
వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కరీంనగర్‌స్పోర్ట్స్: వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేస్తామని జిల్లా పేటా టీఎస్ అధ్యక్షుడు బాబు శ్రీనివాస్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన జిల్లా పెటా టీఎస్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పడ్డ కమిటీ సభ్యులు ఎల్లవేళలా సంఘం పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. పెటా టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ సభ్యుల సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామన్నారు. అనంతరం పెట టీఎస్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం
పెటా టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులుగా దత్తాత్రి, హరికిషన్, వి.రూపారాణి, పి.శ్రీనివాస్, ఎన్.శ్యామలాదేవి, కె.రమాదేవి, పి.శ్రీనివాస్ జి.నిర్మల ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.రమేశ్‌కుమార్, వి.శ్రీలత, ఎం.చంద్రశేఖర్, వి.సూర్యప్రకాశ్, యజాజ్ అహ్మద్, బిట్ర శ్రీనివాస్, ఎం.రమేశ్, కె.వెంకటలక్ష్మి ఎన్నికయ్యారు. సంఘం కోశాధికారిగా డి.వీర్‌పాల్, సంయుక్త కార్యదర్శులుగా రామానందతీర్థ, బి.సత్యనారాయణ, స్నేహలత, ప్రవీణ, రాజ్‌కుమార్, సత్యానంద్, ప్రతిమ ఎన్నికయ్యారు.