
వేంకటేశ్వరస్వామి గుట్టపైకి రహదారి
● సుందరగిరి వెంకన్న బ్రహ్మోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి వేంకటేశ్వరస్వామి గుట్టపైకి రహదారి నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, రథాన్ని లాగారు. అనంతరం మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు వెళ్లి ప్రతీ ఒక్కరు మొక్కులు తీర్చుకోవాలని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉందని సూచించారు. హుస్నాబాద్ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, ఈవో రాజ్‌కుమార్, డైరెక్టర్లు పూల లచ్చిరెడ్డి, జీల సంపత్‌యాదవ్, ఎనగందుల శారద, బూట్ల కవిత, పూజారులు శేషం నవీనాచార్యులు, సుధీరాచా ర్యులు, మాజీ సర్పంచ్‌లు శ్రీమూర్తి రమేశ్, దేవులపల్లి భద్రయ్య పాల్గొన్నారు.