
మనసత్తా ప్రపంచానికి తెలిసింది
కరీంనగర్‌టౌన్: యుద్ధానికి విరామమే తప్ప ము గియలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశానికి ఆపదొస్తే టెర్రరిస్టుల అంతూ చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్‌తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలి సిందన్నారు. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను ముట్టుపెట్టిన ఘ నత మన సైనికులదేనని కొనియాడారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని గీతాభవన్ చౌరస్తా నుంచి రాంనగర్ మార్క్‌ఫెడ్ గ్రౌండ్ వరకు తిరంగా ర్యా లీ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు ర్యాలీకి తరలివచ్చి ప్రధాని మోదీ నాయకత్వానికి, సైన్యానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, పహల్గాంలో మతం పేరు అడిగి ప్రజలను చంపడం దుర్మార్గమన్నారు. పిల్లల ముందు తండ్రిని, భార్యల ముందు భర్తను ప్యాంటు విప్పి కాల్చి చంపాలని ఏ మతం చెప్పిందని ప్రశ్నించారు. మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేస్తూ నిర్వహిస్తున్న తిరంగా యాత్ర.. మద్దతిస్తున్న ప్రజానీకానికి వందనాలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కంట్రోల్ రూం బాధ్యతలు నిర్వర్తిస్తూ సైనికుల ధైర్యసాహసాలను కళ్లారా చూసే అదృష్టం తనకు కలిగిందని వివరించారు. మన సైనికులను చూసి గర్విస్తున్నానని వెల్లడించారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ సునీల్‌రావు, గంగాడి కృష్ణారెడ్డి, డాక్టర్ రమణాచారి, బాస సత్యనారాయణరావు, చొప్పరి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
● కేంద్ర మంత్రి బండి సంజయ్