
ప్రదర్శనకు ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్
కరీంనగర్ కార్పొరేషన్: శాతవాహన అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటి (సుడా) ఆధ్వర్యంలో రూ పొందించిన నగర కొత్త మాస్టర్ ప్లాన్‌ను ప్రజల కు తెలియచేసేందుకు నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచారు. కార్యాలయానికి వచ్చిన సందర్శకులు పరిశీలించారు. కొత్త మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, రోడ్ల వెడల్పు, కొత్త రోడ్లు తదితర అంశాలను ఆసక్తిగా గమనించారు. ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ కాగా, 90 రోజుల అనంతరం ఆమోదం పొందనుంది.