
అంతరిక్షం గురించి తెలుసుకుంటా
ఇస్రో శిక్షణకు ఎంపికకావడం నాకు సంతోషంతోపాటు గర్వంగా ఉంది. చిన్నవయసులోనే అంతరిక్షం గురించి తెలుసుకునే అవకావం రావడం సంతోషంగా ఉంది. శిక్షణ సమయంలో శాస్త్రవేత్తలు తెలియజేసే అంశాలను బాగా పరిశీలించి ఉన్నత విద్య అభ్యసిస్తా.
–పొలవేణి సాత్విక
శాస్త్రవేత్త అవుతాను
ఇస్రో శిక్షణతో మరింత చదువుకుని శాస్త్రవేత్తను అవుతా. 11రోజుల శిక్షణతో చాలా విషయాలు నేర్చుకుంటా. నాకు అవకాశం కల్పించిన ఇస్రోకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నా ఉన్నతికి శిక్షణ ఒక మైలురాయి అవుతుంది.
–పడాల సిరివెన్నెల
విద్యార్థులకు మంచి అవకాశం
ఇస్రో శిక్షణకు పెద్దపల్లి జిల్లా విద్యార్థులు ముగ్గురు, జగిత్యాల జిల్లా విద్యార్థిని ఒకరు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థుల భవిష్యత్‌కు మ ంచి అవకాశం. శిక్షణలో అవకాశం రావడం వారికి వరం. 11 రోజుల శిక్షణలో అంతరిక్షంతోపాటు చాలావిషయాలు తెలుసుకుంటారు.
–బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి

అంతరిక్షం గురించి తెలుసుకుంటా

అంతరిక్షం గురించి తెలుసుకుంటా