
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించండి
కరీంనగర్‌కార్పొరేషన్: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. సోమవారం బల్దియా సమావేశ మందిరంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, ఎస్టాబ్లిష్‌మెంట్, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నగరపాలక సంస్థకు చెందిన ప్రజల నుంచి వచ్చే ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. సెక్షన్ వారీగా సంబంధిత సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం సమస్య న్యాయబద్ధంగా ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఫీల్డ్ లెవల్‌లో సమస్యను పరిశీలించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, పలు సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.