
సేవ.. ఆధ్యాత్మిక తోవ
వేములవాడ: యువత ఇటు సేవ.. అటు ఆధ్యాత్మిక బాటలో వెళ్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో వివిధ సేవలకు హాజరవుతున్నారు. చుట్టుపక్కల జిల్లాలకు చెందిన యువతీయువకులు సైతం రాజన్న ఆలయంలో చేపట్టే హుండీ లెక్కింపు, ఆలయంలో భక్తులకు అందించే వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీని ద్వారా తమకు సేవ చేశామన్న ఆనందంతోపాటు ఆధ్యాత్మిక చింతన కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. భగవంతుడు, భక్తుల సేవలో తరిస్తున్న యువతను చూసి ఇతరులు సైతం స్ఫూర్తిపొందుతారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొన్న యువతీయువకులను ఆలయ అధికారులు అభినందించారు. ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఏఈవోలు శ్రవణ్, శ్రీనివాస్ మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
సెలవులు వృథా కావద్దనే..
వేసవి సెలవులు వృథా కావద్దనే ఉద్దేశంతోనే వేములవాడ రాజన్న హుండీ లెక్కింపులో సేవలందించేందుకు వచ్చాం. స్వామి వారికి భక్తులు సమర్పించిన డబ్బులను లెక్కించడం ఆనందంగా ఉంది. ఇలాంటి సేవ లభించినందుకు గర్వపడుతున్నాం.
– అమూల్య, రిత్విక, అక్షయ(నిర్మల్ జిల్లా కడెం)
భక్తిభావంతో వచ్చాం
మేమంతా రాజన్నపై భక్తిభావంతో సేవ చేసేందుకు వచ్చాం. బుధవారం నాటి హుండీ లెక్కింపులో పాల్గొన్నాం. సేవా చేసేందుకు వచ్చే వారికి కొంచె ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
– అభిలాష్, కౌషిక్, మనోజ్, మహేశ్, శరత్,
రంజిత్(జగిత్యాల జిల్లా గొల్లపల్లి)
రాజన్న హుండీ లెక్కింపులో యువత
వేసవి సెలవుల్లో విద్యార్థులు సైతం..

సేవ.. ఆధ్యాత్మిక తోవ

సేవ.. ఆధ్యాత్మిక తోవ