
వైర్లు కట్‌చేసి.. సెన్సార్లు తొలగించి..
పాలకుర్తి(రామగుండం): పాలకుర్తి మండలం బసంత్‌నగర్ సమీపంలోని రాజీవ్‌రహదారిపై గ ల కన్నాల టోల్‌ప్లాజావద్ద రామగుండం ఏరి యా, స్థానిక లారీ యజమానులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. గోదావరిఖని ఏరి యా లారీలకు టోల్‌రుసుం వసూలు చేయకుండా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని డి మాండ్ చేశారు. ఇదే సమయంలో గోదావరిఖని వైపు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆందోళనకారుల వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఫోర్‌లేన్ నిర్వహణ సంస్థ హెచ్‌కేఆర్‌కు టోల్‌వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజాభద్రత, రోడ్ల నిర్వహణపై లేదన్నారు. పన్నేండేళ్లు గా టోల్ ద్వారా అధిక ఆదాయం ఆర్జిస్తున్న సంస్థ.. సర్వీసు రోడ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చే స్తోందని ధ్వజమెత్తారు. తద్వారా అనేక ప్రమా దాల్లో వాహనదారులు ప్రాణాలకు కోల్పోయా రని తెలిపారు. స్థానిక ప్లాజాలోని కార్మికులకు పన్నెండేళ్లుగా వేతనం పెంచడం లేదన్నారు. కనీ స వేతన చట్టం అమలు చేయడం లేదని మండిపడ్డారు. గోదావరిఖని ఏరియా లారీలకు టోల్‌మాఫీ చేయాలని కోరారు. ప్లాజా వద్ద మరు గుదొడ్లు, విశ్రాంతిగది వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఈనేపథ్యంలోనే ఆందోళనకారులు తమ డిమాండ్లు నెరవేర్చేదాకా టోల్ వసూళ్లు నిలిపివేయాలన్నారు. క్యాబిన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులను బయటకు వెళ్లగొట్టారు. టోల్‌గేట్లు తెరిచి ఉంచారు. ఆటోమేటిక్ సెన్సార్ల వైర్లను కట్ చేశారు. ఉచితంగా వాహనాల రాకపోకలకు వీలుగా చర్యలు తీసుకున్నారు. గతంలో ఎన్నడూలేనివిధంగా నాయకులు, లారీ యజమానులు టోల్‌ప్లాజాపై ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బసంత్‌నగర్ టోల్‌ప్లాజాలో వాహనాలకు ఉచిత ప్రయాణం
రామగుండం, స్థానిక లారీ యజమానుల ఆందోళన
హెచ్‌కేఆర్ టోల్‌ప్లాజా అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఠాకూర్ ఆగ్రహం

వైర్లు కట్‌చేసి.. సెన్సార్లు తొలగించి..

వైర్లు కట్‌చేసి.. సెన్సార్లు తొలగించి..