న్యూ ఇయర్‌కి ముందు టీమిండియాకు ఊహించని షాక్..!
మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా.. భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్.. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే శ్రేయస్ కూడా ఫిట్నెస్ సాధించి, ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 30) శ్రేయస్‌కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్నెస్ క్లియెరెన్స్ లభించాల్సి ఉండింది. అయితే శ్రేయస్ అనూహ్యంగా 6 కిలోలు బరువు తగ్గినట్లు CoE వైద్య బృందం గుర్తించింది. దీని వల్ల శ్రేయస్‌కు బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి సమస్య లేకపోయినా, మసిల్ మాస్ బాగా క్షీణించి, శక్తి స్థాయిలు తగ్గాయని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్‌కు రిటర్న్ టు ప్లే (RTP) సర్టిఫికేట్ ఇవ్వలేమని పరోక్షంగా చెప్పారు. దీంతో శ్రేయస్ రీఎంట్రీ మరో వారం వాయిదా పడనుంది.ఒకవేళ శ్రేయస్‌కు ఇవాళ RTP సర్టిఫికేట్ లభించి ఉంటే జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేవాడు. తాజా పరిస్థితి ప్రకారం.. శ్రేయస్ న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. జట్టును 2 లేదా 3 తేదీల్లోగా ప్రకటించే అవకాశం ఉంది.ఆ సమయానికి శ్రేయస్‌కు ఫిట్నెస్ క్లియరెన్స్ లభించడం అసాధ్యంగా కనిపిస్తుంది. వన్డే జట్టులో కీలకమైన శ్రేయస్ విషయంలో CoE అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకునే సాహసం చేయలేరు. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను మిస్ అయితే, విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
Metro: రేపు రాత్రి ఒంటిగంట వరకూ సేవలు
సాక్షి హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా డిసెంబర్ 31 బుధవారం రోజు మెట్రో సేవలను రాత్రి ఒంటి గంట వరకూ పొడిగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని ఆకతాయిలతో ప్రమాదం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు అన్ని మెట్రో స్టేషన్లలో మెట్రో సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసు సిబ్బందితో నిఘా ఉంచనున్నట్లు మెట్రో ప్రకటించింది. సాధారణంగా ఇతర రోజుల్లో హైదరాబాద్ మెట్రో సేవలు రాత్రి 11 గంటల వరకే ఉంటాయి.
మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి(90) కన్నుమూశారు. గతకొంత కాలంగా పక్షవాతం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.శాంతి కుమారి భర్త, మాజీ ప్రభుత్వ ఉద్యోగి విశ్వనాథన్ నాయర్ 2005లో మరణించారు. వారి పెద్ద కుమారుడు ప్యారేలాల్ కూడా 2000లో మృతిచెందారు. మోహన్‌లాల్ తన తల్లితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత కూడా ముందుగా తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తల్లి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నట్లు మోహన్‌లాల్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తన విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడేవారని తెలిపారు. శాంతకుమారి మరణవార్త విని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. మమ్ముట్టి దంపతులు మోహన్‌లాల్ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్ వీడియో
కర్నాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో వింత సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే ఒక మహిళ మాజీ భర్తను కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆమె పదే పదే కొడుతున్నా జుట్టు పట్టిలాగినా, దుర్భాషలాడినా ఎగిరి తన్నినా, నవ్వుతూనే ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. అసలేం జరిగిందంటే.ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె భర్తకు ఉద్యోగం లేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకెక్కారు. విడాకులు మంజూరయ్యాయి. భరణం కోసం కూడా కేసు వేసింది. ఇక్కడే భర్త కపట తెలివితేటల్ని ప్రదర్శించాడు. అయితే విడాకులు మంజూరు అయితే భరణం చెల్లించాల్సి వస్తుందన్న కుట్రతో తన పేరిట ఉన్న ఆస్తులన్నింటిని తన తల్లి పేరు మీదు ముందుగానే బదలాయించేశాడు. ముందు అనుకున్న ప్లాన్ప్రకారమే తనకు ఎలాంటి ఆస్తులు, ఆదాయం లేదు కాబట్టి, భరణం ఇవ్వలేనని వాదించాడు. అతడి వాదనలను విశ్వసించిన కోర్టు భార్యకు షాకిచ్చింది. తనకు భరణం రాకుండా చేశాడనే ఆగ్రహంతో భార్య చేశాడని, కోర్టు బయటే భర్తను కొట్టింది. చెంపలు వాయించేసింది. జుట్టు పట్టుకొని కొట్టింది. దుర్భాషలాండింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే తాను అనుకున్నది సాధించిన అతగాడు మాత్రం ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలాగా నవ్వుతూ ఉండటం ఈ వీడియోలో రికార్డైంది.ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. భర్తనుంచి విడి పోయిన మహిళల దీన పరిస్థితికి ఇది నిదర్శమని నెటిజన్లు కొందరు వ్యాఖ్యానించారు. ఇది అన్యాయం అని మరికొందరు భర్తపై మండిపడ్డారు. మరోవైపు మహిళలకు భరణంపై ఉండే ప్రేమకు ఇది నిదర్శమన కొందరు, దాడి చేసిన దోషిని శిక్షించాలని ఒకరు, ప్లాన్ ఏ ఎదురు దెబ్బ తగిలితే, ప్లాన్ బీ ఏమీ లేనప్పుడు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణంShe took a divorce chasing alimony.The husband had already transferred all his property to his mother’s name — the wife got nothing. 😁After the divorce, the guy is smiling even while getting beaten.On behalf of all men — salute to you! 😂😜pic.twitter.com/YEGociB8Hr— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 29, 2025
సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!
లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్షలతో కిమ్ జాంగ్ బిజీబిజీ..!
అడ్రస్ చెప్పిన మారుతి.. కడుపు నింపేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రశ్నార్థకంగా మేడ్చల్ నేతల రాజకీయ భవిష్యత్
రష్యా నియంత్రణలో 334 గ్రామాలు : పుతిన్ కీలక ప్రకటన
శ్రీలంక క్రికెటర్ కన్నుమూత
డ్రైవర్ రాయుడు హత్య కేసు వేగవంతం.. ఎమ్మెల్యే బొజ్జలను విచారించే అవకాశం!
ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా
2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలు
భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్ వీడియో
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు
‘జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారు’
నోబెల్ వచ్చేదాకా ముగింపు ఉండదా సార్!
సార్! మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒక టెండరూ రాదు! మీ భవిష్యత్తు చిత్రం కాంట్రాక్టర్లకు తెలిసిపోయినట్లుంది!!
వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ రాశి వారికి కాంట్రాక్టులు లభిస్తాయి.. సంఘంలో గౌరవం
‘మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?‘
పార్టీ బలోపేతం అంటే అది అధికార పార్టీని ఉద్దేశించి సార్!
'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు ఔట్..?
కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గాలంటే..!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. కొత్త పనులకు శ్రీకారం
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్‌లో మధుర జ్ఞాపకం: తనూజ
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపార అభివృద్ధి
సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!
లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్షలతో కిమ్ జాంగ్ బిజీబిజీ..!
అడ్రస్ చెప్పిన మారుతి.. కడుపు నింపేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రశ్నార్థకంగా మేడ్చల్ నేతల రాజకీయ భవిష్యత్
రష్యా నియంత్రణలో 334 గ్రామాలు : పుతిన్ కీలక ప్రకటన
శ్రీలంక క్రికెటర్ కన్నుమూత
డ్రైవర్ రాయుడు హత్య కేసు వేగవంతం.. ఎమ్మెల్యే బొజ్జలను విచారించే అవకాశం!
ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా
2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలు
భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్ వీడియో
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు
‘జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారు’
నోబెల్ వచ్చేదాకా ముగింపు ఉండదా సార్!
సార్! మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒక టెండరూ రాదు! మీ భవిష్యత్తు చిత్రం కాంట్రాక్టర్లకు తెలిసిపోయినట్లుంది!!
వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ రాశి వారికి కాంట్రాక్టులు లభిస్తాయి.. సంఘంలో గౌరవం
‘మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?‘
పార్టీ బలోపేతం అంటే అది అధికార పార్టీని ఉద్దేశించి సార్!
'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు ఔట్..?
కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గాలంటే..!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. కొత్త పనులకు శ్రీకారం
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్‌లో మధుర జ్ఞాపకం: తనూజ
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపార అభివృద్ధి
ఫొటోలు
రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)
అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)
చిరంజీవి-వెంకటేశ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ (ఫొటోలు)
గోల్డెన్ బ్యూటీలా హీరోయిన్ శోభిత (ఫొటోలు)
పెళ్లి, షూటింగ్.. ఈ ఏడాది జ్ఞాపకాలతో హెబ్బా పటేల్ (ఫొటోలు)
ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)
యూత్ హార్ట్ బ్రేక్ అయ్యేలా 'నిధి అగర్వాల్' (ఫోటోలు)
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (చిత్రాలు)
వైకుంఠ ఏకాదశి : తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)
‘శంబల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినిమా
మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి(90) కన్నుమూశారు. గతకొంత కాలంగా పక్షవాతం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.శాంతి కుమారి భర్త, మాజీ ప్రభుత్వ ఉద్యోగి విశ్వనాథన్ నాయర్ 2005లో మరణించారు. వారి పెద్ద కుమారుడు ప్యారేలాల్ కూడా 2000లో మృతిచెందారు. మోహన్‌లాల్ తన తల్లితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత కూడా ముందుగా తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తల్లి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నట్లు మోహన్‌లాల్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తన విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడేవారని తెలిపారు. శాంతకుమారి మరణవార్త విని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. మమ్ముట్టి దంపతులు మోహన్‌లాల్ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా
ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. రెగ్యులర్ స్టోరీలానే అనిపించినప్పటికీ సమాజంలో జరిగే విషయాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'బ్యూటీ'. ప్రేమలో మోసపోయే అమ్మాయి కథతో తీసిన ఈ మూవీలో తండ్రి ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండాయి. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన వచ్చేసింది.అంకిత్, నీలఖి, నరేశ్, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బ్యూటీ'. టీనేజీ ప్రేమకథకు తోడు తండ్రి ఎమోషన్స్‌తో తీశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 02 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు.(ఇదీ చదవండి: మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య)'బ్యూటీ' విషయానికొస్తే.. నారాయణ (నరేశ్) మధ్య తరగతి వ్యక్తి. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కూతురు అలేఖ్య(నీలఖి) అంటే నారాయణకు ప్రాణం. ఆమె అడిగింది కొనిస్తూ, అందులో తన ఆనందాన్ని వెతుక్కుంటుంటాడు. ఇంటర్ చదివే అలేఖ్య.. అనుకోకుండా పెట్ ట్రైనర్ అర్జున్ (అంకిత్)తో ప్రేమలో పడుతుంది. ఇంట్లో ప్రేమ విషయం తెలిసిపోవడంతో అర్జున్‌తో పాటు అలేఖ్య లేచిపోతుంది. అలా కూతురుని వెతుక్కుంటూ నారాణయ.. హైదరాబాద్ వెళ్తాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ మూవీ స్టోరీ అంతా మనం రోజూ చూసినట్లే ఉంటుంది గానీ.. చూపించిన విధానం, పాత్రల తీరుతెన్నులు కట్టిపడేస్తాయి. బ్యూటీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కాలేజ్‌కి పంపిన 18 ఏళ్ల కూతురు ప్రేమలో పడుతుంది. దాని వల్ల కన్న తల్లితండ్రులు ఎంత బాధపడ్డారు? లేచిపోయిన కూతురు ఎలాంటి ఇబ్బందుల్లో పడిందీ అని కళ్లకు కట్టినట్లు చూపించారు. తండ్రిగా నరేశ్ ఆకట్టుకునే ఫెర్ఫార్మాన్స్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్)A love story that turns into a mystery… 💔Beauty Trailer is here!Get ready for #BeautyPremieres 2nd January @AnkithKoyyaLive #NilakhiPatra @ItsActorNaresh @JSSVARDHAN @VijaypalreddyA @iamraj20 @shriesaidaara @__SaNaRe @VijaiBulganin @AdithyarkM @LakshmiMeghanaK pic.twitter.com/aZgbCRV6nw— ZEE5 Telugu (@ZEE5Telugu) December 30, 2025
సల్మాన్ ఖాన్ సినిమాపై చైనా అక్కసు.. కారణం ఇదేనా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్'పై చైనా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ మేరకు తమ సంపాదకీయంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇండియన్ సినిమాపై చైనాకు ఎందుకంత అక్కసు? బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కథేంటి?తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్సల్మాన్ఖాన్(salman Khan) హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’(Battle of Galwan Movie). సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు.అయితే ఈ సినిమా కథపైనే ఇప్పుడు చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ చిత్రం చరిత్రను వక్రీకరిస్తోందని చైనా మీడియా ఆరోపిస్తోంది. చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో తమ సైన్యం సంకల్పాన్ని ఇలాంటి సినిమాలు దెబ్బతీయబోదంటూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో చైనా సైనిక నిపుణులు మాట్లాడుతూ..భారత్-చైనా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని ఆరోపించారు. మూవీ కథాంశం భారత్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది.అదే చైనా భయమా?2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలోనే 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' సినిమా రాబోతుంది. ఈ సినిమా విడుదలైతే..అసలు నిజం చైనీయులకు కూడా తెలిసే అవకాశం ఉంది. భారత్ చేతిలో చైనా సైన్యం ఘోరంగా దెబ్బతిందనే విషయం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. అందుకే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చైనా దుష్ప్రచారం చేస్తోంది. ఈ సినిమా చైనా సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత విశ్లేషకులు చెబుతున్నారు.
మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య
అభిమానుల పెళ్లికి సినిమా హీరో లేదా హీరోయిన్లు వెళ్లడం టాలీవుడ్లో ఎప్పుడైనా చూశారా? అస్సలు చూసుండరు. మహా అయితే వ్యక్తిగత సిబ్బంది పెళ్లి జరిగితే కొన్నిసార్లు కనిపిస్తారంతే. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఫ్యాన్స్ పెళ్లిలో హీరోలు కనబడటం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. హీరో సూర్య ఇప్పుడు అలానే ఓ లేడీ ఫ్యాన్‌కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో షాక్ అవడం ఆమె వంతైంది.(ఇదీ చదవండి: ప్రభాస్ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్)అరవింద్ అనే కుర్రాడు కాజల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు కాబోయే భార్యకు హీరో సూర్య అంటే చాలా ఇష్టం. దీంతో రిక్వెస్ట్ చేసి సూర్య తన వివాహానికి వచ్చేలా ఒప్పించాడు. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకు కాజల్‌కు చెప్పలేదు. సడన్‌గా కల్యాణ మండపంలో సూర్యని చూసి ఆమె షాకైంది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి కొత్త పెళ్లి జంట.. దాన్ని తమ ఇన్ స్టా పేజీ 'కాదల్స్'లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు గతంలోనూ సూర్య.. పలువురు అభిమానుల పెళ్లికి హాజరై సర్ప్రైజ్ చేశాడు. తమిళ హీరో విశాల్, ఆర్య, కార్తీ, ధనుష్ తదితర హీరోలు కూడా ఫ్యాన్స్ వివాహాలకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో హీరోలు ఇలా చేస్తున్నారు. మరి తెలుగులో ఇలా అభిమానుల పెళ్లికి గానీ శుభకార్యాలకు గానీ అటెండ్ అయిన హీరోలు ఎంతమంది ఉన్నారు?(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?) View this post on Instagram A post shared by Aravind & Kajal (@kaadhals_)
క్రీడలు
నిజాన్ని మీరే బయటపెట్టాలి: రోహిత్, కోహ్లికి మాజీ క్రికెటర్ విజ్ఞప్తి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వీరిద్దరు పరుగులు రాబట్టలేక ఇబ్బందిపడ్డారు.రోహిత్ మధ్యలో విరామం తీసుకుంటూ మ్యాచ్‌లు ఆడగా.. కోహ్లి పదే పదే ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో దాదాపుగా ఎనిమిది సార్లు వికెట్లు పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రో- కో ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రోహిత్ టెస్టులకు స్వస్తి పలికితే బాగుంటుందనే డిమాండ్లు పెరగగా.. మేటి టెస్టు బ్యాటర్ అయిన కోహ్లి తప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అనూహ్య రీతిలోఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా తొలుత ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియాలో రో- కో ఆడతారని ముందుగా సంకేతాలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో వీరిద్దరు టెస్టులకు గుడ్‌బై చెప్పేశారు. రోహిత్ శర్మ స్థానంలో టెస్టు పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్ గిల్.. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన కోహ్లి నాలుగో స్థానాన్నీ భర్తీ చేశాడు.ఒత్తిడి చేశారుఅయితే, రోహిత్- కోహ్లి ఆకస్మిక రిటైర్మెంట్లపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇదైతే సహజమైన రిటైర్మెంట్లా అనిపించలేదు. ఈ విషయంలో వాళ్లు మాత్రమే నిజమేంటో చెప్పగలరు. నాకైతే ఇదేదో బలవంతంగా చేయించినట్లు అనిపిస్తోంది.నిజాన్ని మీరే బయటపెట్టాలిరోహిత్ శర్మ ఆరు నెలల పాటు విరామం తీసుకుని.. ఫిట్నెస్ సాధించి తిరిగి వస్తే బాగుండేది. అదే జరిగితే తిరిగి అతడు ఫామ్‌ను అందుకునేవాడు. అతడిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది. రోహిత్‌తో పాటు కోహ్లి కూడా కొన్నాళ్ల విరామం తర్వాత తిరిగి వస్తే బాగుండేది. ఏదేమైనా టెస్టు రిటైర్మెంట్ విషయమై వాళ్లు నోరు విప్పితేనే నిజం తెలుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.ఇద్దరూ సిద్ధంఅదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుత ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సౌతాఫ్రికాతో వన్డేల్లో ఇద్దరూ అదరగొట్టారు. రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధిస్తే.. కోహ్లి వరుసగా రెండు శతకాలు బాదాడు. ఇద్దరూ ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నారు.ఇటీవలే రోహిత్‌ను కలిశాను. అతడు ప్రస్తుతం రిలాక్సింగ్ మోడ్‌లో ఉన్నాడు. ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాడు. రోహిత్- విరాట్ పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికే ఇద్దరూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. అయినా సరే ఇంకా ఇంకా ఆడాలనే పట్టుదల వారిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
ఆర్సీబీకి భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
వచ్చే ఏడాది (2026) జనవరి 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్ 2026కు ముందు 2024 ఎడిషన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికి దూరం కానుంది. పెర్రీ స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం దేశీయ ఆల్‌రౌండర్ సయాలీ సత్ఘరేతో భర్తీ చేసింది.సత్ఘరే గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఈ సీజన్ వేలంలో సత్ఘరేను (30 లక్షలు) ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. తాజాగా ఎల్లిస్ లీగ్ నుంచి తప్పుకోవడంతో సత్ఘరేను అదృష్టం వరించింది. ఎల్లిస్ వైదొలిగిన తర్వాత ఆర్సీబీలో నడినే డి క్లెర్క్ మాత్రమే నాణ్యమైన విదేశీ ఆల్‌రౌండర్‌గా ఉంది.ఎల్లిస్ ఆర్సీబీ 2024లో టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఎల్లిస్‌కు డబ్ల్యూపీఎల్ మొత్తంలోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్ ఎల్లిసే. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్.. 8 హాఫ్ సెంచరీల సాయంతో 972 పరుగులు చేసి, 8.25 ఎకానమీతో 14 వికెట్లు తీసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా..!డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, ఆసీస్ ప్లేయరే అయిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ కూడా వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికే దూరం కానుంది. సదర్‌ల్యాండ్ స్థానాన్ని డీసీ యాజమాన్యం అలానా కింగ్‌తో భర్తీ చేసింది.
ఒమన్ వరల్డ్‌కప్ జట్టు కెప్టెన్‌గా భారత సంతతి ఆటగాడు
వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల ఒమన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ కూడా భారత సంతతి ఆటగాడే (వినాయక్ శుక్లా) కావడం మరో విశేషం. ఈ జట్టులో వీరే కాక మరో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు. కరణ్ సోనావాలే, జయ్ ఒడేడ్రా, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రామనంది భారత్‌లో జన్మించిన వారే.ఈ జట్టుకు డిప్యూటీ కోచ్ కూడా భారతీయుడే. ముంబై మాజీ హెడ్ కోచ్‌గా పని చేసిన సులక్షన్ కులకర్ణి ప్రపంచకప్‌లో ఒమన్ డిప్యూటీ కోచ్‌గా వ్యవహరిస్తాడు. మొత్తంగా చూస్తే ప్రపంచకప్ బరిలోకి దిగబోయే ఒమన్ బృందం భారతీయులతో నిండుకొని ఉంది.2026 టీ20 వరల్డ్‌కప్ కోసం ఒమన్ జట్టు..జతిందర్ సింగ్ (c), వినాయక్ శుక్లా (vc), మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మిర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహ్మూద్, జయ్ ఓడేడ్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రమనంది, హస్నైన్ అలీ షా కాగా, ఒమన్ జట్టు ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జరిగిన 2024 వరల్డ్‌కప్‌కు కూడా ఒమన్ క్వాలిఫై అయ్యింది. ఈసారి ప్రపంచకప్‌లో ఒమన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఒమన్ ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్‌లో ఆడనుంది. కొలొంబో వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.సొంతజట్టు బరోడా తరఫున దేశీ టీ20లు ఆడాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). తాజాగా దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అతడు భాగం కానున్నాడు. జనవరి 3, 8వ తేదీల్లో బరోడా.. విదర్భ, చండీగఢ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు IANSకు తెలిపాయి.అయితే, ఈ రెండు మ్యాచ్‌లకు మధ్య బరోడా.. జమ్మూ కశ్మీర్‌తో జనవరి 6న తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ మేరకు విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి మ్యాచ్‌లలో ఆడనున్నాడు.విశ్రాంతి తీసుకోమన్నా వినడే!టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ సిరీస్ నుంచి హార్దిక్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. కివీస్‌తో ఐదు టీ20లు సహా వరల్డ్‌కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, పాండ్యా మ్యాచ్ ఫిట్నెస్ కోసం బరోడా తరఫున బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.రో-కో ఆడేశారుకాగా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పటికే భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తమ సొంత జట్లు ముంబై, ఢిల్లీ తరఫున రెండేసి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడారు. టీమిండియా యంగ్ స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర సారథిగా ఈ టోర్నీలో భాగం కాగా.. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక శుబ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్ తదుపరి మ్యాచ్‌లలో పంజాబ్‌కు ఆడతారు. సంజూ శాంసన్ కేరళ తరఫున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నారు.చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో బాదుడే బాదుడు...ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం...
పార్కుల ముసుగులో చంద్రబాబు పందేరం.. ఆంధ్రప్రదేశ్‌లో దళితుల భూముల్లో ‘ప్రైవేట్’ దందా!
అభాగ్యులతో చంద్రబాబు సర్కారు చలగాటం... 19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
బిజినెస్
పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గాలైన బంగారం, వెండి ధరల్లో గత రెండు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డిసెంబర్ 29, 30 తేదీల్లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధర తన జీవితకాల గరిష్ట స్థాయి నుంచి సుమారు 3 శాతానికిపైగా క్షీణించింది. అదే సమయంలో బంగారం ధర కూడా 1.7 శాతం తగ్గింది. అయితే ఇందుకు అంతర్జాతీయంగా కొన్ని సంఘటనలు కారణమవుతున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలుఈ ధరల పతనానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందన్న సంకేతాలు రావడం ప్రధాన కారణమని అంచనాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ఫ్లోరిడాలో జరిగిన చర్చలు కొత్త ఆశలను చిగురింపజేశాయి. ‘శాంతి ఒప్పందానికి మేము చాలా దగ్గరగా ఉన్నాం’ అని వారు ప్రకటించడం పెట్టుబడిదారుల ఆలోచనా ధోరణిని మార్చేసింది.యుద్ధాలు లేదా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో పెట్టుబడిదారులు తమ డబ్బు కోల్పోకుండా ఉండటానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెడతారు. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి అందుకే ధరలు పెరిగాయి. ఇప్పుడు ట్రంప్-జెలెన్స్కీ శాంతి చర్చల వల్ల యుద్ధం ముగిసిపోతుందనే నమ్మకం పెరిగింది. దీనివల్ల భయం తగ్గి, పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బు తీసి ఇతర రంగాల్లో (స్టాక్స్ వంటివి) పెట్టడం మొదలుపెట్టే అవకాశం ఉంది.ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.. శాంతిగా ఉన్నప్పుడు డిమాండ్ తగ్గుతుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య 90% శాంతి ఒప్పందం కుదిరిందనే వార్త రాగానే మార్కెట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది. రిస్క్ తగ్గితే సహజంగానే బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు వెళ్లే వారు తగ్గుతారు. తద్వారా ధరలు పడిపోతాయి.సరఫరా గొలుసు మెరుగుపడుతుందనే ఆశరష్యా ప్రపంచంలో బంగారం, వెండిని ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఒకటి. యుద్ధం వల్ల రష్యాపై ఉన్న ఆంక్షలు సరఫరాను తగ్గించాయి. శాంతి చర్చలు సఫలమైతే, రష్యా నుంచి మెటల్స్ సరఫరా మళ్ళీ పుంజుకుంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. సరఫరా పెరిగితే ధరలు తగ్గుతాయి.ధరల పతనానికి దోహదం చేసిన ఇతర అంశాలు2025లో వెండి అసాధారణ లాభాలను అందించింది. గరిష్ట ధరల వద్ద పెట్టుబడిదారులు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకోవడానికి విక్రయాలకు మొగ్గు చూపారు.నూతన సంవత్సర వేడుకల ముందు మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నాయి.డిసెంబర్ 31న విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్ కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడ్ ఇచ్చే సంకేతాలు భవిష్యత్ ధరలను నిర్ణయిస్తాయి.ప్రస్తుత ఉద్రిక్తతలుశాంతి చర్చలు ఒకవైపు సాగుతుండగానే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. డిసెంబర్ 29 రాత్రి పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని రష్యా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీన్ని ఉక్రెయిన్ ఖండించినప్పటికీ రష్యా తన వైఖరిని కఠినతరం చేస్తామని హెచ్చరించడం మార్కెట్లలో మళ్లీ అనిశ్చితిని నింపింది. ఈ పరిణామం శాంతి ప్రక్రియకు స్పీడ్ బ్రేకర్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.భవిష్యత్తు అంచనాలుముగింపు దిశగా సాగుతున్న ఈ చర్చలు విజయవంతమైతే బంగారం, వెండి ధరలు మరింత స్థిరీకరణకు లేదా స్వల్ప పతనానికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే, వెండికి ఉన్న పారిశ్రామిక డిమాండ్ (ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహన రంగం) ధరలను పూర్తిగా పడిపోకుండా కాపాడుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు శుభసూచకం. అయితే, ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుత ఉద్రిక్తతలను, శాంతి చర్చల ఫలితాలను క్షుణ్ణంగా గమనిస్తూ తమ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం
ఆరోగ్య బీమాలో సరికొత్త ట్రెండ్స్
భారతదేశంలో ఆరోగ్య బీమా రంగం మునుపెన్నడూ లేని విధంగా వేగవంతమైన మార్పులకు లోనవుతోంది. పెరుగుతున్న వైద్య ఖర్చులు, జీవనశైలి వ్యాధుల ముప్పు, డిజిటలైజేషన్ వెరసి భారతీయులు తమ ఆరోగ్య రక్షణపై చూపే దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ మార్పులను విశ్లేషిస్తూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తాజాగా ‘ట్రెండ్స్ రిపోర్ట్ 2025’ను విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం, ప్రజలు కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ముందస్తు జాగ్రత్తలు, సమగ్ర రక్షణ కోసం బీమాను ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనంగా భావిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే (2023-24 నుంచి 2024-25 వరకు) బీమా చేయించుకున్న సభ్యుల సంఖ్య 27 శాతానికిపైగా పెరగడం విశేషం. వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్య బీమాను తమ ప్రాథమిక అవసరంగా గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణం.యువత, సీనియర్ సిటిజన్ల ఆసక్తికొత్త పాలసీదారుల్లో యువత (18-35 ఏళ్లు వయసు) వాటా 30 శాతం పైగా ఉంది. సీనియర్ సిటిజన్ల (60+ ఏళ్లు) నిష్పత్తి 14 శాతానికి చేరుకుంది. పిల్లల (0-17 ఏళ్లు) కోసం సగటు బీమా మొత్తాన్ని (Sum Insured) తల్లిదండ్రులు 7 శాతం మేర పెంచుకుంటున్నారు. ఇది భవిష్యత్ ఆరోగ్యం పట్ల వారి నిబద్ధతను చూపుతోంది.క్లెయిమ్‌లకు కారణమవుతున్న వ్యాధులుఆసుపత్రిలో చేరడానికి ఇన్ఫెక్షన్లతో పాటు జీవనశైలి వ్యాధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్లున్నాయి. వీటిలో గుండె, క్యాన్సర్ చికిత్సల కోసం క్లెయిమ్ చేసే మొత్తం విలువ నిరంతరం పెరుగుతోంది.యాప్‌ల ద్వారానే అంతా..సాంకేతికత వాడకంలో భారతీయులు ముందంజలో ఉన్నారు. ఆరోగ్య బీమా సేవలకు స్మార్ట్ఫోన్లు కీలకంగా మారాయి. ఆన్లైన్ రెన్యూవల్స్ గతంతో పోలిస్తే 10% పెరిగాయి. కేర్ హెల్త్ యాప్ ద్వారా 30% క్లెయిమ్‌లు, 15% రెన్యూవల్స్ జరుగుతున్నాయి. గడిచిన మూడేళ్లలో ఆన్లైన్ ద్వారా పాలసీ కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయి. ప్రీమియం డిస్కౌంట్ల కోసం ‘స్టెప్ ట్రాకింగ్’ వాడే వారి సంఖ్య 2.5 రెట్లు పెరగడం గమనార్హం.సమగ్ర కవరేజీకే మొగ్గుపాలసీదారులు కేవలం హాస్పిటలైజేషన్ మాత్రమే కాకుండా మరిన్ని సౌకర్యాలను కోరుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని చిన్నపాటి చికిత్సలకు ఓపీడీ బెనిఫిట్స్ కావాలనుకుంటున్నారు. టెలికన్సల్టేషన్ ద్వారా ఆన్లైన్లో డాక్టర్ సలహాలు, బీమా పరిమితిని పెంచుకోవడం, నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా పైసా ఖర్చు లేకుండా చికిత్స పొందడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ సందర్భంగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, మనీష్ దొడేజా మాట్లాడుతూ.. ‘భారతీయ ఆరోగ్య బీమా పాలసీదారులు ఇప్పుడు ముందస్తు రక్షణ పట్ల చురుకుగా వ్యవహరిస్తున్నారు. వారు కేవలం పాలసీని కొనుగోలు చేయడమే కాకుండా, సాంకేతికతను వాడుకుంటూ సమగ్ర కవరేజీని కోరుకుంటున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి సవాళ్లు
బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి సవాళ్లు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం అత్యంత బలంగా, స్థిరంగా ఉంది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకులు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎప్సీ) నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన ‘ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2024-25’ నివేదిక ఆధారంగా, బ్యాంకులు మెరుగైన లాభాలను సాధిస్తున్నప్పటికీ డిజిటలైజేషన్, కొత్త రకపు రిస్కుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.ఆర్థిక వనరుల సమీకరణలో సమతుల్యత2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వాణిజ్య రంగానికి అందిన మొత్తం నిధులు రూ.35.1 లక్షల కోట్లు. ఇందులో బ్యాంకుల వాటా (రూ.18 లక్షల కోట్లు), బ్యాంకింగేతర వనరుల వాటా (రూ. 17.1 లక్షల కోట్లు) దాదాపు సమానంగా ఉన్నాయి. అందుకు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడం, అధికంగా జరుగుతున్న ఈక్విటీ ఇష్యూలు, కార్పొరేట్ బాండ్లు, విదేశీ రుణాల లభ్యత.. వంటి అంశాలు కలిసొచ్చాయి.గత కొన్ని ఏళ్లుగా చేపట్టిన సంస్కరణల వల్ల షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. బ్యాంకుల గ్రాస్ ఎన్పీఏ (స్థూల నిరర్థక ఆస్తులు) నిష్పత్తి గత దశాబ్ద కాలంలోనే కనిష్ఠ స్థాయికి, అంటే 2.2 శాతానికి పడిపోయింది. సెప్టెంబర్ 2025 నాటికి ఇది ఇంకా తగ్గి 2.1 శాతానికి చేరుకోవడం విశేషం. బ్యాంకుల వద్ద తగినంత మూలధనం ఉంది. సెప్టెంబర్ 2025 నాటికి బ్యాంకుల CRAR(ఒక బ్యాంక్ తన వద్ద ఉన్న రిస్కులకు తగినంత మూలధనాన్ని కలిగి ఉందో లేదో కొలిచే కొలమానం ఇది) 17.2 శాతంగా ఉంది. ఇది నియంత్రణ సంస్థలు సూచించిన 11.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2024-25లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు 11.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.ఎన్‌బీఎఫ్‌సీల హవాదేశంలోని మొత్తం బ్యాంక్ క్రెడిట్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 25 శాతానికి చేరింది. బ్యాంకింగ్ సర్వీసులు అందించలేని మారుమూల ప్రాంతాలకు, చిన్న తరహా పరిశ్రమలకు నిధులు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి స్థూల నిర్ధరక ఆస్తులు మార్చి 2025 నాటికి 2.9 శాతానికి చేరింది. ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐలు (Microfinance) కూడా 24.9 శాతం క్యాపిటల్ బఫర్‌తో బలంగా ఉన్నాయి.కొత్త సవాళ్లుబ్యాంకింగ్ రంగం ఎంత వేగంగా డిజిటలైజ్ అవుతుందో అంతే వేగంగా కొత్త రిస్కులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్ మోసాలు, డేటా ఉల్లంఘనలు బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. సాంకేతిక మార్పులను త్వరగా అందిపుచ్చుకోకపోతే బ్యాంకులు తమ వినియోగదారులను కోల్పోయే ప్రమాదం ఉంది.ఆర్బీఐ సూచనలుభారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్బీఐ కొన్ని కీలక సూచనలు చేసింది. ‘బ్యాంకులు తమ రిస్క్ అసెస్మెంట్ను మరింత పటిష్టం చేసుకోవాలి. పారదర్శకమైన పాలన, బాధ్యతాయుతమైన సాంకేతికతను వాడాలి. పెరిగిపోతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. ఎన్బీఎఫ్సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా తమ నిధుల మూలాలను వైవిధ్య పరచాలి’ అని ఆర్బీఐ తెలిపింది.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు! ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ
తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..!
అనుకోని ప్రమాదాల్లో బాధితులు అవయవాలు కోల్పోవడం సర్వసాధారణం. ఒక్కోసారి కొన్నిటిని కృత్రిమ అవయవాలతో భర్తి చేస్తే.. కొన్ని సున్నితమైన అవయవాల విషయాల్లో అది అస్సలు సాధ్యం కాదు. ఇక్కడ ఒక్క మహిళ కూడా అలానే ఎడమ చెవిని కోల్పోయింది. అయితే దాన్ని చక్కగా తిరిగి ఆమెకు అతికించేందుకు విన్నూతమైన వైద్యవిధానాన్ని ఉపయోగించారు. తెగిన చెవిని తిరిగి అతికించడం కాస్తం కష్టం. అయితే దాన్ని పాడవకుండా కాపాడి మరి అతికించారు. అది ఏవిధంగానే తెలిస్తే.. ఇదేం వైద్య విధానం అని విస్తుపోతారు.చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుట్టు యంత్రంలో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మంతో సహా చెవి కూడా పూర్తిగా తెగిపోయింది. దాంతో స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ ప్రమాదంలో సదరు మహిళకు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల చెవిని తిరిగి అమర్చడం క్లిష్టంగా మారింది. అయితే తెగిపోయిన చెవికి గనుక రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉంది. దాంతో వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. తెగిపోయిన చెవి పాడవ్వకుండా ఉండేలా.. పాదం పైభాగానికి అతికించారు. ఎందుకంటే అక్కడ చర్మం పల్చగా ఉండటమే గాక అక్కడి ఉండే రక్తనాళాలు సరిగ్గా చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. ఆ నేపథ్యంలో పాదానికి చెవిని అతికించారు. అక్కడ తలవెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. చెవి సురక్షితంగా పెరగడానికి సుమారు ఐదు నెలలు పైనే పట్టింది. ఆ ఐదు నెలలు నిరీక్షణ అనంతరం పాదంపై ఉన్న చెవిని తీసి తల భాగంలో విజయవంతంగా అమర్చారు వైద్యులు. అలాగే ఆ మహిళ తల చర్మాన్ని పునరుద్ధరించడానికి కడుపు నుంచి తీసిన చర్మాన్ని అతికించారు. ఈ సరికొత్త చికిత్సా విధానం విజయవంతం అవడమే గాక సదరు మహిళ సైతం పూర్తిగా కోలుకుంటోంది కూడా. ఇలాంటి శస్త్ర చికిత్సలు చైనాకేం కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. View this post on Instagram A post shared by Interesting Engineering (@interestingengineering)చదవండి: భావోద్వేగ మద్దతుకు పెరుగుతున్న డిమాండ్..! ఈ ఏడాదిలోనే ఏకంగా..
భావోద్వేగ మద్దతుకు పెరుగుతున్న డిమాండ్..! ఈ ఏడాదిలోనే ఏకంగా..
దేశవ్యాప్తంగా భావోద్వేగ మద్దతుకు డిమాండ్ పెరుగుతోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలు ఈ ఏడాది ఎక్కువగా వినిపించాయి. ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల సమస్యలు, చదువుపై ఒత్తిడి, ఉద్యోగ భారం, గుర్తింపు సంక్షోభం, సామాజిక ముద్ర వంటి అంశాలతో బాధపడుతున్నవారి నుంచి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మానసిక ఆరోగ్య అవగాహన, ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ 1లైఫ్ (www.1life.org.in – 7893078930)కు నిరంతరంగా, భారీగా కాల్స్ వచ్చాయి. మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన పెరగంతో పాటు భావోద్వేగ సమస్యల తీవ్రత, సంక్లిష్టత కూడా పెరిగినట్టు ఇది స్పష్టం చేసింది. 2025లో జనవరి నుంచి డిసెంబర్ మధ్య వరకు 1లైఫ్‌కు మొత్తం 38,437 కాల్స్ వచ్చాయి. ఈ సంఖ్య అవసరం ఎంత పెద్దదో తెలియజేయడమే కాకుండా, సాధారణ బాధలు సంక్షోభం స్థాయికి చేరకముందే వాటిని అడ్డుకునే విషయంలో అనుభూతితో వినడం, సమయానికి స్పందించడం ఎంత కీలకమో స్పష్టం చేసింది. సంవత్సరం మొత్తం కాల్స్ సంఖ్య క్రమంగా పెరిగింది. జనవరిలో 2,224గా ఉన్న నెలవారీ కాల్స్ సెప్టెంబరులో గరిష్ఠంగా 4,135కు చేరాయి. ఈ పెరుగుదల 86%. జులై నుంచి అక్టోబర్ వరకు నెలకు దాదాపు 4,000 కాల్స్ వచ్చాయి. ఈ పెరుగుదల సీజనల్ కాదని, భావోద్వేగ, మానసిక ఆరోగ్య సమస్యలు నిరంతరంగా పెరుగుతున్నాయని ఈ గణాంకాలు సూచించాయి. ఏడాది మొత్తం వాలంటీర్లు కాలర్లకు మద్దతు ఇవ్వడానికి 1,838 గంటలు కేటాయించారు. సగటు కాల్ వ్యవధి కూడా పెరిగింది. ఈ సేవల గురించి 1లైఫ్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ రెబెక్కా మారియా మాట్లాడుతూ, “ప్రతి కాల్ వెనుక బాధ, అయోమయం, ఒంటరితనం కథలుంటాయి. ఆ బాధను ఇతరులతో పంచుకోవడానికి చాలామందికి భద్రత అనిపించదు. మేము చూస్తున్నది సంఖ్యల పెరుగుదల కాదు, బాధ తీవ్రత పెరుగుదల. చాలామంది కాలర్లు సమయం, సహనం, తమ భావాలకు విలువ ఉందన్న భరోసా కోరుతున్నారు. సంక్షోభ తరుణం దాటిన తర్వాత కూడా మద్దతు ఉంటుందన్న నమ్మకాన్ని వారు ఆశిస్తున్నారు” అని తెలిపారు. 1లైఫ్‌కు వచ్చిన కాల్స్ స్వరూపం కాలర్ల సవాళ్ల విస్తృతి, లోతును ప్రతిబింబించింది. ఆర్థిక ఒత్తిడి, సంబంధాలు చెడిపోవడం, చదువు, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ర్యాగింగ్, వ్యాపార నష్టాలు తదితర కారణాలతో ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నవారి నుంచి భారీగా కాల్స్ వచ్చాయి. ఇటీవల దక్షిణ, ఉత్తర భారతదేశాల నుంచి కూడా కాల్స్ పెరిగాయి. “నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భావోద్వేగ సహాయానికి పెరుగుతున్న డిమాండ్ అదే విషయాన్ని తెలియజేస్తోంది. ఎవరికీ వినేవారు లేరన్న భావన రాకుండా చూడడానికే 1లైఫ్ పనిచేస్తోంది. కాల్స్ సంఖ్య పెరుగుతుండటం దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య అవగాహన, వాలంటీర్ శిక్షణ, అందుబాటులో ఉండే మద్దతు వ్యవస్థలపై మరింత పెట్టుబడి అవసరమని స్పష్టం చేస్తోంది” అని 1లైఫ్ డైరెక్టర్ టి.శ్రీకర్ రెడ్డి తెలిపారు. ఇటీవలి పలు సంఘటనలు ఈ గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాయి. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల యువకుడు ఆన్లైన్ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన తర్వాత 1లైఫ్‌ను సంప్రదించాడు. అతడు ఇంటిని, భార్య ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అతడిని తీవ్ర నిరాశకు, ఆత్మహత్య ఆలోచనలకు నెట్టింది. 1లైఫ్ సానుభూతితో వినడం ద్వారా అతడికి తన బాధను చెప్పుకొనే అవకాశం కల్పించింది. సహాయం అందుబాటులో ఉందన్న భావనను అతడిలో మళ్లీ తీసుకొచ్చింది. మరో ఘటనలో ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల మహిళ ఆరేళ్ల బంధం ముగిసిన తర్వాత 1లైఫ్‌ను సంప్రదించారు. తామిద్దరం దూరంగా ఉన్నప్పుడు తన భాగస్వామి సహోద్యోగితో సంబంధం పెట్టుకున్నట్టు ఆమెకు తెలిసింది. ఆ మోసం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. మానసికంగా కుంగిపోయిన ఆ క్షణంలో ఆమె మద్దతు కోరారు. వివక్షను ఎదుర్కొంటున్నవారి నుంచి కూడా 1లైఫ్‌కు కాల్స్ వస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల ట్రాన్స్‌జెండర్.. సమాజధోరణి తనను ఒంటరిగా, నిరుత్సాహంగా మార్చిందని చెప్పారు. ఎంబీఏ పూర్తిచేసి ఐటీ రంగంలో పనిచేస్తున్నా, తరచూ అవహేళన, దూరం పెట్టడం ఎదురయ్యాయి. అవి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. సంభాషణలో తీర్పు ఏమీ ఇవ్వకుండా ఆమె అనుభవాలను గుర్తించి, అంగీకరించారు. 2025 గణాంకాలు, అనుభవాలు దేశవ్యాప్తంగా వేలమందికి 1లైఫ్ కీలక జీవనాధారంగా నిలుస్తున్నట్టు స్పష్టం చేశాయి. అదే సమయంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అవి సూచించాయి. సామాజిక, ఆర్థిక, వృత్తిరంగాల్లో మానసిక ఆరోగ్య సవాళ్లు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో వాలంటీర్ల నియామకం, శిక్షణ, నిర్వహణ మద్దతుపై నిరంతర పెట్టుబడి అత్యవసరమని ఈ అనుభవాలు తెలియజేశాయి. (చదవండి: సెరిబ్రల్ పాల్సీ బాధితుడి సక్సెస్ స్టోరీ..తొలి ప్రయత్నంలోనే ఇంజనీరింగ్ సర్వీస్ సత్తా చాటి..)
శబరిమల యోగా దండం, జప మాల మరమ్మత్తు పనుల కేసుపై సిట్ దర్యాప్తు ముమ్మరం
పథనంతిట్ట: శబరిమల ఆలయంలో ఆరోపణలు వెల్లువెత్తిన యోగా దండం, జపమాల మరమత్తుల కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తును వేగవంతం చేసింది. అసలు యోగా దండం, జప మాల స్థానంలో కొత్త వస్తువులు పెట్టారని నిందితుల్లో ఒకరు చేసిన ప్రకటనను అనుసరించి ఈ చర్య తీసుకుంది.2014 నాటి అక్రమాలపై దర్యాప్తు చేయాలని సిట్‌ను కోరుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ విస్తృత దర్యాప్తు జరుగుతోంది. 2019 ఏప్రిల్‌లో విషు పండుగ సందర్భంగా ఎ. పద్మకుమార్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరమ్మతు పనులు చేపట్టారు. మరమ్మతులను ఆయన కుమారుడు అందించాడని చెప్పుకున్నారు. దేవస్వం బోర్డు సన్నిధానం (ఆలయ ప్రాంగణం) వద్ద పనులు జరిగాయని పేర్కొంది.జూలై 2019లో బంగారు పూత కోసం ద్వారపాలక (సంరక్షక దేవత) శిల్పాలను తొలగించే ముందు మరమ్మతులు జరిగాయి. మార్చి 16 , 2019 నాటి దేవస్వం బోర్డు నిర్ణయం ప్రకారం , యోగా దండను బంగారంతో చుట్టడానికి బయటకు తీసుకెళ్లారు. మరమ్మతులు చేపట్టే బాధ్యతను జయశంకర్ పద్మన్‌కు అప్పగించారని కూడా ఈ నిర్ణయంలో పేర్కొన్నారు.యోగా దండం, రుద్రాక్ష మాల అనేవి గర్భగుడి లోపల ప్రత్యేకంగా ఉంచబడిన పవిత్ర వస్తువులు. ఆలయ ప్రతిష్ట సమయంలో పండలం ప్యాలెస్ మొదట యోగా దండను అందించేది.సన్నిధానంలో మరమ్మతులు హైకోర్టు అనుమతితో జరిగాయని అధికారులు పేర్కొన్నప్పటికీ, రికార్డులలో పని జరిగిన ప్రదేశాన్ని స్పష్టంగా పేర్కొనకపోవడం లేదా కోర్టు ఆర్డర్ నంబర్ వంటి వివరాలను అందించకపోవడంతో సిట్ ఆందోళన వ్యక్తం చేసింది.మరమ్మతులను డాక్యుమెంట్ చేసే మహాజర్ను ఏప్రిల్ 14 , 2019న తయారు చేశారు. దీనిలో అప్పటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ప్రస్తుతం జైలులో ఉన్న) మురారి బాబు , ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. సుధీష్ కుమార్ మరియు తిరువాభరణం కమిషనర్ కె. ఎస్. బైజు సంతకాలు ఉన్నాయి. ఈ అధికారులలో ఒకరి ప్రకటనలు సిట్ యోగా దండ సమస్యను నిశితంగా పరిశీలించడానికి కారణమయ్యాయని వర్గాలు తెలిపాయి.మహాజర్ ప్రకారం , యోగా దండపై ఉన్న బంగారు ఉంగరాలు మొదట్లో 19.2 గ్రాముల బరువు ఉండేవి. తరువాత , 18 ఉంగరాలు మరియు బేస్ వద్ద బంగారు టోపీని తయారు చేయడానికి 44.54 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారు. రుద్రాక్ష మాలను చింతపండుతో కడిగి శుభ్రం చేశారని కూడా పత్రం పేర్కొంది.సాంప్రదాయ ఆలయ కళాకారుల కుటుంబానికి చెందిన ఆలయ శిల్పి తట్టవిల మహేష్ పనికర్ మాట్లాడుతూ, అసలు యోగా దండ ఎబోనీ (కరుంగలి) కలపతో తయారు చేయబడిందని మరియు దాని స్థానంలో బంగారంతో చుట్టబడిన వెదురు కర్రను ఉంచారని ఆరోపించారు. కాగా, 2018 నుంచే శబరిమల అయ్యప్ప ఆలయంలోని యోగదండం, ఏకముఖీ రుద్రాక్షల మాల మిస్సయినట్లు క్రైమ్ బ్రాంచఠ్ భావిస్తోంది. అప్పట్లో యోగదండాన్ని బంగారు పూత కోసం తరలించారు. అలా తరలించడం ఆలయ ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్(మజహర్ రికార్డు)లో నమోదు కాలేదు. అప్పట్లోనే అత్యంత ఖరీదైన పురాతన ఏకముఖీ రుద్రాక్షల మాలను కూడా బంగారు పూతకు తీసుకెళ్లారు. హైకోర్టు అనుమతి లేకుండానే.. ఓ అధికారి వీటిని బయటకు పంపేందుకు అనుమతినిచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.(చదవండి: శబరిమల యోగదండం మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఈడీ)
నాడు పెన్సిల్ పట్టుకోవడానికే కష్టపడ్డాడు..కానీ ఇవాళ ఏకంగా..
అవయవ లోపంకి మించిన రుగ్మతలతో పోరాడుతూ ప్రతిభను చాటుకుంటున్నారు చాలామంది. అన్ని బాగుండి విజయం సాధించడం కాదు..సమస్యతో పోరాడుతూ విజయం సాధించడం వేరేలెవల్ అంటూ సత్తా చాటి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ మన్వేందర్ సింగ్. చిన్నానాటి నుంచి సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూ..మరోవైపు తండ్రి మరణం భుజాలపై ఇంటి బాధ్యతలు..ఇన్ని సమస్యలతో పోరాడుతూ అసామాన్యమైన ప్రతిభను చాటి శెభాష్ అనిపించుకుని యువతకు ప్రేరణగా నిలిచాడు. అతడే బులంద్‌షహర్ జిల్లాలోని ఆవాస్ వికాస్ నివాసి మన్వేంద్ర సింగ్. అతడు సెరిబ్రల్ పాల్సి బాధితుడు. ఇది కదలిక, కండరాలను నియంత్రణను ప్రభావితం చేసే నాడీ సంబంధిత వ్యాధి. అతడికి ఆరునెలల వయసులో వ్యాధి ఉందని వైద్యులు నిర్థారించారు. రెండేళ్లకే మెడను సరిగా నిలబెట్టడంలో ఇబ్బందిపడ్డాడు, పెద్దయ్యాక శరీరం కుడివైపుకి వండిపోవడంతో..రోజువారీ పనులు చేసుకోలేక చాలా అవస్థలు పడ్డాడు. తనకు ప్రతిబంధంగా ఉన్న శరీరంతో పోరాడుతూ..సవాలుగా మారిన రోజువారీ సాధారణ పనులను ఎలా చేయాలో తెలుసుకుంటూ సాగింది అతడి ప్రయాణం.అతడి ప్రతిభను వెలికతీయడంలో తల్లి పాత్ర కీలకం..అతని తల్లి రేణు సింగ్, బులంద్‌షహర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్. తన కుమారుడు ప్రతీది చాలా ఆలస్యంగా నేర్చుకునేవాడు. పెన్సిల్ పట్టుకోవడమే చాలా కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అతడి బాల్యం మొత్తం శారీరక, సామాజిక అడ్డంకులతో నిండి ఉందని చెప్పుకొచ్చారామె. తన కుడివైపు ఉన్న శారీరక పరిమితులను భర్తీ చేసేలా ఎడమ చేతితో అన్ని పనులు చేసుకునేలా శిక్షణ తీసుకున్నాడు. వైద్యులు అతడి నడకను సైతం ఆ వ్యాధి ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. దాంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఆస్పత్రులన్ని తిరిగామని చెప్పుకొచ్చారామె. వైద్య సంరక్షణ తోపాటు అతడి సంకల్ప బలం తోడవ్వడంతో ..అతడు ఆ సమస్యను అధిగమించగలిగాడు. ఇంతలో విధి మరోలా తలచింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారామె. ఈ శారీరక కష్టానికి తోడు ఇంటి బాధ్యతలు..మన్వేంద్రకు 17 ఏళ్ల వయసులో, అతని తండ్రి దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించాడు. ఇంటి పెద్దను కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మన్వేందర్‌ని ఈ ఘటన మరింతగా కుంగదీసింది. అయితే ఒకరకంగా అతడిలో దాగున్న అంతర్లీన శక్తిని తట్టిలేపి..ఇంటికి పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలను స్వీకరించేలా చేసిందని చెప్పుకొచ్చారామె. ఇక మన్వేందర్ ఇంటర్ తర్వాత ఐఐటీ లక్ష్యంగా ఎంట్రన్స్ టెస్ట్‌కి ప్రిపేరయ్యి..ఐఐటీ పాట్నాలో సీటు సంపాదించాడు. అక్కడ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, యూపీఎస్సీ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ 2025కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసి, ఆల్ ఇండియా 112ర్యాంకు సాధించి..అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఎగ్జామ్‌లో గెలుపొందితే టెలికాం, విద్యుత్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలలో గ్రూప్ ఏ, లేదా బీ కేటగిరీలో ఇంజనీర్‌గా నియమిస్తుంది ప్రభుత్వం. చివరగా అతడి తల్లి రేణుసింగ్ మాట్లాడుతూ.. "ప్రతిదీ భారంగా అనిపించిన క్షణాలు ఉన్నాయి. అయితే నేను నువ్వు ఇది చేయగలవు అనే నమ్మకాన్ని ఇస్తూనే ఉన్నా. ఈ విజయం అతడి ఏళ్ల తరబడి కృషి, పట్టుదల, ఓర్పుల ప్రతితిఫలమే ఈ సక్సెస్ అని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది ". మన్వేంద్ర తల్లి. బిడ్డ ఎలా ఉన్నా తల్లికి గొప్ప అందగాడు, హీరో.. అది నిజం చేసేలా ప్రపంచం ముందు గొప్పవాడిగా తీర్చిదిద్దేలా తల్లి ఎంతగా పరితపిస్తుంది అనేందుకు ఈ కథే ఉదాహరణ.(చదవండి: పేరెంట్స్ చేత ట్రీట్ ఇప్పించుకోండి..! వైరల్‌గా ప్రముఖ వ్యాపారవేత్త పోస్ట్)
అంతర్జాతీయం
శాంతి ఒప్పందానికి చేరువలో...
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. శాంతి ఒప్పందం విషయంలో ఆ రెండు దేశాలు ఎన్నడూ లేనంత సమీపంలోకి వచ్చాయని తెలిపారు. ఆదివారం ఫ్లోరిడాలోని ఓ రిసార్ట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఈ భేటీ జరగడం విశేషం. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంతోపాటు యుద్ధం ముగించడంపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. భేటీ అనంతరం జెలెన్స్కీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధినేత పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జెలెన్స్కీ నిజంగా ధైర్యవంతుడైన నాయకుడు అంటూ కొనియాడారు. మరోవైపు జెలెన్స్కీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి దిగడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. ఏం చర్చించారు? ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. కొన్ని అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉక్రెయిన్‌కు సంబంధించిన కొన్ని భూభాగాలను రష్యా ఆక్రమించింది. వాటిని తిరిగి అప్పగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా రష్యా అంగీకరించడం లేదు. వాటిపై హక్కులు వదులుకోవడంతోపాటు రష్యాలో అంతర్భాగంగా అధికారికంగా గుర్తిస్తేనే యుద్ధాన్ని ఆపేస్తామని తేలి్చ చెబుతోంది. ఇందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా భద్రతాపరమైన గ్యారెంటీలు ఇవ్వాలని కోరుతోంది. ఈ రెండు ముఖ్యమైన అంశాలపైనే ట్రంప్, జెలెన్స్కీ చర్చించినట్లు తెలుస్తోంది. యూరోపియన్ నాయకులతో సమావేశం కావాలని వారిద్దరూ నిర్ణయించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్తోపాటు ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, పోలాండ్ తదితర దేశాల అధినేతలతో సమావేశం ఏర్పాటుచేస్తానని ట్రంప్ చెప్పారు. వచ్చే నెలలో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. శాంతి కోసం ట్రంప్ ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ఆయనకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, రష్యా అధినేత పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. శాంతి ఒప్పందంపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు.
పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి.. రష్యా సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మధ్య రష్యా–ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని మాస్కో సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది.రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకారం... ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో–సెంట్ పీటర్స్బర్గ్ మధ్య ఉన్న నోవ్గొరడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునఃసమీక్షిస్తాం అని హెచ్చరించారు.ఇదే సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితం. ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్‌పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ కథనాన్ని ప్రచారం చేస్తోంది. అలాగే, యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికీ ఇదే కారణం అని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఈ పరిణామాలతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాక్ ఆర్మీపై దాడి: 15మంది మృతి
బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్‌పై విరుచుకపడుతోంది. గత కొద్ది రోజులుగా పాక్‌లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులలో 15మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. సరిహాద్దు వెలుపల భారత్, ఆప్గాన్లతో ఆ దేశానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇవి చాలవన్నట్లు పాకిస్థాన్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ఆ దేశ ఆర్మీ ఊక్కిరిబిక్కిరవుతోంది.ఇటీవల పాక్‌పై జరిపిన దాడులలో 15 మంది ఆదేశ సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. డిసెంబర్ 23న కేచ్ జిల్లా తేజ్బాన్ ఆర్మీ పోస్టుపై జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 25వ తేదీన పంజూర్ జిల్లాలో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ వద్ద మిలటరీ వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్ప్లోసివ్స్తో దాడులు జరిపామని ఆ ఘటనలో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.అదే విధంగా పాకిస్థాన్ సెక్యూరిటీ వెహికిల్స్ పై చేసిన దాడిలో ఐదుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఈ ఆదివారం మరో దాడి చేసి ఆ దేశ కమ్యూనికేషన్ టవర్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం సాధించేవరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.1948లో పాక్‌లో బలూచిస్థాన్ విలీనం చేసే సందర్భంలో ఆ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బలంవంతంగా ఆప్రాంతాన్ని పాకిస్థాన్‌లో కలిపారు. అప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పై బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను తీవ్రతర చేసింది.
లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
లకురవా..! ఒకప్పుడు నైజీరియాలో దోపిడీ దొంగల నుంచి గ్రామీణులను కాపాడతారనే పేరున్న ఈ ముఠా సభ్యులు.. క్రమంగా కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో జతకట్టారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలో పాగా వేశారు. ఇప్పుడు పెద్దన్న...... అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా మారారు. అందుకే ట్రంప్ క్రిస్మస్ రోజున ‘హ్యపీ క్రిస్మస్’ సందేశమిస్తూ.. నైజీరియా వాయవ్య సరిహద్దుల్లోని సోకోటో రాష్ట్రంలో ఐఎస్ ఉగ్రవాదులను టార్గెట్‌గా చేసి, దాడులు జరిపిన విషయాన్ని బహిర్గతం చేశారు. ఏమిటా లకురవా ముఠా? ట్రంప్ వారిపై ఎందుకు కక్షకట్టాడు?? లకురవా అంటే రిక్రూటింగ్ అని అర్థం. 2016-17 మధ్యకాలంలో లకురవా ముఠా టంకాసాలోని గోంగానో అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాలపై దాడులు జరిపి, దోపిడీలకు పాల్పడే మూకల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేది. తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడే ఈ గ్రామాలను దోచుకునే బందిపోట్ల పీచమణిచేది. వ్యవసాయాధారితమైన ఈ గ్రామాల్లో రాజకీయ అస్థిరతకు తోడు.. నైజీరియా సైన్యం రక్షణ లేకపోవడంతో.. దోపిడీదారులు విజృంభించేవారు. ఈ పరిస్థితుల్లో నైజర్, మాలి నుంచి వచ్చిన కొంతమంది యువకులు దోపిడీదారులపై ఎదురుదాడి చేశారు. గ్రామస్థులు కూడా వీరికి మద్దతిచ్చారు. 2018 నాటికి ఈ ముఠా శక్తిమంతమైంది. తమ ముఠాకు లకురవా అని నామకరణం చేసింది. స్థానికులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని స్థిరపడింది. ఆ తర్వాత.. తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. ఇస్లామిక్ నిబంధనలను అమలు చేయడం మొదలు పెట్టింది. మ్యూజిక్ వినేవారికి కొరడాలతో శిక్షలు విధించింది. 2023 నాటికి లకురవా ముఠా.. సోకోటోలోని అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకుంది. గతంలో ఈ ప్రాంతాలను బెంబేలెత్తించిన దోపిడీదారులను మించి.. ప్రజలను హింసించడం మొదలు పెట్టింది. క్రమంగా క్రూరత్వానికి మారుపేరుగా లకురవా మారిపోయింది. గ్రామాలపై పన్నులు విధించి.. దారుణంగా వసూలు చేసేది. దాదాపు 500 గ్రామాల్లో లకురవా పాగా వేసింది. అదే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే నైజీరియా సైన్యంపై అత్యంత క్రూరంగా దాడులు జరిపేది.క్రమంగా లకురవా ముఠాలు రిక్రూట్మెంట్లను తీవ్రతరం చేశాయి. 18-35 ఏళ్ల యువకులను ఆకట్టుకున్నాయి. తమతో జతకట్టే యువకుల కుటుంబాలకు డబ్బులివ్వడమే కాకుండా.. వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, విత్తనాలను అందజేసేది. అలా.. దారుల్ ఇస్లాం అనే పేరుతో శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. దీంతో.. నైగర్, నైజీరియా సైన్యాలు చర్యలకు ఉపక్రమించాయి. 2024 నవంబరులో ఈ రెండు దేశాలు లకురవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో లకురవా ఉగ్రదాడులను మరింతగా పెంచింది. అదే నెలలో కేబ్బీలోని మెరా అనే గ్రామంపై దాడి చేసి, 25 మంది గ్రామస్థులను హతమార్చింది.లకురవాను ఉగ్రసంస్థగా ప్రకటించడానికి సరిగ్గా రెండు నెలల ముందు.. అంటే.. 2024 సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి ఓ కీలక సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది. లకురవా నేతలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారనేది ఆ సమాచారంలో ప్రధానాంశం. ఐఎస్‌లో చేరి ఐఎస్‌జీఎస్.. అంటే.. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ద గ్రేటర్ సహారాను ఏర్పాటు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా.. ఐఎస్ నుంచి అధునాతన ఆయుధాలు, డ్రోన్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలను సేకరించింది. ఐఎస్‌జీఎస్ ఇప్పుడు బోకోహరామ్‌తో కూడా చేతులు కలిపే ప్రమాదాలున్నట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అదే సమయంలో.. లకురవా మాత్రం అరాచకాలను మరింత పెంచింది. క్రైస్తవులు అధికంగా ఉండే గ్రామాలను టార్గెట్‌గా చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను టార్గెట్‌గా చేసుకుంది. లకురవా చర్యలపై ఉప్పందుకున్న అమెరికా రంగంలోకి దిగింది. ఈ ఏడాది నవంబరు నుంచే అమెరికా గూఢచర్య సంస్థలు వాయవ్య నైజీరియాలో నిఘాను పెంచినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ కూడా ఈ నెల 22న ఓ కథనాన్ని ప్రచురించింది. అందుకు తగిన ఆధారాలుగా అమెరికా సైన్యం ఫైటర్ జెట్ల రాకపోకలకు సంబంధించిన ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను పాఠకుల ముందుంచింది. అంతేకాదు.. క్రైస్తవులపై హింస పెరుగుతుండడంతో మత అసహన దేశాల జాబితాలో నైజీరియాను ట్రంప్ ప్రభుత్వం చేర్చింది. అయితే.. క్రిస్మస్ సందర్భంగా ట్రంప్ ప్రపంచానికి షాకిచ్చారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలోని బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని, దాడులు జరిపినట్లు ప్రకటించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఈ దాడులు జరిపానంటూ తననుతాను సమర్థించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అంతంచేస్తానని ప్రతినబూనారు.లకురవా అరాచకాలు ఒక్కటని చెప్పలేం. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో కూడా క్రిస్మస్ రోజున దాడులు జరిపింది. కొన్ని వారాల క్రితం ఉత్తర నైజీరియాలో ఓ క్యాథలిక్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, 300 మంది పిల్లలను అపహరించింది. నైజీరియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక అపహరణ ఉదంతం. చాలా మంది పిల్లలను ఆ తర్వాత విడుదల చేసినా.. మిగతావారెక్కడ? అనేదానిపై స్పష్టత లేదు. ఓ క్రైస్తవ మిషనరీ సంస్థ కోసం పనిచేసే ఓ పైలట్ కూడా ఇటీవల అపహరణకు గురయ్యారు. నైజీరియాలో ముస్లిం-క్రిస్టియన్ల జనాభా దాదాపుగా చెరిసగం ఉంటుంది. ఈ నేపథ్యంలో నైజీరియాలో క్రైస్తవులపై దాడులు కొనసాగితే.. అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఆ మేరకే క్రిస్మస్కు ముందు సోకోటోలోని అనేక ఉగ్రవాద స్థావరాలను అమెరికా, నైజీరియా సైన్యాలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. ఈ ఉదంతాన్ని బహిర్గతం చేస్తూనే ట్రంప్ ‘హ్యాపీ క్రిస్మస్’ అంటూ పోస్టు చేశారు. ట్రంప్ పట్టుదలను చూస్తుంటే.. నైజీరియాలో అమెరికా సైన్యాన్ని మరింతగా మోహరించి, మున్ముందు మరిన్ని దాడులు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -హెచ్.కమలాపతిరావు
జాతీయం
డ్రైవర్ వీరంగం.. టోల్ ప్లాజా గేటు ధ్వంసం
బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ సమీపంలోని బ్రహ్మరకూట్లు టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్ ఫీజు చెల్లించే విషయంలో మొదలైన వివాదం టోల్ సిబ్బందిపై దాడికి దారితీసింది. లారీ డ్రైవర్, క్లీనర్ కలిసి టోల్ గేటును ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి సిబ్బందిపై దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిక్కమగళూరుకు చెందిన భరత్ (23) అనే లారీ డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్లో టోల్ ప్లాజా వద్దకు తీసుకువచ్చాడు. డ్యూటీలో ఉన్న టోల్ సిబ్బంది టోల్ రుసుము చెల్లించాలని కోరగా, డ్రైవర్ నిరాకరిస్తూ, గొడవకు దిగాడు. ఆవేశంతో వాహనాన్ని ముందుకు పోనిచ్చి టోల్ గేటును ఢీకొట్టి, దానిని ధ్వంసం చేశాడు. అనంతరం డ్రైవర్ భరత్, క్లీనర్ తేజస్ (26) కలిసి అక్కడి సిబ్బంది అంకిత్, రోహిత్‌లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై దాడికి దిగారు.నిందితులు అంతటితో ఆగకుండా, తమకు తోడుగా మరికొందరిని పిలిపించి, మరోమారు టోల్ ప్లాజాపై దాడి చేశారు. ఈ ఘటనతో టోల్ ప్లాజా వద్ద కొంతసేపు పనులు నిలిచిపోయాయి. టోల్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ ఫిర్యాదు మేరకు బంట్వాల్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై కేసు నమోదు చేశారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టోల్ ప్లాజాల వద్ద సిబ్బంది రక్షణ కోసం భద్రతను పెంచాలని, ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై నిఘా పెట్టేందుకు సీసీటీవీ దృశ్యాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఏడాది చివరిలో ఘోరం.. ఏడుగురు మృతి
ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. ప్రియాంక, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా (25) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితురాలు అవీవా బేగ్ (Aviva Baig)తో రేహాన్ నిశ్చితార్ధం చేసుకున్నారన్న వార్త కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.రేహాన్ వాద్రా (Raihan Vadra) ఇటీవల తన ఏడేళ్ల నాటి స్నేహితురాలు అవివా బేగ్‌కు ప్రపోజ్ చేశాడు. దానికి ఆమె ఓకే చెప్పారట. వీరి ప్రేమ ప్రయాణానికి రెండు కుటుంబాలు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ నిశ్చితార్థంపై ప్రియాంక గాంధీ కుటుంబం నుంచి గానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రేహాన్ వాద్రా గురించి..రేహాన్ వాద్రా డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నాడు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా చదువుకున్నది కూడా ఇక్కడే కావడం గమనార్హం. ఆ తర్వాత పొలిటిక్స్‌లో ఉన్నత విద్య కోసం లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)కి వెళ్లాడు. రేహాన్ ఒక విజువల్ ఆర్టిస్ట్ గత పదేళ్లుగా ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టాడు. ముంబైలోని కొలాబాలో ఉన్న సమకాలీన ఆర్ట్ గ్యాలరీ APRE ఆర్ట్ హౌస్‌లో అందుబాటులో ఉన్న బయో ప్రకారం, అతని పోర్ట్‌ఫోలియో వన్యప్రాణులు స్ట్రీట్, వ్యాపార ఫోటోగ్రఫీపై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. తన తల్లి ప్రియాంక గాంధీ వాద్రా ప్రోత్సాహంతో, ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నాడు. అలాగే తాత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీపై అభిరుచిని కలిగి ఉండేవారు.అవివా బేగ్ ఎవరు?ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మోడరన్ స్కూల్లో తన ప్రారంభ విద్యను, OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి మీడియా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీని పొందారు. అంతేకాదు ఆమె జాతీయ స్థాయి మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారిణి. అలాగే ఫోటోగ్రాఫర్ కూడా. 'యు కాంట్ మిస్ దిస్' (ఇండియా ఆర్ట్ ఫెయిర్, 2023), 'ది ఇల్యూసరీ వరల్డ్' (2019) వంటి అనేక విజయవంతమైన ప్రదర్శనలలో తన కళను ప్రదర్శించారు.ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం
ఏడాది చివరిలో ఘోరం.. ఏడుగురు మృతి
అల్మోరా: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భికియాసైన్ నుండి రామ్‌నగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి, వినాయక్ ప్రాంతంలోని ఒక లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 17 నుండి 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు ద్వారహత్ నుండి బయలుదేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శైలాపాని సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వందల అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలో పడిపోయిన క్షతగాత్రులను వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గాయపడిన వారిని వెంటనే భికియాసైన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా యంత్రాంగం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కూడా చదవండి: Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి
ఉన్నావ్ కేసు.. సెంగార్ కూతురి ఎమోషనల్ పోస్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిందిఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్లైన్లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు. నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె. ToThe Hon’ble Authorities of the Republic of India,I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 2017లో యూపీ ఉన్నావ్‌కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్‌ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు.. బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది.
ఎన్ఆర్ఐ
సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం ! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్
సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్ ఓ మంచి ఎనర్జిటిక్‌గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌లో ఏం చెప్పాడంటే..తన పేరు సచిన్ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు. అక్కడ జీతం, హోదా, జెండర్, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు. అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sachin | Life in Norway 🇳🇴 | Ship to Shore 🚢 (@sachinoffshore) (చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..)
మెల్బోర్న్లో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని వైఎస్సార్సీపీ మెల్బోర్న్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జూమ్ మీటింగులో పలువురు సీనియర్ పార్టీ నాయకులు సాకే శైలజానాథ్,ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. గత కొన్ని ఏళ్లుగా వైఎస్సార్సీపీ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకులు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే ప్రోగ్రామ్‌లో సీనియర్ నాయకులని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని అన్నారు నాయకులు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతిచ్చి తీర్చుకుంటామని తెలియజేశారు. సాకే శైలజానాథ్, ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ..మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసీపీ నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు.(చదవండి: అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్)
మానసిక అస్వస్థతతో అబుదాబిలో తెలంగాణా కార్మికుడు, ప్రజావాణిలో వినతి
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం యూఏఈ రాజధాని అబుదాబి ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. గ్రామంలో చెడు అలవాట్లకు బానిసై దాన్నుంచి బయటపడాలని గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడ దుర్భర జీవితాన్ని వెళ్ల దీస్తున్నాడు.నవంబర్ 11న క్లీనర్ వీసాపై అబుదాబికి వెళ్లిన శ్రీరాం, రెండు రోజులకే మతిస్థిమితం కోల్పోయి లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమయ్యాడు. నెల రోజుల అనంతరం అతడిని గుర్తించి క్యాంప్‌కు తీసుకువచ్చినా, కంపెనీ మానవత్వం మరిచి లోపలికి అనుమతించకుండా బయటకు తోసివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అమానుష వైఖరి కారణంగా అతడు మళ్లీ రోడ్ల పాలయ్యాడు.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, కంపెనీ అతడిపై ‘అబ్స్కాండింగ్’ కేసు నమోదు చేసి, స్వదేశానికి పంపాలంటే 4,500 దిర్హముల (సుమారు రూ.1.10 లక్షలు) జరిమానా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆందోళన చెందిన బాధితుడి భార్య సునీత మంగళవారం (23.12.2025) హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ వినతి ప్రతులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లకు అందజేశారు.మంద భీంరెడ్డి వెంట రాగా, బాధితుడి భార్య సునీత 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రికి లేఖ రాశారు.ఇదిలా ఉండగా, శ్రీరాంను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో అబుదాబి తెలంగాణ సామాజిక సేవకురాలు, వేములవాడకు చెందిన ప్రియా సింగిరెడ్డి కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నారు.“నా భర్తను తక్షణం స్వదేశానికి తీసుకువచ్చి, కుటుంబ సభ్యుల సమక్షంలో మానసిక వైద్యం, పునరావాసం కల్పించండి. అత్యంత పేద గిరిజన కుటుంబం. ఈ ఖర్చులు భరించే స్థితిలో లేము” అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయంకు లేఖ రాశారు.
కెనడాలో సాక్షి టీవీ గ్రాండ్ లాంచ్
తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షిటీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు.సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంచింగ్‌పై హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ వెన్నెల రెడ్డి జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రీనా హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ కెనడా లాంఛ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె.రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు : వరాహసూరి అప్పారావు, ప్రవీణ్ నీలా,రాజ్ సజ్జా, విశ్వ శ్రీనివాసన్, వేణుగోపాల్ రోకండ్ల, ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, మహమ్మద్ సిద్ధిఖీ, సుధాకర్ రెడ్డి సింగన, ర్యాన్ సెక్వేరా, రాజేష్ ప్రసాద్, రంజిత్ పింగిలేటి, భావన పగిదేల, మురళీధర్ పగిదేల, రుక్మిణి మద్దులూరి, మధుసూధన్ కొట్టురి, యశ్వంత్ వుమ్మనేని, సూర్య కొండేటి, ప్రసన్న తిరుచిరాపల్లి, విజయ్, లక్ష్మి రాయవరపు, శ్రీనివాసులు, నూర్ అహ్మద్,విజయ్ చేగిరెడ్డి,కౌశిక్ నారాల, శ్రీని ఇజ్జాడ, సౌజన్య కసుల, ప్రతాప్ బి, విద్యా సాహితి, శైలేష్ పాలెం, అల్లంపాటి కృష్ణా రెడ్డి, విజయ్ సేతుమాదవన్, షాలిని బెక్కం, యశ్వంత్ రెడ్డి నిమ్మకాయల, గుణశేఖర్ కోనపల్లి, శ్రీనివాసులు రెడ్డి మరిక్కగారి నరసింహారెడ్డి గుత్తిరెడ్డి , చెన్న కేశవరెడ్డి కుమ్మెత, వెంకట కృష్ణా రెడ్డి గోపిరెడ్డి ,అస్లాం బేగ్, శశివర్ధన్ పట్లోళ్ల, విష్ణు వంగల , సుబ్బారావు నాయక్ బాణావతు, కళ్యాణ్ జి, కాయం పురుషోత్తం రెడ్డి, వి వి ఎన్ మూర్తి, రామ్, రమేష్ తుంపెర ,భరత్ కుమార్ సత్తి, శ్రీకాంత్ బి, నరేన్ తాడి, స్వాతి మిరియాల, పావని పులివర్తి , రవి కాసుల, సౌజన్య కాసుల, రామ్ చిమట, సుధీర్ కుమార్ సూరు, శ్రీనివాస్ కస్తూరి, వలియుద్దీన్ , లక్ష్మీ రాయవరపు, రవీందర్, వెంకట్ రామ్ రెడ్డి పలిచెర్ల, గౌతమ్ కొల్లూరి, పృధ్వీ, మహేశ్వర కనాల, నాగ వెంకట చిరంజీవి చాడ, క్రాంతి ఆర్, జగపతి రాయల, నిశ్చల్ వి, అనంత్ కందసామి, నాగార్జున, కోటేశ్వర్ రావు, వేణుగోపాల్, మణిదీప్, పలువురు పాల్గొన్నారు
క్రైమ్
‘అమ్మా’ అని పిలిచి, అదను చూసి..
సాక్షి, హైదరాబాద్: నాచారం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒంటరి మహిళ అని సుజాతను గుర్తించి.. ఆమెతో మంచిగా ప్రవర్తించి.. నగల కోసం దారుణానికి ఒడిగట్టాడు ప్రధాన నిందితుడు అంజిబాబు. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత భర్త, పిల్లలు కొన్నేళ్ల కిందట యాక్సిడెంట్లో మరణించారు. దీంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. రెండు నెలల కిందట డ్రైవర్‌గా పని చేసే అంజిబాబు ఆమె ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే సుజాత ప్రతీరోజూ ఒంటి నిండా బంగారం ధరించేది. ఇది గమనించిన అంజిబాబు.. ఆ నగల కోసం సుజాతను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో.. అమ్మా అని సుజాతను పిలుస్తూ దగ్గరయ్యాడు. ఆ పిలుపు విని ఆమె కూడా మోసపోయింది. ఈ నెల 18వ తేదీన కిచెన్‌లో ఉన్న సుజాతను వెనుక నుండి ముసుగు వేసి అంజి బాబు ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ఆపై ఆమె ఒంటిపై నగలు తీసేసి.. ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. అయితే.. పారిపోతే తన మీదకే నేరం వస్తుందని ఆలోచించి స్నేహితులతో కలిసి ఓ పన్నాగం పన్నాడు. మృతదేహాన్ని మాయం చేయాలనీ తన స్నేహితులు దుర్గారావు, యువరాజులతో కలిసి ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ సూట్‌కేసు తెచ్చి.. అందులో సుజాత మృతదేహం కుక్కి రాజమండ్రి(ఆంధ్రప్రదేశ్) తీసుకెళ్లారు. ఆ బ్యాగును కోనసీమ రాజోలు దగ్గర గోదావరిలో పడేసి వచ్చారు.సుజాత కనిపించకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే తనకు ఏం తెలియనట్లు.. ఆ బంధువులతో కలిసి అంజిబాబు ఆమె కోసం గాలించడం మొదలుపెట్టాడు. ఈలోపు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు ఈ కేసును చేధించారు. అంజిబాబు, అతనికి సహకరించిన యువకుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో గోదావరి నది నుంచి ట్రాలీ బ్యాగ్‌ను వెలికి తీశారు. అందులోంచి సుజాత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు. నిందితుల నుంచి నాలుగు బంగారు గాజులు, చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నారు.
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
మహబూబాబాద్: ఉన్నత చదువులు.. ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. అమెరికాలో ఘోర ప్రమాదంలో భారతీయ విద్యార్థినిలు మృతి చెందారు. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి బయల్దేరారు. ఈ క్రమంలో.. అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు.. ఇటు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఇద్దరి మృతితో గార్ల మండలంలోని వాళ్ల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల మీసేవా సెంటర్ నిర్వహకుడు కాగా.. భావన ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వర్రావు కుమార్తె అని తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, యువతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల మృతదేహాలను రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.అమెరికాలో రోడ్డు ప్రమాదం మహబూబాబాద్ యువతులు మృతిఅమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతిఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి… pic.twitter.com/rnCljzTWtP— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025
ట్రాప్ చేసి సర్వం దోచుకున్న నయవంచకుడు
కర్ణాటక: ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను నమ్మించి సర్వం దోచుకుని మోసగిస్తున్న నయ వంచకుని ఉదంతమిది. చివరకు బాధితులు ఫిర్యాదు చేయడంతో బెంగళూరు బాగలగుంట పోలీసులు గాలించి అరెస్టు చేశారు. హరియానాకు చెందిన శుభాంశు శుక్లా (27) ఆ కిలాడీ. ఇతడు గత నాలుగేళ్లుగా బెంగళూరులోని టీ దాసరహళ్లిలో నివసిస్తున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకుని ఫేస్బుక్, ఇన్‌స్టా తదితరాల ద్వారా నిందితుడు స్థానిక యువతులను ట్రాప్ చేయడం ప్రారంభించాడు. ముందు పరిచయం చేసుకుని, ఆపై తీయని మాటలతో ప్రేమ వల విసరడం, వారి నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకోవడం, ఇతరత్ర మోసగించడం ఇతని నైజం. ఓ యువతితో ఇలాగే ప్రేమాయణం నడుపుతున్నాడు. ఆమె ద్వారా ఆమె మైనర్ చెల్లెలిని కూడా మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి రూ.34 లక్షలు వసూలు చేశాడు. ఇది తెలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో అతని మోసాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి.
BIG Twist: పెళ్లికి ముందే హర్ష అనే యువకుడితో ప్రేమ!
బెంగళూరు: బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా సంచలనం కలిగిస్తున్న నవ వివాహిత గానవి, భర్త సూరజ్ ఆత్మహత్యల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భర్త ఆదరించలేదని, నపుంసకుడని ఆరోపిస్తూ గానవి మెట్టినింటిలో ఆత్మహత్యాయత్నం చేసి రెండురోజుల తరువాత కన్నుమూసింది. ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టడంతో సూరజ్, అతని తల్లి జయంతి, అన్న నాగపూర్‌కు పరారయ్యారు, అక్కడ సూరజ్ శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో రెండు నెలలకే కొత్త జంటకు నూరేళ్లు నిండాయి. హనీమూన్‌లో పోట్లాట అందుకే అయితే గానవి పెళ్లికి ముందు ఓ యువకున్ని ప్రేమించిందని ఆదివారం ప్రచారంలోకి వచ్చింది. ఆమె భర్తతో శ్రీలంకకు హనీమూన్ వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాను హర్ష అనే యువకున్ని ప్రేమిస్తున్నట్లు భర్తకు చెప్పడమే కారణమని తెలిసింది. అతనినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, తల్లిదండ్రుల ఒత్తిడితో నిన్ను చేసుకున్నట్లు ఆమె చెప్పడంతో సూరజ్ కుంగిపోయాడు. హనీమూన్‌ని రద్దుచేసుకుని తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సూరజ్ మృతికి గానవి తల్లిదండ్రులు కారణమని అతని బావ రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గానవి తల్లి రుక్మిణి రాధ, బాబుగౌడ, సతీశ్‌లు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయడం వల్ల సూరజ్ ప్రాణాలు తీసుకున్నాడన్నారు. రెండు కుటుంబాల్లో ఇద్దరు చనిపోవడంతో పాటు, కేసులు పెట్టుకుంటూ బతుకులను బుగ్గి చేసుకుంటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.
వీడియోలు
NTR District: YSRCP బ్యానర్లు తొలగించడంపై అసహనం
నాలుగు నెలల్లో వచ్చేది మేమే... Amit Shah
అనంతపురంలో పోలీసుల అత్యుత్సాహం
Shyamala: మీసం ఎప్పుడు తీస్తారు మంత్రిగారు
కోర్టు ఆదేశించిన తర్వాత భూ సేకరణ చేస్తారా: అంబటి రాంబాబు
చంద్రశేఖర్ రెడ్డి సంచలన కామెంట్స్
ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి: మాజీ మంత్రి కాకాణి
రాంప్రసాద్ రెడ్డి తొడగొట్టి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్
ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక అంశాలు
New Year Day: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

