సాక్షి హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా డిసెంబర్ 31 బుధవారం రోజు మెట్రో సేవలను రాత్రి ఒంటి గంట వరకూ పొడిగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని ఆకతాయిలతో ప్రమాదం ఉండే అవకాశం ఉందని తెలిపింది.
ఈ మేరకు అన్ని మెట్రో స్టేషన్లలో మెట్రో సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసు సిబ్బందితో నిఘా ఉంచనున్నట్లు మెట్రో ప్రకటించింది. సాధారణంగా ఇతర రోజుల్లో హైదరాబాద్ మెట్రో సేవలు రాత్రి 11 గంటల వరకే ఉంటాయి.


