నా సూపర్‌స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
గురువింద సామెతను గుర్తు చేస్తున్న పవన్!
ఏపీ ఉపముఖ్యమంత్రి నిజజీవితంలోనూ నటించడంలో ఆరితేరుతున్నారు. సినీ అభిమానులు అతడిని పవర్‌స్టార్ అంటూ పిలుచుకుంటూంటారు. ప్రజా జీవితంలో ఆయన నటనను చూసిన తరువాత ‘‘రాజకీయ నట శూర’’ అన్న అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. పెరవలిలో ఆయన లేని ఆవేశం తెచ్చేసుకుని వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. అనవసరమైన విమర్శలు చేస్తూ పీకుడు భాష వాడారు. ఈ క్రమంలో పవన్ తెలిసో తెలియకుండానో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను పొగిడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉందని చెప్పకనే చెప్పారు. నెపం వైఎస్సార్సీపీకి నెట్టి టీడీపీ మెప్పుకోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ, జనసేనల అరాచకం గురించి రాష్ట్రంలో తెలియందెవరికి? తీరు చూడబోతే పవన్ మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ తో పోటీపడుతున్నట్లుగా ఉంది. సందర్భ శుద్ది లేకుండా, అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడారా? లేక తన ఉనికిని కాపాడుకోవడానికి బెదిరించే రీతిలో ప్రసంగించారా?అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఎల్లో మీడియా ఆయన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఇబ్బందిలేని రీతిలో ప్రచారం చేసింది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడిన వైనం అర్థమైపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని జనం మెచ్చడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.అలాగే ఉత్తరాంధ్రలో భూ మాఫియా గురించి పవన్ కళ్యాణే ఫిర్యాదు చేశారు. ఇవన్ని కూటమి ప్రభుత్వం పరువు తీశాయి.దీంతో డామేజీని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు సూచన మేరకు ఆయన వైఎస్సార్సీపీపై ఆవేశపడినట్లు నటించారా? అన్న అనుమానం చాలామందికి కలిగింది. వైఎస్సార్సీపీని తిట్టి వారిలో ఎవరైనా పరుష భాష వాడితే దాన్ని రాజేసి పోలీసుల సాయంతో కేసులు పెట్టవచ్చుననా ఇలా వ్యవహరించి ఉండవచ్చని కొందరు విశ్లేషించారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆ వ్యూహం కాస్తా బెడిసికొట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ మాటలను ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విషయం వీరికి తెలుసు. రాష్ట్రంలో జూద శిబిరాలు పెచ్చుమీరాయని చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించిన టీడీపీ ఎమ్మెల్యేని ఒక్క మాట అనలేని పవన్ కళ్యాణ్, ఈ మధ్య వైఎస్సార్సీపీపై మాత్రం ఇష్టారీతిన దూషించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. పవన్ ఈ పదకుండేళ్లలో ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అంతా అగమ్యగోచరం. 2019లో ఓడిపోగానే బీజేపీని బతిమలాడి వారితో కలిశారు. వాళ్ల కాళ్లు విరగగొడతా..వీళ్ల కీళ్లు తీస్తా.. వేళ్లు అరగగొడతా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. లోకేశ్ రెడ్‌బుక్ మాత్రమే కాదు..తాను కూడా ఆయనతో పోటీ పడి అరాచకాలు చేయించగలనని పవన్ చెబుతున్నట్లు ఉంది. ముందుగా అక్కడక్కడా అరాచకాలకు పాల్పడుతున్న జనసేనకు చెందినవారి కీళ్లు విరగగొడితే, ఆ తర్వాత పవన్ ఏ కబుర్లు చెప్పినా జనం వింటారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు జనసేన ఎమ్మెల్యేలే భూదందాలకు పాల్పడుతున్నారని ఈయనకే ఫిర్యాదులు వచ్చాయని అంటారు. ఇదే టైమ్ లో టీడీపీ నేతలు తమపై పెత్తనం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు ఆయనతో మొరపెట్టుకున్నారు.వారికి ఊరట ఇవ్వకపోగా టీడీపీ వారు ఏమి చేసినా భరించాలని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. టిపి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తను ఎలా కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని పని చేస్తున్నది బాహాటంగానే వెల్లడించారు. పవన్‌కు ఆయన బాహుబలిగా కనిపిస్తున్నారు. దీని అర్థమేమిటో? మచిలీపట్నంలో ఏదో బానర్ గొడవ వస్తే జనసేన నేత యర్రంశెట్టి సాయితో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకున్నారట. వీరి కీళ్లు తీసే ధైర్యం పవన్‌కు లేకపోయిందా? అని జనసేనలో కొందరు ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాల గురించి ఆ పార్టీ మీడియానే చెబుతోంది. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కూటమి పెద్దలు రాజీ చేశారే తప్ప చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో గంజాయి అరికట్టడం సంగతి దేవుడెరుగు..గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మొత్తం లోకేశ్ పర్యవేక్షణలోనే నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పవన్ ఆయనకు విధేయుడిగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారన్న భావన అభిమానులది. పవన్‌కు అండగా నిలిచిన ఒక సామాజికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించి, తనను వైఎస్సార్సీపీ వాళ్లు ఏదో అంటున్నారన్న అభూత కల్పనను సృష్టించి సానుభూతి పొందడానికి యత్నించినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు కాపు నేస్తం వంటి స్కీముల ద్వారా ఆయా వర్గాల మహిళలను ఆదుకోవడానికి కృషి చేయకుండా ఈ కీళ్ల పంచాయతీ పెడితే ఎవరికి ప్రయోజనం? 'సూపర్ సిక్స్,ఎన్నికల ప్రణాళికలోని హామీలు ఎటూ చేయలేరు కనుక, ఈ డ్రామా ఆడితే సరిపోతుందని అనుకున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా నిలదీసి కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేసింది. దీనిపై జనసేనకు ఒక విధానం ఉందో లేదో తెలియదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పవన్ కేవలం టీడీపీ వారు ఏమి చెబితే దానినే గుడ్డిగా సమర్థిస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలలో పెల్లుబుకిన అసమ్మతిని కప్పిపుచ్చి చంద్రబాబు నుంచి మెప్పు పొందడానికి ఈయన యత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.తాము అధికారంలోకి వస్తే పనిచేసే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామని అంటున్నారని జగన్‌పై ఒక అబద్దాన్ని సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్‌లో భాగస్వాములయ్యే ప్రైవేటు వారిని కూడా జైళ్లలో పెడతామని జగన్ హెచ్చరించారు తప్ప పనిచేసే కాంట్రాక్టర్లను కాదు. ఒక ఆశయం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయనని, పోయే ముందు తాట తీస్తానని, రోమాలు తీసి కూర్చోబెడతానని పవన్ అనడం హస్యాస్పదంగా ఉంది. ఈయన ప్రాణాలు ఎవరు తీస్తారు?అలాంటి బెదిరింపులు ఎమైనా వచ్చాయా? వాటిపై ఫిర్యాదు చేశారా? ఇవేమి లేకుండా అడ్డంగా మాట్లాడితే జనం నమ్ముతారా? ఇంతటి సాహసవంతుడు పవన్ తన తల్లిని దూషించారటూ ఎవరిపై గతంలో ఆరోపణలు చేశారు? వారిని ఏమి చేశారో చెప్పి ఆ తర్వాత ఇతరుల తాట తీయవచ్చు. లేకుంటే ఈయనవి ఉడుత ఊపులే అవుతాయి. ఎవరు తప్పు చేసినా తప్పే. నిజంగానే వైఎస్సార్సీపీ వారు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చర్య తీసుకోవచ్చు.కాని ప్రస్తుతం ఏపీలో ఏమి జరుగుతోందో తెలియదా? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే ఎవరూ చూడడం లేదనుకుంటే సరిపోతుందా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారట.అది చట్టబద్దమైతే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసిన వారికి ఇవ్వండి.. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి వీధిలో నరికి చంపిన టీడీపీ వారికి ఇవ్వండి.. సుగాలి ప్రీతి కేసు నిందితులకు ఇవ్వండి. ఈ కేసులో తాను ఇచ్చిన హామీ ఏమిటో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది కదా! విజయవాడలో పోలీసులు, టీడీపీ వారు కలిసి 42 ఇళ్లు కూల్చివేశారు.రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. టీడీపీ నేతల నకిలీ మద్యం వ్యవహారం తెలియదా? ఇలాంటి వాటిపై నోరు విప్పని పవన్ కళ్యాణ్‌కు వైఎస్సార్సీపీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా? ఆయనకు విసుగు వస్తోందట. అది విసుగు కాదు.తనను అటు ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇటూ విపక్షం పట్టించుకోవడం లేదన్న ఫ్రస్టేషన్ కావచ్చు. హద్దుమీరి అంటే ఏదో చేస్తారట. నిజమే.. ఎవరూ హద్దులు దాటి మాట్లాడరాదు. కాని తాను అధికారంలో లేని ఐదేళ్లలో ఎన్నిరకాలుగా మాట్లాడింది. ఎన్నిసార్లు హద్దు దాటింది ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ వంటివారికి ఉండకపోవచ్చు. అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని బాధ్యతారాహిత్యంగా ఆరోపించిన చంద్రబాబుకు వంత పాడారు. పైగా ఆ లడ్డూలు అయోధ్యకు వెళ్లాయని చెప్పి సడన్‌గా సనాతని వేషం కట్టడాన్ని మించి హద్దు దాటిన వైనం మరొకటి ఉంటుందా? విపక్షంలో ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని, వలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసినదానికన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా? ఇంకా ఎన్నో ఉన్నాయి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని వేమన శతకం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తనకు దొరికిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారు.అంతవరకు అభ్యంతరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి హద్దుమీరిన హెచ్చరికలు, బెదిరింపుల వల్ల పవన్ కళ్యాణ్ పరువు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తే మంచిది!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి.. చివరికి ర్యాపిడో డ్రైవర్‌గా!
ఎన్నో జర్నీలు చేస్తుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు కొత్త వ్యక్తులను పరిచయం చేసి మధుర జ్ఞాపకాలని ఇస్తే.. మరొకొన్ని జర్నీలు భావోద్వేగం చెందేలా చేస్తాయి. అలాంటి భావోద్వేగానికి గురిచేసే బైక్జర్నీ స్టోరీని చిరాగ్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.ఏం జరిగిందంటే.. చిరాగ్ తన పోస్ట్‌లో "ఇవాళ ర్యాపిడో బైక్‌లో ప్రయాణిస్తున్నా. అతడి కథతో సాధారణ ప్రయాణం కాస్తా భావోద్వేగ క్షణంగా మారింది" అనే క్యాప్షన్ జోడించి మరి షేర్ చేసుకున్నాడు. నిజానికి ఆ ర్యాపిడో డ్రైవర్‌తో ప్రయాణం మాములుగానే ప్రారంభమైంది. తమ మధ్య సంభాషణ అత్యంత నార్మల్‌గా సాగిందంటూ ఇలా పేర్కొన్నాడు. తనని ఎక్కడ ఉంటావ్? ఏ కళాశాలలో చదువుతున్నావ్? వంటి ప్రాథమిక ప్రశ్నలను ఆ రైడర్ అడిగాడని పోస్ట్‌లో రాసుకొచ్చాడు."ఆ తర్వాత కొద్దిసేపటికే డ్రైవర్ తన సొంత జీవితం గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడే మా మధ్య సంభాషణ కాస్తా ఎమోషనల్‌గా మారింది. ఆ రైడర్ తాను అమిటీలో హోటల్ మేనేజ్మెంట్ చేశానని, అప్పట్లో తన తండ్రి సైన్యంలో ఉండేవాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన లైఫ్ చాలా బాగుండేదని అన్నాడు. తమకు మంచి వ్యాపారం ఉందని.. కుటుంబం అంతా చాలా సంతోషంగా సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారితో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయిందని, వ్యాపారాలు మూతపడటంతో తమ కుటుంబం దాదాపు రూ. 14 కోట్ల మేర నష్టపోయిందని బాధగా పచెప్పుకొచ్చాడు. తిరిగి నిలదొక్కుకోవడానికి చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో చివరికి తన స్నేహితుడితో కలిసి ఒక స్టార్టప్‌ని ప్రారంభించడానికి చాలా ప్రయత్నించానని, కానీ దానివల్ల రూ.4 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తమ వద్ద ఎలాంటి సేవింగ్స్ లేకుండా రోడ్డుపై పడిపోయామని వేదనగా చెప్పుకొచ్చాడు. అప్పుడు తన కుటుంబాన్ని నిలదొక్కుకునేలా చేయడానికి తన కళ్లముందు ఒకే ఒక్క మార్గం కనిపించిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన దగ్గర ఉన్నదల్లా బైక్ మాత్రమేనని, అదే తనను జీవనోపాధి కోసం రాపిడో రైడర్‌గా పనిచేయడానికి పురికొల్పిందని చెప్పుకొచ్చాడు. తన కథంతా చెప్పిన ఆ ర్యాపిడో డ్రైవర్ చివరగా అన్న ఆ ఒక్క డైలాగ్ తనను ఎంతగానో కదిలించింది అంటూ ఆ మాటను కూడా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. తాను ఆశ వదులుకోనని, ఇప్పటికి దేవుడిని నమ్ముతున్నా అంటూ మాట్లాడిన మాట.. తన మదిలో నిలిచిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు సోషల్ మీడియా యూజర్ చిరాగ్.Life is so unfair, man. I was on a Rapido bike today, just a normal ride. The driver asked me where I live, which college I go to. Casual stuff. Then out of nowhere, he started telling me his story. He said he did hotel management from Amity. Life was good back then when his…— Chiraag (@0xChiraag) December 22, 2025 (చదవండి: Roblox CEO David Baszucki: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..)
స్కిల్ స్కాం.. కేసు కొట్టివేతకు బాబు మాస్టర్ ప్లాన్!
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తనపై ఉన్న కేసులను మూసివేసే ప్రక్రియలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే.. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు చురుకుగా ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ సీఐడీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోంది. పూర్తి సహకారం అందిస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మూసివేయించుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుక కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే స్కిల్ స్కాం కేసు మూసివేతకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అందుకు, చంద్రబాబు అడుగులకు సీఐడీ కూడా మడుగులొత్తుతున్నది. స్కిల్ కేసు మూసివేతకు పూర్తి సహకారం అందిస్తోంది.ఈ క్రమంలో క్లోజర్ రిపోర్టును వ్యతిరేకిస్తే కోర్టుకు వచ్చి చెప్పాలంటూ ఏపీఎస్ఎస్డీసీ ఎండీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లోగా వచ్చి సమాధానం చెప్పాలని నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో స్కిల్ స్కాం కేసును కూడా చంద్రబాబు త్వరగా మూసివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు.. 52 రోజులు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాంలో ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసేసేందుకు ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఫైబర్‌నెట్ కేసు క్లోజ్!
వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా కల్పిత కథనాలు.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు
చిల్ అవుతోన్న మ్యాడ్ బ్యూటీ.. ఫుల్ గ్లామరస్‌గా భాగ్యశ్రీ బోర్సే..!
రాజమౌళి-మహేశ్ బాబు వారణాసి.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది..!
వెహికల్ ఇన్సూరెన్స్: తెలుసుకోవలసిన విషయాలు
'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
సత్తా చాటిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అప్డేట్స్
ఇది అసలు నిజం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ఉండటం కలేనా..?
పీఎం అభ్యర్థిగా ప్రియాంక..?
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
ఇది సార్ తనూజ బ్రాండు! ఎంత సంపాదించిందంటే?
అవసరమా ‘అఖండ’ కావరం?
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి - మంత్రి నారా లోకేష్
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అమ్ముకుంటున్న కూటమి ముఠాలు
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విరుచుకుపడిన వెండి
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. ఉద్యోగులకు పదోన్నతులు
బిగ్‌బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పు
బిగ్‌బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్‌కు తన్నుకొచ్చిన దుఃఖం
ప్రభుత్వం మాటలు విని మోసపోయా: హిడ్మా తల్లి
భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా కల్పిత కథనాలు.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు
చిల్ అవుతోన్న మ్యాడ్ బ్యూటీ.. ఫుల్ గ్లామరస్‌గా భాగ్యశ్రీ బోర్సే..!
రాజమౌళి-మహేశ్ బాబు వారణాసి.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది..!
వెహికల్ ఇన్సూరెన్స్: తెలుసుకోవలసిన విషయాలు
'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
సత్తా చాటిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అప్డేట్స్
ఇది అసలు నిజం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ఉండటం కలేనా..?
పీఎం అభ్యర్థిగా ప్రియాంక..?
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
ఇది సార్ తనూజ బ్రాండు! ఎంత సంపాదించిందంటే?
అవసరమా ‘అఖండ’ కావరం?
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి - మంత్రి నారా లోకేష్
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అమ్ముకుంటున్న కూటమి ముఠాలు
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విరుచుకుపడిన వెండి
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. ఉద్యోగులకు పదోన్నతులు
బిగ్‌బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పు
బిగ్‌బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్‌కు తన్నుకొచ్చిన దుఃఖం
ప్రభుత్వం మాటలు విని మోసపోయా: హిడ్మా తల్లి
భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
ఫొటోలు
గ్రాండ్‌గా కోలీవుడ్ స్టార్ కమెడియన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
వైఎస్ జగన్ ప్రజాదర్బార్: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)
నా సూపర్‌స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సినీతారలు (ఫొటోలు)
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
రిసార్ట్‌లో హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్ (ఫొటోలు)
2025 జ్ఞాపకాలతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
పూల డ్రస్‌లో మెరిసిపోతున్న సంయుక్త (ఫొటోలు)
నిర్మాత బర్త్ డే.. బాలీవుడ్ అంతా ఇక్కడే కనిపించారు (ఫొటోలు)
కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)
సినిమా
దురంధర్ తెలుగు వర్షన్.. రిలీజ్ కాకపోవడానికి అదే కారణమా?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కేవలం హిందీలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదుర్స్ అనిపిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే రూ.872 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. కేవలం నార్త్ ఆడియన్స్‌కే పరిమితమైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వీక్షించాలని సౌత్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. కానీ దురంధర్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అసలు దురంధర్‌ను సౌత్ భాషల్లో విడుదల చేస్తారా? లేదా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు భాషలోనైనా ఈ మూవీని చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ దురంధర్ తెలుగు వర్షన్ రిలీజవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఓటీటీలో మాత్రమే అన్ని భాషల్లో తీసుకొస్తారా? థియేటర్లలో రిలీజ్ చేస్తారా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.అదే కారణమా?అయితే తెలుగులో దురంధర్ రిలీజ్ చేయకపోవడానికి ఓ కారణముందని సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 19న ఈ మూవీని తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే తెలుగులో విడుదలపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఎందుకంటే హైదరాబాద్‌లోని తెలుగు ప్రేక్షకులు హిందీలోనే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్. అందుకే డబ్బింగ్ వర్షన్‌తో ఈ మూవీ ఒరిజినాలిటీ మిస్సవుతుందని మేకర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఓటీటీలో చూడాల్సిందేనా..?ఇక సౌత్ భాషల్లో దురంధర్‌ను థియేటర్లలో చూసే అవకాశం కనిపించట్లేదు. కేవలం ఓటీటీ రిలీజ్ అయిన తర్వాతే తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దురంధర్ రిలీజై మూడోవారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. అందువల్ల దురంధర్ డబ్బింగ్ వర్షన్ ఇక రిలీజయ్యేలా కనిపించడం లేదు. దీంతో తెలుగులో దురంధర్ వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.
'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఆయన హీరోగా వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మారి దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా రిలీజైన రాజు గారి పెళ్లిరో అంటూ సాగే పాట ప్రోమో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు.
చిల్ అవుతోన్న మ్యాడ్ బ్యూటీ.. ఫుల్ గ్లామరస్‌గా భాగ్యశ్రీ బోర్సే..!
డిసెంబర్లో మూడ్‌లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..గులాబీలా మెరిసిపోతున్న కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్..మ్యాడ్ బ్యూటీ రెబా మోనికా జాన్ చిల్..మరింత గ్లామరస్‌గా కింగ్డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే..హీరోయిన్ ప్రణీత బ్యూటీఫుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta)
ఆ అందాల నటి వయసు 92 ...ఆరోగ్య రహస్యం ఇదే...
చాలా మందికి కదలడం కూడా కష్టంగా ఉండే వయస్సులో ఆ నటి నృత్యం చేస్తున్నారు. చురుకైన కదలికలు, వన్నె తరగని ముఖ వర్ఛస్సుతో ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఆమె ప్రముఖ సీనియర్ నటి–నర్తకి వైజయంతిమాల బాలి. ప్రస్తుతం 92 ఏళ్ల ఈ ఐకానిక్ సంగం స్టార్ ఇప్పటికీ తరగని తేజస్సుతో కళాత్మక శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ట్వింకిల్ టోస్ అని ప్రేమగా పిలువబడే ఆమె, ఒక ప్రదర్శనకారిణి, గురువు, పండితురాలు సాంస్కృతిక సంరక్షకురాలిగా బహుళ పాత్రలను సజావుగా సమతుల్యం చేసుకుంటున్నారు. ప్రేక్షకులను తన ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేశారు, భావోద్వేగ లోతు శాస్త్రీయ వైభవంతో నిండిన ప్రదర్శన సమర్పించారు.నాట్యమే...ఆరోగ్యంఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా , తన శారీరక బలాన్ని మానసిక స్పష్టతను నిలబెట్టిన సూత్రాల గురించి వైజయంతిమాల మీడియాతో పంచుకున్నారు. నిర్మాణాత్మక జీవనం, బుద్ధిపూర్వక ఆహారం వీటన్నింటితో పాటు భరతనాట్యం పట్ల అచంచలమైన నిబద్ధత తదనుగుణ శారీరక శ్రమల సమ్మేళనమే తన దీర్ఘాయువు రహస్యం అంటారామె. తన జీవితంలో భరతనాట్యం కేంద్ర శక్తిగా మిగిలిపోయిందని వైజయంతిమాల వివరించారు. ప్రస్తుతం ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోవచ్చు, కానీ ఎంపిక చేసిన యువ విద్యార్థుల బృందానికి శిక్షణ ఇవ్వడం ద్వారా తన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. తన రోజులో మిగిలిన గంటలు పరిశోధనలో పెట్టుబడి పెడతారు, ఇది ఆమె దశాబ్దాలుగా అనుసరించిన కళారూపంతో మేధోపరంగా నిమగ్నమై ఉండటానికి వీలు కల్పిస్తుంది.మితాహారం...యోగా ధ్యానం...ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె దినచర్య గురించి మరింత విపులంగా వెల్లడయింది. ఆ ఛానల్ ప్రకారం, వైజయంతిమాల తన ఉదయాలను క్రమం తప్పని నడకలతో ప్రారంభిస్తుంది, ఈ అలవాటు శరీరాన్ని అప్రమత్తంగా శక్తివంతం చేస్తుందని ఆమె నమ్ముతుంది. ఆమె ఆరోగ్య దినచర్యలో స్థిరమైన యోగాభ్యాసం ధ్యానం కూడా భాగమై ఉంటాయి, ఆహారం కూడా ఆమె చురుకైన జీవనశైలిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె సాంప్రదాయ శాఖాహార దక్షిణ భారత భోజన శైలికి కట్టుబడి ఉంటారు. ఆమె ఉదయం పూట తరచుగా దోస, ఊతప్పం లేదా ఉప్మా వంటి సుపరిచితమైన అల్పాహారాలను తీసుకుంటారు, అదే విధంగా తాజా పండ్ల రసంతో పాటు. పోషకాలతో నిండిన తేలికపాటి భోజనం చేస్తారు. భోజనంలో సాధారణంగా బియ్యంతో రసం లేదా పప్పు చావల్ వడ్డిస్తారు. సాయంత్రం వేళలో ఆమె పండ్ల రసం లేదా కొద్దిగా పొడి పండ్ల వంటి తేలికపాటి రిఫ్రెష్మెంట్లను ఇష్టపడతారు. రాత్రి పూట ఆహారం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా తన డిన్నర్ కూరగాయలతో రోటీ లేదా పప్పు చావల్ లలో ముగుస్తుంది. నమ్మిన వృత్తి పట్ల నిబద్ధత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి నిత్యనూతనంగా ఉంచే అభిరుచులు కలగలిపిన మనిషి వయసుతో సంబంధం లేని ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు అనే దానికి వైజయంతిమాల బాలి జీవితం ఓ నిదర్శనం.
క్రీడలు
రెండో వివాహం చేసుకున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం (2018లో) అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మొదటి భార్య రూత్‌ను కోల్పోయిన స్ట్రాస్.. తాజాగా ఆంటోనియా లిన్నేయస్ పీట్ (30) అనే మాజీ పీఆర్ ఎగ్జిక్యూటివ్‌ను మనువాడాడు.వీరి వివాహం అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో స్ట్రాస్ జన్మస్థలమైన దక్షిణాఫ్రికాలోని (ఫ్రాన్స్హోక్) ఓ వైన్ యార్డ్‌లో జరిగింది. లిన్నేయస్ పీట్తో వివాహ సమాచారాన్ని స్ట్రాస్ సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నాడు.వివాహ ఫోటోలను షేర్ చేస్తూ, భార్య లిన్నేయస్ను ఉద్దేశిస్తూ ఈ సందేశాన్ని రాసుకొచ్చాడు. “మన ప్రియమైన ప్రదేశంలో అత్యంత ప్రత్యేకమైన రోజు జరుపుకున్నాం. నన్ను, నా పిల్లలను ప్రేమించి, నిజమైన ఆనందాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. నేను ఎంతో అదృష్టవంతుడిని. మన జీవితంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉండాలని కోరుకుంటున్నాను”స్ట్రాస్ భార్య ప్రస్తుతం లిన్నేయస్ అనే ఫైన్ ఆర్ట్ అడ్వైజరీ సంస్థ నిర్వహిస్తుంది. 48 ఏళ్ల స్ట్రాస్ ఇటీవల ఈసీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పని చేసి పదవీ విరమణ చేశాడు. స్ట్రాస్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన స్ట్రాస్.. 2003-2012 మధ్యలో 100 టెస్ట్‌లు, 127 వన్డేలు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీల సాయంతో 11000 పైచిలుకు పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ గెలిచిన అతి కొద్ది మంది ఇంగ్లండ్ కెప్టెన్లలో స్ట్రాస్ ఒకరు.స్ట్రాస్.. మొదటి భార్య రూత్ జ్ఞాపకార్థం Ruth Strauss Foundation స్థాపించాడు. ఈ ఫౌండేషన్ కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, క్యాన్సర్ పరిశోధనలకు నిధులు సమకూరుస్తుంది. ఈ సేవలకు గాను స్ట్రాస్‌కు 2019లో నైట్‌హుడ్ లభించింది.
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడు. సొంత జట్టు సౌరాష్ట్ర తరపున జడ్డూ రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కర్ణాటకలోని ఆలూర్‌లో జనవరి 6, 8న జరిగే మ్యాచ్‌లలో సౌరాష్ట్ర జట్టుకు జడేజా ప్రాతినిథ్యం వహిస్తాడని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయలేదుఈ క్రమంలో ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న జడ్డూను.. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. వన్డే జట్టులో అతడికి స్థానం కల్పించలేదు. దీంతో వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల్లో జడ్డూ లేడా అన్న సందేహాలు నెలకొన్నాయి.ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నాడు స్పందిస్తూ.. ‘‘మా ప్రణాళికల్లో అతడు భాగమే. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ అతడు ఉన్నాడు. నాడు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా అదనపు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చాం.అయితే, ఆసీస్టూర్లో జట్టు సమతూకంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి వాషీ, కుల్దీప్లతో మేము ముందుకు వెళ్తున్నాం. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నపుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పిచ్ పరిస్థితులకు తగ్గట్లే జట్టును ఎంపిక చేశాము’’ అని జడ్డూను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.సఫారీలతో సిరీస్‌లో సత్తా చాటిన జడ్డూఅయితే, ఈ టూర్ తర్వాత స్వదేశంలో ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA) తో జరిగిన వన్డే సిరీస్‌కు జడేజాను ఆడించింది యాజమాన్యం. తొలి వన్డేలో 20 బంతుల్లోనే 32 పరుగులు చేసిన జడ్డూ.. రెండో వన్డేలో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఈ సిరీస్‌లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.కాగా టీమిండియా తరఫున విధుల్లో లేని సమయంలో ఆటగాళ్లంతా దేశీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఇటీవలే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గాయం, ఫిట్నెస్ సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా తమ జట్లు ముంబై, ఢిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.ఇక కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ తదితరులు కూడా తమ జట్ల తరఫున ఆడేందుకు సిద్ధం కాగా.. తాజాగా జడ్డూ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా లిస్-ఎ క్రికెట్లో లెఫ్టాండర్ జడేజా 260 మ్యాచ్‌లు ఆడి.. 3911 పరుగులు చేయడంతో పాటు 293 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న తర్వాత.. టీమిండియా స్టార్లు.. న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీ అవుతారు.చదవండి: Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో..
పాక్ అభిమానుల చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు అభిమానులు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. భారత అండర్-19 క్రికెటర్లపై విద్వేష విషం చిమ్మారు. ప్రధానంగా పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూ చిల్లర చేష్టలకు దిగారు.ఫైనల్లో పాక్ గెలుపుఏసీసీ మెన్స్ ఆసియా కప్ (యూత్ వన్డే)-2025 టోర్నమెంట్ దుబాయ్ (Dubai) వేదికగా ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాయాదులు భారత్- పాకిస్తాన్.. గ్రూప్-ఎ నుంచి పోటీపడ్డాయి. లీగ్ దశలో పాక్‌ను భారత్ ఓడించగా.. ఫైనల్లో పాకిస్తాన్ 191 పరుగుల తేడాతో యువ భారత జట్టుపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది.ఇక ఆసియా కప్ అండర్-19 టైటిల్‌ను భారత్ ఇప్పటికే ఎనిమిదిసార్లు గెలవగా.. పాక్ తాజాగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు.. భారత ప్లేయర్లను రెచ్చగొట్టగా అందుకు ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. పాక్ ఆటగాళ్లకు వారి శైలిలోనే ఘాటుగా జవాబిచ్చాడు.చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత అండర్-19 ఆటగాళ్లు టీమ్ బస్ ఎక్కే వేళ.. అక్కడికి చేరుకున్న పాక్ అభిమానులు.. యువ క్రికెటర్లను హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై అనుచిత రీతిలో కామెంట్లు చేస్తూ రాక్షసానందం పొందారు. అయితే, ఇక్కడ వైభవ్ హుందాగా ప్రవర్తించడం విశేషం.ఓవైపు.. వయసులో పెద్ద అయిన పాక్ ఫ్యాన్స్ తన పట్ల విద్వేషం ప్రదర్శిస్తున్నా.. వైభవ్ మాత్రం అసలు ఆ వైపు కూడా చూడకుండా పక్కవాళ్లతో మాట్లాడుతూ వెళ్లి బస్సు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిన్నపిల్లాడిపై ఇంత విద్వేషమా?ఈ నేపథ్యంలో.. ‘‘పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను సిగ్గు లేకుండా హేళన చేస్తున్నారు. అండర్-19 ఆసియా కప్ గెలిస్తే ఏదో ప్రపంచ చాంపియన్లు అయినట్లు ఆ బిల్డప్ ఎందుకు?చిన్నపిల్లాడి పట్ల మీరు ప్రవర్తించిన తీరు మీ సంస్కారానికి అద్దం పడుతోంది. మరీ ఇంత అసూయ పనికిరాదు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకోండి. చిన్నపిల్లాడే అయినా అతడు ఎంత హుందాగా ఉన్నాడో చూడండి. తనని చూసైనా నేర్చుకోండి’’ అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. ఇందులో ఓ భారీ శతకం (171) ఉంది.చదవండి: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫినిషర్ ఎవరు?Pakistan’s fans are acting shamelessly and they have no sense of shame whatsoever.👀These people are booing 14-year-old Vaibhav Suryavanshi just because Pakistan won a ‘cheap’ U19 Asia Cup. They’re acting like Pakistan won the World Cup.🤦🏻This is why Pakistani people have no… pic.twitter.com/D1X6lgshr0— Mention Cricket (@MentionCricket) December 22, 2025
మరో టీ20 లీగ్.. ఐపీఎల్ తర్వాత ఏ లీగ్‌కు ఆదరణ ఎక్కువ..?
పొట్టి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో లీగ్ సిద్దమైంది. యూఏఈ వేదికగా వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (APL T20) ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ లీగ్ 2018లోనే ప్రారంభమైంది. అయితే వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ, చివరికి ఆరేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్దమైంది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడదలైంది.APL T20 లీగ్ యూఏఈలో జరుగనున్నా, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆథ్వర్యంలోనే జరుగుతుంది. తొలి ఎడిషన్ తరహాలోనే 2026 ఎడిషన్‌లోనూ ఐదు ఫ్రాంచైజీలు (బాల్ఖ్ లెజెండ్స్, కాబూల్ జ్వానన్, కందహార్ నైట్స్, నంగర్హార్ లియోపార్డ్స్, పక్తియా పాంథర్స్) పాల్గొంటాయి. తొలి ఎడిషన్‌లో బల్క్ లెజెండ్స్ విజేతగా నిలిచింది. ఈ లీగ్‌లో కూడా ఇతర లీగ్‌ల్లో లాగే భారత ఆటగాళ్లు మినహా ప్రపంచవాప్తంగా ఉండే ఆటగాళ్లు పాల్గొంటారు.ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ రీఎంట్రీ వార్త నేపథ్యంలో ప్రైవేట్ టీ20 లీగ్‌లకు సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ఐసీసీ ఫుల్‌టైమ్ మెంబర్‌గా ఉండే ప్రతి దేశంలో ఓ ప్రైవేట్ టీ20 లీగ్ జరుగుతుంది. వీటిలో భారత్‌లో జరిగే ఐపీఎల్‌కే ఆదరణ ఎక్కువన్నది కాదనలేని సత్యం. అయితే, ఐపీఎల్ తర్వాత రెండో స్థానం ఏ లీగ్దన్నదే ప్రస్తుత చర్చ.ఆదరణ ప్రకారం చూసినా, బిజినెస్ పరంగా చూసినా ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌దే రెండో స్థానమన్నది బహిరంగ రహస్యం. ఐపీఎల్ మొదలైన మూడేళ్ల తర్వాత పురుడుపోసుకున్న ఈ లీగ్, ప్రారంభ దినాల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా, క్రమంగా ఆదరణ చూరగొంది. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా జాతీయ జట్ల స్టార్లందరూ పాల్గొనడంతో పాటు భారత్ మినహా ప్రపంచ క్రికెట్ స్టార్లంతా పాల్గొంటారు. ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్ కూడా సదీర్ఘంగా సాగుతుంది.ఐపీఎల్, బీబీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్ ఏదంటే.. 2023లో ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్ అని చెప్పాలి. ఈ లీగ్‌లో కూడా బీబీఎల్ తరహాలోనే స్థానిక స్టార్లు, విదేశీ స్టార్లు పాల్గొంటారు. SA20లో ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఆధారిత ఫ్రాంచైజీలే కావడం విశేషం. పారితోషికాల విషయంలో ఈ లీగ్ ఐపీఎల్‌కు దగ్గరగా ఉంటుంది. ఈ లీగ్ పుణ్యమా అని సౌతాఫ్రికా టీ20 జట్టు చాలా పటిష్టంగా తయారయ్యిందనే టాక్ ఉంది.సౌతాఫ్రికా టీ20 లీగ్ తర్వాత ఇంచుమించు అదే స్థాయి ఆదరణ కలిగిన లీగ్‌గా ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌కు పేరుంది. దుబాయ్‌లో జరిగే ILT20, సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రారంభమైన 2023వ సంవత్సరంలోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో కూడా చాలావరకు ఐపీఎల్ ఆధారిత ఫ్రాంచైజీలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ లీగ్ నాలుగో ఎడిషన్ నడుస్తుంది.SA20, ILT20 తర్వాత ఇప్పుడిప్పుడే యూఎస్ఏలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (MLC), ఇంగ్లండ్‌లో జరిగే ద హండ్రెడ్ లీగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. మేజర్ లీగ్ క్రికెట్ 2023లో ప్రారంభం కాగా.. హండ్రెడ్ లీగ్ 2021లో మొదలైంది. హండ్రెడ్ లీగ్ 100 బంతుల ఫార్మాట్లో జరిగినా టీ20 ఫార్మాట్ పరిధిలోకే వస్తుంది.ఈ లీగ్‌ల కంటే చాలా ముందుగానే ప్రారంభమైనా పాకిస్తాన్లో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ (2016), బంగ్లాదేశ్‌లో జరిగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (2012), వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (2013), శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్ (2020) పెద్దగా సక్సెస్ కాలేదు. పైన పేర్కొన్న లీగ్‌లతో పోలిస్తే ఈ లీగ్‌ల్లో ఆటగాళ్ల పారితోషికాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌ల్లో పాల్గొనేందుకు పెద్దగా సుముఖత చూపారు. దీంతో ఆటోమేటిక్‌గా ఈ లీగ్‌లకు ఆదరణ తక్కువగా ఉంటుంది. పీఎస్ఎల్ లాంటి లీగ్ ఐపీఎల్‌కు తాము సమానమని జబ్బలు చరుచుకుంటున్నా, ఆ లీగ్‌లో ఆడేందుకు చాలామంది విదేశీ స్టార్లు ఇష్టపడరు. భద్రతా కారణాలు, సదుపాయాల లేమి, పారితోషికాలు తక్కువగా ఉండటం లాంటి కారణాల చేత విదేశీ ప్లేయర్లు ఈ లీగ్ ఆడేందుకు రారు.ఐపీఎల్‌తో పోలిస్తే ఆటగాళ్ల పారితోషికాలు పీఎస్ఎల్లో కనీసం పావు శాతం కూడా ఉండవు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కెమరూన్ గ్రీన్‌కు రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్ల భారీ మొత్తం దక్కింది. పీఎస్ఎల్లో ఇంత మొత్తంలో పది శాతం కూడా ఆ దేశ స్టార్ క్రికెటర్‌కు దక్కదు.
న్యూస్ పాడ్‌కాస్ట్
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
బిజినెస్
ఢిల్లీలో త్వరలో ‘దర్పణ్ 2.0’ ప్రారంభం!
పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన నిర్ణయాలే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశ రాజధానిలో పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ‘దర్పణ్ 2.0’ అనే అధునాతన పర్యవేక్షణ(మానిటరింగ్) డాష్‌బోర్డ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది.ఏమిటీ ‘దర్పణ్ 2.0’?దర్పణ్ (Dashboard for Analytics, Review and Performance Assessment Nationwide) అనేది వివిధ ప్రభుత్వ పథకాలను 24x7 పర్యవేక్షించేందుకు రూపొందించిన ఒక మల్టీ ల్యాంగ్వేజీ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్. ఇది కేవలం సమాచారాన్ని చూపడమే కాకుండా, విశ్లేషణాత్మక అంశాలను అందిస్తుంది.ఫీచర్లు ఇవే..వేర్వేరు విభాగాల మధ్య ఉన్న డేటా అంతరాలను తొలగించి అన్ని ప్రభుత్వ పథకాల పురోగతిని ఒకే చోట చూపిస్తుంది.ప్రభుత్వ పథకాల స్టేటస్‌ను తెలియజేస్తుంది. ఈ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా? అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. రియల్ టైమ్‌లో వీటిని ట్రాక్ చేయవచ్చు.ఏదైనా ప్రాజెక్ట్ నెమ్మదించినా లేదా అడ్డంకులు ఎదురైనా ఈ సిస్టమ్ అధికారులను ముందుగానే అప్రమత్తం చేస్తుంది.కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) ద్వారా ప్రతి విభాగం పనితీరును స్కోర్ కార్డుల రూపంలో అంచనా వేస్తుంది.అమలు ఎప్పుడంటే..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం రాబోయే 12 నుంచి 16 వారాల్లో దశలవారీగా అమలు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల నోడల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సురక్షితమైన ఏపీఐల ద్వారా ఢిల్లీ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ఈ డాష్‌బోర్డ్‌కు అనుసంధానిస్తారు.భవిష్యత్ లక్ష్యాలుడిజిటల్ ఇండియా విజన్‌లో భాగంగా రూపొందుతున్న ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విశ్లేషణలకు, పబ్లిక్ డాష్‌బోర్డ్‌లకు పునాది వేయనుంది. దీనివల్ల ప్రభుత్వ పనితీరు ప్రజలకు స్పష్టంగా తెలియడమే కాకుండా, సాక్ష్యాధారిత విధాన ప్రణాళిక రూపొందించడానికి మార్గం సుగమం అవుతుంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ ‘దర్పణ్’ మోడల్‌ను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.ఉత్తరప్రదేశ్: ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘NexGen UP-CM DARPAN 2.0’ పేరుతో అత్యంత ఆధునిక వెర్షన్‌ను ప్రారంభించింది. ఇందులో 53 విభాగాలకు చెందిన దాదాపు 588 పథకాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్: ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాల పురోగతిని పర్యవేక్షించడానికి దర్పణ్ డ్యాష్‌బోర్డ్ అందుబాటులో ఉంది.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్: పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను సమర్థవంతంగా వాడుతున్నారు.ఈశాన్య రాష్ట్రాలు: మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాలు కూడా తమ జిల్లా స్థాయి ప్రాజెక్టుల పర్యవేక్షణకు దీనినే ఉపయోగిస్తున్నాయి.కేంద్రపాలిత ప్రాంతాలు: పుదుచ్చేరి, లక్షద్వీప్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇది అమలులో ఉంది.
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
ఇటీవల కాలంలో బంగారం అంటేనే కొండెక్కి కూర్చునే ధర అనుకున్న వారికి, ఇప్పుడు వెండి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే సుమారు 120 శాతం పైగా రాబడి అందించి, కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2 లక్షలను దాటింది. అయితే, ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు. 2026 జనవరి 1 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు అయిన చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించనుందనే వార్తలు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోసం మైక్రోచిప్‌ల తయారీలో వెండి వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారింది. సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026 ప్రారంభానికి ముందే కిలో వెండి ధర రూ.2.5 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు చైనా ఎగుమతుల కోత, ఇటు పెరుగుతున్న టెక్నాలజీ అవసరాల మధ్య వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లనున్నాయి.వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలుప్రపంచంలో వెండి ఉత్పత్తిలోనూ, ఎగుమతిలోనూ చైనాది కీలక పాత్ర. అయితే జనవరి 1, 2026 నుంచి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. అయితే వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. ఇకపై వెండిని ఎగుమతి చేయాలంటే కంపెనీలు ప్రత్యేక ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇది 2027 వరకు అమలులో ఉండే అవకాశం ఉంది. ఏడాదికి 80 టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే చిన్న సంస్థలకు ఎగుమతి అనుమతులు నిరాకరించే అవకాశం ఉంది. కేవలం పెద్ద, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకే ఈ అవకాశం దక్కుతుంది. చైనా తన దేశీయ అవసరాల కోసం (ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాలు) వెండి నిల్వలను కాపాడుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను ప్రభావితం చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.డిమాండ్ పెరగడానికి కారణాలుగ్రీన్ ఎనర్జీ విప్లవం.. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. సౌర ఫలకాల తయారీలో వెండిని కీలకమైన సిల్వర్ పేస్ట్ రూపంలో వాడతారు. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతుండటంతో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు 150% పెరిగింది.ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ.. సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా ఎక్కువ. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సెన్సార్లు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల విస్తరణ వల్ల అత్యాధునిక చిప్‌లు, సెమీకండక్టర్ల తయారీలోనూ వెండి వాటా పెరుగుతోంది.సరఫరాలో లోటు.. గడిచిన ఐదేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగా ఉంది. వెండి అనేది ఎక్కువగా రాగి, బంగారం, సీసం వంటి లోహాల వెలికితీతలో ఉప-ఉత్పత్తిగా ఉంది. కాబట్టి, డిమాండ్ పెరిగిన వెంటనే వెండి ఉత్పత్తిని పెంచడం మైనింగ్ సంస్థలకు సాధ్యం కావడం లేదు.సురక్షిత పెట్టుబడిగా వెండి.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల వల్ల పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది వెండి దాదాపు 120% పైగా రాబడిని ఇచ్చింది.2026 నాటి చైనా ఎగుమతి ఆంక్షలు అమలులోకి వస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఆభరణాల రంగాన్నే కాకుండా ఆధునిక సాంకేతిక, ఇంధన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 2026 నాటికి వెండి ధరలు కిలోకు రూ.2.4 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వెండి కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక వనరుగా మారబోతోంది.ఇదీ చదవండి: రూపాయి విలువ తగ్గినా మంచికే!
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
విలువ తగ్గినా మంచికే!
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం అనేది సాధారణంగా ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది. అయితే, ఆర్థిక కోణంలో విశ్లేషిస్తే దీనివల్ల భారత ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు కొన్ని కీలకమైన సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. అదెలాగంటారా? ముఖ్యంగా ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, దేశీయ తయారీ రంగంపై దీని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ఎలాగో చూద్దాం.ఎగుమతులకు లభించే ప్రోత్సాహంరూపాయి విలువ తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గుతాయి. అంటే విదేశీ కొనుగోలుదారులకు మన ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. చైనా వంటి దేశాలతో పోటీ పడేటప్పుడు తక్కువ ధర కలిగిన భారతీయ వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. విదేశీ కరెన్సీలో (డాలర్లలో) వచ్చే ఆదాయాన్ని రూపాయల్లోకి మార్చినప్పుడు ఎగుమతిదారులకు మునుపటి కంటే ఎక్కువ మొత్తం అందుతుంది. ఇది ఐటీ, ఫార్మా, వస్త్ర పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తుంది.ప్రవాస భారతీయుల నుంచి రెమిటెన్స్లుప్రపంచంలోనే అత్యధికంగా విదేశాల నుంచి నిధులను పొందే దేశం భారత్. రూపాయి విలువ పడిపోవడం ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఒక వరం లాంటిది. వారు ఇండియాకు పంపే ప్రతి డాలర్‌కు ఇప్పుడు ఎక్కువ రూపాయలు వస్తాయి. దీనివల్ల వారి కుటుంబాల వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా దేశంలోకి విదేశీ కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది. ఇది దేశ విదేశీ మారక నిల్వలను బలోపేతం చేస్తుంది.‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతందిగుమతులు ఖరీదైనవిగా మారడం వల్ల దేశీయంగా వస్తువులను తయారు చేసే కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. విదేశీ వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజలు స్వదేశీ వస్తువుల వైపు మొగ్గు చూపుతారు. ఇది దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. విదేశీ కంపెనీలు భారత్‌లో కార్యాలయాలను లేదా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం మునుపటి కంటే చౌకగా మారుతుంది. దీనివల్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (FDI) పెరిగే అవకాశం ఉంది.పర్యాటక రంగం అభివృద్ధివిదేశీ పర్యాటకులు భారత్‌లో పర్యటించేందుకు మరింత తక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. డాలర్ విలువ పెరగడం వల్ల విదేశీయులు తక్కువ ఖర్చుతోనే భారతదేశంలో ఎక్కువ రోజులు గడపవచ్చు. ఇది హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారాలకు ఆదాయాన్ని పెంచుతుంది.ప్రభుత్వానికి ఆదాయందేశంలో దిగుమతి చేసుకునే వస్తువుల విలువ రూపాయల్లో పెరగడం వల్ల వాటిపై విధించే కస్టమ్స్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఎగుమతుల ద్వారా లాభపడే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వానికి అధిక డివిడెండ్లు అందే అవకాశం ఉంది.రూపాయి విలువ తగ్గడం వల్ల ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ వంటి దిగుమతుల భారం పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ సరైన విధానాలతో ఎగుమతులను, దేశీయ ఉత్పత్తిని పెంచుకుంటే భారత్ దీన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ప్రభుత్వం ఎగుమతి ఆధారిత వృద్ధిపై దృష్టి పెట్టినప్పుడు బలహీనమైన రూపాయి ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా పనిచేస్తుంది.ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..
ఫ్యామిలీ
అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..
చీర గొప్పతనం గురించి మన తెలుగు పాటలతో.. ఎంతో మంది గాయకులు, రచయితలు అద్భుతం వర్ణించి రాశారు, పాడారు. అలాంటి చీర అత్యంత ఖరీదైనదిగా, కళఖండంగా రికార్డు సృష్టించింది ఆ చీరలో దాగున్న విశేషాలు చూస్తే..కంగుతింటారు. అడుగడుగున ఓ కళా ప్రతిరూపం, ఓ ప్రత్యేకత, ఓ ప్రసిద్ధ చిత్రకారుడు కుంచె నుంచి జాలువారిని చిత్రాలు, అమూల్యమైన ఆభరణాలు, నగలు కనిపిస్తాయి. అంతేగాదు చీరను చూడగానే "సరికొత్త చీర ఊహించినాను" అన్న పాట స్పురణకు వస్తుంది. అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ శారీని. దీని ఖరీదు లక్షలు పైమాటే..అంటే ఈ చీర ధరతో పల్లెటూరిలో ఓ మోస్తారు ఇల్లు కట్టేయొచ్చు లేదా ఓ మారుమూల ప్రాంతంలో సింగిల్ బెడ్రూం ధర అని కూడా చెప్పొచ్చు.ప్రపంచం చీరల దినోత్సవం సందర్భంగా..అత్యంత ఖరీదైన వివాహ పట్టు చీర, కళలకు నిలయమైన చెన్నై సిల్క్ కంజీవరం పట్టు చీర విశేషాలు గురించి తెలుసుకుందామా. ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది. దీన్ని డబుల్ వార్ఫ్ పద్ధతిని ఉపయోగించి చేతితో నేసిన చీర. దీనిలో 64 రంగుల షేడ్స్, పది ప్రత్యేకమైన డిజైన్లు ఉంటాయి. ఈ చీర బరువు వచ్చేసి దగ్గర దగ్గరగా ఎనిమిది కిలోగ్రాములు.దీనిలో బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి, కెంపు, పచ్చ, నీలమణి, ముత్యాలు వంటి విలువైన రాళ్లను పొందుపరిచారు. నివేదికల ప్రకారం.. 59.7 గ్రాముల బంగారం, 3.9 క్యారెట్ల వజ్రం, 5 క్యారెట్ల నీలమణిని వినియోగించారు. అంత విలువైన వజ్రాలు, కళాఖండాలకు నిలయం కావడంతోనే ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇది జనవరి 05, 2008న సుమారు రూ. 39 లక్షలు పైచిలుకే అమ్ముడుపోయింది. ఈ చీర తయారీకే దాదాపు 4 వేలు గంటలు పనైనే పట్టిందట. మొత్తం 36 మంది నేత కార్మికుల కృషి ఫలితం ఈ చీర. మరో విశేషం ఏంటంటే..ఇందులో ప్రఖ్యాత భారతీయ కళాకారుడు రాజా రవి వర్మ 11 చిత్రాల ప్రతిరూపాలు ఉన్నాయి. ఆ శారీ పల్లులో 'గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్' ప్రతిరూపం ఉంటుంది. ఇది సంగీత ప్రదర్శనలో నిమగ్నమైన 11 మంది మహిళలను వర్ణిస్తుంది. ఇందులో ప్రతి స్త్రీ ఒక ప్రాంతం లేదా కమ్యూనిటికి సంబంధించిన విభిన్న దుస్తులను ధరించి కనిపించడం మరింత విశేషం. కుడివైపు ఒక ముస్లీం మహిళ, ఎడమవైపు ఒక స్త్రీ నాయర్ ముండు దుస్తులను(కేరళ నాయర్ సామాజికి వర్గానికి సంబంధించిన స్త్రీలు) ధరించి చేతిలో వీణ వాయిస్తూ కనిపిస్తుంది. మధ్యలో ఆకుపచ్చ గాజులతో మరాఠీ శైలి చీర ధరించిన స్త్రీ కనిపిస్తుంది. ఇంతలా వివవరణాత్మక పెయింటింగ్ చీరపై చిత్రించడంతనే ఈ చీర అత్యంత హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ చీరను రెండు వెర్షన్లలో తయారు చేసినట్లు సమాచారం. ఒకటి బెంగళూరుకి చెందిన ఒక వ్యాపారవేత్త తన పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలు చేయగా, మరొకటి 2009లో కువైట్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేశారట.(చదవండి: Nita Ambani: ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!)
శబరిమల యాత్రికులకు సాంప్రదాయ కేరళ సద్య..!
అన్నదానం కార్యక్రమంలో భాగంగా , శబరిమల వద్ద అయ్యప్ప భక్తులకు సాంప్రదాయ కేరళ సద్య పంపిణీ ఈ నెల డిసెంబర్21 నుంచి ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ OG బిజు ఉత్సవ దీపం వెలిగించి , అయ్యప్ప స్వామికి సద్యను నివేదించి మరి సేవను ప్రారంభించారు.ఈ విందు కేరళ అసలైన రుచిని ప్రతిబింబిస్తుంది. ఇందులో పరిప్పు , సాంబార్ , రసం , అవియల్ , తోరన్ , ఊరగాయ , పప్పడం, పాయసం ఉంటాయి. వైవిధ్యం, తాజాదనాన్ని కాపాడుకోవడానికి , అవియల్, తోరన్లను ప్రతిరోజూ భిన్నంగా తయారు చేస్తారు. అయితే మోర్ , రసం లేదా పులిస్సేరిని ఒకరోజు విడిచి ఒకరోజు వడ్డిస్తారు. అలాగే ప్రతిరోజూ కొత్త రకం పాయసం కూడా అందిస్తారు.పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా , స్టీల్ ప్లేట్లు, గ్లాసులను ఉపయోగించి ఆహారాన్ని వడ్డిస్తారు. ప్రతి మధ్యాహ్నం సుమారు 5 వేల మందికి పైగా యాత్రికులకు భోజనం అందిస్తారు. సాంప్రదాయ సద్య, పులావ్‌ను ప్రత్యామ్నాయ రోజులలో వడ్డిస్తారు.ప్రారంభ సాంకేతిక జాప్యాలను పరిష్కరించిన తర్వాత, అధికారులు ఇప్పుడు ఈ గొప్ప సేవను కొనసాగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. కేరళ గొప్ప వంటకాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సేవను ప్రారంభించారు. (చదవండి: చెత్తను కొనుగోలు చేసే తొలి గ్రామం..అందుకోసం ఏకంగా యాప్..!)
అక్కడ 'చెత్త' ఆదాయంగా మారుతోంది..!
చాలాచోట్ల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ అనే నినాదం మాటలకే పరిమితమైంది. కానీ కొన్నిచోట్ల కార్యరూపానికి నోచుకుని సరికొత్త విధానంతో మార్పుకి నాంది పలుకుతూ.. స్ఫూర్తిని కలిగిస్తోంది. అది ఒకరకంగా అటు పర్యావరణ పరంగా, ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది కూడా. ఇలాంటి వినూత్న మార్గాలు ఆదర్శంగానే కాదు యావత్తు దేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్కి నిలయంగా ఉండేలా చేస్తాయి కూడా. అలాంటి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి..దేశంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది ఈ గ్రామం. అంతేకాదు చెత్తతో సంపద సృష్టించి మొత్తం దేశాన్నే ఆకర్షించింది కూడా. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.బిహార్‌లోని సివాన్ జిల్లాలోని లఖ్వా గ్రామ పంచాయతీ గృహ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చి..ఆదర్శం గ్రామంగా నిలిచింది. ఏకంగా మొబైల్ అప్లికేషన్‌తో గృహవ్యర్థాలను కొనుగోలు చేసిన తొలి గ్రామం కూడా ఇదే. లోహియా స్వచ్ఛ బీహార్ అభియాన్ (LSBA) కింద ప్రారంభించిన ఈ చొరవ గ్రామస్తులు తమ గృహ వ్యర్థాల వివరాలను 'కబాద్ మండి' యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సమాచారం అందిన వెంటనే సంబంధిత ఏజెన్సీ అస్రాజ్ స్కేప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యర్థాలను తూకం వేసి, నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా డబ్బులను తత్క్షణమే చెల్లిస్తుంది. ఈవ్యవస్థ ఒక రకంగా పారదర్శకత, సరళత, విశ్వసనీయతను నిర్థారిస్తుంది. ఇక్కడ వాళ్లు సేకరించిన వ్యర్థాలలో ప్రతిదానికి ఒక ఫిక్స్డ్ రేటు ఉంటుంది. దాంతో సులభంగా ప్రజలు ఈ విధానాన్ని ఉపయోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అక్కడ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సమాచార, విద్య, కమ్యూనికేషన్ సలహాదారు(ఎల్ఎస్బీఏ) సుమన్ లాల్కర్న్ ప్రకారం..ఈ కార్యక్రమం విజయానికి దాని స్పష్టమైన ధరల విధానమేనని అన్నారు. దీనివల్ల గృహ వ్యర్థాల విభజన సులభమైందని కూడా చెబుతున్నారు. ఇంతకీ వ్యర్థాల ధరలు వస్తువుల వారీగా ఎలా ఉంటాయంటే..ప్లాస్టిక్ సీసాలు: కిలోకు రూ. 15టిన్: కిలోకు రూ. 10పెద్ద కార్డ్బోర్డ్: కిలోకు రూ. 8మధ్యస్థ కార్డ్బోర్డ్: కిలోకు రూ. 6తెల్లటి పాలిథిన్ కవర్లు(ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ఉండేవి): కిలోకు రూ. 5చిన్న కార్డ్బోర్డ్: కిలోకు రూ. 4కాగితం: కిలోకు రూ. 3బ్లాక్ ప్లాస్టిక్: కిలోకు రూ. 2సేకరించిన వ్యర్థాలను ఏం చేస్తారంటే..సేకరించిన వ్యర్థాలను ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు (PWMU), వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లకు (WPU) రవాణా చేస్తారు. ఆ తర్వాత వ్యర్థాలను ల్యాప్‌టాప్ బ్యాగులు, మహిళల పర్సులు, డైరీలు, కీ రింగ్‌లు, కప్బోర్డ్లు, బెంచీలు వంటి ఇతర మన్నికైన ఉత్పత్తులుగా రీసైకిల్ చేస్తారు. ఈ ప్రక్రియ పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా స్థానికులకు ఉపాధిని కూడా అందిస్తోందిరాష్ట్రవ్యాప్త ప్రభావంవ్యర్థాల నిర్వహణలో బిహార్ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని గ్రామీణాభివృద్ధి రవాణా మంత్రి శ్రావణ్ కుమార్ హైలైట్ చేశారు. ప్రస్తుతం, బీహార్‌లో దాదాపు 7 వేలకు పైగా గ్రామ పంచాయతీలలో వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లను, 171 ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేసింది. దీంతో వేల టన్నుల ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేసి.. తిరిగి ఉపయోగించుకునేలా మార్చి.. బిహార్ స్వావలంబన, పరిశుభ్రతకు శ్రీకారం చుట్టింది. చెప్పాలంటే ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలిచింది. (చదవండి: అలాంటి ఇలాంటి పిల్లి కాదు..! నష్టాల్లో ఉన్న రైల్వేని గట్టేక్కించిదట..ఎలాగో తెలుసా..!)
లోతైన ఆలోచన
ఒక ఊర్లో కూలీలను పెట్టి బావుల్ని తవ్వించే మేస్త్రీ ఉండేవాడు. ఆ బావి మేస్త్రీ పల్లెలన్నీ తిరిగి ఎవరు బావి తవ్విస్తారో వారికి కూలీలను ఏర్పాటు చేసి బావుల్ని తవ్వించే పని చేసేవాడు. అతడు పనికి ఒప్పుకున్నాడంటే ఆ బావిలో నీళ్ళు పడాల్సిందే. కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అతడికి మంచి పేరుంది. దాంతో బాగా డబ్బు సంపాదించి కొంచెం స్థిమితపడ్డాడు.ప్రతి పౌర్ణమికీ అతడు వీలు కల్పించుకుని దగ్గరున్న పట్టణంలోని గుడికి వెళ్ళేవాడు. అక్కడ ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలను, రామాయణ భారత భాగవతాలను విని ఇంటికి వచ్చేవాడు. తీరికగా ఆ విషయాలన్నీ భార్యకు చెప్పేవాడు. ఆమె చాలా ఆసక్తిగా వినేది. తనకు వచ్చిన అనుమానాలను భర్తనడిగి తెలుసుకునేది. అయితే తాము మాత్రమే వాటిని తెలుసుకోవడం ఆమెకు రుచించలేదు. ‘మరింత మందికి ఆ మంచి విషయాలు తెలియజేస్తే బాగుంటుంది కదా’ అని ఆలోచించసాగింది.ఒకరోజు పనులన్నీ ముగించుకుని ఉపన్యాసాలు వినడానికి పట్టణానికి బయలుదేరబోయాడు మేస్త్రీ. అతడి స్నానానికని ఇంట్లోని చేదబావిలోని నీళ్ళను తోడుతూ ‘ఎవరింట్లో అయినా బావి తవ్విస్తే ఏమి జరుగుతుంది?’ అని అడిగింది. ‘ఆ ఇంట్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు తోడుకుంటారు. వంటకీ, ఇంటికీ వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు.‘అదే ఊరి మధ్యలో చేదబావి తవ్వితే ఏమవుతుంది?’ అని ప్రశ్నించింది.‘అనుమానమెందుకు? ఊర్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మీరు మాత్రమే విని నాకు చెబితే మనవరకే ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. అదే మీరు ఉపన్యాసకులను మన ఊరికి పిలిపిస్తే ఇంకా బాగుంటుంది. మన ఊరి రాములవారి గుడిలో నెలకొకసారి కార్యక్రమం ఏర్పాటు చేస్తే పిల్లలూ, పెద్దలూ అందరూ వింటారు. నలుగురు వింటే నాలుగు లోకాలు విన్నట్లు కదా’ అని మెత్తగా చెప్పింది.‘ఇన్నాళ్ళూ నా భార్యని బావిలోని కప్పనుకున్నాను. కానీ, లోతుగా ఆలోచన చేసే మనిషి’ అని గుర్తించాడు. వెంటనే వెళ్ళి ఉపన్యాసకులతో మాట్లాడి వారిని ఒప్పించాడు. తమ ఊర్లోనే కార్యక్రమాలు ఏర్పాటు చేయించాడు. మొదటగా ఊర్లో వాళ్ళు మాత్రమే వినడానికి వచ్చే వారు. చిన్నగా చుట్టుపక్కల గ్రామాలకు విషయం పాకింది. ఇతర గ్రామాల ప్రజలు మైళ్ళ దూరం నడిచి వచ్చి శ్రద్ధగా వినడం ప్రారంభించారు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, వచ్చి నాలుగు మంచిమాటలు వినే జనాన్ని చూసిన మేస్త్రీ దంపతులకు, నిండుగా నీళ్ళున్న బావిని చూసినంత ఆనందం కలిగింది.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు
అంతర్జాతీయం
పాలసంద్రంలో కృష్ణశిల
తెల్లని నురగలతో నిండిన పాలసంద్రంలోకి పడిపోతున్న నల్లరాయిలా కన్పిస్తున్న ఈ శిల వాస్తవానికి ఒక ఉపగ్రహం. దీని పేరు ఫోబోస్. ఇది అంగారకుని చుట్టూ పరిభ్రమిస్తోంది. మార్స్‌కు అత్యంత సమీపంగా అంతర్గత కక్షలో తిరిగే ఈ ఫోబోస్ తాజా ఫొటోలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) ఇటీవల క్లిక్ మనిపించి విడుదలచేసింది. ఇమేజ్ స్పెషలిస్ట్ అయిన ఆండ్రియా లక్ ఈ ఫొటోలను అందరితో పంచుకున్నారు. ఈఎస్ఏ వారి ‘మార్స్ ఎక్స్‌ప్రెస్ ఆర్బిటార్’ ద్వారా ఈ ఫొటోలను తీశారు. ఓ పేద్ద బంగాళదుంపకు అతుక్కున్న రాయిలా ఈ ఉపగ్రహం భలేగా కన్పిస్తోందని ఒక నెటిజన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌పెట్టారు. సౌరవ్యవస్థలోనే అత్యంత వైవిధ్యమైన నేలలున్న గ్రహంగా మార్స్ పేరొందింది. విస్తారమైన అగ్నిపర్వత నేలలు, రుధిరవర్ణ ఉపరితలం మీదుగా గగనతలంలో నల్లటి ఫోబోస్ దూసుకుపోవడం ఫొటోల్లో మరింత అందంగా కన్పిస్తోంది. ఫోబోస్ వెడల్పు 27 కిలోమీటర్లు మాత్రమే. అత్యల్ప స్థాయి సహజ ఉపగ్రహాల తీరుతెన్నులను గమనించేందుకు ఇలాంటి ఫొటోలు అక్కరకొస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్
సౌదీపై మంచు దుప్పటి
రియాద్: ఎటుచూసినా ఇసుక తిన్నెలు, భగభగమండే భానుడి సెగలు, భరించరాని వేడి, అత్యధిక ఉష్ణోగ్రతలకు చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా ఎడారుల్లో ఇప్పుడు లెక్కలేనంత మంచు కుప్పలుతెప్పలుగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. చలికాలం కావడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టాలకు పడిపోతున్నాయి. దీంతో తమ ఎడారుల్లో మంచు దుప్పట్లు పర్చుకోవడంతో సౌదీ స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి, మరికొంద గందరగోళానికి గురవుతున్నారు. వాతావరణ మార్పుల విపరిణామాల కారణంగానే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఈశాన్య సౌదీలో అత్యధికంగా మంచు కురుస్తోంది. తబుక్ ప్రావిన్స్‌లోని పర్వతాలన్నీ ఇసుకరేణువులపై పడిన మంచుతో దవళవర్ణ శోభను సంతరించుకున్నాయి. జిబేల్ అల్–లావాజ్ పరిధిలో సముద్రమట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని ప్రఖ్యాత ట్రోజెనా ప్రాంతం మొత్తం మంచుతో నిండిపోయింది. ఎడారి ఓడగా వినతికెక్కిన ఒంటెలన్నీ ఇప్పుడు మంచు చల్లదనాన్ని తెగ ఆస్వాదిస్తున్నాయి. ఎడారి ఇసుకతిన్నెలన్నీ తెలుపురంగులో మిలమిలా మెరిసిపోవడం, ఒంటెల శరీరాల మీదుగా మంచు పేరుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సముద్రమట్టం నుంచి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు ఏకంగా సున్నా డిగ్రీసెల్సియస్కు పడిపోవడం విశేషం. పలు రీజియన్లలో వర్షాలు పడటంతో వాటికి చల్లటిగాలులు తోడై ఉష్ణోగ్రతలను కనిష్టాలకు పరిమితంచేస్తున్నాయి. సౌదీ అరేబియాలో ఇంతటి స్థాయిలో మంచు కురవడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారికావడం గమనార్హం.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. భారతీయుల పరిస్థితి విషమం
ఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా సైన్యంలో చేరిన భారతీయుల పరిస్థితి మరింత విషమంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 50 మంది భారతీయులు రష్యా సైన్యంలో చిక్కుకుని ఉన్నారు.వారిలో ఇప్పటి వరకు 26 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు అదృశ్యమైనట్లు సమాచారం. వారి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. మొత్తం మీద, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 200 మందికి పైగా భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.ప్రభుత్వ చర్యలుభారత ప్రభుత్వం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రష్యా సైన్యంలో చేరిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని రప్పించగలిగామని, కానీ ఇంకా 50 మంది చిక్కుకుని ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.కుటుంబాల ఆందోళనయుద్ధంలో చిక్కుకున్న యువకుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ప్రాణాలు రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులు తమ పిల్లలు మోసపూరిత వాగ్దానాలతో రష్యా సైన్యంలో చేరారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దక్షిణాసియా దేశాల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడం వల్ల చిక్కుకున్న భారతీయుల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి భారత విదేశాంగానికి పెద్ద సవాలుగా మారింది.ముగింపురష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నంత కాలం, రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రాణాలు రక్షించేందుకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబాలు కోరుతున్నాయి.
స్టార్‌లింక్ శాటిలైట్లకు రష్యా ముప్పు
పారిస్: ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ కూటమిలోంచి కృత్రిమ ఉప గ్రహం ‘35956’ అదుపుతప్పి భూమి దిశగా కదులుతూ కొత్త ముప్పుమోసుకొస్తుంటే అంతకుమించి పెను ముప్పు రష్యా రూపంలో పొంచి ఉందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు ఆందోళనవ్యక్తంచేశాయి. అంతరిక్షంలో కక్షలో తిరిగే వందలాది కృత్రిమ ఉపగ్రహాలను పిట్టల్లా రాల్చేసే అధునాతన ఆయుధాన్ని తయారు చేయడంలో రష్యా తలమునకలైందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు నిఘా సమాచారంతో ది అసోసియేటెట్ ప్రెస్ వార్తాసంస్థ ఒక కథనాన్ని వెలువర్చింది.దాని పేరు జీరో ఎఫెక్ట్అంతరిక్షంలోని ఉపగ్రహాలపైకి అత్యంత సాంద్రతతో తయారుచేసిన సూక్ష్మ పెల్లెట్లను ప్రయోగించి వాటికి తీవ్ర నష్టం కలిగేలా చేయడమే రష్యా ఆయుధం అసలు లక్ష్యం. ఈ ఆయుధానికి ‘జీరో ఎఫెక్ట్’ అని పేరుపెట్టినట్లు తెలుస్తోంది. వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ధాటికి ఒకేసారి పెద్ద సంఖ్యలో శాటిౖలైట్లును సర్వనాశనం అవుతాయి. ఇవి చిన్నచిన్న ముక్కలుగా శకలాలుగా చెల్లాచెదురుగా పడడంతో సమీప కక్ష్యల్లోని ఇతర ఉపగ్రహాలకు సైతం దెబ్బతింటాయి. దీంతో వినాశనం ఊహించనంత పెద్దదిగా ఉంటుంది. ఇంతటి పెనువినాశనం సృష్టించగల ఆయుధాన్ని రష్యా సృష్టించకుండా ఉంటుందని తాము భావించట్లేమని అమెరికాలోని ప్రభుత్వేతర ‘ సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్’లోని అంతరిక్ష భద్రతా నిపుణుడు విక్టోరియా సామ్సన్, కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ వ్యాఖ్యానించారు. జీరో ఎఫెక్ట్ ఆయుధ తయారీ మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు. ‘‘ కక్షలో తిరగగలిగే సామర్థ్యమున్న ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐరాస చొరవచూపాలి. అయినా అణ్వస్త్ర సామర్థ్యమున్న అంతరిక్ష ఆయుధాలను మొహరించబోమని పుతిన్ గతంలోనే చెప్పారు’’ అని పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్‌లింక్ ఉపగ్రహాలు రష్యా గగనతలంపై నిఘా పెట్టి ఉక్రెయిన్ దిశలో రష్యా సేనల జాడను గుర్తించి ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. దీంతో స్టార్‌లింక్ ఉపగ్రహాలు తమ సార్వభౌమత్వం, భద్రతకు ముప్పుగా వాటిల్లాయని వీటిని నాశనంచేయాలని రష్యా భావిస్తోందని పశ్చిమాసియా నిఘా వర్గాలు నిర్ధారించాయి.పొడవు మిల్లీమీటర్!‘‘హఠాత్తుగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ల వంటి వాటినే గుర్తించగలం. కేవలం మిల్లీమీటర్ పొడవుండే సూక్ష్మ పెల్లెట్లను భూతల, గగనతల నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. వీటితో ఉపగ్రహాలపై దాడి చేస్తే నష్టనివారణ అసాధ్యం. పెల్లెట్ల దెబ్బకు ఒక కక్షలోని ఉపగ్రహాలన్నీ నాశనంఅవుతాయి. అదీకాకుండా దాడి చేసింది రష్యానే అని నిరూపించడం కూడా చాలా కష్టం. మిల్లీమీటర్ పొడవు పెల్లెట్లతో ఉపగ్రహాలకు మరణశాసనం రాయొచ్చు. చైనా ఉదంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ. నవంబర్‌లో సూక్ష్మస్థాయి అంతరిక్ష శకలం తగిలి చైనా వ్యోమనౌక దెబ్బతింది. దాంతో చైనా సొంత అంతరిక్ష కేంద్రం నుంచి అది బయల్దేరలేక అక్కడే ఉండిపోయింది. దాంతో దాని ద్వారా భూమి మీదకు రావాల్సిన చైనా వ్యోమగాములు సైతం అక్కడే చిక్కుకుపోయారు’’ అని బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఉపగ్రహాల ఉపరితలాల్లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించేవి సౌర ఫలకాలే. పెల్లెట్ల ఉరవడికి ఇవన్నీ బద్దలవుతాయి. అప్పుడు ఉపగ్రహం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని వాషింగ్టన్‌లోని ‘సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో అంతరిక్ష భద్రత, ఆయుధాల నిపుణుడు క్లేటన్ స్వాప్ చెప్పారు. స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూమి నుంచి ఆకాశంలో 500 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తున్నాయి. వీటి కింది కక్షల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా వారి తియాంగ్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్నాయి. రష్యా దాడి చేస్తే ఉపగ్రహాలు శకలాలుగా ఛిద్రమై అవి ఐఎస్ఎస్, తియాంగ్ స్పేస్స్టేషన్లనూ నాశనంచేసే ఆస్కారముంది.
జాతీయం
కాలువలో మొండెం.. వెలుగులోకి భార్య కిరాతకం
సంభల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక దారుణ హత్యోదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఒక ఇల్లాలు తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్యచేసింది. అంతటితో ఆగకుండా మృతదేహం ఆనవాళ్లు దొరకకూడదని దానిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రాంతాల్లో పారేసిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది.నవంబర్ 18న తన భర్త రాహుల్ అదృశ్యమయ్యాడంటూ భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హైడ్రామా మొదలైంది. డిసెంబర్ 15న ఇక్కడి ఒక కాలువలో తల, కాళ్లు, చేతులు లేని మొండెం పోలీసులకు లభించింది. ఆ మొండెంపై ఉన్న ‘రాహుల్’ అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులకు రూబీపై అనుమానం కలగడంతో అసలు నిజం బయటపడింది.పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ కలిసి రాహుల్‌ను ఇనుప రాడ్డు, రోకలితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ఒక చెక్కలు కోసే గ్రైండర్‌ను తీసుకువచ్చి, మృతదేహాన్ని ముక్కలుగా కోశారు. ఒక భాగాన్ని కాలువలో పడేయగా, మిగిలిన శరీర భాగాలను రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలిపేసి ఏమీ తెలియనట్టు నాటకమాడారు.నిందితులు హత్యకు ఉపయోగించిన గ్రైండర్, ఇనుప సుత్తి మరియు ఇతర పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రూబీ, గౌరవ్‌లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మృతదేహం రాహుల్‌దేనని నిరూపించేందుకు అతని పిల్లల డీఎన్ఏ నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ
ఢిల్లీలో ఉద్రిక్తత.. బంగ్లా హైకమిషన్ వద్ద హిందూ సంఘాల నిరసనలు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరససగా వీహెచ్‌పీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్‌పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణాలు, దీపూ చంద్ర దాస్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద బారికేడ్లు తోసుకుంటూ వీహెచ్‌పీ నేతలు లోపలికి వెళ్లే యత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో హిందూ సంఘాలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. #WATCH | Delhi | Members of Vishva Hindu Parishad and other Hindu organisations protest near the Bangladesh High Commission over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh pic.twitter.com/0nrtZ3XWYG— ANI (@ANI) December 23, 2025దీపు చంద్రదాస్ హత్య చేసిన వారిని శిక్షించాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యూనస్ ప్రభుత్వం రాడికల్స్ మద్దతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, హిందువులపై అత్యాచారాలు నిరోధించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని హిందువులను రక్షించాలని కోరారు. 1971 తరహాలో తప్పు చేయవద్దని ఇండియాలో బంగ్లాదేశ్‌ను కలపాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. అనంతరం.. ఆందోళకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలిసింది. మరోవైపు.. బంగ్లాదేశ్‌పై ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 జరగాలంటూ వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. #WATCH | Delhi | Vishva Hindu Parishad and other hindu organisations protest near the Bangladesh High Commission against the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das pic.twitter.com/aKo0T3BUs2— ANI (@ANI) December 23, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్‌లో సైతం హిందు సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భోపాల్‌లో బజరంగ్ దళ్ నేతలు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. #WATCH | Bajrang Dal and other Hindu organisations protest over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh, in BhopalA Bajrang Dal member says,"Bajrang Dal has protested against the Bangladesh government today. We demand that… https://t.co/O134zU9B9p pic.twitter.com/1xVG722dxQ— ANI (@ANI) December 23, 2025
రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ
బెర్లిన్: జర్మనీలోని బెర్లిన్‌లో గల హెర్టీ స్కూల్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య ఉన్న సమానత్వ భావనను దెబ్బతీస్తూ, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను బీజేపీ కాలరాస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఒక గంట నిడివి గల వీడియోను విడుదల చేసింది.ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇది కేవలం భారతీయుల ఆస్తి మాత్రమే కాదని, ప్రపంచ సంపద అని రాహుల్ అభివర్ణించారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న ఏ దాడి అయినా, దానిని అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగే దాడిగానే పరిగణించాలని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకుని, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, వాటిని ఆయుధాలుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. This battle is no longer just about elections. It’s about protecting the foundation of our Constitution and Democracy - One Person, One Vote. pic.twitter.com/QjecwCtjxr— Congress (@INCIndia) December 22, 2025దేశంలోని దర్యాప్తు సంస్థలైన ఈడీ (ఈడీ), సీబీఐ (సీబీఐ)ల పనితీరును రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ ఈ సంస్థలను నిర్మించడంలో సహకరించినప్పటికీ, బీజేపీ మాత్రం వాటిని తమ సొంత ఆస్తులుగా వాడుకుంటూ, ప్రతిపక్షాలపై రాజకీయ కేసులు పెడుతోందని విమర్శించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని తాము నిరూపించామని, అలాగే మహారాష్ట్ర ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని తాము భావించడం లేదని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక నమూనాపై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ కాలం నాటి ఆర్థిక విధానాలనే బీజేపీ ముందుకు తీసుకెళ్తోందని, ప్రస్తుత మోదీ ఆర్థిక విధానం పూర్తిగా నిలిచిపోయిందని రాహుల్ అన్నారు. దేశంలోని సంస్థాగత వ్యవస్థపై జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఒక బలమైన ప్రతిఘటన వ్యవస్థను రూపొందిస్తున్నాయన్నాయన్నారు. కేవలం ఎన్నికల లోపాలను ఎత్తిచూపడమే కాకుండా గెలుపు వైపు నడిచే పద్ధతిని సిద్ధం చేస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు.ఇండియా కూటమి పార్టీల మధ్య వ్యూహాత్మక విభేదాలు ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఎదుర్కోవడంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తామంతా చాలా ఐక్యంగా ఉన్నామని రాహుల్ గాంధీ తెలిపారు. పార్లమెంటులో ప్రతిరోజూ ప్రతిపక్షాల ఐక్యత కనిపిస్తున్నదని, తమకు సమ్మతం లేని చట్టాలపై బీజేపీని గట్టిగా నిలదీస్తామని రాహుల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఎఫెక్ట్.. ‘గన్ బైబ్యాక్’ సంచలనం!
ఈ నెల 27న ఘనంగా మండల పూజ,హరివరాసనం..ఆలయం మూసివేత
శబరిమల (Shabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు ప్రకటించారు. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.మండల పూజ సమయాలు, జరిగే ఆచారాలు..మండల పూజ 27న ఉదయం 10:10AM నుండి 11:30AM వరకు జరిగే అవకాశముంది. 26న రాత్రి 6:30PM సమయంలో, పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకి చేరుకుంటాయి. ఈ వస్త్రాలు స్వామి అలంకరణకు ఉపయోగిస్తారుఈ వస్త్రాలతో దీపారాధన నిర్వహిస్తారు. దీపారాధన తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఘనంగా హరివరాసనం, ఆలయ మూసివేతపూజ అనంతరం, 27న రాత్రి 11:00PMకి హరివరాసనం పూర్తి అవుతుంది. హరివరాసనం శబరిమలలో(Shabarimala) జరిగే మహత్తరమైన ఉత్సవాలలో ఒకటిగా పేర్కొంటారు. దీని అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.ఆలయ కార్యక్రమాల సమగ్ర వివరాలు:పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరవేత: 26న రాత్రి 6:30PM.దీపారాధన: 26న పూజ అనంతరం.మండల పూజ: 27న ఉదయం 10:10AM నుంచి 11:30AM.హరివరాసనం: 27న రాత్రి 11:00PM.ఆలయ మూసివేత: హరివరాసనం తర్వాత, 27న రాత్రి.మకరవిళక్కు ఉత్సవం: 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుస్తారు(చదవండి: ఇవాళే ధంక అంగి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..)
ఎన్ఆర్ఐ
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను “పబ్లిక్” సెట్టింగ్స్‌లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్‌ఫార్మ్‌లలోని కంటెంట్‌ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
FIA అమెరికా అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి
న్యూయార్క్: 1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్‌కోస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి, ఎన్నరైలకు ప్రతినిధిగా భావించే అతిపెద్ద గ్రాస్‌రూట్ నాన్–ప్రాఫిట్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ USA (FIA NY–NJ–CT–NE) తన 2026 నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమితులైన ఎన్నికల సంఘం సభ్యులు అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయి ఎంపిక చేసిన తర్వాత సూచించిన పేర్లకు FIA బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్ స్థానంలో 2026 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీకాంత్ అక్కపల్లిని ఎంపిక చేశారు.ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. ఈ సంవత్సరం FIA కార్యవర్గాన్ని కుదించి, కౌన్సిల్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థకు స్వతంత్రంగా షా అకౌంటెంట్స్ ట్రెజరర్‌గా పనిచేయనున్నారు.కొత్త కార్యవర్గం 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనుంది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్, ట్రాన్సిట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా శ్రీకాంత్ అక్కపల్లి పేరు నిలిచింది. అమెరికా–భారత దేశాల్లో ఆయన చేపట్టిన వివిధ రంగాల వ్యాపారాల విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం, అక్కాపల్లి బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. FIA చైర్మన్ అంకుర్ వైద్యకు తనకు “పెద్ద కుటుంబం లాంటి సంస్థలో చోటు కల్పించినందుకు” ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తొలి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా FIA అధ్యక్షుడిగా అవతరించడం చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూషన్ పట్ల నిబద్ధత, నైతికత, సేవా భావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.అనేక దశాబ్దాలుగా సంస్థతో ఉన్న సీనియర్ సభ్యులు ఆయనను ప్రశంసిస్తూ.. “నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అక్కపల్లి ఎంపిక FIA లో విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా సేవా భావంతో నడిచే ఈ 55 ఏళ్ల సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్‌లో అధికారిక గుర్తింపు ఉంది. భారత దేశ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుతో పాటు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అనేక గౌరవాలను అందుకుంది.
యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా తెలంగాణ వాసి..!
బ్రిటన్‌లో మన తెలంగాణ (Telangana) వాసికి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ (House of Lords)కు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని శనిగరం (Shanigaram) గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) నామినేట్ అయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు సభ్యులను ప్రధాన మంత్రి సలహా మేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లండ్ నామినేట్ చేస్తారు. ఇందుకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుంచి కూడా నామినేషన్లు వస్తాయి. ప్రధానంగా నైపుణ్యం, అనుభవం, దేశానికి సేవ ఆధారంగా హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ పదవికి భారతీయ సంతతికి చెందిన వారిని కూడా నామినేట్ చేస్తారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ. ఇది చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది. కాగా, గతంలో నాగరాజు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ (North Bedfordshire) నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వం కలిగిన ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. ఆయన విద్యాభ్యాసం అంతా వరంగల్, హైదరాబాద్‌నే పూర్తయింది. ఆ తర్వాత బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు.ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచిపట్టు ఉంది.(చదవండి: శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ)
శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ
జార్జియాలోని కమ్మింగ్‌లోని వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్, శంకర నేత్రాలయ USA సంవత్సరాంతపు మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించడంతో సంస్కృతి, కరుణ యొక్క శక్తివంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఇది గ్రామీణ భారతదేశంలో కంటి సంరక్షణను గరిష్టంగా విస్తరించడానికి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) చొరవ విస్తరణకు మద్దతు ఇచ్చే దాతృత్వ వేడుక. ఈ కార్యక్రమం సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో స కళ,సేవ శక్తిని ప్రదర్శించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఇలా నొక్కిచెప్పారు. “వైద్య మిషన్‌కు మించి, MESU సానుభూతి ఉద్యమంగా నిలుస్తుంది. ప్రయాణించిన ప్రతి మైలు దృష్టి, ఆశ పునరుద్ధరించబడుతుందనే హామీని అందిస్తుంది. ”అట్లాంటాలోని భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ ముఖ్య అతిథిగా హాజరై SNUSA బృందం, దాతలు, స్వచ్ఛంద సేవకులను ప్రశంసించారు. "నివారించగల అంధత్వాన్ని తొలగించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో SNUSA నా అంచనాలను మించిపోయింది. బాల రెడ్డి ఇందూర్తి నాయకత్వాన్ని నేను అభినందిస్తున్నాను" అని ఆయన అన్నారు. ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్, డాక్టర్ జగదీష్ శేత్, డాక్టర్ కిషోర్ చివుకుల, ఉదయ భాస్కర్ గంటి వంటి బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదారుల బోర్డు సహకారాన్ని కూడా ఆయన గుర్తించారు. సన్మాన కార్యక్రమంలో, గౌరవ భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబును శంకర నేత్రాలయ USA గౌరవ బోర్డు సలహాదారుగా అధ్యక్షులు బాలా రెడ్డి ఇందుర్తి ప్రకటించారు.ఆత్మ వెలుగుతో కలిసిన వేళ: ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి దాతృత్వం, నాయకత్వం మా లక్ష్యాన్ని గణనీయంగా బలోపేతం చేశాయి. 2025 వ్యవస్థాపకుడు సౌత్‌వెస్ట్ అవార్డు ఫైనలిస్ట్ ట్విస్టెడ్ ఎక్స్ గ్లోబల్ బ్రాండ్స్ వెనుక చోదక శక్తిలా ఆవిష్కరణ, స్థిరత్వం, కరుణను కలిగి ఉన్నారు. సత్కార సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దృష్టి అంటే భవిష్యత్తును చూడటం మాత్రమే కాదు—అది దానిని రూపొందిస్తోంది. ఆవిష్కరణ, కరుణ కలిసి పురోగమించాలి. ఈ లక్ష్యాన్ని సాధించడం నాకు గర్వకారణం. ” ఘంటసాల బయోపిక్ “ఘంటసాల ది గ్రేట్” సృష్టికర్త దర్శకుడు సిహెచ్. రామారావు గారు, ఘంటసాలకు అసాధారణ నివాళి అర్పించినందుకు వేదికపై సత్కరించారు. మరుసటి రోజు, ఈ చిత్రాన్ని అట్లాంటాలోని హిందూ దేవాలయం ఆడిటోరియంలో, లార్డ్ బాలాజీ గర్భగుడి క్రింద ప్రదర్శించారు.తపన స్వరాన్ని కలిసిన చోటు: ఈ సాయంత్రం కార్యక్రమం టాలీవుడ్ గాయకులు మల్లికార్జున్, పార్థు నేమాని, సుమంగళిల హృదయపూర్వక సంగీత ఆవాహనతో ప్రారంభమైంది. వారి భక్తి, శాస్త్రీయ ప్రదర్శనలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. దీని తరువాత నటరాజ నాట్యాంజలి కూచిపూడి నృత్య అకాడమీ, అకాడమీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, కర్నాటిక్ స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో, భరతకళా నాట్య అకాడమీ, విపంచి మ్యూజిక్ అకాడమీ వంటి ప్రముఖ అట్లాంటా నృత్య, సంగీత అకాడమీల నుంచి ఉత్సాహభరితమైన ప్రదర్శనలు జరిగాయి. గార్డియన్స్ ఆఫ్ సైట్: $1.625 మిలియన్లను సేకరించడం ద్వారా మన అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ల స్ఫూర్తిని గుర్తించారు. మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది, 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, అనేక మంది కరుణామయ వ్యక్తిగత దాతల నిరంతర మద్దతు ద్వారా దాదాపు $1.625 మిలియన్ల కీలకమైన నిధులను సమీకరించింది. శ్రేయోభిలాషులు, డా. గోవింద విశ్వేశ్వర, డా. వలియా రవి, టి.ఆర్. రెడ్డి, ప్రకాష్ బేడపూడి, కాష్ బూటాని, అరవింద్ కృష్ణస్వామి, డా. వీణా భట్, జలంధర్ రెడ్డి, రఘు సుంకి, తిరుమల్ రెడ్డి కంభం,MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, డాక్టర్. బి. కృష్ణమోహన్, డా. మాధవ్ దర్భా మరియు డా. అపర్ణ, వెంకట్ చుండి, కళ్యాణి, ప్రసన్న కుమార్,దివంగత డాక్టర్ ఉమ, ప్రభాకర్ రెడ్డి ఎరగం, నీలం జయంత్ -లావణ్య, ఆది మొర్రెడ్డి-రేఖ రెడ్డి, డాక్టర్ మంజుల మంగిపూడి, డాక్టర్ రూపేష్ రెడ్డి-మాధవి, వెంకట్ కన్నన్, డాక్టర్ ప్రసాద్ గరిమెళ్ల, అనిల్ జాగర్లమూడి, ప్యాడీ రావు -రాధ ఆత్మూరి, స్వర్ణిమ్ కాంత్, కోదండ బిందు, నారాయణ రేకపల్లి -శైలజ,డాక్టర్ ప్రియా కొర్రపాటి, ప్రతాప్ జక్కా, రాజేష్ తడికమల్ల, డాక్టర్ సుజాత &సూరి గున్నాల, డాక్టర్ శేషకుమారి మూర్తి -డాక్టర్ శ్రీనివాస మూర్తి, శివాని నాగ్‌పాల్, డా. సందీప్ శాండిల్య, డాక్టర్ నీతా సుక్తాంకర్ -విష్ ఈమని, వర ఆకెళ్ల, కృష్ణ-శుభా, శ్రీని SV, జోనాథన్ షులర్, డాక్టర్ రఘువీర్ రెడ్డి, మరియు పురప్రముఖులు రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, జేసీ శేకర్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన $1.625 మిలియన్ల దాతృత్వం సుమారు 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు ఉపయోగపడింది. సేకరించిన నిధుల ద్వారా శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లు (MESUలు) మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, వేలాది మందికి దృష్టిని ప్రసాదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ దాతలు సేవలు అందని ప్రాంతాలలో వందలాది ఉచిత శస్త్రచికిత్సలకు నిధులు సమకూరుస్తున్నారు. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, “ప్రతి అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ ఆశ, కరుణ, అవకాశాన్ని తెస్తాడు, గ్రామాలను దృష్టి ఆశతో ప్రకాశింపజేస్తాడు. శంకర నేత్రాలయ USA తరపున, నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.సృజనాత్మకత కరుణను స్వీకరించే చోట: సాయంత్రం శంకర నేత్రాలయ USA మిషన్‌కు మద్దతునిస్తూ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రాణం పోసిన నృత్య ఉపాధ్యాయులు, గాయకులు, ప్రదర్శనకారులను సత్కరించారు. తెరవెనుక, SNUSA అట్లాంటా బృందం అవిశ్రాంతంగా పనిచేసింది. శంకర నేత్రాలయ కోశాధికారి మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని రెడ్డి వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజశేఖర్ రెడ్డి ఐల, డాక్టర్ మాధురి నంబూరి, ఉపేంద్ర రాచుపల్లి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలం, కమిటీ సమన్వయకర్తలు నీలిమ గడ్డమణుగు, రమేష్ చాపరాల, డా. కిషోర్ రెడ్డి రాసమల్లు, గిరి కోటగిరి, చాప్టర్ లీడ్స్ వెంకట్ కుట్టువా, శిల్పా ఉప్పులూరి, డాక్టర్ జనార్దన్ పన్నెల, బిజుదాస్, రామరాజు గాదిరాజు, కార్యక్రమ వ్యాఖ్యాత వసంత చివుకుల గార్లకు కృతజ్ఞతలు. అమెరికా వివిధ నగరాల నుంచి విచ్చేసిన SNUSA అతిథులు శ్యామ్ అప్పాలి, వంశీ కృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, నారాయణరెడ్డి ఇందుర్తి, డా. శ్వేతా త్రిపాఠి, చంద్ర మౌళి సరస్వతి, శ్రీని గుప్తా, శశాంక్ రెడ్డి ఆరమడక, బుచ్చిరెడ్డి గోలి, తిరుమల్ మునుకుంట్ల, జగదీశ్ జొన్నాడ, వెంకట్రామిరెడ్డి మద్దూరి గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇది సాధ్యం చేసిన హృదయాలకు, చేతులకు నివాళిలాజిస్టిక్స్ నిర్వహణకు కోశాధికారి మూర్తి రేకపల్లికి; వేదిక, అలంకరణలు, ప్రదర్శనకారులను సమన్వయం చేసినందుకు సాంస్కృతిక చైర్ నీలిమా గడ్డమణుగుకు; భోజన ఏర్పాట్లను పర్యవేక్షించిన చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలంకు; హోటల్, రవాణా ఏర్పాట్లను నిర్వహించినందుకు ట్రస్టీ మెహర్ లంకకు ప్రత్యేక ధన్యవాదాలు. టీవీ వీడియోలను రూపొందించిన EVP శ్యామ్ అప్పాలి, ప్రెస్ నోట్స్ సిద్ధం చేసిన డా. రెడ్డి ఊరిమిండి, సోషల్ మీడియా ప్రమోషన్‌ను నిర్వహించిన వంశీ కృష్ణ ఏరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి గార్లకు కృతజ్ఞతలు. అతిథులు ఆచిస్ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆస్వాదించారు. ఈవెంట్ ఫ్లైయర్లను రూపొందించినందుకు చెన్నై బృందం - త్యాగరాజన్, దీన్ దయాళన్ అండ్ సురేష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. (చదవండి: డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం)
క్రైమ్
మరిది.. నీ భార్యకు వేరొకరితో సంబంధం ఉంది!
తమిళనాడు: తన భార్యతో తరచూ ఘర్షణ పడుతుందనే కారణంతో వదిననూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన మరిదిని మప్పేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఇరుళంజేరి గ్రామానికి చెందిన ఇళయరాజ. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన శాంతిమేరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు.కాగా ఇళయరాజ సోదరుడు ఇసైమేగం(29). ఇతడికి పేరంబాక్కం గ్రామానికి చెందిన లావణ్య(24)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం లావణ్య మూడు నెలల గర్బవతి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉంటున్నారు. కాగా శాంతిమేరికి వివాహమై రెండు సంవత్సరాల తరువాత పిల్లలు పుట్టగా, లావణ్యకు వివాహమైన నాలుగు నెలలకే గర్బం దాల్చింది. ఈ విషయమై శాంతిమేరి తరచూ లావణ్యకు వివాహానికి ముందే వేరొకరితో సంబంధం ఉందంటూ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఆదివారం రాత్రి శాంతిమేరికి, లావణ్యకు చిన్నపాటి ఘర్షణ జరగడంతో ఆగ్రహించిన ఇసైమేగం తన భార్యకు అక్రమ సంబందాన్ని అంటగట్టుతున్నారనే ఆగ్రహంతో వదినపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డన శాంతిమేరిని స్థానికులు చికిత్స కోసం తిరువళ్లూరుకు తరలించగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటన ఇరుళంజేరిలో తీవ్ర సంచనలం కలిగింది. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్ణిమా..వాడిని వదిలేయ్!
హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను కడతేర్చింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె.అశోక్ (45) ఓ ప్రైవేట్ కళాశాలలో మేనేజర్‌గా పనిచే స్తున్నాడు. భార్య పూర్ణిమ ప్లేస్కూల్ నిర్వహిస్తోంది. వేరేకాలనీ లో ఉన్నప్పుడు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న పాలేటి మహేశ్ (22)తో పూర్ణిమ కొన్ని సంవత్సరా లనుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో అశోక్ గతంలో భార్య ను మందలించాడు. ఈనెల 10వ తేదీన ఇంటిముందు మహేశ్ కనిపించడంతో పూర్ణిమతో భర్త గొడవ పడ్డాడు. దీంతో ఎలా గైనా అశోక్ అడ్డు తొలగించుకోవాలని మహేశ్, పూర్ణిమ పథకం పన్నారు. 11వ తేదీన సాయంత్రం ముందుగా మహేశ్ తన స్నేహితుడు బూక్యా సాయితో కలిసి అశోక్కోసం ఇంట్లోనే వేచి చూస్తున్నారు. అశోక్ ఇంటికి రాగానే ముగ్గురూ మూకుమ్మడిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. పూర్ణిమ అశోక్ కాళ్లు పట్టుకోగా, ప్రియుడు, మరోవ్యక్తి మెడకు మూడు చున్నీలను బిగించి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అనుమానం రాకుండా మృతుడి ఒంటిపై రక్తపు మరకలున్న దుస్తులను మార్చి, అంబులెన్స్‌లో అశోక్‌ను మల్కాజిగిరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. వాష్‌రూంలో హార్ట్ ఎటాక్ వచ్చి తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పూర్ణిమ బంధువులను నమ్మించింది. ఆసుపత్రి సిబ్బంది మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్యను విచారించగా ప్రియుడు, మరోవ్యక్తి సాయంతో హత్యచేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడు మహేశ్‌తోపాటు సహకరించిన సాయిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సీఐపై కత్తితో యువకుడు దాడి
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివార్లలో కాల్పుల మోత సంచలనం కలిగించింది. రెండు హత్యాయత్నాల కేసుల్లో నిందితున్ని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడి చేయడంతో.. ప్రతిఘటించే క్రమంలో సీఐ తన సర్విస్ రివాల్వర్‌తో కాలి్చన సంచలన ఘటన అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలో జరిగింది. వివరాలు.. అనంతపురం నగరం నాయక్‌నగర్‌కు చెందిన చాకలి రాజా, సొహైల్, అక్రం, అజయ్ స్నేహితులు. వీరు ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో నగరంలోని అరవిందనగర్‌లో అయ్యప్ప కేఫ్ వద్ద మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. ఈక్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అజయ్ తన స్నేహితుడు చాకలి రాజాను కత్తితో కడుపులో బలంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అజయ్ కోసం గాలింపు చేపట్టారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడు అజయ్ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో టీవీ టవర్ సమీపంలోని షికారు కాలనీలో ఉన్నాడనే సమాచారం అందడంతో ఇన్ఫార్మర్ ఆటోడ్రైవర్ బాబాను వెంట బెట్టుకుని టూటౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ రుష్యేంద్రబాబు, సిబ్బంది మఫ్టీలో వెళ్లారు. పోలీసులు రౌండప్ చేయడాన్ని పసిగట్టిన అజయ్.. తన దగ్గరికి వస్తున్న ఆటోడ్రైవరు బాబాను ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. ఆపై వీరంగం సృష్టిస్తూ మహిళలను కత్తితో బెదిరిస్తూ ముళ్లపొదల్లోకి దూరి పారిపోయాడు. చెరుకు తోటలో నక్కి ఉండి.. సీఐపై అటాక్.. వరుసగా దాడులకు పాల్పడుతున్న అజయ్‌ను పట్టుకోవాలని సవాల్‌గా తీసుకున్న పోలీసులకు ఆకుతోటపల్లి సమీపంలోని కందుకూరుకు వెళ్లే దారిలో ఓ చెరుకుతోటలో నిందితుడు దాక్కున్నట్లు సమాచారం రావడంతో చుట్టూ మోహరించారు. చెరుకు తోట ఏపుగా ఉండడంతో సీఐ శ్రీకాంత్ లోపలకు వెళ్లి లొంగిపోవాలని కోరాడు. అయితే సీఐ దగ్గరకు సమీపిస్తుండగా అజయ్ ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో భుజానికి గాయమైంది. మరోమారు దాడి చేసేందుకు రావడాన్ని గమనించిన సీఐ అప్రమత్తమై తన సర్విస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్చాడు.ఒక బుల్లెట్ అజయ్ మోకాలిలో దూరి బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు. మరోవైపు సీఐ శ్రీకాంత్ గాయపడడంతో అక్కడే ఉండగా సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అజయ్ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సీఐ శ్రీకాంత్ పై యువకుడు కత్తితో దాడి చేయడాన్ని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఓ ప్రకటనలో ఖండించారు. అజయ్‌పై హత్యాయత్నం కేసు: ఎస్సీ జగదీష్ సీఐ శ్రీకాంత్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు అజయ్‌పై ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీంచిన ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ నిందితుడిపై గతంలోనూ క్రిమినల్ కేసులున్నాయన్నారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలతో పాటు వారి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు.
రూ. 8.10 కోట్ల మోసం.. తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐజీ
పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అమర్ సింగ్ చాహల్ సోమవారం సెక్యూరిటీ గార్డు రివాల్వర్ ఉపయోగించి తనను తాను కడుపులో కాల్చుకున్నారు. సంఘటనా స్థలం నుండి 12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరుణ్ శర్మ తెలియజేశారు. పంజాబ్‌లోని పాటియాలాలో చాహల్ ఆత్మహత్యాయత్నం విషయం తమ దృష్టికి రాగానే పోలీసు బృందాలు అతని నివాసానికి చేరుకుని, ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ప్రకటించారు. ప్రస్తుతం చాహెల్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.Breaking : Punjab ex-IPS officer Amar Singh Chahal, accused in 2015 Faridkot firing case, critical after alleged 'suicide' attempt pic.twitter.com/7NRdu1hEuh— Gurpreet Garry Walia (@garrywalia_) December 22, 2025సూసైడ్ నోట్ లో ఏముంది?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటనా స్థలం నుండి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు, అందులో చాహల్ ఆర్థిక మోసానికి గురయ్యాడని రాసి ఉంది. ఈ మేరకు చాహల్ పంజాబ్ పోలీస్ డీజీపీ గౌరవ్ యాదవ్‌ను ఉద్దేశించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆ నోట్లో రూ.8.10 కోట్ల విలువైన ఆన్లైన్ మోసం కేసు గురించి ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ మోసం, తీవ్రమైన ఆర్థిక నష్టాలతో ఒత్తిడికి గురైనట్టు సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చాహల్ ఐజీ పదవి నుండి పదవీ విరమణ చేసినప్పటి నుండి పాటియాలాలో నివసిస్తున్నారు.కోట్కాపుర కాల్పుల కేసులో నిందితుడుకాగా 2015లో ఫరీద్‌కోట్‌లో జరిగిన బెహ్బాల్ కలాన్ ,కోట్కాపుర కాల్పుల కేసు నిందితుల్లో అమర్ సింగ్ చాహల్ కూడా ఒకరు. 2023, ఫిబ్రవరిలో, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్.కె. యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అమర్ సింగ్ చాహల్‌తో సహా పలువురు సీనియర్ పంజాబ్ అధికారులపై ఫరీద్కోట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.కాగా గతంలో కూడా సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని సీనియర్ పోలీసు అధికారి వై. పురాన్ కుమార్ చండీగఢ్‌లోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు డీజీపీ, ఏడీజీసీ ఎస్పీతో సహా 10 మంది అధికారులను నిందిస్తూ ఆయన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాసిన సంగతి తెలిసిందే.
వీడియోలు
మోడీతో బిగ్ థ్రెట్.. మళ్ళీ జైలుకు చంద్రబాబు..!కారుమూరి షాకింగ్ నిజాలు
విజయ్ కారును అడ్డుకున్న TVK మహిళా నేత
రౌడీ షీటర్ పండుకు స్పెషల్ ట్రీట్ మెంట్
తగలబడుతున్న బంగ్లాదేశ్.. హిందువుల ఇంటికి నిప్పు
నువ్వు బొట్టు, మెట్టెలు పెట్టుకొని తిరుగు! శివాజీకి చిన్మయి కౌంటర్
17 రోజుల్లోనే కాంతార-2 రికార్డు బద్దలు.. ధురంధర్ కలెక్షన్స్ సంచలనం!
వీధి కుక్క దాడి.. ఐదుగురికి గాయాలు
No స్కామ్.. No కేస్.. స్కిల్ స్కామ్ కేస్ కొట్టేయించే పనిలో చంద్రబాబు
ఢిల్లీలో హై టెన్షన్.. బంగ్లాకు హిందూ సంఘాల వార్నింగ్
నా తల్లి చావుకి కారణం వాడే.. ఇదిగో వీడియో ప్రూఫ్.. TDP నేతపై సంచలన కామెంట్స్

