మరింత తక్కువకు బంగారం.. కొనేవారిదే భాగ్యం!
దేశంలో బంగారం ధరల (Today Gold Rate) తగ్గుదల కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. దీంతో పెళ్లిళ్ల సీజన్లో కొనుగోలుదారులకు ఉపశమనం కలుగుతోంది. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఇజ్రాయెల్‌లోని అణు కేంద్రంపై దాడి చేస్తాం: ఇరాన్ సంచలనం
టెహ్రాన్: ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రంపై దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఉంచేందుకు టెహ్రాన్ గ్రాండ్ మోసల్లాలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఇరాన్ ప్రభుత్వ మీడియా పలు వివరాలు తెలిపింది.సుప్రీం లీడర్‌కు తుది వీడ్కోలు తెలపడంలో భాగంగా 3 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది సంతాపం తెలిపేందుకు మోసల్లా వద్దకు చేరుకునే అవకాశం ఉంది. సుప్రీం లీడర్ మరణం తర్వాత సాధారణంగా “వీడ్కోలు కార్యక్రమం”, ఆ తర్వాత “అంతిమ యాత్ర” నిర్వహించడం అక్కడి ఆచారం.ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూల్చే ప్రయత్నం జరిగితే ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని గురువారం ఇరాన్ హెచ్చరించింది.ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ వస్తే అతడిని కూడా టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిమోనా అణు కేంద్రాన్ని టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ హెచ్చరించడం గమనార్హం. ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలు, జెరూసలేం పరిసరాలు, పశ్చిమ తీర ప్రాంతం భాగాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఆపరేషన్ ప్రారంభించామని ఇరాన్ పేర్కొంది.అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన 7కు పైగా ఆధునిక రాడార్ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఈ దాడులతో ఆ దేశాల నిఘా వ్యవస్థలు పనిచేయకుండా చేశామని పేర్కొంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థను ఛేదించి మరీ దూసుకెళ్లి పలుచోట్ల తాకినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ భవనాల సముదాయం, బెన్ గురియన్ విమానాశ్రయం కూడా లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపింది.ఈ థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థ అమెరికాకు చెందింది. గగనతలంలో శత్రుదేశాల క్షిపణులను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఇది. వాటిని దాటుకుని మరీ తమ క్షిపణులు దూసుకెళ్లాయని ఇరాన్ అంటోంది. ఐఆర్జీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ కొనసాగిస్తున్న క్షిపణి-డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్లోఏని అనేక ప్రాంతాల్లో గంటల తరబడి సైరన్లు మోగాయి. ప్రజలు చాలాసేపు సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
నార్కో గ్యాంగ్‌లకు ట్రంప్ వార్నింగ్: ఈక్వెడార్‌లో వేట షురూ!
వాషింగ్టన్: దక్షిణ అమెరికాలో వేళ్లూనుకున్న మాదకద్రవ్యాల ముఠాలు, ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈక్వెడార్ ప్రభుత్వంతో చేతులు కలిపి ఆ దేశ భూభాగంపై 'నార్కో-టెర్రరిస్టుల'ను ఏరివేసేందుకు అమెరికా సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాలను ప్రారంభించింది. మార్చి 3వ తేదీన ఉమ్మడి బలగాలు ఈ ఆపరేషన్‌ను మొదలుపెట్టినట్లు అమెరికా సదరన్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది.లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో విస్తరిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హింసను అరికట్టేందుకు భాగస్వామ్య దేశాల నిబద్ధతకు ఈ చర్య ఒక నిదర్శనమని సదరన్ కమాండ్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ డోనోవన్ అన్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి హెలికాప్టర్లు గగనతలానికి ఎగురుతున్న దృశ్యాలను, నిఘా నీడలో ఉన్న ఉగ్రవాద స్థావరాల వీడియోలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది.రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి డ్రగ్ కార్టెల్స్‌ను 'విదేశీ ఉగ్రవాద సంస్థలు'గా పరిగణిస్తున్న ట్రంప్ యంత్రాంగం, ప్రస్తుతం తన సైనిక వ్యూహానికి మరింత పదును పెట్టింది. తాజా ఆపరేషన్‌లో భాగంగా అమెరికా దళాలు నేరుగా యుద్ధరంగంలోకి దిగకుండా, ఈక్వెడార్ సైన్యానికి అవసరమైన నిఘా సమాచారాన్ని, అత్యాధునిక లాజిస్టిక్స్ సదుపాయాలను అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముఠాలపై రాజీలేని పోరాటం చేస్తామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఉద్ఘాటించారు. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం డ్రగ్ ట్రాఫికింగ్ అనేది నేరమే తప్ప యుద్ధం కాదని, అమెరికా చేపడుతున్న వైమానిక దాడులు చట్టవిరుద్ధమైన హత్యల కిందకు వస్తాయని కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరేబియన్, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో జరిగిన 44 వైమానిక దాడుల్లో సుమారు 150 మంది మరణించగా, వారిలో కొందరు సాధారణ కార్మికులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.2020 కరోనా మహమ్మారి తర్వాత ఈక్వెడార్‌లో నేరాల రేటు గణనీయంగా పెరగడం, నిరుద్యోగం, భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ దేశం డ్రగ్ రవాణాకు అడ్డాగా మారడంతో నోబోవా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మార్చి 1 నుండి కొలంబియా దిగుమతులపై 50 శాతం టారిఫ్ విధిస్తూ ఈక్వెడార్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో వెనిజులా భూభాగంపై దాడులు చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న తరహాలోనే, ఇప్పుడు ఈక్వెడార్ వేదికగా డ్రగ్ మాఫియాపై మరో యుద్ధాన్ని అమెరికా ప్రకటించింది. అక్రమ గనుల తవ్వకం, డ్రగ్స్ మాఫియాను తుదముట్టించేందుకు ఇది ఒక ప్రయత్నమని ఈక్వెడార్ అధ్యక్షుడు తెలిపారు.
ఒకప్పుడు క్లాస్ టాపర్..కానీ ఇవాళ..!
జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మెరుగైన స్టూడెంట్ గొప్ప ఉద్యోగంలో ఉంటాడని, యావరేజ్ స్టూడెంట్ ఏ ఉద్యోగం లేకుండా ఉంటాడని అనుకుంటాం. కానీ విధి చాలా పక్కా స్క్రిప్ట్‌తో మన అంచనాలను తలకిందులు చేస్తూ మన రాతన నిర్దేశిస్తుంది. అందుకు ఈ మిత్రులు కథే ఓ ఉదాహరణ. ఇప్పుడు ఆ ఇద్దరు మిత్రులు మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్‌గా మారి..నెటిజన్లను ఆలోచింపచేసేలా చేసింది. ఈ మిత్రుల సంభాషణను భారత్ మాతా కే సేవక్ సోష్ల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేసింది. ఉమర్ అనే వ్యక్తి రైడ్‌ని బుక్ చేసుకున్నాడు. అయితే ఆ రైడర్ పేరు ఎందుకనో ఆసక్తిగా అనిపించిది. ఆ రైడర్ పేరు చందన్‌గా మొబైల్లో కనిపించడంతో ఒకప్పటి తన క్లాస్మేట్ చందన్నే. ఆ..! క్లాస్ టాపర్ కదా వీడేనా వాడు అని ఆలోచిస్తూ ఉండగానే..బుక్‌చేసుకున్న రైడర్ రానే వచ్చాడు. అతడు ఊహించనట్లుగానే ఆ రైడర్ తన క్లాస్మేట్ కావడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతడిని కలిసిన ఆనందంతో ఎప్పటి నుంచి రైడర్‌గా పనిచేస్తున్నావ్ రా అని అడుగుతాడు. వెంటనే సదరు రైడర్ చందన్ ముందు ఓటీపీ చెప్పరా అని సమాధానమిస్తాడు. ఆ తర్వాత చందన్ మాట్లాడుతూ..జీవితం ఎప్పుడూ ఓ ప్లాన్ ప్రకారం జరిగిపోదురా. అయిన పర్లేదు మిత్రమా..! నువ్వు నాగురించి ఏం బాధపడొద్దు. అయినా నువ్వు నా ఫ్రెండ్‌వి. నేను నీకు ఎలాంటి ఛార్జ్ చేయను అని అంటాడు. అప్పుడు ఉమర్ నువ్వు మన క్లాస్ టాపర్‌వి కదరా ఇలా..అంటూ ఆగిపోగా..చందన్ నవ్వుతూ..జీవితం చాలా విచిత్రమైనది..అయినా నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. నువ్వే నా కస్టమర్వి అవుతావని అని నవ్వుతూ అంటాడు. ఆ తర్వాత రా కూర్చో..నేను నిన్ను సురక్షితంగా డ్రాప్ చేస్తాను అని బదులిస్తాడు. ఆ పోస్ట్ చాలా ఆలోచనాత్మక సందేశాన్ని ఇచ్చింది. మార్కులు, డిగ్రీలు లేదా టాపర్‌గా ఉండటం అనేవి మన భవిష్యత్తుని నిర్ణయించవు. అలాగే నిజాయితీగా పనిచేస్తే ఏ ఉద్యోగం చిన్నది కాదు. ముందు మనల్ని మనం చిన్నబుచ్చుకోకుండా గౌరవప్రదంగా భావిస్తే.. ప్రతి ఉద్యోగానికి ఓ గౌరవం ఉంటుంది అనే విషయాన్ని నొక్కిచెప్పింది అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం క్లాస్ టాపర్ ఇలా రాపిడో రైడర్‌గా మారడం ఓకింత బాధను కలిగించింది అని పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by The Siasat Daily (@siasatdaily) (చదవండి: శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్‌గా పనికి వచ్చేయాలి..)
మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కదా!
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మరో మహిళ మృతి
స్కానింగ్ సెంటర్లోనే ప్రసవం!.. గంగరాజుపై పోక్సో కేసు
పగిలిన ఇటుకలు.. వలస గుండె చప్పుళ్లు!
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
తనూజ బర్త్‌డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
ప్రొద్దుటూరులో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశ్వీరాదం
స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!
యుద్ధం ఎఫెక్ట్.. ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్‌పై దెబ్బ!
పశ్చిమాసియాలో యుద్ధం.. ‘బ్లడ్ చిట్’ చూశారా? అంటే ఏంటంటే?
ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’
బోయపాటి శ్రీను కొత్త సినిమా.. స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్
ఎన్నో యుద్ధాలు ఆపానని అన్నారు.. ఇది కూడా ఆపండి సార్!
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే
బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
ఇప్పుడే పెళ్లొద్దమ్మా.. నేను ఇంకా చదువుకుంటా
అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!
దుబాయ్ దాటని బంగారం..
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు
పాక్ ప్రపంచకప్ హీరోకు ఘోర అవమానం
యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
బ్లాక్‌బస్టర్ 'గీత గోవిందం'ను మిస్ చేసుకున్నా: హీరోయిన్
టీ20 ప్రపంచకప్‌పై యుద్ద ప్రభావం
బాబర్ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు
ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!
మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కదా!
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మరో మహిళ మృతి
స్కానింగ్ సెంటర్లోనే ప్రసవం!.. గంగరాజుపై పోక్సో కేసు
పగిలిన ఇటుకలు.. వలస గుండె చప్పుళ్లు!
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
తనూజ బర్త్‌డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
ప్రొద్దుటూరులో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశ్వీరాదం
స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!
యుద్ధం ఎఫెక్ట్.. ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్‌పై దెబ్బ!
పశ్చిమాసియాలో యుద్ధం.. ‘బ్లడ్ చిట్’ చూశారా? అంటే ఏంటంటే?
ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’
బోయపాటి శ్రీను కొత్త సినిమా.. స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్
ఎన్నో యుద్ధాలు ఆపానని అన్నారు.. ఇది కూడా ఆపండి సార్!
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే
బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
ఇప్పుడే పెళ్లొద్దమ్మా.. నేను ఇంకా చదువుకుంటా
అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!
దుబాయ్ దాటని బంగారం..
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు
పాక్ ప్రపంచకప్ హీరోకు ఘోర అవమానం
యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
బ్లాక్‌బస్టర్ 'గీత గోవిందం'ను మిస్ చేసుకున్నా: హీరోయిన్
టీ20 ప్రపంచకప్‌పై యుద్ద ప్రభావం
బాబర్ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు
ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!
ఫొటోలు
భద్రాచలం : రామయ్య పెళ్లి పసుపు దంచి.. తలంబ్రాలు కలిపి పెళ్లి పనులు ప్రారంభం (ఫొటోలు)
విశాఖలో వైఎస్ జగన్.. పోటెత్తిన అంతులేని అభిమానం (ఫొటోలు)
విరోష్ జంట రిసెప్షన్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
#Virosh Reception: ఘనంగా విజయ్- రష్మిక రిసెప్షన్ (ఫోటోలు)
'పీలింగ్స్..' పాటకు స్టెప్పులేసిన అనసూయ (ఫోటోలు)
హైదరాబాద్ లో ఘనంగా హోలీ సంబరాలు (ఫొటోలు)
అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)
వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
ఆకుపచ్చ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియమణి (ఫొటోలు)
సినిమా
చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్
బండ్ల గణేశ్ మొదట నటుడిగానే అందరికీ పరిచయం. ఆ తర్వాత ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారాడు. తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి పలు చిత్రాలు నిర్మించాడు. దాదాపు దశాబ్దకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. బీజీ బ్లాక్‌బస్టర్స్ పేరుతో రెండో నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.అంత టైం లేదుతాజాగా ఈయన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రయూనిట్‌తో ప్రత్యేకంగా సంభాషించాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్ చేసే సమయం లేదు. నాదగ్గర వెయ్యి మంది పని చేస్తున్నారు. నేను షూటింగ్స్‌కు వెళ్లి యాక్టింగ్ చేసుకుంటూ కూర్చుంటే నా వ్యాపారం దెబ్బతింటుంది. చిరంజీవి సినిమాలో..కాకపోతే నా మనసుకు నచ్చి ఈ వేషం నేను వేయాల్సిందే అనిపించిన రోల్స్ మాత్రం స్వీకరిస్తాను. ఇప్పుడు చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. నాకు ఓ వేషం వేయాలని కోరిక ఉంది. అది నా బ్యానర్లోనే నిర్మించి ఆ రోల్ నేనే చేస్తాను, కచ్చితంగా సూపర్ హిట్ కొడతాను అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. కాగా చిరంజీవి- బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనే బండ్ల గణేశ్ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్
'రైరై రారా' పాట రాసేందుకు 2 నెలలు: అనంత శ్రీరామ్
ఒక మంచి పాట రాయడం, మాస్ పాట రాయడం అనేది కష్టం కాదు. కానీ, పెద్ది సినిమా కోసం రై రై రా రారా.. పాటలో మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం అనేది కత్తిమీద సాములా అనిపించింది. రెహమాన్ గారి బాణీ అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను. ఈ పాట రాయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది అని పాటల రచయిత అనంత శ్రీరామ్ తెలిపారు.పెద్ది సెకండ్ సాంగ్రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి రై రై రారా.. అంటూ సాగే రెండో పాటను మార్చి 2న విడుదల చేశారు.అదే జరిగితే..ఈ పాట రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాప్ వన్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. రామ్‌చరణ్‌గారి రుద్రతాండవం, రెహమాన్ గారి ధీర శంఖారావం, రత్నవేలుగారి చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.. వీటన్నిటి మధ్యలో నుంచి కూడా రై రై రారా.. పాటలోని లిరిక్స్ బాగున్నాయి అనడం.. సాహిత్యానికి ప్రశంసలు రావడం ఆనందాన్నిచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్లు ఆ ఆలోచన విరమించుకునేలా నా పాట స్ఫూర్తి నింపితే నా రచన సార్థకమైనట్లే అని చెబుతుంటాను. ఆ లక్షణం ఈ పాటకు ఉంది అని చెప్పాడు.
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నటుడు విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎడాపెడా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్లో శింబు హీరోగా నటిస్తున్న అరసన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్న ఈయన తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.బాలీవుడ్ బ్యూటీవిడాముయుర్చి ఫేమ్ మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు భోగట్టా! ఇకపోతే ఇందులో విజయ్ సేతుపతికి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌కుగానీ ఆమె ఒప్పుకుంటే కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో షురూ అయినట్లే! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!
బ్లాక్‌బస్టర్ 'గీత గోవిందం'ను మిస్ చేసుకున్నా: హీరోయిన్
ఎనిమిదేళ్ల క్రితం రష్మిక మెడలో తాళి కడుతుంటే విజయ్‌కు చేతులు వణికాయి. కానీ ఇప్పుడు భయం, బెరుకు ఏదీ లేదు.. మనసంతా గాల్లో తేలుతోంది. చుట్టూ ఉన్న వాతావరణమంతా ప్రేమమయంగా మారింది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన గీతగోవిందం సినిమాలో విజయ్- రష్మిక రీల్ మ్యారేజ్ చేసుకున్నారు. సినిమాలో ఆ సీన్ చూసి సగటు ప్రేక్షకుడు మురిసిపోయాడు.ఆ సినిమాతో పునాదిఇప్పుడూ అంతే.. రియల్ లైఫ్‌లో విజయ్- రష్మిక ఒక్కటైనందుకు ప్రేక్షకలోకం సంతోషంగా శుభాకాంక్షలు చెప్తోంది. కలకాలం కలిసి జీవించమని దీవిస్తోంది. వీరి ప్రయాణానికి పునాది పడింది గీత గోవిందం సినిమాతోనే! పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సినిమా అయిపోయే సరికి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. డియర్ కామ్రేడ్ మూవీ చేస్తున్న టైంలోనే స్నేహం ప్రేమగా మారగా.. ఫస్ట్ రష్మికనే లవ్ ప్రపోజ్ చేసింది. గీత గోవిందం ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదుఅలా ఈ ఏడడుగల బంధానికి తొలి అడుగు పడింది. అయితే గీత గోవిందం సినిమా ఆఫర్ రష్మిక కంటే ముందు చాలామంది హీరోయిన్స్‌కు వెళ్లిందట! వారిలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య ఒకరు. ఈమె ఇటీవలే సీతా పయనం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ దీనికంటే ముందు తనకు తెలుగులో గీత గోవిందం ఆఫర్ వచ్చిందని తెలిపింది. నేను చేయని ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి.సినిమాతెలుగులో 'గీత గోవిందం' కథ విన్నాను. కానీ, ఎందుకో అది కుదర్లేదు. ఇది చాలామంది హీరోయిన్ల దగ్గరకు వెళ్లిందని తెలిసింది. ఏదేమైనా చివరకు సినిమా అద్భుతంగా వచ్చింది అని పేర్కొంది. ఐశ్వర్య.. గీత గోవిందం పోగొట్టుకున్నప్పటికీ సీతా పయనం మూవీతో మంచి డెబ్యూ అందుకుంది. అటు రష్మికకు.. గీత గోవిందం కెరీర్ పరంగా, వ్యక్తిగతంగానూ బాగా కలిసొచ్చింది.చదవండి: కొత్త కోడలు వచ్చింది.. బాగా చూసుకోండి: విజయ్ దేవరకొండ
క్రీడలు
T20 WC 2026: సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్‌లో షాకింగ్ సన్నివేశం
సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య నిన్న (మార్చి 4) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో షాకింగ్ సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ తొలి బంతిలో కగిసో రబాడా వేసిన అద్భుత బంతికి టిమ్ సీఫర్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆశ్చర్యకరంగా, ఓ బెయిల్ ఎగిరి ఏకంగా బౌండరీ రోప్‌పై పడింది. దీంతో ఆటగాళ్లు, అభిమానులు, వ్యాఖ్యాతలు అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా జరిగాయి.pic.twitter.com/ZjIVl2UxEz— crictalk (@crictalk7) March 4, 2026మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో (33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్) కివీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ ఇదే తొలి సెంచరీ. ఈ సెంచరీతో అల్లెన్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 77 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ (29) కాసేపు సహకరించాడు. అంతకుముందు డెవాల్డ్ బ్రెవిస్ (34) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. వీరు మినహా సౌతాఫ్రికా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. మార్క్రమ్ 18, డికాక్ 10, మిల్ర్ 6, బాష్ 2, రికెల్టన్, రబాడ డకౌటయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను రచిన్ (4-0-29-2), మ్యాట్ హెన్రీ (4-0-34-2), కోల్ మెక్‌కోంచి (1-0-9-2), ఫెర్గూసన్ (4-0-29-1), మిచెల్ సాంట్నర్ (4-0-25-0) దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టిమ్ సీఫర్డ్ (58), ఫిన్ అల్లెన్ (100 నాటౌట్) 9 ఓవర్లలో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. సీఫర్ట్ ఔటయ్యాక మరింత రెచ్చిపోయిన అల్లెన్ కేవలం బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. అతనికి రచిన్ (13 నాటౌట్) సహకరించాడు.2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్‌కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది.
మొయిన్ అలీపై నిషేధం..!
ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ 2026 హండ్రెడ్ లీగ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకారం, ఏ ఫ్రాంచైజీ మొయిన్‌ను నామినేట్ చేయలేదు. దీంతో అతని పేరు వేలం జాబితాలో చేరలేదు. నాలుగు సీజన్ల పాటు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్కు నాయకత్వం వహించిన మొయిన్‌కు ఈ అవమానం జరగడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మొదటిది.. అతను పాక్ ఆటగాళ్లకు మద్దతు తెలపడం. ఈసారి హండ్రెడ్ లీగ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లపై షాడో బ్యాన్ ఉంది. ఈ లీగ్‌లో మెజార్టీ ఫ్రాంచైజీలను భారతీయులు, ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు చేజిక్కించుకోవడంతో పాక్ ఆటగాళ్లను తీసుకోకూడదని అనధికారిక నిర్ణయం జరిగింది. ఇలా జరగడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్తో పాటు మొయిన్ అలీ కూడా వ్యతిరేకించాడు. ECB వివక్షకు వ్యతిరేకంగా కట్టుబడి ఉందని నమ్ముతున్నంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే దక్షిణాఫ్రికాలో జరిగిన జాతి వివక్షను ఉదాహరించి, ఇప్పుడు అదే విధమైన వివక్ష పాకిస్తాన్ ఆటగాళ్లపై జరుగుతోందని వ్యాఖ్యానించాడు. పాక్ ఆటగాళ్లకు మద్దతుగా మొయిన్ చేసిన ఈ వ్యాఖ్యలే అతన్ని ఏ హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీ నామినేట్ చేయకపోవడానికి కారణంగా తెలుస్తుంది.మరిన్ని కారణాలు..గత నిర్ణయాలు: గత సీజన్లో మొయిన్ CPL కోసం హండ్రెడ్ లీగ్‌ను మధ్యలోనే వదిలేశాడు. ఈ చర్య లీగ్ పట్ల అతని కమిట్మెంట్ను ప్రశ్నార్థకంగా మార్చింది. అందుకే ఏ ఫ్రాంచైజీ అతన్ని నామినేట్ చేయలేదు. వేలం ధర: మొయిన్ బేస్ ప్రైస్ £75,000 ఉండటం ఫ్రాంచైజీలను వెనక్కి తగ్గేలా చేసింది. వయసు: సీజన్ ప్రారంభ సమయానికి అతని వయసు 39 ఏళ్లు అవుతుంది. నిలకడలేమి: మొయిన్‌ను ఈ సీజన్లో హండ్రెడ్ ఫ్రాంచైజీలు చిన్నచూపు చూడటానికి మరో కారణం అతని నిలకడలేమి. మొయిన్ కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఇతర లీగ్‌లలో ఆడేందుకు NOCలు పొందాడు. అయితే, ఇటీవల అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని యార్క్‌షైర్ తరఫున T20 బ్లాస్ట్‌లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ నిలకడలేమే అతనికి మరో మైనస్‌గా మారింది.తలుపులు మూసుకుపోలేదు మొయిన్‌కు హండ్రెడ్ లీగ్ 2026 తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు. జూన్‌లో జరిగే వైల్డ్ కార్డ్ సైనింగ్స్ ద్వారా అవకాశం లభించవచ్చు. ప్రతి ఫ్రాంచైజీ T20 బ్లాస్ట్ ప్రదర్శన ఆధారంగా £31,000 కాంట్రాక్ట్‌తో ఇద్దరు ఆటగాళ్లను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంపిక చేసుకుంటుంది. యార్క్‌షైర్ తరఫున మంచి ప్రదర్శన చేస్తే మొయిన్ మళ్లీ హండ్రెడ్ లీగ్‌లో కనిపించే అవకాశం ఉంది.
33 బంతుల్లో శతకం.. రికార్డుల మోత మోగించిన కివీస్ యోధుడు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (మార్చి 4) జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి, ఫైనల్‌కు చేరింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో కివీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అల్లెన్ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన సెంచరీ చేసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సెంచరీతో అల్లెన్ రికార్డుల మోత మోగించాడు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఓ ఫుల్ మెంబర్ జట్టుపై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్‌గా (ఫుల్ మెంబర్లు, సభ్య దేశాలు) టీ20ల్లో ఇది మూడో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్‌గా ఓ ఫుల్ మెంబర్ జట్టు తరఫున సికందర్ రజాతో (గాంబియాపై 33 బంతుల్లో శతకం) పాటు జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల చరిత్రలో తొలి శతకం.టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ.టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో బ్రెండన్ మెక్కల్లమ్తో (11 ఫోర్లు, 7 సిక్సర్లు) కలిసి ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీ కౌంట్ (10 ఫోర్లు, 8 సిక్సర్లు). ఓ టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు-20.టీ20 వరల్డ్‌కప్ సెమీస్ లేదా ఫైనల్స్‌లో కనీసం 30 బంతులు ఆడిన కోటాలో విరాట్ కోహ్లితో పాటు అతి తక్కువ డాట్ బాల్స్ (3). టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున మూడో శతకం (మెక్కల్లమ్, ఫిలిప్).ఈ ఇన్నింగ్స్‌తో అల్లెన్ మరిన్ని చిన్నా చితకా రికార్డులను కూడా బ్రేక్ చేసి న్యూజిలాండ్‌ను ప్రపంచకప్ కల సాకారం చేసే దిశగా తీసుకెళ్లాడు. 2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్‌కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది.
భారత్ ఫైనల్ గురి
3-2 టి20 వరల్డ్ కప్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 3 గెలిచి, 2 ఓడింది. గత టి20 ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సందర్భంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించే ముందంజ వేసింది. అంతకుముందు 2022 సెమీఫైనల్లో భారత్‌పై విజయం సాధించిన ఇంగ్లండ్ ఆపై టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి టైటిల్ పోరుకు ముందు ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీస్ సమరంలోనే ముఖాముఖికి సిద్ధమయ్యాయి. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రెండు జట్లూ కూడా ‘లోపాలు లేని అత్యుత్తమ ఆటతీరు’ను కనబర్చలేకపోయాయి. ఇంగ్లండ్ ప్రస్థానం తడబడుతూనే సాగగా... భారత్ కూడా తమపై ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు మిగిలిన రెండు మ్యాచ్‌లు ఎలా గెలవడం అనేదే ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్ సొంతగడ్డపై సత్తా చాటుతుందా లేక ఇంగ్లండ్ అనూహ్య ఫలితాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: టి20 వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్ సమరానికి సిద్ధమైంది. నేడు వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లండ్ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లండ్ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్‌కు చేరింది. టి20 వరల్డ్ కప్‌ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు నేటి పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి. మార్పుల్లేకుండా... పిచ్, వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్–11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పైనే అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించాడు. నాటి మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్స్‌లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు. ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్ భావిస్తున్నాడు. విండీస్‌పై గత మ్యాచ్‌లో తడబడినా ఈసారి చెలరేగితే తిరుగుండదు. మరో ఓపెనర్ సంజు సామ్సన్ ఒక్క ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాన్, సూర్య, తిలక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు చివర్లో వేగంగా అందించే పరుగులు దీనికి అదనం. ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్‌లాంటి ఆటగాడు ఉండటం టీమిండియా బలం. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ ఎప్పటిలాగే ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగితే మన జట్టు పని మరింత సులువవుతుంది. అక్షర్‌తో పాటు వైవిధ్యమైన బౌలింగ్ ఉన్న వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు కత్తి మీద సామే. ఇంగ్లండ్‌పై ఘనమైన రికార్డు ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనే భావిస్తున్నా... ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి. బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్, అక్షర్, ఇషాన్ కీలకం విల్ జాక్స్... ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టమ్మీద నేపాల్‌పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్ చేతిలో ఓడింది. ‘సూపర్ ఎయిట్స్’లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై చచ్చీ చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటకు చిరునామాగా నిలిచిన టీమ్ ఇప్పుడు అతి కష్టమ్మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్ ఓపెనింగ్ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్ సాల్ట్ 7 మ్యాచ్‌లలో కలిపి 84 పరుగులే జోడించగలిగారు. ఏ మ్యాచ్‌లోనూ గరిష్టంగా నాలుగు ఓవర్లకు మించి వీరి భాగస్వామ్యం సాగలేదు. అయినా సరే మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి జట్టు వీరినే నమ్ముకుంటోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన బట్లర్ 7 మ్యాచ్‌లలో కలిపి చేసింది 62 పరుగులే! అయినా సరే, అతని స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా రావాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. బెతెల్, బాంటన్‌లను నమ్మే స్థితి లేకపోవడంతో కెప్టెన్ బ్రూక్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటం అవసరం. ఆల్‌రౌండర్‌గా స్యామ్ కరన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా....ఈ టోర్నీలో నాలుగు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు నెగ్గిన విల్ జాక్స్ కీలకం కానున్నాడు. ఆర్చర్‌తో పాటు రెండో పేసర్‌గా ఒవర్టన్‌పై భారం ఉంది. పిచ్ కొంత అనుకూలిస్తే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆదిల్ రషీద్, డాసన్ కూడా ప్రభావం చూపగలరని జట్టు నమ్ముతోంది. పిచ్, వాతావరణం వాంఖెడే పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్‌ను భారత్ ఇక్కడ ఆడగా... ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లు ఆడింది. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా...రిజర్వ్ డే ఉంది. 17-12 భారత్, ఇంగ్లండ్ మధ్య 29 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 17 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. ఇంగ్లండ్: బ్రూక్ (కెప్టెన్ ), సాల్ట్, బట్లర్, బెతెల్, బాంటన్, కరన్, ఒవర్టన్, జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్.
న్యూస్ పాడ్‌కాస్ట్
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్‌కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
భగ్గుమన్న పశ్చిమాసియా... ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు... భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు క్లీన్చిట్... కవిత, సిసోడియా సహా 23 మందీ నిర్దోషులే... ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
తిరుమల లడ్డూ ప్రసాదం, రాయలసీమ లిఫ్ట్‌పై ఏపీ శాసన మండలిలో చర్చించకుండా పలాయనం చిత్తగంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం... చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల హెచ్చరిక
బిజినెస్
స్టాక్ మార్కెట్ సూచీల దారెటు?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 24,596 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 375 పాయింట్లు పుంజుకొని 79,502 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
దలాల్ స్ట్రీట్‌లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి?
పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ మేఘాల సెగ భారత స్టాక్ మార్కెట్లను చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుండగా ఇటీవల దేశీయ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. నిన్న ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8.75 లక్షల కోట్లు ఆవిరైపోయింది.బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు (1.40%) నష్టపోయి 79,116.19 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది 1,795 పాయింట్ల వరకు పడిపోవడం గమనార్హం. నిఫ్టీ 385.20 పాయింట్లు (1.55%) కోల్పోయి 24,480.50 వద్ద ముగిసింది. రంగాల వారీగా ఎనర్జీ సెక్టార్‌కు చెందిన షేర్లు అత్యధికంగా 14.90% పతనమయ్యాయి. రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు కూడా 3% పైగా నష్టపోయాయి.మార్కెట్లు ఎందుకు కుప్పకూలాయి?ముడి చమురు సెగ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడటం మార్కెట్లను భయపెట్టింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 82 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి, కరెంట్ అకౌంట్ లోటు పెరిగే ప్రమాదం ఉంది.రూపాయి రికార్డు పతనం: అంతర్జాతీయ అనిశ్చితి వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి (92.17) పడిపోయింది. ఇది దిగుమతులపై భారాన్ని పెంచుతోంది.ఎఫ్ఐఐల అమ్మకాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత మూడు సెషన్లలోనే దాదాపు రూ.14,400 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.ఆసియా మార్కెట్ల ప్రభావం: జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి వంటి ఇతర ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉండటం దేశీయ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుఇలాంటి సంక్షోభ సమయాల్లో భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భయం వద్దు.. మార్కెట్లు పడిపోగానే కంగారుపడి క్వాలిటీ షేర్లను విక్రయించకూడదు. యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తాత్కాలికమే. చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి పతనం తర్వాత మార్కెట్లు మరింత బలంగా పుంజుకున్నాయి.సిప్ కొనసాగిచాలి: మార్కెట్ కనిష్టాల్లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీనివల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం చేకూరుతుంది.నగదు నిల్వలు: పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుకోవడం మంచిది. మంచి షేర్లు తక్కువ ధరలో లభించినప్పుడు కొనుగోలు చేయడానికి ఇది మీకు ఒక అవకాశం ఇస్తుంది.స్టాప్ లాస్ తప్పనిసరి: ట్రేడర్లు ట్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా స్టాప్ లాస్ పాటించాలి. మార్కెట్ సూచీల ఊగిసలాట ఎక్కువగా ఉన్నప్పుడు అధిక లివరేజ్ తీసుకోవడం రిస్క్‌తో కూడుకున్న పని.ప్రపంచ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే చమురు ధరలు 100 డాలర్లకు చేరే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పునసమీక్షించుకోవాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా వేచి చూసే ధోరణి అవలంబించడం ఉత్తమం.ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!
92 దాటేసిన రూపాయి!
ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలకు రెక్కలు రావడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్ మారకంలో 56 పైసలు క్షీణించి జీవితకాల కనిష్ట స్థాయి 92.05 వద్ద స్థిరపడింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘రిస్క్ –ఆఫ్’ పరిస్థితులు నెలకొనడంతో స్టాక్స్, బాండ్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలు బంగారం, వెండి ధరల్లో అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో డాలర్లకు డిమాండ్ పెరగడంతో డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని సులభంగా ఛేదించింది.మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆందోళనలతో బ్రెంట్ క్రూడాయిల్ ధర సైతం 1.29% పెరిగి 82.46 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు భయాలు తలెత్తాయి. ఈ పరిణామాలు రూపాయి కరిగిపోయేందుకు కారణమయ్యాయి’’ అని నిపుణులు తెలిపారు. ఒక దశలో ఏకంగా 86 పైసలు కరిగిపోయి 92.35 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది.2 రోజుల్లో రూ.16.32 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ సూచీల వరుస నష్టాలతో రెండు రోజుల్లో ఇన్వెస్టర్లకు రూ.16.32 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.447.18 లక్షల కోట్లకు దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల మేర సంపద గల్లంతైంది.ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!
సేవల్లో పనితీరు.. ఫ్లాట్
న్యూఢిల్లీ: సేవల రంగ కార్యకలాపాలు ఫిబ్రవరిలో కాస్తంత నిదానించాయి. ఈ రంగంలో కార్యకలాపాలను సూచించే హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ 58.1 పాయింట్లుగా నమోదైంది. జనవరిలో ఇది 58.5గా ఉంది. 50 పాయింట్లకు పైన ఉన్నంత వరకు విస్తరణగానే పరిగణిస్తుంటారు. డిమాండ్ స్వల్పంగా మెరుగుపడడం, ద్రవ్యోల్బణం పెరగడం ఫలితంగా సేవల రంగం పనితీరు 13 నెలల కనిష్ట వృద్ధికి పరిమితమైనట్టు హెచ్ఎస్బీసీ ఇండియా తెలిపింది. ‘‘జనవరితో పోలి్చతే దాదాపు అదే స్థాయిలో ఫిబ్రవరిలోనూ సేవల రంగ పీఎంఐ నమోదు కావడం.. బలమైన పనితీరును సూచిస్తోంది. కొత్త ఆర్డర్లు రాక 13 నెలల కనిష్టానికి తగ్గింది. సేవల రంగం విక్రయాలు అంతర్జాతీయంగా పుంజుకున్నాయి. నిర్వహణ అవసరాల దృష్ట్యా కంపెనీలు నియామకాలు పెంచుకోవడం కనిపించింది’’అని హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. పోటీ పెరిగిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించినట్టు కొన్ని కంపెనీల పర్చేజింగ్ మేనేజర్లు ఈ సర్వేలో భాగంగా వెల్లడించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి కాంపోజిట్ పీఎంఐ (తయారీ, సేవలు కలిసిన) అవుట్‌పుట్ ఇండెక్స్ 58.9కి పుంజుకుంది. జనవరిలో 58.4 పాయింట్లుగానే ఉంది.
ఫ్యామిలీ
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్ క్రీములతో జర భద్రం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ కనిపించడంలో సర్వత్రా రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్ అనారోగ్యం పాలయ్యారా? అని యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది కూడా. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అది సాధారణ చర్మక్రీమ్ని ఉపయోగించడం వల్ల వచ్చిన అలెర్జీగా పేర్కొన్నారు. కొన్ని వారాలపాటు ఇలా ఉంటుందని కూడా అన్నారు. దీంతో ఒక్కసారిగా మనం సాధారణంగా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి అలెర్జీకి దారితీస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే దీని గురించి డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే..మనం రెగ్యులర్‌గా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అదిగాక డీ హైడ్రేషన్ వల్ల, చర్మం పైపొర దెబ్బతిని ఇలా సమస్యలు ఉత్పన్నమవుతాయట. మనం రెగ్యులర్ రాసే ఈ క్రీమ్ సున్నితత్వానికి అలవాటుపడి కూడా ఇలా దద్దుర్లతో కూడిన ఇరిటేషన్ వస్తుంటుందని చెబుతున్నారు. కొందరి సున్నితమైన వ్యక్తుల్లో ఈ అలెర్జీ మరింత తీవ్రంగా ఉండొచ్చని కూడా అన్నారు. ఒక్కోసారి ఏజ్ పైబడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినా..ఇలా ఎప్పుడూ రాసే స్కిన్ క్రీమ్ ప్రతిచర్య చూపించి చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. కొందరికి వెంటనే ఈ సమస్య చూపించగా, మరికొందరికి కనీసం 24 నుంచి 72 గంటల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అందుకే మన శరీరానికి సరిపడే క్రీమ్ అయినా ప్రతిచర్య చూపిన వెంటనే కడిగేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమస్య తగ్గేంత వరకు ఆయా క్రీమ్‌లు వినియోగించకపోవడమే మేలు అని అంటున్నారు. ఇది అందరికీ ఒకేలా ఉండదు..కొందరికీ తక్కువ రియాక్టివ్ చర్మం ఉంటుంది.పదే పదే అదే క్రీమ్ వాడటం వల్ల ఆ సంరక్షణకు మించి చర్మానికి ఎఫెక్టివ్ క్రీమ్ అవసరమై ఇలా ప్రతిచర్య చూపించొచ్చు కూడా. అంతేగాదు కొందరికీ ఆ క్షణం అలెర్జీ వచ్చినా..ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. అందువల్ల మన శరీరాని పడిన క్రీమ్ అని గుడ్డిగా అదే పనిగా రాసేయొద్దు..ఒక్కోసారి మనం వేరే ప్రాంతంలో ఉంటే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా స్కిన్‌క్రీమ్ మార్చాల్సి ఉంటుందనే విషయం గుర్తెరగండి అని చెబుతున్నారు. అలాగే ఏ మాత్రం దురదగా..ఇబ్బందిగా అనిపించినా తక్షణమే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుభ్రపరుచుకుని ఆయా క్రీమ్‌లను కొద్దిరోజులపాటు వినియోగించకుండా ఉండటమే బెస్ట్ అని చెబుతున్నారు. ఒకరకంగా ఈ ఘటన స్కిన్క్రీమ్ల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో హైలెట్ చేసిందని చెబుతున్నారు చర్మ నిపుణులు.(చదవండి: బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..)
ఓ పెంపుడు కుక్క కథ..
ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నగరవాసులు దివ్య, జాన్ రాజేష్ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు రూ.16లక్షలు కూడబెట్టారు. ఈలోపు వీరికి ఆ్రస్టేలియాలో స్థిరపడే అవకాశం వచి్చంది. దీంతో పెంపుడు శునకం ‘స్కై’ని తమ వెంట తీసుకెళ్లాలని సంకల్పించి.. ఇంటికోసం దాచుకున్న మొత్తాన్ని దాని కోసం వెచి్చంచారు. ఈ జంతు ప్రేమికుల కథ ప్రస్తుతం ఇన్‌స్టాలో డాక్యుమెంటరీగా వైరల్ అయ్యింది. ‘స్కై ది మేజికల్ డాగ్’ పేరుతో ఏకంగా ఓ పేజీ ఏర్పడింది. దీనిపై అనూహ్యంగా స్పందిస్తున్న నెటిజనులు తమ పెట్స్‌తో ఉన్న అనుబంధాన్ని, అనుభవాలను పంచుకుంటున్నారు. నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసిన టెక్కీలు దివ్య, జాన్‌లకు గతేడాది ఉద్యోగరీత్యా ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ వెళ్లి స్థిరపడే అవకాశం వచి్చంది. ఏళ్లుగా తాము పెంచుకుంటున్న జాగిలం స్కై దగ్గరకు వచ్చేసరికి వారికి ఇబ్బంది అనిపించింది. తమ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రేమగా పెంచుకుంటున్న దానిని ఇక్కడ వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. దాన్నీ తమతోపాటు ఆ్రస్టేలియా తీసుకెళ్లాలని భావించారు. అందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు ఆ దేశ యంత్రాంగాన్ని సంప్రదించారు. ఒక్క రేబిస్ కేసు కూడా నమోదుకాని కంట్రీగా ఉన్న తమ దేశానికి పెట్స్‌ను నేరుగా తీసుకురావడం సాధ్యం కాదని వాళ్లు స్పష్టం చేశారు.సన్నిహితులు వద్దన్నా.. తాహతకు మించిన ఖర్చే అయినా.. స్కై మీద ప్రేమ ఇంటి కోసం దాచుకున్న మొత్తాన్ని వెచి్చంచేలా చేసింది. విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు వీరి నిర్ణయాన్ని వారించారు. అవసరమైతే మరో మేలి జాతి జాగిలాన్ని ఖరీదు చేసుకోవాలని సూచించారు. స్కై మీద ప్రేమతో అంత పెద్ద మొత్తాన్ని ఖర్చుచేయవద్దని వారించారు. ఏమాత్రం వెనుకాడక.. ఎలాగైనా స్కైని తెసుకెళ్లాలని భావించి అనేక మార్గాలను అన్వేషించారు. మరో రేబిస్ ఫ్రీ దేశంలో ఆరు నెలలు పెట్‌ను ఉంచినట్లు, వైద్య పరీక్షలతో ధ్రువీకరణ పొందితే ఆ్రస్టేలియాలో అడుగుపెట్టొచ్చని తెలిసింది. అంతే క్షణం ఆలోచించకుండా ఆ పనులకు శ్రీకారం చుట్టారు. స్కైని తొలుత దుబాయ్ తీసుకెళ్లి ఆరు మాసాలు ఉంచాలని నిర్ణయించుకున్నారు. రవాణా, పెట్ కేర్, షెల్డర్ హోమ్, ఇతర వైద్య పరీక్షలకు ఏజెన్సీలకు సంప్రదించారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా ఆస్ట్రేలియాకు చేరేందుకు రూ.15 లక్షలు అవుతుందని లెక్కతేలింది.కథ సుఖాంతం.. తొలుత స్కైని హైదరాబాద్ నుంచి దుబాయ్ తీసుకెళ్లారు. తక్కువ ఖర్చుతో ఆరు నెలలు ఉంచే రేబిస్ ఫ్రీ దేశాలు మరికొన్ని ఉన్నా.. స్కైకితో హిందీలో సంప్రదింపులు జరపాల్సి ఉండటంతో దుబాయ్‌నే ఎంచుకున్నారు. అక్కడి పెట్ కేర్ సెంటర్లో ఆరు మాసాలు ఉంచి తాము ఆ్రస్టేలియా వెళ్లిపోవాలని భావించారు. కొత్త ప్రాంతం, వాతావరణం కావడంతో నెల రోజులు దాంతో పాటే దుబాయ్‌లో ఉన్నారు. ఆపై మెల్బోర్న్ వెళ్లిపోయారు.. ఐదు నెలల రోజూ ఉదయం, సాయంత్రం వీడియో కాల్స్ ద్వారా స్కైని పలుకరించారు. చివరికి 180 రోజుల అనంతరం స్కై మెల్బోర్న్ చేరింది. అక్కడి క్వారంటైన్ సెంటర్లో మరో పది రోజులు ఉంచిన తర్వాత వారి ఇంటికి తీసుకువెళ్లారు. దీని ఆధారంగా ‘కహానీ ఆఫ్ టేల్స్’ అనే హ్యాండిల్ డాక్యుమెంటరీ చేయడంతో వైరల్ అయ్యింది.
సపోర్ట్ కాదు... క్లారిటీ కావాలి
మన మధ్యే మహాశక్తిసామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు.ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు... మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు.కామన్ విమెన్ అన్ కామన్ జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.సపోర్ట్ కాదు... క్లారిటీ కావాలిజీవితపు చివరి దశలో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు సేవలందిస్తూ, కుటుంబ జీవనాన్ని తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతోంది హైదరాబాద్ బోడుప్పల్లో ఉంటున్న మైరూన్. మరోచోట నర్సింగ్‌లో చేరితే అధిక డబ్బు వస్తుందని అయినవారు చెప్పినా తనకు సంతృప్తినిచ్చిన సేవనే ఎంచుకున్నానని వివరించింది. చంటిబిడ్డకు పాలిస్తూ, కరోనా సమయంలో రోగులకు సేవలందించింది. తెలంగాణలోని ఖమ్మంలో పుట్టి పెరిగిన మైరూన్ సేవాభావం గురించి మహిళాదినోత్సవం సందర్భంగా కథనం.‘‘పాలియేటివ్ కేర్ అంటేనే చివరి స్టేజ్ కదా! వారికి పుండ్లు ఉంటాయి. నోటి నుంచి స్రావాలు బయటకు రావడం.. వంటివన్నీ ఉంటాయి. డెడ్ ఎండ్ స్టేజ్ కాబట్టి ఈ ఫీల్డ్కి రావడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ, నాకు దీనిలోనే ఒక సంతృప్తి ఉంది. ఇదే నన్ను టచ్ చేసింది. పేషెంట్స్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలుగుతాను.. అనిపించి ఇదే సర్వీస్‌ను ఎంచుకున్నాను. మనసును తడిచేసిన జ్ఞాపకాలు..ఈ నర్సింగ్ సేవలో ఎంతో కఠినమైన జబ్బులతో బాధపడేవారిని చూస్తుంటాం. క్యాన్సర్ పేషంట్ల చివరి దశ చాలా కష్టంగా ఉంటుంది. ఒక మహిళా రోగికి యోని క్యాన్సర్ వచ్చింది. ఆ పుండు వల్ల చాలా దుర్వాసన ఉండేది. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఉండేవాళ్లు కాదు. అప్పుడు నేను నాలుగు నెలల గర్భవతిని. మార్నింగ్ సిక్నెస్ ఉండేది. ఆ స్మెల్‌కు తల తిరిగిపోయేది. పొట్టలో వికారంగా అనిపించేది. కానీ, డ్రెస్సింగ్ చేస్తేనే ఆమెకు చాలా ఉపశమనం ఉంటుంది. ఆ టైమ్‌లో కూడా రోజూ ఇంజక్షన్ చేసి, పుండును వాష్ చేయడం, అయిట్మెంట్ అప్లై చేయడం చేసేదాన్ని. ఆమె కళ్ల నీళ్లు పెట్టుకునేది. ‘నా భర్తతో సహా మా ఇంట్లో వాళ్లు ఎవ్వరూ కనీసం దగ్గరగా వచ్చి కూర్చొని, పలకరించేవాళ్లు లేరు. వచ్చినా చేతులకు గ్లౌజులు వేసుకొని, ముక్కుకు క్లాత్ పెట్టుకొని వస్తున్నారు. ఈ స్థితిలో కూడా నన్ను టచ్ చేసి, నువ్వు ఇంత సేవ చేస్తున్నావు.. ఏమివ్వగలను నీకు.. ’ అనేది. తను చనిపోయేంతవరకు నేను ఒక్కరోజు ఆమె వద్దకు వెళ్లకపోయినా అందరినీ అడిగేవారు. ఇలాంటివి ఎన్నో మనసును తడి చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి ఈ పదేళ్లలో.రోగి కోలుకోవడంలో నర్స్ పాత్ర కీలకంఖమ్మం దగ్గర పాసర్లపాడు అనే పల్లెటూరు మాది. మా నాన్న విశ్రాంత రైల్వే ఉద్యోగి. నా అసలు పేరు జాజుల వెంకటరమణ. కానీ, అందరూ చిన్నప్పటి నుంచి మైరూన్ అనే పిలుస్తారు. టెన్త్‌క్లాస్ తర్వాత నర్సింగ్ కోర్సు చేస్తే త్వరగా జాబ్ వస్తుంది అని చెప్పేవారు. కానీ, నాకు అప్పుడు నర్సింగ్ అంటే ఏమిటో తెలియదు. టెన్త్ తర్వాత నర్సింగ్ గురించి అన్నీ కనుక్కున్నా. డాక్టర్ చికిత్స చేస్తారు. తర్వాత రోగి పూర్తిగా కోలుకోవడంలో నర్స్ పాత్ర చాలా కీలకం. ఇంజక్షన్స్ చేయడం, సమయానికి మందులు ఇవ్వడం, ధైర్యం చెప్పడం.. ఇవన్నీ పేషంట్ ఆందోళన, బాధ తగ్గిస్తాయి. అందువల్ల ఇది బాగుందనిపించి విజయవాడలో నర్సింగ్ కోర్సులో చేరాను.చంటి బిడ్డతో.. సేవపదేళ్ల క్రితం రెండేళ్ల పాటు పెద్ద హాస్పిటల్స్‌లో ఐసీయూలో వర్క్ చేశా. కానీ, అక్కడ వర్క్ సంతృప్తినివ్వలేదు. స్నేహితుల ద్వారా పాలియేటివ్ కేర్ సెంటర్స్ గురించి తెలిసింది. అంటే మరణానికి చివరి దశలో ఉన్న పేషెంట్స్. ఆ సమయంలో వారి బాధ ఎంత ఉంటుందో చెప్పలేం. అప్పుడే వారికి మానవ స్పర్శ కావాలి. అందుకే అది నా మనసుకు దగ్గరగా ఉన్న వర్క్ అనిపించింది. దీంతో పదేళ్లుగా ఇదే సర్వీస్‌లో ఉన్నాను. హోమ్ విజిట్స్‌కు కూడా వెళ్లేదాన్ని. కరోనా సమయంలో నేను చంటిబిడ్డ తల్లిని. బిడ్డకు పాలు ఇస్తూ కూడా ఈ సర్వీస్ చేశా. పదేళ్లు ‘స్పర్శ్ హాస్పిస్’లో చేశాను. మూడు నెలల నుంచి‘పావనీ ప్రకాశ్ హాస్పిస్’లో సర్వీస్ చేస్తున్నాను. కుటుంబమూ అత్యంత ముఖ్యమే..చాలామంది ‘లేడీస్ ఇంట్లోనే ఉంటారు కదా! వారేం చేస్తారులే’ అని అనుకుంటారు. అది నిజం కాదు. మహిళ లేకపోతే ఏమీ లేనట్టే. ఆమె ఉంటే అన్నీ ఉన్నట్టే. దేనినైనా మహిళ ఒంటరిగా సాధించగలదు. నా లైఫ్‌లో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఒక దశలో నాకు, మా హజ్బెండ్కు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ‘విడిపోదాం’ అన్నారు. మా పేరెంట్స్‌తో సహా నాకు సపోర్ట్‌గా ఎవరూ నిలబడలేదు. ఏమైనా చెబితే ‘వదిలేయ్, వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా’ అనేవారు. కానీ, అది నాకు సరికాదు అనిపించింది. నా భర్త నాకు కావాలి, నా బిడ్డకు తండ్రి ఉండాలి అని చాలా ఫైట్ చేశాను. నా భర్తది ప్రైవేట్ జాబ్. ఈ రోజు మేం కలిసి హ్యాపీగా ఉంటున్నాం. అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. మనసుకు నచ్చిన ఉద్యోగం, సంతోషకరమైన కుటుంబం.. ఇవి నేను సాధించుకున్నాను.మనకేం కావాలో ఒక క్లారిటీ ఉంటే, దానిని తప్పక అదీ ఒంటరిగానే సాధించుకోగలం. సపోర్ట్ కోరుకుంటేనే గానీ మనం అనుకున్నది సాధించుకోలేం అనిపిస్తుంది నాకు. అప్పుడు అలా మాట్లాడిన మా పేరెంట్స్కూడా ఇప్పుడు మమ్మల్ని చూసి, మంచి పని చేశావు అని అభినందిస్తారు. అందుకే, మనకు మనమే పెద్ద సపోర్ట్‌గా ఉండాలి’’ అని వివరించింది బంధాలను, సేవను శ్వాసగా భావిస్తున్న మైరూన్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..
ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం అంత ఈజీకాదు. ఆ రంగం ఎంత ఇష్టమైనా.. దానిలోని మెళుకువలపై పట్టు సాధించేది మాత్రం టీనేజ్ వయసుకే. అంతకంటే చిన్న వయసులో అంత సులభం కాదు..పైగా క్లాత్‌ని పట్టుకుని కుట్టుగల నేర్పరితనం, క్రియేటివిటీ ఉండదు. కానీ ఈ బుడతడు..పిట్ట కొంచెం కూత ఘనంలా అలవోకగా పలు రకాల ఫాబ్రిక్లను అందమైన డిజైనర్‌వేర్‌లా తీర్చిదిద్దుతుండటం విశేషం. అంతేకాదండోయ్ ఏకంగా ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్‌లో దిగ్గజ డిజైనర్ల మధ్య..తన ఫ్యాషన్వేర్ని ప్రదర్శించనున్నాడు కూడా. ఇలా అత్యంత పిన్నవయసులో ఫ్యాషన్ డిజైనర్‌గా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్న చిన్నారిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆ చిన్నారి ఎవరంటే..ఆ చిచ్చర పిడుగే మాక్స్ అలెగ్జాండర్. ఆ చిన్నారి తల్లిదండ్రులు జాక్ అలెగ్జాండర్, షెర్రీ మాడిసన్ దంపతులు. పూర్తిగా భాషై పట్టు రాని ఆ వయసుకే ఈ బాలుడు మాక్స్ స్కెచ్ పట్టుకుని డిజైన్లు, సూది దారం సాయంతో చక్కటి కళ్లు చెదిరిపోయే ఫ్యాషన్వేర్లను క్రియేట్ చేసేస్తాడు. తనలోని ఫ్యాషన్ క్రియేటివిటీ తన సోదరి సమంత కారణంగా బయటకు వచ్చిందట. ఆమెకు ప్రస్తుతం 14 ఏళ్లు. తాను తయారు చేసిన డిజైనర్వేర్లన్నీ తన అక్క కోసమేనని, ఆమె వాటిని ధరించి చూడటం నిజంగా చాలా ఆనందాన్నిస్తుందని చెబుతున్నాడు మాక్స్. అతడి క్రియేటివిటీ అత్యంత విభిన్నం..ఫ్యాషన్ డిజైనర్లు ముందుగా తమ క్రియేటివిటీ లేదా ఆలోచనను కాగితంపై స్కెచ్‌తో పని చెబితే..మాక్స్ మాత్రం ముందుగా దాన్ని మడతలతో కట్టి చూస్తాడు. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి కుట్టేస్తాడు. తనకు డ్రేపింగ్ అంటే ఇష్టమని, ముందుగా ధరిస్తేనే..క్రియేటివిటీ తళుక్కుమని బుర్రలో ప్రత్యక్షమవుతుందని చెబుతున్నాడు మాక్స్. అలా ఇప్పటివరకు ఈ చిన్నారి 150కి పైగా డిజైనర్‌వేర్‌లు రూపొందించాడు. వాటిలో దుస్తులు, జాకెట్లు, స్కార్ఫ్‌లు, బ్యాగులు, కిమోనోలు, సూట్లు, స్టఫ్డ్ యానిమల్స కూడా ఉన్నాయి. అంతేగాదు తన సొంత రన్‌వే షోను ప్రదర్శించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పాడు. 2024లో ఎనిమిదేళ్ల వయసులో ఐక్యరాజ్యసమితలో ఫ్యాషన్ స్థిరత్వంపై ప్రసంగించాడు. వ్యర్థాలను పునర్వినియోగం చేసి.. దుస్తులుగా ఎలా మలచొచ్చో ఆలోచనాత్మకంగా వివరించాడు. పైగా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేలా కాఫీ బీన్ బ్యాగ్‌ల నుంచి రూపొందించిన డిజైనర్‌వేర్‌లలో మెరిశారు మోడళ్లు. అలాగే ఆ చిన్నారి మాక్స్ చదువుకుంటూనే ఫ్యాషన్ వీక్‌లలో తన ప్రదర్శనలను ఇస్తుంటాడు. ఇదేగాక మాక్స్‌కి పలు స్కిల్ కూడా ఉన్నాయి. అవేంటంటే వంట చేస్తాడు, పికిల్‌బాల్, టెన్నిస్ వంటివి ఆడతాడు, కథలు రాస్తాడు. అలాగే తనకొక రెస్టారెంట్, కారు వాష్‌ని ఉండాలని కలలుకంటుంటాడు. పైగా ఇంజనీర్ కావలన్నిది అతడి ధ్యేయం కూడా. ఇక మాక్స్ తన పాఠశాల చదువుకి ఆటంకం లేకుండా వారాంతాల్లో ఫ్యాషన్‌కి సంబంధించిన స్కిల్స్‌లో నిమగ్నమవుతుంటాడట. నిజంగా పెన్సిల్ పట్టుకుని కుదురుగా బొమ్మలు వేయని ఆ చిరుప్రాయంలో ఇంత అసామాన్య ఫ్యాషన్ డిజైనర్ ప్రతిభ మాటలకందనిది కదూ..!.వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: తనకు తాను ఓటు వేసుకుని మేయర్ అయిన మహిళ..! ఎక్కడంటే..)
అంతర్జాతీయం
ఆపరేషన్ ముగియలేదు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా సైన్యం పనితీరుకు అసాధారణ రేటింగ్ ఇచ్చారు. అమెరికా ఇప్పుడు కమాండింగ్ స్థానంలో ఉందన్నారు. యుద్ధ రంగంలో అమెరికా సైన్యం పైచేయి సాధించిందని.. బాగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ట్రంప్.. 15/10 రేటింగ్ ఇచ్చారు.వైట్ హౌస్‌లో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లతో ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికా, మిత్రదేశాలు.. ఇరాన్‌పై యుద్ధంలో పైచేయి సాధిస్తున్నాయి. వారం కంటే తక్కువ సమయంలోనే వేగంగా పురోగతి సాధించాం. మేము యుద్ధ రంగంలో బాగానే ఉన్నాము. ఈజీగా చెప్పాలంటే. 10 స్కేల్లో 15 రేటింగ్‌తో ముందంజలో ఉన్నాం. మనం ఇప్పుడు చాలా బలమైన స్థితిలో ఉన్నాం. ఇరాన్ నాయకత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఇరాన్‌కు నాయకుడిగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇరాన్ నాయకత్వ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఇదే సమయంలో ట్రంప్ అణు హెచ్చరికను పునరావృతం చేశారు. ఇరాన్‌పై దాడి చేయాలనే నిర్ణయాన్ని అమెరికా నాయకుడు మళ్ళీ సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించడానికి దగ్గరగా ఉందని వాదించారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయి అని మండిపడ్డారు. ఇరాన్‌పై ఇంకా ఆపరేషన్ ముగియలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ఆయుధశాల వేగంగా తుడిచిపెట్టబడుతోందన్నారు. చివరగా.. వాషింగ్టన్ చివరికి టెహ్రాన్‌లో పాలన మార్పును కోరుకుంటుందో లేదో వైట్ హౌస్ నిర్ధారించకుండా ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. పెను విపత్తులో పాక్?
న్యూఢిల్లీ : పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్‌ను సైతం చుట్టుముట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన ఆత్మాహుతి డ్రోన్ సౌదీ అరేబియాపై దాడి చేసిన దరిమిలా పాకిస్తాన్ ఈ యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025 సెప్టెంబరులో సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య కుదిరిన ‘స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్’ (SMDA) ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా, అది ఇద్దరిపై జరిగిన దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరాన్ గనుక సౌదీపై దాడులను ఉధృతం చేస్తే, ఆ దేశ రక్షణ కోసం పాకిస్తాన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ తన వైఖరిని స్పష్టం చేస్తూ, ఇరాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. తమ మధ్య ఉన్న రక్షణ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని, సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇరాన్ విదేశాంగ మంత్రిని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ బహిరంగంగానే తన రక్షణ ఒప్పందాన్ని ప్రస్తావించింది. అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్, సంపన్న దేశమైన సౌదీకి అణు రక్షణ కల్పించేలా ఈ ఒప్పందం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందాలకు (ఎన్పీటీ) ఇది విరుద్ధమని ఐక్యరాజ్యసమితి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.2025లో ఇజ్రాయెల్.. దోహా, ఖతార్‌లపై వైమానిక దాడులు చేసిన సమయం నుండి గల్ఫ్ దేశాల్లో అభద్రతా భావం పెరిగింది. అమెరికా తమను కాపాడుతుందన్న నమ్మకం సన్నగిల్లడంతోనే సౌదీ అరేబియా ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్‌తో ఈ రక్షణ ఒప్పందం చేసుకుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పాకిస్తాన్ తన బలగాలను యుద్ధ భూమికి పంపకపోయినప్పటికీ, సౌదీకి మద్దతుగా దౌత్యపరమైన, వ్యూహాత్మకమైన బలాన్ని చేకూర్చడం ఖాయమనే విధంగా కనిపిస్తోంది.
తాలిబన్లకు భారీ షాక్..
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లోని బగ్రాం ఎయిర్ బేస్‌పై పాకిస్తాన్ భారీ వైమానిక దాడులు చేపట్టింది. పాక్ ప్రభుత్వ టీవీ బుధవారం ఈ విషయం వెల్లడించింది. అఫ్గాన్ తాలిబన్లు పాకిస్తాన్‌తో 2,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లోని 53 ప్రాంతాల్లో దాడులకు తెగబడటంతో పాక్ ఆర్మీ ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి ఘజబ్ లిల్ హక్ పేరుతో భారీ ఆపరేషన్ ప్రారంభించింది.అందులో భాగంగానే బగ్రాం వైమానిక స్థావరంపై తీవ్ర దాడులు జరిగాయని, అఫ్గాన్ తాలిబన్ల దురాక్రమణ చర్యలకు తగు బుద్ధి చెప్పామని పాక్ టీవీ పేర్కొంది. ఎయిర్‌బేస్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని, అందులోని ఓ హంగార్, రెండు గిడ్డంగులు ధ్వంసమయ్యాయంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఉటంకించింది. వారం రోజుల వ్యవధిలో అఫ్గానిస్తాన్‌లోని సైనిక లక్ష్యాలపై 50కి పైగా వైమానిక దాడులు జరిగాయని తెలిపింది. తాలిబన్లపై ఇలాంటి దాడులు మున్ముందు కూడా కొనసాగుతాయని హెచ్చరించింది.#BREAKING: Intense fighting between Afghan and Pakistani forces has resumed after nearly 30 hours of relative calm.Pakistan’s Air Force has conducted airstrikes in Kandahar, Afghanistan, with multiple explosions reported across the city.Afghan forces say they have struck… pic.twitter.com/JMydVuupLR— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 4, 2026టీటీఏ కమాండర్ హతంపెషావర్: సరిహద్దులోని తోర్ఖామ్ వద్ద పాకిస్తాన్ సైన్యం జరిపిన కీలక ఆపరేషన్‌లో ఆఫ్ఘన్ తాలిబన్ కమాండర్ (టీటీఏ) కహ్రామాన్ హతమయ్యారు. ఈ ఘటనలో కమాండర్‌తో పాటు అతని అనుచరులు కూడా మరణించారు. తోర్ఖామ్, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ మధ్య ప్రధాన సరిహద్దు క్రాసింగ్. పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్ర పన్నుతున్న తాలిబన్లు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్ ప్రభుత్వం తెలిపింది. సరిహద్దును చేరుకోవడానికి వారు ప్రయత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయని, భద్రతా దళాలు చేసిన దాడిలో ఖహ్రామాన్, అతని సహచరులు అనేక మంది మరణించారని వెల్లడించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రధాన ఆపరేషన్‌లో మొత్తం 67 మంది ఆఫ్ఘన్ తాలిబన్లను చంపినట్లు పాకిస్తాన్ భద్రతా దళాలు పేర్కొన్నాయి.
పోలీసు అధికారిని చంపిన వ్యక్తికి మరణ శిక్ష
స్టార్క్(యూఎస్ఏ): ఓ పోలీస్ అధికారిని అతడి సొంత సర్వీస్ రివాల్వర్‌తో ఏకంగా 14సార్లు కాల్చి మరణానికి కారకుడైన వ్యక్తికి మంగళవారం సాయంత్రం ఫ్లోరిడా జైలులో మరణ శిక్ష అమలు చేశారు. స్టార్క్ సమీపంలోని ఫ్లోరిడా స్టేట్ ప్రిజన్లో సాయంత్రం 6 గంటలకు దోషి అయిన బిల్లీ లియోన్ కీర్స్(53)కు మూడు ఇంజెక్షన్ల ద్వారా ఈ శిక్షను అమలు చేశారు. చివరి కోరిక తెలపాలని జైలు వార్డెన్ కోరగా..‘మృతుడు డానీ పారిష్ కుటుంబం నుంచి క్షమాపణలు మాత్రమే కోరుతున్నాను. ఇంతకు మించి వారికి తిరిగి ఏమీ ఇవ్వలేను’అని పేర్కొన్నాడు. ఆ సమయంలో మరణ శిక్ష అమలును చూసేందుకు కుటుంబీకులు, అధికారులు కలిపి అక్కడ 15 మంది వరకు ఉన్నారు. బిల్లీ లియోన్ కీర్స్ 1991 జనవరిలో ఓ రోజు కారులో వెళ్తుండగా ఫోర్ట్ పియర్స్ పోలీసు అధికారి డానీ పారిష్ అతడిని ఆపారు. ఆ సమయంలో అతడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. పైపెచ్చు అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్సు లేదు. దీంతో, అతడికి బయటకు రప్పించి, చేతులకు బేడీలు వేసేందుకు యత్నించగా పెనుగులాట జరిగింది. అదను చూసుకుని పారిష్ వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్‌ను కీర్స్ లాక్కున్నాడు. అతడిపైకి 14సార్లు కాల్చాడు. దీంతో, అక్కడికక్కడే పారిష్ చనిపోయారు. పోలీసులు అనంతరం కీర్స్ను ఇంట్లోనే అరెస్ట్ చేశారు. 1991లోనే కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఫ్లోరిడా సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. 1997లో తిరిగి విచారణ జరిపిన కోర్టు కూడా అతడికి మరణశిక్షనే విధించింది. గత వారం ఫ్లోరిడా సుప్రీంకోర్టు కీర్స్ అప్పీల్‌ను తిరస్కరించింది. మరణ శిక్ష అమలుకు కొద్ది గంటల ముందు కీర్స్ చేసిన తుది అప్పీల్‌ను అమెరికా సుప్రీంకోర్టు సైతం ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా కొట్టివేసింది.
జాతీయం
నిద్రలేమి.. మహిళల్లోనే ఎక్కువ!
సాక్షి, స్పెషల్ డెస్క్: మహిళల్లో నిద్రలేమి అనేది ఒక క్లిష్టమైన ప్రజారోగ్య సమస్యగా అవతరించింది. పురుషుల కంటే మహిళలే నిద్ర విషయంలో అధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతల్లో అసమానత ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణాలు. ఫలితంగా నేటి కాలంలో చాలామంది భారతీయ మహిళలకు నాణ్యమైన నిద్ర అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా మెడికల్ డివైసెస్ తయారీలో ఉన్న రెస్‌మెడ్ ఇటీవల గ్లోబల్ స్లీప్ సర్వే–2026 నిర్వహించింది. భారత్‌తోపాటు అమెరికా, చైనా, యూకే, జ ర్మనీ, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్, కొరియా, బ్రెజిల్, పోలండ్, సింగపూర్, మెక్సికో దేశాలకు చెందిన 30 వేల మంది పాలుపంచుకున్నారు. ఇందులో భారత్ నుంచి 5 వేల మంది ఉన్నారు. ఈ సర్వే ప్రకారం.. నిద్రలేమి సమస్యతో 38% మంది భారతీయ మహిళలు ఇబ్బందిపడుతున్నారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 29% మాత్రమే. వంట, ఇంటి పనులు; పిల్లలు, పెద్దల సంరక్షణ.. భారతీయ మహిళల భు జాలపై సహజంగా ఉండే భారం. ఇంటి నిర్వహణకు సంబంధించిన మానసిక ఒత్తిడి దీనికి అదనం. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే అటు వృత్తి బాధ్యతలనూ మోయాల్సి వస్తోంది. భిన్నమైన ప్రభావం..: సామాజిక, మానసిక ఒత్తిళ్లు స్త్రీ పురుషులపై రాత్రి నిద్ర విషయంలో ఎలా భిన్నంగా ప్రభావం చూపుతాయో ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నిద్రాభంగం కావడానికి మానసిక ఒత్తిడి, ఆందోళనను ప్రధాన కారకాలుగా 42% మంది మహిళలు పేర్కొన్నారు. ఈ విషయంలో పురుషుల సంఖ్య 36% ఉంది. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలు నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయని 39% మంది మహిళలు, 33% మంది పురుషులు చెబుతున్నారు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి స్థిర, నాణ్యమైన నిద్ర అవసరమని ప్రపంచవ్యాప్తంగా 90% మంది గుర్తించారు. ఆహారం, వ్యాయామంతోపాటు నిద్రను అత్యంత ముఖ్యమైన అలవాటుగా 44% మంది భారతీయులు పరిగణిస్తున్నారు. అయినప్పటికీ 53% ప్రజలు వారానికి నాలుగు రాత్రులు లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే నాణ్యమైన నిద్రను పొందుతున్నట్లు తెలిపారు. ఇది అవగాహనకు, వాస్తవానికి మధ్య పెరుగుతున్న భారీ అంతరాన్ని నొక్కి చెబుతోంది. వేరబుల్ టెక్నాలజీతో.. నిద్ర ప్రాముఖ్యతపై ప్రజల్లో అధిక అవగాహన ఉన్నప్పటికీ సమస్యలున్నవారు వైద్యపరంగా సాయం తీసుకోవడం లేదు. 78% మంది భారతీయులు నిద్ర సమస్యల పరిష్కారం కోసం వైద్యుడిని సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. సాధారణ చెకప్‌లలో 69% మందికి మాత్రమే దీనికి సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని ఆసుపత్రులు మరింత చురుకుగా నిద్ర సమస్యలను గుర్తించాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. 75% మంది భారతీయులకు తమ నిద్ర విధానాలను మరింత నిశితంగా గమనించడానికి స్మార్ట్‌వాచెస్, ఫిట్నెస్ బ్యాండ్స్ వంటి వేరబుల్ టెక్నాలజీ దోహదపడుతోంది. ఈ పరికరాలు నెగిటివ్ ఫలితాలు చూపితే.. 66% మంది వినియోగదారులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వైద్య సలహాను పొందుతామని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై.. నాణ్యమైన నిద్ర తక్కువగా ఉండటం వల్ల కేవలం అలసట మాత్రమే కాకుండా అంతకుమించిన తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. సరైన నిద్రలేని రాత్రి తర్వాత తాము మరింత చిరాకుగా, ఒత్తిడితో లేదా నిరాశతో ఉన్నట్లు అత్యధికులు తెలిపారు. ప్రత్యేకించి 30% మంది నిద్రలేమికి, కుంగుబాటు లక్షణాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
అదనంగా ఐపీఎస్‌లను కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని..తర్వాత 2021లో జరగాల్సిన రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని తెలిపారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో అమిత్‌షాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికీ అనేక ఆధునిక సవాళ్లు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని చెప్పారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని, ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఆ సంఖ్యను 105కు పెంచాలని రేవంత్ కోరారు. 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు.. ఇటీవలి కాలంలో మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్‌షాతో సీఎం చర్చించారు. అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం తదితర అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలోనే 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. పలువురు అగ్రనేతలు సైతం సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని చెబుతూ.. వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం తదితర విషయాలను వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) విజయ్‌కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ బి.సుమతి పాల్గొన్నారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం.. బుధవారం ఢిల్లీకి వచ్చిన సీఎం రాత్రి ఇక్కడే బస చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొననున్నారు.
డీఎంకే.. కాంగ్రెస్ మధ్య కుదిరిన పంచాయితీ
సాక్షి చెన్నై: తమిళనాడు కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ తేలింది. కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వడానికి డీఎంకే అంగీకరించింది. దీంతో ఇంతకాలం ఇరుపార్టీల మధ్య నడిచిన సందిగ్ధతకు తెరపడింది. రెండు పార్టీలు కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.గత కొంతకాలంగా తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడిచింది. కాంగ్రెస్ పార్టీకి ఈ సారి కాంగ్రెస్‌కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని పట్టుబట్టింది. అయితే తాజాగా ఇరుపార్టీల మధ్య సీట్ల పంచాయితీ ముగిసింది అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. తాజాగా మరో మూడుసీట్లతో పాటు ఒక రాజ్యసభ స్థానం కాంగ్రెసుకు కేటాయించారు. ఆ రాష్ట్రంలో మెుత్తం 234 సీట్లున్నాయి. కాగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫిలీం స్టార్ విజయ్ పార్టీ, దివంగత నేత మాజీ సీఎం జయలలిత మిత్రురాలు శశికళ నూతన పార్టీ పెట్టడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ సారి ఆ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?
ఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత, సీపీఐ(మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి.. ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. నేపాల్‌లో గణపతి ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న గణపతి.. లొంగిపోతున్నట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్రనేతల శకం దాదాపు ముగిసినట్లే.వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన గణపతి.. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగారు. గణపతి వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యుల కోరిక. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం.గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ అని.. వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గణపతి.. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గణపతి.. షార్ట్ కట్లో పార్టీలో ఎదిగాడన్న వాదన కూడా ఉంది.1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లో ఆయన జన్మించారు. ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. 1970లో రైతు పోరాటాలు జగిత్యాల జైత్రయాత్ర ద్వారా పోరాటానికి దిగారు. నక్సల్స్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్‌గా గణపతికి గుర్తింపు పొందారు. ఇప్పటికీ గణపతి భార్య సుజాత ఉద్యమంలో కొనసాగుతున్నారు. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్.
ఎన్ఆర్ఐ
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది.
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్‌లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్‌కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్‌కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్‌కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్‌లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్‌లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్‌లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్‌ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్‌ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
అమెరికాలోని జార్జియాలో ఉండే భారతీయ అమెరికన్‌కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.జార్జియాలోని అక్వర్త్లోని వాల్‌మార్ట్‌లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్‌మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్‌ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్‌కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది. అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న, తాను వాల్‌మార్ట్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్ (టాబ్లెట్స్) ఎక్కడ ఉన్నాయోమిల్లర్‌ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.SHOCKING & SAD !! Mahendra Patel has filed a federal civil rights lawsuit after being jailed for 47 days over a Walmart incident.He was arrested after a shopper accused him of trying to kidnap her child. Police video later showed no force, no injury, and no kidnapping… pic.twitter.com/cRlPZfwvEH— M9 USA🇺🇸 (@M9USA_) February 11, 2026 తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పింది.నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఇదీ చదవండి: రైల్లో శాండ్విచ్...నెటిజన్ల రియాక్షన్స్ వైరల్ వీడియో మానసిక వేదన, వ్యాపార నష్టం ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్‌మార్ట్ వీడియో లేకపోయి ఉంటే. ఆమె మాట వర్సెస్ నా మాటగా మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు. ఆ ఫుటేజ్‌అక్షరాలా తన ప్రాణాన్ని కాపాడిందన్నారు.సుమారు రూ. 210 కోట్లుతాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్‌పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్‌కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతంసీసీటీవీ ఫుటేజ్‌లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్మన్ అన్నారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో
క్రైమ్
దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్కౌంటర్
ఛత్తీస్‌గఢ్: దంతేవాడ-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు రాజీవ్ పునేమ్ మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఐఎస్ఎస్ఏఎస్ రైఫిల్స్,పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
రెండేళ్ల చిన్నారి.. రాత్రంతా చెట్లపొదల్లోనే
హైదరాబాద్: అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో వచ్చి తప్పిపోయిన రెండేళ్ల బాలుడు మంగళవారం రాత్రంతా చెట్ల పొదల్లోనే ఉన్నాడు. వందలాది కుక్కలు అక్కడే తచ్చాడుతున్నా బాలుడికి పెద్దగా ప్రమాదం తలపెట్టలేదు. ఒకటి, రెండు కాట్లు వేసి వదిలిపెట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నార్సింగి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గండిపేట మైసమ్మ దేవాలయానికి మంగళవారం తెల్లాపూర్‌నకు చెందిన వడ్డె వెంకటే‹Ù, అనూష దంపతులు కుమారుడు అభిమన్యు (2)తో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు వచ్చారు. సాయంత్రం 5.50కు అభిమన్యును తీసుకుని వెంకటేష్ కుళాయి వద్దకు వెళ్లారు. కొద్ది సేపట్లోనే అభిమన్యు అదృశ్యమయ్యాడు. వెతికినా ప్రయోజనం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు ఆలయ ఆవరణలోని చెట్ల పొదల్లోనే రాత్రంతా ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. ఆలయ పరిసరాల్లో ఉండే వందల కుక్కలు బాలుడిని ఏమీ చేయకపోవడంతో గమనార్హం. ఈ సందర్భంగా ఇటీవల చిన్నారులను కుక్కలు తీవ్రంగా కరిచిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.
వెంకటేశ్వరా.. కాపాడలేదే?
ఆ కుటుంబంలో త్వరలో ఓ శుభకార్యం ఉండడంతో బంధువులు ఎంతో సంతోషించారు. కార్యం దిగ్విజయం కావాలని.. ముందుగా ఇలవేల్పు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీర్వాదం పొందాలనుకున్నారు. కుటుంబంతో కలిసి కారులో తిరుమల కొండకు బయలుదేరారు. ఇంతలోనే విధి వక్రించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరువాసుల తీర్థయాత్ర విషాదమయమైంది.పలమనేరు/ గంగవరం: కర్ణాటక నుంచి తిరుమలకు వెళ్తున్న కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. బెంగళూరులోని రాజాజీనగరకు చెందిన మోహన్‌రావు (71), కుసుమ (61) భార్యాభర్తలు. నాగరాజరావు(68), జయంతి (61) వృద్ధ దంపతులు. నాగరాజరావు కుమార్తె పూజ (32) కారులో వెళ్తూ వెనుక నుంచి లారీని ఢీకొనడంతో దుర్మరణం చెందారు. ఎలా జరిగింది? బుధవారం వేకువ జామున ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కారును మోహన్‌రావు నడుపుతుండగా ఆయన పక్కన భార్య కుసుమ కూర్చున్నారు. వెనుక వైపు నాగరాజరావు, జయంతి, పూజ ఉన్నారు. ముళబాగిళ్ వద్ద ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసి కదిలారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద బైపాస్‌లో సరిగ్గా 9.05 నిమిషాల ప్రాంతంలో గంటకు 130 కి.మీ వేగంతో వెళుతున్న కారు ముందు వెళుతున్న ఖాళీ సిమెంట్ లారీని ఢీకొని లారీ కిందకు దూసుకెళ్లి చిక్కుకుంది. దీన్ని గమనించని లారీ డ్రైవర్ కొంతదూరం అలాగే వెళ్లిపోయాడు. పక్కరూట్లో వెళ్లే వాహనాల డ్రైవర్లు కేకలు వేయడంతో లారీని రోడ్డు పక్కన ఆపాడు. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న వారందరూ నిమిషాలలో మరణించారు. వీరిలో కుసుమ, జయంతి అక్కాచెల్లెళ్లు. తెరుచుకోని ఎయిర్ బెలూన్లు కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకుని ఉంటాడని భావిస్తున్నారు. కారులోని వారంతా సీటు బెల్టులు ధరించే ఉన్నారు. ప్రమాదం జరిగినా ఎయిర్ బెలూన్లు మాత్రం ఓపెన్ కాలేదు. కారు ముందు వైపున్న సెన్సార్లకు తగలకుండా కారు లారీ కిందికి వెళ్లడంతో సెన్సార్లు పనిచేయలేదని తెలుస్తోంది. బెలూన్లు తెరుచుకుని ఉంటే ప్రాణనష్టం తగ్గేదని పోలీసులు పేర్కొన్నారు. జేసీబీతో చాలాసేపు ప్రయత్నించి కారును, మృతదేహాలను బయటకు తీశారు.వెంకటేశ్వరా.. కాపాడలేదే? = బంధువుల రోదనలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చిన కాసేపటికే వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. పొద్దున బై బై చెప్పి బయల్దేరిన వారు ఇలా అవుతారని అనుకోలేదు.. నెలకు రెండుసార్లు తిరుమలను దర్శించే తమ కుటుంబానికి ఆ దేవుడు ఈ శిక్ష వేయడం ఏమిటి..? అని కుసుమ, జయంతిల అన్న తీవ్రంగా విలపించారు. కారు పేరు కూడా సెవెన్‌హిల్స్ అని పెట్టుకున్నామే.. ఆ వెంకన్నకు మాపై దయలేదా..? అని రోదించారు. మృతుల్లో నాగరాజరావు గతంలో బళ్లారి జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన కుమార్తె, మృతురాలు పూజ బెంగళూరులోనే టెక్కీగా పనిచేసేది. నాగరాజరావు కుమారుడు జర్మనీలో ఉంటాడు. బంధువుల రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి.
అత్త పోరు.. మహిళా టెక్కీ ఆత్మహత్య
యశవంతపుర(కర్ణాటక): మంచి ఉద్యోగం, దండిగా జీతం.. కానీ కుటుంబ కలహాలతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు అబ్బిగెరెలో జరిగింది. అత్త వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన సుష్మ (35) డెల్ సంస్థలో ఐటీ ఇంజనీరు, ఐదేళ్ల క్రితం పునీత్‌కుమార్‌తో పెళ్లి కాగా, 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇంటిలో చిన్నచిన్న విషయాలపై అత్త కల్పనతో సుష్మకు గొడవలు జరిగేవి. మంగళవారం అత్తతో పోట్లాట జరిగింది. దీంతో ఆవేదన చెందిన సుష్మ ఇంటిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. అత్త, భర్త వేధింపుల వల్లనే తమ కూతురు చనిపోయిందని, అదనపు కట్నం తేవాలని సతాయించేవారని సుష్మ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, సోలదేవనహళ్లి పోలీసులు విచారణ చేపట్టారు.
వీడియోలు
BR నాయుడు అత్యంత కళంకితుడు.. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్‌ను చేశారు
ఇది మీ దగ్గర ఉంటే.. 10 ఏళ్లలో మీరే కోటేశ్వరులు
Proddatur: వైఎస్ జగన్ కాన్వాయ్ విజువల్స్
అమెరికా చేతికి ఇరాన్ సీక్రెట్స్.. డేంజర్ జోన్ లో మిస్సైల్ సిటీ
విరోష్ రిసెప్షన్లో సెలబ్రిటీల సందడి
యుద్ధం దగ్గరగా చూశా.. దుబాయ్ లో భయంకర పరిస్థితులపై PV సింధు రియాక్షన్
అమెరికా ఇజ్రాయెల్ Vs ఇరాన్.. వార్ స్ట్రాటజీ అనాలిసిస్
విజయ్ దేవరకొండ & రష్మిక మందన్న రిసెప్షన్ విజువల్స్
BR నాయుడు వీడియో లీక్ వెనుక.. ఆ మీడియా అధినేత?
గెలవాలంటే ఆ మ్యాచ్ విన్నర్ ని దింపాల్సిందే.. ఒక్కడు చాలు...

