Politics
-
కొనసాగుతున్న కక్ష సాధింపు.. భూమా కిశోర్‌రెడ్డిపై కేసు
నంద్యాల: జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో భూమా కిశోర్‌రెడ్డిపై కేసు నమోదైంది. చికెన్ ధరలపై ప్రజల తరపున ప్రశ్నించినందుకు భూమా కిశోర్‌రెడ్డిపై అఖిల ప్రియ అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజల పక్షాన నిలబడి చికెన్ ధర ఎందుకు పెంచారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అంటూ కూటమి ప్రభుత్వంపై భూమా కిశోర్‌రెడ్డి మండిపడ్డారు.అక్రమంగా కేసులు నమోదు చేయడం సరికాదన్న భూమా కిషోర్ రెడ్డి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చికెన్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేక పనులు చేస్తే.. ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. ఎన్ని అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కానీ భయపడేది లేదని భూమా కిషోర్‌రెడ్డి అన్నారు. -
కేసీఆర్‌కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరుకుందని.. కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందంటూ మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పింది. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా.. కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసింది’’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. కవిత పచ్చి నిజాలు మాట్లాడారు.. ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది’’ అని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.‘‘పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడు...కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది.. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.’’ అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. -
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటీవ్, నెగిటీవ్ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. 👉పాజిటీవ్ అంశాలు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నానుసిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయిందిపహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయిరేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారుతెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారుఅయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.👉నెగిటీవ్ అంశాలు :ఉర్దూలో మాట్లాడకపోవడం.వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడంబీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదుఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.పాత ఇన్ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు.పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది.బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.👉అందరూ ఆశించిన విషయం:ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.👉సూచన:కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్‌గా పరిగణించండి’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
‘చంద్రబాబు సర్కార్’ అరాచకాల చిట్టా విప్పిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వాన్ని నిలదీశారు.‘‘రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది...కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది’’ అని మీడియాకు వివరించారు.‘‘టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్‌లు డీజే ర్యాంకు అధికారి. పీఎస్ఆర్ అంజనేయులు, డీజే ర్యాంక్ దళిత అధికారి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ ఐపీఎస్, సీనియర్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్ కాంతిలాల్ రాణా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి ఐపీఎస్ లు, ఐపీఎస్ అధికారి పి.జాషువా, వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, నా వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. బండారు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పాయకరావుపేట: ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా.. సమాధానం చెప్పలేకపోతున్నా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీకీ ఓటు వేయలేదా?. ప్రశ్నించే వేదిక ఇదే.. నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు. ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా’’ అంటూ బండారు వ్యాఖ్యానించారు.మరో వైపు, టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు. -
‘సీఎం రేవంత్ పనైపోయింది.. అదొక లొట్టపీసు కేసు’
సాక్షి, తెలంగాణ భవన్: లొట్టపీసు కేసులతో సీఎం రేవంత్ చేసేది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ‘తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్యారేజ్‌లో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. టైమ్ పాస్ కోసమే కమిషన్ నోటీసులు పంపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు అందాయో? లేదో? తెలియదు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుంది.మిస్ వరల్డ్ ప్లెక్సీలో రేవంత్ రెడ్డి ,బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు ఉన్నాయి. వీరిలో ఎవరు మిస్ వరల్డో అర్థం కావడం లేదు. కమిషన్లు దండుకోవడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.కేసీఆర్ వరంగల్‌కు కదలగానే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజం నిలకడగా తెలుస్తుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనైపోయింది. లొట్టపిసు కేసులతో ఏం కాదు. కోటిమంది మహిళలను కోటీశ్వరలను చేస్తామని అంటున్నారు. అవి అలవికాని హామీలు. ప్రతిపక్షంలో ఉంటూ రేవంత్ నిద్ర పట్టకుండా చేస్తున్నాం. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నిలదీస్తున్నాం’ అని అన్నారు. జూన్ ,జూలైలో బీఆర్ఎస్ నూతన మెంబర్షిప్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి కట్టుగా చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్ధేశం చేశారు. -
నోటీసులపై ఏం చేద్దాం?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ
సాక్షి, సిద్ధిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్‌రావు.. సుమారు మూడు గంటల పాటు కేసీఆర్‌తో మంతనాలు సాగించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా? వద్దా? అన్న దానిపై చర్చించినట్లు సమాచారం. కమిషన్ విచారణకు వెళ్లాలా? లేదా? అన్న దానిపై కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది.కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది.బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం నోటీసులు ఇచ్చింది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్‌రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్‌కు తెలిపింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. బరాజ్‌ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కూటమి నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు రాలేదు: జ్యోతుల నెహ్రూ
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ..‘కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించండి. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి?. ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా?.(కుడా చైర్మన్, డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు). కూటమిలో పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నిసార్లు బయటకు రాలేదు.టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలి. నేను వాళ్లకు ఇవ్వకూడదు అని అనడం లేదు. మా నిష్పత్తి ప్రకారం టీడీపీకి కూడా ఇవ్వండి అంటున్నాను. ద్వితీయ శ్రేణి నేతలు తమ ఇంట్లో వారికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మా వాటా పదవులు మాకు సక్రమంగా ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు. -
జూన్ 4న వెన్నుపోటు దినం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారాయన. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారాయన.ఇదీ చదవండి: YS Jagan-నాకు పోరాటాలు కొత్త కాదు -
విజయసాయిలాంటి వాళ్ల స్టేట్మెంట్లకు విలువుందా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మరోసారి తన మంత్ర దండం బయటకు తీశారని.. వ్యస్థలను మేనేజ్ చేస్తూ తన మోసాలను ప్రశ్నించేవారి గొంతును నొక్కేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే.. లిక్కర్ స్కాం అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారాయన. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా?. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా?. ఎక్కడైనా దుకాణాలు 33 శాతం తగ్గిస్తే లంచాలు ఇస్తారా?. 2019-2024 మధ్య లిక్కర్ సేల్ తగ్గింది. ఒక్క కంపెనీకి లైసెన్స్ ఇవ్వలేదు. ట్యాక్స్‌లు పెంచాం. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు పోలేదు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాం. అదే సమయంలో.. మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేశాం. ప్రతీ బాటిల్‌పై క్యూఆర్ కోడ్ పెట్టించాం.లాభాపేక్ష లేకుండా మా(వైఎస్సార్సీపీ) ప్రభుత్వం అమ్మకాలు జరిపాం... అసలు లిక్కర్ స్కాం (Jagan on Liquor Scam) ఎక్కడ జరిగింది?. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ 12 నెలల కాలంలో లిక్కర్ సేల్ పెరిగింది. కూటమి పాలనలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయి. బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడం లేదు.. మద్యాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే అవి నడుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కొత్త కొత్త బ్రాండులను తీసుకొచ్చారాయన. గతంలో..(2014-19) తన హయాంలోనూ లిక్కర్ సేల్స్ పెంచుకుంటూ పోయారు. తద్వారా అమ్మకాలు పెరిగాయి. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు వెళ్లాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాంటప్పుడు స్కాం ఎక్కడ జరిగింది?. డిస్టరీలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మా హయాంలో ఉందా?’’ అని జగన్ ప్రశ్నించారు.గతంలో లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టికి బెయిల్ మీద ఉంది నిజం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు.. లాటరీ పేరుతో రిగ్గింగ్ చేసి మద్యం షాపులు దోచుకున్నారు. ఆనాడు కూడా ప్రైవేట్ సిండికేట్‌కు మేలు చేశారు. తనకు కావాల్సిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారు. 2015-19 మధ్య ఐదు కంపెనీలు 69 శాతం ఆర్డరులు ఇచ్చారు. తద్వారా కొన్నిబ్రాండ్‌లకు మాత్రమే డిమాండ్ సృష్టించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ సిండికేట్‌కు లబ్ధి చేకూర్చడం కోసం.. తన పాలసీని కొనసాగించడం కోసం.. ఏం స్కాం జరగకపోయినా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. భయపెట్టి.. బెదిరించి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి.. తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి(V. Vijayasai Reddy). వైఎస్సార్సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని.. మూడేళ్ల టర్మ్ ఉండగానే కూటమికి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి.. ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది?. లోక్‌సభ ఎంపీ, ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం?. ఆయన తండ్రి పెద్దిరెడ్డి కనీసం ఆ శాఖ మంత్రి కూడా కాదు. ఐఏఎస్, ఐపీఎస్‌లను జైళ్లో పెట్టిన చరిత్ర లేదు. సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అరెస్ట్ చేసిన ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కేసిరెడ్డి ఒకరు. కేసిరెడ్డికి, బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఏం సంబంధం?. విజయవాడ టీడీపీ ఎంపీ, కేసిరెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. కేసిరెడ్డి అప్రూవర్‌గా మారలేదని నిందితుడిగా చేర్చారు. కావాల్సిన స్టేట్మెంట్ ఇస్తే కేసిరెడ్డిని వదిలేసేవారు. లిక్కర్ స్కాంకి సంబంధించి ఒక్క ఫైల్ అయినా సీఎంవోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా? అని చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా. కుట్రలు చేసి.. సంబంధం లేని వ్యక్తులనూ తెరపైకి తీసుకొచ్చి లిక్కర్ కేసులంటూ తప్పుడు కేసులు పెడుతూ.. రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు. ఐపీఎస్‌లు సంజయ్, కాంతిలాల్ ఠాణా, జాషువా, విశాల్ గున్నీ, ధనుంజయ్, రఘురామ్ రెడ్డి ఇలా అధికారులను వేధిస్తున్నారు అని వైఎస్ జగన్ అన్నారు. -
అమరావతి పేరుతో దోపిడీ.. స్కాంలకు పరాకాష్ట: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీలో జరుగుతున్న స్కాంలకు పరాకాష్ట.. అమరావతి పేరుతో దోపిడీనేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఆర్థిక దోపిడీని వివరించారు. ‘‘అమరావతి పనుల కోసం 2018 లోనూ టెండర్లు పిలిచారు. నాడు ఖరారైన టెండర్ల విలువ రూ.41, 107 కోట్లు. దాదాపు 6 వేల కట్లు పనులు చేశారు. మిగిలిన రూ. 35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉంది. కానీ, ఈ టెండర్లు రద్దు చేేశారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేశారు. ఇప్పటికే కట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కాకుండా మళ్లీ కడతారట. అంటే అన్నీ గంగపాలు చేసినట్లే!. అక్రమాలకు అడ్డు కాకూడదని.. మా హయంలో తెచ్చిన జ్యూడీషియల్ ప్రివ్యూ తీసేశారు. రివర్స్ టెండరింగ్నూ రద్దు చేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌లు లేవు. కానీ, స్కాంల కోసమే మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తెచ్చారు. అడ్వాన్స్‌ల పేరిట 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. 2018 ఐకానిక్ టవర్ల పేరిట టెండర్లకు పిలిచారు. మిగిలిన పనులను ఇప్పుడు నిర్మాణ వ్యయం 4,468 కోట్లు. 2018తో పోలిస్తే దాదాపు రూ.2,417 కోట్లు (105 శాతం) పైగా పెంచారు. చదరపు అడుగుకు రూ.8, 931.. అంటే ఏమైనా బంగారంతో కడుతున్నారా?మీరు సాయం చేస్తే.. పుంజుకుంటాం(ఈనాడు క్లిప్‌ను ప్రదర్శిస్తూ..) అంటూ చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆకాశాన్ని అంటేలా అప్పులు చేస్తున్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. సొంత లాభాలు, బినామీ ఆస్తులను పెంచుకునే పని పక్కన పెడితే.. ఇంతేసి అప్పులు చేయాల్సి ఉండదు కదా’’ వైఎస్ జగన్ సూచించారు. -
అసలువి మరచి.. కొసరుతో కాలక్షేపం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు గమ్మత్తుగా ఉంటుంది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన విషయం ప్రజలకు గుర్తు రాకుండా చేసేందుకు అన్ని రకాల గిమ్మిక్కులూ చేస్తుంటారు. చిన్న, చితకా విషయాలపై సమీక్షల పేరుతో గంటల కొద్దీ సమావేశాలు పెట్టడం.. ఆ వార్తలు తమ అనుకూల పత్రికల్లో ప్రముఖంగా వచ్చేలా చూసుకోవడం.. ఇదీ బాబు మోడల్.చంద్రబాబు ఈ నెల 19న జరిపిన సమీక్ష సమావేశాలనే ఉదాహరణగా తీసుకుందాం. రెండు అంశాలు. ఒకటి.. ప్రభుత్వ సేవలలో లోపాలకు చెక్ పెట్టాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్‌తో మార్పులు చేయాలి అని!. రెండోది... గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా? అన్నది. మామూలుగా చూస్తే ఇది బాగానే ఉంది కదా? అనిపిస్తుంది. కానీ.. ఇది ఒక ముఖ్యమంత్రి సమీక్షించాల్సిన అంశాలా? కింది స్థాయి అధికారో.. లేక సంబంధిత శాఖల మంత్రులో చేస్తే సరిపోదా? అన్నది ప్రశ్న! పైగా తమ సొంత నిర్ణయాల కారణంగా నిన్న మొన్నటి వరకూ ప్రజలకు అందుతున్న రకరకాల సేవలను తొలగించి ఇలా మాట్లాడటం బాబుకే చెల్లుతుంది!.ఈ సమీక్షలోనే రేషన్ సరుకులు పంపిణీ విషయంలో 74 శాతం మంది తమకు రేషన్ అందుతోందని చెప్పారట. ఆయన అడగాల్సిన ప్రశ్న ఇదా? ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని తొలగించిన తరువాత ఏం జరుగుతోందని కదా?. ఇంటి పట్టున అందే రేషన్ అందక ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. కొన్నిసార్లు రద్దీ కారణంగా తోపులాటలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చిత్తశుద్ధిగల ప్రభుత్వం ఏదైనా ఇళ్లవద్దకే రేషన్ అందివ్వాలా? లేక షాపుల వద్దనైనా ఓకేనా? అని ప్రజలను అడిగి తెలుసుకోవాలి. ఇవేవీ చేయకుండానే.. రేషన్ సరఫరా వాహనాలను సేవల నుంచి తొలగించాలని మంత్రివర్గం ఎలా నిర్ణయించింది? ఎవరిని మభ్య పెట్టడానికి ఈ సమీక్ష!.గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయమూ ఇంతే. ఏజెన్సీల నుంచి సిలిండర్లు తీసుకొచ్చేవారికి ఎంతో కొంత టిప్ ఇవ్వడం సాధారణమే. ఇవ్వకపోయినా చెల్లుతుంది. పైగా ఇలాంటి అంశాల గురించి సాధారణంగా కలెక్టర్లు తమ సమీక్షల్లో చర్చిస్తుంటారు. పౌర సరఫరాల శాఖకు ఒక మంత్రి కూడా ఉన్నారు. వీరి స్థాయిలో జరగాల్సిన పనులను ముఖ్యమంత్రి స్వయంగా చేపట్టడం ఎంత వరకూ సబబు?. వాస్తవానికి బాబు సమీక్షించాల్సిన అంశం తాము ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ ఎలా అమలవుతోంది? అని!. ఏడాదికి ఒక సిలిండర్.. అది కూడా కొంతమందికే ఇవ్వడం వల్ల ప్రజలేమనుకుంటున్నారు? అని!. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎల్లో మీడియాలో రాయించుకుంటే ఏం ప్రయోజనం?. పైగా ఇప్పుడు ఇంకొ కొత్తమాట మాట్లాడుతున్నారు.. మూడు సిలిండర్లకు డబ్బులు ప్రజల ఖాతాల్లోకి వేస్తామూ అంటున్నారు. మంచిదే కానీ.. వీటికి నిధులు ఎక్కడివి అని కూడా చెబితే కదా ప్రజలకు నమ్మకం కుదిరేది?. పంచాయతీలలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతోందని అరవై శాతం మంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కూడా సీఎం స్థాయి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చిన అంశం.జగన్ టైమ్‌లో కొద్దిపాటి నిర్వహణ ఛార్జీలతో చెత్త తరలింపు సమర్థంగా చేపడితే ‘‘చెత్త పన్ను’’ అంటూ బాబు అండ్ కో వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు చెత్తపన్ను తీసేశామని చెప్పి... ఆస్తి పన్ను పెంచేశారు! పోనీ చెత్త తొలగింపు జరుగుతోందా అంటే అది అంతంత మాత్రమే!. చెత్త సరిగా ఎత్తడం లేదని 40 శాతం మంది చెప్పారంటేనే ఆ విషయం స్పష్టమవుతోంది!. స్వచ్చాంద్రప్రదేశ్ పేరుతో చంద్రబాబు ఈ మధ్య ప్రత్యేక సభలు పెడుతున్నారు. ఈ మాత్రం పని పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత మంత్రులు చేయలేకపోయారా?. పంచాయతీ రాజ్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? బహుశా ఆయన సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారేమో మరి.ఆర్టీసీ బస్స్టాండ్లలో సేవలపై ప్రజలలో అసంతృప్తి ఉందని తేలిందట. తాగునీరు, టాయిలెట్లు తదితర సదుపాయాలు బాగోలేవట. ఈ సంగతి ముఖ్యమంత్రి స్థాయిలో కనిపెట్టాలా? మరి సంబంధిత మంత్రి ఏమి చేస్తున్నారు?. ఆర్టీసీకి అవసరమైన నిధులు కేటాయించినా అధికారులు ఎందుకు ఈ సేవలు అందించ లేకపోతున్నారు?. ఇక వాట్సప్ సేవలతో అన్ని జరిగిపోతున్నట్లు ప్రొజెక్టు చేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 375 సేవలు అందిస్తున్నారని, జూన్ 12 నాటికి 500 సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. బాగానే ఉంది. ఇంతవరకు 45 లక్షల మంది ఈ సేవలను వాడుకున్నారట. ఏపీ జనాభా ఐదు కోట్లు అనుకుంటే ఈ సేవలను పది శాతం మంది మాత్రమే వాడుకున్నారన్న మాట!. వాట్సప్ సేవల సంగతేమో కాని, జనం ప్రతీ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వస్తోంది.జగన్ హయాంలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, వలంటీర్ల వ్యవస్థలన్నీ నీరు కార్చి ఇప్పుడు వాట్సాప్ కథలు చెబుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం ఐదు వేల నుంచి పది వేలకు పెంచుతామని ఉగాది నాడు పూజలు చేసి మరీ వాగ్దానం చేసిన చంద్రబాబు దానిని గాలికి వదిలి వేశారు. దీనిపై కూడా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనవసరం లేదా!. ఆరోగ్యశ్రీని క్రమేపి బీమా కిందకు మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా?.కొన్ని ప్రభుత్వ సంస్థలలో నెలల తరబడి జీతాలు అందడం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలపై అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాటిపై సమీక్ష జరిపితే పది మందికి మేలు జరుగుతుంది. ఏది ఏమైనా తాను ఇచ్చిన హామీలను అమలు చేసి ఆ తర్వాత వాటి తీరుతెన్నులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటే ఉపయోగం తప్ప, ఇలా విషయం లేని అభిప్రాయ సేకరణలు జరిపి, ఈ స్థాయిలో వాటిని సమీక్షించడం అంటే అవి సీఎం వద్ద జరిగే కాలక్షేపం మీటింగులే అని ప్రజలు భావిస్తారని చంద్రబాబుకు తెలియదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘మోదీజీ.. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించండి’
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘డొనాల్డ్ ట్రంప్ గత 11 రోజుల్లో ఎనిమిది సార్లు భారత్, పాక్ మధ్య కాల్పుల ఒప్పందాన్ని తానే కుదిర్చినట్టు చెప్పారు. భారత్‌ను తానే ఒప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ట్రంప్ ఇదే చెబుతున్నారు. కానీ, ఆయన స్నేహితుడు ప్రధాని మోదీ మాత్రం ఆయన వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారు. మన విదేశాంగ మంత్రి కూడా ఏం మాట్లాడటం లేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. అంటే భారత్, పాకిస్తాన్ ఒకే పడవలో ఉన్నాయి. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ చెప్పినప్పుడు దేశం మొత్తం షాక్ అయ్యింది. ప్రధాని మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆయన ఈ సమస్యల నుండి దృష్టిని మళ్లిస్తున్నారు’ అని ఆరోపించారు.ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ విషయమై అఖిలపక్ష ప్రతినిధుల బృందంపై జైరాం రమేష్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు జమ్ము, కశ్మీర్‌లోనే తిరుగుతున్నారు. వీరందరూ గత 18 నెలల్లో మూడు ఉగ్రవాద దాడులకు కారణమైనట్టు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను పట్టుకోవడమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యతగా ఉండాలి. ఇలాంటిదేమీ లేకుండా.. ఎంపీలందరూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఎంపీలను ఇతర దేశాలకు పంపడం ఎందుకు?. మేము అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?. పార్లమెంట్ సమావేశం జరగాలి. ప్రధానమంత్రి ఎప్పుడూ అఖిలపక్ష సమావేశాలకు హాజరు కారు. ఆయన ఎటువంటి సమాధానాలు ఇవ్వరు అని విమర్శలు చేశారు.#WATCH | Delhi | Congress MP Jairam Ramesh says, "In the last 11 days, US President Trump has repeated 8 times that he convinced India and enabled the ceasefire... But his friend, PM Modi, is quiet. Our foreign minister is quiet... Donald Trump praises both PM Modi and Pakistan… pic.twitter.com/G2FxHs8Trx— ANI (@ANI) May 22, 2025 -
చంద్రబాబు.. అప్పుల సామ్రాట్: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మోసాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలో ఎండగట్టారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్ కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులను లెక్కలతో సహా వివరించారు. ‘‘ఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఏపీఎండీసీకి గనులు తాకట్టుపెట్టి 9 వేలకోట్లు అప్పు చేశారు. 293(1) ప్రకారం బాబు అప్పులు చేసే విధానం చట్ట విరుద్ధం. ఏపీఎండీసీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాష్ట్ర గనులపై ప్రైవేట్ వ్యక్తులు అజమాయిషి ఇస్తున్నారు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
నాకు పోరాటాలు కొత్త కాదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గత ఏడాది కాలంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, చంద్రబాబు పాలన అంతా అవినీతి, స్కాములు, దోపిడీ మయంగా మారిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజా రాజకీయ పరిస్థితులపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద నాణేనికి రెండో వైపులా.. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా!.బాబు 12 నెలల పాలనలో..ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, కాగ్ నివేదికను పరిశీలిస్తే.. అభివృద్ధి కనిపించలేదు. సంక్షేమం ఊసే లేదు. ఈ సంవత్సర కాలం అంతా మోసాలతో గడిపారు. ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. రాష్ట్ర ఆదాయమంతా బాబు గజదొంగల జేబుల్లోకి వెళ్తోంది. అదే మా హయాంలో.. కోవిడ్ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గోప్పగా నడిపాం. అభివృద్ధి, సంక్షేమం.. ప్రజలకు మంచి పరిపాలన అందించాం.అప్పుల సామ్రాట్ బాబుఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈనాడు.. ఓ మీడియానా?ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఓ మాఫియా రాజ్యం. సెకీకి సన్మానం అంటూ ఈనాడు నా ఫొటోలో ఓ కథనం ఇచ్చింది. 2021 డిసెంబర్లో ఏపీతో సెకీ ఒప్పందం అయితే, ఆపై రెండేళ్లకు సెకీ చైర్మన్ నియామకం జరిగింది. కానీ, సెకీకి సన్మానం అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ఇచ్చింది. ఈనాడు.. టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కి తక్కువ. దున్నపోతును ఈనితే.. దూడను కట్టేసినట్లు ఉంది ఈనాడు తీరు. సిగ్గు పడాలి మీడియా అని చెప్పుకునేందుకు. పరాకాష్టకు స్కాంలురాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా.. ఇలా అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ నుంచి రాష్ట్రానికి రూపాయి రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటలకు యూనిట్‌కు రూ.4.60 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. మా హయంలో రూ.2.49కే విద్యుత్ కొన్నాం. విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ఖర్చు తగ్గించాం. బాబు పాలనలో విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఖజానాకు గండి కొట్టారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదోగానీ.. ఉర్సా అనే సంస్థకు భూములు ఇచ్చారు. బిడ్ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇచ్చారు. స్కాంలకు పరాకాష్ట్ర అమరావతి పేరుతో దోపిడీనే.. జూన్ 4న వెన్నుపోటు డేకిందటి ఏడాది జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు ఎలాంటి హామీ నెరవేర్చలేదు. అందుకే చంద్రబాబు మోసాలకు గుర్తుగా ఆ రోజున వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటాం. కలెక్టర్లకు హామీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. బాబు ఎందుకు అరెస్ట్ కాకూడదు?రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. తనపై కేసులను చంద్రబాబు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్‌పై ఉంటూ అధికార దుర్వినయోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ కండిషన్లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు అరెస్ట్ కాకూడదు?లిక్కర్ స్కాం పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందా? అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా.. ‘‘నాకు పోరాటాలు కొత్త కాదు. గతంలో రెండు పార్టీలు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా న్యాయమే గెలుస్తుంది. గతంలో ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా వైఎస్సార్సీపీ పుట్టింది.. పెరిగింది.. ఎదిగింది. న్యాయం, ధర్మం వైపే దేవుడు ఉంటాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
కేంద్రంపై స్టాలిన్ పోరాటం.. సుప్రీంలో పిటిషన్
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వశిక్ష అభియాన్ నిధుల కోసం తమిళనాడు ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. 2024–2025 సంవత్సరానికి రూ.2,151 కోట్లకు పైగా నిధులను నిలిపేయడాన్ని సవాలు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ విద్యా విధానం 2020ని డీఎంకే ప్రభుత్వం అమలుచేయకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వ శిక్ష అభియాన్ నిధులను కేంద్రం నిలుపుదల చేసింది. జాతీయ విద్యా విధానం అమలుతోనే నిధులు వస్తాయని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేంద్రంపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. సర్వశిక్ష అభియాన్ నిధులను జాతీయ విద్యావిధానాన్ని అనుసంధానిస్తూ కేంద్రం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం, అసమంజసమైనదని పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ పెట్టిన వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోమారు ప్రభుత్వం కేంద్ర నిధులపై పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. -
సీఎం రేవంత్‌రెడ్డిది పర్సంటేజీ పాలన: కేటీఆర్
నల్లగొండ టూటౌన్: ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా ఇచ్చే నోటీసులకు, విచారణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. నల్లగొండ పట్టణంలో బుధవారం ఓ వివాహానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, పర్సంటేజీల పాలన అని విమర్శించారు. కమీషన్లు ఇవ్వనిదే ఈ ప్రభుత్వంలో పనులు కావని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగ వేదికలపైనే చెబుతున్నారని అన్నారు. 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు రాష్ట్ర సచివాలయంలోనే ధర్నా చేశారని గుర్తుచేశారు. ఈ కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమిషన్ల ఏర్పాటు, నోటీసులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది దద్దమ్మ ప్రభుత్వం: ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి గురువారానికి మూడు నెలలు పూర్తవుతుంది. అందులో చనిపోయినవారి శవాలను కూడా తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు విచారణ లేదు. అందుకు కారణమైన సంస్థపై చర్యలు లేవు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపుహౌస్ మునిగింది. పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా చర్యలు లేవు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేశంలో చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయం, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణకు మేలు చేసినవారిని ఆ దేవుడే కాపాడుతాడు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలు అమలు చేసేంతవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’అని తేల్చి చెప్పారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్ గాందీ, బీఆర్ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
అనంత జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం ప్రదర్శించారు. జెడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ చాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చేశారు. జడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగారు. వైఎస్ జగన్ ఫొటో తీసేయాలంటూ రాద్ధాంతం చేశారు. ఉద్యోగం తీసేయిస్తామంటూ జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదు: వెన్నపూస రవీంద్రారెడ్డిఅనంతపురంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరించారన్నారు. అనుమతి లేకుండా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవా?. చంద్రబాబు ఫోటోపై ఉన్న శ్రద్ధ... సూపర్ సిక్స్ హామీల అమలులో ఎందుకు చూపలేదు?. జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదని వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. -
తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్ జగన్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్ జగన్‌కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్ జగన్.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు. -
కీలక రాజకీయాంశాలపై వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కీలక రాజకీయ అంశాలపై ఆయన మీడియా ద్వారా ప్రజలకు సందేశం ఇస్తారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో పాటు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం మైక్ ఇవ్వని పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానంటూ వైఎస్ జగన్(YS Jagan), కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తొలినాళ్లలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధికారంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను(Kutami Atrocities), ప్రతీకార రాజకీయాలను ఆయన ఎండగడుతూ వస్తున్నారు. అంతేకాదు.. గత వైఎస్సార్సీపీ హయాంలో కొనసాగిన సంక్షేమం ఆగిపోవడం, ఉద్దేశపూర్వకంగా అన్ని వర్గాల లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుండడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేయడం లాంటి.. తాజా అంశాలపైనా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: రేషన్ డెలివరీ వాహనాలపై కుట్రలెందుకు? -
కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని.. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు(Notices To KCR) జారీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Rama Rao) అన్నారు. పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారాయన. రేవంత్ సర్కార్(Revanth Sarkar)కు కమీషన్లు తప్ప.. పాలన చేత కాదు. ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసుల డ్రామా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే ఈ నోటీసులు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నం. ఇలా ఎన్నో నోటీసులు ఇచ్చినా దుదీ పించల్లా ఎగిరి పోతాయి. కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ.. ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలును పక్కనపెడదామనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ చట్టానికేమైనా అతీతుడా? -
‘బాబూ.. రేషన్ డెలివరీ వాహనాలపై కుట్రలెందుకు?’
సాక్షి, అనంతపురం/తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ చేసిన సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవు పలికారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదు. వైఎస్ జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఆపడం దారుణం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి విదేశీ నిధులు ఆపడం దుర్మార్గం. హంద్రీనీవా లైనింగ్ పనులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని వ్యాఖ్యనించారు.వరదల్లో ఆదుకున్నవి ఇవే కదా: కారుమూరి తాడేపల్లిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కానీ, ఆ సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారు. రేషన్ డెలివరీ వాహనాల వ్యవస్థను చంద్రబాబు తొలగించారు. ఈ వాహనాల ద్వారా పేదలకు ఎంతో ఉపయోగం జరిగింది. అలాంటి వ్యవస్థను చంద్రబాబు ఎలా నాశనం చేయగలుగుతున్నారు?. ఎండీయూల తొలగింపు ద్వారా 20వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 2.60 లక్షల మంది వాలంటీర్లను కూడా రోడ్డున పడేశారు.ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తూ రేషన్ బియ్యాన్ని ఆపేయటం ఏంటి?. పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ నిలిపేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ ఎండీయూ వాహనాలు ఆ తర్వాత డిపోలు తొలగిస్తారు. చంద్రబాబుది శాడిస్టు బుద్ధి. అందుకే ప్రజలను పట్టి పీడిస్తున్నారు. గోదావరి వరదలు, విజయవాడ వరదల సమయంలో ఎండీయూ వాహనాలే ఆదుకున్నాయి. ఎండీయూ వాహనదారులకు మేము అండగా నిలుస్తాం. ఆ వాహనాలను కొనసాగించాల్సిందే. లేకపోతే వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎండీయూ వాహనాల ద్వారా ఏం అక్రమాలు జరిగాయో ప్రభుత్వం చెప్పాలి?. సీజ్ ద షిప్ ఎపిసోడ్ ఏమైంది?. ఆ కేసులో ఎంత బియ్యం సీజ్ చేశారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. జగన్ సంస్కరణలను నాశనం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. -
తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు: మల్లు రవి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు.. కేసీఆర్ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎంపీ మల్లు రవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. ముగ్గురు కలిసి ప్రజా ప్రభుత్వం మళ్ళీ రాకుండా కుట్ర చేస్తున్నారు. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా ప్రభుత్వమే వస్తుంది. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా?. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. బీహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా?. కేసీఆర్, హరీష్, ఈటల.. కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా?. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్‌కు సహకరించాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఏదైనా వస్తువు కొన్నాక కొన్నాళ్ళు వాడిన తరువాత దానిమీద.. దాని పనితీరు మీద అసంతృప్తి మొదలవుతుంది. అయ్యో బోలెడు డబ్బు పోసి కొన్నాను ఇది సరిగా పనిచేయడం లేదు. బాగుంది తీసుకెళ్లండి అంటూ షాపువాడు నన్ను మోసం చేసాడు అని తిట్టుకోవడం సహజం. కానీ చంద్రబాబు అనే నాసిరకం సరుకును తెచ్చుకున్న జనం దాన్ని ప్యాకింగ్ విప్పిన క్షణం నుంచీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో బయట మాటలు.. కలరింగ్.. మార్కెటింగ్ వాడి మాయ కబుర్లు నమ్మేసి ఈ దారిద్య్రాన్ని ఇంటికి తెచ్చుకున్నామే అన్నట్లుగా ప్రతి ఇంట్లోనూ తిట్టడం మొదలైంది. దుకాణంలో కౌంటర్లో చూపించేది ఒక రకం సరుకు.. మనకు పార్సిల్ చేసి ఇచ్చేది ఇంకో రకం సరుకు అన్నట్లుగా ఎన్నికల సభల్లో చంద్రబాబు.. లోకేష్.. పవన్ చెప్పింది ఒకటి. గెలిచాక చేస్తున్నది ఇంకోటి అని ఏడాది లోపే తేలిపోయింది. దీంతో పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి అనుకుని ఉన్న కాకినాడ ఎంపీ సెగ్మెంట్లోని తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఇటీవల జరిపిన సర్వేలో చేదు నిజాలు వెలుగుచూశాయి. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ జనంలో వ్యతిరేకత ఎక్కువే ఉంది.ఎన్నికల సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు.. అత్యుత్సాహంతో విరిసిన డైలాగులు.. ఊపిన చేతులు.. హావభావాలని గుర్తు చేసుకుంటున్న జనం ఏదీ ఆ జోరు ఇప్పుడు కనిపించదేమి అని ప్రశ్నిస్తున్నారు. పైగా తెలుగుదేశం నాయకుల రౌడీయిజం.. రుబాబు.. దోపిడీ వంటి వాటిని పవన్ ఏమాత్రం ప్రశ్నించకపోవడంతో జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైనట్లు భావిస్తున్నారు. దీంతో ఇది కూడా నాసిరకం సరుకు.. ప్యాకింగ్ చూసి కోనేసాం.. లోపలంతా తాలు సరుకు అని తిట్టిపోస్తున్నారు. పైగా పవన్ కూడా పార్టీని గాలికి వదిలేసి తన అన్న నాగబాబుకు పదవి ఇప్పించుకోవడంతో సంతృప్తి చెంది ఇతర నాయకుల పొలిటికల్ కెరీర్ గురించి పూర్తిగా ఇగ్నోర్ చేయడంతో వారిలో అసంతృప్తి మొదలైంది.పైగా గ్రామాల్లో జనసేన కార్యకర్తల రౌడీయిజం వంటివి జనాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ విషయాన్నే వైఎస్ జగన్ కూడా తాజాగా పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఏడాదిలోపే ప్రభుత్వం మీద వ్యతిరేకత కమ్ముకొచ్చిందని.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టాలని కేడర్‌కు సూచించారు. ఆయన చెప్పడం అని కాదు కానీ గ్రామాల్లో ఇప్పటికే చంద్రబాబు పాలనమీద పెదవి విరుపు మొదలైంది. ఇసుక ధరలు పెంపు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు.. రౌడీయిజం వంటివి జనంలో వ్యతిరేకతని పోగుచేస్తున్నాయి. -సిమ్మాదిరప్పన్న. -
గంటా రవితేజ నోట.. జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేశ్‌బాబు!
మధురవాడ(విశాఖపట్నం): భీమిలి నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడులో పార్టీ నేతల మధ్య అసమ్మతి సెగ బయటపడింది. పీఎంపాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగిన ఈ సభకు కోరాడ రాజబాబు వర్గం డుమ్మా కొట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కె.బాలాజీ, టీడీపీ నేతలు తొలుత దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభాధ్యక్షత వహించిన 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ముందుగా గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ప్రకటించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ పరిశ్రమల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. రాజబాబు వర్గం డుమ్మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన భీమిలి టీడీపీ ఇన్చార్జ్ కోరాడ రాజబాబు, అతని వర్గం ఈ సభకు డుమ్మా కొట్టింది. ఆనందపురం ప్రాంత నాయకులు కూడా అరకొరగానే వచ్చారు. కొంత కాలంగా గంటా, కోరాడ మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు ఈ సభ స్పష్టతనిచ్చింది. సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లపై కూడా రాజబాబు ఫొటో ఎక్కడా కనిపించలేదు. రాజబాబును నియోజకవర్గ ఇన్చార్జిగా అనధికారికంగా ఇప్పటికే తప్పించినట్లు తమ్ముళ్లు గుసగుసలుపోతున్నారు. ఇప్పుడు సభలోనే గంటా రవితేజను ఇన్చార్జిగా ప్రకటించేశారు. స్థానిక కమిటీలపై అసంతృప్తి పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సీనియర్లకు గంటా వచ్చాక తగిన ప్రా«ధాన్యత దక్కట్లేదన్న విమర్శలున్నాయి. పదవులు, స్థానిక కమిటీల్లో కూడా వారికి చోటు దక్కలేదు. మధురవాడలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో సీనియర్ నాయకులు అసమ్మతి ర్యాలీగా మహానాడుకు తరలి రావడం విశేషం. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదంటూ సంకేతాలు ఇస్తున్నారు.జోహార్ సీఎం సర్! గంటా రవితేజ తన ప్రసంగంలో జోహార్ ఎన్టీఆర్.. జోహార్ సీఎం సర్.. జోహార్ లోకేశ్‌బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారు అవాక్కయ్యారు. చనిపోయిన వారికి కదా జోహార్లు అరి్పంచేది అంటూ.. పక్కనే ఉన్న నాయకులు చెప్పడంతో.. పొరపాటున అలా అనేశానంటూ.. వివరణ ఇచ్చుకున్నారు. -
లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు!
పచ్చ పత్రిక ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని అనిపిస్తుంది!. కానీ, బాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వీళ్లు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే!. ఈ మధ్య కాలంలోనే రూ.33వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వీటితో 34 వేల మందికి ఉపాధి దొరికేసినట్లు ఈనాడు ఒక కథనాన్ని వండి వార్చింది.రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటికి జగన్ హయాంలోనే ఒప్పందాలు కుదిరినా వాటిని బాబు గారి ఖాతాలో వేసేసి తరిస్తున్నాయి ఎల్లో పత్రికలు!. తప్పులేదు కానీ.. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే రోత పుట్టిస్తున్నాయి. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది’ అని చంద్రబాబు అన్నట్టు.. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు బాబు చెప్పారని రాసుకొచ్చింది ఈనాడు!. మొత్తం రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపిందని, 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కూడా బాబు చెప్పినట్లు ఈ కథనం చెబుతోంది. విచిత్రం ఏమిటంటే బోర్డు సమావేశం జరగడానికి ముందు రోజు టీడీపీ పాలిట్‌బ్యూరో సమావేశంలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. వీటిలో దేనిని నమ్మాలి?.తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టులలో కొన్ని గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందాయన్నది వాస్తవమా? కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలో బీఈఎల్ యూనిట్, అనకాపల్లి వద్ద టైర్ల ప్యాక్టరీ, శ్రీసిటీలో డైకిన్ సంస్థలన్నీ ఇవన్ని గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకువెళుతున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ హయాంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏమి ఉంటుంది!. అలాగే, లోకేష్ ఈ మధ్య శంకుస్థాపనలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినవే అన్నది వాస్తవం.ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు బేతపల్లిలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా జగన్ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతోంది. ఓర్వకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్లింది. అదానీకి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు కూడా కేటాయించారు.ఆ రోజులలో ఎల్లోమీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. రామాయంపట్నం వద్ద శిర్డిసాయి కంపెనీకి చెందిన ఇండో సోలార్ ప్రాజెక్టు వస్తుంటే ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డిపై ఎన్ని అసత్య కథనాలు వండివార్చారో లెక్కలేదు. జగన్ బినామీ అని కూడా ఎల్లో మీడియా ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్ ఇస్తోందంటూ విషపు రాతలు రాసింది. తదుపరి ఏమైందో కానీ, ఆ సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనను ఆనందంగా ప్రచురించుకుంది. అంటే, ఆ కంపెనీ యజమానిని ఈ మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని అనుకోవాలా? ఆయా కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేవు.మరో ఉదాహరణ కూడా చెప్పాలి. విజయవాడ సమీపంలోని మల్లవల్లి వద్ద అశోక్ లేలాండ్ సంస్థ 2022లోనే బస్సుల తయారీని ఆరంభించింది. ఆ విషయం ఆ కంపెనీ సెబీకి కూడా తెలిపింది. కానీ, కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ఆరంభమైనట్లు, లోకేశ్ ప్రారంభోత్సవం చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా యుగంలో ఏదో మాయ చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతామన్న సంగతిని నేతలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి?. కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని పరిశ్రమలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు?. కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి తెస్తున్నది పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్దమా?. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, ఇలాగైతే తాము పని చేయలేమని ఒక సిమెంట్ కంపెనీ హెచ్చరించడమూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా అన్నీ టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపేవే కదా?.ఆది నారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారే!. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని దందాలకు రెండు సిమెంట్ కంపెనీలు కొన్నాళ్లపాటు మూతపడ్డాయి కదా?. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక కూటమి నేతలు కింగ్ ఫిషర్ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కదా?. రెడ్‌బుక్ కారణంగా జిందాల్ సంస్థ ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులను కాస్తా మహారాష్ట్రకు తరలించిందే!. గత ఫిబ్రవరి 12న ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏపీలో పారిశ్రామికాభివృద్ది ‘-2.94 శాతం’గా ఉందని, పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా! దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా?. దావోస్‌కు వెళ్లి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి, చివరికి ఒక్క రూపాయి కూడా తేలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానిని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్ బాగా ప్రచారమైందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లు ఎందుకు చెప్పారు?. చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా?. వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని శంకుస్థాపన చేసుకుని ప్రారంభమయ్యాయి కూడా. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ను చూడవచ్చు.అంతేకాదు.. ఎన్టీపీసీ లక్ష పదివేల కోట్ల వ్యయంతో హైడ్రో పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ దీనికే శంకుస్థాపన చేశారు. కాకపోతే దీన్ని టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. వాటిలో కొన్నిటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల కోల్పోయాయన్న విమర్శలు ఉన్నాయి.ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయనను చూసే వస్తున్నాయని లోకేష్ చెబుతుంటారు. కానీ, అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు ఎకరా 99పైసలకే కట్టబెట్టవలసిన దుస్థితిలో రాష్ట్రం ఉంది. లీజుకు ఇవ్వాలని టీసీఎస్ సంస్థ కోరినా దాదాపు ఉచితంగా విక్రయించడం ఎందుకో?. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కారుచౌకగా అరవై ఎకరాల భూమిని కట్టబెడ్టడంలోని ఆంతర్యం ఏమిటి? ఏది ఏమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తకాదు.2014 హయాంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో పదోవంతు కూడా వచ్చినట్లు స్పష్టంగా తెలియలేదు! నిరుద్యోగ భృతి ఎగవేయడానికి ఇలా చేస్తుండవచ్చు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని, గత ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్‌ను పాడు చేయకుండా చిత్తశుద్దితో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుందాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ లేకపోయినా పదవి కోసం దిగజారిపోతున్నారని మండిపడ్డారు. కోరం లేకుండా చేసి.. గెలిచినట్లు ప్రకటించుకున్నారని తప్పును ఎత్తి చూపారు. ఈ రోజు తిరువూరు.. నిన్న, మొన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. ఎక్కడైనా అదే రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఈ రోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో అన్నీ మనం గెలిచాం. కేవలం రెండు మున్సిపాలిటీల్లో ఓడిపోయాం. తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు 16 మంది కౌన్సిలర్లు ఉంటే, టీడీపీకి 18 మంది ఉన్నారు. ఇద్దరిని లాగుదామని, మన ఎమ్మెల్యే అంటే, నేను వద్దన్నాను. ఎమ్మెల్యేను హౌజ్ అరెస్టు చేయించి, చైర్మన్ ఎన్నిక నిర్వహించాను. అదీ మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం. ‘నాడు జగనన్నకు చెబుదాం’, ‘స్పందన’ అనే కార్యక్రమాల ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా, నేరుగా సీఎంఓ ఫాలోఅప్ చేసేది. అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారివే పరిష్కారమయ్యాయి’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటిస్తారా? ⇒ ఆ రోజు కులం, మతం, రాజకీయం చూడకుండా మనం పాలించాం. అదే ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం రాజకీయం చేస్తున్నాం. ⇒ తిరువూరులో 20 మంది కౌన్సిలర్లలో 17 మంది వైఎస్సార్సీపీ, మిగతా ముగ్గురు టీడీపీ. అయితే బలవంతంగా ఐదుగురిని లాగారు. అయినా ఆ ఎన్నికలో మనమే గెలవాలి. ఎందుకంటే మన బలం 12. టీడీపీకి కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి బలం లేకపోయినా, పదవి కోసం దారుణంగా వ్యవహరిస్తున్నారు. లేదంటే పోలీసుల సహాయంతో ఎన్నిక జరగకుండా చూస్తున్నారు. మన నాయకులను హౌజ్ అరెస్టు చేశారు. టీడీపీ వారందరినీ రోడ్ల మీదకు వదిలారు. ఈరోజు హైకోర్టులో హౌజ్ మోషన్ మూవ్ చేశాం. పోలీసు బందోబస్తు కోరాం. ⇒ నరసరావుపేటలో మొత్తం 17 గెలిచాం. కానీ వారిలో కొందరిని లాక్కున్నారు. దీంతో మనకు 13 మంది సభ్యులు ఉండగా, టీడీపీకి కేవలం ముగ్గురే ఉన్నారు. ఒకరు చనిపోయారు. కోరం లేకపోయినా గెలిచామని ప్రకటించుకున్నారు. ⇒ కారంపూడిలో మొత్తం 14 వైఎస్సార్సీపీ గెలిస్తే, ఆరుగురిని లాగారు. అయినా అక్కడ మన బలం ఎనిమిది కాగా, టీడీపీకి ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయినా కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించారు. చివరకు కుప్పం మున్సిపాలిటీ, రామకుప్పంలోనూ అదే పరిస్థితి. ⇒ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో వైఎస్సార్సీపీ 9 గెలిస్తే, టీడీపీ 1 గెలిచింది. అయినా ఎంపీపీ ఎన్నికలో అక్రమాలు. ఒక పార్టీ మీద గెలిచినప్పుడు, వారిని లాక్కోవడం ఏమిటి? సీఎంగా ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా పోలీసులను పెట్టి భయపెట్టడం ఏమిటి? మన పార్టీ నుంచి ముగ్గురిని లాక్కున్నారు. అయినా మనకు ఇంకా ఆరుగురు ఉన్నారు. మనదే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. అయినా దౌర్జన్యం చేసి, కోరం లేదని చెప్పి, ఎన్నిక గెల్చే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో వైఎస్సార్సీపీ 14, టీడీపీ నాలుగు స్థానాల్లో నెగ్గింది. ఒకరిని లాక్కున్నారు. మిగతా వారు గట్టిగా నిలబడడంతో ఏం చేయలేక వదిలేశారు. ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ అయిన పరిస్థితుల్లో మనం ఏకం అవుతున్నాం.వైఎస్సార్సీపీలో చేరిన విశాఖ టీడీపీ కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్సాక్షి, అమరావతి: విశాఖపట్నం 41వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మంగళవారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ వాసుపల్లి గణేశ్ పాల్గొన్నారు. -
కొత్త సాంప్రదాయం.. టీడీపీ కార్యకర్తకు ఉద్యోగం
విజయవాడ: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తమ పార్టీకి చెందిన వారికే వర్తింపు చేయాలని, ఇది ఏ స్థాయి అధికారి అయినా గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని గతంలో బహిరంగంగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఉద్యోగాలు కూడా టీడీపీ కార్యకర్తలకే ఇస్తామనే విషయాన్ని తాజాగా బహిర్గతం చేశారు. ఓ టీడీపీ కార్యకర్తకు ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేబినెట్ సాక్షిగా నిలవడం గమనార్హం. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా నిర్ణయం తీసుకోవడం చెడు సాంప్రదాయానికే తెరలేపినట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత కక్షలతో చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త హత్యగావించబడితే, ఆయన కుమారుడికి ఇప్పుడు శాశ్వత ఉద్యోగం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు.2022లో వెల్దుర్ది మండలం గుండ్లపాడుకు చెందిన చంద్రయ్య హత్యగావించబడ్డాడు. అయితే రెండు కుటుంబాల నడుమ చోటు చేసుకున్న విభేదాల కారణంగా చంద్రయ్యను హత్య చేసింది మరో కుటుంబం. ఈ హత్యకు రెండు కుటుంబాల మధ్య కక్ష అని అప్పట్లోనే పోలీసులు సైతం ప్రకటించారు. ఇక్కడ చంద్రయ్య కుటుంబం కూడా ఒక కుటుంబంపైనే ఫిర్యాదు చేసింది కూడా. అంటే ఇదంతా వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంటే, మరి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం -
‘కేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారు’
ఎన్టీఆర్ జిల్లా: ప్రశాంతమైన తిరువూరులో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. ‘టీడీపీ గూండాలు మాపై దాడి చేశారు కేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారు. మా కారును ధ్వంసం చేశారు.. మమ్మల్ని హతమార్చాలని చూశారు, టీడీపీ గూండాల దాడికి పోలీసులు సహకరించారు. మాపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టం. పోలీసులే రాజకీయం చేస్తున్నారు.కౌన్సిలర్లకు వారి ఇంటి నుంచి భద్రత ఇస్తామని వితండవాదం చేశారు. మా కౌన్సిలర్లకు మేమే రక్షణగా నిలిచాం. టిడిపి ఎంపీ కేశినేని చిన్ని మందు పోయించి టిడిపి గూండాలను మా పైకి రెచ్చగొట్టారు. మా కారును పైకి లేపి పల్టీలు కొట్టించి...ధ్వంసం చేయాలని చూశారు. మా కారు ధ్వంసం చేసే వరకూ పోలీసులు చూస్తూ ఊరుకున్నారు’ అని ధ్వజమెత్తారు.కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదునేను 35 ఏళ్లుగా తిరువూరు రాజకీయాలు చూస్తున్నా. తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండా మాదిరి వ్యవహరించారు. ఇలాంటి ఎమ్మెల్యేని తిరువూరు ప్రజలు ఎన్నడూ చూడలేదు. కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. టిడిపి నేతలను చట్టపరంగా శిక్షిస్తాం. మాకు రక్షణ కల్పించమని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లిపోయారు. అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుంది. రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం లేదు. రాబోయేది జగన్ మోహన్ రెడ్డి 2.0 పాలనే. తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాం. మాపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారి పై కేసు పెట్టి చట్టం ముందు నిలబెడతాం’ అని తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి,నల్లగట్ల స్వామిదాస్ హెచ్చరించారు.టీడీపీ గూండాలు భయోత్పాతం స్పష్టించారురెండు గంటల పాటు టిడిపి గూండాలు భయోత్పాతం సృష్టించారు. తిరువూరు వెళ్లడానికి మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. పోలీసులే దగ్గరుండి టిడిపి గూండాలతో మాపై దాడి చేయించారు, మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. నా కారును ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ , హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. ఒక్కో కౌన్సిలర్ కు ఒక్కొక్క గన్ మెన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయ్. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే మేమే రక్షణ కవచంలా నిలిచాం. మా కారును ధ్వంసం చేసి మా పై హత్యాయత్నం చేశారుతిరువూరు టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తించాడు. మా కారును అడ్డగించి మా పై దాడి చేసారు. నన్ను , స్వామిదాస్ ను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు’ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. -
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ: సుదర్శన్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్‌తో పాటు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయలేదని ఆ పార్టీ లీగల్ సెల్ సీనియర్ నాయకుడు జల్లా సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్లను ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్లనివ్వకుండా మార్గమధ్యలోనే కూటమి పార్టీలకు చెందిన గుండాలు అడ్డుకుని దౌర్జన్యం చేశారని అన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు కూటమి నేతలకు అండగా నిలబడి, వైఎస్సార్సీపీ నేతలనే అరెస్ట్ చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఖూనీ అవుతోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం విజయవాడ నుంచి తరలివెళుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై మరోసారి కూటమి పార్టీలకు చెందిన గుండాలు దౌర్జన్యం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది. నిన్న కౌన్సిలర్లు ఎన్నికకు హాజరుకాకుండా కూటమి పార్టీలకు చెందిన వారు ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో అందరూ చూశారు. దీనితో ఈ రోజుకు ఎన్నికను వాయిదా వేశారు. ఏ విధంగా అయినా సరే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఈ రోజు కూడా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు హాజరుకాకుండా అడ్డుకోవడాలని, తమకున్న కొద్దిపాటి సభ్యుల నుంచే చైర్మన్‌ను ఎన్నుకోవాలని కూటమి పార్టీలు కుట్ర పన్నాయి.దీనిని అర్థం చేసుకున్న వైఎస్సార్సీపీ నిన్ననే ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఎన్నికకు హాజరయ్యేందుకు రక్షణ కల్పించాలని కోరిన మీదట, ఎన్నికల కమిషన్ డీజీపీతో పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలంటూ మెమో కూడా జారీ చేసింది. దీనిలో భాగంగానే వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎక్కడి నుంచి ఏ మార్గంలో తిరువూరు మున్సిపల్ కార్యాలయం వరకు వెడతారో పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ అధికారులకు అందచేశాం.రక్షణ కల్పించాల్సిన పోలీసులే దౌర్జన్యానికి కొమ్ముకాశారునిన్న కూటమి పార్టీలు చేసిన దౌర్జన్యానికి భయపడి పలువురు కౌన్సిలర్లు విజయవాడ రామవరప్పాడులోని ఒక హోటల్లో తలదాచుకున్నారు. నిన్న టీడీపీ నేతలు కిడ్నాప్‌కు ప్రయత్నించడంతో మరో మహిళా కౌన్సిలర్ తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఇంట్లో ఆశ్రయం పొందారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి భద్రత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఈ మొత్తం అంశంపై కోర్ట్‌లో హౌస్ మోషన్ కింద పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. రాత్రి ఫైల్ చేసిన పిటీషన్‌ను ఈ రోజు పదిగంటలకు కోర్ట్ విచారణకు స్వీకరించింది. ఈ సందర్బంగా కోర్ట్ ఎదుట ప్రభుత్వం తరుఫు న్యాయవాది మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు పూర్తి రక్షణ కల్పించడం జరిగిందని చెప్పారు. అయితే ఏ అధికారి పర్యవేక్షణలో రక్షణ కల్పించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు రక్షణ కల్పించారని, ఒక ఏసీపీ స్థాయి అధికారిని నియమించి, ఆయన ద్వారా కోర్టుకు నివేదిక సమర్పించాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కోర్టులో ఈ అంశం విచారణలో ఉందని తెలిసి కూడా ఏ కొండూరు మండలం పడమట మాధవరం గ్రామం వద్ద కూటమి పార్టీలకు చెందిన వారు వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లను అడ్డుకున్నారు. కూటమి నేతల దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, నాయకుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్లను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో భయాందోళనలకు గురైన వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎన్నిక జరిగే ప్రదేశంకు వెళ్ళకుండానే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెనుదిరిగారు.వీరు సమావేశంకు వెడితే కూటమి పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఓడిపోతారు. అందుకే రెండోసారి కూడా ఎన్నిక జరగకుండా అధికారబలాన్ని ఉపయోగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. చట్టంలోని లొసుగును అడ్డం పెట్టుకుని మూడోసారి కోరం లేకపోయినా ఎన్నిక జరపవచ్చని చూపుతూ వారికి ఉన్న తక్కువ మంది కౌన్సిలర్ల నుంచే చైర్మన్‌ను ఎన్నుకోవాలన్నదే వారి లక్ష్యం. ఇలాంటి చర్యలను చూస్తే ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉందా అనే సందేహం కలుగుతోంది. న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగానే పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం చూస్తూంటే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఖూనీ అయ్యిందని అర్థమవుతోంది. ఈ జరిగిన మొత్తం వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోతున్నాం. దీనికి బాధ్యులైన అధికారులపై న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుంది. -
తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా
సాక్షి, విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. కోరం లేక ముగించిసనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న, ఈ రోజు టీడీపీ అరాచకం వల్ల ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరగకుండా టీడీపీ గూండాలు అల్లర్లు సృష్టించారు. టీడీపీ గూండాల బీభత్సంతో రెండు రోజులు ఎన్నిక జరగలేదు. వైసీపీ కౌన్సిలర్లు తిరువురు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజురుకాలేకపోయారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ఆర్డీవో కే.మాధురి ముగించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యచరణ ఉంటుందని ఆర్డీవో ప్రకటించారు.దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసు వాహనం ఎక్కనివ్వకుండా టీడీపీ టీడీపీ నేత రమేష్ రెడ్డి, టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై కూడా టీడీపీ గూండాల దాడి చేశారు. దేవినేని అవినాష్ , మొండితోక అరుణ్ కుమార్‌లను రెడ్డిగూడెం స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు. -
టీడీపీ గూండాల దౌర్జన్యం.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆ పార్టీ ప్రతినిధి బృందం మండిపడింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పండుల రవీంద్రబాబు, వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్య నాయకులు విజయవాడలో మరోసారి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి జరిగిన దౌర్జన్యానికి సంబంధించి ఫిర్యాదు చేశారు.కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు బేఖాతరు చేయని వైనంపై ఆధారాలతో సహా కమిషనర్‌కు వివరించారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించకపోగా, దాడికి పాల్పడిన కూటమి నేతలకు అండగా నిలుస్తూ, వైఎస్సార్సీపీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేసిన వైనాన్ని కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. అనంతరం విజయవాడలో మీడియాతో పార్టీ నేతలు మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే..పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పోలీసులే ఎస్ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి పూర్తి బలం ఉన్నా, అధికార బలంతో అడ్డదారిలో నెగ్గాలని చూస్తున్నారు. తిరువూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో టీడీపీ అనుసరిస్తున్న విధానాలు, పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించడంపై ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి వైఎస్సార్సీపీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు. రాష్ట్రాన్ని బీహార్‌లా మార్చేశారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి అధికార టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ నాయకులకు వంత పాడుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లకు స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రౌడీ మూకల్ని వెంటేసుకొచ్చి 144 సెక్షన్ ను ఉల్లంఘించి హంగామా చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి సహకరించారు.ఎన్నిక సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన పోలీసులే మా కౌన్సిలర్ల మెడలో ఉన్న వైయస్సార్సీపీ కండువాలను లాగి పడేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం చూసి ప్రజలంతా చీదరించుకుంటున్నారు. తిరువూరులో పోలీసులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కూటమి పాలనలో ఆంధ్ర రాష్ట్రం బీహార్ కన్నా దారుణంగా తయారవుతోంది. ఇలాంటి సంస్కృతి భావితరాలకు మంచిది కాదని గుర్తుంచుకోవాలి. అధికార పార్టీ అరాచకాలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి.కోర్టులు, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పట్టించుకోరా?: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుచట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చ చొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఓటేసేందుకు వెడుతున్న కౌన్సిలర్లకు భద్రత కల్పించాల్సిన పోలీసులు, తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని మాటమార్చారు. చట్టపరంగా నడుచుకోవాల్సిందిపోయి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలన్నా, కోర్టులన్నా గౌరవం కానీ భయం కానీ కనిపించడం లేదు. నిన్న ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆర్డర్‌ను పోలీసులు పాటించడం లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు, కలెక్టర్‌తో మాట్లాడతానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తిరువూరులో ఎన్నికకు హాజరుకావాల్సి ఉంటే, విజయవాడ నుంచి వస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మార్గమధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో పోలీసులే సమాధానం చెప్పాలి. మున్సిపాలిటీలో కేవలం ముగ్గురు సభ్యుల బలం మాత్రమే ఉన్న టీడీపీ, చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కింది. పోలీసుల అండతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గూండాలతో వచ్చి మా కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులే బలవంతంగా నలుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్పించారు.ఈరోజు కూడా అదే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలిపై ఈ రోజు ఉదయం వైయస్సార్సీపీ కోర్టును ఆశ్రయించింది. కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా పోలీసులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని సాక్షాత్తు కోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ 30 నిమిషాల్లో పూర్తి వివరాలతో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. అధికారం చేతుల్లో ఉంది కదా అని దౌర్జన్యం చేసి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. వీరి ఆటలు ఎంతోకాలం సాగవు. తిరువూరు మున్సిపాలిటీ హాల్ వరకు కౌన్సిలర్లకు భద్రత కల్పించి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం: వైఎస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి:’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.‘‘మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని, మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం, కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా, చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం...జగనన్నకు చెబుదాం నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..👉స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు👉తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి పెట్టి, లాగేసుకునే ప్రయత్నంచేస్తోంది👉అయినా సరే మెజార్టీ వైయస్సార్సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు:👉పోలీసులు వైయస్సార్సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు👉సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు👉కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే👉రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు👉ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం👉పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు👉యలమంచిలిలో మన వాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు👉ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది👉కాని చంద్రబాబుగారి పరిపాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది👉మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు👉జగన్ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు👉కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు 👉కాని, మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ వెళ్లాడు👉గడపగడపకూ కార్యక్రమం కింద మూడుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లారు:👉99శాతం హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైయస్సార్సీపీ మాత్రమే👉మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు👉10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు👉ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్‌బాల్ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు👉వైఎస్సార్సీపీ మాదిరిగా ప్రతి ఇంటికీ వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా?👉హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది👉మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు👉పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు👉ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు👉రూ.3600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు👉ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు👉వైద్యంకోసం అప్పులు పాలు అయ్యే పరిస్థితి👉ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడంలేదు👉ప్రభుత్వం రంగంలో వైయస్సార్సీపీ తీసుకొచ్చిన కాలేజీలను చంద్రబాబు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు:👉కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం ప్రారంభించాం👉శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లాం👉ఇప్పుడు ఆమూడు పోర్టులను కమీషన్లకోసం అమ్మేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు👉ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపించాం👉ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు పెట్టాం👉బోగాపురం ఎయిర్‌పోర్టుకు గత చంద్రబాబు హయాంలో అనుమతులు లేవు, భూసేకరణ లేదు👉మనం అన్నీచేసి 30శాతం పనులు చేశాం👉రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనులు కేవలం వైయస్సార్సీపీ హయాంలోనే జరిగాయి👉ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి👉వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు👉ప్రజలను వెన్నుపోటు పొడిచాడు👉ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చాడు👉రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు👉ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నాడు👉చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు👉తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు 👉గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు👉పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు👉ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను👉జగన్ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది👉కోవిడ్ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం👉ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను 👉రేపు కచ్చితంగా వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ ఒన్👉అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి👉కొడతానంటే.. కొట్టమనండి👉కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి👉కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం👉రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం👉దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం👉అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం👉మనకూ టైం వస్తుంది👉చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి👉చంద్రబాబు దుర్మార్గపు పాలనవల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది👉మహిళలను అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు👉ఒక కేసులో బెయిల్ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు👉ఇలా కేసులు మీదు కేసులు పెడుతన్నారు👉వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు👉దళితుడైన ఎంపీ నందిగం సురేష్ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు👉సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు👉తనను, తన కుటుంబ సభ్యులను తిడితే, ఎందుకు తిట్టావన్నందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు👉చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మరిచిపోవద్దు👉రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దాం👉వచ్చేది మన ప్రభుత్వమే👉మంచి రోజులు కచ్చితంగా వస్తాయి -
ప్రజల ఆశలతో బాబు కపట రాజకీయం!
‘‘ప్రజలకు మరీ ఆశ ఉండకూడదు. దురాశ పనికిరాదు’’ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరచూ చేసే వ్యాఖ్య ఇది. ఈమధ్య సోషల్ మీడియాలోనూ ఆయన వాడిన ఈ డైలాగులు ఎక్కవగా కనిపిస్తున్నాయి. ఆయన చెప్పింది వాస్తవమే. ఎందుకంటారా? బాబు, పవన్‌కళ్యాణ్ లాంటి వాళ్లు ఇచ్చినమాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మడం ప్రజల అత్యాశే కదా! ఈ దురాశతోనే ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించింది! పాపం.. పై పై వాగ్ధానాలు చేసిన వాళ్లు ఎవరు? వారి ట్రాక్ రికార్డు ఏమిటి అన్నది కూడా గుర్తుపెట్టుకోకుండా ప్రజలు అతిగా ఆశపడ్డారు. టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలోని ‘ఆడ బిడ్డ నిధి’కి కూడా బాబు అండ్ కో మంగళం పాడేసినట్లేనన్న వార్తలు చూసిన తరువాత ప్రజలను ఇంత గొప్పగా మోసం చేయవచ్చా? అని అనిపించక మానదు. ప్రజలను దురాశా పరులుగా చిత్రీకరించి నిందించవచ్చు కానీ.. ఆ ఆశ పెట్టిన వారి తప్పు మాత్రం ఏమీ లేదన్నచందంగా ఉందీ వ్యవహారం. ప్రజలను ఇంత బాహాటంగా మోసం చేసినందుకు ఇతర దేశాల్లో ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు కానీ.. ఇలాంటి వారు.. ప్రజల ఆగ్రహాన్ని, ఛీత్కారాలనైతే తప్పకుండా చూస్తారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో నేతల వైఖరి నమ్మి మోసపోయిన వారిదే తప్పన్నట్టుగా ఉండటం. అయ్యో ఈ నేతలు ప్రజలను పిచ్చోళ్లుగా చూస్తున్నారే అన్న ఆవేదన కలుగుతుంది. నిజాయితీ లేని నేతలు అధికారంలోకి వచ్చి, చెప్పినవి చేయకపోగా, వారినే బెదిరిస్తున్న తీరు, విషయాలను పక్కదారి పట్టిస్తున్న తీరులపై పెద్ద పరిశోధనే చేయవచ్చు. ఆశపెట్టి ఏమార్చడం.. ఆ తరువాత ప్రజలనే నిందించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. సుమారు రూ.లక్ష కోట్ల రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న హామీతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత ఏం చేశారో అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే ఆయన ‘‘ఆశకు హద్దు ఉండాలి’’ అని రైతులను ఉద్దేశించి నేరుగానే అన్నారు. తాజాగా 2024 ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకూ రూ.1500 చొప్పున నెల నెల ఇస్తానని! ఈ పథకానికి ఆడబిడ్డ నిధి పేరూ పెట్టారు. ప్రతి ఒక్కరికీ ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఊదరగొట్టడంతో మహిళలు చాలామంది ఆశపడ్డారు. ఓట్లేశారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు అప్పట్లో ‘‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’’ అంటూ ప్రచారం చేయడమూ మనం చూశాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సైతం.. ‘‘ఒకరుంటే రూ.15 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు..ఇంకా పిల్లలను కనండి..వారి బాధ్యత మాది’’ అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాది పూర్తి అయిపోయింది.. తల్లికి వందనం లేదు. విద్యార్ధులకు సుమారు రూ.13 వేలు ఎగవేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఇస్తామని అంటున్నారు. ఏమవుతుందో తెలియదు! ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత రవాణా సౌకర్యం అన్న హామీని కూడా అటకెక్కించేశారు. అమలు చేసి ఉంటే ఏపీ మహిళలకు ఏడాదికి రూ మూడు వేల కోట్ల వరకూ మిగిలేది! ఈ లెక్క కూడా ఎల్లోమీడియాదే. ఆగస్టు పదిహేను నుంచి ఈ స్కీము అమలు చేస్తామని చంద్రబాబు ఈమధ్య కర్నూలులో ప్రకటించారు. అంటే మరో మూడు నెలలు ఈ స్కీమ్ ఉండదు. దీనిని కూడా లెక్కలోకి తీసుకుంటే మహిళలు మరో రూ.వెయ్యి కోట్లు నష్టపోయినట్లు! ఇదే సభలో చంద్రబాబు ఆడబిడ్డ నిధి స్కీము లేనట్లే తేల్చారని వార్త వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ చూస్తే మరీ ఇంత పచ్చి పాపమా అనిపిస్తుంది. తాను అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు మోసపూరితమని ఆయనకు తెలుసు. తాను ఆ వాగ్దానాలు ఎందుకు చేసింది.. ఎందుకు అమలు చేయలేకపోతున్నది నిజాయితీగా వివరించడం మానేసి, మరో కొత్త అబద్దాన్ని సృష్టించారు. అదేమిటంటే తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఏపీలో పేదలు బాగానే సంపాదిస్తున్నట్లు చంద్రబాబే తేల్చేశారు! అందువల్ల వారికి ఆ స్కీమ్ అవసరం లేదని, 2029నాటికి పేదరికం లేకుండా చేసేస్తామని, అప్పటికీ పేదలు ఉంటే పీ-4 కింద దాతలకు అప్పగిస్తామని అన్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక పేదలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు, వ్యాపారాలు లేక వ్యాపారస్తులు అల్లాడుతుంటే పేదలంతా బాగా సంపాదించుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి ఓటు వేసినందుకు తమకు బాగానే శాస్తి అయిందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఆడబిడ్డ నిధి స్కీము రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలకు ఉపయోగపడేది! ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్లకుపైగా అవసరమని లెక్క. ఇంత మొత్తం ఎలా సాధ్యమని అప్పట్లో ప్రశ్నించిన వారికి బాబు ఇచ్చిన సమాధానం తాను సంపద సృష్టించగలనూ అని! ఇప్పుడేమో సంపద వచ్చేసిందని చెబుతుంటే బిత్తరపోవడం తప్ప ప్రజలు చేయగలిగేది ఏముంటుంది! ఒకరకంగా చెప్పాలంటే ఈవీఎంల మాయాజాలం సంగతి పక్కనబెడితే అనేక నియోజకవర్గాలలో తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి వాగ్దానాలు గేమ్ చేంజర్ గా మారి కూటమిని అధికారంలోకి తెచ్చాయి. ఇప్పుడేమో చేతులెత్తేసి పేదల జీవితాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. వాగ్దానాల గురించి చెప్పకుండా, చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని, ఓర్వకల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని, బుద్దుడి సలహాలు పాటించండని కధలు చెబుతున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. చెత్త ఎత్తడానికి పనివారు వస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నిస్తే లేదు..లేదు..అని ఎక్కువ మంది చేతులెత్తారు. దాంతో చెత్త గురించి ఆయన చెబుతున్న కబుర్లలో డొల్లతనం బయటపడింది. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు పెడతామని, లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తామని, ఉద్యానవన పంటలను 18 లక్షల హెక్టార్ల నుంచి 36 లక్షల హెక్టార్లు చేస్తామని, ఇలా ఏవేవో సంబంధం లేని మాటలతో ప్రసంగం చేశారు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కూడా దబాయించి మరీ చెప్పారు. నవ్వుకుని ఊండిపోవడం అక్కడి ప్రజల వంతైంది. చివరికి బుద్దుడు, ఆయన శిష్యుడి కథ అంటూ చంద్రబాబు ప్రజలకు ఒక స్టోరీ చెప్పారు. దాని ప్రకారం శిష్యుడి కోరిక మేరకు బుద్దుడు కొత్త వస్త్రాలు ఇప్పించారట. ఆ తర్వాత కొద్ది రోజులకు బుద్దుడు పిలిచి పాత వస్త్రాలు ఏమి చేశావని అడిగాడట. వాటితో చిరిగిపోయిన బొంతలో పెట్టి కుట్టుకున్నానని శిష్యుడు చెప్పాడట. మరీ చినిగిపోయిన బొంతలోని వస్త్రాలు ఏమి చేశావు అని బుద్దుడు అడిగాడట. వాటిని కిటికీ తెరలు చేశానని జవాబు ఇచ్చారు.మరి అప్పటికే ఉన్న కిటీకి తెరలు ఏమి చేశావని అడిగితే గది తుడవడానికి వాడుతున్నానని, ఆ వస్త్రాన్ని మసిబట్టగా వాడుతున్నానని, అప్పటిదాకా ఉన్న మసిబట్ట దారాలను కొవ్వొత్తిలో వాడే వత్తులకు వినియోగిస్తున్నానని శిష్యుడు చెప్పారట. ప్రతి వస్తువుకూ ఒక ఉపయోగం ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు ఈ కథ చెప్పినా, విన్న వారికి మాత్రం చివరికి ఏపీ పరిస్థితి ఇలా మారిందన్నమాట అని అనుకున్నారనుకోవాలి. ఒక పక్క అమరావతిలో ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ తదితర భవనాలు ఉన్నా, అవి పనికి రావంటూ లక్ష కోట్లు వ్యయం చేస్తూ గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రజలు మాత్రం ఈ ఆధునిక యుగంలో చినిగిన వస్త్రాలు సైతం వాడుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దుడు, శిష్యుడు కథ వర్తించదా అంటే ఏమి చెబుతాం. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు అన్న సూత్రం చంద్రబాబు వంటివారిని చూసే వచ్చిందనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి
రెండు గంటల పాటు టిడిపి గూండాలు భయోత్పాతం సృష్టించారుఎమ్మెల్సీ ,మొండితోక అరుణ్ కుమార్తిరువూరు వెళ్లడానికి మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదుపోలీసులే దగ్గరుండి టిడిపి గూండాలతో మాపై దాడి చేయించారుమేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాంనా కారును ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారుకౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ , హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు పెడచెవిన పెట్టారుఒక్కో కౌన్సిలర్ కు ఒక్కొక్క గన్ మెన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయ్పోలీసులు రక్షణ ఇవ్వకపోతే మేమే రక్షణ కవచంలా నిలిచాంమా కారును ధ్వంసం చేసి మా పై హత్యాయత్నం చేశారుతిరువూరు టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తించాడుమా కారును అడ్డగించి మా పై దాడి చేసారునన్ను , స్వామిదాస్ ను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు కులం పేరుతో దూషించి బెదిరించిన వారి పై నేను , స్వామిదాస్ కేసు పెట్టి... హై కోర్టుకు ఈడుస్తాంకోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు: తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి,నల్లగట్ల స్వామిదాస్నేను 35 ఏళ్లుగా తిరువూరు రాజకీయాలు చూస్తున్నాతిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండా మాదిరి వ్యవహరించారుఇలాంటి ఎమ్మెల్యేని తిరువూరు ప్రజలు ఎన్నడూ చూడలేదుకూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారుటిడిపి నేతలను చట్టపరంగా శిక్షిస్తాంమాకు రక్షణ కల్పించమని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లిపోయారుఅసలు ఈ రాష్ట్రం ఎటుపోతుందిరాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం లేదురాబోయేది జగన్ మోహన్ రెడ్డి 2.0 పాలనేతప్పుచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాంమాపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారి పై కేసు పెట్టి చట్టం ముందు నిలబెడతాంప్రశాంతమైన తిరువూరులో టీడీపీ గూండాలు విధ్వంసం స్పష్టించారు: దేవినేని అవినాష్టీడీపీ గూండాలు మాపై దాడి చేశారుకేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారుమా కారును ధ్వంసం చేశారు.. మమ్మల్ని హతమార్చాలని చూశారుటీడీపీ గూండాల దాడికి పోలీసులు సహకరించారుమాపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టంపోలీసులే రాజకీయం చేస్తున్నారుకౌన్సిలర్లకు వారి ఇంటి నుంచి భద్రత ఇస్తామని వితండవాదం చేశారుమా కౌన్సిలర్లకు మేమే రక్షణగా నిలిచాంటిడిపి ఎంపీ కేశినేని చిన్ని మందు పోయించి టిడిపి గూండాలను మా పైకి రెచ్చగొట్టారు మా కారును పైకి లేపి పల్టీలు కొట్టించి...ధ్వంసం చేయాలని చూశారుమా కారు ధ్వంసం చేసే వరకూ పోలీసులు చూస్తూ ఊరురున్నారు 👉వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్‌దేవినేని అవినాష్, అరుణ్‌కుమార్‌లు అరెస్ట్‌తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులురెడ్డిగూడెం స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడిదేవినేని అవినాష్, అరుణ్‌కుమార్ వాహనాలపై దాడివైఎస్సార్సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలుదారికాసి వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలుఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్ వద్ద టీడీపీ గూండాల విధ్వంసంసాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్సీపీ నేత స్వామిదాస్ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.వైఎస్సార్సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్, స్వామిదాస్ అరుణ్ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్, స్వామిదాస్‌పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు. -
‘రేపటి ఎన్నికైనా సజావుగా జరపండి’
విజయవాడ: టీడీపీ నేతలు అరాచకం సృష్టించిన కారణంగానే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. పడిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ఎన్నిక జరగకుండా ఉండటానికి టీడీపీ నేతలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. ‘ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్చల్ చేశారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు. 20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో వైఎస్సార్సీపీ 17, టీడీపీ 3 గెలిచింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థినే గెలిపించాలనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ గూండాలు గుంపులుగా వచ్చారు. మా పై దాడిచేసేందుకు టిడిపి నేతలకు పోలీసులు మద్దతిచ్చారు. మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు. ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు. స్వచ్ఛంధంగా వైఎస్సార్సీపీకే మద్దతిస్తున్నానని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారుఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర్నుంచి టిడిపి ఎమ్మెల్యే వరకూ అందరూ దిగజారిపోయారు. ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. రేపటి ఎన్నిక సజావుగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం. రేపు మా కౌన్సిలర్లకు భద్రత కల్పించమని కోరాం. రేపు తిరువూరులో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని ఆశిస్తున్నాం’ అని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. తిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీతిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ‘టీడీపీ బరిలోని నిలిపిన చైర్మన్ అభ్యర్థి కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. పోలీసులు ఖాకీ దుస్తుల బదులు .. పచ్చ దుస్తులు వేసుకున్నారు. మా కౌన్సిలర్ ను లాక్కెళ్లి...ఆమె మెడలోని వైఎస్సార్సీపీ కండువాను తీసి చెట్లలో పడేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని పోలీస్ కమిషనర్ ను ప్రశ్నిస్తున్నాంతిరువూరులో జరిగిన విషయాలు తెలుసుకుని కమిషనర్ ఆశ్చర్యపోయారు. పోలీసులు టిడిపి తొత్తుల్లా పనిచేయడం బాధాకరం. రక్షణ కల్పించాల్సిన పోలీసులు...ఎంపీ ,ఎమ్మెల్యేకు అమ్ముడుపోయారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్సార్సీపీ అండగా నిలిచిన మా కౌన్సిలర్లను అభినందిస్తున్నాం. రేపు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి’ అని పేర్కొన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. -
‘మహిళలకు ఫ్రీ బస్సు పథకానికి ముహూర్తం ఏంటి?’
విశాఖ : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ పథకం ప్రస్తావన తీసుకురాకపోవడంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయడానికి ముహూర్తం ఏమిటని ప్రశ్నించారు. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చెయ్యాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బొత్స తెలిపారు.ఈరోజు( సోమవారం) విశాఖ నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన బొత్స.. ‘ తల్లికి వందనం ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు p4కి సంబంధం ఏమిటి?, p4 కి పథకాలకు లింక్ పెట్టడం ఏమిటి..? , లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ పథకం అమలు చేయనట్టేనా.. ఆడ బిడ్డ నిధి పథకంపై కూటమి నేతలు స్పందించాలి. ఇస్తారో ఇవ్వరో కూటమి ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో మహిళలు అందరూ ఆలోచించాలి. ప్రభుత్వ డొంక తిరుగుడు వ్యవహారాన్ని గమనించాలి. ఆడ బిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. లేదంటే మహిళలను మోసం చేసిన వారు అవుతారు. విశాఖ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. 6 నెలలుగా జీవీఎంసీ కమిషనర్ లేరు.కీలకమైన జీవీఎంసీ కమిషనర్ స్థానాన్ని భర్తీ చేయకపోవడం దురదృష్టం. కూటమి ప్రభుత్వానికి అధికారం, దోచుకోవడం మాత్రమే అవసరం. కూటమి పార్టీల మధ్య సంఖ్యత లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవు. పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని అబాసూపాలు చేస్తుంది. ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం చేతిలో పెట్టుకుని చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు నష్టపోతారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తరువాత మోసం చెయ్యడం బాబుకి అలవాటే’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
సాక్షి, విశాఖ: విశాఖ డిప్యూటీ మేయర్ ఎంపిక విషయమై కూటమిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎంపిక కూటమిలో చిచ్చు రాజేసింది. జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో, పలువురు టీడీపీ నేతలు ఎన్నికకు హాజరు కాకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.వివరాల ప్రకారం.. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేనకు చెందిన డల్లి గోవింద రెడ్డికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వడంపై టీడీపీ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఈ వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరుకాలేదు. కోరం సరిపడకపోవడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కావలసిన సంఖ్యాబలం 56 కావాల్సి ఉండగా.. 54 మంది హాజరయ్యారు. దీంతో, ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అలకబూనిన కౌన్సిలర్లతో టీడీపీ హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సతీష్ మాట్లాడుతూ..‘అధికార దాహంతో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ను పదవి నుంచి దింపేశారు. నగర అభివృద్ధిపై కూటమికి చిత్తశుద్ధి లేదు. కూటమి నేతల మధ్య సమన్వయ లోపం ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కోరం సభ్యులు కూడా లేరు. మేము చేసిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకుంటుంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా జీవీఎంసీ కార్పొరేటర్లు విడిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అంతా ఒకే మాట మీద ఉన్నాం’ అని అన్నారు. -
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, కర్నూలు: కర్నూలులో కూటమి కుట్రలను పటాపంచలు చేశారు వైఎస్సార్సీపీ నేతలు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైఎస్సార్సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వివరాల ప్రకారం.. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో కూటమి కుట్రలు ఫలించలేదు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా వైఎస్సార్సీపీ సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తలొగ్గలేదు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై నమ్మకంతో కౌన్సిలర్లు లోకేశ్వరికి అండగా నిలిచారు. దీంతో, ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. లోకేశ్వరి ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా..మరోవైపు.. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైఎస్సార్సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు.శ్రీ సత్యసాయి జిల్లా..రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీకి మహిళా ఎంపీటీసీల మద్దతు దొరకలేదు. రామగిరిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్సీపీకి-8, టీడీపీకి-1 స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాలతో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంది. మరోవైపు.. టీడీపీలో చేరడం ఇష్టంలేక పేరూర్ ఎంపీటీసీ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగ్గా.. ముగ్గురు పురుష ఎంపీటీసీలు హాజరయ్యారు. మహిళా ఎంపీటీసీల నుంచి నామినేషన్ రాకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రామగిరి ఎంపీపీ ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రలోభాలకు మహిళా ఎంపీటీసీలు లొంగలేదు. -
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే? ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయం భేష్ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్ లెక్కల్లో వెతుకుదాం.. జగన్ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది. ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది.అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు?జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తిరువూరులో ఉద్రిక్తత.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
తిరువూరులో ఎన్నిక అప్డేట్.. విజయవాడ:ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్👉తిరువూరు మున్సిపాల్టీ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో పోలీసులు టిడిపి కార్యకర్తల్లా వ్యవహరించారు👉20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో వైఎస్సార్సీపీ 17 , టిడిపి 3 గెలిచింది👉ఉపఎన్నిక నేపధ్యంలోవైఎస్సార్సీపీ అభ్యర్ధినే గెలిపించాలనివైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు👉టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్,టిడిపి గూండాలు గుంపులుగా వచ్చారు👉మా పై దాడిచేసేందుకు టిడిపి నేతలకు పోలీసులు మద్దతిచ్చారు👉మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు👉ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు👉స్వచ్ఛంధంగా వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్నానని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారు👉ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర్నుంచి టిడిపి ఎమ్మెల్యే వరకూ అందరూ దిగజారిపోయారు👉ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు👉రేపటి ఎన్నిక సజావుగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం👉రేపు మా కౌన్సిలర్లకు భద్రత కల్పించమని కోరాం 👉కూటమి కుట్రలతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. 👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన కూటమి నేతలు. పోలీసులు సమక్షంలోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ మూకల దాడులు. ఎన్నిక జరగకుండా కూటమి నేతల వ్యూహం. అల్లర్లు సృష్టించిన పచ్చ నేతలు👉తిరువూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్చల్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరుకాకుండా దాడికి యత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై చెప్పులు విసిరి, బాటిళ్లు విసురుతూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 👉తిరువూరులో పోలీసులు, టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రోడ్డుపై భైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.👉టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని చోద్యం చూస్తూ పోలీసులు అక్కడే నిలబడ్డారు. ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతల వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టలేదు. బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ అల్లర్లు. తిరువూరులో టీడీపీ ఉద్రిక్తత సృష్టిస్తోంది.👉తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.👉తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ కొలికపూడి, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారినే బెదిరిస్తూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, వాగ్వాదం జరిగింది.👉మరోవైపు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్ తిరువూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేడు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. -
తిరువూరు ఎన్నిక.. వైఎస్సార్సీపీ నేతలు హౌస్ట్ అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్: నేడు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయడంతో నేడు చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు తిరువూరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతిభద్రతల సాకుతో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తిరువూరులో బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీకి 17 మంది కౌన్సిలర్ల బలం ఉంది. టీడీపీకి ఉన్నది కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే. ముగ్గురు కౌన్సిలర్లతో ఏవిధంగా గెలవాలనుకుంటున్నారు. అధికార బలంతో మున్సిపాల్టీ, నగర పాలక సంస్థలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మీరు ఏం చెప్పి గెలిచారు. రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి?. తిరువూరు వెళ్లొద్దని మా పై ఆంక్షలు పెట్టడమేంటి?. వెళితే అరెస్ట్ చేస్తామని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. ఏపీలో పోలీసు రాజ్యం నడిపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరువూరు వెళ్లి తీరుతాం. తిరువూరు మున్సిపాల్టీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం’ అని అన్నారు. మరోవైపు.. సోమవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ..‘శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపించి వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్టు చేయటం కరెక్ట్ కాదు. రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాయటమే అవుతుంది. వైఎస్సార్సీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం తిరువూరు మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఫలితం మాత్రం శూన్యం’ అని అన్నారు. ఇక, వైఎస్సార్సీపీ తరఫున 17 మంది కౌన్సిలర్లు ఉండగా, టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందారు. ఎన్నికల్లో గెలించేందుకు బలం లేకపోయినప్పటికీ టీడీపీ కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం
నెల్లూరు(బారకాసు): ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం లేని స్కామ్‌లు సృష్టించి కక్ష సాధింపులకు దిగుతోందని ధ్వజమెత్తారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. ఏపీలో పనిచేయాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మైనింగ్ మాఫియాను పోషిస్తున్న చంద్రబాబు నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మైనింగ్ మాఫియాను బాబు పెంచి పోషిస్తున్నారు. జిల్లాలో దాదాపు 180 మైన్లు ఉంటే అందులో కేవలం 25 నుంచి 30 మాత్రమే నడుస్తున్నాయి. వేమిరెడ్డి వల్ల అనేక క్వారీలు ఇంకా మూతపడే ఉన్నాయి. వేమిరెడ్డి కంపెనీ పెట్టుకోవడం తప్పా అంటూ టీడీపీ నాయకుడు బీద రవిచంద్రయాదవ్ వత్తాసుగా మాట్లాడారు. తాను తప్ప ఇంకెవరూ మైనింగ్ వ్యాపారాలు చేసుకోకూడదన్న ఎంపీ దురాశ వల్ల నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు.260 మందికిపైగా క్వార్ట్జ్æ ఎగుమతిదారులుంటే ఎంపీ వేమిరెడ్డికి చెందిన కంపెనీ ఒక్కటే వ్యాపారం చేయడం వెనుక మతలబు ఏంటి? ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకుందామనిపోతే వారిని బెదిరిస్తున్నారు. ఎంపీ మైనింగ్ అక్రమాలపై నేను ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కొంతమందిని పిలిపించుకుని మాట్లాడుకున్నారని తెలిసింది. లోకల్ మైన్లన్నీ ఎంపీ కంపెనీకి చేయాలట. ఎక్స్‌పోర్టర్ చైనా కంపెనీకి అమ్ముకుంటామని వాళ్లతో చెప్పారు. ఇదే జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ కావడం తథ్యం. లీజు గడువు ముగిసిన వాటిలో అక్రమ మైనింగ్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఫ్యాక్టరీ పెడతానని ఇంకా శంకుస్థాపన చేయకుండానే వేల టన్నులు చైనాకి ఎక్స్‌పోర్టు చేస్తున్నాడు. 50 ఏళ్ల పరి్మషన్ గడువు ముగిసిపోయిన ఏడెనిమిది మైన్స్, పట్టా భూములను తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమంగా మైనింగ్ చేస్తూ ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైనే దోపిడీకి స్కెచ్ వేశాడు. ఇవి నిజంకాదని నిరూపిస్తే ఎంపీకి క్షమాపణలు చెప్పడానికీ సిద్ధం. మా హయాంలో పారదర్శకంగా మైనింగ్ గత ప్రభుత్వంలో ఎవరి మీద ఎలాంటి ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా మైనింగ్ చేసుకోనిచ్చాం. టాప్ టెన్ ఎక్స్‌పోర్టర్ల లిస్ట్ చూస్తే అందులో టీడీపీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మా ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇంతకన్నా వేరే రుజువులు అవసరం లేదు. -
దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
అప్పుడేం జరిగిందో గుర్తులేదా?: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో కొత్త రాజకీయం మొదలైందంటూ.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని.. కానీ కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడిని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకెళ్తుందని దుయ్యబట్టారు.‘‘ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే భ్రష్టు పట్టిపోయింది. వైఎస్సార్సీపీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు.. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. కనీసం ఈ కేసులో ఎటువంటి ఆధారాలు కూడా లేవు’’ అని మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కొంతమంది పోలీసులు పచ్చ చొక్కా వేసుకోకుండానే టీడీపీ కార్యకర్తల పని చేస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా వైఎస్ జగన్‌ని కూడా అరెస్టు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచింది. 40 శాతం ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్‌ను అక్రమ కేసుల్లో జైలుకు పంపడంతో రెండు శాతానికి పడిపోయింది. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. రేపు కూటమి పరిస్థితి కూడా అంతే. ఇవాళ మాకు పాఠాలు నేర్పుతున్నారు.. రేపు అవి వారికి గుణపాఠాలవుతాయి’’ అని మహేష్‌రెడ్డి చెప్పారు.మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ధైర్యంగా ఎదుర్కొంటాం.. న్యాయ పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలపడతాం. ఈ రోజు కొన్ని నియోజకవర్గాల్లో సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కచ్చితంగా కేసులు పెడతాం’’ అని కాసు మహేష్‌రెడ్డి హెచ్చరించారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట
సాక్షి, అమరావతి/సాక్షి,నెట్వర్క్: ఎన్నికల హామీలు అమలుచేయకపోవడం.. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు మరోసారి తెరతీశారని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్టని.. దాని అమలులో భాగంగానే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా కక్ష సాధిస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి, సాకే శైలజానాథ్, అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, వరుదు కళ్యాణి, మార్గాని భరత్‌రాం శనివారం వేర్వేరుచోట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని వారు హెచ్చరించారు. ఎవరెవరు ఏమన్నారంటే..ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిటైర్డ్ అధికారులను అక్రమంగా అరెస్టుచేసింది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలనే దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా అసలు జరగని మద్యం స్కాంలో రిటైర్డ్ అధికారులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టుచేయడం విడ్డూరం. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపిన చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి లిక్కర్ స్కాంలో అసలు దోషి బాబే..లిక్కర్ స్కాంలో అసలు దోషి చంద్రబాబే. ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన, సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టుచేశారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కాం జరిగింది. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుచేసి, వాటి యజమానులకు దాదాపు రూ.1,300 కోట్ల లాభం చేకూర్చారు.2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కాం జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కాంలో ఇలాంటిది ఉందా? ఇక మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆదాయం వస్తుందో టీడీపీ నేతలు చెప్పాలి. ఏపీలో ఉన్న అన్ని డిస్టిలరీలకు అనుమతులిచ్చింది చంద్రబాబే. అంతేకాక.. 69 శాతానికి పైగా ఆర్డర్లు నాలుగైదు డిస్టిలరీలకే ఇచ్చారు. ఇదంతా స్కాం కాదా? పైగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నడిపే మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి జైలు అధికారుల మార్పులో బాబు కుట్ర..విజయవాడ జైలు అధికారులను హఠాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు భారీ కుట్ర ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్టయిన వారంతా విజయవాడ జైలులో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారు. ఒకవైపు సంబంధంలేని అంశాల్లో కొందరు ప్రభుత్వాధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులతో వారిని జైలులో హింసించాలన్నదే చంద్రబాబు కుతంత్రంగా కనిపిస్తోంది. 2018–19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.16,900 కోట్లు అయితే.. 2023–24లో అది రూ.24,700 కోట్లు. నిజంగా, చంద్రబాబు చెబుతున్నట్లుగా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఎలా పెరిగింది? వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గి ఆదాయం పెరిగింది. అదే ఇప్పుడు బాబు హయాంలో లిక్కర్ సేల్స్ పెరిగి ఆదాయం తగ్గింది. దీని మతలబు ఏమిటో చంద్రబాబే చెప్పాలి. ఈ తగ్గిన ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఇది స్కాం కాదా? – మార్గాని భరత్, వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అణిచివేయాలనుకుంటే మరింత బలోపేతమవుతాం..వైఎస్సార్సీపీని అణిచివేయాలని చూస్తే మరింత బలోపేతమవుతాం. గతంలో ఒకసారి వైఎస్సార్సీపీని అణగదొక్కాలని కాంగ్రెస్‌తో చంద్రబాబు జట్టు కట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చిఏడాదైనా ఎన్నికల హామీలను అమలుచేయడంపై చంద్రబాబు దృష్టిపెట్టలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమయ్యారు. వైఎస్ జగన్ బలహీనపరిచేందుకు లిక్కర్ స్కామ్ సృష్టించారు. – అంబటి రాంబాబు, మాజీ మంత్రిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు..చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోవడంతోపాటు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దుచేసి, మద్యం షాపులు, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకి దమ్ముంటే ఆయనపై నమోదైన ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలి.– ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజకీయ అరాచకం ఎక్కువైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకులపైనే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. కొందరు అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. సర్వీస్‌లో ఉన్న వారినే కాకుండా రిటైర్డ్ అధికారులనూ అరెస్టు చేస్తున్నారు. ఒక్క ఆధారం లేకపోయినా లిక్కర్ స్కాం జరిగిందంటూ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చివరకు హైకోర్టు న్యాయమూర్తులు అక్షింతలు వేసినా సిగ్గులేకుండా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది. వైఎస్ జగన్‌ను నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు లిక్కర్ స్కాం రూ.10వేల కోట్లు..మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందంటూ అనవసర యాగీ చేస్తున్న టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్‌స్టేషన్‌కు, ఎక్సైజ్ స్టేషన్‌కు మామూళ్లు అందుతున్నాయని, తమ ప్రభుత్వంలో మామూళ్ల ప్రస్తావనే లేదన్నారు. ప్రస్తుతం ప్రతి మద్యం షాపు యజమాని ఎక్సైజ్ శాఖకు రూ.70 వేలు, పోలీస్‌స్టేషన్‌కు రూ.30 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా చెల్లిస్తున్నారని, కిందిస్థాయి నుంచి అమరావతి వరకు ఎవరి వాటా వారికి చేరుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తద్వారా నెలకు సుమారు రూ.100 కోట్ల వరకు మద్యం మామూళ్లు యువరాజు లోకేశ్‌కు అందుతున్నాయని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,200 కోట్ల అవినీతి జరుగుతోందన్నారు. ఇక డిస్టలరీల నుంచి నేరుగా చంద్రబాబుకు ఏడాదికి రూ.1,000 కోట్లు అందుతోందన్నారు. నక్కలు, తోడేళ్లు కలిసి రూ.1,000 కోట్లు తింటే.. సింహం ఏకంగా రూ.1,000 కోట్లు ఆర్జిస్తోందన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి రూ.10వేల కోట్లకు పైగా అవినీతి జరుగుతుంటే.. జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారన్నారు.ఇదే అత్త కోడలికి సుద్దులు చెప్పడం అని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఆరు పథకాలను అమలుచేయలేని చంద్రబాబు 60 కేసులు పెట్టి 60 మందిని జైలుకు పంపాడని, ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నాడన్నారు. మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానిది అంతా దోపిడీ అని, ఐదేళ్లలో రూ.10వేల కోట్ల అవినీతి జరుగుతుందని, టీడీపీ నేతలకు దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. – మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి..అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయి. రాజ«దాని పేరుతో కూటమి ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటోంది. హామీల అమలును విస్మరించి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. – ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేరాష్ట్రంలో శాంతిలేదు..రాష్ట్రంలో ఎక్కడా శాంతి లేదు.. ప్రజలకు భద్రత అసలు లేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. శనివారం అనంతపురం జిల్లా రాప్తాడులో దంపతులను టీడీపీ రౌడీమూకలు చంపినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయి. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ -
Nara Lokesh: మనల్ని ఎవడ్రా ఆపేది.. చినబాబు పెద్ద ప్లాన్!
ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే మంత్రి పదవి చేసేసారు.. పైగా ఈ ఐదేళ్ళలో బోలెడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది.. క్యాడర్ తో కలిశారు..కలుస్తున్నారు.. పార్టీలో పెద్దరికం కూడా చేస్తున్నారు.. పైగా పాదయాత్ర పేరిట మరిన్ని మార్కులు.. ఇవన్నీ సరిపోవా ఏమి.. గమ్మున మా చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు మీద కుటుంబం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో మే 27.. 28.. 29 తేదీల్లో కడపలో నిర్వహించే మహానాడులో చినబాబు స్టేచర్ పెరిగిపోవాలి.. లేదంటే ఇంట్లో గొడవలు అవుతాయి.. గిన్నెలు గాల్లోకి లేస్తాయి అనే అల్టిమేటం రావడంతో చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వక తప్పడంలేదు. పోనీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం వంటి పదవులు ఇవ్వాలంటే అటు బీజేపీ ఒప్పుకోవాలి.. పవన్ ఊ కొట్టాలి.. ఇవన్నీ అయ్యేది కాదు.. కూటమి ప్రభుత్వంలో ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కేంద్రంలోని బిజెపి పెద్దలు సుతరామూ ఒప్పుకోవడం లేదు.వాస్తవానికి ప్రభుత్వంలో పార్టీలో లోకేష్ ఇప్పుడు నంబర్ టూ గా ఉంటున్నారు.. పేరుకే చంద్రబాబు కానీ పదవులు.. ప్రాజెక్టులు.. పంచాయతీలు అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఎలివేషన్ ఉండాల్సిందే అనే డిమాండ్ కూడా క్యాడర్ నుంచి వచ్చేలా లోకేష్ ప్లాన్లు వేస్తున్నారు. వీలైనప్పుడల్లా కొందరితో చంద్రబాబుకు రికమెండ్ చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు కడప మహానాడులో చినబాబుకు పెద్దపదవిని కట్టబెట్టేపనిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్..లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పదవుల్లో ఆయన్ను కూర్చోబెట్టి ఇక పవన్ కళ్యాణ్ కు సరిసమాన హోదా ఇవ్వడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది.. అనే ట్యాగ్ లైన్ మీద హడావుడి చేసే జనసేన నాయకులకు.. క్యాడర్ కు లోకేష్ ఇప్పుడు పోటీగా నిలబడతారని అంటున్నారు.. అప్పుడు లోకేష్ కూడా పవన్ కు సమానమైన హోదా.. గుర్తింపు వస్తుందని. అప్పుడు ఆయన్ను ఎవరూ ఆపలేరని క్యాడర్ సంబరపడుతోంది. -సిమ్మాదిరప్పన్న -
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్
విజయవాడ: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మద్యం కేసులో తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలం సృష్టించి అరెస్ట్ చేసిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది. వీరిని మే 20వ తేదీ వరకూ రిమాండ్ ఇస్తూ తీర్పునిచ్చింది. అదే సమయంలోవీరి వయసును దృష్టిలో పెట్టుకుని జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. వీరికి వెస్ట్రన్ కమోర్డ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చింది కోర్టు. అంతే కాకుండా ధనుంజయరెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది.ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు..రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుకు ఆధారాల్లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పై ఈరోజు(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.. ఈ కేసుకు సంబంధించి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల తరఫున న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ సక్రమం కాదు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఇద్దరి అరెస్ట్‌కు అధారాల్లేవ్. కోర్టుకు కూడా అరెస్ట్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ ఇవ్వలేదు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్ట విరుద్ధం. సిట్ కు ఈ కేసు విచారించే అర్హత లేదు.అసలు రూ. 3200 కోట్లు స్కామ్ కి అసలు ఆధారాలు ఏవి?, రూ. 3200 కోట్లు స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా ఇవ్వలేదు.ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారం కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది. లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. మరి రూ. 3200 కోట్లు స్కామ్ ఎక్కడ జరిగింది?, రూ. 16 వేల కోట్ల నుండి రూ. 24 వేల కోట్లకు ఆదాయ పెరిగింది. మరి ప్రభుత్వంకి నష్టం ఎక్కడొచ్చింది. అరెస్ట్ కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది’ అని శ్రీరామ్ స్పష్టం చేశారు. -
‘సంపద సృష్టిస్తామన్న ప్రభుత్వం.. చెత్తను తొలగించలేకపోతోంది’
విశాఖ: సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పెద్దలు.. వీధుల్లో చెత్తను కూడా తొలగించాలేకపోతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రస్తుతం కూటమి నేతలు హామీలు అమలు చేయలేక ఫస్ట్రేషన్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక చిన్నపాటి వర్షానికి ప్రపంచస్థాయి రాజధాని అని బాబు చెప్పుకుంటున్న అమరావతి మునిగిపోయిదంటూ చురకలంటించారు బొత్స.‘వైఎస్సార్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు వేచి ఉండాలి.. కూటమి హనీమూన్ టైమ్ అయిపోయింది. ఇప్పటికే పోరాటాలు మొదలు పెట్టాము. నిర్దిష్టమైన ఉద్దేశాన్ని పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా చెప్పింది. అధికారులు మీద తప్పుడు కేసులు పెడతారా?, తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిదా? అని ప్రశ్నించారు.మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడితే పరిస్థితి ఏమిటి.. సీజ్ ద షిప్ ఏమైంది?, మాట చెప్పే ముందు మనం ఏమి చేస్తున్నామో ఆలోచించాలి. నిజం నిలకడ మీద తేలాలి తప్ప.. ఉద్దేశాలను ఆపాదించడం సరైన విధానం కాదు’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.అధికారుల అరెస్టులు ఏ మాత్రం సహించదగినవి కాదు, వాటిని ఖండిస్తున్నాం. నన్ను 60 రోజులు జైల్లో పెట్టారు, మేము అధికారంలోకి వచ్చిన తరువాత.. నన్ను జైల్లో పెట్టిన వారిని, ఒక్కరోజైనా జైలులో ఉంచాలనే ఆలోచన మంచిది కాదు. సరైన విధానంలో విచారణ జరగకుండా అరెస్టులు చేయడం తప్పు. కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదని బొత్స గుర్తు చేశారు.వ్యక్తిగత సిబ్బందిని అరెస్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు మీకు పీఏలు లేరా?, వ్యవస్థలను తమ పని తాము చేసుకొనివ్వకపోవడం వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయి. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు వీధుల్లో చెత్తను కూడా తొలగించలేక పోతున్నారు. హామీలు అమలు చేయలేక, ఫ్రస్టేషన్లో వున్నారు. చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిపోయిందిని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ప్రతి అక్రమ అరెస్టుకు ప్రతిఫలం అనుభవిస్తారు: మార్గాని భరత్
తాడేపల్లి: ఎన్నికల సమయంలో హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. వేధింపులే లక్ష్యంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. రెడ్‌బుక్ పేరుతో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లని సైతం వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దెబ్బకి పారిశ్రామిక వేత్తలు కూడా ఏపీ నుండి పరారవుతున్నారని భరత్ స్పష్టం చేశారు. ''చంద్రబాబు గత పాలనలో భారీగా లిక్కర్ స్కాం జరిగింది. రూ.5 వేల కోట్లకు పైగా నిధులను కొల్లగొట్టారు. ఆ కేసులో చంద్రబాబు నిందితుడు. కానీ జగన్ ప్రభుత్వంలో రూ.24 వేల కోట్ల ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వచ్చింది?'' అని మార్గాని భరత్ ప్రశ్నించారు.‘ఇప్పుడు చంద్రబాబు పాలనలో మళ్ళీ తమ మనుషులకు దోచి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. వాట్సప్‌లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పర్మిట్ రూములు పెట్టి అమ్ముతున్నారు. మరి ఇంత చేసినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు రావటం లేదు?, ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?, దీనిని డైవర్షన్ చేసేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారు’ అని భరత్ వివరించారు.చంద్రబాబు.. జగన్ చుట్టూ ఉన్న వారిని టార్గెట్ చేశారు. నిజాయితీ కలిగిన అధికారులను పక్కన పెట్టి తమకు కావాల్సిన వారిని సిట్‌లో వేశారు. వారి ద్వారానే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఇప్పుడు చేస్తున్న ప్రతి అక్రమ అరెస్టుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రతిఫలం అనుభవిస్తారు’ అని భరత్ హెచ్చరించారు.రాష్ట్రంలో ఏ పంటకూ సరైన ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అక్రమ కేసులు ఆపి, ముందు రైతాంగానికి మేలు చేయండి. దావోస్ వెళ్ళి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకు రాలేక పోయారు. జిందాల్ ఏపీ నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఇవి మాత్రమే కాకుండా.. జైళ్లలో అధికారులను కూడా ఉన్నపళంగా బదిలీలు చేయటం వెనుక కారణం ఏంటి?, జైళ్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని భరత్ వెల్లడించారు. -
‘చంద్రబాబు.. లిక్కర్ స్కామ్‌కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’
తాడేపల్లి: నాణ్యమైన మద్యం, తక్కువ ధరలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాన్ని మోసం చేశారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. విమర్శించారు. దేశంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు కూటమి ప్రభుత్వం పెట్టింది పేరని ఎద్దేవా చేశారు శైలజానాథ్,ఈ రోజు(శనివారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. మద్యం వ్యాపారంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్. అని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు చేసిన అన్ని వ్యవహారాలు ప్రజలు మర్చిపోతారనే భావనలో ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే డిస్టలరీలకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వ్యవహారం గురువింది గింజ సమేతలా ఉంటుంది. నూతన పాలసీ విధానంలో మద్యం అమ్మకాలు ప్రైవేటుకి ఇవ్వడంలో కూడా అవకతవకలు జరిగాయి. టీడీపీ స్థానిక నాయకులకు భాగస్వామ్యం ఉంది. రండి చూపిస్తాం... బెల్ట్ షాప్ లు లేని గ్రామం లేదు.. మేము చూపిస్తాం. అసలు మద్యం స్కాం అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం లోనే నడుస్తోంది. మీ ప్రభుత్వ హయాంలో రోజు రెవెన్యూ లోటు కనిపిస్తుంది.మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు?, లిక్కర్ కేసులో ఉన్న ఆధారాలు ఏంటి?, భయాన్ని క్రియట్ చేసి రాజ్యం నడుపుదాం అనుకుంటున్నారా?, చంద్రబాబు ఎన్నికల్లో గెలుపుకోసం ఏమైనా ప్రకటనలు చేస్తారని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగించాలి. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు?, ఇప్పటికైనా కక్ష పూరిత వేధింపులు ఆపండి. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. మీ సీనియర్లతో చర్చించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోండి. మీ సచ్చీలతను నిరూపించుకోండి. చంద్రబాబు.. లిక్కర్ స్కామ్ కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’ అంటూ ధ్వజమెత్తారు శైలజానాథ్. -
‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు’
నెల్లూరు: పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. హామీల అమలును గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. మద్యాన్ని మాత్రాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్ట్ దుర్మార్గం. గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విషయాన్ని లిక్కర్ స్కాంగా మార్చారు. జరగని లిక్కర్ స్కామ్‌ని జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఈ కేసులో నేతలతో పాటు సీనియర్ అధికారులకు ఇరికించారు.చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ధ్వజమెత్తారు చంద్రశేఖర్ రెడ్డి. -
ఆ అరెస్ట్‌ల వెనుక కుట్ర కోణం: అంబటి
సాక్షి, గుంటూరు: కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తే బెదిరిపోయేది లేదని.. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు.‘‘రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పని చేశారని ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్‌ను అక్రమ కేసులతో జైలులో పెట్టి, ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైఎస్సార్సీపీ నేతలను, గత ప్రభుత్వ హయాంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారు. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుంది. అమ్మ ఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
తిరుగుబాటు: ఆమ్ ఆద్మీ పార్టీలో ‘ కొత్త పార్టీ’!
ఢిల్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీలో అంతర్గత పోరు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాజాగా ఆప్ లో ఎప్పట్నుంచో నివురుగప్పిన నిప్పులో ఉన్న వర్గ పోరు వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లో ఆప్ కు చెందిన కౌన్సిలర్లు తమ రాజీనామాలు ప్రకటించారు.తమకు అసలు పనే లేదని, ఇంకెందుకు కౌన్సిల్లరుగా ఉండటం అంటూ వారు రాజీనామాలు చేశారు. ఆప్ కు చెందిన 15 మంది కౌన్సిలర్లు రాజీనామాలు చేయడమే కాకుండా కొత్తగా ఓ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి ఇంద్రప్రస్థ వికాస్ పేరును పెట్టినట్లు రాజీనామాకు సిద్ధమైన ఆప్ కౌన్సిలర్ హిమానీ జైన్ స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా మాకు పని లేదు. కార్పోరేషన్ లో జరగాల్సిన పని ఏదీ జరగలేవు. మేము అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏమీ చేయలేదు. కౌన్సిలర్లుగాఉండటం అనవసరం అని భావించే కొత్త పార్టీ పెట్టాం ’ అని ఆమె స్పష్టం చేశారు. తాము ఆప్ లో ఉన్నామనే సంగతినే అధ్యక్షుడు కేజ్రీవాల్ మరిచిపోయినట్లున్నారని మరో కౌన్సిలర్ ముఖేస్ గోయల్ వ్యాఖ్యానించారు.#WATCH | Delhi | On her resignation from the AAP, party councillor Himani Jain says, "We have formed a new party, Indraprastha Vikas Party. We have resigned from AAP. In the last 2.5 years, no work was done in the corporation which should have been done. We were in power, yet we… pic.twitter.com/c1thjuALZU— ANI (@ANI) May 17, 2025 -
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్ట్‌లు’
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక, హామీలు అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.హామీల అమలు విషయంలో అన్నివర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు.వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి, మద్యం షాపులు తగ్గించి, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతులిచ్చాడని, గత వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. గత మా వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. వీధివీధినా బెల్ట్ షాపులు తెరిచి 24 గంటలూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి దమ్ముంటే తన మీద నమోదైన ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని, ఐఏఎస్, ఐపీఎస్‌లనే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అరాచక పాలనతో ఎంతోకాలం ప్రజాచైతన్యాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
‘సకల శాఖలకు మంత్రి లోకేష్.. అందుకే పవన్‌కు మోదీ చాక్లెట్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. రాష్ట్రంలో సకల శాఖల మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్షాలు.. అబద్ధపు స్టేట్మెంట్స్తో ఈ అరెస్ట్ జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉంది. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. వైఎస్సార్సీపీ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ పాలనలో 22వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు. ఏపీలో నారా లోకేష్ సకల శాఖ మంత్రి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు?. ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలను ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంత పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం.రాష్ట్రంలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. డిప్యూటీ సీఎం పదవి వచ్చాక అదృశ్యమైన మహిళల వ్యవహారంపై పవన్ ఎందుకు మాట్లాడరు. పవన్ కళ్యాణ్.. పిఠాపురం పీఠాధిపతి. అందుకే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబు కుట్ర ఇదే: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్‌లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీని నాశనం చేయాలని, వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్సార్సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు...గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్‌లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాదించుకున్నారు...తప్పుడు ఆరోపణలతో వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారి చిత్తశుద్దితో పనిచేస్తారు? ఎక్కడా జరగని మద్యం కుంభకోణంను సృష్టించి, దీనిలో వైఎస్ జగన్‌ను ఇరికించి, అరెస్ట్ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు...ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి, ఇదే తరహాలో పాలన సాగించాలని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు చేస్తున్న తప్పులను కృష్ణుడి మాదిరిగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రయోగిస్తూ, గత వైయస్ఆర్సీపీపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలను చూసి రేపు మన భవిష్యత్తు ఏమిటీ అనే ఆత్మ మథనం అధికారుల్లో ప్రారంభమైంది’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది. ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్ ఒక పక్కనుంటే.. ఇంకోపక్క ఒకటి అర కూడా అమలు చేయని కూటమి ఇంకోవైపున ఉంది. రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. దాన్ని చల్చార్చలేక కూటమి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోంది. రెడ్‌బుక్ పేరుతో సృష్టిస్తున్న ఆరాచకాలు.. జగన్‌పై లేనిపోని అభాండాలు వేయడం వంటివి ఎన్ని చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు.ఈ విషయం కూటమి నేతలకూ బాగానే అర్థమైంది. ఎక్కడికెళ్లినా జగన్‌కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తన స్వరాన్ని కొంత మార్చుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్‌సిక్స్ హామీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా అమలు చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి!. అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరిట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే.. పార్టీ కేడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టమవుతుంది.టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు రూ.650 కోట్ల చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ స్కీమ్‌ల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపి వేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు రూ.1000కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రూ.650 కోట్ల నిధులు పంచబోతున్నారు. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం!. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీము అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి వేయాలని నిర్ణయించారంటూ, సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. టీడీపీ ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది.ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జగన్ రెండు, మూడు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎప్పుడు వెళ్లినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయనను ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ జై కొడుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లినప్పుడు, సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కాం అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్‌బ్యూరో నిశ్చయించిందట.జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంటగ్యాస్ వినియోగుదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా?. మళ్లీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నా, ఒక సిలిండర్ మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే రెండు లేదా, మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా?. వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. అలాంటిది అందరికి సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావుడి చేసేవారు? ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా? అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే బడ్జెట్ లో ఈ స్కీమ్‌కు వంద కోట్లే కేటాయించారని, అది ఎలా సరిపోతుందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తల్లికి వందనం గురించి ఇప్పటికి పలు వాయిదాలు వేశారు. మళ్లీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు. మహిళలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి చెప్పడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు. ఆ మాట గురించి ఏంటి?. జగన్ ఆయా స్కీమ్‌లను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేసేశామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు.ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ఉపయోగం?. పాలిట్‌బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి.. దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు కానీ.. ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చేశాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి!. ఇలాంటి అబద్ధాలే.. చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకూ పెంచుతున్నాయి!.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏ ఆధారాలతో వారిని అరెస్ట్ చేశారు?: రాచమల్లు
సాక్షి, కడప: కూటమి ప్రభుత్వం చేసే అరెస్ట్‌లు కుట్రలో భాగమేనని వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మద్యం పాలసీతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సంబంధమే లేదన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేశారన్నారు.ఏ సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్ట్ చేశారో ప్రభుత్వం చెప్పగలదా? అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. ‘‘సత్యప్రసాద్ అనే చిన్న ఉద్యోగిని బెదిరించారు. అతని బెదిరించి వారికి కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు ధైర్యంగా పనిచేయగలుగుతున్నారా?. ఐఏఎస్, ఐపీఎస్‌లు జైళ్లకు పోవాల్సిందేనా?’’ అంటూ రాచమల్లు దుయ్యబట్టారు.‘‘కొన్ని బ్రాండ్లే అమ్మారు.. అన్ని బ్రాండ్లు అమ్మలేదని ఆరోపణ.. కూటమి ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం చర్యలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఎవరిని జైలుకు పంపాలని ఉద్దేశంతో అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు?. రూ.3,200 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో ఆధారాలతో చెప్పగలరా?. చంద్రబాబు మద్యం పాలసీ అత్త నీతులు చెప్పినట్లుంది. ఎన్నికలకు ముందు మద్యం ధరలు తగ్గిస్తామన్నారు.. తగ్గించారా?’’ అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. -
తమిళ పాలిటిక్స్.. పార్టీ నేతలకు విజయ్ కీలక ఆదేశాలు
సాక్షి, చెన్నై: పార్టీ పరంగా కమిటీలు, పదవుల భర్తీ ప్రక్రియలన్నీ ఈ నెలాఖరులోపు ముగించే విధంగా ముఖ్య నేతలకు తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలను జూన్ నుంచి విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటుతో జిల్లాల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ముఖ్య పదవులన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఇతర కమిటీలలో కొన్ని పదవుల భర్తీ కసరత్తులు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలు ఉన్న దృష్ట్యా, ఇక ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణలో విజయ్ ఉన్నారు.ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జననాయగన్ చిత్ర షూటింగ్ ఈనెలతో ముగియనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత జూన్ మొదటి వారం నుంచి విజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉండబోతున్నారు. ఇందులో భాగంగా విజయ్ పర్యటనలకు సంబంధించి గత రెండు రోజులుగా చెన్నైలో జిల్లాల కార్యదర్శుల సమావేశం విస్తృతంగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షణలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా అన్ని ప్రక్రియలను, పదవుల భర్తీని ఈ నెలాఖరులోపు ముగించాలని విజయ్ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జూన్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ సైతం సిద్ధమవుతోంది. -
ఈ అరెస్టులు అప్రజాస్వామికం: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు.చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. కాని.. బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించారు. మరి ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా వల్ల నష్టం వచ్చిందన్నారు. మరి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడంలేదు?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కక్ష రాజకీయాలు తార స్థాయికి.. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి...పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు.. మేరుగ నాగార్జునధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని.. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోంది. ఈ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మేరుగ నాగార్జున హెచ్చరించారు.చంద్రబాబువి కక్ష రాజకీయాలు: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుమాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను.వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ధనుంజయ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం.పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తిరుపతి ఎంపీ గురుమూర్తిచంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. -
‘హరీష్ పై కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమో..’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందంటూ ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టం చేసిన రామచంద్రనాయక్.. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.‘పార్టీ ప్లీనరీ సమయంలో హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు అంత సీను లేదని చెప్పారు. రెండు గంటలకు పైగా హరీష్ రావుతో చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లలేదు.హరీష్ రావు ఇంట్లో గతంలో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సడన్‌గా హరీష్ రావు పైన కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలి. హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత ఇప్పటికే పార్టీ కి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. తన మీద దుష్పచారం జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కవిత అంటోంది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. హరీష్ రావు తో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.హరీష్‌రావు నివాసానికి కేటీఆర్హరీష్రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
‘కుట్రతోనే లిక్కర్ స్కామ్ అంటూ అక్రమ కేసు’
కాకినాడ: తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ,వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పని చేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే, నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండ గడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.బొత్స ఇంకా ఏం మాట్లాడారంటే..కూటమి ప్రభుత్వం దారుణ వ్యవహారంకూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్ ముగిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. కూటమి పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు.ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి కింది ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. కానీ, ఏడాది గడుస్తున్నా వాటిలో ఏదీ అమలు చేయడం లేదు.మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగింత. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. ‘సీజ్ ది షిప్’ అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు.తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారు?ఏడాది పాలనలోనే ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు. ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు? మా హయాంలో అప్పులు చేసినా, వివిధ పథకాల కింద రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మరి కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి. సంపద సృష్టిస్తాను. అది తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు, మరి ఇన్ని అప్పులు, ఇంత తక్కువ సమయంలో ఎందుకు చేశారు? అప్పు చేయడం. ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొంత అప్పు చేసినా, ఆ ఖర్చులకు ఒక అర్థం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, తీర ప్రాంతాల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, బోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా ఉత్పాదకతకు దోహదం చేసే వాటికి ఖర్చు చేశాం. మాట ఇస్తే, దాన్ని తప్పకుండా నెరవేర్చాలనేది జగన్‌గారి విధానం. అందుకే ఎన్నికల ముందు, టీడీపీ కూటమి మాదిరిగా, అడ్డగోలు హామీలు ఇవ్వలేదు.పార్టీ కార్యాచరణ. నిర్ణయాలువైఎస్సార్సీపీ అయిదు జిల్లాల ముఖ్య నేతలతో ఈరోజు (శుక్రవారం) సమావేశం నిర్వహించాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రతి జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నాం. అలాగే గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో పాటు, తీర ప్రాంతాల్లోని ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పొగాకు రైతులు ఇదే సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు.దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పొగాకు రైతులను కలిసి నేరుగా వారితో మాట్లాడనున్నారు. తదుపరి పొగాకు కొనుగోళ్ళపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ పరంగా కార్యాచరణను ఖరారు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు మద్దతు ధర లభించని సందర్భంగా మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ మొద్దునిద్ర నుంచి ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు రైతుల పక్షాన పోరాడతామని బొత్య సత్యనారాయణ హెచ్చరించారు. -
మద్యం కేసు రాజకీయ ప్రేరేపితం: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు రాజకీయ ప్రేరేపితమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నట్టు సుప్రీంకోర్టుకు సైతం అర్థమైందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.‘‘చంద్రబాబు రూ.370 కోట్లు లూఠీ చేసినట్టు ఆధారాలతో సహా దొరికారు. ఏలేరు స్కాం నుంచి అనేక కేసులు విచారణ కూడా జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. దానిమీద ఒక్కరోజైనా వైఎస్ జగన్‌ని జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందర పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్షసాధింపు పనిలో పడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబే స్వయంగా అక్రమాలకు పాల్పడ్డారు. నిధుల విడుదల అక్రమమని తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేశారు. ఆధారాలతో సహా స్కిల్ కేసులో దొరికారు’’ అని పేర్ని నాని గుర్తు చేశారు.‘‘బ్రీఫ్డ్ మీ కేసులో టేపులతో సహా దొరికారు.. కానీ లిక్కర్ కేసులో జగన్‌కు ఏం సంబంధం?. ఆయన ఎక్కడైనా సంతకాలు పెట్టారా?. ఈ కేసులో నిజాయితీగా వ్యవహరించిన వినీత్ బ్రిజిలాల్‌ను తప్పించారు. తమకు వత్తాసు పలికే ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్‌ను వేసి లిక్కర్ కేసు నడుపుతున్నారు. కేసు నిలుస్తుందా? లేదా? అనేది పక్కన పెట్టి జగన్ అరెస్టే లక్ష్యంగా కేసు నడుపుతున్నారు. ఇందుకోసం ఎన్ని పాపాలు, తప్పులు చేయాలో అవన్నీ సిట్‌తో చేయిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగన్ వెనకడుగు వేయరు..చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్చెన్నాయుడు.. వీరంతా లిక్కర్ కేసు మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు, ఆరోపణలు చేశారు. అనేక కేసుల్లో దొరికిన దొంగ చంద్రబాబు. లక్షా 50 వేల కోట్లు అప్పు చేసి, ఆ డబ్బును ఏం చేశారో చెప్పటం లేదు. రాష్ట్ర ఆదాయాలు భారీగా పడిపోయాయి. సంపద సృష్టి ఇంకెప్పుడు చేస్తారు?. ప్రత్యేక విమానాల్లో విహారాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల కోసం మూడు హెలికాఫ్టర్లు కొనబోతున్నారు. ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు’’ అని పేర్ని నాని నిలదీశారు.మీరు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లిక్కర్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి వాట్సప్‌లో వచ్చిన ప్రశ్నలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వంశీ కేసులో కోట్ల రూపాయలను లాయర్లకు ఇస్తున్నారు. ప్రజల డబ్బును టీడీపీ నేతల అవసరాలు, కక్షసాధింపు కోసం ఖర్చు చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర డమ్మీ మంత్రి. ఆయన ఇంటి పక్కనే బెల్టుషాపు పెట్టినా చూస్తూ కూర్చున్న చేతగాని మంత్రి’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు. రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
హరీష్‌రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
‘చంద్రబాబు నిర్వాకం.. పదివేల మంది టీచర్లకు డిమోషన్’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. సీఎం చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని అన్నారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి.ఒకవైపు సర్ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుంది?. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దు’ అంటే వ్యాఖ్యలు చేశారు. -
‘సురేఖ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్ కమీషన్ల సంగతేంటి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రులు కమీషన్లు తీసుకోకుండా సంతకాలు చేయరు అని మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఏయే మంత్రి ఎంత కమీషన్లు తీసుకున్నారో దర్యాప్తు చేపట్టాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రులు కమిషన్లు తీసుకోవడం కామన్ అనడం బాధాకరం. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఏయే శాఖ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించాలి. మంత్రులు తీసుకున్న కమీషన్లు బయట పెట్టాలి అని వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర..ఇదే సమయంలో తిరంగా యాత్రపై మాట్లాడుతూ.. పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రమూకలు హతమార్చారు. మానవత్వం లేకుండా పిల్లల ముందు తండ్రిని, భార్య ముందు భర్తను పేర్లు అడిగి హతమార్చారు. మానవ సమాజానికే సవాల్ గా మారిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలను పేల్చివేశాం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేయడం జరిగింది. ఉగ్రవాద చర్యలతో మనదేశం బలవుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోనే 46 వేల మందిని ఉగ్రమూకలు బలితీసుకున్నాయి. మన సైనికులు నూతన చరిత్రను ప్రారంభించారు.గతంలో ఉగ్రమూకలు దాడి చేసినప్పుడు.. మరణించినవారి ఫోటో దగ్గర గులాబీ పువ్వు పెట్టడం వరకే పరిమితం అయ్యే వాళ్ళం. 2009లో 40 మందిని ఊచకోత కోశారు. భారత్‌పై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించాం. ఉగ్రవాదుల శిక్షణ కార్యక్రమాలు, ఉగ్రవాదుల నివాసాలను ధ్వంసం చేశాం. కరడుకట్టిన ఉగ్రవాదులను అంతం చేశాం. పాకిస్తాన్ పిల్ల చేష్టలతో దాడికి ఒడిగట్టింది.. భారత సైన్యం తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. ఇంకా కొనసాగుతోంది. రక్షణ రంగంలో ప్రతి సైనికుడు రాణించారు. S-400, బ్రహ్మాస్త్రం పనితీరు దేశ ప్రజలు గమనించారు. భారత ఆర్మీకి అన్ని రకాలుగా సమకూర్చడం జరిగింది.ఆర్మీకి అవసరమైన వాటిలో 35 శాతం మనమే సమకూర్చుకున్నాం. మిథానీ, DRDAలో వసతులు మెరుగు పరుస్తున్నాం. ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను మరింత సంసిద్ధం చేసుకున్నాం. పాకిస్తాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెడతాం. భారత సైనికులు అనుసరించిన స్ట్రాటజీని ప్రపంచం మొత్తం చూసింది. రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
‘కొండా సురేఖకు నా అభినందనలు’: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కమీషన్ సర్కార్’గా మారిపోయింది. ఇది రహస్యమే కాదు. ఓపెన్ సీక్రెట్. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఫైల్స్‌పై సంతకం చేసేందుకు మంత్రులు, వారి సహచర మంత్రులు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే కమిషన్ల వ్యవహరంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తుందా? అని ప్రశ్నించారు. ఆ ఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా కొండా సురేఖని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలి. ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని అన్నారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ,రేవంత్‌రెడ్డిలు వారి సొంత కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరా?’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. Many congratulations to Minister Konda Surekha garu for finally speaking some truths!Congress in Telangana runs a “commission sarkaar”, and it's unfortunate this has become an open secret in TelanganaIn this 30% commission government, ministers, according to their own… https://t.co/3dMd2yDfb5— KTR (@KTRBRS) May 16, 2025 -
వంశీపై కూటమి కుట్రలు.. మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో మైనింగ్ అక్రమాలపై ఏడీ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.ఇప్పటికే వంశీకి ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు అయినప్పటికీ కూటమి సర్కార్ మాత్రం తప్పుడు కేసులతో వంశీకి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్‌పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇంతలో నిన్న నూజివీడు పోలీసులు.. వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈరోజు మరో కేసు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్‌పై 58 పేజీలతో గనుల శాఖ ఏడీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‌లో వంశీపై కేసు నమోదైంది. ఇలా.. వంశీపై ఏదో ఒక కేసు పెడుతూ వంశీకి బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. సర్కార్ తీరు కారణంగా వంశీ.. 90 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.‘నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. నేను అలా చేయను.. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్ డెవలప్మెంట్ చేయమని కోరా’ అని వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ.. అయితే, తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం కావడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నేను వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు తెలుసు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు. నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌లను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మా కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. పని చేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రినయ్యాను నాపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తారో రండి’ అంటూ సవాల్ విసిరారు. -
బాబూ.. మీడియాతో పెట్టుకోకు!
ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆపరేషన్ సరే.. పహల్గాం నిందితులు చనిపోయారా?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భారత దాడుల్లో మరణించింది ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఒక్కరైనా ఉన్నారా?. సరిహద్దులో ఎందుకు భద్రత లేదు?. పహల్గాం ఘటన జరిగిన తర్వాత వారు ఎలా తప్పించుకున్నారు? అని ప్రశ్నలు సంధించారు.కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోతూర్ మంజునాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ భారత్‌కు ఎలాంటి ప్రయోజనం అందించలేదు. ఈ ఆపరేషన్‌లో ఏమీ చేయలేదు. కేవలం గొప్పగా చూపించుకోవడానికే ఇదంతా చెబుతున్నారు. ఓ నాలుగు విమానాలు సరిహద్దులు దాటి వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చాయి. అంతే తప్ప ఇంకేమీ జరగలేదు. భారత దాడుల్లో మరణించిన వారు ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఎవరైనా ఉన్నారా?. అధికారులు ఒకటి చెబితే.. టీవీలు మరొకటి చెబుతున్నాయి. మరొకరు ఇంకేదో అంటున్నారు. మనం ఎవరిని నమ్ముతాము? అధికారిక ప్రకటన ఎక్కడ?’ అని ప్రశ్నించారు.అలాగే, భారత్ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించారు?. మన సరిహద్దును దాటిన ఆ ఉగ్రవాదులు ఎవరు? వారి గుర్తింపు ఏంటి? సరిహద్దులో ఎందుకు భద్రత లేదు? వారు ఎలా తప్పించుకున్నారు? ఉగ్రవాద మూలాలు, శాఖలను గుర్తించి వాటిని నిర్మూలించాలి. పహల్గాం ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమే. పహల్గాం దాడి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడంలో కేంద్రం విఫలమైంది. పహల్గాం బాధితులకు కేంద్రం పరిహారం ఇచ్చిందా?. కర్ణాటక, పాకిస్తాన్, చైనా లేదా బంగ్లాదేశ్‌లో ఎక్కడైనా పౌరులపై జరిగే దాడులను మేము వ్యతిరేకిస్తాం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ సిందూర్’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. పాక్ దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్.. నూర్ఖాన్, రఫీకీ, షోర్కోట్, మురిద్, సుక్కోర్, సియాల్కోట్, పసురూర్, చునియన్, సర్గోదా, భోలారీ, జకోబాబాద్‌లో దాడులు చేసింది. దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్‌లోని షాబాజ్ బేస్ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి. -
రెడ్‌బుక్ మరువను: మంత్రి నారా లోకేశ్
గుంతకల్లు/గుత్తి : ‘రెడ్‌బుక్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ మర్చిపోను.. టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన అందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేపిస్తా’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారాలోకేశ్ పేర్కొన్నారు.గురువారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతూ ఏ సమావేశానికి వెళ్లినా పార్టీ కేడర్ రెడ్‌బుక్ గురించి అడుగుతున్నారని, ప్రతి ఒక్కరి చిట్టా విప్పి, చేయాల్సిన పని చేస్తానన్నారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ నిర్వహకం వల్లే కరెంటు బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు వేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం స్కూల్ మూసివేస్తుందని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందన్నారు. అనంతపురానికి రూ.22 వేల కోట్ల విలువైన భారీ సోలార్ విండ్ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. -
ఆధి‘పచ్చ’ పోరు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. తమ మాటే వినాలని అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. పోస్టింగ్‌లు, కాంట్రాక్టులు, ఇతర పనుల్లో తమ మాటే నెగ్గాలని ఎవరికి వారు పట్టుబడుతుండడంతో వారి మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఈ విభేదాలు మరింత ముదిరిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ఎంపీల పెత్తనం ఎక్కువ కావడంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లోకేశ్ అండతో ‘చిన్ని’కిచినికి గాలివాన..!విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తాను లోకేశ్ మనిషినంటూ నియోజకవర్గాల్లో అన్నింటికీ తనకు వాటా ఉండాలని పట్టుబట్టి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇసుక ర్యాంపులు, మద్యం షాపులు, కాంట్రాక్టుల కోసం ఎక్కడికక్కడ తన మనుషులను పెట్టి వారితో వ్యవహారాలు నడిపిస్తున్నారు. విజయవాడ నగరంతోపాటు నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో చిన్నచిన్న విషయాల్లోనూ వేలు పెడుతుండడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనను వ్యతిరేకిస్తే లోకేశ్‌తో ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో ఎవరూ బయటపడడం లేదని, కేశినేని చిన్ని తీరు అన్యాయంగా ఉందని వాపోతున్నారు.మా‘లావు’ చిక్కులునర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటూ తన మాటే నెగ్గాలని పట్టుబడుతుండడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నిచోట్లా ప్రత్యేకంగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారితో పనులు చేయించేందుకు యత్నిస్తుండడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలోనే గురజాల, నర్సరావుపేట సీట్లను తాను చెప్పిన వారికి ఇప్పించేందుకు యత్నించినా గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, నర్సరావుపేటలో అరవింద్‌బాబు సీట్లు తెచ్చుకుని గెలిచారు. ఆ తర్వాత కూడా వారితో లావు విభేదాలు కొనసాగిసూ్తనే ఉన్నారు.నర్సరావుపేటలో జనసేన ఇన్చార్జిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన మర్రి రాజశేఖర్‌ను చేరదీయడంతో ఆయన వర్గం రగులుతోంది. మాచర్లలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని పక్కనపెట్టి తన మనుషులతోనే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తనకు మంత్రి పదవి రాకుండా లావు అడ్డుకున్నారనే కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు లావు శ్రీకృష్ణదేవరాయలుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.సిఫార్సుల ‘పెమ్మసాని’గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరులోని తెనాలి, తాడికొండ నియోజవర్గాల్లో బదిలీలు, పనులకు ఆయన ప్రత్యేకంగా సిఫారసు లేఖలు ఇస్తుండడంతో ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెనాలిలో ఒక విద్యుత్ ఏఈ పోస్టు కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వేర్వేరు వ్యక్తులను సిఫారసు చేస్తూ లేఖలు ఇవ్వడంతో ఎవరి చెప్పినట్లు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు.తగ్గ‘వేమిరెడ్డి’!నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు జిల్లా అంతా తనదేనంటూ అన్నింట్లో జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఆయనకు సీఎం తనయుడు లోకేశ్ అండ ఉండడంతో మైనింగ్ వ్యవహారాల్లో ఆయన చెప్పినట్లే జరుగుతోంది. మైనింగ్ డీడీగా తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని తాను చెప్పినట్లు వినేలా చేసుకున్నారు. దీంతో ఆయన తమ మాట కూడా వినకుండా ఎంపీ ఏది చెబితే అది చేస్తున్నారని ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. సర్వేపల్లి, వెంకటగిరి, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీకి ఏమాత్రం పొసగడంలేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించిన అక్రమ మైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి విజిలెన్స్ దాడులు చేయించినట్లు సమాచారం.విశాఖలో ‘భరత్’నాట్యమే!విశాఖపట్నం ఎంపీ భరత్ సీఎం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అన్ని విషయాలూ తనకు తెలియాలని, తనకు చెప్పి చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యవహారాలు, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)కి చెందిన పనులకు సంబంధించి ఆయన పెత్తనం చేస్తుండడంతో ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారు. భరత్ వ్యవహార శైలిపై భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడుతున్నట్లు సమాచారం. అన్ని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటుండడంతో మిగిలిన ఎమ్మెల్యేలు పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా రగిలిపోతున్నారు. -
కొనసాగుతున్న కక్ష.. వల్లభనేని వంశీపై మరో పీటీ వారెంట్ దాఖలు
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. వల్లభనేని వంశీపై మరో పీటి వారెంట్ దాఖలైంది. నూజివీడు కోర్టులో పీటీ వారెంట్‌ను పోలీసులు దాఖలు చేశారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారంటూ పీటీ వారెంట్ దాఖలు చేశారు. వంశీతో పాటు మరో 10 మందిపై కేసు నమోదైందికాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే అభియోగంపై అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ బెయిల్ పిటీషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన అనంతరం ప్రాసిక్యూషన్ తరపున జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించగా, వంశీ తరపున సత్య దేవిశ్రీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం 12వ అదనపు జిల్లా న్యాయస్థానం జడ్జి తీర్పును శుక్రవారం వెల్లడించనున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్ ఎ71 నిందితునిగా ఉన్నారు. -
‘వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే.. అందుకే చంద్రబాబు ఇలా’
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ, వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజల కొనుగోలుశక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి, ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చేస్తానంటూ నమ్మించారు.కానీ ఆయన పాలనను చూస్తే దయనీయమంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్‌పై ఏ విధంగా బురదచల్లాలి, ఏ విధంగా ఆయన వ్యక్తిత్వహననం చేయాలి, వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు.వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీపై తప్పుడు కేసులులేని మద్యం కేసును రంగంలోకి తీసుకువచ్చి, దానిలో వైఎస్ జగన్‌కి సన్నిహితులైన వారందరినీ బాధ్యులుగా చూపి, ఒక పథకం ప్రకారం కక్ష సాధింపులకు చంద్రబాబు తెగబడ్డారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ సంస్థ వికాట్‌లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వికాట్ అనే సంస్థ 165 సంవత్సరాల కిందట ప్రారంభించిన సిమెంట్ కంపెనీ. యూరప్‌లోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన ఈ సంస్థ 1967లో ప్రారంభమైంది. ఈ సంస్థ 2024లో మొత్తం 44,316 కోట్ల రూపాయలు సిమెంట్ అమ్మకాల ద్వారా ఆర్జించిందంటే ఎంత బలమైన సంస్థో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ భారతీ సిమెంట్స్‌ను వరల్డ్ ఫస్ట్‌క్లాస్ టెక్నాలజీతో ప్రారంభించారు. దానిని 2010లో ఈ వికాట్ కంపెనీ టేకోవర్ చేసింది. 51 శాతం వాటాలు దీనికి ఉన్నాయి.ఈ వికాట్ కంపెనీనికి బాలాజీ గోవిందప్ప ఫుల్‌టైం ఫైనాన్స్ సెక్రటరీ. కేవలం వైఎస్ జగన్ ప్రారంభించిన కంపెనీలో ఈయన పనిచేస్తున్నారనే కారణంతోనే లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి, దానిలో ఆయనను ఇరికించి, ఆయనను జైలుకు పంపారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఈ అరెస్ట్ ఒక ఉదాహరణ. అలాగే సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే పెద్ద వ్యాపార దిగ్గజ్జం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించి, పనులు ప్రారంభించారు.చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒక సెకెండ్ గ్రేడ్ సినిమా ఆర్టీస్ట్ను అడ్డం పెట్టుకుని జిందాల్‌ను వేధింపులకు గురి చేశారు. ఇవి తట్టుకోలేక జిందాల్ కడప నుంచి వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టారు. ఒక డీజీపీ ర్యాంక్‌లో ఉన్న పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా వైఎస్ జగన్‌పై కోపంతో, మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో పారిశ్రామికవేత్తలను చంద్రబాబు భయపెట్టాలని చూస్తున్నారు.కూటమి నేతల అరాచకాలతో పారిశ్రామికవేత్తలు బెంబేలుమరోవైపు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలపై మామూళ్ల కోసం దాడులు చేస్తున్నారు. తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫిర్యాదులు చేశారు. తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని కంపెనీకి ముడిసరుకుని ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థలను ఇబ్బంది పెట్టారు. దీనితో సిమెంట్ ప్లాంట్‌నే మూసేసే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మన దేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా అన్నీ ఉత్పత్తి చేసుకోవాలని చెబుతుంటే, అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని ఏకంగా ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్‌నే మూయించే ప్రయత్నం చేశారు. ఇలా చేస్తుంటే పరిశ్రమలు వస్తాయా?గండికోట ప్రాంతంలో ఆదానీ హైడ్రోపవర్ పైనా బీజేపీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు తమకే మొత్తం కాంట్రాక్ట్‌లు ఇవ్వాలని ఆ కంపెనీ కార్యాలయంపైనే దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీలో ఏ పరిశ్రమ అయినా సరే కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే, లేనిపక్షంలో ఆ సంస్థలు పనిచేయవు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడులోని గురజాడలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాను ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశానని, ఆ డబ్బును భవ్య, చెట్టినాడు సిమెంట్ ప్లాంట్లు చెల్లించాలంటూ వారిని వేధించడంతో ఈ రెండు సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయి.శ్రీకాకుళంలోని యూబీ బీర్ తయారీ ఫ్యాక్టరీపై నడికుదిటి ఈశ్వర్రావు అనే బీజేపీ ఎమ్మెల్యే బీర్ రవాణా చేసే ఒక్కో లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ లెక్కన నెలకు రూ.1.50 కోట్లు వారి నుంచి డిమాండ్ చేశాడు. పదివేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న యూబీ సంస్థపై ఇలాంటి వేధింపులకు పాల్పడటంతో ఆ సంస్థ ఎలా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది? జాతీయ రహదారుల కాంట్రాక్ట్‌ల కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌లు పోటీపడి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. దాల్మియా సిమెంట్‌పై చంద్రబాబు కక్షసాధింపు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.793 కోట్ల రూపాయలు జప్తు చేసే కార్యక్రమం చేశారు. టీవీ9 ను లొంగతీసుకోవాలని మైహోం రామేశ్వరరావుకు చెందిన సిమెంట్ కంపెనీకి గనుల నుంచి ముడిసరుకుని రానివ్వకుండా వేధిస్తున్నారు.అసమర్థ పాలనతో ప్రగతి శూన్యంచంద్రబాబు అద్భుతమైన సంపద సృష్టిస్తాను, పరిశ్రమలను తీసుకువస్తాను అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాటు మంచి పాలనను అందించిన వైఎస్ జగన్ కాదని ఒక దుర్మార్గమైన పాలనను అనుభవిస్తున్నామని నేడు అన్ని వర్గాలు ఆవేదన చెందుతున్నారు. కాగ్ లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రం తిరోగమనంలో ఉందని తెలుస్తుంది. 2023-24లో వచ్చిన ఆదాయం కంటే 2024-25లో వచ్చిన ఆదాయంలో తగ్గుదల రూ.5520 కోట్లు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టించడం? ఆయన సంపద పోగొడుతున్నాడు.అమ్మకంపన్ను, స్టాంప్ డ్యూటీ చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.1,053 కోట్లు పడిపోయింది. రిజిస్ట్రేషన్లు లేవు, అమ్మకాలు లేవు, ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లింది. ఇదీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలన. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.705 కోట్లకు పడిపోయింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024-25లో రూ.842 కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన డబ్బు 2024-25లో రూ.14,563 కోట్లు తగ్గింది. మూలధన వ్యయం రూ.4,413 కోట్లకు తగ్గిపోయింది. విద్యా, వైద్యం, సంక్షేమం తదితరాలకు చేసిన వ్యయం రూ.4696 కోట్లు తగ్గింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన లెక్కలు ఇవి.హామీల అమలులో పూర్తి వైఫల్యంచంద్రబాబు ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని గొప్పగా తమను తాము ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు ఏదీ? ఈ హామీలను అమలు చేయడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు బడ్జెట్లో కేటాయించింది చూస్తే రూ.7,282 మాత్రమే. దీనిలో ఖర్చు పెట్టింది రూ.865 కోట్లు మాత్రమే. చివరికి పెన్షన్లలోనూ మూడు లక్షల వరకు కోత పెట్టారు. ఉచిత బస్పు ఊసే లేదు.చివరికి తల్లికి వందనం కింద ఇచ్చేదానిని కూడా వాయిదాల ప్రకారం ఇస్తానంటున్నారు. గతంలో ఇలాగే రైతురుణమాఫీని కూడా ఎగ్గొట్టారు. ఇప్పుడు తల్లికి వందనంను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక నిరుద్యోగభృతి అమలు ఏమయ్యిందో తెలియదు. పాలన ద్వారా ప్రజలను మెప్పించి, మళ్ళీ అధికారంలోకి రావాలనే కోరికే చంద్రబాబుకు లేదు. చంద్రబాబ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోయాయి.రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తీవ్రంగా భ్రష్టు పట్టించారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఇటీవలే చిలుకలూరిపేటలో సీఐ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. న్యాయస్థానాలు పోలీసుల తీరుపై చాలా ఘాటుగానే విమర్శిస్తున్నా స్పందించడం లేదు. ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాల ప్రకారం వ్యవహరించకపోతే భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏం చెబితే గుడ్డిగా దానిని అనుసరించుకుంటూ పోతే దానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొందరు అధికారులు చట్టాలను అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఇది తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత తీవ్రమైన అవమానం’
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన విదేశీ వనితలకు తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్లు కడిగించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల అభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా? అంటూ ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు కిషన్‌రెడ్డి. ‘ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. 72వ మిస్‌వరల్డ్ పోటీల్లో భాగంగా.. కల్చరల్, స్పిరిచువల్ టూర్లో పాల్గొనేందుకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ అందగత్తెలు వచ్చిన సందర్భంలో.. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరం.సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఢిల్లీలోని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంతృప్తి పరిచేందుకే రాహుల్ గాంధీ.. భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాళ్లు కడిగించారు.‘అతిథి దేవో భవ’ మన విధానం.. కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదు. విదేశీ అందగత్తెలముందు మన గౌరవాన్ని పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ మన గౌరవాన్ని దిగజార్చింది. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత కానీ.. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు.ఇందుకుగానూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి.. భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
‘దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి?’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించగా, దానిని కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ శశిథరూర్ కొనియాడారు. ప్రత్యేకంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అమోఘమంటూ కొనియాడారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. శశిథరూర్ ‘లక్ష్మణ రేఖ’ దాటారంటూ విమర్శించింది.దీనిపై శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘ ఇక్కడ భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రత్యేక కోణంలో చూడాలి. నేను ఒక భారతీయుడిగా మాత్రమే ప్రధాని మోదీని పొగిడాను. ఇది నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. దీనికి పార్టీ నిర్ణయంతో పనేంటి?’ అంటూ ధ్వజమెత్తారు.‘భారత్, పాకిస్తాన్ ల యుద్ధంపై నన్ను కొంతమంది అడిగారు. దీన్ని మీరు ఎలా చూస్తారు అని ప్రశ్నించారు. దీనిపై నాకు అవగాహన ఉంది కాబట్టి మాట్లాడా. ఇక్కడ నేను మాట్లాడింది అంతా క్లియర్ గానే ఉంది. ఒక భారతీయుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ఇక్కడ ప్రధాని మోదీని పొగిడితే పార్టీ అభిప్రాయం ఎలా అవుతుంది’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు శశిథరూర్.కాగా, ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పొగడ్తల వర్షం కురిపించారు. రెండు రోజుల క్రితం శశిథరూర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అఘోఘమంటూ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాకిస్తాన్ కు ఒక క్లియర్ మెస్సేజ్ పంపించారని అన్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్న దానిని అస్సలు పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు.ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఏం జరిగిందో అంతా చూశారన్నారు శశిథరూర్. భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతను సమర్థవంతంగా తిప్పికొట్టారని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదన్నారు శశిథరూర్. ఇక కోవిడ్ సమయంలో కూడా ప్రధాని మోదీ స్పందించిన తీరును ఈ సందర్భంగా శశిథరూర్ ప్రస్తావించారు. ఇక్కడ చదవండి: ‘మోదీ జీ.. మీరు దేశాన్ని నడిపిస్తున్న తీరు అమోఘం’ -
‘రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదు’
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదని విమర్శించారు. ఈ రోజు(గురువారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘40 కేజీల వరి ధాన్యం బస్తా నుంచి 4 కేజీల తరుగు తీస్తున్నారు. 13 లక్షల క్వింటాళ్ల ధాన్యం తరుగు రూపంలో పక్కదారి పడుతుంది. 6 వేల కోట్ల రూపాయల తరుగు రూపంలో రైతుల నుంచే కొట్టేస్తున్నారు. ఇది ఎవరి ఖాతాల్లో చేరుతోంది. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లు లు ఎన్ని ?, బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లులకు మళ్ళీ ఎందుకు ధాన్యం పంపుతున్నారు ? ,గతంలో ధాన్యం తీసుకుని సీఎంఆర్(CMR)ఇవ్వని రైస్ మిల్లులకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం CBI తో దర్యాప్తు చేయించాలి. బీఆర్ఎస్ పాలనలో సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్, ఉత్తమ్... ఎందుకోసం విచారణ చేయడం లేదు ?’ అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలి: బండి సంజయ్
హైదరాబాద్: రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైనిక స్కూల్ ను ఏర్పాటు చేయాలని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తికి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం సైనిక స్కూలు ఏర్పాటు కోసం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇక్కడ రాజకీయ పార్టీల వైఖరిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
శ్రీసత్యసాయి జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ!
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. దొడ్డిదారిన మడకశిర మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గిన టీడీపీ.. బలం లేకపోయినా ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టింది. గతంలో మొత్తం 20 వార్డులకు 15 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించగా, కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది.కాగా, రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెత్తనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. ఈ క్రమంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చేజిక్కించుకున్న స్థానాలను సొంతం చేసుకునేందుకు దిగజారి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకున్న టీడీపీ నేతలు మడకశిర మున్సిపాలిటీని కూడా అప్రజాస్వామికంగా కైవసం చేసుకున్నారు.మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 15 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో చైర్‌పర్సన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్‌గా రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరినీ ఎలాగైనా పదవుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు ప్లాన్ వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందికి పచ్చ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఐదుగురితో పాటు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
‘ఏపీలో జీహెచ్ఎంసీ యాక్ట్?.. కూటమిలో కుర్చీ కోసం కుమ్ములాట’
సాక్షి, వైఎస్సార్: కూటమి పాలనలో అభివృద్ధి లేదు.. కానీ కక్ష సాధింపులో మాత్రం ముందుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పుకొచ్చారు. కుర్చీల కోసం కుమ్ములాట నడుస్తోందన్నారు.వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో అభివృద్ధి లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కక్ష సాధింపులో భాగంగా రాక్షసానందం పొందుతున్నారు. వాళ్ళు పెడుతున్న కేసులు ఏవీ కోర్టుల్లో నిలబడటం లేదు. కడప మేయర్ సురేష్ బాబు విషయంలోనూ అదే తీరులో వెళ్తున్నారు. అసలు యాక్ట్ లేదు.. మనం జీహెచ్ఎంసీ యాక్టు అమలు చేసుకుంటున్నాం. మన రాష్ట్రానికి అసలు యాక్ట్ లేనే లేదు. జీహెచ్ఎంసీ యాక్టు చూపించి మా మేయర్‌పై చర్యలు తీసుకోవడం విడ్డూరం. మేయర్ కుమారుడి సంస్థకు కమిషనర్ రిజిస్టర్ చేస్తారు.. అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదు?ఆరోపణల్లో ఏదైనా అవినీతి చూపించలేదు. కుర్చీల కోసం కుమ్ములాట కోసం ఇదంతా జరుగుతోంది. వాళ్ళ పత్రికలే కుర్చీల కోసమే ఇదంతా జరుగుతుందని రాసింది. ఎమ్మెల్యేలకు చాలా కంపెనీలు ఉన్నాయి.. మరి వాళ్ళు కాంట్రాక్టులు చేయవచ్చా?. మేయర్ తన వివరణలో తన దృష్టికి రాలేదని వివరణ కూడా ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై మాకు గౌరవం ఉంది.. న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి నేరుగా ఫిర్యాదు చేసారట.. దీనిలో ఇక రాజకీయం లేక ఏముంది?. నగరానికి ఆమె ఒక్క పైసా నిధులు తీసుకురాక పోగా కక్ష సాధింపులకు దిగడం సరికాదు.వేదికపై మేయర్ ఒక్కరే కూర్చోవాలి.. అది చట్టం. నీకు కుర్చీ వేయలేదని కక్ష సాధింపు అంటే ఎలా?. దీనికి మేయర్ ఇంటిపై చెత్త వేయిస్తారా?. తప్పుడు ఫిర్యాదులు చేస్తారా?. ఈ ప్రభుత్వం రాగానే అవిశ్వాసం పెట్టీ దించాలని ప్రయత్నం చేశారు. అది వీలు కాకపోవడంతో ఈ రకంగా కక్ష సాధింపునకు దిగుతున్నారు. చిన్న విషయాన్ని చూపి అనర్హత అనడం దారుణం’ అంటూ మండిపడ్డారు. -
కట్టిన మూడేళ్లకే కూలింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఈ భూ ప్రపంచంలో కట్టిన మూడేళ్లకే కుప్పకూలిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజాం కాలంలో మూసీ నదిపై కట్టిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌తో పాటు జవహర్లాల్ నెహ్రూ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని చెప్పారు. కానీ మూడేళ్లలోనే కాళేశ్వరం.. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినా 50 వేల ఎకరాలకు కూడా నీరివ్వలేదని విమర్శించారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్లుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందిన 423 మందికి బుధవారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారికి పలు సూచనలు చేస్తూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల తీరుతెన్నులను వివరించారు. ఓ రాజకీయ పార్టీ భావోద్వేగాన్ని వాడుకుంది ‘నీళ్లు నాగరికతను నేర్పుతాయి. తెలంగాణ ప్రజలకు నీళ్లు ఉద్యమాన్ని నేర్పాయి. నీళ్ల కోసం పరితపించి పోరాడాం. అంతటి ప్రాధాన్యత గల నీటిపారుదల శాఖలో పనిచేయడం ఉద్యోగం కాదు. భావోద్వేగం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది నీళ్లు, నిధులు నియామకాలు. ఈ మూడింటితో కూడిన భావోద్వేగాన్ని ఓ రాజకీయ పార్టీ వాడుకుని పదేళ్లు అధికారంలో కొనసాగింది. పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఉమ్మడి రాష్రంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమై పెండింగ్‌లో ఉన్న ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పాలమూరు–రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఈ రూ.2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? 10 ఏళ్లు నియామకాలు జరగలేదు. మేం ఇప్పటివరకు నీటి పారుదల శాఖలో 1,161 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. లష్కర్లుగా మరో 2 వేల మందిని నియమించాం. మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత సాగునీటి పారుదలకే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మూడుచోట్లా కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు ‘సాగునీటి ప్రాజెక్టులు ఎలా కట్టాలో.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదలు సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ కట్టిన ఇంజనీర్లు చూపించారు. 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని భయపడ్డా. కానీ ఆ కట్టడానికి ఏం కాలేదు. ఒక ప్రాజెక్టు ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. హెలీకాప్టర్‌లో వెళ్తూ కిందకు చూపించి మూడు బరాజ్‌లు కట్టించారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఎవరి పని వారు చేయాలి ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. అలా చేసిన వాళ్లు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురుకాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలడానికి అధికారులే బాధ్యులన్నట్టుగా నివేదికలు వస్తున్నాయి. మీరు కట్టే ప్రాజెక్టులు భావితరాలకు ఉపయోగపడతాయి. 30 ఏళ్లు కష్టపడితే తప్ప అసిస్టెంట్ ఇంజనీర్.. ఇంజనీర్ ఇన్ చీఫ్ కాలేరని గుర్తుంచుకోవాలి. కుప్పకూలిన ప్రాజెక్టు కాళేశ్వరంను ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందిన వారు సందర్శించాలి..’ అని రేవంత్ చెప్పారు. ‘సీతారామ’ కూడా లోపభూయిష్టంగానే ఉంది ‘సీతారామ ప్రాజెక్టు కూడా లోపభూయిష్టంగానే ఉంది. 45 కిలోమీటర్ల అతి పొడవైన టన్నెల్ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ 75 శాతం ఎప్పుడో పూర్తయితే పదేళ్లలో 10 కిలోమీటర్ల పనులు పూర్తి చేయలేదు. 3.36 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును పదేళ్లు పట్టించుకోకపోతే మళ్లీ మేం అధికారంలోకి వచి్చన తరువాత పనులు ప్రారంభించాం. అయితే పదేళ్లు పనులు జరగక సొరంగం కుప్పకూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం: మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో సాగునీటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. నీటిపారుదల శాఖలో తొలిసారిగా ఉద్యోగ ఖాళీలన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిధుల కొరత వచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. తెలంగాణకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు. నిధుల కొరత వచ్చినా, ఏదోరకంగా పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తాం. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం అన్నారు. -
‘ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. దానికి మీరే ప్రతినిధులు’
హైదరాబాద్: నీళ్లు మన నాగరికత అని, దాని కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈరోజు(బుధవారం) జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. ‘నీళ్లు మన నాగరికత.. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.నీళ్ల కోసం మొదలైన మన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. ఆ భావోద్వేగానికి మీరే ప్రతినిధులు. భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయి. రూ. 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?, మేధావులు, ఉద్యోగులు ఈ విషయంపై ఆలోచన చేయాలి. ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాం. ఈ పదిహేను నెలల్లో ఒక నీటిపారుదలశాఖలోనే 1161 ఉద్యోగా ఖాళీలను భర్తీ చేశాం. అత్యంత ప్రాధాన్యమైన శాఖ నీటిపారుదల శాఖ. అందుకే ఆనాడు ఇరిగేషన్ ప్రాధాన్యతగా తీసుకుని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు కట్టారుగతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ కాళేశ్వరం మూడేళ్ళలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. కట్టిన మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే. ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి.. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్ట నిర్మాణాలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎప్పడు ఏది కూలుతుందో తెలియని పరిస్థితి. ఎవరి నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదో అందరికీ తెలుసు.తెలంగాణ ప్రజల బిగ్గెస్ట్ సెంటు మెంట్ నీళ్లు. నీళ్లు అందించే సాగునీటి ప్రాజక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
‘ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి? ’
తాడేపల్లి : రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతే చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కారుమూరి.. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.‘జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేశారు. పంట నష్టం వచ్చినా అందుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. చంద్రబాబు వచ్చాక కౌలుదారీ కార్డులు తొలగించారు. ఖరీఫ్ సీజన్ కి మరో 15 రోజులే సమయం ఉంది. ఈలోపు కౌలుదారులకు కూడా న్యాయం చేయాలి. 80% మంది ఉన్న కౌలు రైతుల మేలు గురించి పట్టించుకోకపోవడం దారుణం. జగన హయాంలో తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేశారు. కౌలు రైతుకు కూడా కార్డులు ఇస్తే ఎక్కడ ప్రభుత్వ మేలు చేయాల్సి వస్తుందోనని చంద్రబాబు ఇవ్వటం లేదు. 32 లక్షల మంది కౌలు రైతులు చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి?, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే ఇంకా చంద్రబాబు ఉన్నారు. అమరావతి మీద చూపే ప్రేమ రైతుల మీద కూడా చూపించండి. పొగాకుకు ధరల్లేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రూ.18 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.10వేలు కూడా లేదురైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వారి తరపున పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు. -
‘రాష్ట్రంలో విద్యకు చంద్ర గ్రహణం పట్టించారు’
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలనతో రాష్ట్రానికి రాహు కాలం పట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్యను విధ్వంసం చేసి చంద్రగ్రహణం పట్టించారని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. ప్రీ హైస్కూల్స్, శాటిలైట్ స్కూల్స్ వంటి రీఫామ్స్ తెచ్చారు. వాటి వలన 25 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ వచ్చాయి. జీవో 117 తో జగన్ తెచ్చిన మార్పులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.చంద్రబాబు తెచ్చిన 9 రకాల వ్యవస్థల వలన విద్యారంగం నాశనం అయింది. దీని వలన టీచర్ల మధ్య కూడా వైషమ్యాలు తెచ్చారు. చివరికి 26 వేల స్కూళ్లు దెబ్బతినబోతున్నాయి. ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ స్కూళ్ల మీద విరక్తి కలిగేలా చేస్తున్నారు. జగన్ మీద ఉన్న కోపాన్ని స్కూళ్ల మీద చూపిస్తూ వాటిని నాశనం చేస్తున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
ఏపీ పోలీసుల ఆగడాలకు హద్దు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ఏమైంది?. ప్రభుత్వమేదైనా.. రాజకీయ ప్రభావం ఎంతో కొంత ఉండవచ్చు కానీ.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో మాత్రం పోలీసింగే తక్కువైపోతోంది!. వేసే ప్రతి అడుగు రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు మహిళలన్న విచక్షణ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు లాకప్ మరణాలూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 1980లలో తరచూ కనిపించిన లాకప్‌డెత్ వార్తలు మళ్లీ పత్రికలకు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రమీజాబి, షకీలా అనే ఇద్దరు మహిళల లాకప్ డెత్ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేశాయి. విపక్షాల ఆందోళనను అదుపు చేయడమే ప్రభుత్వానికి కష్టమైపోయింది. ఒక మహిళను గన్నవరం వద్ద పోలీసులు హింసిస్తే ప్రజలే తిరుగుబాటు చేసినంత పనిచేశారు. లాకప్‌డెత్‌లకు సంబంధిత పోలీసు అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకునేవారు. ఒకసారి విజయవాడలో మురళీధరన్ అనే కేరళ వ్యక్తి లాకప్‌లో మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయ వ్యవస్థ జోక్యంతో లాకప్ డెత్‌ల విషయంలో పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.తాజా పరిణామాల విషయానికి వస్తే.. సాక్షి దినపత్రికలో ‘ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్’ శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. రాజకీయ బాస్‌లను మెప్పించేందుకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారా? అనిపిస్తుంది. దీన్ని చదివితే టీడీపీ జిల్లా నేత, అధిష్టానానికి సన్నిహితుడైన వీరయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని మరో వర్గం వారే హత్య చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీరయ్య చౌదరి అంత్యక్రియలకు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కేసు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆ తరువాత పోలీసులు ఈ హత్య కేసులో అనుమానితులన్న పేరుతో కొందరిని నిర్బంధించి హింసిస్తున్నట్లు.. నేరం తామే చేసినట్టుగా ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిందితులైతే అరెస్టు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ.. అనధికారికంగా నిర్బంధించడంతోనే వస్తోంది సమస్య.పోలీసుల హింస తట్టుకోలేక ఒక అనుమానితుడు ప్రాణాలు కోల్పోవడంతో సమస్య జటిలమైంది. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కితే మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారట. పోలీసు ఉన్నతాధికారి ఒకరి పాత్ర కూడా ఇందులో ఉందట. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పి అంత్యక్రియలు కూడా జరిపించేశారట. ప్రజలను కాపాడవలసిన పోలీసులే ఇలా లాకప్ డెత్‌లకు కారణం అవుతుంటే ఏపీలో పాలన తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం అవుతుంది.ఎల్లో మీడియా గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఏ ఘటన జరిగినా భూతద్దంలో చూపుతూ నానా యాగీ చేసేవి. రాజమండ్రి వద్ద ఒక పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి శిరోముండనం చేశారు. అది బయటకు వచ్చింది. వెంటనే జగన్ ప్రభుత్వం సంబంధిత పోలీసు అధికారులపై కేసు కూడా పెట్టి చర్య తీసుకుంది. అయినా అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కలిసి దారుణమైన రీతిలో ప్రచారం చేశాయి. సుధాకర్ అనే ఒక డాక్టర్ మద్యం తీసుకుని విశాఖ రోడ్డుపై రచ్చ చేస్తుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. దానిపై ఎంత గందరగోళం సృష్టించారో అందరికి తెలుసు. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా విరుచుకుపడేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పోలీసుల కారణంగానే మరణించినా ప్రభుత్వం పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించదు.మరోవైపు మాజీ మంత్రి విడదల రజని పట్ల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యవహరించిన తీరు శోచనీయం. ఆమెను కారు నుంచి బలవంతంగా దించి, కారణం, కేసు వివరాలు చెప్పకుండా ఆమె వద్ద పనిచేసే వ్యక్తిని అరెస్టు చేసిన వైనం తీవ్ర విమర్శలకు గురైంది. గుంటూరు జిల్లాలో ఒక మహిళా ఎంపీటీసీని రాత్రివేళ కనీసం డ్రెస్ మార్చుకోనివ్వకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కృష్ణవేణి అనే సోషల్ మీడియా కార్యకర్తను గతంలో అరెస్టు చేసి పలు స్టేషన్లకు తిప్పారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు, హత్యలు వంటి వాటిని అరికట్టడానికి పోలీసులు ఏం చర్యలు చేపడుతున్నది తెలియదు కాని, ఇలా వైఎస్సార్సీపీకి చెందిన మహిళలను మాత్రం పలు రకాలుగా పోలీసులతో వేధిస్తున్న తీరు అభ్యంతరకరం అని చెప్పాలి.ఇవే కాదు.. అటవీ శాఖాధికారి, సీనియర్ అధికారి సిసోడియా వద్ద ఓఎస్డీగా పనిచేసిన మూర్తి అనే అధికారిని సిసోసియా మనుషులే కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూర్తి ఇంటెలిజెన్స్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారట. ఈ కేసు సంగతి వదలి, అతనిని పోలీసులు ఇబ్బంది పెడుతుంటే హైకోర్టు జోక్యం చేసుకుని రక్షణ కల్పించిందట. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మార్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను ప్రత్యర్దులు కారు టిప్పర్‌తో ఢీకొట్టి వేట కొడవళ్లతో హత్య చేశారు. ఇది టీడీపీ నేతతో ఉన్న ఫ్యాక్షన్ గొడవతోనే. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ హత్య జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు వాపోతున్నారు.మరో ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని గత నవంబర్ 8న అరెస్టు చేసి పదో తేదీన జరిగినట్లు రికార్డుల్లో చూపించారన్న విషయమై హైకోర్టు కూడా సీరియస్ అయింది. రెడ్ బుక్ పాలనలో సీనియర్ ఐపీఎస్ అధికారులు కొందరికి కూడా అక్రమ కేసుల బెడద తప్పడం లేదు. గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండటమే వీరు చేసిన తప్పుగా ఉంది. ఈ పరిణామాలేవీ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది కాదు. ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే మ్యూజిక్‌ను ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్సార్సీపీ హెచ్చరికలు చేస్తున్నా, పోలీసు అధికారులు కొందరు రాజకీయ బాస్‌లకు అత్యంత విధేయులుగా ఉండడానికి, వారి మెప్పు పొందడానికి ఆగడాలకు దిగుతున్నారు. ఇది దురదృష్టకరం!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం.. రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజీ డీల్ కుదిరిందని అన్నారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జూన్ రెండో తేదీన లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. బీఆర్ఎస్ విలీనం అవుతుంది. రాష్ట్రంలో సీఎం మార్పు ఖాయం. రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజీ డీల్ కుదిరింది. కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేస్తానన్న హరీశ్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్ సర్కార్‌పై వరుస పోరాటాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతమొందించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను మోసం చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కిందని, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంగళవారం రాత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం షురూ అయిందన్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు బీఆర్ఎస్సేనని, సభ తర్వాత ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం ఈ సభ ద్వారా కలిగిందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత వ్యతి రేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవడం అనే లక్షణాలు పుష్కలంగా ఉన్న రేవంత్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పోయిందన్నారు. ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతకు అనుగుణంగా ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవాలని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందన్నారు. రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో చూపిస్తున్న నిర్లక్ష్యం, అకాల వర్షాల తో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీ కార్యాచరణ ఉండబోతుందని తెలిపారు. ఇటీవల వెలుగుచూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండ గట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగసభ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీసభగా ఎల్కతుర్తి రజతోత్సవ సభ నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ కార్యకర్త, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అంతులేని అభిమానానికి ఎల్కతుర్తి సభనే నిదర్శనమన్నారు. ఈ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. పార్టీ 25 సంవత్సరాల సంబురాన్ని వరంగల్ గడ్డపై నిర్వహించే అవకాశం తమకు ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విషయాల్లో తమకు దిశానిర్దేశం చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహణలో భాగమైన నేతలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. -
హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వదిలేసి అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల లెక్కలను విడుదల చేశారు ఉత్తమ్. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. 43. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రతి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హరీష్ కు ఉత్తమ్ హితవు పలికారు. ఒకసారి హరీష్ లెక్కలు చూసి మాట్లాడితే మంచిదని సూచించారు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లాగ కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇందిరమ్మ ఇండ్ల కోటా ఇస్తామన్నారు పొంగులేటి. ఇక ఏపీలో కలిసిన ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
‘చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తి’
ఢిల్లీ: సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాటిని అమలు చేయలేక డకౌట్ అయ్యారని విమర్శించారు సీడబ్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబు తీరు చూస్తే వాగ్దానాలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు గిడుగు రుద్రరాజు. చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తయ్యిందని చమత్కరించారు. అమరావతి పేరుతో మళ్లీ భూసేకరణ చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో భూమి ఇచ్చిన రైతులకే ప్రభుత్వం ఆర్థికంగా న్యాయం చేయలేదన్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ద్వజమెత్తారు. అమరావతికి 7 వేల ఎకరాలు సరిపోతుందని గిడుగు రుద్రరాజు స్సష్టం చేశారు. -
కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే.. : హరీష్ రావు ఏమన్నారంటే
హైదరాబాద్: బీఆర్ఎస్ లో విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా వస్తున్న రూమర్లకు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు చెక్ పెట్టారు. అసలు బీఆర్ఎస్ లో విభేదాలున్నాయనే వార్తల్లో నిజం లేదన్నారు. దీనిపై ఈరోజు(మంగళవారం) హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ‘ మా పార్టీ బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవు. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా. మా అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా’ అని హరీష్ రావు స్పష్టం చేశారు.కాగా, ఎప్పట్నుంచో ‘బీఆర్ఎస్ లో విభేదాలు’ అనే మాట తరచు వినిపిస్తూ వస్తోంది. ప్రధానంగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ బాధ్యతల్ని ఎవరు మోస్తారు అనేది ప్రధానంగా నడిచే చర్చ. ఇక్కడ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆ బాధ్యతల్ని తీసుకుంటారా?, లేక మేనల్లుడైన హరీష్ రావు తీసుకుంటారా? అనే దానిపై రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే, హరీష్ రావు పరిస్థితి ఏంటి?, హరీష్ రావు మరొక పార్టీవైపు కన్నేస్తారా? అనేదే ప్రధానంగా నడిచిన చర్చ.దీనికి ముగింపు పలికారు హరీష్ రావు. తమ పార్టీలో విభేదాలు లేవని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే తనకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు. , దాన్ని తాను స్వాగతిస్తాననన్నారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానన్నారు హరీష్ రావు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. -
‘రూ. 300 కూలి కోసం పనికి వెళితే వేధించారు’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపురించిందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం.. ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జగన్మోహన్ రావు.. ‘ చందర్లపాడు లో ఉపాధి హామీ కూలి చేసే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగులు మందు తాగింది. రూ. 300 కూలి కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది అని పనికి వెళితే వేధించారు. ఆమె మాట్లాడిన వీడియో ఉన్నా... అనుమానాస్పద మృతి గా కేసు కట్టడం దారుణం. ఆమె భర్త చేత కడుపు నొప్పి అని ఫిర్యాదు చేయించడం బాధాకరం. కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా..?, ఆమె మరణ వాంగ్మూలంకి విలువ లేదా?, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను ప్రశ్నించినందుకు ఆమె ను వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనుల్లో ఇలానే అక్రమాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ప్రమేయంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంత ఘోరంగా వేధించి చంపేస్తే కేసును తారుమారు చేస్తున్నారు. గతంలో కూడా కాకినాడలో మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ని డబ్బులు ఇమ్మని వేధించారు. ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎందుకని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఉపాధి కూలీలు వైఎస్సార్ సీపీకి చెందినవారైతే పనులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. -
‘రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నాం’
శ్రీ సత్యసాయి జిల్లా: రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో భాగంగానే వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారని, మరో కార్యకర్తను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని తోపుదుర్తి పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) రామగిరి ఎంపీపి ఎన్నికపై తోపుదుర్తి మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీణించాయి. టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్ లోనే హింసా రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మెజారిటీ ఉన్నా రామగిరి ఎంపీపీ ఎన్నిక లను బహిష్కరిస్తున్నాం’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. -
‘వాడికి ఎందుకంత కొవ్వు’ .. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం నోటి దురుసు వ్యాఖ్యలు
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్‌ను తొలగించేందుకు రెడీ అయ్యింది.ఈ తరుణంలో రవికుమార్‌ను విధుల నుంచి తొలగించవద్దంటూ కొఠారి గ్రామస్తులు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ఆశ్రయించారు. రవి కుమార్ ఏ తప్పూ చేయలేదని, అతన్ని తొలగించవచ్చని ఎమ్మెల్యేని కోరారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ మహిళలతో ఎమ్మెల్యే బెందాళం అశోక్ దురుసుగా మాట్లాడారు.ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ..‘వాడికి ఎందుకంత కొవ్వు. నేను ఎమ్మెల్యేని. నేను పిలిస్తే వాడు రాడా? వాడు నా దగ్గరికి ఎందుకు రాలేదు?’అంటూ దురుసుగా మాట్లాడారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గ్రామస్తులు, మహిళలతో దురుసుగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో బెందాళం అశోక్ అలా దురుసుగా మాట్లాడడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా గ్రామస్తులు ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం, ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అప్పుడు జన్మభూమి కమిటీలు... ఇప్పుడు పీ-4 సమన్వయకర్తలు!
పేదరిక నిర్మూలన కోసమే పీ-4 విధానం అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని పార్టీ నేతల పదవీదాహాన్ని తీర్చేందుకు వాడేసుకుంటున్నారా? అవుననే అంటున్నారు ప్రజలు. కార్పొరేట్ సంస్థలు, ధనికులు రాష్ట్రంలోని పేదలను దత్తత తీసుకుని పేదరికం నుంచి బయటపడేయడమే పీ-4 అని చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో రాష్ట్రమంతా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. అదేదో గేమ్‌ఛేంజర్ అని... కొద్దిమంది ధనికులు కొంతమంది పేదలను దత్తత తీసుకుంటే పేదరికం ఎలా తగ్గుతుందన్న అనుమానం వ్యక్తం చేస్తే.. ‘‘మీకు తెలియదులే’’ అన్నట్టుగా వ్యవహరించారు చంద్రబాబు. ఈ పీ-4 విషయంలో తాజా సమాచారం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది.ధనికుల అనాసక్తో ఇంకో కారణమో తెలియదు కానీ.. పీ-4 అమలుకు ఇప్పుడు కొత్త స్కీమ్‌ను ముందుకు తెచ్చారు. పేదలకూ.. ధనికులకు మధ్య వారధిగా ఓ సమన్వయ కర్తను నియమించనున్నామని అంటున్నారు. మంచిదేగా అనుకుంటున్నారేమో.. నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్రం మొత్తం 175 మందిని ఏర్పాటు చేయడమే కాదు.. వీరు ఒకొక్కరికి నెలకు రూ.60 వేల జీతమిస్తారట! అలాగని వీరి నియామకాలకు ఏదైనా నిర్దిష్ట విధానముందా అంటే అదీ లేదు! అంటే.. తెలుగుదేశం కూటమి నేతలు సిఫారసు చేసిన వారికే ఈ పదవి వస్తుందన్నమాట. పైగా ఇది ఉద్యోగమా? లేక ఓ హోదానా? ఉద్యోగి అయితే అతడికి ఇతర సదుపాయాలు కల్పించాలి మరి!నియోజకవర్గంతోపాటు అవసమైనప్పుడు జిల్లా కేంద్రం, రాష్ట్ర రాజధానికి వెళ్లి వచ్చేందుకు అవసరమైన ఖర్చులన్నమాట. ఇవన్నీ ఏ పద్దు కింద.. ఏ కార్యాలయానికి అనుంబంధంగా ఇస్తారు? అంతేకాకుండా... ఈ సమన్వయకర్త పని చేసేందుకు ఓ కార్యాలయం.. అతడికో సీటు ఏర్పాటూ తప్పనిసరి అవుతుంది! పోనీ సమన్వయకర్త అనేది ఒక హోదా అనుకున్నా.. ఆఫీసు, రవాణా ఖర్చుల్లాంటివి భరించక తప్పదు. వీటన్నింటికీ కేటాయింపులు కూడా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏడాదికి రూ.12 కోట్ల వ్యయానికి లెక్కలేమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు?పీ-4 సమన్వయ కర్తలు నియోజకవర్గ ప్రణాళిక తయారు చేసి, దాతృత్వ వ్యక్తులు, ప్రైవేటు రంగ సంస్థలను ఒప్పించి సమన్వయం చేస్తూ సమాజానికి మేలు చేయాలట. నిజానికి చంద్రబాబు ఈ కార్యక్రమం ఆరంభించినప్పుడు ఏపీలో ఉన్న ప్రముఖులు, ఆయా సంస్థలు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో పేదలను దత్తత తీసుకుంటారన్నట్లుగా హోరెత్తించారు. ఇందుకోసం ఒక సర్వేని కూడా నిర్వహించి సుమారు 20 లక్షల కుటుంబాలను పేదల కింద నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అయితే ఆయా కుటుంబంలో పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చేందుకు ఎంతమంది దాతలు ముందుకు వస్తారన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఏదో హడావుడి చేసినా, స్పందించింది చాలా కొద్దిమందేనని అనిపిస్తోంది. ప్రభుత్వం స్వయంగా పేదరికాన్ని వేలెత్తి చూపే విధంగా వ్యవహరించడం మంచిదేనా అన్న మీమాంస ఏర్పడింది. ఈ సమన్వయ కర్తలను కాంట్రాక్టు పద్దతిలో నియమించడం ద్వారా తమకు తోచిన వారిని నియమించుకోవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం పేదలను ఆదుకునే బాధ్యత ప్రైవేటు రంగానికి అప్పగించి చేతులు దులుపుకున్నట్లుగా ఉందీ వ్యవహారం. తాజాగా తెలుస్తున్నదేమిటంటే... పేదలను దత్తత తీసుకునే వారిని ఎంపిక చేయడం.. ఒప్పించడం అన్నీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల బాధ్యతగా ప్రభుత్వం తీర్మానించింది. ఈ పని చేయకపోతే వారి జీతాల్లో కోతలూ ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నట్లు సమాచారం. దీంతో మాకీ కొత్త తలనొప్పి ఏమిటని గ్రామ పంచాయతీ కార్యదర్శలు తలలు పట్టుకుంటున్నారు.సమన్వయకర్తలతోపాటు కన్సల్టెంట్ల పేరుతో మరింత మందిని నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వికసిత ఆంధ్ర విజన్’ పేరుతో ఏపీ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక కమిటీలో 71 మందిని కన్సల్టెంట్లుగా పెడుతున్నారు. ఇదే కాదు.రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఎనిమిది నెలల కాలానికి రూ.3.28 కోట్లు చెల్లిస్తూ.. 11 మంది కన్సల్టెంట్లను నియమిస్తున్నారు. రాజధాని అభివృద్ది సంస్థ కోసం ఒకొక్కరికి రూ.లక్ష నుంచి రెండు లక్షల జీతాలతో మరో 68 మంది కన్సల్టెంట్లకూ ఓకే అంది ప్రభుత్వం. వీరు అమరావతి ఆర్థికాభివృద్దిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలట. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం మరో కన్సల్టెన్నీ ఏజెన్సీకి రెండేళ్లలో ఇంకో రూ.22 కోట్లు వ్యయం చేయనున్నారు. చూడబోతే ప్రభుత్వాన్ని అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పెట్టేలా ఉన్నారు.లక్షల మంది ఉద్యోగులు, యంత్రాంగం ఉన్న ఏపీ ప్రభుత్వం ఎందుకు ఈ నియమాకాలను చేపడుతోంది అంటే ఇదంతా పార్టీకి పని చేసిన వారి కోసమో, లేక కూటమి నేతలు తమ ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవడానికో అన్న సమాధానం వస్తుంది. అసలు చంద్రబాబు పేరు వినగానే, ఆయనను చూడగానే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి, దానాలు చేయడానికి ముందుకు వస్తారని, అది ఆయన బ్రాండ్ గొప్పదనమని ప్రచారం చూసిన తెలుగుదేశం నేతలు, ఇప్పుడు ఆ బ్రాండ్ ఆశించిన స్థాయిలో ఉపయోగపడడం లేదని భావిస్తున్నారా? గత జగన్ ప్రభుత్వం ఏ నియామకం చేపట్టినా నానా రచ్చ, రచ్చగా రాసిన ఎల్లో మీడియా కాని, విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు కాని ఇప్పుడు వీటి గురించి ప్రజలకు వివరించడం లేదు. రహస్యంగా తమ పని తాము చేసుకుపోతూ ప్రజాధనాన్ని మంచినీటిలా ఖర్చు చేస్తున్నారు. ఇది ఏపీకి మేలు చేస్తుందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజయ్‌కు 105 సీట్లు?
సాక్షి, చెన్నై: విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికలలో 105 సీట్లలో గెలుపు ఖాయం అన్నది వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మూడు నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలు సోమవారం బయట పడ్డాయి. గత ఏడాది విజయ్ తమిళగ వెట్రికళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. పార్టీ ఆవిర్భావ వేడుక అనంతరం కొంత కాలం విజయ్ సినీమా షూటింగ్ బిజీలో పడ్డారు. గత మూడు నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై మళ్లీ దృష్టి పెట్టి, ప్రజలలోకి దూసుకెళ్లే కార్యాచరణలో ఉన్నారు. ఆ పార్టీ వర్గాలు విజయ్ పార్టీ పేరు, జెండాను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. బూత్ కమిటీలు తమ పనిని వేగవంతం చేశారు. ఇక, విజయ్ ప్రజా పర్యటనకు కార్యచరణలో ఉన్నారు. ఈ షెడ్యూల్ త్వరలో వె లువడనుంది. ఈ పరిస్థితులలో గత మూడు నెలలుగా సోషల్ మీడియాతో పాటూ పలు వర్గాల నుంచి ఓ సంస్థ సేకరించిన అభిప్రాయాలు, నిర్వహించిన సర్వే మేరకు తాజాగా విజయ్ కు 105 సీట్లు ఖాయం అన్న సమాచారం చర్చకు దారి తీసింది. ఈ సర్వే మేరకు 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కు 95 నుంచి 105 సీట్లతో ఆపటుగా 34.55 శాతం ఓట్లు దక్కబోతున్నట్టుగా సామాజిక మాధ్యమంలో సమాచారం వైరలైంది. అలాగే డీఎంకే కూటమికి 75 నుంచి 85 స్థానాల వరకు 30.20 శాతం ఓటింగ్‌తో, అన్నాడీఎంకేకు 55 నుంచి 65 సీట్లు 28.85 శాతం ఓట్లతో దక్కే అవకాశాలు ఉన్నాయన్న ఈ సమాచారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. తమకు అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో మరింతగా శ్రమించేందుకు తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తమ తమ ప్రాంతాలలో గోడ ప్రచారాలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రైవేటుకు చెందిన ప్రహరీ గోడలు, ప్రదేశాలలో గోడ ప్రచారం కోసం ముందస్తుగా బుక్ చేసుకుంటుండడం గమనార్హం. -
నువ్వు ముదిరాజ్వా.. రెడ్డివా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను బీసీ బిడ్డగా ఎవరూ ఆమోదించడం లేదని, ఆయన అసలు ము దిరాజ్ కులానికి చెందిన వారో, లేక రెడ్డి కులానికి చెందిన వారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అనుభవమున్న నాయకుడు రాజేందర్‌కు ఇంత దిగజారుడు తనం ఎందుకో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మాట్లాడడం తగదని, ఇక ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరించారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ నేతలు ఈర్ల కొమురయ్య, సలీం, గజ్జి భాస్కర్, ఇందిరా శోభన్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ.. ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం లేదనే నిస్పృహలో ఉన్నారని, అందుకే కిషన్‌రెడ్డిపై ఉన్న ఆక్రోశాన్ని రేవంత్‌పై వెళ్లగక్కుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలన లోని అలీబాబా 40 దొంగల్లో ఈటల కూడా ఒక సభ్యుడని, రాష్ట్రం అప్పుల పా లు కావడానికి కేసీఆర్‌తో పాటు ఈటల నిర్వాకం కూడా కారణమని పేర్కొన్నా రు. దద్దమ్మగా ఉన్న ఈటలను అప్పుడు బీఆర్ఎస్ నుంచి తంతే వెళ్లి బీజేపీలో ప డ్డారని, మళ్లీ ఇప్పుడు అక్కడ ఇమడలేక కేసీఆర్‌వైపు చూస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. సీఎంను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, తాము ఒక్క విజిలేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారో తెలియదని అ న్నారు. కేటీఆర్ బాణిలోనే రాజేందర్ మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోంది కిషన్‌రెడ్డి, రాజేందర్ గ్యాంగేనని మండిపడ్డారు. -
డీజీపీ అపాయింట్మెంట్ కోరిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దాంతో పాటు, యథేచ్ఛగా సాగుతున్న పోలీసుల అక్రమ అరెస్టులు, వేధింపులపై వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి రాసిన లేఖను పార్టీ ప్రతినిధులు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.మాజీ మంత్రి విడదల రజినిపై సీఐ దౌర్జన్యంగా వ్యవహరించిన నేపథ్యంలో, రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు, విపక్షంపై సాగుతున్న పోలీసులు వేధింపులు, అక్రమ అరెస్టులు.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదంగా మారుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంకా అవన్నీ కచ్చితంగా పౌరుల హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. వీటన్నింటిపై వినతి పత్రం సమర్పించేందుకు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని తమ లేఖలో కోరారు. -
కక్ష సాధింపు కోసమేనా పోలీసులు?.. ఇది దేనికి సంకేతం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ.. రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉదాహరణలతో సహా సమావేశంలో ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనంను ప్రజలు ముందు పెట్టేందుకు వైఎస్సార్సీపీ ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణ అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఎన్ని సార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందించపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ సీరియస్‌గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, వేమారెడ్డి, పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కల్యాణ్‌పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.‘‘కంప్యూటర్ యుగంలో దళితుల సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు. పిఠాపురంలో మనువాదం అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణం. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం’’ అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు.దళితుడన్న కారణంగా కరెంటు షాక్‌తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని కూడా పరామర్శిచలేదు. పవన్‌కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం, మతం రంగు పూసుకుని బతుకుతున్నాడు. మల్లాం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీం కోర్టును ఆశ్రయించాం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కాకినాడ కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులపై కేసు పెట్టాం...మల్లాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందిక పోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం’’ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్ బాబు తెలిపారు. -
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీలో చిచ్చు రేపిన నామినేటెడ్ పోస్టుల భర్తీ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జిల్లా టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చు రాజేసింది. మాజీ మంత్రి , ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌కు అన్యాయంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. ఆప్కాబ్ ఛైర్మన్ పదవిపై రఘురాం ఆశలు పెట్టుకోగా, ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఆయనకు ఇవ్వకపోవడంపై జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేటలోని ఓ ఫంక్షన్ హాలులో నెట్టెం రఘురాం అనుచరులు, టీడీపీ నేతలు సమావేశమయ్యారు.టీడీపీ ఆవిర్భావం నుంచి నెట్టెం రఘురాం పార్టీ కోసం పనిచేశారని.. కేడీసీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఆయన స్థాయిని తగ్గించారని.. నేడు ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా అవమానపరిచారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. నలభై ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి నెట్టెం రఘురాంకు పదవి ఇవ్వకుండా చేయడం బాధాకరమన్నారు.‘‘2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం వెనుక నెట్టెం కృషి ఎంతో ఉంది. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు వెంట నిలబడిన వ్యక్తి నెట్టెం రఘురాం. రెండు సార్లు పార్టీ గెలుపు కోసం తన సీటును త్యాగం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు ఇచ్చిన మాట మర్చిపోయారు. తక్షణమే రఘురాంకు ఆప్కాబ్ ఛైర్మన్ లేదా రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలి. పార్టీలో సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టం’’ అంటూ ఆ పార్టీ నేతలు తేల్చిచెప్పారు. -
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, మేడ్చల్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్‌లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద పోలీసులు మోహరించి.. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను శాడిస్ట్ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు ఈరోజు.. ఈటల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీగా సంఖ్యలో ఈటల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు ఈటల ఇంటికి చేరుకున్నాయి.అనంతరం, బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడుతూ..‘కలెక్టరేట్ల ముట్టడి, కార్యాలయాల ముట్టడి చూశాం.. ఇళ్లను ముట్టడిస్తారా?. కుటుంబాలు ఉంటాయి.. ఇళ్లను ముట్టడించడం పద్ధతి కాదు. అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయి ఉంటే హైదరాబాద్‌లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందో చూడాలి. పాలకుడు అనే వాడు ఏదైనా నిర్మించే ప్రయత్నం చేస్తారు.. డిస్‌స్ట్రక్షన్ చేస్తారా?. 50 ఏళ్లుగా మొదటిసారి చూస్తున్నాను. డిస్‌స్ట్రక్షన్ చేస్తున్న మొట్టమొదటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసులకు భయపడేది లేదు.. అధికారం లేనినాడే కొట్లాడిన పార్టీ బీజేపీ. ఎవరు మోసం చేసే వాళ్లు, ఎవరు సంస్కార హీనులో ప్రజలే చెబుతారు. కుక్కలా అరిస్తే ఏం వస్తుంది?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘కూటమికి వత్తాసు.. పోలీసుల లెక్కలు తేల్చే టైమ్ వస్తుంది’
సాక్షి, తూర్పుగోదావరి: దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ నేతలను ఎలా అణగదొక్కాలని ఆలోచిస్తున్నారని అంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడకుండా సీఐ ప్రవర్తించిన తీరు దారుణం. ఖాకీ చొక్కా వేసుకోగానే రాష్ట్రానికి సుప్రీం అనుకుంటున్నారేమో అర్థం కావడం లేదు. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉండి అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం మంచి పరిణామం కాదు. దేశ ప్రజలంతా యుద్ధం గురించి చర్చించుకుంటుంటే వైఎస్సార్సీపీ వారిని ఎలా అణగదొక్కలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు ఏ పోలీసు అధికారి ఏ రకంగా ప్రవర్తించారన్నది తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం. అధికార పార్టీకి కొమ్ము కాసిన ప్రతీ పోలీస్ అధికారి రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా లెక్కలు అప్పజెప్పాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తు పెట్టుకుని పోలీసులు వ్యవహరిస్తే మంచిది’ అంటూ హెచ్చరించారు. -
బిల్డప్ బాబాయ్ బడాయి!
అమరావతిలో నాలుగు వేల ఎకరాలు అమ్మితే రూ.80 వేల కోట్లు వస్తాయట! ఎల్లో మీడియాలో బిల్డప్ బాబాయి రాసిన ఒక కథనం చెబుతోంది. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా ప్లాన్ చేశారన్నమాట! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. విశాఖపట్నంలో టీసీఎస్‌కు కేవలం 99 పైసలకే భూములు కేటాయించిన ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆయా సంస్థలకు ఎకరా రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిందట.ఇలా సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకూ ఉపయోగిస్తారని ఈ మీడియా చెబుతోంది.ఎవరైనా నమ్మగలరా? గోబెల్స్ మాదిరి ఒకటికి, పదిసార్లు ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నదే వీరి ధీమా కావచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఇష్టారీతిలో అబద్దాలు రాసిన ఎల్లో మీడియా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక కిలకమైన విషయం ఉంది. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన కొన్ని భవనాలను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రూ.31 వేల కోట్లు మూడేళ్లలో ఇవ్వడం లేదు. దశల వారీగా ఐదారేళ్లలో ఇస్తాయని ఎల్లో మీడియానే తెలిపింది. అందుకనే బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపి మరో రూ.40 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సంగతి బయటకు వస్తే మరింత అల్లరి అవుతుందని భయపడి, డైవర్ట్ చేయడానికి భూములు అమ్మడం ద్వారా రూ.80 వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం ఆరంభించారు. హైదరాబాద్ లోనే ఏవో కొన్ని ప్రదేశాలలో తప్ప ఎకరా ఇరవై కోట్ల ధర పలకడం లేదు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎకరా వంద కోట్లకు వేలంలో పోయిందని చెప్పినా, ఆ రకంగా కొనుగోలు చేసిన సంస్థలు ఆ డబ్బు చెల్లించలేదు. ఇటీవలీ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. అమరావతిలో పలు రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నా భూముల విలువలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. చంద్రబాబు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పినా, చివరికి ప్రధాని మోడీని తీసుకువచ్చి అమరావతి పనుల పునః ప్రారంభం అంటూ హడావుడి చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులన్నీ భూముల అమ్మకం ద్వారా తీరిపోతాయని చెబుతూ కొత్త డ్రామాకు తెరదీశారు. ఏ సంస్థ ఎకరా రూ.ఇరవై కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఈ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తాయి? అమరావతిలో సమీకరించిన 33 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలు కలిపి అభివృద్ది చేసిన తర్వాత పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత దానిని ఎనిమిదివేల ఎకరాలు అన్నారు. తదుపరి రెండువేల ఎకరాలే మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు నాలుగువేల ఎకరాలు మిగులుతుందని అంటున్నారు. వీటిలో దేనిని నమ్మాలి? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదు కనుక మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు. ఐదు వేల ఎకరాలలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని, అది కట్టకపోతే ఈ భూములు అన్ని వృథా అయిపోతాయని, కేవలం మున్సిపాల్టీగా మిగిలిపోతుందని చంద్రబాబే బెదిరించారు. గతంలో 53 వేల ఎకరాలు సరిపోతుందని అన్నారు కదా అంటే దానికి జవాబు ఇవ్వరు. కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో కట్టు కధలు చెప్పడం ద్వారా జనాన్ని మభ్య పెట్టే దిశలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. మరో విశేషం ఉంది. రెండో దశలో ఎంత భూమి మిగులుతుందో తెలియదు కాని, అప్పుడు అమ్మే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు 60ః40 రిష్పత్తిలో భూములు ఇస్తారట. వారు అభివృద్ది చేసిన గృహాలు ,విల్లాలు, వాణిజ్య ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి ఆస్తులు సమకూరతాయట.ఇదంతా గాలిలో మేడలు కట్టినట్లే అనిపిస్తుంది. కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు మూడేళ్లలో ఐకానిక్ టవర్లతో సహా ఆయా భవనాల నిర్మాణం చేస్తామని చెప్పినా, దశల వారీగా వచ్చే నిధులతో పనులు పూర్తి కావని ఎల్లో మీడియానే స్పష్టం చేసింది. అందుకే బ్యాంకుల ద్వారా రూ.40 వేల కోట్లు సమీకరించాలని రాజధాని అభివృద్ది సంస్థ తలపెడుతోందట.దీంతో అమరావతి అప్పు రూ.70 వేల కోట్లు అవుతుంది. మంత్రి నారాయణ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ఇంకో 30 వేల కోట్లు అవసరం అవుతాయి. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లకన్నా డబుల్ రేట్లను కాంట్రాక్టర్ లకు చెల్లించి భవనాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మూడేళ్లకు ఈ పనులు పూర్తి కాకపోతే సహజంగానే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఆ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. లక్షల కోట్ల రుణాలు తెచ్చి పనులు చేపడితే ఏపీ ప్రజలపై పడే అప్పు భారం తడిసి మోపెడవుతుంది. ముందుగా లక్షల కోట్లు వ్యయం చేసి ఈ మొత్తం భూమికి ప్రాధమిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిజంగానే భూమి ప్రభుత్వానికి ఏదైనా మిగిలితే దానిని ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలి. దానిని ఆ ధరకు కొనడానికి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ ఆ ధరకు కొనడానికి ఎక్కువమంది సిద్దపడకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అదేమీ లేకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఇలాంటి కల్పిత కధలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా? అసలు ప్రభుత్వం తనకు అవసరమైన కొద్దిపాటి భవనాలను నిర్మించుకొని, మిగిలిన భూమిని రైతులకే వదలివేసి ఉంటే,వారే రియల్ ఎస్టేట్ వారికో, లేక ఇతరులతో అమ్ముకుంటారు కదా? ఈ పని అంతా ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంటోంది? కేవలం తమ వర్గంవారి ఆస్తుల విలువలు పెంచడానికే ఈ తంటాలు అన్న విమర్శకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? గతంలో కూడా అభూత కల్పనలు, అర్ధ సత్యాలు రాసి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ దేశ,దేశాలు తిరిగి వచ్చారు.అసలు ప్రపంచ రాజధాని అవసరం ఏమిటి?ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేపనేనా?భవిష్యత్తులో ఈ ప్లాన్ లన్నీ తలకిందులైతే ఎపి ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోరా? అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత పెద్ద రాజధాని కట్టుకుంటారా? మహా నగరాన్ని నిర్మించుకుంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? అన్నది మీ ఇష్టం.అలా కాకుంటే ఏదో రకంగా తన సొంత కీర్తి కోసం నగర నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్న అపకీర్తిని చంద్రబాబు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఎల్లో మీడియా ఇచ్చే దిక్కుమాలిన సలహాలు విని చంద్రబాబు మునుగుతారా? లేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది ఆయన ఇష్టం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అమానుషం.. అమానవీయం
తిరుపతి మంగళం/నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)/ సాలూరు/ బద్వేలుఅర్బన్/సాక్షి, నరస రావుపేట/ పెదకూరపా డు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విడదల రజని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సైతం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ మెప్పు పొందేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు.చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు.. మాజీ మంత్రి, బీసీ నేత అని కూడా చూడకుండా విడదల రజని పట్ల ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీఐ గారూ.. సీఐ గారూ.. అని ఆమె పదే పదే గౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమెను కారు నుంచి కిందకు లాగేయడం ఎంత దుర్మార్గం.. అని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలి పట్ల కూడా అర్ధరాత్రి పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల బెదిరింపులకు, కక్ష సాధింపులకు, కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నా భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నంబూరు శంకరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన కీచకపర్వాన్ని తలపిస్తోందని వైఎస్సారీసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మహిళా నేతలతో కలసి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేలా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మహిళ మంత్రి విడదల రజని పట్ల పోలీసుల తీరు సరికాదని ఖండించారు.కొందరు పోలీసు అధికారులు సభ్యత, సంస్కారాలు మరచి వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ అన్న కనీస గౌరవ మర్యాద లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకోవాలి’
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలాన్ని వాడటం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు ఎంతవరకూ కరెక్ట్ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈటెల మాట్లాడిన మాటలు ఎంపీ స్థాయి మాటల్లా లేవని, గంజాయి తాగిన వ్యక్తి మాటల్లా ఉన్నాయంటూ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ పై ఈటెల చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి.. ‘ నేను తిట్టడం కోసం ప్రెస్ మీట్ పెట్టా. మీకేనా తిట్టడం వచ్చింది.. మాకు రాదా?, మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకోవాలి’ అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఈటెల ఏరోజైనా సీఎంను కలిసి తన పార్లమెంట్ సమస్యల గురించి అడిగారా? అని జగ్గారెడ్డి నిలదీశారు. ఏదో ఫ్రస్టేషన్ లో ఈటెల మాట్లాడుతున్నట్లు ఉందని, సీఎంను తనకు పోస్ట్ వస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఉందన్నారు.ఈటెల పరిధి దాటి మాట్లాడాడు కాబట్టే తాను కూడా మాట్లాడుతున్నానన్నారు జగ్గారెడ్డి. ఆయన పెద్ద తోపేంద కాదని, పెద్ద పర్సనాలిటీ అని ఈటెల తనకు తానే ఊహించుకుంటున్నారని విమర్శించారు. గౌరవ ప్రదమైన విమర్శలు చేస్తే తప్పులేదు కానీ, ఈ తరహా వ్యాఖ్యలు సీఎంపై చేస్తారా అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి తెచ్చే తెలివి లేదు కానీ ఉద్దెర విమర్శలు ఎందుకన్నారు జగ్గారెడ్డి.సీఎం ఓ తుగ్లక్. నువ్వో శాడిస్ట్కాంగ్రెస్ ప్రభుత్వం తలాతోకా లేకుండా వ్యవహరిస్తోందని, ఇదిలాగే ఉంటే ఇంకా ఎన్నో రోజులు కొనసాగదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేం దర్ హెచ్చరించారు. 'ఇది తుగ్లక్ ప్రభుత్వం, సీఎం ఓ తుగ్లక్. నువ్వో శాడిస్ట్, సైకోవి కాబట్టి ప్రజలను ఏడిపి స్తున్నావు. మిస్టర్ ముఖ్యమంత్రి నీ కింద ఏం జరుగుతుందో సోయిపెట్టు. నీ కింది అధికారులు ఏం చేస్తున్నారో దృష్టి పెట్టు. ప్రజల జోలికి వస్తే ఖబడ్డార్' అని హెచ్చరించారు. శనివారం ఈటల మీడియాతో మాట్లాడుతూ తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అపార్ట్మెంట్లు కూలగొడతామంటూ హైడ్రా నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 'సీఎంకు, ఎమ్మెల్యేకు, మంత్రికి ఇక్కడికి వచ్చే ముఖం లేదు. దమ్ముంటే రమ్మని చెప్పండి. మేము హైడ్రాకు, చెరువుల పునరు ద్ధరణకు, మూసీలో కొబ్బరినీళ్ల వంటి నీళ్లను పారించడానికి వ్యతిరేకం కాదు. అన్ని అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చడానికి వ్యతిరేకం'అని స్పష్టంచేశారు. -
‘విడదల రజిని పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించారు’
కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకురాలు విడదల రజిని పట్ల సీఐ సుబ్బారాయుడు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. విడదల రజిని పట్ల సీఐ వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. ఈరోజు(ఆదివారం) మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా.. సీఐ తీరును ఖండించారు. ‘మాజీ మంత్రి అని చూడకుండా విడదల రజిని పట్ల అమానుషంగా ప్రవర్తించారు.దీనిపై మేము పోరాడతాము.వ్యవస్ధలకు వన్నె తెచ్చే విధంగా ఉద్యోగులు బాధ్యతతో పని చేయాలి. సంక్షోభంలో అవినీతిని వెతుకునే మగోడు చంద్రబాబు తప్పా మరో నాయకుడు లేడు.గత ఏడాదిగా ఉద్యోగులు, రైతులకు, విద్యార్ధులు,మహిళలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు.రాష్ట్రంలో మహిళలను వేధించడం టీడీపీకి అలవాటుగా మారిపోయింది. టీడీపీ, పోలీసుల వేధింపులు తాళ్ళలేక ఇటీవల తుని మున్సిపల్ ఛైర్మన్ సుధారాణీ తన పదవికి రాజీనామా చేశారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రెడ్ బుక్ రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. కూటమి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఏపీలో మహిళలు వేధింపులు జీవిస్తున్నారు’ అని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. -
రెడ్ బుక్ పాలన.. ప్రజలే బుద్ధి చెబుతారు: ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని.. మహిళల ఆత్మగౌరవం కాపాడతామంటూ చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిస్తున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు ఏం చేస్తున్నారు. రజినీ పీఏ పై అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటి?. మహిళా మాజీ మంత్రి అనేది చూడాకుండా పోలీసులు చేయి చేసుకోవడం దారుణం. అత్యుత్సాహంతో పోలీసులు.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇలాగే రెడ్ పాలన కొనసాగితే, వైఎస్ జగన్ మరో బుక్ సిద్ధం చేస్తారు. ఎంపీటీసీ కల్పనపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలను పోలీస్ స్టేషన్లో ఎలా పెడతారు?’’ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.84 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడతల రజినిపై జరిగిన దుశ్చర్యపై న్యాయ పోరాటం చేస్తాం. నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బారాయుడిపై చర్యలు తీసుకోవాలి లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధం అవుతాం’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రశ్నించిన వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళిపై 16 అక్రమ కేసులు నమోదు చేసి.. పలు జిల్లాల్లో తిప్పి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఇలాంటి చర్యలపై ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. -
పాక్‌తో కాల్పుల విరమణ.. 1971లో ఇందిర నిర్ణయంపై చర్చ!
ఢిల్లీ: భారత్, పాక్ యుద్ధానికి(India-Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. కొందరు హస్తం నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇందిర కాలం నాటి పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు.భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్ స్పందించారు. శశిథరూర్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకుంది. ఆ గుణపాఠం చెప్పారని నేను నమ్ముతున్నాను. అలాగే, మాట తప్పడం పాకిస్తాన్ నైజం. వారి వాగ్దానాలను ఎలా నమ్ముతాం? అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో 1971లో జరిగిన యుద్ధంపై కూడా శశిథరూర్ స్పందించారు. ఈ సందర్భంగా శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘1971లో ఒక గొప్ప విజయం అందుకున్నాం. ఇందిరా గాంధీ ఉపఖండం మ్యాప్‌ను తిరగ రాశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ నైతిక లక్ష్యంతో పోరాడుతోంది. పాకిస్తాన్‌పై దాడులు చేయడం, బాంబులు పేల్చడం మాత్రమే స్పష్టమైన లక్ష్యం కాదు అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi | "1971 was a great achievement, Indira Gandhi rewrote the map of the subcontinent, but the circumstances were different. Bangladesh was fighting a moral cause, and liberating Bangladesh was a clear objective. Just keeping on firing shells at Pakistan is not a… pic.twitter.com/Tr3jWas9Ez— ANI (@ANI) May 11, 2025అయితే, పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన వేళ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా తీసుకున్న చర్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. దీనిపై పలు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు.. పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా.. కాల్పుల విరమణ అంశంపై తక్షణం ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్లమెంటు ప్రత్యేక సెషన్ నిర్వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ వేదికగా.. ‘వాషింగ్టన్ నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన తక్షణం అఖిలపక్ష సమావేశం జరగాలి. పార్లమెంటు ప్రత్యేక భేటీని ఏర్పాటుచేసి గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలను చర్చించాలి’ అని డిమాండ్ చేశారు. This is Prime Minister Indira Gandhi's historic letter to President Nixon of Dec 12, 1971. Four days later Pakistan surrendered.She ensured that there was no "neutral site" which has now been agreed to. pic.twitter.com/Fvvcmn6VkZ— Jairam Ramesh (@Jairam_Ramesh) May 10, 2025 మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా స్పందిస్తూ.. గత 5,6 రోజుల్లో దేశం ఏం సాధించిందో, ఏం కోల్పోయిందో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని పేర్కొన్నారు. అలాగే, 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దిగిన ఫొటోలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందిర లేని లోటు కనిపిస్తోందని పేర్కొంది. ‘ఇందిర ధైర్యం చూపారు. దేశం కోసం నిలబడ్డారు. జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదు’ అని కాంగ్రెస్ తెలిపింది. India misses Indira. pic.twitter.com/TUluFLh1Hj— Pawan Khera 🇮🇳 (@Pawankhera) May 10, 2025The Most famous speech of Indira Gandhi..!!! "FIGHT BACK INDIA"!!!#ceasefire pic.twitter.com/fkGX2zwfep— Samir Karki (@SarojKarki65) May 11, 2025 -
అన్నీ ఒకేసారి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పదవుల జాబితాలన్నీ ఒకేసారి విడుదల అవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ పెద్దల కసరత్తు పూర్తయిందని, వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీ చేరాయని గాందీభవన్ వర్గాలు అంటున్నాయి. గత గురువారం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం పెద్దలకు ఇచ్చి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక కమిటీల బంతి అధిష్టానం కోర్టుకు చేరిందని, త్వరలోనే అధిష్టానం ఈ కమిటీలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్థానంలో బి.మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టి కూడా సంవత్సరం దాటిపోయింది. కానీ, ఇంతవరకు అటు టీపీసీసీ కమిటీలను కానీ, ఇటు క్షేత్రస్థాయి పదవులను కానీ భర్తీ చేయలేదు. టీపీసీసీ కార్యవర్గంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో పాటు కార్యవర్గ సభ్యుల నియామకం చేపట్టలేదు. ఎన్నికల సమయంలోనే నియమించిన ప్రచార కమిటీ కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పోస్టు ఖాళీ అయి దాదాపు మూడేళ్లు కావస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా గతంలో ఎప్పుడో నియమించిన వారే కొనసాగుతున్నారు. బ్లాక్, మండల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కమిటీలన్నింటినీ నియమించేందుకు పలు దఫాలుగా ఇటు హైదరాబాద్‌లో, అటు ఢిల్లీ పెద్దల సమక్షంలో అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ, కమిటీల ప్రకటన వెలువడలేదు. కమిటీల కసరత్తు పూర్తయిందని, నేడో రేపో ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మారారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ రావడంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. ఆమె ప్రాతిపదికలు మారిపోవడంతో పార్టీ కమిటీల నియామకానికి మళ్లీ కసరత్తు జరిగింది. ఈ కసరత్తు పూర్తి కావడంతో మూడు రోజుల క్రితమే ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయని సమాచారం. గాందీభవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి పార్టీ సంస్థాగత కమిటీలతో పాటు రాష్ట్ర పారీ్టలో కీలకమైన రాజకీయ వ్యవహారాల సలహా (పీఏసీ) కమిటీని కూడా పునరి్నయమించనున్నారు. జై బాపూ–జై సంవిధాన్ కమిటీ (ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు మీడియా సమన్వయం కోసం డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీకి ఎంపీని ఇన్చార్జిగా నియమిస్తారని తెలుస్తోంది. విష్ణునాథ్ స్థానంలో మరొకరు! మరో పక్క ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిగా రాష్ట్రానికి కొత్త నేత రానున్నారు. ఇద్దరు కార్యదర్శుల్లో ఒకరైన విష్ణునాథ్ ఇటీవలే కేరళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొక నేతను టీపీసీసీ కమిటీలతో పాటే నియమిస్తారని తెలుస్తోంది. -
‘విడదల రజిని పట్ల సీఐ ప్రవర్తన కరెక్ట్ కాదు’
చిలుకలూరిపేట: మాజీ మంత్రి విడుదల రజిని పట్ల చిలుకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సభ్యతా, సంస్కారాలను మరిచిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలుకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసానికి వెళ్ళి ఆమెను పరామర్శించారు పేర్ని నాని. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్‌బాబు తదితరులు విడదల రజినిని పరామర్శించిన వారిలో ఉన్నారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘సీఐ సుబ్బారాయుడు పశువులా ప్రవర్తించారు. కుటుంబ సభ్యులు సీఐకు అన్నంతో పాటు సంస్కారం కూడా పెట్టాలి. వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్ట్ పై కోర్టును ఆశ్రయిస్తాం’ అని స్పష్టం చేశారు.నాపై సీఐ దౌర్జన్యం చేశారు..వైఎస్సార్ సీపీ నేత అరెస్ట్ పై ప్రశ్నిస్తే పోలీసుల దర్జన్యం చేశారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. నాపై కేసు పెడతానని బెదిరించారు. ఇప్పటికే మా కుటుంబ సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారు’ అని విడదల రజిని పేర్కొన్నారు.కాగా, మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు.విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
‘రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితి’
తణుకు(ప గో జిల్లా): కూటమి ప్రభుత్వం రైతుల నడ్డివిరిచేస్తోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకు పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ... ‘ధాన్యం రైతులకు గొనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. పది లక్షల మెట్రిక్ తన్నులు ధాన్యం జిల్లాలో పండిస్తే ఆరు లక్షలు మాత్రమే కొంటామని చేతులెత్తేశారు.రైతులనుండి ఆఖరు గింజవరకు ప్రభుత్వం కొనాల్సిందే. లేదంటే వైస్సార్సీపీ రైతులు పక్షాన పోరాటానికి దిగుతుంది. మంత్రి నాదెండ్ల ఎన్ని ప్రగల్బాలో పలికారు అంత చేస్తాం.. ఇంత చేస్తాం అన్నారు. ఇప్పుడు చుస్తే పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వంలో వ్యాపారాలన్నీ కళాహీనంగా ఉన్నాయ్. జగన్ గారి హయాంలో నెంబర్ వన్ స్థానంలో జీడీపీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. విద్యుత్ కొనుగోళ్లలో చంద్రబాబు వేల కోట్లు దోచుకొంటున్నారు. కుట్టు మిషన్ల లో 157 కోట్లు స్కామ్ కి తెరలేపారు బాబు. చంద్రబాబుది అంతా దాచుకో దోచుకో సిద్ధాంతం’ అని కారుమూరి విమర్శించారు. -
వారిపై చర్యలు తప్పవు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: తన వ్యక్తిగత జీవితం, వైఎస్సార్సీపీ శ్రేణులపై కిరాక్ ఆర్పీ, సీమరాజు సోషల్ మీడియాలో పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వాటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనపై కూడా చేసిన సోషల్ మీడియాలో పోస్టులపై ఫిర్యాదులు చేశాను. మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు.. న్యాయస్థానాల ద్వారా పోరాటంతో నాలుగు కేసులను రిజిస్టర్ చేశారు. మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘ఈ నెల 18వ తేదీన ఆ కేసుపై స్వయంగా నేనే హైకోర్టులో వాదనలు వినిపించనున్నాను. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. మహిళలను ఉదయం ఆరు లోపు అదుపులోకి తీసుకోకూడదని చట్టం చెబుతోంది. కానీ రాజకీయ ఒత్తిడికి గురై పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవు. కాంతేరులో దళిత ఆడబిడ్డను బలవంతంగా లాక్కెళ్లారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గం.‘‘గుంటూరు సీఐడి కార్యాలయానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే.. ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటే వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు రాచ మర్యాదలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైన్యం తగ్గడం లేదు.. మరింతగా పెరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
ఎమ్మెల్యే జయసూర్య Vs ఎంపీ శబరి.. మరోసారి రచ్చ రచ్చ
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో వర్గ విభేదాలు.. టీడీపీ నాయకులు మధ్య చిచ్చురేపుతున్నాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరిల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందికొట్కూరులో అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేను అధికారులు ఆహ్వానించారు.అయితే, ఎంపీ శబరి రాక ముందే.. ఎమ్మెల్యే జయసూర్య భూమి పూజ చేసి వెళ్లిపోయారు. పంతం కొద్ది ఎమ్మెల్యే భూమి పూజ చేసిన భవనాన్నికి ఎంపీ శబరి మరోసారి భూమి పూజ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎవరికి వారు భూమి పూజలు చేసి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే, ఎంపీల ప్రొటోకాల్ అధికారులకు తలనొప్పిగా మారింది. -
ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్‌ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్‌గా గుర్తింపు పొందుతోంది.ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్‌లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.గత ఏప్రిల్‌లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది! - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నందిగామ కూటమి నేతల చీప్ పాలిటిక్స్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ కూటమి నేతల చీప్ పాలిటిక్స్‌కు తెరతీశారు. నందిగామ గాంధీ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్లో నిర్ణయించారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల తీరుపై వైఎస్సార్సీపీ, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మొండితోక జగన్మోహన్ రావు మీడియాత మాట్లాడుతూ.. గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ట్రాఫిక్ సమస్య సాకుగా చూపి విగ్రహాన్ని తొలగించేందుకు దురుద్ధేశంతో కౌన్సిల్లో తీర్మానం చేశారు. గాంధీసెంటర్‌లో అస్తవ్యస్తంగా ఉన్న విగ్రహాలను వైఎస్సార్సీపీ హయాంలో ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశాం. విగ్రహాలను మార్చే సమయంలో కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాతే మార్పు చేశాం’’ అని ఆయన వివరించారు.విగ్రహాలను మారుస్తున్న సమయంలో అప్పటి టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ విగ్రహం తొలగించాల్సిన అవసరం లేదని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పినా అక్రమంగా తీర్మానం చేసి విగ్రహాన్ని తొలగించేందుకు యత్నిస్తున్నారు వైఎస్ జగన్ పాలనలో కూటమి అధికారంలోకి వచ్చిన పదినెలల కాలంలోనే ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనించాలి. ఈ క్షణం ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయం’’ అని మొండితోక జగన్మోహన్రావు చెప్పారు. -
ఒక ఓటుకు ఐదేళ్ల శిక్ష!
సత్తుపల్లి: ‘రాష్ట్రమంతా బర్బాద్ అయింది.. ఏమైనా ఉపాయం ఉంటే ఆలోచించండి అన్నా అని ఓ ఆటోడ్రైవర్ ఈ మధ్య సిగ్నల్ దగ్గర నన్ను గుర్తుపట్టి అడిగారు.. ఒక ఓటుకు ఐదేళ్ల శిక్ష.. తప్పు పార్టీకి ఓటేస్తే అనుభవించాలి కదా.. రీకాల్ వ్యవస్థ మనకు లేదు..’అని చెప్పానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.ఇటువంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తారని ప్రపంచ మేధావి బీఆర్ అంబేడ్కర్ ఊహించక పోవడంతోనే వారిని ఐదేళ్లూ భరించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు పలువురు సీఎంలను చూసిన తాను, రేవంత్‌రెడ్డి వంటి దివాలాకోరు సీఎంను మాత్రం చూడలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్తే తమ మాటలు నమ్మడం లేదని, దొంగల్లా చూస్తున్నారని, అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించండి ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేసీఆర్ మీటింగ్‌లు పెట్టి మరీ చెప్పారని.. మోసపోతే గోస పడతామని చెప్పినా ప్రజలు వినకపోవడం వల్లే మోసకారి ప్రభుత్వం వచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రజలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని సూచించారు. తొలుత పహల్గాం మృతులతో పాటు యుద్ధంలో అమరులైన జవాన్లకు కేటీఆర్ సహా నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. -
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. -
‘కూటమి’ అక్రమాలు.. ప్రశ్నిస్తే వేధింపులా?: రవీంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పనిచేస్తోందని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు.. కానీ అన్ని స్కాములే’’ అంటూ దుయ్యబట్టారు. 1.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని మండిపడ్డారు.‘‘సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం. సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్రమాలు ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. లేని లిక్కర్ స్కాం బయటకు తీసి అబద్ధాలే ఆరోపణలుగా కేసులు పెడుతున్నారు. అధికారులను, నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అమాతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.ఆపరేషన్ సిందూర్‌పై ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులకు సెల్యూట్ చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం హర్షణీయం అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఉర్సాకు పెట్టుపోతలు పూర్తయినట్టేనా?
కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీల్లాంటివి ఇవ్వడం సహజమే కానీ.. ఓ స్టార్టప్ కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం మాత్రం కని విని ఎరగనిదే! ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు నెలల వయసున్న ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో సుమారు 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేసింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ తోసిరాజంటోంది అక్కడి ప్రభుత్వం. ఉర్సా వ్యవస్థాపకుల గత చరిత్ర.. వారి వెనుక ఉన్న పెద్దల సంగతి అన్నింటిలోనూ పలు అనుమానాలున్నా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రభుత్వం భూమిని కట్టబెట్టేందుకే సై అనింది.పెందుర్తి విజయకుమార్, అబ్బూరి సతీష్ అనే ఇద్దరు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు మొదట వార్తలొచ్చినా.. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్లుగా కొత్త కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి. అమెరికా వాసి తాళ్లూరి జయశేఖర్ అనే వ్యక్తి ఉర్సా తరఫున ఆన్లైన్లో మీడియా సమావేశం నిర్వహించి తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అనుకూల మీడియాతోనే నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు అంశాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ కంపెనీ సుమారు రూ.5600 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారు.తొలుత రూ.200 కోట్లు వచ్చిస్తారట. ఆర్థిక సహకారం అందించే వారెవ్వరన్నది వారి కోరిక మేరకు రహస్యంగా ఉంచారట. ఈయనకు బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌కూ బంధుత్వం కూడా ఉందట. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేరు ఈ వివాదంలోకి రావడం, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానినే ఆరోపణలు సంధించడం సంచలనంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటటన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ, డీల్ వెనుక చాలా ప్రముఖుల హస్తమే ఉండవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. పరిశ్రమల ముసుగులో ఎవరికి పడితే వారికి, ఇష్టారీతిన భూములు కట్టబెడితే అది ఏపీకి తీరని నష్టం చేస్తుంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక ఎలాగైనే చేయవచ్చులే అనుకుంటే అనుకోవచ్చు. కాని పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండకపోవచ్చు.విశాఖలో ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు ఎకరా కేవలం 99 పైసలకే కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. టీసీఎస్‌కు 21 ఎకరాలు ఇస్తే, ఊరు పేరు లేని ఈ ఉర్సా కంపెనీకి అరవై ఎకరాలా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. విశాఖలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కనుక తమకు నచ్చిన వారికి పందారం చేస్తున్న నేతలు అమరావతిలో ఇచ్చి ఉండవచ్చు కదా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఉర్సా కంపెనీకి భూమి ఇస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఎవరికి అర్థం కాలేదు. డిజిటల్ మీడియా దీనిపై పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలకే ఇస్తున్నారన్న అభిప్రాయం కలిగింది.అప్పుడు కేవలం టీసీఎస్‌కు ఇచ్చిన భూమి విలువ చెప్పి ఈ ఉర్సా కంపెనీకి ఎంతకు ఇచ్చింది ప్రభుత్వం వెల్లడించలేదు. వివాదం చెలరేగిన తర్వాత ఉర్సా కంపెనీ డైరెక్టర్‌గా చెప్పుకున్న జయశేఖర్ తమకు ఎకరం రూ.ఏభై లక్షల చొప్పున ఇచ్చారని వెల్లడించారు. ఆ రకంగా చూసినా ఈ కంపెనీకి కేవలం రూ.మూడు వేల కోట్ల విలువైన భూమిని రూ.30 కోట్లకే ఇచ్చినట్లవుతుంది. అసలు ప్రభుత్వం భూమి అమ్మకం కాకుండా, లీజు పద్దతిలో ఇచ్చి ఉంటే, ఏదో కొంత ఎక్కువ, తక్కువకు భూమి కేటాయించారులే అని సరి పెట్టుకోవచ్చు.ఏ మాత్రం అనుభవం లేని సంస్థలకు భూములు అమ్మేస్తే, తదుపరి ఈ సంస్థలు ఆశించిన రీతిలో పని చేయకపోయినా, మూతపడినా, ఆ భూమి మాత్రం వారి సొంతం అవుతుంది. అప్పుడు వారికి భారీ లాభం చేకూరుతుంది కదా అన్నది మేధావుల భావన. దీనికి ప్రభుత్వం నుంచి ఎవరూ సమాధానం ఇస్తున్నట్లుగా లేదు. విశేషం ఏమిటంటే ఈ ఉర్సా కంపెనీ హైదరాబాద్‌లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ లో రిజిస్టర్ చేయడం. దీనికి ఒక వెబ్సైట్ కాని, ఇతరత్రా సిబ్బంది తదితర హంగు ఆర్భాటాలేవీ లేవు. ఆ తర్వాత ఏదో వెబ్‌సైట్‌ను చూపించినా, దాని అనుమతి ఒక ఏడాదికే ఉన్నట్లు తెలిసింది. అందులో ఉన్న వివరాలపై కూడా అనేక సందేహాలు వచ్చాయి.మాజీ ఎంపీ కేశినేని నాని అయితే ఈ కంపెనీ టీపీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ సంస్థ అని ఆరోపించారు. అబ్బూరి సతీష్, ఈయన వ్యాపార భాగస్వాములని, ఒక ప్రాపర్టీ సంస్థను స్థాపించి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. విశాఖలో భూమి కొట్టేయడానికే ఈ ప్లాన్ అని ఆయన అన్నారు. దీన్ని చిన్ని ఆయన మద్దతుదారులు కొందరు ఖండించినప్పటికీ, అసలు ఉర్సా కంపెనీ సామర్ధ్యం, అమెరికాలో ఈ సంస్థ కట్టిన పన్ను, అనుభవం తదితర వివరాలు బయటకు వచ్చాక, ఇది ఎవరికో బినామీనే అన్న అనుమానాలు బలపడ్డాయి. సతీష్ అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి. పెందుర్తి విజయకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నారని వైసీపీ సంయుక్త కార్యదర్శి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌కు వీరికి ఉన్న స్నేహ సంబంధాలపై కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన దీనిపై వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు.ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడతామని అంటే పరిశ్రమల శాఖ అన్ని విషయాలను పరిశీలించాలి. అవేవి చూడకుండా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించి, ఆ పైన మంత్రివర్గం ఓకే చేయడం కచ్చితంగా సందేహాలకు తావిస్తుంది. ఒక వైపు గత ప్రభుత్వ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అధికంగా ఆర్డర్లు, మరికొన్నిటికి తక్కువ ఆర్డర్లు ఇవ్వడంతో రూ.మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పిచ్చి కేసు పెడుతోంది. మరో వైపు ఒక్క డీల్లోనే రూ.మూడు వేల కోట్ల భూమి స్కామ్ కు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశంలో కూడా గగ్గోలుగా చెప్పుకుంటున్నారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీలకు భూములు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో బిల్లీరావు అనే వ్యక్తి సంస్థకు 400 ఎకరాల భూమిని విక్రయించడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే సదస్సులు పెట్టి పలు బోగస్ ఒప్పందాలు చేసుకున్నారన్న అప్రతిష్ట కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చింది. ఏది ఏమైనా ఉర్సా కంపెనీకి అరవై ఎకరాల భూమి కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా?లేక ఇదే రీతిలో ముందుకు సాగుతుందా అన్నది చర్చ.కాని ప్రభుత్వం తీరు చూస్తే ఈ అడ్డగోలు తతంగాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వేధించే వారిని విడిచిపెట్టం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులను, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచి పెట్టేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారికి తప్పకుండా సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. పార్టీకి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులతోపాటు ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు... జరుగుతున్న పరిణామాల గురించి చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు అనైతిక చర్యలు ⇒ చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఎంపీపీ చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. అయినా చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని ఇక్కడి నుంచి లాక్కునే ప్రయత్నం చేయడంతోపాటు మన పార్టీ ఎంపీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారు. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ, మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడి మున్సిపాలిటీలో 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. ⇒ అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు మనవాళ్లే. కేవలం నలుగురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు. ఇన్ని అనైతిక పనులు చేస్తున్న చంద్రబాబు సిగ్గు పడాలి. ఎక్కడైనా, ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలి. అదే స్ఫూర్తితో మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో అత్యంత విలువలతో పని చేస్తున్నారు. మనం మాట తప్పలేదు.. విలువలు వదల్లేదు ⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు... ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగరగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్ నొక్కాం. మాట తప్పకుండా కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాం. ⇒ నాడు కేవలం రెండే రెండు మున్సిపాలిటీల్లో టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిచారు. అయినా వారిని లాక్కుని, ఆ చైర్మన్ పదవి పొందాలని చూడలేదు. అందుకే చివరకు అప్పుడు నేను మన తాడిపత్రి ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేయించాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని టీడీపీ గెలిచింది. మనం ఆనాడు అలా అంత విలువలతో కూడిన రాజకీయం చేస్తే.. ఇప్పుడు అదే తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను ఊళ్లోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆయన, ఆయన అనుచరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ⇒ ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నా. కేవలం వైఎస్సార్సీపీని ప్రేమించినందుకు, నన్ను అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను చూస్తున్నా. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. వారికి అడుగడుగునా తోడుగా, అండగా నిలబడతాను. ప్రశ్నించకూడదనే నిరంకుశత్వం, డైవర్షన్ ⇒ ఈ రోజు సాక్ష్యాలతో సంబంధం లేకుండా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. ఏ హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. ⇒ ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకో రోజు సినీ నటి కేసు. ఇలా ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్లినా.. ఏం జరుగుతుంది? నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, తమ రూ.36 వేలు ఏమయ్యాయని యువత అడుగుతారు. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పలేరు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి. వ్యవస్థలన్నీ నాశనం.. నిర్వీర్యం ⇒ ఈ రోజు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ప్రధానమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిరీ్వర్యం చేస్తున్నారు. స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా అమలు కావడం లేదు. మన ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందిన గవర్నమెంట్ బడులు రివర్స్లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ పక్కాగా విద్యా దీవెన ఇచ్చాం. అలాగే వసతి దీవెన కూడా పక్కాగా అమలు చేశాం. అందుకు విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు.. అలా ఏటా రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. వాటిని మనం ఇచ్చాం. ⇒ ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3,900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు. దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. వసతి దీవెన లేనే లేదు. ⇒ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. దాన్ని మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. కానీ, కూటమి ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా అస్సలు ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ⇒ రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈ రోజు దళారుల పాలయ్యాడు. టమాటా కిలోకు రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. అదే మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, రైతులకు నష్టం జరిగినా, వెంటనే అక్కడ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. ఆ సీజన్ ముగిసేలోగానే వారిని ఆదుకునే వాళ్లం. పరిహారం ఇచ్చే వాళ్లం. మనం రైతులకు పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇచ్చాం. దాన్ని రూ.26 వేలకు పెంచి ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు. యథేచ్ఛగా అవినీతి ⇒ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం, అది కూడా 30 ఏళ్లు ఇచ్చేలా ‘సెకీ’ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో యూనిట్ విద్యుత్ రూ.2.49 చొప్పున మనం ఒప్పందం చేసుకుంటే, అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం అదే యూనిట్ విద్యుత్‌కు రూ.4.60తో ఒప్పందం చేసుకుంది. ⇒ రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని, ఇంకా లూలూ కంపెనీకి రూ.1,500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ⇒ ఊరూరా బెల్టుషాప్‌లు. మద్యం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. బాండ్ల పేరుతో కొత్త అవినీతి ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా మనపై దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి మొదలుపెట్టారు. ఏపీఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా తాము కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇంత దారుణమైన అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు. మళ్లీ వచ్చేది మనమే.. సినిమా చూపిస్తాం చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ అప్పుడు వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారందరికీ సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తూ, ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసి పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఎవ్వరినీ వదిలిపెట్టబోం. ఈ రోజు వారు (చంద్రబాబు, పోలీసులు) దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆ రోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. పట్టుకుని తీసుకొచ్చి సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు. -
‘సాక్షి ఎడిటర్ నివాసంలో సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలా?’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి పత్రికపైన చంద్రబాబు దుర్మార్గంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ నివాసంలో ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించడం చంద్రబాబు అధికార దుర్వినియోగంకు పరాకాష్టగా నిలుస్తోందని అన్నారు. వైఎస్ జగన్ వెంట ఉన్న వారిపై వేధింపుల్లో భాగంగా లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి, దానిలో వారిని భాగస్వాములుగా చూసే దారుణానికి చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఏపీలో మాత్రం చంద్రబాబు రాజకీయంగా కక్షలు తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. లేని లిక్కర్ స్కామ్‌ను తెరమీదికి తీసుకువచ్చి వైయస్ జగన్ వెంట ఉన్న వారిని దోషులుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రజల గొంతుక సాక్షి పత్రికపైన కూడా దుర్మార్గమైన దాడికి చంద్రబాబు ప్రయత్నించడం సిగ్గుచేటు. దేశంలో ఒకవైపు యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు దేశ రక్షణ బలగాలకు సంఘీభావంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదర్కోవడానికి సమాయత్తమవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు తన కుటిల రాజకీయ కుతంత్రాలను అమలు చేయడానికే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు.లేని లిక్కర్ స్కాంను సృష్టించి, అబద్ధాలను ఆరోపణలుగా మార్చి దానిచుట్టూ కక్ష తీర్చుకునే దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనిలో భాగంగా రోజుకు ఒకరిని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి… కొన్నాళ్లపాటు వారి ఆటలు చెల్లుతాయి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. అమావాస్య చీకట్లు ఎలా ఉంటాయో, వెలుగు కూడా దాని వెనుకకే ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేసిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిమీద, ఓఎస్డీగా పనిచేసిన ఒక నిజాయితీపరుడైన మాజీ ప్రభుత్వ ఉద్యోగి మీద చంద్రబాబు మొత్తం, బలాన్ని, బలగాన్ని ప్రయోగించడం సిగ్గు చేటు.అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు. ఇది ఒక కుట్ర. దీనిలో అందరినీ భాగస్వాములను చేసి, వైయస్ జగన్ గారి చుట్టూ ఉన్న వారిని దీనిలో ఇరికించాలనే ఈ కక్ష సాధింపు చర్యలు. కక్షలు తీర్చుకోవడంలో చంద్రబాబు అన్ని లైన్లు క్రాస్ చేశాడు. తెలుగు పత్రికా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న సాక్షి ఎడిటర్ మీద కూడా పోలీసులను చంద్రబాబు ప్రయోగించడం దుర్మార్గం. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఒక పెద్ద పత్రిక సంపాదకుడ్ని టార్గెట్ చేయడం దారుణం.సాక్షి కథనాలు చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కూటమి పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశంకు ఎల్లో పత్రికల్లాగ సాక్షి పత్రిక డబ్బా కొట్టాలని అనుకోవడం వారి అవివేకం. సమాజం పట్ల, ప్రజలపట్ల తన బాధ్యతను సాక్షి నిర్వహిస్తోంది. అలా సాక్షి పత్రికను, సంపాదకుడ్ని, జర్నలిస్టులను భయపెట్టాలనుకోవడం వారి దురాశే అవుతుంది. ప్రజల పక్షాన ఎన్నికల హామీలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రజల అండ ఉన్నంత వరకూ సాక్షి పత్రికను ఎవ్వరూ ఏమీ చేయలేరు. గతంలో కూడా సాక్షిపైన ఇలాంటి కుట్రలే చేసి విఫలమయ్యారు. నీతీ, నిజాయితీగా పనిచేసే సాక్షి పత్రికా బృందాన్ని కూటమి ప్రభుత్వం తన బలంతో అణిచివేయాలని చూసినా ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. -
‘మీ బాధలు చూశా.. ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రాసుకోండి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర, మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన... ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్నవారిని అభినందించారు.‘‘రాష్ట్రంలో కూటమి సర్కార్.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ.. మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు సిగ్గు పడాలిఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాంఅవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాంనాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైఎస్సార్సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే..ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు.ఈ రోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు.దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.అవినీతి రాజ్యమేలుతోంది..విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం యూనిట్ విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈ రోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.బాండ్ల పేరుతో కొత్త అవినీతి:ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.మళ్లీ వచ్చేది మనమే:చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం. -
చంద్రబాబు బాటలోనే రేవంత్.. ఇదేం రాజకీయం!
ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యల్లో వాస్తవమున్నప్పటికీ ఆయన కూడా తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటే పట్టారేమో అనిపిస్తుంది. ఎన్నికల ముందు ఆకాశం మీ చేతుల్లోకి తెచ్చేస్తానన్న రీతిలో హామీలివ్వడం.. తీరా అధికారం చేపట్టిన తరువాత ఖజానా చూస్తే హామీల అమలుపై భయమేస్తోందని సన్నాయి నొక్కులు నొక్కడంలో చంద్రబాబు ఆరితేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ కూడా అదే మాదిరిగా.. అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది.నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంత బహిరంగంగా మాట్లాడడం సరికాకపోవచ్చు. వాస్తవాలు చెబుతున్న కారణంగా అంతా సర్దుకు పోతారని ఆయన భావన కావచ్చు. కాని దీనివల్ల రాష్ట్రం పరపతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు అప్పులు నిజంగానే పుట్టడం లేదా అంటే ఆంధ్రప్రదేశ్‌లో పదకుండు నెలల్లోనే రూ.1.5లక్షల కోట్ల అప్పు చేస్తే, తెలంగాణలో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేశారు. అదనంగా అప్పులకు వెళితే ఇస్తున్నట్లు లేరు. దేనికైనా పరిమితులు ఉంటాయి. తోచినట్లు వాగ్దానాలు చేసి,అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయని అంటే ప్రజలు ఏమని అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, తీరు చూస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అన్నట్లుగా పరిస్థితి దేశం ముందట ఉందని రేవంత్ అన్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. దీనికంతటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని రేవంత్ చెప్పవచ్చు. కాని అది పరిష్కారం కాదు. సరైన జవాబు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే రాష్ట్ర అప్పులపై రేవంత్ కాని, ఇతర కాంగ్రెస్ నేతలు కాని అనేక విమర్శలు చేశారు. అయినా అధికారం రాబట్టుకోవడం కోసం ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చారో గుర్తులేదా? ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండానే వాగ్దానం చేశారా? అలా చేస్తే అది బాధ్యతారాహిత్యం కాదా? అదేమంటే రేవంత్ ఇచ్చిన సమాధానం చూడండి. ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఇదెంత సంసారం. చక్కదిద్దవచ్చని అనుకున్నానని ఆయన చెప్పారు. తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు.. రెండు లక్షల కోట్లే ఆదాయం, అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉంది అని ఆయన వివరిస్తున్నారు.సరిగ్గా చంద్రబాబు కూడా ఏపీలో ఇలాగే మాట్లాడారు. తనకు ఎన్నికల ముందు అన్నీ ఇవ్వవచ్చని అనుకున్నానని, కాని లోపలికి వెళ్లి చూస్తే ఏమీ లేదని, ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు తీరా బడ్జెట్లో రూ. ఆరున్నర లక్షల కోట్లే ఉందని అంగీకరించారు. అయినా హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి ఈ కబుర్లు చెబుతున్నారన్న సంగతి ఏపీ ప్రజలకు అర్థమైంది. అదే ధోరణిలో రేవంత్ కూడా ఎన్నికలకు ముందు వంద రోజులలో అన్ని హామీలు చేసి చూపిస్తామని, రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎవరైనా అప్పు చేయకపోతే బ్యాంకులకు వెళ్లి అప్పు తీసుకోండని చెప్పారా? లేదా? అది బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పుడేమో తాను 18 గంటలు కష్టపడుతున్నానని, ఒక్క రోజైనా, ఒక్క గంట సెలవైనా తీసుకోలేదని సానుభూతి కోసం మాట్లాడుతున్నారు. నిజానికి ఏ సీఎం అయినా 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే ఆ ప్రభుత్వం పద్దతిగా లేదని అర్థం.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. మిగిలినవారిని పని చేయనివ్వకుండా తానే పని చేస్తున్నానని చెప్పుకోవడానికి ఇలాంటి మాటలు పనికి వస్తాయి తప్ప జనానికి ఏమి ఉపయోగం? ఇది కూడా చంద్రబాబు తరహా మాటే.ఆయన కూడా తాను ఎంతలా కష్టపడుతున్నది పదే, పదే జనానికి చెబుతుంటారు. రేవంత్ కొత్తగా సీఎం అయి ఉండవచ్చు.ఆయన కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయినా అన్నిటిని అమలు చేయడం కష్టం కనుక ఈ కొత్తరాగం ఎత్తుకున్నారు. అప్పులు, వాయిదాలకే రూ.7500 కోట్లు అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు రేవంత్‌కు మద్దతుగా మాట్లాడుతున్నా, అవి అంత కన్విన్సింగా కనిపించవు. ఏ ప్రభుత్వం ఉన్నా, రుణాలు చెల్లించవలసిందే కదా! ఒక్కసారి గతానికి వెళితే చంద్రబాబు నాయడు 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిస్తేనే కిలో రెండు రూపాయల బియ్యం, మద్య నిషేధం, మొదలైనవి కొనసాగుతాయని ప్రచారం చేశారు.ఎన్నికలు అయ్యాక మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, మార్పులు చేయాలని, బియ్యం రేట్లు పెంచాలని, మద్య నిషేధం ఎత్తివేయాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు సాగించారు. ప్రతి ఎన్నికకు ముందు ఇదే తతంగం ఆయన సాగిస్తుంటారు. 2014లో రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని, బ్యాంకులలో తనఖాలో ఉన్న రైతుల భార్యల బంగారం కూడా విడిపిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఏదో అరకొర చేసి చేతులెత్తేశారు. 2024లో కూడా సూపర్ సిక్స్ అంటూ మరోసారి జనాన్ని మభ్య పెట్టడానికి వెనుకాడలేదు. ఈ రకంగా గురు, శిష్యులైన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే బాటలో పయనించడం విశేషం.ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత సహేతుకంగా అనిపించవు. తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఎవరిపై మీ సమరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఏమి ప్రయోజనం? తెలంగాణ రాష్ట్రం దివాళా తీయడానికి ఉద్యోగులు బాధ్యులు అవుతారా? లేక పాలన చేస్తున్న నేతలా?‘‘నన్ను కోసినా రూపాయి రాదు..ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు..ప్రజా ప్రతినిధులు,, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం’’ అంటూ సూత్రాలు చెబితే ఏమి లాభం. రేవంత్ ఒక్కసారి కాంగ్రెస్ మానిఫెస్టోని తిరిగి చదువుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ చదివి వినిపించారు. వాటన్నిటిని ఏ బాధ్యతతో చేశారు? ఇప్పుడు వాటిని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ‘‘ఎవరిపై మీ సమరం?’’ అంటే వారేమి జవాబు ఇస్తారు! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తదితర వాగ్దానాలు చేశారా? లేదా? రేవంత్ తాను అన్ని నిజాలే చెప్పినట్లు అనుకోవచ్చు.కాని అది చెప్పిన తీరు బాగోలేదు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని అంతరంగికంగా చర్చలు జరిపి వారికి నచ్చ చెప్పి ఉండవచ్చు. ఫలానా సమయానికి తాను హామీలు అమలు చేయగలుగుతామని చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా ఇంత బహిరంగంగా వేరే కార్యక్రమంలో ఉద్యోగులను బెదిరించే రీతిలో మాట్లాడడం వల్ల ఆయనకే నష్టం. రేవంత్ తీరువల్ల రాష్ట్ర పరువు పోయిందని బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ తాను నిజాలే మాట్లాడుతున్నానులే అనుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సీఎంకు చేతకావడం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్‌లో కూడా దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళతాయి. కుల గణన ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం ద్వారా దేశానికి ఏమి సంకేతం ఇచ్చినట్లయింది? అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో రేటింగ్ తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డే దానిని మరింత తగ్గించుకున్నట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు పొలిటికల్ సైన్స్, ఎన్నికల తర్వాత ఎకనామిక్స్ చెబితే జనం నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది.. కేంద్రం ప్రకటన
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆపరేషన్ సిందూర్‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు ఆపరేషన్ సిందూర్ వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇక, వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.అఖిలపక్ష సమావేశంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అన్నారు. అనంతరం, కేంద్రమంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌ను అన్ని పార్టీలు సమర్థించాయి. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఆపరేషన్ సిందూర్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతం. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేం. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు’ అని చెప్పుకొచ్చారు.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట భారత్ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. ఈ భేటీకి ముందు ప్రధాని మోదీ నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులను ప్రధానికి వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు.#WATCH | Centre holds all-party meeting to brief all political parties on #OperationSindoor pic.twitter.com/q96NZnhUY6— ANI (@ANI) May 8, 2025 -
ఈసారి అధికారం మనదే: వైఎస్ జగన్
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్‌కు ఉత్సాహాన్నివ్వడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు క్రియాశీలకంగా పని చేయాలి. వారానికి మూడు రోజులు మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ జిల్లా మీద మీకు పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది వింటారు. ఇది చాలా ముఖ్యం. మీ వల్ల పార్టీకి మంచి జరగాలి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లా పని చేయాలి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియుగంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయాలంటే ఈ రెండు విషయాల్లో వెనకాడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం. రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, వైద్య రంగాలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి. ప్రతి పథకం కనపడకుండా పోతోంది. మరోవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ స్థాయిలో అవినీతిని ఎప్పుడూ చూసి ఉండం. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కానీ.. ఈ ప్రభుత్వంలో మాత్రం రూపాయికే ఎకరం చొప్పున లూలూ గ్రూపు లాంటి వాళ్లకు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల విలువైన భూములు వస్తాయి. మరొకరికి రూపాయికే ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. ఈ స్థాయిలో ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. -వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని చెప్పారు. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ‘మనల్ని అభిమానించే వారిని కొడుతున్నారు.. ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అభిమానించినందుకే కదా.. వీళ్లకు దెబ్బలు తగులుతున్నాయన్నది నన్ను బాధిస్తోంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే. అందుకే జగన్ 2.0లో ఈ మాదిరిగా ఉండదని స్పష్టంగా చెబుతున్నా. మొదటి ప్రాధాన్యత ఉంటుంది’ అని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని, కేడర్ ధైర్యంగా నిలబడిందని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్రమైన అగ్రహం ఉందని తెలిపారు. మన ప్రభుత్వ హయాంలో మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశారని చెప్పారు. వారి కడుపు కొట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అనైతిక పనులు చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన ప్రభుత్వ హయాంలో చాలా కష్టపడ్డాం. చాలా మంది నాయకులను మన పరిపాలనలో కట్టడి చేశాం. తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్సీపీకి 16 వార్డులు, టీడీపీకి 18 వార్డులు వచ్చాయి. కానీ అప్పటి వైఎస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫలితాన్ని మన వైపు తిప్పుదామని యత్నించారు. కానీ, ఆ రోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యేనే గృహ నిర్భంధం చేశాం. అదే ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ రోజు 99.99 శాతం గ్రామ స్థాయిలో కేడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు. చంద్రబాబునాయుడు 12 నెలల రెడ్ బుక్ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు, గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి అదే ఆశిస్తున్నారు. కేసులు పెట్టించుకునే పరిస్థితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది.అవినీతి కంటికి కన్పిస్తోంది రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి మనం ‘సెకీ’ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో యూనిట్ విద్యుత్ రూ.2.49కే కొనుగోలు చేశాం. రైతులకు ఉచితంగా పగటి పూటే తొమ్మిది గంటల పాటు, నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే.. ఇప్పుడు నిస్సిగ్గుగా ఇవాళ వీళ్లు యూనిట్ విద్యుత్ రూ.4.60కు కొనుగోలు చేస్తున్నారు. సెక్షన్–108 ప్రకారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకున్నారు. మెడ మీద కత్తిపెట్టి వాళ్లతో పని చేయించుకున్నారు. అవినీతి కంటికి కనిపిస్తోంది. గ్రామాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ స్కాములే. పేకాట క్లబ్బులు దగ్గర నుంచి మొదలు పెడితే.. విచ్చలవిడిగా బెల్టు షాపులు.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. పరిశ్రమ నడవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ కొనసాగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని దండుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఓటు వేసి ఐదేళ్లు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారంతే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు.చరిత్ర పునరావృతం ఖాయం 2014లో ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆ రోజు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ అని కొద్దిగా చేసి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు. అది కూడా మోసంగా తయారైంది. ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదీ మోసమైంది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు.. అదీ మోసంగా మిగిలింది. అదే సమయంలో మనం పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇచ్చాం. చివరకు ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చీల్చడానికి తన భాగస్వామిని వేరేగా పోటీ చేయించాడు. అయినా చంద్రబాబు ఓటమిని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో మొట్టికాయలు వేస్తారు. ముఖ్యమైన వారికి కీలక బాధ్యతలు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు.. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారు.. అని చాలా అధ్యయనం చేశాకే మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద 11 నెలలుగా మనం ప్రధానంగా ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు అన్నీ పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం. వాళ్లకు సరైన సపోర్ట్ మెకానిజమ్‌గా రీజినల్ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్‌ను వారు కోఆర్డినేట్ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహకారం అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది.రీజినల్ కో–ఆర్డినేటర్లతో సమన్వయం జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. రీజినల్ కో–ఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో భావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం. వీళ్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తకు ఉపయోగపడేలా పని చేస్తారు. వీళ్లను ఆయా రీజినల్ కో ఆర్డినేటర్లతో మ్యాపింగ్ చేస్తాం. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలి. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలి. జిల్లా కమిటీల నుంచి, బూత్ కమిటీల వరకు జిల్లా అధ్యక్షులకు సహాయకారిగా ఉండాలి. ప్రజలకు మరింత చేరువగా.. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ ఇన్‌ఛార్జి పనితీరును బేరీజు వేస్తారు. సరిగ్గా పని చేసేలా మోటివేట్ చేయాలి. వారిని ప్రోత్సహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త గెలవడం చాలా సులభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిదే. నియోజకవర్గ అభ్యర్థికి ఎవరితోనైనా విభేదాలు ఉంటే, వాళ్ల మధ్య సమన్వయం చేయడంలో కూడా పరిశీలకులదే కీలక బాధ్యత. ఇదంతా జిల్లా అధ్యక్షులతో కలిసి చేయాలి. మీరు, జిల్లా అధ్యక్షులు కలిసి రీజనల్ కోఆర్డినేటర్లకు కాళ్లూ, చేతుల్లా పని చేస్తారు. వారు మీ ద్వారానే అన్ని పనులు చేయించుకుంటారు.గెలుపే మీ పనితీరుకు గీటురాయి మీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఎంత మందిని మీరు గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీకు, జిల్లా అధ్యక్షులకు మీ మీ పనితీరు ఆధారంగానే మంచి పదవులు వస్తాయి. మీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి. అలాగే రీజినల్ కోఆర్డినేటర్లు కూడా, వాళ్ల ప్రాంతాల్లో ఎంత మందిని గెలిపించుకుని వచ్చారన్న దానిపైనే వాళ్లకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో అందరికీ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి, పారదర్శకంగా పథకాలిచ్చి, రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి, ప్రతి ఇంటికీ పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్థితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.మీరు పని చేయండి.. మీ బాధ్యత నాది మీరు పని చేయండి. మీ బాధ్యత నాది. మిమ్నల్ని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో మన పార్టీ బలంగా ఉంది. దీన్ని మరింత ఆర్గనైజ్డ్గా తీసుకుని రావాలి. గ్రామ కమిటీ సభ్యుడిగానో, బూత్ కమిటీలోనో, మహిళా కమిటీ సభ్యురాలిగానో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి కార్యకర్తను తీసుకుని రావాలి. అంతిమంగా మీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వచ్చారా లేదా అన్నదే నా పరీక్ష. గ్రామ, బూత్, మండల కమిటీలు ఎప్పుడైతే క్రియాశీలకంగా పని చేయడం మొదలవుతుందో అప్పడే గెలుపు సాధ్యం. మోసం మనకు చేతకాదుమనం అధికారంలోకి వచ్చే నాటికి నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించి రూ.2,300 కోట్లు చంద్రబాబు హయాంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులు మనం చెల్లించాం. మనం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పథకం అమలు చేస్తూ బటన్ నొక్కి జమ చేశాం. విలువలు, విశ్వసనీయత, క్రెడిబులిటీ కోసం మనం తాపత్రయ పడ్డాం. ప్రజల కోసమే ఆలోచన చేశాం. కాబట్టి కేడర్‌కు అనుకున్న మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. చంద్రబాబుకు అవేవీ లేవు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత మన కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. తొలి ప్రాధాన్యత వారికే. అదే టైంలో చంద్రబాబు మాదిరిగా మనం అబద్ధాలు చెప్పలేం. మోసాలు చేయలేం. ఎప్పుడైనా సరే నిజాయితీగానే రాజకీయాలు చేస్తాను. త్వరితగతిన కమిటీల నిర్మాణంబూత్ కమిటీల నియామకం పూర్తయ్యే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు. వారికి ఇన్సూరెన్స్ కచ్చితంగా చేస్తాం. వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో 94 శాతం మండల అధ్యక్షుల నియామకం, 54 శాతం మండల కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. అనుబంధ విభాగాలకు సంబంధించి 9 వేల మంది అధ్యక్షులను నియమించాం. మే ఆఖరులోగా మండల కమిటీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలి. అప్పుడు మండల కమిటీలు.. గ్రామ స్థాయి కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తాయి. జూలై ఆఖరు నాటికి మున్సిపాలిటీ, గ్రామ స్థాయి విలేజ్ కమిటీల నియామకాలు పూర్తి కావాలి. ప్రతి మున్సిపాలిటీలో డివిజన్ ప్రెసిడెంట్ నియామకాలు పూర్తి కావాలి. కార్పొరేటర్ ఉన్నా కూడా డివిజన్ ప్రెసిడెంట్‌ను నియమించాలి. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలు కూడా పూర్తి కావాలి. ప్రతి గ్రామంలో అత్యధికంగా సర్పంచ్‌లు మన వాళ్లే ఉన్నారు. తొలుత 18 లక్షల మంది క్రియాశీలక (యాక్టివ్) సభ్యులకు ప్రత్యేకంగా ఐడీ కార్డు, ప్రత్యేక ఇన్సూరెన్స్ వస్తాయి. ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తాం. అక్టోబర్ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. తొలుత జిల్లా స్థాయిలో కమిటీలు, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీల హెడ్లను నియమించాం. మండల స్థాయిలో అధ్యక్షుల నియామకం దాదాపు 94 శాతం పూర్తి అయింది. తొలుత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాల కమిటీల అధ్యక్షులను నియమించాలి. మీరు వారానికి మూడు రోజులు వెళ్లి పరిశీలించగలిగితే అన్ని నియామకాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీ నిర్వహిద్దాం.మన హయాంలో రైతులకు భరోసా⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితా పెట్టే వాళ్లం. మద్దతు ధర కోసం రూ.7,600 కోట్లు ఖర్చు చేసి రైతులకు మేలు చేశాం. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఆ పంటలు కొనుగోలు చేసేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ⇒ ప్రైవేటు కంపెనీలతో పోటీ పడి వేలంలో పాల్గొని, రైతులను ఆదుకున్నాం. ఆయిల్‌పామ్ రైతులనూ ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. రూ.80 కోట్లు ఇచ్చాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానికి ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. అదనంగా గన్నీ బ్యాగ్స్, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చు (జీఎల్టీ) కూడా ఇచ్చాం. ⇒ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సంప్రదాయం మన దగ్గరే ప్రారంభమైంది. క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్లం. వ్యవసాయ రంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టనిది కూటమి ప్రభుత్వం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించాం. విపత్తులు వస్తే తక్షణమే వెళ్లి ఆదుకున్నాం. ⇒ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధర అందడం లేదు. రైతును పట్టించుకునే నాధుడే లేడు. ప్రజలకు సమస్యలొస్తే మీరు అక్కడికి వెళ్లాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజా సమస్యల పట్ల ఎంత ఎక్కువగా వారికి అండగా ఉంటే.. అంత గట్టిగా ప్రజల్లో బలపడే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా చేసేందుకే చంద్రబాబు వేధింపులకు దిగుతున్నాడు. అయినా ప్రజల కష్టాల్లో వారికి అండగా ఉండాలి’. -
ముంతాజ్ హోటల్‌కు రూ.వేల కోట్ల విలువైన టీటీడీ భూములు: భూమన
తిరుపతి: పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్‌కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు అలిపిరి సమీపంలోని టీటీడీ భూమిని ఏపీ టూరిజంకు బదలాయించేందుకు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించిందన్నారు. టీటీడీ బోర్డ్ చరిత్రలోనే ఇలా ఒకే ఎజెండా కోసం అత్యవసర సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. శ్రీవారి పాదాల మంటపం అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై సాధుపుంగవులు, హిందూ సమాజం స్పందించాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది. భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు. కానీ ఈ పాలకమండలి సమావేశంలో అలిపిరికి అంటే శ్రీవారి పాదాల మంటపంకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో టీటీడీకి చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ఏపీ టూరిజంకు బదలాయించాలనే ఎజెండా అంశాన్ని అంగీకరిస్తూ తీర్మానం చేశారు.తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ 588ఏ లో టీటీడీకి ఉన్న 24.68 ఎకరాలు, అలాగే ఇదే సర్వే నెంబర్ లో ఉన్న మరో 10.32 ఎకరాల భూమిని ఏపీ టూరిజం అథారిటీకి ఇవ్వాలని, దానికి బదులుగా ఏపీ టూరిజంకు తిరుపతి రూరల్ మండలం పేరూరులో సర్వే నెంబర్ 604 లో ఉన్న 24.68 ఎకరాలు, మరో 10.32 ఎకరాలను టీటీడీ తీసుకోవాలనే అంశంపై తీర్మానం చేశారు.గతంలో ఓబెరాయ్ సంస్థకు హోటల్ నిర్మాణం కోసం వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, శ్రీవారి పవిత్రతకు దెబ్బతీస్తోందంటూ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పెద్ద ఎత్తున హంగామా సృష్టించి, మాపైన బుదరచల్లారు. సాధుపుంగవులు కూడా దీనిని వ్యతిరేకించారు. ఇదే క్రమంలో చంద్రబాబు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి వచ్చినప్పుడు ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాని, ప్రత్యామ్నాయంగా సమీపంలోనే మరో స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు.ఇప్పుడు శ్రీవారి అలిపిరికి సమీపంలోనే టూరిజం అథారిటీకి టీటీడీ భూములను కట్టబెట్టడం ద్వారా ముంతాజ్ హోటల్‌ను అక్కడ నిర్మించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అత్యవసర బోర్డ్ అత్యవసర సమావేశం నిర్వహించి తీర్మానం చేసి, వెంటనే ఈ భూబదలాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదేనా శ్రీవారి పవిత్రను కాపాడే విధానం? ఆనాడు ముంతాజ్ హోటల్ ను వ్యతిరేకిస్తూ హిందూసమాజం ఆందోళనలు చేస్తే, దానిని సమర్థించిన చంద్రబాబు ఇప్పుడు అదే సంస్థకు ఏకంగా టీటీడీ స్థలానే ఎలా కేటాయిస్తున్నారు? దీనిపై హిందూ సమాజం, సాధుపుంగవులు స్పందించాలి. ఓబెరాయ్ హోటల్ కు ప్రత్యమ్నాయ స్థలాన్ని చూపించాల్సి ఉంటే, ఎయిర్ పోర్ట్ ఏరియాలో ప్రభుత్వ స్థలాలా ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఇవ్వాలే తప్ప టీటీడీ స్థలంను ఎలా కట్టబెడతారు?ప్రభుత్వ తప్పిదాల మీద, అవకతవకలపై నేను పెద్ద ఎత్తున స్పందిస్తున్నాను కాబట్టే నాపైన కూటమి ప్రభుత్వం వేధింపులు ప్రారంభించింది. ఎల్లో మీడియా ద్వారా అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారు. 2004లో నక్సల్స్‌తో ప్రభుత్వ చర్చల సందర్భంగా నక్సల్స్ ప్రధాన ఎజెండాలో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రభుత్వానికి చెందిన చెరువులు, పోరంబోకు స్థలాలు, కుంటలను రామోజీరావు ఆక్రమించారని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆనాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఈరోజు రామోజీ కుమారుడు కిరణ్ నేతృత్వంలో నడుస్తున్న ఈనాడు పత్రిక నాపైన భూకబ్జా ఆరోపణల చేస్తుండటం విడ్డూరంగా ఉంది. నిజంగా నేను ఎక్కడైనా భూ ఆక్రమణలకు పాల్పడితే నిరూపించమని సవాల్ చేస్తున్నాను. నాలుగేళ్ల పాటు కూటమి ప్రభుత్వం నాపైన వేధింపులకు, అక్రమ కేసుల బనాయింపులకు పాల్పడుతుందని చాలా స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఈ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం కొనసాగిస్తూనే ఉంటాను. హైదరాబాద్ కోహినూరు హోటల్లో రాసలీలలు చేసి, ప్రభుత్వ భూములు కబ్జాలు చేయాలనుకున్న ఒక పెద్ద నేత నాపైన విచారణకు ఆదేశించారంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. వీటికి భయపడేది లేదు. -
వైఎస్సార్సీపీలోకి పలువురు మాజీ ఉద్యోగ సంఘం నేతలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పలువురు మాజీ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీవోస్ కార్యదర్శి బి.ఉమామహేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, కృష్ణా జిల్లా ఎన్జీవోస్ సంఘం నాయకులు తోట సీతారామంజనేయులు తదితరులు పార్టీలో చేరారు. అనంతరం వారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తాం: నలమారు చంద్రశేఖర్ రెడ్డికూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్సీపీ పాలనను తలుచుకుంటున్నారు. తాజాగా ఉద్యోగ నాయకుల చేరికతో వైయస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం మరింత బలోపేతం అయ్యింది. అందరం కలిసికట్టుగా ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. వైయస్సార్సీపీని బలోపేతం చేయడం ద్వారా వైయస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తాం.వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవడమే లక్ష్యం: : బీవీ సుబ్బారావువైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల ఆలోచనల్లో వచ్చిన మార్పులను ఆయనకు వివరించడం జరిగింది.ఉద్యోగులకిచ్చిన హామీలు నెరవేర్చాలి: బండి శ్రీనివాసరావుమాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. మాట తప్పను, మడమ తిప్పను అని మాటల్లో కాకుండా తన ఐదేళ్ల సంక్షేమ పాలనతో నిరూపించుకున్న గొప్ప నాయకుడు జగన్. మేనిఫెస్టోను ఖురాన్ బైబిల్ భగవద్గీతగా భావించి పరిపాలన చేశారు. ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు.అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినా ఉద్యోగులకు ఎన్నికల్లో ఏ ఒక్క హామీని నేటికీ అమలు చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించకుండా కాలయాపన చేస్తున్నారు. పెన్షనర్లకు ఎన్‌క్యాష్ మెంట్ ఆఫ్ ఎర్రర్ లీవ్ బెనిఫిట్స్, రెగ్యులర్ ఉద్యోగులు, పోలీసుల సరెండర్ లీవ్ బెనిఫిట్స్ అమలు కాలేదు. డీఏలు పెండింగ్‌లో ఉంచారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీలో చేరడం జరిగింది.జగన్ వస్తేనే మళ్లీ ఉద్యోగులకు మంచిరోజులు: ఉమామహేశ్వరరావు2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ తన సంక్షేమ పాలనతో గుప్తుల స్వర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చారు. కరోనా విలయతాండవంతో ప్రపంచమంతా వణికిపోయినా సంక్షేమ పథకాలను ఆపకుండా రాష్ట్ర ప్రజలను తన కుటుంబంలా కాపాడుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే లక్షన్నర కోట్లకుపైగా అప్పులు చేసినా ఆ డబ్బంతా ఏం చేసిందో అర్థంకాని పరిస్థితి. మోసపూరిత హామీలతో అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలే కాకుండా ఉద్యోగులు, పెన్షనర్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ వైయస్ జగన్ ను సీఎం చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి.ఉద్యోగుల సంక్షేమం కోసమే వైఎస్సార్సీపీలో చేరా: విజయసింహారెడ్డిఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం వైయస్సార్సీపీలో చేరడం జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయితేనే ఉద్యోగులకు మళ్లీ మంచిరోజులొస్తాయి. -
చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారు. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై, వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడగలగాలి. మీరు పరిశీలకుడిగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎంతమందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీ పనితీరు ఆధారంగా మీకు మంచి మంచి పదవులు వస్తాయి.. తప్పకుండా మనం అధికారంలోకి వస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు.. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.‘‘ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది?. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు చేయలేదు. మనం పాదయాత్ర చేసి, ప్రజలకు భరోసా ఇచ్చాం. 2019 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత కొట్టిచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. ప్రజావ్యతిరేకతను చీల్చడానికి చంద్రబాబు తన రాజకీయ భాగస్వామిని వేరేగా పోటీచేయించారు. అయినా చంద్రబాబు తన ఓటమిని అడ్డుకోలేకపోయారు. చంద్రబాబు రాకముందు.. మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి. ఇప్పుడు చంద్రబాబు ప్రజలు తింటున్న కంచాన్ని లాగేశాడు’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘అంతేకాదు తానిచ్చిన హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదు. రెండు రకాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు పూర్తిగా నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయంగా ఉన్న రైతు భరోసా ఎగిరిపోయింది. అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, అదే రూపాయికి వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. లూలుకు రూ.1500 కోట్ల భూములు కట్టబెట్టారు. మరొకరికి రూ.3వేల కోట్ల భూములు కట్టబెట్టారు...రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి సెకీతో మనం రూ.2.49లకే విద్యుత్ కొనుగోలు చేశాం. కాని ఇవాళ వీళ్లు రూ.4.60లకు కొనుగోలు చేశారు. సెక్షన్ 108 ప్రకారం ఏపీఆర్సీపీమీద ఒత్తిడి తెచ్చి మరీ అమలు చేయించుకున్నారు. అవినీతి మన కంటికి కనిపిస్తోంది. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు, బెల్టుషాపులు, ఎమ్మార్పీ ధర కన్నా లిక్కర్ ఎక్కువకు అమ్ముకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు మట్టజెప్పనిదే ఏమీ కావడంలేదు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్నాయి. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఒక్కసారి ఓటు వేశాక, ఐదేళ్లపాటు ప్రజలు వేచి చూడాలి. అందుకే ఇప్పుడేమీ చేయలేక ప్రజలు అన్నింటినీ చూస్తున్నారు..సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రజలు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు. ఇప్పుడు కలియుగం పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని మన ప్రభుత్వంలో చాలా కష్టపడ్డాం. మన పరిపాలనలో చాలామంది నాయకులను కట్టడి చేశాం.తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్సీపీకి 16, టీడీపికి 18 వచ్చాయి. కాని అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మన పార్టీ వైపునకు ఫలితాన్ని తిప్పుదామని యత్నించారు. ఆ రోజు మన పార్టీ ఎమ్మెల్యే అయిన పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశాం. ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయడంలేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతాను. ఈ సారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను. ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తాను. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది. కేడర్ ధైర్యంగా నిలబడింది. రాష్ట్రవ్యాప్తంగా నేను ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంది. రాజకీయాలతో సంబంధం లేనివారినికూడా కక్షలకు గురిచేస్తున్నారు. వచ్చే ఏడాది ప్లీనరీని నిర్వహిద్దాం. బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం...బూత్ కమిటీలు పూర్తయ్చే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షలమంది ఉంటారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు, కనీస మద్దతు ధర అందడంలేదు. వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితాను పెట్టేవాళ్లం. ఎంఎస్పీ కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జోక్యంచేసుకునేది. ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వేలంలో పాల్గొన్నాం. రైతులను ఆదుకున్నాం. అలాగే ఆయిల్‌పాం రైతులను ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం...ధాన్యానానికి ఎంఎస్పీ ఇవ్వడమే కాదు, ఎంఎస్పీకి అదనంగా జీఎల్టీ కూడా ఇచ్చాం. వ్యవసాయరంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పంటలకు నష్టం వస్తే సీజన్ మగిసేలోగా వారికి ఇన్పుట్ సబ్పిడీ ఇచ్చేవాళ్లం. మళ్లీ సీజన్‌లోగా పరిహారిం ఇచ్చేవాళ్లం. క్రమంగా ప్పతకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఏమీ లేవు. క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించేవాళ్లం’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. -
పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై వైఎస్ జగన్ వారితో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. -
‘అప్పులు చెల్లింపుల కోసం నెలకు రూ. 6 వేల కోట్లు కడుతున్నాం’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఈరోజు(మంగళవాళం) బేగంపేట్ లో మీడియాతో మాట్లాడిన సీతక్క.. గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పుగా మార్చిందని మండిపడ్డారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భవిష్యత్ కు ముప్పుగా దాపురించిందని ధ్వజమెత్తారు.‘కేసీఆర్ నిర్వహాకం వల్ల నెలకు రూ. 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుంది. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే.. పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలి. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ది. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా?, ఉపాద్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగుల గొట్టింది ఎవరు కేటీఆర్?. ఎందరో ఉద్యమకారులను అవమాన పరిచి బయటకు పంపిన చరిత్ర మీది. అప్పులు, అమ్మకాలు తప్ప మీరు చేసిన అభివృద్ది శూన్యం. మీరు చేసిన అభివృద్ది ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నాం’ అని మంత్రి సీతక్క తెలిపారు. -
ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై జయచంద్ర రెడ్డి ధ్వజం
వైఎస్సార్ కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్ర రెడ్డి భగ్గుమన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షి పత్రికపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన విమర్శలను తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె అవినీతి చిట్టా బయట పెడుతుందనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మాధవిరెడ్డిపై అన్ని వార్తా పత్రికల్లో, టీవీ చానెల్స్ లో ఇప్పటికే కథనాలు వస్తున్నాయని గుర్తుచేశారు. జిల్లాలో ఆమె చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆయన అన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని చెరువు స్థలాల్లో వెంచర్లు వేస్తున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. మాధవిరెడ్డి అనుచరులు బహిరంగంగానే అవినీతి పనులు చేస్తున్నారన్నారు. స్థానిక బిల్డర్ల నుంచి కూడా లక్షల్లో వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యేపై జయచంద్రారెడ్డి ఆరోపించారు.ఏపీలో కూటమి సర్కార్ మొదలైన సమయం నుంచి కడపలో అక్రమాలు పెరిగిపోయాయని ప్రజలు ప్రత్యక్షంగానే చెబుతున్నారు. దేవుని కడపలోని 450 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు ప్లాన్ వేశారు. తప్పడు డాక్యుమెంట్లు తయారు చేసి ఇప్పటికే అక్కడ ప్లాట్లు వేసేందుకు పనులు కూడా ప్రారంభించారు. దానిని స్థానిక రైతులు అడ్డుకోవడంతో అసలు విషయం బయటకొచ్చింది. కోట్ల రూపాయలు విలువ చేసే 450 ఏకరాల భూమిని కొట్టేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు స్కెచ్ చేశారు. పనులు ఆపకపోతే చూస్తూ తాము సహించబోమని రైతులు హెచ్చరించారు. స్థానిక రైతులు చెప్పిన ఇదే విషయాన్ని సాక్షి పత్రిక ప్రచురణ చేయడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కసు వెల్లగక్కిన విషయం తెలిసిందే. -
‘సీఎం రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదు’
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ కు పరిపాలను చేతకాకపోవడం వల్లే నిస్పృహతో రేవంత్ ఈ మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి డబ్బుకు కక్కిస్తానని చెప్పిన రేవంత్.. ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.‘తెలంగాణకు పరపతి లేదని ఎలా మాట్లాడుతారు?, కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే తెలంగాణ లక్షన్నర కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుంది. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని రక్షణశాఖ సహాయం మంత్రిని కలిశాను. తెలంగాణలో మూడు సైనిక్ స్కూల్స్ తీసుకొచ్చి బాధ్యత నాదే. రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరించి... భూమి ఇవ్వాలి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ ఇస్తామన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. తెలంగాణలో 25 వేల మంది విద్యార్థులు సైనిక్ స్కూల్స్ కోసం పరీక్షలు రాస్తే... తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ లేకపోవడం దురదృష్టకరం’ అని రఘునందన్ రావు విమర్శించారు. -
‘అవినీతే సిగ్గుపడేలా..కూటమి ప్రభుత్వం అవినీతి’
తాడేపల్లి : అవినీతే సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా, వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కుట్టు మిషన్ల స్కాం చేస్తున్నారన్నారు.‘అన్ని వర్గాల మహిళలను మోసం చేస్తున్నారు. అప్పుల్లోనే కాదు, అవినీతిలోనూ రికార్డు సృష్టించారు. బాబు ష్యూరిటీ, అవినీతి గ్యారెంటీగా మారిపోయింది. NDA అంటే నారా దోపిడీ అలియెన్సుగా మారిందిమహిళ మంత్రిగా ఉన్న శాఖలో అవినీతి జరగటం దారుణం. కొద్దిరోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపటం లేదు? , జగన్ హయాంలో ఇళ్ల పట్టాల దగ్గర్నుంచి అనేక పథకాలను మహిళల కోసం తెచ్చారు.కాపు మహిళల కోసం జగన్ కాపునేస్తం తెచ్చారు. చంద్రబాబు కాపు మహిళలకు ఏం చేశారు? , ఇసుక, మట్టి, మద్యం, అమరావతి నిర్మాణాలు, ఉర్సా భూములు ఇలా ప్రతిదానిలోనూ స్కాం చేస్తున్నారు. కుట్టుమిషన్ల స్కీంని కమీషన్ల స్కాంగా మార్చారు. రూ.7,300 వేలు ఖర్చయ్యే దానికి రూ. 23 వేలు ఖర్చు ఎందుకు పెడుతున్నారు?, రూ.157 కోట్లు దోచుకునేందుకు ప్లాన్ చేశారు.మొబలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చి అవినీతికి రెడీ చేశారు. L1 కి ఐదు శాతం వర్కు ఇచ్చి L2, L3 కాంట్రాక్టరుకి 95% వర్కు ఇవ్వటం వెనుకే కుట్ర ఉంది.దానిపై ఏసీబి కేసు నమోదు చేసి, విచారణ జరపాలి. వెంటనే టెండర్ ని రద్దు చేయాలి. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటుంది. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ వరుదు కళ్యాణి హెచ్చరించారు. -
చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్
సాక్షి, తూర్పుగోదావరి: విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా? అంటూ చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. ‘‘విద్యుత్ ఒప్పందాల్లో రూ.11 వేల కోట్ల స్కాం జరిగింది. ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు?. చంద్రబాబు బినామీలకు వాటాలు వెళ్లాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.మంగళవారం.. మార్గాని భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ రెండు రూపాయల 49 పైసలకు ఏడు వేల మెగా వాట్లు రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అతి తక్కువ ధర కొనుగోలు చేయడం ఒక రికార్డు. మార్కెట్లో విద్యుత్ తక్కువగా దొరుకుతున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయటం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణమేనన్నారు. చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.‘‘ఈ ఒప్పందంతో సంవత్సరానికి రూ. 400 కోట్ల రూపాయలు అధిక భారం రాష్ట్ర ప్రజలపై పడుతుంది. కనీసం ప్రజలు ఏమన్నా అనుకుంటారేమోనన్న ఆలోచన కూడా చంద్రబాబు లేకపోవడం దారుణం. ఇప్పటివరకు బషీర్ బాగ్ ఘటన ఎవరు మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది. ఓ వైపు సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడ కూలిపోయింది. పేక మేడలాంటి నిర్మాణాలతో ప్రభుత్వం అమాయకులను బలి చేస్తుంది. టీటీడీలో గోవులు చనిపోతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్లు కోసం భక్తులు ప్రాణం కోల్పోయారు. ప్రభుత్వ తప్పులు మీద తప్పులు చేస్తుంది’’ అని మార్గాని భరత్ మండిపడ్డారు.విద్యులు తగ్గించకపోతే వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తారు. సింహాచలం ఘటనలో మంత్రులకు బాధ్యత లేదా?. పర్యవేక్షణ అంటే ఏసీ రూములో కూర్చుని కాఫీలు తాగడమా?’’ అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు. -
అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లేందుకు అనేక అడ్డంకులను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన సందర్భంగా సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీలను ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది.అయితే, హైకోర్టు ఉత్తర్వుల కాపీలను అనంతపురం ఎస్పీ జగదీష్‌కు అందజేసేందుకు మూడు రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నేరుగా అనంతపురం ఎస్పీ కార్యాలయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. విషయం తెలుసుకున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఏఎస్పీతో మాట్లాడి.. అనంతరం ఎస్పీ జగదీష్‌తో కూడా ఫోన్లో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, పెద్దారెడ్డి. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉందని.. ఆ తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చి.. తగిన భద్రత కల్పిస్తామని ఎస్పీ జగదీష్ హామీ ఇచ్చినట్లు వారు మీడియాకు వివరించారు. -
కూటమిపై తిరుగుబాటు మొదలైంది: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. కరెంట్ చార్జీలు పెంచమని చెప్పిన కూటమి సంవత్సర కాలంలోనే 15వేల కోట్లు భారం వేశారని.. 200 కరెంటు బిల్లు వచ్చిన వాళ్లకు బిల్లు మోత మోగిస్తున్నాయని దేవినేని అవినాష్ మండిపడ్డారు.‘‘కరెంట్ చార్జీలు తగ్గించపోగా భారీగా పెంచారు. పెరిగిన కరెంట్ ఛార్జీలత్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి పాలనలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు. జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బాగా నడిచిందని ప్రజలు అంటున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచం అని కూటమి నేతలు బాండ్లు ఇచ్చి ఓట్లు అడిగారు. నాడు బాండ్లు ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో తిరగగలరా?. సంక్షేమం, అభివృద్ధి చేయకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎస్సి, ఎస్టీలకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ని కూడా తొలగించారు’’ అని దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు.అధికారులు.. ప్రతిపక్ష పార్టీల నేతలు అర్జీలు ఇస్తామన్న తీసుకోవడానికి భయపడుతున్నారు.. మేము ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం. వైఎస్సార్సీపీ నేతలను చూస్తే అధికారులకు భయం వేస్తోంది. ప్రజలను అన్యాయం చేసిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకొంటాం. విద్యుత్ చార్జీల తగ్గింపు, ఎస్సీ. ఎస్టీలకు ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాల అమలు కోసం పోరాటం చేస్తాం. వర్షాల్లో దెబ్బ తిన్న రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. కనీసం గోని సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. -
సీఎం రేవంత్ చేతులెత్తేశారా?.. బండి సంజయ్ కౌంటర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి అధైర్యం నింపుతారా? అంటూ నిలదీశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందే తెలుసా కదా?. అప్పుల గురించి తెలిసే హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ రాసిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయింది’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.మంగళవారం.. ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగస్థులు, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏలకు డబ్బుల్లేవంటున్నాడు సీఎం. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అన్నీ హుళక్కే ఇక. ఓట్లు వేసి గెలిపించారు ఇక మీ కర్మ. మేమైతే ఏం చేయలేమని ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండు...కేసీఆర్ అప్పులు చేశాడని చెప్పిన మీరు... తాము వస్తే అంతా బాగుంటుందని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. రేపట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. కేంద్ర మంత్రులు, ప్రధాని వచ్చినప్పుడు సాయం చేస్తున్నారని మాట్లాడే కాంగ్రెస్ నాయకులే.. మళ్లీ ఆ తర్వాత కేంద్రం ఏం చేయడం లేదని రాజకీయాలు చేస్తారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. -
తాకట్టులో ఆంధ్రప్రదేశ్ ఖజానా!
ఇది విన్నారా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖజానానే తాకట్టు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అది కూడా రూ.9500 కోట్ల అప్పు కోసం! ఏడాది కూడా నిండని కూటమి పాలనలో ఇప్పటికే రికార్డు స్థాయిలో రూ.1.47 లక్షల కోట్ల అప్పులయ్యాయి. ఇవి చాలవన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అదనంగా ఖజానాను తాకట్టు పెట్టి రుణాలు పొందే ప్రయత్నం చేస్తోంది. గనుల మాదిరిగానే ట్రెజరీని కూడా తాకట్టు పెడుతున్నట్టుగా ఒప్పందం ఉండటం.. రుణ వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోతే రిజర్వు బ్యాంక్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచి నేరుగా వసూలు చేసుకోవచ్చట. ఈ వార్త విన్నప్పుడు తొలుత అది నిజమై ఉండదులే అనుకున్నాం. కాని వైసీపీ సీనియర్ నేత, ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వయానా ఈ విషయం చెప్పడంతో అదెలా సాధ్యమని అనిపించింది. ఖజానా తాకట్టు గురించి బుగ్గన విపులంగా వివరించినా.. కూటమి ప్రభుత్వం దానికి వివరణ కూడా ఇవ్వలేదు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ట్రెజరీ ఖాతాకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రభుత్వానికి అప్పులు అవసరం అయినప్పుడు మరీ బ్యాంకులు కోరితే ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టడం జరిగేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే విపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పెద్ద ఎత్తున రచ్చ చేశాయి. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు జరగరానిది ఏదో జరిగిపోతోందని ప్రజలను భయపెట్టే యత్నం చేసేవి. వీటి ప్రభావం సహజంగానే ప్రజలపై ఎంతో కొంత ఉంటుంది. ఆ రకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల రాజకీయాల కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశారు. అబద్దపు ప్రచారం చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి తన వంతు దుష్ప్రచారం చేశారు. జగన్ సర్కార్ నిత్యం అప్పు చేస్తోందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేస్తోందని, శ్రీలంక అయిపోతుందని ఇలా ఏది పడితే అది మాట్లాడి జగన్ ప్రభుత్వంపై ప్రజలలో సందేహాలు వచ్చేలా వ్యవహరించారు. తాము అధికారంలోకి వస్తే అప్పులు తేబోమని, ఉన్న అప్పులు తీర్చుతామని, చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని ఊదరగొట్టేవారు. దీనితోపాటు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్, మరో వంద ఎన్నికల హామీలు అంటూ ప్రచారం చేసి బాండ్లు కూడా ఇచ్చి వచ్చారు. ఎలాగైతే అధికారం సాధించారు. ఇప్పుడేమో అప్పు చేయడమే సంపద అని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పోనీ దానిపై క్లారిటీతో మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని తనకూ ఆశగా ఉందని, కాని ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు కూడా పుట్టడం లేదని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు అంటున్నారు. కానీ ఏడాది కాక ముందే రూ.లక్షన్నర కోట్లు ఎలా అప్పు చేశారని ఆయనను ఎవరూ అడగరు. ప్రశ్నించే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ అంటూ భయపెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటివి పట్టించుకోవడం మానేసి చాలాకాలమైంది. కాని జనానికి వీరు చేస్తున్న మాయ అర్ధం అవుతోంది. అప్పుల మీద చంద్రబాబు గతంలో ఏమి చెప్పింది..ఇప్పుడు ఏమి చేస్తున్నది బెరీజు వేసుకుంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో రూ.వెయ్యి కోట్లు అప్పు తీసుకున్నా, దానిని మొదటి పేజీలో ప్రచురించి, అప్పులు తప్ప ఏపీలో ఇంకేమీ జరగడం లేదన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు తన సభలలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తూ నాశనం చేస్తోందని, ఒకసారి పది లక్షల అప్పు చేశారని, మరరో సారి 13 లక్షల కోట్లుఅని, ఇంకోసారి ఏకంగా 14 లక్షల కోట్లు అని దుర్మార్గంగా పబ్లిసిటీ చేశారు.ఒక్క జగనే అంత భారీగా అప్పు చేశారా అన్న అనుమానం కలిగించారు. అంతే తప్ప, రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత అప్పు ఉంది. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? ఆ తర్వాత జగన్ టైమ్ లో ఎంత అప్పు అయింది విడమరిచి చెప్పకుండా, మొత్తం అప్పంతా జగన్ ఖాతాలో వేసేశేవారు. అదే చంద్రబాబు గొప్పదనం. ఎంతటి అబద్దాన్ని అయినా నమ్మించేలా మాట్లాడగల సత్తా కలిగిన నేత అని ఆయన ప్రత్యర్ధులు చెబుతుంటారు. ఈ అప్పులపై ఆయన చేసిన దుష్ప్రచారం దానిని నిర్ధారిస్తుంది. విశేషం ఏమిటంటే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా ఉన్నా రూ.3.30 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశారని వెల్లడైంది. ఆ వివరాలు టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్టే తెలిపింది. కాని కేశవ్ కార్పొరేషన్ల ద్వారా జగన్ ప్రభుత్వం అప్పు చేయడాన్ని ఆక్షేపించారు. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వపరంగా నేరుగా చేసిన అప్పులే లక్ష కోట్లు ఉంటే మరో రూ.ఏభై వేల కోట్లు అమరావతి పేరుతో తీసుకుంటున్నారు. అందులో ఇప్పటికే రూ.31 వేల కోట్లకు ఒప్పందం అయ్యారు. కేంద్ర ఆర్థిక సంఘం కేపీలో పర్యటించినప్పుడు అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరమన్నారు. అమరావతిలో చేపడుతున్నామని రూ.లక్ష కోట్ల విలువైన పనులు మంత్రి నారాయణ చెప్పారు. ఒక్క రూపాయి వ్యయం ప్రభుత్వపరంగా చెయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు చేస్తున్న నిర్వాకం ఇదన్నమాట. ఈ క్రమంలో తాజాగా ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా రూ. తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి నిజంగానే పరపతి పోయిందేమో తెలియదు కాని, బాండ్ల రూపంలో ఆ అప్పు ఇచ్చినవారికి నమ్మకం కలిగించడానికి రాష్ట్రంలో ఉన్న సుమారు రూ.1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలన్నిటిని ఖనిజాభివృద్ధి సంస్థకు బదలాయించి, వాటిని చూపించి ఈ అప్పు తీసుకున్నారు. అయినా బాండ్లు కొన్నవారికి ఇంకా అపనమ్మకంగానే ఉన్నట్లు ఉంది. అందుకే ఒకవేళ ఖనిజాభివృద్ది సంస్థ ఖాతాలో రుణ వాయిదాల ఆరునెలల మొత్తం డిపాజిట్ లేకపోతే, ఆ ప్రైవేటు సంస్థలు, లేదా వ్యక్తులు ప్రభుత్వానికి రిజర్వు బ్యాంక్‌లో ఉండే ఖాతా నుంచి నేరుగా తమ రుణ వాయిదాను రాబట్టుకోవచ్చని చెబుతూ జీవోనే ఇచ్చేశారు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. ప్రజల పట్ల బాధ్యతలేని పద్దతే అని అనాలి. చంద్రబాబు సర్కార్ విడుదల చేసిన జీవో లోని అంశాలను పేర్ని నాని ఏప్రిల్ 24న చదివి వినిపించారు. నేరుగా ఏపీ అకౌంట్ నుంచి డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం ద్వారా అవకాశం ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని నాని అన్నారు. అది వాస్తవమైనా, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఊహాలోకంలో వారిని ప్రశ్నించేవారు లేరు. వైసీపీ వారు ప్రశ్నించినా పట్టించుకున్న నాథుడు లేడు. విశేషం ఏమిటంటే ఇప్పటివరకు చేసిన అమరావతికి కాకుండా చేసిన లక్ష కోట్ల అప్పు ఏమి చేసింది కూడా ప్రభుత్వం వివరించలేదు.జగన్ ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి శ్వేతపత్రాలు అంటూ పిచ్చి పత్రాలు విడుదల చేసిన సర్కార్, జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ 2 అంటూ కాకి లెక్కలు చెప్పిన సర్కార్ , ధైర్యంగా ఈ లక్ష కోట్లు ఏ రకంగా వ్యయం చేసింది ఎందుకు చెప్పలేకపోతున్నారు? సూపర్ సిక్స్ హామీల అమలుకు ఈ మొత్తంలో ఎంత వ్యయం చేశారో చెబుతారా? బడ్జెట్లో చిల్లర ఖర్చుల కోసం దాదాపు రూ.8 వేల కోట్ల రూపాయలు కేటాయించి మరో రికార్డును కూడా ఈ ప్రభుత్వం సృష్టించింది. మరో వైపు గత ప్రభుత్వ టైమ్‌లో వచ్చిన ఆదాయం కంటే ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.13 వేల కోట్లు తగ్గిందని నిపుణులు లెక్కలు చూపుతున్నారు. ఇలాంటి వాటిపై సోషల్ మీడియాలో పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నా జవాబు చెప్పడం లేదు.అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు పిట్టల దొర కబుర్లు చెబుతూ, ఆకాశంలో మేడలు కడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సంపద సృష్టించడం సంగతి దేవుడెరుగు. ఏపీని ఈ రకంగా అప్పుల పాలు చేయకుండా ఉంటే చాలు దేవుడా అని జనం అనుకునే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
యాక్సిస్ పవర్.. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్
సాక్షి, అమరావతి: యాక్సిస్ పవర్‌తో కూటమి ప్రభుత్వం ఒప్పందం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ చీఫ్ విప్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలుతో ప్రజలపై పెనుభారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని స్కామ్ అని, బినామీల జేబులు నింపడానికే సీఎం చంద్రబాబు దీనికి తెగించారని అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శ్రీకాంత్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.‘వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐఎస్‌టీసీ చార్జీలు లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా యూనిట్ విద్యుత్తు రూ.2.49కు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటేనే కూటమి పారీ్టలు గగ్గోలు పెట్టాయి. ప్రభుత్వానికి వైఎస్ జగన్ రూ.1.10 లక్షల కోట్లు నష్టం చేశారంటూ చంద్రబాబు, ఆయన వర్గం దారుణమైన అబద్ధపు ప్రచారం చేశారు. మరి యాక్సిస్ పవర్ నుంచి యూనిట్ రూ.4.60కు కొనుగోలుకు ప్రస్తుత ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ అడ్డగోలు ఒప్పందం ద్వారా మరో భారీ కుంభకోణానికి ప్రణాళికలు రచించింది.పైగా 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించడానికి వీల్లేకుండా సీలింగ్ షరతు విధించి కాంట్రాక్టర్ల ఆదాయానికి రాజమార్గం చూపింది. యూనిట్ మీద రూ.2.11 అధికంగా చెల్లించి కొనడం, ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఒప్పందాన్ని ఆమోదించుకోవడం చూస్తుంటే ఎంత భారీ అవినీతికి తెగించారో తెలుస్తోంది’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనంతా చీకట్లే ‘గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎప్పుడూ లో ఓల్టేజీ సమస్యలతో రైతులు అల్లాడేవారు. పంపిణీ సంస్థలను దివాలా తీయించారు. వైఎస్సార్ సీఎం అయ్యాక విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించి వ్యవసాయాన్ని పండుగ చేశారు. మళ్లీ 2014లో బాబు సీఎం అయ్యాక తప్పుడు ఒప్పందాలతో దోపిడీకి తెరతీశారు. ఉమ్మడి ఏపీ విడిపోయేనాటికి రూ.29 వేల కోట్ల విద్యుత్తు బకాయిలు ఉండగా, 2019లో దిగిపోయే నాటికి అవి రూ.86,300 కోట్లకు చేర్చారు. సీఏజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) 24 శాతం పెరిగింది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక కరోనా సంక్షోభంలోనూ సీఏజీఆర్ రేషియో 7.2 శాతమే నమోదైంది’ అని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. వైఎస్ జగన్ 2019–24 మధ్య డిస్కంలకు రూ.47,800 కోట్లు చెల్లిస్తే, 2014–19 నడుమ టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించిందని, రైతులకు ఉచిత విద్యుత్తు బకాయిలు రూ.8,845 కోట్లు ఎగ్గొట్టిందని, వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. 2014 వరకు 11 పీపీఏలు (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు) మాత్రమే ఉంటే, 2014–19 మధ్య చంద్రబాబు 39 సోలార్ పీపీఏలు చేసుకున్నారని, అన్నీ 25 ఏళ్ల కాల పరిమితితో, మూడేళ్లకోసారి ధరలు పెంచేలా ఒప్పందం కుదుర్చుని ప్రజల నెత్తిన అప్పు మోపారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 2014 వరకు 91 విండ్ పీపీఏలు జరిగితే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 133 ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ యూనిట్ రూ.4.84 కనీస చార్జితో చేసుకున్నవే అని చెప్పారు. -
‘అప్పుడు రూ. 2.49.. ఇప్పుడు రూ. 4.60.. మరి ఇదేంటి బాబూ?’
సాక్షి,విశాఖ: వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు వార్తలు రాసిన ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. యాక్సిస్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకితో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు వార్తల రాశారు. సెకితో అత్యంత తక్కువ రేటుకు 2.49 రూపాయలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కూటమి ప్రభుత్వం యాక్సిస్ కంపెనీతో యూనిట్‌కు రూ.4.60 రూపాయలకు విద్యుత్ ఒప్పందం చేసుకుంది. రూ.2.49 రూపాయలకు ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందన్న మీరు రూ.4.60 ఎలా ఒప్పందం చేసుకున్నారు. రూ.2.11 రూపాయలకు ఎక్కువ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందాలపై ఎల్లో మీడియా ఎందుకు వార్తలు రాయడం లేదు. రూ.2.49 అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసిన వైఎస్ జగన్‌పై రాసిన తప్పుడు వార్తలకు ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలి.కూటమి ప్రభుత్వ కొనుగోలు వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.11 వేల కోట్ల రూపాయల గండి పడుతుంది. దీనిపై కూటమి పార్టీల నేతలు ఏం సమాధానం చెబుతారు. డబ్బులు ఎలా కొట్టి వేయాలనే దానిమీద ఈ ఏడాది పరిపాలన జరిగింది. యాక్సెస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో పెడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపు 30ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఏడువేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కారుచౌకగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.49కే అందించేలా ఒప్పందం చేసుకుంది. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాక్సెస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో యూనిట్‌కు ఏకంగా రూ.4.60లు కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. -
‘ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారు?’
పెద్దపల్లి: మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదనే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ ఎంపీ బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు రామగుండంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటని సంజయ్ ప్రశ్నించారు. ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారంటూ బండి సంజయ్ ఎదురు ప్రశ్నించారు.‘కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. మావోయిస్టులు దశాబ్దాలుగా అమాయకులను కాల్చి చంపిన సంగతి గుర్తు లేదా?, మావోయిస్టుల సానుభూతి పరులు సాధించిందేంటి?, మావోయిస్టులు ఎవరున్నా తుపాకీ వీడి లొంగిపావాల్సిందే.. జన జీవన స్రవంతిలో కలవాల్సిందే. పౌర హక్కుల సంఘం నేతలారా.. నక్సల్స్ నచ్చజెప్పండి’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.ఇక తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదన్నారు బండి సంజయ్. కేవలం సర్వే మాత్రమే జరిగిందన్నారు. ఇక్కడ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదన్నారు. ప్రతి ఇంటికి కచ్చితంగా వెళ్లి నిర్వహించేది కులగణన అని అన్నారు. జనగణన మాదిరిగానే మోదీ ప్రభుత్వం కులగణన చేస్తుందన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు బండి సంజయ్. -
‘60 అడుగుల గోడకే దిక్కులేదు.. అమరావతి కడతారా?’
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. అలాగే, చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనకాపల్లి జిల్లాలో సోమవారం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, పెట్ల ఉమా శంకర్ గణేష్, వరుదు కళ్యాణి, కంబాల జోగులు, అదీప్ రాజు, కన్నబాబు రాజు, మలసాల భరత్, శోభ హైమవతి, మాజీ ఎంపీ సత్యవతి, బొడ్డెడ ప్రసాద్, కేకే రాజు, పార్టీ నేతలు హాజరయ్యారు.👉ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైఎస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైఎస్సార్సీపీ ఓడిపోయింది. కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. 11 నెలల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం. 11 నెలల్లో లక్ష 50 వేల కోట్లు అప్పు చేశారు. ఇంత అప్పు చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు.అప్పు చేసిన లక్ష 50 వేల కోట్లు ఏం చేశారో చెప్పాలి.కూటమి పాలనలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. భర్త చనిపోతేనే కొత్త పెన్షన్ భార్యకు ఇవ్వాలని జీవో ఇచ్చారు. వైఎస్ జగన్ పాలనలో అర్హులకు పెన్షన్ లు అందజేశారు. మళ్ళీ పెళ్లి అన్నట్లు అమరావతికి పున: ప్రారంభం చేశారు. అమరావతికి లక్ష కోట్లు తెచ్చుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుకు లేదా?. విశాఖ నూతన రైల్వే జోన్ ఏమైంది?. రైల్వే భవనాలు ఎందుకు నిర్మించలేదు. మూడు టీవీలు మూడు పేపర్లతో పబ్బం గడుపుతున్నారు. 99 పైసలకు ఎకరా భూమి ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఏం చేయాలని చూస్తున్నారు. సింహాచలం కొండ మీద మరణాలు సంభవించాయి. నాయకుల ప్రచార పిచ్చితో ఏడుగురు భక్తులు మరణించారు. సింహాచలంలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే.👉మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. టీడీపీ ఓడిపోయిన తరువాత నాలుగేళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయటకు రాలేదు. ఆరు నెలలకే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా రోడ్డు మీదకు వస్తున్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 పాలన వస్తుంది. కార్యకర్తలకు అండగా వైఎస్ జగన్ ఉంటారు. 60 అడుగుల గోడ కట్టలేని వ్యక్తి అమరావతి కడతానని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన భక్తులు చనిపోతున్నారు. చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారు.👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ రామరాజ్య పాలన అందించారు. కూటమి రాక్షస పాలనను తలపిస్తుంది. ఏపీని అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌గా మార్చివేశారు. ప్రతీ కార్యకర్తకు వైఎస్ జగన్ అండగా ఉంటారు.👉కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. అమర్నాథ్కు అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం సంతోషం. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుంది. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి నాయకుడు కృషి చేయాలి.👉మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక తప్పుడు కేసులు పెడుతుంది. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కుంటున్నాము. ప్రభుత్వంపై వ్యతిరేకత మూడు నెలలకే బయట పడింది. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు..👉కన్నబాబు రాజు మాట్లాడుతూ.. కూటమిలో గొడవలు అప్పుడే మొదలయ్యాయి. 2026లో కూటమిలో చీలిక ఏర్పడుతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎన్నడూ అమలు చేయరు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది.👉బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ..‘పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు. వైఎస్ జగన్ నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేస్తారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుంది. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది అని అన్నారు. -
ఈనాడు పేపర్‌నే కూటమి సర్కార్ ఫాలో అయ్యేది: ఉండవల్లి
తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్ పోలీస్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్‌కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్‌లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు.. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్‌సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. -
సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి
గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్సార్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రొత్సహంతో వైఎస్సార్సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.