
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం.. రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజీ డీల్ కుదిరిందని అన్నారు.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జూన్ రెండో తేదీన లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. బీఆర్‌ఎస్ విలీనం అవుతుంది. రాష్ట్రంలో సీఎం మార్పు ఖాయం. రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజీ డీల్ కుదిరింది. కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేస్తానన్న హరీశ్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు.
