
తణుకు(ప గో జిల్లా): కూటమి ప్రభుత్వం రైతుల నడ్డివిరిచేస్తోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకు పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ... ‘ధాన్యం రైతులకు గొనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. పది లక్షల మెట్రిక్ తన్నులు ధాన్యం జిల్లాలో పండిస్తే ఆరు లక్షలు మాత్రమే కొంటామని చేతులెత్తేశారు.
రైతులనుండి ఆఖరు గింజవరకు ప్రభుత్వం కొనాల్సిందే. లేదంటే వైస్సార్సీపీ రైతులు పక్షాన పోరాటానికి దిగుతుంది. మంత్రి నాదెండ్ల ఎన్ని ప్రగల్బాలో పలికారు అంత చేస్తాం.. ఇంత చేస్తాం అన్నారు. ఇప్పుడు చుస్తే పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది.
కూటమి ప్రభుత్వంలో వ్యాపారాలన్నీ కళాహీనంగా ఉన్నాయ్. జగన్ గారి హయాంలో నెంబర్ వన్ స్థానంలో జీడీపీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. విద్యుత్ కొనుగోళ్లలో చంద్రబాబు వేల కోట్లు దోచుకొంటున్నారు. కుట్టు మిషన్ల లో 157 కోట్లు స్కామ్ కి తెరలేపారు బాబు. చంద్రబాబుది అంతా దాచుకో దోచుకో సిద్ధాంతం’ అని కారుమూరి విమర్శించారు.
