
తాడేపల్లి : అవినీతే సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా, వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కుట్టు మిషన్ల స్కాం చేస్తున్నారన్నారు.
‘అన్ని వర్గాల మహిళలను మోసం చేస్తున్నారు. అప్పుల్లోనే కాదు, అవినీతిలోనూ రికార్డు సృష్టించారు. బాబు ష్యూరిటీ, అవినీతి గ్యారెంటీగా మారిపోయింది. NDA అంటే నారా దోపిడీ అలియెన్సుగా మారిందిమహిళ మంత్రిగా ఉన్న శాఖలో అవినీతి జరగటం దారుణం. కొద్దిరోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపటం లేదు? , జగన్ హయాంలో ఇళ్ల పట్టాల దగ్గర్నుంచి అనేక పథకాలను మహిళల కోసం తెచ్చారు.
కాపు మహిళల కోసం జగన్ కాపునేస్తం తెచ్చారు. చంద్రబాబు కాపు మహిళలకు ఏం చేశారు? , ఇసుక, మట్టి, మద్యం, అమరావతి నిర్మాణాలు, ఉర్సా భూములు ఇలా ప్రతిదానిలోనూ స్కాం చేస్తున్నారు. కుట్టుమిషన్ల స్కీంని కమీషన్ల స్కాంగా మార్చారు. రూ.7,300 వేలు ఖర్చయ్యే దానికి రూ. 23 వేలు ఖర్చు ఎందుకు పెడుతున్నారు?, రూ.157 కోట్లు దోచుకునేందుకు ప్లాన్ చేశారు.
మొబలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చి అవినీతికి రెడీ చేశారు. L1 కి ఐదు శాతం వర్కు ఇచ్చి L2, L3 కాంట్రాక్టరుకి 95% వర్కు ఇవ్వటం వెనుకే కుట్ర ఉంది.దానిపై ఏసీబి కేసు నమోదు చేసి, విచారణ జరపాలి. వెంటనే టెండర్ ని రద్దు చేయాలి. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటుంది. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ వరుదు కళ్యాణి హెచ్చరించారు.
