
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ కూటమి నేతల చీప్ పాలిటిక్స్‌కు తెరతీశారు. నందిగామ గాంధీ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్‌లో నిర్ణయించారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల తీరుపై వైఎస్సార్‌సీపీ, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొండితోక జగన్మోహన్ రావు మీడియాత మాట్లాడుతూ.. గాంధీ బొమ్మ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ట్రాఫిక్ సమస్య సాకుగా చూపి విగ్రహాన్ని తొలగించేందుకు దురుద్ధేశంతో కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. గాంధీసెంటర్‌లో అస్తవ్యస్తంగా ఉన్న విగ్రహాలను వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశాం. విగ్రహాలను మార్చే సమయంలో కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాతే మార్పు చేశాం’’ అని ఆయన వివరించారు.
విగ్రహాలను మారుస్తున్న సమయంలో అప్పటి టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ విగ్రహం తొలగించాల్సిన అవసరం లేదని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పినా అక్రమంగా తీర్మానం చేసి విగ్రహాన్ని తొలగించేందుకు యత్నిస్తున్నారు
వైఎస్ జగన్ పాలనలో కూటమి అధికారంలోకి వచ్చిన పదినెలల కాలంలోనే ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనించాలి. ఈ క్షణం ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయం’’ అని మొండితోక జగన్మోహన్‌రావు చెప్పారు.