
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ కు పరిపాలను చేతకాకపోవడం వల్లే నిస్పృహతో రేవంత్ ఈ మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి డబ్బుకు కక్కిస్తానని చెప్పిన రేవంత్.. ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.
‘తెలంగాణకు పరపతి లేదని ఎలా మాట్లాడుతారు?, కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే తెలంగాణ లక్షన్నర కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుంది. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని రక్షణశాఖ సహాయం మంత్రిని కలిశాను. తెలంగాణలో మూడు సైనిక్ స్కూల్స్ తీసుకొచ్చి బాధ్యత నాదే.
రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరించి... భూమి ఇవ్వాలి.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ ఇస్తామన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. తెలంగాణలో 25 వేల మంది విద్యార్థులు సైనిక్ స్కూల్స్ కోసం పరీక్షలు రాస్తే... తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ లేకపోవడం దురదృష్టకరం’ అని రఘునందన్ రావు విమర్శించారు.