
విశాఖ: సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పెద్దలు.. వీధుల్లో చెత్తను కూడా తొలగించాలేకపోతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రస్తుతం కూటమి నేతలు హామీలు అమలు చేయలేక ఫస్ట్రేషన్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక చిన్నపాటి వర్షానికి ప్రపంచస్థాయి రాజధాని అని బాబు చెప్పుకుంటున్న అమరావతి మునిగిపోయిదంటూ చురకలంటించారు బొత్స.
‘వైఎస్సార్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు వేచి ఉండాలి.. కూటమి హనీమూన్ టైమ్ అయిపోయింది. ఇప్పటికే పోరాటాలు మొదలు పెట్టాము. నిర్దిష్టమైన ఉద్దేశాన్ని పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా చెప్పింది. అధికారులు మీద తప్పుడు కేసులు పెడతారా?, తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిదా? అని ప్రశ్నించారు.
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడితే పరిస్థితి ఏమిటి.. సీజ్ ద షిప్ ఏమైంది?, మాట చెప్పే ముందు మనం ఏమి చేస్తున్నామో ఆలోచించాలి. నిజం నిలకడ మీద తేలాలి తప్ప.. ఉద్దేశాలను ఆపాదించడం సరైన విధానం కాదు’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
అధికారుల అరెస్టులు ఏ మాత్రం సహించదగినవి కాదు, వాటిని ఖండిస్తున్నాం. నన్ను 60 రోజులు జైల్లో పెట్టారు, మేము అధికారంలోకి వచ్చిన తరువాత.. నన్ను జైల్లో పెట్టిన వారిని, ఒక్కరోజైనా జైలులో ఉంచాలనే ఆలోచన మంచిది కాదు. సరైన విధానంలో విచారణ జరగకుండా అరెస్టులు చేయడం తప్పు. కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదని బొత్స గుర్తు చేశారు.
వ్యక్తిగత సిబ్బందిని అరెస్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు మీకు పీఏలు లేరా?, వ్యవస్థలను తమ పని తాము చేసుకొనివ్వకపోవడం వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయి. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు వీధుల్లో చెత్తను కూడా తొలగించలేక పోతున్నారు. హామీలు అమలు చేయలేక, ఫ్రస్టేషన్‌లో వున్నారు. చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిపోయిందిని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.