
ఢిల్లీ: సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాటిని అమలు చేయలేక డకౌట్ అయ్యారని విమర్శించారు సీడబ్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబు తీరు చూస్తే వాగ్దానాలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు గిడుగు రుద్రరాజు.
చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తయ్యిందని చమత్కరించారు. అమరావతి పేరుతో మళ్లీ భూసేకరణ చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో భూమి ఇచ్చిన రైతులకే ప్రభుత్వం ఆర్థికంగా న్యాయం చేయలేదన్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ద్వజమెత్తారు. అమరావతికి 7 వేల ఎకరాలు సరిపోతుందని గిడుగు రుద్రరాజు స్సష్టం చేశారు.