
నంద్యాల: జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌లో భూమా కిశోర్‌రెడ్డిపై కేసు నమోదైంది. చికెన్ ధరలపై ప్రజల తరపున ప్రశ్నించినందుకు భూమా కిశోర్‌రెడ్డిపై అఖిల ప్రియ అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజల పక్షాన నిలబడి చికెన్ ధర ఎందుకు పెంచారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అంటూ కూటమి ప్రభుత్వంపై భూమా కిశోర్‌రెడ్డి మండిపడ్డారు.
అక్రమంగా కేసులు నమోదు చేయడం సరికాదన్న భూమా కిషోర్ రెడ్డి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చికెన్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేక పనులు చేస్తే.. ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. ఎన్ని అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కానీ భయపడేది లేదని భూమా కిషోర్‌రెడ్డి అన్నారు.