‘రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నాం’ | Raptadu MLA Topudurthi Prakash Reddy Said That They Are Boycotting The Ramagiri MPP Election, Details Inside | Sakshi
Sakshi News home page

‘రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నాం’

May 13 2025 4:02 PM | Updated on May 13 2025 4:34 PM

YSRCP Leader Topudurti Takes On AP Govt

శ్రీ సత్యసాయి జిల్లా: రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ కాట్ చేస్తున్నామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో భాగంగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారని,  మరో కార్యకర్తను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని తోపుదుర్తి పేర్కొన్నారు.  ఈరోజు(మంగళవారం) రామగిరి ఎంపీపి ఎన్నికపై తోపుదుర్తి మీడియాతో మాట్లాడారు. 

‘టీడీపీ కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీణించాయి. టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్ లోనే  హింసా రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మెజారిటీ ఉన్నా రామగిరి ఎంపీపీ ఎన్నిక లను బహిష్కరిస్తున్నాం’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement