
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. వల్లభనేని వంశీపై మరో పీటి వారెంట్ దాఖలైంది. నూజివీడు కోర్టులో పీటీ వారెంట్‌ను పోలీసులు దాఖలు చేశారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారంటూ పీటీ వారెంట్ దాఖలు చేశారు. వంశీతో పాటు మరో 10 మందిపై కేసు నమోదైంది
కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే అభియోగంపై అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ బెయిల్ పిటీషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన అనంతరం ప్రాసిక్యూషన్ తరపున జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించగా, వంశీ తరపున సత్య దేవిశ్రీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం 12వ అదనపు జిల్లా న్యాయస్థానం జడ్జి తీర్పును శుక్రవారం వెల్లడించనున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్ ఎ71 నిందితునిగా ఉన్నారు.