
ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ ఏర్పాటు
ఢిల్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీలో అంతర్గత పోరు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాజాగా ఆప్ లో ఎప్పట్నుంచో నివురుగప్పిన నిప్పులో ఉన్న వర్గ పోరు వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లో ఆప్ కు చెందిన కౌన్సిలర్లు తమ రాజీనామాలు ప్రకటించారు.
తమకు అసలు పనే లేదని, ఇంకెందుకు కౌన్సిల్లరుగా ఉండటం అంటూ వారు రాజీనామాలు చేశారు. ఆప్ కు చెందిన 15 మంది కౌన్సిలర్లు రాజీనామాలు చేయడమే కాకుండా కొత్తగా ఓ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి ఇంద్రప్రస్థ వికాస్ పేరును పెట్టినట్లు రాజీనామాకు సిద్ధమైన ఆప్ కౌన్సిలర్ హిమానీ జైన్ స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా మాకు పని లేదు. కార్పోరేషన్ లో జరగాల్సిన పని ఏదీ జరగలేవు. మేము అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏమీ చేయలేదు. కౌన్సిలర్లుగాఉండటం అనవసరం అని భావించే కొత్త పార్టీ పెట్టాం ’ అని ఆమె స్పష్టం చేశారు. తాము ఆప్ లో ఉన్నామనే సంగతినే అధ్యక్షుడు కేజ్రీవాల్ మరిచిపోయినట్లున్నారని మరో కౌన్సిలర్ ముఖేస్ గోయల్ వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi | On her resignation from the AAP, party councillor Himani Jain says, "We have formed a new party, Indraprastha Vikas Party. We have resigned from AAP. In the last 2.5 years, no work was done in the corporation which should have been done. We were in power, yet we… pic.twitter.com/c1thjuALZU
— ANI (@ANI) May 17, 2025