
దద్దమ్మగా ఉన్న నిన్ను తంతే బీజేపీలోకి వెళ్లావు..
ఇప్పుడు మళ్లీ బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్టున్నావు
అధ్యక్ష పదవి రాలేదన్న ఆక్రోశాన్ని రేవంత్‌పై వెళ్లగక్కుతున్నావు
ఒక్క విజిల్ వేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారో మాకే తెలియదు
బీజేపీ ఎంపీ ఈటలపై పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను బీసీ బిడ్డగా ఎవరూ ఆమోదించడం లేదని, ఆయన అసలు ము దిరాజ్ కులానికి చెందిన వారో, లేక రెడ్డి కులానికి చెందిన వారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అనుభవమున్న నాయకుడు రాజేందర్‌కు ఇంత దిగజారుడు తనం ఎందుకో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మాట్లాడడం తగదని, ఇక ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరించారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ నేతలు ఈర్ల కొమురయ్య, సలీం, గజ్జి భాస్కర్, ఇందిరా శోభన్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ.. ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం లేదనే నిస్పృహలో ఉన్నారని, అందుకే కిషన్‌రెడ్డిపై ఉన్న ఆక్రోశాన్ని రేవంత్‌పై వెళ్లగక్కుతున్నారని చెప్పారు.
కేసీఆర్ పాలన లోని అలీబాబా 40 దొంగల్లో ఈటల కూడా ఒక సభ్యుడని, రాష్ట్రం అప్పుల పా లు కావడానికి కేసీఆర్‌తో పాటు ఈటల నిర్వాకం కూడా కారణమని పేర్కొన్నా రు. దద్దమ్మగా ఉన్న ఈటలను అప్పుడు బీఆర్‌ఎస్ నుంచి తంతే వెళ్లి బీజేపీలో ప డ్డారని, మళ్లీ ఇప్పుడు అక్కడ ఇమడలేక కేసీఆర్‌వైపు చూస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. సీఎంను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, తాము ఒక్క విజిలేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారో తెలియదని అ న్నారు. కేటీఆర్ బాణిలోనే రాజేందర్ మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోంది కిషన్‌రెడ్డి, రాజేందర్ గ్యాంగేనని మండిపడ్డారు.