అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా | High Drama At Anantapur SP Office | Sakshi
Sakshi News home page

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా

May 6 2025 12:39 PM | Updated on May 6 2025 2:42 PM

High Drama At Anantapur SP Office

సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లేందుకు అనేక అడ్డంకులను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన సందర్భంగా సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీలను ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది.

అయితే, హైకోర్టు ఉత్తర్వుల కాపీలను అనంతపురం ఎస్పీ జగదీష్‌కు అందజేసేందుకు మూడు రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో నేరుగా అనంతపురం ఎస్పీ కార్యాలయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. విషయం తెలుసుకున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. 

అక్కడే ఉన్న ఏఎస్పీతో మాట్లాడి.. అనంతరం ఎస్పీ జగదీష్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, పెద్దారెడ్డి. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉందని.. ఆ తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చి.. తగిన భద్రత కల్పిస్తామని ఎస్పీ జగదీష్ హామీ ఇచ్చినట్లు వారు మీడియాకు వివరించారు.

అనంతపురం ఎస్పీ కార్యాలయం దగ్గర హైడ్రామా

Advertisement
 
Advertisement
Advertisement