DMK
-
CM విజయ్ VS కోలీవుడ్
-
విజయ్‌కు కొత్త టెన్షన్!
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకే విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో, విజయ్ మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు చేరనున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు సమాచారం.కాగా, తమిళనాడు ప్రభుత్వానికి అటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అన్నాడీఎంకే రెబల్స్‌కు మంత్రి పదవులు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరికను సీపీఎం వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని సీఎం విజయ్‌కు అల్టిమేటం విధించినట్టు సమాచారం. దీంతో, సీఎం విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్‌కు సీఎం విజయ్ నివాళులు అర్పించం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్‌ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్‌కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్‌గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందికాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్‌కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్‌తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది.డిఫెన్స్‌లో టీవీకే.. ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే కాదని, శ్రీలంకలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, సీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
-
విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
సాక్షి, చెన్నై: అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకుండానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే (TVK) కూటమి ప్రభుత్వంపై సీనియర్ డీఎంకే (DMK) నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలబడదని, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే మళ్లీ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది."మా తలైవరే తదుపరి ముఖ్యమంత్రి. మరో నాలుగు లేదా ఆరు నెలల్లో మా నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం గానీ, టీవీకే పార్టీ గానీ, లేదా ఆధవ్ అర్జున గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. టీవీకే, డీఎంకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ... అధికార తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, విల్లివాక్కం నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు. ఆధవ్ అర్జున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరుచెందూర్‌లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.ఈ ప్రభుత్వం మహా అయితే మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందంటూ జోస్యం చెప్పారు. గత ఏప్రిల్ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనవిజయం సాధించకముందు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.అంతేకాదు ‘‘నీకు నిజంగా దమ్ముంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్, నేను కూడా చేస్తాను. మనమిద్దరం తిరుచెందూర్‌లో తలపడదాం. ఇది మా సొంత గడ్డ, ఇక్కడ మేము ఎవరినైనా ఓడిస్తాం" అని రాధాకృష్ణన్ అర్జునకు సవాల్ విసిరారు.కాగా తిరుచెందూర్ నియోజకవర్గం గత 25 ఏళ్లుగా రాధాకృష్ణన్‌కు కంచుకోటగా ఉంది. ఆయన మొదట 2001లో డీఎంకే బద్ధశత్రువైన ఏఐఏడీఎంకే (AIADMK) తరపున ఇక్కడి నుండి గెలిచారు. ఆ తర్వాత 2009లో డీఎంకేలో చేరి, అప్పటి నుండి ఈ స్థానాన్ని తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలలోనే విజయ్ సాధించిన విజయం అతిపెద్ద సంచలనంగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే 108 స్థానాలను కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీకి కేవలం 10 స్థానాల దూరంలో నిలిచినప్పటికీ, గత 62 ఏళ్లుగా తమిళనాడును మారుమార్చిపాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు.తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో మాజీ డీఎంకే నాయకుడు, ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీలో ఉన్న వి.ఎస్. బాబు చేతిలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వారం రోజుల పాటు జరిగిన తీవ్ర రాజకీయ డ్రామా అనంతరం కాంగ్రెస్, రెండు లెఫ్ట్ పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతుతో టీవీకే మెజారిటీ మార్కును దాటింది. దీంతో ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో కూడా 144-22 ఓట్ల తేడాతో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి అగ్రపీఠాన్ని అధిరోహించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పాలన, నియామకాలు, పరిపాలనాపరమైన నిర్ణయాలపై డీఎంకే నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. -
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ అన్నామలై బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీ నేత పీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి.అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలు దేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పీఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయాల సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.ఈ మేరకు పీఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజారిటీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమన్నది స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆయన్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకు ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం. -
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో వైఫల్యం ఎందుకో? నిష్పక్షపాతంగా నిజాలు చెప్పండి అని క్షేత్ర పరిశోధన బృందానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదేశించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 సీట్లను మాత్రమే గెలుచుకుని ఊహించని పరాజయాన్ని చవిచూసింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానాలకు పరిమితమయ్యారు. చివరికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా తాను పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ భారీ షాక్ తర్వాత, ఓటమికి గల అసలు కారణాలను విశ్లేషించడానికి డీఎంకే నాయకత్వం రంగంలోకి దిగింది.క్షేత్రస్థాయి పరిశోధన బృందంతో స్టాలిన్ భేటీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్ నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ 36 మంది సభ్యులతో కూడిన ఒక క్షేత్ర పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలో శనివారం ఈ బృందంతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కనిమొళి, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.నిజాలు మాత్రమే చెప్పండి ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యులు లేదా స్థానిక నిర్వాహకులు ఏం చెబుతున్నారనేది పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకుని తనకు నేరుగా చెపాలని కోరారు. నివేదికలో తనను (డీఎంకే అధ్యక్షుడు) విమర్శించినా తప్పుగా అనుకోను. ఎవరినీ కాపాడటానికి ప్రయత్నించవద్దు అని సూచించారు. అలాగే ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో నివేదికలు ఇవ్వద్దు అని సూచించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, పరిశీలకులు , కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి జూన్ 5వ తేదీలోగా తుది నివేదికను సమర్పించాలని స్టాలిన్ కోరారు. -
ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: న్నికల తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల గురించి గురువారం స్టాలిన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగింది ఒక రకమైన కొత్త వింత మాయాజాల సునామీ అని వ్యాఖ్యలు చేశారు. సునామీ అంటే అది అద్భుతమో లేక సాహసమో కాదు.. అది వినాశనానికి సంకేతంగా అభివర్ణించారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన సునామీ ఇది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం కూడా కేవలం మిత్రపక్షాల దయతో నడుస్తున్నట్టు గుర్తు చేశారు.డీఎంకేలో భారీ మార్పులుడీఎంకేలో ప్రక్షాళన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుతో పాటుగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఓటమికి కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. పార్టీ కార్యకర్తలు తమ మనసులోని బాధను, ఓటమికి కారణాలను నేరుగా అధిష్టానానికి తెలియజేయడానికి శుక్రవారం నుంచి ఒక ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. ఎవరైనా పార్టీ కోసం పని చేయలేమని అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని, గ్రూపు రాజకీయాలను సహించేది లేదని జిల్లా కార్యదర్శులకు స్టాలిన్ ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాబోయే రోజుల్లో డీఎంకే వ్యవస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ఓటమి తాత్కాలికం.. మనం మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ఎగురుతాం అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడును రక్షించే బలం, పోరాట స్ఫూర్తి అన్నది ఒక్క డీఎంకేకు మాత్రమే ఉందని వ్యాఖ్యలు చేశారు. ఉదయ సూర్యుడికి అస్తమయం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఎ. రాజ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ముఖ్య నేతలు ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్, కోశాధికారి టీఆర్‌బాలుతో పాటూ అన్ని జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.ఓటమికి నేనే బాధ్యుడిని..పార్టీ ఓటమిపై స్టాలిన్ తన పరిణతిని చాటుకున్నారు. ఒక నాయకుడిగా ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, అన్నాదురై, కరుణానిధి నేర్పిన పాఠాలు. ఓటమిపై చర్చ జరగాలి కానీ, అది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేలా ఉండకూడదని హితవు పలికారు. -
పుష్ప పాలిటిక్స్..! పుష్ప సినిమాను గుర్తుచేసిన డీఎంకే నేత ఉదయనిధి
-
అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
DMK వాక్అవుట్ .. బలపరీక్షలో 144 MLAల సపోర్ట్
-
అరవ చదరంగం అదుర్స్
-
వీసీకే అధినేతను సీఎంను చేయడానికి సంప్రదింపులు జరిగాయా?
చెన్నై: కులం-ముఖ్యమంత్రి పదవి గురించి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తొల్ తిరుమావళవన్ ఇటీవల చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వీసీకే మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి ఏర్పాటు జరిగితే తనను ముఖ్యమంత్రిని చేస్తామంటూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సంప్రదించాయంటూ వచ్చిన వార్తలను తిరుమావళవన్ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని తిరుమావళవన్ మీడియాను కోరారు. “మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని అంటున్నారు” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారని తిరుమావళవన్ తెలిపారు. దానికి తాను స్పందిస్తూ.. “అలాంటి ప్రయత్నం జరిగిందని నాకు కూడా సమాచారం వచ్చింది” అని అన్నారు.ఎవరూ నన్ను సంప్రదించలేదు తనకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాల గురించి మాట్లాడారని తెలిపారు. అంతేగానీ, డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి అధికారికంగా ఎవరూ తనను ముఖ్యమంత్రి విషయంపై సంప్రదించలేదని, తానూ ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. ఆ ప్రశ్నకు తాను వివరణ ఇచ్చానని.. కానీ, దానికి వేరే అర్థం వచ్చేలా శీర్షికలు పెట్టి వార్తలు ప్రచారం చేసి సంచలనం సృష్టించడం మీడియాకు సరికాదని తెలిపారు. నిన్న, ఇవాళ దీని గురించి మీడియాలో నిర్ధారణ కాని వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులో దళిత సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని చేసేందుకు తమిళ సమాజం ఇంకా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన చేదు నిజమని చెప్పారు.భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో దళితులు ముఖ్యమంత్రులుగా పాలనా పీఠంపై నిలిచిన చరిత్ర ఉందని తెలిపారు. కానీ, తమిళనాడులో ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అది కలగానే మిగులుతుందని తనకు తెలుసని చెప్పారు. అయినా, నేటి రాజకీయ పరిస్థితుల్లో అలాంటి చర్చ జరిగిందని చెప్పారు. దాన్ని వక్రీకరించి వేరే అర్థం వచ్చే ఉద్దేశంతో కొన్ని మాధ్యమాలు వార్తలు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తిరుమావళవన్ చెప్పారు. కాగా, టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఉంది. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు తలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. -
నేను విజయ్ ఒకటే కాలేజ్ అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
-
ఉదయనిధి స్టాలిన్ స్పీచ్ కు సీఎం విజయ్ రియాక్షన్
-
TVK MLA జేబులో జయలలిత ఫోటో విజయ్ డిఫరెంట్
-
ఒకప్పుడు ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు మారిపోయిన సీన్
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరం నాయకుల యుగం ప్రారంభమైంది. సినీ నటుడు విజయ్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మద్దతుతో సీఎం కుర్చీని అధిరోహించారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించనున్నారు. తొలుత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెపాక్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయిదేళ్ళ క్రితం వరకూ చూస్తే సీఎంగా స్టాలిన్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా పళని స్వామి వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆ చాన్స్ పళనిస్వామికి లేకుండా పోయింది.ఎన్నికల్లో ఓడిపోయిన స్టాలిన్ స్థానంలో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 74 సీట్లు గెలుచుకున్న డీఎంకే కూటమికి ఆయన నాయకత్వం వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు అదనపు బలం. విజయ్ 52 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. ఉదయనిధి 49 ఏళ్ల వయసులోనే ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇద్దరూ యువకులే కావడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రజలు చూడబోతున్నారు. కాగా ఉదయనిధి పలు సినిమాలకు నిర్మాతగా, హీరోగా సినీ రంగంలో గుర్తింపు పొందారు. 2008లో ఆయన నిర్మించిన 'కురువి' చిత్రంలో విజయ్ హీరోగా నటించారు. ఆ చిత్రంలో త్రిష కథానాయిక. ఆ రకంగా విజయ్, ఉదయనిధి మధ్య రెండు దశాబ్దాల క్రితమే స్నేహం ఉంది. అయితే ఇప్పుడు ఆ స్నేహం రాజకీయ వేదికపై ప్రత్యర్థిత్వంగా మారింది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. విజయ్ ప్రమాణం చేస్తున్నప్పుడు ఉదయనిధి ఆయన వైపు చూడలేదు. కానీ ఉదయనిధి ప్రమాణం చేస్తుండగా విజయ్ మాత్రం ఆయనను చూసి ఓ చిరునవ్వు నవ్వారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్‌కు రాజకీయ అనుభవం లేకపోవడం ఒక సవాల్‌గా మారవచ్చు. కానీ ఉదయనిధి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రతిపక్షాన్ని బలంగా నడిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపై అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి మధ్య ఢీ తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
విజయ్ - స్టాలిన్ అపూర్వ కలయిక
-
స్టాలిన్ ఇంటికి చేరుకున్న సీఎం విజయ్
-
స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్
-
విజయ్‌కు స్టాలిన్ తొలి కౌంటర్
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు విజయ్ను మాజీ సీఎం స్టాలిన్ అభినందించిన వెంటనే కౌంటర్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ తన ప్రసంగంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ అప్పులపై విజయ్ శ్వేతపత్రం విడుదల చేస్తామని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో తమిళనాడు అప్పులపై స్టాలిన్ స్పందిస్తూ..ప్రభుత్వానికి రూ.10 లక్షల కోట్ల అప్పుంది, ఖజానా ఖాళీగా ఉందని చెప్పడాన్ని తప్పుపట్టారు. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయన్నారు. కోవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొని, నిధులకు సహకరించని బీజేపీని తట్టుకుని దీటుగా నిలబడ్డామని బదులిచ్చారు. డబ్బు పుష్కలంగా ఉందని, ప్రస్తుతం కావాల్సింది సంక్షేమ పథకాల అమలు చేయడమేనని చెప్పుకొచ్చారు. ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం అవసరం అంటూ కౌంటరిచ్చారు.ఇదిలా ఉండగా.. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలను తెరపైకి తెస్తోంది. అప్పు రూ.10 లక్షల కోట్లకు చేరుకోవడం వల్ల కొత్త ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణను పాటించడం పెద్ద సవాలు అవుతుంది. ఇది డీఎంకే చేసిన ఖర్చులపై ప్రజా చర్చను మరింత పెంచుతుంది. మరోవైపు.. డీఎంకే పాలనలో అమలు చేసిన పథకాల వల్ల అప్పు పెరిగిందని స్టాలిన్ చెబుతున్నారు. ప్రజలకు లభించిన ప్రయోజనాలను కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.విజయ్ తొలి పాలనలో ప్రాధాన్యతలుఉచిత విద్యుత్: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇది మధ్యతరగతి మరియు రైతులకు ఉపశమనం.మహిళల భద్రత: ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఇది కొత్త ప్రభుత్వానికి ప్రజా విశ్వాసాన్ని పెంచే అంశం.డ్రగ్ నియంత్రణ: యువతలో మత్తు పదార్థాల సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యేక చర్యలు.విద్య, ఆరోగ్యం, నీరు: ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రజల అంచనాలను తీర్చే ప్రయత్నం.రైతులు, మత్స్యకారులు: సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ వర్గాలను ఆకర్షించడం. -
బీజేపీకి సినిమా చూపెట్టిన సీఎం విజయ్
-
సీఎంగా విజయ్.. తొలి రోజే సంచలన ప్రకటన
Tamil Nadu CM Oath Live.. విజయ్ ప్రమాణ స్వీకారం అప్డేట్స్.. ఇక అన్నీ మారిపోతాయి: మంత్రి కీర్తనకొత్త మంత్రి, టీవీకే నాయకురాలు ఎస్.కీర్తన (29) కీలక వ్యాఖ్యలువిజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుందివిజయ్ టీవీకే మార్పు తీసుకొచ్చిందిముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేరురాష్ట్రంలో ఇక అన్నీ మారిపోతాయిప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్నిస్తారునాకు మంత్రి పదవి రావడం పార్టీ విధానాన్ని చూపుతోందిమధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానుఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందానునాలాంటివాళ్లు క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా?విజయ్ సంచలన నిర్ణయాలు.. ఉచిత కరెంట్‌పై సీఎం విజయ్ తొలి సంతకం.మహిళల భద్రతపై రెండో సంతకం.తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగం.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం. సీఎం విజయ్ కామెంట్స్..నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే.మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను.నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు.రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు.నేను మీకు హామీ ఇస్తున్నాను.అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను.ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను.నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను.తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది.నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్ సెంటర్ ఉంటుంది.సాధ్యమైనది మాత్రమే చేస్తాను.చిన్నారులకు మామగా అండగా ఉంటా.ఇది అస్థిర ప్రభుత్వం కాదు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తా.వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు.. మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు.నన్ను అవమానించేవారున్నారు.. ఇబ్బంది పెట్టేవారు వస్తారు.వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే.. విజయ్‌కు ప్రధాని విషెస్.. విజయ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం.సీఎం విజయ్‌కు ప్రధాని అభినందనలుసీఎంగా ప్రమాణం చేసిన విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: మోదీ కమల్ హాసన్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఎంపీ కమల్ హాసన్ శుభాకాంక్షలు.సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు.విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం వెలుగొందాలని ఎక్స్‌లో పోస్ట్.విజయ్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయ్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..రాహుల్ గాంధీ సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.తమిళనాడు ముఖ్యమంత్రిగా, మీరు పేదలకు సంక్షేమం, అందరికీ న్యాయం చేస్తారని, మీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ఎత్తుకు తీసుకెళ్తారని నేను బలంగా నమ్ముతున్నాను.హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. 👉తమిళనాట విజయ్ శకం ప్రారంభంతమిళనాడు సీఎంగా విజయ్మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్విజయ్ కేబినెట్లో ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్‌రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకట్రామన్..ఆర్ నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభుత్వ, కీర్తన👉తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం#WATCH | Chennai: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes oath as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/8yGuYEAkfj— ANI (@ANI) May 10, 2026👉విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఆర్లేకర్👉విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా దద్దిరిల్లిన స్టేడియం #WATCH | Chennai | Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay and Lok Sabha LoP and Congress MP Rahul Gandhi at the Jawaharlal Nehru Stadium in Chennai.Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/9J8R7Zrq3H— ANI (@ANI) May 10, 2026 సీఎం ప్రమాణ స్వీకారంలో బీజేపీ నేతలు..విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ నేతలుకార్యక్రమానికి హాజరైన బీజేపీ చీఫ్ నాగేంద్రన్, తమిళిసై, అన్నామలై#WATCH | Tamil Nadu BJP president Nainar Nagenthran, and BJP leader K Annamalai at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK chief Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/HuzvvWCesA— ANI (@ANI) May 10, 2026👉నెహ్రు స్టేడియం చేరుకున్న గవర్నర్👉కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం.. నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్ ఆర్లేకర్నెహ్రు స్టేడియంకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీరాహుల్కు కాంగ్రెస్ శ్రేణుల స్వాగతం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/xgXEyzAnNs— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai | Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar leaves from Lok Bhavan. He will administer the oath of office to TVK Chief C Joseph Vijay as the Tamil Nadu Chief Minister shortly pic.twitter.com/Y9wpi6ol9r— ANI (@ANI) May 10, 2026నెహ్రు స్టేడియం చేరుకున్న త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన త్రిష. స్టేడియం వద్ద త్రిషకు స్వాగతం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/oCevs6N1Wx— ANI (@ANI) May 10, 2026విజయ్ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేవిజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్‌కు చోటు.మెలూరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్అయితే, నేడు చెన్నైలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు. తొమ్మిది మంత్రులు వీరే.. నేడు సీఎం సహా తొమ్మది మంది మంత్రుల ప్రమాణ స్వీకారంమంత్రి వర్గంలో కీర్తనకు చోటు. మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కురాలిగా కీర్తన రికార్డు C. Joseph Vijay, the Chief Minister-designate, has recommended a list of nine persons to be appointed as Ministers for the State of Tamil Nadu.1. N. Anand2. Aadhav Arjuna3. Dr. K.G. Arunraj,4. K.A. Sengottaiyan5. P. Venkataramanan6. R. Nirmalkumar7. Rajmohan8. Dr TK.… pic.twitter.com/0tU5Gox6zM— ANI (@ANI) May 10, 2026 స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్నెహ్రుకు స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్.విజయ్‌కి అధికారులు స్వాగతంకాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం. స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలి వచ్చిన అభిమానులు. #WATCH | TVK Chief C Joseph Vijay arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where he will take oath as the Chief Minister of Tamil Nadu shortly. (Source: TN DIPR) pic.twitter.com/4UvuSfAGxj— ANI (@ANI) May 10, 2026చెన్నై చేరుకున్న రాహుల్‌విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ.తమిళనాడు చేరుకున్న రాహుల్కాంగ్రెస్ శ్రేణుల ఆహ్వానం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives in Chennai to attend the swearing-in ceremony of TVK Chief Vijay as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/XOgPYpftwI— ANI (@ANI) May 10, 2026స్టేడియంకు బయలుదేరిన త్రిష..చెన్నైలోని తన నివాసం నుండి బయలుదేరిన నటి త్రిష కృష్ణన్విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న త్రిష.ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/vUbZ5TpLE9— ANI (@ANI) May 10, 2026 #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/M7XFTKyKSt— ANI (@ANI) May 10, 2026 విజయ్ కుటుంబ సభ్యుల ఆనందం..విజయ్ సోదరి వ్యాఖ్యలు..విజయ్ ముఖ్యమంత్రి కావడం ఎంతో ఆనందంగా ఉంది.దేవుడి దయ, అభిమానులు, ప్రజల మద్దతే విజయ్ విజయానికి కారణం. మదర్స్ డే రోజున ఇది మాకు ఎంతో ఆనందమని విజయ్ తల్లి శోభ కామెంట్స్.. #WATCH | Chennai, Tamil Nadu: Shoba Chandrasekhar, mother of TVK Chief and CM-designate, Vijay, says, "I am so happy. It is Mother's Day today, I am very happy..." pic.twitter.com/Ti4DM4iCVl— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai, Tamil Nadu: Cousin of TVK Chief and CM-designate, Vijay, says, "We are very proud. All credits to God and the people of Tamil Nadu." pic.twitter.com/oDu8OiYlqP— ANI (@ANI) May 10, 2026 స్టేడియంకు బయలుదేరిన విజయ్..నెహ్రు స్టేడియంకు బయలుదేరిన విజయ్..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..భారీ కాన్వాయ్, అభిమానులతో స్టేడియంకు బయలుదేరిన దళపతి.. ఆనందంలో విజయ్ పేరెంట్స్. #WATCH | Tamil Nadu: TVK Chief and CM-designate Vijay leaves from his residence. He will take oath as the Chief Minister of Tamil Nadu today at Jawaharlal Nehru Stadium in Chennai.(Source: TN DIPR) pic.twitter.com/Cydz5VkjfC— ANI (@ANI) May 10, 2026 కీర్తన సరికొత్త రికార్డు..టీవీకే ఎమ్మెల్యే కీర్తన(29) మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలుశివకాశి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కీర్తనముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం #WATCH | Chennai, Tamil Nadu | S Keerthana, TVK MLA-elect from the Sivakasi constituency, says, "Today is a big day for Tamil Nadu and the public of the state...This is the moment everybody has been waiting for..." https://t.co/Ndr3C8C0VK pic.twitter.com/wbw05LZjQs— ANI (@ANI) May 10, 2026పదవుల జాబితా సిద్దం!ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్దం.ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్దే పెట్టుకోనున్న విజయ్. టీవీకే పార్టీ కన్వీనర్ సెంగొట్టయన్‌కు ప్రజా పనులు.పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్‌కు మున్సిపల్ శాఖ.పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ.పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్‌కు విద్యుత్ శాఖ.అరుణ్ రాజ్‌కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ.రాజమోహన్‌కు ఆది ద్రావిడ సంక్షేమం.ముస్తఫాకు మైనార్టీ సంక్షేమ శాఖ. తమిళనాడు బయలుదేరిన రాహుల్ గాంధీ.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీఢిల్లీకి తమిళనాడుకు బయలుదేరిన రాహుల్ టీవీకేకు కాంగ్రెస్ మద్దుతు. #WATCH | Delhi | Leader of Opposition (LoP) Rahul Gandhi arrives at IGI Airport as he heads to Tamil Nadu He will be attending the swearing-in ceremony of Tamil Nadu CM-designate Vijay in Chennai, today. pic.twitter.com/Z5yNaTr0vw— ANI (@ANI) May 10, 2026విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..నేడు సీఎంగా విజయ్ ప్రమాణం.. విజయ్‌తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణంప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులకు ఆహ్వానం.చెన్నైలో ఉన్న అని దేశాల రాయబారులకు ఆహ్వానం.చెన్నైలో ప్రమాణ స్వీకారం కోసం 20 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం.ప్రమాణ స్వీకారోత్సవానికి కోలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం. అసెంబ్లీలో బల నిరూపణలకు టీవీకే మూడు రోజులు సమయం ఇచ్చిన గవర్నర్ ఆర్లేకర్. ఈనెల 13న బలనిరూపణకు అవకాశం. నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..నేడు తమిళనాడు నూతన సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారంచెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా గొప్ప సంబరంకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ దాటిన విజయ్రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో టీవీకే నేతలు, విజయ్ అభిమానులుప్రమాణ స్వీకారానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశంహాజరు కానున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.నాలుగు పార్టీల మద్దతు.. ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంనాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖకాసేపటికే ఐఎంయూఎల్ కూడా విజయ్‌కు మద్దతు ప్రకటనకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐఎంయూఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది.ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు.ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్, తమిళనాడు సీఎంగా విజయ్ను నియమిస్తూ లేఖ విడుదల. -
కొత్త సర్కార్‌కు రిక్వెస్ట్.. ఎంకే స్టాలిన్ కీలక పోస్ట్
చెన్నై: కూటమి నుండి వైదొలిగిన కాంగ్రెస్‌పై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. మరో వైపు, రాబోయే కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ.. డీఎంకే పథకాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజల కోసం డీఎంకే ఎంతో చేసిందన్నారు. విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ తమ కూటమి నుంచి బయటకు రావడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కూటమి తరఫున పోటీ చేసి గెలిచినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా డీఎంకే ప్రధాన కార్యాలయానికి రాలేదని.. ఆ రోజే డీఎంకేతో సంబంధాలను తెంచుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను అవకాశవాదిగా అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు మద్దతు ఇచ్చినప్పటికీ, వీసీకేతో పాటు సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీలు కూటమిలోనే కొనసాగుతాయని ఆయన అన్నారు.కమ్యూనిస్ట్ నేతలు కామ్రేడ్ షణ్ముగం, కామ్రేడ్ వీరపాండియన్లతో పాటు విడుదల చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ నాయకుడు తిరుమావళవన్.. తమిళనాడు హక్కులు, ప్రజల సంక్షేమం కోసం డీఎంకేతో చేతులు కలిపి పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తద్వారా వారు తమ మధ్య ఉన్న స్నేహభావాన్ని చాటుకోవడమే కాకుండా, బలమైన సిద్ధాంతాలు కలిగిన డీఎంకేపై తమకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నారు," అని ఆయన కొనియాడారు."డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలను సాధించలేకపోయినప్పటికీ.. తమకు భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి ఆటంకాలు సృష్టించబోమని.. డీఎంకే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తుందని తాను ఇప్పటికే ప్రకటించానని స్టాలిన్ గుర్తు చేశారు. తమ మిత్రపక్షాలు తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా డీఎంకే.. గౌరవిస్తుందని, మళ్లీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేకుండా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా సమన్వయంతో వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. என் உயிரோடு கலந்திருக்கும் தலைவர் கலைஞரின் அன்பு உடன்பிறப்புகளுக்கும், என் உயிர்நிகர் தமிழ் மக்களுக்கும் என் அன்பு வணக்கம்.தேர்தல் முடிவுகள் அறிவிக்கப்பட்ட பின்பு, நடக்கும் நிகழ்வுகளை நீங்கள் பார்க்கிறீர்கள். எந்தக் கட்சிக்கும் ஆட்சி அமைக்கும் பெரும்பான்மை கிடைக்காத வகையில்…— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 9, 2026 -
తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. డీఎంకే-అన్నాడీఎంకే ప్రత్యామ్నాయాలపై తీవ్ర స్ధాయిలో చర్చలు జరుపుతున్నాయి. డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్ తెరపైకి రాగా.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, డీఎంకే ప్రతిపాదను అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.సాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వీకేసీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీవీకేకు వీసీకే మద్దతుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక స్థానంలో దూరంలో టీవీకే ఉండగా.. వీసీకే మద్దతు కోసం విజయ్ ఎదురుచూస్తున్నారు. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పళనిస్వామి నివాసానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఆరుగురు ముఖ్య నేతలతో పళనిస్వామి కీలక చర్చలు జరుపుతున్నారు. -
కాంగ్రెస్ ఒక్కటే సరిపోదు.. డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు పొలిటికల్ యూటర్న్లు పీక్‌స్టేజ్‌కు చేరుకున్న వేళ డీఎంకే నాయకుడు ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోవడం లేదన్నారు. డీఎంకే ఒంటరిగానే ఉందన్నారు. విజయ్.. తగిన బలంతో వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ను సంప్రదించాలన్నారు.డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలాంగోవన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీవీకే అధినేత విజయ్ ముందుగా ఇతర రాజకీయ పార్టీలతో ప్రయత్నించి ఆ తర్వాతే గవర్నర్‌ను సంప్రదించాలి. ఒకే అతిపెద్ద పార్టీగా టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో విజయ్ ఒంటరిగా వెళ్ళి ఉంటే, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఉండేవారు. కానీ వారు కాంగ్రెస్‌తో కలిసి వెళ్ళి, మెజారిటీని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తగిన బలం లేకుంటే గవర్నర్ ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. తమిళనాడులో డీఎంకే ఒంటరిగానే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు ఆలోచన మాకు లేదు. ఏఎంఎంకే ఎమ్మెల్యే టీవీకేకు మద్దతు ఇవ్వనప్పుడు ఆయన మద్దతు లేఖ ఎందుకు ఇవ్వాలి? ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫోర్జరీ కేసులో పోలీసులు ఏం తేల్చారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ఏఎంఎంకే సపోర్టు లెటర్ లేకుండా ఎందుకు డ్రామా చేస్తోంది. అన్నాడీఎంకే ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచింది. టీటీవీ దినకర్ అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్ చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా అన్నాడీఎంకేను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిందని మండిపడ్డారు. #WATCH | Chennai | DMK leader TKS Elangovan says, "He (TVK chief Vijay) should first try with other political parties and then approach the Governor. If AMMK MLAs are not supporting TVK, then why should he give a letter of support? Let us see what happens when the police… pic.twitter.com/IPIfw54koq— ANI (@ANI) May 9, 2026అంతకుముందు కూడా ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేకు బీజేపీ ఎలాంటి సూచనలు చేసిందో తనకు తెలియదన్నారు. ఒకవేళ అన్నాడీంఎకే గనక టీవీకేకు మద్దతు ఇవ్వకపోతే.. ఏ పార్టీకీ సరైన మద్దతు రాకపోవడంతో హంగ్ వస్తే.. మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకే ఓటమిపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో పొరపాటు జరిగిందని.. అదేమిటో తాము పరిశీలిస్తున్నామన్నారు. కేవలం అధికారంలోకి రావడం మాత్రమే డీఎంకే అజెండా కాదని, కొన్ని దశాబ్దాలుగా తమ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రమే సరిపోదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని, అందువల్ల ఆ పార్టీ మద్దతుతో సర్కార్ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. -
రాష్ట్రాలకు గవర్నర్ అవసరం లేదు
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ పదవిపై వ్యతిరేకతను డీఎంకే నాయకురాలు కనిమొళి పునరుద్ఘటించారు. ప్రస్తుతం రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నందున, గవర్నర్ పదవిని రద్దు చేయాలన్న డీఎంకే డిమాండ్ మారలేదని ఆమె నొక్కి చెప్పారు. ‘అసలు గవర్నర్ అవసరం లేదనే మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత పరిస్థితి చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాజ్యాంగ ప్రక్రియలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది’అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే బయటి నుంచి ఏఐఏడీఎంకేకు మద్దతు ఇస్తుందన్న వదంతులను ఆమె కొట్టిపారేశారు. అవన్నీ వట్టి ఊహాగానాలేనని, ప్రతి వదంతికి స్పందించలేమని అన్నారు. -
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే చాన్స్ఎనిమిది మంత్రుల పేర్ల జాబితాను గవర్నర్‌కు అందజేసిన విజయ్ విజయ్‌తో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశంరేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంనెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి కోరిన విజయ్ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్‌కు అందజేతప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్అందుకు గవర్నర్ సమ్మతిప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమంఈ నెల 13లోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశం తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్లుకేరళం పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్లోక్భవన్కు వచ్చిన విజయ్ మళ్లీ వెనుదిరిగారు.కేరళంకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్విజయ్కు సమయం ఇవ్వని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు?పీవీ షణ్ముగం నేతృత్వంలో రెబల్ ఎమ్మెల్యేలుఈపీఎస్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మాసస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలురాత్రి 7.10 గంటలకు కేరళ వెళ్లనున్న గవర్నర్ రాజేంద్రగవర్నర్ వెళ్లిపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యంసస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలుఇప్పటికి తేలని మద్దతు లెక్కలువిజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సస్పెన్స్టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులుటీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వీసీకేకాసేపట్లో వీసీకే మీడియా సమావేశంవీసీకే అధికారిక ప్రకటన తర్వాత గవర్నర్‌ను కలవనున్న విజయ్తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్వీసీకే చీఫ్ తిరుమావళవన్‌కు ముఖ్యమంత్రి పదవి?డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్డీఎంకే ప్రతిపాదన అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలుసాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రెస్మీట్తమిళనాడు సంక్షోభంపై సుప్రీం కోర్టులో పిటిషన్టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌కు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్విజయ్ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉందికానీ, అలా చేయలేదుసుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐపీఎస్ అధికారివిచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠమ్యాజిక్ ఫిగర్ దగ్గరే ఆగి.. తమిళనాట అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకే ప్రస్తుత బలం 108-1=107 (ఒక్క స్థానంలో విజయ్ తప్పుకోవాల్సిందే)కాంగ్రెస్ 5వామపక్షాలు 4ఏఎంఎంకే 1లోక్‌భవన్‌కు నిన్న సమర్పించిన మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య 117ఏఎంఎంకే ఎమ్మెల్యే విత్‌డ్రా అయితే 116వీసీకే కలిస్తే .. 118 మ్యాజిక్ ఫిగర్ పూర్తిసాయంత్రం దాకా ఆగాల్సిందే!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న సస్పెన్స్ఎటూ తేల్చని విడుదలై చిరుతైగల్ కట్చి(2 సీట్లు)విజయ్ను వెయిటింగ్లో పెట్టిన వీసీకేమద్దతు ఇస్తే తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్‌కు ఎండ్ కార్డ్కొనసాగుతున్న వీసీకే హైలెవల్ మీటింగ్సాయంత్రం దాకా జరగనున్న చర్చలుసాయంత్రం వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియా సమావేశంకీలక ప్రకటన చేసే అవకాశం తమిళనాడు సంక్షోభంపై లెఫ్ట్ పార్టీల కీలక ప్రకటనవామపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని తమిళనాట ఆరోపణలుహార్స్ ట్రేడింగ్‌కు మేం వ్యతిరేకం: సీసీఐ,సీపీఎంబేరసారాలకు గవర్నరే అవకాశం ఇచ్చారు: సీసీఐ,సీపీఎంఢిల్లీ పెద్దల సూచనతోనే తమిళనాడు స్క్రీన్‌ప్లే నడుస్తోంది: సీసీఐ,సీపీఎంబీజేపీ బ్యాక్‌డోర్ పాలిటిక్స్ నడిపిస్తోంది: సీసీఐ,సీపీఎంఅతిపెద్ద పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి : సీసీఐ,సీపీఎంకానీ, ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు : సీసీఐ,సీపీఎంఅందుకే టీవీకేకు మద్దతు ఇచ్చాం: సీసీఐ,సీపీఎంమా రెండు పార్టీలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయి : సీసీఐ,సీపీఎంఇదే విషయాన్ని డీఎంకేకు సమాచారం అందించాం : సీసీఐ,సీపీఎంఏ పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాం: సీసీఐ,సీపీఎంఆ తర్వాతే మేం మా మద్దతు లేఖను గవర్నర్‌కు పంపాం: సీసీఐ,సీపీఎంవీసీకే పార్టీ కొన్ని కారణాలతో ఇంకా లేఖ పంపలేదు: సీసీఐ,సీపీఎంసాయంత్రంకల్లా ఆ పార్టీ నుంచి స్పష్టత రావొచ్చు: సీసీఐ,సీపీఎంప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారనే ఆశిస్తున్నాం: సీసీఐ,సీపీఎంమద్దతిస్తారా? ప్రతిపక్షంలో కూర్చుంటారా?వీసీకే పార్టీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తుందా? లేదా? అనే చర్చచెన్నైలోని కార్యాలయంలో వీసీకే హైలెవల్ మీటింగ్ప్రతిపక్షంలో కొనసాగుతారా? అధికార పార్టీతో కలుస్తారా?బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశమూ!ఏ నిర్ణయం అనేది స్వేచ్ఛగా తీసుకోవాలని వీసీకే అధిష్టానానికి డీఎంకే అధినేత స్టాలిన్ సూచనడీఎంకే నేతృత్వం సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌లో భాగంగా పోటీ చేసి రెండు సీట్లు నెగ్గిన వీసీకేమరికాసేపట్లో స్పష్టమైన ప్రకటన వెలువడే చాన్స్వీసీకే చీఫ్ తిరుమావళవన్ నిర్ణయం ఎలా ఉండనుందో?గవర్నర్ తీరు వల్లే గందరగోళం: ముకుల్ రోహత్గీతమిళనాడు సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కీలక వ్యాఖ్యలుదేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తోందిఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభంవారంరోజులైనా ఏ విషయం తేల్చలేకపోవడం దారుణంగవర్నర్ తీరు వల్లే ఈ గందరగోళంసింగిల్ లార్జెస్ట్ పార్టీకి గవర్నర్ అవకాశం ఇవ్వాలిఅత్యధిక సీట్లు నెగ్గిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాల్సిందిఅసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాల్సిందిబలనిరూపణ లోక్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీలో జరిగాలిపీపీ నరసింహారావు ప్రభుత్వం చాన్నాళ్లు మైనారిటీలో నడిచిందిగవర్నర్ ఏదీ తేల్చకపోతే.. విజయ్ కోర్టును ఆశ్రయించొచ్చుగతంలో ఇలాంటి కేసులు చాలా కోర్టుకు వచ్చాయి.. నేనూ వాదించారాష్టపతి పాలన, మరోసారి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదు.. ఇది అప్రాజాస్వామికంఅది ఏఐ వీడియోనేమో!: దినకరన్టీవీకేపై ఏఎఎంకే చీఫ్ దినకరన్ ఆగ్రహంతమ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వనేలేదని మరోసారి వ్యాఖ్యఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసిన టీవీకేఆ వీడియోపై దినకరన్ అనుమానాలుఅది అసలు వీడియో కాదు : దినకరన్అందులో లేఖ.. మా పార్టీ నోట్‌ప్యాడ్ వేర్వేరుగా ఉన్నాయి : దినకరన్అది ఫేక్ లెటర్ : దినకరన్మా పార్టీ లేఖను ఫోర్జరీ చేశారు: దినకరన్పూర్తి వీడియోను టీవీకే ఎందుకు రిలీజ్ చేయడం లేదు?: దినకరన్అది ఏఐ వీడియో అయ్యి ఉండొచ్చు: దినకరన్ వీసీకే ఆఫీస్ వద్ద కోలాహలంచెన్నైలోని విడుదలై చిరుతైగల్ కట్చి ఆఫీస్ వద్దకు భారీగా చేరుకుంటున్న జనంకాసేపట్లో మీడియా ముందుకు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై ఉత్కంఠమద్దతు ప్రకటిస్తే.. అనిశ్చితికి తెరపడే అవకాశంస్వయంగా వీకేసీ ఆఫీస్‌కు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయనున్న విజయ్దాదాపుగా మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలుఇవ్వకుంటే.. కొనసాగనున్న సస్పెన్స్వీకేసీ మద్దతు ఇస్తే.. 119కి చేరనున్న టీవీకే బలంఏఎంఎంకే మద్దతు ఉపసంహరించుకున్నా.. టీవీకే మెజారిటీ 118మ్యాజిక్ ఫిగర్ (118) కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ అన్నాడీఎంకే కీలక భేటీపళనిస్వామి ఇంట్లో సమావేశమైన అన్నాడీఎంకే నేతలుప్రభుత్వ ఏర్పాటుపై చర్చ?టీవీకే మెజారిటీ చూపించుకోలేకపోతే.. ఏం చేయాలన్నదానిపై సీనియర్లతో పళని మంతనలుఅన్నాడీఎంకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖమొన్నటిదాకా విజయ్‌కు మద్దతు ఇస్తారని ప్రచారంనిన్ననేమో బద్ధశత్రువు డీఎంకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రచారంఇవాళ.. తగిన సంఖ్యా బలం లేకున్నా అన్నాడీఎంకేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం మరికాసేపట్లో కీలక ప్రకటనవిడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) మద్దతుపై ఉత్కంఠమరికాసేపట్లో మీడియా ముందుకు వీసీకే చీఫ్ తిరుమావళవన్విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టీకరణమద్దతు ఇస్తే.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ ఇవాళే సీఎంగా విజయ్ ప్రమాణం చేసే చాన్స్ఇవ్వకపోతే.. కొనసాగనున్న సస్పెన్స్దినకరన్పై డీఎంకే ఫైర్ఏఎంఎంకే అధినేత దినకరన్‌పై డీఎంకే ఆగ్రహంమిత్రపక్షం అన్నాడీఎంకే తరఫున ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వాన విజ్ఞప్తి గవర్నర్‌కు అందించిన దినకరన్ఏ ప్రతిపాదికన గవర్నర్‌కు ప్రభుత్వ ఏర్పాటు లేఖ అందించారని ప్రశ్నించిన డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్అన్నాడీఎంకేకు సంఖ్యా బలం ఎక్కడ ఉంది?: ఇళంగోవన్ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా.. సపోర్ట్ లెటర్ లేకుండా దినకనర్ డ్రామాలు చేస్తున్నారా?: ఇళంగోవన్త్రిషకు నిరాశ తప్పదా?తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేయనున్న విజయ్ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందని ప్రచారండిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలుతిరుచ్చి ఈస్ట్‌తో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలంటున్న విడుదలై చిరుతైగల్ కట్చిఅలాగైతేనే విజయ్‌కు మద్దతు ఇస్తామని స్పష్టీకరణసంబంధిత కథనం: త్రిష ఆశలు గల్లంతు!116 కాదు.. 117!విజయ్ మద్దతుపై తమిళనాడు లోక్‌భవన్ క్లారిటీ117 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌కు లేఖ సమర్పించిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేవిజయ్ రెండు చోట్ల పోటీ చేసిన నెగ్గడంతోనే ఆ ఫిగర్ఒక సీటు మైనస్ చేసి 107 బలంగానే చూపించిన టీవీకేకాంగ్రెస్ సపోర్ట్‌తో 112బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీలు 4ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు కూడా చూపించిన విజయ్మొత్తం 117 మంది ఎమ్మెల్యేల సంతకాలుమెజారిటీకి తక్కువైన ఒక్క స్థానంవీసీకే పార్టీ(2) మద్దతుపై టీవీకేకు అందని లేఖఅది అంది ఉంటే.. 119కి పెరగనున్న బలంఏఎంఎంకే ఎమ్మెల్యే విషయంలో ఆ పార్టీ అధినేత దినకరన్ కిరికిరివీసీకే మద్దుతు ఇస్తే.. ఏఎంఎంకే ఎమ్మెల్యే వైదొలగినా 118 పూర్తి మెజారిటీనేడు వీసీకే ఆఫీస్‌కు విజయ్మద్దతుపై సాయంత్రంలోగా రానున్న స్పష్టతతమిళనాట జోరుగా క్యాంపు పాలిటిక్స్తమిళనాడులో మొదలైన నెంబర్ గేమ్మ్యాజిక్ ఫిగర్ 2 తక్కువైన టీవీకే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న అనిశ్చితిటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు ససేమీరా అంటున్న గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్రేపటితో టీవీకేకు గవర్నర్ ఇచ్చిన గడువు పూర్తి?!పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీవీకేమహాబలిపురం రిసార్ట్‌కే పరిమితమైన టీవీకే ఎమ్మెల్యేలుచెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపునేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిఅన్నాడీఎంకేకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు ఏఎంఎంకే లేఖఅన్నాడీఎంకే తరఫున లేఖ సమర్పించిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్పళనిస్వామి గవర్నర్‌ను కలిస్తే మారనున్న నెంబర్లుకాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అన్నాడీఎంకే దృష్టికాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న ఏఐసీసీ ఇంచార్జీ గిరీష్ చోడంకర్కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసులతో బెదిరింపులు.. డబ్బు ఆశ చూపిస్తున్నారని ఆరోపణలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయం మొదలుపెట్టిన కాంగ్రెస్రాత్రికి రాత్రే బెంగళూరు.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలింపుహైదరాబాద్లోనే తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరం మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్నిన్న విజయ్‌తో జన నాయగన్ ప్రొడ్యూసర్ భేటీఅనంతరం లోక్‌భవన్‌కు విజయ్, మద్దతుదారు పార్టీల నేతలతో వెళ్లిన నిర్మాత లేఖ సమర్పించే సమయంలో గవర్నర్ పక్కనే నిల్చున్న నిర్మాత వెంకట్ కే నారాయణప్రొటోకాల్కు విరుద్ధంగా తీసుకెళ్లారని విజయ్‌పై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలుప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్‌కు ఏం పని అంటూ మండిపాటుప్రొడ్యూసర్ ద్వారా వామపక్షాలకు డబ్బులు పంచి ఉంటారని ఆరోపణలువిజయ్ హార్స్‌ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసే అవకాశంగవర్నర్కు(శాలువా కప్పుకున్న వ్యక్తి) ఎడమ వైపు ఉంది జన నాయగన్ నిర్మాత వెంకట్ కే నారాయణఆ ఇద్దరు ముందుకు వస్తే.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కంటిన్యూవిజయ్కు మద్దతిచ్చే విషయంలో పార్టీల హైడ్రామావీసీకే తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన జ్యోతిమణి, వన్నీరసు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల నెగ్గిన విజయ్ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితిడిప్యూటీ సీఎం పోస్టుతో పాటు విజయ్ వదులుకునే తిరుచ్చి ఈస్ట్ సీటును డిమాండ్ చేస్తున్న వీసీకేవీటితో పాటు మరో రెండు డిమాండ్లుచివరి నిమిషంలో మద్దతు లేఖ ఇవ్వకుండా హ్యాండిచ్చిన వీసీకేటీవీకే మద్దతు అంశం పక్కన పెట్టి.. డీఎంకే అధినేత స్టాలిన్‌తో వీసీకే చీఫ్ తిరుమావళవన్ భేటీఇవాళ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే చాన్స్మద్దతు ఇస్తే సీఎంగా విజయ్‌కు లైన్ క్లియర్ఇవ్వకుంటే.. కొనసాగనున్న ఉత్కంఠ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది.. చిన్నతప్పిదంతో గవర్నర్ దగ్గర బుక్కైన టీవీకే అధినేత విజయ్6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను తొలిసారి కలిసిన విజయ్గవర్నర్కు సమర్పించిన జాబితాలో కాంగ్రెస్ మద్దతు ఎమ్మెల్యేల పేర్లు కూడాకూటమిగా.. టీవీకేను అతిపెద్ద పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయిన విజయ్అక్కడే గవర్నర్‌కు దొరికిపోయిన విజయ్ఆ మరుసటి రోజే.. మరోసారి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తినిన్న.. 116 ఎమ్మెల్యేల సంతకాలతో మూడోసారి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి118 ఎమ్మెల్యేల సంతకాలే కావాలని పట్టుబడుతున్న గవర్నర్మొదటిసారి..రెండో‘సారీ’..మూడోసారి 116 వర్సెస్ 116తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులుక్షణక్షణానికి మారిపోతున్న లెక్కలునెంబర్ గేమ్‌తో టీవీకే చీఫ్ విజయ్ సతమతంతమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకేకు ప్రస్తుత బలం 116ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్‌కు అవకాశం ఇవ్వాలంటున్న డీఎంకే అధినేత స్టాలిన్ఇవాళ పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక భేటీవిజయ్ చేతులెత్తేస్తే.. డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు అన్నాడీఎంకేకు బయటి నుంచి డీఎంకే మద్దతు ఇస్తుందంటూ జోరుగా ప్రచారండీఎంకే-అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన బలం 116ఇరు వైపులా.. ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు అవసరంవీసీకే పార్టీ మద్దతు ఇస్తేనే విజయ్ పార్టీకి సంపూర్ణ బలంఇదే అదనుగా టీవీకేకు డిమాండ్లు చేస్తున్న వీసీకేకీలకమైన మంత్రిత్వ శాఖ, విజయ్ ఖాళీ చేసే స్థానంలో పోటీ, మరో రెండు డిమాండ్లు చేస్తున్న వీసీకేఇవాళ తమ నిర్ణయం ప్రకటిస్తామన్న వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ఇవాళ వీసీకే మద్దతు ఇస్తే విజయ్ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ఈరోజు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠటీవీకేను టెన్షన్ పెడుతున్న పళనిస్వామిమరోవైపు.. టీవీకేకు గుబులు పుట్టిస్తున్న అన్నాడీఎంకేడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ప్రచారంమరోవైపు.. అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ ఇచ్చిన మిత్రపక్షం ఏఎంఎంకేగవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌ను శుక్రవారం సాయంత్రం కలిసిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంసీనియర్ నేతలతో భేటీ కానున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిగవర్నర్ను కలిసి టీవీకేపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న పళని!విజయ్‌కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిందని మొన్నటిదాకా ప్రచారంతమ కూటమి ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్ ఆరోపణ.. గవర్నర్‌కు ఫిర్యాదుస్టాలిన్ పరోక్ష సాయం!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో తమ జోక్యం ఉండబోదన్న డీఎంకే చీఫ్ స్టాలిన్టీవీకే పార్టీకి ఎలాంటి అవాంతరం కలిగించబోమని వ్యాఖ్యప్రజా తీర్పును గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టీకరణవిజయ్ పాలనను ఆరు నెలలపాటు గమనిస్తామని.. ఆ తర్వాతే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని ప్రకటనఅన్నాడీఎంకేతో కూటమి ప్రభుత్వం ఉండబోదన్న సంకేతాలిచ్చిన స్టాలిన్ విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో తన ఒత్తిడి ఏం ఉండదని.. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని మిత్రపక్షాలకు సూచనఆ సూచన తర్వాతే విజయ్‌కు మద్దతు విషయంలో ముందుకు వచ్చిన వామపక్షాలువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్‌కు చోటుతమకు చోటు అక్కర్లేదని.. బయటి నుంచే మద్దతు(డీఎంకేలో కొనసాగుతూ) ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్ పార్టీలువీసీకే కూడా తమ నిర్ణయాన్ని గౌరవించిందన్న సీపీఐ, సీపీఎంలుఅయితే.. కేబినెట్ బెర్త్‌తో పాటు విజయ్ వదులుకునే సీటు తమకు ఇవ్వాలంటున్న వీసీకే!ఈ క్రమంలోనే మద్దతుపై ఇంకా ఏదీ తేల్చని వీసీకే చీఫ్ తిరుమావళవన్తిరుమావళవన్ ఎక్కడ?క్షణక్షణానికి మారుతున్న తమిళనాడు రాజకీయంటీవీకేను టెన్షన్ పెడుతున్న వీసీకే అధినేత తిరుమావళవన్చివరి నిమిషంలో మద్దతుపై ట్విస్ట్ ఇచ్చిన విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)డీఎంకే సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమిలో ఉన్న వీసీకేమొన్నటిదాకా విజయ్‌కు మద్దతు ఇవ్వమంటు వ్యాఖ్యవిజయ్ విజ్ఞప్తి మేరకు ఆలోచన చేస్తామని ప్రకటనసాయంత్రానికి సానుకూలంగా స్పందించినట్లు ప్రచారంస్టాలిన్తో భేటీ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన తిరుమావళవన్అర్ధరాత్రి వరకు నిరీక్షించిన టీవీకేవీసీకే మద్దతు లేఖపై ఉత్కంఠనేడు అధికారిక ప్రకటన వెలువడే చాన్స్విజయ్ ఉక్కిరి బిక్కిరితమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠటీవీకేకు ఇంకా పూర్తిగా దక్కని మద్దతుప్రస్తుత బలం 116గా ఉందన్న గవర్నర్ కార్యాలయంఇంకా ఇద్దరు తక్కువడీఎంకే కూటమిలోని పార్టీలకు విజ్ఞప్తి చేసిన విజయ్టీవీకే విజయ్ పార్టీ బలం (108.. ఇందులో విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి.. దీంతో 107కి పడిపోనున్న సంఖ్యడీఎంకేతో కటీఫ్ చెప్పి విజయ్‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్(5)డీఎంకే కూటమిలోనే ఉంటూ బయటి నుంచి విజయ్‌కు మద్దతు ప్రకటించిన లెఫ్ట్ పార్టీ(4)మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ((2))అన్నాడీఎంకే కూటమిలోని ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే మద్దతు కూడా!దినకరన్‌కు టీవీకే కౌంటర్మా ఎమ్మెల్యే విజయ్‌కు మద్దతు ఇవ్వలేదు: దినకరన్తమ ఏకైక ఎమ్మెల్యే సంతకం టీవీకే ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే చీఫ్ దినకరన్ ఆరోపణచెన్నై కమిషనర్‌కు ఫోర్జరీ కంప్లయింట్దినకరన్కు టీవీకే స్ట్రాంగ్ కౌంటర్ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే గవర్నర్‌కు విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల్లో.. కామరాజ్ సంతకం కూడా!దినకరన్ ఎంట్రీతో మారిన సీన్తెరపైకి అమ్మ మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) చీఫ్ దినకరన్జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్సొంత పార్టీతో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన దినకరన్ఒక్క స్థానంలో నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థిమన్నార్గుడి నుంచి నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థి కామరాజ్మొదటి నుంచి టీవీకే విజయ్‌కు మద్దతు ఇస్తారనే ప్రచారంఅందుకు తగ్గట్లే గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతులో కామరాజ్ సంతకం కూడాదినకరన్ సంచలన ఆరోపణలుతమ ఏకైక ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణనిన్న సాయంత్రం గవర్నర్‌ను కలిసిన దినకరన్అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తితమిళ రాజకీయం.. హైదరాబాద్‌కు షిఫ్ట్తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠహైదరాబాద్కు మారిన తమిళనాడు రాజకీయంహైదరాబాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుతమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్‌లోనే ఐదుగురు ఎమ్మెల్యేల మకాంఏర్పాట్లు చూసుకోనున్న టీపీసీసీ చీఫ్తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ అవాంతరంగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను ముచ్చటగా మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్మ్యాజిక్ ఫిగర్ 118టీవీకే గెలిచిన స్థానాలు 108కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. మొత్తం మ్యాజిక్ ఫిగర్ గవర్నర్‌కు చూపించిన విజయ్ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంవిజయ్కు సీఎం స్థాయి భద్రతను పునరుద్దరించాలని పోలీస్ శాఖను గవర్నర్ ఆదేశించినట్లు ప్రచారందీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన టీవీకేఅయితే వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల సంతకం మిస్సింగ్!116 మంది మద్దతే ఉందని ప్రకటించిన లోక్భవన్వీసీకే నిర్ణయం వెలువడేది ఇవాళేనేటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్దత -
టీవీకేకు కొత్త కష్టం.. ఫోర్జరీ కేసు నమోదు?
చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయితున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న రాజకీయ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్.. టీవీకేపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, టీవీకే విజయ్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరినా.. ఈ అంశంపై లోక్‌భవన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇంతలో తమ ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇచ్చినట్లు టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్‌కు ఇచ్చిందని దినకరన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమిళనాడు గవర్నర్‌కు ఒరిజినల్ కాపీ చూపించామన్న ఆయన, టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, దినకరన్‌కు టీవీకే కూడా కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖపై సైన్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసింది. తొలుత దీనిని దినకరన్ ఆమోదించారని.. కానీ అంతలోనే ఆయన యూటర్న్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.#WATCH | Chennai, Tamil Nadu | AMMK Party General Secretary TTV Dhinakaran visited the office of Assistant Commissioner of Police, Guindy RangeThis comes amid Dhinakaran's claim that TVK shared 'forged copy' of MLA Kamaraj's letter with the Governor and that he is filing a… pic.twitter.com/GgF0T6Eaz8— ANI (@ANI) May 8, 2026ఇదిలా ఉండగా.. ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. తమిళనాడులో అన్నాడీఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం పళనిస్వామిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏఎంఎంకే ఒక స్థానంలో గెలిచిన విషయం తెలిసిందే.కాగా, ఆ వీడియోలో దినకరన్ ఆమోదంతోనే తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు చెబుతూ కామరాజ్ లేఖను రాయడం కనిపిస్తుంది. విజయ్ పార్టీకి తాము అధికారికంగా ఎటువంటి మద్దతు ఇవ్వలేదని దినకరన్ ఖండించడంతో ఆయన తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని టీవీకే ఆరోపించింది. వాస్తవాలను దాచిపెడుతున్నారని టీవీకే మండిపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ ప్రయత్నంలో ఎవరితోనూ బేరసారాలు లేదా చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. #WATCH | TVK shares a video of AMMK MLA Kamaraj, saying "These are the video visuals of AMMK MLA Kamaraj voluntarily and happily writing a letter expressing his support for the Tamilaga Vettri Kazhagam. He had stated that he was extending support to the Tamilaga Vettri Kazhagam… pic.twitter.com/sM3xtyXx12— ANI (@ANI) May 8, 2026విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు :కాంగ్రెస్ ఎంపీఇదిలా ఉండగా, తమిళనాడులో విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజల మద్దతు కోల్పోయిన రాజకీయ శక్తులు ఇప్పుడు విజయ్ను తమిళనాడు ముఖ్యమంత్రిగా అవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ విమర్శించారు. టీవీకేకు ఇంకా మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్య చేరేందుకు చిన్న పార్టీల మద్దతు ఆలస్యమవుతోందని అంగీకరించిన ఆయన, అధికారం ప్రజల తీర్పును ఆలస్యం చేయగలదు కానీ శాశ్వతంగా అణచలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య తీర్పుకు ఇంకా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు. ప్రజల హక్కులు, న్యాయం కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.టీవీకేకు మద్దతు లేఖ పంపాం: వీసీకేఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తున్నట్లు వీసీకే వెల్లడించింది. ఈ- మెయిల్ ద్వారా తమ లేఖను పంపినట్లు తెలిపింది. ఈ మేరకు వీసీకే పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. తమ మద్దతుకు సంబంధించి అధికారిక ప్రకటన శనివారం చేస్తామని మరో ట్వీట్లో పేర్కొంది. వీసీకే, టీవీకే శ్రేణులంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. -
విజయ్ సిద్ధం.. రేపే ప్రమాణ స్వీకారం?
-
కాంగ్రెస్ తో కటీఫ్.. స్టాలిన్ సంచలన నిర్ణయం
-
విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి,చెన్నై: టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతు ప్రకటించడంతో విజయ్‌కు స్పష్టమైన సంఖ్యాబలం లభించింది. టీవీకేకు 107, వీసీకేకు 2, సీపీఐకు 2, సీపీఎంకు 2, కాంగ్రెస్‌కు 5 స్థానాలు కలిపి విజయ్ బలం 118కి చేరింది.మెజార్టీ సభ్యుల జాబితాతో విజయ్ ఈ రోజు సాయంత్రం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలవనున్నారు. ఇప్పటికే విజయ్ గవర్నర్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఆ సమయంలో సంఖ్యాబలం తక్కువగా ఉందని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.సంఖ్యాబలం కోసం విజయ్ వామపక్షాల మద్దతు కోరారు. పార్టీ జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వామపక్ష నేతలతో చర్చలు జరిపారు. నాలుగు రోజుల క్రితం లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, అనంతరం నేరుగా సమావేశమై చర్చలు జరిపింది. ఆ చర్చలు సఫలమవడంతో వామపక్షాలు, వీసీకే ఎలాంటి షరతులు లేకుండా విజయ్‌కు మద్దతు ప్రకటించాయి.వారికి కేబినెట్ బెర్త్లుప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన వీసీకే, సీపీఐ, సీపీఎంకు ఒక్కో మంత్రి పదవి, కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.టీవీకే శ్రేణుల సంబరాలు నాలుగు రోజుల అనిశ్చితి, గందరగోళం తర్వాత శుక్రవారం సాయంత్రం చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద ‘టీవీకే, టీవీకే’ నినాదాలు మార్మోగాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు సమకూర్చుకున్నారని సమాచారం రావడంతో ఆయన తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంతో టీవీకే శ్రేణుల సంబరాలు అంబరార్నంటాయి.అదనపు మద్దతు అవసరం విజయ్ వద్ద 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో 11 మంది అదనపు మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి 5 మంది మద్దతు పొందారు. అలాగే వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలతో చర్చలు జరిపారు. ఇవి డీఎంకే మిత్రపక్షాలే అయినప్పటికీ, చివరికి విజయ్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీసీకే, సీపీఐ, సీపీఎం కలిపి 6 సీట్లు ఉండటంతో విజయ్‌కి కావలసిన సంఖ్య పూర్తయింది. -
DMK-AIADMK పొత్తు.. స్టాలిన్ నమ్మక ద్రోహి
-
అలా జరిగితే విజయ్ మళ్లీ ఎన్నికలకు వెళ్లడం ఖాయం..
-
డీఎంకే, అన్నాడీఎంకే పొత్తు...! సీఎం ఎవరంటే?
-
ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై
సాక్షి,చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, డీఎంకే ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి, డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖతో డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి.కాంగ్రెస్ ఇటీవల టీవీకేకు మద్దతు ప్రకటించడం డీఎంకేకు పెద్ద షాక్‌గా మారింది. డీఎంకే నేతృత్వం దీనిని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌కు ద్రోహంగా అభివర్ణించింది. దీంతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఒక్కసారిగా ముగిసింది.డీఎంకే ఈ నిర్ణయం వల్ల ఇండియా కూటమి బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, టీవీకే-కాంగ్రెస్ కూటమి బలపడుతుందని అంచనా. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు,కొత్త వ్యూహాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. -
టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు.. పరువు పోగొట్టుకుంటున్న గవర్నర్
సాక్షి,చెన్నై: తమిళనాడు ఏఐసీసీ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో తీసుకున్న నిర్ణయాల వల్ల తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పరువు పోగొట్టుకుంటున్నారని ఆయన అన్నారు.తమిళనాడులో డీఎంకే–అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చోడంకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే బెదిరిస్తున్నదని, కుట్రలో భాగంగా ఈడీ పేరుతో ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు.కాంగ్రెస్‌ను వీడి అన్నాడీఎంకేలో చేరేది లేదని ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంగా తెలిపారు. బెదిరింపులు, భేరసారాసాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడుతున్నారని, విజయ్‌కు ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ముందుండి నడిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా గవర్నర్ రాజేంద్రపై తీవ్ర విమర్శలు గుప్పించిన చోడంకర్.. ‘దేశం ఎప్పుడూ చూడని విధంగా తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వడం లేదు. టీవీకే కాకుండా ఇతర పార్టీలు సంఖ్యాబలం నిరూపిస్తే అవకాశం ఇస్తానని చెప్పి నవ్వులు పాలవుతున్నారు’ అని అన్నారు.టీవీకేకు మద్దతు ఇవ్వాలని వీసీకేతో పాటు మరో రెండు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఆ మూడు పార్టీల నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
TVK విజయ్ పై DMK, AIADMK పెద్ద కుట్ర..
-
DMK, AIADMK లకు సినిమా చూపించిన TVK విజయ్
-
టీవీకేతో కాంగ్రెస్ దోస్తీ.. అఖిలేష్ చురకలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే.. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ క్రమంలో మద్దుతు ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే స్నేహహస్తం అందించడం జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలను కూడా మార్చేసింది.సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌లో భాగంగా.. డీఎంకేతో జట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. డీఎంకేతో సంబంధాలు తెంచుకుని విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చింది. దీనిని డీఎంకే వెన్నుపోటుగా అభివర్ణించింది. స్టాలిన్ మూలంగానే ఆ పార్టీ ఐదు స్థానాల్లో నెగ్గిందని డీఎంకే.. ఎక్కువ సీట్లలో పోటీ చేయకుండా స్టాలిన్ అడ్డుకున్నారని కాంగ్రెస్ పరస్పరం ఆరోపించుకున్నాయి. ఈ తరుణంలో ఇండియా బ్లాక్ ముగిసినట్లేనని స్టాలిన్ సైతం వ్యాఖ్యానించారు. అయితే..ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతుండగానే ఎస్పీ అధినేత, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎంకే స్టాలిన్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఉన్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “కష్టకాలంలోనూ ఒకరినొకరు వదిలిపెట్టేవాళ్లం కాదు మేం” అని కామెంట్ ఉంచారు. దీంతో ఇది కాంగ్రెస్ పార్టీకే ఆయన అంటించిన చురకలనే చర్చ నడుస్తోంది.हम वो नहीं जो मुश्किलों में साथ छोड़ दें। pic.twitter.com/p1EosEJtvV— Akhilesh Yadav (@yadavakhilesh) May 8, 2026ఇదిలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ ఈ మధ్యకాలంలో ఈ తరహా చేష్టలతో రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో తన దిష్టిబొమ్మను తగలబెట్టబోయి గాయపడిన బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనుపమను ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించి యూపీలో ఆరోగ్యకరమైన రాజకీయాలకు తెర తీశారు. బీజేపీని ఓడించే లక్ష్యంతో 2023లో విపక్షాలన్నీ ఇండియా కూటమి పేరుతో ఒకే వేదికపైకి వచ్చాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల్లో సీట్ల పంపకాల విషయంలో మిత్రపక్షాల మధ్య అభిప్రాయ బేధాలు.. వరుస ఓటములు.. ఆ కూటమిని బలహీనపరుస్తూ వచ్చాయి.ఇక.. తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మద్దతుదారు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని టీవీకే అధినేత విజయ్ చెబుతున్నారు. అయితే.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. పూర్తి బలం 118 ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే తాను సంతృప్తి చెందుతానని.. ఆ తర్వాత సీఎంగా ప్రమాణం చేసుకోమని విజయ్‌కు చెబుతున్నారు. దీంతో మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో టీవీకే తలమునకలైంది. -
మెజారిటీకి ఇంకా 6 మంది ఎమ్మెల్యేల అవసరం
-
మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఎంపీ మాణిక్కం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం భద్ర శత్రువులుగా ఉన్న రెండు పార్టీలు కేవలం ఒక్క వ్యక్తిని ఆపడానికి ఏమమవుతున్నాయన్నారు. దీనిని స్పష్టంగా గమనించే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిందని తెలిపారు.తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సరైనా సంఖ్యాబలం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఆరాష్ట్ర గవర్నర్ తేల్చి చెప్పడం.. ఆ తరువాత డీఎంకే- ఏఐడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం.. ఒకవేళ అలా చేస్తే టీవీకే ఎమ్మెల్యేలు అంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని విజయ్ హెచ్చరించడం ఇలా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాణిక్కం ఠాగూర్ తన ట్విట్టర్లో... "జీవితకాలం బద్ధ శత్రువులుగా ఉన్న రెండు పార్టీలు అధికారం కోసం కలుస్తున్నాయి. ఒక్క వ్యక్తిని ఆపడం కోసం రెండు పార్టీలు కలుస్తున్నాయి. ఆర్ఎస్ఎస్/బీజేపీల బి-టీమ్‌తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులని పిలుచుకోలేరు. స్థిరమైన ప్రభుత్వం పేరుతో రెండు పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. డీఎంకే ఈ రోజు తన ముసుగు తీస్తుందా?" అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్, బీజేపీల బీ-టీమ్‌తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులుగా పిలుచుకోలేరు అని అన్నారు. కాగా ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటునకు మాత్రం గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ అంగీకరించడం లేదు. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే రావాలంటూ స్పష్టం చేశారు. తనకు నెంబర్ ముఖ్యమని.. మెజారిటీ బలంతో ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది. -
టీవీకేపై కుట్ర.. మరో బాంబు పేల్చిన అన్నాడీఎంకే ఎంపీ
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అన్నాడీఎంకే ఎంపీ మరో బాంబు పేల్చారు. తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ తంబిదురై తమిళనాడు రాజకీయ పరిస్థితులపై తాజాగా స్పందించారు. ఎంపీ తంబిదురై మీడియాతో మాట్లాడుతూ.. తమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్‌ను కోరుకుంటున్నారు. అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రావాలనే ప్రజాభిప్రాయం ఉంది. తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. దైవానుగ్రహంతో తగిన సమయంలో అది జరగవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై తమిళనాడులో చర్చ మొదలైంది.ఇక, తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకే ఎంపీ ఇలా కామెంట్స్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? అనే చర్చ నడుస్తోంది.#WATCH | Chennai | AIADMK MP M Thambidurai says, "...The public sentiment is there that AIADMK has to come back to power...That may happen in the due course of time with the grace of God" pic.twitter.com/8JtjU5Jr5H— ANI (@ANI) May 8, 2026ఇదిలా ఉండగా.. తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయం కొనసాగుతోంది. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి చెన్నై చేరుకోవాలని పార్టీ చీఫ్ పళనిస్వామి సూచించారు. మరోవైపు.. వివిధ పార్టీల మద్దతు తమకు ఇవ్వాలని టీవీకే నేతలు మంతనాలు జరుపుతున్నారు. లెఫ్ట్, వీఎంసీ పార్టీల మద్దతుపై ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
గాడిదల పెంపకంలో బిజీగా పీఎంకే మాజీ ఎమ్మెల్యే
సాక్షి, చెన్నై: సేలం వెస్ట్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఓటమి పాలైన పీఎంకే రాందాసు శిబిరం నేత అరుల్ తాజాగా సామాజిక మాధ్యమంలో ఆవులు, గుర్రాలు గాడిదల పెంపకంపై దృష్టి పెట్టినట్టుగా ఫొటో పెట్టడం వైరల్‌గా మారింది. సేలం వెస్ట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరుల్, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో తమిళగ వెట్రి కళగం అభ్యర్థి లక్ష్మణన్ విజయం సాధించగా, అరుల్ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. కాగా ఓటమి తర్వాత తన నియోజకవర్గ ప్రజలకు దూరంగా, సొంత పనుల్లో నిమగ్నమైన అరుల్.. తన తోటలో ఆవు, గుర్రాలు, గాడిదల పెంపకంపై దృష్టి పెట్టినట్టుగా అప్పుడే పుట్టిన గాడిద పిల్లను చేతుల్లోకి తీసుకునే ఫొటోలను షేర్ చేశారు.‘తోటలో మా పని పూర్తయింది.. ఇప్పుడు పశువులను మేపుతూ బిజీగా ఉన్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గత ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన నాయకుడు, ఇప్పుడు గాడిదల కాపరిగా మారానంటూ పోస్ట్ చేయడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. -
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది.ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌తో టీవీకే చీఫ్ విజయ్.. గురువారం రెండోసారి సమావేశమైన విషయం తెలిసిందే. వీరి భేటీ అనంతరం, ఆర్లేకర్ పొలిటికల్ బాంబు పేల్చారు. మెజారిటీపై తాను సంతృప్తి చెందాకే టీవీకేకు అవకాశమిస్తానని స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని టీవీకే ఏర్పాటు చేయకుండా తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వాదనను ఖండించారు. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆర్లేకర్..‘ప్రభుత్వ ఏర్పాటుకు నా వద్దకు వచ్చిన పార్టీని అందుకు కావాల్సిన మెజారిటీ చూపించాలని అడిగాను. టీవీకేనే కాదు, ఏ పార్టీ వచ్చినా అదే అడుగుతాను. తర్వాత అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవచ్చు. ప్రక్రియను నేనేమీ ఆలస్యం చేయడం లేదు. విజయ్ 118 నంబరును రాతపూర్వకంగా ఇస్తే చాలు’ అని అన్నారు.అనంతరం, ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే వచ్చి 118 మందిని చూపిస్తామంటే అంగీకరిస్తారా అని ప్రశ్నించగా.. ఎవరు మెజార్టీ చూపించినా నాకు ఓకే. అది సాధ్యమైనా సరే.. తప్పో, ఒప్పో వారికి మెజారిటీ ఉంది కాబట్టి కాదనలేను. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియ. నేను ప్రజల్ని మర్చిపోను. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇక్కడున్నాను. వెరిఫై చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా అనుమతిస్తాను? ముందు నేను సంతృప్తి చెందాకే ఆ పనిచేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం మరో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, విజయ్ మరో 2-3 రోజుల్లో మెజారిటీ చూపించుకోలేకపోతే ఏం చేస్తారని అడగ్గా, తనకున్న అవకాశాల మేరకు తదుపరి ప్రక్రియకు వెళ్తానని చెప్పారు. తనకు సలహా బృందం ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవహారంపై కాంగ్రెస్.. నేడు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు సిద్దమైంది. ఇందులో భాగంగా లోక్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు నిచ్చింది. అయితే, కాంగ్రెస్ నిరసనలో టీవీకే పాల్గొంటుందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ఆదేశాలతోనే గవర్నర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
పొలిటికల్ ట్విస్ట్.. విజయ్ సంచలన నిర్ణయం?
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడే సీట్లు రాకపోవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ.. రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఇలాంటి తరుణంలో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.తమిళనాడులో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గానీ, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే.. టీవీకే తన 107 మంది ఎమ్మెల్యేలందరితో సామూహిక రాజీనామాలను పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. ఈ మేరకు విజయ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు బయటకు వచ్చాయి. రాజకీయ ప్రతిష్టంభన మధ్య విజయ్ శిబిరంలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది సంకేతమని పలువురు చెబుతున్నారు. విజయ్ స్వయంగా అధికారికంగా ఈ హెచ్చరిక చేయనప్పటికీ, ఎన్నికల అనంతర చర్చలు అసంపూర్తిగా మిగిలిపోవడం, సంఖ్యాబలం ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటుండటంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని ఇది ప్రతిబింబిస్తోంది. టీవీకే అధికారం చేపట్టకుండా నిరోధించే ప్రయత్నంలో, డీఎంకే తన చిరకాల ప్రత్యర్థి ఏఐఏడీఎంకేతో రహస్య చర్చలు ప్రారంభించిందన్న వార్తలు వెలువడిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.Some reports are now claiming that if DMK and AIADMK come together and form the government, TVK MLAs may resign from their seats.Honestly, that would be a very risky political move.If 100+ MLAs resign, by-elections will happen in all those constituencies. In that situation,… pic.twitter.com/84LpB5f7xc— TVK Pulse (@TVKpulse) May 7, 2026పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, అసెంబ్లీలో విజయ్ పార్టీ ఏకైక అతిపెద్ద కూటమిగా అవతరించినప్పటికీ, ఆయనను అధికారంలోకి రాకుండా నిరోధించడానికి డీఎంకే, అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు ఉందని భావిస్తున్న టీవీకే నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏ పార్టీకి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం లేనప్పటికీ, టీవీకేను అధికారానికి దూరంగా ఉంచే ప్రయత్నంగానే ఈ రెండు ప్రధాన ద్రవిడ పార్టీల ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది, ఇందులో విజయ్ గెలిచిన రెండు స్థానాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగ నియమం ప్రకారం విజయ్ ఒక సీటును ఖాళీ చేసే అవకాశం ఉన్నందున, పార్టీ వాస్తవ బలం 107 మంది ఎమ్మెల్యేలుగా ఉంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు లభించింది. దీనితో మరో ఐదుగురు సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్య 112కు చేరింది. అయితే, 234 మంది సభ్యులు కలిగిన ఈ సభలో మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్యను ఇది ఇంకా చేరుకోలేదు. ఈ నేపథ్యంలో టీవీకే.. డీఎంకే మిత్రపక్షాలైన విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK), వామపక్ష పార్టీలు మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లను సంప్రదిస్తోంది. అయినప్పటికీ, వారి నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదు.ఈ సందర్బంగా ఐయూఎంఎల్ అధ్యక్షుడు కేఎం కాదర్ మొహిదీన్ స్పందిస్తూ.. పొత్తు కోసం టీవీకే తమను సంప్రదించిందని, అయితే తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. డీఎంకే నేతృత్వంలోని అలయన్స్ ఉన్న IUML, స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరిస్తామని అన్నారు. కాగా, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో IUML రెండు సీట్లను గెలుచుకుంది. -
విజయ్‌కు మళ్లీ గవర్నర్ మొండిచేయి.. సారీ.. రెండోసారి!
సాక్షి, చెన్నై: తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టినట్లు తమ మొదటి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాల్లో గెలిచి దాదాపు అధికారతీరాలకు చేరిన టీవీకే గంటలు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు గండాన్ని దాటలేక అవస్థలు పడుతోంది. మ్యాజిక్ ఫిగర్ సాధించాకే తన వద్దకు రావాలని ఓవైపు గవర్నర్ అర్లేకర్ స్పష్టంచేయడం, మరోవైపు పదవీయోగం దక్కకుండా చేసేందుకు ద్రవిడ దిగ్గజ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే కలిసి పనిచేయనున్నాయనే వార్తల నడుమ టీవీకే చీఫ్ విజయ్ వేగంగా పావులు కదుపుతున్నారు. తమ ప్రియతమ హీరో, నేతను ముఖ్యమంత్రికాకుండా అడ్డుతగిలితే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకూ వెనుకాడబోమని టీవీకే ఎమ్మెల్యేలు ప్రతినబూనారన్న వార్త తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ప్రత్యేకంగా కలిసి అభ్యరి్థంచినా గవర్నర్ మనసు మార్చుకోకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయపోరాటానికి సిద్ధపడేందుకు టీవీకే రెడీగా ఉందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఆలోపు భావసారూప్య పార్టీల మద్దతు కూడగట్టేందుకూ టీవీకే శతథా ప్రయత్నిస్తోంది. టీవీకే అభ్యర్థనతో మద్దతు ఇచ్చే ఆలోచన ఉన్నా బీజేపీ ఒత్తిడి కారణంగా అంతటి సాహసం చేసే దమ్ములేక అన్నాడీఎంకే మిన్నకుండిపోయిందని వార్తలు వినవస్తున్నాయి. టీవీకే కూటమిలోకి దూకేయకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటికే అన్నాడీఎంకే రిసార్ట్ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. అటు అన్నాడీఎం కలిసిరాక, ఇటు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సరిపోక విజయ్ ఇతర పార్టీల అగ్రనేతలతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాట ఏ పార్టీ/కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే దానిపై తలపండిన రాజకీయ పండితులు సైతం ఎటూ తేల్చలేకపోతున్నారు. మరోసారి లోక్‌భవన్‌కు.. గవర్నర్ అర్లేకర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విజయ్ గురువారం లోక్‌భవన్‌కు వెళ్లారు. తమకు అవకాశమిస్తే అసెంబ్లీ బల నిరూపణ చేసుకుంటామని గవర్నర్‌ను లిఖితపూర్వకంగా అభ్యరి్థంచారు. ఇందుకు గవర్నర్ నుంచి సానుకూల స్పందన కరువైంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తేనే సాధారణ మెజార్టీ సాధించినట్లు భావించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తానని విజయ్‌కు గవర్నర్ స్పష్టంచేశారు. తమకంటే ముందుగా మరే పార్టీ లేదా కూటమికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వొద్దని విజయ్ కోరారని, అందుకు గవర్నర్ సమ్మతి తెలిపారని లోక్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌తో విజయ్ భేటీ 40 నిమిషాల్లోపే ముగిసింది. అనూహ్యంగా షణ్ముగం రాజీనామా అన్నాడీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురువారం రాత్రి అనూహ్యంగా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఢిల్లీకొచ్చి సంబంధిత ఉన్నతాధికారికి తన రాజీనామా లేఖను అందజేశారు. విజయ్‌తో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి క్షేమదాయకమని ఫలితాలు వెల్లడయ్యాక షణ్ముగం వ్యాఖ్యానించడం తెల్సిందే. దీంతో అన్నాడీఎంకేను చీల్చి తన వర్గం ఎమ్మెల్యేలను టీవీకేకు మద్దతు ఇచ్చేలాచేసి ప్రభుత్వ ఏర్పాటుకు షణ్ముగం ప్రయత్నిస్తున్నారని వార్తలొచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. ‘‘దీనిపై నేనేమీ మాట్లాడను. నాకేమీ తెలియదు’’ అని అన్నారు. డీఎంకేతో అన్నాడీఎంకే పొత్తు ప్రతిపాదనలను మొదట్నుంచీ షణ్ముగం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పనయూర్‌లో టీవీకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఇక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నారనేది తెలియరాలేదు. అందరూ ఐక్యంగా ఉండాలని విజయ్ కోరుకుంటున్నారని పార్టీ ముఖ్యనేత తెలిపారు. ముందస్తుగా జాబితా ఎందుకు? ‘‘పార్టీ అనేది అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటుంది. మొత్తం ఎమ్మెల్యేల జాబితాను ముందస్తుగా అడగాల్సిన అవసరం గవర్నర్‌కు ఏముంది? ఉద్దేశపూర్వకంగా బీజేపీ గవర్నర్‌తో తమిళనాట రాజకీయ అస్థిరతను సృష్టిస్తోంది. గవర్నర్ వైఖరిపై శుక్రవారం నిరసనర్యాలీలు కొనసాగుతాయి’’ అని కాంగ్రెస్ తెలిపింది. టీవీకే అభ్యర్థనపై శుక్రవారం సమావేశమై నిర్ణయం తీసుకుంటామని సీపీఎం తెలిపింది.6 నెలల వరకు ఇబ్బంది పెట్టం: స్టాలిన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమ వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టంచేశారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్, ఎండీఎంకే పార్టీల నేతలతో గురువారం స్టాలిన్ సమావేశమయ్యారు. ఐక్యంగా ఉందామని కోరారు. తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడారు. ఏ నిర్ణయానికైనా కట్టుబడాల్సిందేనని స్టాలిన్ స్పష్టంచేశారు.మూడు పార్టీల నేతలతో భేటీలు.. టీవీకే నేత నిర్మల్ నేతృత్వంలోని బృందం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్, వీసీకే నేత తిరుమావళవన్‌తో వేర్వేరుగా సమావేశమైంది. తమతో కలిసిరావాలని వీళ్లను నిర్మల్ కోరారు. ఈ మూడు పార్టీలు శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. డీఎంకేతో చర్చించాక చెప్తామని ఐయూఎంఎల్ నేత ఖాదర్ వెల్లడించారు. పుదుచ్చేరి క్యాంప్‌లో పళనిస్వామి పుదుచ్చేరి క్యాంప్‌లో ఉన్న తమ ఎమ్మెల్యేలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఉదయం అంతా చెన్నైలో ముఖ్య నేతలతో సమావేశమైన పళనిస్వామి సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు పదుచ్చేరిలో ఏర్పాటు చేసిన క్యాంప్‌కు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశంలో నిమగ్నమయ్యారు. -
కఠిన నిర్ణయాలు తీసుకుంటాం.. ఎమ్మెల్యేలకు స్టాలిన్ ఆదేశాలు
చెన్నై: ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితులు చాలా గంభీరంగా మారాయి. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు అభ్యర్థణను అక్కడి గవర్నర్ తిరస్కరించడంతో ఇప్పుడు అక్కడ ఏం జరగనుందా అనే టెన్షన్ మెుదలైంది. ఈ నేపథ్యంలోనే రకరకాల ఉహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత స్టాలిన్..ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి వార్త పత్రికలు కథనాలు ప్రచురించాయి.తమిళ తంబీల రాజకీయాలపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. దానికోసం విజయ్ పలు చిన్న పార్టీల మద్దతుని అభ్యర్థించారు. వారు త్వరలో తమ నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ డీఎంకే అధినేత స్టాలిన్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించినట్లు తమిళనాడు పత్రికలు పేర్కొన్నాయి. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది " రాష్ట్రంలో మేము మంచి ప్రతిపక్ష పార్టీగా పనిచేయాలనుకుంటున్నాం. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ కార్యవర్గ నాయకులతో సంప్రదించిన తర్వాత మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. డీఎంకే నాయకులంతా మే 10వ తేదీ వరకూ చెన్నైలోనే ఉండాలి. డీఎంకే ప్రణాళికలకు ఎటువంటి ఆటంకం తలెత్తవద్దు". అని వారికి తెలిపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.అయితే ఇది వరకే స్టాలిన్ టీవీకే అంశమై ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన విజయ్‌ని తాము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే తాము అడ్డుకోమన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్టాలిన్ ఏం నిర్ణయం తీసుకుంటారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
టీవీకే విజయ్ను ఉద్దేశిస్తూ.. తమిళనాడు గవర్నర్ అధికారిక ప్రకటన
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. తాజాగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కలిశారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రకటనలో ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా లభించలేదు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ నిరూపించకపోతే ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానం ఇవ్వలేం’ అని పేర్కొంది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. కానీ మెజారిటీకి కావలసిన 118కి ఇంకా తక్కువ. ఇక ఇతర పార్టీల వైఖరి కీలకంగా మారింది. సీపీఐ,సీపీఎం, వీసీకే మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని వామపక్షాలకే వదిలేశారు. అయితే ఏఐఏడీఎంకే మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా తెలిపింది.టీవీకే మద్దతుదారులు లోక్‌భవన్ వద్ద నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆలస్యం పై పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. మొత్తం మీద, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ, మెజారిటీకి కావలసిన సంఖ్య ఇంకా తక్కువ. గవర్నర్ ఆహ్వానం ఇవ్వడానికి ముందు స్పష్టమైన మెజారిటీ నిరూపణ కోరుతున్నారు. చిన్న పార్టీల నిర్ణయం, కాంగ్రెస్ మద్దతు, డీఎంకే తాత్కాలిక వెనుకడుగు వంటి అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి. Governor Tells Vijay, Majority Not Yet EstablishedChennaiThe #LokBhavan, Tamil Nadu, has issued a press statement stating that Governor Rajendra Vishwanath Arlekar met C. Joseph #Vijay, President of the Tamilaga Vettri Kazhagam (#TVK), in #Chennai today. During the… pic.twitter.com/c1OQza05RK— Yasir Mushtaq (@path2shah) May 7, 2026 -
పొలిటికల్ థ్రిల్లర్
-
విజయ్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
చెన్నై: తమిళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చారు. విజయ్‌తో భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అయితే, లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత తన నిర్ణయం చెబుతానని గవర్నర్ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఒకవేళ గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈరోజే విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. గవర్నర్ గ్రీన్‌సిగ్నల్‌తో టీవీకే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే లోక్‌భవన్ వేదికగా గవర్నర్, విజయ్ మధ్య కీలక సమావేశం జరిగింది. 24 గంటల్లో రెండోసారి గవర్నర్‌ను విజయ్ కలిశారు.40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. వీరి భేటీ సందర్భంగా గవర్నర్‌కు విజయ్.. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను అందించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని విజయ్ చెప్పారు. 113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించారు. #WATCH | Chennai | TVK Chief Vijay leaves from Lok Bhavan after meeting Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar pic.twitter.com/ygxHkVNi4q— ANI (@ANI) May 7, 2026విజయ్‌కు అనుమతి ఇవ్వాలి..ఇదిలా ఉండగా.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి విజయ్‌కు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్‌ను కోరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా, ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తంచేసింది. -
గంటగంటకూ ఉత్కంఠ..! తమిళ రాజ్యమేలేదెవరు..?
-
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్‌కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్‌గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్‌కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్‌తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్‌గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్‌లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
తమిళ రాజకీయంలో సంచలనం.. విజయ్ సీఎం కానట్టే...!!
-
అధికారం కోసం కొత్త పొత్తు.. మాజీ శత్రువులు ఇప్పుడు కొత్త మిత్రులు?
-
తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు వార్తలతో వేడెక్కిన పాలిటిక్స్.
-
తమిళ రాజకీయాల్లో మహిళల జోష్.. అసెంబ్లీలో కొత్త చరిత్ర
రెండు దశబ్దాల అనంతరం తమిళనాడు అసెంబ్లీలో మహిళా శక్తి గళం జ్వలించనుంది. ఈ సారి ఏకంగా 23 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో 13 మంది టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: 17వ తమిళనాడు శాసన సభకు ఎన్నికలు ముగిశాయి. సినీ నటుడు విజయ్ టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో సుమారు 3 కోట్ల మంది మహిళలే. అందుకే మహిళా ఓటు బ్యాంక్‌ను గురి పెట్టి ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ పారీ్టలు హామీల వరాలు కురిపించడం జరుగుతోంది. అయితే, చట్ట సభలలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య ఇది వరకు తక్కువగానే ఉంటూ వచ్చింది.1991లో 32 మంది మహిళలు సభలో అడుగు పెట్టారు. ఆ తదుపరి పది శాతంలోపే గెలిచే వారు. 2016లో దివంగత సీఎం జయలలితతో సహా 21 మంది మహిళలు అసెంబ్లీలో ఉన్నారు. రెండు దశాబ్దాల 1991,2016 తదుపరి తాజా ఎన్నికలలో 23 మంది మహిళలు గెలిచారు. వీరిలో అత్యధికంగా 13 మంది విజయ్ టీవీకే నుంచి గెలిచిన వారే. వీరితోపాటూ ధర్మపురి నుంచి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణి, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కృష్ణస్వామి కుమార్తె సౌమ్య అన్బుమణి, డీఎండీకే దివంగత అ«ధినేత, నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్‌లు ప్రపథమంగా సభలో అడుగు పెట్టనున్నడంతో నారీ శక్తి గళం తమిళ అసెంబ్లీలో జ్వలించనుంది. ఇక, అన్నాడీఎంకే నుంచి కోటీశ్వరు రాలైన లాటరీ మారి్టన్ సతీమని లీమా రోజ్‌తో పాటుగా ఆరుగురు మహిళలు, సీపీఎం నుంచి డి. లత వంటి నారీ లోకం అసెంబ్లీకి ఎన్నిక కావడంతో తమిళ సభ కళకళ లాడనుంది. అయితే డీఎంకే నుంచి మహిళలు ఎవరు విజయం సాధించక పోవడం గమనార్హం. 25 మంది మైనారిటీ ఎమ్మెల్యేలు మహిళా శక్తే కాదు, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు 25 మంది ఈసారి ఏకంగా ఎన్నికయ్యారు. ఇందులో డీఎంకే నుంచి మనోజ్ పాండియన్, ఆస్టిన్ ఉన్నారు. ఈ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి ఇద్దరు, మనిదనేయ మక్కల్ కట్చి నుంచి మరో ఇద్దరు, మనిదనేయ జననాయగ కట్చి నుంచి మరొకరు గెలిచారు. వీరిలో 9 మంది ముస్లిం నేతలు ఉన్నారు. ఇందులోనూ టీవీకే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలయ్యారు. ఇక, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పదేళ్ల అనంతరం బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరు టీవీకే నుంచి గెలిచిన మైలాపూర్ ఎమ్మెల్యే వెంకటరామన్, శ్రీరంగం నుంచి గెలిచిన రమేష్ ఉన్నారు. జస్ట్ మిస్ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్ మిస్ కావడం ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్ మిస్ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రేపు తమిళనాడులో కాంగ్రెస్ ధర్నా
తమిళనాడు రాజకీయానికి సంబంధించిన అప్డేట్స్.. తమిళనాడు గవర్నర్‌ను కలిసిన సీఎస్, డీజీపీవిజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని డీజీపీని ప్రశ్నించిన గవర్నర్ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారన్న గవర్నర్రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలుగవర్నర్ తీరుకు నిరసనగారేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నవిజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శలుగవర్నర్ తీరుకు నిరసనగా ఆందోళనకు ధర్నాకు దిగనున్న కాంగ్రెస్ శ్రేణులు రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంటీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు వేగవంతంవామపక్షాలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి టీవీకే నేత నిర్మల్ కుమార్వామ పక్షాలతో చర్చలు జరిపే బాధ్యతల్ని కుమార్‌కు అప్పగించిన విజయ్ రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంసమావేశం తర్వాతే విజయ్‌కు మద్దతు అంశంపై క్లారిటీ అప్పటి వరకు కొనసాగనున్న ఉత్కంఠలోక్భవన్ అధికారిక ప్రకటనతమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్ అధికారిక ప్రకటనగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈ రోజు చెన్నైలో విజయ్‌ని కలిశారుప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మద్దతు తమిళనాడు శాసనసభలో ఇంకా లభించలేదని స్పష్టంలోక్భవన్ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళనప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శననాది భరోసాటీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ భరోసా ప్రభుత్వ ఏర్పాటు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని హామీ తగిన మెజారిటీతో రావాలని సూచన 118 మంది జాబితాతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని సలహా విజయ్‌కి మద్దతు ఇస్తారా?డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠవామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన విజయ్మద్దతు కోరుతూ లేఖ రాసిన టీవీకే అధినేతడీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయిన మిత్రపక్షాల నేతలువిడిగా పార్టీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తమ నిర్ణయం ఏంటన్నది రేపు భేటీల తర్వాత ప్రకటించే చాన్స్విజయ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ(2)ఏదీ తేల్చని సీపీఎం (2)మద్దతు ఇవ్వమని ఇదివరకు ప్రకటించిన వీసీకే(2)విజయ్ లేఖ నేపథ్యంలో పునరాలోచనలో వీసీకేమద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(2)తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్..విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల సంతృప్తి చెందని గవర్నర్.గవర్నర్ ఆఫీసు నుంచి టీవీకేకి ఫోన్.118 మంది మెజార్టీ ఫిగర్‌తో లేఖ సమర్పించాలని టీవీకేకు స్పష్టం చేసిన గవర్నర్ ఆఫీస్.కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలుసంబంధిత వార్త: 113తో ప్రభుత్వమా? అలా ఎలా?కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలుఎంపీ కమల్‌హాసన్ ట్వీట్.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు.లోక్‌భవన్ కాదు.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలి.ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలి. తమిళనాడు చర్రితలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது. என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామంటీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందనముగిసిన భేటీ.. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో ముగిసిన విజయ్ భేటీ.24 గంటల్లో రెండోసారి గవర్నర్‌ను కలిసిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్‌కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్.113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించిన విజయ్.కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న అన్నాడీఎంకే పళనిస్వామి. పళనిస్వామికి టెన్షన్!విజయ్‌కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఒత్తిడి.ఈపీఎస్ ఒప్పుకోకుంటే టీవీకేకి మద్దతు పలికే ఆలోచనలో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి, షణ్ముగం సంప్రదింపులు.పుదుచ్చేరి రిసార్టులో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో విజయ్ సమావేశం..ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని కోరిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్‌కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉంది: విజయ్ తమిళనాడులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులుగవర్నర్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే పళనిస్వామివిజయ్ భేటీ అనంతరం గవర్నర్‌ను కలవనున్న పళనిస్వామి.మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌తో పళనిస్వామి భేటీ. గవర్నర్‌తో పళనిస్వామి సమావేశంపై పలు రకాల ఊహాగానాలుటీవీకే విజయ్‌కి మద్దతు ఇవ్వాలని పుదుచ్చేరిలో 25 మంది ఎమ్మెల్యేల క్యాంపుతాజా పరిణామాల నేపథ్యంలో టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు ఇచ్చే ఛాన్స్అన్నాడీఎంకే మద్దతిస్తే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విజయ్గవర్నర్, విజయ్ భేటీపై సర్వత్ర ఉత్కంఠ👉గవర్నర్‌ను కలిసిన విజయ్👉లోక్‌భవన్‌లో గవర్నర్‌తో విజయ్ భేటీ. ప్రజల అండ విజయ్‌కు ఉంది: ప్రకాశ్రాజ్తమిళనాడు రాజకీయాలపై స్పందించిన ప్రకాశ్రాజ్ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ ప్రకాశ్‌రాజ్ పోస్ట్విజయ్కు ప్రజామోదం ఉందంటూ వ్యాఖ్యలు.ప్రజలు అండగా ఉన్నారని కితాబు. గవర్నర్ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరం, ఆమోదయోగ్యం కానిది మరియు రాజ్యాంగ విరుద్ధమైనది.మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు..కానీ విజయం ప్రజల తీర్పు ద్వారా లభించింది.సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి.This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ— Prakash Raj (@prakashraaj) May 7, 2026క్షణక్షణం.. ఉత్కంఠ.. 👉లోక్‌భవన్‌కు బయలుదేరిన విజయ్👉కాసేపట్లో గవర్నర్‌తో కీలక భేటీ. 👉 కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్ ఆర్లేకర్. విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కాన్వాయ్ కేటాయించినట్లు వెల్లడించిన అధికారులుసుప్రీంకోర్టుకు విజయ్కాసేపట్లో గవర్నర్‌తో విజయ్ భేటీతమిళ రాజకీయంపై ఉత్కంఠకాసేపట్లో లోక్‌భవన్‌కు విజయ్.ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ కానున్న విజయ్.నిన్న గవర్నర్‌ను కలిసిన విజయ్118 మంది సంతకాలతో రావాలన్న గవర్నర్అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవలేదనే పాయింట్ మీద కోర్టుకు వెళ్లనున్న టీవీకే.సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నట్టు సమాచారం. అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పుదుచ్చేరి రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.అన్నాడీఎంకే బలం-47టీవీకే మద్దతు ఇవ్వాలన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలింపు.టీవీకేకే మద్దతు ఇవ్వాలంటున్న ఓ వర్గం.టీవీకేకి దూరంగా ఉండాలంటున్న మరో వర్గం.చెన్నైలోనే పళనిస్వామి వర్గం.పుదుచ్చేరిలో షణ్ముగం వర్గం.పుదుచ్చేరి రిసార్టులో దాదాపు 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి ఒక్కొక్కొరుగా పార్టీ ఆఫీసుకు వస్తున్న టీవీకే ఎమ్మెల్యేలు. నేడు విజయ్ కీలక సమావేశం.. నేడు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం.రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. మళ్లీ ఎన్నికలు జరపండి: శ్రీధర్ వేంబుతమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరపాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వ్యాఖ్యలు.టీవీకే విజయ్‌కి ప్రభుత్వ ఏర్పాటు కోసం తగినంత సంఖ్యా బలం లేదు.సంఖ్యలు సరిపోతున్నట్లు కనిపించడం లేదు.ఏ ప్రభుత్వం ఏర్పడినా, అది వివిధ రకాల ఆకర్షణలు, ఒత్తిళ్లతో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది.తమిళనాడు ఇంతకంటే మెరుగైన ప్రభుత్వానికి అర్హమైనది.అందుకే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి వస్తారని నేను భావిస్తున్నాను.ఒకవేళ డీఎంకే-అన్నాడీఎంకే దానిని ఆపాలనుకుంటే, వారిద్దరూ కలిసి పోరాడాలి.సున్నా సీట్లు వచ్చినా సరే, బీజేపీ ఒంటరిగా పోరాడాలి.తమిళనాడులో బీజేపీకి ఇది ఒక కొత్త ఆరంభం.ప్రజలే మళ్లీ నిర్ణయించనివ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు. The numbers don't seem to add up. Whatever government is cobbled together is likely to be unstable with various pulls and pressures. Tamil Nadu deserves better.President's rule with fresh elections may be the best course, this time with a very strict "no cash for votes"…— Sridhar Vembu (@svembu) May 7, 2026తమిళనాడులో అల్లర్లకు చాన్స్..తమిళనాడులో ఇంటెలిజెన్స్ హెచ్చరికపలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం.దీంతో, పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన సీఎస్, డీజీపీపొత్తులపై కొత్త ట్విస్ట్.. పొత్తులపై ప్రచారాన్ని ఖండించిన డీఎంకేఅవన్నీ ఫేక్ అంటూ డీఎంకే నేతలు వ్యాఖ్యలు.విజయ్ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదన్న స్టాలిన్మరోవైపు.. విజయ్‌కు తమ మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే.ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుపై ఉత్కంఠ.టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న లెఫ్ట్ పార్టీలు, అన్నాడీఎంకే.కాంగ్రెస్ మద్దతులో 112కు చేరిన టీవీకే బలంమరో ఆరుగురు ఎమ్మెల్యే కోసం టీవీకే ప్రయత్నాలు. రిసార్ట్ రాజకీయాలు..గత మూడు రోజులుగా మహాబలిపురంలోని రిసార్ట్‌లో టీవీకే ఎమ్మెల్యేలు.మరోవైపు.. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పుదుచ్చేరిలోని రిసార్ట్‌కు తరలింపు.'ది షోర్ త్రిశ్వం'లో 20కి పైగా గదులను బుక్ చేసుకున్న అన్నాడీఎంకే సీవీ షణ్ముగంPuducherry: AIADMK MLAs have gathered at a private resort in Puducherry amid uncertainty over government formation in Tamil Nadu. With TVK lacking a clear majority and seeking support, political maneuvering is underway. Heavy police security has been deployed to maintain law and… pic.twitter.com/hsUdAsgbSE— IANS (@ians_india) May 6, 2026ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను టీవీకే నేతలు కలిశారు.విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది.వీళ్లకు కాంగ్రెస్‌లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్‌కు అందజేత.ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిఅందుకు గవర్నర్ విముఖత.118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్‌కు గవర్నర్ సూచన.దీంతో నిరాశతో వెనుతిరిగిన విజయ్. రసవత్తరంగా తమిళ రాజకీయం..గంట గంటకూ మారుతున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలుకొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొనసాగుతున్న ఉత్కంఠ..నేడు ఏం జరగబోతోందని అనేది సస్పెన్స్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలం ఇలా.. టీవీకే - 108డీఎంకే - 59అన్నాడీఎంకే - 47కాంగ్రెస్ - 05పీఎంకే - 04ఐయూఎమ్ఎల్- 02సీపీఐ - 02సీవీకే - 02సీపీఎం - 02బీజేపీ - 01డీఎండీకే - 01అన్నామక్కల్ మున్నేట్ర కళగం - 01రెండు పార్టీల మంతనాలుతమిళనాట కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు వార్తలుఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలుకు 106 సీట్లువామపక్షాలు మిగిలిన చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నాయట!దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం. -
తమిళ రాజకీయంలో ఊహించని ట్విస్ట్...
-
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సంచలనం?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడుతున్న డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 106సీట్లు. ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే,అన్నా డీఎంకేల మధ్య జరిగిన చర్చల్లో చెరో రెండున్నరేళ్లు పాలించేలా ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, డీఎంకే, అన్నా డీఎంకే మధ్య చర్చలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నో సార్లు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కోసం చేతులు కలపాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య విభేదాలు 1970ల నుండి కొనసాగుతున్నాయి. ఈ రెండు పార్టీలు తమిళనాడులో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చి, రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా, దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న ఈ పార్టీలు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ పొత్తు జరిగితే, తమిళనాడు రాజకీయాల్లో ఇది చారిత్రక మలుపు అవుతుంది. అయితే, ఇరుపార్టీల కేడర్, నాయకత్వం ఈ నిర్ణయాన్ని ఎంతవరకు అంగీకరిస్తారన్నది చూడాలి. మరోవైపు, కొత్తగా ఎదుగుతున్న పార్టీలు కూడా ఈ సమీకరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
టీవీకేతో కాంగ్రెస్ పొత్తు.. డీఎంకే షాకింగ్ రియాక్షన్
చెన్నై: భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదంటూ డీఎంకే తేల్చి చెప్పింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందన్న డీఎంకే.. కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిచాం. అందుకు తాము భారీ మూల్యాన్ని చెల్లించామంటూ డీఎంకే పేర్కొంది.సోనియా, మన్మోహన్ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం. రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం. అయితే ఇప్పుడు డీఎంకేతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం.. మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం. మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది. ఇది ప్రజలను మోసం చేయడమే. బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండి కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం. ఓటమి మాకు కొత్తేమి కాదు.. వెన్నుపోటు కొత్త కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతాం’’ అంటూ డీఎంకే హెచ్చరించింది. -
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. స్టాలిన్ సంచలన నిర్ణయం
చైన్నై: తమిళనాడులో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీవీకేకు సరైన సంఖ్యాబలం లేదంటూ ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రకటించారు. కాగా ఇప్పుడు డీఎంకే సైతం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పింది. ఈ మేరకు డీఎంకే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.డీఎంకే అధికారిక ప్రకటనలో... కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిస్తే దానికి తాము భారీ మూల్యాన్ని చెల్లించామని పేర్కొంది. సోనియా, మన్మోహన్ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం ఐతే ఇప్పుడు DMKతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని తెలిపింది. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది ఇది ప్రజలను మోసం చేయడమేనని పేర్కొంది. బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదని రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికికాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా డీఎంకే అధినేత స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండియా కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం, ఓటమి మాకు కొత్తేమి కాదు..వెన్నుపోటు కొత్త కాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతామంది. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుఉండదు. ఆపద వేళ కాంగ్రెస్‌ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టింది". అని డీఎంకే ప్రకటన విడుదల చేసింది.టీవీకే మెజార్టీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్నపార్టీల మద్దతు కోరింది. దీంతో టీవీకేకు సపోర్టు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఎంకే సంచలన ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా డీఎంకే పార్టీ ఉంది. ఇండియా కూటమికి ఛైర్మన్‌గా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తున్నారు. కాగా డీఎంకే ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి సైతం దాదాపుగా వైదోలిగినట్లేనని విశ్లేషకులు అంచనా.. -
ఎంకే స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. ఎందుకంటే..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత.. ఎం.కే స్టాలిన్‌ను రజనీకాంత్ ఆయన నివాసంలో ఇవాళ(బుధవారం) కలిశారు. మర్యాద పూర్వకంగానే రజనీకాంత్.. స్టాలిన్‌తో భేటీ అయ్యారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్.. స్టాలిన్ కలిసి కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకోగా, డీఎంకే 59 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.స్టాలిన్ తన కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. డీఎంకే, మిత్రపక్షాలు రెండో అతిపెద్ద కూటమిగా నిలిచినందున.. కొత్త అసెంబ్లీలో అవి ప్రతిపక్ష స్థానంలో కూర్చోనున్నాయి. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.గతంలో రజనీకాంత్.. డీఎంకేకు అందించిన మద్దతు దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 1995లో రాజకీయాల్లోకి వస్తారని భావించిన సమయంలో ఆయన డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 1998 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీకి అండగా నిలిచారు. ఆ తర్వాత 2017లో రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించినప్పటికీ, 2021లో అనారోగ్య కారణాలతో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. విజయ్ విజయం తర్వాత.. ఆయనకు అభినందనలు తెలుపుతూ రజనీకాంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.కాగా, విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆయన పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఉప ఎన్నికలు జరగవచ్చు. మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకు ఇంకా 10 స్థానాల మద్దతు అవసరం. -
TVKకు కాంగ్రెస్ మద్దతు.. DMK ఫైర్
-
DMK తో 55 ఏళ్ల బంధాన్ని వదిలి TVK కు కాంగ్రెస్ మద్దతు
-
డీఎంకేతో కటీఫ్.. విజయ్‌కు మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకే పార్టీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు.. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీవీకే కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో డీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పినట్లైంది. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తొలి నుంచి భావిస్తోంది. అయితే డీఎంకే మాత్రం అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో స్టాలిన్ నేతృత్వంలో నిన్న జరిగిన కూటమి మీటింగ్‌కు కాంగ్రెస్ తరఫు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. బదులుగా.. టీవీకే నేత సెంగొట్టియాన్తో ఓ హోటల్లో సమావేశమై జట్టు గురించి చర్చలు జరిపారు. ఈ పరిణామం డీఎంకేకు మంట పుట్టించింది. కాంగ్రెస్ ఐదు స్థానాలు నెగ్గిందే స్టాలిన్ వల్ల అని.. టీవీకేతో వెళ్లడం వెన్నుపోటు కిందకే వస్తుందని మండిపడింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో రాహుల్ గాంధీని తప్పు పట్టిస్తున్నారని ఆరోపించింది. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మాణిక్యం ఠాగూర్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి? అని అన్నారాయన. ఈ క్రమంలో తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వమని చెప్పారు. మరోవైపు.. కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం. సెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది. విజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి అని అన్నారు.ఇంకోవైపు డీఎంకే కూటమికి కొత్తగా నెగ్గిన ఎమ్మెల్యే రాజేష్‌కుమార్ చురకలంటించారు. ఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం. కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్‌తో ఏం గెలవలేదు. తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు. ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా అని అన్నారు. ఇండియా కూటమికి బీటలుతమిళనాడు ఎన్నికల టైంలోనే సీట్ల పంపకాల విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఇండియా కూటమి పేరుతో కాకుండా సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరుతో ఎన్నికలకు వెళ్లారు. అయితే కేవలం 28 సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజా పరిణామంతో తమిళనాడులో డీఎంకేతో దోస్తీకి కాంగ్రెస్ గుడ్‌బై చెప్పింది. దీంతో.. డీఎంకే నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది. -
బాబొచ్చారు ఓటమి తెచ్చారు
-
DMK ఓటమిపై స్టాలిన్ స్పందన
-
ఆ పార్టీలతో విజయ్ పొత్తు ఖరారు.. ఎల్లుండే ప్రమాణ స్వీకారం
-
టీవీకే ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో బిగ్ ట్విస్ట్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులోకి ఉంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించడంతో టీవీకే మరో 10 మంది బలం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పది మంది కోసం టీవీకే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, అన్నాడీఎంకే లుకలుకలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి పార్టీలో చీలికలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్.. విజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక, తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి లీమా గెలుపొందారు.అయితే, ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్‌కు మద్దతు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై నేడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతానికి పళనిస్వామి.. ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమై ఉన్నారు. అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్‌కు మద్దతు ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. నేడు జరగబోయే సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు.. సీపీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో, వారంతా ఏ నిర్ణయం తీసుకోనున్నారనే సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే మద్దతుపై విజయ్ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో జయలలిత టైంలో పలు చేదు అనుభవాలు దృష్ట్యా విజయ్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో ఉంది. -
విజయ్ పవర్ స్ట్రోక్.. తెర వెనుక ఐదుగురు!
తమిళనాట ఎన్నికల పర్వం ముగిసింది. భారీ మెజార్టీతో టీవీకే విజయం సాధించారు. ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు విజయ్ చుక్కలు చూపించి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే, టీవీకే సాధించిన ఆకస్మిక విజయం వెనుక ఐదుగురు సీక్రెట్ సభ్యులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. దీంతో, వారి గురించే ఇప్పుడు ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..తమిళనాడులో విజయ్‌కు ఇప్పటికే బలమైన అభిమానగనం ఉంది. అభిమానుల విధేయతను ఎన్నికల బలంగా మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆన్లైన్ సైన్యం విజయ్ వద్ద అప్పటికే అందుబాటులో ఉంది. ఇక అవసరమైంది కేవలం ఒక పార్టీ నిర్మాణాన్ని రూపొందించుకోవడం మాత్రమే. అందులో భాగంగానే.. విజయ్ కోసం ఐదుగురు సభ్యుల సీక్రెట్ టీమ్.. ఎన్. ఆనంద్, అరుణ్‌రాజ్, CTR నిర్మల్ కుమార్, ఆధవ్ అర్జున, KA సెంగుట్టువన్ రంగంలోకి దిగారు. ఈ కీలక బృందం టీవీకే సందేశాన్ని రూపొందించడంలోనూ, క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషించింది. వీరందరూ కలిసి విజయ్ సినీ ప్రపంచంలో ఒక భాగంగా ఉంటూ టీవీకే విజయ రథాన్ని విజయం వైపు నడిపించారు.ఆనంద్ (Bussy ఆనంద్)ఆనంద్ 2006లో పుదుచ్చేరిలోని 'Bussy' నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి, ఈయన 'Bussy' ఆనంద్‌గా ప్రాచుర్యం పొందారు. విజయ్ తరపున క్షేత్రస్థాయిలో వ్యవహరించే ప్రధాన వ్యక్తి ఈయనే. విజయ్ను 'దళపతి' అని సంబోధించే ఆయన, విజయ్ అభిమాన సంఘమైన 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను నేటి టీవీకేగా తీర్చిదిద్దడంలో కేంద్ర బిందువుగా నిలిచారు. విజయ్ పార్టీ పేరును ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన విధేయత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత, కళ్లలో నీళ్లతో, భావోద్వేగానికి లోనైన ఆనంద్.. విజయ్ పక్కన కూర్చుని కనిపించారు. 2026 ఎన్నికల్లో టీనగర్ నియోజకవర్గం నుండి ఆనంద్ విజయం సాధించారు.అరుణ్‌రాజ్..ఎంబీబీఎస్ పట్టా కలిగి మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్‌రాజ్ తన పరిపాలనా నైపుణ్యాన్ని టీవీకే పార్టీకి అందించారు. పన్ను దాడులు, విచారణలను నిర్వహించడంలో విశేష అనుభవం ఉన్న అరుణ్‌రాజ్.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొద్ది కాలంలోనే ఆయన TVK అంతర్గత కోర్ కమిటీలో ఒక కీలక సభ్యుడిగా ఎదిగారు. విజయ్ అనుసరించే స్వతంత్ర రాజకీయ వైఖరి తనను ఆకర్షించిందని అరుణ్‌రాజ్ గతంలో పేర్కొన్నారు. డీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించే ఆయన, 2026 ఎన్నికల్లో తిరుచెంగోడ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.CTR నిర్మల్ కుమార్నిర్మల్ కుమార్.. TVK పార్టీకి డేటా, సోషల్ మీడియా నిపుణుడిగా వ్యవహరించారు. 2025లో టీవీకేలో చేరడానికి ముందు బీజేపీలో పనిచేసి రాజకీయ మెలకువలను నేర్చుకున్నారు. వాస్తవానికి, తమిళనాడులో టీవీకే డిజిటల్ ఉనికిని పెంచడంలో నిర్మల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా ఆయన కాషాయ పార్టీని వీడి, అన్నాడీఎంకేలో చేరారని వార్తలు వచ్చాయి. కానీ, అన్యూహంగా ఆయన టీవీకే చేరారు. నిర్మల్.. టీవీకేలో చేరిన తర్వాత సర్వేలు, ఓటర్ల డేటా విశ్లేషణ, పోలింగ్ బూత్ స్థాయి విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించారు. టీవీకే పార్టీకి 30% ఓట్ల వాటా లభిస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంతిమంగా పార్టీ 35% ఓట్ల వాటాను సాధించింది. ఆయన అందించిన వ్యూహాత్మక సూచనలే విజయ్ ఎన్నికల ప్రచార నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం నుండి విజయం సాధించారు.ఆధవ్ అర్జునఆధవ్ అర్జున భారతదేశ లాటరీ రాజుగా ప్రసిద్ధి. శాంటియాగో మార్టిన్ అల్లుడైన ఆధవ్ రాజకీయ ప్రస్థానం పలు రాజకీయ పార్టీల గుండా సాగింది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని 'Voice of Commons' అనే రాజకీయ సలహా సంస్థను స్థాపించడం ద్వారా ప్రారంభించారు. త్వరలోనే ఆయన పనితీరు డీఎంకే పార్టీ దృష్టిని ఆకర్షించింది. దాంతో 2021లో ఆయన డీఎంకేలో చేరారు. వాస్తవానికి డీఎంకే కోసం పనిచేసేలా ప్రశాంత్ కిషోర్‌ను ఒప్పించి తీసుకురావడంలో ఆధవ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. అయితే, డీఎంకేలో తనకు ఆశించిన కీలక పదవి లభించకపోవడంతో ఉదయనిధి స్టాలిన్‌తో ఆయనకు విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తిరుమావలవన్ నేతృత్వంలోని VCK పార్టీలో చేరారు, అక్కడ ఆయనకు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. అనంతరం, టీవీకే గూటికి చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన విల్లివాక్కం నుండి గెలుపొందారు.కేఏ సెంగోట్టయ్యన్సీనియర్ నాయకుడైన సెంగోట్టయ్యన్.. టీవీకేకి అత్యంత అపారమైన రాజకీయ అనుభవాన్ని అందించారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా (గోబిచెట్టిపాలయం నుండి) ఎన్నికైన ఆయన, ఎంజీ రామచంద్రన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అలాగే, జయలలితకు గట్టి మద్దతుదారుగా ఉండేవారు. నిజానికి, జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి కే పళనిస్వామి మరియు సెంగోట్టయ్యన్ ఇద్దరూ పోటీదారులుగా ఉన్నారు. శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వంలను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో ఈపీఎస్‌తో విభేదాల కారణంగా సెంగోట్టయ్యన్ అన్నాడీఎంకేను వీడారు. పార్టీ నుండి విడిపోయిన తర్వాత, ఆయన 2025లో టీవీకేలో చేరి విజయ్‌కు మార్గదర్శిగా మారారు. ఈ క్రమంలోనే గోబిచెట్టిపాలయంపై అతని విజయం ఆయన శాశ్వత ప్రభావాన్ని మరోసారి బలపరిచింది. -
ఈ వెన్నుపోటు రాజకీయమేంది?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల 2026 ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీశాయి. విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కగళం 108 స్థానాలు గెలిచింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు అవసరం పడింది. ఈ నేపథ్యంలో విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.తమిళనాడు సీనియర్ నేత, విజయ్‌కు కుడి భుజంగా పేరున్న సెంగొటియన్ నిన్నంతా కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి రాకూడదనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఈ తరుణంలో విజయ్ ఏర్పాటు చేయబోయే సర్కార్ మద్దతు ప్రకటించాలనే యోచనతోనే హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే ఇది మిత్రపక్షం డీఎంకేతో రాజకీయ ఘర్షణలకు కారణమయ్యేలా కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరిట డీఎంకే కూటమి పోటీ చేసింది. అయితే సీట్ల పంపకాల దగ్గరి నుంచి కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో డీఎంకేకు విబేధాలు మొదలయ్యాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఐదు చోట్ల నెగ్గింది. మరిన్ని ఎక్కువ స్థానాలు కేటాయించి ఉంటే ఎక్కువ సీట్లు గెలిచి ఉండేవాళ్లమని రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్, కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదించింది. ఈ నేపథ్యంలో.. నిన్న ఓటమి తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ కూటమి సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ఆ పార్టీ నేతలు విడిగా సమావేశమై టీవీకేతో జట్టు కలిసే అంశంపై చర్చించారు. ఇది డీఎంకేకు మరింత కోపం తెప్పించింది. కాంగ్రెస్ వైఖరిని వెన్నుపోటుగా అభివర్నిస్తూ డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై మండిపడ్డారు. The Backstabbers.— Saravanan Annadurai (@saravofcl) May 5, 2026No. DMK does not endorse the support of INC to TVK. It was their unilateral decision. The Backstabbers. https://t.co/DPPW3caNio— Saravanan Annadurai (@saravofcl) May 6, 2026ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకే సిద్ధమైంది. హైకమాండ్ రాష్ట్ర యూనిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇవాళ ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. మరోవైపు.. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించాయి. దీంతో ఇవాళో, రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4(సీపీఐ, సీపీఎం చెరో రెండు) కలిపితే తొమ్మిది స్థానాలు అవుతాయి. మరొక స్థానం తక్కువ అయ్యింది. డీఎంకే కూటమిలోని విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) ఎట్టి పరిస్థితుల్లో విజయ్‌కు మద్దతు ఇవ్వమని ప్రకటించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా పొత్తునకు ససేమీరా అనేసింది. అయితే దివంగత విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే మద్దతు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున 1 స్థానం గెలుచుకోగా.. విజయ్ తన బిడ్డలాంటోడంటూ విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడు ఫలితాలతో డీఎంకే కుదేలు అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ప్రకటిస్తే అది మరో దెబ్బ కానుంది. -
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకే-అన్నాడీఎంకేల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47సీట్లతో మొత్తం 106సీట్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ప్రయత్నాలు ముమ్మరం 1970ల నుంచి డీఎంకే ,అన్నా డీఎంకే మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా ఒక్కటి కానున్న బద్ధ శత్రువులు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని డీఎంకే, అన్నాడీఎంకే పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలువిజయ్కు మద్దతిచ్చేందుకు వామపక్షాల నిరాకరణమద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలుకూటమిలోనే ఉంటామని ప్రకటన ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని చెప్పిన ముస్లిం లీగ్టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్రేపు విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమేప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లభించని గవర్నర్ అనుమతిమెజార్టీపై గవర్నర్‌ను ఒప్పించలేకపోయిన విజయ్విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలన్న గవర్నర్ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదు : టీవీకే లోక్‌భవన్‌లో జరిగిన పరిణామాలు రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చరేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న విజయ్ తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అని అడిగిన గవర్నర్ రేపు ఉదయం 6గంటల సమయానికి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పిన టీవీకే నేతలు ప్రమాణ స్వీకారానికి అడ్డులేదని చెప్పిన టీవీకే ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?లోక్‌భవన్‌కు చేరుకున్న విజయ్ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించిన గవర్నర్ ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?గవర్నర్‌తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారంపై క్లారిటీ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు విజయ్‌కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కాంగ్రెస్తో పాటు విజయ్‌కు మద్దతు ఇచ్చిన సీపీఐ,సీపీఎం గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ కానున్న విజయ్ కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో విజయ్ భేటీపార్టీ ఆఫీస్ నుంచి లోక్ భవన్‌కు బయల్దేరిన విజయ్ గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాలు వివరాల్ని అందిచనున్న విజయ్ అంతకంటే ముందే తమిళనాడు ఎన్నికల సంఘం గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ భేటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాల్ని అందించిన అధికారులు విజయ్ మరో సంచలనం?సాయంత్రం లోక్‌భవన్‌కు విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్మద్దతుదారుల లిస్ట్‌ను గవర్నర్‌ను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ తర్వాతే ప్రమాణస్వీకారంపై రానున్న స్పష్టతరేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణం?విజయ్ మరో సంచలన నిర్ణయంప్రమాణ స్వీకార ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కాకుండా టీవీకే తరఫున చేయాలని నిర్ణయంఖర్చంతా భరించనున్న టీవీకే పార్టీనెహ్రూ ఇండోర్ స్టేడియంలో 5 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుసాయంత్రంకల్లా రానున్న క్లారిటీ ప్రొటెం స్పీకర్ ఎవరంటే..టీవీకే నుంచే ప్రొటెం స్పీకర్9వ సారి ఎమ్మెల్యేగా నెగ్గిన సెంగొట్టియాన్అన్నాడీఎంకేలో సుదీర్ఘ కాలం ఉన్న సెంగొట్టియాన్గతేడాది విజయ్ టీవీకేలో చేరికవిజయ్కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న సెంగొట్టియాన్ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే కూటమి పార్టీలతో చర్చలు జరిపిన సెంగొట్టియాన్ఫలించిన సెంగొట్టియాన్ దౌత్యం.. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఇతర పార్టీలుపార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న విజయ్మహాబలిపురంలోని రిసార్ట్‌లో బస చేసిన ఎమ్మెల్యేలుప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సమయం ఉండడంతో జాగ్రత్త పడ్డ టీవీకే అధినేతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 123?తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే నెగ్గిన స్థానాల సంఖ్య 108రెండు చోట్ల విజయ్ గెలుపు.. ఒక చోట రాజీనామా చేస్తే 107కాంగ్రెస్ 5 (మద్దతు ప్రకటన)సీపీఐ, సీపీఎం 2+2 (చర్చలు జరగాల్సి ఉంది.. దాదాపుగా మద్దతు ఖరారైనట్లే) ఏఎంఎంకే 1 (మద్దతు ప్రకటన)వీసీకే 2 (మద్దతు ఇవ్వబోమని తొలుత ప్రకటించారు. అయితే విజయ్ లేఖ రాశారు.. ఇంకా బదులు రావాల్సి ఉంది)పీఎంకే 4 (బదులు రావాల్సి ఉంది)అంతా సవ్యంగా సాగితే.. విజయ్ పార్టీ బలం 123కి చేరే చాన్స్తమిళనాడు రాజకీయాల్లో మరో సర్ప్రైజ్?బయటకు నుంచి టీవీకేకు మద్దతు ఇచ్చే యోచనలో అన్నాడీఎంకేఇప్పటికే అన్నాడీఎంకేలో విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై ముసలంసపోర్ట్ ఇవ్వాలని ఒక వర్గం.. ఇవ్వొద్దని మరో వర్గంఅన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలిసిన టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథవ్ అర్జునాఎన్డీయే నుంచి బయటకు వచ్చి విజయ్ టీవీకేకు మద్దతు తెలిపే అవకాశంఅదే జరిగితే అమాంతం పెరగనున్న టీవీకే బలంవిజయ్కు గవర్నర్ ఆహ్వానంతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ ఆహ్వానంసాయంత్రం గవర్నర్‌ను కలవనున్న విజయ్మద్దతుదారుల లిస్ట్‌ను గవర్నర్‌ను అందజేయనున్న విజయ్టీవీకే బలం 108 (విజయ్ రెండు చోట్లా పోటీ.. ఒక చోట రాజీనామా చేస్తే 107)మద్దతు ప్రకటించిన కాంగ్రెస్మద్దతు ఇచ్చిన ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యేవామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశంటీవీకేకు భేషరతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ముగిసిన తమిళనాడు కాంగ్రెస్ నేతల భేటీటీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసిన కాంగ్రెస్తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే కూటమి తరఫున 28 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ఐదు స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్టీవీకే మద్దతు విషయంలో డీఎంకేతో విబేధాలుపరస్పర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్-డీఎంకే నేతలుఇదీ చదవండి: డీఎంకేతో కటీఫ్.. విజయ్‌తో దోస్తీవిజయ్కు మద్దతు.. తప్పేంటి?: కాంగ్రెస్విజయ్కు మద్దతు విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం: మాణిక్యం ఠాగూర్ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు: మాణిక్యం ఠాగూర్ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి?: మాణిక్యం ఠాగూర్తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వం: మాణిక్యం ఠాగూర్టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది: కార్తీ చిదంబరంపార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం: కార్తీ చిదంబరంసెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది: కార్తీ చిదంబరంవిజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి: కార్తీ చిదంబరంఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం: ఎమ్మెల్యే రాజేష్కుమార్కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్‌తో ఏం గెలవలేదు: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు: ఎమ్మెల్యే రాజేష్కుమార్ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళనాట మరో ట్విస్ట్అన్నాడీఎంకే మద్దతు కోరే యోచనలో టీవీకే విజయ్?అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి టీవీకే కీలక నేత పళనిస్వామితో భేటీ కానున్న అథవ్ అర్జునాటీవీకేలో టాప్ 5 కీలక నేతల్లో అథవ్ అర్జునా ఒకరుఎన్నికల్లో పని చేసిన అథవ్ అర్జునా వ్యూహాలుమద్దతుపైనే చర్చిస్తారంటున్న అన్నాడీఎంకేలోని ఓ వర్గంవిజయ్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకేనంటున్న మరో వర్గంఅన్నాడీఎంకే నుంచి టీవీకేకు టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే అత్యవసర సమావేశంఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోరుతూ విజయ్ లేఖసాయంత్రం మద్దతుదారుల లిస్ట్‌తో గవర్నర్‌ను కలవనున్న విజయ్?తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ ప్రయత్నాలుతమిళనాడు కాంగ్రెస్‌తో పాటు చిన్న పార్టీల మద్దతు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకేలకు లేఖ రాసిన విజయ్మద్దతు తెలిపేందుకు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్(5), ఏఎంఎంకే(1)మద్దతు కోసం విజయ్ వెయింటింగ్ఈలోపే.. లోక్‌భవన్ నుంచి టీవీకేకు కబురుసాయంత్రంలోగా మద్దతుదారుల జాబితాను లోక్‌భవన్‌కు పంపనున్న టీవీకేస్వయంగా వెళ్లి సమర్పించే యోచనలో విజయ్రేపు సీఎంగా ప్రమాణం చేసే చాన్స్బలనిరూపణకు ఇప్పటికే రెండు వారాల గడువు కోరిన విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారుమధ్యాహ్నాం చెన్నైకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్సాయంత్రం టీవీకే అధినేత విజయ్‌కు అపాయింట్మెంట్ ఖారారు చేసిన లోక్భవన్రేపు సీఎంగా విజయ్ ప్రమాణం చేసే ఛాన్స్గవర్నర్తో భేటీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్న టీవీకేఅన్నీ కుదిరితే.. రేపు నెహ్రూ స్టేడియంలో 11.30గం.కి సీఎంగా విజయ్ ప్రమాణంవిజయ్ ఒక్కడే ప్రమాణం చేసే అవకాశంబలనిరూపణకు.. గవర్నర్‌ను రెండు వారాల గడువు కోరిన విజయ్విజయ్కు శ్రీలంక నేతల శుభాకాంక్షలుతమిళనాట టీవీకే ప్రభంజనంతొలి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించిన విజయ్పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ విక్టరీఅభినందిస్తున్న శ్రీలంక నేతలువిజయ్ గెలుపుతో ఉత్తర ప్రావిన్స్‌లో తమిళ యువత సంబురాలువిజయ్కు విషెస్ తెలియజేసిన ప్రతిపక్ష నేత, ఎంపీ నమల్ రాజపక్సగతంలో.. శ్రీలంక విషయంలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించిన విజయ్శ్రీలంక తమిళుల కోసం గొంతెత్తడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యఖర్గేకు విజయ్ లేఖప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ మద్దతు కోరుతూ టీవీకే లేఖఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విజయ్సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ యూనిట్‌కే వదిలేసిన హైకమాండ్విజయ్ను కలిసేందుకు సమయం కోరిన కాంగ్రెస్తన కేబినెట్లో రెండు మంత్రి పదవులు కాంగ్రెస్‌కు!వామపక్ష పార్టీలనూ మద్దతు కోరిన విజయ్ఎల్లుండి వామపక్ష పార్టీలతో విజయ్ సమావేశంపళనిస్వామికి చుక్కలుటీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో లుకలుకలుఅన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి చుక్కలు చూపిస్తున్న చీలికలుఒక వర్గం ఇద్దామని.. మరో వర్గం ఇవ్వొద్దని వాదనలువిజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి గెలుపొందిన లీమాపళనిస్వామి నేతృత్వంలో నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకేకూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ఇస్తారా? అనే చర్చసమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతుపై ఏమాత్రం ఆసక్తిగా లేని విజయ్గతంలో జయలలిత టైంలో విజయ్‌కు పలు చేదు అనుభవాలు!అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారంఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమైన పళనిస్వామి47 సీట్లతో మూడో స్థానంలో ఉన్న అన్నాడీఎంకే గవర్నర్.. చెన్నైకి వస్తారా?లోక్‌భవన్ పిలుపు కోసం టీవీకే ఎదురు చూపులుకేరళ, తమిళనాడుకు గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ప్రస్తుతం త్రివేండ్రంలో ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు లోక్‌భవన్‌కు సమాచారం అందించిన టీవీకే వర్గాలుఇప్పటికే బలనిరూపణకు రెండు వారాల గడువు కోరిన విజయ్మద్దతుదారుల జాబితాను లోక్‌భవన్‌కు పంపాలని ఇప్పటికే గవర్నర్ సూచనపూర్తి సమాచారం ఇచ్చాకే కమ్యూనికేట్ చేస్తామంటున్న లోక్‌భవన్ వర్గాలుగవర్నర్ వస్తే.. వెళ్లి కలిసే యోచనలో విజయ్ఐదు కోసం..తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే ప్రయత్నాలుమేజిక్ ఫిగర్ 118టీవీకే తరఫున నెగ్గింది 108తిరుచ్చి ఈస్ట్‌కి రాజీనామా చేసే యోచనలో విజయ్అదే జరిగితే 108 నుంచి 107కి పడిపోనున్న టీవీకే బలంకాంగ్రెస్, ఏఎంఎంకే సపోర్ట్‌తో 113కి పెరగనున్న టీవీకే బలంమరో ఐదుగురి కోసం టీవీకే ప్రయత్నాలుకాంగ్రెస్ నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీకాంగ్రెస్ వైఖరిపై డీఎంకే మండిపాటుకాంగ్రెస్ ఆ ఐదు స్థానాలు నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేసీట్ల పంపకం విషయంలో డీఎంకే తప్పు చేసింది.. మరిన్ని సీట్లు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు ఇచ్చేవాళ్లం: కాంగ్రెస్కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వస్తుందా? బయటి నుంచే టీవీకేకు మద్దతు ఇస్తుందా?డీఎంకే ఇందుకు ఒప్పుకుంటుందా?డీఎంకే-కాంగ్రెస్ బంధం ముగిసినట్లేనా?అదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లోనూ బలహీనపడనున్న డీఎంకే!టీవీకే ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరంతమిళనాడులో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసిన టీవీకేమహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో టీవీకే ఎమ్మెల్యేలు బసడీఎంకే కూటమిలోని పార్టీలతో టీవీకే నేత సెంగొట్టాయాన్ మంతనాలుకాంగ్రెస్ మద్దతు దాదాపు ఖరారువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్‌కు రెండు మంత్రిత్వ శాఖలకు ఇచ్చే యోచనఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌కు టీవీకే గాలంమన్నార్గుడి నుంచి నెగ్గిన కామరాజ్రేపే విజయ్ ప్రమాణం?తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి టీవీకే ముహూర్తం ఫిక్స్రేపు 11.30 ని. నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణంముహూర్తం పెట్టిన రాధన్ పండిట్నాలుగేళ్ల కిందటే విజయ్ విజయాన్ని జోస్యం చెప్పిన రాధన్తమిళనాడు గవర్నర్ కోసం ఎదురు చూపులుప్రస్తుతం కేరళం త్రివేండ్రంలో ఉన్న గవర్నర్విజయ్కు మరో షాక్ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకేకు మద్దతు నిరాకరించిన ఐయూఎంఎల్తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన పార్టీడీఎంకే నాయకత్వానికే కట్టుబడి ఉంటామని వ్యాఖ్యఇప్పటికే మద్దతు ఇవ్వబోమని వీసీకే పార్టీ స్పష్టీకరణపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉: సారీ.. సపోర్ట్ ఇవ్వలేం!కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఫైర్విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయంతీవ్రంగా తప్పుబడుతున్న డీఎంకేసెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్గా డీఎంకే కూటమిలో కాంగ్రెస్వెన్నుపోటు కిందకే వస్తుందంటున్న డీఎంకేఇవాళ తమిళనాడు కాంగ్రెస్ సమావేశంస్టాలిన్ నేతృత్వంలో జరిగిన నిన్నటి కూటమి మీటింగ్‌కు కాంగ్రెస్ డుమ్మా విజయ్ మద్దతు అంశంపై విడిగా సమావేశమైన కాంగ్రెస్నేడు మరోసారి సమావేశమై మద్దతు ప్రకటన చేసే చాన్స్సంబంధిత వార్త: కాంగ్రెస్-డీఎంకే బంధం ముగిసినట్లేనా?టచ్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?టీవీకేకు టచ్‌లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుTVKకు మద్దతు ఇస్తామంటున్న పలువురు ఎమ్మెల్యేలుఅప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానంనేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంచెన్నైలోని AIADMK కార్యాలయంలో సమావేశంఅన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలుగెలిచిన ఎమ్మెల్యేలందరూ రావాలని పళనిస్వామి ఆదేశంఅవసరమైతే రిసార్ట్‌కు తరలించే యత్నంఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలుతమిళనాడులలో ఏ పార్టీకి దక్కని మెజారిటీ(118)అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (108)ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకేమహాబలిపురం రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇతర పార్టీల ప్రయత్నాలుచెన్నైలోనే ఉన్న 59 మంది డీఎంకే, 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే కీలక సమావేశంనేడు గవర్నర్‌ను కలవనున్న విజయ్?నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్న టీవీకే అధినేత విజయ్ప్రస్తుతం కేరళం పర్యటనలో ఉన్న గవర్నర్నేడు మధ్యాహ్నాం చెన్నైకి చేరుకునే చాన్స్సాయంత్రంలోపు అపాయింట్మెంట్ కోరిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వివరించే అవకాశంఇప్పటికే రెండు వారాల గడువు కోరుతూ లేఖరేపు సీఎంగా నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణం?ఒకటి తక్కువైంది!ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన తమిళగ వెట్రి కగళంమ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంవిజయ్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్విజయ్ కోరితే మద్దతు అంశం పరిశీలిస్తామన్న వామపక్షాలురెండు కలిపినా.. 9 స్థానాలేప్రభుత్వ ఏర్పాటునకు మరో సీటు తక్కువ -
ఓట్ల తేడా 17.43 లక్షలే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మంగళవారం స్పందించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన టీవీకేకు, డీఎంకేకి పోలైన ఓట్లలో తేడా 17.43 లక్షలు మాత్రమేనన్నారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 74 సీట్లు గెలుచుకోగా, ఇందులో డీఎంకేకి 59 స్థానాలు దక్కాయి. సోమవారం వెలువడిన ఫలితాలపై మంగళవారం ఎంకే స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. టీవీకే, డీఎంకే కూటమికి ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమేనన్నారు. డీఎంకే కూటమికి 1.54 కోట్ల మంది ఓటేశారని ఆ ప్రకటనలో వివరించారు. తమకు పడిన ప్రతి ఓటూ తమపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అనేక పర్యాయాలు అధికారం చేపట్టిందని గుర్తు చేస్తూ ఆయన, ‘మేం చూడని విజయం లేదు, ఎదుర్కోని ఓటమి లేదు’అని పేర్కొన్నారు. ‘గెలుపోటములను సమానంగా చూస్తూ, ఆశయ సాధన దిశగా ప్రయాణాన్ని కొనసాగించేవారే పార్టీ నిజమైన కార్యకర్తలు. ఈ ఉద్యమానికి ఆధారం, పునాదులు’అని పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. స్టాలిన్ రాజీనామా..ఆమోదం తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇన్‌ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు పంపించారు. సీఎం స్టాలిన్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ అర్లేకర్ ఆమోదించారని అనంతరం లోక్‌భవన్ తెలిపింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని స్టాలిన్‌ను గవర్నర్ కోరారని వివరించింది. ఓటర్లకు కృతజ్ఞతగా ర్యాలీ స్టాలిన్ మంగళవారం ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కూటమి పార్టీలకు చెందిన వైగో, తదితరులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలెవరూ ఈ భేటీకి రాకపోవడం గమనార్హం. సాయంత్రం ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతగా రోడ్‌షో చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంకే వర్గాలు, మద్దతుదారులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయ నిధి? 59 మంది సీట్లను గెల్చుకున్న డీఎంకే అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఉదయనిధిని ప్రశ్నించగా, అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తెలిపారు. -
విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్బుత విజయం అందుకున్నాడు. తొలిసారి బరిలో నిలిచినప్పటికీ ఏకంగా 108 స్థానాల్లో కైవసం చేసుకోవడం తలలు పండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్‌ని రెండు వారాల సమయం అడిగిన విజయ్.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇకపోతే విజయ్ గెలుపు గురించి చాలామంది చాలారకాలుగా ట్వీట్స్ చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాస్త వ్యంగ్యంగా ఫొటోతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్‌లో త్రిష)తమిళనాడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, డీఎంకే పార్టీని కూడా నడిపించిన కరుణానిధితో పాటు విజయ్ ఉన్న పాత ఫొటోని షేర్ చేసిన వర్మ.. 'తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమిళనాడులో 234 స్థానాలుండగా విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు దక్కించుకుంది. డీఎంకే కూటమి 73, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌తో కలిసొచ్చేది ఎవరా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలు.. విజయ్‌కి మద్ధతుగా నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: టీవీకే విజయం.. త్రిష కూడా రాజకీయాల్లోకి?)Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026 -
DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు
-
విజయ్ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీని వెనక మరో వ్యూహం ఉండొచ్చనే చర్చా జోరందుకుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్ల విక్టరీతో సంచలన విజయం నమోదు చేసింది తెలిసిందే. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీకి టీవీకే దగ్గర్లోనే ఆగిపోయింది. అయినప్పటికీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కోరారు. ఆ వెంటనే.. నెగ్గిన వాళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి రప్పించిన ఆయన.. అటు నుంచి అటే పూంజేరీలోని ఓ స్టార్ హోటల్‌కు తరలించాలని నిర్ణయించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే వాళ్లకు బస ఏర్పాటు చేయాలని పార్టీ కీలక నేతలను ఆయన ఆదేశించారు. అయితే..విజయ్ మాస్టర్ ప్లాన్?టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఒకట్రెండు సీట్లు నెగ్గిన పార్టీలు విజయ్ పార్టీతో అధికారంలో భాగమయ్యేందుకు ముందుకు వచ్చాయి. మద్దతు అంశం పరిశీలిస్తామని బహిరంగంగా ప్రకటనలు సైతం చేస్తున్నాయి. అయితే ఆయన ఈ విషయంలో ఆచితూచీ అడుగేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే పూర్తిగా ఆయన నిర్ణయమేనని.. అందులో తమ పాత్ర ఏదీ ఉండబోదని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. రెండు వారాల గడువు కోరడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది. ఈలోపు సమీకరణాలు ఎలాగైనా మారొచ్చని ఆయన లెక్కేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పటికైనా రిస్క్ ఉండొచ్చు. అందుకే పెద్ద చేపలకే ఆయన గాలం వేసి ఉంటారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్‌లో డీఎంకే లేదంటే అన్నాడీఎంకే నుంచి పలువురు బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించే అవకాశం లేకపోలేదు(అసలే అన్నాడీఎంకేలో ఆ అసంతృప్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది). ఇందుకు అవకాశం ఉండడంతోనే.. డీఎంకే, అన్నాడీఎంకేలు అప్రమత్తం అయ్యాయి. ఇవాళ చెన్నైలో ఆ పార్టీలు కీలక సమావేశాలు పెట్టుకున్నాయి. ఎమ్మెల్యేలంతా చెన్నైకు తరలి రావాలని ఆదేశించాయి. అటు నుంచి అటే వాళ్లను కూడా రిసార్ట్‌లకు తరలించవచ్చనే చర్చా అక్కడ జోరందుకుంది. మొత్తానికి విజయ్ మాస్టర్ స్ట్రోక్‌కు తమిళనాట దిగ్గజ పార్టీలు విలవిలలాడిపోతున్నాయి. -
ఊరిస్తున్న సీఎం కుర్చీ.. 108 సీట్లు వచ్చినా.. విజయకి కష్టాలే
-
సీఎంనే ఓడించిన మొనగాడు ఇతనే....
-
విజయ్ వెంట ఎవరెవరు? ఆప్షన్స్ ఇవే
-
ద్రవిడ అధికార శకానికి ముగింపు
సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే ద్రవిడ పార్టీల ఐదు దశాబ్ధాల పాలనా శకానికి టీవీకే ముగింపు పలికింది. తమిళనాడులో 1962లో ద్రవిడ పార్టీగా డీఎంకే ఎన్నికలకు వెళ్లగా 50 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చుంది. 1967 ఎన్నికల్లో అన్నాదురై నేతృత్వంలో డీఎంకే తొలిసారిగా అ«ధికార పగ్గాలు చేపట్టింది. ఆయన మరణం తర్వాత 1969లో కరుణానిధి డీఎంకే అధ్యక్షపగ్గాలతో పాటు తమిళనాడు సీఎం కురీ్చని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు ఎంజీఆర్, కరుణానిధి మధ్య నెలకొన్న వివాదంతో అన్నాడీఎంకే ఆవిర్భవించింది. 1977 ఎన్నికల్లో తొలిసారిగా ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకుంది. మరణించే వరకు ఎంజీఆర్ సీఎంగా కొనసాగారు. తర్వాతి పరిణామాలతో 1989లో వచ్చిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రెండు పార్టీల ప్రభుత్వాలు వరుసగా మారుతూ వచ్చాయి. 1991లో అన్నాడీఎంకే, 1996లో డీఎంకే, 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే అధికారం చేపట్టాయి. 2011 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం జయలలిత తన రాజకీయ గురువు ఎంజీఆర్ రికార్డును తిరగరాస్తూ 2016లో మళ్లీ గెలిచారు. ఆమె మరణం తదుపరి పరిణామాలతో 2021 ఎన్నికల్లో డీఎంకే గద్దె నెక్కింది. డీఎంకే దివంగత అధినేత కరుణానిధి వారసుడైన స్టాలిన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఇలా డీఎంకే, అన్నాడీఎంకే అంటూ అధికారం సాగుతూ వచ్చిన సమయంలో తమిళనాడులో మూడోశక్తిగా అవతరించిన విజయ్ రూపంలో ద్రవిడ పార్టీల అధికార శకానికి ముగింపు పలికినట్లయింది. -
MGR తర్వాత.. విజయ్ రికార్డ్ TVK విజయ దుందుభి
-
విజయకి జేజేలు అయ్య.. అమ్మ.. అన్న
-
Tamilnadu Results: MLA గా స్టాలిన్ ఓటమి...!
-
TVK సంచలనం. 50 ఏళ్ల పార్టీలను మట్టి కరిపించిన విజయ్
-
DMK ఓటమికి కారణం ఇదే..
-
DMK పార్టీ ఆఫీస్ వద్ద టెంట్లు పీకేస్తున్న కార్యకర్తలు
-
తమిళనాట తలకిందులైన లెక్కలు
తమిళనాడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అనూహ్యంగా టీవీకే ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. డీఎంకేను దాటి దూసుపోతుంది. తమిళనాడులో టీవీకే ముందంజ ఉండగా, రెండో స్థానంలో డీఎంకే, మూడో స్థానానికి అన్నాడీఎంకే పరిమితమైంది. తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. లీడింగ్‌లో టీవీకే విజయ్ పార్టీ దూసుకుపోతుంది.విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. టీవీకే విజయ్‌కు తమిళ ఓటర్లు జైకొట్టారు. హంగ్ వస్తే టీవీకే-అన్నాడీఎంకే జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి.మరోవైపు, ముందస్తుగా అప్రమత్తమైన విజయ్ పార్టీ.. తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరతీసిన సంగతి తెలిసిందే. మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ‘గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు’ అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
గవర్నర్‌ను కలిసి రాజీనామా చేయనున్న స్టాలిన్
తమిళనాడు ప్రజా తీర్పు బయటకు వస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు.. అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠ నెలకొంది. దీంతో గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పార్టీల అధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు చూస్తున్న ఎదురుచూపులకు ఎండ్‌కార్డు పడనుంది. టీవీకేకు కంగ్రాట్స్: మోదీతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై మోదీ స్పందనఎన్డీయేకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలుప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాంటీవీకే అద్భుత ప్రదర్శనకు అభినందనలురెండు స్థానాల్లోనూ విజయ్ గెలుపుతమిళనాడులో టీవీకే విజయ్ సంచలనం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపుపెరంబూర్, తిరుచ్చిలో గెలిచిన విజయ్ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లుడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లుఒంటరిగా డీఎంకే సాధించిన ఓట్లు 83 లక్షలుఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లుఒంటరిగా ఏఐఏడీఎం సాధించిన ఓట్లు 77 లక్షలు రెండో స్థానంలోకి వచ్చిన డీఎంకేపుంజుకున్న డీఎంకే రెండో స్థానంలోకి వచ్చిన డీఎంకేటీవీకే 107 స్థానాల్లో ఆధిక్యండీఎంకే 59 స్థానాల్లో ఆధిక్యండీఎంకే 47 స్థానాల్లో ఆధిక్యం ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులుటీవీకే చీఫ్ విజయ్ కీలక ఆదేశాలుఅభ్యర్థులంతా చెన్నై రావాలని పిలుపుప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులుస్టాలిన్ రాజీనామా!కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న స్టాలిన్సీఎం పదవికి రాజీనామా చేయనున్న స్టాలిన్ఒక్కో మెట్టు ఎక్కాడు: విజయ్ తండ్రిటీవీకే గెలుపుపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ హర్షంతమిళ ప్రజలకు మేలు చేయాలనేదే లక్ష్యంగెలుపుపై విజయ్ మొదటి నుంచి ధీమాగా ఉన్నాడుఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు సీఎం అవుతున్నాడు👉తమిళనాట టీవీకే, కాంగ్రెస్, లెఫ్ట్ జట్టుకంటే అవకాశంకాంగ్రెస్కు 5 సీట్లు వచ్చే అవకాశంసీపీఎం 2, సీపీఐకి 2 వచ్చే సూచనలుతమిళనాడులో కేవల 2 స్థానాల్లోనే బీజేపీ లీడ్అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ 👉తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సంచలనంవంద స్థానాలు దాటి దూసుకుపోతున్న టీవీకేతమిళనాడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేహంగ్ దిశగా తమిళనాడుటీవీకే విజయ్ నివాసం దగ్గర భద్రత పెంపుచెన్నైలోని విజయ్ ఇంటికి భారీగా చేరుకుంటున్న అభిమానులువిజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానుల సంబరాలువిజయ్ తండ్రి నివాసంలో సంబరాలుతమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయం: టీవీకేఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు 👉ఓటమి దిశగా సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్నకొళతూర్ యోజకవర్గంలో టీవీకే ముందంజడిప్యూటీ సీఎం పోటీ చేస్తున్న చెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గంలో సైతం టీవీకే ముందంజకొలతూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు ముందంజచెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి సెల్వం ముందంజ👉విరుంబాకంలో టీవీకే ఆధిక్యంవిజయ్ డ్రైవర్ కుమారుడు శబరినాథన్ లీడ్కొళత్తర్లో వెనుకంజలో సీఎం స్టాలిన్చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ వెనుకంజ 👉చెన్నైలో బోసిపోయిన డీఎంకే కార్యాలయంఆఫీస్ దగ్గర కనిపించని డీఎంకే కార్యాలయంటెంట్లు తీసేసి కుర్చీలు తీసుకెళ్తున్న డీఎంకే కార్యకర్తలుఎన్నికల ఫలితాల షాక్‌తో బోరున విలపించిన డీఎంకే శ్రేణులు👉తమిళనాడులో 100 స్థానాల్లో టీవీకే ఆధిక్యంటీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రతవిజయ్ నివాసానికి భారీగా చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలుజెండాలు పట్టుకుని సందడి చేస్తున్న టీవీకే అభిమానులుకేంద్ర బలగాలతో విజయ్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం 👉ఆధిక్యం ఇలా.. విజయ్ టీవీకే పార్టీ 103అన్నాడీఎంకే 76డీఎంకే 53👉తమిళనాడులో సంచలన ఫలితాలుతమిళనాట వెలువడుతున్న సంచలన ఫలితాలు!లీడ్‌లో సెంచరీ కొట్టిన విజయ్ టీవీకేఎర్లీ ట్రెండ్స్‌లో.. 100 సీట్ల ఆధిక్యంటీవీకే దూకుడు దాటికి డీఎంకే విలవిలరెండో స్థానంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో స్థానానికి పరిమితమైన డీఎంకే కూటమిఐదు చోట్ల ఆధిక్యంలో డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ డీఎంకే ఆఫీస్ ముందు టెంట్ల తొలగింపుతిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో ఆధిక్యంలో విజయ్విజయ్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు👉తమిళనాడులో ఒక్కసారిగా మారిన సీన్అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకొచ్చిన టీవీకేడీఎంకేను దాటి దూసుపోతున్న టీవీకేతమిళనాడు ఫలితాలపై సర్వతా ఉత్కంఠతమిళనాడులో పోస్టల్ బ్యాలెట్లో టీవీకే ముందంజరెండో స్థానంలో డీఎంకేపోస్టల్ బ్యాలెట్ మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేతమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో మొదటి స్థానానికి దూసుకొచ్చిన టీవీకే 👉తమిళనాడులో డీఎంకే ఆధిక్యంపలు స్థానాల్లో రన్నరప్‌గానే అన్నాడీఎంకేరెండో స్థానంలో అన్నాడీఎంకే, టీవీకే మధ్య హోరాహరీకొళత్తూర్లో డీఎంకే కన్నా టీవీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యం 👉చెన్నై సిటీలో డీఎంకే, టీవీకే హోరాహోరీకొళత్తూరులో సీఎం స్టాలిన్ ముందజచెపాక్లో ఉదయనిధి ఆధిక్యంతిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో విజయ్ వెనుకంజమైలాపూర్లో తమిళిసై వెనుకంజతిరుచ్చి వెస్ట్‌లో మంత్రి నెహ్రూ వెనుకంజఎడప్పాడిలో పళనిస్వామి ముందంజకోయంబత్తూరు సౌత్‌లో సెంథిల్ బాలాజీ ముందంజ 👉పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్డీఎంకే -22 స్థానాలుఏఐడిఎంకే -5 స్థానాలుటీవీకే 4 స్థానాల్లో ముందంజ👉పెరంబూర్‌లో విజయ్ ముందంజకొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డీఎంకే ఆధిక్యం #WATCH | Tamil Nadu Assembly Elections | Heavy security arrangements have been put in place at the counting centre set up at Loyola College in Chennai, where votes for several key Assembly constituencies will be counted today. pic.twitter.com/JEQmLTjLhh— ANI (@ANI) May 4, 2026👉తమిళనాడులో కౌంటింగ్ ప్రారంభంమొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులురాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బందిచెన్నైలోని లయోలా కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లుపలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 👉మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు?నేడు తమిళనాడు ఎన్నికల ఓట్ల కౌంటింగ్ఉదయం 8 గంటల నుంచి ఓట్లని లెక్కించనున్న సిబ్బంది234 స్థానాల్లో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికలు5.73 కోట్ల మంది ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకోగా.. తమిళనాడులో రికార్డ్ స్థాయిలో 85 శాతం పోలింగ్రాష్ట్రవ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంమొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠడీఎంకే, ఏఐ డిఎంకె కూటమి, విజయ్ టీవీకే పార్టీల మధ్య ప్రధాన పోటీకౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, ప్రత్యేకించి కేంద్ర బలగాలతో పహారారాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బందిప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణలో కౌంటింగ్కొళత్తూరు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళని స్వామి, చెపాక్-తిరువల్లికేని నుంచి ఉదయ్ నిధి స్టాలిన్ పోటీపెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెంకాసి జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘంఅక్కడ భారీగా పోలీసు భద్రత ఏర్పాటుహంగ్ ఏర్పాటయ్యే అవకాశం అంటూ సర్వేలు వెల్లడిక్యాంప్ రాజకీయాలకు తెరలేపిన టీవీకేమహాబలిపురం వద్ద రిసార్ట్లు బుక్ చేసిన టీవీకే అధినేత విజయ్గెలిచిన అభ్యర్థులు వెంటనే రిసార్ట్‌కి రావాలని ఆదేశం..ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాలు👉రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది.👉తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. -
తమిళనాట మరో సంచలన సర్వే
సాక్షి, చెన్నై: తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మరో ఎంజీఆర్ అయ్యేనా అన్నది మరికొన్ని గంటల వ్యవధిలో తేలనుంది. ఈ నేపథ్యంలో మరో ఎగ్జిట్ పోల్‌లోనూ విజయ్‌కే అధికారం ఖాయం అని స్పష్టం కావడం చర్చనీయాంశమైంది. వివరాలు.. తమిళనాడులో మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి.అయితే యాక్సిస్ మై ఇండియా, మరికొన్ని స్థానిక చిన్న సంస్థలు, సామాజిక మాధ్యమాలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం వైపే ప్రజలు మొగ్గు చూపారని స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో శనివారం మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం నిర్వహించిన నియోజకవర్గాల వారీగా ఎగ్జిట్ పోల్ సర్వే ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. విజయ్ పార్టీకి 121 స్థానాలు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమగ్రంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే అంచనా ప్రకారం, విజయ్ నాయకత్వంలోని టీవీకే ఏకంగా 41 శాతం ఓట్లను సాధించి, 121 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, ముఖ్యంగా 18–40 ఏళ్ల వయస్సు గల ఓటర్లు టీవీకే వైపు బలంగా నిలిచారని ఈ నివేదిక పేర్కొన్నారు.ఐదు దశాబ్దాల ఆధిపత్యానికి బ్రేక్ సుమారు ఐదు దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల కంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారని ఈ సర్వే విశ్లేషించడం గమనార్హం. ఇక యాక్సిస్ మై ఇండియా విజయ్ పార్టీకి 98 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తెలిపింది. మాజీ ఐపీఎస్ పి. రవి టీమ్ సర్వేతో పాటూ యాక్సిస్ మై ఇండియా సర్వేలు విజయ్‌కు అనుకూలంగా రావడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అప్రమత్తమయ్యాయి. మే 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తమ ఏజెంట్లు, అభ్యర్థులకు సూచించాయి. -
తమిళనాడులో భారీగా ఎన్నికల పోలింగ్
తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.. -
నేడే తమిళనాడు సమరం
సాక్షి, చెన్నై: వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్... ఐదేళ్ల క్రితం దూరమైన అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి... తొలి పోటీలోనే సత్తా చాటాలని సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తహతహలాడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమయ్యింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో జరిగే ఓటింగ్‌లో 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల తలరాతలను నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే పోటీ నెలకొన్నప్పటికీ విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) గణనీయమైన ప్రభావం చూపడం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పార్టీ ఏ కూటమి ఓట్లను చీలుస్తుంది? లాభపడేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నికల సర్వేలు స్టాలిన్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేయడం గమనార్హం. డీఎంకే–కాంగ్రెస్ కూటమి 40.1 శాతం ఓట్లతో 181 నుంచి 189 స్థానాలు గెల్చుకోనున్నట్లు సర్వేలు తెలిపాయి. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లు సాధిస్తుందని వెల్లడించాయి. విజయ్ పార్టీ టీవీకే 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి. యువ ఓటర్లకు గాలం ఎన్నికల్లో ప్రధాన పార్టీలు యువత ఓట్లపై గురిపెట్టినట్లు స్పష్టమవుతోంది. అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చాయి. దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు రప్పిస్తామని పేర్కొన్నాయి. తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. యువత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడించాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇవ్వడం విశేషం. దళపతి విజయ్ యువ ఓటర్లనే నమ్ముకున్నారు. ఆయన సభలకు యువత పోటెత్తారు. విజయ్ అభిమానుల్లో యువత, మహిళలు అధికంగా ఉండడం ఆయనకు అనుకూలాంశంగా మారింది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 చొప్పున అందజేస్తామని విజయ్ హామీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పలు పథకాలు ప్రకటించారు. యువతకు చేరువకావడానికి పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి. తొలిసారి ఓటర్లు 14.59 లక్షల మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చివరి నిమిషంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా అధికారులు నిఘా ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పటా్నయక్ తెలిపారు. 14.59 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయబోతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోసం 1,06,418 బ్యాలెట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఓటింగ్‌లో జాప్యం జరగకుండా అదనపు యంత్రాలను సమకూర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 249 మోడల్ పోలింగ్ స్టేషన్లు, పూర్తిగా మహిళలే నిర్వహించే 325 పింక్ స్టేషన్లు, దివ్యాంగులు నిర్వహించే 71 పోలింగ్ స్టేషన్లు, యువత నిర్వహించే 29 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంచేశారు. 83,875 మంది స్థానిక పోలీసులతోపాటు 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలను చాలావరకు అరికట్టామని, ఇప్పటిదాకా స్వా«దీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.1,262 కోట్లకు చేరిందని, అందులో నగదు, ఇతర సామగ్రి విలువ రూ.543 కోట్లు అని అర్చనాపట్నాయక్ తెలియజేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. విదేశాల నుంచి రాక తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు స్వరాష్ట్రానికి తరలివచ్చారు. గత రెండు రోజుల్లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి విమానాశ్రయాలకు పది వేల మందికి పైగా తరలిరావడం విశేషం. ఓటింగ్ ప్రక్రియను స్వయంగా తిలకించడానికి కొందరు విదేశీయులు సైతం వచ్చారు. -
ఎన్నికల వేళ డీఎంకే, కాంగ్రెస్‌లకు షాక్
తమిళనాడులో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. డీఎంకే, కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అయితే ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల (ఏప్రిల్ మొదటి వారంలో) సేలంలోని పలువురు డీఎంకే నేతల ఇళ్లు మరియు కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు సుమారు 5-8 గంటల పాటు కొనసాగాయి. కాగా ప్రస్తుతం మరో సారి ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయన కూమారుడి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. క్రిప్టో మనీలాండరింగ్ కేసులో భాగంగా బెంగళూరులో ఎమ్మెల్యేకు సంబంధించిన 17 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా తమిళనాడు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23 గురువారం రోజున ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మే 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులపై నిఘా సంస్థల తనిఖీలు పెరిగాయి. -
తమిళనాట ఇండియన్ ఇనిస్టిట్యూట్ సర్వే...!
చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ సంచలన ఓపీనియన్ పోల్ వెల్లడించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన స్థానాన్ని పదిలం చేసుకోబుతున్నారని సర్వే తెలిపింది.ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటములతో పాటు సినీ హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రచారాలు జోరుగా చేస్తున్నాయి. అధికారం పొందడమే లక్షంగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే కూటమి తమిళనాట మరోసారి జెండా ఎగురవేయడం ఖాయమని ఒపీనియన్ పోల్ చెబుతున్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష డీఎంకే కూటమి ఏ సారి కూడా ప్రతిపక్షానికి పరిమితం కానున్నట్లు పేర్కొంది. సినీహీరో విజయ్ అధికారానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ మంచి స్థాయిలో ఓట్లషేర్ సాధించే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది.ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ ఓపీనియన్ పోల్ ప్రకారండీఎంకే కూటమి-37.5 % ఓట్లు 121 సీట్లుఏఐడీఎంకే కూటమి- 33.63 % ఓట్లు 83 సీట్లుటీవీకే పార్టీ - 24.71 % ఓట్లు 3 సీట్లు సాధించనున్నట్లు సర్వే తెలిపింది. 27 చోట్ల హోరాహోరి పోరు నడుస్తోందని పేర్కొంది. అయితే డీఎంకే సైతం సొంతంగా మెజారిటీ సాధించలేదని అలియన్స్ ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇదివరకు వచ్చిన సర్వేలలో చాలా వరకూ డీఎంకే వైపే మెుగ్గుచూపాయి. కాగా తమిళనాడులో 234 స్థానాలుండగా అధికారం సాధించడానికి 118 స్థానాలు అవసరం. -
Tamil Nadu Survey: 178 స్థానాలలో గెలుపు బాటలో డీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే వర్గాలలో మంచి జోష్ నింపే విధంగా తాజాగా ఏఎన్ఎస్ సర్వే వివరాలు వెలుగు చూశా యి. ఇందులో తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభంజనం సృష్టించబోతున్నట్టుగా సమాచారం వెలువడింది. తాజా సర్వే గణాంకాల ప్రకారం ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 178 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉంది. ఎన్నికలకు ముందుగా వెలువడ్డ అనేక సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి. అదే సమయంలో ఎన్నికల నగారా మోగినానంతరం ప్రచార హోరు నేపథ్యంలో అన్నాడీఎంకేకు సైతం అనుకూలంగా సర్వేలు రావడంతో ఉత్కంఠ తప్పలేదు. అదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కీలక శక్తిగా మారనున్నట్టుగా సర్వేలు పేర్కొంటూ వచ్చాయి. ఓటరు నాడి ఎటు అన్న ఉత్కంఠ నేపథ్యంలో తాజాగా వెలువడ్డ ఈ సర్వే వివరాలను డీఎంకే అనుకూల పత్రిక ప్రకటించింది. జోన్ల వారీగా అంచనాలు సర్వే నివేదిక ప్రకారం వివిధ ప్రాంతాల్లో డీఎంకే కూటమి పరిస్థితిని వివరించారు. ఇందులో చెన్నై జోన్లో 37 నియోజకవర్గాలకు డీఎంకే కూటమి 36 స్థానాల్లో పటిష్టంగా ఉండగా, అన్నాడీఎంకే ఒకే స్థానానికి పరిమితం కానున్నట్టు ప్రకటించారు. సెంట్రల్ జోన్లో 37 స్థానాల్లో 35 చోట్ల డీఎంకే గెలుస్తుందని సర్వేలో తేల్చారు. దక్షిణ జోన్లో 58 స్థానాలకు గాను 42 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు ప్రకటించారు. జిల్లా వారీగా క్లీన్ స్వీప్ అనేక జిల్లాల్లో డీఎంకే కూటమి 100 శాతం సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో వివరించారు. ఆ మేరకు చెన్నై జిల్లాలో 16 సీట్లు, తిరువళ్లూరు జిల్లాలో 10 సీట్లు, తంజావూరు 8 సీట్లు, కాంచీపురం 11 సీట్లు, నీలగిరి, కరూర్, తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లోని అన్ని సీట్లను డీఎంకే గెలుచుకునే అవకాశం ఉందని ఆ సర్వే ద్వారా వివరించారు. విజయ్ ప్రభావం ఓట్ల శాతం పరంగా ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతుందని ప్రకటించారు. డీఎంకే కూటమి 45.4 శాతం, అన్నాడీఎంకే కూటమి 35.3 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని వివరించారు. అయితే, నటుడు విజయ్ టీవీకే 11.5 శాతం ఓట్లు, సీమాన్ ఎన్టీకే 5.6 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్టు పేర్కొన్నారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, సర్వే ప్రకారం డీఎంకే 178 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా అవతరించనున్నదని, అన్నాడీఎంకే 56 సీట్ల వద్ద నిలిచిపోయే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది. అయితే తుది ఓటరు తీర్పు అన్నది మే 4న వెలువడే ఫలితాల మేరకు ఉండబోతుండడం గమనార్హం. ఈ సర్వే తమకు అనుకూలంగా ఉండడంతో డీఎంకే వర్గాలలో జోష్ పెరిగింది. గెలుపు దిశగా మరింత ఉత్సాహంతో ప్రచారంచేసే పనిలో పడ్డారు. -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్‌జెండర్‌కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్‌కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్‌ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
తమిళిసై మైలాపూర్ ‘మహారాణి’.. వేచి చూడాలి!
చెన్నై: ఆధ్యాత్మికతకు, చారిత్రక వారసత్వానికి చిరునామా అయిన మైలాపూర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు అధికార డీఎంకే బలం, మరోవైపు మాజీ గవర్నర్, బీజేపీ ఫైర్ బ్రాండ్ తమిళిసై సౌందరరాజన్ దూకుడుతో ఈ ‘టెంపుల్ టౌన్’లో రాజకీయ సెగలు పుడుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అసలైన శక్తి మాత్రం మహిళా ఓటర్లే.‘లేడీ పవర్’ ఎవరి వైపు?మైలాపూర్‌లో పురుషుల కంటే మహిళలే అధికం అని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 2,70,568 మంది ఓటర్లలో మహిళా ఓటర్లు 1,39,349, పురుష ఓటర్లు 1,31,179. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం తమిళిసైకి అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఒక మహిళా నాయకురాలిగా, ఒక వైద్యురాలిగా, మాజీ గవర్నర్‌గా ఆమెకున్న క్లీన్ ఇమేజ్ మహిళా ఓటర్లను ఆకర్షిస్తోందని చెబుతున్నారు. ఇంటింటి ప్రచారంలో మహిళలతో ఆమె మమేకమవుతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కమలం వికసిస్తుందా?గత చరిత్రను చూస్తే మైలాపూర్ ఏ పార్టీకీ శాశ్వత చిరునామా కాదు. 2016లో అన్నాడీఎంకేను ఆదరించిన ప్రజలు 2021లో డీఎంకే అభ్యర్థి ధా వేలుకు పట్టం కట్టారు. ప్రస్తుతం డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ధా.వేలుపై వ్యతిరేకత ఉందా? లేక పి.వెంకటరమణన్ (టీవీకే), ఆర్ఎల్ అరుణ్ అయ్యంగార్ (ఎన్టీకే)లు ఓట్లను చీల్చుతారా? అన్నది పక్కన పెడితే.. తమిళిసై మాత్రం ‘మహిళా శక్తి’ మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. మహిళా ఓటర్లు కరుణిస్తే మైలాపూర్ గడ్డపై కమలం వికసించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బహుముఖ పోరులో ఉత్కంఠతత్వవేత్త తిరువళ్లువర్ జన్మించిన ఈ పవిత్ర నేలపై తనదైన ముద్ర వేయాలని తమిళిసై గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే మైలాపూర్ మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కడతారో? ఈ ‘టెంపుల్ టౌన్’ పోరులో చివరకు విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: నోయిడాలో కార్మిక రణరంగం: ఎవరీ మేధా రూపమ్? -
దుర్గా స్టాలిన్ ఎంట్రీతో రాజకీయాల్లో హీట్
సాక్షి,చైన్నె : తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు ఏ అభ్యర్థి తరపున నేరుగా ఓట్లు అడగని సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తొలిసారిగా శీర్గాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీఎంకే కూటమి తరపున ఎండీఎంకే అభ్యర్థిగా సెంథిల్ సెల్వన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ ‘ఉదయ సూర్యుడు’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ప్రప్రథమంగా..సాధారణంగా దుర్గా స్టాలిన్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కేవలం ఆలయ సందర్శనలకే పరిమితం అవుతుంటారు. గతంలో ఓ మారు కొళత్తూరులో తన భర్త స్టాలిన్ తరపున మహిళా ఓటర్లను కలిశారు. ఈ పరిస్థితులలో తాజాగా ఆమె నేరుగా ప్రచార రంగంలోకి దిగడం గమనార్హం.శీర్గాలి సెంటిమెంట్తమిళనాడు రాజకీయాల్లో శీర్గాళి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తుందే, ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న బలమైన నమ్మకం. దీనిని ‘దీర్ఘదర్శి నియోజకవర్గం’ అని కూడా పిలుస్తారు. అంటే రాష్ట్ర భవిష్యత్తును ఈ నియోజకవర్గ ఫలితం ముందుగానే చెబుతుందని అర్థం.ఎండీఎంకే అభ్యర్థి.. డీఎంకే గుర్తువాస్తవానికి ఈ సీటు కూటమిలో ఎండీఎంకే పార్టీకి దక్కింది. వారు సొంత గుర్తుపై పోటీ చేస్తామని తొలుత ప్రకటించినా, చివరకు సెంటిమెంట్ దృష్ట్యా, డీఎంకే గుర్తు అయిన ‘ఉదయ సూర్యుడు’ పైనే అభ్యర్థిని నిలబెట్టారు. ఇక్కడ గెలిస్తేనే డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో స్టాలిన్ దంపతులు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీఎం స్టాలిన్ కూడా నాగపట్నంలో జరగాల్సిన సభను రద్దు చేసుకుని మరీ శీర్గాళిలో బహిరంగ సభ నిర్వహించారు. ‘నేను ఈ ఊరి అల్లుడిగా ఓటు అడగడానికి వచ్చాను’ అని స్టాలిన్ ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. దుర్గా స్టాలిన్ తన స్వగ్రామం తిరువెంకాడు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో, తాను ఈ ఊరి కోడలినని, తన ఊరి ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించాలని కోరడం విశేషం. సెంటిమెంట్‌ను బలంగా నమ్మే దుర్గా స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగడంతో, ఈసారి శీర్గాళి సెంటిమెంట్ పలికి మళ్ళీ డీఎంకే అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఎన్టీకే అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ రోహిణి
విల్లివాక్కం నియోజకవర్గంలో రాజకీయ సమరం రసవత్తరంగా మారింది. డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్న అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ వారసుడు కార్తీక్ మోహన్‌కు విల్లివాక్కం ఓటర్లు గెలుపు కిరీటాన్ని అందించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అలాగే టీవీకే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆపార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునను ఓటర్లు ఆదరించేనా అన్న చర్చ జోరందుకుంది. ఇక, ఈ ఇద్దరి మధ్య తాను సైతం అంటూ అన్నాడీఎంకే అభ్యరి్థ, మాజీ ఎంపీ ఎస్ఆర్ విజయకుమార్ దూసుకెళ్తున్నారు. తమకూ అవకాశం ఇవ్వాలని ఎన్టీకే అభ్యర్థి రోహిణి ఓట్ల వేటలో ఉన్నారు.సాక్షి, చెన్నై : చెన్నై నగరంలో విల్లివాక్కం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ స్థానం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే ఐదుసార్లు విజయఢంకా మోగించింది. అన్నాడీఎంకే రెండు సార్లు, సీపీఐ రెండు సార్లు, కాంగ్రెస్, టీఎంసీలు తలా ఓ సారి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చెన్నై నగరం విస్తరణ పరిధిలో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రాంతంగా విల్లివాక్కం ఉంది. ఐసీఎఫ్ గడ్డగా రైల్వే కారి్మకుల ఓటు బ్యాంక్, తెలుగు వారి ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమరం రసవత్తరంగా సాగుతోంది. 2011 పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మార్చుకుంది. ఈ పరిధిలో ఐసీఎఫ్, తిరుమంగళం, అన్నానగర్(కొంత భాగం), కెల్లీస్, ఐనావరం వంటి నగరంలో అత్యంత ముఖ్యమైనప్రాంతాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ రైలు పెట్టెల తయారీ కేంద్రం ఐసీఎఫ్‌తో పాటుగా సిడ్కో పారిశ్రామక వాడ, కీల్పాకం మానసిక చికిత్సాలయం వంటివి ఆధవ్ను ఆదరించేనా.. విజయ్ తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున ఇక్కడ పోటీ చేస్తున్నారు. యువ ఓటర్లను గురి పెట్టడమే కాదు, మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా నియోజకవర్గంలో ఆధవ్ తిష్ట వేశారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో గతంలో ఇక్కడ అన్నాడీఎంకే తరపున పోటీ చేసి గెలిచిన జేసీడీ ప్రభాకర్‌కు మద్దతు గణం ఇక్కడ ఉంది. తాజాగా ఆయన టీవీకేలో చేరిన దృష్ట్యా, ఆ మద్దతు తనకు కలివచ్చిందన్న ధీమాతో ఆధవ్ ఉన్నారు. టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు తదుపరి ఈ విల్లివాక్కం నియోజకవర్గం ఉండటంతో తమ అధినేత చరిష్మా మరింతగా కలిసి వస్తుందన్న ధీమాతో ఆధవ్ దూసుకెళ్తున్నారు. విజయకుమార్ ఎదురీత అన్నాడీఎంకే అభ్యరి్థగా ఎస్ఎస్ఆర్ విజయకుమార్ పోటీలో ఉన్నారు. ఆయన మాజీ ఎంపీ కూడా, కూటమి బలం, పార్టీకి ఇక్కడ అనాదిగా ఉన్న రెండుకుల గుర్త మద్దతు తనను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ప్రచారంలో దూసుకెళ్లడమే కాకుండా, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తాను ఈ పరిసరాలకు చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక, సీమాన్ నాన్ తమిళర్ కట్చి( ఎన్టీకే ) అభ్యరి్థగా సామాజిక కార్యకర్త, ట్రాన్స్‌జెండర్ అయిన రోషిణిని బరిలో ఉనర్నారు.సామాజిక మార్పు కోరుకునే ఓటర్లను ఆమె ఆకట్టుకుంటున్నారు.హోరాహోరీ సమరం... విల్లివాక్కం డీఎంకే కంచుకోట. ఈ కూటమిలోని వామపక్షాలకు సైతం ఇక్కడ కారి్మక ఓటు బ్యాంక్ మరీ ఎక్కువే. అయితే ఈసారి సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెట్రి అళగన్కు ఈసారి డీఎంకే సీటు ఇవ్వలేదు. అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడు కార్తీక్ మోహన్‌ను ఈసారి డీఎంకే రంగంలోకి దించింది. అధికార డీఎంకే కూటమి బలం, పటిష్ట ఓటు బ్యాంక్ గెలుపు కిరీటాన్ని కార్తీక్ ఓటర్లకు అప్పగించే అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో ఆయన స్థానికేతరుడు అన్న ముద్ర ఉండటం సవాలుగా మారింది. యువకుడైన కార్తీక్‌ను గెలిపించేందుకు ఓ వైపు ఆయన తండ్రి మోహన్, మంత్రి శేఖర్‌బాబుతో పాటూ చెన్నై మేయర్ ఆర్ ప్రియ ఉరకలు తీస్తున్నారు. ఇక, కార్తీక్ కోసం స్వయంగా సీఎం స్టాలిన్ అల్లుడైన శబరీషన్ సైతం రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెట్టడం గమనార్హం.ఓటరు ఎటో ఈ నియోజకవర పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ 76947 పురుçషులు, 82785 మహిళలు, 32 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,59,765గా ఉంది. వన్నియర్, నాయుడు , ఆది ద్రావిడ సామాజిక వర్గాల ఓట్లు కూడా ఇక్కడ కీలకం. వీరితో పాటు ముదలియార్ , నాడార్ ఓట్లు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. డీఎంకే వారసత్వ రాజకీయాల పై వ్యతిరేకత అన్నది ఇక్కడ పనిచేస్తుందా లేక సంక్షేమ పథకాలు కాపాడుతాయా?, అన్నాడీఎంకే పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా? లేక విజయ్ పార్టీ ’విజిల్’ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
కరుణానిధిని గృహనిర్బంధం చేశారు: పళని స్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని చివరి రోజుల్లో గృహనిర్బంధంలో ఉంచారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సంచలన ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. శనివారం తిరువణ్ణామలైలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘కరుణానిధి గురించి డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి ఎ.రాజా చెప్పిన విషయాలనే గుర్తు చేస్తున్నా. తండ్రిని గృహనిర్బంధంలో ఉంచడం న్యాయమేనా అని సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఒక వీడియోలో రాజా ప్రశ్నించారు’’ అని చెప్పారు. మాజీ సీఎం జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామన్న స్టాలిన్, తన తండ్రి కరుణానిధిని గృహనిర్బంధంలో ఉంచిన వారిపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే దీనిపై విచారణ చేయించి, బాధ్యులను శిక్షిస్తామని పళనిస్వామి ప్రకటించారు. 2021–26 మధ్య కాలంలో తమిళనాడును అప్పుల్లో, అవినీతిలో, డ్రగ్స్ వాడకంలో, శాంతిభద్రతల వైఫల్యంలో స్టాలిన్ నంబర్‌వన్ స్థానానికి తీసుకెళ్లారని విమర్శించారు. ఆయన కేవలం ఫొటోషూట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. -
డీఎంకే కూటమిపై TVK Chief విజయ్ విమర్శలు
-
దరఖాస్తు రుసుం వెనక్కి ఇవ్వరూ!
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న దృష్ట్యా, ఆశావహుల నుంచి దరఖాస్తుల సమయంలో స్వీకరించిన ఫీజును వెనక్కి ఇవ్వాలన్న నినాదం మక్కల్ నీది మయ్యంలో మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నటుడు, రాజకీయ నాయకుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇస్తున్నామని, అయితే, తమ పార్టీ తరఫున ఎవ్వరూ పోటీ చేయడం లేదని ప్రకటించారు. అదేసమయంలో డీఎంకే తన పార్టీ ఉదయసూర్యుడి చిహ్నంలో పోటీచేయాలని ఒత్తిడి తీసుకు రావడంతోనే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసే ఆశతో లక్ష మందికి పైగా మక్కల్ నీది మయ్యం నాయకులు దరఖాస్తు చేసుకున్నారు.వీరంతా రూ.30వేల నుంచి రూ.50వేల వరకు దరఖాస్తు రుసుము చెల్లించారు. అదేసమయంలో ఎన్నికలల్లో పోటీ చేయనప్పుడు పార్టీని నడపడంలో అర్థం ఏమిటి అన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆశావహుల నుంచి దరఖాస్తుల రూపంలో సేకరించిన రుసుంను వెనక్కి అందించేందుకు కమల్ నిర్ణయించినట్టు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని దరఖాస్తు చేసుకున్న వారికి అందించే విధంగా చర్యలపై మక్కల్ నీది మయ్యం కసరత్తులు చేపట్టిందని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. -
ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు: స్టాలిన్
తిరుచ్చి: ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారంటూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ప్రదేశ్‌గా పేరు మారుస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏపై స్టాలిన్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ డబ్బా ఇంజిన్ ముందు ద్రవిడ మోడల్ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ తల వంచదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్టాలిన్ విరుచుకుపడ్డారు.బీజేపీ ప్రభుత్వాన్ని ఒక పనికిరాని డబ్బా ఇంజిన్‌గా అభివర్ణించిన స్టాలిన్.. తమ ద్రవిడ మోడల్ పాలనను 'సూపర్ ఫాస్ట్ ఇంజిన్‌తో పోల్చారు. తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడటంలో, అభివృద్ధి పథంలో దూసుకుపోవడంలో తమ ప్రభుత్వం ఎవరికీ లొంగదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించి, ద్రవిడ సిద్ధాంతాన్ని మరోసారి గెలిపించాలంటూ ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు.బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే, వారి వల్ల కలిగే నష్టాలు మన ఊహకు అందవు. తమిళనాడు పేరును కూడా మార్చేస్తారు. తమిళనాడు ఎప్పటికీ తమిళనాడుగానే ఉండాలి. ఉత్తరప్రదేశ్, మణిపూర్లాగా హింసాత్మక ప్రాంతంగా మారకూడదు. హోసూర్ విమానాశ్రయం, విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల కోసం తరచుగా పర్యటనలు చేస్తారు’’ అంటూ స్టాలిన్ విమర్శలు గుప్పించారు. -
నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్.. టీవీకే అధినేత ఆస్తులెంత?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ఇవాళ (మార్చి 30) కోలతూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచే ఆయన 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కోలతూర్ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న అభవృద్ధి పనులపై స్టాలిన్ ఓ పుస్తకం విడుదల చేశారు."మేము భారీ విజయం సాధించనున్నాం. గత మూడు ఎన్నికలతో పోల్చితే ఈ సారి మరింత భారీగా మద్దతు కనపడుతోంది. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తమిళనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సారి భారీ విజయం సొంతమవుతుంది" అని స్టాలిన్ చెప్పారు.డీఎంకే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 164 స్థానాల్లో పోటీ చేస్తుంది, 70 స్థానాలు మిత్ర పార్టీలకు సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 28, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి 5, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐఎం)కి 5, వీసీకేకు 8, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది. ఇతర చిన్న పార్టీలలో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే)కి 10, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కి 2 స్థానాలు, ఇంకా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చిన విజయ్ నామినేషన్ సమర్పించారు. విజయ్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. విజయ్ తన అఫిడవిట్లో రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. TVK Chief Vijay declares ₹405 crore of movable assets and ₹115 crore of immovable assets in his affidavit while filing nomination for Perambur assembly constituency pic.twitter.com/03U4JC28GC— Arvind Gunasekar (@arvindgunasekar) March 30, 2026 -
స్టాలిన్, విజయ్ నామినేషన్ దాఖలు
-
డీఎంకే మేనిఫెస్టో.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్
చెన్నై: తమిళనాడులో గెలిస్తే 35 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని అధికార డీఎంకే ప్రకటించింది. ‘మహిళలకు రూ.8,000 విలువైన కూపన్లు ఇస్తాం. కూపన్లతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే పాతవాటితో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు’’ అని పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం ఆయన విడుదల చేశారు. ‘‘వ్యవసాయం, విద్య, పరిశ్రమల రంగాల్లో పలు రకాల సంక్షేమ పథకాలను అమలుచేస్తాం. రైతులు, గృహిణులు, విద్యార్థులు మొదలు అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోరుతూ పలు సంక్షేమ చర్యలను అమలుచేయబోతున్నాం. మామూలుగా డీఎంకే మేనిఫెస్టో హీరోలా ఉంటుంది. ఈసారి సూపర్స్టార్లా ఉండనుంది’’ అంటూ హామీల చిట్టాను ఓటర్ల ముందు ఆవిష్కరించారు.డీఎంకే మేనిఫెస్టో ముఖ్యాంశాలు...20 లక్షల మందికిపైగా రైతులకు ఉచితంగా మీటర్‌లేని పంపుసెట్లువార్షిక ఆదాయ పరిమితి పెంపుముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం రూ.10లక్షలకు పెంపువృద్ధులు, వితంతువులు, 50 ఏళ్లు దాటిన అవివాహితులకు నెలకు రూ.2,000 పెన్షన్కలైంగర్ మగలిర్ ఉరుమై థొగై పథకం కింద కుటుంబపెద్దగా ఉన్న మహిళలకు నెలవారీ ఆర్థికసాయం రూ.2వేలకు పెంపుపాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం ఎనిమిదవ తరగతి విద్యార్థుల దాకా వర్తింపుక్వింటాల్ వరి ధాన్యానికి రూ.3,500 మద్దతు ధరటన్ను చెరకుకు రూ.4,500 మద్దతు ధరవచ్చే నాలుగేళ్లలోపు పూరిగుడిసెల అవసరం లేకుండా గృహపథకంలో భాగంగా కొత్తగా 10 లక్షల గృహాల నిర్మాణంఉన్నత విద్య పూర్తిచేసిన వాళ్లకు నాన్ ముధల్వాన్ పథకం కింద ఆరు నెలలపాటు వృత్తి నైపుణ్య శిక్షణతోపాటు నెలకు రూ.1,500 అందజేతరాష్ట్రానికి రూ.18 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించడంవచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడంపుధుమై పెన్, తమిళ్ పుధల్వాన్ పథకాల కింద నెలకు రూ.1,500 ఉన్నత విద్యా గ్రాంట్ అందజేతకోయంబత్తూర్, సేలం, మదురై, తిరుచిరాపల్లి సమీపంలో ఫ్యూచర్–రెడీ గ్లోబల్ సిటీల నిర్మాణం. -
డీఎంకే మేనిఫెస్టో విడుదల.. ఇవన్నీ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే మేనిఫెస్టో ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పథకాలను ఇందులో పొందుపర్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన స్టాలిన్.. డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసిందని, మళ్లీ గెలిస్తే ప్రస్తుత పథకాలను మరింత పెంచుతామని తెలిపారు.మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలుఉన్నత విద్య చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు మహిళలకు ప్రతి నెల ఇచ్చే సాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,000కు పెంపు (రూ.1.37 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు ప్రయోజనం)వృద్ధాప్య పెన్షన్ కూడా రూ. 2,000కు పెంపుబ్రేక్ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి వరకు పెంపు (ప్రస్తుతం 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు అమలులో ఉంది)మహిళల స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలుముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద ఇచ్చే ప్రయోజనం రూ.లక్షకు పెంపు20 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ కొనసాగింపుమీటర్లు లేకుండా పంప్ సెట్లు కూడా పంపిణీప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ యూనిట్ల సంఖ్య రెండింతలు పెంపురాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ.18 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యం టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి నియో టైడల్ పార్కుల ఏర్పాటు -
164 స్థానాల్లో డీఎంకే పోటీ
చెన్నై: తమిళనాట అధికార డీఎంకే పార్టీ వచ్చే నెలలో జరగబోయే శాసనసభ ఎన్ని కల్లో 164 స్థానాల నుంచి బరిలో దిగనుంది. తన సారథ్యంలోని లౌకిక ప్రగతిశీల కూటమి(ఎస్పీఏ)లో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, డీఎండీకే తది తర 11 పార్టీలకు డీఎంకే మొత్తంగా 70 సీట్లను కేటాయించింది. కూటమి పార్టీల్లో కాంగ్రెస్‌కు అత్యధికంగా 28 సీట్లు కేటాయించింది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలోని పార్టీ కార్యాల యంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ‘‘సీట్ల సర్దుబాటులో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. నిదానంగా చర్చలు జరపడంతో నష్టంకంటే లాభమే ఒనగూరింది. మిత్ర పక్షాలన్నింటినీ సంతృప్తిపరుస్తూ సీట్లు కేటాయించాం.ఎస్పీఏ కూటమిలో ఐక్యతకు ఇది నిదర్శనం. ఎన్నికల తర్వాత డీఎంకే 2.0 ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అభ్యర్థులంతా గెలుపు గుర్రాలే’’ అని అన్నారు. పార్టీ మేనిఫెస్టోను ఆదివారం విడుదలచేస్తానని ఆయన వెల్లడించారు. వైకో సారథ్యంలోని ఎండీఎంకేలోని కొందరు అభ్యర్థులు సహా 11 మంది కూటమి పార్టీల అభ్యర్థులు ఈసారి డీఎంకే ‘ఉదయించే సూర్యుడు’ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతుండటం విశేషం. దీంతో డీఎంకే పరోక్షంగా 175 స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నట్లయింది. సీట్ల సర్దుబాటు తర్వాత పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్కోడె, శివకాశి, కరైకుడి సహా 28 స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీకి నిలబడుతున్నారు. కూటమి న్యాయం పాటిస్తూ... దివంగత తమిళనటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ స్థాపించిన డీఎండీకే పార్టీకి 10 సీట్లు కేటాయించారు.దాదాపు మంత్రులందరికీ మళ్లీ చాన్స్33 మంది కేబినెట్ మంత్రుల్లో ము గ్గురు మినహా మిగతా వారందరికీ సీఎం స్టాలిన్ మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించారు. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకూ మరోసారి పోటీచేసే అవకాశం దక్కింది. ఈసారి వైద్యులు, ఇంజనీర్లు, పీహెచ్డీ పట్టాదారులు సహా 60 మందికిపైగా కొత్తవాళ్లను డీఎంకే రంగంలోకి దింపుతోంది. డీఎంకే పార్టీ తరఫున ఈసారి 18 మంది మహిళా నేతలూ ఎన్నికల రణక్షేత్రంలోకి దూసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగోసారి కొలథూర్ స్థానం నుంచి పోటీచేయనున్నారు. ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి మరోసారి చెపాక్–త్రిప్లికేన్ నుంచి పోటీచేస్తున్నారు. -
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఇలా..
చెన్నై: వచ్చే నెలలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే పార్టీ- కాంగ్రెస్‌ల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ మేరకు డీఎంకేతో జట్టు కట్టిన కాంగ్రెస్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సీట్ల సర్దుబాటును ఈరోజు(శనివారం, మార్చి 28వ తేదీ) ప్రకటించారు. తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను డీఎంకే 164, కాంగ్రెస్ 28, డీఎండీకే 10 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక వీసీకే 8 స్థానాల్లో, సీపీఐ 5, సీపీఎం 5, ఎండీఎంకే 4 స్థానాలను కేటాయించారు. ఇక డీఎంకే పోటీ చేసే పలు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ బరిలోకి దిగుతుండగా, చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ చేయనున్నారు. బోడినాయక్కనూర్ నుంచి పన్నీరు సెల్వం పోటీ దిగుతుండగా, కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలోకి సెంథిల్ బాలాజీ బరిలో ఉండనున్నట్లు డీఎంకే వెల్లడించింది. -
కమల్ మరో సంచలనం.. స్టాలిన్‌కు మద్దతుగా..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థులకు బేషరతు మద్దతు ప్రకటించాలని కమల్ నిర్ణయించుకున్నారు.అందుకే ఈ నిర్ణయండీఎంకేతో జరిగిన సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాకపోవడమే కమల్ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డీఎంకేకు చెందిన ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేయాలన్న ప్రతిపాదనను కమల్ హాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ అస్తిత్వమైన ‘టార్చ్ లైట్’ గుర్తును కాపాడుకోవడం, కార్యకర్తల మనోభావాలను గౌరవించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘రాజకీయాలనేవి ఒక నిరంతర ప్రయాణం. ఎన్నికల ఫలితాలు ఒక భాగం మాత్రమే, అవే అంతిమ లక్ష్యం కాదు’ అని కమల్ వ్యాఖ్యానించారు.స్టాలిన్ కృతజ్ఞతలు.. ప్రచారానికి ఆహ్వానంకమల్ హాసన్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. రాష్ట్ర సంక్షేమం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, కమల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. ‘ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు రావడం లేదు. ఈ నిర్ణయం నన్ను ఎంతగానో కదిలించింది’ అని స్టాలిన్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఆయన కమల్‌ను కోరారు.ద్రవిడ మోడల్ 2.0 లక్ష్యంగా..తమ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడాన్ని త్యాగంగా భావించడం లేదని, అదొక బాధ్యతని కమల్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రగతికి ‘ద్రవిడ మోడల్ 2.0’ ప్రభుత్వం అవసరమని, అందుకే డీఎంకే కూటమికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి, రాజ్యసభలో తమ గళాన్ని వినిపించామని ఆయన గుర్తు చేశారు. కాగా ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నా, డీఎంకే కూటమి విజయానికి కీలకంగా మారడం ద్వారా కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో సరికొత్త వ్యూహానికి తెరలేపారు. ఈ నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదో వేచి చూడాల్సిందే! இது தியாகம் அல்ல; கடமை. சுய நலம் அல்ல; பொறுமை.@mkstalin @Udhaystalin @maiamofficial pic.twitter.com/V19889YYlg— Kamal Haasan (@ikamalhaasan) March 24, 2026 -
మళ్లీ డీఎంకేదే అధికారం
చెన్నై: త్వరలో తమిళనాడు అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి రానుందని ఓ సర్వే అంచనా వేసింది. అసెంబ్లీలోని 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 180 వరకు సీట్లు గెల్చుకుంటుందని సర్వే చేపట్టిన అగ్ని న్యూస్ సరీ్వస్(ఏఎన్ఎస్) సీఈవో ఆర్.సురేశ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమికి 44.9 శాతం వరకు ఓట్లు పోలవుతాయి. ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమి 38.5 శాతం ఓట్లతో 54 సీట్లు వస్తాయి’అని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై ప్రాంతంలో ప్రతిపక్ష కూటమి ఘోర పరాజయం చవిచూడనుందని, ఒక్క సీటూ గెల్చుకునే అవకాశాలు లేవని చెప్పారు. నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగా వెట్రి కళగం(టీవీకే)కు 9.7 శాతం ఓట్లు, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి 4.8 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. -
దురంధర్గా ఇళయ దళపతి విజయ్?
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందే తడవుగా తమిళనాట రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ముఖ్యంగా వరుసగా రెండోసారి విజయం కోసం డీఎంకే సారథి ఎంకే స్టాలిన్ సిద్ధమవుతుండగా.. ఎన్డీయేతో పొత్తు ఉన్నప్పటికీ అన్నాడీఎంకే తడబడుతోంది. జయలలిత మరణానంతరం ఆ పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేత లేరనే అపవాదును పళనిస్వామి కొంత వరకు దూరం చేస్తున్నా.. పొత్తు ధర్మంలో స్వతంత్ర నిర్ణయాలు పనికి రావనే విషయాలను విస్మరిస్తున్నారు. దీంతో డీఎంకే ఆయనను పది ఓటముల పళనిస్వామి అని హేళన చేస్తుండగా.. అన్నాడీఎంకే నేతలు మాత్రం అధికార పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు తప్పనిసరి. పళనిస్వామి మాత్రం అన్నాడీఎంకే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అన్నాడీఎంకే పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేకి సీట్ల సర్దుబాటు కలిసి వస్తుందా? తలనొప్పిని తెచ్చిపెడుతుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. అదే సమయంలో సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగంతో పొత్తుకోసం బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దక్షిణాదిలో పాగా కోసం తహతహలాడుతున్న బీజేపీ.. విజయ్‌కి పెద్దపీట వేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. ఆ పరిణామం అన్నాడీఎంకేకు ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దళపతి విజయ్ రాజకీయ దురంధురుడుప్రస్తుతానికి విజయ్ మాత్రం తాను బీజేపీతో కలిసే ప్రసక్తే లేదంటున్నారు. అయితే.. రాజకీయాల్లో చివరి క్షణం వరకు సమీకరణాలు ఎలామారిపోతాయో పసిగట్టడం కష్టమే..! ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్లాలని టీవీకే భావిస్తే.. అన్నాడీఎంకే పొత్తుధర్మంలో భాగంగా పలు స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయాల్సి ఉంటుంది. దాంతో.. పార్టీలో రెబెల్స్ పుట్టుకొచ్చి, మరింత తలనొప్పిని తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు బీజేపీ మాత్రం తమిళనాట పాగా వేయడమే పరమావధిగా భావిస్తూ.. దళపతి విజయ్‌ని తమిళ రాజకీయ దురంధరుడిగా భావిస్తోంది. అంటే.. పొత్తు కుదిరితే.. ఎన్డీయే ఘనవిజయం సాధిస్తే.. కింగ్ మేకర్ విజయ్ అవుతారన్నమాట..!సామ, దాన, బేధ, దండోపాయాలతో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తే.. రాజనీతిని ప్రయోగిస్తుంది. రాజనీతిలో అత్యంత కీలకమైన నియమం.. సామ, దాన, బేధ, దండోపాయాలను అందిపుచ్చుకుంటుందని సమాచారం. నామినేషన్ల తేదీ సమీపిస్తున్నా.. అన్నాడీఎంకే తన అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పుడు తమిళనాట విజయం అనేది అన్నాడీఎంకేకు సీట్ల కేటాయింపు సమస్యే కాదు.. ఒకవేళ మళ్లీ ఓటమిపాలైతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు.ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్?ఒకవేళ ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్ చేరితే.. అన్నా డీఎంకే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు తమిళ తంబీలను వేధిస్తోంది. అటు డీఎంకే కూడా ఈ పరిణామాలను అత్యంత సమీపం నుంచి పరిశీలిస్తోంది. అయితే.. అన్నాడీఎంకే వర్గాల మేరకు.. ఆ పార్టీ కచ్చితంగా తమకు 130 సీట్లు కావాలనే డిమాండ్‌ను బీజేపీ ముందు పెడుతుంది. పట్టణ, నగర ప్రాంతాల్లో బీజేపీ కొద్దోగొప్పో పుంజుకుంటోంది. టీవీకే విజయ్‌కి కూడా అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. అందుకే.. పళనిస్వామి తనకు పట్టున్న ప్రాంతాలను కోరే అవకాశాలున్నాయి.అగమ్య గోచరంగా అన్నాడీఎంకే అవి.. అన్నాడీఎంకేకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న కొంగు ప్రాంతం. అంటే పశ్చిమ తమిళనాడులోని నియోజకవర్గాలు. అదేవిధంగా దక్షిణ జిల్లాల్లోనూ అన్నాడీఎంకేకు మంచి పట్టున్నప్పటికీ.. మదురై, ఈరోడ్, దిండిగల్, థేని వంటి ప్రాంతాల్లో టీవీకేకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆ ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు పరిమిత సీట్లే దక్కే అవకాశాలున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ అన్నాడీఎంకేకు కంచుకోటల్లాంటివి. ఇప్పటికీ అక్కడ సంప్రదాయ ఓటర్లున్నా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ స్థానాలను కోల్పోతే.. పార్టీ ఆదరణ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు.మొత్తానికి ఇప్పుడు టీవీకే తమిళనాడులో అన్నాడీఎంకే పాలిట శరాఘాతంగా మారుతోంది. టీకప్పులో తుఫానును పుట్టిస్తోంది. పొత్తు ఉన్నా.. లేకున్నా.. అన్నాడీఎంకే పట్టున్న ప్రాంతాల్లో పాగావేసి, పెను విధ్వంసం సృష్టించేలా ఎదిగే ప్రమాదముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
ఎన్నికల వేళ విజయ్ ‘టీవీకే’కి మరో షాక్
చెన్నై: సినీనటుడు, టీవీకే అధినేత విజయ్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు ఎన్నికల వేళ కూడా ఆయనకు పలువురి రూపంలో షాక్ తగులుతోంది. మొదట కరూర్ తొక్కిసలాట, ఆ తర్వాత భార్యతో విడాకులు, హీరోయిన్ త్రిష ఇష్యూ. ఇప్పుడు నటి రంజనా నాచియార్ కూడా టీవీకే పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతేగాక, ఆ పార్టీపై రంజనా తీవ్ర ఆరోపణలు చేశారు. “విజయ్ పార్టీలో మహిళలకు ఎల్లప్పుడూ అవమానం జరుగుతూనే ఉంటుంది” అని తెలిపారు. ఇవాళ రంజనా నాచియార్ టీవీకే నుంచి డీఎంకేలో చేరారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆమె డీఎంకే కండువా కప్పుకున్నారు. “టీవీకే అగ్ర నాయకులను ఎవరూ కలవలేకపోతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల బాధను పట్టించుకోరు. పార్టీలో మహిళలకు నిరంతరం అవమానం జరుగుతోంది’’ అని రంజనా అన్నారు. డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఆమె గతంలో బీజేపీలో సుమారు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో ఆ పార్టీని ఆమె వీడారు. ఆ తర్వాత టీవీకేలో చేరారు. ఇప్పుడు టీవీకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.మరోవైపు, నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “డీఎంకే కమల్ హాసన్ పార్టీని, చిన్న మిత్ర పార్టీలన్నింటిని మింగేసింది... అవన్నీ తమ గుర్తులను వదిలి డీఎంకే గుర్తుపై పోటీ చేస్తున్నాయి. ఇటువంటివి బీజేపీలో జరగవు...” అని అన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనెల 23న జరగనున్నాయి. -
‘నేను భోజనం చేస్తున్నాను.. ప్రస్తుతం పాయసం తింటున్నాను’
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలంటేనే.. ఐతే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులుంటాయి. ఈ రెండు పార్టీలు మినహా.. మరో పార్టీ పాగా వేసే అవకాశాలే ఉండవంటే.. అక్కడి పరిస్థితులను, ఓటర్ల విస్పష్ట తీర్పును అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఒక్కటిగా ఉన్న డీఎంకే.. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్‌ను కరుణానిధి అణచివేయడంతో అన్నాడీఎంకేగా చీలిపోయింది. ఒక్క మంత్రి పదవి విషయంలో కరుణానిధి మంకుపట్టు.. తమిళనాట మరో ద్రావిడ పార్టీ పుట్టుకకు కారణమైంది. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్‌ను దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు ఎన్నికలపై ఇప్పుడు దేశమంతా దృష్టిసారించింది. ఒకప్పుడు తమిళగళాన్ని దేశానికి వినిపించేందుకు ఒక్క డీఎంకే పార్టీ ఉండేది. ద్రావిడ వాదంతో ఆ పార్టీ ముందుకు సాగేది. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్ తోడవ్వడంతో... కరుణానిధి దూసుకుపోయారు. అయితే.. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్‌ను పక్కన పెట్టడమే కాకుండా.. కరుణానిధి ఆయనను రాజకీయంగా సినిమాలపరంగా అణచివేయడం.. పార్టీ నుంచి బహిష్కరించినా.. పరోక్ష టార్చర్‌ను నిలిపివేయకపోవడం వంటి పరిణామాలు డీఎంకే చీలికకు దారితీశాయి. అప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులు మారడమే కాకుండా.. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రత్యర్థులపై కక్షసాధింపు రాజకీయాలు తీవ్రమయ్యాయి.ఎంజీఆర్ క్రేజ్.. అక్కసు వెళ్లగక్కిన కరుణానిధిఅది 1971.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించింది. కరుణానిధికి ఇది రెండోసారి వరుస విజయం. రాజాజీ నేతృత్వంలోని కూటమి ఆ ఎన్నికల్లో ఓటమిపాలైంది. కేంద్రంలోని అప్పటి ఇందిరాగాంధీ సర్కారుకు డీఎంకే దన్నుగా నిలిచింది. నిజానికి అప్పటి డీఎంకే సారధి కరుణానిధే అయినప్పటికీ.. ఆ పార్టీ అభివృద్ధికి ఎంజీఆర్ ఎనలేని సేవ చేశారు. ఆయనకున్న ఫేమ్.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ పార్టీని విజయాల బాట పట్టించింది. ఆ తర్వాత.. పార్టీలో ఎంజీఆర్‌కు క్రమంగా పెరుగుతున్న ఆదరణను గుర్తించిన కరుణానిధి.. అణచివేత ధోరణిని ప్రారంభించారు. ఎంజీఆర్ తనకు ఆరోగ్యశాఖ కావాలని కోరుతూ.. మంత్రిపదవిని ఆశించారు. ఆ క్రమంలోనే ఇందిరాగాంధీ శ్రీలంకను సందర్శించడం డీఎంకేకు ససేమిరా నచ్చలేదు. ఆయన శ్రీలంకలో తమిళుల కోసం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారు. ఈ పరిణామాలన్నీ.. డీఎంకేలో చీలిక వస్తుందనే సందేశాలకు దారితీశాయి.సినిమా వర్సెస్ రాజకీయం.. ఏదో ఒకటే కరుణానిధి మంత్రిపదవుల విషయంలో తన మంకుపట్టును వదల్లేదు. ఎంజీఆర్‌ను ఈ విషయంలో పక్కనబెట్టారు. ఆ సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఓ చిత్ర షూటింగ్లో ఉన్న ఎంజీఆర్.. స్వయంగా కరుణానిధికి ఫోన్ చేశారు. తనకు ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశమివ్వాలని కోరారు. అయితే.. నటనకు దూరమైతేనే మంత్రిగా ప్రజాసేవకు అవకాశమిస్తానని కరుణానిధి తేల్చిచెప్పారు. ఎందుకంటే.. అప్పటికే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ యాక్షన్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించే పార్టీగా డీఎంకేకు పేరుంది. జోడుపదవులు తగదనేది కరుణానిధి ఆలోచన. ‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’అయినప్పటికీ ఆయన ఎంజీఆర్‌కు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ.. రాష్ట్ర చిన్నమొత్తాల పొదుపు పథకానికి చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కరుణానిధితో ఎంజీఆర్ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. 1971 అక్టోబరులో ఎంజీఆర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే కరుణానిధి అమెరికా వెళ్లారు. అదే సమయంలో.. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి డిసెంబరు 3న దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాంతో అమెరికా పర్యటనలో ఉన్న కరుణానిధి డిసెంబరు 5న ఆగమేఘాల మీద చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ పరిణామాలకు సంబంధించి అప్పట్లో ’ద హిందూ‘ విలేకరి సత్య స్టూడియోలో షూటింగ్లో ఉన్న ఎంజీఆర్ స్పందన కోసం ఫోన్ చేశారు. ఆ ఫోన్‌ను లిఫ్ట్ చేసిన ఎంజీఆర్ అసిస్టెంట్ మహాలింగం.. విషయాన్ని ఎంజీఆర్‌కు చేరవేశారు. దానికి ఎంజీఆర్ స్పందిస్తూ.. ‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’ అని సమాధానమిచ్చారు. అప్పట్లో ఆ మాట పతాకశీర్షికలకెక్కింది.కరుణానిధిలో భయం పుట్టించిన ఎంజీఆర్?వేగంగా మారుతున్న పరిణామాలు కరుణానిధికి మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. దాంతో ఆయన ఎంజీఆర్‌కు పోటీగా తన కుమారుడు ఎంకే ముత్తును వెండితెరకు పరిచయం చేశారు. ఎంజీఆర్‌కు సినిమా అవకాశాలు రాకుండా తెరవెనక మంత్రాంగం నెరిపారు. కరుణానిధి ఆదేశాలతో.. పోలీసులు కూడా ఎంజీఆర్ అభిమాన సంఘాలపై అణచివేత ధోరణిని కొనసాగించారు. ఎంకే ముత్తు అభిమాన సంఘాలు పెరిగేందుకు చర్యలు ప్రారంభించారు. ఎంజీఆర్‌ను అభిమానించే 700 ఫ్యాన్స్ క్లబ్ నేతలపై ఒత్తిడి మొదలైంది. ఈ పరిణామాలన్నీ ఎంజీఆర్‌కు మరింత చిరాకు పుట్టించాయి. దాంతో.. ఎంజీఆర్ వేరుకుంపటి ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన కరుణానిధి ఓ అడుగు వెనక్కి తగ్గారు. ఎంకే ముత్తు ఫ్యాన్స్ క్లబ్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఒక్క ఆదేశంతో డీఎంకేలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కరుణానిధి భయపడ్డారనే ప్రతికూల సందేశం దేశంలో వ్యాపించింది.పురుడు పోసుకున్న అన్నాడీఎంకేఎంజీఆర్ అంతటితో ఆగలేదు. డీఎంకే పరిపాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. అవినీతి పాతుకుపోయిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మద్యపానం కారణంగా ప్రాణాలు పోతున్నాయంటూ సమాజానికి చాటిచెప్పారు. నిజానికి ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి బహిష్కరించడం వల్ల ఆయనకు జరిగిన నష్టం లేదు కానీ.. డీఎంకే పార్టీ ఎంతగానో ప్రజాదరణను కోల్పోవడానికి కారణమైంది. తనను పార్టీ నుంచి బహిష్కరించిన ఏడాది కాలంలోనే.. అంటే.. 1972 అక్టోబరు 17న ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారు. 1986లో ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ పార్టీకి విరాళంగా చెన్నైలోని రాయపేటలో ఉన్న తన భవనాన్ని విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా తమిళ రాజకీయాలు కొనసాగాయి. ఎంజీఆర్ వారసురాలిగా 1989 నుంచి 2016 వరకు అన్నాడీఎంకేను జయలలిత నడిపించారు. -
విజయ్ వైపు.. ఆ ముగ్గురి చూపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో చేరే పార్టీల జాబితా దాదాపుగా ఖరారైంది. అయితే టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన పిలుపునకు ఎట్టకేలకు ముగ్గురు స్పందించారు. ఈ ముగ్గురి విజయ్‌తో కలిసి మెగా కూటమి దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. డీఎంకే మెగా కూటమి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఏఏ పారీ్టలు ఉన్నాయో దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఇక, అన్నాడీఎంకే– బీజేపీ కూటమిలోనూ అదే పరిస్థితి. కాగా సంకీర్ణ ధర్మం మేరకు పాలనలోనూ భాగస్వామ్యం అన్న నినాదంతో తనతో కలిసి వచ్చేవారికి అధికారంలో వాటా ఇస్తానన్న విజయ్ వైపుగా ఇంత వరకు ఎవ్వరూ దృష్టి పెట్ట లేదు. చివరకు ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్‌కు మరింత బలాన్ని ఇచ్చేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఓ వైపు ,దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ మరోవైపు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరిన దృష్ట్యా, డీఎంకేలో తమకు అవకాశం లేక పోవడంతో ఇక విజయ్ పక్షాన నిలబడేందుకు రాజకీయ అనుభవజు్ఞడైన రాందాసు నిర్ణయించి, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ సైతం రాందాసు పిలుపునకు స్పందించినట్టు ప్రచారం. రహస్యంగా చర్చలు.. ఈ ప్రచారానికి అద్దం పట్టే విధంగా ఆమె మంగళవారం రాత్రి తైలాపురంలో రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. తనకు వెన్నుపోటు పొడిచిన పళణిస్వామి, టీటీవీ దినకరన్‌కు గట్టిగా బుద్ది చెప్పే రీతిలో అన్నాడీఎంకే కేడర్‌ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా చిన్నమ్మవ్యూహాలకు పదును పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్, ముక్కళత్తోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా ఆయనకు దన్నుగా నిలబడేందుకు సన్నద్ధమవుతున్నట్టు చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను కలిగిన పుదియ తమిళగం నేత కృష్ణస్వామి సైతం విజయ్‌కు దన్నుగా నిలబడే రీతిలో సిద్ధమైనట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే సజావుగా వ్యవహారాలన్నీ సాగి, వ్యూహాలు ఫలించిన పక్షంలో విజయ్ నేతృత్వంలోమెగా కూటమి తథ్యమని రాందాసు ,చిన్నమ్మ శశికళ శిబిరంలోని కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం. -
డీఎంకే.. కాంగ్రెస్ మధ్య కుదిరిన పంచాయితీ
సాక్షి చెన్నై: తమిళనాడు కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ తేలింది. కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వడానికి డీఎంకే అంగీకరించింది. దీంతో ఇంతకాలం ఇరుపార్టీల మధ్య నడిచిన సందిగ్ధతకు తెరపడింది. రెండు పార్టీలు కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.గత కొంతకాలంగా తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడిచింది. కాంగ్రెస్ పార్టీకి ఈ సారి కాంగ్రెస్‌కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని పట్టుబట్టింది. అయితే తాజాగా ఇరుపార్టీల మధ్య సీట్ల పంచాయితీ ముగిసింది అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. తాజాగా మరో మూడుసీట్లతో పాటు ఒక రాజ్యసభ స్థానం కాంగ్రెసుకు కేటాయించారు. ఆ రాష్ట్రంలో మెుత్తం 234 సీట్లున్నాయి. కాగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫిలీం స్టార్ విజయ్ పార్టీ, దివంగత నేత మాజీ సీఎం జయలలిత మిత్రురాలు శశికళ నూతన పార్టీ పెట్టడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ సారి ఆ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
డీఎంకే సర్కార్ అవినీతిమయం: ప్రధాని మోదీ
సాక్షి, చెన్నై/పుదుచ్చేరి: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. డీఎంకే మంత్రులు అవినీతిలో పరస్పరం పోటీపడుతున్నారని విమర్శించారు. డీఎంకే సర్కారు అవినీతికి పాల్పడడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. పేదలు, రైతులు, యువతను దోచుకుందని ధ్వజమెత్తారు. ఈ అవినీతి ప్రభుత్వానికి ఇకపై అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని తేలి్చచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం మదురైలో బహిరంగ సభలో ప్రసంగించారు. అవినీతి, అసమర్థ పాలనతో తమిళనాడు ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కచ్చతీవులను శ్రీలంకకు అప్పగించి తమిళనాడుపై కక్ష తీర్చుకుందన్నారు. తమకు అధికారం అప్పగిస్తే తమిళనాడును అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, ఏఎంఎంకే వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్ సభలో పాల్గొన్నారు.పుదుచ్చేరిని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్ పుదుచ్చేరిని గతంలో ఢిల్లీలోని ఒక కుటుంబానికి ఏటీఎంగా కాంగ్రెస్ మార్చేసిందని మోదీ నిప్పులు చెరిగారు. ఆదివారం అక్కడ రూ.2,714 కోట్ల ప్రాజెక్టులకు ఆయన ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తర్వాత సభలో మాట్లాడారు. పుదుచ్చేరి అభివృద్ధికి ఆ కాంగ్రెస్, డీఎంకే స్పీడ్ బ్రేకర్‌గా మారాన్నారు. బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ పాలనలో పుదుచ్చేరి ప్రగతి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ ఆదివారం తమిళనాడులో తిరుప్పరకుండ్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ దోతీ, కుర్తా ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణచేశారు. పూజల్లో పాల్గొన్నారు. -
తిరుచెందూర్ రేసులో కనిమొళి.. డీఎంకే కొత్త స్కెచ్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. ముఖ్యంగా అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన వ్యూహాలకు పదును పెడుతూ, దక్షిణ తమిళనాడులో పార్టీ పట్టును మరింత సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుకుడి ఎంపీ కనిమొళి కరుణానిధిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నదని సమాచారం. ఎంపీ కనిమొళిని తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తిరుచెందూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ స్థానంలో కనిమొళిని బరిలోకి దింపేలా అంతర్గత చర్చలు సాగుతున్నాయని సమాచారం. అనారోగ్య కారణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు రాధాకృష్ణన్ ఇప్పటికే పార్టీ అగ్రనాయకత్వానికి తెలియజేశారని సమాచారం.ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ మార్పును బలపరుస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది కనిమొళి రాకకు సంకేతమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సోదరి అయిన కనిమొళి ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో డీఎంకే తరఫున చురుకుగా కనిపిస్తున్నారు.ఇటీవల మీడియా ప్రతినిధులు తిరుచెందూర్ నుంచి పోటీ చేసే విషయంపై ప్రశ్నించగా, ఆమె ఆ అవకాశాన్ని కొట్టిపారేయకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దక్షిణ తమిళనాడు జిల్లాల్లో డీఎంకే ప్రాబల్యాన్ని పెంచడానికి కనిమొళి లాంటి అగ్రశ్రేణి నాయకురాలు అసెంబ్లీ బరిలో ఉండటం వ్యూహాత్మకంగా కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనిమొళి రంగ ప్రవేశం ఖాయమన్న వార్తలు తమిళ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.ఇది కూడా చదవండి: ‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు -
డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీ ఎంకే బహి ష్కృత నేత ఓ.పన్నీర్ సెల్వం (ఓపీఎస్) డీఎంకేలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఆయన డీఎంకే కండువాను కప్పుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకేలో చేరడం తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. సీఎం స్టాలిన్ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, అన్నాదురై, కరుణానిధి చూపిన దారిలో ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోతూ పార్టీని, ప్రభుత్వాన్ని ఆదర్శంగా నడిపిస్తున్నారని కొనియాడారు. ‘దేశం మొత్తం స్టాలిన్ నాయకత్వాన్ని నిశితంగా గమనిస్తోంది. రాజకీయ పార్టీని ఎలా నడపాలో ఆయన కొత్త వ్యాకరణం నిర్దేశించారు. తమిళనాడు ప్రజలకు సమర్థవంతమైన, గొప్ప ప్రశంసనీయమైన పరి పాలనను అందిస్తున్నారు’అని కొనియాడారు. -
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. సెల్వంకు కండువా కప్పిన స్టాలిన్
-
తమిళనాట సంచలనం.. డీఎంకేలో చేరిన మాజీ సీఎం
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఏఐడిఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయనను సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పన్నీరు సెల్వానికి ఆయన గతంలో పోటీ చేసిన స్థానం నుంచే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని సమాచారం.పన్నీరు సెల్వం దివంగత నేత ఆ రాష్ట్ర మాజీ సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడు. జయలలితపై అనర్హత వేటు పడిన సందర్భంతో పాటు ఆమె మరణాంతరం తమిళనాడుకు సీఎంగా వ్యవహరించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో 2022లో ఆయన ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా కొద్దిరోజుల క్రితమే దివంగత నేత ఆరాష్ట్ర మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. కాగా తాజాగా జయలలిత వీర విధేయుడిని అని చెప్పుకునే పన్నీరు సెల్వం డీఎంకేలో చేరారు. దీంతో తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పన్నీరు సెల్వం డీఎంకేలో చేరడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. -
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)తో సీపీఐ,సీపీఎం వంటి వామపక్షాలతో పాటు పదికిపైగా పార్టీలు పొత్తును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం (ops)..సీఎం స్టాలిన్‌తో భేటీ అయారు. ఇరువురి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(aiadmk)నుంచి బహిష్కరణకు గురైన సీఎం ఓ.పన్నీరు సెల్వం శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కలిశారు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశం చివరి రోజున ఓపీఎస్‌తో పాటు ఆయన తనయుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్‌తో కలిసి స్టాలిన్‌ను కలిశారు. స్టాలిన్ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు అనంతరం, డీఎంకే పాలనపై ఓపీఎస్ ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తోందని వ్యాఖ్యానించారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని అన్నారు. ఓపీఎస్ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఈ భేటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త కూటమి అవకాశాలపై ఊహాగానాలకు దారితీసింది.ఒకప్పుడు సీఎం.. ఇప్పుడు రాజకీయ నిరుద్యోగిఏఐఏడీఎంకే హయాంలో ఓపీఎస్ సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ఆ పార్టీతో విభేదాలు, ఓపీఎస్ అనుచరులు డీఎంకే, ఏఐఏడీఎంకేలో చేరిపోయారు. ఏఐఏడీఎంకేలో బహిష్కరణకు గురైన ఓపీఎస్ తిరిగి చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్డీఏలో తిరిగి చేరాలన్న యత్నం కూడా ఫలించలేదు. గత ఏడాది బీజేపీతో విభేదాల కారణంగా ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఓపీఎస్ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. ఈ క్రమంలో స్టాలిన్‌ను ఓపీఎస్ కలవడం ఆసక్తికరంగా మారింది.ఒకే దెబ్బకు రెండు పిట్టలుఅయితే,ఓపీఎస్,ఎంకే స్టాలిన్ సమావేశంపై విశ్లేషకులు భవిష్యత్తు రాజకీయాల్ని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం వల్ల ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం అన్నది విశ్లేషిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఓపీఎస్‌ను చేర్చుకోవడం ద్వారా డీఎంకే, ఏఐడీఎంకేలోని అసంతృప్తుల్ని తనవైపుకు తిప్పుకోవచ్చు. ఓపీఎస్‌కు ఉన్న వ్యక్తిగత మద్దతు, ఆయన అనుచరుల ఓటు బ్యాంక్ డీఎంకేకి చేరితే వచ్చే ఎన్నికల్లో అదనపు బలం లభిస్తుంది. ఓపీఎస్‌ను కూటమిలో చేర్చుకోవడం డీఎంకేకి వ్యూహాత్మకంగా లాభదాయకం. అదే సమయంలో డీఎంకేతో చేరితే ఓపీఎస్‌కు ఆయన కుమారుడికి రాజకీయ పునరావాసం లభిస్తుంది. ఓపీఎస్‌కు ఇది ఒక కొత్త మార్గం, కొత్త అవకాశంగా మారొచ్చు.ఓపీఎస్-డీఎంకే భేటీ ప్రతిపక్ష ఏఐఏడీఎంకి పెద్ద దెబ్బ. ఇప్పటికే ఓపీఎస్ అనుచరులు డీఎంకే, ఏఐడీఎంకేలలో చేరిపోయారు. ఓపీఎస్.. డీఎంకేతో కూటమి కుదుర్చుకుంటే, ఏఐఏడీఎంలోని విభేదాలు మరింత పెరుగుతాయి. ఇది ఏఐడీఎంకే ఓటు బ్యాంక్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.ఓపీఎస్.. ఎన్డీఏ నుంచి బయటకు రావడం బీజేపికి నష్టం. ఓపీఎస్.. డీఎంకేలో చేరితే, బీజేపీకి తమిళనాడులో మిత్రపక్షం కోల్పోయినట్టే. ఇది ఎన్డీయే వ్యూహానికి ప్రతికూల ప్రభావం చూపుతుంది.మొత్తానికి సీఎం ఎంకే స్టాలిన్‌తో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసింది. అదే సమయంలో ఏఐఏడీఎకే, బీజేపీలకు నష్టం. ఓపీఎస్ డీఎంకేలో చేరుతారా? లేక ఎన్డీయే కూటమితో చర్చలు జరుపుతారా? అన్న అంశంపై స్పష్టత లేదు. అయినప్పటికీ, ఈ పరిణామం రాబోయే ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. -
మహిళల ఖాతాల్లోకి రూ.5వేలు
తమిళనాడు: డీఎంకే ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి రూ.5వేలు వేయడంతో మహిళలు రెట్టింపు ఉత్సాహం చెందారు. ఎన్నికల వేల డీఎంకే వ్యూహానికి సానుకూల స్పందనతో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ మహిళలను ఆకర్షించే విధంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు నెలలకు రూ.3వేలు, మే నెల వేసవి ఎండలకు అదనంగా రూ.2వేలతో కలిపి రూ.5లచొప్పున మహిళ హక్కు పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల ఖాతాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకే నగదు జమ చేశారు. మహిళల చేతికి డబ్బులు అందాలని శుక్రవారం ఉదయం 7 గంటలకల్లా అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని సీఎం స్టాలిన్ తెలిపారు. దీంతో మహిళలు నగదు విత్‌డ్రా కోసం బ్యాంకుల వద్దకు పోటెత్తారు. తిరుత్తణిలోని మపోసీ ప్రదాన రోడ్డు మార్గంలోని ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకుల వద్ద క్యూకట్టారు. రెండు గంటల పాటు బ్యాంకు వద్ద వేచివుండి బ్యాంకు ఏజెంట్లు, సరీ్వసు కేంద్రాల్లో డబ్బులు విత్‌డ్రా చేశారు. -
ఒంటరిగానే గెలుస్తాం.. స్టాలిన్
తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని ప్రకటించారు. ఆ పార్టీకి పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. ఈ అంశంపైనే ఇటీవల DMK ఎంపీ MP కనిమెుళి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సారి కాంగ్రెస్‌కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.డీఎంకే ఒంటరిగానే మెజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అంతేకాకుండా 2021 లో సాధించిన స్థానాల కంటే ఈ ఏడాది మరిన్ని అధిక సీట్లు గెలుస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. అయినప్పటికీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.అయితే ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ గతంతో పోలిస్తే మరిన్ని అధిక స్థానాలు కోరుతుందని తెలుస్తోంది. మంత్రి వర్గంతో పాటు రాజ్యసభ స్థానంకోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల సీట్ల షేర్ అంశాలు ఈ నెల 22నుంచి ప్రారంభమవుతాయని డీఎంకే పార్టీ ప్రకటించింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సినీనటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. -
తమిళనాడులో అరాచక పాలన
మధురాంతకం(తమిళనాడు): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎంసీ(కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కార్ రాజ్యమేలుతోందని మండిపడ్డారు. అవినీతి, మాఫియా, నేరాలకు డీఎంకే పర్యాయ పదంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు గట్టిగా బుద్ధి చెప్పాలని తమిళనాడు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని స్పష్టంచేశారు. సీఎంసీని ఎవరూ సహించబోరని అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం తమిళనాడులోని మధురాంతకంలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రజలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అన్నా డీఎంకే అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి, అమ్మ మక్కల్ కట్చి కళగం(ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్, పీఎంకే నాయకుడు డాక్టర్ అన్బుమణి రాందాస్, టీఎంసీ–ఎం నేత జీకే వాసన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్నారు. అరాచక పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సుపరిపాలన కోసం వారంతా ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి డీఎంకే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తిరుప్పరకుండ్రంలో ఇటీవల జరిగిన కార్తీక దీప వివాదాన్ని ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలను కూడా డీఎంకే లెక్కచేయడం లేదని ఆక్షేపించారు. భక్తుల హక్కుల రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. డీఎంకేలో ఎవరైనా పైకి ఎదగాలంటే వారసత్వం, అవినీతి, మహిళలపై వేధింపుల్లో ప్రమేయం ఉండాలని ఎద్దేవా చేశారు. మన సంస్కృతిని అవమానించేవారికి ఆ పార్టీలో పెద్దపీట వేస్తుంటారని విమర్శించారు. డీఎంకే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇష్టం ఉండదని చెప్పారు. కేవలం ఒక్క కుటుంబం కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. తమిళనాడులో ఎంత అవినీతి జరిగిందో, ఎవరికి జేబుల్లోకి ఎంత సొమ్ము వెళ్లిందో చిన్నపిల్లలకు కూడా తెలుసని పేర్కొన్నారు. డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి మనమంతా ఒక్కటి కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని సూచించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రంతో భుజం భుజం కలిపి పనిచేసే ప్రభుత్వం కావాలన్నారు. డీఎంకే పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆక్షేపించారు. డ్రగ్స్, నేరాలు తప్ప ఇక్కడ అభివృద్ధి లేదన్నారు. యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకున్నారని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు నేరాలను కట్టడి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రస్తుతం డీఎంకే పాలనలో ప్రజలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. -
డీఎంకే పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ
చెన్నై: డీఎంకే పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని.. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన తమిళనాడులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై సమీపంలోని మదురాంతకం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తమిళనాడులో ఎన్డీఏ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.డీఎంకేను సీఎంసీ ప్రభుత్వం(అవినీతి, మాఫియా, క్రైమ్) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ప్రజలు ఈ పార్టీని వేరులతో సహా పెకిలించి మార్పు కోసం ఓటు వేయాలని నిర్ణయించుకున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం కేవలం ఒకే కుటుంబం కోసం పనిచేస్తోందని విమర్శించారు. 2014 కంటే ముందు కేంద్రంలో కాంగ్రెస్, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల కంటే, తమ ప్రభుత్వం తమిళనాడుకు మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించిందని మోదీ గుర్తుచేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో డ్రగ్స్, మద్యం మాఫియాలు పెరిగిపోయాయంటూ ఆరోపించారు.ఎన్డీయేకు వేసే ప్రతి ఓటు తమిళనాడును మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేస్తుందంటూ మోదీ చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉంటే (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) పెట్టుబడులను ఆకర్షించడం సులభమవుతుందన్నారు. దివంగత నేత జయలలిత హయాంలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ బాగుండేదని.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. -
తమిళనాట పెరిగిన పొలిటికల్ హీట్
సాక్షి చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల పంపకాలపై సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 40 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తుండగా.. డీఎంకే అందుకు ఇంకా స్పందించలేదు. ఒకవేళ సీట్ల పంపకం తేలనిపక్షంలో విజయ్ టీవీకే పార్టీతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది.తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు పొత్తుల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. అధికార డీఎంకేతో కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాయి. దీంతో సీట్ల షేరింగ్ అంశంపై రెండుపార్టీల మధ్య ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ సీట్లు తమ పార్టీకి కేటాయించాలని డీఎంకేను కోరినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్ పార్టీ 32 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ కనీసం 38 స్థానాలకైనా పరిమితం కావాలని భావిస్తోందట. కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది" అని వ్యాఖ్యానించారు. దీంతో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు.ఇటు కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీ టీవీకేతో పొత్తుపెట్టుకునే అవకాశాల్ని పూర్తిగా కొట్టిపడేసే అవకాశాలు లేవు. ఇటీవల ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫిలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ " కాంగ్రెస్, టీవీకే పార్టీలు సహజమిత్రులు. రాహుల్ గాంధీ, విజయ్ మంచి స్నేహితులు, రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలు అధికంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించడం కలకలమే రేపింది. దీంతో.. బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ సైతం విజయ్ పార్టీతో పొత్తుకోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తమిళనాడులో పర్యటించిన అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షా ఉద్దేశపూర్వకంగానే అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి పళనిస్వామిని కలవకుండా వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తుల అంశంపై తమ అధినేత విజయ్‌తో చర్చించాకే ఏ నిర్ణయమనేది ప్రకటిస్తామని టీవీకే నేతలు చెబుతుండడం గమనార్హం. -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌పై బీజేపీ బిగ్ ప్లాన్?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట రాజకీయం ములుపులు తీరుతోంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)(TVK Vijay) పార్టీతో పొత్తు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ మా సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి వ్యాఖ్యలు చేసిన వేళ.. బీజేపీ రంగంలోకి దిగింది. టీవీకేతో పొత్తు గురించి బీజేపీ నేతలు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న తమిళనాడుపై (Tamil Nadu Politics) బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతో పాటు అక్కడి అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక, తమిళనాడులో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన టీవీకే విజయ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన విజయ్ తన పార్టీని గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీలు విజయ్ పార్టీపై ఫోకస్ పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.బీజేపీ ప్లానేంటి? విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుండటం అందరూ గమనిస్తున్నారు. ఈ క్రమంలో టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తోంది. ఇదే సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక తన పర్యటనలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామిని కలవకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎన్డీఏ కూటమి కేవలం ఒక పార్టీకే పరిమితం కాదని.. డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులను ఏకం చేయాలనే బలమైన సందేశాన్ని అమిత్ షా తన మిత్ర పక్షాలకు పంపించారు. అలాగే, జనవరి 14వ తేదీన వచ్చే పొంగల్ (సంక్రాంతి) నాటికే మహాకూటమి రూపకల్పనపై స్పష్టత రావాలని అమిత్ షా.. తమిళనాడు బీజేపీ కార్యవర్గాన్ని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ముందే ప్రారంభించాలని సూచించారు.అయితే ఇప్పటికే తాము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న టీవీకే పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. మరోవైపు.. ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా ఉంది. టీవీకే పార్టీ ఏర్పాటు తర్వాత విజయ్ తమిళనాడులోని అధికార డీఎంకేను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటూ పలుమార్లు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, విజయ్ మధ్య గ్యాప్‌ను ఉపయోగించుకుని టీవీకేను తన వైపు తిప్పుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.టీవీకే నేత సంచలన ప్రకటన..!ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తమ సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లౌకికవాదం, మతత్వానికి వ్యతిరేకంగా వారి వైఖరి విషయంలో కాంగ్రెస్, టీవీకే సహజ మిత్రపక్షాలు. ఆ కోణంలో మేము ఎల్లప్పుడూ సహజ భాగస్వాములమై రాహుల్ గాంధీ, మా నాయకుడు విజయ్ కూడా స్నేహితులే అనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రాజకీయంగా వ్యూహత్మకంగా ముందుకెళ్లే బీజేపీ.. టీవీకే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. మొత్తంగా తమిళ రాజకీయం పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. -
తమిళనాట ‘20% కమీషన్ల’ పాలన
పుదుకొట్టై: తమిళనాడులో డీఎంకే పాలనలో అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మండిపడ్డారు. రాష్ట్రంలో ‘20 శాతం కమీషన్ల’ పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రతి పనిలో 20 శాతం కమీషన్లు నొక్కేస్తున్నారని, ఇదొక నిబంధనగా మారిపోయిందని షా దుయ్యబట్టారు. తమిళనాడుతోపాటు పశ్చిమ బెంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగరత్నన్ చేపట్టిన యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం పుదుకొట్టైతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తమిళనాడులో ఉందన్నారు. తమిళ భాషను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తమిళాన్ని మరింత ప్రోత్సహించడానికి పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో హిందుమతాన్ని, హిందువులను డీఎంకే తరచుగా కించపరుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరియాణా, ఢిల్లీ, బిహార్ తరితర రాష్ట్రాల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిందని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ అదే ఫలితం పునరావృతం కాబోతోందని స్పష్టంచేశారు. కుటుంబ రాజకీయాలకు ఇక చరమగీతం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని అమిత్ షా మండిపడ్డారు. ఆ పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందన్నారు. క్యాష్ ఫర్ జాబ్స్‌తోపాటు మనీ లాండరింగ్ కేసుల్లో డీఎంకే నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయని గుర్తుచేశారు. అవినీతి నేతలుండగా రాష్ట్రం ప్రగతి సాధించడం సాధ్యం కాదని అన్నారు. అప్పులు, మద్యం ఆదాయంతోనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏర్పడిందన్నారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సీఎం స్టాలిన్ ఆరాటపడుతున్నారని, ఆయన ఆశ నెరవేరే ప్రసక్తే లేదని అమిత్ షా పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించని స్టాలిన్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందువుల పండుగలకు సైతం అనుమతి ఇవ్వడం లేదన్నారు. హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి స్టాలిన్ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. -
విజయ్‌కు డీఎంకే మాస్టర్ స్ట్రోక్!
తమిళనాడు ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా లేదంటే సంక్రాంతి లోపే ఏయే పార్టీలు, ఎవరెవరితో పొత్తులో కొనసాగుతాయో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే..కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్.. అధికార డీఎంకేపైనే ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొన్న పుదుచ్చేరి.. నిన్న ఈరోడు బహిరంగ సభల్లో ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో.. గురువారం ఈరోడులో జరిగిన టీవీకే ‘మక్కల్ సందిప్పు’బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే ఓ దుష్ట శక్తి అని, టీవీకే స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో ఈ రెండింటి మధ్యే పోటీ అన్నారు. అయితే.. ‘‘ఎంజీఆర్, జయలలిత డీకేంను తీవ్రంగా విమర్శించారని, వారు ఎందుకు అంతగా విమర్శించారో అప్పట్లో నాకు తెలియలేదు. వారు చెప్పిందే నేనిప్పుడు చెబుతున్నా. డీఎంకే దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. టీవీకే అంటే డీఎంకేకు భయం పట్టుకుంది. నా గురించి 24 గంటలూ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కానీ డీఎంకే ప్రభుత్వం దానిని మూసి పెడుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నేనేంటో తెలుస్తుంది. సెంగోట్టైయ్యన్ మనతో కలిసిపోవడం గొప్ప బలం’’ అని విజయ్ ప్రసంగించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా చెన్నై ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ‘‘విజయ్‌ని ఏనాడైనా ఇలా అడిగారా?.. ముందు అసలు ఆయన్ని మీ ముందు మాట్లాడించండి’’.. అని మీడియాకే చురక అంటించారాయన. ఈలోపు.. ఆయన మరో దారిలో విజయ్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది.ఖాకీ ఫేమ్ వినోద్ డైరెక్షన్లో విజయ్ ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇది ఆయన చివరి చిత్రంగా ఓ ప్రచారం సాగుతోంది. దీంతో.. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్ హిట్ చేసి విజయ్‌కు సెండాఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 9వ తేదీన ఈ చిత్ర రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది కూడా. అయితే..ఎలాంటి క్లాష్ లేకుండా.. మిగతా చిత్రాలు రిలీజ్ అవుతాయనుకున్న టైంలో కోలీవుడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ‘పరాశక్తి’.. జనవరి 14వ తేదీ నుంచి 10వ తేదీకి ముందుకు జరిగింది. ఈ ప్రీపోన్ నిర్ణయం విజయ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఇది చాలదన్నట్లు.. మరో స్టార్ నటుడు అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మంకత్త (తెలుగు డబ్ మూవీ గ్యాంబ్లర్)ను దాదాపుగా ఆ టైంలోనే రిరీలీజ్ కాబోతోంది. అయితే.. ఈ రెండు నిర్ణయాల వెనుకా ఉదయ్‌నిధి హస్తం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది అక్కడ..సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన పరాశక్తిలో శివకార్తీకేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల, రానా దగ్గుబాటి లాంటి స్టార్‌కాస్టింగ్ ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఉదయ్‌నిధికి అత్యంత సన్నిహితుడు కూడా. ఈ కారణంగానే ఆకాశ్‌పై ఈడీ దాడులు జరిగాయని అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. కాబట్టి.. ఉదయ్‌నిధి కోరిక మేరకే పరాశక్తి ప్రీపోన్ జరిగిందనే బలమైన ప్రచారం మొదలైంది. అలాగే.. అజిత్ మంగథాను నిర్మించింది సన్ పిక్చర్స్. అది స్టాలిన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అని తెలిసిందే. అలా విజయ్ చివరి సినిమా కలెక్షన్లకు గండికొట్టేందుకు.. ఉధయ్నిధి ఆధ్వర్యంలో డీఎంకే ఇలాంటి మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత అనేది పక్కన పెడితే.. దానికి విజయ్ అభిమానులు ఇస్తున్న కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోందక్కడ. -
డీఎంకే ఈవిల్, టీవీకే ప్యూర్.. విజయ్ రాజకీయ పునరాగమనం
తమిళనాడు: నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ గురువారం మధ్యాహ్నం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత రాష్ట్రంలో ఆయన పెద్ద ఎత్తున జరిపిన మీటింగ్ ఇదే కావడం విశేషం. ఈ ర్యాలీ ద్వారా విజయ్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారానికి స్వరం సిద్ధం చేసుకున్నారు. విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడులో NEET పరీక్ష మినహాయింపు అంశం, శాంతిభద్రతల సమస్యలపై ఆయన డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే పార్టీకి సమస్యలు ఫెవికాల్తో ముడిపడి ఉన్నాయి, వాటిని వేరు చేయలేం అని వ్యాఖ్యానించారు. అధికార డీఎంకేను దుష్ట శక్తిగా, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కజగం)ను స్వచ్ఛమైన శక్తిగా అభివర్ణించారు. పోరాటం స్వచ్ఛమైన శక్తికి, చెడుకు మధ్య అని విజయ్ మండిపడ్డారు. ర్యాలీకి వచ్చిన జనసమూహాన్ని సురక్షితంగా వెళ్లమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ మాజీ ఏఐఏడీఎంకే నాయకుడు కేఏ సెంగొట్టయన్ స్వస్థలం విజయమంగళం సమీపంలో జరగడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సెంగొట్టయన్ గత నెలలో ఏఐఏడీఎంకే నుండి బహిష్కరణకు గురైన తర్వాత విజయ్ పార్టీ టీవీకేలో చేరారు. ఆయనను సీనియర్ రాజకీయ నాయకుడు, అద్భుతమైన ప్రచార వ్యూహకర్తగా పరిగణిస్తారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ నిర్వహించిన రెండవ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇదే కావడం విశేషం. మొదటి సభ గత వారం పుదుచ్చేరిలో జరిగింది, అక్కడ కూడా ఆయన డీఎంకేపై మాటల దాడి చేశారు. ఈరోడ్ ర్యాలీతో విజయ్ తన రాజకీయ యాత్రను మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ ర్యాలీతో డీఎంకేపై ప్రత్యక్ష పోరాటానికి సంకేతాలు ఇచ్చారు. తోపులాటకు ఆస్కారం లేకుండా.. తోపులాట, తొక్కిసలాటలకు ఆస్కారం ఇవ్వకుండా లోనికి కేడర్‌ను నిర్ణీత సమయంలోకి అనుమతించడం, నిర్ణీత సమయంలో విజయ్ అక్కడికి వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏర్పాట్లను టీవీకే వర్కింగ్ కమిటీ సమన్వయకర్త సెంగొట్టయ్యన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షించారు. గుర్తింపు కార్డులు ఉన్న కేడర్‌ను మాత్రమే లోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా విజయ్ పర్యటనను నిర్వహించారు. గర్భిణిలు, వృద్ధులు, పిల్లలు దయ చేసి ఇక్కడకు రావొద్దని ముందుగానే సూచించారు. రెండున్నర నెలల అనంతరం రాష్ట్రంలో మళ్లీ మీట్ ది పీపుల్ ప్రచార ప్రయాణానికి విజయ్ శ్రీకారం చుట్టనన్నడంతో బయటి వ్యక్తులు ఎవ్వరూ ఈరోడ్‌కు రావొద్దని, విజయ్ వాహనాన్ని వెంబడించ వద్దని టీవీకే కార్యాలయం విన్నవించుకుంది. -
స్టాలిన్‌కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్ సభ
పుదుచ్చేరి: తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు డీఎంకేకి తగిన గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. గతంలో కరూర్‌లో విజయ్ బహిరంగ సభ జరగగా, తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేడు (మంగళవారం) పుదుచ్చేరిలో జరిగిన ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ.. ‘2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుండి డీఎంకే పాలకులు 100 శాతం గుణంపాఠం నేర్చుకుంటారు. మా ప్రజలు దానిని నిర్ధారిస్తారు’ అని అన్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ విజయ్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.డీఎంకే ప్రభుత్వంపై విజయ్ విమర్శలు కొనసాగిస్తూ.. పుదుచ్చేరి సీఎం రంగసామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పుదుచ్చేరి ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని, ప్రత్యర్థి పార్టీ ర్యాలీకి సైతం భద్రత కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ‘సీఎం రంగసామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం తమిళనాడు డీఎంకే పాలన లాంటిది కాదు’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు డీఎంకే పాలకులు పుదుచ్చేరి ప్రభుత్వం నుండి నేర్చుకుంటే మంచిది, అయితే, వారు ఇప్పుడు నేర్చుకోరు' అని వ్యంగ్యంగా అన్నారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన కర్తవ్యమని టీవీకే చీఫ్ ప్రకటించారు. #WATCH | Puducherry | Security arrangements in place as a large number of people start arriving for TVK Chief Actor Vijay's political rally in Uppalam Expo Ground. For the first time since the stampede during his rally in Karur that killed 41 people, actor-politician Vijay is… pic.twitter.com/NGMFCNIeeT— ANI (@ANI) December 9, 2025ఈ సందర్భంగా విజయ్.. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాపై ఉన్న డిమాండ్‌ను మరోమారు లేవనెత్తారు. కేంద్రం అభివృద్ధి విషయంలో పుదుచ్చేరికి మద్దతు ఇవ్వలేదనిఅని విమర్శించారు. అయితే, కేంద్రం విభజించి చూసినా.. తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలు కలిసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గత సెప్టెంబర్ 27న కరూర్‌లో టీవీకే నేత విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 110 మంది గాయపడ్డారు. "DMK regime will 100 per cent learn their lesson from 2026 TN Assembly election. Our people will ensure it," TVK chief #Vijay said at the party's first public rally at Puducherry since #KarurStampede. https://t.co/NMgDbEXbHH— The New Indian Express (@NewIndianXpress) December 9, 2025 -
విజయ్ ర్యాలీపై పోలీసుల ఆంక్షలు.. క్యూఆర్ కోడ్ గుర్తింపుతో..
సాక్షి, చెన్నై: టీవీకే నేత విజయ్ తన కేడర్‌కు 11 రకాల ఆంక్షలను విధించారు. కరూర్ విషాద ఘటన నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలలో నిమగ్నమయ్యారు. బుధవారం పుదుచ్చేరిలో జరగనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకుని ముందుగా కేడర్‌కు 11 రకాల ఆంక్షలను వినయ పూర్వకంగా విజయ్ సోమవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పుదుచ్చేరి ఉప్పలంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు విస్తృతం చేశారు. ఈసభకు హాజరయ్యే వారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలో అందజేస్తూ వస్తున్నారు. పార్టీ ఆవిర్భావంతో పుదుచ్చేరిలో జరగనున్న తొలి సభను పోలీసులకు అనేక ఆంక్షలు,సూచనలు, షరుతుల నడుమ విజయవంతం చేసుకునేందుకు టీవీకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో ఈ సభ విజయవంతానికి సహకరించాలని కోరుతూ కేడర్‌కు విజయ్ లేఖరాశారు. దయ చేసి ఈ సభకు తమిళనాడు నుంచి ఎవ్వరూ రావద్దని విన్నవించారు. తన వాహనాన్ని ద్విచక్ర వాహనాలు, కార్లలో వెంబడించ వద్దని వేడుకున్నారు. గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులు, బాల బాలికలు దయ చేసిన రావొద్దని విన్నవించారు. శాంతిభద్రతల పరిరక్షణకు.. పోలీసుల సూచనలను తప్పని సరిగా అనుసరించాలని, ట్రాఫిక్ జాం పరిస్థితులు కలి్పంచ వద్దు అని, శాంతి భద్రతల పరిరక్షణలో గానీయండి, క్రమశిక్షణలో గానీయండి హుందాగా వ్యవహరించాలని విన్నవించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించాలని, సభా ప్రాంగణ పరిసరాలలో చెట్లు ఎక్కడం, గోడలపైకి ఎక్కడం, విద్యుత్ స్తంభాలపై నిలబడటం వంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడ కూడదని కోరారు. అంబులెన్స్‌లకు, మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆ పరిసరాలలో వ్యవహరించాలని, బహిరంగ సభ ముగిసిన అనంతరం శాంతియుతంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది, సమస్య అన్నది సృష్టించకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. కాగా, సోమవారం ఏర్పాట్లను పరిశీలించిన భుస్సీ ఆనంద్ చేసిన వ్యాఖ్య హాట్‌టాపిగా పుదుచ్చేరిలో మారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పొత్తు విషయంగా విజయ్ సమాచారం ఇస్తారని పేర్కొనడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఇక పార్టీ వర్కింగ్ కమిటీ సమన్వయ కర్త సెంగొట్టయ్యన్ పేర్కొంటూ, టీవీకే ఎన్నికల చిహ్నం చూసి దేశమే ఆశ్యర్య పోబోతందని స్పందించడంతో ఎలాంటి గుర్తు దక్కబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈరోడ్‌లో విజయ్ ర్యాలీకి పోలీసులు నో -
అది సరికాదు.. కేంద్రంపై మరోసారి సీఎం స్టాలిన్ ఫైర్
చెన్నై: కేంద్రంపై మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. తమిళనాడును కేంద్రం మోసం చేస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడు నుంచి కేంద్రానికి ఎక్కువ రెవెన్యూ వెళ్తోందని.. కేంద్రం నుంచి మాత్రం తమిళనాడుకు తక్కువ నిధులొస్తున్నాయంటూ కేంద్రాన్ని స్టాలిన్ నిలదీశారు. రాష్ట్రానికి సంబంధించిన న్యాయమైన డిమాండ్లను కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని దుయ్యబట్టారు.అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకుంటూ, తమిళనాడు ప్రజల గొంతును బీజేపీ ప్రభుత్వం విస్మరించడం సరైనదేనా? అంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. తమిళనాడు డిమాండ్లు, అవసరాలను లేఖలు, వ్యక్తిగత పిటిషన్లు, శాసనసభ తీర్మానాల ద్వారా తీసుకొని వాటిని వినకపోవడం న్యాయం కాదు. అత్యధిక పన్ను ఆదాయాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రమైన తమిళనాడును మోసం చేయడాన్ని మనస్సాక్షి ఉన్న ఎవరూ అంగీకరించరు. మేము తలవంచం. నిటారుగా నడుస్తాం. రాబోయే పార్లమెంటరీ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం.. తమిళనాడు ప్రజా ప్రతినిధులకు సమాధానం చెప్పాలి’’ అంటూ స్టాలిన్ డిమాండ్ చేశారు. மிகப்பெரிய ஜனநாயக நாடு என்று பெருமையாகச் சொல்லிக்கொண்டே, தமிழ்நாட்டு மக்களின் குரலை ஒன்றிய பா.ஜ.க. அரசு புறக்கணிப்பது சரியா?தமிழ்நாட்டின் கோரிக்கைகளை - தேவைகளைக் கடிதங்களாக, நேரில் மனுக்களாக, சட்டமன்றத் தீர்மானங்களாக எடுத்துச் சொல்லியும் காதில் வாங்காமல் இருப்பது நியாயமல்ல!… pic.twitter.com/xCC8BcOZNB— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) November 29, 2025 -
డిప్యూటీ సీఎం బర్త్‌డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు
తమిళనాడు మంత్రి పెరియా కరుప్పన్ చిక్కుల్లో పడ్డారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో(డిసెంబర్ 27న ఆయన బర్త్‌డే) అశ్లీల నృత్యాల్ని ప్రొత్సహించారాయన. పొట్టి దుస్తుల్లో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుంటే సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఆయన జాలీగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో దుమారం రేగుతోంది. వీడియోలో మంత్రి పెరియా కరుప్పన్.. ముందువరుసలో జిల్లా స్థాయి పార్టీ నాయకులతో కలిసి కూర్చుని ప్రదర్శనను చూస్తున్నట్లు కనిపించారు. ఆ డ్యాన్సర్లను చూస్తూ మీసాలను మెలేశారాయన. ఆ తర్వాత ఆయన వేదికపై ఉన్న కళాకారులను దిగమని సంకేతాలు చేస్తూ.. తన దగ్గరగా నృత్యం చేయమని సూచిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో వాళ్లు ఆయన దగ్గరకు వచ్చి స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి.. డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఇలాంటి నృత్యాలను ప్రొత్సహించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మహిళలకు గౌరవం ఇచ్చే తీరు ఇదేనా? అని బీజేపీ నిలదీస్తోంది. అర్థనగ్నంగా ఉన్న మహిళలను తమ వద్దకు పిలిపించుకుని ఇలా మురిసిపోయే నేతలకు.. తమ భద్రత గురించి మహిళలు ఎలా చెప్పుకోగలరు? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరుప్పున్ చరిత్ర గురించి పాపం వాళ్లకు తెలియదేమో. ఇది పగటిపూట జరిగిందని అదృష్టం, లేకపోతే ఏమి జరిగేదో ఊహించలేం అంటూ అన్నాడీఎంకే ఘాటు చురకలు అంటించింది. పలువురు నెటిజన్లు సైతం ఈ వీడియోపై మండిపడుతున్నారు. గతంలో ఓ మహిళతో ఆయన్న సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజా ఘటన నేపథ్యంలో ఆ వీడియోను పలువురు తెరపైకి తెచ్చారు. ఈ ఘటనపై డీఎంకే పార్టీ, ఉదయ్‌నిధి ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదు. மீசையை முறுக்கிக்கொண்டே ஆட்டத்தை ரசிக்கும் அமைச்சர் பெரிய கருப்பன்... வைரல் வீடியோவ முழுசா பாருங்க.... pic.twitter.com/D1sHnbpmd8— Kathir News (@KathirNews) November 26, 2025 -
వచ్చే ఎన్నికల్లో డీఎంకే చిత్తుగా ఓడిపోవడం ఖాయం: విజయ్ విమర్శలు
చెన్నై: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తర్వాత కొన్ని నెలలు సుదీర్ఘ విరామం తీసుకున్న టీవీకే పార్టీ అధినేత, సినీనటుడు విజయ్.. తన రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. నేడు(ఆదివారం, నవంబర్ 23 వ తేదీ) కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దానికోసం కాంచీపురంలోని ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేశారు.కేవలం 2000 మందికి మాత్రమే QR కోడ్ పాస్‌లతో కూడిన అనుమతి ఇచ్చారు. అనుమతి లేని వారికి ప్రవేశం లేకుండా పకడ్బందీ ప్లానింగ్ చేశారు. ప్రచార పునఃప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార డీఎంకే, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశంలో మాట్లాడిన విజయ్.. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే ర్యాడికల్స్‌కు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రజలను విడదీసే రాజకీయాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలతో పాటు దోపిడీ భావజాలం డీఎంకే స్వభావమని ఆయన మండిపడ్డారు. టీవీకే పార్టీ సమానత్వం కోసం స్పష్టమైన విధానాలను ముందుకు తీసుకొస్తోందని విజయ్ స్పష్టం చేశారు.ఇటీవల ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పారదర్శకంగా లేదని, ఆ ప్రక్రియ ప్రజలకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలిపారు.తమిళనాడులో అధికార డీఎంకేతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని విజయ్ విమర్శించారు. రెండు పార్టీల విధానాలు ప్రజలకు అనుకూలంగా లేవని అన్నారు.విజయ్ ఒకేసారి డీఎంకే, బీజేపీలపై దాడి చేయడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో అన్న విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
తమిళనాట ఎస్ఐఆర్పై సుప్రీంకు డీఎంకే
న్యూఢిల్లీ: తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేప ట్టాలంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అధి కార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు లకు భంగకరమని పేర్కొంది. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి ఈ పిటిషన్ వేశారు. తమిళ నాడులో ఎస్ఐఆర్ చేపట్టేందుకు అక్టోబర్ 27న ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించడమేనన్నారు. ఎస్ఐఆర్తో అసలైన ఓటర్ల పేర్లను సైతం సరైన పత్రాలు లేవనే సాకుతో తొలగించే ప్రమాదముందన్నారు. పిటిషన్‌పై ఈ వారంలోనే అత్యు న్నత న్యాయస్థానం విచారణ చేపట్టే అవకా శముంది. -
ఉత్తరాదిలో ‘ఇండియా’కూటమి ఓటమికి డీఎంకేనే కారణం: తమిళిసై
చెన్నై: ఉత్తరాదిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తరచూ ఓటమి పాలవ్వడానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ కొత్త భాష్యం చెప్పారు. ఇండియా కూటమి ఓటమికి తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీయే కారణమని విశ్లేషించారు. శనివారం ఆమె చెన్నైలోని రాజ్‌భవన్ సమీపంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు పటేల్ కృషి చేశారని, డీఎంకే మాత్రం బిహారీలు, ఉత్తర భారతీయులపై వివక్ష చూపుతోందని తమిళిసై విమర్శించారు. ముఖ్యంగా బిహార్ ప్రజల గురించి డీఎంకే దారుణంగా మాట్లాడుతోందని దుయ్యబట్టారు. ‘‘బిహారీలు అజ్ఞానులంటూ డీఎంకే మంత్రి కేఎన్ నెహ్రూ అంటున్నారు. బల్లలు ఊడ్చడం, మరుగుదొడ్లను శుభ్రం చేయడంలో బిహారీలు మంచి పనివారని డీఎంకే వ్యాఖ్యలు చేసింది. బిహారీలు గోమూత్రం తాగేవారంటూ ఏకంగా చట్టసభల్లో డీఎంకే నేతలు విమర్శలు చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. డీఎంకే వల్లే ఉత్తరాదిలో ఇండియా కూటమి ఓడిపోతోందని స్పష్టం చేశారు.మోదీ నుంచి మొదలు..ఇటీవల బిహార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత డీఎంకే అంశాన్ని లేవనెత్తారు. డీఎంకే తమిళనాడులో ఉన్న ఉత్తరాది కార్మికులను వేధిస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే నేతలు ఖండిస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు బీజేపీ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళిసై శనివారం డీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీకి(Senthil Balaji) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) చుక్కెదురైంది. క్యాష్ ఫర్ లాండ్ కుంభకోణం కేసు పెండింగ్‌లో ఉన్నందున తనను తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవాలా వద్దా అనే విషయంలో గత ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిష్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.మంత్రి పదవి(DMK Minister Post) గురించిన ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో లేనే లేదని స్పష్టం చేసింది. ‘మేం ఆ ఉత్తర్వును మళ్లీ చదవం. మీరు మంత్రిగా(Tamil Nadu) మారడానికి దానిని మేం చదవలేం. అయితే, మీరు మంత్రి పదవిని చేపట్టినా లేదా మరే ఇతర అధికార పదవిని నిర్వహించినా రాష్ట్ర వాతావరణం ప్రభావితమైతే, న్యాయం జరిగేలా అప్పుడే చూస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది.మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని పదవికి రాజీనామా చేయాలంటూ ఇచ్చిన తీర్పుపై మళ్లీ స్పష్టత కోరడమెందుకంటూ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌ను ప్రశ్నించింది. బెయిల్ వచ్చిన కొన్ని రోజుల్లోనే తిరిగి మంత్రి పదవిని చేపట్టిన సెంథిల్ బాలాజీ, కేసుల విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నందునే జైలుకు వెళ్లడం మంచిదంటూ అప్పటి ధర్మాసనం వ్యాఖ్యానించి ఉంటుందని పేర్కొంది. -
‘మీరేం ఒంటరి కాదు..’ విజయ్‌కు దన్నుగా ఢిల్లీ పెద్దలు!
కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందంటూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగళం(TVK) మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం కనీస ఆహారం, మంచి నీళ్ల సదుపాయం కల్పించలేని స్థితిలో ర్యాలీని ఎందుకు నిర్వహించారని, ఘటన తర్వాత అక్కడి నుంచి ఎందుకు పారిపోయారని.. ప్రశ్నలు గుప్పిస్తూనే ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో..తమిళ రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) మనుగడపై అనిశ్చితి నెలకొంది. ఘటనకు విజయ్, టీవీకే పూర్తి బాధ్యత అంటూ అధికార డీఎంకే విమర్శలతో తిట్టిపోస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ విజయ్‌కు వ్యతిరేక క్యాంపెయిన్ నడుపుతూ.. ఈ వేడి చల్లారకుండా చూసుకుంటోంది. అయితే ఈ అనిశ్చితినే తమకు ఫ్లస్‌గా మల్చుకునేందుకు ఇటు జాతీయ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.తాజాగా బీజేపీకి చెందిన ఓ అగ్రనేత విజయ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్‌కు సూచించినట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదివరకే విజయ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలను ఆయన ఆరా తీశారు. తద్వారా పరోక్షంగా విజయ్‌కు సానుభూతి ప్రకటించడంతో పాటు అండగా నిలబడతామని ఈ రెండు జాతీయ పార్టీలు సంకేతాలు అందించాయనేది స్పష్టమవుతోంది(Congress BJP Backs Vijay).కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఘటన తర్వాత.. ఆగమేఘాల మీద, అదీ మునుపెన్నడూ లేని రీతిలో తమ ఎంపీలను బృందంగా తమిళనాడుకు పంపింది. ఈ బృందం కరూర్‌ను పరిశీలించి.. బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. టీవీకేతో పాటు డీఎంకే ప్రభుత్వం కూడా కరూర్ ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి ఇవ్వడం, సరైన భధ్రత కల్పించకపోవడం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.ఇటు కాంగ్రెస్.. డీఎంకేతో పొత్తులో కారణంగా తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అందుకే ఘటనపై అధికార, టీవీకే పార్టీల్లో ఎవరినీ నిందించడం లేదు. కేవలం సానుభూతి ప్రకటన, నష్టపరిహారం అందజేత లాంటివి మాత్రమే చేసింది. దీంతో ద్రవిడ పార్టీల డామినేషన్‌ను తట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.అయితే.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్‌ను ఆకర్షించే ప్రయత్నంగానే కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్‌గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!.ఇప్పటికే విజయ్ తొక్కిసలాట ఘటనలో తనకు మద్దతు తెలిపిన జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సంగతేమోగానీ.. బీజేపీ+అన్నాడీఎంకే మాత్రం ఎలాగైనా విజయ్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చని, డీఎంకే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీవీకే అధినేత కూడా అందుకు ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మాత్రం విజయ్ను నమ్ముకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన చిన్న పార్టీలకు పెద్ద షాకే అని చెప్పొచ్చు.ఇదీ చదవండి: తమిళ రాజకీయాల తొక్కిసలాట -
తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తులు
దేశంలో ఇంతపెద్ద రాష్ట్రాన్ని అయినా జయిస్తున్న భారతీయజనతా పార్టీకి దక్షిణాది మాత్రం కోరుకుడుపడడం లేదు.. ఇటువైపున్న ద్రావిడ రాష్ట్రాలు తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. ఏపీ.. తెలంగాణ.. పాండిచ్చేరి.. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి అంతంతమాత్రమే.. ఏదో నానా యాతనా పడి..ఏదోలా కర్ణాటకలో ఏదోలా అధికారం దక్కించుకున్నా అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతోంది తప్ప మళ్ళా అక్కడ అధికారాన్ని నిలుపుకోవడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. ఇక ప్రాంతీయపార్టీలు ఆలవాలమైన తమినాడులో అయితే దశాబ్దాలుగా పోరుతున్నా బీజేపీ అడుగుకూడా పెట్టేందుకు వీలు చిక్కడంలేదు. అక్కడ ఉంటే అన్నాడీఎంకే.. కూడా డీఎంకే.. ఇక మిగతావన్నీ చిన్నా చితకాపార్టీలు మాత్రమే.. దేశాన్ని 75 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కూడా తమిళనాట నాడు కరుణానిధి.. నేడు స్టాలిన్ చాటున మనుగడసాగించడమే తప్ప సొంతంగా అక్కడ సాధించిందేమీ లేదు.. ఇక బీజేపీ మాత్రం ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని తీవ్రంగా తాపత్రయపడుతోంది. ఆ రాష్ట్ర శాసన సభలో 234 సీట్లుండగా అక్కడ 2026 ఏప్రిల్.. మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రస్తుతానికి 46 శాతం ఓట్లు సాధించిన స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే 159 సీట్లు సాధించి అధికారంలో ఉంది.. తరువాత 74 సీట్లతో పాళనిస్వామి సారథ్యంలోనే అన్నా డీఎంకే ప్రతిపక్ష పాత్రలో ఉంది.. ఇక ఇక్కడ బీజేపీకి స్థానం తక్కువే.. కానీ ఆశ చావని బీజేపీ నేతలు దింపుడుకల్లం ఆశతో తమిళనాడువైపు చూస్తూనే ఉన్నారు..ఇదిలా ఉండగానే మొన్న సినిమా నటుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ రాజకీయ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించగా వందమందికి పైగా గాయపడ్డారు.. ఇది రాజకీయ సభలకు సంబంచింది దేశంలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెబుతున్నారు.. అయితే ఈ ప్రమాద సంఘటన తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం ఎంపీ హేమామాలిని సారధ్యంలోని ఎనిమిది మంది ఎంపీలతో ఒక కమిటీని వేసింది. తెలుగుదేశం.. శివ సేన వంటి ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకూ ఈ కమిటీలో స్థానం కల్పించిన బీజేపీ అక్కడి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ సభలో జరిగిన ప్రమాదాన్ని సైతం రాజకీయంగా ఎలా వాడుకోవాలన్నదానిగురించి బీజేపీ యోచన చేస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2. 62 శాతం ఓట్లు తెచ్చుకుని కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీకి అన్నా డీఎంకేతో వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.. ఈ విజయ్ సభ ప్రమాదాన్ని సైతం బీజేపీ రాజకీయంగా వినియోగించుకునే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ప్రాంతీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగా వాడుకుని లబ్ధిపొందుతారుతప్ప వారి యోగ క్షేమాలు.. భద్రతా ఏమాత్రం పట్టించుకోవు అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఈ ప్రమాదాన్ని సామాజిక అంశంగా మార్చుకుని రాజకీయంగా లబ్ధిపొందడానికి ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ వెతుకుతోంది.. ఇకనైనా రాష్ట్రంలో అన్నా డీఎంకేతో కలిసి అధికారంలోకి వస్తుందా చూడాలి.. సిమ్మాదిరప్పన్నఇదీ చదవండి: అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు -
అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో.. రెండు మానాడులు, సామాజిక యాత్రలో భాగంగా ర్యాలీలు నిర్వహించినా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం చూసుకోలేకపోయారంటూ తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా ఆ పార్టీ నేత ఒకరు చేసిన పని ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది.శ్రీలంక, నేపాల్‌లో జెన్‌జీ నిరసనలు ప్రభుత్వాల్ని గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో.. తమిళ యువత కూడా డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాలంటూ విజయ్ పేరిట ఓ ప్రచారం నడుస్తోంది. అయితే కరూర్ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఇది తెరపైకి రావడంతో.. ఇటు రాజకీయ ప్రత్యర్థులు, అటు నెటిజన్లు విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. టీవీకే(TVK) అధికారికంగా స్పందించింది. ఆ ప్రకటనతో విజయ్కిగానీ, పార్టీకిగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. విజయ్ ఏనాడూ ప్రజలను రెచ్చగొట్టరని, హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు చేయబోరని ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కూడా ఈ సిద్ధాంతానికే కట్టుబడి ఉందని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన టీవీకే సీనియర్ నేత ఆధవ్ అర్జున చేయడం చేసిన సోషల్ మీడియా పోస్టుతో వైరల్ అయ్యింది. కరూర్ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే యువతను రెచ్చగొట్టేలా ఆధవ్ అర్జున(TVK Aadhav Arjuna) పోస్ట్ చేశారంటూ అధికార డీఎంకే మండిపడింది. 41 మందిని బలిగొన్న కూడా ఆ పార్టీ ఇంకా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తోంది. యువతను ఉసిగొల్పి హింసను ప్రేరేపించాలని చూస్తే సహించేది లేదు అని డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimozhi) హెచ్చరించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. దీని ఆధారంగా డీఎంకే ఫిర్యాదునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న ఆధవ్ అర్జున.. కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ కోర్టును కోరారాయన. అలాగే బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించేందుకు అనుమతించాలంటూ రిక్వెస్ట్ చేశారు కూడా. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరూర్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది.ఇదీ చదవండి: కరూర్ ఘటన 21 మందిపై కేసు.. తొలి అరెస్ట్ -
కరూర్ ఘటన.. టీవీకే సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట కారణంగా 39 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో విషాద ఘటనపై టీవీకే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమంటూ విమర్శించింది.కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే స్పందిస్తూ..‘తొక్కిసలాట ఘటనకు కారణంగా స్టాలిన్ ప్రభుత్వమే. మేము అడిగిన ప్రాంతంలో కాకుండా.. చిన్నపాటి రోడ్డులో సభకు అనుమతి ఇచ్చారు. సభ జరుగుతున్న సమయంలో అంబులెన్స్‌లు అటుగా వచ్చేలా డీఎంకే ప్లాన్ చేసింది. ఈ క్రమంలో అంబులెన్స్ కోసం దారి ఇవ్వాలని విజయ్ కోరడంతో తొక్కిసలా జరిగింది. పోలీసులతో కలిసి డీఎంకే ప్రభుత్వం విజయ్‌పై కుట్ర చేసింది అని ఆరోపించింది. మరోవైపు.. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణం అంటూ టీవీకే పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.He shamelessly ignored people literally dying around him and continued with this nonsense on mic.There are times when you have to stop and think what kind of demons and narcissistic animals are made Gods by us...💔#Karur #KarurStampede pic.twitter.com/10lngolUI8— Namita Balyan (@NamitaBalyan) September 27, 2025డీజీపీ కీలక వ్యాఖ్యలు..ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై తమిళనాడు లా అండ్ ఆర్డర్ డీజీపీ వెంకట్రామన్ అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..‘టీవీకే పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. కరూర్‌లో జరిగినది చాలా విషాదకరమైన ఘటన. వీరిలో 13 మంది పురుషులు, 16 మంది మహిళలు, ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ డేవిడ్సన్ నాయకత్వంలో ముగ్గురు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలతో సహా 2000 మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు.விஜயிடம் பேசிய போலீஸ் குறிப்பிட்ட நேரத்திற்கு செல்லாத விஜய்க்கு காவல்துறையினர் தொடர்புகொண்டு பேசியிருக்கின்றனர்.கூட்டம் அதிக அளவில் இருக்கிறது என்பதையும் தெரியப்படுத்தி,ஒத்துழைப்பு தருமாறு அறிவுறுத்தியுள்ளனர்.அதனால்தான் விஜய் காவல்துறைக்கு நன்றி சொல்லி பேசினார். #karur pic.twitter.com/6BbXGxc2Jp— Gokula Kannan R 👑 (@rg_kannan_dmk61) September 27, 2025తమిళనాడు టీవీకే పార్టీ గతంలో నిర్వహించిన సమావేశాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో, వారి అభ్యర్థన మేరకు ఇప్పుడు కరూర్‌లో పెద్ద స్థలాన్ని కేటాయించారు. రాష్ట్ర స్థాయిలో అదే స్థలంలో ఒక పెద్ద పార్టీ ప్రచారం చేసింది. పది వేల మంది వస్తారని భావించినప్పటికీ, 27 వేల మంది గుమిగూడారు. విజయ్ ప్రచారం చేసిన ప్రదేశంలో 500 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి కోరారు. కానీ, ఉదయం 11 గంటల నుండి గుమిగూడిన జనసమూహం రాత్రి 7:40 గంటలకు వస్తూనే ఉన్నారు. విజయ్ వస్తున్నారనే వార్తతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 27వేల మందికిపైగా ఉన్న సమూహాన్ని పోలీసులు కంట్రోల్ చేశారు. సభ జరుగుతున్న సమయంలో పోలీసులకు విజయ్ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం లేదు. కానీ, దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. దీనికి సంబంధించి కారణాల కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఏమీ మాట్లాడలేం. అయితే, ఈ ఘటనకు పోలీసులే కారణమా? అని మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు.ఏకసభ్య కమిషన్ ఏర్పాటు.. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పందించారు. కరూర్ జిల్లా కలెక్టరుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లోని క్షతగాత్రులను ఆదివారం ముఖ్యమంత్రి పరామర్శించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. -
పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన విజయ్
-
తమిళ పాలిటిక్స్.. విజయ్‌పై ఉదయనిధి సెటైర్లు
చెన్నై: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న నేపథ్యంలో పొలిటికల్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీవీకే అధినేత విజయ్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విజయ్ను టార్గెట్ చేసిన ఉదయనిధి.. తాను వీకెండ్ పొలిటీషియన్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొత్తగా ఏర్పడిన కొన్ని పార్టీలకు సిద్ధాంతం ఏమిటో తెలియదు. వారికి సిద్ధాంతం గురించి అవగాహన లేదని కనిపిస్తోంది. డీఎంకే ఎన్నికల కోసం మాత్రమే పుట్టిన పార్టీ కాదు, ప్రజల హక్కుల కోసం ఏర్పడిన పార్టీ. సీఎం ఎంకే స్టాలిన్‌కు సుమారు 60 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అనేక పోరాటాలతో ఆయన ప్రజా జీవితం నిండి ఉంది. మన సిద్ధాంతాన్ని యువతలోకి తీసుకెళ్లాలి. విద్యార్థులు, యువతతో మాట్లాడాలన్నారు.ఇదే సమయంలో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి మాట్లాడుతూ.. ‘నేను వారంలో 4-5 రోజులు అధికారిక పర్యటనలతో బిజీగా ఉంటాను. ఆదివారాల్లో కూడా పర్యటిస్తాను. కేవలం ప్రతీ శనివారం మాత్రమే బయటకు రాను. రాబోయే రోజుల్లో కొన్ని ఆదివారాలను కూడా ప్రచార కార్యక్రమానికి చేర్చుకోవాలని భావిస్తున్నా. నేను వారంలో ఏ రోజు అని చూడకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తా. కార్యకర్తలు మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి ఉండాలి' అని చెప్పుకొచ్చారు.అలాగే, ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామిని ఉద్దేశించి.. ఆయనకు ఎప్పుడు బీజేపీ నేత, హోంశాఖ మంత్రి అమిత్ షానే ముఖ్యమని అన్నారు. తన సొంత పార్టీ అధినేత ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)ను కూడా మరచిపోయారని ఎద్దేవా చేశారు. ఇక, టీవీకే విజయ్.. ప్రతి శనివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం రోజునే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. -
సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అరవ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది డీఎంకేకు ప్రచారంగానే కాకుండా.. అటు ప్రత్యర్థి విజయ్ టీవీకే పార్టీకి కౌంటర్‌గానూ ఉందన్న చర్చ నడుస్తోందక్కడ. తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ట్రెండ్‌కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ విభాగాల క్రియేటివిటీతో ‘పొలిటికల్ డిజిటల్ వార్’ ఇప్పుడక్కడ హాట్ టాపిక్‌గా మారింది. మైకుల్లో మాటలు, సోషల్ మీడియాలో పోస్టులకు అదనంగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. పైగా ప్రత్యర్థులను నేరుగా విమర్శించాల్సిన అవసరం లేకుండానే ఆ సెల్ఫ్ ప్రమోషన్ వీడియోలు భలేగా ఉపయోగపడుతున్నాయి పార్టీలకు. తాజాగా.. విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను రిలీజ్ చేసింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై విజయ్‌పై ప్రశంసలు గుప్పించినట్లు ఉంది. అదే సమయంలో తన సొంత పార్టీ డీఎంకే విధానాలను విమర్శించినట్లుగా ఉంది. ఈ వీడియో తమిళనాట నిన్నంతా ట్రెండింగ్‌లో కొనసాగింది. அண்ணாவின் வழியில்... தம்பி விஜய் ஆட்சி! என்று எல்லோரும் சொல்லட்டும்."தமிழக வெற்றிக்கழகம் வெல்லட்டும்" pic.twitter.com/jyh4SoxTrz— TVK IT Wing Official (@TVKHQITWingOffl) September 15, 2025ఈ పరిణామంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్‌ఫేక్ వీడియోలతో విజయ్ టీవీకే పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి శరవణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ ఉపయోగించడం బాధాకరమని అన్నారాయన. ఈ క్రమంలో బీజేపీతో డీఎంకే రహస్య బంధంలో ఉందంటూ విజయ్ చేస్తున్న ఆరోపణలనూ శరవణన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగానే.. విజయ్ టీవీకే పార్టీ పెరియార్ సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించలేదు. కానీ ఆయన భావజాలం నుంచి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం వంటి అంశాలను మాత్రం తీసుకుంటానని విజయ్ బహిరంగంగానే చెప్పాడు. ఈ క్రమంలో పెరియార్ ఫొటో దీంతో తాజా ఏఐ జనరేటెడ్ వీడియోతోతద్వారా స్టాలిన్ రాజకీయ నేరేటివ్‌ను తిరిగి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పోనుపోను ఈ డిజిటల్ క్యాంపెయిన్ వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదు!.தந்தை பெரியார் - இனப்பகையைச் சுட்டெரிக்கும் பெருநெருப்பு! தமிழினத்தின் எழுச்சிக்கான பகுத்தறிவுப் பேரொளி!தந்தை பெரியார் என்றும் - எங்கும் நிலைத்திருப்பார்!#PeriyarForever #Periyar #SocialJusticeDay pic.twitter.com/B4RvgXCgzH— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 17, 2025 -
‘‘రజినీ సర్.. ఆయన మీలా ప్యాకేజీ స్టార్ కాదు’’
తమిళనాడు రాజకీయాల్లో మామూలుగా హీటెక్కలేదు. వచ్చే ఎన్నికల్లోనూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధిస్తుందంటూ సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇవి మరో అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అభిమానులకు సాధారణంగానే మంట పుట్టించాయి.స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్.. ఎంకే స్టాలిన్‌పై రజినీ కురిపించిన ప్రశంస ఇది. ‘‘స్టాలిన్ తమిళనాట మాత్రమే కాదు భారతీయ రాజకీయాల్లో ఓ ధృవతార. కేంద్రంలోని ప్రభుత్వానికి మాత్రమే కాదు.. పాత, కొత్త ప్రత్యర్థులకు ఇప్పుడు ఆయన ఓ సవాల్‌గా మారారు. నా స్నేహితుడు తన మార్క్ చిరునవ్వుతోనే రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నారు’’ అంటూ ఓ ఈవెంట్లో రజినీకాంత్ వ్యాఖ్యానించారు. అయితే..అన్నింటికీ మించి.. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. ఎలాంటి తుఫానునైనా తట్టుకునే శక్తి ఉంది ఓ బలమైన కామెంట్ చేశారు. ఈ ఎఫెక్ట్‌తో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఊగిపోతున్నారు. అందుకు కారణం.. రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక్కరోజు ముందు విజయ్ తన రాజకీయ పార్టీకి కీలకమైన ప్రస్థానం ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి ప్రజా యాత్ర (మీట్ ది పీపుల్) ప్రారంభించారు. ఆ సభలో అలవి కాని హామీలిచ్చారంటూ డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో తాజా రజినీకాంత్ కామెంట్లు విజయ్ను ఉద్దేశించి చేసినవేనన్న చర్చ ప్రముఖంగా నడుస్తోందక్కడ.దళపతినే అంటారా?.. రజినీ కామెంట్లతో అరవ రాజకీయంలో స్టార్ వార్ మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కామెంట్లు చేసిన టైంలో మరో సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా అక్కడే నవ్వుతూ కనిపించారు. కమల్ ఇప్పటికే డీఎంకే కూటమికి మద్దతు అనే సంగతి తెలిసిందే. దీంతో.. రాజకీయంగా అడుగులు వేయలేని వాళ్లు, సొంతగా పార్టీని నడిపించుకోలేని వాళ్లు.. ఒంటరిపోరుకు సిద్ధమైన విజయ్ను విమర్శించడమా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి తోడు..మొన్నటిదాకా బీజేపీకి సపోర్ట్‌గా మాట్లాడిన రజినీకాంత్.. ఇప్పుడు అనూహ్యంగా డీఎంకేకు అనుకూలంగా మాట్లాడడం ఆయన డబుల్ స్టాండర్డ్‌కు నిదర్శనమని, రీల్లో సూపర్‌స్టార్ అయినప్పటికీ రియల్ లైఫ్‌లో రజినీకాంత్ ప్యాకేజీ స్టార్ అని, విజయ్ అలా ప్యాకేజీ స్టార్ ఏనాటికి కాబోరని తిట్టిపోస్తున్నారు.సూపర్ స్టార్ ట్యాగ్‌తో మొదలై..స్టార్డమ్ పెరిగిపోయే క్రమంలో.. రజనీకాంత్ అభిమానులతో విజయ్ అభిమానుల వైరం మొదలైంది. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అది మరింత ముదురుతూ వస్తోంది. గతంలో సినిమా ఈవెంట్లలోనూ స్టేజ్ మీద రజినీకాంత్ ‘‘కుక్క, కాకి’’ అంటూ ఏవో పిట్టకథలతో తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆ సమయంలో విజయ్ అభిమానులు ఆయన్ని టార్గెట్ చేసేవారు. అంతేకాదు స్వయంగా విజయ్ కూడా అంతే సెటైరిక్‌గా తన సినిమా ఈవెంట్లలో ఆ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.ఈ క్రమంలో.. కిందటి ఏడాది విల్లుపురంలో జరిగిన టీవీకే తొలి మహానాడు తర్వాత రజినీకాంత్ విజయ్ను ప్రశంసించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఈలోపే.. రాజకీయాల్లో తన ప్రధాన ప్రత్యర్థిగా విజయ్ ప్రకటించిన డీఎంకే, స్టాలిన్‌ను రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తడంతో పరిస్థితి మళ్లీ మునుపటికి వచ్చింది.రజినీ వెనకడుగులు.. 1995–1996.. రజినీకాంత్ హవా కొనసాగుతున్న రోజులు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆయన తొలిసారిగా పెదవి విప్పారు. అప్పటి జయలలిత ప్రభుత్వంపై అవినీతి విమర్శలు గుప్పిస్తూ.. డీఎంకేకు మద్దతు ప్రకటించారాయన. ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయంలో ఆయన మద్దతూ కీలకంగా మారింది. అయితే..2000 నుంచి దశాబ్దం పాటు ఆయన రాజకీయాలపై మౌనం పాటించారు. బాబా సినిమా టైంలోనూ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం విస్తృతంగా నడిచినప్పటికీ.. ఆయన కేవలం సామాజిక అంశాలపై మాత్రమే స్పందిస్తూ వచ్చారు. దీంతో రజినీ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. చివరకు..అయితే పాతికేళ్ల అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ.. 2017 డిసెంబర్ 31వ తేదీన రజినీకాంత్ నుంచి రాజకీయ పార్టీ స్థాపన ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. 2020 టైంలో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ సమయంలో తమిళనాట కోలాహాలం నడిచింది. అదే సమయంలో.. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడడం, మరోపక్క కరోనా విజృంభణతో ఆయన వెనకడుగు వేశారు. తన ఆరోగ్య కారణాల రిత్యా రాజకీయ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఆయన అభిమానులు చల్లబడ్డారు.అయితే.. అప్పటి నుంచి రాజకీయంగా మాత్రం ఆయన తన అభిప్రాయాలను స్వేచ్ఛగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో కొన్నాళ్ల కిందట ఓ ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.విజయ్ సూటిగా.. తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (Thalapathy Vijay).. గత దశాబ్ద కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు వంటి చర్యల ద్వారా రాజకీయంగా చురుకుగా ఉన్నారు. అవినీతి, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తమిళనాడుకు మౌలిక మార్పు అవసరం అని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారాయన. ఈ క్రమంలో ఆయన ఏనాడూ.. ఏ పార్టీకి మద్దతు ప్రకటించింది లేదు. అయితే.. ఆయన అభిమాన సంఘాలు(Vijay Makkal Iyakkam) మాత్రం 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో.. నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాలపై ఆయన తన సినిమాల్లో సెటైర్లు ఉండేలా చూడడంతో కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకమనే చర్చ నడిచింది. అయితే.. డీఎంకేను రాజకీయ విరోధిగా, బీజేపీని సైద్ధాంతిక విరోధిగా పేర్కొంటూ 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళగ వెట్రి కళగం (TVK) అనే పార్టీని స్థాపించారు.తాము ఏ కూటమికి చెందిన వాళ్లం కాదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం సింహం సింగిల్‌గానే వస్తుందని.. అధికారం కోసం జరుగుతున్న పోరులో పొత్తు కోసం కలిసొచ్చే పార్టీలకు ఆహ్వానమంటూ బహిరంగంగా చిన్నపార్టీలను ఆహ్వానించారాయన. ఏమిటీ ప్యాకేజీ గోల?!అధికార డీఎంకే కుటుంబానికి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గతకొన్నేళ్లుగా అక్కడి అగ్ర హీరోలతో బిగ్‌డీల్(కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు, బోనస్‌గా కాస్ట్లీ గిఫ్ట్‌లు కూడా) కుదుర్చుకుని వరుస ప్రాజెక్టులు చేస్తూ వస్తోంది. ఈ లిస్ట్‌లో రజినీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా ఉండడం గమనార్హం. రాజకీయంగా తమ ఎదుగుదలకు ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో వాళ్లను ఇలా బుజ్జగిస్తోందని ముమ్మర ప్రచారం నడిచింది. తమిళనాట తమకు ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ మధ్యే ఎన్నికలు జరగాలని డీఎంకే తొలి నుంచి భావిస్తోంది. రజినీకాంత్ కంటే విజయ్‌కు తమిళనాట ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. దీంతో సొంత పార్టీ ప్రకటన కంటే ముందే ఆయన్ను తమ వైపునకు తిప్పే ప్రయత్నమూ డీఎంకే చేసింది. కానీ రాజకీయ అడుగులు వేయాలని బలంగా ఫిక్స్ అయిన విజయ్ ఆ ప్యాకేజీకి ఒప్పుకోలేదని.. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారన్నది ఆ ప్రచార సారాంశం(దీనిని విజయ్ ఫ్యాన్సే నడిపించారనే టాక్ కూడా ఉంది). ఇక.. ఏడాదిన్నర కాలంగా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తరచూ విమర్శలు గుప్పించడం.. తాజా మధురై మానాడులో అంకుల్ అని స్టాలిన్‌ను సంబోధిస్తూ విజయ్ విమర్శలు చేయడాన్ని డీఎంకే సీరియస్‌గా భావించింది. ఈ క్రమంలోనే కేసులతో ఇబ్బంది పెడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోందక్కడ. అయితే.. ఇంత సీరియస్ ఆరోపణలపై ఇటు రాజకీయంగా గానీ, అటు సినిమాలపరంగానూ ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్! -
డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!
విమర్శలు, వ్యంగ్యాస్త్రాలను(ట్రోల్స్+మీమ్స్) పట్టించుకోకుండా తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం దిశగా సినీ హీరో విజయ్ అడుగులేస్తున్నారు. మీట్ ది పీపుల్ పేరిట ఈ శనివారం నుంచి రాష్ట్ర పర్యటనలు చేపట్టనున్నారు. అయితే జనాల్లోకి వెళ్లే క్రమంలో.. తమిళనాడు డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. తన పర్యటనల రిత్యా అవసరమైన భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకే దిగారాయన. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK)కు బలమైన పునాది వేయడం మాత్రమే కాదు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో అధికార కైవసమే లక్ష్యంగా విజయ్ అడుగులేయబోతున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన తిరుచ్చి నుంచి ప్రత్యేక ప్రచార రథం బయల్దేరనుంది. అలా మొత్తం 38 జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలతో (సభలు, సమావేశాలు, ర్యాలీలు, ముఖాముఖి, రౌండ్ టేబుల్ మీటింగ్స్) నిర్వహిస్తుంది. డిసెంబర్ 20వ తేదీన మధురైలో సభ ద్వారా టీవీకే విజయ్ మీట్ ది పీపుల్ పర్యటన ముగియనుంది. అయితే.. టీవీకే చర్యలతో అధికార డీఎంకే నేతలకు నిద్రలేకుండా పోతోందని విజయ్ అంటున్నారు. టీవీకే కేడర్‌పై వరుసగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారాయన. ఆ పార్టీ కార్యదర్శి ఆనంద్‌తో పాటు తిరుచ్చి పార్టీ విభాగం నేతలపైనా తాజాగా కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ పరిణామంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకేకు అధికారంలో ఉన్నపార్టీ భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. డీఎంకే ఇప్పుడు టీవీకే గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. 24 గంటలూ అదే ఆలోచనతో ఉంటోంది. ఆ పార్టీ నేతలకు నిద్ర కరువైంది. ఈ క్రమంలోనే పోలీసులపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తోంది. కొంపదీసి.. టీవీకేకు డీఎంకే భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. తమిళనాడు రాజకీయాల్లో తారలకు ప్రజలు అధికారం కట్టబెట్టడం కొత్తేం కాదు. శివాజీ గణేషన్, విజయ్‌కాంత్, శరత్‌కుమార్, కమల్‌హాసన్.. ఇలా ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రజినీకాంత్ లాంటి భారీ ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న తార ఆ దిశగా అడుగు వేసినట్లే వేసి.. వెనక్కి వెళ్లిపోయారు. అయితే.. ఎంజీఆర్, జయలలిత ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్లందరితో పోల్చుకుంటే.. విజయ్‌కు ఇప్పుడున్న మాస్ ఫాలోయింగ్ చాలాచాలా ఎక్కువే. ఆ అభిమానాన్నే ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నారు.తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, విజయ్ చేపట్టిన “మీట్ ది పీపుల్” పర్యటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ గత ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టి, రెండు మానాడు(మహానాడు)లను విజయవంతంగా నిర్వహించారు. మదురైలో జరిగిన రెండో మహానాడులో ప్రజల మధ్యకి వస్తున్నట్టు ప్రకటించి.. రాజకీయ ప్రత్యర్థి డీఎంకే, సైద్ధాంతిక విరోధి బీజేపీ లతోనే తమ పోరాటం అని కుండబద్దలు కొట్టారు. తాను, తన టీవీకే ఏ కూటమిలో భాగం కాబోమని.. కలిసొచ్చే పార్టీలకు రేపు అధికారం గనుక దక్కితే వాటా ఇస్తామని చెప్పారు. విజయ్ ఈ ప్రకటన అక్కడి రాజకీయాల్లో అలజడి రేపింది. పలు పార్టీలోని సీనియర్ నేతలు విజయ్ ఆఫర్‌కు టెంప్ట్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అసంతృప్త నేతలతో పాటు ఓట్ షేరింగ్ ఉన్న పార్టీలు, కుల ఓట్లను రాబట్టే పార్టీలు సైతం విజయ్ టీవీకేతో కూటమిగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. ప్రజల సమస్యలపై నేరుగా స్పందించేందుకు, వారి అభిప్రాయాలను స్వీకరించేందుకు ఈ పర్యటనను ప్రజా ఉద్యమంగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ మీట్ ది పీపుల్‌పై అధికార డీఎంకే ఓ కన్నేసింది. విజయ్ పర్యటనను నిశితంగా పరిశీలించాలని, ప్రత్యర్థి వ్యూహానికి చెక్ పెట్టేలా పునరాలోచనలు చేయాలని ఆ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ సీనియర్లకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే టీవీకే కేడర్‌పై ఈ సమయంలోనే కేసులు నమోదు అవుతుండడంతో డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విజయ్ మాత్రం ఇలాంటివాటికి వెనకడుగు వేయబోనని అంటున్నారు. 1967లో అన్నాదురై కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొట్టినట్లు.. 1977 అన్నాడీఎంకేతో ఎంజీఆర్ డీఎంకేను గద్దె దించినట్లు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుతో అధికారం కైవసం చేసుకుని తానూ చరిత్ర సృష్టిస్తానని చెబుతున్నారు. జనంలోకి వెళ్తున్న విజయ్.. రెండు నెలలపాటు నాన్‌స్టాప్ పర్యటనలు చేపట్టబోతున్నారు. మొదటి విడతలో 10 జిల్లాల్లో పర్యటించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. శనివారం కీలక కార్యక్రమాలు జరుగుతాయి. ఆదివారం ఒకే ఒక్క కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యలో సెప్టెంబర్ 27, అక్టోబర్ 25వ తేదీన చెన్నైకి విజయ్ చేరుకుంటారు. పార్టీ ప్రకటన నుంచి మానాడు విజయవంతం దాకా.. విజయ్ వెంట నడిచింది యువతే. కాబట్టి యువత మద్దతుతోనే తన పర్యటనలను విజయవంతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: విజయ్ టీవీకే.. ఆ పార్టీకే ఫ్లస్ -
షాకింగ్ సర్వే.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్!!
ఏ పార్టీతో పొత్తు ఉండదు. సింహం ఎప్పటికీ సింహమే!. సింగిల్‌గానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాం అంటూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మధురైలో జరిగిన టీవీకే మానాడు సూపర్ సక్సెస్ కావడంతో విజయ్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రముఖ పార్టీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. తమిళనాడులో జరిగిన ఓ సర్వే వెల్లడించిన విషయాలు టీవీకే సహా అక్కడి రాజకీయ పక్షాలకు ఝలక్ ఇచ్చాయి. తమిళనాడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. డీఎంకే అత్యధిక సీట్లు కైవసనం చేసుకుంటుందని తెలిపింది. ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 3 సీట్లు దక్కవచ్చని, అదే సమయంలో విజయ్ టీవీకేకు జీరో ఎదురుకావొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తమిళనాడులో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 39 స్థానాలను కూటమిలోనే పార్టీలోనే కైవసం చేసుకున్నాయి. అయితే ఇప్పటికిప్పడు జరిగితే మాత్రం 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. సంక్షేమ పథకాలతో పాటు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం, నీట్ పోరాటాలు డీఎంకే గెలుపును ప్రభావితం చేసే అంశాలుగా పేర్కొంది.ఇక.. బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి మూడు స్థానాలు మాత్రమే దక్కవచ్చని పేర్కొంది. అయితే.. ఓటు శాతం మాత్రం 18% నుంచి 37%కి పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2024లో ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక తమిళనాడులో రాబోయే కాలంలో జరిగే ఎన్నికలకు విజయ్ టీవీకే పార్టీ అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పార్టీ ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. అయితే ఇప్పటికప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏ స్థానం దక్కకపోవచ్చని(0 సీట్లు) ఆ సర్వే వెల్లడించింది. విజయ్ పార్టీ పెట్టి ఏడాది పైనే అవుతోంది. అయితే అందులో ముఖాలేవీ జనాలకు పెద్దగా తెలిసినవి కావు. జనాలకు తెలిసిన ముఖాలు టీవీకేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.. విజయ్ అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు జనాల్లోకి ఇంకా బలంగా ఆ పార్టీ చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే డీఎంకే వ్యతిరేకతను టీవీకే ఓట్ల రూపంలో మార్చుకోవాలని విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. టీవీకే పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా డీఎంకేకే లాభం కలగించవచ్చని సర్వే పేర్కొంది. తద్వారా.. టీవీకేతో ఎన్డీయే కూటమికే భారీ నష్టం కలగవచ్చని స్పష్టం చేసింది. ఇండియా టుడే సీవోటర్ Mood of the Nation ఆగస్టు 2025 పేరిట నిర్వహించిన ఈ సర్వే నిర్వహించింది. జూలై 1 నుండి ఆగస్టు 14, 2025 మధ్య 2 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపొందించబడింది. సర్వే లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో జరిగినప్పటికీ మరో ఏడేనిమిది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకూ సమీకరణాలు ఇలాగే కొనసాగితే మాత్రం.. డీఎంకే నెత్తిన విజయ్ టీవీకే పాలు పోసినట్లే అవుతుందన్న చర్చ జోరుగా నడుస్తోందక్కడ. -
‘రాధాకృష్ణన్‌తో లాభం లేదు.. ఇండియాకు మనం గట్టి అభ్యర్థిని నిలబెడదాం’
సాక్షి, చెన్నై: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇండియా కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. కూటమి తరఫున ఎవరిని బరిలో నిలపాలి అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని డీఎంకే సీనియర్ నాయకుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సదరు నేత అంతటితో ఆగకుండా.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌తో తమిళనాడుకు ప్రయోజనం లేదని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు సోమవారం సమావేశమయ్యారు. కూటమి పార్లమెంటరీ పక్ష నేతలు.. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నాయకులు ఇళంగోవన్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది భారత ఉప రాష్ట్రపతి పదవి. రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థి.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మా రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే మంచి ఏమీ ఉండదు. దీన్ని భాష ద్వారా మాత్రమే కాకుండా రాజకీయంగా చూడాలి.#WATCH | Chennai, Tamil Nadu: On Maharashtra Governor CP Radhakrishnan announced as NDA's Vice Presidential candidate, DMK Leader TKS Elangovan says, "He is an RSS man. He is a BJP candidate. You should view this politically, not as per language...I don't know why the poor man… pic.twitter.com/I1IxxxH2Ij— ANI (@ANI) August 18, 2025బీజేపీ నేతృత్వంలోని బీజేపీ.. ఇప్పటికే పలుమార్లు తమిళులను అవమానించింది. బీజేపీ.. తమిళుల కోసం పనిచేయలేదు. కేంద్రంలోని పెద్దలు.. తమిళనాడు విద్యార్థులకు ఎటువంటి సాయం అందించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే నుంచే అభ్యర్థి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అందుకే రాధాకృష్ణకు పోటీగా తమిళనాడు నుంచే.. అది కూడా డీఎంకే నుంచి అభ్యర్థి ఎంపిక చేయాలని కోరుతున్నాను అని అన్నారు. చివరగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇండియా బ్లాక్ తీసుకున్న నిర్ణయానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇండియా కూటమిలో కొంత మంది నేతలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు దగ్గరలో ఉన్నందున అధికార పక్షం క్రాస్ ఓటింగ్ ద్వారా తమ బలాన్ని పెంచుకుంటే.. అది బీహార్ ఓటర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు భావించారు.కూటమి మల్లగుల్లాలు..కాంగ్రెస్ వర్గాల సమాచారాల ప్రకారం.. విపక్ష అభ్యర్థి కాంగ్రెస్ నుంచే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. మిత్రపక్షాలు తటస్థ, స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న అభ్యర్థి పేరును సూచిస్తే, కాంగ్రెస్ కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, సిద్ధాంతపరమైన పోరాటాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అంటే బీజేపీకి స్వేచ్ఛగా మార్గం ఇవ్వడమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ఈ నెల 19న సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి మళ్లీ 21న బీహార్ వెళ్లనున్నారు. ఈ సమయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. -
గవర్నర్ Vs స్టాలిన్.. మరోసారి భగ్గుమన్న విభేదాలు
చెన్నై: తమిళనాడు సర్కార్‌కి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా గవర్నర్‌పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల కంటే గవర్నర్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.విభేదాలు మరోసారి బహిర్గతం అవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. ఆదివారం ఆయన ధర్మపురిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గవర్నర్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.‘ప్రతిపక్షాలు చేసే విమర్శలపై తనకు ఆందోళన లేదన్న స్టాలిన్.. అవన్నీ రాజకీయాల్లో సహజమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ రవి.. వారి కంటే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్‌లో ఉండి అధికార డీఎంకేకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ మండిపడ్డారు. తమిళ గీతాన్ని కూడా అగౌరవ పరుస్తారంటూ గవర్నర్‌పై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళ భద్రత, విద్యారంగంపై గవర్నర్ ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడు దేశంలోనే అగ్ర రాష్ట్రమని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.‘‘తమిళనాడు ప్రజల కోసం మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కానీ కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’’ అంటూ స్టాలిన్ మండిపడ్డారు.


