చెన్నై: కూటమి నుండి వైదొలిగిన కాంగ్రెస్‌పై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. మరో వైపు, రాబోయే కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ.. డీఎంకే పథకాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజల కోసం డీఎంకే ఎంతో చేసిందన్నారు. విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ తమ కూటమి నుంచి బయటకు రావడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కూటమి తరఫున పోటీ చేసి గెలిచినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా డీఎంకే ప్రధాన కార్యాలయానికి రాలేదని.. ఆ రోజే డీఎంకేతో సంబంధాలను తెంచుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను అవకాశవాదిగా అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు మద్దతు ఇచ్చినప్పటికీ, వీసీకేతో పాటు సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీలు కూటమిలోనే కొనసాగుతాయని ఆయన అన్నారు.
కమ్యూనిస్ట్ నేతలు కామ్రేడ్ షణ్ముగం, కామ్రేడ్ వీరపాండియన్లతో పాటు విడుదల చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ నాయకుడు తిరుమావళవన్.. తమిళనాడు హక్కులు, ప్రజల సంక్షేమం కోసం డీఎంకేతో చేతులు కలిపి పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తద్వారా వారు తమ మధ్య ఉన్న స్నేహభావాన్ని చాటుకోవడమే కాకుండా, బలమైన సిద్ధాంతాలు కలిగిన డీఎంకేపై తమకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నారు," అని ఆయన కొనియాడారు.
"డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలను సాధించలేకపోయినప్పటికీ.. తమకు భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి ఆటంకాలు సృష్టించబోమని.. డీఎంకే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తుందని తాను ఇప్పటికే ప్రకటించానని స్టాలిన్ గుర్తు చేశారు. తమ మిత్రపక్షాలు తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా డీఎంకే.. గౌరవిస్తుందని, మళ్లీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేకుండా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా సమన్వయంతో వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
என் உயிரோடு கலந்திருக்கும் தலைவர் கலைஞரின் அன்பு உடன்பிறப்புகளுக்கும், என் உயிர்நிகர் தமிழ் மக்களுக்கும் என் அன்பு வணக்கம்.
தேர்தல் முடிவுகள் அறிவிக்கப்பட்ட பின்பு, நடக்கும் நிகழ்வுகளை நீங்கள் பார்க்கிறீர்கள். எந்தக் கட்சிக்கும் ஆட்சி அமைக்கும் பெரும்பான்மை கிடைக்காத வகையில்…— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 9, 2026


