విల్లివాక్కం నియోజకవర్గంలో రాజకీయ సమరం రసవత్తరంగా మారింది. డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్న అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ వారసుడు కార్తీక్ మోహన్‌కు విల్లివాక్కం ఓటర్లు గెలుపు కిరీటాన్ని అందించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అలాగే టీవీకే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆపార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునను ఓటర్లు ఆదరించేనా అన్న చర్చ జోరందుకుంది. ఇక, ఈ ఇద్దరి మధ్య తాను సైతం అంటూ అన్నాడీఎంకే అభ్యరి్థ, మాజీ ఎంపీ ఎస్‌ఆర్ విజయకుమార్ దూసుకెళ్తున్నారు. తమకూ అవకాశం ఇవ్వాలని ఎన్‌టీకే అభ్యర్థి రోహిణి ఓట్ల వేటలో ఉన్నారు.
సాక్షి, చెన్నై : చెన్నై నగరంలో విల్లివాక్కం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ స్థానం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే ఐదుసార్లు విజయఢంకా మోగించింది. అన్నాడీఎంకే రెండు సార్లు, సీపీఐ రెండు సార్లు, కాంగ్రెస్, టీఎంసీలు తలా ఓ సారి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చెన్నై నగరం విస్తరణ పరిధిలో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రాంతంగా విల్లివాక్కం ఉంది. ఐసీఎఫ్ గడ్డగా రైల్వే కారి్మకుల ఓటు బ్యాంక్, తెలుగు వారి ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమరం రసవత్తరంగా సాగుతోంది. 2011 పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మార్చుకుంది. ఈ పరిధిలో ఐసీఎఫ్, తిరుమంగళం, అన్నానగర్(కొంత భాగం), కెల్లీస్, ఐనావరం వంటి నగరంలో అత్యంత ముఖ్యమైనప్రాంతాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ రైలు పెట్టెల తయారీ కేంద్రం ఐసీఎఫ్‌తో పాటుగా సిడ్కో పారిశ్రామక వాడ, కీల్పాకం మానసిక చికిత్సాలయం వంటివి
ఆధవ్‌ను ఆదరించేనా..
విజయ్ తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున ఇక్కడ పోటీ చేస్తున్నారు. యువ ఓటర్లను గురి పెట్టడమే కాదు, మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా నియోజకవర్గంలో ఆధవ్ తిష్ట వేశారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో గతంలో ఇక్కడ అన్నాడీఎంకే తరపున పోటీ చేసి గెలిచిన జేసీడీ ప్రభాకర్‌కు మద్దతు గణం ఇక్కడ ఉంది. తాజాగా ఆయన టీవీకేలో చేరిన దృష్ట్యా, ఆ మద్దతు తనకు కలివచ్చిందన్న ధీమాతో ఆధవ్ ఉన్నారు. టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు తదుపరి ఈ విల్లివాక్కం నియోజకవర్గం ఉండటంతో తమ అధినేత చరిష్మా మరింతగా కలిసి వస్తుందన్న ధీమాతో ఆధవ్ దూసుకెళ్తున్నారు.
విజయకుమార్ ఎదురీత
అన్నాడీఎంకే అభ్యరి్థగా ఎస్‌ఎస్‌ఆర్ విజయకుమార్ పోటీలో ఉన్నారు. ఆయన మాజీ ఎంపీ కూడా, కూటమి బలం, పార్టీకి ఇక్కడ అనాదిగా ఉన్న రెండుకుల గుర్త మద్దతు తనను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ప్రచారంలో దూసుకెళ్లడమే కాకుండా, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తాను ఈ పరిసరాలకు చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక, సీమాన్ నాన్ తమిళర్ కట్చి( ఎన్‌టీకే ) అభ్యరి్థగా సామాజిక కార్యకర్త, ట్రాన్స్‌జెండర్ అయిన రోషిణిని బరిలో ఉనర్నారు.సామాజిక మార్పు కోరుకునే ఓటర్లను ఆమె ఆకట్టుకుంటున్నారు.
హోరాహోరీ సమరం...
విల్లివాక్కం డీఎంకే కంచుకోట. ఈ కూటమిలోని వామపక్షాలకు సైతం ఇక్కడ కారి్మక ఓటు బ్యాంక్ మరీ ఎక్కువే. అయితే ఈసారి సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెట్రి అళగన్‌కు ఈసారి డీఎంకే సీటు ఇవ్వలేదు. అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడు కార్తీక్ మోహన్‌ను ఈసారి డీఎంకే రంగంలోకి దించింది. అధికార డీఎంకే కూటమి బలం, పటిష్ట ఓటు బ్యాంక్ గెలుపు కిరీటాన్ని కార్తీక్ ఓటర్లకు అప్పగించే అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో ఆయన స్థానికేతరుడు అన్న ముద్ర ఉండటం సవాలుగా మారింది. యువకుడైన కార్తీక్‌ను గెలిపించేందుకు ఓ వైపు ఆయన తండ్రి మోహన్, మంత్రి శేఖర్‌బాబుతో పాటూ చెన్నై మేయర్ ఆర్ ప్రియ ఉరకలు తీస్తున్నారు. ఇక, కార్తీక్ కోసం స్వయంగా సీఎం స్టాలిన్ అల్లుడైన శబరీషన్ సైతం రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెట్టడం గమనార్హం.
ఓటరు ఎటో
ఈ నియోజకవర పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ 76947 పురుçషులు, 82785 మహిళలు, 32 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,59,765గా ఉంది. వన్నియర్, నాయుడు , ఆది ద్రావిడ సామాజిక వర్గాల ఓట్లు కూడా ఇక్కడ కీలకం. వీరితో పాటు ముదలియార్ , నాడార్ ఓట్లు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. డీఎంకే వారసత్వ రాజకీయాల పై వ్యతిరేకత అన్నది ఇక్కడ పనిచేస్తుందా లేక సంక్షేమ పథకాలు కాపాడుతాయా?, అన్నాడీఎంకే పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా? లేక విజయ్ పార్టీ ’విజిల్’ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.


