180 సీట్లు గెల్చుకునే అవకాశం: సర్వే
చెన్నై: త్వరలో తమిళనాడు అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి రానుందని ఓ సర్వే అంచనా వేసింది. అసెంబ్లీలోని 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 180 వరకు సీట్లు గెల్చుకుంటుందని సర్వే చేపట్టిన అగ్ని న్యూస్ సరీ్వస్(ఏఎన్‌ఎస్) సీఈవో ఆర్.సురేశ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమికి 44.9 శాతం వరకు ఓట్లు పోలవుతాయి.
ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమి 38.5 శాతం ఓట్లతో 54 సీట్లు వస్తాయి’అని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై ప్రాంతంలో ప్రతిపక్ష కూటమి ఘోర పరాజయం చవిచూడనుందని, ఒక్క సీటూ గెల్చుకునే అవకాశాలు లేవని చెప్పారు. నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగా వెట్రి కళగం(టీవీకే)కు 9.7 శాతం ఓట్లు, నామ్ తమిళర్ కట్చి(ఎన్‌టీకే)కి 4.8 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నామన్నారు.


