రేపు తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారం | Tamil Nadu Government Formation Live Updates May 09th Updates | Sakshi
Sakshi News home page

రేపు తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారం

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 9:12 PM

Tamil Nadu Government Formation Live Updates May 09th Updates

పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే చాన్స్‌

  • ఎనిమిది మంత్రుల పేర్ల జాబితాను గవర్నర్‌కు అందజేసిన విజయ్‌
  •  విజయ్‌తో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం

రేపు తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారం

  • నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 10 గంటలకు విజయ్‌ ప్రమాణం
  • ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ అనుమతి కోరిన విజయ్‌
  • ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్‌కు అందజేత
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్‌
  • అందుకు గవర్నర్‌ సమ్మతి
  • ప్రభుత్వ   ఏర్పాటుకు మార్గం సుగుమం
  • ఈ నెల 13లోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ ఆదేశం
     

తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్‌లు

  • కేరళం పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్‌
  • సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌

తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్‌ ట్విస్ట్‌

  • విజయ్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని గవర్నర్‌
  • లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్‌ మళ్లీ వెనుదిరిగారు.
  • కేరళంకు వెళ్తున్న గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌
  • విజయ్‌కు సమయం ఇవ్వని గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌
  • గవర్నర్‌కు ముందస్తు అపాయింట్‌మెంట్‌ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు
     

అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు?

  • పీవీ షణ్ముగం నేతృత్వంలో రెబల్‌ ఎమ్మెల్యేలు
  • ఈపీఎస్‌ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మా

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలు

  • రాత్రి 7.10 గంటలకు కేరళ వెళ్లనున్న గవర్నర్‌ రాజేంద్ర
  • గవర్నర్‌ వెళ్లిపోతే విజయ్‌ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం
  • సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలు
  • ఇప్పటికి తేలని మద్దతు లెక్కలు
  • విజయ్‌ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సస్పెన్స్‌

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు

  • టీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వీసీకే
  • కాసేపట్లో వీసీకే మీడియా సమావేశం
  • వీసీకే అధికారిక ప్రకటన తర్వాత గవర్నర్‌ను కలవనున్న విజయ్‌

తమిళనాడు  రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్‌

  • వీసీకే చీఫ్‌ తిరుమావళవన్‌కు ముఖ్యమంత్రి పదవి?
  • డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్‌
  • డీఎంకే ప్రతిపాదన  అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు
  • సాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్‌ ప్రెస్‌మీట్‌

తమిళనాడు సంక్షోభంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌

  • టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌కు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌
  • విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌ ఆహ్వానించాల్సి ఉంది
  • కానీ, అలా చేయలేదు
  • సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన మాజీ ఐపీఎస్‌ అధికారి
  • విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ

మ్యాజిక్‌ ఫిగర్‌ దగ్గరే ఆగి.. 

  • తమిళనాట అధికారానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 118
  • విజయ్‌ టీవీకే ప్రస్తుత బలం 108-1=107 (ఒక్క స్థానంలో విజయ్‌ తప్పుకోవాల్సిందే)
  • కాంగ్రెస్‌ 5
  • వామపక్షాలు 4
  • ఏఎంఎంకే 1
  • లోక్‌భవన్‌కు నిన్న సమర్పించిన మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య 117
  • ఏఎంఎంకే ఎమ్మెల్యే విత్‌డ్రా అయితే 116
  • వీసీకే కలిస్తే .. 118 మ్యాజిక్‌ ఫిగర్‌ పూర్తి

సాయంత్రం దాకా ఆగాల్సిందే!

  • తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న సస్పెన్స్‌
  • ఎటూ తేల్చని విడుదలై చిరుతైగల్ కట్చి(2 సీట్లు)
  • విజయ్‌ను వెయిటింగ్‌లో పెట్టిన వీసీకే
  • మద్దతు ఇస్తే తమిళనాడు పొలిటికల్‌ థ్రిల్లర్‌కు ఎండ్‌ కార్డ్‌
  • కొనసాగుతున్న వీసీకే హైలెవల్‌ మీటింగ్‌
  • సాయంత్రం దాకా జరగనున్న చర్చలు
  • సాయంత్రం వీసీకే చీఫ్‌ తిరుమావళవన్‌ మీడియా సమావేశం
  • కీలక ప్రకటన చేసే అవకాశం

 తమిళనాడు సంక్షోభంపై లెఫ్ట్‌ పార్టీల కీలక ప్రకటన

  • వామపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని తమిళనాట ఆరోపణలు
  • హార్స్‌ ట్రేడింగ్‌కు మేం వ్యతిరేకం: సీసీఐ,సీపీఎం
  • బేరసారాలకు  గవర్నరే అవకాశం ఇచ్చారు: సీసీఐ,సీపీఎం
  • ఢిల్లీ పెద్దల సూచనతోనే తమిళనాడు స్క్రీన్‌ప్లే నడుస్తోంది: సీసీఐ,సీపీఎం
  • బీజేపీ బ్యాక్‌డోర్‌ పాలిటిక్స్‌ నడిపిస్తోంది: సీసీఐ,సీపీఎం
  • అతిపెద్ద పార్టీని గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి : సీసీఐ,సీపీఎం
  • కానీ, ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారు : సీసీఐ,సీపీఎం
  • అందుకే టీవీకేకు మద్దతు ఇచ్చాం: సీసీఐ,సీపీఎం
  • మా రెండు పార్టీలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయి : సీసీఐ,సీపీఎం
  • ఇదే విషయాన్ని డీఎంకేకు సమాచారం అందించాం : సీసీఐ,సీపీఎం
  • ఏ పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాం: సీసీఐ,సీపీఎం
  • ఆ తర్వాతే మేం మా మద్దతు లేఖను గవర్నర్‌కు పంపాం: సీసీఐ,సీపీఎం
  • వీసీకే పార్టీ కొన్ని కారణాలతో ఇంకా లేఖ పంపలేదు: సీసీఐ,సీపీఎం
  • సాయంత్రంకల్లా ఆ పార్టీ నుంచి స్పష్టత రావొచ్చు: సీసీఐ,సీపీఎం
  • ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారనే ఆశిస్తున్నాం: సీసీఐ,సీపీఎం

మద్దతిస్తారా? ప్రతిపక్షంలో కూర్చుంటారా?

  • వీసీకే పార్టీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ
  • విజయ్‌ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తుందా? లేదా? అనే చర్చ
  • చెన్నైలోని కార్యాలయంలో వీసీకే హైలెవల్‌ మీటింగ్‌
  • ప్రతిపక్షంలో కొనసాగుతారా? అధికార పార్టీతో కలుస్తారా?
  • బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశమూ!
  • ఏ నిర్ణయం అనేది స్వేచ్ఛగా తీసుకోవాలని వీసీకే అధిష్టానానికి డీఎంకే అధినేత స్టాలిన్‌ సూచన
  • డీఎంకే నేతృత్వం సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌లో భాగంగా పోటీ చేసి రెండు సీట్లు నెగ్గిన వీసీకే
  • మరికాసేపట్లో స్పష్టమైన ప్రకటన వెలువడే చాన్స్‌
  • వీసీకే చీఫ్‌ తిరుమావళవన్‌ నిర్ణయం ఎలా ఉండనుందో?

గవర్నర్‌ తీరు వల్లే గందరగోళం: ముకుల్‌ రోహత్గీ

  • తమిళనాడు సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ కీలక వ్యాఖ్యలు
  • దేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తోంది
  • ఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభం
  • వారంరోజులైనా ఏ విషయం తేల్చలేకపోవడం దారుణం
  • గవర్నర్‌ తీరు వల్లే ఈ గందరగోళం
  • సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీకి గవర్నర్‌ అవకాశం ఇవ్వాలి
  • అత్యధిక సీట్లు నెగ్గిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాల్సింది
  • అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాల్సింది
  • బలనిరూపణ లోక్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీలో జరిగాలి
  • పీపీ నరసింహారావు ప్రభుత్వం చాన్నాళ్లు మైనారిటీలో నడిచింది
  • గవర్నర్‌ ఏదీ తేల్చకపోతే.. విజయ్‌ కోర్టును ఆశ్రయించొచ్చు
  • గతంలో ఇలాంటి కేసులు చాలా కోర్టుకు వచ్చాయి.. నేనూ వాదించా
  • రాష్టపతి పాలన, మరోసారి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదు.. ఇది అప్రాజాస్వామికం

అది ఏఐ వీడియోనేమో!: దినకరన్‌

  • టీవీకేపై ఏఎఎంకే చీఫ్‌ దినకరన్‌ ఆగ్రహం
  • తమ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వనేలేదని మరోసారి వ్యాఖ్య
  • ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్‌ సంతకం చేసిన వీడియోను రిలీజ్‌ చేసిన టీవీకే
  • ఆ వీడియోపై దినకరన్‌ అనుమానాలు
  • అది అసలు వీడియో కాదు : దినకరన్‌
  • అందులో లేఖ.. మా పార్టీ నోట్‌ప్యాడ్‌ వేర్వేరుగా ఉన్నాయి : దినకరన్‌
  • అది ఫేక్‌ లెటర్‌ : దినకరన్‌
  • మా పార్టీ లేఖను ఫోర్జరీ చేశారు: దినకరన్‌
  • పూర్తి వీడియోను టీవీకే ఎందుకు రిలీజ్‌ చేయడం లేదు?: దినకరన్‌
  • అది ఏఐ వీడియో అయ్యి ఉండొచ్చు: దినకరన్‌

 

వీసీకే ఆఫీస్‌ వద్ద కోలాహలం

  • చెన్నైలోని విడుదలై చిరుతైగల్ కట్చి ఆఫీస్‌ వద్దకు భారీగా చేరుకుంటున్న జనం
  • కాసేపట్లో మీడియా ముందుకు వీసీకే అధినేత తోల్‌ తిరుమావళవన్‌ 
  • టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై ఉత్కంఠ
  • మద్దతు ప్రకటిస్తే.. అనిశ్చితికి తెరపడే అవకాశం
  • స్వయంగా వీకేసీ ఆఫీస్‌కు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయనున్న విజయ్‌
  • దాదాపుగా మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలు
  • ఇవ్వకుంటే.. కొనసాగనున్న సస్పె‍న్స్‌
  • వీకేసీ మద్దతు ఇస్తే.. 119కి చేరనున్న టీవీకే బలం
  • ఏఎంఎంకే మద్దతు ఉపసంహరించుకున్నా.. టీవీకే మెజారిటీ 118
  • మ్యాజిక్‌ ఫిగర్‌ (118) కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు లైన్‌ క్లియర్‌ 

అన్నాడీఎంకే కీలక భేటీ

  • పళనిస్వామి ఇంట్లో సమావేశమైన అన్నాడీఎంకే నేతలు
  • ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ?
  • టీవీకే మెజారిటీ చూపించుకోలేకపోతే.. ఏం చేయాలన్నదానిపై సీనియర్లతో పళని మంతనలు
  • అన్నాడీఎంకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు ఏఎంఎంకే చీఫ్‌ దినకరన్‌ లేఖ
  • మొన్నటిదాకా విజయ్‌కు మద్దతు ఇస్తారని ప్రచారం
  • నిన్ననేమో బద్ధశత్రువు డీఎంకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రచారం
  • ఇవాళ.. తగిన సంఖ్యా బలం లేకున్నా అన్నాడీఎంకేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం  

మరికాసేపట్లో కీలక ప్రకటన

  • విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) మద్దతుపై ఉత్కంఠ
  • మరికాసేపట్లో మీడియా ముందుకు వీసీకే చీఫ్‌ తిరుమావళవన్‌
  • విజయ్‌ టీవీకేకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టీకరణ
  • మద్దతు ఇస్తే.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు లైన్‌ క్లియర్‌ 
  • ఇవాళే సీఎంగా విజయ్‌ ప్రమాణం చేసే చాన్స్‌
  • ఇవ్వకపోతే.. కొనసాగనున్న సస్పెన్స్‌

దినకరన్‌పై డీఎంకే ఫైర్‌

  • ఏఎంఎంకే అధినేత దినకరన్‌పై డీఎంకే ఆగ్రహం
  • మిత్రపక్షం అన్నాడీఎంకే తరఫున ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వాన విజ్ఞప్తి గవర్నర్‌కు అందించిన దినకరన్‌
  • ఏ ప్రతిపాదికన గవర్నర్‌కు ప్రభుత్వ ఏర్పాటు లేఖ అందించారని ప్రశ్నించిన డీఎంకే సీనియర్‌ నేత టీకేఎస్‌ ఇళంగోవన్
  • అన్నాడీఎంకేకు సంఖ్యా బలం ఎక్కడ ఉంది?: ఇళంగోవన్‌
  • ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా.. సపోర్ట్‌ లెటర్‌ లేకుండా దినకనర్‌ డ్రామాలు చేస్తున్నారా?: ఇళంగోవన్‌

త్రిషకు నిరాశ తప్పదా?

  • తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేయనున్న విజయ్‌
  • ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందని ప్రచారం
  • డిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలు
  • తిరుచ్చి ఈస్ట్‌తో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్‌ కావాలంటున్న విడుదలై చిరుతైగల్ కట్చి
  • అలాగైతేనే విజయ్‌కు మద్దతు ఇస్తామని స్పష్టీకరణ

సంబంధిత కథనం: త్రిష ఆశలు గల్లంతు!

116 కాదు.. 117!

  • విజయ్‌ మద్దతుపై తమిళనాడు లోక్‌భవన్‌ క్లారిటీ
  • 117 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్‌ ఆర్వీ ఆర్లేకర్‌కు లేఖ సమర్పించిన విజయ్‌
  • తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకే
  • విజయ్‌ రెండు చోట్ల పోటీ చేసిన నెగ్గడంతోనే ఆ ఫిగర్‌
  • ఒక సీటు మైనస్‌ చేసి 107 బలంగానే చూపించిన టీవీకే
  • కాంగ్రెస్‌ సపోర్ట్‌తో 112
  • బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్‌ పార్టీలు 4
  • ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌ మద్దతు కూడా చూపించిన విజయ్‌
  • మొత్తం 117 మంది ఎమ్మెల్యేల సంతకాలు
  • మెజారిటీకి తక్కువైన ఒక్క స్థానం
  • వీసీకే పార్టీ(2) మద్దతుపై టీవీకేకు అందని లేఖ
  • అది అంది ఉంటే.. 119కి పెరగనున్న బలం
  • ఏఎంఎంకే ఎమ్మెల్యే విషయంలో ఆ పార్టీ అధినేత దినకరన్‌ కిరికిరి
  • వీసీకే మద్దుతు ఇస్తే.. ఏఎంఎంకే ఎమ్మెల్యే వైదొలగినా 118 పూర్తి మెజారిటీ
  • నేడు వీసీకే ఆఫీస్‌కు విజయ్‌
  • మద్దతుపై సాయంత్రంలోగా రానున్న స్పష్టత

తమిళనాట జోరుగా క్యాంపు పాలిటిక్స్‌

  • తమిళనాడులో మొదలైన నెంబర్‌ గేమ్‌
  • మ్యాజిక్‌ ఫిగర్‌ 2 తక్కువైన టీవీకే 
  • విజయ్‌ సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న అనిశ్చితి
  • టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు ససేమీరా అంటున్న గవర్నర్‌ ఆర్వీ ఆర్లేకర్‌
  • రేపటితో టీవీకేకు గవర్నర్‌ ఇచ్చిన గడువు పూర్తి?!
  • పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీవీకే
  • మహాబలిపురం రిసార్ట్‌కే పరిమితమైన టీవీకే ఎమ్మెల్యేలు
  • చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపు
  • నేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అన్నాడీఎంకే చీఫ్‌ పళనిస్వామి
  • అన్నాడీఎంకేకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు ఏఎంఎంకే లేఖ
  • అన్నాడీఎంకే తరఫున లేఖ సమర్పించిన  ఏఎంఎంకే చీఫ్‌ దినకరన్‌
  • పళనిస్వామి గవర్నర్‌ను కలిస్తే మారనున్న నెంబర్లు
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అన్నాడీఎంకే దృష్టి
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న ఏఐసీసీ ఇంచార్జీ గిరీష్‌ చోడంకర్‌
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కేసులతో బెదిరింపులు.. డబ్బు ఆశ చూపిస్తున్నారని ఆరోపణలు
  • ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్‌ రాజకీయం మొదలుపెట్టిన కాంగ్రెస్‌
  • రాత్రికి రాత్రే బెంగళూరు.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలింపు
  • హైదరాబాద్‌లోనే తమిళనాడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శిబిరం

 

మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్‌

  • నిన్న విజయ్‌తో జన నాయగన్‌ ప్రొడ్యూసర్‌ భేటీ
  • అనంతరం లోక్‌భవన్‌కు విజయ్‌, మద్దతుదారు పార్టీల నేతలతో వెళ్లిన నిర్మాత 
  • లేఖ సమర్పించే సమయంలో గవర్నర్‌ పక్కనే నిల్చున్న నిర్మాత వెంకట్‌ కే నారాయణ
  • ప్రొటోకాల్‌కు విరుద్ధంగా తీసుకెళ్లారని విజయ్‌పై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు
  • ప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్‌కు ఏం పని అంటూ మండిపాటు
  • ప్రొడ్యూసర్‌ ద్వారా వామపక్షాలకు డబ్బులు పంచి ఉంటారని ఆరోపణలు
  • విజయ్‌ హార్స్‌ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం

గవర్నర్‌కు(శాలువా కప్పుకున్న వ్యక్తి) ఎడమ వైపు ఉంది జన నాయగన్‌ నిర్మాత వెంకట్‌ కే నారాయణ

ఆ ఇద్దరు ముందుకు వస్తే.. 

  • తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్‌ కంటిన్యూ
  • విజయ్‌కు మద్దతిచ్చే విషయంలో పార్టీల హైడ్రామా
  • వీసీకే తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన జ్యోతిమణి, వన్నీరసు 
  • పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ రెండు చోట్ల నెగ్గిన విజయ్‌
  • ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి
  • డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు విజయ్‌ వదులుకునే తిరుచ్చి ఈస్ట్‌ సీటును డిమాండ్‌ చేస్తున్న వీసీకే
  • వీటితో పాటు మరో రెండు డిమాండ్లు
  • చివరి నిమిషంలో మద్దతు లేఖ ఇవ్వకుండా హ్యాండిచ్చిన వీసీకే
  • టీవీకే మద్దతు అంశం పక్కన పెట్టి.. డీఎంకే అధినేత స్టాలిన్‌తో వీసీకే చీఫ్‌ తిరుమావళవన్‌ భేటీ
  • ఇవాళ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే చాన్స్‌
  • మద్దతు ఇస్తే సీఎంగా విజయ్‌కు లైన్‌ క్లియర్‌
  • ఇవ్వకుంటే.. కొనసాగనున్న ఉత్కంఠ

 

ఆ మిస్టేక్‌ చేయకుండా ఉండాల్సింది.. 

  • చిన్నతప్పిదంతో గవర్నర్‌ దగ్గర బుక్కైన టీవీకే అధినేత విజయ్‌
  • 6న గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను తొలిసారి కలిసిన విజయ్‌
  • గవర్నర్‌కు సమర్పించిన జాబితాలో కాంగ్రెస్‌ మద్దతు ఎమ్మెల్యేల పేర్లు కూడా
  • కూటమిగా.. టీవీకేను అతిపెద్ద పార్టీగా ప్రొజెక్ట్‌ చేసుకోలేకపోయిన విజయ్‌
  • అక్కడే గవర్నర్‌కు దొరికిపోయిన విజయ్‌
  • ఆ మరుసటి రోజే.. మరోసారి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి
  • నిన్న.. 116 ఎమ్మెల్యేల సంతకాలతో మూడోసారి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి
  • 118 ఎమ్మెల్యేల సంతకాలే కావాలని పట్టుబడుతున్న గవర్నర్‌

మొదటిసారి..

రెండో‘సారీ’..

మూడోసారి

 

116 వర్సెస్‌ 116

  • తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు
  • క్షణక్షణానికి మారిపోతున్న లెక్కలు
  • నెంబర్‌ గేమ్‌తో టీవీకే చీఫ్‌ విజయ్‌ సతమతం
  • తమిళనాడు మ్యాజిక్‌ ఫిగర్‌ 118
  • విజయ్‌ టీవీకేకు ప్రస్తుత బలం 116
  • ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్‌కు అవకాశం ఇవ్వాలంటున్న డీఎంకే అధినేత స్టాలిన్‌
  • ఇవాళ పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక భేటీ
  • విజయ్‌ చేతులెత్తేస్తే.. డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు 
  • అన్నాడీఎంకేకు బయటి నుంచి డీఎంకే మద్దతు ఇస్తుందంటూ జోరుగా ప్రచారం
  • డీఎంకే-అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన బలం 116
  • ఇరు వైపులా.. ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు అవసరం
  • వీసీకే పార్టీ మద్దతు ఇస్తేనే విజయ్‌ పార్టీకి సంపూర్ణ బలం
  • ఇదే అదనుగా టీవీకేకు డిమాండ్లు చేస్తున్న వీసీకే
  • కీలకమైన మంత్రిత్వ శాఖ, విజయ్‌ ఖాళీ చేసే స్థానంలో పోటీ, మరో రెండు డిమాండ్లు చేస్తున్న వీసీకే
  • ఇవాళ తమ నిర్ణయం ప్రకటిస్తామన్న వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్‌
  • ఇవాళ వీసీకే మద్దతు ఇస్తే విజయ్‌ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్‌
  • ఈరోజు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ

టీవీకేను టెన్షన్‌ పెడుతున్న పళనిస్వామి

  • మరోవైపు.. టీవీకేకు గుబులు పుట్టిస్తున్న అన్నాడీఎంకే
  • డీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ప్రచారం
  • మరోవైపు.. అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ ఇచ్చిన మిత్రపక్షం ఏఎంఎంకే
  • గవర్నర్‌ ఆర్‌వీ ఆర్లేకర్‌ను శుక్రవారం సాయంత్రం కలిసిన ఏఎంఎంకే చీఫ్‌ దినకరన్‌
  • నేడు అన్నాడీఎంకే కీలక సమావేశం
  • సీనియర్‌ నేతలతో భేటీ కానున్న అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పళనిస్వామి
  • గవర్నర్‌ను కలిసి టీవీకేపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న పళని!
  • విజయ్‌కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిందని మొన్నటిదాకా ప్రచారం
  • తమ కూటమి ఎమ్మెల్యేలను విజయ్‌ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్‌ ఆరోపణ.. గవర్నర్‌కు ఫిర్యాదు

స్టాలిన్‌ పరోక్ష సాయం!

  • తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో తమ జోక్యం ఉండబోదన్న డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌
  • టీవీకే పార్టీకి ఎలాంటి అవాంతరం కలిగించబోమని వ్యాఖ్య
  • ప్రజా తీర్పును గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టీకరణ
  • విజయ్‌ పాలనను ఆరు నెలలపాటు గమనిస్తామని.. ఆ తర్వాతే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని ప్రకటన
  • అన్నాడీఎంకేతో కూటమి ప్రభుత్వం ఉండబోదన్న సంకేతాలిచ్చిన స్టాలిన్‌  
  • విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో తన ఒత్తిడి ఏం ఉండదని.. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని మిత్రపక్షాలకు సూచన
  • ఆ సూచన తర్వాతే  విజయ్‌కు మద్దతు విషయంలో ముందుకు వచ్చిన వామపక్షాలు
  • విజయ్‌ కేబినెట్‌లో కాంగ్రెస్‌కు చోటు
  • తమకు చోటు అక్కర్లేదని.. బయటి నుంచే మద్దతు(డీఎంకేలో కొనసాగుతూ) ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్‌ పార్టీలు
  • వీసీకే కూడా తమ నిర్ణయాన్ని గౌరవించిందన్న సీపీఐ, సీపీఎంలు
  • అయితే.. కేబినెట్‌ బెర్త్‌తో పాటు విజయ్‌ వదులుకునే సీటు తమకు ఇవ్వాలంటున్న వీసీకే!
  • ఈ క్రమంలోనే మద్దతుపై ఇంకా ఏదీ తేల్చని వీసీకే చీఫ్‌ తిరుమావళవన్‌

తిరుమావళవన్‌ ఎక్కడ?

  • క్షణక్షణానికి మారుతున్న తమిళనాడు రాజకీయం
  • టీవీకేను టెన్షన్‌ పెడుతున్న వీసీకే అధినేత తిరుమావళవన్‌
  • చివరి నిమిషంలో మద్దతుపై ట్విస్ట్‌ ఇచ్చిన విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)
  • డీఎంకే సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ కూటమిలో ఉన్న వీసీకే
  • మొన్నటిదాకా విజయ్‌కు మద్దతు ఇవ్వమంటు వ్యాఖ్య
  • విజయ్‌ విజ్ఞప్తి మేరకు ఆలోచన చేస్తామని ప్రకటన
  • సాయంత్రానికి సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం
  • స్టాలిన్‌తో భేటీ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన తిరుమావళవన్‌
  • అర్ధరాత్రి వరకు నిరీక్షించిన టీవీకే
  • వీసీకే మద్దతు లేఖపై ఉత్కంఠ
  • నేడు అధికారిక ప్రకటన వెలువడే చాన్స్‌

విజయ్‌ ఉక్కిరి బిక్కిరి

  • తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • టీవీకేకు ఇంకా పూర్తిగా దక్కని మద్దతు
  • ప్రస్తుత బలం 116గా ఉందన్న గవర్నర్‌ కార్యాలయం
  • ఇంకా ఇద్దరు తక్కువ
  • డీఎంకే కూటమిలోని పార్టీలకు విజ్ఞప్తి చేసిన విజయ్‌
  • టీవీకే విజయ్‌ పార్టీ బలం (108.. ఇందులో విజయ్‌ రెండు చోట్ల నెగ్గడంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి.. దీంతో 107కి పడిపోనున్న సంఖ్య
  • డీఎంకేతో కటీఫ్‌ చెప్పి విజయ్‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌(5)
  • డీఎంకే కూటమిలోనే ఉంటూ బయటి నుంచి విజయ్‌కు మద్దతు ప్రకటించిన లెఫ్ట్‌ పార్టీ(4)
  • మద్దతు ఇవ్వబోమని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (IUML) ((2))
  • అన్నాడీఎంకే కూటమిలోని ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే మద్దతు కూడా!

దినకరన్‌కు టీవీకే కౌంటర్‌

  • మా ఎమ్మెల్యే విజయ్‌కు మద్దతు ఇవ్వలేదు: దినకరన్‌
  • తమ ఏకైక ఎమ్మెల్యే సంతకం టీవీకే ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే చీఫ్‌ దినకరన్‌ ఆరోపణ
  • చెన్నై కమిషనర్‌కు ఫోర్జరీ కంప్లయింట్‌
  • దినకరన్‌కు టీవీకే స్ట్రాంగ్‌ కౌంటర్‌
  • ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్‌ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే 
  • గవర్నర్‌కు విజయ్‌ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల్లో.. కామరాజ్‌ సంతకం కూడా!

దినకరన్‌ ఎంట్రీతో మారిన సీన్‌

  • తెరపైకి అమ్మ మక్కల్‌ మున్నేట్ర కగళం(AMMK) చీఫ్‌ దినకరన్‌
  • జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్‌
  • సొంత పార్టీతో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన దినకరన్‌
  • ఒక్క స్థానంలో నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థి
  • మన్నార్‌గుడి నుంచి నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థి కామరాజ్‌
  • మొదటి నుంచి టీవీకే విజయ్‌కు మద్దతు ఇస్తారనే ప్రచారం
  • అందుకు తగ్గట్లే గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతులో కామరాజ్‌ సంతకం కూడా
  • దినకరన్‌ సంచలన ఆరోపణలు
  • తమ ఏకైక ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణ
  • నిన్న సాయంత్రం గవర్నర్‌ను కలిసిన దినకరన్‌
  • అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి

తమిళ రాజకీయం.. హైదరాబాద్‌కు షిఫ్ట్‌

  • తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ
  • హైదరాబాద్‌కు మారిన తమిళనాడు రాజకీయం
  • హైదరాబాద్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
  • తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్‌లోనే ఐదుగురు ఎమ్మెల్యేల మకాం
  • ఏర్పాట్లు చూసుకోనున్న టీపీసీసీ చీఫ్‌

తమిళనాడు రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌

  • విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ అవాంతరం
  • గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను ముచ్చటగా మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్‌
  • మ్యాజిక్‌ ఫిగర్‌ 118
  • టీవీకే గెలిచిన స్థానాలు 108
  • కాంగ్రెస్‌ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. మొత్తం మ్యాజిక్‌ ఫిగర్‌ గవర్నర్‌కు చూపించిన విజయ్‌
  • ప్రమాణ స్వీకారానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం
  • విజయ్‌కు సీఎం స్థాయి భద్రతను పునరుద్దరించాలని పోలీస్‌ శాఖను గవర్నర్‌ ఆదేశించినట్లు ప్రచారం
  • దీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన టీవీకే
  • అయితే వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల సంతకం మిస్సింగ్‌!
  • 116 మంది మద్దతే ఉందని ప్రకటించిన లోక్‌భవన్‌
  • వీసీకే నిర్ణయం వెలువడేది ఇవాళే
  • నేటి విజయ్‌ ప్రమాణ స్వీకారంపై సందిగ్దత

Advertisement
 
Advertisement
Advertisement