చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ సంచలన ఓపీనియన్ పోల్ వెల్లడించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన స్థానాన్ని పదిలం చేసుకోబుతున్నారని సర్వే తెలిపింది.
ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటములతో పాటు సినీ హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రచారాలు జోరుగా చేస్తున్నాయి. అధికారం పొందడమే లక్షంగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే కూటమి తమిళనాట మరోసారి జెండా ఎగురవేయడం ఖాయమని ఒపీనియన్ పోల్ చెబుతున్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష డీఎంకే కూటమి ఏ సారి కూడా ప్రతిపక్షానికి పరిమితం కానున్నట్లు పేర్కొంది. సినీహీరో విజయ్ అధికారానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ మంచి స్థాయిలో ఓట్లషేర్ సాధించే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమెక్రటిక్ స్ట్రాటజీస్ ఓపీనియన్ పోల్ ప్రకారం
డీఎంకే కూటమి-37.5 % ఓట్లు 121 సీట్లు
ఏఐడీఎంకే కూటమి- 33.63 % ఓట్లు 83 సీట్లు
టీవీకే పార్టీ - 24.71 % ఓట్లు 3 సీట్లు
సాధించనున్నట్లు సర్వే తెలిపింది. 27 చోట్ల హోరాహోరి పోరు నడుస్తోందని పేర్కొంది. అయితే డీఎంకే సైతం సొంతంగా మెజారిటీ సాధించలేదని అలియన్స్ ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇదివరకు వచ్చిన సర్వేలలో చాలా వరకూ డీఎంకే వైపే మెుగ్గుచూపాయి. కాగా తమిళనాడులో 234 స్థానాలుండగా అధికారం సాధించడానికి 118 స్థానాలు అవసరం.


