తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు ఇలా.. | DMK announces seat sharing for Secular Progressive Alliance | Sakshi
Sakshi News home page

తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు ఇలా..

Mar 28 2026 5:08 PM | Updated on Mar 28 2026 5:50 PM

DMK announces seat sharing for Secular Progressive Alliance

చెన్నై: వచ్చే నెలలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే పార్టీ- కాంగ్రెస్‌ల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ మేరకు డీఎంకేతో జట్టు కట్టిన కాంగ్రెస్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సీట్ల సర్దుబాటును ఈరోజు(శనివారం, మార్చి 28వ తేదీ) ప్రకటించారు. తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను డీఎంకే 164, కాంగ్రెస్‌ 28, డీఎండీకే 10 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక వీసీకే 8 స్థానాల్లో, సీపీఐ 5, సీపీఎం 5, ఎండీఎంకే 4 స్థానాలను కేటాయించారు. 

ఇక డీఎంకే పోటీ చేసే పలు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొలతూర్‌ నుంచి సీఎం స్టాలిన్‌ బరిలోకి దిగుతుండగా, చెపాక్‌ నుంచి ఉదయనిధి పోటీ చేయనున్నారు. బోడినాయక్కనూర్‌ నుంచి పన్నీరు సెల్వం పోటీ దిగుతుండగా, కోయంబత్తూర్‌ సౌత్‌ నుంచి బరిలోకి సెంథిల్‌ బాలాజీ బరిలో ఉండనున్నట్లు డీఎంకే వెల్లడించింది. 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement