చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయితున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న రాజకీయ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్.. టీవీకేపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, టీవీకే విజయ్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరినా.. ఈ అంశంపై లోక్‌భవన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇంతలో తమ ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇచ్చినట్లు టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్‌కు ఇచ్చిందని దినకరన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమిళనాడు గవర్నర్‌కు ఒరిజినల్ కాపీ చూపించామన్న ఆయన, టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, దినకరన్‌కు టీవీకే కూడా కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖపై సైన్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసింది. తొలుత దీనిని దినకరన్ ఆమోదించారని.. కానీ అంతలోనే ఆయన యూటర్న్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
#WATCH | Chennai, Tamil Nadu | AMMK Party General Secretary TTV Dhinakaran visited the office of Assistant Commissioner of Police, Guindy Range
This comes amid Dhinakaran's claim that TVK shared 'forged copy' of MLA Kamaraj's letter with the Governor and that he is filing a… pic.twitter.com/GgF0T6Eaz8— ANI (@ANI) May 8, 2026
ఇదిలా ఉండగా.. ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. తమిళనాడులో అన్నాడీఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం పళనిస్వామిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏఎంఎంకే ఒక స్థానంలో గెలిచిన విషయం తెలిసిందే.
కాగా, ఆ వీడియోలో దినకరన్ ఆమోదంతోనే తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు చెబుతూ కామరాజ్ లేఖను రాయడం కనిపిస్తుంది. విజయ్ పార్టీకి తాము అధికారికంగా ఎటువంటి మద్దతు ఇవ్వలేదని దినకరన్ ఖండించడంతో ఆయన తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని టీవీకే ఆరోపించింది. వాస్తవాలను దాచిపెడుతున్నారని టీవీకే మండిపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ ప్రయత్నంలో ఎవరితోనూ బేరసారాలు లేదా చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది.
#WATCH | TVK shares a video of AMMK MLA Kamaraj, saying "These are the video visuals of AMMK MLA Kamaraj voluntarily and happily writing a letter expressing his support for the Tamilaga Vettri Kazhagam. He had stated that he was extending support to the Tamilaga Vettri Kazhagam… pic.twitter.com/sM3xtyXx12
— ANI (@ANI) May 8, 2026
విజయ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు :కాంగ్రెస్ ఎంపీ
ఇదిలా ఉండగా, తమిళనాడులో విజయ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజల మద్దతు కోల్పోయిన రాజకీయ శక్తులు ఇప్పుడు విజయ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా అవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ విమర్శించారు. టీవీకేకు ఇంకా మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్య చేరేందుకు చిన్న పార్టీల మద్దతు ఆలస్యమవుతోందని అంగీకరించిన ఆయన, అధికారం ప్రజల తీర్పును ఆలస్యం చేయగలదు కానీ శాశ్వతంగా అణచలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య తీర్పుకు ఇంకా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు. ప్రజల హక్కులు, న్యాయం కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
టీవీకేకు మద్దతు లేఖ పంపాం: వీసీకే
ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తున్నట్లు వీసీకే వెల్లడించింది. ఈ- మెయిల్ ద్వారా తమ లేఖను పంపినట్లు తెలిపింది. ఈ మేరకు వీసీకే పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. తమ మద్దతుకు సంబంధించి అధికారిక ప్రకటన శనివారం చేస్తామని మరో ట్వీట్‌లో పేర్కొంది. వీసీకే, టీవీకే శ్రేణులంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.



