డీఎంకే మేనిఫెస్టో విడుదల.. ఇవన్నీ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. | DMK's Tamil Nadu poll manifesto | Sakshi
Sakshi News home page

డీఎంకే మేనిఫెస్టో విడుదల.. ఇవన్నీ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

Mar 29 2026 7:21 PM | Updated on Mar 29 2026 7:46 PM

  DMK's Tamil Nadu poll manifesto

చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే మేనిఫెస్టో ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పథకాలను ఇందులో పొందుపర్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన స్టాలిన్.. డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసిందని, మళ్లీ గెలిస్తే ప్రస్తుత పథకాలను మరింత పెంచుతామని తెలిపారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

  • ఉన్నత విద్య చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు 

  • మహిళలకు ప్రతి నెల ఇచ్చే సాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,000కు పెంపు (రూ.1.37 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు ప్రయోజనం)

  • వృద్ధాప్య పెన్షన్ కూడా రూ. 2,000కు పెంపు

  • బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి వరకు పెంపు (ప్రస్తుతం 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు అమలులో ఉంది)

  • మహిళల స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

  • ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద ఇచ్చే ప్రయోజనం రూ.లక్షకు పెంపు

  • 20 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ కొనసాగింపు

  • మీటర్లు లేకుండా పంప్ సెట్లు కూడా పంపిణీ

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ యూనిట్ల సంఖ్య రెండింతలు పెంపు

  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ.18 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యం 

  • టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి నియో టైడల్ పార్కుల ఏర్పాటు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement