కాంగ్రెస్‌ ఒక్కటే సరిపోదు.. డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు | DMK leader TKS Elangovan Interesting Comments On TVK Vijay | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఒక్కటే సరిపోదు.. డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు

May 9 2026 10:47 AM | Updated on May 9 2026 11:15 AM

DMK leader TKS Elangovan Interesting Comments On TVK Vijay

చెన్నై: తమిళనాడు పొలిటికల్‌ యూటర్న్‌లు పీక్‌స్టేజ్‌కు చేరుకున్న వేళ డీఎంకే నాయకుడు ఇళంగోవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోవడం లేదన్నారు. డీఎంకే ఒంటరిగానే ఉందన్నారు. విజయ్‌.. తగిన బలంతో వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ను సంప్రదించాలన్నారు.

డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలాంగోవన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీవీకే అధినేత విజయ్‌ ముందుగా ఇతర రాజకీయ పార్టీలతో ప్రయత్నించి ఆ తర్వాతే గవర్నర్‌ను సంప్రదించాలి. ఒకే అతిపెద్ద పార్టీగా టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో విజయ్ ఒంటరిగా వెళ్ళి ఉంటే, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఉండేవారు. కానీ వారు కాంగ్రెస్‌తో కలిసి వెళ్ళి, మెజారిటీని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తగిన బలం లేకుంటే గవర్నర్‌ ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. తమిళనాడులో డీఎంకే ఒంటరిగానే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు ఆలోచన మాకు లేదు. 

ఏఎంఎంకే ఎమ్మెల్యే టీవీకేకు మద్దతు ఇవ్వనప్పుడు ఆయన మద్దతు లేఖ ఎందుకు ఇవ్వాలి? ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫోర్జరీ కేసులో పోలీసులు ఏం తేల్చారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.  అలాగే, ఏఎంఎంకే సపోర్టు లెటర్‌ లేకుండా ఎందుకు డ్రామా చేస్తోంది. అన్నాడీఎంకే ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచింది. టీటీవీ దినకర్‌ అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్‌ చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా అన్నాడీఎంకేను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిందని మండిపడ్డారు. 

అంతకుముందు కూడా ఇళంగోవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేకు బీజేపీ ఎలాంటి సూచనలు చేసిందో తనకు తెలియదన్నారు. ఒకవేళ అన్నాడీంఎకే గనక టీవీకేకు మద్దతు ఇవ్వకపోతే.. ఏ పార్టీకీ సరైన మద్దతు రాకపోవడంతో హంగ్‌ వస్తే.. మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకే ఓటమిపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ఏదో పొరపాటు జరిగిందని.. అదేమిటో తాము పరిశీలిస్తున్నామన్నారు. కేవలం అధికారంలోకి రావడం మాత్రమే డీఎంకే అజెండా కాదని, కొన్ని దశాబ్దాలుగా తమ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మద్దతు మాత్రమే సరిపోదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని, అందువల్ల ఆ పార్టీ మద్దతుతో సర్కార్‌ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement