సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం! | AI is no longer just tech Now political weapon In Tamil Nadu | Sakshi
Sakshi News home page

సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!

Sep 17 2025 1:30 PM | Updated on Sep 17 2025 2:17 PM

AI is no longer just tech Now political weapon In Tamil Nadu

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అరవ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్‌ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఓ ఏఐ వీడియోను రిలీజ్‌ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది డీఎంకేకు ప్రచారంగానే కాకుండా.. అటు ప్రత్యర్థి విజయ్‌ టీవీకే పార్టీకి కౌంటర్‌గానూ ఉందన్న చర్చ నడుస్తోందక్కడ. 

తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ట్రెండ్‌కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ విభాగాల క్రియేటివిటీతో ‘పొలిటికల్‌ డిజిటల్‌ వార్‌’ ఇప్పుడక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది. మైకుల్లో మాటలు, సోషల్‌ మీడియాలో పోస్టులకు అదనంగా   అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. పైగా ప్రత్యర్థులను నేరుగా విమర్శించాల్సిన అవసరం లేకుండానే ఆ సెల్ఫ్‌ ప్రమోషన్‌ వీడియోలు భలేగా ఉపయోగపడుతున్నాయి పార్టీలకు. తాజాగా.. 

విజయ్‌ తమిళగ వెట్రి కళగం (TVK) ఓ ఏఐ జనరేటెడ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో  డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సీఎన్‌ అన్నాదురై విజయ్‌పై ప్రశంసలు గుప్పించినట్లు ఉంది. అదే సమయంలో తన సొంత పార్టీ డీఎంకే విధానాలను విమర్శించినట్లుగా ఉంది. ఈ వీడియో తమిళనాట నిన్నంతా ట్రెండింగ్‌లో కొనసాగింది. 

ఈ పరిణామంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్‌ఫేక్‌ వీడియోలతో విజయ్‌ టీవీకే పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి శరవణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ ఉపయోగించడం బాధాకరమని అన్నారాయన. ఈ క్రమంలో బీజేపీతో డీఎంకే రహస్య బంధంలో ఉందంటూ విజయ్‌ చేస్తున్న ఆరోపణలనూ శరవణన్‌ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగానే.. 

విజయ్‌ టీవీకే పార్టీ పెరియార్‌ సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించలేదు. కానీ ఆయన భావజాలం నుంచి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం వంటి అంశాలను మాత్రం తీసుకుంటానని విజయ్‌ బహిరంగంగానే చెప్పాడు. ఈ క్రమంలో పెరియార్‌ ఫొటో దీంతో తాజా ఏఐ జనరేటెడ్‌ వీడియోతో

తద్వారా స్టాలిన్ రాజకీయ నేరేటివ్‌ను తిరిగి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పోనుపోను ఈ డిజిటల్‌ క్యాంపెయిన్‌ వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదు!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement