మాణిక్కం ఠాగూర్‌ సంచలన వ్యాఖ్యలు | Manikkam Tagore's comments on Tamil Nadu politics | Sakshi
Sakshi News home page

మాణిక్కం ఠాగూర్‌ సంచలన వ్యాఖ్యలు

May 8 2026 12:23 PM | Updated on May 8 2026 12:44 PM

 Manikkam Tagore's comments on Tamil Nadu politics

చెన్నై:  ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం భద్ర శత్రువులుగా ఉన్న రెండు పార్టీలు కేవలం ఒక్క వ్యక్తిని ఆపడానికి ఏమమవుతున్నాయన్నారు. దీనిని స్పష్టంగా గమనించే కాంగ్రెస్ పార్టీ వాకౌట్‌ చేసిందని తెలిపారు.

తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సరైనా సంఖ్యాబలం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఆరాష్ట్ర గవర్నర్ తేల్చి చెప్పడం.. ఆ తరువాత డీఎంకే- ఏఐడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం.. ఒకవేళ అలా చేస్తే టీవీకే ఎమ్మెల్యేలు అంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని విజయ్‌ హెచ్చరించడం ఇలా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు.  

మాణిక్కం ఠాగూర్‌ తన ట్విట్టర్‌లో... "జీవితకాలం బద్ధ శత్రువులుగా ఉన్న రెండు పార్టీలు అధికారం కోసం కలుస్తున్నాయి. ఒక్క వ్యక్తిని ఆపడం కోసం రెండు పార్టీలు కలుస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీల బి-టీమ్‌తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులని పిలుచుకోలేరు. స్థిరమైన ప్రభుత్వం పేరుతో రెండు పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. డీఎంకే ఈ రోజు తన ముసుగు తీస్తుందా?" అని ‍ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల బీ-టీమ్‌తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులుగా పిలుచుకోలేరు అని అన్నారు. కాగా ప్రస్తుతం విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటునకు మాత్రం గవర్నర్‌ ఆర్‌వీ ఆర్లేకర్‌ అంగీకరించడం లేదు. మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే రావాలంటూ స్పష్టం చేశారు. తనకు నెంబర్‌ ముఖ్యమని.. మెజారిటీ బలంతో ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement