Festival
-
Holi 2025, బోసిపోయిన రహదారులు.. కిటకిటలాడిన వైన్ షాపులు
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరిగింది. చిన్నపెద్ద వయసుతో తేడా లేకుండా అందరూ ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ జరుపుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గతేడాది కంటే ఈసారి హడావుడి కొంత తగ్గినప్పటికీ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా అనేక మంది రాజకీయ నాయకులు తమతమ ప్రాంతాల్లో జరిగిన హోలీ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముంబై, నవీముంబై, థానే పుణే, సోలాపూర్‌లో వీధివీధినా సంబరాలు అంబరాన్ని తాకాయి. కొన్ని ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు, బ్యాండు మేళాలతో నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకున్నారు. పలుచోట్ల గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, పూరన్ పోలీ (పూర్ణంతో తయారుచేసిన తీపి రొట్టెలు, బూరెలు) నైవేద్యంగా సమరి్పంచి, కాముని దహనం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగుపంచమి (రంగులు చల్లుకునే) ఉత్సవాలను జరుపుకున్నారు. ముఖ్యంగా కోళీ ప్రజలు తమ సాంప్రదాయ పద్దతిలో హోళీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా శుక్రవారం కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో గురువారం సాయంత్రం నుంచే యువతీ యువకులు, పిల్లలు, అందరు వేడుకలను ప్రారంభించారు. కొందరు ఫోన్లలో, మరికొందరు ప్రత్యక్షంగా కలుసుకుని ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు..... హోలీ ఉత్సవాల్లో ఎటువంటి అనుచిత సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించింది. బహిరంగ ప్రదేశాల్లో , బాటసారులపై రంగులు చల్లి ఇబ్బందులు పెట్టకుండా నగర రహదారులపై గస్తీ నిర్వహించారు. పండగ నేపథ్యంలో అనేక మంది పోలీసుల వారంతపు సెలవులు రద్దు చేశారు. హోలీ రోజున మద్యం సేవించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ప్రధాన కూడళ్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినవారిపై చర్యలు తీసుకున్నారు. కిటకిటలాడిన బీచ్‌లు.. హోలీ పండుగ సందర్భంగా ముంబైలోని బీచ్‌లన్నీ కిటకిటలాడాయి. పండుగ అనంతరం సముద్ర స్నానాలు చేసేందుకు యువతీ, యువకులు పెద్దసంఖ్య లో బీచ్‌లకు చేరుకున్నారు. ముఖ్యంగా చరి్నరోడ్, లో టస్, వర్లీ సీ ఫేస్, శివాజీపార్క్, మాహిం, బాంద్రా, అక్సాబీచ్ తదితర బీచ్‌లు సందర్శకులతో నిండిపోయాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జలాశయాలు, చెరువుల పరిసరాల్లో కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మద్యం సేవించి ఇతరుల ను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నారు. బోసిపోయిన రహదారులు.. నిత్యం వాహనాలతో రాకపోకలతో రద్దీగా కనిపించే ముంబై రహదారులన్నీ శుక్రవారం బోసిపోయి కనిపించాయి. శుక్ర, శని, ఆదివారం...ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధిక శాతం ప్రజలు గురువారం రాత్రి నుంచే పర్యాటక ప్రాంతాలకు, రిసార్టులకు, పిక్నిక్ పాయింట్లకు తరలిపోయారు. దీంతో హోలీ పండుగనాడు ప్రధాన రహదారులు సైతం బోసిపోయి కనిపించాయి. అయితే విహారప్రాంతాలకు వెళ్లే రోడ్లపై ముఖ్యంగా పుణే ఎక్స్‌ప్రెస్ హైవే, గోవా మార్గంతోపాటు పలు మార్గాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ కొంత పెరిగింది. శుక్రవారం ‘బెస్ట్’బస్సులు కూడా పూర్తిస్థాయిలో రోడ్లపైకి రాలేదు. అదే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిక్కిరిసి తిరిగే లోకల్ రైళ్లు కూడా ఖాళీగానే కనిపించాయి. నగరంలో ట్యాక్సీలు, తూర్పు, పశి్చమ ఉపనగరాలలో ఆటోలు కూడా అనుకున్నంత మేర తిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. వైన్ షాపుల వద్ద రద్దీ.. హోళి పండుగ నేపథ్యంలో శుక్రవారం ముంబైతోపాటు థాణే జిల్లాలోని వైన్ షాపుల వద్ద మద్యం కొనుగోలు కోసం మందుబాబులు పెద్దఎత్తున బారులు తీరారు. చేసేందుకు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు. మటన్, చికెన్ కొనుగోళ్లకు కూడా జనం పోటెత్తారు. గురువారంతోపాటు శుక్రవారం మధ్యాహ్నం దాకా ఈ రద్దీ కొనసాగింది. -
Holi 2025 : భూమికి పచ్చాని రంగేసినట్టు, రంగులద్దిన ఫ్యాషన్ క్వీన్స్
హోలీ (Holi2025) పండుగ అంటే ఉల్లాసం, ఉత్సాహం. పిల్లాపెద్దా అంతా అందంగా ముస్తాబవుతారు. ఇంద్రధనుస్సు లాంటి రంగులతో ఆటలాడుకుని తమ జీవితాలు మరింత రంగులమయం శోభిల్లాలని కోరుకుంటారు. రంగు రంగుల రంగులు, గులాల్ చల్లుకొని హోలీ ఆడతారు. ఇక సెలబ్రిటీలయితే అందంగా ముస్తాబై తమ అభిమానులను అలరిస్తారు. రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వయసుతో పని ఏముంది అని నిరూపించారు బాలీవుడ్ హీరోయిన్లు. వారెవరో చూసేద్దామా.2025 హోలీ కోసం సాంప్రదాయ చీరలో మాధురి దీక్షిత్ ( Madhuri Dixit ) ప్రశాంతకు చిహ్నమైన పచ్చని రంగులో అందంగాముస్తాబైనారు. తొమ్మిది గజాల అద్భుతంలో ఆకుపచ్చ రంగులో మాధురి యంగ్ అండ్ ఎనర్జటిక్‌గా కనిపించారు. 57 ఏళ్ల ఈ బాలీవుడ్ స్టార్ పండుగ కళతో ఉట్టిపడుతూ దేవతలామెరిపించింది.చీర అంటే గుర్తొచ్చే సెలబ్రిటీలలో మాధురి ఒకరు అనడంలో ఎలాంటి సందేహంలేదు. డిజైనర్ జయంతి రెడ్డి రూపొందించిన చీరకు వెండి జర్డోజీ ఎంబ్రాయిడరీ స్వీట్హార్ట్ నెక్లైన్, జుట్టుగా చక్కగా ముడి వేసుకకొని తన సిగ్నేచర్ లుక్కు మరింత వైభవాన్ని జోడించారు. చదవండి: Holi 2025 Celebrations: యంగ్ హీరోయిన్ల ఫ్యావరేట్ కలర్స్ ఇవే! సెలబ్రిటీ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ మాధురి ఎథెరియల్ లుక్‌ను వజ్రాలు, పచ్చలు నిండిన మహారాణి నెక్లెస్, చెవిపోగులు, ఇతర ఆభరణలతో ఎథ్నిక్ లుక్కు మెరుపు వచ్చేసింది. గ్లామర్ విత్ ట్రెడిషన్ మాధురి షేర్ చేసిన ఫోటోలను ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా! తగ్గేదెలే అంటున్న రవీనా నాకేం తక్కువ అంటూ ఈ హోలీకి వచ్చేశారు మరో సీనియర్ నటి, 52 ఏళ్ల రవీనా టాండన్ (Raveena Tandon). 90ల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ అందమైన దివా , ఈ హోలీకి బ్యూటీ ట్రీట్‌ను అందించింది. తన అందమైన కళ్ళతో హోలీకి రంగుల కళను తీసుకొచ్చింది. ఇద్దరు బిడ్డలతల్లి, రవీనా దేశీ స్టైల్ గ్లామ్‌లో మహారాణిలా కనిపించింది. గోధుమరంగు డ్రెస్‌కు, పింక్ కలర్ దుప్పట్టాను జోడించింది. సొగసైన ఝుంకాలు ఆమె లుక్నుమరింత ఎలివేట్ చేశాయి. హోళికా దహన్ శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. -
Holi 2025: పసందైన సినీ హోలీ పాటలు
హోలీ పండుగ అంటేనే సంబరాలు పండుగ. హోలీకి సంబంధించిన అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాగే సరదా సంబరాల పండుగలో పాటలు లేకుండా సరదా ఏముంటుంది. సినీ పరిశ్రమలో ఎన్నో పాటలు రంగుల వసంతాలను వెదజల్లాయి. తెలుగు సినిమా పాటల్లో హోలీ సంబరం కనిపిస్తుంది. మచ్చుకు కొన్ని పాటలు... 71 సంవత్సరాల హోలీ సాంగ్... మణిరత్నం–కమల్‌హాసన్ ‘నాయకుడు’ సినిమాలోని హోలీ పాట ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ ప్రతి హోలీ సందర్భంగా ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘రాఖీ’లో ‘రంగ్ బర్సే’ హోలీ పాట బాగా పాపులర్.నాగార్జున ‘మాస్’ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ హోలీ పండగ రోజున చెవిన పడాల్సిందే వెంకటేష్ ‘జెమిని’లో ‘దిల్ దివానా.. మై హసీనా’ హోలీ నేపథ్యంలో వినిపిస్తుందిప్రణయ విలాసములే. శివాజీ గణేషన్ సినిమా ‘మనోహర’ సినిమాలోనిది ఈ పాట. వీటితోపాటు గోపాల గోపాల, విజయ్ దేవర కొండ, మెహ్రీన్.. ‘హోలీ’ స్పెషల్ సాంగ్ , సీతారామరాజు సీనిమాలోని నాగార్జున, హరికృష్ణ, సాక్షి శివానంద్, ఆట ఆరంభం: అజీత్ కుమార్, రాణా, నయన తార నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాల్లోని పాటలు ఉన్నాయి. హోలీ -పురాణగాథలుచెడు అంతానికి సంకేతంవద్దని చెప్పినా శ్రీమహావిష్ణువునే స్మరిస్తున్న ప్రహ్లాదుడిని చంపాని తన సోదరి హోలికను ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని హోలిక మంటల్లో దూకుతుంది. విష్ణునామ స్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి చీమ కుట్టినట్లు కూడా కాదు. హోలిక మాత్రం కాలి బూడిద అవుతుంది, ఆ బూడిదే చెడు అంతానికి సంకేతం.చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!కాముని పున్నం శివుని భార్య సతీదేవి దక్ష ప్రజాప్రతి యజ్ఞంలో దేహాన్ని విసర్జింపగా శివుడు విరాగిౖయె హిమవత్ పర్వతంపై తపస్సు చేయసాగాడు. రాక్షసుల బాధలు పడలేని దేవతలు తపస్సులో ఉన్న శివుడి దీక్షను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. పార్వతిగ పుట్టిన సతీదేవిపై శివుడికి ప్రేమ కలిగించవలసిందిగా దేవతలు మన్మథుణ్ణి కోరారు. మన్మథుడు తన భార్య రతీదేవి మిత్రుడు వసంతుడితో కలిసి హిమవంతం చేరాడు. పార్వతీదేవి సపర్యలు చేస్తున్న సమయంలోశివుడిపై మన్మథుడు పుష్ప బాణాలు ప్రయోగించాడు. తన దివ్యదృష్టితో కాముని చర్యలు గ్రహించిన శివుడు కోపంతో ముక్కంటితో దహించాడు. కాముడి రూపంలో ఉన్న మన్మథుడిని దహించి వేయడాన్ని ‘కాముని దహనం’ ‘కాముని పున్నం’గా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రజలు పండుగ చేసుకుంటారు.కాముని పున్నంకృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు రాజు ఉండేవాడు. పసిపిల్లలను ‘హోలిక’ అనే రాక్షసి హింసిస్తోందని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు. అదే సభలో ఉన్న నారద మహాముని ‘ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికను పూజించిన పసిపిల్లలకు బాధలు ఉండవు’ అని చెప్పాడు. ఆనాటి నుంచి ఈ హోలీ ఉత్సవం జరుగుతోందని ప్రతీతి.‘రంగుల’ రాట్నం పురాతన కాలంలో గ్రీస్‌లో ‘నీలం’ రంగుకు నేరుగా సరిపోయే పదం లేదు. దగ్గరి వర్ణనలు మాత్రమే ఉండేవి ఆఫ్రికా ఎడారి తెగ ప్రజలు ‘ఎరుపు’ వర్ణాన్ని ఆరు పేర్లతో పిలుస్తారు. పురాతన కాలంలో ఈజిప్షియన్లు, మాయన్లు వేడుకలలో తమ ముఖానికి ఎరుపు రంగు పూసుకోవడం తప్పనిసరిగా ఉండేది. రోమన్ సైన్యాధిపతులు తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి శరీరానికి ఎరుపురంగు వేసుకునేవారు. కలర్ అసోసియేషన్ల ద్వారా వ్యక్తిత్వ లోపాలను నిర్ధారించేవాడు... డాక్టర్ మాక్స్ లుషర్. ∙వన్స్ అపాన్ ఏ టైమ్ రోమన్ల కాలంలో క్యారెట్లు ఉదా, తెలుపు రంగులలో ఉండేవి. మధ్య యుగాలలో నలుపు, ఆకుపచ్చ రంగులలో కూడా ఉండేవి.కలర్ మ్యాజిక్ వర్డ్స్: సెలాడాన్–లేత ఆకుపచ్చ రంగు, ల్యూటీయన్–డీప్ ఆరెంజ్, కెర్మెస్–ప్రకాశవంతమైన ఎరుపు, సినోపర్–ముదురు ఎరుపు–గోధుమ రంగు, స్మాల్డ్–డీప్ బ్లూ. చదవండి : Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! -యంబ నర్సింహులు, సాక్షి, ప్రతినిధి, యాదాద్రి భువనగిరి -
Holi 2025 యంగ్ హీరోయిన్ల ఫ్యావరేట్ కలర్స్ ఇవే!
భువిపై విరిసే ఇంధ్రధనుస్సుఇంధ్ర ధనుస్సు నేలకు దిగి వచ్చిందా... అనిపించే రోజు హోలీ. సప్తవర్ణాలలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది.ఆ ఇష్టాన్ని తమ డ్రెస్సుల ద్వారా చూపుతుంటారు. సినిమా తెరపైన రంగు రంగుల దుస్తుల్లో కనిపించే తారలు తమకు ప్రత్యేకించి ఇష్టమైన రంగు గురించి ఈ హోలీ సందర్భంగా మనతో పంచుకుంటున్నారు. బ్లూ అండ్ పింక్ నాకు నచ్చిన రంగు పింక్. పెరుగుతున్న కొద్దీ అన్ని రంగులు నచ్చుతుంటాయి. కానీ, ఎక్కువ భాగం అయితే పింక్, బ్లూ కలర్స్ నా డ్రెస్సింగ్లోనూ చోటు చేసుకుంటుంటాయి. – శివాత్మిక రాజశేఖర్మల్టీ కలర్స్ నా జీవితంలో ఇంధ్రధనస్సు రంగులన్నీ ఉండాలనుకుంటాను. ఎందుకంటే, మనలోని భావోద్వేగాలను తెలియజేప్పేవే రంగులు. సప్తవర్ణాలన్నీ నాకు ఇష్టమైనవే. అందుకే నా డ్రెస్సులలో మల్లీ కలర్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. ఒక ప్లెయిన్ కలర్ శారీ లేదా డ్రెస్ వేసుకుంటే దాని మీదకు మల్టీకలర్ బ్లౌజ్, దుపట్టా ఉండేలా చూసుకుంటాను. – సంయుక్త మీనన్చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!అన్ని రంగులను స్వాగతించే తెలుపు నాకు తెలుపు రంగు చాలా ఇష్టం. శాంతి, కొత్త ప్రారంభాలు, అంతులేని అవకాశాలకు చిహ్నం తెలుపు. రంగులతో నింపుకోవడానికి వేచి ఉండే ఖాళీ కాన్వాస్ లాంటిది తెలుపు. ఇది అన్నింటినీ స్వాగతించే రంగు. అందుకే ఈ రంగు నాకు స్ఫూర్తిమంతమైనది కూడా. ప్రేమ, దయ, ఆనందాన్ని వ్యాప్తి చేసే ఈ వేడుక సందర్భంగా తెల్లని మన హృదయాలపైన అందమైన రంగులను చిలకరించుకుందాం. – వైష్ణవి చైతన్యచదవండి: Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! గ్రీన్ అండ్ పర్పుల్నాకు చాలా ఇష్టమైనది ఎల్లో. దీనిలోనే మరింత బ్రైట్‌గా ఉండే డ్రెస్సులను ఎంచుకుంటాను. దీంతో పాటు పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్స్ ఇష్టపడతాను. ఈ రంగులోనే పీచ్ కలర్ డ్రెస్సులు ధరించినప్పుడు ఉల్లాసంగా అనిపిస్తుంది. అవి నన్ను ప్రత్యేకంగా చూపుతాయి అనే భావన ఉంటుంది – రెజినా కసండ్రాప్రతి ఒక్కరికి కొన్ని రంగులు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అయితే, దుస్తుల విషయంలో మాత్రం కొన్ని రంగులు మాత్రమే వారి శరీరానికి నప్పేవిధంగా ఉంటాయి. ఏ రంగు డ్రెస్ ఎవరికి నప్పుతుందంటే... సాధారణంగా చీరలు ఎంపిక చేసుకుంటున్నప్పుడు వాటిని మన మీద వేసుకొని, కలర్ బాగుంటుందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకుంటుంటాం. కొంత మంది చర్మం ఫెయిర్‌గా ఉంటుంది. కానీ, డార్క్ కలర్స్ సెట్ అవవు. అలాంటప్పుడు లైట్ షేడ్స్ లేదా మల్టీకలర్స్ని ఎంపిక చేసుకోవచ్చు. వీరు సేమ్ స్కిన్ టోన్ కలర్ డ్రెస్సులు ఈవెనింగ్ పార్టీలకు ధరిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు డార్క్ స్కిన్ ఉన్నవారికి లేత రంగులు బాగుంటాయి అనుకుంటారు. కానీ, వీరికి డార్క్ కలర్స్ బాగుంటాటాయి.తమకు నప్పే కలర్ డ్రెస్ ఎంపికకు డిజైనర్ సలహాలు తీసుకుంటారు. అలాంటి వారికి కలర్ కాన్సెప్ట్ గురించి వివరిస్తాం. వారి శరీర రంగు, సందర్భం, పార్టీ .. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని డిజైన్ చేస్తాం. రీ యూజ్... రంగులు చల్లుకున్నాక వేసుకున్న డ్రెస్ మల్టీకలర్‌తో నిండిపోతుంది. ఆ డ్రెస్ పైన ఏ కలర్ భాగం ఎక్కువుందో చూసుకొని, ఆ రంగుతో డైయింగ్ చేయించి, తిరిగి వాడుకోవచ్చు. -నవ్యశ్రీ మండవ, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
Holi 2025 వర్చువల్ హోలి,నలభై రోజుల హోలీ!
హోలి అంటే యువతరం పండగ. ఆనందం ఆకాశాన్ని అంటే పండగ. దీన్ని దృష్టిలో పెట్టుకొని వర్చువల్ హోలిని ముందుకు తెచ్చాయి శాంసంగ్,స్నాప్‌చాట్. సాంకేతికతకు, సంప్రదాయాన్ని జోడిస్తూ హోలి వేడుకలకు కొత్త రంగు జోడించాయి శాంసంగ్, స్నాప్‌చాట్ సంస్థలు. ఏఐ ఆధారిత ఏఆర్ లెన్స్‌తో హోలీ వేడుకలకు డిజిటల్ రంగును జోడించాయి. ఇంటరాక్టివ్ ఫేస్–పెయింటింగ్ ఎఫెక్ట్ ద్వారా హోలీ రంగులు వచ్చువల్‌గా అనుభవంలోకి వస్తాయి. పైనల్ స్క్రీన్ డిస్ప్లేలో ‘హోలి మెసేజ్’ కనువిందు చేస్తుంది. ‘77 శాతం మంది హోలి వేడుకలను సృజనాత్మకంగా, కొత్తగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఏఆర్ లెన్స్లనుఇష్టపడుతున్నారు’ అంటుంది స్నాప్ ఇంక్ ఇండియా అడ్వర్టైజింగ్ హెడ్ నేహా జోలి. వర్చువల్ హోలి ‘ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్‌తో కలిపి హోలి బాగా ఆడేవాడిని. వారు విదేశాల్లో ఉండడం వల్ల ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను’ అని ఇక ముందు బాధ పడనక్కర్లేదు. ఫ్రెండ్స్ ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు ఉన్నా సరే, వర్చువల్ హోలి పుణ్యమా అని పండగ సంతోషాన్ని సొంతం చేసుకోవచ్చు. వర్చువల్ హోలి పార్టీలు ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి!చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా! నలభై రోజుల హోలీ! ఉత్తరాఖండ్‌లో హోలీని ‘కుమావోనీ’ హోలీగా జరుపుకుంటారు. ఇది బసంత్ పంచమితో ప్రారంభమయ్యే నెలరోజుల ఉత్సవం. దీన్ని బైతక్ హోలీ, నిర్వైన్ హోలీ అని కూడా పిలుస్తారు శివుడు కొలువు తీరిన వారణాసిలో శ్మశానంలో దొరికే బూడిదతో హోలీ వేడుకలు జరుపుకుంటారు. ఈ హోలిని ‘మసన్ హోలీ’ అని పిలుస్తారు.రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో చారిత్రాత్మకమైన ‘ఘన్‌శ్యామ్ జీ మందిర్’ ప్రాంతంలో హోలీ ఉత్సవాన్ని 40 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ హోలీ ఉత్సవాలను చూడడానికి స్థానికులే కాదు విదేశీయులు కూడా వస్తారు. ఈ ఆలయాన్ని 1718లో నిర్మించారు పండగకి రెండు రోజుల ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లో వితంతువులు హోలీ వేడుకలు మొదలుపెడతారు.ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘లాత్మార్ హోలీ’ వేడుకలు జరుగుతాయి. పురుషులను కర్రలతో తరుముతూ, వారిని రెచ్చగొట్టేలా మహిళలు పాటలు పాడతారు ∙హోలీని మన దేశంలోనే కాదు నేపాల్, శ్రీలంకలాంటి దేశాల్లోనూ జరుపుకుంటారు. నేపాల్‌లో ‘భోటే ఉత్సవ్’ అని, శ్రీలంకలో ‘పులంగి’ అనీ పిలుస్తారు.హోలీ... అరవై వేల కోట్ల వ్యాపారం! గత ఏడాదితో పోల్చితే 20 శాతం వృద్ధితో ఈ సంవత్సరం హోలీ పండగకు సంబంధించి రూ.60,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. మూలికరంగులు, పండగ వస్తువులు, స్వీట్లు, వాటర్ గన్స్, బెలూన్లు, వైట్ టీ–షర్ట్లు, కుర్తా–పైజామాలు, హ్యాపీ హోలి స్లోగన్లతో ఉన్న టీ–షర్ట్లు... మొదలైన వాటికి పెరిగిన డిమాండ్ దేశవ్యాప్తంగా హోలీ పండగ వాణిజ్యాన్ని పెంచింది. ఈ డిమాండ్ రిటైలర్లు, చిన్న వ్యాపారులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఎఐటి) తెలియజేసింది చదవండి: Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! -
అమ్మ శ్రమలో ఎన్ని రంగులో!
ఉదయాన్నే అమ్మ వేసే ముగ్గు రంగు తెలుపు. చల్లే కళ్లాపి ఆకుపచ్చ. గడపకు రాయాల్సింది పసుపు. నాన్నకు పెట్టాలి గోధుమ రంగు టీ. బాబు షూస్ పాలిష్ చేయాలి కదా నల్లగా. పాపాయికి కట్టాలి ఎర్ర రిబ్బన్. బట్టల సబ్బు రంగు నీలం. వంట గది నిండా మెటాలిక్ కలర్ పాత్రలే. కాటుక, తిలకం కంటే ముందు అమ్మకు అంటేది శ్రమ తాలూకు రంగులే. లోకానికి ఒకటే హోలి. అమ్మకు నిత్యం హోలి. నేడు అమ్మకే చెప్పాలి రంగు రంగుల కృతజ్ఞత.ప్రతి ఒక్కరి జీవితంలో రంగు రంగుల కలలు ఉంటాయి. అయితే స్త్రీలు ఆ రంగుల కలలను అందుకోవడంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. పరిమితులు ఎదురవుతాయి. వారు ఈ రంగులకు మాత్రమే అర్హులు అనే కనిపించని నియమాలు ఉంటాయి. పరిస్థితి చాలా మారినా స్త్రీ ఏదో ఒకదశలో రాజీ పడాలి. అయితే భారతీయ స్త్రీ ఆ రాజీని ఇష్టంగానే స్వీకరిస్తుంది. ముఖ్యంగా వివాహం అయ్యాక, తల్లిగా మారాక తాను కన్న రంగుల కలలన్నీ తన సంతానానికి ఇచ్చేస్తుంది. భర్త, పిల్లల సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. వారి కేరింగ్ కోసం రోజూ అంతులేని శ్రమ చేస్తుంది. ఆ పనుల్లోనే ఆమెకు రంగుల ప్రపంచం తెలియకుండానే ఎదురవుతుంటుంది. అమ్మకు రంగులు తోడవుతాయి. అవి ఆమెను అంతో ఇంతో ఉత్సాహ పరచడానికి ప్రయత్నిస్తాయి. కావాలంటే గమనించండి.అమ్మ శ్రమలో తెలుపు రంగు అడుగడుగునా ఉంది. ఆమె నిద్ర లేవడమే పాలు పోయించుకోవాలి. ముగ్గు వేయాలి. పిల్లలకు స్కూలుకు సిద్ధం చేసి తెల్లటి పౌడర్ రాయాలి. వెన్న కంటే తెల్లనైన ఇడ్లీల కోసం రాత్రే పిండి గ్రైండర్లో వేసుకోవాలి. తెల్ల యూనిఫామ్ ఉతికి సిద్ధం చేయాలి. తెల్లటి ఉప్పు, పంచదార తాకకుండా ఆమెకు జీవితం గడవదు. మునివేళ్ళకు ఆ తెల్లరంగు పదార్థాలు తాకుతూనే ఉంటాయి. ఎండలో వడియాలూ? టెంకాయ తెచ్చి పగులగొట్టి కొబ్బరి తీయడం ఆమెకు గాక ఇంటిలో ఎవరికీ రాదు. రాత్రిళ్లు అత్తామామలకు పుల్కాల కోసం ఆశీర్వాద్ ఆటాతో చేతులు తెల్లగా చేసుకోవాలి. ఆమే అన్నపూర్ణ. తెల్లటి అన్నం ఆమె చేతి పుణ్యం. ఆ వెంటనే ఆమెకు ఆకుపచ్చ ఎక్కువగా కనపడుతుంటుంది. కూరగాయలన్నీ ఆ రంగువే. ఇంట్లో మొక్కలకు ఆమే నీరు పోయాలి. ఆకుపచ్చ డిష్ వాషర్‌ను అరగదీసి గిన్నెలు కడిగి కడిగి చేతులు అరగదీసుకోవాలి. హెల్త్ కాన్షియస్నెస్ ఉన్న భర్త రోజూ ఆకుకూరలు ఉండాల్సిందే అంటాడుగాని పొన్నగంటి కూరో, కొయ్య తోటకూరో ఆకులు తుంచి కవర్లో వేయమంటే వేయడు. చేస్తే తప్ప ఆ పని ఎంత పనో తెలియదు.ఎరుపు రంగు అమ్మ పనిలో భాగం. ఇంటికి ఆమె ఎర్రటి జాజుపూతను అలుకుతూ ఉంటే వాకిలి నిండా మోదుగుపూలు రాలినట్లు అనిపిస్తుంది. అమ్మ ఉదయాన్నే స్నానం చేసి, దేవుడి పటాల ముందు నిలిచి అరుణ కిరణం లాంటి ఎర్రటి కుంకుమను వేలికొసతో అందుకొని, నుదుటి మీద దిద్దుకొని, దీపం వెలిగించాకే దేవుడు ఆవులిస్తూ నిద్రలేచేది. అమ్మ మునివేళ్ల మహిమకు సూర్యుడు కూడా ఆమె పాపిట్లో సిందూరమై ఒదిగిపోతాడు. ఎర్రటి ఆవకాయలు, పచ్చళ్లు చేతులను మంట పుట్టించినా అమ్మ చిర్నవ్వు నవ్వుతూనే ఉంటుంది. ఆమె చేయి కోసిన టొమాటోలు ఎన్ని వేలో కదా.అయితే అమ్మకు తనకంటూ కొన్ని రంగులు ఇష్టం. గోరింట పండితే వచ్చే ఎరుపు ఇష్టం.. మల్లెల తెలుపు ఇష్టం... తన ఒంటిపై మెరిసే నగల బంగారు వర్ణం ఇష్టం, మట్టి గాజుల రంగులు ఇష్టం, పట్టీల వెండి వర్ణం ఇష్టం, గోర్ల రంగులు ఇష్టం, కురుల నల్ల రంగు ఇష్టం, తాంబూలపు ఎరుపు ఇష్టం, కొద్దిగా మొహమాట పడినా లిప్‌స్టిక్ రంగులూ ఇష్టమే. పసుపు ఇంటికీ, అమ్మకూ శుభకరం. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా పసుపు డబ్బా తీసుకుని అమ్మ పరిగెడుతుంది. తీరిక ఉన్నప్పుడు గడపలకు రాస్తుంది. తను తాగినా తాగకపోయినా పిల్లలకు పాలలో కలిపి ఇస్తుంది. ఇక బ్లూ కలర్ అమ్మకే అంకితం. గ్యాస్ స్టవ్ మీద నీలం రంగు మంట ఆమెను ఎప్పటికీ వదలదు. ఇక జీవితాంతం బట్టల సబ్బు, సర్ఫ్‌ను వాడుతూ బట్టలు శుభ్రం చేయడమో చేయించడమో చేస్తూనే ఉండాలి. కనీసం హార్పిక్ వేసి టాయిలెట్లు కడగరు ఇంటి సభ్యులు. అదీ అమ్మ చాకిరే. నీలి మందు వేసి తెల్లవి తళతళలాడించడం, ఇస్త్రీ చేయించడం ఆమెకు తప్పదు. బట్టల హోమ్‌వర్క్‌లు చేయిస్తే బాల్‌పాయింట్ పెన్నుల నీలి గుర్తులు ఆమె చేతుల మీద కనిపిస్తాయి. ఇక నలుపు ఆమెకు ఏం తక్కువ. బూజు నుంచి అంట్ల మసి వరకు ఆమెకు ఎదురుపడుతూనే ఉంటుంది.ఇవాళ హోలి. కనీసం ఇవాళ అయినా అమ్మకు విశ్రాంతినిచ్చి ఆమెకు ఇష్టమైన రంగుల్లో ఇష్టమైన బహుమతులు ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి. -
Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!
హోలీ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. సరదాలు, రంగులు కలగలిసిన చక్కటి రంగుల పండుగ హోలీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఒకరిపై ఒకరు సంతోషంగా రంగులు జల్లుకుంటూ సంబరంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ హోలీ వెనుక అనే పురాణగాథలున్నాయి. అంతేకాదు పండుగ వేడుకల్లో ఆరోగ్యకరమైన ఆయుర్వేదకర ప్రయోజనాలున్నాయి. వణికించే చలి పులి పారిపోతుంది. వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ గాలి మార్పు కారణంగా జ్వరాలు, జలుబూ మేమున్నాం అంటూ వచ్చేస్తాయి. వీటిని అడ్డుకునేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడులను నీళ్లలో కలిపి చల్లుకునేందుకు ఈ వేడుక పుట్టిందని పెద్దలు చెబుతారు. కానీ కాలక్రమంలో సహజమైన రంగుల స్థానంలో రసాయనాలుమిళితమైన ప్రమాదక రంగులు వచ్చి చేరాయి. పైగా నాచులర్ కలర్స్‌తో పోలిస్తే చవగ్గా దొరుకుతాయి. అందుకే ఇంట్లోనే తక్కువగా ఖర్చుతో ఆర్గానిక్‌గా తయారు చేసుకునే కలర్స్ గురించి తెలుసుకుందాం. తద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు ప్రకృతిని కాపాడుకున్నవారమవుతాం.పండుగ వేడుక అంటే సంతోషాన్ని మిగిల్చాలి. ఆనందంగా గడిపిన క్షణాలు మనకు లేనిపోని సమస్యల్ని, రోగాలను తీసుకు రావడం కూడదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మందారం, బంతి, చేమంతిలా పూలతోపాటు, గోరింటాకుతో పచ్చని రంగు, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగులు తయారు చేసుకోవచ్చు. మోదుగుపూల రసాన్ని మర్చిపోతే ఎలా? మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హోలీ పండుగ పూట చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరి చేరవని అంటారు.పసుపు: బంతి పువ్వులు, నారింజ తొక్కల పొడి, చేమగడ్డ పొడి, పసుపు వంద సమపాళ్లలో తీసుకొని కలుపుకోవాలి.దీనికి కొద్దిగా నిమ్మ రసం వేసి ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే చక్కటి పసుపు రంగు తయారవుతుంది. దీన్ని నీళ్లలో కలుపుకుంటే లిక్విడ్ కలర్‌గా మారిపోతుంది.ఎరుపు: మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. వీటిని మెత్తని పొడిగా నూరుకుంటే ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఇది ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే దీనికి కొంచెం బియ్యప్పిండి యాడ్ చేసుకుంటే చాలు.మందారంతోపాటు ఎర్ర చందనం పౌడర్(కొంచెం ఖరీదైనదే)కలిపితే రెడ్ కలర్ తయారవుతుంది. ఎర్ర చందనం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తడి, పొడి రూపంలో వాడుకోవచ్చుగోధుమరంగుగోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్ర మాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్య ప్పిండిని కలిపితే చాలు.నీలం: జకరండ లేదా బ్లూ, ఊదా గుల్మొహార్ ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. అలాగే నీలం రంగు శంఖు పుష్పాలను నీళ్లలో నానబెడితే చక్కటి నీలం రంగు తయారవుతుంది. ఆకుపచ్చ: గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్య కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా సిద్దం చేసుకోవచ్చు.కాషాయం: మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెడితే పసుపు కాషాయం రంగుల మిశ్రమంతో చక్కటి రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. గోరింటాకును నూరి నీటిలో కలిపి, కొద్దిసేపు ఉంచి వడబోసుకుంటే ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును (ఇది కూడా చాలా ఖరీదైనది) రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికి కాషాయం రంగు తయారవుతుంది.గులాబీ: హోలీ ఆటలో చాలా ప్రధానమైన గులాల్ గులాబీ రంగులో ఉంటుంది. బీట్ రూట్ (నీటిలో మరగబెట్టి) రసం ద్వారా దీన్ని తయారు చేయొచ్చు. బీట్ రూట్‌ను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దీనికి శెనగ, పిండి, బియ్యం, గోధుమ పిండిని కలుపుకోవచ్చు. -
Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
హోలీ హోలీల రంగ హోలీ..చమ్మకేళీలహోలీ అంటూ ఎంతో సరదాగా, ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ. పిల్లా పెద్దా అంతా హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణంగా ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే, హోలీ ఆడేముందు, ఆడిన తరువాత కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం.హోలీ ఆడే సమయంలో ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలు ఉంటాయని గమనించాలి. అలాగే వాడి సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు, ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకు దారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం.సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించు కోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదు.చదవండి: Holi 2025 : ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా! పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి.స్కిన్ అండ్ హెయిర్ : హోలీ ఆడటానికి వెళ్లే ముందు కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్‌ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు.ఇలా చేయడం వల్ల రంగులు ముఖం నుచి పోయే అవకాశం ఉంటుంది. హోలీ రంగులతో రియాక్షన్ ఇచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. పైగా సులభంగా రంగులు క్లీన్ అవుతాయి.దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని.నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.రంగులను ఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకుందాం. అందరికీ హ్యాపీ హోలీ. -
Holi 2025 : ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!
హోలీ (Holi) అంటే.. రంగుల రాజ్యం. ఆద్యంతం హుషారుగా సాగే ఏకైక పండుగ ఇదేనేమో.. డ్యాన్స్, మ్యూజిక్, విందు వినోదాల కలయికగా సాగే ఈ పండుగ సందర్భంగా అనుసరించే ఫ్యాషన్ కూడా కలర్ఫుల్గా ఉండాలి కదా.. కాబట్టి కలర్ ఫెస్ట్‌లో ప్రత్యేకంగా కనబడేందుకు తాను చెప్పే స్టైల్స్‌తో లుక్‌ని కొత్త లెవల్‌కి తీసుకెళ్లండి అని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్ కన్సెల్టెంట్ సుమన్ కృష్ణ. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కలర్.. బ్లాక్‌ని సెంటరాఫ్ ఫ్యాషన్‌గా చేసి హోలీ వేడుకలో త‘లుక్’మనవచ్చని అంటున్నారామె. ఆమె అందిస్తున్న విశేషాలు, సూచనలివీ.. – సాక్షి, సిటీబ్యూరో కలర్ బ్లాకింగ్ అంటే..? ఇది విభిన్న, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ స్టైల్. మామూలు వైట్ కుర్తా బోరింగ్‌గా ఉంటుంది. సో.. ట్రెండీ కలర్ కాంబినేషన్లతో లుక్‌కి ఎక్స్ట్రా గ్లామర్ వస్తుంది.. ఒకే షేడ్‌లో ఉండే డ్రెస్సింగ్ కంటే, రెండు లేదా మూడింటికి పైగా బ్రైట్ కలర్స్ మిక్స్ చేసి ధరించడం ద్వారా మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. కొన్ని కలర్ కాంబినేషన్స్.. ధరించే దుస్తుల మధ్య సరైన కలర్ కాంబినేషన్ చాలా కీలకం. పింక్–ఆరేంజ్ హోలీకి చాలా ఎనర్జిటిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే..ఎల్లో–పర్పుల్ వంటి బ్రైట్ షేడ్స్ ట్రెడిషనల్ హోలీ లుక్‌కి సరైన ఎంపిక. అంతేకాకుండా బ్లూ–రెడ్ కూడా ట్రెండీ లుక్ అందిస్తాయి. వైట్–రేసింగ్ గ్రీన్‌లు క్లాసిక్‌గా కనపడాలంటే బెస్ట్. పీచ్‌లను సున్నితమైన, పండుగ కళ తెచ్చే కలర్స్‌గా పేర్కొనవచ్చు.స్టైల్–కంఫర్ట్ రెండింటి మేళవింపులా ఇంపుగా అనిపించాలంటే, కాటన్ లేదా లినెన్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవడం మంచిది. బ్రైట్ టాప్ + లైట్ బాటమ్ – లేదా ఆపోజిట్ కలర్ బ్లాక్ డ్రెస్సింగ్ ట్రై చేయవచ్చు. బాగీ/లూజ్ కుర్తాస్, ఫ్యూజన్ ధోతి ప్యాంట్స్ హోలీ మూడ్‌కి సరిగ్గా సరిపోతాయి. హోలీ డాన్స్‌లో ఫుల్ ఫన్ కోసం బెస్ట్ ఆప్షన్‌గా పాదాలకు స్నీకర్స్ బెస్ట్. సన్‌గ్లాసెస్, వాటర్ ప్రూఫ్ మేకప్ – హోలీ ఎఫెక్ట్స్ స్టైలిష్‌గా హ్యాండిల్ చేయండి. ఇలా చేయొద్దు.. పూర్తిగా వైట్ డ్రెస్సింగ్ వద్దు. దీనివల్ల రంగుల మిక్స్ తక్కువగా కనిపిస్తుంది. హెవీ మెటీరియల్స్, సిల్క్ ధరిస్తే అన్ ఈజీగా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కాళ్లకు హీల్స్ ధరిస్తే జారిపడే చాన్స్ ఎక్కువ. మేకప్, హెయిర్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్లడం పెద్ద పొరపాటు అవుతుంది.ఫైనల్ టచ్.. ఈ హోలీలో బ్లాక్ కలర్‌తో మ్యాజిక్ ట్రై చేయవచ్చు. ఫొటోలు మరింత ట్రెండీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ హోలీ జ్ఞాపకాలతో ఆనందాన్ని ఏడాది పాటు కొనసాగించవచ్చు. -
Holi 2025 : రంగుల పండుగ, షాపింగ్ సందడి షురూ!
నగరంలో హోలీ సందడి మొదలయ్యింది. ఈ నెల 14న పండుగ సందర్భంగా ఇప్పటికే నగరంలోని పలు దుకాణాల్లో హోలీ వేడుకలకు సంబంధించిన వివిధ రకాల సామగ్రిని కొనుగోలు చేయడానికి బేగం బజార్ వచ్చిన కొనుగోలుదారులు, మహిళలతో సందడి వాతావరణం నెలకొంది. హోలీ రంగుల కేళీ. చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగల్లో మరో ముఖ్యమైన పండుగ. హోలీ అంటే రంగుల పండుగ. ఫాల్గుణ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. పౌర్ణమి రాత్రి హోలికా దహనం చేస్తారు. మరునాడు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకలను ఎంజాయ్ చేస్తారు. దీనిని ధూలేడి పండుగ అని అంటారు.హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. భారతదేశం వ్యాప్తంగా హోలీని గొప్పగా జరుపుకుంటారు. ఒక్కోప్రాంతంలో ఒక్కోలా దీనిని చేసుకుంటారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలో హోలీకి ప్రత్యేక ప్రాధన్యత ఉంది. మేజర్‌గా అన్ని చోట్ల రంగులతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆర్గానిక్ కలర్స్‌నే వాడదాంహోలీ ప్రధానంగా రంగుల చుట్టూ ఉంటుంది. అందుకే దీనిని ఆడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణానికి, మన చర్మానికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలంటే సేంద్రీయ, సహజమైన రంగులు ఎంచుకోవడం ఉత్తమం. అలాగే స్నేహితులతో హోలీ ఆడేటపుడు అప్రమత్తంగాఉండాలి. ఎక్కువగా తిరగకుండా, హైడ్రేటెడ్‌గా ఉండాలా జాగ్రత్తపడాలి. జుట్టుకు నూనె రాస్తే రంగులు ఈజీగా వదిలిపోతాయి. కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. సన్‌స్క్రీన్ వాడితే మంచిది. -
మహిళా దినోత్సవం– పుష్ప విలాసం
అనేక దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే పువ్వులుప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ పువ్వులలో ఎక్కువప్రాచుర్యం పొందింది... యెల్లో మిమోసా. మహిళలకు యెల్లో మిమోసా పువ్వులను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం ఇటలీలో ఉంది. సున్నితత్వాన్ని, బలాన్ని సూచించే యెల్లో మిమోసాను ఇటాలియన్ ఫెమినిస్ట్‌లు మహిళా హక్కుల ఉద్యమానికి చిహ్నంగా ఎంచుకున్నారు. మార్చి ప్రారంభంలో మిమోసా వికసిస్తుంది కాబట్టి వారు ఈ పువ్వును ఎంచుకున్నారు. -
Kanuma Importance: కనుమ పండుగ ఈ విశేషాలు తెలుసా?
సంక్రాంతి పండగ సంబరాలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముచ్చటగా మూడు రోజుల వేడుకలో తొలి రోజు భోగి. భోగి మంటల వెచ్చటి వెలుగులతో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని ప్రార్థిస్తారు. రెండో రోజు మకర సంక్రాంతి కాంతులతో , సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని కోరుకుంటారు. కొత్తబియ్యంతో పొంగలి తయారు చేసుకుంటారు. మూడో రోజు కనుమ. పల్లెసీమలు పశుసంపద, వ్యవసాయ, పంటలతో సుభిక్షంగా కలకళలాడాలని ఆకాంక్షిస్తారు. పశువులను ప్రత్యేకంగా అలంకరించి, మొక్కుకుంటారు. అసలు ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు? ప్రయాణాలు చెయ్యరు ఎందుకు? తెలుసుకుందామా.!పశువులకు పూజలు, అందంగా ముస్తాబుసంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండగ. వ్యవసాయంలో ప్రధాన భూమిక పశువులదే. రైతులు ఎల్లవేళలా అండగా ఉంటాయి.అందుకే వాటిని దైవంతో సమానంగా భావిస్తున్నారు. పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నలు కనుమ రోజున పశువులను ఈ రోజున అందంగా అలంకరించి పూజిస్తారు. కనుమ రోజున పశువులను శుభ్రంగా కడిగి, వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్లకు మువ్వలుతొడిగి అలంకరించి కన్నబిడ్డల్ని చూసినట్టు మురిసిపోతారు. ఇలాఅలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా గ్రామ దేవత గుడిలో నైవేద్యం సమర్పిస్తారు. ఏడాదంతా సమృద్ధిగా పంటలు పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. మాంసాహారంతో విందు చేసుకుంటారు.అంతేకాదు గతంలో ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు సేకరించి, ఉప్పువేసి దంచి పొడి చేసి తినిపించేవారట. తద్వారా వాటిలో సంవత్సరానికి సరిపడా రోగనిరోధక శక్తి వస్తుందని నమ్మేవారు.ప్రయాణాలు ఎందుకు వద్దనేవారురవాణా సౌకర్యాలు బాగా లేని రోజుల్లో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించే ఆరాధించేవారు. అందుకే ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంలో ఈ రోజు ప్రయాణాలను మానుకునేవారట మన పెద్దలు. కనుమ రోజు ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే ఒక నానుడి ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఈ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవనే విశ్వాసం బాగా ఉంది. మరోవైపు సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతీ ఇల్లూ బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండువగా ఉంటుంది. కొత్త అల్లుళ్లు, పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లి తిరిగి పుట్టింటికి ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంతో వస్తారు. మరి వారితో సమయం గడిపేలా, కొత్త అల్లుడికి సకల మర్యాదలు చేసేలా బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దనే నియమం పెట్టారేమో! ఏది ఏమైనా ఈ నియమాలు కట్టుబాట్లు, ఎవరి ఇష్టాఇష్టాలు, నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. -
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్‌తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్‌ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్‌తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్‌కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్‌కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్‌లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్‌గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్‌హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్‌తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్‌కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్‌లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్‌తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్‌గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్‌లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్‌బాస్4’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్‌స్టాప్‌గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి -
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు. తొలి పండగ, పెద్ద పండగ అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సంబరాలు అంబరాన్నంటుతాయి. స్థానికంగా ఉన్న తెలుగువారంతా ఒక్క చోట సంబరంగా వేడుకచేసుకుంటారు. సంక్రాంతి-2025 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పోటీలను నిర్వహించారు. పిల్లలకు డ్రాయింగ్ ఈవెంట్, పెద్దలకు కబడ్డీ పోటీలు, ఆడవారికి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఇంకా కైట్ ఫెస్టివల్‌తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జపాన్‌లో నివసించే తెలుగువారు, జపనీయులు కూడ పెద్ద ఎత్తున పాల్గొని సంతోషంగా గడిపారు.ఉద్యోగగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా తరువాతి తరం వారికి అందించే విధంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) నిరంతరం కృషిచేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.గత పదేళ్లుగా సంక్రాంతి డుకులను జరుపుకుంటూ వస్తున్నామని తాజ్ నిర్వాహకులు ప్రకటించారు. ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే కాకుండా, ప్రతీ తెలుగు పండుగను అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకుంటా మన్నారు. -
విభేదాలూ, విద్వేషాలను దహించేసి.. భోగాల రాగాలు
మన్మథుడికి వసంతుడి లాగా, భోగి పండగ సంక్రాంతికి సామంతుడు. పెద్ద పండగకు హంగుదారు. ‘సంక్రాంతి లక్ష్మి వేంచేస్తు న్నదహో, బహుపరాక్!’ అని ముందస్తు హెచ్చరికలు చేస్తూ, ఊరంతటినీ ఉత్తేజపరిచి, పండగ కళకు పటిష్ఠమైన పునాది వేస్తుంది.ధనుర్మాసపు ముచ్చటలకు యథోచితంగా భరతవాక్యం పలికి, పౌష్యయోష ఆగమనానికి అంగరంగ వైభవంగా రంగం సిద్ధం చేస్తుంది. మకర సంక్రమణం జరగ బోతున్న మహత్తర ముహూర్తం వేళకు, చప్పటి సాధారణ జీవితపు స్తబ్ధతను వది లించే ప్రయత్నం చేస్తుంది. చలిమంటల నెపంతో, ఆబాల గోపాలంలోనూ సంబరాల వేడి పుట్టిస్తుంది. పల్లె సీమలలో ప్రతి ఇంటి ముంగిటా సమృద్ధికి సంకేతాలుగా, సంతుష్టికి గుర్తులుగా, పూర్ణ కలశాల ‘కుండ ముగ్గులు’ పూయిస్తుంది.వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి! /అరటి స్తంభాలతో అందగింతాము, / బంతి పూదండలన్ భావించుదాము, / తామరాకులతోడ దళ్ళల్లు దాము, / కలవ కాడల తోడ మెలికలేతాము! అంటూ (రాయప్రోలు వారి) పాటలు పాడుతూ వచ్చి, అందరినీ హుషారు చేస్తుంది.మరో రకంగా చూస్తే, సుదీర్ఘమైన సంక్రాంతి ఉత్సవంలో భోగి పండగ భోగానుభవాల రోజు. పులకింతలు కలిగించే చలిమంటలూ, ఉత్సాహం పెంచే ఉష్ణోదక అభ్యంగన స్నానాలతో ఆరంభించి, కొత్త బట్టల కోలాహలాలతో, వంటలు, పిండి వంటల ఆటోపాలతో, ఆత్మారాముడిని ఆనందపరిచే రోజు భోగి. సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభ సమయం. మార్తాండుడి మకర సంక్రమణ వేళ. కనుక దానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎక్కువ. ఆ రోజు ఆస్తికులు దానాలూ, తపాలూ, పితృతర్పణాల లాంటి ఆధ్యాత్మిక వ్యాసంగాలలో ఎక్కువ కాలం గడుపుతారు. కాబట్టి, సరదాలకూ, భోగాలకూ సమయం సరిపోక పోవచ్చు. కాబట్టి భోగినాడే చలిమంటలలో విభేదాలూ, విద్వేషాలూ, ఈర్ష్యా సూయల లాంటి నకారాత్మక భావనలు యథాశక్తి దహించేసుకొని, ఆ రోజంతా బంధుమిత్రుల సాంగత్యంలో ఉల్లాసంగా గడిపి, జీవితంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ నింపుకొని, ఆపైన జరపవలసిన సంక్రాంతి విధులకు సన్నద్ధం కావాలి.అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!– ఎం. మారుతి శాస్త్రి -
Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో వచ్చే అందమైన పండుగ సంక్రాంతి. ఊరూ వాడా అంతా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మొదలైపోయాయి. తెల్లవారుఝామున భోగి మంటలతో ఆరంభమై మకర సంక్రాంతి, పొంగళ్లు, కనుమ, ముక్కనుమ మూడు రోజుల పాటు ముచ్చటైన వేడుకలతో పల్లెలన్నీ కళకళ లాడతాయి. ఈ వేడుకల్లో ప్రధానమైంది భోగిపళ్లు. పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఎలా పోయాలి? ఈ విషయాలు తెలుసుకుందాం రండి.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే రేగుపళ్లు పోయడం ద్వారా చాలా రోగాల నుంచి రక్షణ లభిస్తుందంటారు పెద్దలు. అంతేకాదు వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని ప్రతీతి. సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, అలాగే ఆరోజన పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే ఆ లోక నాయరాణుని కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ల పోసే వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు. భోగి రోజు వచ్చిందంటే... ఇంట్లో చిన్నపిల్లలందరికీ భోగి పళ్లు పోసే వేడుక నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతారు అమ్మమ్మలు, అమ్మలు. ఎలాగా పిల్లలందరికీ భోగి రోజు పొద్దున్నే భోగి మంటల సందడి ఉంటుంది. పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని, తలారా స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకొని భోగిమంటల విభూదిని దిద్దుకుంటారు.నోటి తీపి చేసుకుంటారు. ఇక భోగి పళ్లు పోస్తున్నామంటూ ముత్తుయిదువలను పేరంటానికి ఆహ్వానిస్తారు. సాయంత్రం ఇంట్లో 10 ఏళ్ల లోపు పిల్లలందరికీ కొత్త బట్టలు తొడిగి ముస్తాబు చేస్తారు. రేగి పళ్లు, పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు, నానబెట్టిన సెనగలు, అక్షింతలు మొదలైనవి కలిపి ఉంచుతారు. అందరు రాగానే, తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా చిన్నారులను కూర్చోపెడతారు. ఎలా పోయాలి? ఇంట్లోని పెద్దవాళ్లు (అమ్మమ్మ, నానమ్మ) తల్లి కలిపి ఉంచుకున్న భోగిపళ్లను మూడు గుప్పిళ్లతో పిల్లల శిరస్సు చుట్టూ దిష్టి తీసినట్టు తలచుట్టూ తిప్పి పోయాలి. అంటే మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తలమీద పోయాలి. ఆ తరువాత పేరంటాళ్లు కూడా ఇలాగే చేయాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని పిల్లల్ని నిండు మనస్సుతో దీవించాలి.ఈ సందర్భంగా "ఓం సారంగాయ నమః" అనే నామం చెప్పాలని పెద్దలు చెబుతారు.ముత్తయిదువలకు పండూ ఫలం కానుకగా ఇస్తారు. ఇలా కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెడతారు. పిల్లలకు దిష్ట పోవాలని తీసినవి కాబట్టి, ఈ రేగు పళ్లును ఎవరూ తినకూడదని కూడా చెబుతారు.విశిష్టతశ్రీమన్నారాయణుడు రేగుచెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూనే తపస్సు చేశాడని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్య భగవానుడు. సూర్యుడితో సమానంగా రేగుపళ్లను భావించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలు కూడా ఉండడంతో చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయట. -
గీతాభాస్కర్ సమర్పించు సంక్రాంతికి సకినాలు
గీతాభాస్కర్ సినిమాలలో నటిస్తే నటన ఎక్కడా కనిపించదు. పూర్తిగా సహజత్వమే. ఆమె ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ తీసుకోలేదు. ‘డెస్టినీస్ చైల్డ్’ అనే పుస్తకం రాస్తే.... ‘పుస్తకం అంటే ఇలా ఉండాలి నాయనా’ అనిపిస్తుంది. ఆమె పెద్ద పుస్తకాలు రాసిన పెద్ద రచయిత్రి కాదు. నటన అయినా రచన అయినా వంట అయినా... ఏదైనా ఇట్టే నేర్చుకోగల సామర్థ్యం గీతమ్మ సొంతం. గీత పుట్టి పెరిగింది చెన్నైలో. అయినప్పటికీ... ఆమె సకినాలు చేస్తే తెలంగాణ పల్లెకి చెందిన తల్లి చేసినంత రుచిగా ఉంటాయి. పెళ్లయిన తరువాత గీత... దాస్యం గీతాభాస్కర్ అయింది. అత్తగారిది పక్కా తెలంగాణ. తెలంగాణ అంటే ది గ్రేట్ సకినాలు. ఇక నేర్చుకోకుండా ఉంటారా! సకినాలు ఎలా చెయ్యాలి... నుంచి ఫ్యామిలి ముచ్చట్ల వరకు ‘సాక్షి’తో పంచుకున్నారు గీతాభాస్కర్. ఆమె మాటల్లోనే.. అరిసెల పిండిలానే సకినాల పిండి కూడా తయారు చేసుకోవాలి. మామూలుగా వరి పిండి అయితే గట్టిగా అయిపోతుంది. పైగా అంతకుముందు వేరే గోధుమ పిండిలాంటివి పట్టి ఉంటే... అదే గిర్నీలో ఈ పిండి పడితే సరిగ్గా ఉండదు. అదే తడి పిండి అనుకోండి వేరే పిండి ఏదీ పట్టరు... బియ్యం పిండి మాత్రమే పడతారు. అయితే అరిసెల పిండికి రోజంతా బియ్యం నానబెట్టాలి. కానీ సకినాలకి నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది.మా ఆయన ఉన్నప్పుడు ముగ్గుల పోటీకి తీసుకుని వెళ్లేవారు. ఒకసారి గవర్నర్ చేతుల మీదగా బహుమతి కూడా అందు కున్నాను. పండగ రోజున మంచి మంచి ముగ్గులు వేస్తుంటాను. నా ముగ్గులన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. దసరా, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలో నేను పాల్గొనాల్సిందే. ఆయన అలా తీసుకువెళ్లేవారు.– గీతాభాస్కర్ గీతా భాస్కర్ వేసిన ముగ్గునువ్వులు ఎక్కువ వేస్తాసకినాల పిండికి కొలతలు అంటూ ఉండవు. ఒక గ్లాసు పిండికి నేను పావుకిలో నువ్వులు వేస్తాను. నువ్వులు ఎక్కువ వేస్తే గ్యాప్ ఎక్కువ వస్తుంది... పైగా నువ్వుల నుంచి కూడా నూనె వస్తుంది కదా.. బాగా ఉడుకుతుంది. దాంతో సకినం కరకరలాడుతుంది. కొంతమందైతే పచ్చి నువ్వులు వేసేస్తారు. నేను చెన్నై నుంచి వచ్చినదాన్ని కదా... మాకు అక్కడ మురుకులు అలవాటు. అక్కడ వేయించిన నువ్వులు వేస్తారు. నేను సకినాల్లో అలానే వేస్తా. అసలు ఇక్కడికి వచ్చాకే నేను సకినాలు వండటం నేర్చుకున్నాను. సకినాలకి దొడ్డు బియ్యం బాగుంటుంది. నేను దాదాపు రేషన్ బియ్యమే వాడతాను. అవి ఎక్కువ పాలిష్ ఉండవు కాబట్టి సకినాలకి బాగుంటుంది. అలాగే వేరు శెనగ నూనె వాడతాను.అమ్మ వైపు... నాన్న సైడుమా తండ్రి, తల్లివైపు వాళ్లందరూ చెన్నైలో సెటిల్ అయ్యారు. నేను పుట్టింది, పెరిగిందీ అక్కడే. రెండు కుటుంబాల వాళ్లు బిగ్ బిజినెస్ పీపుల్. ఇక మా అమ్మగారివైపు అయితే పూర్తిగా కాస్మోపాలిటన్. ఆవిడ హార్స్ రైడ్ చేసేవారు. చెన్నైలో శివాజీ గణేశన్‌లాంటి స్టార్స్ ఉండే మలోని స్ట్రీట్‌లో మా తాత ఉండేవారు. పొలిటికల్‌గా ఆయనకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉండేవి. నెహ్రూగారితో పరిచయం ఉండేది. మా అమ్మ బట్టలన్నీ సినిమా కాస్ట్యూమర్స్ కుట్టేవారు. ఇక నాన్నవైపు పూర్తిగా భిన్నం. వాళ్లు కూడా వ్యాపారవేత్తలే. నాన్న వాళ్లది పప్పుల వ్యాపారం. నాన్నగారి కుటుంబంలో అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు... మగవాళ్లతో మాట్లాకూడదు... అలా ఉండేది. నేను ఇటు అమ్మవైపు అటు నాన్నవైపుఇలాంటి కాంబినేషన్లో పెరిగా. మా అమ్మ ఒక్కతే కూతురు. ఆమెకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక్కతే కూతురు కావడంతో రాణిలా పెంచారు. నాన్నవాళ్లు పదమూడుమంది. నాన్నమ్మ వాళ్లు బాగా ట్రెడిషనల్. ఇంటికి పెద్ద కోడలిగా అమ్మకి చాలా బాధ్యతలు ఉండేవి. అయితే అమ్మ ఎక్కడిది అక్కడే అన్నట్లుగా తనను మలచుకుంది. అత్తింటి విషయాలు పుట్టింటికి, అక్కడివి ఇక్కడ ఎప్పుడూ చెప్పలేదు. మా నాన్నమ్మ సైడ్‌లో పూర్తి ట్రెడిషనల్ పిండి వంటలు వండేవాళ్లు. అమ్మ సైడ్ కొంచెం డిఫరెంట్. అలా నాకు అమ్మ వల్ల, నాన్నమ్మ వల్ల వంటలు చేయడం అలవాటైంది. ఇక నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి (తెలంగాణ) వచ్చాక పూర్తి భిన్నమైన వంటలు వండాల్సి వచ్చింది.అత్తింట్లోనే సకినాలు నేర్చుకున్నాఅత్తింటికి వచ్చాకే సకినాలు చేయడం నేర్చుకున్నాను. మా అత్తగారైతే అన్ని వంటలు బాగా వండుతావు... ఈ సకినాలు ఎందుకు చేయలేకపోతున్నావు... ఇవి కూడా చేయడం వస్తది అనేవారు. మా పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ సకినాలు నేర్పించారు. మామూలుగా సకినాలకు ఉల్లికారం బాగుంటుంది. మా తరుణ్ (హీరో–దర్శకుడు– రచయిత తరుణ్‌భాస్కర్) కాస్త కారంగా తింటాడు. ఉల్లికారం తనకి తగ్గట్టుగా చేస్తాను. అయితే మా అత్తవాళ్లు ఉప్పు, కారం నూరి దానిమీద పచ్చి నూనె వేసేవారు. నేను కాస్త చింతపండు వేస్తాను. పండగకి అరిసెలు కూడా వండుతాను. యాక్చువల్లీ మా అమ్మ బాగా వండేది. నాకు కుదిరేది కాదు. అత్తింటికి వచ్చాక కూడా సరిగ్గా వండలేక΄ోయేదాన్ని. అయితే నా ఫ్రెండ్ వాళ్ల అమ్మ నేర్పించారు. అప్పట్నుంచి అరిసెలు చక్కగా మెత్తగా వండటం నేర్చుకున్నాను. ఇట్లు... బొబ్బట్లుఒకప్పుడు బుట్టలు బుట్టలు పిండివంటలు వండేవాళ్లు. మా ఇంట్లో మా అమ్మమ్మ, నాన్నమ్మ అలా వండటం చూశా. కానీ ఇప్పుడు ఒకట్రెండు కేజీలు వండటానికే కష్టపడిపోతున్నాం. అప్పట్లో పిండి దంచి వండేవాళ్లు. ఇప్పుడు అన్నింటికీ మిషన్ ఉంది. అయినా చేయలేకపోతున్నాం. కానీ బయట కొనుక్కుని తింటే అంత సంతృప్తి ఉండదు. ఇంట్లో వండితే పండగకి ఇంట్లో వండాం అనే తృప్తి ఉంటుంది. కానీ ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావని తరుణ్ అంటుంటాడు. ఇప్పుడు తను కూడా బిజీ కాబట్టి హెల్ప్ చేసే వీలుండదు. కానీ నాకు పండగకి ఇంట్లో వండితేనే మనసుకి బాగుంటుంది. పోయిన గురువారం నాకు స్కూల్లో ఓ వర్క్‌షాప్ ఉంది. అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్లు గవర్నమెంట్ సపోర్ట్‌తో ఓ నాలుగైదు ప్రోగ్రామ్స్ చేయమన్నారు. ఇంకా ‘ఇట్లు బొబ్బట్లు’ అని పిల్లలు తయారు చేస్తుంటారు. వాళ్లు పిలిస్తే వెళ్లాను. మా నాన్నగారు మాతోనే ఉంటారు. ఆయనకు 90 ఏళ్లు. ఆయన్ని చూసుకుంటూ, బయట పనులు చూసుకుని, ఇంటికొచ్చాక పిండి వంటలు మొదలుపెట్టా. ఇలా ఇంట్లో వండుకుంటే ఫీల్‌గుడ్ హార్మోన్‌తో మనసు హాయిగా ఉంటుంది. అది మన హెల్త్‌కి మంచిది. సకినాలు ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్‌కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్‌కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్‌లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). స్ట్రెస్ ఉంటే తరుణ్ ‘చెఫ్’మా తరుణ్‌కి కూడా వంటలంటే ఇష్టం. నేను చేస్తుంటే వచ్చి చేస్తుంటాడు. నేనేదైనా బాగా వండితే, ఎలా వండావు అని అడిగి తెలుసుకుంటాడు. మా ఇంటి పక్కనే మాకు బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ ఉంది. అలాగే మా ఆఫీసు ఒకటి క్లోజ్ చేశాం... ఆ ఆఫీసులో ఉన్న ఇద్దరు పిల్లలు మా ఇంట్లో ఉంటారు. ఇక ఆ ఫ్యామిలీ, ఈ పిల్లలు అందరూ కలిసి చేస్తుంటాం. మా నాన్న కూడా సలహాలు ఇస్తుంటారు. మా తరుణ్‌కి చాలా స్ట్రెస్ ఉండిందనుకోండి... అప్పుడు వంట చేస్తాడు. నా వంటిల్లు మొత్తం హైజాక్ అయి΄ోతుంది (నవ్వుతూ). వాడి బర్త్‌డేకి వాడికి తెలియకుండా వంటల బుక్ రాసి, గిఫ్ట్‌గా ఇచ్చాను. ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్‌కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్‌కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్‌లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). -
భోగి వైభోగం
సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ భోగి. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. కర్రపుల్లలు, పిడకల దండలు, పాత సామాన్లు, కొబ్బరిమట్టలు... లాంటివాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. పాత వస్తువులతో పాటు, మనుషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆరోజు నుంచి కొత్త ఆయనంలోకి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచనగా భావిస్తారు. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ రోజున భోగి మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి తోటి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలికాచుకుంటూ కోలాహలంగా కనిపిస్తారు. సైన్సుపరంగా చెప్పాలంటే, చలికాలం వాతావరణంలో సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందడానికి అనువైన కాలం. అందువల్ల అందరూ ఏకకాలంలో భోగిమంటలు వేయడం వల్ల సూక్ష్మక్రిములన్నీ నశించిపోయి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అదేవిధంగా ఎప్పటెప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత సామానును ఏడాదికోసారి ఈ విధంగా వదిలించుకోవడం వల్ల దుమ్ము, ధూళి, ఎలుకలు, వాటిని తినడానికి పాములు చేరకుండా ఉంటాయనేది పెద్దల మాట. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగిపళ్లు పోసేటప్పుడు రేగు పళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడిటినీ కలిపి తలచుట్టూ మూడుసార్లు తిప్పి తలమీద పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగ ముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూలరేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల దృష్టి దోషం పోతుందని విశ్వాసం. పిల్లలు కూర్చునే పీటకింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరవాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క ఇస్తారు. మన పండుగల వెనుక సంప్రదాయంతోపాటు ఆరోగ్య కోణమూ దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగా వస్తున్నాయి.వస్తు వ్యామోహానికి మంటమనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు కాబట్టి భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. ఇక పోతే, భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదని దాని అర్థం. రేగుపండ్లు శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. రేగుపండ్లకున్నప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. మహా భక్తురాలైన గోదాదేవి భోగినాడే రంగనాథుని పతిగా పొందిందని ద్రవిడ వేదం చెబుతోంది. అందువల్ల విష్ణ్వాలయాలలో భోగిరోజు గోదా రంగనాథులకు కల్యాణం జరిపిస్తారు. – డి.వి.ఆర్. -
నేలకు చుక్కలు
ఒకప్పటి రోజుల్లో ఇంటి ఇల్లాలు ΄పొద్దున్నే లేవగానే చేసే పని,,, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయడం. వెసులుబాటును బట్టి, సందర్భాన్ని బట్టీ చిన్న ముగ్గెయ్యాలో... పెద్ద ముగ్గెయ్యాలో... చుక్కల ముగ్గు పెట్టాలో, గీతల ముగ్గు వెయ్యాలో ముందే అనుకునేవారు. ఇక సంక్రాంతి నెల వచ్చిందంటే పోటా పోటీలుగా ముగ్గులు వేసేవారు. పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా పెట్టేవాళ్లు. ముగ్గుల మీద కార్టూన్లు కూడా బాగానే పడేవి. ఇక ముగ్గులోకి దించటం, ముగ్గు΄పొయ్యటం లాంటి జాతీయాలు, ముత్యాల ముగ్గు లాంటి సినిమాల సంగతి సరేసరి. ముగ్గులు ఒకప్పుడు శుభాశుభ సంకేతాలుగా పనిచేసేవి. పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు రోజూ ఇల్లిల్లూ తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటిలోకి అడుగుపెట్టేవారు కాదు. వారే కాదు యాచకులు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్లేవారు కాదు! ఎందుకంటే, ఇంటి వాకిట్లో ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. ధనుర్మాసంలో ప్రతి ఇంటిముందు తెల్లవారుఝామున ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజించడం ఆచారం. ఎందుకంటే గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం.గొబ్బియల్లో... గొబ్బియల్లోముగ్గులకు ఎంత ప్రాధాన్యముందో, ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లు లేదా గొబ్బెమ్మలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు తెలుగువాళ్లు. ఎందుకంటే గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గుమధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని విశ్వాసం. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో.. అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు.గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. శ్రీ కృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో,, అలాగే గొబ్బిళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడుతారు.– డి.వి.ఆర్. భాస్కర్ -
వచ్చాడు బసవన్న
ఉదయం పూట చెట్ల కొమ్మలపై మంచుపూలు స్వాగతం పలుకుతుండగా సన్నాయి రాగం మధురంగా వినిపిస్తుంది. చేగంట మోగుతుండగా బసవన్న పాట వినిపిస్తుంది... ‘డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా/ఉరుకుతూ రారన్న రారన్న బసవన్నా/అమ్మవారికి దండం బెట్టు అయ్యగారికి దండం బెట్టు/రారా బసవన్నా... రారా బసవన్నా....’గంగిరెద్దులు ఊళ్లోకి అడుగు పెడితే ఊరికి సంక్రాంతి కళ సంపూర్ణంగా వచ్చినట్లే. విశేషం ఏమిటంటే... గంగిరెద్దుల ముందు పెద్దలు చిన్న పిల్లలై పోతారు. ‘దీవించు బసవన్నా’ అంటూ పిల్లలు పెద్దలై భక్తిపారవశ్యంతో మొక్కుతారు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో కళలు వెనక్కి పోతూ చరిత్రలో కలిసిపోయాయి. అయితే గంగిరెద్దుల ఆట అలా కాదు. కాలంతో పాటు నిలుస్తోంది. ‘ఇది మన కాలం ఆట’ అనిపిస్తోంది...కొత్త కాలానికి... కొత్త చరణాలుకాలంతో పాటు బసవన్న పాటలోకి కొత్త చరణాలు వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి ఆ పాటలో చరణాలు భాగం అవుతుంటాయి. ఒక ఊళ్లో... సంక్రాంతి సెలవులకు వచ్చిన పిల్లాడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది ఎన్నో సంవత్సరాల చేదు జ్ఞాపకం అయినా సరే, ఊళ్లో సంక్రాంతి రోజు ప్రతి ఇల్లు పండగ కళతో కళకళలాడినట్లు ఆ ఇల్లు కనిపించదు. జ్ఞాపకాల దుఃఖభారంతో కనిపిస్తుంది. ఆ భారం నుంచి ఆ ఇంటి వాళ్లను తప్పించడానికి బసవడు ఆడుతాడు పాడుతాడు. ‘నవ్వించు బసవన్న నవ్వించు/అమ్మ వారికి దండం పెట్టి నవ్వించు/అయ్యవారికి దండం పెట్టి నవ్వించు/ వాళ్లు హాయిగా ఉండేలా దీవించు..ఆ దీవెన ఎంతో పవర్‌పుల్.పండగపూట బసవన్న ఇంటిముందుకు రాగానే బియ్యం లేదా పాత బట్టలతో రావడం ఒక విషయం అయితే... భవిష్యత్ వాణి అడగడం, ఆశీర్వాదం ఒక మరో విషయం. గంగిరెద్దులాయన సంచిలో బియ్యం పోస్తు ‘మా అబ్బాయికి ఈ సంవత్సరమన్నా ఉద్యోగం వస్తుందా బసవన్నా’ అని అడుగుతుంది ఒక అమ్మ, ‘అవును’ అన్నట్లు తల ఆడిస్తుంది. ‘మా తల్లే’ అని కంటినిండా సంతోషంతో గంగిరెద్దు కాళ్లు మొక్కుతుంది ఆ అమ్మ. గంగిరెద్దుల ఆటలో విశేషం ఏమిటంటే, తెలుగు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ప్రత్యేతలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో గంగిరెద్దుల వారి పాటల్లో తత్వం ధ్వనిస్తుంది. సామాజిక విశ్లేషణ ఉంటుంది. ఉదా: ‘దేవా! ఏమి జరుగుతున్నది ప్రపంచం/అహో! ఏం చిత్రంగున్నదీ ప్రపంచం/ పసుపురాత తగ్గిపోయి....΄పౌడరు రాతలెక్కువాయె’...సంక్రాంతి రోజుల్లో బసవన్నల విన్యాసాలకు ప్రత్యేకంగా రంగస్థలం అక్కర్లేదు. ఊళ్లోకి అడుగుపెడితే... అణువణువూ ఆ కళకు రంగస్థలమే. మనసంతా ఉల్లాసమే. తరతరాల నుంచి ప్రతి తరానికి దివ్యమై అనుభవమే.– బోణం గణేష్, సాక్షి, అమరావతి -
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి!
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటాం. ఏడాదిలో తొలి పండుగ కూడా. మరి అలాంటి పండగకి ఘుమఘుమ లాడే పిండి వంటలు లేకపోతే ఎలా? కొత్త అల్లుళ్లు, అత్తారింటి నుంచి ఎంతో ఆశతో పుట్టింటికి వచ్చిన అమ్మాయిలతో సంక్రాంతి అంతా సరదా సరదాగా గడుస్తుంది. ఈ సంబరాల సంక్రాంతికోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొంగల్, బూందీ లడ్డూని సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.సంక్రాంతి అనగానే ముందుగానే గుర్తొచ్చే స్వీట్ పొంగల్. కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో పొంగల్ తయారు చేసిన బంధు మిత్రులకు పంచి పెడతారు.స్వీట్ పొంగల్స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కొద్దిగా, నెయ్యి-అరకప్పు.తయారీమొదటపెసరపప్పును నేతిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్లో కడిగిన బియ్యం, వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడా నీరు పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చేదాకా బెల్లాన్ని సన్నగా తరిగిఉంచుకోవాలి. యాలకుల పొడి చేసుకోవాలి. కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ మూత వచ్చాక, ఉడికిన అన్నం, పప్పులో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఒక కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఉడకనివ్వాలి. ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపి మరో పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తరువాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ.బూందీ లడ్డు కావలసిన పదార్థాలు: శనగ పిండి - 1 కేజీ, నీరు - తగినంత. నూనె - వేయించడానికి సరిపడాపాకం కోసం: బెల్లం - 1కేజీ,కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి - 1 టీస్పూన్, నిమ్మరసం - నాలుగు చుక్కలు, జీడిపప్పు ఎండు ద్రాక్ష, చిటికెడు పచ్చకర్పూరం తయారీ విధానం : ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా , మృదువుగా ఉండేలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి మూకుడు పెట్టి, సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక, బూందీ గరిటె సాయంతో ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. సన్నగా ముత్యాల్లా బూందీ నూనెలో పడుతుంది. పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేయకూడదు. ఇలా చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కొద్దికొద్దిగా వేసుకుంటూ సన్న మంటమీద బూందీ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం బూందీనీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం తయారీఒక కడాయిలో బెల్లం,నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం కరిగి కాస్త పాకం వచ్చాక యాలకులు, పచ్చ కర్పూరం వేసి కలపాలి. తీగ పాక వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది. పాకం వచ్చాక జీడిపప్పులు,కిస్మిస్తోపాటు ముందుగా రెడీ చేసుకున్న వేడి వేడి బూందీలను పాకంలో వేసి బాగా కలపండి. కాస్త వేడి వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి బూందీ లడ్డు రెడీ! -
ఆంధ్ర దంగల్‌కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్ విషయాలు
సంక్రాంతి పండుగలో డూడూ బసవన్నలు, రంగవల్లులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటలు ఎంత ప్రాధాన్యత కలిగినవో.. కోడి పందేలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.. గట్టిగా చెప్పాలంటే.. సంక్రాంతి సందడిలో కోడిపందేలే కీలంకంగా మారాయి కూడా.. ఆంధ్రలో సంక్రాంతికి కోడిపందేలకు మహిళలు సైతం వెళ్లి పందేలు కాస్తారంటే ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి ఆంధ్రా సంక్రాంతి కోడి పందేలకు నగరం నుంచి పందెం రాయుళ్లతో పాటు కోళ్లు కూడా వెళుతున్నాయి.. అంతే కాదు పందేల్లో ప్రత్యర్థి కోళ్లను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సారి పందేల బరిలోకి దిగేందుకు పాతబస్తీలోని కోళ్లు కాలుదువ్వుతున్నాయి. పాతబస్తీలో పందెపు కోళ్ల పెంపకంతోపాటు వాటికి బరిలో పడే విధంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. దీంతో ఇక్కడ పెంచుతున్న కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి నేపథ్యంలో దీనిపైనే ప్రత్యేక కథనం..– సాక్షి, సిటీబ్యూరోసంక్రాంతి కోడి పందేలకు ఇప్పటికే సర్వం సిద్ధమవుతోంది. బరిలో నిలిచే కోళ్లను ఇప్పటికే పందెంరాయుళ్లు జల్లెడపట్టేశారు. మరికొందరు ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఒక్కో కోడి ధర పదివేల నుంచి లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. జాతి, రంగును బట్టి కూడా ధరలను నిర్ణయిస్తారు. బరిలో దిగితే చావో రేవో తేల్చుకునేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. కొన్ని రకాల జాతి పుంజులైతే రూ.70 వేల నుంచి లక్ష వరకూ పలుకుతాయి.. అత్యంత ఖరీదుగా ఉండేవి సీతువ జాతి కోడి పుంజులు. ఆ తరువాతి స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకిపుంజు, పెట్టమారు రకాలున్నాయి. మెనూ చాలా ముఖ్యం.. అట్లపెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్ చేస్తారు. చికెన్, ఎండు చేప ముక్కలు ధాన్యంలో కలిపి ఇస్తారు. ఇవేకాకుండా జీడి పప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, మేకపాలు, వీటితోపాటు బలవర్ధకమైన పోషకాలు ఉండే ఆహారం తినిపిస్తారు. గంట్లు, చోళ్ళు, బియ్యం, రాగులు మినప, శనగపప్పు, గోధుమ మిశ్రమాన్ని రోజూ తినిపిస్తారు. దీంతో పాటు మధ్యాహ్నం మటన్ కీమా, సాయంత్రం స్నాక్స్‌గా జొన్నలు, కోడిగుడ్లు పెడతారు. ప్రతి మూడు గంటలకూ ఓ సారి జీడిపప్పు, బాదం పిస్తా మిశ్రమాన్ని వడ్డిస్తారు. పుంజులకు బలమైన ఆహారం ఇస్తూనే కఠినమైన వ్యాయామం శిక్షణ ఇస్తారు. ఎంపికే కీలకం... కోడిపుంజు ఎంపిక నుంచి దానికి ఇచ్చే ఆహారం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కోడిపందెం కోసం అన్ని రకాల జాతులూ పనికిరావు. ప్రత్యేకంగా సూచించిన వాటినే కోడిపందేలకు ఉపయోగిస్తారు. వీటిలో డేగా, నల్లకాకి, తెల్లపర్ల, నెమలి కాకి, కాకిడేగ, కత్తిరాయి, జుమర్, నూరీ, కగర్, డుమర్, యాకూద్, కాకిడేగ, అబ్రాస్, పచ్చ కాకి, సీతువా, అసీల్ ప్రధానమైనవి. సాధారణ కోడిపుంజుల కంటే పందెంకోళ్లు భిన్నంగా ఉంటాయి. 24 గంటలు వాటిపై ప్రత్యేక నిఘా పెడతారు. పోటీకి ప్రత్యేక శిక్షణ.. ప్రత్యర్థి దెబ్బలు తట్టుకుని సత్తా చాటేలా కోడి పుంజులకు తర్ఫీదు ఇస్తున్నారు. కోడి బలిష్టంగా తయారు కావడానికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. పిల్లగా ఉన్నప్పటి నుంచే పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రోజువారీ మెనూ, కసరత్తు, మాసాజ్తో వాటిని కుస్తీకి సిద్ధం చేస్తారు. నాలుగు నెలల శిక్షణా కాలాన్ని విభజించి పోటీకి తీర్చిదిద్దుతారు. ఉదయాన్నే వాటికి మౌత్ వాష్ చేయిస్తారు. ట్రైనర్ నోటిలో నీళ్లు పోసుకుని కోళ్ల ముఖంపై స్ప్రే చేస్తాడు. ఈ ప్రక్రియను కల్లె కొట్టడం అంటారు. పుంజు కండరాలు బిగుతుగా ఉండేందుకు వాకింగ్ చేయిస్తారు. వేడి నీళ్లు, స్పెషల్ షాంపూతో కోడికి స్నానం చేయిస్తారు. రెండు గంటల సమయం తర్వాత మళ్లీ శిక్షణ మొదలవుతుంది. మరో పుంజును బరిలో దించడం ద్వారా పోటీకి రెచ్చగొట్టేలా ట్రిక్స్ ఉపయోగిస్తారు. తద్వారా రెండు పుంజులూ పోటాపోటీగా పోరాడేలా చేస్తారు. ఈ పోటీ తర్వాత పుంజులకు మసాజ్ సెషన్ ఉంటుంది. అంతేకాదు.. తిన్నది ఒంటబట్టేవిధంగా కసరత్తులు ఉంటాయి. చెరువులో ఈత కొట్టిస్తారు. పందెం కోడి నిర్వహణకు నెలకు ఐదు నుంచి ఆరు వేల వరకూ ఖర్చు అవుతుంది భారీ డిమాండ్ ఉంది.. గత కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రాంతానికి మా కోళ్లు పెందేలకు తీసుకెళుతున్నారు. దీంతో భారీ డిమాండ్ ఏర్పడింది. అప్పటి నుంచి మేము పందెం కోళ్లను పెంచుతున్నాం.. వాటికి ప్రత్యేక ఆహారంతో పాటు, శిక్షణ కూడా ఇస్తాం. కోడి బ్రీడ్, జీవనశైలిని బట్టి వాటి ఆహారం, శిక్షణ ఉంటుంది. ఇప్పటికే పలువురు మా కోళ్లను కొనుగోలు చేశారు. ఆల్ బొగ్దాది అండ్ స్కోర్ ఆసీల్ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ నిర్వహిస్తున్నాము. దీని ద్వారా కోళ్లు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. – హబీబ్ జైన్, పందెం కోళ్ల ఫామ్ యజమాని . -
Christmas 2024 : బెస్ట్ నెయిల్ ఆర్ట్ డిజైన్స్..ఇదిగో ఇలా!
యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ భక్తులు క్రీస్తు పుట్టుకను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు అని విశ్వసిస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్ర సపరివారంగా సంబరాలు చేసుకుంటారు. పవిత్ర ఏసును కీర్తిస్తూ చర్చ్‌లలో ప్రార్థనలు చేస్తారు. క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ వచ్చిందంటే ఆ సంబరమే వేరు. విద్యుద్దీప కాంతులతో గృహాలను అలంకరించు కుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు, రకరకాల పిండివంటలతో ఉత్సాహంగా గడుపుతారు. గృహిణులు, కన్నెపిల్లలు అందంగా ముస్తాబవుతారు. మరి పవిత్ర క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ నెయిల్ పెయింట్ క్రియేటివ్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దేమా. మాసిమో (@రెయిన్‌మేకర్1973) ట్విటర్ ఖాతా షేర్ చేసిన వీడియో మీకోసం..Christmas nail art🎄 [📹 the_nail_mannn]pic.twitter.com/9ieWpRXlnn— Massimo (@Rainmaker1973) December 25, 2024 -
Christmas 2024 లోక రక్షకుడు
మానవాళి ముక్తికొరకు మనుజావతారుడైన దైవం...జగతిలో భీతి బాపేందుకు దిగివచ్చిన దైవ తనయుడు...సర్వలోకానికి శాంతి సందేశం..దివిలోనూ భువిలోనూ వేడుక...పరలోక దూతావళి పరవశించి పాడిన వేళప్రతి హృదిలో క్రిస్మస్ ఆనందం...జగతిలో పాపం నిండినప్పుడు ప్రేమతో కలిసి జీవించాల్సిన ధరణి వాసుల హృదయాలు అసూయ, ద్వేషంతో రగులుతున్నప్పుడు చీకటి జలధిలో మునిగిన వారికి, శృంఖలాల్లో మగ్గేవారికి మరణ ఛాయలో బతికే వారికి ఒక ఆశాకిరణంగా... అరుణోదయ కాంతిగా... విమోచకుడిగా... జగద్రక్షకుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభువు ఈ భువిపైకి అరుదెంచాడు. అదొక సుమనోహర ఘట్టం.. సర్వలోకాన్ని సంభ్రమాశ్చర్యాలతో విశేషంగా ఆకట్టుకున్న మధుర కావ్యం. తమను రక్షించే మెస్సయ్య కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న విశ్వాసుల్లో నింపిన అంతులేని ఆనందం వెరసి స్తోత్ర గీతంగా స్తుతి గానంగా మారిన వైనం.. అందుకు యూదా దేశంలోని బెత్లెహేము వేదిక అయింది.ఆ సమయంలో రాజైన హేరోదు యెరూషలేము రాజధానిగా రాజ్యమేలుతున్నాడు. యూదా ప్రజలంతా తమను విమోచించే మెస్సయ్యా కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఆ భాగ్యం కన్య అయిన మరియకు లభించింది. అప్పటికే గలిలయలోని నజరేతులో దావీదు వంశస్తుడైన యోసేపునకు మరియ ప్రదానం చేయబడింది. పరమ దేవుని ఆజ్ఞ మేరకు ప్రభువు దూత గబ్రియేలు ద్వారా ఈ శుభ వర్తమానం అందింది. ‘దయా ప్రాంప్తురాలా!’... అంటూ గబ్రియేలు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడే యవ్వన్రపాయంలో అడుగుపెడుతున్న మరియ ఎంతో భయపడింది.ఎందుకంటే ఆ కాలంలో దేవుడు కాని ఆయన దూతల దర్శనం అరుదుగా మారింది. ప్రవక్తలకు ప్రవచనాలు నిలిచి పొయాయి. నిశ్శబ్దకాలంగా చెప్పబడింది. అటువంటి తరుణంలో దేవుని దూత మరియ వద్దకు వచ్చి ‘భయపడకుము నీవు ధన్యురాలవు, దేవుని వలన నీవు కృప ΄పొందావు. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆయన సర్వోన్నతుని కుమారుడనబడతాడు. అతని రాజ్యము అంతము లేనిదై వుంటుందని’ పేర్కొన్నాడు. దూత మాటలు మరింత విస్మయానికి భయానికి గురిచేశాయి. ఇది దేవాది దేవుని నుంచి వచ్చిన పిలుపుగా మరియ తెలుసుకుంది. ‘అయ్యో నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఏలాగు సాధ్యం?’ అని అడిగింది.‘మరియా! భయపడకు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడని దేవదూత చెప్పిన మాటలను బట్టి ఇది దైవకార్యంగా గ్రహించి ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి దేవాది దేవుని తన గర్భంలో మోయడానికి సిద్ధపడింది. వాస్తవానికి వివాహం కాకుండా ఆ రోజుల్లో యూదా స్త్రీ గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపే ఆచారం ఉండేది. దేవుని దయ΄పొంది అంతులేని విశ్వాసంతో దేవుని ఆజ్ఞను శిరసావహించడానికి ముందుకు వచ్చింది కాబట్టే మరియ స్త్రీలందరి లో ధన్యురాలిగా కొనియాడబడింది.అయితే మరియ గర్భవతియైన సంగతి తెలుసుకున్న యోసేపు కలత చెందాడు. నీతిమంతుడు కాబట్టి ఆమెను నలుగురిలో నగుబాటు చేయకుండా రహస్యంగా విడనాడాలని నిశ్చయించుకున్నాడు. ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై మరియ గర్భము ధరించింది ఏ పురుషుని వలన కాదని పరిశుద్ధాత్మ వలన జరిగినదని మరియను చేర్చుకొనడానికి ఏమాత్రమూ సందేహపడవద్దని పుట్టబోవు శిశువునకు యేసు అని పేరు పెట్టాలని తన ప్రజలందరి పాపములనుండి ఆయనే రక్షిస్తాడని తెలుపడంతో యోసేపులో ఆవేదన తొలగిపొయింది. అంతేకాదు మరియ యేసుకు జన్మనిచ్చేవరకూ ఆమెను ముట్టకుండా జాగ్రత్త పడ్డాడు.ఇదే సమయంలో ఆరు నెలలకు ముందు మరొక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మరియ సమీప బంధువు రాలైన ఎలీసబెతు ఆమె భర్త జెకర్యా కురు వృద్ధులు. ఆ వయస్సులో దేవుడు వారికి సంతాన ప్రాంప్తి అనుగ్రహించాడు. దేవుని హస్తం వారికి తోడుగా వుండి ఒక మగ శిశువును దయచేసాడు. ఆ శిశువే తర్వాతి కాలంలో బాప్తీస్మం ఇచ్చు యోహానుగా పిలువబడి యేసు ప్రభు పరిచర్యకు ముందు ఆయన మార్గం సరళం చేసే సాధనమయ్యాడు.లేఖన ప్రవచనాలు నెరవేర్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు జననం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినా ఆయన ఆదిసంభూతుడు. ఆల్ఫా ఒమేగా ఆయనే. ఆదియు అంతమునై యున్నాడు. మొదటివాడు కడపటి వాడుగా ఉన్నవాడు. జగత్ పునాది వేయకముందే వున్న యేసు కాలం సంపూర్ణమైనప్పుడు సాతాను చెరలో చిక్కుకున్న మానవుడు పాపానికి బందీగా మారి దేవుని సన్నిధికి దూరంగా వెళుతున్న తరుణంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పతనమై ఏ నిరీక్షణ లేని సమయంలో నిత్య జీవమిచ్చి తిరిగి దేవునితో ఐక్యపర్చేందుకు భూమి మీద దేవుని కుమారుడిగా క్రీస్తు అవతరించాడు.యేసు పుట్టుకను క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మీకా, యెషయా ప్రవక్తలు ప్రవచించడం విశేషం. ‘బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏల బోవువాడు నీలో నుండి వచ్చును’ అని మీకా ప్రవచించగా ‘ఆలకించుడి కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును’ అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థం.యేసు పుట్టుక ఆవశ్యకత గూర్చి యెషయా వివరించాడు. ‘ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయం కలవారిని దృఢ పరచుటకు చెరలో నున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు’ అని యెషయా ప్రవక్త చెప్పిన లేఖనాలు తన రాక ద్వారా నిజమయ్యాయని యేసుప్రభు తనపరిచర్యలో చెప్పడం విశేషం.ప్రజా సంఖ్యలో రాయబడటానికి యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. రెండింటి మధ్య 90 మైళ్ళ దూరం. రెండు వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ప్రయాణ సాధనాలు లేనిరోజుల్లో నిండు చూలాలైన మరియను వెంటబెట్టుకొని బహు ప్రయాస కోర్చి చలికాలంలో బెత్లెహేము చేరుకున్నారు దంపతులు. జన సంఖ్య కోసం ఆ గ్రామం అప్పటికే క్రిక్కిరిసి పొయి ఉండటంతో ఎక్కడా స్థలం లేక ఓ పశువుల కొట్టమే వారికి అశ్రయమైంది. అర్థరాత్రి వేళలో క్రీస్తు జన్మించడంతో పశువుల తొట్టె క్రీస్తు పాన్పుగా మారిపొయింది. పరలోకాన్ని విడచివచ్చి పశువుల కొట్టంలో బాల యేసు పరుండాల్సి వచ్చింది. అతి సామాన్య కుటుంబంలో అతి సామాన్యంగా యేసు జన్మించాడు.యేసు పుట్టుక శుభవార్త మొదట తెలిసింది సామాన్యులకే. ఊరి వెలుపల ΄÷లంలో గొఱె<లను కాచుకుంటున్న పశు కాపరుల వద్దకు ప్రభువు దూత వచ్చి వారి మధ్య నిలచినప్పుడు ప్రభువు మహిమ వారిచుట్టూ ప్రకాశించగా వారెంతో భయపడ్డారు. అందుకు దూత ‘భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తీసుకు వచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అంటూ శిశువు ఆనవాలు తెలియజేయడం జరిగింది. అప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూతల సమూహం ‘సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక’ అంటూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. యేసు పుట్టుక కేవలం యూదా ప్రాంంతానికే పరిమితం కాలేదు. యేసుక్రీస్తు జన్మవిశేషం తెలియజేస్తూ ఆకాశంలో ఓ వింత తార వెలిసింది. దాన్ని చూసిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రోజును వెతుక్కుంటూ యెరూషలేము చేరుకున్నారు. తుదకు బెత్లెహేము లో పుట్టాడని తెలుసుకొని శిశువును పూజించి తాము తెచ్చిన బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలను సమర్పించి అత్యానందభరితులై తిరిగి వెళ్లారు. ఈ విధంగా యేసు పుట్టుక ఒక విశ్వ వేడుకగా మారింది.రక్షణ తెచ్చిన క్రిస్మస్ యేసు పుట్టుక సర్వమానవాళికి రక్షణ అందించిది. యేసు పుట్టుక పరమార్థమే అది. పాప పంకిలమైన మానవ జాతిని రక్షించడానికే యేసు జన్మించాడు. దేవుని ఆజ్ఞ మీరడం ద్వారా దేవుడు సృజించిన తొలి మానవుడు ఆదాము, అతని భార్య హవ్వ ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని తీసుకు వచ్చారు. ఆ పాపానికి ప్రతిఫలంగా నర జాతి మొత్తానికి మరణం సం్రపాప్తించింది. అయితే ఆ శాపాన్ని పాపాన్ని కొట్టివేసి తద్వారా వచ్చిన మరణభయాన్ని తొలగించేందుకు క్రీస్తు అందించిన శిలువ యాగం ద్వారా రక్షణ ΄పొంది నిత్యజీవానికి వారసులై సదా కాలం క్రీస్తుతో నివసించే భాగ్యాన్ని క్రిస్మస్ మనకు అందించింది. క్రిస్మస్ ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి రక్షణార్థం పాపపరిహారార్థ బలిగా శిలువపై తనను తాను సమర్పించుకున్నాడు. యేసు శిలువలో కార్చిన రక్తం ద్వారా పాప విమోచన. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మానవుడు దేవునితో పరలోకంలో ఉండే భాగ్యం అందించడానికి దేవుడు మానవుడిగా అవతరించాల్సి వచ్చింది. అందుకు క్రీస్తు పుట్టుక వేదికగా మారింది. అప్పుడు ఈ ధరిత్రి మీద మానవునిగా జన్మించిన యేసు ఇప్పుడూ నీవు ఆహ్వానిస్తే నీ హృదిలో ఆత్మరూపుడై వసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో నిత్యసంతోషం నింపుతాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సంతోషం... సమాధానం తెచ్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. క్రీస్తు పుట్టుక సమయంలో కురేనియ, సిరియా దేశమునకు అధిపతి అయిన కైసరు ఔగుస్తు మొదటి ప్రజాసంఖ్య ప్రకటించాడు. ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక అంశాలతో తెలియ చేయబడిన క్రీస్తు జననం ఒక కల్పితకథ కాదు ఒక చారిత్రాత్మక సత్యం. ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు. క్రీస్తుకు ముందు... క్రీస్తు తర్వాతగా కాలం రెండుగా విభజింపబడటయే ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ.– బందెల స్టెర్జి రాజన్ సీనియర్ పాత్రికేయులు -
ప్రభువునందు ఆనందించుటే ఆత్మసంబంధ పండుగ
‘ఒకని జన్మ దినము కంటె మరణ దినమే మేలు’ అన్నది దేవుని దృష్టికోణం. ఉన్నతంగా చెప్పబడిన ఈ మాట అందరి గూర్చి అయినా, మరి ముఖ్యంగా, ఒక్క క్రీస్తును గురించి మాత్రమే ఇది చెప్పబడిందంటూ బైబిలు పండితులు వ్యాఖ్యానిస్తుంటారు. సువార్తలు రెండు మూడు లేవు. నాలుగైదు లేనే లేవు. ఒక్కటే సువార్త. అదే క్రీస్తు మరణ సువార్త. ఒక్క క్రీస్తు మరణాన్ని సువార్తగా కాకుండా ఇక వేరే ఏది సువార్తగా ప్రకటించిన వాడు శాపగ్రస్తుడని బైబిలు చాలా ఖండితంగా చెప్పుటను ప్రతి ఒక్కరూ మనస్సు పెట్టి అలోచించాలి. (గలతీ 1:6–10 ).‘ఆయన భుజములపై రాజ్య భారముండును’,‘నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది’ అను భవిష్యత్ ప్రవచనాలు క్రీస్తు నందు క్రీస్తు సంఘమనే రాజ్య స్థాపన ద్వారా నెరవేర్చబడ్డాయి. అపొస్తలుల బోధకు కట్టుబడి విధేయంగా దానికి తలవంచే క్రీస్తు ప్రభువు సంఘాలలో ఆత్మసంబంధిత పండుగ వాతావరణం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది.అపొస్తలుడైన ΄ûలు బోధ ప్రకారంగా ‘ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి. మరల చెప్పుదును. ఆనందించుడి’(ఫిలిప్పీ 4:4). ఒకరు ఇలా ఎల్లప్పుడూ క్రీస్తు నందు ఆనందిస్తే అతనికి నిత్యమూ పండుగే. క్రీస్తు సువార్త విని లోబడి ఒక ΄ాపి రక్షించబడితే ఇలా మరణంలో నుండి జీవములోనికి దాటితే పరలోకంలో గొప్ప పండుగ వాతావరణం నెలకొంటుంది. భూలోకం వైపు తొంగి చూస్తూ దేవ దూతలు, దేవ దూతలు సమక్షంలో దేవదూతలే చేసుకోనే పండుగ అది. నిజానికి క్రీస్తు మరణ సత్య సువార్తే ఇంతటి గొప్ప పండుగ వాతావరణాన్ని ఇక్కడ అక్కడ అంతటా సృష్టించ గలదు. సత్య సువార్త అంతటి శక్తిమంతమైనది మరి. ఎందుకంటే ఇది మనిషియోచన వలన కలిగినది కాదు. సమాజంగా కూడి క్రీస్తు పునరుత్థాన దినమనే ప్రభువు దినమును పరిశుద్ధ దిన ఆచారంగా ఎంచి క్రీస్తు ద్వారా దేవున్ని ఆరాధిస్తూ ఇలా ఆత్మసంబంధంగా ఆనందిస్తే అదే సంఘమునకు అసలు సిసలైన పండుగ వాతావరణం. దీన్నే ఇశ్రాయేలీయుల రాజైన క్రీస్తు ప్రభువు నందు ఆనందించడంగా చెప్పవచ్చు. ఇది పండుగ కంటే మించినది. వారమునకు ప్రప్రథమ దినములైన ఒక సంవత్సరంలోని యాభై రెండు ఆదివారాలు ప్రభువు నందు ఆనందించగలిగితే అవి క్రైస్తవులకు ఎప్పుడూ పండుగ దినములే.ప్రతి ఆదివారం క్రీస్తు ద్వారా దేవున్ని ఆరాధించడం దేవుని రాజ్యానికి ఆయన నీతికి ప్రప్రథమ స్థానం ఇవ్వడంగా, వాటిని మొదట వెదకడంగా గ్రంథం చెబుతుంది. దేవుడు ఘనపరచి గొప్ప చేసిన ఉపదేశ క్రమాన్ని అనుసరించి చూస్తే,అపొస్తలుల బోధ ప్రకారంగా క్రైస్తవులు పరిశుద్ధ లేఖనాలను మీరి తమకు నచ్చినట్టుగా ఏ పండుగలు చేయకూడదు. దేవుడు చేయమని అజ్ఞాపించి చెప్పిన పండుగలు అన్నీ ΄ాత నిబంధనలోనే ఉన్నాయి. ఇప్పుడైతే, భౌతిక సంబంధ ఆచార వ్యవహారాలతో ముడిపడిన పండుగలు చేసి దేవుని ఏనాడూ ఘనపరచలేరు.ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన ఏడు పండుగలు అన్నీ కొత్తనిబంధన ఆత్మ సంబంధ ఆరాధనలోకి వచ్చి చేరి ఇలా విలీనం అయ్యి అందు ఒద్దికగా నిండుగా నిక్షిప్తమవడం విశేషం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ద్వారా అద్వితీయ సత్యదేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటను మించిన పరిశుద్ధ దినం, ఇట్టి పండుగ వాతావరణం మరొకటి ఎక్కడా కానరాదు. మనోనేత్రాలు వెలిగించబడితేనే ఈ సత్యం అర్థమవుతుంది. భౌతికపరమైన పండుగలు ఆచార వ్యవహారాలు అన్నీ క్రీస్తునందు సిలువలో కొట్టివేయబడ్డాయి. మృత్యుంజయుడైన క్రీస్తును బట్టి నూతన సృష్టి అనబడే క్రైస్తవులకు సంవత్సరంలోని ప్రతి ఒక్క ఆదివారం ఆత్మ సంబంధ పండుగ దినమే.అపొస్తలులు, ఆదిమ సంఘము వారు ఆత్మ సంబంధులుగా సత్య సంబంధులుగా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించారు తప్ప వారు ఎలాంటి పండుగలు చేయలేదు. వారి బోధలు, వారి వారి నడతలు మనకు ఎప్పుడూ శిరోధార్యమే అనుటలో ఎలాంటి సందేహం లేదు. క్రొత్త నిబంధన పూర్తిగా ఆత్మ సంబంధమైనది. దాన్ని అలాగే మనం ఆచరించబద్దులము. – జేతమ్ -
Christmas 2024 : మైదాలేకుండానే మీ కిష్టమైన కేక్, రెసిపీలు
క్యాలెండర్ చివరికి వచ్చేశాం. హాయ్ చెప్పడానికి క్రిస్మస్ వస్తోంది. కేక్ మీదకు మనసుపోతుంది. బేకరీ కేక్లన్నీ మైదా కేక్‌లే. ఆరోగ్యంగా ఏమీ తినలేమా? పండగ కోసం కొంచెం కష్టపడదాం. మన వంటిల్లు క్రిస్మస్కి సిద్ధమైంది . మీరూ రెడీనా.సెమోలినా కోకోనట్ కేక్ కావలసినవి: బొంబాయి రవ్వ పావు కేజీ; కొబ్బరి తురుము – 125 గ్రాములు; చక్కెర పొడి– 150 గ్రాములు; బటర్– 125 గ్రాములు; పెరుగు– 125 గ్రాములు; పాలు – 125 ఎం.ఎల్; వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్; బేకింగ్ సౌడర్– టీ స్పూన్; బేకింగ్ సోడా– అర టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; బటర్– టీ స్పూన్; బాదం పప్పు – గుప్పెడు (సన్నగా తరగాలి).షుగర్ సిరప్ కోసం: చక్కెర – 125 గ్రాములు; నీరు – 200 ఎంఎల్; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; రోజ్ ఎసెన్స్ – 2 చుక్కలు.తయారీ: మొదట షుగర్ సిరప్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం నాన్‌స్టిక్ పెనంలో చక్కెర, నీరు, దాల్చిన చెక్క, రోజ్ ఎసెన్స్ వేసి కలిపి గరిటెతో కలుపుతూ సన్న మంట మీద వేడి చేయాలి. 8 నుంచి పది నిమిషాలకు మిశ్రమం తీగపాకం వస్తుంది. అప్పుడు స్టవ్ మీద నుంచి దించేయాలి ∙కేక్ ట్రేకి టీ స్పూన్ బటర్ రాయాలి. తర్వాత దళసరి కాగితాన్ని పరిచి సిద్ధంగా ఉంచుకోవాలి ∙ఒవెన్‌ని హీట్ చేయాలి ∙కేక్ తయారీ కోసం తీసుకున్న పదార్థాలలో బాదం పలుకులు మినహా మిలిగిన అన్నింటినీ ఒక పాత్రలో వేసి బీటర్‌తో బాగా చిలకాలి. నురగ వచ్చే వరకు చిలికిన తరవాత మిశ్రమాన్ని ట్రేలో పోసి ఒవెన్‌లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 40 నిమిషాల సేపు ఉంచాలి.∙ఒవెన్‌లో నుంచి కేక్‌ను బయటకు తీసిన తరవాత ముందుగా కలిపి పెట్టిన షుగర్ సిరప్‌ని కేక్ అంతటికీ సమంగా పట్టేలాగ పోసి (దాల్చిన చెక్కను తీసేయాలి), బాదం పలుకులను కూడా చల్లి ట్రేని కదిలించకుండా పక్కన ఉంచాలి. కేక్ చల్లారేటప్పటికి షుగర్ సిరప్ చక్కగా పడుతుంది. చల్లారిన తర్వాత చాకు సహాయంతో కేక్‌ను ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి.కావలసినవి: మెత్తటి ఖర్జూరాలు– 300 గ్రాములు; వాల్నట్ –30 గ్రాములు; పిస్తా– 40 గ్రాములు (రోస్టెడ్, సాల్టెడ్ పిస్తా); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పు– 30 గ్రాములు (సన్నగా తరగాలి); యాలకుల ΄ పొడి– పావు టీ స్పూన్; గసగసాలు – టేబుల్ స్పూన్.ఖజూర్ బర్ఫీ తయారీ: ∙ఖర్జూరాల నుంచి గింజలు తొలగించాలి. వాల్నట్స్ని సన్నగా తరగాలి. పిస్తాను కూడా తరగాలి ∙ఖర్జూరాలను మిక్సీ బ్లెండర్లో వేసి గుజ్జుగా చేయాలి ∙పెనం వేడి చేసి అందులో నెయ్యి, బాదం, వాల్నట్, పిస్తా పలుకులు వేసి సన్న మంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. వేగిన గింజలను ఒక ప్లేట్లోకి తీసుకుని అదే పెనంలో మిగిలిన నెయ్యిలో యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్ వేసి కలుపుతూ వేయించాలి. ఖర్జూరం పేస్ట్ మృదువుగా మారిన తరవాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టిన గింజలను వేసి కలిపి దించేయాలి ఒక దళసరి పేపర్ మీద ఖర్జూర మిశ్రమాన్ని వేసి సమంగా పరిచి పైన గసగసాలను పలుచగా చల్లి పేపర్‌ను రోల్ చేసి మనకు కావల్సిన సైజ్‌లో కట్ చేసుకుంటే ఖజూర్ బర్ఫీ రెడీ. ఇవి మూడు వారాల వరకు నిల్వ ఉంటాయి. వీటిని వేడి తగ్గిన తర్వాత తినవచ్చు, చల్లగా తినాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. -
సంక్రాంతి వస్తోంది! ఈ వేడుకల గురించి తెలుసా?
సంక్రాంతి పండుగ వస్తోందంటే గ్రామాలకు ప్రయాణం మొదలవుతుంది. సొంతూరికి వెళ్లే వాళ్ల ఆనందం అన్నింటికంటే మిన్న. అలాగే హైదరాబాద్‌వాసులు శిల్పారామంలో నిర్వహించే వేడుకలతో ఆనందిస్తారు. గాలిపటాలతో గాల్లో తేలినట్లు సంతోషిస్తారు. ఇది మన తెలుగు సంక్రాంతి. ఇక తమిళులు సంక్రాంతిని దేశానికే తలమానికం అన్నట్లు నిర్వహించుకుంటారు. కళారంగం ఉత్సాహంతో ఉరకలేస్తుంది. దేశంలో ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లంతా సొంత రాష్ట్రానికి వస్తారు. మైలాపోర్ వేడుకల్లో పాల్గొని సంతోషాన్ని మది నిండా నింపుకుని తిరిగి వెళ్తారు. మైలాపోర్ వేడుకలుతెలుగువాళ్లలాగే తమిళనాడుకి సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి వేడుకల వాతావరణం నెలకొంటుంది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఏటా ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. మైలాపోర్లో జరుగుతుంది కాబట్టి దీనికి మైలా΄ోర్ ఫెస్టివల్ అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఏటా సంక్రాంతి ముందు జరిగే ఈ వేడుక వచ్చే ఏడాది జనవరి తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు జరుగుతాయి. గడచిన 72 ఏళ్లుగా జరుగుతున్న ఈ వేడుకల్లో 30కి పైగా కళలను ప్రదర్శిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మూడు వందలకు పైగా కళాకారులు పాల్గొంటారు. నాట్యప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, సాము గారడీ నుంచి జానపద కళారూపాల ప్రదర్శనలతో నగరం కళకళలాడుతుంది. అన్నింటిలోకి ముగ్గుల పోటీ ప్రత్యేకం. ముగ్గును కోలామ్ అంటారు. ఇందులో మహిళలతోపాటుబాలికలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇంకా ఏమేమి ఉంటాయి?ప్రాచీన కపాలి ఆలయానికి హెరిటేజ్ వాక్, తె΄్పోత్సవం, మాడవీథుల్లో పర్యటనలు ఆహ్లాదకరంగా ఉంటాయి. సైక్లింగ్ టూర్లో టీనేజ్ నుంచి యువకులు ఉత్సాహంగా కనిపిస్తారు. బోట్ షికార్, ఫుడ్ వాక్, చిల్డ్రన్ టూర్... ఇలా థీమ్ ప్రకారం వేడుకలు సాగుతాయి. సంక్రాంతి సెలవుల్లో ఈ మైలాపోర్ ఫెస్టివల్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. -
Cake Mixing: కేక్స్ మిక్స్..టేస్ట్ అదుర్స్..
డిసెంబర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం నూతనోత్సాహాన్ని పుంజుకుంటుంది. ఒకవైపు ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ వేడుకలు, మరోవైపు క్రిస్మస్ సంబరాలతో నగరం అంతా పార్టీ మూడ్‌లో ఉంటుంది. ఇందులో భాగంగా నగరంలో ఇప్పటికే విభిన్న వేదికల్లో వినోద కార్యక్రమాలు, వేడుకలు మొదలయ్యాయి. కల్చరల్ డైవర్సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్‌లో సర్వమత సమ్మేళనంలో భాగంగా క్రిస్మస్ వేడుకలు సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ మిక్సింగ్ సందడి నెలకొంది. నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇయర్ ఎండ్ వేడుకలకు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించే కేక్ మిక్సింగ్పైనే ఈ కథనం.. నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా కేక్ మిక్సింగ్.. ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో క్రిస్మస్ ఫ్రీ ఈవెంట్స్‌లో భాగంగా కేక్ మిక్సింగ్ నిర్వహించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కేక్ మిక్సింగ్‌లో పాల్గొంటూ వినూత్న సంస్కృతికి నాంది పలుకుతున్నారు. నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్స్, రిసార్ట్స్, ఎన్జీవోలు, విద్యా వ్యాపార సంస్థల్లో, ఇతర ఎంటర్టైన్మెంట్ వేదికలుగా కేక్ మిక్సింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలో పలువురు సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నోవోటెల్ హైదరాబాద్, గోల్కొండ హోటల్, తాజ్ కృష్ణ, తాజ్ వివంత వంటి ఫైవ్ స్టార్ హోటల్స్‌తో పాటు ఇతర వేదికల్లో కేక్ మిక్సింగ్ వేడుకలు మొదలై కొనసాగుతూనే ఉన్నాయి.సెలిబ్రిటీల సందడి.. నగర జీవన శైలిలో భాగమైన ఈ కార్యక్రమాలకు సెలిబ్రిటీల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. నిర్వాహకులు సైతం పలువురు సెలిబ్రిటీలు, సామాజికవేత్తలు, ఐకానిక్ వ్యక్తులను ఈ కేక్ మిక్సింగ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తూ నగరవాసులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది నగర వేదికగా ఇప్పటికే జరిగిన పలు వేడుకల్లో సినీ తారలు, సింగర్లు, స్పోర్ట్స్ స్టార్స్ పాల్గొని సందడి చేశారు.వివిధ రకాల డ్రై ఫ్రూట్స్.. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా, కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ ప్రధానంగా నిర్వహిస్తారు. ఈ కేక్ మిక్సింగ్‌లో దాదాపు 25 రకాల డ్రై ఫ్రూట్స్, పలు రకాల స్పైసెస్, రం, బ్రాందీ, విస్కీ లాంటి లిక్కర్ కలుపుతారు. ఇందులో వాడే పదార్థాల మిశ్రమం మంచి పోషకాలతో ఆరోగ్య ప్రదాయిని గానూ ఉంటున్నాయి. ఈ మిశ్రమాన్నంతా కొద్ది రోజులపాటు సోక్ (పులియ బెట్టడం) చేసి ఆ తరువాత ఫ్లమ్ కేక్ తయారు చేస్తారు. పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా తయారు చేసిన ఈ ఫ్లమ్ కేక్ క్రిస్మస్ వేడుకల్లో అందరికీ ఫేవరెట్. కేక్ మిక్సింగ్‌లో చిన్నలు, పెద్దలు అందరూ కలిసి లిక్కర్‌తో డ్రై ఫ్రూట్స్ కలుపుతూ ఎంజాయ్ చేస్తారు.గ్రేప్ స్టాంపింగ్.. కేక్ మిక్సింగ్‌తో పాటు ఈ మధ్యకాలంలో గ్రేప్ స్టాంపింగ్ విరివిగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రేప్ స్టాంపింగ్‌లో ఒక పెద్ద చెక్క బుట్టలో అధిక మొత్తంలో ద్రాక్ష పళ్లను వేసి సామూహికంగా వాటిని తొక్కుతూ ద్రాక్ష రసాన్ని తీసి దాని నుండి వైన్ తయారు చేస్తారు. ఈ వైన్ కూడా క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన అంశమే ఇలాంటి సాంస్కృతిక వినోదపరమైన కార్యక్రమాలకు నగరంలోని యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ నెలలో వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకొని అందులో పాలుపంచుకుంటున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. నూతనోత్సాహం కోసం.. కేక్ మిక్సింగ్ కూడా మన జీవన పరమార్థాన్ని తెలిపే ఓ వేడుకే. ఈ కేక్ మిక్సింగ్ లో కలిపే డ్రై ఫ్రూట్స్ నట్స్ సుగంధద్రవ్యాల లాగే మన అందరి జీవితాలు కలుపుగోలుగా అందంగా ఉండాలని అర్థం. అంతేకాకుండా ప్రతి ఏడాదీ నూతనోత్సాహాన్ని అందించడానికి ముందస్తు వేడుక. నగరంలో ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతికి ఆదరణ బాగా పెరిగింది. – ఎస్పీ శైలజ, ప్రముఖ సింగర్, (ఈ మధ్య జరిగిన ఓ కేక్ మిక్సింగ్ వేడుకలో భాగంగా). -
గురునానక్ జయంతి: ప్రత్యేక ప్రార్థనలు, ప్రసాదం రెసిపీ షేర్ చేసిన బాలీవుడ్ నటి
కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి పర్వదినాన్ని బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ జరుపుకుంది. ఈ శుభ సందర్భంగా స్వయంగా ఇంట్లోనే కడ ప్రసాదం(హల్వా) తయారు చేసి గురుద్వారాలో ప్రార్థనలు, నివేదన అనంతరం పంచిపెట్టింది. కుటుంబంలో తరతరాలుగా కడ ప్రసాదం తయారు చేస్తున్న వైనాన్ని వివరించి, ఈ రెసిపీ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గురుద్వారాలో పూజల తరువాత మీడియాకు ప్రసాదాన్ని పంచిపెట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.గురునానక్ జయంతి సందర్భంగా ప్రసాదం హల్వాను ఎలా తయారు చేయాలో దశలవారీగా నిమ్రత్ కౌర్ వెల్లడించింది. ఈ ప్రసాదం తయారు చేయడం తన తల్లి దగ్గరనుంచి నేర్చుకున్నట్టు తెలిపింది. అలాగే తన తాతగారు చాలా ఏళ్లు గురుద్వారాలో హల్వా తయారు చేసేవారనీ, ఆయన్నుంచి అమ్మ , అమ్మనుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది.కాగా బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ అభిషేక్ బచ్చన్‌తో ఎఫైర్ ఉందనే పుకార్ల మధ్య గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మధ్య సమస్యలకు నిమ్రత్ కౌర్‌తో ఎఫైర్ ఒక కారణమని ఊహాగానాలు జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఊహిస్తున్నాయి. ఈ వివాదాలను, ఆరోపణల ప్రభావం తనమీద ఏమాత్రం పడకుండా నిమ్రత్ కౌర్ తన పని తాను చేసుకుపోతోంది. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis); View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) -
కనులపండువగా అమ్మవారి ఒడిబియ్యం మహోత్సవాలు
భివండీ: భివండీ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగ పురస్కరించుకొని శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి అమ్మవారికి ఒడి బియ్యం మహోత్సవ కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరాన్ని విద్యుత్ దీపాలతో పాటు వివిధ రంగుల పూలతో వైభంగా ముస్తాబు చేశారు. పద్మశాలీయుల ఆడపడుచైన అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమాలలో పద్మశాలీ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు దేవస్థాన ప్రధాన అర్చకుడు ప్రసాద్ స్వామి నేతృత్వంలో జరిగాయి. శనివారం ఉదయం స్వామి వారికి నిత్య పూజలతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఒడి బియ్యం కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వేంకటేశ్వర స్వామి అమ్మవారిని శేషవాహనంపై మందిరం నుంచి ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపు పద్మనగర్ పురఃవీధులు మహాముని చౌక్, దత్తమందిర్, రామ్ మందిర్, గీతా మందిర్, బాజీ మార్కెట్, వరాలదేవి రోడ్ నుంచి తిరిగి రాత్రి 10 గంటల వరకు మందిరాన్ని చేరుకుంది. ఊరేగింపులో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వీధివీధిన స్వామి వారికి భక్తులు బ్రహ్మరథం పట్టారు. దర్శనం నిమిత్తం బారులు తీరి హారతులు, కానుకలు సమరి్పంచుకున్నారు. సిద్ధివినాయక్ భజన మండలి, గీతా భజన మండలి వారు ఆలకించిన అన్నమయ్య కీర్తనలతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. రాత్రి నిర్వహించిన అన్నదానంలో సుమారు ఐదు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారని దేవస్థాన కమిటీ సభ్యుడు దావత్ కైలాస్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గౌడ లింగం, బైరి జనార్దన్, డాక్టర్ పాము మనోహర్, వడిగొప్పుల శంకర్ పంతులు, బాలె శ్రీనివాస్, అవధూత బలరామ్, భీమనాథిని శివప్రసాద్, బూర్ల మనోజ్‌తో పాటు వందల సంఖ్యలో పద్మశాలీ కులబాంధవులు భక్తులు పాల్గొని సేవలందించారు. ఇదీ చదవండి : వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు -
వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు
సోలాపూర్: దేశవ్యాప్తంగా అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి పర్వ దినోత్సవాన్ని సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆవు లేగ దూడల ధూళి సంప్రదాయ కార్యక్రమంతో గోపూజలతో ప్రారంభమైన దీపావళి ధన త్రయోదశి, నరక త్రయోదశి తదుపరి దీపావళి పర్వదినానికి ఆకర్షణీయమైన లక్ష్మీ పూజలు శుక్రవారం రాత్రులతోపాటు శనివారం వేకువ జాము నుంచి తెల్లవారే వరకు వ్యాపారులు కోలాహలంగా జరుపుకున్నారు. వ్యాపారులు లక్ష్మీ పూజలను తమ తమ షాపులలో సాక్షాత్తు లక్ష్మీదేవిని హోటల్లో ప్రతిష్టించి సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి వ్యాపారాలు సజావుగా లాభాల బాటలో కొనసాగాలని అలాగే ఆరోగ్యం, అందరి శ్రేయస్సు కోసం ప్రారి్థస్తుంటారు. పూజా కార్యక్రమాలు పిదప బాణసంచా టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. వీధి వీధిలో టపాకాయల మోత మోగింది. ఈ సందర్భంగా గత మూడు నాలుగు రోజులుగా పట్టణం, జిల్లా వ్యాపార కూడళ్లు పూజాసామగ్రి, అలంకరణ వస్తువుల విక్రయాలతో కిటకిటలాడాయి. ఇదీ చదవండి: అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి! -
పరమ పవిత్రం.. కార్తీక మాస విశేషాలివిగో
దీపావళి సంబరాలు ముగిశాయి. ఆ వెంటనే పవిత్ర కార్తీక మాసం హడావిడి మొదలైంది. శివ కేశవుల భక్తులంతా ఏంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయమిది. ఈ పుణ్య మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1న సూర్యోదయ సమయంలో అమావాస్య ఘడియలు ఉన్నందున ఆ మరుసటి రోజు నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలనేది పండితుల మాట. శివనామస్మారణలతో ఆలయాలన్నీ మార్మోగుతాయి. వేకువ ఝామునే చన్నీటి స్నానాలు, దీపారాధన, శివరాధనలో భక్తులు పరవశిస్తారు.కార్తీకమాసం అంతా ధూప దీపాలు, శివనామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శివాలయంలోనో మరేదైనా దీపం వెలగించడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. కనీసం ఇంట్లో తులసికోటముందు దీపాలు వెలిగించినా పుణ్యం దక్కుతుందని భావిస్తారు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు.ప్రత్యేకంగా మహిళలు నిష్టగా పూజలు చేస్తారు. దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీకపురాణ పఠనం చేస్తూ శివకేశవులిద్దరనీ ఆరాధిస్తారు. ఈ పురాణంలో శివారాధన, దీపారాధన వైశిష్ట్యం, ఫలితాల గురించి విపులంగా ఉంటుంది. అలాగే శక్తి కొలదీ దానం చేయం, సాత్విక జీవనం లాంటి విషయాలతో పాటు, ఆరిపోతున్న దీపపు ఒత్తిని సరిచేసి, దీపాన్ని వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతుంది. నిష్టగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, ఉసిరి దీపాలు, దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెడతారని చెబుతుంది. అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు నాగుల చవితి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశితోపాటు, కార్తీకపూర్ణిమ ( నవంబర్ 15వతేదీ శుక్రవారం) రోజులు అతిపవిత్రమైనవి భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం. అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి సమీపంలోని నదులు,చెరువులలో వదిలే దృశ్యాలు కన్నుల పండువలా ఉంటాయి. అలాగే జ్వాలాతోరణం ఉత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.అయ్యప్ప దీక్షలు, పడిపూజలుకార్తీక మాసం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం. అయ్యప్పదీక్షలు కార్తీక మాసం నుంచి,మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల ధారణ చేస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తారు. స్వామి చింతనలో, సాత్విక జీవనాన్ని పాటిస్తారు. తెల్లవారుజామునే చన్నీటి స్నానం భజనలు, పూజలతో గడుపుతారు. దిండ్లు పాదరక్షలు కూడా వాడకుండా నేలపై పడుకుంటారు. బ్రాహ్మచర్యాన్ని పాటిస్తూ మండలం అనగా 41రోజులు పాటు ఈ నియమాలను భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తారు. సంక్రాంతిలో రోజు మకర జ్యోతి దర్శనంతో దీక్షలను విరమిస్తారు. -
Diwali 2024 పలు కారణాల పండగ
ఎంతో విస్తృతీ, వైవిధ్యం గల భారతదేశంలో, భిన్నత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి దీపావళి పండగ ఒక ప్రతీక. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు. కానీ ఈ పండగ ప్రాశస్త్యానికీ, ప్రాముఖ్యతకూ వెనక కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.దక్షిణ భారతంలో నరకాసుర వధ కథ ప్రసిద్ధం. సత్యభామా సహితుడై, శ్రీకృష్ణుడు ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకుడిని సంహరించాడు. కనుక అది నరక చతుర్దశి. ఆ మరునాటి విజయోత్సవ దినం దీపావళి. కానీ ఉత్తర భారతంలో ఈ కథ తెలిసిన వారే అరుదు. ఉత్తర భారతంలో, రావణ సంహారం జరిపి రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ దినంగా దీపావళి అమావాస్యకు గుర్తింపు. అందుకే ఆరోజు మహోత్సవం. అంతటి మహోత్సవం గనక చిన్న దీపావళి (చతుర్దశి), పెద్ద దీపావళి అని రెండు రోజులు జరుగుతుంది. తూర్పున వంగ దేశంలో దీపావళి అమావాస్య... కాళీ పూజ పర్వదినం. పశ్చిమాన గుజరాత్ వాసులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతం. అమావాస్య ముగుస్తూనే నూతన సంవత్సరాది. రాజస్థాన్‌లో చాలా ప్రాంతాలలో దీపావళి అమావాస్య నాడే ఉగాది. ఆరోజు వైభవంగా లక్ష్మీ పూజ చేసి, కొత్త పద్దు పుస్తకాలకు శ్రీకారం చుట్టడం భాగ్యప్రదమని అక్కడి వ్యాపారస్థులు భావిస్తారు.జైనులకు దీపావళి అయిదు రోజుల పండగ. జైన ప్రవక్త మహావీరుడు, నేటికి సరిగ్గా 2,550 సంవత్సరాల క్రితం, దీపావళి అమావాస్యనాడు మోక్ష ప్రాప్తి (నిర్వాణం) పొందాడు. అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయన తన శిష్యులకు ఆఖరి బోధనలు ఆరంభించాడు. ఆ త్రయోదశి ‘ధన్య త్రయోదశి’ (ధన్–తేరస్). ఆ రోజు వాళ్ళు ధ్యానాది సాధనలలో గడిపే పవిత్ర దినం. కాలగతిలో ‘ధన్–తేరస్’ను ధన త్రయోదశిగా జరుపుకొనే ఆనవాయితీ అనేక ప్రాంతాలలో ఆరంభమైంది.అమావాస్య నాడు మహావీరుడనే మహత్తరమైన ‘జ్ఞాన జ్యోతి’ అంతర్ధానమవటం వల్ల కలిగిన అంధకారాన్ని ఆయన శిష్యగణం దివ్వెల వరసలు (దీప– ఆవళులు) వెలిగించి తొలగించటానికి చేసే ప్రయత్నంగా ఈ దీపావళులకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వర్ధమానుడు దూరమవడంతో, దుఃఖ సాగరంలో మునిగి, చేష్టలుడిగిన నంది వర్ధనుడనే రాజును, శుక్ల విదియనాడు, ఆయన సోదరి సుదర్శన తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, వైరాగ్య బోధన చేసి ఊరడించిన సందర్భం ‘భాయి–దూజ్’.దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! – ఎం. మారుతి శాస్త్రి -
Happy Diwali: కాలుష్యరహిత దీపావళి.. ఈ టిప్స్ పాటిద్దాం!
వెలుగుల పండుగ దీపావళి వచ్చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సన్నద్ధ మవు తున్నారు. ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రేమికులు, నిపుణులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దేశంలోని పలు నగరాలలో దీపావళి టపాసులను కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తారా స్థాయికి చేరింది. దీంతో కాలుష్యం నుంచి జనావళిని రక్షించేందుకు టపాసులను నిషేధించారు. అలాగే కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పాక్షిక నిషేధం, ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరి కాలుష్యాన్ని నివారించాలంటే ఏం చేయాలి? కాలుష్యం బారిన పడకుండా టపాసులను కాల్చడం ఎలా? తెలుసుకుందాం.టపాసులు కాల్చని, బాంబుల మోత మోగని దీపావళి ఏం దీపావళి అనుకుంటున్నారా? అవును ఇలా అనిపించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి టపాసులను కాల్చడానికి అలవాటు పడ్డాం. అందులో ఆనందాన్ని అనుభవించాం. గతంలో పర్యావరణ హితమైన టపాసులను ఇంట్లోనే తయారు చేసుకునే వారు. మరిపుడు శబ్దం కంటే వెలుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కాకరపువ్వొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, చిన్ని చిన్న తాటాకు టపాసులను కాల్చే వారు. అదీ కూడా చాలా పరిమితంగా ఉండేది. దీంతో దోమలు, క్రిములు,కీటకాలు నాశనమయ్యేవి. కానీ రాను రాను ఈ పరిస్థితులు మారాయి. రసాయన మిళితమైన, పెద్ద పెద్ద శబ్దాలతో చెవులు చిల్లలు పడేలా బాంబులు వచ్చి చేరాయి. భయంకరమైన, ప్రమాదకరమైన రసాయన పొగ వ్యాపింప చేసే టపాసులు ఆకర్షణీయంగా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అర్థరాత్రి తర్వాత కూడా అపార్ట్మెంట్లలో భారీఎత్తున దీపావళి టపాసులను కాల్చడం అలవాటుగా మారిపోయింది. దీని వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అలాగే పశుపక్ష్యాదులకు ప్రమాదంకరంగా మారింది.మరి ఏం చేయాలి?భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని, కాలుష్యం కాటేయని ప్రకృతిని అందించాలంటే కొన్ని జాగ్రత్తలు, నియంత్రణలు తప్పనిసరి. అందరం విధిగా కొన్ని విధానాలను అనుసరించక తప్పదు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం స్థాయి పెరుగుతుంది అనడానికి దీపావళి తరువాత వచ్చిన కాలుష్యం స్తాయి లెక్కలే నిదర్శనం. పర్యావరణహితమైన గ్రీన్ టపాసులనే వాడాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ పొగ, ఎక్కువ శబ్దం వచ్చేవాటికి దూరంగా ఉండాలివెలుగులు జిమ్మే మతాబులు, చిచ్చు బుడ్లను ఎంచుకోవాలి.అర్థరాత్రి దాకా కాకుండా, కొంత సమయానికే మనల్ని మనం నియంత్రించుకోవాలి. టపాసులను బడ్జెట్‌ను సగానికి సగం కోత పెట్టుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె దీపాలే శ్రేష్టం. అవే మంగళకరం, శుభప్రదం అని గమనించాలి.ఇతర జాగ్రత్తలుటపాసులు కాల్చేటపుడు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దగ్గరుండి కాల్పించాలి. అలాగే సిల్క్,పట్టు దుస్తులను పొద్దున్నుంచి వసుకున్నా, సాయంత్రం వేళ టపాసులనుకాల్చేటపుడు మాత్రం కాటన్ దుస్తులను మాత్రమే వాడాలి.ఇరుకు రోడ్లు, బాల్కనీల్లో కాకుండా, కాస్త విశాలమైన ప్రదేశాల్లో టపాసులు కాల్చుకోవాలి.టపాసులు కాల్చుకోవడం అయిపోయిన తరువాత, చేతులను,కాళ్లు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.ఇంట్లో శిశవులు, చిన్న పిల్లలు ఉంటే శబ్దాలు విని భయపడకుండా చూసుకోవాలి.అసలే శీతాకాలం, పైగా కాలుష్యంతో శ్వాస కోస సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే అందరూ విధిగా మాస్క్‌లను ధరించాలి.అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. సౌకర్యం ఉన్నవారుఇంట్లో గాలి నాణ్యతకోసం ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి.వాయు కాలుష్యం ఇంట్లోని గాలిపై కూడా ప్రభావం చూపుతుంది. దీపావళి సందర్భంగా అధిక స్థాయి కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. పుష్కలంగా నీరు త్రాగాలి.కాలుష్యం ప్రభావం కనపించకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యంలేని శబ్దాలతో భయపెట్టని ఆనంద దీపావళిని జరుపుకుందాం. మన బిడ్డలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. -
Diwali 2024 దీపావళి లక్ష్మీపూజ : మీ ఇల్లంతా సంపదే!
పండుగ ఏదైనా పరమార్థం ఒకటే. చీకటినుంచి వెలుగులోకి పయనం. చెడును నాశనం చేసి మంచిని కాపాడుకోవడం. అలాంటి ముఖ్యమైన పండుగల్లో వెలుగుల పండుగ దీపావళి ఒకటి. ‘‘చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి.. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి ’’ న్నాడు ఆత్రేయ.చిన్నా పెద్దా, తేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగలో దీపాలు, మతాబులతోపాటు లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైన ఆచారం. అదృష్టానికి , ధనానికి దేవత లక్ష్మీ దేవిని పూజిస్తారు. అమావాస్యనాడు వచ్చే పండుగ అయినా జగమంతా వెలుగుపూలు విరగపూస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి.దీపావళి కథశ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై, లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికిపంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, నరసింహా వతారంలో విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించి, హరి భక్తుల కష్టాలను తొలగించిన ఆనందంలోనూ ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. దీపావళి నాడు ఏం చేయాలి?ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతారు.దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతుందట. అలా శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లల్లో మాత్రమే తాను కొలువుదీరుతుందని భక్తుల విశ్వాసం. దీపావళి నాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టిందట సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది.అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, మట్టి ప్రమిదలు, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించా దేదీప్యమానంగా అలంకరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనీ, ఇల్లంతా సంపదతో తులతూగుతుందని నమ్మకం. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీపూజ ఇలా మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి. పిండి ముగ్గులతో ముంగిళ్లను తీర్చిదిద్దాలి. ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచి భక్తితో యథాశక్తి పూజించాలి. ఈ సందర్భంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచుతారు. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. బంగారు పూలతోనే పూజించాలనేదేమీ లేదు. భక్తితో చేసినదే ముఖ్యం. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఆ తరువాత స్వీట్లు, పిండి వంటలను ఇరుగుపొరుగువారితో సంతోషగా పంచుకుంటారు.దీపావళి సందడి మరింతదీపావళి రోజు చిన్న పిల్లలతో దివిటీలు కొట్టించడం కూడా ఒక ఆచారంగా పాటిస్తారు. గోగు కర్రలపై తెల్లటి కొత్త వస్త్రంతో చేసిన వత్తులను నువ్వులనూనెతో వెలగించి... దిబ్బు దిబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’’ అంటూ పాడుతూ వాటిని నేలమీద మూడు సార్లు కొట్టించి, వెనక్కి తిరిగి చూడకుండా పిల్లలకు లోపలకు వెళ్లమని, ఆ విభూతిని వారి నొసట దిద్ది, తీపి పదార్థంతో వారి నోటిని తీపి చేస్తారు. బొమ్మల కొలువుబొమ్మలకొలువులో లక్ష్మీ దేవి, పార్వతి, సరస్వతిలను ప్రధానంగా పూజించడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజున ఇంటిని మొత్తం శుభ్ర పరచుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చెక్కలతో మూడు నుంచి ఐదు మెట్ల ఆకారంలో ఏర్పాటు చేస్తారు. దాని మీద కొత్త చీరను పరిచి ముందుగా గౌరమ్మతో పాటు లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి మధ్యలో ఉంచుతారు. బొమ్మల కొలువును తెలుగు ప్రాంతాల్లో బొమ్మలకొలువు, తమిళనాడులో బొమ్మా కొలు, కర్నాటకలో గొంబే హబ్బా పేరుతో పిలిచినా.. ఎక్కడైనా దీనిని ఒకేలా నిర్వహించడం జరుగుతుంది.మతాబులు, చిచ్చుబుడ్లుపూజ,దీపాలంకరణ అనంతరం పిల్లా పెద్దా అంతా మతాబులు, చిచ్చు బుడ్లు ఇలా అనేక రకాలు దీపావళి టపాసులను వెలగించుకొని ఆనందంగా గడుపుతారు. తక్కువ పొగ, శబ్దం వచ్చే క్రాకర్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం అనేది అందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే టపాసులను కాల్చేటపుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ అప్రమత్తండా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు జాగరూకతతో మెలగాలి.ఈ దీపావళి అందరికీ ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలగాలని కోరుకుందాం. -
Diwali 2024 మోతీ చూర్ లడ్డూ .. ఈజీగా ఇలా చేసేయ్యండి!
ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఇలా పండుగలకు మాత్రమేనా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది మోతీ చూర్ లడ్డూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) స్వీట్లలో ప్రధానమైంది అనడంలో సందేహమే లేదు. మరి ఈ దీపావళికి ఈజీగా , టేస్టీగా ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!మోతీ చూర్ లడ్డూ పేరు వెనుక రహస్యంహిందీ లో, 'మోతీ' అంటే ముత్యం అని అర్థం. 'చూర్ లేదా చుర్' అంటే చూర్ణం అని. అంటే శనగపిండి ముత్యాలు (బూందీ) తినేటపుడు మృదువుగా వెన్నలా కరిగిపోయేలా ఉండే లడ్డూ అన్నమాట.సాధారణంగా స్వీట్స్ షాపుల్లో కృత్రిమ రంగుల్లో మోతీచూర్ లడ్డూలు దర్శనమిస్తాయి .కృత్రిమ రంగులతో ఎరుపు లేదా నారింజ, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తారు. మనం కృత్రిమ రంగులను వాడకుండా ఉండటం మంచిది. రంగుకోసం కుంకుమపువ్వును, వాసన కోసం తినే కర్పూరాన్ని వాడుకోవచ్చు.మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:రెండు కప్పుల సెనగపిండి రెండు కప్పుల పంచదారయాలకుల పొడి, బాదం ,పిస్తా, జీడిపప్పు,కిస్మిస్ బూందీ తయారీకి నూనె, కొద్దిగా నెయ్యి,కర్పూరం పొడితయారీ: ఒక గిన్నెలో రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి. బాగా జల్లించుకుని ఉండలు లేకుండా పిండిని బాగా జారుగా కలుపుకోవాలి. పిండిన పైకి తీసినపుడు గరిటె నుంచి చుక్కలుగా పడేలా ఉండాలి. మంచి రంగు కావాలనుకున్నవాళ్లు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును నానబెట్టి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.పంచదార పాకంఇపుడు మందపాటి గిన్నెలో రెండు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని,కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అలాగే పంచదార మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ , కొద్దిగా నిమ్మరసం పిండాలి. చివర్లో కర్పూరం పొడి వేసి పాకం వచ్చాక దింపి పక్కన పెట్టుకోవాలి.బూందీ తయారీస్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడెక్క నివ్వాలి. ఈ నూనెలో నెయ్యి వేస్తే బూందీలకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఈ నూనెలో జారుగా కలుపుకున్న శనగపిండితో,బూందీ గొట్టంతోగానీ, అబకతో గానీ బూందీలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ బూందీలోని నూనె పీల్చేలా కాసేపు పేపర్ నాప్కిన్పై ఉంచాలి.తరువాత ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన పైజులో లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ నోట్ : మోతీచూర్ లడ్డూ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే రుచికరమైన వంటకం. అయితే ఈ స్వీట్లో చాలా నూనె పంచదార ఉంటుంది కాబట్టి, షుగర్ వ్యాధి గ్రస్తులు, కొంచెం మితంగా తిన తినండి ,రుచిని ఆస్వాదించండి. -
థాయ్‌లాండ్‌లో దీపావళి వేడుక వేరే లెవల్! చూసి తరించాల్సిందే!
వెలుగుల పండుగ దివాలీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాటు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో దీపావళిని వేడుకగా నిర్వహించు కుంటారు. ముఖ్యంగా మిరుమిట్లు కొలిపే దీపకాంతులతో థాయ్‌లాండ్ మెరిసి పోతుంది. నింగిలోనూ, నీటిలోనూ లాంతర్ల వెలుగు, దీపాలతో థాయలాండ్‌లో దీపావళి వేడుక ఒక రేంజ్లో జరుగుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!థాయ్‌లాండ్‌లో నవంబర్ నెలలో లాయ్ క్రాథోంగ్, యి పెంగ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు . అరటి ఆకులతో చేసిన దియాలు (దీపాలు) ప్రత్యేక ఆకర్షణ. ఈ దీపాలు తామరపువ్వు ఆకారాల్లొ నదిపై తేలియాడుతూ అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ దీపాలపై ఒక నాణెం, ధూపంతో పాటు కొవ్వొత్తులనూ ఉంచుతారు. దీపావళి రోజున మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు .లాయ్ క్రాథోంగ్ (లాంతర్ల పండుగ)దీన్నే "ఫ్లోటింగ్ బాస్కెట్ ఫెస్టివల్" అని పిలుస్తారు. loi అంటే 'ఫ్లోట్' అని, క్రాథాంగ్ అనేది పూలతో అలంకరించబడిన బుట్ట అని అర్థం. థాయ్‌లాండ్ లైట్స్ ఫెస్టివల్ అని పిలువబడే లాయ్ క్రాథాంగ్ ఫెస్టివల్, థాయ్ చంద్ర క్యాలెండర్‌లోని 12వ నెల పౌర్ణమి రాత్రి జరుగుతుంది. కొవ్వొత్తులు , పువ్వులతో అలంకరించిన తామరపువ్వు ఆకారంలో ఉన్న బుట్టలను నదులు మరియు జలమార్గాలపై విడుదల చేయడం ద్వారా నీటి దేవతకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటారు. ఇది వర్షాకాలం ముగింపుకు గుర్తుగా , శీతాకాలాన్ని స్వాగతించే వార్షిక వేడుకగా కూడా భావిస్తారు. మంత్రముగ్ధం చేసే ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనలు , నదులు, కాలువలు, సరస్సులలో తేలియాడే బుట్టలు నిజంగా అద్భుతంగా ఉంటుంది. లాయ్ క్రాథాంగ్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటే, ఉత్తర థాయిలాండ్‌లో, యి పెంగ్ అని చియాంగ్ మాయిలో ఈ లాంతరు పండుగ నిర్వహస్తారు. యి పెంగ్స్కై లాంతర్ ఫెస్టివల్ యి పెంగ్: రాత్రివేళ ఆకాశంలో వేల సంఖ్యలో కొవ్వొత్తుల లాంతర్లను ఎగువేవేస్తారు. చియాంగ్ మాయిలో మాత్రమే ఈ రెండు పండుగలను ఒకే రోజు జరుపు కుంటారు.దురదృష్టాన్ని గాల్లోకి వదిలి, అదృష్టాన్ని స్వాగతించడానికి ప్రతీకగా ఈ వేడుక ఉంటుంది. ఈ కార్యక్రమంలో బౌద్ధసన్యాసులు, స్థానికులు, పర్యాటకులు వేలాదిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రాములతో సందడిగా ఉంటుంది. వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. -
మట్టి ప్రమిదలు,నువ్వుల నూనె : ఆరోగ్య లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మికి ఆహ్వానం!
వినాయక చవితి సందర్భంగా మట్టివిగ్రహాలతొ విఘ్ననాయకుడ్ని కొలిచి తరించాం. ఇపుడు దీపాల పండుగ దీపావళి సంబరాలకు సమయం సమీపిస్తోంది. దీపావళి రోజున పెట్టిన దీపాల పరంపర, కార్తీకమాసం అంతా కొనసాగుతుంది. దీపావళి పండుగలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది.దీపావళి రోజున మట్టి ప్రమిదలనే వాడదాం. తద్వారా దైవశక్తులను ఆకర్షించడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడిన వారమూ అవుతాం. ‘‘దీప” అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. అలా దీపావళి అంటే.. దీపాల వరుస అని అర్థం. దీపం అంటే జ్ఞానం, ఐశ్వర్యం. చీకటి నుంచి వెలుగులోకి, ఐశ్వర్యంలోకి పయనించడమే దీపాల పండుగ ఆంతర్యం.మట్టి ప్రమిద. నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యి ఈ కలయిక ఎంతో మంగళకరం. నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల దీపపు కాంతి, ఆరోగ్యానికి కంటికి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలపు చలిగాలు మధ్య మన శరీరానికి ఏంతో మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభించి, పూర్వ జన్మ పాపపుణ్యాలు తొలగి పోతాయి. మట్టి ప్రమిదల్లో దీపం పెట్టడం అంటే అటు ఆరోగ్య లక్ష్మీని ఇటు ఐశ్వర్యలక్ష్మీని ఆహ్వానించి, వారి అనుగ్రహాన్ని పొందడన్నమాట.దీపారాధన చేసే సమయంలో ”దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!!” అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మట్టి ప్రమిదలు, దీపాలు అందుబాటులో ఉన్నాయి. మట్టి దీపాలను వాడటం ద్వారా వృత్తి కళాకారులకు ప్రోత్సాహమిచ్చినవారమవుతాం. అలాగే కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా, ఆకట్టుకునే డిజైన్లతో ట్రెండీ లుక్‌తో అలరిస్తున్నాయి మట్టి దీపాలు. పాత ప్రమిదలను కూడా శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు. -
Diwali 2024 దివాలీకి ఈ స్వీట్లు చేసిపెడితే : దిల్ ఖుష్!
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా ఎదురు చూస్తున్నారు. దీపావళి దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం. ఒకటి మూంగ్ హల్వా, రెండు క్యారెట్–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగో..ఇలా..!మూంగ్ హల్వాకావల్సిన పదార్థాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుచాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)నీళ్లు – రెండు కప్పులునెయ్యి – అరకప్పుగోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లుపంచదార – ముప్పావు కప్పుఫుడ్ కలర్ – చిటికెడుయాలకుల పొడి – పావు టీస్పూనుజీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లుకిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లుతయారీ స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. క్యారెట్–ఖర్జూరం హల్వా కావల్సిన పదార్థాలు ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులుకొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి,పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)తయారీముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి.ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
సింగం పాఠశాలలో దీపావళి వేడుకలు
సోలాపూర్: దత్తు నగర్‌లోని దత్తు మందిర్ దేవస్థానం కమిటీ దివంగత వెంకటనరసు వీరయ్య సింగం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు దీపావళి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కోటను అప్రతిమంగా తయారుచేసి తీర్చిదిద్దారు. అలాగే పట్టణానికి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త గణేశ్ రంగయ్య గుడుమల్ పాఠశాలలోని 250 మంది విద్యార్థులకు సకినాలు, గారెలు, మడుగులు, శంకరపల్లిలు, లడ్డూ వంటి ఫలహారాల పాకెట్లను పంపిణీ చేశారు. అలాగే సంజయ్ మడూర్ తరఫున ఉపాధ్యాయులకు దీపావళి బహుమతులు అందజేసి సన్మానించారు. (ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి)ఈ సందర్భంగా దత్త మందిర్ దేవస్థానం సంస్థ కమిటీ అధ్యక్షుడు మహేశ్ దేవసాని, సంజయ్ మడూర్, కిశోర్ దేవసాని, గణేశ్ దేవసాని, నరేశ్ దేవరశెట్టి, దామోదర్ మాచర్లను దేవస్థానం ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ దేవసాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దీపావళి పర్వదినాన్ని ఆనందాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాలు పేదలు కూడా సనాతన కాలంగా వస్తున్న దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లల దీపావళి
ముంబై: ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో గ్రామీణ, గిరిజన పిల్లలతో దీపావళి పండుగ స్నాక్స్, గిఫ్ట్స్ టపాకాయలతో ఘనంగా జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్‌బాబు ఆధ్వర్యంలో బృందావనం ఫారమ్స్, ఖోపోలిలో ఈ వేడుకలను నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామ పంచాయతీ, గిరిజన ప్రాంతాల పేద విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. వారికి ఆటలు, పర్యావరణం, మంచి అలవాట్ల గురించి పూజ పలు సూచనలిచ్చారు. కార్యక్రమానికి విఠల్, రమాకాంత్, ప్రశాంత్, గణేశ్, దిలీప్, అర్చన తదితరులు సేవలందించారు. కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ భివండీ: కపిల్ పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణ్‌లోని సాయి చౌక్ వద్ద నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బీజేపీ మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ నేతృత్వంలో నవంబర్ 2వ తేదీన ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. హిందీ–మరాఠీ చలనచిత్ర గీతాలు, ప్రసిద్ధి గాంచిన వెండితెర, బుల్లి తెర కళాకారులు హాస్యనటుల ప్రదర్శనలు, భారతీయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ముఖ్యంగా బంజారా బృందం, బెల్లీ డ్యాన్స్, భరతనాట్యం తదితర నృత్యాల ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్ విన్నర్, బిగ్‌బాస్ ఫేమ్ సింగర్ అభిజిత్ సావంత్, ప్రజక్తా శుక్రే, భూమి త్రివేది, జూలీ జోగ్లేకర్‌తో పాటు పాతిక మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకలను అలరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. . -
అమావాస్య రోజుని పున్నమి వెలుగులా మార్చే వేడుక..!
దీపావళి అమావాస్య రోజున జరుపుకొనే వెలుగుల వేడుక. సాధారణంగా పండుగలు ఏదో ఒక మతానికి చెందినవి అయి ఉంటాయి. దీపావళి ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు, నాలుగు మతాల వారు జరుపుకొనే అరుదైన పండుగ. దీపావళి పండుగ రోజున ఊరూరా ఇంటింటా ముంగిళ్లలో అసంఖ్యాకంగా దీపాలు వెలుగుతాయి. అమావాస్య రాత్రిని పున్నమిని మించిన వెలుగులతో వెలిగిస్తాయి. ముంగిళ్లలో వెలిగించే గోరంత దీపాలు జగమంతటికీ వెలుగులు పంచుతాయి.దీపావళి నేపథ్యానికి సంబంధించి అనేక పురాణగాథలు ఉన్నాయి. దీపావళి మూలాలు భారత్‌లోనే ఉన్నా, ఇది దేశదేశాల పండుగగా విస్తరించింది. చాలా పండుగల మాదిరిగానే అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకొంటారు. దీపావళికి మూలంగా నరకాసుర సంహారం గాథ బాగా ప్రాచుర్యంలో ఉంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా ఇదేరోజున అయోధ్యకు తిరిగి చేరుకున్నట్లు పురాణగాథలు ఉన్నాయి.ఐదు రోజుల ఆనందాల పండుగదీపావళి వేడుకలు ఒకరోజుకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఐదురోజుల ఆనందాల పండుగ. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకొంటే, అంతకు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమిని బలి పాడ్యమిగా, కార్తీక శుక్ల విదియను యమ ద్వితీయగా జరుపుకొంటారు. ఈ ఐదురోజులకు సంబంధించి వేర్వేరు పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.ధన త్రయోదశి: అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతకలశ హస్తుడై ఆరోగ్య ప్రదాతగా ధన్వంతరి ఆవిర్భవించాడు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. ధన త్రయోదశి రోజున «నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించి, ధన్వంతరిని పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయి. ఈ రోజున బంగారం కొన్నట్లయితే, సంపద పెరుగుతుందని చాలామంది నమ్మకం.నరక చతుర్దశి: ముల్లోకాలనూ పీడించిన నరకాసురుడిని ఇదే రోజు సత్యభామా సమేతుడై యుద్ధానికి వెళ్లిన శ్రీకృష్ణుడు సంహరించాడు. నరకాసురుడి పీడ విరగడైనందున మరునాడు ద్వారకాపురికి చేరుకున్న సత్యభామా శ్రీకృష్ణులను జనాలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని, అప్పటి నుంచి దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని ప్రతీతి.దీపావళి: దీపావళికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. ముక్కోపిగా పేరుపొందిన దుర్వాస మహర్షి ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు ఆయనకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి సంతోషించిన దుర్వాసుడు అతడికి కానుకగా ఒక హారాన్ని బహూకరించాడు. ఇంద్రుడు ఆ హారాన్ని తాను ధరించకుండా, దానిని తన పట్టపుటేనుగైన ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం ఆ హారాన్ని నేల మీదకు పడవేసి, కాలితో తొక్కింది. ఆ దృశ్యం చూసిన దుర్వాసుడు మండిపడి, ఇంధ్రుణ్ణి శపించాడు. దుర్వాసుడి శాపంతో ఇంద్రుడు స్వర్గాన్ని, సర్వసంపదలను కోల్పోయి రాజ్యభ్రష్టుడయ్యాడు. దిక్కుతోచని ఇంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. ‘అమావాస్య రోజున ఒక జ్యోతిని వెలిగించి, దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి ప్రార్థించు. నీకు పునర్వైభవం ప్రాప్తిస్తుంది’ అని చెప్పాడు విష్ణువు. అమావాస్య రోజున జ్యోతిని వెలిగించి పూజించిన ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపత్యాన్ని పొందాడు. పోగొట్టుకున్న సంపదలన్నీ మళ్లీ పొందాడు. అందువల్ల దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా మారినట్లు చెబుతారు. లక్ష్మీపూజ తర్వాత ప్రజలు కొత్త వస్త్రాలు ధరించి, విందు వినోదాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బలి పాడ్యమి: దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి. దీనినే బలి పాడ్యమి అంటారు. వామనావతారం దాల్చిన శ్రీమహావిష్ణువు బాలవటువులా వెళ్లి బలి చక్రవర్తిని దానంగా మూడడుగుల చోటు కోరుకున్నాడు. త్రివిక్రముడిగా మారిన వామనుడు రెండు పాదాలతోనూ భూమ్యాకాశాలను ఆక్రమించుకున్నాడు. మూడో అడుగు ఎక్కడ మోపాలో చోటు చూపించమని బలి చక్రవర్తిని అడిగాడు. అప్పుడు బలి చక్రవర్తి త్రివిక్రముడి పాదాల ముందు శిరసు వంచి, తన తల మీదనే మూడో అడుగు మోపమన్నాడు. వెంటనే బలి తలపై వామనుడు తన పాదాన్ని మోపి, అతణ్ణి పాతాళానికి అణగదొక్కాడు. ఇది కార్తీక శుక్ల పాడ్యమి నాడు జరిగింది. విష్ణువు ఇచ్చిన వరం మేరకు ఈ రోజున బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడని పలువురు నమ్ముతారు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో బలి చక్రవర్తి గౌరవార్థం వివిధ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. జమ్ము, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బలి పాడ్యమిని విశేషంగా జరుపుకొంటారు.యమ ద్వితీయ: దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుక్ల విదియ రోజును యమ ద్వితీయగా పాటిస్తారు. ఈ రోజున యముడిని, చిత్రగుప్తుడిని పూజిస్తారు. ఈ రోజున యముడికి ఆయన సోదరి యమున ఇంటికి పిలిచి, భోజనం పెట్టిందని, ఎన్ని పనులు ఉన్నా ఏడాదికి ఒకసారి ఇలా తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలని యమున కోరిన కోరికను యముడు సరేనని వరమిచ్చినట్లు పురాణాల కథనం. అందుకే ఈ రోజును ‘భగినీ హస్తభోజనం’, ‘భాయీ దూజ్’ పేర్లతో జరుపుకొంటారు. ఈ రోజున ఆడపడుచులు తమ సోదరులను ఆహ్వానించి విందు భోజనాలు పెడతారు. యమ ద్వితీయ రోజున సోదరులను ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చే ఆడపడుచులు సౌభాగ్యంతో వర్ధిల్లుతారని, సోదరీమణుల చేతి భోజనం తిన్న సోదరులు దీర్ఘాయుష్మంతులు అవుతారని నమ్మకం.దేశదేశాల దీపావళిదీపావళి పండుగను దాదాపు రెండువేల ఏళ్ల కిందట భారత ఉపఖండం సహా అన్ని దక్షిణాసియా దేశాల్లోనూ జరుపుకొనే వారు. ఇటీవలి కాలంలో ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఈ పండుగను జరుపుకొంటారు. ఈ నాలుగు మతాలూ భారత భూభాగంలోనే పుట్టాయి. ఈ నాలుగు మతాల వారు ఎక్కువగా ఉండే దేశాల్లో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. బౌద్ధ మతం తొలిరోజుల్లోనే దక్షిణాసియా ప్రాంతమంతటా విస్తరించింది. ఇరవయ్యో శతాబ్ది నుంచి పాశ్చాత్య దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి.ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో భారత సంతతివారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పలు దేశాల్లో భారత సంతతి ప్రజలు రాజకీయంగా కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు డజను దేశాల్లో దీపావళి అధికారిక సెలవు దినం. ఇంకొన్ని దేశాల్లో దీపావళి అధికారిక సెలవుదినం కాకపోయినా, ఆ దేశాల్లో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అమెరికాలో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం 2003 నుంచి కొనసాగుతోంది. దీపావళి రోజున అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఘనంగా వేడుకలు జరుగుతాయి. నేపాల్, భూటాన్, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంక, థాయ్‌లండ్, లావోస్, తైవాన్, కంబోడియా తదితర దేశాల్లో బౌద్ధులు, హిందువులు దీపావళిని తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధారామాల్లోను, హిందూ దేవాలయాల్లోనూ దీపాలు వెలిగించి, ప్రార్థనలు, పూజలు జరుపుతారు. కెనడాలో స్థిరపడిన భారతీయుల్లో హిందువులతో పాటు సిక్కులు కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నారు. సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్ దివస్’– అంటే చెర నుంచి విడుదలైన రోజుగా జరుపుకొంటారు. గురుద్వారాలను దీపాలతో అలంకరించి, బాణసంచా కాల్పులు జరుపుతారు. భారత సంతతి ప్రజలు నివసించే పలు ఇతర దేశాల్లోనూ ఇటీవలి కాలంలో దీపావళి వేడుకలను విశేషంగా జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మందికి పైగా జనాలు దీపావళి వేడుకలను జరుపుకొంటారు. అరుదైన విశేషాలుదీపావళికి సంబంధించి రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కొన్నింటికి విశేష ప్రాచుర్యం ఉంటే, ఇంకొన్ని చాలా అరుదైనవి. దీపావళికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొద్దిమందికే పరిమితమైన ఆచారాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆచారాలకు సంబంధించి ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. వీటిలో ఉదాహరణకు చెప్పుకోవాలంటే, బిహార్‌లో దీపావళి సందర్భంగా ‘హుక్కా పాతీ’ అనే ఆచారం ఉంది. దీని వెనుక కర్ణుడికి సంబంధించిన కథ ఉంది. మహాభారత కాలంలో కర్ణుడు అంగరాజ్యాన్ని పరిపాలించాడు. ఆనాటి అంగరాజ్యం ఇప్పటి బిహార్, ఝార్ఖండ్‌లలోని అంగ, మిథిలాంచల్, కోసి ప్రాంతాలలో ఉండేది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం. ఈ ఆచారం ప్రకారం దీపావళి రోజున మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇంటిపెద్ద ‘హుక్కా పాతీ’ని సిద్ధం చేస్తారు. జనప కట్టెలను, గోగునారతో పేనిన తాడును కట్టి, ఎండబెడతారు. సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత ఇంటిలోని పూజా మందిరాల్లో గాని, ఇంటికి చేరువలోని ఆలయ ప్రాంగణాల్లో గాని వాటిని దహనం చేస్తారు. దీపావళి రోజున కర్ణుడు ఈ ఆచారం పాటించేవాడని ఇక్కడి ప్రజలు చెబుతారు. ‘హుక్కా పాతి’ వలన ఐశ్వర్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలుగుతాయని వారు నమ్ముతారు.దీపావళికి ముందు రోజును ఎక్కువమంది ప్రజలు నరక చతుర్దశిగా జరుపుకొంటే, పశ్చిమ బెంగాల్‌లోని కొందరు ప్రజలు మాత్రం దీనిని ‘భూత చతుర్దశి’గా పాటిస్తారు. భూత చతుర్దశి రోజు రాత్రివేళ ఇంటి ముంగిళ్లలో మట్టి ప్రమిదల్లో పద్నాలుగు దీపాలను వెలిగిస్తారు. ఈ పద్నాలుగు దీపాలూ పద్నాలుగు లోకాలలో ఉండే తమ పూర్వీకుల ఆత్మలకు దారి చూపుతాయని, తద్వారా వారు తమ ఇళ్లలోకి దుష్టశక్తులు చొరబడకుండా నిలువరిస్తారని నమ్ముతారు.దీపావళి సందర్భంగా పశ్చిమ భారత ప్రాంతంలో కొందరు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు. వ్యాపారులు తమ వ్యాపారాల జమా ఖర్చులకు సంబంధించిన కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో ఈ సందర్భంగా ‘చోప్డా పూజ’ జరుపుతారు. ‘చోప్డా’ అంటే జమా ఖర్చుల పుస్తకం. దీపావళి రోజున వారు కొత్త జమా ఖర్చుల పుస్తకాలను ప్రారంభించి, వాటిని లక్ష్మీనారాయణుల పటాల ముందు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు జరుపుతారు. కొందరు ఇప్పటికీ జమా ఖర్చుల పుస్తకాలకు పూజలు చేస్తుంటే, ఆధునికత సంతరించుకున్న యువతరం తమ వ్యాపారాల జమా ఖర్చుల వివరాలను నిక్షిప్తం చేసుకున్న లాప్‌టాప్‌లకు, కంప్యూటర్లకు కూడా ‘చోప్డా పూజ’ జరుపుతూ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుండటం విశేషం.మనకు దసరా పాటలు తెలుసు. బడుల్లో చదువుకునే పిల్లలు తమ ఉపాధ్యాయులతో కలసి ఇంటింటికీ వెళ్లి దసరా పాటలు పాడుతూ, వారు ఇచ్చే కానుకలు పుచ్చుకునేవారు. దాదాపు ఇలాంటి ఆచారాన్నే దీపావళి సందర్భంగా ఉత్తరాఖండ్‌లో పాటిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ ప్రాంతంలో ఇప్పటికీ ఈ ఆచారం మిగిలి ఉంది. దీపావళి రోజున మధ్యాహ్నం వేళ బడుల్లో చదువుకునే పిల్లలు తమ చుట్టు పక్కల ఇళ్ల ముంగిళ్లలో నిలిచి, పాటలు పాడతారు. ఇళ్లలోని వారు పిల్లలకు కానుకగా డబ్బులు, బాణసంచా వస్తువులు, మిఠాయిలు ఇస్తారు. దీపావళి రాత్రివేళ వీరంతా ఆరుబయట కట్టెలతో చలిమంటలు వేసుకుని, ఆట పాటలతో ఆనందంగా గడుపుతారు.దీపావళి రోజున అన్ని ప్రాంతాల వారు విరివిగా మిఠాయిలు, పిండివంటలు దేవతలకు నివేదించి, వాటిని ఆరగిస్తారు. తమిళనాడులో మిఠాయిలు, పిండివంటలతో పాటు ప్రత్యేకంగా దీపావళి లేహ్యాన్ని తయారు చేస్తారు. ఇతర పదార్థాలతో పాటు ఈ లేహ్యాన్ని కూడా దేవతలకు నివేదిస్తారు. దీనిని తమిళులు ‘దీపావళి లేగియం’ అని, ‘దీపావళి మరుందు’ అని అంటారు. దీపావళి రోజున వేకువ జామునే పూజలు జరిపి, ఈ లేహ్యాన్ని నివేదించి, పరగడుపునే ఆరగిస్తారు. ధనియాలు, వాము, జీలకర్ర, మిరియాలు, సొంఠి, నెయ్యి, బెల్లంతో తయారు చేసే ఈ లేహ్యం ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతారు.దీపావళి తర్వాత కార్తీక శుక్ల విదియ రోజున కొందరు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. ఈ ఆచారం పాటించే పలు ప్రాంతాల్లో ఆవుపేడతో గోవర్ధన పర్వత ప్రతిమను రూపొందించి, పూజలు జరుపుతారు. ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రమైన బృందావనంలో గోవర్ధన పూజ సందర్భంగా ‘అన్నకూట పూజ’ నిర్వహిస్తారు. అన్నాన్ని పర్వతాకారంలో రాశిగా పోసి పూజిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడికి ఛప్పన్న నైవేద్యాలను సమర్పిస్తారు.దీపావళికి ముందు ధనత్రయోదశి నాడు దేశంలో పలుచోట్ల ధన్వంతరి పూజలు, లక్ష్మీపూజలు ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్రలో మాత్రం పలుచోట్ల ఈరోజున యమధర్మరాజును పూజిస్తారు. మరాఠీ మహిళలు తమ కుటుంబంలో ఉన్న పురుషులందరి పేరిట చెరొక దీపం చొప్పున వెలిగిస్తారు. ఈ క్రతువును ‘యమ దీపదానం’ అంటారు.మొఘల్ సామ్రాజ్యంలో బాణసంచాకు రాజాదరణ మొదలైంది. బాణసంచా తయారు చేసే నిపుణులను ఔరంగజేబు మినహా మిగిలిన మొఘల్ చక్రవర్తులు, వారి సామంతులు బాగా ఆదరించేవారు. అక్బర్ చక్రవర్తి బాణసంచా కాల్పులను, వాటి తయారీ నిపుణులను బాగా ప్రోత్సహించేవారు. బాణసంచా తయారీ నిపుణులకు భారీ నజరానాలను చెల్లించేవారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బాణసంచా కాల్పులపై నిషేధం విధించాడు. ఆయన 1667లో విధించిన నిషేధం ఆయన మరణించేంత వరకు కొనసాగింది. మొఘల్ పాలన అంతరించి, బ్రిటిష్ పాలన మొదలైన తర్వాత బాణసంచాకు పునర్వైభవం మొదలైంది. -
Dhanteras 2024 : వెండి, బంగారమేనా? ఇలా చేసినా ఐశ్వర్యమేనట!
ధనత్రయోదశి, ధంతేరస్, లేదా చోటీ దివాలీ పేరు ఏదైనా సందడి మాత్రం ఒకటే. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సుకోసం లక్ష్మీదేవిని, ధన్వంతరి ఆరాధించడమే దీని ప్రాముఖ్యత. అలాగే సంపదకు అధిపతి కుబేరుడికీ మొక్కుతారు. పూజ చేస్తారు. ధంతేరస్ అంటే పూజలు మాత్రమే కాదు, లక్ష్మికి ప్రతిరూపమైన బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఎవరికి శక్తికి తగ్గట్టు వారు బంగారం, వెండి ఆభరణాలను, లేదా వెండి లక్ష్మీదేవి, గణేష్ నాణేలను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. అలా అదృష్టాన్ని తమ ఇంటికి తెచ్చుకున్నట్టు మురిసిపోతారు. అయితే ధనత్రయోదశి అంటే కేవలం వెండి, బంగారం, కొత్తబట్టలు కొత్త ఇల్లు, కొత్త వాహనం, కొత్త ఫోన్ తదితర విలువైన వస్తువులు కొనడం మాత్రమే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే వాటిని శుభప్రదంగా భావిస్తారు కాబట్టి!ఈ పవిత్రమైన రోజున అత్యంత భక్తిశ్రద్దలతో లక్ష్మీదేవిని పూజించడం, ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీస్వరూపులుగా భావించి కానుకలు ఇవ్వడం. తమ కున్నంతలో పేద ప్రజలకు బట్టలు, ధనము దానం చేయడంచీపురు కొనడం: లక్ష్మీదేవి రూపంగా భావించే చీపురును ధంతేరస్ రోజు కొనుగోలు చేస్తారు. ఫలితంగా కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాటు తొలగి అష్టైశ్వార్యాలతో తులతూగుతామని నమ్ముతారు. వాహనం కొనుగోలు: కారు, బైక్ లేదా స్కూటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలని భావిస్తారు. అందుకే అనేక కంపెనీలు కూడా దీపావళి సందర్భంగా అనేక అఫర్లను కూడా ప్రకటిస్తాయి. మీరు దానిని కొనుగోలు చేయవచ్చు.ఇత్తడి- రాగి వస్తువులు : ధన్వంతరికి ఇత్తడి అంటే చాలా ఇష్టమట. అందుకే ఈ రోజు ఇత్తడి వస్తువులను కొనడం శ్రేయస్కరమని భావిస్తారు. ఉప్పు: ధంతేరాస్ రోజు ఉప్పు కొనడం కూడా పవిత్రంగా చూస్తారు. ఉప్పును లక్ష్మీ దేవిగా భావిస్తారు. ధన త్రయోదశి రోజు ఉప్పునుకొనుగోలు చేస్తే ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే కొత్తి మీరను కూడా సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున కొత్తిమీరను కొంటే డబ్బుకు లోటు ఉండదనేవి విశ్వాసం. -
Diwali 2024 పండగొస్తోంది.. ఈజీగా చేసుకునే స్వీట్లు, కుకీస్!
పండుగ వస్తోందంటే గృహిణులకు ఒకటే పని. ఇంటి శుభ్రంనుంచి పిండి వంటల దాకా ఎడతెగని పనులతో బిజీగా ఉంటారు. పెద్దగా హడావిడిగా లేకుండా, సులభంగా, ఆరోగ్యంగా తయారు చేసుకునే కొన్ని వంటల్ని ఇపుడు చూద్దామా.రాగి కుకీస్ కావలసినవి: రాగిపిండి – కప్పు; గోధుమపిండి – కప్పు; చక్కెర పొడి – కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – 15 టేబుల్ స్పూన్లు; పాలు – 4 టేబుల్ స్పూన్లు (అవసరమైతేనే వాడాలి).తయారీనెయ్యి కరిగించి పక్కన పెట్టాలి. వెడల్పు పాత్రలో రాగిపిండి, గోధుమ పిండి, చక్కెర పొడి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి అన్నీ సమంగా కలిసేటట్లు గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి వేసి మళ్లీ కలపాలి. చపాతీల పిండిలా ముద్దగా వస్తుంది. తగినంత తేమలేదనిపిస్తే పాలు కలపాలి. ఈ పిండి మీద మూత పెట్టి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒవెన్‌ను 170 డిగ్రీలు వేడి చేయాలి. పిండిని ఫ్రిజ్‌లో నుంచి తీసి పెద్ద నిమ్మకాయంత గోళీలు చేయాలి. ఒక్కో గోళీని అరచేతిలో వేసి వత్తాలి. ఫోర్క్‌తో నొక్కి గాట్లు పెట్టి బేకింగ్ ట్రేలో సర్దాలి ∙ట్రేని ఒవెన్‌లో పెట్టి 12 నిమిషాల సేపు ఉంచాలి. కుకీ మందంగా ఉందనిపిస్తే మరో నిమిషం అదనంగా ఉంచాలి ∙ఒవెన్ లేక పోతే ప్రెషర్ కుకర్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. కుకర్‌లో ఉప్పు చల్లి గాస్కెట్, వెయిట్ తీసేసి మూత పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత కుకీలను అమర్చిన ట్రేని జాగ్రత్తగా కుకర్‌లో పెట్టి సన్న మంట మీద 15 నిమిషాల సేపు ఉంచాలి. అయితే కుకర్‌లో ఒకేసారి అన్నింటినీ బేక్ చేయడం కుదరక పోవచ్చు. కుకర్ సైజ్, ట్రే సైజ్‌ను బట్టి నాలుగైదు సార్లుగా చేయాలి ఈ బిస్కట్లను గాలి చొరబడని బాటిల్లో నిల్వ చేస్తే మూడు వారాల పాటు తాజాగా ఉంటాయి. మిల్క్ బర్ఫీకావల్సిన పదార్ధాలుపాలపొడి – రెండున్నర కప్పులుపంచదార – ముప్పావు కప్పుపాలు – కప్పునెయ్యి – పావు కప్పుపిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లుతయారీ విధానంగిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి.స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి.10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి.ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తా పలుకులు వేసి మరోసారి వత్తుకోని, గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి.రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. -
Diwali 2024 ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా, టేస్ట్ అదిరిపోవాలంతే!
దీపావళి వెలుగు దివ్వెలు, మతాబులు, చిచ్చబుడ్ల వెలుగులు మాత్రమే కాదు స్వీట్ల పండుగ కూడా. అయితే ఎప్పడూ చేసుకునే తరహాలో కాకుండా, ఆయిల్ లేకుండా ఆరోగ్య కరంగా చేసుకునే స్వీట్ల గురించి తెలుసుకుందాం. ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పట్టదు కూడా. ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి!బొప్పాయిహల్వాకావల్సిన పదార్ధాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుబొప్పాయి పండు – ఒకటి (తొక్క తీసి తురుముకోవాలి)పంచదార – పావు కప్పుబాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లుయాలకుల పొడి – టీ స్పూనుకోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లుబాదం పలుకులు, ఎండు ద్రాక్షలు – రెండు టీస్పూన్లు.తయారీ విధానంముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. సహజతీపితో ఉండే ఈ హల్వాలోని పోషకాలు బొప్పాయిలో విటమిన్ సి ,బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్, డైటరీ ఫైబర్‌లో కూడా ఎక్కువే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.జీర్ణక్రియకు ,గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులోని బెల్లం ఇనుము , మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు సహజమైన తీపిని అందిస్తుంది.బాదం, ఎండుద్రాక్షలతో రుచిని పెంచడమే కాకుండా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ E, మెగ్నీషియం లభిస్తాయి. -
TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు
సౌతెండ్, యునైటెడ్ కింగ్డమ్లో TCUK ఆధ్వర్యంలొ ప్రప్రధముగా తెలంగాణ బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎస్సెక్స్ లోని సౌతెండ్, బాసిల్డ్న్ , చెల్మ్సఫోర్డ్ , తుర్రోక్ కౌన్సిల్ ఉంచి దాదాపు 450 మన తెలుగు వాళ్ళు అందరు ఒక్కదగ్గర చేరి బతుకమ్మ దసరా సంతోషంగా జరుపుకున్నారు. గుర్రం మల్లారెడ్డి, గుర్రం లావణ్య నేతృత్వంలో ఈ ఈవెంట్ స్వచ్చందంగా నిర్వహించారు.తెలంగాణ ఆడపడుచులు అందమైన బతుకమ్మ పేర్చికొని వచ్చారు. దసరా జమ్మి ఆకూ మొగవాళ్ళు ఇచ్చుకొని అలాయి బలయ్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ కి సౌత్జెండ్ కౌన్సిలర్స్ క్రిస్ వెబ్‌స్టర్ , పమేలా కిన్సేల్ల, సామ్ అల్లెన్, షాహిద్ నదీమ్, జేమ్స్ మొరిషన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. చివరగా తెలంగాణ వంటకాలతో విందు ఆరగించి, దసరా, బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలాంటి వేడుకలు భవిష్యత్తులోమరెన్నో జరగాలని అందరూ ఆకాంక్షించారు. -
ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?!
దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, గిప్ట్‌లు ఇవ్వడం చాలా కామన్. ఇటీవలి కాలంలో కంపెనీ లాభాలను బట్టి ఖరీదైన బహుమతులను ఇస్తున్న సందర్భాలను కూడా చూశాం. గతంలో డైమండ్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇళ్లు, కార్లు బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచాడు. తాజాగా చెన్నైకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా బెంజ్ కార్లను బహుమతిగా ఇచ్చింది. బెంజ్ సహా 28 ఇతర బ్రాండెడ్ కార్లను, 29 బైక్‌లను దివాలీ గిఫ్ట్ ఇచ్చింది.స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ అండ్ డిటైలింగ్ కంపెనీ, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తన ఉద్యోగులకుఅదిరిపోయే దీపావళి కానుక అందించింది. హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ , మెర్సిడెస్ బెంజ్ నుండి వివిధ రకాల బ్రాండ్ కొత్త కార్లను ఉద్యోగులకు అందించింది. కంపెనీ అభివృద్ధిలోనూ, విజయవంతంగా కంపెనీని నడిపించడంలోనూ ఉద్యోగుల కృషి , అంకితభావానికి ప్రశంసల చిహ్నంగా అందించినట్లు కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమ గొప్ప ఆస్తి అని, ఈ విధంగా ఉద్యోగుల విజయాలను గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఇది తమ ఉద్యోగుల్లో ధైర్యాన్ని, ప్రేరణనిచ్చి, ఉత్పాదకతను పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే ఉద్యోగుల అభివృద్ధికి , కస్టమర్ సంతృప్తికి అధిక ప్రాధాన్యత భవిష్యత్తులో కొనసాగుతుందని కన్నన్ తెలిపారు. వివాహ సాయం లక్ష రూపాయలకు పెంపుకంపెనీలో సుమారు 180 మంది ఉద్యోగులుండగా, దాదాపు అందరూ నిరాడంబరమైన నేపథ్యంనుండి వచ్చినవారు, అత్యంత నైపుణ్యం ఉన్నవారేనని కంపెనీ కొనియాడింది. కార్లను బహుమతిగా ఇవ్వడంతో పాటు, వివాహ సహాయంగా ఉద్యోగులకు సహాయం కూడా చేస్తుందని కూడా వెల్లడించారు. వివాహ సహాయంగా గతంలో ఇచ్చే 50 వేల సాయాన్ని ఇపుడు లక్షరూపాయలకు పెంచారు.2022లో, ఇద్దరు సీనియర్ సిబ్బందికి మాత్రమే రెండు కార్లను ఇచ్చిన కంపెనీ,ఈ ఏడాది 28 కార్లతోపాటు, 28 బైక్‌లను కూడా కానుకంగా అందించడం విశేషం.కాగా సరిగ్గా జీతాలు ఇవ్వక ఉద్యోగులను, కార్మికులను దోపిడీ చేస్తున్నారంటూ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్న తరుణంలో చెన్నైకంపెనీ నిర్ణయం విశేషంగా నిలిచింది. -
ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలు అద్భుతంగా ముగిశాయి. సుమారు 7వేలమంది మంది పాల్గొన్న కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం విశ్వవ్యాప్తంగా ప్రదర్శితమైంది. 25 అడుగుల ఎత్తైన కమల పీఠం బతుకమ్మల అందంతో అలరించింది. అష్టలక్ష్మి అలంకరణలు, 6 గంటలపాటు నిరాటంకంగా జరిగిన బతుకమ్మ నృత్యం కార్యక్రమం ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవానికి రెండు నెలల పాటు కఠోర సాధన చేసి మరీ బతుకమ్మను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జే జె చౌదరి, మారిస్విల్ మేయర్ టిజే కౌలీ, మేయర్ ప్రో టెం సతీష్ గరిమెల్ల, కౌన్సిల్ సభ్యులు లిజ్ జాన్సన్, స్టీవ్ రావు, కేరీ టౌన్ కౌన్సిల్ సభ్యురాలు సరికా బన్సాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానికులను మాత్రమే కాకుండా ఉత్తర కరోలినా ,ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన భారతీయులను ఆకర్షించింది. స్థానిక డెల్టా కంపెనీ ఐటీ డైరెక్టర్ స్టెఫనీ షైన్ తోపాటు, ఇతర వ్యాపార ప్రతినిధులు, ఐటీ డైరెక్టర్లు, ఇతర ప్రముఖులు హాజరు కావడం విశేషం.అతిథులకు భోజనవసతి, శాటిలైట్ పార్కింగ్ నుండి స్టేడియం వరకు రవాణా సౌకర్యం అందించారు. ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి TTGA నాయుకత్వంలో రెండు నెలలు ప్రణాళికా సూత్రాలను అమలు చేశారు.బతుకమ్మ కోసం ప్రత్యేక పాటను రూపొందించి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమం TTGA అధ్యక్షుడు మహిపాల్ బిరెడ్డి, ఉపాధ్యక్షురాలు భారతి వెంకన్నగారి, ఈవెంట్ డైరెక్టర్ శశాంక్ ఉండీల, సాంస్కృతిక డైరెక్టర్ పూర్ణ అల్లె, యువత డైరెక్టర్ శ్రీకాంత్ మందగంటి, ఫెసిలిటీ డైరెక్టర్ రఘు యాదవ్, ఫుడ్ డైరెక్టర్ మహేష్ రెడ్డి, కోశాధికారి రవి ఎం, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ స్వాతి గోలపల్లి, మెంబర్షిప్ డైరెక్టర్ ఉమేష్ పారేపల్లి, కమ్యూనికేషన్ డైరెక్టర్ మాధవి కజా నాయకత్వంలో విజయవంతంగా సాగింది.ఈ బతుకమ్మ వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటించడంతో పాటు, ఉత్తర కరోలినాలో భారత సాంస్కృతిక ఉత్సవాల పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తూ విజయవంతంగా ముందుకు సాగుతుందని TTGA ప్రకటించింది. -
పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా TDF బతుకమ్మ సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ , దసరా ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. క్వాటామా ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున ప్రవాసులు పాల్గొని విజయవంతం చేసారు.తెలుగుదనం ఉట్టి పడేలా.. మహిళలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. ఈ సంబరాల్లో భాగంగా దుర్గా పూజ నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చి పుచ్చుకొని అలయ్ భలాయ్ చేసుకున్నారు. బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు.ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలు విజయవంతం అవటానికి కృషి చేసిన స్పానర్స్, పోర్ట్లాండ్ చాప్టర్ టీం, వాలంటీర్స్, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ మెట్రో ఇండియన్ కమ్యూనిటికి, సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. TDFసంస్థ స్థాపించి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, శుభాకాంక్షలు తెలిపారు. -
కళ, సంస్కృతి, కవిత్వాన్ని ప్రేరేపించే చేప కథ
అనేక బెంగాలీ కుటుంబాలకు వారి ప్రియమైన ఇలిష్ (హిల్సా) లేకుండా దుర్గా పూజ అసంపూర్ణంగా ఉంటుంది. అది లేనిదే పూజ అసంపూర్తిగా ఉంటుందని భావించి కొందరు అమ్మవారికి ఈ చేప వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. హిల్సా వంటకం కేవలం పాక ఆనందాన్ని మాత్రమే కాకుండా వారి సంస్కృతిపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ ’జీవనాళం’ గుండా ఈదుతూ, పండుగలు, వేడుకలలో కనిపిస్తుంది.హిల్సా వెండి మెరుపు, అద్భుతమైన రుచి రారమ్మని ఆహ్వానిస్తాయి. బెంగాలీ–అమెరికన్ ఆహార చరిత్రకారుడు చిత్రిత బెనర్జీ ఈ చేప సాంస్కృతికతను సంపూర్ణంగా అక్షరీకరించారు. దీనిని ‘జలాల ప్రియత‘, ‘చేపలలో రాకుమారుడు‘గా అభివర్ణించారు.హిల్సా కథ పండుగలు, డైనింగ్ టేబుల్‌కు మించి విస్తరించి ఉంది. శతాబ్దాలుగా, ఇది సాంప్రదాయ కాళీఘాట్ పెయింటింగ్స్‌లో లేదా సమకాలీన వర్ణనలలో గంభీరమైన, మత్స్యకన్య లాంటి దేవతగా – కవులు, రచయితలు, కళాకారుల కల్పనలను ఆకర్షించింది.ఒక సాహిత్య వ్యవహారంహిల్సాతో బెంగాలీ ప్రేమ, దాని సాహిత్య సంప్రదాయంలో క్లిష్టంగా అల్లింది. 18 ఉపపురాణాలలో ఒకటైన బృహద్ధర్మ పురాణంలో సనాతనవాదులు దాని వినియోగాన్ని చర్చించినప్పటికీ, చేపలు బ్రాహ్మణులకు రుచికరమైనది అని ప్రశంసించారు. ‘బ్రాహ్మణులు రోహు (బెంగాలీలో రుయి), చిత్తడి ముద్ద (పుంటి), స్నేక్‌హెడ్ ముర్రెల్ (షూల్), ఇతర తెల్లటి, పొలుసుల చేపలను తినవచ్చని ఈ పాఠం చెబుతోంది‘ అని గులాం ముర్షీద్ తన పుస్తకం, బెంగాలీ కల్చర్ ఓవర్ ఎ థౌజండ్‌లో రాశారు. -
ప్రతి అమ్మా దుర్గమ్మే
విజయ దశమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు సాక్షి ఫ్యామిలీకి ప్రత్యేకంగా చెప్పిన ముఖ్య విశేషాలు...పదవరోజుతో ఎందుకు ముగించాలి...లోకంలోని ప్రతి అమ్మా ఆ లోకంలోని జగదంబకి ప్రతిరూపం. ఈమె కనిపిస్తుంది. ఆమె కన్పించదు. ఈమె ఎలాగైతే తొమ్మిది నెలలపాటు తనలో జరిగే వ్యాధులూ అలజడీ... తోపోరాడి 10వ నెలలో సంతాన విజయాన్ని సాధిస్తోందో– అలా అమ్మ ఈమెకి మార్గదర్శకురాలిగా తొమ్మిది రాత్రులపాటు (రాక్షసులకి రాత్రే బలం అధికం. నిశాచరులు కదా) పోరాడి పోరాడి 10వ నాడు దశమి విజయాన్ని సాధించింది కాబట్టి దేవీ నవరాత్రులంటే ప్రతి స్త్రీ విజయానికీ సాక్ష్యమన్నమాట. సంతానాన్ని కనగలగడమంటే అమ్మ అనుగ్రహంతో జయాన్ని సాధించి పండంటి బిడ్డని పొందడమన్నమాట. జయమంటే గెలుపు. అమ్మ అనుగ్రహం దానికి అండగా నిలిస్తే అది విజయం అన్నమాట!రోజూ అమ్మకి కొత్తకొత్తగా ముస్తాబు...అమ్మ అలంకారాల విషయానికి వద్దాం... స్థూలంగా చెప్తే– యోగసాధన చేయదలచిన సాధకుడు మొదటి రోజున బాల్య స్థితిలో ఉంటాడు. అదే బాలా త్రిపుర సుందరీ రూపం. అమ్మ తన సంతానాన్ని బడికి పంపేముందు కడుపునిండుగా అన్నం పెట్టి పంపుతుంది. అదుగో అదే అన్నపూర్ణా రూపం. సంతానం బడికెళ్లాక మూడవ కన్నయిన జ్ఞానాన్ని పొందుతారు. అదే గాయత్రీ రూపం. గాయత్రీ మంత్రానుష్ఠానం సాగగానే ఆ వ్యక్తికి ఓ వాక్ఛక్తి వచ్చి, అతడు ఏం చెప్తే అది జరగడం ప్రారంభమౌతుంది. ఆ శక్తిని ధనార్జనకి ఉపయోగిస్తాడా? లేక పై చదువుకోసం వినియోగిస్తాడా... అని పరీక్షించడం కోసం 4వ రోజున పరీక్ష కోసం మహాలక్ష్మీ రూపం వేస్తారు. ఆ ఆలోచనని జయిస్తే సరస్వతి లక్ష్మి ఇతర దేవతలూ... ఇలా అందర్నీ శాసించగల లలితారూపాన్ని దర్శించేలా 5వ రోజున లలితా రూపాన్ని వేస్తారు. ఆరవ రోజున షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉండే కారణంగా సరస్వతీ రూపాన్ని వేయించి జ్ఞాన అజ్ఞానాలకీ, విరోధం విచక్షణం అనే రెంటికీ మూలమైన శక్తిని తెలుసుకునేలా చేస్తారు.7వ రోజున వివాహిత అయిన స్త్రీ తన భర్తతో కలిసి ఉన్నప్పుడే భోగాన్నీ (మానసికానందం) పొందగలదని ఉపదేశిస్తూ భవానీ రూపాన్ని వేస్తారు. 8వ రోజున ఎంతటి కష్టానికైనా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దుర్గారూపాన్నీ– 9వ రోజున శత్రువుని ఎదుర్కొనే సాహసాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలనే దృష్టిని నేర్పుతూ మహానవమి నాడు క్రోధ రూపిణి అయిన కాలి రూపాన్నీ– 10వ రోజున మహిసాసుర మర్దినీ రూపాన్నీ (జాడ్యం బద్ధకం నిర్లక్ష్యం సిగ్గులేనితనం.. వంటి లక్షణాలని తొలగించగల) వేస్తారు. స్త్రీ అలా ఉన్న రోజున రాజరాజేశ్వరిగా సర్వులకీ అధిపత్ని గా ఉంటూ అ–పరాజిత (చేపట్టిన కార్యక్రమంలో ఓటమి లేనిది) గా అవుతుందని ఈ రూపాలతో నిరూపిస్తారు.అమ్మ చేతిలో మారణాయుధాలా?మనింట్లో ఉండే కూరగాయల్ని తరుక్కునే కత్తిపీట– వంటింట్లో ఉండే పొయ్యిమంటా... ఏవి కావు మారణాయుధాలు? వాటి ఉపయోగాన్ని బట్టి అవి ప్రయోజనాన్ని సాధించుకునే ఉపాయాలూ లేదా మారణాయుధాలూ ఔతాయి. అమ్మ చేతిలో పాశం అనురాగపాశం. అందుకే మనం ఈ ఉత్సవాలను చేసుకునేలా దాంతో బంధించింది. అమ్మ చేతిలోని అంకుశం మనం అహంకారం గర్వం హోదా ఉందనే దర్పంతో ఉన్నప్పుడు (తమోగుణం)– ఆ మదగజంలా ఉన్న మనని తోవలో పెట్టేందుకు ఉపయోగించే సాధనం. అలాగే ఆమె చేతిపుష్పబాణం మనని తన దగ్గరకి రప్పించుకునేందుకు చూపే ఆకర్షణా కుసుమం. మనని కోరికకి లొంగి΄ోకుండా నిలబడగల ధైర్యాన్ని పొందవలసిందిగా సూచించే పుష్పబాణం. పరిస్థితుల్ని దాటినట్లైతే మనని వధించడానికి లేదా శిక్షించి తోవలోకి తెచ్చేందుకు అమ్మ వాడే చాపం. అర్థం చేసుకోగలగాలి! అవి రక్షణాయుధాలు– వ్యతిరేకించిన పక్షంలో మారణాయుధాలు.దేవీ నవరాత్రుల ద్వారా తెలుసుకోవలసింది..?సంవత్సర చక్రంలో ఉగాది రాగానే అమ్మకి వసంత నవరాత్రోత్సవాలు పేరిట 9 రోజులపాటు ఉత్సవాలు, కొందరైతే పూర్ణిమ వరకూ పండుగ చేస్తారు. మళ్లీ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు మంగళవారాలు, మళ్లీ నాలుగు లేదా ఐదు శుక్రవారాలూ అమ్మ పండుగలే. ఇదుగో ఈ ఆశ్వయుజంలో పాడ్యమినుండి అమావాస్య వరకూ ఆమె పండుగలే 30 రోజులపాటు. కార్తికమాసం అంతటా శివునితో కలిపి పూజాఉత్సవాలే ఆమెకి. మొత్తం అమ్మకి పండుగరోజులెన్ని... అని ఆలోచిస్తే.. కనిష్ఠంగా 9+4+4+30+15=62 స్త్రీని ఓ దేవతగా ప్రతి సంవత్సరమూ ఆరాధించే ఉత్తమ సంస్కారం భారత దేశానిదే.లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే...అమ్మకున్న వెయ్యి నామాల్లో అమ్మవారి భౌతిక రూప వర్ణనం– ఆమె ఏ మంత్ర రూపంలో ఉంటుందో ఆ మంత్ర స్వరూప విధానం– స్త్రీలలో చైతన్యాన్ని ఎలా అమ్మ నింపి ‘శక్తి సేన’ అనే ఓ దాన్ని సిద్ధం చేసిందో ఆ పద్ధతీ– ఆమెకి తన సాహస పరాక్రమాలతో దుర్మార్గులూ లోకకంటకులూ అయిన పురుష రాక్షసుల్ని ఎలా సహరించిందో తన సైన్య సహాయంతో ఆ దృశ్యం – గర్భవతి అయిన ఆమెలో ఎదుగుతున్న శిశువుకి ఏ నెలలో ఏ తీరు ఆహారసారాన్ని అందించాలో ఆ వైద్యక్రమం, శత్రువుల్ని ఎలా వధించాలో ఆ తీరుతెన్నులూ, భర్తతో ఎలా అన్యోన్యంగా ఉండాలో ఆ జీవన విధానం.. ఇలా వివరింపబడ్డాయి.దేవీ నవరాత్రాల ముఖ్యోద్దేశం అరాచకాలు చేసే పురుషుల్ని సాహస పరాక్రమాలని తోటి స్త్రీల సహాయంతో ఎదిరించి వాళ్లకి భయం కలిగేలా చేయడం– భర్తతో కలిసే ఉండే తీరుని నేర్పడం– కుటుంబ రహస్యాలని గోప్యంగా ఉంచుకుంటూ సత్త్వ గుణంతో పరిస్థితిని సానుకూలత ఉండేలా చేసుకోవడం– ఎవరో వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవడం, ఎదురు చూడ్డం కాకుండా తమె కుటుంబాన్ని తామే రక్షించుకోగల నేర్పరితనాన్ని సధైర్యంగా సాధించుకోగల విధానాన్ని నేర్పడమనేవి వీటి ముఖ్యోద్దేశాలు. -
Singer Mangli: పాట పల్లకీ ఎక్కి
‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ పాడారు. ఆ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తి సాధించారు. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. బతుకమ్మ అంటే ‘తంగేడు’ పువ్వు ప్రత్యేకం. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. నవరాత్రి సందర్భంగా తాను పాడిన తొలి బతుకమ్మ పాట గురించి, ఇతర విశేషాలను గాయని మంగ్లీ ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే అన్నట్లుగా నన్ను అభిమానిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువాళ్లు ఉన్నారో అక్కడ బతుకమ్మ పండగ అంటే నా పాట వినపడుతోంది. ‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి దూసి తెచ్చి... తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి... పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి... బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...’ అంటూ నేను పాడిన బతుకమ్మ పాటలో ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అని కూడా ఉంటుంది. అలా నా ఈ ఫస్ట్ పాట నన్ను శ్రోతలకు ఎంత దగ్గర చేసిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని అడుగుతుంటారు. నా లైఫ్‌లో బతుకమ్మ అంటేనే చాలా ప్రత్యేకం. నా కెరీర్లోనే ప్రాథమిక గీతంగా మారిపోయింది ‘బతుకమ్మ’. విదేశాల్లో బతుకమ్మ ఆడాను నేను విదేశాల్లోని తెలుగువారితో కలిసి బతుకమ్మ పండగ చేసుకున్నాను. బతుకమ్మ ఆడాను... పాడాను... వాళ్లతోనూ ఆడించాను. మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందంటూ వాళ్లు ఎదురు చూడటం నాకో మంచి అనుభూతి. నా తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా ఓన్ చేసుకున్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను.రెండూ ప్రకృతి పండగలే... మేం తీజ్ పండగ చేసుకుంటాం. బతుకమ్మ పండగ కూడా అలానే. తీజ్ పండగకు మేం మొలకలను పూజిస్తాం. బతుకమ్మను పూలతో పూజిస్తాం. మొలకలు, పువ్వులు... రెండూ చెట్ల నుంచే వస్తాయి కాబట్టి రెండూ ప్రకృతి పండగలే. అందుకే బతుకమ్మ పాట పాడే తొలి అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాయడం, నేను పాడటం, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ చేయడం అన్నీ బాగా కుదిరాయి. పాటలు అందరూ బాగా పాడతారు... బాగా రాస్తారు... బాగా మ్యూజిక్ చేస్తారు. కానీ ఆ పాటను ఎంత బాగా చూపించామన్నది చాలా ముఖ్యం. దామోదర్ రెడ్డి తన డైరెక్షన్‌తో ఈ పాటను బాగా చూపించాడు. అన్నీ బాగా కుదరడంతో ఈ పాట జనాల్లోకి వెళ్లింది.ప్రతి ఇల్లూ ఆమెకు నిలయమే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు లేనిదే మనం లేము. ప్రతి ఒక్క దేవుడికి గుడి ఉంటుంది కానీ బతుకమ్మకు మాత్రం గుడి ఉండదు. మిట్టపల్లె సురేందర్ అన్న ‘పచ్చి పాల వెన్నెలా...’ పాటలో ఈ విషయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే... ఆ పాటలో ఆమెకి ఉన్నన్ని గుళ్లు ఏ దేవుడికీ ఉండవని రాశాడు. గుడి లేని ఆ దైవానికి ప్రతి ఒక్క ఇల్లూ నిలయమే. ప్రతి ఇంట్లో ఆమెను పూజిస్తారు కదా. ప్రతి ఇంట్లోనూ ఆమెను తయారు చేస్తారు. ఏ దేవతనూ తయారు చేసి పూజ చేయరు. కానీ గౌరమ్మను తయారు చేసి మరీ పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇల్లూ ఆమెకు గుడే.సంబరాలన్నీ జనాలతోనే... నేను బతుకమ్మను తొలిసారి తయారు చేసింది 2013లో. ఒక చానెల్ కోసం చేశాను. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో బతుకమ్మ పండగను జరుపుకుంటాం. అయితే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారం వంటివి చేసే వీలుండదు. నేనెక్కువగా బయటే జనాలతో పండగ చేసుకుంటా. నా బతుకమ్మ సంబరాలు మొత్తం జనాలతోనో అయిపోతాయి. ఇది కూడా అదృష్టమే.పూలనే దేవుడిలా పూజిస్తాం మనం ప్రతి దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిలా పూజించి, కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తులు వెలిగించడం అనేది బతుకమ్మకే జరుగుతుంది. ఈ పండగలో ఉన్న గొప్పతనం ఏంటంటే మగవాళ్లంతా ముందుండి తమ ఇంటి ఆడవాళ్లను దగ్గరుండి ఆడమని... పాడమని ప్రోత్సహిస్తుంటారు. తెలంగాణలో మహిళల్ని గౌరవించినంతగా ఇంకెక్కడా గౌరవించరు. అమ్మని అయినా బిడ్డల్ని అయినా ఎంతో గౌరవంగా చూస్తారు. ముందుండి నడిపిస్తారు. అంత గొప్ప కల్చర్ తెలంగాణాది. ఉన్నోళ్లు... లేనోళ్లు... మంచి చీరలు కట్టుకుని పండగ చేసుకుంటారు’’ అంటూ మా ఇంట్లో అమ్మకి, ఇంకా అందరికీ కొత్త బట్టలు కొంటాను. ఆనందంగా పండగ జరుపు కుంటాం అన్నారు మంగ్లీ.ఇది సందర్భం కాకపోయినా చెబుతున్నాను... నేను హనుమంతుణ్ణి బాగా పూజిస్తాను. ఆయన గుడి కట్టించాను. నేను కట్టించాలనుకున్నాను.... ఆయన కట్టించుకున్నాడు. గుడి లేకుండా నేను ఆయన్ను చూడలేకపోయాను. నా సంకల్పం నెరవేర్చు తండ్రీ అనుకున్నాను... నెరవేర్చాడు. నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో కట్టించాను. ఆయన ఆజ్ఞ లేనిదే అది జరుగుతుందా? ఇది అద్భుతమైన అవకాశమే కదా. – డి.జి. భవాని -
బోరివలిలో అంబరాన్నంటిన సంబరాలు బతుకమ్మ సంబరాలు
తెలుగు కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు ముంబై పరిసర ప్రాంతాలనుంచి మూడు వేలమంది మహిళల హాజరు తీరొక్క పూలతో కనువిందుగా బతుకమ్మల కూర్పుడప్పుచప్పుళ్ల మధ్య ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు కాలుకదిపిన అతివలు ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు బోరివలి: బోరివలి తూర్పులోని సుకూర్వాడి, గోపాల్ హేమ్రాజ్ హైస్కూల్ లో సుమారు రెండెకరాల సువిశాల స్థలంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారు. వేడుకల కోసం ఉత్తర ముంబై ప్రాంతాలైన దహిసర్, బోరివలి, కాందివలి, మలాడ్, గోరేగావ్, మాల్వా నీ, శివాజీ నగర్, దౌలత్ నగర్, నవగాం తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది కుటుంబ సమేతంగా తరలివచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి డప్పు చప్పుళ్ల మధ్య ఆటపాటలతో వాటి చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందుభోజనాన్ని ఆరగించారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు... బతుకమ్మలను అందంగా పేర్చిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కమిటీ ముందే ప్రకటించడంతో మహిళలు ఒకరికొకరు పోటీపడుతూ తమ బతుకమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మనీషా కొమ్ము న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ బతుకమ్మ పోటీల్లో మొదటి బహుమతి లాల్ జీ పాడ, కాందివలి ప్రాంత మహిళలు, ద్వితీయ బహుమతి సాయిబాబా నగర్, బోరివలికి చెందిన మహిళలకు అదేవిధంగా తృతీయ బహుమతి మలాడ్ పద్మశాలీ సంఘానికి చెందిన మహిళలకు లభించాయి. ఈ సందర్భంగా మైదానంలో వివిధ రకాల రంగవల్లులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది తెలుగు సంస్కృతిని జ్ఞప్తికి తెచ్చిన శారదరెడ్డి అనే మహిళను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, అతిధులు ఉత్తర ముంబై మాజీ లోక్‌సభ సభ్యుడు గోపాల్ శెట్టి, భాస్కర్ నాయుడు, స్థానిక కార్పోరేటర్ సంధ్య విపుల్ జోషి, బహుజన సాహిత్య అకాడమీ మహా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ నాగెల్ల తెలంగాణ ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ బతుకమ్మ వేడుకలను గురించి ప్రసంగించారు. అనంతరం వీరందరినీ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కార్యవర్గం అధ్యక్షుడు సునీల్ అంకం, కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తెర శంకరయ్య, ప్రధాన కార్యదర్శి ఎలిజాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మదుసుదన్ రావు, మేకల హనుమంతు, కోశాధికారి గాజుల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మనగర్‌లో బతుకమ్మ, దాండియా వేడుకలు పద్మనగర్ మహిళ సాంస్కృతిక సేవ మండలి నిర్వహించిన బతుకమ్మ, దాండియా వేడుకలకు మహిళలనుంచి విశేష స్పందన లభించింది. అదివారం సాయంత్రం స్థానిక పార్లమెంటు సభ్యురాలు ప్రణతి శిందే, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపాలి కాలే లాంఛనంగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. స్థానిక తెలుగు మహిళలతో కలిసి వారు కూడా బతుకమ్మ పాటలకు కాలు కదిపి కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో భాగంగా ప్రథమ స్థానంలో నిలిచిన వారికి బంగారు, అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి వెండి వస్తువులను బహూకరించారు. అదేవిధంగా దాదాపు 50 మంది మహిళలకు చీరలు, ఇతర రకాల దుస్తులను బహుమతులుగా అందించారు. అలాగే ఉత్తమంగా దాండియా ఆడిన మహిళలకు నిర్వాకులు నగదు బహుమతులపే అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మేయర్ శ్రీ కాంచన యన్నం, మాజీ కార్పొరేటర్ దేవేంద్ర కోటే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మహిళా మండలి అధ్యక్షురాలు లీనా ఆకేన్, సెక్రటరీ మంజుశ్రీ వల్లకాటి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న రవ్వ, కోశాధికారి అర్చన వల్లకాటి, సహాయ కోశాధికారి పల్లవి కనకట్టి, స్వాతి అడం, వందన గంజి పాల్గొన్నారు. థానేలో ఉత్సాహంగా ‘బతుకమ్మ’ థానేలో స్థిరపడిన తెలంగాణకు చెందిన గౌడ సమాజం సభ్యులు ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. థానే లూయిస్వాడీలోని షెహనాయి హాల్లో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా సంప్రదాయ వస్త్రధారణలో కార్యక్రమానికి విచ్చేసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. తమను చల్లగా చూడాలని బతుకమ్మను వేడుకున్నారు.అనంతరం బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నవారందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. గౌడ సమాజానికి చెందిన మహిళలందరినీ ఐక్యం చేసేందుకు గత రెండేళ్ల నుంచి ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో సంఘ ప్రముఖులు, పదాధికారులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు -
అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం బతుకమ్మ సంబరాలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల ఆడపడచులు, పిల్లలు, మరియు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను పేర్చి, జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి సందడి చేశారు. సింగపూర్ స్థానికులు కూడా ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. తెలుగువారంతా మమేకమై ఈ సంబరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ఆర్ ఆర్ హెచ్ సి , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.అందంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రదానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని.. గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ పేర్కొన్నారు. కుంభకర్ణ, Mr.బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రకర్రీ, మరియు బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి , ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు.సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. -
నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో
దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకొంటూ భక్తిపారవశ్యంలో భక్తులు మునిగి తేలుతున్నారు. మరోవైపు దాండియా, గార్బా నృత్యం, కోలాటాలతో ఈ ఉత్సవాలు మరింత శోభను సంతరించు కుంటున్నాయి. తాజాగా గుజరాత్లో నిర్వహించిన గార్బా డ్యాన్స్ కార్యక్రమం విశేషంగా నిలుస్తోంది. నెటిజన్ల ఫన్నీ కమెంట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ సందడి ఏంటో తెలుసుకుందాం పదండి! దసరా అంటే గార్బా సందడి ఉండాల్సిందే. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు,ఆఫీసులు, ఇతర ప్రదేశాలలో గర్బా ఈవెంట్లలో చిన్నా పెద్దా అంతా అందంగా ముస్తాబై నృత్యం చేస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో నవరాత్రి ఉత్సవాలకు దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గుజరాత్‌లోని ఒక గార్బా ఈవెంట్లో బ్రౌన్ కుర్తా, జీన్స్ ధరించిన యువకుడు తన చేతుల్లో పుస్తకాన్ని పట్టుకుని మరీ గార్బా స్టెప్పులేయడం విశేషంగా నిలుస్తోంది. తన తోటి డ్యాన్సర్లు నవ్వుతున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా, చక్కగా తన దారిన తాను నృత్యం చేస్తూ, పుస్తకంలో లీనమై పోయాడు. (అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?)చదువుకోవాలని అంటే ఎలా అయినా చదువుకోవచ్చు అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ఎక్స్ లో పోస్ట్ అయింది. దీనిపై నెటిజన్లు ఆ అబ్బాయి కమిట్మెంట్పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఇది మరీ విడ్డూరం.. చదువుకోవడానికి వేరే ప్రదేశమే దొరకలేదా? అంటూ మరికొందరు కమెంట్ చేశారు. ఈ వీడియో మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే అన్నట్టు ఇంకొక యూజర్ స్పందించారు. UPSC పరీక్షలకు సిద్ధమవుతున్నాడ నుకుంటా అని మరొక వినియోగదారు చమత్కరించారు. (సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్)'Padhne wale bacche kahi bhi padh lete hai' just got real 😭😭 pic.twitter.com/cieAIqUMmd— Ankita (@Memeswalimulagi) October 6, 2024 -
బంగరు నవ్వుల ఆట.. వాకిలయ్యే పువ్వుల తోట
సాక్షి,ముంబై: ముంబైలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వర్లీ, లోవర్‌పరెల్, బాంద్రా, అంధేరి, బోరివలి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పాటలతో సందడి నెలకొంది. ఒక్కేసి పువ్వేసి ఆడవే చెల్లి బతుకమ్మ పాట అంటూ మహిళలు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఓ వైపు బతుకమ్మ పాటలతోపాటు తెలుగు ప్రజలు కూడా దసరా నవరాత్రి ఉత్సవాల్లో దేవీమాతను అలంకరించే చీరల రంగుల ప్రకారమే చీరలు ధరించి బతుకమ్మలు ఆడుతూ కన్పిస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రతీరోజు ఒకే రంగు చీరలతో బతుకమ్మ ఆడుతూ సంబురాలు చేస్తున్నారు. తిరంగ వెల్ఫేర్ కమిటీ... బాంద్రాలోని తిరంగా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. తూర్పు బాంద్రా జ్ఞానేశ్వర్నగర్లో ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు ప్రతీ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలందరూ ఒకే రంగుల చీరలు ధరించి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెబుతున్నారు. తెలుగు రజక సంఘం... తెలుగు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. అంటప్హిల్ సీజిఎస్ కాలనీలోని గహ కల్యాణ్ కేంద్రహాల్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబురాలకు ముఖ్యఅతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కెపె్టన్ తమిళ సెల్వన్, స్థానిక కార్పొరేటర్ కృష్ణవేణిరెడ్డి, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎం.కొండారెడ్డి తోపాటు బీజేపీ ముంబై సౌత్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు అనీల్ కనోజియాలు హాజరయ్యారు. ముఖ్యంగా కృష్ణవేణిరెడ్డి మహిళల బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలతో పరిసరాలన్నీ మార్మోగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ముంబై ఆంధ్ర ఎడ్యుకేషన్ హై స్కూల్ కాలేజీ పదాధికారి పురుషోత్తంరెడ్డి, ముంబై రజక సంఘం ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ముంబై ప్రజాగాయకుడు గాజుల నర్సారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరినీ సంఘం పదాధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు నడిగోటి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు మర్రిపల్లి మల్లేశ్, ప్రధాన కార్యదర్శి అవనిగంటి రామలింగయ్య, కోశాధికారి భూమ చిన్న నరసింహ, ఉపకోశాధికారి భూమ యాదయ్య, కమిటీ సలహాదారులు భూమ పెద్దనర్సింహ, చెరుకు కృష్ణ, తాందారి వెంకటేశ్, బసవాడ కృష్ణ, భూమ సురేశ్, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ఎల్లయ్య, అక్కనపల్లి నరసింహ, బసాని ఉపేందర్, ఐతరాజు మల్లయ్య, భూమ వెంకటేశ్, భూమ శంకర, పున్న సోమయ్య, బొడ్డుపల్లి రాజుతోపాటు తదితరులతోపాటు విజయనగర్, మోతిలాల్నెహ్రూనగర్, వాడాలా, సైన్కు చెందిన మహిళలు కూడా పాల్గొన్నారు. పద్మశాలి యువక సంఘం...తూర్పు దాదర్ నాయిగావ్‌లోని పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. సంఘం హాల్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దాండి యా, కోలాటాలు ఆడి సందడి చేశారు. ముఖ్యంగా దసరా నవరాత్రులతోపాటు బతుకమ్మ సంబురాల నేపథ్యంలో ప్రతి ఏటా పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నవరాత్రి ఉత్స వాల తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు. అనంతరం స్థానిక సంప్రదాయాలమేరకు యువత దాండియా కోలాటాలు ఆడారు. ఇక అక్టోబరు 10వ తేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా దాండియా, కోలాటాలు మంచిగా ఆడి విజేతలుగా నిలిచిన వారికి అక్టోబరు 22న సద్దుల బతుకమ్మ పండుగ రోజున బహమతులు అందించనున్నారని సంఘం అధ్యక్షుడు గంజి సీతారాములు వెల్లడించారు. అదేవిధంగా సద్దుల బతుకమ్మ రోజు అందంగా పేర్చిన బతుకమ్మలకు, బతుకమ్మలు బాగా ఆడినవారికి కూడా బహమతులు అందించనున్నారన్నారు. మరోవైపు శనివారం ఆడిన దాండియా, కోలాటాల పోటీలకు అతిథిగా హాజరైన తిలక్‌నగర్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యురాలు పారెపెల్లి లత, మహారాష్ట్ర తెలుగు మహిళ సంస్థ కార్యదర్శి గాజెంగి హారికలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అతిథులను న్యాయనిర్ణేతలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సంఘం మహిళ మండలి ఉపాధ్యక్షురాలు జిల్లా శారద, కార్యదర్శి చెరిపెల్లి పరమేశ్వరి, సహ కార్యదర్శి బిట్ల సోని, కోశాధికారి పేర్ల గీతాంజలి, సభ్యులు అడ్డగట్ల ఐశ్వర్య, చెడుదుపు పద్మ, దొంత ప్రభావతి, ఇడం పద్మ, గుజ్జరి జాహ్నవీ, కైరంకొండ లక్షి్మ, కండ్లపెల్లి కవిత, మహేశ్వరం సాక్షి, పగుడాల రోహిణి, సీతారేఖ, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడి చంద్రమౌళి, అనబత్తుల ప్రమోద్, పొన్న శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లక్సెట్టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, కోశాధికారి దోర్నాల బాలరాజు, దుస్స అమరేంద్ర, దోమల శంకర్, కస్తూరి గణేశ్, పుట్ట గణేశ్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పద్మశాలి సంఘం... సిరిసిల్ల పద్మశాలి సంఘం ముంబై శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వర్లీ బీడీడీ చాల్స్‌లోని మార్కండేయ మందిరం ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిఫలించేలా ఆడపడచులు బతుకమ్మ పాటలు ఆలపిస్తూ పూలతో పేర్చిన బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల సంఘం మహిళలే కాకుండా స్థానిక, వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో పాల్గొన్న వివాహిత మహిళలకు లక్కీడిప్ ద్వారా 15 మందిని ఎంపికచేసి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ఉపాధ్యక్షుడు కొక్కుల రమేశ్, ప్రధాన కార్యదర్శి యేముల లక్ష్మీనారాయణ, సంయుక్త కోశాధికారి దూస మురళీధర్, కోశాధికారి సుంక ప్రభాకర్, సంయుక్త కోశాధికారులు ఆడెపు చంద్రశేఖర్, అడ్డగట్ల ముఖేశ్ సాంస్కృతిక అధికారి మార్గం శ్రీనివాస్, సోషల్ మీడియా అడ్మిన్ అడెపు అశోక్, కమిటీ సభ్యులు కోడం మనోహర్, ముదిగంటి అంజనేయులు, జిందం దశరథ్, జిందం నాగేశ్, కోడం గంగాధర్, వాసం నారాయణ, గాజుల సురేశ్, వాసా ల గంగాధర్, కట్టెకోల అశోక్, యంజాల్ భూమేశ్వర్, గాలిపెల్లి లక్ష్మణ్, వాసం అనిల్ కుమార్, రాపెల్లి సతీశ్, సలహాదారులు దూస నారాయణ, అడ్డగట్ల సుదర్శన్, ఆడెపు హనుమంతు పాల్గొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక, టూరిజం శాఖ, ఎఫ్–టామ్ సంయుక్త ఆధ్వర్యంలో..తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఎఫ్–టామ్ సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని థానేలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన మహిళలు తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెబుతూ బతుకమ్మ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. బతు కమ్మ వేడుకలకు హాజరైన మహిళలు గోదావరి, కావేరి, గంగ వంటి దేశంలోని వివిధ నదుల పేర్లతో గ్రూపులుగా విడిపోయి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో గోదావరి మహిళా బృందానికి మొదటి బహుమతి రాగా, గంగా నది మహిళా గ్రూపునకు రెండవ బహుమతి, కావేరి నది మహిళా గ్రూపునకు మూడో బహుమతి లభించాయి. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు అంజలి మచ్చ ఆధ్వర్యంలో స్నేహ అంబ్రె, రమేశ్ అంబ్రె, ఎఫ్–టామ్ సంస్థ అధ్యక్షుడు గంజి జగన్ బాబు చేతులమీదుగా చీరలు అందజేశారు. కార్యక్రమంలో రాఘవరావు, కిరణ్మయి, సునీల్ బైరి, వాణి వేముల, విజయ, స్నేహ వంగ, స్నేహ బొమ్మకంటి, మహేశ్ గుజ్జ, రాధిక, రమేశ్, పద్మాకర్, అర్జున్, సుభాష్, మహేంద్ర, హరితరావు, సత్యనారాయణ కంచెర్ల పాల్గొన్నారు. -
బతుకమ్మ దశ దిశలా చాటే సంస్కృతి
చేతల్లోనూ, గొంతుల్లోనూ, ఊరువాడల్లోనూ విరాజిల్లుతూ వర్ధిల్లే బతుకమ్మ ఏనాడు పుట్టిందో, ఏనాడు పెరిగిందో నేటికీ తెలంగాణను ఒక్కతాటి మీదుగా నిలుపుతోంది. జాతి వైభవాన్ని చాటుతోంది. శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరి భాగంలో (ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు) జరిగే వేడుక బతుకమ్మ. రుతుపవనాల వర్షాలు మంచినీటి చెరువులలోకి పుష్కలంగా నీటిని తెస్తాయి. తెలంగాణ ్ర΄ాంతంలోని సాగు చేయని, బంజరు మైదానాలలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించే సమయం కూడా ఇదే. వీటిలో అత్యధికంగా లభించేవి ‘గునుగు, తంగేడు పూలు.’ ఇక సీతజడ, బంతి, చెమంతి, గోరింట, గుమ్మడి, కట్లపూలు... పూల పేర్లు చెప్పుకుంటూపోవడం కన్నా అవన్నీ ఒక్క చోట చేర్చిన వారి శ్రమ, ఆ పూల అందం ఎంత చెప్పినా తనివి తీరదు. ప్రకృతి తన సౌందర్యాన్ని ఈ అనేక రకాల పువ్వుల రంగులతో తెలియజేస్తుంది. ఈ పూలన్నీ కలిస్తే ఉండే అందం స్త్రీలంతా ఒక్కచోట చేరి ఆట ΄ాటలతో శక్తి స్వరూపిణిని కొలవడంలో, వారి పాటల్లో తెలుస్తుంటుంది.స్వేచ్ఛకు ప్రతీకదసరాకు ముందు వచ్చే ’సద్దుల బతుకమ్మ’ కి ఆడబిడ్డలు అత్తవారింటి నుండి తల్లిగారింటికి తిరిగి వచ్చి, పువ్వుల రంగులను జరుపుకోవడానికి స్వేచ్ఛ, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజున ఇంటి పెద్దతో పాటు బతుకమ్మ ను అందంగా పేర్చడానికి ఆ ఇంట్లో అందరూ ఒక చోట కూర్చుంటారు. పువ్వులు వృత్తాకార వరుసలలో, రంగులలో ఇత్తడి ప్లేట్లో జాగ్రత్తగా వరుస తర్వాత వరుసలో అమర్చుతారు. సాయంత్రం సంప్రదాయ వేష ధారణలో తమ ్ర΄ాంగణంలో అంతా చేరి, బతుకమ్మను ఉంచి, చుట్టుపక్కల మహిళలు పెద్ద వలయంలో గుమికూడుతారు. బతుకమ్మల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నట్టు తిరుగుతూ,పాటలు పాడటం మొదలు పెడతారు. ఐకమత్యం, ప్రేమ, సోదరీమణుల ఆనందానికి బతుకమ్మ ప్రతీక.సామూహిక సందడిబతుకమ్మ పాటలు పాడి, ఆడలు ఆడి, చివరకు వాటిని తలపై ఎత్తుకొని ఊరేగింపుగా పెద్ద నీటి ప్రదేశానికి చేరుకుంటారు. బతుకమ్మలను నెమ్మదిగా ఆ నీటిలో వదులుతారు. చేసిన ప్రసాదాలను పంచుకుని, బతుకమ్మను కీర్తిస్తూపాటలుపాడుతూ తిరిగి వస్తారు. కష్టం, సుఖం చెప్పుకోవడం, తీపిదనాన్ని పంచుకోవడం కూడా ఈ వేడుక మనసును తృప్తి పరుస్తుంది.నీటి స్వచ్ఛతబతుకమ్మ... భూమి, నీళ్లతో మానవుల మధ్య అంతర్గత సంబంధాన్ని చూపుతుంది. కొన్ని చోట్ల బతుకమ్మతో పాటు ’బొడ్డెమ్మ’ (గౌరీ దేవిని మట్టితో తయారు చేస్తారు)ను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ ప్రక్రియ చెరువులను బలోపేతం చేయడానికి, మరింత నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు నీటిని శుద్ధి చేసే గొప్ప నాణ్యతను కలిగి ఉంటాయి. వ్యవసాయ నేపథ్యం ఉన్న స్త్రీలు ప్రకృతి సౌందర్యాన్ని పండగలా జరుపుకోవడం ద్వారా చెరువులను ఎలా మెరుగుపరచాలో అంతర్లీనంగా వారికి తెలుసు. ఈ పండుగ ప్రకృతి, ప్రజల సామూహిక, మహిళా జనాదరణ పొందిన స్ఫూర్తి. అలాగే ప్రకృతి వనరులను వేడుకగా సంరక్షించడంలో వ్యవసాయదారుల శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేస్తుంది. అందుకే బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. మన దేశంలోబతుకమ్మ వేడుకను దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులలో స్థిరపడిన తెలంగాణ వాళ్లు ఇప్పటికీ జరుపుకుంటున్నారు ∙బతుకమ్మ పండగ వచ్చిందంటే బెంగళూరు, పుణె వీధుల్లోనూ ఊయ్యాల ఆటపాటల కళ కనపడుతుంది. పూణెలో కూడా బతుకమ్మ పండగ సందడి జోరుగానే ఉంది ∙ముంబైలో డీజీపాటల స్టెప్స్ వేస్తూ బతుకమ్మ ఆటలతో సందడి చేస్తుంటారు. భిన్న సంస్కృతుల ముంబై తెలంగాణ సంస్కృతినీ స్వీకరించింది. విదేశాలలోనూ... నేపాల్, అమెరికా, సింగపూర్, కెనడాలో, న్యూజిలాండ్.. మొదలైన దేశాలలో ఉన్న తెలంగాణీయులు బతుకమ్మ సంస్కృతికి జీవం పోస్తున్నారు. తమ కమ్యూనిటీలో అందరినీ ఒక చోట చేర్చి, సంబరం జరుపుకుంటున్నారు. భావి తరాలకు బతుకమ్మను మరింత వైభవంగా అందిస్తున్నారు. -
స్కాట్ లాండ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని స్థానిక తెలుగు సంఘం నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ భూమి మాత లేదా భూమి దేవి మన పవిత్ర ప్రకృతి దేవత. ప్రకృతికి బతుకమ్మ ఒక ప్రతీక. ఆమెపై జీవించిన ప్రతి రూపానికి ఆమె తల్లి. మన హిందూ మతం శాశ్వతమైనది (సనాతన ధర్మం) అని నమ్ముతారు. దైవత్వం. ప్రకృతి తల్లి యొక్క విడదీయరాని స్వభావాన్ని గుర్తించి ఆరాధించే లోతైన పర్యావరణ విధానం కోసం ఆధ్యాత్మిక మరియు తాత్విక సాధనాలను అందిస్తుందన్నారు.గ్లాస్గో దక్షిణ భాగంలో, మనకు అధిక సంఖ్యలో హిందూ సమాజం ప్రకృతిలో పెరుగుతోంది. దీనికి సమీపంలో మందిరం లేదా సాంస్కృతిక కేంద్రం లేకపోవడంతో మదర్ ఎర్త్ హిందూ దేవాలయం ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత స్థలాన్ని గుర్తించారు. ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘం డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల , వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి, బతుకమ్మలను జరుపుకుంటారు. చిరకాలం నిలిచిపోయే వేడుక జరగడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నవరాత్రి అలంకరణలో నవనవోన్మేషంగా...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.3వ తేదీ గురువారం – శ్రీబాలా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో తొలిరోజున దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.4వ తేదీ శుక్రవారం – శ్రీగాయత్రిదేవిరెండోరోజున దుర్గమ్మ శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. వేదమాత గా గాయత్రిదేవిని దర్శించుకోవడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం ΄÷ందుతారు.5వ తేదీ శనివారం – శ్రీఅన్నపూర్ణాదేవిదసరా ఉత్సవాలలో మూడోరోజున దుర్గమ్మను శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని ΄÷ందగలుగుతారు.6వ తేదీ ఆదివారం- శ్రీలలితా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో నాల్గో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తుల పూజలందుకుంటారు.7వ తేదీ సోమవారం – శ్రీ మహాచండీదేవిఐదవ రోజున దుర్గమ్మ శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయి.8వ తేదీ మంగళవారం – శ్రీమహాలక్ష్మీదేవిఆరో రోజున దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక స్ధితికారిణిగా, «అమృత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య్ర΄ాప్తి కలుగుతుంది. 9వ తేదీ బుధవారం – శ్రీసరస్వతిదేవిఏడవరోజయిన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల సర్వ విద్యలయందు విజయం ΄÷ందుతారు.10వ తేదీ గురువారం – శ్రీదుర్గాదేవి 8వ రోజున దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను ΄ోగొట్టి దుర్గగా వెలుగొందినది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని ఆర్చించటం సద్గతులను ప్రసాదిస్తుంది.11వ తేదీ శుక్రవారం – శ్రీమహిషాసుర మర్ధనిదేవిదసరా ఉత్సవాలలో 9వ రోజున దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధనిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల అరిష్ట్వర్గాలు నశించి, సాత్విక బావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పంటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.12వ తేదీ శనివారం – శ్రీరాజరాజేశ్వరిదేవిదసరా ఉత్సవాలలో 10వ రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తం తో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహా మంత్ర స్వరూపిణి గా, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.– సుభాని, సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) -
Bathukamma 2024 నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ స్పెషల్
తెలంగాణా పల్లెపల్లెల్లో బతుకమ్మ సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. రంగు రంగుల పూలతో అత్యంత సుందరంగా బతుకమ్మలను పేర్చి తెలంగాణా ఆడబిడ్డలు సంప్రదాయ దుస్తుల్లో గౌరమ్మను కొలుస్తున్నారు. ప్రతీ రోజు సాయంత్రం బతుకమ్మ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో పూల పండుగను జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుతారు. నాలుగో (అక్టోబరు 5,శనివారం) రోజు బతుకమ్మ ‘నానేబియ్యం బతుకమ్మ’గా పిలుస్తారు. గౌరమ్మను తయారు చేసి, గుమ్మడి తంగేడు, బంతి, గునుగు లాంటి రకరకాల పూలతో అలంకరిస్తారు. గౌరమ్మకు ఈరోజు నైవేద్యంగా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చెక్కరతోకలిపి ముద్దలు చేసి పెడతారు. రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడి ఆకలితో జగన్మాత అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానబెట్టిన బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదాన్ని ఆనందంగా అందరూ పంచుకుని తింటారు.కాగా తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. -
దసరాకు ఆ పేరు ఎలా వచ్చింది?
దసరా పండగకు కొత్త బట్టలు కొనుక్కోవడం, అమ్మ చేసిన రకరకాల పిండివంటలు తినడం, సెలవలకు ఊళ్లకెళ్లడం అందరికీ తెలుసు. అయితే అంతకన్నా ముందు అసలు దసరా పండగకు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా... అక్కడికే వద్దాం... దశ అహః అంటే పది రోజులు అని అర్థం. దశ అహః అనే పదమే దశహర అయింది. దశహర, పది రోజులు అనే పదం కాలక్రమంలో ‘దసరా’ గా మారింది. దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది.దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు దసరా అంటే దక్షిణాదిన అమ్మవారి పూజకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, ఉత్తరాదిన రాముని లీలలను గానం చేసేందుకు అంతే ఉత్సాహం చూపుతారు. వారి దృష్టిలో దసరా అంటే అమ్మవారు మహిషాసురుని సంహరించిన రోజు మాత్రమే కాదు, రాముడు, రావణుని చంపిన రోజు కూడా. అందుకే ఈ పది రోజుల పాటు అక్కడ రామాయణంలో ఘట్టాలను వర్ణిస్తూ.. చివరి రోజున ‘రావణ దహన్’ పేరుతో రావణుడి భారీ దిష్టిబొమ్మను దహనం చేస్తారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏటా ఈ వేడుకలు అట్టహాసంగా సాగుతాయి. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటానికి వేలాది భక్తులతో పాటు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తారు.సమయం, వ్యక్తిగత కారణాల రీత్యా కొంత మందికి రామ్‌లీలా మైదానంలో జరిగే వేడుకలను వీక్షించడం కుదరదు. చాలా మందికి ఈ వేడుకల విశిష్టత కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ రెలీజియస్ యాప్ ‘హౌస్ ఆఫ్ గాడ్’ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. రామ్‌లీలా మైదానంలో వేడుకలను ఈ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందించనుంది. -
Dussehra 2024 : శరన్నవరాత్రులు, అన్నపూర్ణాదేవిగా పూజలు
దసరా సందర్బంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవ రాత్రులలో తొలి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండో రోజు గాయత్రిదేవిగా భక్తుల పూజలందుకున్న ఆ జగన్మాత మూడో రోజు(అక్టోబర్ 5వ తేదీ శనివారం)అమ్మవారిని అన్నపూర్ణా దేవి రూపంలో పూజిస్తారు. మూడోరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజలందుకోనుంది.ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి 'భిక్షాందేహి కృపావలంబన కరీ, మాతాన్నపూర్ణేశ్వరీ!' అని ప్రార్థిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అన్నం పరబ్రహ్మస్వరూపం. సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించాలని అన్నపూర్ణ దేవిని వేడుకుంటారు. అంతేకాదు ఈ రోజునే తల్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, కట్టె పొంగలి, దధ్యోజనం నైవేద్యంగా పెడతారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. మరోవైపు శరన్నవరాత్రుల్లో భాగంగా నాడు మూడో రోజు చంద్రఘంట మాతను ఆరాధిస్తారు. దుర్గా దేవి మూడో రూపమే చంద్రఘంట దేవి.చంద్రఘంట మాత పూజ చేసే వారు ఎక్కువగా ఎరుపు, నారింజ రంగులను ఉపయోగిస్తారు. ఎర్ర చందనం, ఎర్ర చున్ని, ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లను నైవేద్యంగా నివేదిస్తారు. అలాగే చంద్రఘంట అమ్మవారికి పాలతో చేసిన తియ్యని పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. (నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు ) -
నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు
దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. ఆ ప్రసాదాలను పిల్లలు ఇష్టంగా తినాలి. పొంగలి... పులిహోరకు తోడు ఇంకేం చేద్దాం. పచ్చికొబ్బరితో లడ్డు... మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ ట్రై చేద్దాం. మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ కావలసినవి: పెసరపప్పు – అరకప్పు; నీరు – ఒకటిన్నర కప్పు; కొబ్బరిపాలు – ముప్పావు కప్పు (కొబ్బరి పాలు వీలుకాక΄ోతే గేదెపాలు లేదా ఆవుపాలు); బెల్లం పొడి– ముప్పావు కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు – పది; కిస్మిస్ – పది ; ఎండుకొబ్బరి పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; వెన్న తీయనిపాలు – అరలీటరు (పావు వంతుకు ఇంకే వరకు మరిగించాలి).తయారీ: ∙మందపాటి పెనం వేడి చేసి అందులో పెసరపప్పు వేసి మంట తగ్గించి పచ్చివాసనపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వేడి తగ్గిన తరవాత పప్పును కడిగి నీటిని ΄ోసి ప్రెషర్ కుకర్‌లో రెండు – మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ∙ఈ లోపు బెల్లం పొడిని ఒక పాత్రలో వేసి నాలుగు టేబుల్ స్పూన్ల నీటిని పోసి మరిగించాలి. చిక్కబడేటప్పుడు దించి పక్కన పెట్టాలి ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిన్, ఎండుకొబ్బరి పలుకులను వేయించి పక్కన పెట్టాలి ∙ప్రెషర్ కుకర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పును మెదపాలి. అందులో కొబ్బరిపాలు కలిపి స్టవ్ మీద పెట్టి ఒక చిన్న మంట మీద ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పాకం, యాలకుల పొడి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చిక్కటి పాలను కూడా పోసి కలిపితే పెసరపప్పు పాయసం రెడీ. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఎండుకొబ్బరి పలుకులను నేతితో సహా వేసి కలపాలి. గమనిక: నీటి కొలత ప్రెషర్ కుకర్‌లో ఉడికించడానికి మాత్రమే. పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే కనీసం మూడు కప్పుల నీరు అవసరమవుతుంది. కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; యాలకుల పొడి– పావు టీ స్పూన్ ; జీడిపప్పు – 10; నెయ్యి– టీ స్పూన్; చక్కెర – ముప్పావు కప్పు (రుచిని బట్టి మోతాదు మార్చుకోవాలి); పాలు – కప్పు. పచ్చికొబ్బరితో లడ్డు..తయారీ: ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి ∙అదే పెనంలో కొబ్బరి తురుము,పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించాలి ∙మిశ్రమం అడుగుకు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండాలి పాలు, చక్కెరలను కొబ్బరి తురుము పూర్తిగా పీల్చుకుని తేమ ఇంకిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో జీడిపప్పు వేసి కలిపి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో చేతుల్లోకి తీసుకుని లడ్డూలు చేయాలి. గమనిక : చక్కెర బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే చూడడానికి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలకు చక్కెర తింటే జలుబు చేసేటట్లయితే బెల్లంతో చేసుకోవచ్చు. -
పూలు పేర్చి.. బతుకమ్మ ఆడి : బతుకమ్మ వేడుకలు ఘనంగా
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పసుపుతో తయారు చేసిన గౌరమ్మకు బియ్యం పిండి, నువ్వులు, నూకలతో తయారు చేసిన ప్రసాదంగా నివేదించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, యువతలు బతుకమ్మలను ఒక చోట పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. – కుత్బుల్లాపూర్ -
శ్రీవారి బొమ్మల కొలువు
దేవీశరన్నవరాత్రి, దసరా ఉత్సవాల్లో భాగంగా.. కూరత్తాళ్వార్ వంశానికి చెందిన వేదవ్యాస భట్టార్లు గురువారం తమ ఇళ్లల్లో తమిళ సంస్కృతిలో శ్రీవారి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని శ్రీరంగం, తిరుచురాపల్లికి చెందిన కూరత్తాళ్వార్ వంశానికి చెందిన వేదవ్యాస భట్టార్లు ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. తమ ఇళ్లల్లో వివిధ రూపాల్లో విష్ణుమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ అని వారు తెలిపారు. – కేసముద్రం -
ముంబైలో ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు
సాక్షి,ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. నగరంతోపాటు వర్లీ, బాంద్రా, అంధేరి, గోరేగావ్, బోరివలి, థాణే, భివండీ, సోలాపూర్లలో నివసించే తెలుగు ప్రజలు బుధవారం ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో దసరా వేడుకలకు స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా తొలిరోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ను పూజించిన తెలంగాణ మహిళలు బతుకమ్మ పాటలు, కోలాటాలతో ఉల్లాసంగా గడిపారు. ఉత్సవాల నేపథ్యంలో ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోంది. మరోవైపు శరన్నవరాత్రుల సందర్భంగా బెంగాలీలు దుర్గాదేవి విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేస్తుండగా, గుజరాతీలు పూజా కార్యక్రమాలతో పాటు ‘గర్భా’, దాండియాల్లోనూ ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. సద్దుల బతుకమ్మతో ముగింపు...తెలుగువారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవుళ్లకు పువ్వులతో పూజలు చేయడం సహజం కానీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో విడదీయలేని భాగమైన బతుకమ్మ పండుగ సందర్భంగా రకరకాల, రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి వాటికే పూజలు నిర్వహించడం విశేషం. ఇలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పూజించిన మహిళలు చివరి రోజున భారీ ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుని బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. రద్దీగా దేవీ ఆలయాలు... దసరా సందర్భంగా ముంబైతోపాటు రాష్ట్రంలోని మహాలక్ష్మి, మహాకాళి, దుర్గాదేవి, లక్షి్మదేవి తదితర అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాభవానీ, కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి, మావూర్లోని రేణుకా మాత, నాసిక్ జిల్లాలోని సప్తశృంగి దేవి ఆలయాలతో పాటు అదే విధంగా ముంబైలోని మహాలక్షి్మ, ముంబాదేవి, ఠాణే జిల్లాలోని వజ్రేశ్వరీ, విరార్‌లోని జీవ్దనీ మాతా, ముంబ్రాలోని కొండపై ఉన్న ముంబ్రా దేవి మందిరాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. కాగా శరన్నవరాత్రుల తొలిరోజునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యం కోసం భద్రతా ఏర్పాట్లతోపాటు తాగు నీరు, ఇతర సదుపాయాలను కల్పించడంలో ఆలయ కమిటీలు నిమగ్నమయ్యాయి. నాయిగావ్ పద్మశాలీ యువక సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో...దాదర్ నాయిగావ్‌లోని పద్మశాలీ యువక సంఘానికి చెందిన మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక తెలుగు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజించారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా అక్టోబరు 5నకోలాటం, దాండియా, అక్టోబరు 10నసద్దుల బతుకమ్మ సంబరాలను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గంజి సీతారాములు తెలిపారు. ఈసంబరాల్లో ఉత్తమ బతుకమ్మను పేర్చిన, చూడచక్కని బతుకమ్మ అడిన మహిళలకు, బాల బాలికలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గంజి సీతారాములు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, సంఘం మహిళా మండలి ఉపాధ్యక్షురాలు జిల్ల శారద, కార్యదర్శి చెరిపెల్లి పరమేశ్వరి, కోశాధికారి పేర్ల గీతాంజలి, సభ్యులుఅడ్డగట్ల ఐశ్వర్య, గుజ్జరి జానవి, కస్తూరి సావిత్ర, మహేశ్వరం సాక్షి, సీత రేఖలతో పాటు స్థానిక మహిళలు, బాలికలుపెద్దఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో... పశి్చమ గోరెగావ్, హనుమాన్ నగర్‌లోని తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరూ తీరొక్క పూలను అందంగా పేర్చి బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘం కమిటీ అధ్యక్షుడు మల్లేష్ ప్రధాన కార్యదర్శి స్వామి లెంకలపల్లి, ఉపాధ్యక్షుడు శేఖర్ వంటిపాక, నరసింహా బినమోని, కోశాధికారి గణేష్ మచ్చ, నరసింహ నాయక్, శ్రీనివాస్ రెడ్డి మన్నే. సహాయ కార్యదర్శులు బద్దం శంకర్, లక్ష్మణ్ ఎర్ర, మల్లేష్ సురి్వ, సలహాదారులు పరమేష్ నర్సిరెడ్డి, మన్నే జనార్దన్, మల్లేష్ గాదె, కృష్ణ కురుపాటి, శ్రీను కిష్టం, జాని స్వామి, వెంకటేష్ .వి, రాములు, నర్సింహ్మ ఎర్ర, శంకర్ బాబు, శంకర్ .డి, బిక్షం యాదయ్య, ఎ స్వామి, రంగనాధం,లింగయ్య జి, సుధాకర్ రెడ్డిలతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ బాలాజీ రజక మిత్ర మండల్ ఆధ్వర్యంలో... దహిసర్ నవగాం, హనుమాన్ టేకిడి ప్రాంతంలోని శ్రీ బాలాజీ రజక మిత్ర మండల్ ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు మహిళలు సంప్రదాయబద్ధంగా ముస్తాబై రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం ఒకరికొకరు వాయనాలు, ప్రసాదాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ముంబై అంటాప్ హిల్ చర్చి సమీపంలోని మరియమ్మ మందిరంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. స్థానిక తెలుగు మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ్ సెల్వన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ... బుధవారం నవీముంబైలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహాసభ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాదిరెడ్డి కొండారెడ్డిని తెలుగు కళా సమితి అధ్యక్షుడు బండి నారాయణ రెడ్డి. ఉపాధ్యక్షుడు బి. సుబ్రమణ్యం. కే. వరలక్ష్మి, వహీదా షేక్ ఘనంగా సన్మానించారు. చిరాగ్ నగర్ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో... ఘాట్కోపర్,చిరాగ్నగర్లోని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మఆడుకున్నారు. శివాజీ నగర్, గీతాంజలి గార్డెన్లో...దహిసర్ ప్రాంతంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన తెలుగువారు తీరొక్క పూలతో ఎంగిలి పూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. శివాజీ నగర్ ప్రాంతంలోని గీతాంజలి గార్డెన్లో బతుకమ్మ పండుగ సంబరాలు తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పానుగుళ్ల వసుమతి, తేజస్విని కుకడపు, కవిత నందిపాటి, దీపిక పానుగుళ్ల, శిరీష జాల, మమత చినాల, లావణ్య కుకడపు, రేణుక గోగు, రేణుక, బాల కందే తదితరులు పాల్గొన్నారు. తూర్పు డోంబివలిలో...తూర్పు డోంబివలి, పలావా ఫేజ్ 2లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ పండుగ జరిగింది. మొట్టమొదటిసారి జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాకినాకాలో... సాకినాకాలోని పోచమ్మ గుడి వద్ద తెలుగు ప్రజలు ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలుఘనంగా ‘ఎంగిలి పూల బతుకమ్మ’ సంబరాలు -
శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమైనాయి. భక్తులు తొమ్మిది రోజుల పాటు, ఆ జగన్మాతను భక్తితో ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వారి వారి ఆచారాలు, పద్ధతుల ప్రకారం అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వడోదరలో ఒక ప్రత్యేకమైన నవరాత్రి సంప్రదాయం గురించి తెలుసుకుందాం.నవరాత్రి వేడుకల్లో భాగంగా గుజరాత్లో పురుషులు ఆనాదిగా ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు. 200 సంవత్సరాల నాటి శాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నవమిరోజు సంప్రదాయ బద్ధంగా మహిళల్లా దుస్తులు ధరిస్తారు. అంతేకాదు చీర కట్టుకొని అష్టమి రోజు రాత్రం జానపద నృత్యమైన షేరీ , గర్బా నృత్యం చేస్తారు. ‘సాదుబా మాత’ను పూజిస్తారు. ( Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!)తరతరాలుగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 200 ఏళ్ల క్రితం, ‘సదుబెన్’ అనే మహిళను ఒక మొఘల్ కులీనుడు లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. దీంతో బారోట్ సమాజంలోని పురుషులను రక్షణ కోరింది. దీనికి సదరు పురుషులు సాయం చేసేందుకు నిరాకరిస్తారు. ఫలితంగా ఆమె బిడ్డను కోల్పోతుంది. ఈ బాధ, దుఃఖం, ఆవేదనతో భవిష్యత్ తరాల పురుషులు పిరికిపందలుగా మారతారని శపించి 'సతీ'ని పాటించింది. (మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!)ఇదీ చదవండి: శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యంఆ శాపం చాలా శక్తివంతమైందిగా అక్కడి వారు ఇప్పటికీ నమ్ముతారు. అందుకే ఈ ఈ ఆచారాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. సాదుమాను శాంతింప చేసేందుకు, ఆమెను గౌరవించుకునేందుకు ఒక ఆలయాన్ని నిర్మించారు. నవమి రోజు ప్రత్యేక పూజలు చేసి భవిష్యత్తరాన్ని కాపాడాలని వేడుకుంటారు. -
Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!
నేటినుంచి ఆశ్వీయుజ మాసం ఆరంభం అవుతోంది. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజులను నవ రాత్రులు అంటారు. నవ రాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని ’శరన్నవరాత్రి ఉత్సవాలు’గా, ’దేవీనవ రాత్రులు’గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈతొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో,వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజులపాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... సుఖశాంతులు చేకూరుతాయని పండితులు చెబుతారు. ఇక దేవీ నవరాత్రి పూజలు చేయుట, అనునది అనాది కాలంగా వస్తున్న శాస్త్రవిధి. ‘అశ్వనీ‘ నక్షత్రంలో కలసి వచ్చిన పూర్ణిమమాసమే ‘ఆశ్వీయుజమాసం‘ అవుతుంది. ఈ మాసమందు ’దేవీనవరాత్రుల’ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.∙ప్రథమాశైలపుత్రి,ద్వితీయా బ్రహ్మచారిణీ ∙తృతీయాచంద్రఘంటీతి, ∙కూష్మాండేతి చతుర్థికీ ∙పంచమా స్కందమాతేతి∙షష్టాకాత్యాయనేతి ∙సప్తమా కాళరాత్రిచ ∙అష్టమాచాతి భైరవీ ∙నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ ‘దసరావైభవం‘ ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు నిత్యం శ్రీలలితా సహస్రనామ పారాయణ గావిస్తూ ‘శరన్నవరాత్రులు‘ గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త ’దశమి’ తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు ‘దశహరా‘ అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెబుతారు దైవజ్ఞలు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రంలో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు. అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలనిపెద్దలు చెబుతున్నారు.దుర్గమ్మకు దసరా అలంకారాలు∙స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ( పాడ్యమి) ∙శ్రీ బాల త్రిపుర సుందరి (విదియ) ∙శ్రీ అన్నపూర్ణా దేవి (తదియ) ∙శ్రీ గాయత్రి దేవి (చవితి) ∙శ్రీ లలిత త్రిపుర సుందరి(పంచమి) ∙శ్రీ మహాలక్ష్మి దేవి (షష్టి) ∙శ్రీ సరస్వతి దేవి (సప్తమి) ∙శ్రీ దుర్గాదేవి (అష్టమి) ∙శ్రీ మహిషాసురమర్ధిని దేవి (నవమి) ∙శ్రీ రాజ రాజేశ్వరి దేవి (దశమి) -
నేటినుంచి పూల పండుగ: ఇల్లిల్లూ ఓ గుడి... వీధంతా సింగిడి
తెలంగాణ అంతటా గ్రామ గ్రామాల్లో సంబరంగా చేసుకునే పండగ బతుకమ్మ పండుగ. ఆటపాటలతో, ఆనందంగా ప్రజలు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన సంరంభం ఈ పండుగ. వానాకాలం వెళ్లేముందు తెలంగాణ ప్రాంతంలో విరబూసే తంగేడు పూలతో సింగారించుకున్న పల్లె పడుచులతో ఎటు చూసినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలుగులు పారే చెరువులూ, నిండుగా ఉన్న కుంటలూ, ఆపైన గట్లమీద పూసే వెండి జిలుగుల గునుగుతో పల్లెలు అందాలు సంతరించుకుకుంటాయి.పూరిగుడిసెలమీద, పందిరిమీద, పొదలమీద, పెరట్లోనూ, విరగబూసిన బీరపూలూ, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో పసిడి పూసినట్లుగా హరివిల్లులా– కనిపిస్తాయి గ్రామీణ కుటీరాలు. ఇంద్రధనుస్సు దిగివచ్చిందా అన్నట్లు బతుకమ్మ పూలతో నిండుగా నవ్వుతూ స్వాగతం పలుకుతాయి పొలంగట్లు. పూలు కోసుకురావడం ఒక్కటే మగవారి వంతు. ఇక ఆ తర్వాత హడావుడి అంతా ఆడవాళ్లదే. పుట్టిన పిల్లలు పురిటిలోనే చనిపోతుంటే ‘బతుకమ్మ’ అంటూ ఆ జగన్మాత పేరు పెడితే పిల్లలు బతుకుతారన్న విశ్వాసం ఈనాటికీ తెలంగాణలో ఉంది.తెలంగాణ సంస్కృతికీ, వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ తొమ్మిదిరోజుల పండుగ మహాలయ పక్ష అమావాస్యతో ఆరంభం అవుతుంది. కొన్నిచోట్ల పితృ అమావాస్య రోజు మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి, ఆ తెల్లవారినుంచి, ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడతారు. ఆ పాటలు లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడు, బతుకమ్మ మీదనే ఎక్కువగా ఉంటాయి.అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో తెలియజేయడంతో పాటు ఆడపిల్లలకు సంబంధించిన అనేక విషయాలమీదే ఉంటాయి. ధనిక, పేద అనే భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడుకునే పాడుకునే ఒక అద్భుతమైన పండుగ. భాద్రపద అమావాస్య అక్టోబరు 2నప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల పాటూ వైభవంగా సాగి, అక్టోబరు 10న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. – డి.వి.ఆర్. -
Dussehra 2024 అమ్మవారికిష్టమైన ఘుమ ఘుమల చింతపండు, ఇంగువ పులిహోర
తెలుగువారికి పులిహోర లేనిదే ఏ పండుగ, వేడుక అయినా నిండుగా ఉండదు. అందులోనూ చింతపండుతో చేసి, ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటే.. ఆహా అద్భుతం అంటూ ఆరగిస్తారు. ఇక దసరా నవరాత్రులలో అమ్మవారికి పులిహోర ఎంత ముఖ్యమైందో చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, గుడిలో ప్రసాదమంత పవిత్రంగా, రుచికరంగా అద్భుతమైన పులిహోర తయారీ ఎలానో తెలుకుందాం పదండి!కావాల్సిన పదార్థాలు :బియ్యం పావుకేజీ, 100 గ్రా. చింతపండు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు,తాజాగా కరివేపాకు రెబ్బలు మూడు, నాలుగైదు పచ్చిమిరపకాయలు, ఆవాలు- రెండు టేబుల్ స్పూన్లు, అల్లం- చిన్నముక్క నాలుగు ఎండుమిర్చి , చిటికెడు ఇంగువ, కొద్దిగా బెల్లంపొడి, తాలింపు గింజలు, పల్లీలు లేదా జీడిపప్పుతయారీ ముందుగా బియ్యాన్ని(పాత బియ్యం అయితే బావుంటుంది) కడిగి, కాస్త పదునుగా అన్నాన్ని వండుకోవాలి. ఉడికేటపుడు కొద్దిగా ఆయిల్ వేస్తే మెత్తగా అయిపోదు. చింతపండు శుభ్రం చేసుకొని నీళ్లలో నానబెట్టుకోవాలి.అన్నం ఉడికిన తరువాత ఒక బేసిన్‌లోకి తీసుకొని వేడిగా ఉన్నపుడే రెండురెబ్బల కరివేపాకులు, పసుపు, ముందుగా నూరిపెట్టుకున్న ఆవాల ముద్ద కొద్దిగా ఉప్పు, నూనె వేసి కలిపుకోవాలి. మెతుకు నలిగి పోకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి.నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు తీసుకోవాలి. ఇపుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి చింతపండు పులుసుపోసి అది చిక్కగా అయ్యేంతవరకు ఉడిరకించుకోవాలి. ఇందులోనే చిటికెడు, పసుపు, ఉప్పు, నాలుగు పచ్చిమిరపాయలు చీల్చి వేసుకోవాలి. పులుసులో ఉడికి కారం లేకుండా తినడానికి బావుంటాయి. ఇందులోనే రవ్వంత బెల్లం కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ పులుసును చల్లారిన అన్నంలో అన్నీ బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలపాలి.ఇక చివరిగా కడాయిలో ఆయిల్ పోసి, ఆవాలు, ఎండు మిర్చి వేసి, తరువాత వేరు సెనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు బాగా వేయించాలి. ఆ తరువాత కాస్తంత ఇంగువ వేయాలి. పోపు వేగి కమ్మటి వాసన వస్తున్నపుడు స్టవ్ మీదినుంచి దింపేయాలి.దీన్ని పులుసు కలిపి ఉంచుకున్న అన్నంలో కలిపితే.. ఘుమ ఘుమలాడే పులిహోర రెడీ. అమ్మవారికి నైవేద్యం పెట్టినంక , ఇంట్లోని వారందరూ తింటే ఆ రుచే వేరు! -
Dussehra 2024 : బతుకమ్మ బిడ్డ, బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసా?
‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలోకాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలోబతుకమ్మ పండుగలో అతి ముఖ్యమైంది బొడ్డెమ్మ పండగ. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదు రోజుల ముందు బహుళ దశమి తిధి నుండి దీన్ని ప్రారంభించుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో మూడు రోజుల ముందు బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంభించి తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి,ఘ ఆటపాటలతో గౌరీ దేవిని పూజించి, తొమ్మిదవ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తారు.బతుకమ్మ బిడ్డె బొడ్డెమ్మ అని భక్తుల విశ్వాసం. అందుకే ఇది ఆడబిడ్డలకు ప్రత్యేకం. ఈ పండుగను బొడ్డెమ్మ పున్నమి కూడా అంటారు. బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే బొడ్డెమ్మ ఆడుతారు.బొడ్డెమ్మ పండుగను తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా ప్రాంతాల వారిగా తయారు చేస్తారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ , పందిరి బొడ్డెమ్మ, బాయి(వి) బొడ్డెమ్మ. పీటమీద పూజించే బొడ్డెమ్మను పీట బొడ్డెమ్మ అనీ, గుంటల రూపంలో ఉండే బొడ్డెమ్మను 'గుంట బొడ్డెమ్మ' అనీ, పందిరిలా అలంకరించే బొడ్డెమ్మను 'పందిరి బొడ్డెమ్మ', బావిలాగా గొయ్యి తయారు చేసే బొడ్డెమ్మను 'బాయి బొడ్డెమ్మ' అని పిలుచుకుంటారు. ఆకారం ఏదైనా, పూజా విధానం మాత్రం ఒకేలా ఉంటుంది.బొడ్డెమ్మ ఆటలుభాద్రపద బహుళ పంచమి నుంచి చతుర్ధశి వరకు బొడ్డెమ్మ ఆడతారు. చెరువు మట్టి లేదా పుట్ట మట్టిని తెచ్చి చెక్కపీటపై ఐదు దొంతరులుగా వలయాకారంలో బొడ్డెమ్మను తయారు చేస్తారు. దీన్ని ఎర్రమట్టితో అలికి బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో అలంకరించి, ముగ్గులు వేస్తారు. ఐదు అంతస్తులపైన కలశం పెట్టి అందులో బియ్యం పోస్తారు. పైన కొత్త గుడ్డతో చుట్టి తమలపాకులో పసుపు గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. ఈ గౌరమ్మకు ఉదయం ఇంట్లో భక్తితో పూజింజి సాయంత్రం ఇంటి వాకిట్లో అలుకు చల్లి చుక్కల ముగ్గులు వేసి పీట బొడెమ్మను తెచ్చి ప్రతిష్టించి సాయంత్రం పూసే ఉద్రాక్ష, బీర, మల్లె, జాజిపూలతో అలంకరించి ఫలహారాలు పెట్టి చుట్టూ తిరుగుతూ బొడ్డెమ్మ పాటలు పాడుతారు. చివరగా బొడ్డెమ్మను నిద్రపుచ్చే పాటలు పాడుతారు. పాడడం అయిపోయాక తెచ్చుకున్న ఫలహారాలు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుని బొడ్డెమ్మను ఎవరింట్లో ఆడుతున్నారో వారింట్లోనే దేవుని దగ్గర పెట్టి వెళ్లిపోతారు. ఇలా తొమ్మిదిరోజులు ఆడిన తర్వాత చివరిరోజు సాగనంపే పాటలు పాడి బావిలో నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మను బావిలో వేసిన తెల్లారి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. తెలంగాణా పల్లెల్లో కొన్ని చోట్ల బొడ్డెమ్మ పండుగ సంబరాలు మొదలు కాగా, అక్టోబరు 2వ తేదీనుంచి ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు షురూ అవుతాయి. -
దసరా పండుగ విశిష్టత ఇదీ!
ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా.దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం‘ అనీ, ‘దేవీ నవరాత్రులు‘, ‘శరన్నవరాత్రులు‘ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం.తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము.జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది.మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారాలతో పూజించి, అనేక విధాలైన పిండివంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాం. ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు.యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా !నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!!పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం. ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు.అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను అవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తి ్తగా భాసించింది. ఈ తల్లిని దేవతలు ‘అమ్మా! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనం, స్పందన ఉండదు అని జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది.జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే! అనే చులకన భావన స్త్రీల మీద! కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతాగణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తాం, ఆరాధిస్తాం. విజయదశమి నాడు, జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటాం.విజయదశమి జరుపుకోవటంలోఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు కానీ హైందవులందరూ ఈ పండుగ జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపబడుతున్నది. మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చే మార్పులను బట్టి దైవ శక్తిని ఆరాధించటం ఒక భావన అయితే, మనలోని దైవ శక్తిని వృద్ధిపరచుకోవటం, సమాజం లో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది మరొక అంశం.ఈ విజయదశమినాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి విజయుడు అయ్యాడు. శమీ వృక్షం మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాండీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడు శమీవృక్షాన్ని పూజిస్తాం.‘శమీ శమయతే పాపంశమీ శత్రు వినాశినీ!అర్జునస్య ధనుర్ధారీరామస్య ప్రియ దర్శిని’అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాం. ఈ విజయదశమి పండగనాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను – శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు.ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించినందున, విజయదశమి రోజున ‘రామలీల‘ను ప్రదర్శిస్తారు. రావణ దహనం చేస్తారు. జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అధివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది. అందుకే సాక్షాత్తూ ఆ జగజ్జనని మనని పాలిస్తూ ఉన్నట్లుగా.. ఆమె పాలనలో మనందరం క్షేమంగా.. సుఖంగా ఉన్నట్లు భావించుకుందాం. పూజించుకుందాం.‘‘అఖిలాండేశ్వరీ... చాముండేశ్వరీ.. పాలయమాం గౌరీ... పరిపాలయమాం గౌరీ...’’ అని ప్రార్థిస్తూ... మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం.మహిషం అంటే దున్నపోతు, జంతువు. మహిషాసురుడు అంటే జంతు తత్వం కలిగినటువంటి వాడు. రాజస తామస గుణాలకు ప్రతీకలు రాక్షసులు. మహిషాసురుడిని, చండ ముండులను, శుంభ, నిశుంభులను జగన్మాతసంహరించింది అంటే, మనలోనే ఉన్న కామ క్రోధాది అరిషడ్వర్గాలను, లోభ మోహాలను, అహంకారాన్ని నశింప చేసుకోవాలి అని గ్రహించాలి. చండ ముండాది రాక్షసులు దుర్మార్గమైన, ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కనుక అటువంటి బలహీనతలను జయించాలి. మనలోని రజోగుణాలను, తమో గుణాలను అరికట్టి, సత్వగుణాన్ని వృద్ధి పరచుకుని, శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చేయాలి. అది ఈ జగన్మాతను నవరాత్రులలో ఆరాధించడం వలన సాధ్యపడుతుంది. శుద్ధ సత్వ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలుగుతాము, పొందగలుగుతాము.మథు, కైటభులు అనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతీకలు. నేను, నాది అనే భావాలకు ప్రతీకలు. మధువు అంటే తేనె. అన్నింటి కంటే మనకు ఇష్టమైనది, తీయనైనది ఎవరికి వారే! ఒక్క నేను అనేది ఉంటే, అనేకమైన నావి, నా వారు, నా బంధువులు, నా అధికారం, నా పదవులు వంటి అనేకమైనవి బయలుదేరతాయి. ఒక్క తేనె చుక్క ఉంటే, అనేకమైన కీటకాలు చుట్టూ చేరినట్లుగా, ఒక్క నేనుకి, అనేకమైన – నావి అనేవి బయలుదేరతాయి. ఈ నేను, నాది అనే అహంకార, మమకార భావాలను సంహరించటమే మధుకైటభములను సంహరించటం. ధూమ్రాక్షుడు లేక ధూమ్రలోచనుడు అంటే పొగ బారిన, మసకబారిన కన్నులు కలవాడు, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు మసకబారినప్పుడు యదార్థం కనిపించదు. అలాగే అజ్ఞానం వలన జ్ఞానం బహిర్గతం కాదు. వివేక జ్ఞానం ఉదయించదు. కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి. రక్తం అంటే రాగం, మోహం. రక్తబీజుడు అంటే ఎంత వద్దనుకున్నా మోహం ఆనే బీజం మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకే కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి, ఆ రక్తబీజుని శరీరం నుంచి కారే రక్తబిందువులను మింగేసి, ఇంక మళ్ళీ రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా చేసింది. అప్పుడు జగన్మాత వాడిని సంహరించింది. అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనం జయిస్తామో, అప్పుడు జగన్మాత దర్శనం మనకు ప్రాప్తిస్తుంది.విజయదశమి దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండగ. ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు కానీ, మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.(గతంలో డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత ఆచార్యులు సాక్షి కోసం రాసిన ప్రత్యేక వ్యాసమిది -
Dussehera 2024 : నవరాత్రి స్పెషల్, కమ్మని ప్రసాదాల తయారీ
దసరా వేడుకలకు సమయం సమీపిస్తోంది. ఒకవైపు షాపింగ్, మరోవైపు పిండివంటలు సందడి షురూ అయిపోయింది. తొమ్మిది రోజులు అమ్మవారికి పలు రకా నైవేద్యాలు మాత్రమేకాదు, ఇంటికొచ్చే అతిథులకు, మనవళ్లు, మనవరాళ్లకు రకరకాల వంటలు చేసి పెట్టాల్సిందే. ముఖ్యంగా స్వీట్లపై పెద్ద పీట. అటు అమ్మవారికి నైవేద్యంగా ఉపయోగపడేలా, ఇటు ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా కొన్ని వంటకాలు చూద్దాం.పండుగరోజు పులిహోర, పూర్ణం బూరెలు,గారెలు, బొబ్బట్లు (భక్య్షాలు) తదితర వంటకాలు చేసుకోవడం అలవాటు. కానీ సులువుగా చేసుకొనే మరికొన్ని వంటకాలను చూద్దాం.పెసరపప్పు పొంగలికావాల్సిన పదార్థాలుబియ్యం - ఒక కప్పుపెసరపప్పు - ఒక కప్పుబెల్లం - రెండు కప్పులుకొబ్బరి ముక్కలు - అరకప్పుజీడిప్పులు ,బాదం, కిస్ మిస్కొద్దిగా, యాలకు పొడి అరస్పూనునెయ్యి - అర కప్పుతయారీ బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాతజీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులను నేతిలో దోరంగా వేయించుకోవాలిఇప్పుడు బియ్యం, పెసపప్పు బాగా కడిగి నీళ్లుపోసి నాలుగు మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చిక, అన్నంలో ముందుగా తరిగిపెట్టుకున్న బెల్లం తురుము వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం వచ్చి, పాయసంలాగా తయారవుతూ, కమ్మని వాసన వస్తూంటుంది. ఇపుడు ముందుగా వేయించుకున్న కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, కిస్ మిస్లు,బాదం పలుకులు వేసి బాగా కలపాలి. చివర్లో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసుకుంటే కమ్మని పెసరపప్పు పొంగలి నైవేద్యం రెడీ.కట్టు పొంగలి కావలసిన పదార్థాలుబియ్యం: రెండు కప్పులు,పెసరపప్పు: ఒక కప్పు, మిరియాలు, జీలకర్రకరివేపాకు రెండు రెబ్బలు, అయిదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా నెయ్యి, నూనె,ఉప్పు తగినంత, చిటికెడు ఇంగువ: చిటికెడుతయారీ: ఒకటి రెండు చొప్పున పెసరప్పు, బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.ఇపుడు స్టవ్‌మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తరువాత కొలతకు తగ్గట్టుగా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానిన బియ్యం, పప్పు , ఉప్పు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికాక నేతిలో వేయించుకొన్న జీడిపప్పులు వేసుకోవాలి. అంతే మిరియాలు, ఇంగుల ఘాటుతో, వేడి వేడి నెయ్యితో రుచికరమైన కట్టు పొంగలి రెడీ.బాదం పాయసంకావాల్సిన పదార్థాలుబాదం పప్పులు: ఒక కప్పుపాలు - ఆరు కప్పులుపంచదార - ఒక కప్పునీళ్లు - ఒక గ్లాసుకుంకుమ రేకలు: అయిదు రేకలుతయారీ: ముందుగా బాదం పప్పులను నానబెట్టుకోవాలి. శుభ్రంగా పొట్టుతీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇపుడు కడాయి పెట్టి చిక్కని పాలు పోసి బాగా మరగనివ్వాలి. పాలు మరిగాక బాదం పేస్టు వేసి బాగా కలపాలి. కదుపుతూ పదినిమిషాల పాటూ ఉడికించాలి. బాదం పాలల్లో బాగా కలిసాక, పంచదార వేయాలి. పంచదార వేసాక పాయం చిక్కబడుతుంది. అడుగు అంటకుండా మెల్లగా కలుపుతూ మరింత చిక్కగా అయ్యేదాకా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇపుడు కొద్దిగా యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు రేకులను అలా పైన చల్లుకోవాలి. అంతే, టేస్టీ, టేస్టీ బాదం పాయసం సిద్దం. -
Dussehra 2024 : అద్భుత దసరా వేడుక చూడాలంటే, కోరిక నెరవేరాలంటే!
దసరా వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఆగమేఘాల మీద సొంతూర్లకు చేరిపోతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుక చేసుకుంటారు. ఏమూలన ఉన్నా భారతీయులు అత్యంత ఉత్సాహంగా చేసుకునే ప్రముఖమైన పండుగ దసరా. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. తొమ్మిది రోజులు, తొమ్మిది రూపాల్లో జగన్మాతను ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దసరా ఉత్సవాలు అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బెజవాడ, వరంగల్‌తో పాటు కోల్‌కతా, మైసూరు, ఢిల్లీ, కులు ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవుల సందడి ఉండనే ఉంటుంది. అందుకే కోరిన కోర్కెలను నెరవేర్చే జగన్మాతను దర్శనంతో తరించే పుణ్యక్షేత్రాలను చూద్దాం.ఇంద్రకీలాద్రివిజయవాడలోని ఇంద్ర కీలాద్రిఫై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. వివిధ రూపాల్లో అత్యంత మనోహరంగా అలంకరించే అమ్మవారిని దర్శించుకునేందుకు జనం క్యూ కడతారు. చివరి రోజు నిర్వహించే సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇంకా శ్రీశైలం, తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు దసరా పదిరోజులూ ప్రత్యేక సందడి ఉంటుంది.బతుకమ్మతెలంగాణాలో పూల పండగు బతుకమ్మ సంబరాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు గౌరీమాతను ఆరాధిస్తారు. బతుకమ్మ ఆటపాటలతో ఊరూ వాడా మార్మోగిపోతాయి. గునుగు, తంగేడు, బంతి, గుమ్మడి ఇలా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా ముస్తాబైన ఆడబిడ్డలు ఆడిపాడతారు. రోజొక్క తీరు తొమ్మిదిరోజుల పాటు గౌరమ్మకుమొక్కి చివరి రోజు గంగలో నిమజ్జనం చేస్తారు.కోల్‌కతా దుర్గాపూజపశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో దుర్గా పూజ వేడుకలతో శరన్నవరాత్రులను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. . అమ్మవారు స్వయంగా ఇలకు దిగివస్తుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే పుట్టింటికి వచ్చి ఆడబిడ్డలా అపురూపంగా భావిస్తారు.సిలిగురి, జల్పైగురి, బీర్భూమ్ , బంకురా వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపు చూడాలంటే రెండు కళ్లూ చాలవు. మైసూర్ దసరా ఊరేగింపుకర్ణాటక రాష్ట్రంలో నవరాత్రి వేడుకలను విజయ దశమితో కలిపి పది రోజుల పాటు నిర్వహిస్తారు. ముఖ్యంగా 500 ఏళ్ల చరిత్ర గల మైసూరు దసరా వేడుకలు చాలా ప్రత్యేకం. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపా వరకు నిర్వహించే ఈ ఊరేగింపు అద్భుతంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పర్యటకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలు మాత్రమే కాదు, నవరాత్రుల్లో తొమ్మిదో రోజున ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు.అహ్మదాబాద్దుర్గాపూజతో పాటు రాముడు, రావణుడిపై సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని వైభవంగా దసరా నిర్వహిస్తారు. ప్రధానంగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ , నవ్లాఖీ మైదానంలో వేడుకులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాండియా నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలు ఘనంగా ఉంటాయి ముగింపు రోజు భారీ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఇక్కడి ప్రత్యేకత.ఢిల్లీ, వారణాసిదేశ రాజధాని నగరం ఢిల్లీలోని రాంలీలా మైదాన్, ఎర్రకోట , సుభాష్ మైదాన్ వంటి ప్రదేశాల్లో దసరా వేడుకలు కన్నులపండువగా ఉంటాయి. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీ, వారణాసి నగరాల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు. రాంలీలా మైదానంలో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. వారణాసి నగరంలో చిన్నారులంతా పౌరాణిక పాత్రల వేషధారణలో అలరిస్తారు.వైష్ణో దేవి ఆలయ ఉత్సవాలుజమ్మూ కశ్మీర్ కత్రాలో ఉన్న వైష్ణో దేవి ఆలయంలో శరన్నవరాత్రులను చూసి తరించాల్సిందే. విద్యుద్దీప కాంతులతో సంబరాలు అంబరాన్నంటు తాయి. ఇక్కడ తొమ్మిదిరోజుల పాటు జగన్మాత ఆరాధనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ కులు పట్టణంలో అట్టహాసంగా జరుగుతాయి దసరా వేడుకలు. అయితే ఇక్కడ వేడుస దసరా రోజు మొదలై ఏడు రోజుల పాటూ సాగుతుంది. రాజస్తాన్ : రాజస్థాన్‌లో రాజభవనంలో మొదలై, రాజకుటుంబ సభ్యులు జాతరగా మైదానానికి ఊరేగింపుగా తరలివస్తారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలు దహనం చేసి బాణసంచా పేల్చుతారు. బస్తర్ దసరా: ఛత్తీస్ గఢ్ లో నిర్వహించే దసరానే ఉత్సవాలనే బస్తర్ దసరాగా ప్రసిద్ధి చెందింది. బస్తర్‌లోని గిరిజన ప్రాంత రక్షణ దేవత దంతేశ్వరి దేవిని ఆరాధిస్తారు. ఈ ప్రాంతంలో రథాల ఉరేగింపు చూసి తీరాల్సిందే.దేవభూమి, రఘునాధుని రథయాత్రహిమాచల్ ప్రదేశ్‌లో కులు దసరా వేడుకల గురించి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం,అంతర్జాతీయ కులు దసరా అక్టోబర్ 13 నుండి 19 వరకుజరుగుతుంది. 7 రోజుల పండుగలో రథయాత్ర ప్రత్యేకం. మహాకుంభ్ పేరుతో నిర్వహించే రఘునాథుని రథయాత్ర వేలాది మంది భక్తులు తరలివస్తారు స్థానిక జానపద నృత్యాలతో పాటు వివిధ దేశాల సంస్కృతిని కూడా ప్రదర్శించేలా కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలాగే అంతర్జాతీయ నృత్యోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 365 స్థానిక దేవతలు, దేవతలు కులులో నివసిస్తున్నారని భూమిని దేవభూమి అని పిలుస్తారు. -
Bathukamma 2024: పూల పండుగ బతుకమ్మ..సంబురాలు లోడింగ్
తెలంగాణా ఆడబిడ్డలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే వేడుక బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటుభక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. రంగుల రంగుల పూలతో తెలంగాణా పల్లెలు కళ కళలాడుతాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ లాంటి ఆటపాటలతో సందడి నెలకొంటుంది. దీంతో ఇప్పటికే తెలంగాణా ఆడబిడ్డలు సంబరాలకు రెడీ అయిపోతున్నారు.పండుగ సంబురాలు ఎపుడు మొదలు2024లో భాద్రపద అమావాస్య అక్టోబరు 2 బుధవారం రోజు వచ్చింది. ఇలా ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటు అత్యంగా ఉత్సాహంగా సాగుతాయి అక్టోబరు 10న సద్దుల బతుకమ్మ వేడుకతో ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగుస్తాయి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ, గునుగు పూలు, బంతి, చేమంతి, తంగేడు, కట్ల, సీతమ్మవారి జడ, గుమ్మడి పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ తొమ్మిది రోజులు పాటు, పలు నైవేద్యాలతో కులం, మతం, చిన్నా పెద్ద, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ. తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల బతుకమ్మలుఅక్టోబరు 2 తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మనాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మతొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆఖరి రోజైన తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను పూజించి, అందంగా ముస్తామైన ఆడబిడ్డలు అత్యంత ఉత్సాహంగా బతుకమ్మలను మధ్యలో పెట్టి ఆడి పాడితారు. గౌరమ్మకు నైవేద్యాలు సమర్పిస్తారు. బతుకమ్మను చివరకు గంగమ్మ చెంతకు చేరుస్తారు.దీంతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. -
పండగ వేళ: ఫ్యాషన్ అండ్ బ్యూటీ క్వీన్‌లా మెరవాలంటే..!
పండుగ సీజన్ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేసింది. వినాయక చవితి తరువాత వరుసగా వచ్చే పండుగల సందడి మామూలుగా ఉండదు. ఇంటిని అందంగా అలంకరించుకోవడం, పిండి వంటలు మాత్రమే కాదు, పండుగకు అందంగా తయారు కావడం, స్పెషల్ ముస్తాబుతో మురిసిపోవడం చాలా సాధారణం. అందుకే ఫెస్టివల్ లుక్‌లో ఎలా మెరిసి పోవాలో చూద్దాం.శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటేనే మెరుస్తూ ఉంటుంది. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగాలి. అలాగే ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం, ఆకుకూరలు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపవాసాల సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పల్చటి మజ్జిగ, పండ్ల రసాలు మెనూలో చేర్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే ఫేస్‌లో చక్కటి గ్లో వస్తుంది. అలాగే ముఖానికి ఇంట్లోనే తయారు చేసుకునేలా ఫేస్ ప్యాక్, జుట్టు అందం కోసం ప్యాక్‌లు వేసుకోవడం మర్చిపోవద్దు. ఫేస్ ప్యాక్బంగాళాదుంపను మిక్సిలో వేసి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో కొద్దిగా శనగపిండి, నాలుగు చుక్కల బాదం నూనె, కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకున్న తరువాత దీన్ని అప్లయ్ చేసి, పూర్తిగా ఆరడానికి 10-15 నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత సబ్బు, ఫేస్ వాష్ లాంటివి వాడకండి. మీ ఫేస్‌లోని మెరుపు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ మిశ్రమాన్ని శుభ్రపర్చిన గాజు సీసాలో దాచుకోవచ్చు. చర్మం ముడతలు లేకుండా,కాంతిమంతంగా ఉండాలంటే..: టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 బాదాంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటినీ మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.∙టేబుల్ స్పూన్ చొప్పున ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం తీసుకొని కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.జుట్టుకు బలమైన చూర్ణంఅరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.ఫ్యాషన్ అండ్ మ్యాజిక్మంచి కలర్‌ఫుల్ డ్రెస్‌లను ఎంచుకోండి. పండుగ సీజన్లో ప్యాషన్ ,లేదా సంప్రదాయ దుస్తులు ఏదైనా సరే మన శరీరానికి నప్పేలా ఉండాలి. డ్రెస్‌కు సరిపడా సింపుల్, లేదా హెవీ జ్యుయలరీ ఉంటే అద్భుతమైన ఫెస్టివ్ లుక్ మీసొంతం అవుతుంది. -
‘లాల్బాగ్చా రాజా’ కానుకల వెల్లువ : వేలంలో బంగారు ఇటుకకు రూ. 75.90 లక్షలు
ఇటీవల గణేశోత్సవాలను పురస్కరించుకుని ముంబైలోని ప్రముఖ ‘లాల్బాగ్చా రాజా’ గణేశుడికి భక్తులు భారీగా కానుకలు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఈఏడాది లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి 91 వార్షికోవత్సవం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. వీటిలో పెద్దమొత్తంలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా బంగారు, వెండి కానుకలు వేలం వేశారు. భక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన వేలం పాటలో మండలికి రికార్డు స్ధాయిలో ఆదాయం వచి్చంది. ఈ నిధుల్లో కొంత శాతం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు, పేద పిల్లల చదువులకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు మందులు, వైద్యఖర్చులకు సాయంగా అందజేయనున్నట్లు మండలి కార్యదర్శి సుదీర్ సాల్వీ తెలిపారు. ఒక్క బంగారు ఇటుకకు వేలంలో రూ. 75.90 లక్షల ధర ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో కొలువైన లాల్బాగ్చా రాజా గణపతికి దేశ, విదేశాల్లోనూ ఎంతో పేరు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు లక్షలాది భక్తులు ఈ ఏడాది లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. నిమజ్జనోత్సవాలు పూర్తి కావడంతో గత రెండు రోజులుగా హుండీలో వేసిన నగదును లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో మండలి పదాధికారులు వివరాలు వెల్లడించారు. మొత్తం 5.65 కోట్లు మేర నగదును భక్తులు లాల్బాగ్చా రాజాకు కానుకల రూపంలో సమర్పించుకున్నట్లు సాల్వీ తెలిపారు. అదేవిధంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు వేలం వేయగా ఒక కేజీ బంగారు ఇటుక, 10 తులాల బరువైన 13 బంగారు బిస్కెట్లు, బంగారు పూతపూసిన 909 గ్రాముల వెండి సుదర్శన చక్రం, అలాగే బంగారు కడియాలు, చైన్లు, హారాలు, ఉంగరాలు తదితర ఆభరణాలను వేలం వేయడంవల్ల రూ.2.35 కోట్లు లభించినట్లు సాల్వీ వెల్లడించారు. ఒక్క బంగారు ఇటుకకే వేలంలో రూ. 75.90 లక్షల ధర పలికిందని ఇది రికార్డును నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. లాల్బాగ్చారాజాను ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ముంబై రావడానికి వీలుపడని కొందరు భక్తులు తమ మొక్కుబడులను ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. ఈ మొత్తం లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి బ్యాంకు ఖాతాలో జమా అవుతుంది. ఇంకా ఈ డిపాజిట్ల లెక్కలు తేల్చాల్సి ఉందని సాల్వీ పేర్కొన్నారు. లెక్కించేందుకే రెండు మూడు రోజులు ఏటా నిమజ్జనోత్సవాలు పూర్తికాగానే హుండీలో వేసిన నగదును లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు కనీసం రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి లెక్కించిన కానుకలన్నిటినీ బహిరంగంగా వేలం వేస్తారు. ఈ వేలం పాటలో వేలాది మంది పాల్గొంటారు. ముఖ్యంగా వేలం పాటలో పాల్గొనే వారితోపాటు వేలం పాట ప్రక్రియను తిలకేంచేందుకు వచ్చేవారితో మండపం ఆవరణ కిక్కిరిసిపోతుంది. అనేక సందర్భాలలో ఓ వస్తువును దక్కించుకునేందుకు కొన్ని గంటల పాటు వేలం పాట కొనసాగుతుంది. దీంతో మిగిలిన వాటిని మరుసటి రోజున వేలం వేస్తారు. -
Dussehra 2024 : కజ్జికాయలు.. ఈజీగా, హెల్దీగా!
దసరా సంబరాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ వేడుకలకు అందరూ సిద్ధమైపోతున్నారు కూడా ముఖ్యంగా రకారకాల పిండివంటలు, తీపి వంటకాల తయారీలో బిజీగా ఉంటారు. ప్రతీదీ కల్తీ అవుతున్న ప్రస్తుత తరుణంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. అందులోనూ ఈజీగా తయారు చేసుకొనేవైతే ఇంకా మంచిది. మరి ఎంతో ఇష్టమైన కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి! దసరా,దీపావళి, సంక్రాంతి పండగులకు తయారు చేసుకునే వంటకాల్లో కజ్జికాయలు ఒకటి. అనుభవం లేని వారు కూడా చాలా సులభంగా కజ్జికాయలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అటు హాట్ లాగా ఉంటుంది, ఇటు స్వీట్లాగా కూడా ఉంటుంది. కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు:మైదాపిండి, ఒక టేబుల్ స్పూన్ రవ్వ, ఉప్పు, నెయ్యి, పుట్నాలు, ఎండు కొబ్బరి , ఆరు యాలకులు, నూనెకజ్జికాయల తయారీమైదాపిండి శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వ, ఉప్పు, నెయ్యి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఈ ముద్దపైన నూనెరాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ తయారీ కొబ్బరి ముక్కలు, యాలకులు, పుట్నాల పప్పు నెయ్యితో దోరగా వేయించుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం ఆర్గానిక్ బెల్లం పౌడర్ లేదంటే మెత్తగా చేసుకున్న చక్కెర పొడి ,యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కావాలంటే దీంట్లో రుచి కోసం జీడిపప్పు, బాదం పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి, బెల్లం, యాలకులు, జీడిపప్పుతో తయారు చేసినకొబ్బరి లౌజును కూడా వాడుకోవచ్చు. (బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?)ఇపుడుముందుగానే కలిపి ఉంచుకన్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని, కజ్జికాయలు ఒత్తుకునే (మౌల్డ్) చెక్కపై ఉండి, మధ్యలో రెడీ చేసిపెట్టుకున్న స్టఫింగ్ వేసి ప్రెస్ చేసుకోవాలి. లేదంటే చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టి, మడిచి అంచుల్లో ఫోర్క్‌తో డిజైన్ వత్తుకుంటే సరిపోతుంది.ఇపుడు స్టవ్‌మీద బాండ్లీ పెట్టుకుని, నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలను, మంచి రంగు వచ్చేదాకా తక్కువమంటపై వేయించుకోవాలి. అంతే కజ్జికాయలు రెడీ. చల్లారిన తరువాత వీటిని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో ఉంచుకోవాలి. ఇదీ చదవండి: World Tourism Day 2024: ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి! -
Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!
దసరా.. అన్ని వర్గాల వారికీ ఆనందాన్ని పంచే పండగ! ఎన్నో సెంటిమెంట్లను సరదాలను, మెసుకొచ్చే శుభదినం. కొత్త బట్టలు, కొత్త కార్లు, కొత్త ఇల్లు, సరికొత్త ఆభరణాలు కొత్త మొబైల్, ఇలా కొంగొత్తగా వేడుక ఉండాలని ఆరాట పడతారు. కొత్త వ్యాపారాలు చేసే వారు దసరా ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయల్లా విలసిల్లాలని మొక్కుకుంటారు. అంతేనా ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు అబ్బో.. ఆ సందడే వేరు! మనసంతా షాపింగ్సరదా అంటేముందుగా గుర్తొచ్చేది షాపింగ్. ఆఫ్లైన్లైనా ఆన్లైన్లైనా షాపింగ్ మాత్రం మస్ట్. దీన్ని క్యాష్ చేసుకునేందుక రకకరకాల ఆఫర్లతో మురిపిస్తుంటాయి కంపెనీలు. ఏ మాత్రం హడావిడి లేకుండా, జాగ్రత్తగా షాపింగ్ చేసేయ్యడమే. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. మనకి కావలన్నపుడు నచ్చినవి దొరక్క, డీలా పడ్డం కాదు, చీప్‌గా దొరికినపుడు దక్కించుకోవడమే ఇదీ లేటెస్ట్ ట్రెండ్కలిసొచ్చే సెలవులుదసరా అంటే పిల్లలకు కూడా చాలా సంబరం. ఎందుకంటే దాదాపు పది రోజులు ఎంచక్కా సెలవులొస్తాయి. అమ్మచేతి కమ్మనైన వంటలు (అపుడపుడు మొట్టికాయలు కూడా) తినేయొచ్చు. కొత్త బట్టలొస్తాయి, కొత్త బొమ్మలూ వస్తాయి. సన్నిహిత బంధువుల పిల్లకాయలొస్తారు. ఇంకేంముంది ఇల్లు పీకి పందిరేయడమే.స్వీట్లుస్వీట్లు లేని దసరా ఊహించుకోగలమా? చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ జగన్మాతను పూజించుకోవడంతోపాటు, నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. లడ్డూలు, జిలేబీలు, గులాబ్ జామూన్ పూతరేకులతోపాటు, జంతికలు, కారప్పూస, సఖినాలు ఇలా రకరకాల పిండి వంటల తయారీలో మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక దసరా నాడు, గారెలూ, బజ్జీలూ, వడలు, ఇక ఆ తరువాత కోడికూర, మటన్ మంచింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దసరా భక్తిదసరా' అనే 'దశ' అంటే 'పది' ,'హర' అంటే 'ఓటమి' అనే రెండు సంస్కృత పదాలనుంచి వచ్చింది. దసరా నవరాత్రులు, లేదా దేవీ నవర్రాతులు పేరుతో తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మను కొలుస్తారు. ఈ శరన్నవ రాత్రల్లో దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి దేవాలయాలు సర్వంగా సుందరంగా ముస్తాబవుతాయి. రాముడు (విష్ణువు ఎనిమిదవ అవతారం), శని యుగంలో జన్మించిన పది తలల రాక్షసుడు రావణుడిని సహరించిన శుభ సందర్భాన్ని, పాండవుల అజ్ఞాత వాసం వీడి, శమీ వృక్షం మీదున్న ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని కూడా దసరాగా జరుపుకుంటారు. ఇందులో భాగమే రావణ దహనం, శమీ పూజలు తొమ్మిది రోజులు, తొమ్మిది అవతారాలుఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పాటిస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చిన పండుగు కనుక శరన్నరాత్రులు అంటారు. ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. తొమ్మిది రకాల పైవేద్యాలు సమర్పిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి. మహా సరస్వతి, నందయ, రక్త దంతి, శాకంబరి దుర్గ, మాతంగి, భ్రమరి అవతారాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. బాలాత్రిపుర సుందరి , గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి మహిషాసరమర్ధిని, దర్గమ్మ, రాజరాజేశ్వరి, మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. బొమ్మల కొలువుదసరా సంబరాల్లో బొమ్మల కొలువు మరో ముఖ్యమైన ఆచారం. ఈ బొమ్మల కొలువును తీర్చిదిద్దడంలో మహిళలు, అమ్మాయిలు తమ కళాత్మక దృష్టిని ప్రదర్శిస్తారు. ఇది కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సంస్కృతీ సంపన్నమైన ఆచారాలకు ప్రతిబింబంగా ఉంటుంది. -
Dussehra 2024: శరన్నవరాత్రుల సంబరం, దసరా ఎపుడు వచ్చింది?
వినాయక చవితి పండుగ వేడుక ముగించుకొని, బై..బై. గణేశా అంటూ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అలా ముగిసిందో లేదో మరో పండుగు సందడి మొదలైంది. అదే సరదాల దసరా పండుగ. దేశవ్యాప్తంగా దసరా పండుగను ఉత్సాహంగా జరుపుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మరి ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజు వచ్చిందో తెలుసా? ముహూర్తం ఎపుడు? తెలుసుకుందాం రండి.దసరా పండుగ, శుభ సమయం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతీ ఏడాది దసరా పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అశ్వినీ మాసంలోని శుక్ల పక్షం, దశమి రోజున అక్టోబరు 12న విజయ దశమి వచ్చింది. 2వ తేదీనుంచి శరన్నవరాత్రులు ఆరంభం కానున్నాయి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గా భవాని మహిషాసురుడిని సంహరించి ప్రజలకు శాంతిని చేకూర్చింది. అందుకే ఇది విజయదశమి అయిందని పెద్దలు చెబుతారు. అలాగే శ్రీరామడు రావణుడిని తుదముట్టించడం ద్వారా అధర్మంపై ధర్మం గెలిచిన రోజు కనుక విజయ దశమి అయిందని మరో కథనంలో చెబుతారు. విజయదశమి నాడు రావణ దహనం చేసి సంబరాలు చేసుకుంటారు. దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు. పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని, శమీ వృక్షంలో దాచిపెట్టిన ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రోజుగా కూడా చెబుతారు. ఈ క్రమంలో జమ్మి చెట్టుకు పూజలు కూడా నిర్వహిస్తారు. దుర్గమ్మ ఎదుట జమ్మి చెట్టును పూజించి ఆ జమ్మి ఆకులను ఇంటికి తీసుకువెళ్లి అందరికీ పంచిపెట్టి అలాయ్ బలాయ్ తీసుకుంటారు. ఇంటి ఆడపడుచులకు కూడా ప్రేమగా పంచుతారు.ముహూర్తం: గణేష్ చతుర్థి తరువాత అంతే ఉత్సాంగా నవరాత్రులు వేడుక చేసుకునేపండుగ దసరా పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రుల్లో వివిధ రూపాల్లో అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పంచాంగం ప్రకారం, ఈ ఏడాది అశ్వినీ మాసం శుక్ల పక్ష తిథి అక్టోబర్ 12 వ తేదీన ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 13 వ తేదీన ఉదయం 9:08 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం పూజ సమయం మధ్యాహ్నం 1:17 నుండి 3:35 వరకు ఉండనుంది. -
నిమజ్జనం.. గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందుల్లో జనం
దాదర్: నిమజ్జనోత్సవాలు ముగియడంతో స్వగ్రామాలకు తరలిపోయిన వేలాది మంది భక్తులు ముంబై దిశగా తిరగు పయన మయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు బయటపడటంతో ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటికే అనేక మంది గౌరీ గణపతులను గురువారం నిమజ్జనం చేసి శుక్రవారం నుంచి తిరుగు పయనమయ్యారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ఇదిలా ఉండగా బుధవారం మళ్లీ ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు బయటపడటం ఒక కారణమైతే, రోడ్లపై ఏర్పడిన గుంతలు మరో కారణమని తెలుస్తోంది. సాధారణంగా ముంబై–గోవా జాతీయ రహదారి నిత్యం తేలికపాటి, ట్రక్కులు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రాలీలు తదితర సరుకులు చేరేవేసే భారీ వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. గణేశోత్సవాల సమయంలో ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే భక్తుల వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరంతా ముంబై–గోవా జాతీయ రహదారినే ఆశ్రయిస్తారు. దీంతో గణేశోత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై (నిత్యావసర సరుకులు చేరేవేసే వాహనాలు మినహా) భారీ వాహనాలకు నిషేధం ఉండింది. ఉత్సవాలు ముగిసిన రెండు రోజుల వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి. దీన్ని బట్టి ముంబై–గోవా జాతీయ రహ దారి ఏ స్థాయిలో బిజీగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. సాధారణంగా నిమజ్జనోత్సవాలు సాయంత్రం ముగియగానే అదే రోజు అర్ధరాత్రి దాటగానే అనేక మంది తిరుగుపయనమవుతా రు. కానీ ఈ సారి మంగళవారం సాయంత్రం ని మజ్జనోత్సవాలు ముగిసినప్పటికీ అనేక మంది బుధవారం మధ్యాహ్నం తరువాత బయలుదేరారు. బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో గురువారం ఉదయమే విధుల్లో చేరే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కారి్మకులు, కూలీలు, వ్యాపారులు బుధవారం మధ్యాహ్నం తరువాత కుటుంబ సభ్యులతో ముంబై దిశగా తిరుగు పయనమయ్యారు. ఇటీవల కరిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ పాడైపోయా యి. ఎక్కడ చూసిన గుంతలు దర్శనమిచ్చాయి. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్ పడింది. (వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య! 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర )15–17 గంటల ప్రయాణం భక్తుల వాహనాలకు (అప్, డౌన్లో) ప్రభుత్వం టోల్ నుంచి మినహాయింపు నిచ్చినప్పటికీ గుంతల కారణంగా వేగానికి కళ్లెం పడింది. దీంతో పది గంటల్లో పూర్తికావల్సిన ప్రయాణం 15–17 గంటలు పడుతుంది. ముంబై–గోవా జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా పికప్ వాహనాలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలే దర్శనమిచ్చాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి సీట్లో కూర్చుండలేక అనేక మంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డుపక్కనున్న డాబాలను ఆశ్రయించారు. దీంతో డాబా వాలాల బేరాలు జోరందుకున్నాయి. శీతలపానీయాలు, వాటర్ బాటిళ్లు, చీప్స్, తదితర చిరుతిళ్ల ప్యాకెట్లు దొరక్కుండా పోయాయి. కొన్ని చోట్ల మందకొడిగా, మరికొన్ని చోట్ల నిలిచిపోయిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్రమబదీ్ధకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకపక్క గుంతలు, పాడైపోయిన రోడ్లతో వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో వాహనాలు ఇటు ముందుకు వెళ్లలేక అటు తిరిగి వెనక్కి వెళ్లి మరో మార్గం మీదుగా వెళ్లలేక నరకయాతన అనభవించారు. -
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర
సాక్షి, ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయకుడికి శాంతియుతంగా వీడ్కోలు పలికారు. గణేశోత్సవాలతోపాటు నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ‘గణపతి బొప్పా మోర్యా పుడ్చా వర్షీ లౌకర్యా’ (గణపతి దేవుడా వచ్చే సంవత్సరం తొందరగా రావయ్య), ‘గణపతి గేల గావాల చైన్ పడేన హమాల’ అనే నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో 10 రోజులపాటు పూజలందుకున్న వినాయకుడి ప్రతిమలను భారీ ఎత్తున శోభాయాత్రల ద్వారా ఊరేగించి నిమజ్జనం చేశారు. భారీ భద్రత మధ్య మంగళవారం ఉదయం ప్రారంభమైన నిమజ్జనోత్సవాలు పలు ప్రాంతాల్లో బుధవారం వరకు కొనసాగాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 69 కృత్రిమ నిమజ్జన ఘాట్లతోపాటు 204 కృత్రిమ నిమజ్జన ఘాట్ల వద్ద మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ముంబైలో మొత్తం 37,064 వినాయకుల నిమజ్జనం జరిగాయి. వీటిలో 5,762 విగ్రహాలు సార్వజనిక గణేశోత్సవ మండళ్ల వినాయకులు, 31,105 ఇళ్లల్లో ప్రతిష్టించిన వినాయకులతోపాటు 197 గౌరీలను నిమజ్జనం చేశారు. కృత్రిమ జలాశయాల్లో 709 సార్వజనిక గణేశోత్సవ మండళ్ల వినాయకులు, 10,957 ఇళ్లల్లోని వినాయకులు, గౌరీలు ఇలా మొత్తం 11,713 విగ్రహాలున్నాయి. ముంబైలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ముంబై రాజాగా గుర్తింపు పొందిన గణేశ్ గల్లీలోని ముంబైచా రాజా వినాయకుడి నిమజ్జన యాత్ర మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటలకు ప్రారంభమైంది. ఈ శోభాయాత్రతో ముంబై నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అనంతరం ముంబైతోపాటు దేశవ్యాప్తంగా కోరికలు తీర్చేదైవంగా గుర్తింపు పొందిన లాల్బాగ్చా రాజా వినాయకుని హారతి 10.30 గంటల ప్రాంతంలో జరిగింది. అనంతరం లాల్బాగ్ చా రాజా వినాయకుని శోభాయాత్ర సుమారు 11 గంటలకు ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైన నిమజ్జనోత్సవాలలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చెదురు ముదురు సంఘటనలు మినహా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ముంబైలోని గిర్గావ్, శివాజీ పార్క్, జుహూ, చౌపాటీ తదితర నిమజ్జన ఘాట్ల వద్దకి లక్షలాది మంది భక్తులు వినాయకుడిని సాగనంపారు. ప్రతి సారి మాదిరిగానే ఈ సారి నిమజ్జనోత్సవాలు కూడా నిఘా నీడలో జరిగాయి. నిమజ్జనాల ఊరేగింపులు ఎంత తక్కువైతే అంత తక్కువ సమయంలో పూర్తి చేయాలని పోలీసులు సార్వజనిక గణేశోత్సవ మండళ్లకు సూచనలిచి్చనప్పటికీ నగరంలో సగటున 5 నుంచి 10 గంటలపాటు నిమజ్జనాల ఊరేగింపులు కొనసా గాయి. నగరంలోని ప్రముఖ వినాయకులలో ఒకటైన లాల్బాగ్ చా రాజా వినాయకుడి నిమజ్జన ఊరేగింపు సుమారు 19 గంటలపాటు కొనసాగింది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. లాల్బాగ్ నుంచి గిర్గావ్ చౌపాటీ వరకు జనం నీరాజనాలు పలికారు. ఇసుకవేస్తే రాలనంత జనం మధ్య ఈ నిమజ్జనోత్సవాల శోభాయాత్ర కొనసాగింది. గణపతి బొప్పా మోర్యా.. గణపతి చాల్ లా గావాలా.. చైన్ పడేనా అమ్హాలా.. అనే నినాదాలతో పరిసరాలు హోరే త్తాయి. భక్తిమయ వాతవరణం మధ్య నిమజ్జన యాత్ర కొనసాగింది. ముఖ్యంగా చిన్న పెద్ద ఆడామగ వయసుతో తేడా లేకుండా అందరూ బ్యాండుమేళాలు సంగీతానుసారం నృత్యం చేస్తూ వీడ్కోలు పలికారు. ఇలా బుధవారం ఉదయం లాల్బాగ్చా రాజా వినాయకుడిని గిర్గావ్ చౌపాటీలో నిమజ్జనం చేశారు. మరోవైపు పక్కనే ఉన్న థానే, నవీ ముంబైలలో నిమజ్జనాల ఊరేగింపులు కూడా సగటున 3 నుంచి 5 గంటలపాటు సాగాయి. ముంబై పోలీసులకు మద్దతుగా హోంగార్డులు, అగి్నమాపక సిబ్బంది, ఎస్ఆర్పీఎస్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిని మోహరించారు. అలాగే ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా ముందుజాగ్రత్తగా పలు రోడ్లు బంద్ చేయడంతోపాటు వన్‌వే ల కారణంగా అంతగా సమస్య ఏర్పడలేదని చెప్పవచ్చు. అయితే నిమజ్జనాల ఘాట్లవైపు వెళ్లే రోడ్లుపై మాత్రం తీవ్ర ట్రాఫిక్ సమస్య కని్పంచింది. మరోవైపు కృత్రిమ జలాశయాల్లో కూడా భారీ ఎత్తున నిమజ్జనాలు జరగడం పర్యావరణ ప్రేమికులకు ఆనందం కలిగించింది. థానే మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు బీఎంసీ చేస్తున్న ప్రయత్నం పెద్ద ఎత్తున సఫలీకృతమైందని చెప్పవచ్చు. పుణేలో ఎప్పటిలాగానే రెండవరోజు బుధవారం మ« ద్యాహ్నం వరకు నిమజ్జనాలు జరిగాయి. అయితే ఈసారి నిమజ్జనోత్సవాలు 29 గంటలకుపైగా సమయం పట్టడం విశేషం. నగరంలో గణేశోత్సవాలకే గౌర వంగా భావించే మొదటి గణపతి ‘కస్బా పేట్’ వినాయకుడితోపాటు అయిదు గణపతు ల శోభాయాత్రలు ముందు గా ప్రారంభమయ్యాయి. పుణేలో ముఖ్యంగా కళ్లు మిరుమి ట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతోపాటు సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనోత్సవాల శోభాయాత్రలు జరిగాయి. ఈ శోభాయాత్రల ను లక్షలాది మంది తిలకించారు. -
టోక్యోలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
జపాన్ రాజధాని టోక్యో నగరంలో వినాయక చవితి వేడుక ఉత్సాహంగా జరిగింది. తెలుగు అసోసియేషన్ జపాన్ (TAJ) వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విఘ్ననాయకుడికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి, ఆది దేవుడి ఆశీస్సులు పొందారు.అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వారంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించి గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు ఆనందంతో పాల్గొన్నారు. -
గణపతి బప్పా మోరియా : స్టార్ కిడ్ రాహా ఎంత ముద్దుగా ఉందో!
వినాయకవి చవితి పండుగను చిన్నా, పెద్దా అంతా దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించు కుంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల గణేష్ నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యాయి కూడా. తాజాగా గణేష్ చతుర్థి వేడుకల ఫోటోలను బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ షేర్ చేసింది. ఈ ఫోటోలో కపూర్ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు నిండుగా కనిపించడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ కపుల్, రణబీర్ కపూర్, అలియాభట్ ముద్దుల తనయ రాహా తండ్రి ఒడిలో మరింత ముద్దుగా కనిపించింది. ఇంకా స్టార్ కిడ్స్ ఆదార్ జైన్, అలేఖా అద్వానీ, కరీనా కపూర్ కుమారులు జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్ కూడా అందంగా ఉన్నారు. View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) తమ ఇంట్లో జరిగిన గణనాధుడి వేడుకలకు సంబంధించిన ఫోటోలను (సెప్టెంబర్ 15) ఆదివారం కరిష్మా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో రణధీర్ కపూర్, బబితా కపూర్ కరిష్మా కపూర్, కరీనా కపూర్, జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్, రణబీర్ కపూర్, రాహా కపూర్ , ఇతరులున్నారు. "గణపతి బప్పా మోరియా", అంటూ అంతా కలిసి గణపతి బప్పాకు పూజలు అనంతరం ఫ్యామిలీ ఫోటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే కపూర్ కుటుంబంలో రాహా తల్లి అలియా భట్ , కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ మిస్ అయ్యారు.అలాగే నానమ్మ నీతా కపూర్‌తో, చిన్నారి రాహా క్యూట్ ఇంటరాక్షన్ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో అమ్మ చంకలో ఒదిగిపోయిన రాహా, నానమ్మను చూసి లిటిల్ ప్రిన్సెస్ తెగ సంతోష పడింది. సోమవారం ఉదయం వీరు ముంబై విమానాశ్రయంలో కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) తన రాబోయే చిత్రం జిగ్రా ప్రమోషన్లో అలియా బిజీగా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ మూవీ యానిమల్ చిత్రంలో రణ్‌బీర్ స్టార్డం అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం నితీష్ తివారీ రామాయణంలో శ్రీరాముని పాత్రలో నటిస్తున్నాడు. ఇదీ చదవండి: వాకింగ్ : జంటగానా? ఒంటరిగానా? ఎపుడైనా ఆలోచించారా? -
‘మిలాద్ ఉన్ నబి’: మహా ప్రవక్త జననం
అజ్ఞానతిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతులతో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు 1450 సంవత్సరాలు అవుతున్నా ఆ మహనీయుని బోధలు మనవద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని గనక మనం ఆచరించగలిగితే, నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించు కోవచ్చు. నేటి పరిస్థితుల నేపథ్యంలో ముహమ్మద్ ప్రవక్త(స) బోధనల పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.క్రీ.శ. 571 ఏప్రిల్ నెల ఇరవయ్యోతేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో ముహమ్మద్ ప్రవక్త(స) జన్మించారు. తల్లి దండ్రులు ఆమినా, అబ్దుల్లాహ్. ఈ మహనీయుడు జన్మించక ముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య అక్కున చేర్చుకున్నారు. నీతి, నిజాయితీ, సేవాతత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఈ కారణంగానే ఆయన ప్రజల మనసులు చూరగొని ‘సాదిఖ్ ’గా, ‘అమీన్’ గా పిలవబడ్డారు. ముహమ్మద్‌కు చదవడం, రాయడం రాదు. అయినా ఆయన బోధలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. నాటి యావత్ అరేబియా ద్వీపకల్పమంతా ఆయన బోధనలకు ఆకర్షిత మైంది. ఫలితంగా సమస్త దుర్మార్గాలూ అంతమయ్యాయి. అసత్యం, అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితనం, హత్యలు, అత్యాచారాలు అన్నీ సమసి పోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుంచి, స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్ళూనుకుంది. అన్నిరకాల చెడులు, అసమానతలుఅంతమై పొయ్యాయి.బడుగులు, బలహీనుల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి, సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే, ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ‘ముహమ్మద్ ’ మాత్రమేనని ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూల గ్రంథాలన్నీ ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహా పురుషులను గురించి మైకేల్ హెచ్.హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్’ ప్రవక్త పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రశంసించిన ఆమహనీయులు నేడు మనమధ్యలేరు.కాని ఆయన బోధనలు మనవద్ద సురక్షి తంగా ఉన్నాయి. మనం వాటిని ఆచరించ గలిగితే చాలు. ఎందుకంటే, నేటి మన సమాజం అన్నిరకాల అవలక్షణాలతో సతమతమవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతప్రగతి సాధించినా, నైతిక, ధార్మిక, మానవీయ రంగాల్లోమాత్రం తిరోగమనంలోనే ఉన్నామన్నది నిజం. నేటి మన సమాజంలో ఏరంగమూ సంతృప్తికరంగాలేదు. ఎంత ప్రగతిపథంలో పయనిస్తున్నా, నేటికీ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. స్త్రీలకు రక్షణలేని పరిస్థితి. అవినీతి, అక్రమాలకు కొదవే లేదు. మద్య΄ానం, జూదం, అశ్లీలం, అంటరానితనం, నిరక్షరాస్యత, ఆడసంతానం హత్యలు, అత్యాచారాలు, హత్యా రాజకీయాలు నిరాఘాటంగా సాగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ సమసి΄ోవాలంటే, సమాజం నుండి ఈ దుర్మార్గాలు అంతం కావాలంటే, నీతి, నిజాయితీలతో కూడిన, ఎలాంటి వివక్ష, తారతమ్యాలకు తావులేని, ఉన్నత మానవీయ విలువలతో నిండిన సుందర సౌభాగ్యవంతమైన సమాజం పునర్ నిర్మాణం కావాలంటే ఈ అమృత బోధనలను అధ్యయనం చేయాల్సిన, ఆచరించాల్సిన అవసరం ఉంది.(నేడు ప్రవక్త జయంతి ‘మిలాదున్నబీ’)– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
నో స్ట్రింగ్స్ కాఫీ ఫెస్టివల్..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన నో స్ట్రింగ్స్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో కాఫీ ప్రియుల కోసం నగరంలో తొలిసారిగా ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ కొలువుదీరింది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఈ ఫెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆసియాలోనే తొలి కాఫీ మహిళగా పేరొందిన సునాలిని మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో భాగంగా కాఫీ ఆర్ట్ సెషన్స్, బరిస్తా డిస్ప్లే, నిపుణుల చర్చలు.. తదితర విశేషాంశాలకు చోటు కల్పించారు. అదే విధంగా కుటుంబాలు, చిన్నారులు, పెట్స్ కోసం విభిన్న రకాల ఈవెంట్స్ కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కరాఫా కాఫీ, ట్రూ బ్లాక్ కాఫీ, బిగ్ స్టార్ కేఫ్, అరకు కాఫీ, ఎంఎస్పీ హిల్ రోస్టర్స్.. తదితర ప్రముఖ బ్రాండ్లన్నీ కొలువుదీరాయి. ఈ ఫెస్టివల్ ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. -
ఓనం అంటే సంబరం, సరదా, సాధ్య!
దక్షిణ రాష్ట్రమైన కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మరో విధంగా చెప్పాలంటే తెలుగువారికి సంక్రాంతి అంత సంబరం. రుతుపవనాల ముగింపుకు గుర్తుగా రాక్షసరాజు బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ ఘనంగా మలయాళీలు జరుపుకునే పండుగ. సంప్రదాయం,రుచులు కలగలిసిన ఓనం అనగానే రకరకాల వంటలు, వైవిధ్యభరితమైన రుచులు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రదేశంలోఉన్నా కేరళ ప్రజలు ఓనంని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సెప్టెంబరు 6 న మొదలైన ఈ ఏడాది ఓనం పండుగ సంబరాలుఆఖరిరోజు సెప్టెంబరు 15న ముగుస్తాయిఓనం అంటే పువ్వులతో అందమైన అలంకరణ, చూడముచ్చటగొలిపే ముస్తాబు. పసందైన విందు భోజనం సాధ్య. ఎర్రబియ్యంతో చేసిన అన్నం, ఇంకా ఉప్పేరి, పసుపు , ఆవాలు మ్యారినేట్ చేసిన పనీర్ కర్రీ, క్లాసిక్ పరిప్పు, గుమ్మడి, కొబ్బరితో చేసే అనేక రకాల వంటకాలు ఉంటాయి. ఇంకా తోరన్, శర్కరవరట్టి, ఉల్లి వడ అవియల్, సాంబారు, తదితర 20కి పైగా వంటకాలతో అరిటాకు బోజనం మరీ స్పెషల్. పరిప్పు కర్రీపెసరపప్పు, కొబ్బరితో చేసి పరిప్పు కర్రీ. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి (ఇష్టమున్నవారు)వేసి మిక్సీలో వేసుకుని కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. తరువాత పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించాలి. ఇపుడు ఉడికిన పప్పులో పసుపు, కొబ్బరి ముద్ద వేసి బాగా కలపి, దీంట్లో కొద్దిగా నీళ్లుపోసుకుని సన్నని మంట మీద ఉడికించాలి. తగినంత ఉప్పు, చిటికెడు, నల్ల మిరియాల కలపాలి. (కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!)తాలింపు: నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపడలాడాక, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఇది సాధారణంగా ఓనం సాధ్యలో బియ్యంతో కలిపి వడ్డిస్తారు. దీంతోపాటు, అప్పడం, పచ్చడి ఉంటుంది. అన్నట్టు ఓనంలో మరో స్పెషల్ పచ్చడి.పచ్చడిసాధ్యలో ఎన్నో రకాల పచ్చళ్లను వడ్డిస్తారు. బీట్రూట్, దోసకాయ, గుమ్మడి, పైనాపిల్ ఇలా ఏ కూరగాయచ పండుతోనైనా రుచికరంగా తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా భుజిస్తారు.సాంబారుమన విందుభోజనాల్లోఉన్నట్టే కేరళీయులు సాంబారును బాగా ఇష్టపడతారు. అన్ని రకాల కూరగాయల ముక్కలతో సాంబారును తయారు చేస్తారు. చివరిగా పాయసం లాంటి ఇతర అనేక తీపి పదార్థాలతో నోరును తీపి చేసుకుంటారు. ఇదీ చదవండి : మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్ -
ముంబైలో ‘తెలుగు’గణపతి : ఆసక్తికర విశేషాలు
సాక్షి ముంబై: వర్లీలోని నెహ్రూనగర్ సార్వజనిక శ్రీ గణేశోత్సవ మండలి ఆధ్వర్యంలో గణేశోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలను ప్రారంభించి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తికానుండంటతో మరింత అట్టహాసంగా, ఉత్సాహంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈసారి రాజ మహల్ నమూనాలో వివిధ రకాల అలంకరణలతో గణేశ్ మండలిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెలుగు మండళ్లలో ప్రత్యేక స్థానం ముంబై మహానగరంలో వినాయక చవితి సందర్భంగా పదిరోజులపాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారనే విషయం విదితమే. చవితి వేడుకల్లో భాగంగా ప్రతి గల్లీ, రోడ్డులో వినాయక మండళ్లను ఏర్పాటుచేసి భారీ విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. కుల, మత, జాతి, ప్రాంత వ్యత్యాసాలు లేకుండా ముంబైకర్లందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. మహారాష్టక్రు ప్రత్యేకమైన గణేశోత్సవాల నిర్వహణలో తరతరాలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్న తెలుగువారు కూడా ముందంజలోనే ఉన్నారు. అలాంటి తెలుగు గణేశ్ మండళ్లలో ఒకటి వర్లీ, నెహ్రూనగర్ సార్వజనిక్ శ్రీ గణేశోత్సవ్ మండల్. ఐక్యత వల్లే, ఐక్యత కోసమే.... సొంతూళ్లను వదిలి పరాయిగడ్డలో స్థిరపడి ఇక్కడే జీవనం సాగిస్తున్న తెలుగు వారందరినీ ఒక్కతాటి మీద నిలిపేందుకు ఈ గణేశోత్సవాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని మండలి అధ్యక్షుడు వాసాల గంగాధర్, ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి శ్రీనివాస్, కోశాధికారి పొలాస తిరుపతి పేర్కొన్నారు. మండలిని స్థాపించి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తికావస్తుండటంతో గతంలో కంటే భారీ ఎత్తున్న ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గణపతిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఉత్తమ మండలి అవార్డు....1975 నుంచి నిరాటంకంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ గణేశోత్సవ మండలి వర్లీ ప్రాంతంలో తెలుగువారి గణపతిగా ప్రసిద్ధి చెందింది. మారిన కాలంతో పాటే గణేశోత్సవాల రూపు రేఖలు మారిపోయాయి. పూజలతో పాటు సామాజిక సేవలు కూడా ఈ ఉత్సవాల్లో చోటు చేసుకున్నాయి. క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ల ఏర్పాటు, హెపటైటిస్ బి పరీక్షల నిర్వహణ , ఉచిత నేత్ర శిబిరాల నిర్వహణతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. అందుకే నెహ్రూనగర్ సార్వజనిక శ్రీ గణేశోత్సవ మండలిని లోధా ఫౌండేషన్ రెండు సార్లు ఉత్తమ మండలిగా గుర్తించి అవార్డులు ప్రదానం చేసింది. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు. కరోనా కాలంలో ఈ మండలి తరఫున ఉచితంగా శానిటైజర్లను, మాసు్కలను పంపిణీ చేశారు. వాక్సిన్లకు సంబంధించిన సందేహాలపై ఇంటింటికి తిరిగి ప్రజల్లో అవగాహన కలిగించారు. వీరి ఆధ్వర్యంలోనే ఘనంగా ఉత్సవాలు ప్రస్తుతం నెహ్రూనగర్ సార్వజనిక శ్రీ గణేశోత్సవ మండలికి అధ్యక్షుడిగా వాసాల గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా తుమ్మనపల్లి శ్రీనివాస్, కోశాధికారిగా పొలాస తిరుపతి, ఉపాధ్యక్షుడుగా విక్కీ జిందం కొనసాగుతున్నారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా రాజేష్ మహాదాస్, అజయ్ చక్కరకోట, అరవింద్ జిందం, గణేష్ వంగ, క్రాంతి మామిడాల, రవీ భోగ, వినయ వాసాల, వంశీ వాసాల, రాజేంద్ర భైరీ, విశాల్ వాసాల, సురేష్ గాజుల, నవీన్ వంగల, భాస్కర్ దాసరి, సలహదారులుగా వాసాల శ్రీహరి (వంశీ), జిందం భాస్కర్, సిరిపురం లక్షి్మనారాయణ, సిరిపురం వెంకటేశ్, జిందం గణేశ్ వ్యవహరిస్తున్నారు.1975 నుంచి ప్రారంభంనెహ్రూనగర్ గణేశోత్సవాలు 1975లో ప్రారంభమయ్యాయి. వాసాల రాజయ్య, జిందం బుచి్చబాబు, కోడం విశ్వనాథ్, సంకు అశోక్, సంకు శంకర్ తదితరులు జైకతి యువక మండలి తరపున ‘నెహ్రూనగర్చా రాజా’ను ప్రతిష్టించి పూజలు నిర్వహించేవారు. ఇలా స్థాపించిన సంవత్సరం నుంచి ఈ ఏడాది వరకూ నిరాటంకంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అనంతరం మారిన కాలంతో పాటు ఉత్సవాల నిర్వహణ తీరు కూడా మారింది. ఉత్సవాల సందర్భంగా పూజలు మాత్రమే కాదు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. -
గణేష్ నిమజ్జనం: వేడుకగా ఆడిపాడిన అంబానీ కుటుంబం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు నిమజ్జనం కోసం తరలి వెళ్లాడు. గణపతి బప్పా మోరియా అంటూ అంబానీ అధికారిక నివాసం ఆంటిలియాలో పూజలందుకున్న గణపతిని అంబానీ కుటుంబం సాదరంగా సాగ నంపింది. పోయిరావయ్య బొజ్జ గణపతి, మళ్లొచ్చే ఏడాది మళ్లీ రావయ్యా అంటూ ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో లంబోదరుడికి మోకరిల్లి, హారతిచ్చి, జై బోలో గణేష్ మహారాజ్‌కీ అంటూ జేజేలు పలుకుతూ మేళ తాళాలతో ఊరేగింపుగా యాంటిలియా చా రాజాను నిమజ్జనానికి తోడ్కొని పోయారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)నిమజ్జనానికి ముందు నిర్వహించిన పూజాకార్యక్రమంలో ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ హారతి నివ్వగా, కొత్త దంపతులు అనంత్, రాధికతోపాటు, ఆకాశ్ అంబానీ,శ్లోకా అంబానీ,ఇషా, పిరామిల్ ఆనంద్ దంపతులు, అంబానీ మనవలు ,మనవరాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.కాగా గణేష్ చతుర్ధి అంటే అంబానీ ఇంట పెద్ద సందడే ఉంటుంది. అందులోనూ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే 15కోట్ల రూపాయల విలువైన స్వర్ణకిరీటాన్ని ముంబైలోని లాల్బాగ్యా గణపతికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అంబానీ ఇంట వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రేఖ, సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, బోనీ కపూర్, సారా అలీ ఖాన్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, భూమి పెడ్నేకర్ , సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడు : అద్బుత విశేషాలివే!
128 feet tall, the World’s Tallest standing Ganesha Murti at Khlong Khuean Ganesh International Park, Thailand. pic.twitter.com/ARzvHQNpEq— Lost Temples™ (@LostTemple7) September 9, 2024వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలు కూడా ప్రారంభ మైనాయి. గణేష్ బప్పా మోరియా అంటూ పూజించిన భక్తులు జై బోలో గణేష్మహారాజ్ కీ అంటూ లంబోదరుడికి వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు పలు ఆకృతుల్లో కొలువుదీరిని బొజ్జ గణపయ్య విద్యుత్ కాంతుల శోభతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఊరా, వాడా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి ముఖ్యంగా 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి, గాజువాకలో 89 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాలు ప్రత్యేక విగ్రహాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. మరి ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? మన దేశంలో మాత్రం కాదు. మరి ఎక్కడ ఉంది? ఆ విశేషాలు తెలుసుకుందాం ఈ కథనంలో..! గణపతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా నిర్వహిస్తుంటారు. థాయిలాండ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గణనాథుడు కొలువై ఉన్నాయి. దీని ఎత్తు ఏకంగా 128 అడుగులు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో విశేషంగా నిలుస్తోంది. విగ్రహం ప్రత్యేకతలుథాయిలాండ్లోని ఖ్లోంగ్ ఖ్యూన్ ప్రాంతంలో ఉన్న గణేశ్ ఇంటర్నేషనల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలోని చాచోయింగ్షావో నగరం సిటీ ఆఫ్ గణేశ్ పేరుతో ప్రసిద్ధి చెందిది. ఈ పెద్ద విగ్రహాన్ని 2012లో స్థాపించారు. కాంస్యంతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 2008 నుంచి 2012 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందట దీని తయారీకి. తల భాగంలో కమలం, మధ్యలో ఓం చిహ్నం నాలుగు చేతులు ఉంటడం ఈ భారీ విగ్రహం యొక్క ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. అలాగే ఒక చేతిల్లో పనస, రెండో చేతిలో చెరకు, మూడో చేతిలో అరటిపండు, నాలుగో చేతిలో మామిడ పండు ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మరో మూడు పెద్ద గణేష్ విగ్రహాలు ఉన్నాయి.ఈ విస్మయం కలిగించే విగ్రహం ఆధునిక ఇంజినీరింగ్‌కు నిదర్శనం మాత్రమే కాదు. అనేక దైవిక, వైజ్ఞానికి అంశాలను కూగా గమనించవచ్చు. ఎగువ కుడిచేతి పనస పండు సమృద్ధి , శ్రేయస్సుకు చిహ్నంగా, ఎగువ ఎడమ చేతిలో చెరకు తీపి,ఆనందం కలయికను, దిగువ కుడి చేయి అరటిపండు పోషణ, జీవనోపాధికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక దిగువ ఎడమ చేతి మామిడి పండు, దైవిక జ్ఞానం, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది.ఎత్తైన గణేశ విగ్రహం కేవలం అద్భుతమైన కళాకృతి మాత్రమే కాదు, గొప్ప ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశం కూడా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం విశ్వాసం, ఐక్యత, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా ఉంది. దీని గొప్పతనం మానవ సృజనాత్మకత, భక్తితో సాధించే ఉన్నతితోపాటు, సరిహద్దులు, నమ్మకాలకు అతీతంగా ఉన్న గణేశుని విశ్వవ్యాప్త ఆకర్షణకు, ప్రజలను ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. -
గణనాథుడు అందరివాడే...! వైరల్ వీడియోలు
గణపతి అంటే చిన్నా పెద్దా అందరికీ అంతులేని భక్తి. ఈ విషయంలో పేద, గొప్ప తారతమ్యం ఉండదు. ఎంతటి వారైనా చేసిన తప్పులు మన్నించమంటూ బొజ్జ గణపయ్య ముందు గుంజీలు తీయాల్సిందే. విఘ్నాలు కాయవయ్యా అంటూ అధినాయకుడైన వినాయకుడిముందు మోకరిల్లాల్సిందే. ముఖ్యంగా వినాయక చవితికి పిల్లలు తెగ హడావిడి చేస్తారు. ఎలాగో అలాగ డబ్బులు వసూలు చేసి మరీ తమ సామర్థ్యం మేరకు బుల్లి గణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేసుకొని కొలుస్తారు. ముల్లోకాలు చుట్టి రమ్మంటే తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీరే నా ప్రపంచం అంటూ నమస్కరించి తల్లిదండ్రుల తర్వాతే మరేదైనా చాటి చెప్పిన తీరు పిల్లలకు ఆదర్శమే మరి. వినాయక చవితి సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు మీకోసం.Small wonders, big smiles – Ganpati arrives in a child's world! ❤️ pic.twitter.com/v08lzCG56C— Arpit (@ag_arpit1) September 8, 2024 A heartwarming visual of a man welcoming Bappa all alone 🙏 Ganpati Bappa Morya 🙏 pic.twitter.com/v2kLwHKm3F— Vineeta Singh 🇮🇳 (@biharigurl) September 9, 2024గణపతి బప్పా అంటే అందరికీ ఇష్టమే. ఆరోగ్యం , అభయం, విజయం, సంతోషం, సంపద, దైర్ఘ్యం, అన్నింటిని ప్రసాదించే గణపయ్య ముందు శునక రాజం కూడా భక్తితో సాష్టాంగపడటం విశేషం.Bappa is everyone’s favourite. An adorable devotee of Prabhu Ganesh bows down to Him with love and devotion…! 😍❣️🥰 pic.twitter.com/NjxtkTG5Ou— Sumita Shrivastava (@Sumita327) September 9, 2024 -
‘‘గన్నూ రాజాకు బై..బై..!’’ ముద్దుల తనయతో శిల్పాశెట్టి డ్యాన్స్ అదుర్స్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ సారి తన ముద్దుల తనయతో కలిసి చేసిన నృత్యం హృద్యంగా నిలిచింది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి విసర్జన ఆచారాలను నిర్వహించి, ధోల్ దరువులకు ఆనందంగా నృత్యం చేశారు.దీనికి సంబంధించిన వీడియో గణపతి భక్తులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కుమార్తె సమీషాతో కలిసి విసర్జన్ పూజ కోసం ట్విన్నింగ్ లెహంగా-చోలీలో ఉత్సాహంతా డ్యాన్స్ చేసి అలరించారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)అంతకుముందు గణపతి బప్పాకు ఇంటికి సాదరంగా ఆహ్వానించి, భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు శిల్పాశెట్టి దంపతులు. ఆ తరువాత అందమైన సాంప్రదాయ దుస్తుల్లో గణపతికి వీడ్కోలు పలికారు. భర్త రాజ్ కుంద్రా, పిల్లలు వియాన్, సమీషా, సోదరి షమితా శెట్టి, తల్లి సునందతో కలిసి ఇష్టదైవం హారతి ఇచ్చి, గణపతిబప్పా మోరియా అంటూ ఆనందోత్సాహాల మధ్య వీడ్కోలు పలికారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) "మా గన్ను రాజాకు వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదు, అత్యంతభక్తి, ప్రేమతో నిండి ఉన్నాం. కానీ భారమైన హృదయాలతో వీడ్కోలుపలుకుతున్నాం, వచ్చే ఏడాది మిమ్మల్ని స్వాగతించేందుకు ఎదురు చూస్తూ..’’ అంటూ శిల్పా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్శిల్పాశెట్టి ఘనంగా నిర్వహించిన గణపతి వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్,ఆమె భర్త జాకీ భగ్నానీ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా ఉదయం శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈసందర్భంతగా బాల వినాయక పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొని, ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్‌కు పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి ,కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు , మణికంఠ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరిపై వినాయకుని ఆశీస్సులుgడాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారికి చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ ,ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ APAS బిల్డర్స్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మకుట డెవలపర్స్ , జీ ఆర్ టి అర్ట్లాండ్స్ , లైవ్ స్పేస్ ఇంటీరియర్ & రేనోవేషన్స్ , SVS శ్రీవసుధ ట్రూ వెల్త్ ఇండియా మరియు ఎవోల్వ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సాధకులు... గురువులు
గురు అన్న మాటని అతి సామాన్యంగా వాడేస్తూ ఉంటాం. దారిలో కనపడిన ముక్కు మొహం తెలియని మనిషిని పలకరించటానికి, ఎలా సంబోధించాలో తెలియని సందర్భంలోనూ, స్నేహితులు ఒకరినొకరు పలకరించుకోటానికి, చివరికి బస్ కండక్టర్నీ, డ్రైవర్నీ, ఇంకా ఎవరిని పడితే వారిని గురూ అని సంబోధించటం చూస్తాం. కాస్త పెద్దవారైతే గురువుగారూ అంటారు. గురువు అంటే పెద్ద వాడు అన్న అర్థంలో వాడితే సరే! గురు అన్నది అర్థం మాట అటు ఉంచి, పదమే సరి కాదు. గురువు అన్నది సాధు పదం.అసందర్భంగా ఉపయోగించటమే కాదు కొంత మంది ఆ విధంగా పిలిపించుకోవాలి అని చాలా తాపత్రయ పడుతూ ఉంటారు. నిజానికి ఆ విధంగా పిలిపించుకోవటం చాలా పెద్ద బరువు. బాధ్యత అవుతుంది. నాలుగు లలిత గీతాలు నేర్పి, పది పద్యాలో, శ్లోకాలో నేర్పి, రెండు మూడు యోగాసనాలు నేర్పించి, నాలుగు ప్రవచనాలు చెప్పి ‘గురు’ అనే బిరుదాన్ని తమకు తామే తగిలించుకోవటం చూస్తాం. వారి వద్ద నేర్చుకుంటున్న వారు గురువుగారు అనటం సహజం. తప్పనిసరి. అందరూ అట్లాగే అనాలి అనుకోవటం వల్ల సమస్య. అందరూ ఎందుకు అంటారు? అందుకని తామే తమ పేరులో భాగంగా పెట్టుకుంటున్నారు. అయితే ఏమిటిట?గురువు అంటే అజ్ఞాన మనే చీకట్లని తొలగించి, జ్ఞానమనే వెలుగుని ప్రసాదించే వాడు అని కదా అర్థం. గురుత్వాన్ని అంగీకరిస్తే శిష్యుల పూర్తి బాధ్యత నెత్తి కెత్తుకోవలసి ఉంటుంది. వారి తప్పులకి బాధ్యత తనదే అవుతుంది. బోధకుడుగా ఒక విషయంలో బాధ్యత వహించ వచ్చు. కానీ, గురువు అంటే మొత్తం అన్ని విషయాలలోనూ బాధ్యత ఉంటుంది. ఈ బరువు మోస్తూ ఉంటే తన సాధన సంగతి ఏమిటి? తన జీవన విధానం ఆదర్శ్ర΄ాయంగా ఉన్నదా? ఒక్కసారి గురుస్థానం ఆక్రమిస్తే తరచుగా జరిగేది గర్వం పెరగటం. తాను ఒక స్థాయికి రావటం జరిగింది కనుక ఇక పై తెలుసుకోవలసినది, సాధన చేయవలసినది లేదు అనే అభి్ర΄ాయం కలుగుతుంది. దానితో ఎదుగుదల ఆగి΄ోతుంది. గిడసబారి, వామన వృక్షాలు అవుతారు. బోధిసత్వుడు తనను ‘తథాగతుడు’ అనే చెప్పుకున్నాడు కానీ గురువుని అని చెప్పుకోలేదు. శ్రీ రామ చంద్రుడికి అరణ్యవాసంలో మార్గనిర్దేశనం చేసిన ఋషులు కూడా ‘ఇది ఋషులు నడచిన దారి’ అనే చె΄్పారు. మా దారి అని చెప్పలేదు. ఎందుకంటే, వారు అప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళటం అనే ఆదర్శం ఉన్న వారు. ఒక్క సారి తనని గురువు అనిప్రకటించుకున్నాక ముందుకి సాగటం ఉండదు. ఈ జన్మకి ఇంతే! సాధకులు అనే స్థితి లేక ΄ోతే, సాధన ఎక్కడ? సిద్ధి ఎక్కడ? అటువంటి వారిని ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. ఏదో చిన్న సిద్ధి రాగానే దానిని ప్రకటించుకుంటూ ఆగి ΄ోతారు. పతనం కూడా అవుతారు. మరొక గొప్ప బాధకరమైన ఉదాహరణ. చిన్నపిల్లలలో ప్రతిభ ఉండచ్చు. దాన్ని ్ర΄ోత్సహించాలి కూడా. కానీ, వాళ్ళకి బిరుదాలు మొదలైనవి ఇచ్చిన తరువాత మరొక్క అడుగు ముందుకి వేయక ΄ోవటం అనుభవమేగా! ఒక రంగంలో అత్యున్నత స్థానాన్ని ΄÷ందిన వారు ఎవరు కూడా తాము గురువులము అని చెప్పుకోవటం చూడం. ఇంకా సాధన చేస్తున్నాము, జ్ఞానం అనంతం మాకు ఈ మాత్రం అందినందుకు ధన్యులం అంటారు. పైగా ప్రతిరోజు మరింతగా సాధన చేస్తూ ఉంటారు. సంగీత విద్వాంసులయినా, వేద పండితులైనా, క్రికెట్ ఆటగాళ్లయినా అభ్యాసం ఆపరు. తాను చెప్పినది విని తనని నలుగురు అనుసరిస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా మసలుకోవాలి? – డా. ఎన్. అనంత లక్ష్మి -
వినాయక పందిళ్లలో సందడి చేసే మగువలూ.. మీకోసమే ఈ చిట్కాలు
వినాయక చవితి పండగ వచ్చేసింది. ఈ నవరాత్రులు గణనాథుని సేవలో మునిగిపోతారు..భక్తులు. గణేష్ మంటపాలలో మహిళల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చాలా హౌసింగ్ సొసైటీలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కొలువుదీరే విఘ్ననాయకుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలతోపాటు అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. మగువలంతా శుభప్రదమైన ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు రంగు దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మరీసందర్భంలో ముఖంతోపాటు కాళ్లూ, చేతులపై కూడా శ్రద్ధ పెట్టాలి. మరి అదెలాగో చూసేద్దాం.ఇంట్లో దొరికే వస్తువులతో మాస్క్, స్క్రబ్‌లను ప్రయత్నించాలి.ఓట్స్- పెరుగుటీ స్పూన్ ఓట్స్‌ను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ చేతులకు బాగా పట్టించాలి. ఆ తరువాత బాగా రుద్దుకని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. టొమాటో స్క్రబ్బాగా పండిన టొమాటో చక్కెర చల్లి, ముఖం, కాళ్లు, చేతులపై బాగా స్క్రబ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆర నిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలాగే చల్లని ఐస్ క్యూబ్‌తో మృదువుగా మసాజ్ చేసి, మాయిశ్చరైజర్ పూసుకోవాలి. టమాటో గుజ్జుని కాళ్ళకి, చేతులకి రాసి మసాజ్ చేయడం వలన కాళ్లు చేతుల మీద ఉండే నలుపు తగ్గుతుంది. టొమాట విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది.శనగపిండి, పెరుగు,పసుపు శనగపిండిలో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి పేస్టులా చేయాలి. ఈ పిండిని కాళ్లు, చేతులకు రాసి కాసేపు వదిలేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ లాగా పని చేస్తుంది.కీరదోసకాయ కీరదోసకాయ గుజ్జుని కాళ్ళకి చేతులకి అప్లై చేసి ఒక 15 నిమిషాల తరువాత వాష్ చేసుకోవాలి. కీర దోసకాయలలో ఉండే విటమిన్ ఏ చర్మం ముదురు రంగులోకి మార్చే మెననిన్ ని కంట్రోల్ చేస్తుంది. నిమ్మరసంలో కూడా సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మం మెరిసే లాగా చేస్తాయి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.కాఫీ పౌడర్ఫిల్టర్ కాఫీ పౌడర్‌లో చక్కెర కలిపి మసాజ్ చేసుకొని పదినిమిషాల తరువాత కడిగేసుకుంటే, ముఖానికి చేతులకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. చందమామలా మెరిసిపోతారు. -
గణపయ్య బొజ్జనిండేలా పాలతాలికలు, రెసిపీ ఇదిగో
వినాయక చవితి వేడుకలలకు రంగం సిద్ధమైంది. వివిధ ఆకారాల్లో గణనాయకులు ఇప్పటికే గణేష్ మంటపాలకు మేళ తాళాలతో తరలి వెళ్లాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్ననాయకుడిని కొలుచుకునేందుకు భక్తులు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా వినాయక చవితి అనగానే రకరకాల పూలు, పళ్లుతో పాలవెల్లి అలంకరణ, పూజకోసం 21 రకాల పత్రి సేకరణ, పుస్తకాలకు, ( పలకలకు) పసుపు పూసిబొట్లు పెట్టి అలంకరించుకోవడం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వినాయకుడి ప్రసాదాలు మరింత ప్రత్యేకం. కుడుములు, పాల తాలికలు, బెల్లం తాలికల తెలుగువారి ప్రేత్యేకమైన పిండి వంటలలను బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెడతారు. పాలతాలికల రుచి గొప్పదనం గురించి కవుల ప్రస్తావన, వర్ణన కూడా ఉంటుంది. అలాంటి పాల తాలికలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.పాలతాలికల రెసిపీ తడి బియ్యం పిండి వాడితేనే పాలను బాగా పీల్చుకుని,రుచిగా తాలికలు మృదువుగా వస్తాయి. వేరే మార్గం లేనివాళ్లు పొడి బియ్యం పిండిని కూడా వాడవచ్చు. బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు శుభ్రంగా కడిగి వడబోసుకుని వడకట్టి , నీడన ఆరబెట్టుకోవాలి. కొంచెం తడిపొడిగా ఉండగానే బియ్యాన్ని పిండి పట్టించి, జల్లించుకోవాలి. అరిసెల కోసం తయారుచేసుకునే పిండిలాగా మృదువుగా ఉంటే బావుంటుంది. పొడి పిండి అయితే కొద్దిగా నీళ్లు కలిపి పెట్టుకొని, పైన తడి గుడ్డ కప్పి ఉంచుకోవాలి. బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరగనివ్వండి, బెల్లం కరిగాక అప్పుడు తడి బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిని తాలికలుగా చపాతీ పీటపైగానీ, చెక్కపై గానీ వత్తు కోవాలి. పాలను మరింగించుకోవాలి. ఇపుడు ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం వేసి మరికొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇపుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న తాలికలను జాగ్రత్తగా విరిగిపోకుండా వేసుకోవాలి. ఇలా కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఇపుడు కొద్దిగా బియ్యం పిండిలో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ పాకంలో కలుపుకోవాలి. తాలికలు ఉడికినతరువాత బెల్లం పాకం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో యాలికల పొడి, నేతిలో వేయించిన ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే చాలు. దీన్ని వేడిగా తిన్నా, చల్లారిన తిన్నా భలే రుచిగా ఉంటాయి.పాలు ఇష్టం లేనివారు, ఉత్తి బెల్లం పాకంలో తాలికలను వేసి, ఉడికించుకుని, , జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు. -
vinayakachavithi 2024: గరికతో కొలిచినా వరాలే
ఏ దైవాన్ని పూజించాలన్నా, ఏ కార్యాన్నిప్రారంభించాలన్నా ముందుగా ఆయననే పూజించాలి. అప్పుడే ఆ కార్యం శుభప్రదం, శోభస్కరం.. ఆ తర్వాత జయప్రదం అవుతుంది. తల్లిదండ్రులను మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించటమూ, పూజించటమూ, ప్రసన్నం చేసుకోవటమూ ఎంతో సులువు.ఓం గణానాతాం త్వా గణపతిగ్ం హవామహేకవిం కవీనాముపమశ్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతఅనశృణ్వన్నూతి భిస్సీద సాధనమ్రాజులలో జ్యేష్ఠుడు, కవులలో కవి, గణాలకు అధిపతి, బ్రహ్మణస్పతి అని వేదాలు ఆయనను స్తుతిస్తే, మంత్రశాస్త్రాలు సుముఖుడనీ ఏకదంతుడనీ, కపిలుడనీ, గణాధ్యక్షుడనీ, గజకర్ణికుడనీ, వికషుడనీ, ఫాలచంద్రుడనీ, ధూమకేతువనీ, గజకర్ణికుడనీ విష్వక్సేనుడనీ, శూర్పకర్ణికుడనీ అన్నాయి. అంతగా ఆరాధించాయి. ఇక ఉపనిషత్తులయితే వాఙ్మయమూర్తిగా.. గణపతిగా... బ్రహ్మణస్పతిగా.. శ్రీ మహాగణాధిపతిగా విశ్వసించాయి. నిండుగా కొలిచాయి. గణపతి అంటే జ్ఞానమోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. ఆయనను స్తుతిస్తే సర్వ విఘ్నాలూ ఉపశమిస్తాయి. అంతేకాదు ఆయన భక్త సులభుడు కూడా. బంకమట్టిని తెచ్చి దానికి గణపతి రూపు కల్పించి,ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటీ, రకరకాల పుష్పాలు, పత్రాలతోటీ పూజించి, అరటిపళ్లు, కొబ్బరికాయలు, ఉండ్రాళ్లు, వెలగ పళ్లు, పానకం, వడపప్పు, కుడుములు నివేదించి, అపరాధ క్షమాపణగా ఐదు గుంజిళ్లు తీస్తే చాలు – మన కోర్కెలన్నింటినీ తీర్చే మహా ప్రసన్న గణపతి... వల్లభ గణపతీ ఆయన. ఎలా పూజించాలి?ఏ పూజలోనైనా ముందుగా హరిద్రాగణపతిని (పసుపుతో గణపతి ప్రతిమను చేసి, తమలపాకులో ఉంచాలి) పూజించడం మంచిది. వినాయక చవితినాడు తప్ప తక్కిన రోజుల్లో తులసి దళాలతో పూజించరాదు. 21 రకాల పత్రి లభ్యం కానప్పుడు గరిక దొరికినా ప్రసన్నుడవుతాడు. రక రకాల నైవేద్యాలు సమర్పించలేకున్నా నారికేళం, అరటిపండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు ఉంటే చాలంటాడు. ఈ కింది శ్లోకం చదివితే చతుర్థీ చంద్ర దర్శన దోషం పరిహారమవుతుంది.సింహః ప్రసేనమవధీః సింహా జాంబవతా హతేఃసుకుమారక మారోదీః తవహ్యేషçశ్యమంతకఃఏమి నివేదించాలి?వినాయకచవితిరోజు గణపతిని షోడశోపచారాలతో పూజించి, శక్తికొద్దీ ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, నారికేళాలు, కదళీఫలాలు, పానకం, వడపప్పులను నివేదిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది.పాలవెల్లి ఎందుకు..?ఆకాశంలో గ్రహాలూ నక్షత్రాలూ ఉంటాయనే యథార్థాన్ని గుర్తింపజేసేందుకే, భాద్రపదమాసంలో విరివిగా లభించే పాలవెల్లికి నిండుగా మొక్కజొన్న ΄÷త్తులూ, వెలక్కాయలూ, బత్తాయిలూ... వీటన్నింటినీ కడతారు.నిమజ్జనమెందుకు?భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి, దానికిప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి, తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. ఈ వినాయక చవితి మీ అందరి విఘ్నాలనూ దూరం చేయాలని, కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుందాం. అన్నట్లు పూజకు మట్టి వినాయకుడినే తెస్తున్నారు గదా!పత్రి అంటే ఎందుకంత ప్రీతి?కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. అంతేకాదు... మునుల కోరిక మేరకు అగ్నితత్త్వం గల అనలాసురుడనే రాక్షసుని ఉండలా చేసి గుటుక్కున మింగాడాయన. లోపల చేరిన ఆ రాక్షసుడు తన మంటలతో ఆయన ఉదరాన్ని బాధించకుండా చల్లదనాన్ని చేకూర్చడం కోసమే మునులు ఆయనను అనేక రకాల ఔషధ విలువలు గల పత్రితోటీ, పుష్పాలతోటీ పూజించి, మరింత ఉపశమనాన్ని కలిగించడం కోసం గరికతో తాళ్లలా పేని ఆయన ΄÷ట్ట చుట్టూ పట్టీలా కట్టారు. ఆ ఉపచారాలన్నీ ఆయనకు అమితంగా నచ్చి, ఆ నాటినుంచి ప్రతియేటా తనను పత్రితోటీ, పుష్పాలతోటీ, ముఖ్యంగా గరిక΄ోచలతో పూజించిన వారికి కోరిన వరాలనిచ్చే వేల్పు అయ్యాడాయన. -
vinayakachavithi 2024: ప్రతి భాగం ఓ పాఠం... ..ప్రకృతికి పీఠం
భువనచంద్ర వినాయకచవితి అనేది కేవలం ఒక పండుగ కాదు.. ఈ పండుగ నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఏనుగు తలకాయ.. అంటే పెద్దది. అంటే గొప్పగా ఆలోచించు.. పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అంటే... ‘నాయనా నీ శక్తినంతా మాట్లాడుతూ మాట్లాడుతూ వేస్ట్ చేయకు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా విను.. ఆ విన్నదాన్ని చక్కగా నీ మెదడుతో ఆలోచించు..’ అని అర్థం. ఇక ఆయన పొట్టకు నాగబంధం కట్టేశారు.. అంటే అర్థమేంటీ? జాగ్రత్తగా గమనిస్తే.. నాయనా నువ్వు ఎక్కువ గనుక తిన్నట్టయితే.. అది విషంతో సమానం. అందుకే మితంగా భుజించడం నేర్చుకో.. అందుకే తినే ముందు నీళ్లు జల్లి అమృతమస్తుః అంటాం.. అమృతం ఎప్పుడు అవుతుంది? మితంగా తిన్నప్పుడు అమృతం.. అపరిమితంగా తిన్నప్పుడు అది విషం. మనం తినేటటువంటి ఆహారం ఎలుకలు గనుక తినేస్తే.. ఎలుకలను గనుక కంట్రోల్లో పెట్టక΄ోతే మనిషికి గింజ కూడా దొరకదు. అందు గురించే ఆయనకు వాహనంగా పాదాల దగ్గర ఎలుకను ఉంచి ఎలుకలను కంట్రోల్లో పెట్టుకున్నావో నీ ఆహారం సేవ్ అవుతుంది అని సూచిస్తున్నారు.వినాయకుడి చేతిలోని అంకుశం... దేన్నైనా కంట్రోల్ చేసుకునే పవర్.. ఏ బంధమైనా.. స్నేహం కావచ్చు.. ఏదైనా నిర్ణయం కావచ్చు.. అంకుశం ఏంటంటే.. నువ్వు ఏది చేయాలనుకున్నా ఆ చేస్తున్నది కరెక్టా కాదా అనేది మన చేతుల్లో ఉండాలి. తర్వాత పాశం.. రిలేషన్స్.. ఇలా వినాయకుడి శరీరంలో ఉండే ప్రతి భాగమూ మనకు ఒక పాఠం లాంటిది. జీవిత పాఠం అది. గ్రామాల్లో స్థానికంగా ఉండే దేవతల్లో లక్ష్మీ, వినాయకుడు ఇద్దరూ ఉంటారు. ఆహార ఉత్పత్తి, పొదుపు వల్ల సమృద్ధి. నాకు ఒకరు గొప్ప మాట చె΄్పారు. ఆరోజుల్లో జీతాలు తక్కువ వచ్చేవి కదా.. అప్పుడు ఒకరు చె΄్పారు. అది చాలా మంచి మాట. ‘ఏమండీ.. మా ఇంట్లో చింతపండు, ఉప్పు, ఎండు మిరిపకాయలు, బియ్యం కచ్చితంగా ఎప్పుడూ ఉంచుతానండీ... జీతం రాగానే మొట్టమొదట ఎక్కువ మోతాదులో అవే తీసుకుంటానండి’ అని. ‘అదేంటీ?’ అన్నాను. ‘మన ఇంటికి పది మంది అప్పటికప్పుడు వచ్చారనుకోండి.. ఆ నాలుగు పదార్థాలుంటే కనీసం చారన్నం అయినా పెట్టొచ్చు కదా?’ అని సమాధానం ఇచ్చారు. అంటే మిగిలినవన్నీ లగ్జరీ ఐటమ్స్.ఇక తర్వాత లేఖిని.. వ్యాసుడు చెబుతుంటే మహాభారతం రాయడం. ఇక్కడ లేఖిని అంటే అక్షరం రాయడం మాత్రమే కాదు.. ఏ విద్యైనా సిద్ధింపచేయాలంటే మొట్టమొదట చెవులు కరెక్ట్‌గా ఉండాలి.. బుర్ర కరెక్ట్‌గా ఉండాలి. అందుచేత సిద్ధి వినాయకుడు.. ఏది మొదలుపెట్టినా ‘అయ్యా ఇది నేర్చుకోదలిచాను.. నన్ను సిద్ధింపచేసే శక్తి నీలో ఉంది గనుక ఈ సిద్ధి నాకు ్రపాప్తించేలా చూడు’ అని నమస్కరిస్తాం. చిన్నతనంలో కూడా అందుకే వినాయకచవితి వచ్చిందంటే.. పుస్తకాలు, అట్టలు.. పెన్నులు అన్నీ స్వామి వారి ముందు ఉంచి పూజ చేసుకుంటాం. ఏ పని మొదలుపెట్టినా.. ఇల్లు కట్టినా.. పెళ్లి చేసినా వినాయకుడికి మొట్టమొదటి స్థానం ఎందుకు ఇస్తారంటే.. ఆయన సిద్ధి కావాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేనిదే సిద్ధి లేదు. నిజానికి కుమారస్వామితో ఆయన ΄ోటీ పడినప్పుడు కూడా ఆయన బుద్ధిని ఉపయోగించాడు.. అందుకే ఆయన భార్యలను సిద్ధి బుద్ధి అంటాం.. నీ బుద్ధిని గనుక సక్రమంగా వినియోగించినట్లు అయితే ఆటోమేటిక్‌గా సిద్ధి లభిస్తుంది. వినాయకచవితి ఏం చెబుతుందంటే.. ఏది చేసినా శ్రద్ధతో చెయ్.. చక్కటి ఆలోచనలతో ఉండాలి. ఆయన కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. చిన్నగా అంటే అర్థం ఏంటీ? సూక్ష్మమైనదాన్ని కూడా చూడగలగాలి. చీమ కన్ను ఎంత చిన్నగా ఉంటుంది? దానికి కూడా ఆహారం దొరుకుతుంది కదా? అట్లాగే ఏనుగు కళ్లు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ అతి సూక్ష్మమైన కదలికలను కూడా అది పట్టుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. జంతువులు అన్నింటిలోనూ చక్కటి బ్రెయిన్ ఉన్న జంతువు ఏనుగు. అదే నెంబర్ వన్ . మానవుడికి ఎంత శక్తి ఉంటుందో అంత పవర్ దానికి ఉంది. పత్రి అనేది మనం ఎందుకు కోసుకొస్తాం? వెలగ, వాక్కాయ్ వంటివన్నీ ఎందుకు తీసుకొస్తాం పూజకి? ఎందుకంటే ఈ సీజన్ లో వాక్కాయ్ పచ్చడి తినమంటే ఎవరూ తినరు..? అందుకే వాక్కాయ్ – కొబ్బరికాయి, కొబ్బరికాయ – వెలగ కలిసి చేసుకుంటాం. నిజానికి ఈ సీజన్ లో ఇవి తింటేనే రోగనిరోధక శక్తి అద్భుతంగా పని చేస్తుంది. రెండొవది ఆకులు దూసిన తర్వాత కొత్త ఆకులువస్తాయి. అలా కాకుండా ఆ ఆకులు మొక్కకే ముదిరి΄ోతే అక్కడితో ఎండ్ అయి΄ోతుంది. ప్రతి ఔషధ మొక్కలను సజీవంగా ఉంచాలంటే పాత ఆకుల్ని పీకాలి. ఇక కామెర్లకు నేల ఉసిరి బెస్ట్ మెడిసిన్ . ప్రకృతిని రక్షించేవాడు దేవత.. ప్రకృతిని రక్షిస్తూ.. ప్రకృతి మీద ఆధారపడేవాడు మానవుడు. ప్రకృతిని నాశనం చేసేవాడు రాక్షసుడు. ప్రకృతితో సహజీవనం చెయ్ అని చెప్పే ఏకైక పండుగ వినాయకచవితి.సుద్దాల అశోక్‌తేజ వినాయచవితి పట్ల నా పరిశీలన ఏంటంటే పురాణాలు కానివ్వండి.. ప్రబంధాలు కానివ్వండి.. కల్పనలు కావచ్చు.. యదార్థంగా జరిగినవి కావచ్చు.. ఏవైనా.. ఏవైనా సరే.. ప్రజాశ్రేయస్సు కోసం, ప్రకృతి శ్రేయస్సు కోసం రాసినవే.. పుట్టించినవే.. శంకరుడు.. పార్వతమ్మ ఉన్న ఇంట్లోకి వెళ్లబోతుంటే ఒక పిల్లోడు అడ్డుకుంటాడు.. అతడిపై ఆగ్రహించి శిరచ్ఛేదం చేశాడు. ఇది కదా కథ? తర్వాత పార్వతమ్మ వచ్చి.. బాగా ఏడ్చి.. భర్త మీద కోప్పడితే.. మళ్లీ బతికించాడు.. ఫస్ట్ ఏంటంటే.. తొందరపాటుతనం మనుషులకే కాదు.. దేవతలమైన మాకు కూడా ఉంటుందని చెప్పడమే ఆ పసివాడ్ని చంపడం.. ఒక తొందరపాటులో ఇన్ని అనర్థాలు జరగుతాయి అని చెప్పడానికి ఈ కథ ఏర్పడింది అనుకుంటాను.. శివుడు సహనంగా ఉండి ఉంటే చంపేవాడు కాదు కదా.. నంబర్ 2– ఎంత పరమేశ్వరుడైనా భార్యకు శరీరంలో సగభాగం ఇచ్చాడు.. అదొక ఆదర్శమైతే.. భార్య అతడు చేసిన పొరబాటు గురించి చెప్పగానే.. ఎక్కడా పురుషాధిక్యత లేకుండా తన పొరబాటు తాను గ్రహించాడు.. అంటే ఇక్కడ స్త్రీలను ద్వితీయశ్రేణి పౌరుల్లా భావించడం తప్పు అని తన ఈ చర్య ద్వారా తెలిపాడు.. ‘నేను భర్తను, నువ్వు భార్యవి.. అవును చంపేశాను.. నా ఇష్టం..’ అని ఉంటే ΄ోయేది కదా..? కానీ అలా అనలేదు.. పొరబాటు గ్రహించడమే కాదు.. భార్య చెప్పిన దిద్దుబాటు చర్యకు పూనుకున్నాడు. తనకన్నా చిన్నవాళ్లు చెప్పినా.. భార్య చెప్పినా.. మంచి చెప్పినప్పుడు మనం దాన్ని సవరించుకోవాలి.. వీలైతే ఆచరించుకోవాలి.. అనేది రెండో ఘటన.మూడవది ఇది చాలా చిత్రం అనిపిస్తుంది నాకు. తలను తీసేశాడు.. భార్య వచ్చి ఏడవగానే ఉన్న తలను అతికించొచ్చు కదా? ఎన్నో మాయలున్నవాడు.. పైగా నరికిన తల పక్కనే ఉంటుంది కదా? ఆ తలను అతికించకుండా ఏనుగు తల తీసుకుని రావడం ఎందుకు? ఎందుకు అంటే.. మనిషికి ఎంత ్రపాధాన్యత ఉందో.. దేవతలకు ఎంత ్రపాధాన్యత ఉందో.. జంతువులకు కూడా అంతే ్రపాధాన్యత ఉంది అని చెప్పడానికన్నమాట. అంటే ప్రకృతిని గౌరవించడం అనిమాటే. ‘‘నువ్వు జీవించు మిగతా వాటిని జీవించనివ్వు’’ అని చెప్పడం కోసం ఒక జంతువుకి అపారమైన ్రపాధాన్యత ఇవ్వడం కోసం ఏనుగు తలకాయ పెట్టి ఉంటాడా? ఇవన్నీ నా ఆలోచనలే.. నా వ్యక్తిగతమైనవి.తర్వాత శంకరుడి దగ్గర కైలాసంలో పరస్పర శత్రువులైన జంతువులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఎలుకలను తినే పాము పక్కనే ఉంటుంది. పాముని తినే నెమలి పక్కనే ఉంటుంది. మూడు పరస్పర వైషమ్యాలు కలిగిన జీవరాశులకు కూడా సమానమైన గౌరవం ఇస్తూ సమానమైన జీవితావకాశాన్ని ఇచ్చిన వాడు శివుడు. కైలాసంలో జాతీయ జంతువు ఎవరో తెలుసా..? ఎద్దు. ఎద్దుని వాహనం చేసుకున్నవాడు శివుడు. బ్రహ్మ కమలం మీద ఉంటాడు. విష్ణువు ఆదిశేషువు మీద ఉంటాడు. కాని శివుడు రైతుకి, వ్యవసాయానికి దగ్గరగా ఉన్న ఎద్దును వాహనంగా ఎంచుకున్నాడు. ఇక వినాయకుడిని పూజించే దగ్గర.. సాధారణంగా మనం లక్ష్మీదేవిని పూజిస్తే మన దగ్గర ఉన్నవో లేనివో నాణాలు తెచ్చిపెడతాం.. లేదా ఆరోజు బంగారం ఏదొకటి కొనుక్కుని పెడతాం. కానీ వినాయకుడికి అవేం ఉండవు. చెరకు, పత్రి, గరిక ఇలా అతి చౌక ఆకులు.. సులభంగా ప్రకృతిలో దొరికే వాటిని తెచ్చి పెడతాం. ప్రకృతి, ప్రకృతిలోని జీవులు, పరమాత్మ మూడు సమానమే అని చెప్పేందుకు గుర్తుగా ఈ వినాయకచవితి కొనసాగుతోంది. దీన్నే అందుకోవాలి సమాజం. దీన్ని అందుకోవాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. అందుకే బాలగంగాధర తిలక్ దైవభక్తిలో దేశభక్తిని రంగరించి.. వినాయకచవితిని మొట్టమొదటిసారి ఘనంగా జరిపించారు. అందుకే అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప శక్తిని నింపింది ఈ పండుగ. మా చిన్నప్పుడు వినాయకచవితికి ఇంత క్రేజ్ లేదు..ఇప్పుడు ఇంత ఘనంగా జరుగుతున్నదంటే దానికి కారణం తిలక్. ఆ గొప్పతనం ఆయనదే. ఆ తర్వాత గణపతితో ఏం చేయించినారు.. ప్రపంచ పరుగు పందెం ΄ోటీ పెట్టేస్తే ఎలుక మీదున్న వాడు ఏం గెలుస్తాడులే అని కుమారస్వామి నెమలి మీద వెళ్లి΄ోతుంటే.. వినాయకుడు అమ్మానాన్నలను మించి ప్రపంచం భూగోళంలో ఏముంటుందని చెప్పి మూడు చుట్లు తిరిగితే.. అందరూ కలసి ఎవరు మొదలు వచ్చారంటే.. వినాయకుడే మొదట వచ్చాడు కాబట్టి ఆయన ప్రధాన దేవుడు అయ్యాడు.. ప్రథమ దేవుడు అయ్యాడు.. ఇక్కడ తల్లిదండ్రుల ్రపాధాన్యత కనిపిస్తుంది. ఇది గ్రహించాల్సింది. -
ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయకుడికి, అనంత్ అంబానీ బంగారు కానుక
గణేష్ ఉత్సవాలకు మహారాష్ట్రలోని ముంబై నగరం పెట్టింది పేరు. అందులోనూ ముంబైలోని ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయక ఉత్సవం మరింత స్పెషల్‌గా ఉంటుంది. ఇప్పటికే లాల్బాగ్చా రాజా వినాయకుడి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తాజాగా పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, గణనాథునిపై తమ భక్తిని, గౌరవాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు. ముఖ్యంగా అనంత అంబానీ, రాధిక వివాహం తర్వాత తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.నవ వరుడు అనంత్ అంబానీ ముంబైలోని వినాయకుడికి ఘనమైన కానుకను బహూకరించారు. 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.15 కోట్లు. ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. సంప్రదాయ మెరూన్ కలర్ దుస్తుల్లో విలువైన ఆభరణాలకు తోడు ఈ ఏడాది బంగారు కిరీటంతో భక్తుల పూజలందుకోనున్నాడు గణేశుడు.కాగా 'కింగ్ ఆఫ్ లాల్బాగ్' అని పిలిచే లాల్బాగ్చా రాజా ముంబైలో అత్యధికంగా సందర్శించే గణేష్ మంటపం. ప్రతీ సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారు. గత పదిహేనేళ్లుగా అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా కమిటీకి మద్దతుగా నిలుస్తున్నారు అనంత్ అంబానీ.लालबागचा राजाचे, प्रसिद्धी माध्यमांसाठी फोटो सेशन गुरुवार दिनांक 5 सप्टेंबर 2024 रोजी संध्याकाळी ठिक 7 वाजता करण्यात आले आहे. त्या वेळेची क्षणचित्रे.#lalbaugcharaja Exclusive live on YouTube :https://t.co/XAHhCLjBM6 pic.twitter.com/fg07hI096z— Lalbaugcha Raja (@LalbaugchaRaja) September 5, 2024 -
వినాయక పరిణయం.. ఆ ఆంతర్యం ఏమిటో తెలుసా?
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. నారదుడి ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు.. ‘‘నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం. నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి’’ అని చెప్పాడు. ఇది వినాయకుడి పరిణయ గాథ ఆంతర్యం.శ్రీలక్ష్మీ గణపతి వైభవం..మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది. 1)వసంత నవరాత్రులు, 2) గణపతి నవరాత్రులు, 3) దేవీ నవరాత్రులు. వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది. ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు, గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వాటినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి. ఈరోజుల్లో.. చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది."శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. -
భక్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రసాదం మాత్రమే : కర్ణాటక నిర్ణయంపై వివాదం
కర్ణాటక ప్రభుత్వం భక్తులకు నాణ్యమైన 'ప్రసాదం' అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గణేష్ మండపాల వద్ద 'ఎఫ్ఎస్ఎస్ఏఐ-ధృవీకరించిన ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సరికొత్త దుమారం రేగింది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక నిర్ణయమని బీజేపీ అభివర్ణించింది. అయితే, గణేష్ చతుర్థి పండుగ సీజన్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. గణేష ఉత్సవ నిర్వాహకులకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే గణేష్ పందిళ్లలో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. పందిళ్లలోఅందించే ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణ తప్పనిసరి అని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కి రాసిన లేఖలో ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అంతేకాదు అనుమతి లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. అనుమతులు తప్పనిసరిబెంగళూరులోని గణేశ మంటప నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు, నగర పాలక సంస్థ, విద్యుత్ లాంటి స్థానిక అధికారుల అనుమతులను పొందాలి. నిర్వాహకులు పాండల్స్ కోసం కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన నిర్దిష్ట పర్యావరణ నిబంధనలను కూడా పాటించాలి. తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర భద్రతా చర్యల్లో భాగంగా వేదిక వద్ద అత్యవసర సంప్రదింపు నంబర్లను ప్రదర్శించాలి.మరోవైపుగణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ కర్నాటక హైకోర్టు, అధికారుల నిర్ణయాన్ని సమర్థించడంతో బుధవారం హుబ్బళ్లి-ధార్వాడ్‌లోని ఈద్గా మైదాన్‌లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
వినాయక పూజాపత్రిలో ఆయుర్వేద విశేషాలు..
ప్రకృతిలో ఎన్నో రకాల వృక్ష జాతులు ఉండగా, వాటిలో కొన్నింటిని మాత్రమే వినాయక పూజలో పత్రిగా ఉపయోగించడంలోని ఆంతర్యమేమిటో,ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఈ పండుగ ప్రాధాన్యమేమిటో తెలుసు కుందాం.వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాల వలన నిండిన నదులు, కాలువలలో నీరు దిగువ ప్రాతాలలోని చెరువులు, కుంటలు, దిగుడు బావులలోకి ప్రవహించే మార్గంలో అనేక మలినాలతో కూడిన చెత్తను కూడా మోసుకు వస్తుంది. ఆ నీటిని అలాగే తాగిన ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ముందుచూపు కలిగిన మన మహర్షులు ప్రతి సంప్రదాయంలోనూ ప్రజలకు హితవు కలిగించే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను సూచించారు. వాటిలో భాగంగా వినాయక చవితి పర్వదినం రోజున పూజలో ఉపయోగించడానికి కొన్ని ప్రత్యేకమైన ఔషధ జాతులకు సంబంధించిన మొక్కలు, వృక్షాల ఆకులను పూజాపత్రిగా సూచించారు. ఈ పూజాపత్రిని నిమజ్జన సమయంలో ఆయా చెరువులు, కుంటలలో వెయ్యడం వల్ల వాటిలోని నీరు శుభ్రంగా మారుతుంది. తద్వారా క్రిమివ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులు, చర్మవ్యాధులు వంటి సమస్యలకు విరుగుడుగా పనిచేసే ఆకులను మన పూర్వీకులు పూజాపత్రిలో భాగంగా చేశారు. పూజాపత్రి ఔషధ గుణాలను చెప్పుకోవాలంటే, ఉదాహరణకు మాచీపత్రం (దవనం ఆకు) రసాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది. బృహతీపత్రం (వాకుడు ఆకు) వాపులను తగ్గిస్తుంది. బిల్వపత్రం (మారేడు ఆకు) చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దుర్వాయుగ్మం (గరిక) శరీరానికి బలం చేకూరుస్తుంది. ఇలాగే, వినాయక పూజలో ఉపయోగించే ప్రతి పత్రికి విశేష ఔషధ లక్షణాలు ఉన్నాయి. అందుకే, వీటిని మన మహర్షులు, ఆయుర్వేద పండితులు సంప్రదాయంలో భాగంగా చేశారు. – ఆచార్య రాఘవేంద్ర వాస్తు జ్యోతిష సంఖ్యా శాస్త్ర నిపుణులు, ఒంగోలు -
ఆచరించిన వారికి అండాదండా.. సంకటహర చతుర్థీ వ్రతం!
వినాయకుని అనుగ్రహం పొందేందుకు మనం ప్రతియేటా భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితి పర్వదినం జరుపు కుంటాం. అయితే తలపెట్టిన ఏ పనీ ముందుకు సాగక, జీవితంలో అన్నింటా విఘ్నాలు ఎదురవుతూ, అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు, రుణబాధలు వంటి కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు, దుష్టగ్రహాల పీడతో నానా బాధలు అనుభవించే వారు ప్రతి మాసంలోనూ సంకటహర చతుర్థినాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో పాటు కార్యజయం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.వేదకాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన విస్తృతంగా జరగటం తెలిసిందే. వినాయక శబ్దానికి విశిష్టమైన వాడని, నాయకులు లేనివాడని అర్థం. గణపతి గురించి గణేశ పురాణం, స్కాంద పురాణం, ముద్గల పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శివ పురాణంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో సైతం గణపతి ప్రస్తావన ఉంది. గణపతిని జ్ఞానానికి అధిదేవత అని ఋగ్వేదం కొనియాడింది. గణాల అధిపతిగా గణపతి పేరు సార్థకమయ్యింది. మానవులందరికీ మంచి చేసేవారిని గణపతి అని అంటారు. మానవునిలోని చెడును హరించే వాడికి గణపతి అని, వినాయకుడని పేరు. వినాయకునికి రోగహర శక్తి ఉందని గణేశ పురాణం చెబుతోంది.గణపతితో సమానమైన పేరుగల బ్రాహ్మణస్పతిలేదా బృహస్పతి గురించి ఋగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించేవారిని గణపతి ఎల్లవేళలా కాపాడుతుంటాడని ఋగ్వేదం వివరించింది. బ్రహ్మచర్యం అవలంబించి, వేద వేదాంగ శాస్త్రాలను అధ్యయనం చెయ్యవలసిన విద్యార్థులకు గణేశుడు ఆశ్రయ దాత, పోషకుడు.సంకట విమోచక గణపతి స్తోత్రం..నారద ఉవాచప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకంభక్తావాస స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయేప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకంతృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకంలంబోదరం పంచమం చ షష్టం వికటమేవచసప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకంఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననంద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాన్నిత్యంనచ విఘ్నభయం తస్యసర్వసిద్ధికరం ప్రభోఃవిద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభేత్ పుత్రం మోక్షార్థీ లభేత్ గతింజపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయఃఅష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వాయత్సమర్పయేత్తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతఃసంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది?ప్రతిమాసంలోనూ వచ్చే బహుళ చతుర్థి (బహుళ చవితి)ని సంకటహర చతుర్థి లేదా సంకట విమోచక చతుర్థిగా పిలుస్తారు. జాతకంలో కేతు మహర్దశ నడుస్తున్నవారు, కష్టాలను అనుభవించేవారు, తరచు కార్యహానితో చికాకులకు లోనవుతున్నవారు ఈ వ్రతం చేయడం మంచిది. ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికెళ్లి గరికపై ప్రమిదనుంచి దీపారాధన చేసి, గరికపోచలు, పుష్పాలు, పత్రితో గణపతిని పూజించి, లడ్డూలు లేదా ఉండ్రాళ్లు నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి మాసంలోనూ వచ్చే సంకటహర చతుర్థినాడు ఇదేవిధంగా ఆచరించగలిగితే సకల దోషాలూ పోయి, కార్యజయం కలుగుతుంది. ప్రతి బహుళ చతుర్థినాడూ వినాయక చవితిరోజు చేసినట్లే పత్రితోనూ, పుష్పాలతోనూ గణపతికి పూజ చేస్తే అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతోనూ, సమస్యలతోనూ బాధపడేవారు సంకటహర చతుర్థి వ్రతంతోపాటు సంకట విమోచక గణపతి స్తోత్రాన్ని విడవకుండా ఆరుమాసాలపాటు పఠించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. వ్రతాన్ని ఆచరించలేనివారు కనీసం సంకటహర గణపతి స్తోత్రాన్ని నాలుగుసార్లు పారాయణ చేసినా మంచిదే. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలు తొలగి, పనులు సజావుగా సాగుతాయి. కేతుగ్రహ బాధలు తొలగుతాయి. -డి.వి.ఆర్. భాస్కర్ -
ఇండోనేషియా నగదు నోటుపై గణపతి చిత్రం
హిందువుల తొలిపూజలు అందుకునే గణపతి చిత్రం ఇతర దేశాల నగదు నోటుపై ముద్రించడం విశేషమే. ఇండోనేషియా దేశంలోని రూ. 20 వేల నోటుపై గణపతి చిత్రం ముద్రించి ఉండటం మనకు ఆసక్తి కలిగించే అంశమే. ఆ దేశం ఒక ఇస్లామిక్ దేశం. ఇప్పటి వివరాల ప్రకారం ఆ దేశంలో 88 శాతంపైగా ముస్లింలు ఉండగా మూడు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు ఆ దేశం హిందూ మతానికి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా వెలుగొందింది. అక్కడవున్న ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పటికీ దేశ, విదేశీయులకు ప్రముఖ దర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి.ఒకటవ శతాబ్దం నుంచి ఆ దేశంలో ఎక్కువగా హిందూ మతం ఉన్నదని భావిస్తారు. ఆ దేశానికి చెందిన రూ. 20వేల (రూపియా) కరెన్సీ నోటు మీద జ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన గణపతి చిత్రాన్ని చిహ్నంగా ముద్రించబడి ఉంటుంది. అదే నోటు మీద ఆ దేశంలోని పిల్లలందరికీ విద్య అందించడానికి విశేష కృషి చేసిన ఇండోనేషియా జాతీయ విద్యా పితామహుడిగా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హజర్ దేవంతర చిత్రం ప్రచురించబడి వుంటుంది. తదనంతర క్రమంలో (1950) ఆయన ఆ దేశ విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఆయన పుట్టినరోజును జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నారు.ఈ విధంగా ఆ నోటుపై జ్ఞానాన్ని అందించే విద్యాగణపతి, విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుని చిత్రాలతోపాటు, ఆ నోటు వెనుక తరగతి గదిలో వున్న పిల్లల చిత్రం ముద్రించబడి వుండటం విశేషం. -
మట్టి గణపతితో పుణ్యం, ఫలం : గణపతి బప్పా మోరియా!
గణనాధుని పూజించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగువారి తొలి పండుగ, ఆది దేవుడైన గణపతి తొమ్మిది రోజుల పాటు పూజలందుకోనున్నాడు. వినాయక చవితి వేడుకలకు వాడ వాడలూ వినాయక మండపాలతో సిద్ధమై పోతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎక్కడ చూసినా బాల గణపయ్యు, బొజ్జ గణపయ్యలు రక రకాల ఆకారాల్లో, సైజుల్లో కొలువు దీరాయి. నవరాత్రి ఉత్సవాలకు మేం రెడీ.. రారమ్మంటూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మట్టి ప్రతిమలనే పూజించాలని పర్యావరణ పరిరక్షకులు, నిపుణులు సూచిస్తున్నారు. మట్టి గణపతే, మేలైన గణపతి అని నినదిస్తున్నారు. ఈ మేరకు పలు స్వచ్ఛంద సంస్థలు గత కొన్నేళ్లుగా ప్రచారాన్ని చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.వినాయక మండపాల్లో అందం, ఆకర్షణ కోసం రంగురంగుల భారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకే చాలామంది మొగ్గు చూపుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అనే ట్రెండ్ ఇటీవలి కాలంలో బాగా వ్యాపిస్తోంది. ఈ ధోరణే పర్యావరణానికి పెద్ద సమస్యగా మారుతోంది. నవరాత్రులు, భక్తితో పూజించడమే ప్రామాణికమని పండితులు సైతం చెబుతున్నారు. పంచభూతాల సమాహారమైన మట్టి గణపతిని పూజించడం అంటే పంచభూతాలు, అధిష్టాన దేవతలు పూజిస్తున్నామని అర్థమని పండితులు చెబుతున్నమాట. పర్యావరణహితంగా వేడుకలు నిర్వహిస్తే ప్రజలను, పర్యావరణాన్ని రక్షించుకున్న వారమవుతామని పిలుపునిస్తున్నారు.పీఓపీ విగ్రహాలతో అన్నీ అనర్థాలేప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల ద్వారా పర్యావరణానికి తీరని ముప్పు అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. విగ్రహాల అలంకరణకు వాడే రసాయన రంగులు మరింత ప్రమాదం కరమంటున్నారు. ఇవి నీటిని కలుషితం చేయడమే కాదు, అనేక రకాల రోగాలు మూలం అవుతాయి. రసాయ రంగులతో నిండిన విగ్రహాలు చెరువులు, వాగులు, నదుల్లో నిమజ్జనం చేస్తే అవి త్వరగా కరగవు. ఈ నీటిని తాగిన పశువులు, ఇతర జీవుల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రసాయనాలు కలిసిన నీటితో నరాలపై ప్రభావం చూపి కేన్సర్ వ్యాధికి దారితీస్తుంది. అనేక చర్మవ్యాధులు సైతం వ్యాప్తి చెందుతాయి. ఈ నీరు పంట పొలాల్లో చేరితే భూసారం దెబ్బతింటుంది. ఆహార ఉత్పత్తులు కలుషితం అవుతాయి. అంతేకాదు పూజకు వాడిన పువ్వులను కూడా వృధాగా కాలువల్లో పారవేయడం కాకుండా, రీసైకిల్ చేయడంగానీ, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి వినియోగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పీఓపీలో సల్ఫర్, జిప్సం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పదార్థాలు ఉంటాయి. రంగుల్లో పాదరసం, కాడ్మియం, ఆర్సెనిక్, సీసం, కార్బన్ ఉన్నాయి.వీటిని నీటిలో నిమజ్జనం చేస్తే అవి విషపూరితం అవుతాయి. జలచరాలు ,వృక్షసంపదను చంపుతుంది. రసాయన రంగులతో అలర్జీ: ఈ రంగులు, మెరుపులు ఊపిరితిత్తులకు, కళ్లకు హాని కలిగిస్తాయి. వీటిని పీల్చినప్పుడు ఒక్కోసారి తీవ్రమైన ఆగ్నిలొచ్చే ప్రమాదం కూడా ఉంది.మట్టి గణపతే మహాగణపతిపురాణాల ప్రకారం వినాయకుడిని పార్వతీదేవి మేని నలుగు మట్టితోనే తయారు చేసిందట. అందుకే మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పూజించడం మంచిది. . సహజ సిద్ధంగా పొలాల్లో లభించే బంక మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసుకోవాలి. ఇవి నీటిలో ఆరు గంటల్లో పూర్తిగా ,సులభంగా కరిగిపోతాయి, అటు పశు పశుపక్ష్యాదులకు, పంటలకు ఎలాంటి నష్టం ఉండదు. అలాగే సహజసిద్ధమైన చెట్ల ఆకులు, బెరడుతో తయారు చేసే రంగులను మట్టి బొమ్మలకు అద్ది మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు.తద్వారా పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాం. అంతేకాదు, గణనాథుడిని పూజించే 21 రకాల పూజా పత్రి కూడా మట్టి నుంచే వస్తాయి కనుక మట్టిలో కలిసి, భూమిని సారవంతం చేస్తాయి.మట్టి గణపతినే ప్రతిష్టిద్దాం..జైబోలో గణేష్ మహారాజ్ కీ అంటూ నినదిద్దాం! తొలి పూజలందుకునే విఘ్న నాయకా ఈ సర్వజగత్తునూ కాపాడు తండ్రీ! అని మనసారా మొక్కుకుందాం! -
శ్రీకృష్ణుడి చేతిలో హతమైన రాక్షసుల గురించి తెలుసా?
ద్వాపరయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. దేవకీ వసుదేవులకు అష్టమ(8వ) సంతానంగా జన్మించిన వాడే శ్రీకృష్ణుడు. అలాగే మహావిష్టువు ఎనిమిదో అవతారంగా కృష్ణావతారమని, ఇది చాలా విశిష్టమైందని భక్తుల విశ్వాసం.కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపు కుంటారు. అయితే కృష్ణావతారంలో దుష్టశిక్షణ, శిష్ట రక్షణార్థంఅనేకమందిరాక్షసులను తుదముట్టించాడు. ఆ వివరాలు ఒకసారి చూద్దామా. పూతన: మాయారూపంలో చిన్ని కృష్ణుడికి చనుపాలిచ్చి చంపాలని చూసిన రాక్షసి. ఇది గమనించిన కృష్ణుడి రెండు గుక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా పీల్చేసి, చివరకు ప్రాణాలను కూడా హరించాడు.శకటాసురుడు,తృణావర్త (సుడిగాలి): కంసుడు అనుచరులైన వీరుకృష్ణుడిని వధించాలని, అపహరించాలని భావించి ఆయనచేతిలోనే ప్రాణాలు కోల్పోయి, విముక్తి పొందిన రాక్షసులువత్సాసుర వధ: రేపల్లెనెంచి బృందావనానికి చేరిన కృష్ణుడు స్నేహితులతో ఆడుకుంటుండగా కోడె గిత్త రూపంలో వచ్చాడు వత్సాసురుడు. దీన్ని పసిగట్టిన కృష్ణయ్య దాన్ని ఎత్తి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపాడుబకాసురవధ: కంసుడు కృష్ణుడిని చంపడానికి పూతన సోదరుడు బకాసురుడు. పక్షిరూపంలో ఉన్న అతడిని కృష్ణుడు వధించాడు.శ్రీకృష్ణుడు గోపబాలురు యమునాతీరమున ఆడుకుటుండుగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు పెద్ద కొండచిలువ రూపంలో వచ్చి శ్రీకృష్ణుడిచేతిలో హతమయ్యాడు. అలాగే అరిష్టాసుర, ఇంకా గోవుల సమాజానికి ఒక పీడకలగా మారిన కాళియ మర్ధనంచేసి అక్కడి ప్రజలకు విముక్తి కల్పించాడు. కువలయపీడ- శ్రీ కృష్ణుడు మధురలో మదగజం రూపంలో ఉన్న ఏనుగు రాక్షసుడిని శ్రీ కృష్ణుడు చంపాడు.కంసుడు పంపించిన మరో రాక్షసుడు అశ్వం రూపంలో ఉన్న కేశికను కూడా వధించాడు కృష్ణుడు. పౌండ్రక వాసుదేవుడి వధ : అసూయతో యుద్ధం ప్రకటించి, శ్రీకృష్ణుడు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కానీ వైరభక్తితో కృష్ణుని లో కలిసిపోయాడు.శిశుపాలుడి వధ: శిశుపాలుడు తల్లి సాత్యతికిచ్చిన మాట ప్రకారం అతని నూరు తప్పులను కాచిన శ్రీకృష్ణుడు,అతని దూషణలు శృతి మించడంతో సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శిశుపాలుడుని హత మార్చాడు. కంస చాణూర మర్ధన: తండ్రిశాపంతో అసురులుగా పుట్టిన చాణూరుడు, ముష్టికుడు, కళలుడు, తోశాలకుడు, కూటుడు , కంసుని కొలువులో చేరి, చివరికి నల్లనయ్య చేతిలో శాప విముక్తి పొందారు. ఇంకా వెయ్యి బాహువులు కలిగిన బాణాసురుడు కూడా నల్లనయ్య చేతిలో హతమయ్యాడు. అనుచరుల మరణంతో, యుద్ధానికి కాలుదువ్విన మామ కంసుడిని అతి సునాయాసంగా కడతేర్చాడు కన్నయ్య. భౌమాసుర (నరకాసుర)- నరకాసురుడు శ్రీకృష్ణుని 16వేల భార్యలను బంధించాడు, చివరికి కృష్ణుడి చేతిలో చనిపోయాడు. -
Shri Krishna Janmashtami: కృష్ణం వందే జగద్గురుం!
బాల్యంలో వెన్నదొంగగా వన్నెకెక్కినవాడు. మన్నుతిన్నాడని గద్దించిన తల్లి యశోదకు తన నోట ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించినవాడు. బృందావనంలో వేణుగానం వినిపిస్తూ, గోపికలను రాసలీలలతో అలరించినవాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ నెరవేర్చినవాడు. కురుక్షేత్రంలో బంధువులను తన చేతులతో చంపలేనని, యుద్ధం చేయలేనని అస్త్రాలను విడిచిపెట్టిన అర్జునుడికి భగవద్గీతను బోధించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినవాడు. భగవద్గీతను బోధించినందున గీతాచార్యుడిగా, జగద్గురువుగా భక్తుల పూజలు అందుకొనే శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వాంతర్యామి. ఆయన జగన్నాథుడు. ఆయన ఆర్తత్రాణపరాయణుడు. శ్రీకృష్ణుడి భక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. మన దేశంలో బృందావనం, మథుర, ద్వారక సహా పలు శ్రీకృష్ణ క్షేత్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడికి వేలాదిగా ఆలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా, విదేశాల్లోనూ శ్రీకృష్ణుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆగస్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విదేశాల్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయాల విశేషాలు మీ కోసం...శ్రీకృష్ణుడి ఆరాధాన ప్రాచీనకాలంలోనే విదేశాలకు పాకింది. క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలోనే ప్రాచీన గ్రీకులు శ్రీకృష్ణుడిని వాసుదేవుడిగా, దేవాదిదేవుడిగా కొలిచేవారు. గ్రీకు రాయబారి హిలియోడారస్ క్రీస్తుపూర్వం 113 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని విదిశా నగరంలో ఒక గరుడస్తంభాన్ని నాటించాడు. ఈ రాతి స్తంభంపై బ్రహ్మీలిపిలో ‘వాసుదేవుడు దేవాదిదేవుడు’, ఆయన అడుగుజాడలైన ఆత్మనిగ్రహం, జ్ఞానం, దానం అనుసరించడం వల్ల స్వర్గాన్ని చేరుకోవచ్చు’ అని రాసి ఉంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ప్రస్తుతం ‘ఇస్కాన్’ శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్వహిస్తోంది.మన పొరుగు దేశాల్లో కృష్ణాలయాలు..బ్రిటిష్ పాలనలో ఒకటిగా ఉండి తర్వాత విడిపోయిన మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మాలలోను, నేపాల్లోను కృష్ణాలయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే కృష్ణాలయాలతో పాటు కొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. దినాజ్‌పూర్‌లోని ‘కళియా జుయె’ ఆలయం, జెస్సోర్‌లోని రాధాకృష్ణ మందిరం, పాబ్నాలోని జగన్నాథ ఆలయం బంగ్లాదేశ్‌లోని పురాతన కృష్ణాలయాల్లో ప్రముఖమైనవి. పాకిస్తాన్‌లోని క్వెట్టా, రావల్పిండి, హరిపూర్, ఫతేజంగ్ తదితర చోట్ల పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి. లాహోర్‌లో 2006లో కొత్తగా కృష్ణాలయాన్ని నిర్మించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అక్కడి ప్రభుత్వ అనుమతితో కొత్తగా కృష్ణాలయ నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ సహా పాటన్, నవల్పరాసీ, రాజ్‌బిరాజ్ తదితర ప్రాంతాల్లో పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి.ఖండ ఖండాంతరాల్లో కృష్ణాలయాలుమన పొరుగు దేశాల్లోనే కాకుండా, ఆసియా, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి. మలేసియాలోని కౌలాలంపూర్‌లో అక్కడ స్థిరపడిన తమిళులు నిర్మించిన కుయిల్ శ్రీకృష్ణాలయం, పెనాంగ్‌లో శ్రీకృష్ణాలయం, రాధాకృష్ణాలయం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి. సింగపూర్‌లో 1870 నాటి శ్రీకృష్ణాలయం ఉంది. దీనిని సింగపూర్ ప్రభుత్వం జాతీయ సాంస్కృతిక వారసత్వ నిర్మాణంగా గుర్తించింది. మయాన్మార్లో రాధామండలేశ్వర ఆలయం, థాయ్లండ్లో క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికే వైష్ణవారాధన ఉండేది. థాయ్లండ్లోని శ్రీథేప్లో పదమూడో శతాబ్ది నాటి వైష్ణవాలయంలో గోవర్ధనగిరి పైకెత్తిన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో స్థిరపడిన భారతీయులు రాధా శ్యామసుందర ఆలయాన్ని నిర్మించుకున్నారు. భారత సంతతి జనాభా ఎక్కువగా ఉండే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో సెయింట్ మాడలిన్ నగరంలోని కృష్ణ మందిరం, డెబె పట్టణంలోని గాంధీగ్రామంలో రాధాకృష్ణ మందిరం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి.బ్రిటన్ రాజధాని లండన్‌లో కృష్ణయోగ మందిరం, రాధాకృష్ణ ఆలయాలతో పాటు లివర్‌పూల్, మాంచెస్టర్, ఓల్డ్హామ్, స్వాన్సీలలో రాధాకృష్ణ ఆలయాలు, గ్లోస్టర్‌షైర్, ష్రాప్షైర్, కాన్వెంట్రీ, డుడ్లీ, శాండ్వెల్, బోల్టన్లలో కృష్ణ మందిరాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇవే కాకుండా, బ్రిటన్‌లో పలుచోట్ల కృష్ణారాధన జరిగే ‘ఇస్కాన్’ మందిరాలు, స్వామినారాయణ్ మందిరాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని బోయిజ్ స్టేట్ యూనివర్సిటీ సమీపంలో హరేకృష్ణ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వైదిక సంస్కృతీ కేంద్రం కూడా పనిచేస్తోంది. హాల్బ్రూక్లో ‘బ్రజమందిర్’ పేరిట కృష్ణాలయం ఉంది. ఆస్టిన్‌లో రాధామాధవధామ్ ఆలయం, మిల్‌క్రీక్ సాల్ట్‌లేక్ సిటీలో కృష్ణాలయం, స్పానిష్ఫోర్క్లో రాధాకృష్ణాలయం, మిల్వాకీలో రాధామాధవ మందిరంతో పాటు పలుచోట్ల ‘ఇస్కాన్’ నిర్వహిస్తున్న కృష్ణాలయాలు ఉన్నాయి. భారత్ నుంచి వెళ్లి స్థిరపడిన హిందువులు ఎక్కువగా నివసించే గల్ఫ్ దేశాల్లోనూ కృష్ణాలయాలు దుబాయ్‌లో ‘శ్రీకృష్ణ హవేలి’, బహ్రెయిన్‌లో శ్రీనాథ ఆలయం, ఓమన్‌లో శ్రీకృష్ణాలయం ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో హరేకృష్ణ ఆలయంతో పాటు పలుచోట్ల ఇస్కాన్ ఆధ్వర్యంలోని కృష్ణాలయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని మార్ల్బ్రోలో, శాండ్టన్లలో రాధేశ్యామ్ ఆలయాలు ఉన్నాయి.ఇవే కాకుండా, ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా దాదాపుగా అన్ని దేశాల్లోనూ కృష్ణాలయాలు ఉన్నాయి. అలాగే స్వామినారాయణ్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటితో పాటు దేశ విదేశాల్లోని ఇతర వైష్ణవ ఆలయాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. -
Rakhi Purnima 2024: ఒకరికొకరు అండాదండా
శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపూర్ణిమ అంటే తెలియని వారుండరు. పేరు తెలిసినా ఆ సంప్రదాయ బద్ధంగా ఆనాడు ఏం చేయాలో... రాఖీ కట్టడంలోని అంతరార్థం ఏమిటో తెలిసినవారు అరుదనే చె΄్పాలి.పూర్ణిమనాడు శ్రవణానక్షత్రం ఉన్న మాసానికి శ్రావణ మాసమని పేరు. శ్రావణమాసంలో రాత్రివేళ పూర్ణిమ తిథి ఉన్న రోజును రక్షికా పూర్ణిమ అన్నారు పెద్దలు. రక్షించగలిగిన పూర్ణిమ, రక్షణ కోరుకునే వారికోసం ఉద్దేశింపబడిన పూర్ణిమ అని అర్థం. ఈ పండుగ కాస్తా కాలక్రమంలో రాఖీపూర్ణిమగా పేరు మార్చుకుంది.శ్రావణ పూర్ణిమనాడు ఉదయమే స్నానం చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి కడుతూ– ‘ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. అయితే ఇది ఇప్పటి ఆచారం కాదు... ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే!రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక అంతటితో వదిలేయకూడదు. ఆ బంధానికి కట్టుబడి ఒకరికి ఒకరు అన్నింటా అండగా నిలవాలి. మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. అంతేకాదు.. దేశ రక్షణలో పాల్గొనే సరిహద్దు భద్రతాదళాలకు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి విజయాన్ని, శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం శ్రావణ పున్నమిరోజు రక్షాబంధనం కడుతుండటం శుభపరిణామం.స్థితి కారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండే ఈ శ్రావణ పూర్ణిమనాడే నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను. కాబట్టి ఆ శ్రీహరి అనుగ్రహం నా మీద ప్రసరించి నేనూ రక్షించేవాడిగానే ఉండాలని అర్థం చేసుకోవడానికే శ్రావణపూర్ణిమని ఈ పండుగ రోజుగా నిర్ణయించారని గమనించాలి. అంతేకాదు, అపరాహ్ణ సమయంలో రక్షికని కడుతున్న నా రక్షికాబంధానికి ఆ ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యుడని తెల్పడానికే. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలఃతేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల!రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమై΄ోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. ఈ పండుగలోని హంగులు, ఆర్భాటాల మాట ఎలా ఉన్నా, తమకు రక్షణ ఇవ్వవలసిందిగా కోరుతూ... తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయÆ . ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో çమాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. – డి.వి.ఆర్. -
Varalakshmi Vratham 2024: సిరి వరాలు
లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. కుచేలుర నుంచి కుబేరుల వరకు అందరికీ ఆమె అనుగ్రహం కావలసిందే. ఉన్నత స్థితి, రాజరికం, అదృష్టం, దాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే సకల సంపదలు పొందగలమనడంలో సందేహం లేదు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు... అందులోనూ రెండవ శుక్రవారమంటే ఇంకా ఇష్టం. ఈ రోజున వరలక్ష్మీవ్రతం చేసుకున్న వారికి సకల సంపదలూ ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి.మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా గౌరవాదరాలతో మర్యాదలు చేస్తామో అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చిందని భావించి, మనసు పెట్టి ఈ వ్రతాచరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.సమకూర్చుకోవలసిన సామగ్రిపసుపు, కుంకుమ, గంధం, విడి పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరుబత్తీలు, కర్పూరం, చిల్లర పైసలు, కండువా, రవికల బట్టలు రెండు, మామిడాకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు ఐదు రకాలు, అమ్మవారి పటం, కలశం, మూడు కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణాలు రెండు, నైవేద్యం కోసం ఓపికను బట్టి ఐదు లేదా తొమ్మిది రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా పాలు, ఇంకా దీపాలు, గంట, హారతి పళ్లెం, స్పూన్లు, పళ్లేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు.వ్రత విధానంవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ దగ్గర లేకపోతే పూజమీద మనసు నిలపడం కష్టం అవుతుంది..ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదాఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందనపూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయకగణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి పూజ చేసి, స్వామికి పళ్ళుగానీ బెల్లం ముక్క గానీ నివేదించాలి. తర్వాత వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కలశం ఉంచి అమ్మవారిని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజించాలి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అనంతరం తోరపూజ చేసుకుని, ‘బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహిమే రమే’ అని చదువుకుంటూ కుడిచేతికి తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకొని అక్షతలు వేసుకుని, అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్యం పెట్టాలి. ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత పూజ చేసిన వారు తీర్థప్రసాదాలు స్వీకరించి, పేరంటాళ్లు అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి. తర్వాత బంధుమిత్రులతో, పూజకు వచ్చిన వారితో కలిసి కూర్చుని భోజనం చేయాలి. రాత్రికి ఉపవసించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. అదేమంటే అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది పిండివంటలు నివేదించాలి అన్నారు కదా అని ఎంతో శ్రమ పడి. ఓపిక లేకపోయినా అన్నీ చేయనక్కర లేదు. పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, చలిమిడితోపాటు పానకం, వడపప్పు, అరటిపండ్లు, సెనగలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.స్త్రీలలోని సృజనకు దర్పణం ఈ వ్రతంఅది ఎలాగంటే ఆ రోజున ఒక మంచి పెద్ద కొబ్బరికాయకి వీరు కళ్లు, ముక్కు, చెవులు, నోరు తీర్చి దిద్ది తగిన ఆభరణాలతో అలంకరించి మరీ వరలక్ష్మిని సృజిస్తారు. -
శ్రావణమాసం : రాగి, ఇత్తడి, పూజా పాత్రలు తళ తళలాడాలంటే, చిట్కాలివిగో!
శ్రావణమాసంలో కొత్త పెళ్లికూతుళ్లు మాత్రమే కాదు, ప్రతి ఇల్లు అందంగా ముస్తాబవుతుంది. ముత్తయిదువులందరూ ఇంటి అందాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా అలంకరించిని ఇంట్లో స్వయంగా ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఇంటిని పూలతోరణాలు, మామిడాకులతో అందంగా తీర్చిదిద్దుదాం. ఇంట్లో పూజ గది నుండి వంటగది వరకు ప్రతిదీ శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. అలాగే అలంకరణ నిమిత్తం ఇంటి ముందు, వసారాలో పెద్ద పెద్ద ఇత్తడి పాత్రలను, దీపపు కుందులను అమర్చుతారు. ఆరోగ్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇత్తడి, రాగి , కంచు పాత్రల వాడకం బాగా పెరిగింది.చింతపండు:ఇత్తడి, రాగి పాత్రల మురికి వదిలించాలంటే అందరికీ గుర్తొచ్చేది చింతపండు గుజ్జు. చింతపండుతో, ఆ తరువాత మట్టితో తోమడం పెద్దల నాటినుంచి వస్తున్నదే. చింతపండును నీళ్లలో నానబెట్టి ఆ గుజ్జుతో రుద్దితే ఇత్తడి సామానులకు పట్టిన మకిలి, చిలుము అంతా పోయి గిన్నెలు మెరుస్తాయి. నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఆరనిచ్చి మెత్తని గుడ్డతో తుడిచి ఎండలో కాసేపు ఆరనివ్వాలి.వంట సోడా: రాగి, ఇత్తడి మెరిసేలా చేయడానికి దానిపై బేకింగ్ సోడా, సబ్బును అప్లయ్ చేయాలి. ఆ తరువాత శుభ్రంగా తోమాలి. గోధుమ పిండి: గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, టీస్పూన్ వైట్ వెనిగర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. తరువాత ఈ పేస్ట్‌ను ఇత్తడి లేదా రాగి పాత్రలపై అప్లై చేసి, కాసేపు అలాగే ఉంచండి. స్క్రబ్బింగ్, క్లీనింగ్ తర్వాత అది మెరుస్తుంది.వెనిగర్: ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి, పాలిష్ చేయడానికి వైట్ వెనిగర్ ఒక అద్భుతంగా పని చేస్తుంది. గ్లాసు నీటిలో రెండు చెంచాల వెనిగర్ ఉడికించింది. దీనికి లిక్విడ్ డిష్ వాషర్ కానీ, విమ్ పౌడర్ గానీ మిక్స్ చేసి తోమి కడిగితే, పూజా వస్తువులు మెరుస్తాయి.నిమ్మ ఉప్పు: ఇత్తడి పాత్రలు కొత్తవిలా మెరిసిపోయేలా చేయడానికి నిమ్మ ఉప్పు ఉపయోగించండి. నిమ్మరసం, ఉప్పు కలపడం ద్వారా ఒక ద్రావణాన్ని సిద్ధం చేసి, దానిని ఇత్తడి పాన్‌కు అప్లై చేసి పాన్‌ను రుద్దండి. ఇలా చేయడం వల్ల ఇత్తడిపై నలుపు పోయి, ఇత్తడి పాత్రలు మెరుస్తాయి.పీతాంబరీ: ఇత్తడి, రాగి పాత్రలను శుభ్రం చేయడానికి పీతాంబరిమరో బెస్ట్ ఆప్షన్. బాగా కడిగిన మెత్తటి గుడ్డతోతుడిచి ఆరనివ్వాలి. -
బోనాల పండుగ 2024 ప్రాముఖ్యత, ఆసక్తికర సంగతులు
తెలంగాణాలో అత్యంత ఘనంగా, వైభవంగా జరిగే బోనాల పండగ. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండగ పోతురాజులు, బోనం, పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలకు పూజలు, బోనం, రంగం, భవిష్యవాణి.. ఇలా నెల రోజుల పాటు ఈ సందడి కొనసాగుతుంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజుఈ బోనాల ఉత్సవం షురు అవుతుంది. తరువాత అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు. భాగ్యనగరంలో నాలుగు వారాల పాటు ఒక్కో వారంల ఒక్కో గుడిలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించి ఎందుకని బోనాల పండుగ సంబురాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెలంతా తెలంగాణా ఆడబడుచులు ఉత్సాహంగా గడుపుతారు. డప్పులు, వాయిద్యాలు పోతరాజు నృత్యం మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. మూడు ఆదివారాల ఉత్సవం తర్వాత నాలుగో ఆదివారం ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ రోజున రంగం, ఘటం ఆచారాలు నిర్వహిస్తారు. ఘటం చివరి ఊరేగింపు. దేవతలా అలంకరించబడిన కుండను పూజారి తీసుకువెళ్లి పవిత్రనీటిలో నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఉన్న కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం.ప్రతి ఏటా బోనాల పండుగ సంబురాల సందర్భంగా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్కా చెల్లెళ్ల దేవాలయాలన్నీ ముస్తాబవుతాయి. గోల్కోండలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు.భోజనంనుంచి వచ్చిందే బోనంసంస్కృత పదం భోజనం నుంచి వచ్చింది బోనం అని అర్థం. బోనం అంటే కుండలలో వండి అమ్మవారికి సమర్పించే నైవేద్యం. వివిధ ప్రాంతాలలో, బోనాలు పోచమ్మ, ఎల్లమ్మ, అంకాలమ్మ, పెద్దమ్మ, మారెమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ , నూకాలమ్మ వంటి అనేక పేర్లతో అమ్మవారిని ఆరాధించడం. ఈ బోనాల పండగ దాదాపు వెయ్యేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కోండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమితినిచ్చారు. ముఖ్యంగా భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనం, రెండో బోనం బల్కం పేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో వారం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు.ప్రజలు ప్రతి ఆదివారం స్త్రీలు ఉదయాన్నే లేచి, శుచిగా స్నానం చేసి, శుభ్రంగా, కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త మట్టి కుండలో అన్నం, పెరుగు, నీరు ,బెల్లం కలిపి క్షీరాన్ని వండుతారు. కుండను ఎరుపు, తెలుపు పసుపు రంగుల కలయికతో అలంకరిస్తారు. ఈ కుండపై కప్పి, పైన వేప ఆకులను ఉంచి, పైన దీపం వెలిగిస్తారు. ఇదే బోనం జ్యోతి. దీనితోపాటు మహంకాళి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గాజులు , చీరలను సమర్పిస్తారుబోనాలు అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పోతురాజే. పోతరాజును మహంకాళి దేవి సోదరుడని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఏడుగురు అక్కాచెల్లెళ్ల అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర సంబురాలు మస్తుగా షురూ అవుతయి. ఇక చివరగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా వివాహం కానీ ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది.. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చివరగా ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని భక్తుల విశ్వాసం.అతేకాదు బోనంతో విషజ్వరాలకు, అనేక రకాల వైరస్లకుచెక్ పెట్టే ఆచారం ఉంది. వర్షాకాలంలలో వచ్చే ఆఫాఢంలో పలు అంటు రోగాలు వస్తుంటాయి. అలాంటివేమీ రాకుండా పిల్లల్ని సల్లంగా సూడు తల్లీ అని అమ్మవారిని కోరేందుకే ఈ బోనం సమర్పిస్తారు. బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూసి. శుభ్రమైన వేపాకులు కడతారు. సహజ క్రిమి సంహారిణి అయిన పసుపు, వేపగాలి పీల్చడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లు నాశనమవుతాయి. ఇది పిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్యానికి మంచిదని విశ్వాసం.ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్రసికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ య్యాడు. అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. అది తెలుసుకున్న తను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే.. ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తామని అనుకున్నారు. అపుడు అమ్మవారి దయతో వ్యాధి తగ్గిపోవడం, ప్రజలు సంతోషంగా ఉండటంతో , ఇక అప్పటినుంచి 1815లో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అలా ఆషాఢంలో బోనాల సంబురాలు జరుగుతున్నాయి.విదేశాల్లోనూ బోనాల పండుగ..కేవలం తెలంగాణలోనే కాదు, దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు కూడా తెలంగాణ సంస్కృతిని సైతం చాటి చెప్పేలా ఈ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం విశేషం. -
ఆషాఢ గజానన సంకష్ట చతుర్థి : విశిష్టత, లాభాలు
ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతాన్ని గజానన సంకష్ట చతుర్థి అంటారు. ఎంతో భక్తితో జరుపుకునే పండుగ. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం (క్షీణించే దశ) చతుర్థి (నాల్గవ రోజు) నాడు వస్తుంది. సంకష్ట చతుర్థి అంటే కష్టాలను నాశనం చేసేదని అర్థం. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథిని సంకష్ట చతుర్థి అంటారు. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల శివుడు, పార్వతి, గణపతి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడట. అందుకే ఈ మాసంలో శివుడితోపాటు, ఆయన కుమారుడైన వినాయకుడిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఆచరిస్తారు. సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం వేళలో మహిళలు గణపతిని పూజించి, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఈ ఉపవాసాన్ని ముగిస్తారు. అత్యంత భక్తిశ్రద్దలతో గణేశుని పూజించి రోజంతా ఉపవాసం ఆచరిస్తారు. గణపతి వ్రత కథను చదువుకుని సాయంత్రం పూజలు చేసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ వ్రత మహిమ వల్ల అదృష్టం కలిసివస్తుందని అన్ని అడ్డంకులను విఘ్ననాయకుడు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. గజానన సంకష్ట చతుర్థి నాడు దానధర్మాలు చేస్తారు. అన్నార్తులకు అవసరమైన ఇతర బహుమతులు అందించడం శుభప్రదంగా భావిస్తారు. తద్వారా కష్టనష్టాలు తొలగి ఆ గణుశుని ఆశీస్సులు లభిస్తాయని, సకల సంపదలు, శుభాలు కలుగుతాయని మంచి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భావిస్తారు. -
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే. చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి అనే... జీవితంలో ఆకాంక్షలు ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ ఉండాలి. అలాంటి వారికి అభయమిచ్చే ఆధ్యాత్మిక వేడుకలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘రొట్టెల పండగ’ నెల్లూరులో జరిగే ఈ పండగలో స్త్రీలు విశేషంగా ΄ాల్గొంటారు. ప్రతి సంవత్సరం మొహరం పండగ వేళలో నెల్లూరు వీధులు ΄ోటెత్తుతాయి. దేశ విదేశాల నుంచి జనం నెల్లూరులోని బారా షహీద్ దర్గా దగ్గరకు చేరుకుంటారు. కులం, మతం, భాష, ్ర΄ాంతం... తేడా లేకుండా అక్కడి స్వర్ణాల చెరువులో మొక్కు మొక్కుకుంటారు. లేదా తీర్చుకుంటారు. మొక్కు తీరిన వారు రొట్టె పంచుతారు. మొక్కుకునే వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చెక్కు చెదరడం లేదు. ప్రతి సంవత్సరం ఐదు రోజుల ΄ాటు జరిగే ఈ వేడుక నిన్నటి నుంచి çఘనంగా జరుగుతోంది. ఇది ప్రధానంగా స్త్రీల పండగ.ఎవరు ఈ బారా షహీద్?మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా టర్కీ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరమరణం ΄÷ందారు. వీరి తలలు గండవరంలో తెగిపడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకు వచ్చాయి. ఈ 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12ను ఉర్దూలో బారా, వీర మరణం ΄÷ందిన అమరులను షహీద్‌లుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్ అనే పేరొచ్చింది. రొట్టెల ఆనవాయితీతమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఆర్కాట్ నవాబుల ఏలుబడిలో ఉన్నప్పుడు నవాబు భార్య జబ్బు పడితే ఆమెకు నయం అయ్యే మార్గం కోసం నవాబు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బారా షహీద్ దర్గా దగ్గర బట్టలు ఉతుకుతున్న రజకునికి ఆ రాత్రి బారా షహీద్‌లు కనబడి మా సమాధుల దగ్గరి మట్టి తీసుకుని నవాబు భార్య నుదుటికి రాస్తే నయం అవుతుందని చె΄్పారు. ఆ సంగతి రజకుడు ఊరి వారికి తెలుపగా వారు నవాబుకు తెలియచేశారు. మట్టి తెప్పించిన నవాబు దానిని తన భార్య నుదుటికి రాయగా 24 గంటల్లో ఆమెకు నయం అయ్యింది. దాంతో అతడు అంత దూరం నుంచి బారా షహీద్ దర్గాను చూడటానికి వచ్చాడు. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పేదలకు రొట్టెలు పంచాడు. మొక్కు తీరాక ఇలా రొట్టెలు పంచడం ఆనవాయితీ అయ్యింది. ఈ నెల 21 వరకు రొట్టెల పండగ జరుగుతుంది.వివాహం రొట్టె.. సంతాన రొట్టెనెల్లూరు బారా షహీద్ దర్గాలో మొక్కు రొట్టెతో ముడిపడి ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఉద్యోగం, ప్రమోషన్, సౌభాగ్యం, సంతానం, విద్య, స్వగృహం, వ్యా΄ారం... ఈ కోరికలు నెరవేరాలని మొక్కుకునేందుకు వస్తారు. గతంలో మొక్కిన మొక్కులు తీరిన వారు రొట్టెలతో వస్తారు. వారి నుంచి రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో వివాహ మొక్కు మొక్కుకుని వివాహం జరిగిన వారు రొట్టెలతో వస్తారు. వివాహం కావలసిన వారు వారి దగ్గర నుంచి రొట్టె స్వీకరించి తినాలి. మొక్కు తీరాక వాళ్లు ఇలాగే రొట్టెను తెచ్చి ఇవ్వాలి. బారా షహీద్ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో మోకాళ్ల లోతుకు దిగి స్త్రీలు ఈ రొట్టెల బదలాయింపు చేసుకుంటారు. బాకీ తీరాలనే రొట్టె, స్థలం కొనాలనే రొట్టె, ర్యాంకుల రొట్టె... ఇవన్నీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్య రొట్టె కోసం వస్తారు. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం
లండన్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం శుభకార్యాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మధ్యాహ్నం ఆశీర్వాదం, వందన సమర్పణతో ముగిశాయి. ఈసందర్భంగా సీతారాముల వారికి నిర్వహించిన పల్లకీసేవలో పిల్లలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఎస్వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, భాస్కర్ నీల, కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్‌కుమార్ యాదవ్, సురేష్ గోపతి, సురేష్‌రెడ్డి గడ్డం, పావనిరెడ్డి, కేకే చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్, తుకారాం రెడ్డి, రాఘవేందర్, గౌతమ్ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్దన్ హృదయపూర్వక కృతజ్ఞతలు,సంతోషాన్ని వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్వచ్ఛంద సేవకులు, దాతలు ఎంతగానో సహకరించారని కొనియాడారు. బ్రాక్నెల్లో కొత్తగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందుకోసం www.svbtcc.orgలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఎస్వీబీటీసీసీ సభ్యుల భక్తి,సేవానిరతనిఇ ప్రతిబింబించడమే కాకుండా వాలంటీర్ల అంకితభావం, నిబద్ధత కీలక పాత్రను పోషించాయని నిర్వాహకులు తెలిపారు. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం
లండన్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం శుభకార్యాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మధ్యాహ్నం ఆశీర్వాదం, వందన సమర్పణతో ముగిశాయి. ఈసందర్భంగా సీతారాముల వారికి నిర్వహించిన పల్లకీసేవలో పిల్లలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఎస్వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, భాస్కర్ నీల, కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్‌కుమార్ యాదవ్, సురేష్ గోపతి, సురేష్‌రెడ్డి గడ్డం, పావనిరెడ్డి, కేకే చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్, తుకారాం రెడ్డి, రాఘవేందర్, గౌతమ్ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్దన్ హృదయపూర్వక కృతజ్ఞతలు,సంతోషాన్ని వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్వచ్ఛంద సేవకులు, దాతలు ఎంతగానో సహకరించారని కొనియాడారు. బ్రాక్నెల్లో కొత్తగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందుకోసం www.svbtcc.orgలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఎస్వీబీటీసీసీ సభ్యుల భక్తి,సేవానిరతనిఇ ప్రతిబింబించడమే కాకుండా వాలంటీర్ల అంకితభావం, నిబద్ధత కీలక పాత్రను పోషించాయని నిర్వాహకులు తెలిపారు. -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది "జయంత విజయం" పద్యనాటకం. ఓర్లాండో ప్రవాసాంధ్రులను మంత్రముగ్ధులను చేసింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఘట్టాన్ని కేంద్రీకరించుకుని నాటి, నేటి తరాలను అలరించే విధంగా రూపొందించారు. ఈ రంగస్థల దృశ్యకావ్యం, భారతీయ పురాణాలు, ఇతిహాసాల ధార్మికత్వాన్ని చాటి చెప్పేలా ప్రేక్షకులను అలరించింది. తటవర్తి గురుకులం వారి పద్యకల్పద్రుమంలో భాగంగా, తటవర్తి కళ్యాణ చక్రవర్తి రచించిన ఈ నాటకం, తిక్కన విరాటపర్వంలో పద్యాలను సులభమైన తెలుగు నేపథ్యంతో మేళవించి, సుమారు వేయి మందికి పైగా హాజరైన ప్రేక్షకులను విస్మయులయ్యేలా చేసింది. అత్యంత సందోహ సంతోష సంబరంగా వెలసిన "క్రోధి" నామ సంవత్సర ఉగాది వేడుకలలోప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓర్లాండో తెలుగు సంఘం అద్యక్షుడు కిశోర్ దోరణాల సమన్వయంతో, చెరుకూరి మధుగారి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ నాటకంలో వెంకట శ్రీనివాస్ పులి, దీకొండ జయశ్రీ, నిడమర్తి కృష్ణ, యఱ్ఱాప్రగడ శాయి ప్రభాకర్, కసిరెడ్డి ఇంద్రసేన, శీలం గోపాల్, నిడమర్తి అరుణ, ఏనపల్లి మహేందర్, దివాకర్ల పవన్ కుమార్ మరియు దివాకర్ల ప్రసూన ముఖ్య పాత్రధారులు కాగా, శ్రీధర్ ఆత్రేయ అందించిన నేపధ్య సంగీతం RJ మామ మహేష్ కర్టెన్ రైజర్ వాయిస్ ఓవర్ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచాయి. -
Ugadi 2024: ఆన్లైన్లో ఆటా సాహిత్య వేదిక ఉగాది వేడుకలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర "తెలుగు వసంతం" సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంది. త్రిభాషా మహాసహస్రావధాని , ప్రణవ పీఠాధిపతులు వద్దిపర్తి పద్మాకర్, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, శృంగేరి శారదా పీఠ ఆస్తాన పౌరాణికులు డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ, అవుసుల భానుప్రకాష్ అవధాని , అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గణనాథుని కీర్తనతో రాలీ,నార్త్ కరోలీనా నుండి వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా , విశిష్ఠ అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన , సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు , పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ సాహితీ కార్యక్రమం ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలందుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధు బొమ్మినేని పేరు పేరునా ప్రత్యేక అభినందనలను తెలిపారు. అలాగే 2024 సంవత్సరం అట్లాంటా లో జూన్ 7,8,9 తేదీలలో జరుగ నున్న18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్‌కు అందరికీ పేరుపేరున సాదర ఆహ్వానాన్ని పలికారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి నంది శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా అతిథులందరూ ఉత్సాహంగా గడిపారు. చివరిగా ఆటా లిటరరీ సభ్యులు మాధవి దాస్యం విశిష్ఠ అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం
పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం.. వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువు తీరాడు రాముడు. అయితే మన నిత్యజీవితంలో అసలు రామ శబ్దం లేనిదెప్పుడు? చిన్నప్పుడు లాల పోసి శ్రీరామ రక్ష చెప్పడం దగ్గరనుంచి ‘రామాలాలీ.. మేఘశ్యామాలాలీ’ అనే జోలపాటతో బిడ్డలను నిద్ర పుచ్చడం వరకు... అందరి జీవితాలలో రాముడు ఒక భాగంగా మారిపోయాడు. నేడు ఆ జగదభిరాముడు ఇలపై పుట్టినరోజు.. అంతేనా... ఆదర్శదంపతులుగా పేరు ΄పొందిన సీతారాముల పెళ్లిరోజు కూడా. ఈ సందర్భంగా ఆ పురుషోత్తముడి గురించి... ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలనూ, అన్నిసుఖాలనూ విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్యవాసం చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెరవలేదు. తాను నమ్మిన సత్య, ధర్మమార్గాలనే అనుసరించాడు. ఒక మంచి కొడుకులా, అనురాగాన్ని పంచే భర్తలా, ఆత్మీయతను అందించే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ... అందరితో అన్ని విషయాలలోనూ వినమ్రతతో మెలిగే మర్యాద పురుషోత్తముడిలా... ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో ఆ విధంగానే నడుచుకున్నాడు. అన్నివేళలా ధర్మాన్నే పాటించాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడినని అనలేదు. అనుకోలేదు కూడా... దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించలేదు. తాను ఆచరించినదే ధర్మం – అనుకునే విధంగా వ్యవహరించాడు. అందుకే ధర్మం రూపు దాల్చితే రాముడిలా ఉంటుందేమో అనుకునేలా ప్రవర్తించాడు. సంపూర్ణావతారం ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారాలే. మిగిలినవి అంశావతారాలు. అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు. మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం మానవుడిలా పుట్టాడు. అందరిలాగే ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అందుకే కదా... అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభిరాముడయ్యాడు. కల్యాణ వైభోగం ఆ శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. అసలు చైత్ర మాసప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు... ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. పుట్టినరోజునే పెళ్లి వేడుకలా.!? శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే శ్రీ సీతారామకళ్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనేదానికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఏమి చెబుతోందంటే– ఆ పరమాత్ముడు అవతారమూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు çపుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు. శ్రీరామ నవమినాడు ఏం చేయాలి? ఈరోజు రామునితోబాటు సీతాదేవి ని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం మంచిది. సమర్పించవలసిన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర ΄పొంగలి, చెరకు, విప్పపూలు నివేదించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు. నిత్యజీవితంలో రాముడు... లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష, జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ... ఓదార్పుగా అయ్యోరామ... అనకూడని మాట వింటే రామ రామ... పద్దు పుస్తకాలనుప్రారంభిస్తూ శ్రీరామ... కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా... ఇలా ఆయన అందరి నాలుకలమీదా నర్తిస్తూనే ఉన్నాడు... ఉంటాడు. అల్లరి చేస్తే కిష్కింద కాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు పాతవాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది... సామెతలు: రామాయణంలో పిడకల వేట; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు... చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహువంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీతకన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధమంటారు. అందరిళ్లలోని గిల్లి కజ్జాలను ఇంటంటి రామాయణమంటారు. రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్నీ నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ.... – డి.వి.రామ్ భాస్కర్ తారక మంత్రం ‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు. మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయల నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు ఉవాచించారు. శుభప్రదం... రామచరిత పారాయణం రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజుకొసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామమయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్యచరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి. 12 గంటలకు ఎందుకు? రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని భద్రాద్రిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి– ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీ -
Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..
Sri Rama Navami 2024 చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపు కుంటారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడంఆనవాయితీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. బెల్లంతో చేసిన పానకం, వడ పప్పును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు. శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే.. ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడిని శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే, ఐదు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. రామాయణాన్ని పఠించడం, హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కూడా సంతోషం కలుగుతుందట. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది. నవమి రోజున దుర్గ అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గా దేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతారు. రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయడంతోపాటు, దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. ప్రధానంగా రామమందిరంలో 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే'ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం. రామనవమి రోజున దేవుడికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్న దానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజు హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకుని.. సీతమ్మవారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరతాయట. -
Sri Rama Navami 2024: శ్రీరామనవమి ముహూర్తం, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి విషిష్టత ఏంటో తెలుసుకుందాం. అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి. త్రేతా యుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ,పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 2024లో రామ నవమి ఎప్పుడు? చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం ఏప్రిల్ 9, మంగళవారం ప్రారంభమయ్యాయి.ఏప్రిల్ 17 న రామ నవమి పండుగతో ముగుస్తాయి. రామ నవమి శుభ ముహూర్తం రామ నవమి, ఏప్రిల్ 17,బుధవారం. ముహూర్తం - ఉదయం 11:03 -మధ్యాహ్నం 01:38 వరకువ్యవధి - 02 గంటల 35 నిమిషాలు అని పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రామనవమిని ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రామజన్మభూమిగా భావించే అయోధ్యలో, శ్రీరాముని జన్మదినోత్స వేడుకలు కోలాహలంగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అయోధ్యకు వస్తారు.ఈ ఏడాది ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామజన్మభూమి దేవాలయంలో రామ్ లల్లా తొలి వేడుకులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. సీతారామకళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు అయిన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగింట. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని భక్తుల విశ్వాసం. చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. రామ భక్తులు రామాయణం భాగవత గ్రంథాలను పఠిస్తారు. సీతారామ లక్ష్మణులతోపాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు. వడపప్పు, పానకం పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందట. అందుకే శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెపుతుంది. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
"వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం” , “శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్” సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వేదికపై “ఉగాది కవి సమ్మేళనము” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. "శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని, కేవలం విదేశాలలో నివసిస్తున్న తెలుగు కవుల కొరకు ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 11 దేశాల నుండి సుమారు 40 మంది కవులు కవయిత్రులు పాల్గొనడం చాలా సంతోషదాయకమని, త్వరలో ఈ ఈ కవితలు అన్నిటినీ ఒక సంపుటిగా ప్రచురిస్తామని" నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు . 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ రాజ్యసభ సభ్యులు, సాహితీవేత్త పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల కవులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఆసాంతం వీక్షించి, ఆంగ్ల వ్యామోహంలో తెలుగును దూరం చేసుకోకూడదని, యువతరం కవులను రచయితలను ప్రోత్సహించే మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని సందేశాన్నిచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ గేయకవి, రచయిత భువనచంద్ర గీతం అందరినీఆహ్లాదపరిచింది. ఆత్మీయ అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా. వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సభను, నిర్వాహకులను అభినందించారు. రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, కవులందరూ “నా బాల్యంలో ఉగాది” అనే శీర్షికతో తమ చిన్ననాటి ఉగాది పండుగ జ్ఞాపకాలను, తాము పెరిగిన సొంత ఊరి పరిస్థితులను తలచుకుంటూ, వర్ణిస్తూ కవితలను వినిపించడం అందరినీ మరింత విశేషంగా ఆకట్టుకుంది. అందరూ ఒకే శీర్షికతో రాసిన కవితలైనా, వివిధ ప్రాంతాలలో ఉగాది వేడుకల తీరుతెన్నులు, వివిధ మనోభావాల ద్వారా ప్రకటించబడుతూ, దేనికి అదే ప్రత్యేకంగా నిలిచాయి. అమెరికా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, ఖతార్, ఒమాన్, యూఏఈ, పోలాండ్, యూకే దేశాల నుండి 40మంది ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. వంశీ అధ్యక్షరాలు డా తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకరకపల్లి శైలజ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం, కల్చరల్ టీవీ & శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. -
Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్ హెల్దీగా ఇలా..!
ఈద్ 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ పవిత్ర రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్ష తరువాత చంద్ర దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహంగా జరుపుకుంటారు. నెలవంకతో ప్రారంభమై 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు తదుపరి నెల నెలవంకతో ముగుస్తాయి. రంజాన్ పండుగ చేసుకుంటారు. దీన్నే ఈద్ అని కూడా అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తీపి విందు చేసుకుంటారు. ముఖ్యగా రంజాన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఒకటి హలీం. రెండోది షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా అనేది దక్షిణ ఆసియా నుండి వచ్చిన రుచికరమైన, వెల్వెట్ డెజర్ట్. సేవయాన్ అని పిలిచే సున్నితమైన సెమోలినా నూడిల్. ఏలకులు , కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, వివిధ రకాల గింజలు, డ్రైఫ్రూట్స్‌తో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. మరి షీర్ ఖుర్మా రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..! షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు: చిక్కని పాలు, సేమియా, చక్కెర, బాదం, జీడి పప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, నెయ్యి, కోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టు కోవాలి. అదే కడాయిలో సేమియాను కూడా వేసి జాగ్రత్తగా వేయించాలి. ఆ తరువాత మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. చిక్కగా మరిగాక మంట సిమ్‌లో పెట్టుకొని, ఇంకొంచెం మరిగాక పంచదార పొడి, కోవా వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండటం మర్చిపోకూడదు. ర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఖర్జూరాలను, సేమియాలను వేయాలి. ఇపుడిక ఊరికే కలపకూడదు. రోజ్ వాటర్ కూడా వేసి మెల్లిగా కలపాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత దింపేసుకోవాలి. తరువాత ముందే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు రేకలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే టేస్టీ అండ్ హెల్దీ షీర్ కుర్మా సిద్ధం. *సాక్షి పాఠకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు* -
Ugadi 2024 : సుమ ‘ఘమ’ల పులిహోర!
దేశవ్యాప్తంగా శ్రీక్రోధి నామ ఉగాది వేడుకల సందడి నెలకొంది. తెలుగు ముంగిళ్లు మామిడి తోరణాలతో.. బంతి, చేమంతులపూల దండలతో ముస్తాబైనాయి. కొంగొత్త ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదంతా శుభం జరగాలని కోరుకుంటూ తమ ఇష్టదైవాలకు మొక్కుకునే శుభ తరుణమిది. దీంతో దేవాలయ్యాన్నీ ముస్తాబైనాయి. ప్రత్యేకపూజలు ప్రార్థనలతో భక్తులు మునిగి తేలతారు. ఈ క్రమంలో పాపులర్ యాంకర్ సుమ ఒక వీడియోను షేర్ చేసింది. పండగంటే పులిహోర లేకుండా ఎలా పులిహోర రడీ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గలగల మాట్లాడుతూ, సందర్భోచితంగా పంచ్‌లు వేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ. దశాబ్దాలు తరబడి యాంకరింగ్ చేస్తున్నా బోర్ కొట్టని మాటల మూట సుమ. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
Ugadi 2024: లంగావోణీ, లెహెంగా, బెనారసీ.. ఆ సందడే వేరు!
ఉగాది 2024 హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాదికి ఆరంభం. ఉగాది. 'యుగ' అంటే వయస్సు,'ఆది' ఉగాది అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చిందే ఉగాది. ఉగాది అనగానే ఇల్లంగా శుభ్రం చేసుకోవడం, మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల మాలలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. అలాగే రకరకాల పిండి వంటలు, ఉగాది పచ్చడితో విందు చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇంకా ఉగాది అనగానే కవితా పఠనాలు, పంచాంగ శ్రవణాలు, దానధర్మాలు కూడా చేస్తారు. కొంగొత్త ఆశయాలకు అంకురార్పణ చేసే శుభదినమే ఉగాది పర్వదినం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. అందుకే అంతా కొత్త.. కొత్తగా కళకళలాడుతూ ఉండాలనీ, ఉగాది పండగ వచ్చిందంటే సంప్రదాయ రీతిలో కొత్త దుస్తులు ధరించాలని కూడా పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలైతే అందమైన లంగా ఓణీలు, లెహంగాలతో సీతాకోక చిలుకల్లా ముస్తాబవుతారు. ఇక మహిళల ప్రాధాన్యత చీరలకే. ప్రస్తుతం నారాయణ పట్టు, కాటన్,చేనేత లెహంగాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాలం మంచితనంతో నేసిన ఆనందాలే మన వేడుకలు. నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు వేసే చోట.. సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలంటే మన చేనేతలతో మరింత కొత్తగా సింగారించుకోవాలి ఏడాది పొడవునా ఇంటింటా శుభాలు నిండాలి. పదహారణాల లంగావోణీ తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి మన చేనేతలు. చేనేత చీరలు పచ్చని సింగారం కంచిపట్టు సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్ ఒక రంగు కాంబినేషన్ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్ కలర్ వాడుకుంటే బెటర్. మనసు దోచే ఇకత్ ప్లెయిన్ ఇకత్ ఫ్యాబ్రిక్‌ను లెహంగాకు తీసుకున్నప్పుడు బార్డర్, ఎంబ్రాయిడరీ లెహెంగాను ఇపుడుఫ్యాషన్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదేరంగు ఇకత్తో డిజైన్ చేసి, కాంట్రాస్ట్ ఓణీ జతచేస్తే అమ్మాయిలకు ఎవర్గ్రీన్ కాన్సెప్ట్. మంచి కాంట్రాస్ట్ కలర్స్‌తో ఇక్కత చీర ఏ మహిళకైనా నిండుదనాన్ని తీసుకొస్తేంది చల్ల..చల్లగా గొల్లభామ తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్ మెటీరియల్ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహెంగా, దీని మీదకు కలంకారీ దుపట్టాను ఉపయోగించాను. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్ని పార్టీవేర్‌గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్ అనిపించే ఫ్యాబ్రిక్స్‌ని కూడా భిన్నమైన లుక్ వచ్చేలా హైలైట్ చేసుకోవచ్చు. గొల్లభామ చీరలు కూడా నిండుగా, ఈ వేసవిలో చల్లగా ఉంటాయి. గ్రాండ్‌గా గద్వాల్, బెనారసీ పట్టు వివాహ వేడుకల్లో అమ్మాయి అలంకరణ గ్రాండ్‌గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్‌ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్‌తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. ఇక మగువలు గద్వాల్, కంచి, బెనారసీ పట్టు చీరల్లోమహారాణుల్లా మెరిసిపోతారు. ఈ ఉగాదిని గ్రాండ్‌గా సెలబ్రేషన్ల కోసం మీకు ఇష్టమైన సెలబ్రిటీల ఫ్యాషన్ దుస్తులను చూసి కూడా నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు. -
Ugadi 2024: క్రోధిని కార్యసాధనంగా మలచుకుందాం!
ఉగాది తెలుగువారి తొలిపండుగ. ప్రభవతో మొదలు పెట్టి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలు 60. ఈ వరుసలో ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఉగాదికి క్రోధి నామ సంవత్సర ఉగాది అని పేరు. క్రోధి అంటే కోపం కలవారని సామాన్యార్థం. క్రోధి అనే పదానికి కొన్ని నిఘంటువులు కోప స్వభావులైన కుక్క, దున్న΄ోతు అని అర్థం చెప్పినప్పటికీ, దానిని పరిగణనలోకి తీసుకోనక్కరలేదు. అన్ని స్వభావాల లాగే మనిషికి కోపం లేదా క్రోధం కూడా అవసరమే. మనకు ఎంత అవసరమో, అంతవరకు మాత్రమే కోపాన్ని ఉంచుకోవాలి. మిగిలిన దానిని నిగ్రహించుకోవాలి. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు కూడా కొన్ని సందర్భాలలో కోపించాడు. అలా మన జీవితాలకు అవసరమైన మేరకు మాత్రమే కోపాన్ని ఈ ఉగాది ఇస్తుందని, ఇవ్వాలనీ ఆశిద్దాం. ఉగాదితో చాంద్రమాన సంవత్సరం మొదలవుతుంది. పౌర్ణమిచంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో కూడి ఉన్న మాసాన్ని చైత్రమాసంగా పిలుస్తారు. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పాడ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నక్షత్రమాసం అవుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. కాలానికి సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి ఈ మేరకు చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్తఋషులు నక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగ పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువు లో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి అనుగుణం గా కూడా రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థం. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. చాంద్ర– సౌర గమనాలప్రాతిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపాదనలను, మార్పులను తీసుకు వచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహాముని సంవత్సరాదిని వసంత విషువత్కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతం, వసంతంతోపాటు ఉగాది... ఈ రెండు ప్రాకృతిక పరిణామాల్ని మనం మన జీవితాలకు ఆదర్శంగా తీసుకోవాలి, వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది, ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలను తీసుకు వచ్చేది వసంతమే. అందుకే వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చె΄్పాడు. నాటి కవులు, పండితులు మొదలుకొని కళాకారుల వరకు అందరికీ వసంత రుతువంటేనే మక్కువ. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని పొందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘...సంతో వసంతవల్లోకహితం చరంతః ...‘ అని వివేక చూడామణిలో జగద్గురు ఆదిశంకరాచార్యులవారు అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం. హితం వంటి వసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. శుభానికి తొలి అడుగుగా, మంచితనానికి మారు పేరుగా అన్ని ఆరంభాలకూ ఆది అయిన తొలి పండుగగా ఉగాదికి విశిష్టత ఉంది. ఇతర పండుగలలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం కొత్త బెల్లం, మిరియాల΄÷డి, వేపపువ్వు, మామిడి పిందెలు, ఉప్పు, కొత్త చింతపండు కలిపి తయారు చేసిన ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని దీనికి పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగశ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను ఆయా రాశి గల వ్యక్తులకు సూచన్రపాయంగా పంచాంగం తెలియచెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి. ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవుదాం. కాలం ఒక ప్రవాహం కాలం నదిలాంటిది. ముందుకు ప్రవహిస్తుందే కానీ, వెనక్కి తిరగదు. అలా ముందుకు ప్రవహించే నదిలో ఎన్నో సెలయేర్లు, వాగులు, వంకలు కలిసి ఉన్నట్టే... కాలవాహినిలో తృటి, క్షణం, ముహూర్తం, దినం మొదలైన కాలగతి సూచికలు మిళితమై ఉంటాయి. వీటిన్నింటి మేలు కలయికే కాల ప్రవాహం. ఇటువంటి కాలాన్ని ఉగాది రూపంలో ఆరాధించాలన్నదిప్రాచీనుల నిర్దేశ్యం. ప్రతి కొత్త సంవత్సరం శుభపరంపరలతో కొనసాగాలని కోరుకోవడంతోపాటు శుభాచరణకు మనల్ని మనం సమాయత్తం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆరు రుచులలో అనేక అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరు రుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు. ఉగాది పంచాంగ శ్రవణం వల్ల. భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. వీటితోపాటు సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారితమై , వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందంటారు పెద్దలు. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టవచ్చు. నూతనత్వానికి నాంది బ్రహ్మదేవుడు సృష్టినిప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలుప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. – డి.వి.ఆర్. భాస్కర్ -
Ugadi 2024: ఉగాది పచ్చడి ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
#Ugadi 2024 తెలుగువారి తొలి పండుగ ఉగాది అంటేనే ఆనందం. ఉత్సాహం. కొత్తకు నాంది అనే సంబరం. ముఖ్యంగా ఉగాది అనగానే తీపి, చేదు, లాంటి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అందరికీ గుర్తొస్తుంది. ప్రతి పదార్ధం జీవితంలోని విభిన్న అనుభవాలకు గుర్తుగా అమృతం లాంటి జీవితాన్ని ఆస్వాదించే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఉగాది పచ్చడికి అంత ప్రాధాన్యత. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్తగా ఆరంభించ డానికి ఇది శుభతరుణమని భావిస్తారు. ఉగాదికి పులిహోర, బొబ్బట్లు, పూర్ణం బూరెలతోపాటు ఉగాది పచ్చడి చేయడం అనవాయితీ. అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చడి ఇలా.. పచ్చి మామిడికాయ – ఒకటి (మీడియం సైజు) వేప పువ్వు – టేబుల్ స్పూన్ (తొడిమలు ఒలిచినది) కొత్త చింతపండు – నిమ్మకాయంత (రసం చిక్కగా తీసుకోవాలి) బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్ మిరియాలు లేదా మిరియాల పొడి అర టీ స్పూన్ లేదా రెండు చిన్న పచ్చిమిర్చి తయారీ: పచ్చి మామిడి కాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి. ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం టేబుల్ స్పూన్ కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉగాది పచ్చడి.స్పూన్‌తో అరచేతిలో వేసుకుని తినేటట్లు చిక్కగా ఉంటుంది. తెలంగాణలో తెలంగాణలో ఇదే మోతాదులో తీసుకున్న దినుసులను ఒక పెద్ద పాత్రలో వేసి ముప్పావు వంతు నీటిని పోసి కలపాలి. గ్లాసులో పోసి తాగేటట్లు జారుడుగా ఉంటుంది. పిల్లలు మెచ్చేలా..! ఉగాది పచ్చడి ప్రాశస్త్యాన్ని పిల్లలకు చెబుతూనే , వారికి నచ్చే విధంగా ఉగాది పచ్చడిని ఫ్రూట్ సలాడ్‌లా కూడా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడిలో వేసే ఆరు రకాల పదార్థాలతో సంప్రదాయ బద్ధంగా ఉగాది పచ్చడిని చేసుకొని, అందులోనే అరటిపండు, యాపిల్, ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవచ్చు. దీనికి కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకుంటే మరీ జారుగా కాకుండా, చక్కగా స్పూన్‌తో తినేలా ఫ్రూట్ సలాడ్‌లా భలేగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రస్టింగ్‌గా తింటారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మన అందరి జీవితాల్లో శాంతిని, సుఖ సంతోషాలను కలగ చేయాలని, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం.! -
Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..!
హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటేనే కొత్త ఆశలకు పునాది. కొత్త కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభించుకునేందుకు మంచి ముహూర్తం. ఈ సందర్భంగా ఈ ఏడాది ముహూర్తాలు, శుభ ఘడియలు ఎలా ఉన్నాయో చూద్దాం. చైత్ర మాసం (జనవరి) 09/04 శుద్ధ పాడ్యమి మంగళ అశ్వినీ వత్సరాది త్వేన నూతన వస్త్రాభరణ ధారణాదులకు మిథునం ప.గం.11:00 నుండి 11:45. 10/04 విదియ బుధ అశ్విని వ్యాపారాదులకు మేషం ఉ.6:50. భరణి, కృత్తికలు శుభ కార్య నిషేధం. 12/04 చవితి శుక్ర రోహిణి, అన్న, వ్యాపార, మేషం ఉ.గం.7:05. సీమంతం మిథునం ప.గం.10:20. 13/04 షష్ఠి శని మృగశిర సీమంతం వశ్చికం రా.గం.8:30ల 9:00వ. 14/04 షష్ఠి ఆది ఆర్ద్ర నక్షత్ర సంబంధ కర్మలకు వృషభం ఉ.గం.8.25. మిథునోపి ప.గం.11:19. 15/04 సప్తమి సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, సీమంత, వ్యాపార, పుంసవన, దేవాలయ కర్మలు, బోరింగ్, శంఖు, వషభం ఉ.గం.8:24 విశేషం. 17/04 శ్రీరామనవమి కళ్యాణములకు కర్కాటక లగ్నం ప.గం.11:34కు ప్రారంభం. 18/04 దశమి గురు మఘ వివాహం కర్కాటకం ప.గం.12:01. అగ్ని పంచకం 8 కు ఏకాదశీ వృశ్చికము వివాహముకు విశేషం రా.గం.8:54. 19/04 ఏకాదశీ శుక్ర మఘ వివాహము మిథునం ఉ.గం.11:00 విశేషం. 20/04 ద్వాదశీ శని ఉత్తర వివాహం, గర్భ, వ్యాపారం, వృశ్చికం (సగ్రహ) రా.గం.8:30. (గృప్రలకు శనివారం) సీమంతం రా.గం.8:00ల 8:30. త్రయోదశీ శని/ఆది ఉత్తర వివాహం, అత్యవసర గృప్ర మకరం రా.గం.1:10. 21/04 త్రయోదశీ ఆది ఉత్తర అత్యవసర విషయా లకు మిథునం అగ్నిపంచకం ఉ.గం.10:50. హస్త వివాహ, వ్యాపార, సీమంతం వృశ్చికం రా.గం.8:21 (సగ్రహ చంద్ర) ధనురపి రా.గం.11:32. 22/04 చతుర్దశీ సోమ హస్త అన్న వ్యాపార, సీమంత, సమస్త వాస్తుకర్మలు, సమస్త దేవాలయ పనులు మిథునం ప.గం.10:47. చిత్త గప్ర, గర్భాదానాదులకు ధనస్సు రా.గం.11:29. సీమంత వేడుకలకు రా.గం.8:00ల 8:30. 24/04 బ.పాడ్యమి బుధ స్వాతి అన్న, వ్యాపార, వృషభం ఉ.గం.7:47. అన్న, శంకు, వ్యాపార, సీమంత, బోరింగ్, దేవాలయ పనులు, మిథునం ఉ.గం.10:38. ధనుర్లగ్నం రాత్రి 10:30 అత్యవసరం. 26/04 తదియ శుక్ర అనురాధ సమస్త వాస్తు, దేవాలయ పనులకు వివాహ, సీమంత, వ్యాపార, ఉప, అక్షర, అన్న మిథునం ఉ.గం.10:30. (6చం). వివాహ గప గర్భాదానం ధనస్సు రా.గం.10:30. 27/04 చవితి శని జ్యేష్ఠ అత్యవసర విషయములకు మిథునం ప.గం.9:30. 28/04 పంచమి ఆది మూల వివాహం ధనస్సు రా.గం.11:50. లగ్న చంద్ర. సీమంత వేడుకలకు వృశ్చికం రా.గం.7:30ల 8:00 (6శుక్ర). సూచన 28 రాత్రి తెల్లవారితే 29 శుక్ర మూఢమి ప్రారంభం. 02/05 నవమి గురు ధనిష్ఠ అన్న, సీమంత మిథునం ఉ.గం.9:01. 03/05 దశమి శుక్ర శతభిష అన్న, సీమంత మిథునం ఉ.గం.10:01. 05/05 ద్వాదశీ ఆది ఉత్తరాభాద్ర అన్న సీమంత మిథునం ఉ.గం.9:50. 06/05 త్రయోదశీ సోమ రేవతి అన్న సీమంత మిథునం ఉ.గం.9:45 వైశాఖ మాసం (ఫిబ్రవరి) 10/05 తదియ శుక్ర రోహిణి అన్న, సీమంత, డోలా రోహణ మిథున ఉ.గం.9:30. 12/05 పంచమి ఆది పునర్వసు సీమంతాదులకు వృశ్చిక రా.గం.7:30ల 8:00. 13/05 షష్ఠి సోమ పునర్వసు అన్న, సీమంతాదులకు డోలారోహణం మిథున ఉ.గం.9:15. పుష్యమి సీమంతం వృశ్చికం రా.గం.7:30. 18/05 దశమి శని ఉత్తర అన్న, సీమంత, ఊయల, బోరింగ్, మిథునం ఉ.గం.8:55. సీమంతం వృశ్చికోగ్నిః రా.గం.7:00ల 7:30. 19/05 ఏకాదశీ ఆది హస్త మిథునం ఉ.గం.8:30. 20/05 ద్వాదశీ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల, బోరింగ్ మిథునం ఉ.గం.8:50. 23/05 పౌర్ణిమ గురు అనురాధ అన్న, సీమంత, ఊయల, బోరింగ్ కర్కాటకం ప.గం.11:01. సీమంతాదులకు ధనస్సు రా.గం.8:30. 24/05 పాడ్యమి శుక్ర అనురాధ అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.7:30 (6చం) 26/05 తదియ ఆది మూల అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.8:10. 27/05 చవితి సోమ ఉ.షాఢ అన్న, బోరింగ్, సీమంత ధనుః ఉ.గం.10:45. 29/05 షష్ఠి బుధ శ్రవణం మిథునం ఉ.గం.8:01. సప్తమి ధనిష్ఠ సీమంతం ధనస్సు రా.8:00. 30/05 సప్తమి గురు శతభిషం అన్న, బోరింగ్, సీమంతం కర్కాటకం ఉ.గం.9:01 (8 చం,శ) 01/06 దశమి శని ఉత్తరాభాద్ర కటకం ఉ.గం.8:50. 02/06 ఏకాదశీ ఆది రేవతి కటకం ఉ.గం.8:50. జ్యేష్ట మాసం (మార్చి) 07/06 పాడ్యమి శుక్ర మృగశిర కర్కాటకలగ్నం ఉ.గం.10:01 (8 శని) 09/06 తదియ ఆది పునర్వసు అన్న, సీమంత, బోరింగ్ మిథునం ఉ.గం.7:40. 10/06 చవితి సోమ పుష్యమి అన్న, సీమంత, బోరింగ్ కర్కాటకం ఉ.గం.8:34 (8 శని) 13/06 సప్తమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.8:30 (8 శని) 14/06 అష్టమి శుక్ర ఉత్తర కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం) 15/06 నవమి శని హస్త కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం) 17/06 ఏకాదశీ సోమ చిత్త కర్కాటకం ఉ.గం.8:01. అన్న, సీమంత, స్వాతి సీమంతం మకరం రా.గం.8:30ల 9:30. 19/06 త్రయోదశీ బుధ అనురాధ సా.గం.6:40. గోధూళి 20/06 చతుర్దశీ గురు అనురాధ కర్కాటకం అన్న, సీమంత కటకం ఉ.8:35. 21/06 పౌర్ణిమ శుక్ర మూల సీమంతం మకరం రా.గం.8:15ల 8:30. 22/06 పాడ్యమి శని మూల అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:25. 23/06 విదియ ఆది ఉత్తరాషాఢ సీమంత మకరం రా.గం.8:15ల 8:20. 24/06 తదియ సోమ ఉత్తరాషాఢ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:15. సీమంతం మకరం రా.8:01 (6శుక్ర) 26/06 పంచమి బుధ ధనిష్ఠ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:08. 27/06 షష్ఠి గురు శతభిషం అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:04. 29/06 అష్టమి శని ఉ.భా. అన్న, సీమంత కర్కాటకం ఉ.8:00. 30/06 నవమి ఆది రేవతి కర్కాటకం ఉ.గం.8:00. 01/07 దశమి సోమ అశ్విని కర్కాటకం ఉ.8:00. 03/07 ఏకాదశీ బుధ రోహిణి కర్కాటకం ఉ.8:00. ఆషాఢ మాసం (ఏప్రిల్) 06/07 పాడ్యమి శని పునర్వసు వృశ్చిక సా.గం.4:01. 07/07 విదియ ఆది పుష్యమి అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:01. సీమంతం మకరం రా.గం.7:30ల 8:30. 11/07 పంచమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.7:30. షష్ఠి ఉత్తర సీమంతం రా.గం.7:30ల 8:00. మూఢమి వెళ్ళి ఉత్తరాయనం వున్న కారణంగా దేవాలయ కార్యములు 16 వరకు గ్రాహ్యము. 12/07 సప్తమి శుక్ర హస్త సీమంతం మకర రా.గం.7:30. 13/07 అష్టమి శని చిత్త సీమంత మకరం రా.గం.7:30. 14/07 అష్టమి ఆది చిత్త అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:30. నవమి సీమంతం మకరం రా.గం.7:30. 15/07 నవమి సోమ స్వాతి అన్న, అక్షర, సీమంత, దేవాలయ ముహూర్తములు కటకం ఉ.7:30. 17/07 ఏకాదశీ బుధ అనురాధ తుల ప.గం.1:30 (8 కుజ) వృశ్చికం సా.4:01. సీమంతాదులకు ధనస్సు సా.5:30. 19/07 త్రయోదశి శుక్ర మూల సీమంతం ధనుః రా.గం.6:01. 21/07 పాడ్యమి ఆది ఉత్తరాషాఢ సీమంతం ధనస్సు సా.గం.4:30. 22/07 పాడ్యమి సోమ శ్రవణం అన్న, సీమంతం తుల ప.గం.12:01. విదియ సీమంత ధనుః రా.గం.5:30. 24/07 చవితి బుధ శతభిషం సీమంతం ధను సా.గం.5:30. 26/07 షష్ఠి శుక్ర ఉత్తరాభాద్ర అన్న, సీమంత తుల ప.గం.12:01. 27/07 సప్తమి శని రేవతీ అన్న, సీమంత తుల ప.గం.12:01. ధనస్సు సా.గం.4:45ల 5:00. 31/07 ఏకాదశి బుధ రోహిణి అన్న, సీమంత తుల ప.గం.11:30. ధనస్సు సా.గం.4:45ల 5:00. 01/08 ద్వాదశీ గురు మగశిర అన్న, సీమంత తుల ప.గం.11:30. 02/08 చతుర్దశీ శుక్ర పునర్వసు ధనస్సు సా.గం.5:01. శ్రావణ మాసం (మే) 05/08 విదియ సోమ మఘ మేషం రా.గం.11:39. 07/08 చవితి బుధ ఉత్తర వివాహం, గర్భాదానం మేషం రా.గం.11:34. బుధ/గురు వివాహం, గప్ర మిథునం తె.గం.2:30. 08/08 చవితి గురు ఉత్తర సీమంతం, వ్యాపారం ధనస్సు ప.గం.4:45. పంచమి గురు హస్త వివాహం, గప్ర మేషం రా.గం.11:27. గురు/శుక్ర మిథునం వివాహం, శంకు తె.గం.3:45. 09/08 పంచమి శుక్ర హస్త అన్న, సీమంత తుల ప.గం.11:01 (8 కు) సీమంతం ధనుః సా.గం.4:45. వివాహ, గర్భా మేషం రా.గం.11:23. షష్ఠి చిత్త శంకు గృప్ర మిథునం తె.గం.3:41. 10/08 షష్ఠి శని చిత్త సీమంతం, వ్యాపారం ధనుః సా.గం.4:00ల 4:30. సప్తమి శని/ఆది స్వాతి మిథునం తె.గం.3:44 విశేషం. 11/08 సప్తమి ఆది స్వాతి అన్న, అక్షర, సీమంతా దులకు తుల ప.గం.12:01 (8 కు) గర్భ, వివాహం మేషం రా.గం.11:19. ఆది సోమ మి«థునం తె.గం.3:01. 15/08 ఏకాదశీ గురు మూల తుల ప.గం.12:01 (8 కుజ) సీమంతం ధనస్సు సా.గం.4:15. వివాహం మేషం రా.గం.10:58. గురు/శుక్ర వివాహం, శంకు, మిథునం, వాస్తు కర్మలు వివాహం తె.గం.3:14. 17/08 త్రయోదశీ శని ఉత్తరాషాఢ సీమంత, వ్యాపార ధనుః ప.గం.3:50. వివాహం మేషం రా.గం.10:55. మిథునం తె.గం.3:10. 18/08 చతుర్దశి ఆది శ్రవణం సమస్త శుభాలకు తుల ప.గం.11:39. శ్రవణం మేషం రా.గం.10:51. వివాహం మిథునం తె.గం.5:06. కర్కాటక సంబంధిత కార్యములు తె.గం.4:30. 19/08 పౌర్ణిమ సోమ ధనిష్ఠ వివాహం మేషం రా.గం.10:47. సీమంతం, వ్యాపారం మకరం సా.గం.5:10ల 5:30. 22/08 తదియ గురు ఉత్తరాభాద్ర తుల ప.గం.11:23 (8 కుజ). వ్యాపారం ధనస్సు ప.గం.2:30. సీమంతాదులకు మకరం ప.గం.5:15. చవితి వివాహం, గర్భ, మేషం రా.గం.10:32. గురు/శుక్ర వివాహ, గృప్ర మిథునం తె.గం.2:50. కర్కాటకం తె.గం.4:30. 23/08 చవితి శుక్ర రేవతి తుల ప.గం.11:19 (8 కుజ) వ్యాపారం, సీమంత పంచమి మకరం సా.గం.5:11. వివాహం మేషం రా.గం.10:28. అశ్విని శుక్ర/ శని శంకు, గృప్ర మిధునం తె.గం.2:46. కర్కాటక తె.గం.4:30. 24/08 షష్ఠి శని అశ్విని వ్యాపారాదులకు ధనస్సు 2:00ల 3:00. మేషం రా.గం.10:17 వివాహం. 28/08 దశమి బుధ మృగశిర సమస్త శుభాలకు, దేవాలయ పనులకు, వాస్తు కర్మలకు తుల ప.గం.11:00. భాద్రపద మాసం (జూన్) 04/09 విదియ బుధ ఉత్తర అన్న, సీమంత వ్యాపారం తుల ఉ.గం.10:28. 05/09 విదియ గురు హస్త అన్న, సీమంత తుల ఉ.గం.9:01. 06/09 తదియ శుక్ర చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:25. 07/09 చవితి శని చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:21. గణేశ చతుర్థి. 08/09 పంచమి ఆది స్వాతి అన్న, సీమంత తుల ప.గం.10:17. 09/09 షష్ఠి సోమ అనురాధ మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం. 12/09 నవమి గురు మూల మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం 14/09 ఏకాదశి శని ఉత్తరాషాఢ మకరం ప.గం.4:00. 15/09 ద్వాదశీ ఆది శ్రవణం అన్న, సీమంతం తుల ఉ.గం.9:49. 16/09 త్రయోదశి సోమ ధనిష్ఠ అన్న, సీమంతం తుల ఉ.గం.9:45. మహాలయ పక్షం 18 ప్రారంభం. శుభకార్య నిషేధం. ఆశ్వీయుజ మాసం (జూలై) 03/10 పాడ్యమి గురు హస్త కలశస్థాపనాది సర్వములకు తుల ఉ.గం.7:00 ప్రా. 04/10 విదియ శుక్ర చిత్త అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.7:30. వ్యాపారాదులకు మకరం ప.2:00ల 3:00. స్వాతి మేషం రా.గం.7:33. వృషభం రా.గం.8:30. 05/10 తదియ శని స్వాతి అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.8:30. మేషం సా.గం.6:30ల 7:00. 07/10 పంచమి సోమ అనురాధ అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.8:20. వ్యాపారాదులకు మకరం ప.గం.2:30. మేషం రా.గం.7:35. 09/10 సప్తమి మూల బుధ మకరం ప.గం.2:11. మేషం సా.గం.7:00. 10/10 అష్టమి గురు పూర్వాషాఢ యంత్ర పూజలు మకరం ప.గం.2:00ల 2:30. 11/10 నవమి శుక్ర ఉత్తరాషాఢ యంత్ర పూజ, వాహన పూజలు తుల ఉ.గం.7:00ల 8:00. మకరం ప.గం.2:00ల 2:15. 12/10 విజయదశమి సందర్భంగా మకరం ప.గం.2:00ల 2:15. 13/10 ఏకాదశీ ఆది ధనిష్ఠ అన్న, అక్షర వైశ్యోపనయన, వివాహ, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం తుల ఉ.గం.7:57. మకరం వ్యాపారం ప.గం.1:37. వివాహం మేషం రా.గం.7:06. శతభిషం కర్కాటకం రా.గం.1:10. 14/10 ద్వాదశీ సోమ శతభిషం మకరం ప.గం.10:34. మేషం రా.గం.7:02. 16/10 చతుర్దశీ బుధ ఉత్తరాభాద్ర వ్యాపారాదులకు మకరం 1:27. మేషం వివాహాదులకు సా.గం.6:35. వివాహ, గృప్ర, గర్భాదానం వృషభం రా.గం.8:24. 17/10 పౌర్ణమి గురు రేవతి సమస్త శుభాలకు మకరం ప.గం.12:30ల 1:00. అశ్విని వివాహం వషభం రా.8:20. 20/10 చవితి ఆది రోహిణి వృషభం రా.గం.8:15. వివాహ, గప్ర, గర్భాదానాదులకు మిథునం రా.గం.10:59. 21/10 చవితి సోమ మృగశిర మకరం ప.గం.1:30. గృప్రలకు వషభం రా.గం.8:12 మిధునం రా.గం.10:55. అన్న, అక్షర, గృప్ర, వృశ్చికం ఉ.గం.8:25. 23/10 సప్తమి బుధ పునర్వసు మిథునం రా.గం.9:30. 24/10 అష్టమి గురు పుష్యమి మకరం ప.గం.12:15ల 12:30. మిథునం రా.గం.10:30. 26/10 దశమి శని మఘ వివాహం మిథునం రా.గం.10:35. 27/10 ఏకాదశీ ఆది మఘ వివాహం వృశ్చికం ఉ.గం.8:11. మకరం ప.12:15. కార్తీక మాసం (ఆగస్టు) 03/11 విదియ ఆది అనురాధ అన్న, అక్షర వైశ్యో పనయన, వివాహ, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, సీమంత, పుంసవన, ఊయల, నామకరణం, జాతకర్మ మకరం ప.గం.11:59. వివాహం గృప్ర వృషభ రా.7:12. గర్భ, గృప్ర, వివాహం మిధునం రా.గం.10:03 (6శు) 04/11 తదియ సోమ జ్యేష్ఠ వృశ్చికం ఉ.గం.7:33. 07/11 షష్ఠి గురు ఉత్తరాషాఢ వృషభం రా.గం.7:30ల 8:00 సీమంతం, వివాహం మిథునం రా.గం.9:50. 08/11 సప్తమి శుక్ర ఉత్తరాషాఢ సమస్త శుభాలకు వృశ్చికం ఉ.గం.7:20. 09/11 అష్టమి శని శ్రవణం వృశ్చికం ఉ.గం.8:15. నవమి ధనిష్ఠ వివాహాదులకు వృషభం రా.గం.6:53. నవమి వివాహం మిథునం రా.9:46. 10/11 నవమి ఆది ధనిష్ఠ సమస్త శుభాలకు, వైశ్యోపనయన, వాస్తుకర్మలు, దేవాలయ పనులకు వృశ్చికం 7:20. విశేషం. శతభిషం వృషభం రా.6:30. దశమి ఆది మిథునం రా.గం.9:40. 11/11 ఏకాదశి సోమ పూర్వాభాద్ర మిథునం రా.గం.8:00ల 8:30. 13/11 ద్వాదశీ బుధ రేవతి వృశ్చికం సమస్త కార్యములు ఉ.6:54. 14/11 త్రయోదశీ గురు అశ్విని సమస్త శుభాలకు వృశ్చికం ఉ.6:50. 17/11 విదియ ఆది రోహి వివాహం, గర్భ, గృప్ర, వ్యాపార, సీమంతాదులకు మిథునం రా.గం.7:30ల 8:00. పుష్కరాంశ 9:07. విదియ ఆది రోహిణి ధనస్సు ఉ.గం.9:30 (8 కు) శంకు వివాహం తుల తె.5:42. 18/11 తదియ సోమ మృగశిర వ్యాపారం, సీమంతం సా.5:00. 20/11 షష్ఠి బుధ పుష్యమి గృప్ర, గర్భదానం, వ్యాపారం మిథునం రా.8:53. 22/11 అష్టమి శుక్ర/శని మఘ వివాహం తుల తె.గం.5:22. 24/11 దశమి ఆది/సోమ ఉత్తర వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.5:14. 25/11 దశమి సోమ ఉత్తర గర్భ, గృప్ర, మిథునం రా.గం.8:33. 28/11 త్రయోదశీ బుధ స్వాతి మిథునం రా.8:28. మార్గశిర మాసం (సెప్టెంబరు) 02/12 విదియ సోమ మూల మేషం ప.గం.4:01. మిథునం రా.గం.7:30ల 8:00. 04/12 చవితి బుధ ఉత్తరాషాఢ వివాహం గర్భ, గృప్ర, మి«థునం రా.గం.8:04. 05/12 పంచమి గురు ఉత్తరాషాఢ వ్యాపారం మేషం ప.గం.3:50. శ్రవణం వివాహం, గర్భ మి«థునం రా.గం.7:49. గురు/శుక్ర శంకుస్థాపన, వ్యాపారం తుల తె.గం.4:30. 06/12 షష్ఠి శుక్ర శ్రవణం వ్యాపారం మేషం ప.గం.3:45. ధనిష్ఠ సీమంతాదులకు మిధునం రా.గం.7:00ల 7:30. శుక్ర/శని వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.4:30. 07/12 సప్తమి శని శతభిషం వివాహ గృప్ర మిథునం రా.గం.7:46. వ్యాపారం మేషం ప.గం.3:41. శంఖు, బోరింగ్, వివాహం తుల తె.గం.4:26. 09/12 నవమి సోమ ఉత్తరాభాద్ర మిథునం రా.గం.7:39. 14/12 చతుర్దశి శని రోహిణి మేషం ప.గం.3:08 వ్యాపారాదులకు. పౌర్ణమి శని రోహిణి వివాహం, గృప్ర, గర్భాదానం మిథునోగ్ని రా.గం.7:26. శంకు, బోరింగ్, వివాహం, వ్యాపారం తుల తె.గం.3:55 (కోరల పౌర్ణిమ) 15/12 పాడ్యమి ఆది మృగశిర వ్యాపారం మేషం ప.గం.3:04. 18/12 చవితి బుధ/గురు రోహిణి తుల రా.తె.గం.3:01. 20/12 షష్ఠి శుక్ర/శని మఘ వివాహం తుల రా.తె.గం.3:30. 22/12 అష్టమి ఆది/సోమ ఉత్తర వృశ్చికం తె.గం.4:19 సమస్త శుభాలకు. 24/12 దశమి మంగ/బుధ చిత్త వృశ్చికం తె.గం.4:11 శంకు. 25/12 ఏకాదశీ బుధ/గురు స్వాతీ వివాహ, శంకు, బోరింగ్ వృశ్చికం తె.గం.4:08లకు. పుష్య మాసం (అక్టోబర్) 01/01 విదియ బుధ ఉత్తరాషాఢ మేషం ప.గం.12:55. 02/01 తదియ గురు శ్రవణం మేషం ప.గం.12:55. వృషభం ప.గం.4:00. 03/01 చవితి శుక్ర ధనిష్ఠ మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10. 04/01 పంచమి శని శతభిషం మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10. 06/01 సప్తమి సోమ ఉత్తరాభాద్ర మేషం ప.గం.12:30. 08/01 నవమి బుధ అశ్విని మేషం ప.12:30. 11/01 త్రయోదశి శని రోహిణి మేషం ప.12:10. 12/01 చతుర్దశి ఆది మృగశిర మేషం ప.12:10. ఉత్తరాయనం అనుసరించి దేవాలయ పనులు అనుష్ఠించవచ్చు. 19/01 షష్ఠి ఆది ఉత్తర అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు మేషం ప.గం.12:01. 20/01 సప్తమి సోమ, హస్త, అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, అత్యవసర ఉపనయన, శంకు మేషం ప.గం.12:01. 24/01 దశమి శుక్ర అనురాధ అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు అత్యవసర ఉపనయన / శంకు మేషం ప.గం.12:01. 26/01 ద్వాదశీ ఆది మూల మేషం ప.12:01. మాఘ మాసం (నవంబర్) 30/01 పాడ్యమి గురు ధనిష్ఠ అన్న, సీమంత, వ్యాపారం మేషం ప.గం.11:59. 31/01 విదియ శుక్ర శత అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, వివాహం, అత్యవసర ఉపనయనం, వ్యాపారం, ఊయల మేషం ప.గం.11:55. 02/02 చవితి ఆది ఉత్తరాభాద్ర అన్న, అక్షర, సీమంత, వ్యాపార, అత్యవసర ఉపనయన, వివాహం దేవాలయ పనులు, వాస్తు కర్మలు, ఊయల, వ్యాపారం మేషం ప.గం.11:51. 03/02 షష్ఠి సోమ రేవతి అన్న, అక్షర వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, ఊయల, సీమంత మేషం ప.గం.11:47. 07/02 దశమి శుక్ర రోహిణి అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం, అత్యవసర ఉపనయనం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:43. 08/02 ఏకాదశి శని మృగశిర అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం అత్యవసర ఉపనయనం, ఊయల, సీమంతం ప.గం.11:39. గృప్ర. వృషభం ప.గం.12:15. 10/02 త్రయోదశీ సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:34. వృషభోపి ప.12:01. 13/02 బ.పాడ్యమి గురు మఘ వివాహం వృషభం ప.గం.12:01. 14/02 తదియ శని ఉత్తర ఉపనయనం (వారదోషం), అన్న, అక్షర, సీమంత, వాస్తుకర్మలు, దేవాలయ పనులు, ఊయల, వ్యాపారం, వివాహం మేషం ఉ.గం.11:01. 15/02 చవితి హస్త ఆది వృషభం ప.గం.11:59. 17/02 పంచమి సోమ చిత్త అన్న, అక్షర, సీమంత, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.10:45. 18/02 సప్తమి మంగళ/బుధ స్వాతి మకరం తె.గం.5:45. 20/02 అష్టమి గురు అనురాధ మేషం ప.గం.10:01. వృషభం ప.గం.11:59. 21/02 నవమి శుక్ర అనురాధ సమస్త శుభకర్మలు, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపార పనులకు మేషం ఉ.గం.10:38 వషభం ప.గం.12:01. 23/02 దశమి ఆది మూల సమస్త శుభములకు మేషం ఉ.గం.10:01. వషభం ప.గం.12:01. ఫాల్గుణ మాసం (డిసెంబర్) 01/03 తదియ శని/ఆది ఉత్తరాభాద్ర వివాహం, శంకు, వ్యాపారం మకరం తె.గం.4:30. 02/03 తదియ ఆది అన్న అక్షర, సీమంత, వ్యాపార, ఊయల, ఉప, వివాహం, దేవాలయ పనులు, వాస్తుకర్మలు మేషం ప.గం.9:58 విశేషం. వృషభం ప.గం.11:29. చవితి ఆది/సోమ రేవతి శంకు, వివాహం మకరం తె.గం.4:28. 03/03 చవితి సోమ రేవతి సమస్త శుభాలకు, వాస్తు కర్మలకు మేషం ఉ.గం.9:51. వృషభం అశ్విని ప.గం.11:20. 06/03 సప్తమి గురు రోహిణి అన్న, అక్షర, సీమంత, ఉప, వ్యాపార, దేవాలయ కర్మలు, వాస్తు కర్మలు మేషం ఉ.గం.9:12. వృషభం ఉ.గం.11:30. 09/03 ఏకాదశీ ఆది/సోమ పుష్యమీ శంకు మకరం తె.గం.3:56. 10/03 ఏకాదశీ సోమ పుష్యమి అన్న, అక్షర, ఊయల, సీమంత, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.8:40. 14/03 పౌర్ణమి శుక్ర ఉత్తర వృషభం ఉ.గం.10:30. 15/03 పాడ్యమి శని హస్త వృషభం ఉ.గం.10:30. అన్న, సీమంత, ఊయల. 16/03 విదియ ఆది హస్త వృషభం ఉ.గం.9:50. 17/03 తదియ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15. 20/03 షష్ఠి గురు అనురాధ అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15. 22/03 అష్టమి శని మూల వృషభం ఉ.గం.10:08. 24/03 దశమి సోమ ఉత్తరాషాఢ వృషభం ఉ.గం.10:00. ఇవి చదవండి: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.. -
'చెట్టునీడ నీకెందుకు బాబూ.. నీ నీడలో నువ్వు సేద తీర్చుకో'..
ఒకరోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్లి స్వామి నా దగ్గర కోటానుకోట్ల డబ్బు ఉన్నది. పూర్తి ఆరోగ్యవంతుడిని. ఇక నేను ఎవరిపైనా ఆధారపడవల్సిన అవసరం లేదు. ఎవరినీ సహాయం చేయమని అర్థించాల్సిన అవసరం లేదని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆ మాటలు విన్నాక జ్ఞాని నవ్వుతూ ‘‘బాబు నాతో కాస్త దూరం నడవగలవా’’ అని అడిగాడు. అయన ఆలా అడగడంతో నిరాకరించడం బాగుండదని తలచిన ఆ వ్యక్తి జ్ఞానితో కలిసి అడుగులు వేశాడు. అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయిన వ్యక్తి దరిదాపులలో ఏదైనా చెట్టు కనిపిస్తుందేమో... ఆ చెట్టు నీడలో కాసేపు సేద తీరాలని చుట్టూ చూసాడు. ఎక్కడా ఏ చెట్టూ కనిపించలేదు. ఇది గమనించిన జ్ఞాని ‘‘ఏంటి బాబూ... వెతుకుతున్నావు?’’ అని అడిగాడు. ‘‘అయ్యా చాల దూరం వచ్చాము. కాసేపు చెట్టునీడలోకి వెళ్లి సేదతీర్చుకుని ఆ తర్వాత తిరిగి ముందుకు సాగుదాం’’అని చెప్పాడు. అతడి మాటలకు ఆ జ్ఞాని ‘‘చెట్టునీడ నీకెందుకు బాబూ... నీ నీడలో నువ్వు సేద తీర్చుకో’’ అన్నాడు. ‘‘నా నీడలో నేను ఎలా ఉండగలను స్వామీ! ఏం మాట్లాడుతున్నారు మీరు?’’ అని కాస్తంత ఆశ్చర్యంగా మరికాస్త నిష్ఠురంగానూ అడిగాడు ఆ వ్యక్తి. అందుకు ఆ జ్ఞాని, చిరునవ్వుతో అతడివైపు చూస్తూ... అదేంటి, నీ నీడలో నువ్వు తల దాచుకోలేవా? నువ్వే కదా బాబూ, నాదగ్గర అన్నీ ఉన్నాయి. నేను ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అన్నావు, చూశావా! ఇప్పుడు నీ నీడ సైతం నీకు ఉపయోగపడలేదు’’ అన్నారు. ఇప్పుడు ఆ ఐశ్వర్యవంతుడికి నిజంగా జ్ఞానోదయం అయింది ఏ చెట్టు కిందకూ వెళ్లకుండానే. అందుకే పెద్దలన్నారు... అహంకరించవద్దు అని. ఎంత ధనవంతులైనా, వారికి ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికీ ఏది అవసరం అవుతుందో తెలియదు ఈ లోకంలో. అన్నింటికీ మించి మనపైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు. మనపైన మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతేకానీ, ఇతరులపైన ఏమాత్రం చులకన భావం ఉండకూడదు.. మనసులోకి రాకూడదు. ఇవి చదవండి: Ugadi Festival: నిండుగ వెలుగునిచ్చే.. 'తెలుగు పండుగ' ఇది.. -
Ugadi Festival: నిండుగ వెలుగునిచ్చే.. 'తెలుగు పండుగ' ఇది..
‘ఉగాది’ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది అది మన తెలుగు పండుగ అని! ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు. మత్సా్యవతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా ఈ జగత్తును సృష్టించాడంటారు. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’.. ‘ఉగాది’. అంటే సృష్టి ఆరంభమైన దినమే ‘ఉగాది’. ఉగాది పండుగ రోజున త్వరగా నిద్రలేచి ఇంటి ముందర ముగ్గులు వేసి వసంత లక్ష్మిని స్వాగతిస్తారు. తలంటు స్నానాలు చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కడతారు. షడ్రుచు లతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’; ‘అశోక కళికా ప్రాశనం’ అని వ్యవహరించేవారు. "త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు" ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తు న్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికీ – ఆహారానికీ గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెప్తుంది. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరకు ముక్కలు, జీలకర్ర లాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీపొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. బెల్లం – తీపి(ఆనందం), ఉప్పు (జీవితంలో ఉత్సాహం), వేప పువ్వు – చేదు (బాధ కలిగించే అనుభవాలు), చింతపండు – పులుపు (నేర్పుగా వ్యవహరించ వలసిన పరిస్థితులు), మామిడి – వగరు (కొత్త సవాళ్లు), కారం (సహనం కోల్పోయే స్థితి) గుణాలకు సంకేతాలు అంటారు. ఉదయంవేళ, లేదా సాయంత్రం సమయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే అయిదుఅంగాలని అర్థం చెపుతారు. ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా ‘కవి సమ్మేళనం‘ నిర్వహిస్తారు. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాక దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉగాది జరుపుతారు. తెలుగు వారిలానే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలకు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరా దిని ’గుడి పడ్వా’గా (పడ్వా అంటే పాడ్యమి) వ్యవహరిస్తారు. తమిళుల ఉగాదిని (తమిళ) ‘పుత్తాండు’ అంటారు. వారిది సౌరమానం. ఏప్రిల్ 14న సంవత్సరాదిని చేసుకుంటారు. బెంగాలీల నూతన సంవత్సరం వైశాఖ మాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం వైశాఖశుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు. వ్యాపారులు ఆ రోజున పాత ఖాతా పుస్తకాలన్నింటినీ మూసి, సరికొత్త పుస్తకాలు తెరుస్తారు. – నందిరాజు రాధాకృష్ణ ‘ వెటరన్ జర్నలిస్ట్ 98481 28215 (రేపు ఉగాది పర్వదినం సందర్భంగా) -
Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజు జరుపుకునే తొలి పండుగ. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం. హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2024లో ఉగాది ఏప్రిల్ 9వ తేదీన (మంగళవారం) వస్తుంది. "యుగాది" అనే పదం రెండు పదాల కలయిక - "యుగం" (వయస్సు) , "ఆది" (ప్రారంభం) ఒక శుభ సందర్భం అని అర్థం. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 9 న క్రోధి అర్థం కోపం కలిగించేదని. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అసోం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపు కుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఇతర విశేషాలు ఈ రోజు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు. ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వారం రోజుల ముందు నుంచే సందడి ఉగాదికి వారం రోజుల ముందునుంచే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అలంకరించుకునే పనులతో సందడి మొదలవుతంది. రంగురంగుల రంగువల్లులతో ఇంటి ముంగిళ్లు ముస్తాబవుతాయి. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దానధర్మాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వంటలు, ఉగాది పచ్చడి, నైవేద్యాలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి. ఇష్టదైవాన్ని పూజిస్తారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు ఇలా ఎవరికికి నచ్చినట్టు వారు తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా అందిస్తారు. ఏడాదంతా మంచి జరగాలని తొలి పండుగగా తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండగ ఉగాది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం, ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ఏదైనా మంచి కార్యం తలపెడితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొనుగోలు చేస్తారు.కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు. పంచాంగ శ్రవణం ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు, కవి సన్మానాలు అంటూ కవులు, రచయితలు సందడి సందడిగా ఉంటారు. -
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్‌లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది) -
గుడ్ ఫ్రైడే' 2024: ప్రాముఖ్యత ఏంటి.. ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్ చెప్పకండి!
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. గుడ్ ఫ్రైడే విషెస్ యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్‌లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. -
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
Holi 2024: మన దేశంలో ఇక్కడ హోలీ సంబరాలుండవు, ఎందుకో తెలుసా?
రంగుల పండుగ హోలీ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. చిన్నా పెద్దా అంతే రంగుల్లో మునిగి తేలతారు. కానీ దేశంలో హోలీ జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హోలీ ఎందుకు ఆడరో..ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం.. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలీ, కుర్జాన్, జౌడ్లా మూడు గ్రామాలలో కూడా హోలీ పండుగను జరుపుకోరు. తమ ఇష్టమైన దేవత త్రిపుర సుందరి దేవి. ఒకటిన్నర శతాబ్దం క్రితం, ప్రజలు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించింది. ఇక అప్పటినుంచి ఇక్కడి ప్రజలు హోలీ జరుపుకోవడానికి ఇష్టపడరు.ఇక్కడి త్రిపుర సుందరి దేవతకి శబ్దాలు నచ్చవని స్థానికులు చెబుతారు.హోలీ తమకు అచ్చి రాదని భావిస్తారట. అందుకే 150 ఏళ్లుగా హోలీ సంబరాలు చేసుకోరట. జార్ఖండ్: జార్ఖండ్‌లోని బొకారోలోని కస్మార్ బ్లాక్ సమీపంలోని దుర్గాపూర్ గ్రామంలో సుమారు 100 ఏళ్లకు పైగా ఇక్కడ హోలీ జరుపుకోవడం లేదు. ఒక శతాబ్దం క్రితం హోలీ రోజున ఇక్కడ ఒక రాజు కుమారుడు మరణించాడు. ఆ తర్వాత ఊరిలో హోలీ సంబరాలు చేసుకుంటే అరిష్టమని భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం పొరుగూరికి హోలీ పండుగ చేసుకుంటారు. గుజరాత్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా రంసాన్ గ్రామంలో కూడా ప్రజలు హోలీని జరుపుకోరు. కొంతమంది సాధువులచే శాపగ్రస్తమైందట ఈ గ్రామం. అందుకే అప్పటి నుండి హోలీ జరుపుకోవడానికి భయపడతారు ప్రజలు . మధ్యప్రదేశ్: 125 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని బైతుల్ జిల్లా ముల్తాయ్ తహసీల్‌లోని దహువా గ్రామంలో, బావిలో బాలుడు నీటిలో మునిగి చనిపోయాడట. ఈ విషాద ఘటనతో హోలీ ఆడటం తమకు చెడు శకునంగా భావించారు. దీంతో ఇక్కడ ఎవరూ హోలీ ఆడరని చెబుతారు. తమిళనాడు: దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడు చాలా దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ భక్తి కూడా ఎక్కువ అని చెబుతారు. కానీ ఉత్తర భారతంతో జరుపు కున్నంతగా హోలీని ఇక్కడ జరుపుకోరు. హోలీ పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి, తమిళులు మాసి మాగంగా జరుపుకుంటారు. పవిత్ర నదులు, చెరువులు, సరస్సులలో స్నానం చేయడానికి ,పూర్వీకులు భూమిపైకి వచ్చే పవిత్రమైన రోజు అని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఆ రోజు హోలీ ఆడరు. అయితే పుదుచ్చేరి లాంటి టూరిస్ట్ ప్రదేశాలలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్‌ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..! -
Holi 2024: జాలీగా, హ్యాపీగా...ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!
పిల్లా పెద్దా అంతా సరదగా గడిపే రంగుల పండుగ హోలీ సమీపిస్తోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహం గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం, నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణం కంటి గాయాలకు గురవుతున్న అనేక సంఘటనలు జరుగుతాయి.అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం. మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలను గమనించాలి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు , ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం , ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి.ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకుదారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం. సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగదు. పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి. లోషన్ లేదా నూనె : హోలీ ఆడటానికి వెళ్లే కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్‌ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు. దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని. రంగులనుఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలిన కోరుతూ హ్యాపీ హోలీ. -
హోలీ 2024 : యూనివర్శిటీలో విద్యార్థుల హంగామా చూసి తీరాల్సిందే!
చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో వార్షిక హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన ఈ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు హోలీ ఆడుతూ సందడి చేశారు. సరదాగా వాటర్ బెలూన్, తదితర ఆటపాటలతో విద్యార్థులంతా హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఈవేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by '*·舞~ 𝕐άŜ𝓗Ɨ𝔰H ~舞*'¨¯ (@yashish023) అయితే ఈ సందర్బంగా క్యాంపస్‌లో భద్రతా తనిఖీలతో గందరగోళం ఏర్పడింది. అంతకుముందు విద్యార్థిపై బయటి వ్యక్తి దాడి చేసిన ఘటనలో విద్యార్థులు నిరసనకు దిగడంతో వేడుకలకు అంతరాయం ఏర్పడింది. నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్థులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే నిరసనకారులు చెదరగొట్టారు.దాడి కేసులో నిందితుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.ఈ గందరగోళం హోలీ వేడుకల భద్రతా ఏర్పాట్లకు అంతరాయం కలిగించిందని పేరుచెప్పడానికి అంగీకరించని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. View this post on Instagram A post shared by Chandigarh (@the__chandigarh) -
ఈ గ్రామాల్లో హోలీ వేడుకలు ఎలా ఉంటాయంటే..?
తీర్థయాత్రలు చేస్తారు కొందరు. వర్ణయాత్రలు కొందరికి ఇష్టం. మన దేశంలో హోలి చాలా హుషారైన పండగ. బహుశా దీపావళి తర్వాత చిన్నా పెద్దా అందరూ కేరింతలతో పాల్గొనే పండగ ఇదే. రొటీన్ వితంలో రంగులను నింపుకోవడం బాగుంటుంది. అయితే కొందరికి ఇంట్లోనో, అపార్ట్మెంట్ ప్రాగణంలోనో, వీధిలో, ఏరియా చౌరస్తాలోనో ఆడే హోలీ పెద్దగా ఆనదు. వారికి భారీ హోలి వేడుక చూడాలనిపిస్తుంది. అలాంటి వారి కోసం హోలి డెస్టినేషన్స్ ఉన్నాయి. మన దేశంలో. ఈ హోలీకి వెళ్లగలిగితే వెళ్లండి. మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో హోలి వేడుకలు చూడటం అంటే కృష్ణ రాధలు ఆడే హోలిని చూసినట్టే. ఇక్కడి బర్సానాలో స్త్రీలు గోపికల్లా, పురుషులు గోపబాలురలా అలంకరించుకుని హోలి ఆడతారు. రంగులు చల్లడానికి వచ్చిన గోపబాలురను స్త్రీలు సరదాగా బడితెలతో బాది దూరం తరుముతారు. అందుకే దీనిని ‘లాత్మార్ హోలి’ అంటారు. ఉదయ్‌పూర్: ఇక రాచరికస్థాయిలో హోలి చూడాలంటే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లాలి. అక్కడి సిటీ ప్యాలెస్‌లో రాజ వంశీకుల హాజరీలో అద్భుతమైన హోలి వేడుకలు జరుగుతాయి. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజస్థానీ జానపద కళల ప్రదర్శన ఉంటుంది. టూరిస్ట్‌లు ఈ వేడుకలు చూడటానికి తెగబడతారు. బృందావన్: ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళితే అక్కడి బన్కె బిహారి ఆలయంలో పూలు, రంగులు కలిపి చల్లుకుంటూ కోలాహలంగా హోలి నిర్వహిస్తారు. అందుకే దీనిని ‘ఫూల్వాలోంకి హోలి’ అంటారు. ఇక్కడ ఒకరోజు రెండు రోజులు కాదు... వారం రోజులపాటు హోలి వేడుకలు జరుగుతునే ఉంటాయి. చుట్టుపక్కల పల్లెలు రంగులతో తెల్లారి రంగులతో అస్తమిస్తాయి. ఈ అద్భుతమైన వేడుకలను చూడానికి టూరిస్ట్‌లు వస్తారు. హంపి: తుంగభద్ర నది ఒడ్డున రంగుల పండగ ఎలా ఉంటుందో చూడాలంటే హంపి వెళ్లాలి. ఇక్కడ హంపి సందర్భంగా భారీగా అలంకరించి నిర్వహించే రథయాత్ర చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఈ సాంస్కృతిక క్షేత్రంలో హోలీ ఒక విచిత్ర భావన కలిగిస్తుంది. నగర ప్రజలు డోళ్లు మోగిస్తూ హోలి వేడుకల్లో విశేషంగా పాల్గొంటారు. విరూపాక్ష ఆలయం ఈ సందర్భంగా కళకళలాడిపోతుంది. దక్షిణాదివారు హోలీ సెలవు హంపిలో గడిపి ఆనందించవచ్చు. శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్లో హోలి అయితే నయనానందమూ శ్రవణానందమూ కూడా. ఎందుకంటే అక్కడ హోలి అంటే రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు... నృత్యాలు, సంగీతం, కవిత్వం... అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మనోహరంగా హోలి జరుపుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలెట్టిన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడకు వెళ్లి హోలి చూసినవారి హృదయం కచ్చితంగా రంగులతో నిండిపోతుంది. ఆనంద్‌పూర్ సాహిబ్: పంజాబ్‌లోని ఈ ఊళ్లో హోలీ రంగులకు కళ్లు చెదురుతాయి. నిహాంగ్ సిక్కులు ఇక్కడ హోలి సమయంలో యుద్ధ విద్యలు ప్రదర్శిస్తారు. ఉత్తుత్తి పోరాటాలు ఇరు జట్ల మధ్య జరుగుతాయి. డోళ్లు తెగ మోగుతాయి. ఆట పాటల అట్టహాసం చూడతగ్గది. ఇవి చదవండి: పిచ్చుకా క్షేమమా..ఐ లవ్ స్పారోస్!! -
హోలీ, రంగుల కేళి : ఇక్కడ పండుగ సంబరాల లెవలే వేరు!
#Holi2024హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. చెడుపై మంచి విజయానికి సూచిక. ఈ ఏడాది మార్చి 25, సోమవారం హోలీ జరుపుకుంటాం. అసలు హోలీ అంటే ఇలా ఉండాలి అనేలా జరుపుకునే ప్రదేశాల గురించి మీకు తెలుసా? హోలి అంటే వివిధ రకాల రంగులు, చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. ప్రతీ రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. మన దేశంలోని కొన్ని చోట్ల అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఉత్తర్ ప్రదేశ్: యూపీ,మథురలోని బర్సానా లత్మార్ హోలీకి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ఈ హోలీ వేడుకలు ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. స్త్రీలు సంప్రదాయబద్ధంగా గోపికల వేషధారణతోనూ, పురుషులు గో పురుషులుగానూ మారి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. మథురలోని రాధా కృష్ణుల ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతారు. భజనలు, సంకీర్తనలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. స్థానికులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా హోలీ వేడుకలతో సందడి చేయడం విశేషం. బృందావన్: ఇక్కడ హోలీ వేడుక వారం రోజుల పాటు సాగుతుంది. పువ్వులు, రంగులతో హోలీని ఆడతారు. బృందావన్‌లోని బాంకీ బిహారీ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీ అనేది ఒకరోజు కార్యక్రమం కాదు. రంగుల్లో మునిగి తేలడంతోపాటు,పురాణ ఇతిహాసాలు, స్థానిక జానపద కథల ప్రస్తావనలతో వారం పాటు వేడుక కొనసాగుతుంది. శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్, బోల్పూర్లో ఉన్న శాంతినికేతన్ హోలీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక్కడ దీనిని బసంత ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. రవీద్ర భారతి యూనివర్శిటీలో నోబెల్ గ్రహీత రవీద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను నిర్వహించడం మొదలెట్టారట. ఈ ప్రేరణతోనే సాధారణ వేడుకలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. పంజాబ్: పంజాబ్‌లో హోలీ పండుగను హోలా మొహల్లాగా జరుపుకుంటారు. 'హోలా-మొహల్లా' అంటే 'యుద్ధ-నైపుణ్యాల సాధన' అని అర్థం. అందుకే హోలీ వేడుకలో కత్తులతో విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నిహాంగ్ సిక్కులు ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీని పౌరుషానికి ప్రతీకగా, ధైర్యవంతుల హోలీగా వేడుక చేసుకుంటారు. ఉదయపూర్, రాజస్థాన్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనూ హోలీ వేడుకలకు పెట్టింది పేరు. అక్కడ ఉండే మేవార్ రాజ వంశస్థులు ఈ పండుగను హోలికా దహన్ కార్యక్రమంతో ప్రారంభిస్తారు. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కూడా హోలీ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఉత్సాహంగా హోలిని జరుపుకుంటారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై నగరాల్లో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణాలో చిన్నా, పెద్ద అంతా,ముఖ్యంగా యువత ఈ రంగుల హోలీని బాగా ఎంజాయ్ చేస్తారు. -
Mahashivratri 2024 : ఒక చైతన్య జాగృతి
చతుర్దశి నాడు మహాశివరాత్రిని భక్తులు శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారు. ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం. ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే బహుళ (రాత్రిగల) చతుర్దశినాడు మాసశివరాత్రిగా జరుపుకుంటారు. పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన∙శివరాత్రినాడు పగలంతా ఉపవాసం ఉండి, రోజంతా శివనామస్మరణతో గడుపుతూ, ప్రదోషవేళ శివుని అభిషేకించి, బిల్వదళాలతో పూజించాలి. అ రోజున శివాలయంలో దీపం వెలిగించడం వలన విశేష ఫలం లభిస్తుంది. ఉపవాసం, శివార్చన, జాగరణ.. ఈ మూడూ శివరాత్రినాడు ఆచరించవలసిన విధులు. ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో వసించడం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం. భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివసంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం. మహాశివరాత్రినాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మాసశివరాత్రులు/మహాశివరాత్రినాడు రుద్రాభిషేకాలు శివార్చనలు, బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్యఐశ్వర్య ప్రదం. ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తిచేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన చేసి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్రవ్రతం అంటారు. సోమవారం ’ఇందుప్రదోషం’ గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్ర వచనం.16 సోమవారాలు నియమ పూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరతాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ, శివ రూపమే సనాతనం. ఇదే సకల రూపాలకు మూలం. సాక్షాత్తు శివుడు గుణాతీతుడు. కాలాతీతుడు. నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, పూర్చుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ. గుణనిధి అనే ఒక దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో శివరాత్రినాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు. కొండెక్కుతున్న దీపం వత్తిని కాకతాళీయంగా ఎగదోసి, తన ఉత్తరీయపు కొంగులను చించి వత్తిగా చేసి దానికి జత చేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడచినా శివరాత్రినాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితంగా మరుజన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి అపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాథుడి కాశీఖండంలో ఉంది. శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగరతీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ణి కృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్ధివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడోజాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు. శివ తత్త్వం శివతత్త్వం ఎవరికీ అంత సులువుగా అర్థమైనది కాదు. శివుని కన్నా పెద్దది గాని, చిన్నది గాని సాటి మరొకటి లేదనేది తత్త్వ సాధకులు మోక్ష సాధకులకు ఆశ్రయించదగ్గ ఏకైక రూపం శివస్వరూపం. శివతత్త్వంలోని నిగూఢమైనటువంటి విషయాలలో ప్రప్రథమమైనవి జ్యోతిర్లింగాలు. శివుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలలో ఉన్నాడని, ఇది శివతత్త్వంలో భాగమేనని జ్యోతిర్లింగమనగా చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు (అనగా జ్ఞానము) ప్రసాదించేది అని జ్యోతిర్లింగాల తత్త్వం తెలియచేస్తుంది. శివతత్త్వంలో మరొకటి లింగాకారం. శివలింగాకారం పై భాగం లింగంగా కింద పానపట్టం యోని రూపంలో ప్రకృతీ పురుషుల ప్రతీకగా ప్రకృతీ పురుషులలో ఒకరు లేనిదే మరొకరు లేరు అని చెప్పేటటువంటి తత్త్వం. శివతత్త్వంలో మరొక తత్త్వం ప్రళయ తత్త్వం. ప్రళయతత్త్వం మూడు విధాలుగా ఉన్నది. రాత్రి సమయంలో నిద్ర ఇది ప్రళయతత్త్వంలో ఒక భాగం (నిద్ర) ప్రాపంచిక మాయ నుండి మరపునిస్తుంది. రెండవది మరణం. ఇది స్థూల శరీరానికి సంబంధించినటువంటి ప్రళయం. మూడవది మహా ప్రళయం. సమస్తం శివునిలో కలసిపోవటం. నాలుగవది త్రిమూర్తితత్త్వం (శివ, విష్ణు, బ్రహ్మ). శివుని నుండి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ ఆవిర్భవించారనేది శాస్త్రం. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు నడిపించి శివుడు అంతం చేయటం లోకోక్తి. పంచభూతలింగాల తత్త్వం. పంచభూతాలు అనగా అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం. అన్నిటిలోను శివుడున్నాడు అనేటటువంటి తత్త్వం. రుద్రతత్త్వం అంటే శివుడిని పూజించేటటువంటి పద్ధతి. రుద్రంలో మహన్యాసం, నమకం, చమకం అనే విధానం. మహన్యాసం అంటే చేసేది శివుడే, నీవు శివుడవే అని నిర్ధారిస్తుంది. శివతత్త్వంలో శివస్వరూపంలో దాగివున్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. శివరాత్రులు ఐదు రకాలు 1. నిత్యశివరాత్రి: ప్రతిరోజూ శివారాధన చేస్తారు. 2. పక్ష శివరాత్రి : ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షాలలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం. 3. మాస శివరాత్రి : ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి : మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్ఠమనదగిన శివరాత్రి. 5. యోగ శివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన. ఆ రూపంలోనే అంతా! శివుని తలపై గంగ ప్రవాహం ఒక తరంనుండి మరొక తరానికి జ్ఞానం ప్రసారమవుతుందని సూచిస్తుంది. శివుని తలపై చంద్రుడు భగవంతుడిపై ధ్యాస ఎల్లవేళలా ఉండాలని సూచిస్తుంది. శివునికి మూడో కన్ను చెడును, అజ్ఞాన నాశనాన్ని చూపిస్తుంది. శివుని వద్ద ఉన్న త్రిశూలం జ్ఞానం, కోరిక, అమలు అనేటటువంటి మూడింటి స్వరూపం. శివుని ఢమరుకం వేదగ్రంథాలు వేదస్వరాన్ని తెలియచేసే ఢమరుకం. శివుని మెడపై ఉన్న సర్పం అహం నియంత్రణను సూచిస్తుంది. శివుడు ధరించే రుద్రాక్ష స్వచ్ఛతను, ధరించే మాలలు ఏకాగ్రతనూ సూచిస్తాయి. నడుముకు చుట్టుకునే పులి చర్మం భయం లేనటువంటి తత్త్వాన్ని సూచిస్తుంది. క్షీరసాగర మథన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలనూ కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. ‘నిర్ణయసింధు’లోని నారద సంహితలో శివరాత్రి వ్రతవిధానం ఉంది. మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్మనారు, అక్కమహాదేవి, బెజ్జ్ఞ మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఆధ్యాత్మికవేత్త. -
మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు
ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఒమన్‌లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, వీరి కోసం వచ్చిన తెలుగు ప్రముఖుల మధ్య రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. 'రాయల్ కింగ్ హోల్డింగ్'తోపాటు 'చిరు మెగా యూత్ ఫోర్స్' సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఇటీవల సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు.. డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఒమన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణంతో గౌరవించడం ఈ వేడుకలో ప్రధానఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు వ్యాపారవేత్త బుర్ర ప్రశాంత్ గౌడ్‌తోపాటు సీపీవైఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక ఈ వేడుకలు నిర్వహించారు. డా. మురళీమోహన్‌తో పాటు టాలీవుడ్ నటీమణులు.. రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి, టివి నటి సంజన సంక్రాంతి వేడుకలకు కొత్త కళను తెచ్చారు. వేడుకలకు కుమారి మాధవి రెడ్డి చేసిన యాంకరింగ్ ఆకట్టుకుంది. సింగర్లు హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమ సంగీతంతో ప్రేక్షుకలును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డ్యాన్సులతో సందడి నెలకొంది. వేడుకలో ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టెప్పులతో స్టేజిని దులిపారు. జబర్దస్త్ సుధాకర్ తన కామెడీతో కడుపు ఉబ్బా నవ్వించారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎమ్ఎస్ఆర్ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యంతో పిల్లలను అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నుంచి ఇన్‌కంటాక్స్ మాజీ అధికారి శ్రీకర్ వేముల, వ్యాపారవేత్త రమేష్ గౌడ్లు హాజరయ్యారు. ఒమన్‌లో వివిధ రంగాల్లో వ్యాపారాభివృద్ధి గురించి పరిశీలన చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా సామాజిక బాధ్యతను మరిచిపోలేదు తెలుగు బిడ్డలు. ఇప్పటివరకు 20 సార్లకు పైగా రక్తదానం చేసిన 30 మంది యువతీయువకులకు మురళీమోహన్ సత్కరించారు. అంబేద్కర్ సేవాసమితి మహిళామణుల అధినేత శ్రీలతాచౌదరి శాలువాతో సత్కరించారు. ఇందులో భాగంగా తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలను అందిస్తున్న రాజేష్ మడకశిరను మెమొంటోతో సత్కరించారు. ఈ వేడుక జరిగేందుకు అన్ని రకాలుగా సహకరించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైబ్రాంట్ సంస్థకు చెందిన పెద్దలు.. మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్ రావులను సత్కరించారు. సంబరాల్లో సహాయ సహకారాలను అందించిన బాలాజీ, చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగభూషణ్‌ను సన్మానించారు. సంక్రాంతి సంబరాలకు సహకరించిన రాయల్ కింగ్ యాజమాన్యానికి (రెన్నీ జాన్సన్ అండ్ టీం) అభినందనలు తెలిపారు. -
Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది. ► విధులు అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు. ► పెద్దపండగ సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది. ► నెల పట్టటం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం. ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం. ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు. ► సంక్రాంతి అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు. ► కనుము తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ► ముక్కనుము ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు! – డా. ఎన్.అనంతలక్ష్మి -
‘ఏక్ భారత్...’కు ప్రతిబింబం పొంగల్: మోదీ
చెన్నై/ఢిల్లీ: జాతీయ స్ఫూర్తి అయిన ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌కు పొంగల్ పర్వదినం ప్రతిరూపమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ ఇంట్లో పొంగల్ వేడుకకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ తమిళనాడు ప్రజలకు పొంగల్ పర్వదిన శుభాకాంక్షలు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తికి పొంగల్ ప్రతిబింబం. ఇదే భావన కాశీ–తమిళ్, సౌరాష్ట్ర–తమిళ్ సంగమం సంస్కృతిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బియ్యం పిండితో వేసే కోలమ్ రంగవల్లికలు దేశంలోని భిన్న ప్రాంతాల మధ్య ఉన్న భావోద్వేగాలను కలుపుతున్నాయి. దేశం సత్తా ఇలా కొత్త తరహాలో గోచరిస్తోంది. ఇలాంటి ఐక్యతా భావనే 2047కల్లా వికసిత భారత్ నిర్మాణానికి అతిపెద్ద చోదకశక్తిలా పనిచేస్తోంది. ఎర్ర కోట మీద నుంచి నేను ప్రబోధించిన పంచప్రాణాల్లో ముఖ్యమైనది ఇదే. దేశ ఐక్యతను మరింత శక్తివంతం చేయండి, తద్వారా ఐక్యతను మరింత బలోపేతం చేయండి. తమిళ కవి తిరువల్లువర్ ప్రవచించినట్లుగా జాతి నిర్మాణంలో విద్యావంతులైన పౌరులు, నిజాయతీ గల వ్యాపారులు, మంచి పంటలది కీలక భూమిక’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ కొత్త పంటను దైవానికి నైవేద్యంగా వండి రైతన్నలు అన్నదాతలుగా మారే చక్కటి శుభ సమయమే పొంగల్ పర్వదినం. దేశంలోని ప్రతి పండుగలో పల్లెపట్టులు, పంటలు, రైతులతో ముడిపడి ఉంటాయి’’ అన్నా రు. ‘‘తమిళ సాంప్రదాయాలకు తృణధాన్యాలకు అవినాభావ సంబంధం ఉంది. పౌష్టిక శ్రీ అన్న(తృణధాన్యం) గురించి యువతలో కొత్త అవగాహన ఏర్పడింది. దీంతో మిల్లెట్స్ రంగంలో అంకుర సంస్థల స్థాపనకూ యువత ముందుకొస్తోంది. మూడు కోట్లకుపైగా రైతులు తృణధాన్యాలను పండించి చక్కని దిగుబడి ద్వారా లబ్ధి పొందుతున్నారు. పొంగల్ సందర్భంగా దేశ సమైక్యత కోసం కొత్త తీర్మానాలు చేసుకుని దేశం కోసం పునరంకితమవుదాం’’ అని మోదీ పిలుపునిచ్చారు. -
అలంకరణ మెండుగా.. మది నిండుగా.. సంక్రాంతి పండగ!
'ప్రకృతి పండగ సంబరంగా జరుపుకోవాలంటే ఆ కళ కూడా మన ఇంటికి కొత్త కళాకాంతులు తీసుకురావాలి. అప్పుడే పండగ మరింత అందంగా, శోభాయమానంగా మారిపోతుంది. సంక్రాంతి రోజున ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి కొన్ని సంక్రాంతి అలంకరణలు ఇవి.' సంక్రాంతి, పొంగల్ ఈ రెండింటినీ హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున, ఇళ్లను అందంగా అలంకరించడానికి పోటీపడుతుంటారు. సంప్రదాయ పద్ధతులే కాకుండా, పొంగల్ లేదా మకర సంక్రాంతికి ఇంటిని అలంకరించుకోవడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. వాటిలో ఇంటీరియర్ నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలు.. రంగుల రంగోలి ఏ భారతీయ పండుగకైనా ఇంటి ముందు అందమైన రంగోలీ ముచ్చటగొలుపుతుంది. ముగ్గుల పండగగా పేరొందిన సంక్రాంతికి ఇంటి గుమ్మం వద్ద, పూజ గది, పొంగల్ కోసం బయట రంగోలి డిజైన్లను రూపొందించడానికి మీ సృజనాత్మకతను చూపచ్చు. అందరూ వేసేదిగా కాదు అనుకుంటే వినూత్నమైన డిజైన్లను ప్రయత్నించవచ్చు. దీంతో పొరుగువారిని మించిపోవచ్చు. అపార్ట్మెంట్ల కోసం ఇన్డోర్.. అందరూ అలంకరించుకోవడానికి విశాలమైన పచ్చికతో కూడిన పెద్ద బంగ్లాలలో నివసించరు. అనేక మంది పట్టణవాసులు పట్టణాలు, నగరాల్లోని అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు. కానీ ఇన్డోర్ డెకరేషన్ అవుట్‌డోర్‌లో చేసినట్లే ఆహ్వానించదగినదిగా ఉంటుంది. మీ గదిని ఆకులతో పొడవాటి చెరకుతో అలంకరించండి. బియ్యం పాలు, బెల్లం ఉడకబెట్టడాన్ని సూచించే మట్టి కుండలతో అలంకరించండి. సంక్రాంతి లేదా పొంగల్ జరుపుకోవడానికి మీకు పెద్ద బాల్కనీ లేదా తోట అవసరం లేదని గ్రహించాలి. ఆకులతో అందంగా.. పొంగల్, సంక్రాంతి అనేది శ్రేయస్సు వేడుక, ఈ థీమ్‌లో ఆకుపచ్చ రంగుదే అగ్రతాంబూళం. అందుకని, పొంగల్ రోజున మామిడి ఆకుల తోరణాలను ఇంటి ప్రవేశద్వారం వద్ద వేలాడదీయడం శుభప్రదమైనది. రంగు రంగు కాగితాలను ఉపయోగిస్తూ చేతితో పర్యావరణ అనుకూలమైన అలంకరణ చేయచ్చు. థీమ్ డెకరేషన్లో గాలిపటం గాలిపటాల హంగామా ఈ పండగ ప్రత్యేకం. కాబట్టి, పేపర్ క్రాఫ్ట్తో రంగురంగుల గాలిపటాల తయారీ ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకు వస్తుంది. వీటిని తయారు చేయమని పిల్లలను ప్రోత్సహించవచ్చు. వాల్ హ్యాంగింగ్లను అందమైన అలంకరణలుగా ప్రయత్నించవచ్చు. కాగితంతో తయారు చేసిన సీతాకోకచిలుకలు, పువ్వులు, జంతువుల బొమ్మలు ఇంటీరియర్‌కు అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. మార్కెట్లో కూడా గాలిపటాలు అన్ని ఆకారాలు, పరిమాణాలలో లభిస్తాయి. బాల్కనీ అయితే గాలిపటాలను వేలాడదీయవచ్చు. లివింగ్ రూమ్‌లోని ఓ వాల్ని ఎంచుకుని రంగు రంగుల గాలిపటాలతో ఆకర్షణీయమైన అలంకరణ కోసం అతికించవచ్చు. వీటికి పువ్వులు, చెరకు డిజైన్లను కూడా జోడించవచ్చు. వాల్ పేపర్స్ పొంగల్ అలంకరణ చిటికేసినంత సులువుగా నట్టింటికి రావాలంటే ఇప్పుడు అందమైన ఫెస్టివల్ వాల్ పేపర్లు, వాల్ డెకార్ బ్యాక్‌డ్రాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నచ్చిన వాల్పేపర్ని ఎంచుకొని, డెకార్ చేయడమే తరువాయి. పండగ పిండివంటలు ఒక టేబుల్‌పైన కాగితం లేదా చెక్కతో తయారుచేసిన ఎడ్ల బండ్ల బొమ్మలు, అరిశెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు.. వంటివి పలహారాల పేట్లు, కొయ్య బొమ్మలను ఉంచితే చాలు పండగ కళ వచ్చేసినట్టే. ఇవి చదవండి: 'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి.. -
'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి..!
'సంక్రాంతి పండగ వస్తే ఊర్లోకి పాత బంధువులొస్తారు. పండిన పంట నుంచి హక్కుగా తమ భాగం తీసుకుపోతారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు, కొమ్మదాసరులు, జంగం దేవరలు, పిట్టల దొరలు, గారడీ వాళ్లు.. వీరందరికీ సంక్రాంతి వస్తే సంవత్సరానికి సరిపడా సాయం. సాటివారికి సాయం చేయడమే సంక్రాంతి'. సంక్రాంతి అనగానే ఊళ్లోకి బంధువులే కాదు డూడూ బసవన్నలు కూడా వస్తారు. సంక్రాంతి అంటే తిని, తేన్చి, సంబరాలు చేసుకునే పండగ మాత్రమే కాదు... రైతు సౌభాగ్యానికీ పల్లె సౌభాగ్యానికీ సహకారం అందించిన అన్ని వర్గాల వారికీ పంపకాలు చేసే పండగ కూడా. సంక్రాంతి పండగ సమయంలో ఇంటికి పుట్ల కొద్దీ చేరిన ధాన్యం నుంచి రైతు తనకు సేవ చేసిన, సాయం చేసిన వర్గాల వారికి భాగం ఇస్తాడు. ‘మేర’ పంచుతాడు. పాలేర్లకి, సేద్యగాళ్లకి. పనివాళ్లకి వడ్లు పోస్తాడు. కొందరికి కొత్తబట్టలు పెడతాడు. అయితే వీరు కాకుండా ఊరి మీద హక్కుగా తమ వాటా కోసం వచ్చే సంప్రదాయ వృత్తికళకారులు వచ్చి ఊరిలో ఆడి, పాడి వినోదం పంచి తమ వడ్లు మూట గట్టుకుని పోతారు. శ్రీమద్రమా రమణ... ‘సద్గురుని కృపచే తారతమ్యము తరచి గనుమన్నా.. ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహు దుర్లభమ్మిది’.. అని పాడుతూ గురు కటాక్షం వలనే భక్తిని, ముక్తిని చేరుకోవాలని బోధిస్తూ వీధివీధిన తిరుగుతూ సంక్రాంతి శోభను తెస్తాడు హరిదాసు. పండగ రోజుల్లో దానికి ముందు ధనుర్మాసంలో హరిదాసు తిరగని ఊరు, వీధి ఎంతో బోసిపోతాయి. నెత్తిన అక్షయపాత్ర, భుజాన తంబూర, చేతిలో చిడతలతో ‘శ్రీమద్రమా రమణ గోవిందా’ అంటూ భిక్ష స్వీకరించా ‘కృష్ణార్పణం’ అంటూ మనం సంపాదించిన దానిలో కొంత పేదలకు అర్పణం చేయడం ద్వారా దేవునికి సమర్పణం చేసిన పుణ్యం పొందాలని సూచిస్తాడు హరిదాసు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి వీధి వాకిట్లో హరిదాసు కోసం గృహిణులు కాచుకుని ఉండేవారు. ఇప్పుడు పై అంతస్తుల్లో, అపార్ట్మెంట్ బాల్కనీల్లో నుంచి చూస్తూ కిందకు దిగడానికి బద్దకిస్తున్నారు. హరిదాసు అక్షయ΄ాత్రలో జారవిడిచే కాసిన్ని బియ్యం మన ఇంటి సంపదను అక్షయపాత్రగా మారుస్తాయి. డూడూ బసవన్నలు ‘గంగిరెద్దులా తల ఊపకు’ అని అంటారు గాని దైవచిత్తానికి తల ఊపుతూ భారం అంతా నీదే అనుకోవడానికి మించిన వేరే సుఖం ఏముంటుంది? డూడూలు కొట్టే బసవన్నను యజమాని ముద్దుగా చూసుకున్నట్టే జీవుణ్ణి దేవుడు ముద్దుగా చూసుకుంటారు. గంగిరెద్దులు ఇంటి ముందుకొచ్చి సన్నాయి పాట వినిపిస్తే ఆ కళే వేరు. రంగు రంగుల పాతబట్టలు ఇస్తే అవి బసవడి మూపురం మీదకు చేరుతాయి. కాసులిస్తే గంగిరెద్దులవాడి నల్లకోటు జేబులో చేరుతాయి. కాసిన్ని డబ్బులు ఎక్కువిస్తే గంగిరెద్దులు విన్యాసం చేస్తాయి. యజమాని ఛాతీ మీద సుతారంగా గిట్టలు ఆడిస్తాయి. బుడబుడలు... కొమ్మదాసరులు ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ డమరుకం వాయిస్తూ బుడబుక్కల వాళ్ళు వస్తారు సంక్రాంతికి. తలపాగా, కోటు, గొడుగు చేతబూని శుభాల భవిష్యత్తును చెబుతూ భిక్ష స్వీకరిస్తారు. వారు వేగంగా వాయించే డమరుకం గొప్ప శబ్ద విన్యాసం సృష్టిస్తుంది. వీరికి డబ్బు. వడ్లు, పాతబట్టలు ఇవ్వాల్సిందే. ఇక ఊరికి ఒకప్పుడు కొమ్మదాసరులు వచ్చేవారు. వీరు ఊరి మధ్యలోని చెట్టు కొమ్మెక్కి కూచుని కింద గుడ్డ పరిచి వచ్చేపోయేవారి మీద వ్యాఖ్యానం వినిపిస్తుండేవారు. తగిన సొమ్ము ముట్టజెప్తేనే దిగేవారు. కొయ్య తుపాకీతో పిట్టల దొరలు వస్తారు పెద్ద పెద్ద వాళ్లతో కలిసి తిరగాలనుకునే సామాన్యుడి కలలకు మాటల మలాం పూస్తారు. ‘మేము స్నానం చేసిన సబ్బు నీళ్లతో పేద దేశాల వాళ్లు డ్యాములు కట్టుకున్నారు’ అంటారు. ‘మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకిందని చెత్తకుప్పలో పడేశాం’ అంటారు. ‘మోదీ గారు పిలిచి పాకిస్తాన్ మీద యుద్ధానికి పొమ్మని ఆర్రూపాయలు అడ్మాన్సు ఇచ్చారు’ అంటారు. దుబాయ్ షేకుతో టిఫిని తిని అమెరికా ప్రెసిడెంట్‌తో లంచ్‌కు కూచోపోబోతున్నాం అంటారు. తర్వాత శంఖం ఊదుతూ జంగం దేవరలు వస్తారు. గారడీ వాళ్లు, కనికట్టు ప్రదర్శించేవాళ్లు.. వరుస కడతారు. రైతు ఎవరినీ కాదనడు. అందరినీ ఆదరిస్తాడు. ఇక సాయంత్రమైతే ఊళ్లో పాట కచేరీలు, డాన్సు ప్రోగ్రాములు ఉంటాయి. రకరకాల కళాకారులు దిగుతారు. సినిమా నాటకాలు ఒకప్పుడు వేసేవారు. సినిమాలు కూడా వేసేవారు. సంక్రాంతి సందేశం... సామూహిక ఉత్సవం. జీవితం సాటి మనుషులతో కలిసి మెలిసి సాగాలని చెప్తుంది. ఉన్నది పంచుకుని తినాలని చెప్తుంది. శ్రమ చేసి సమృద్ధితో జీవించమని చెబుతుంది. నలుగురూ కలిసి ప్రకృతి వనరులను ఫలవంతం చేసుకుని నలుగురూ వృద్ధి కావాలని కోరడమే సంక్రాంతి. ఇవి చదవండి: Makar Sankranti 2024: పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? -
Merry Christmas 2023: దివిలోను.. భువిలోనా... సంబరం క్రిస్మస్ పర్వదినం
క్రీస్తు పుట్టుక సర్వ సృష్టికి పర్వదినం.. మనుజ కుమారుడిగా ఆ దేవాది దేవుడే ఈ భూతలంపైకి అరుదెంచిన అపురూప ఘట్టం. సర్వ మానవాళికి రక్షణ సౌభాగ్యం. ప్రతి ఒక్కరికి దేవుడు అందించిన శుభదినం. ► పరలోకం పరవశించిన వేళ మానవాళి రక్షణకు యేసు జననం అనివార్యమయినప్పుడు అది విశ్వవేడుకగా మారిపోయింది. రెండు వేల సంవత్సరాల క్రితం ఆ దేవాదిదేవుడే నరరూపిగా అరుదెంచేందుకు సిద్ధపడ్డాడు. నశించిపోతున్న మానవులందరికి తనని తాను బలి అర్పణగా అర్పించుకునేందుకు సిద్ధపడ్డ కరుణామయుని జననం కోసం అటు పరలోకం ఇటు భూలోకం సమాయత్తమయ్యాయి. దైవ సంకల్పం నెరవేర్చేందుకు పరలోక దూతాళి దిగివచ్చింది. గలిలయలోని నజరేతు గ్రామంలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యయైన మరియ వద్దకు పరలోకం నుంచి ముందుగా శుభవార్త తీసుకువచ్చారు. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆ దేవాది దేవుని కృపపొందిన నీవు ఒక కుమారుని కంటావు.. ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడతాడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది కాబట్టి నీవు భయపడాల్సిన పనిలేదు. సర్వోన్నతుని శక్తి నీకు తోడుగా ఉంటుందని అభయమిచ్చాడు. మరియతో పాటు దేవదూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇదంతా దేవుని సంకల్పంతో జరుగుతుంది కాబట్టి నీ భార్యను చేర్చుకొనుటకు సందేహింప వద్దని, పుట్టబోవు శిశువు తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు కాబట్టి యేసు అని నామకరణం చేయాలని చెబుతాడు. ఈ విధంగా మానవ ప్రమేయం లేకుండా పరమ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి తో మరియ ద్వారా అవని మీద అవతరించడానికి మార్గం సుగమం అయింది. ► భూలోకం మైమరచిపోయిన వేళ యేసు పుట్టుక సమయంలో యోసేపు మరియను తీసుకుని తన సొంత గ్రామమైన బెత్లెహేముకు బయలుదేరతాడు. నిండు చూలాలైన మరియకు స్థలం లేకపోవడం వలన ఓ పశువు పాకే ప్రభు జన్మస్థలమైంది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఓ సత్రములో పరుండి యుండుట మీరు చూచెదరన్న ప్రవచనం ఆ విధంగా నెరవేరింది. ఆ రాత్రి ఊరి వెలుపల గొఱె