
సాక్షి, హైదరాబాద్ దేవీ నవరాత్రులను పురస్కరించుకుని దాండియా, కోలాటం, గర్భా నృత్యాలతో ప్రాంగణాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా మారాయి. విస్టా కన్వెన్షన్ అండ్ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన ‘రంగ్ థాలి’ ఆకట్టుకుంటోంది. ఇందులో గుజరాతీ సంప్రదాయ గర్భా నృత్యాలు కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల దుస్తులు, ఆకట్టుకునే వేషధారణలో యువతీ యువకులు చేస్తున్న దాండియా, కోలాటాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఫిఫ్త్ అవెన్యూ ఈవెంట్ మేనేజ్‌మెంట్, రంగోలి మార్కెటింగ్, అగర్వాల్స్ ప్యాకర్స్ మూవర్స్, డీఆర్‌ఎస్ స్కూల్, దోడియా ఆగ్రోటెక్ సంస్థల ఆధ్వర్యంలో ‘రంగ్ థాలి’ సీజన్–4 కనువిందు చేస్తోంది. అక్టోబర్ 1 వరకూ రాత్రి 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే నృత్యాలు అహూతులను విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. సుమారు నాలుగు వేల మంది ప్రతిరోజూ సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక నృత్యరీతులను ప్రదర్శిస్తున్నారు.
చదవండి: వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన పాపులర్ నటుడు