
భువిపై విరిసే ఇంధ్రధనుస్సు
భువిపై విరిసే ఇంధ్రధనుస్సుఇంధ్ర ధనుస్సు నేలకు దిగి వచ్చిందా... అనిపించే రోజు హోలీ. సప్తవర్ణాలలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది.ఆ ఇష్టాన్ని తమ డ్రెస్సుల ద్వారా చూపుతుంటారు. సినిమా తెరపైన రంగు రంగుల దుస్తుల్లో కనిపించే తారలు తమకు ప్రత్యేకించి ఇష్టమైన రంగు గురించి ఈ హోలీ సందర్భంగా మనతో పంచుకుంటున్నారు.
బ్లూ అండ్ పింక్
నాకు నచ్చిన రంగు పింక్. పెరుగుతున్న కొద్దీ అన్ని రంగులు నచ్చుతుంటాయి. కానీ, ఎక్కువ భాగం అయితే పింక్, బ్లూ కలర్స్ నా డ్రెస్సింగ్‌లోనూ చోటు చేసుకుంటుంటాయి. – శివాత్మిక రాజశేఖర్
మల్టీ కలర్స్
నా జీవితంలో ఇంధ్రధనస్సు రంగులన్నీ ఉండాలనుకుంటాను. ఎందుకంటే, మనలోని భావోద్వేగాలను తెలియజేప్పేవే రంగులు. సప్తవర్ణాలన్నీ నాకు ఇష్టమైనవే. అందుకే నా డ్రెస్సులలో మల్లీ కలర్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. ఒక ప్లెయిన్ కలర్ శారీ లేదా డ్రెస్ వేసుకుంటే దాని మీదకు మల్టీకలర్ బ్లౌజ్, దుపట్టా ఉండేలా చూసుకుంటాను. – సంయుక్త మీనన్
చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!
అన్ని రంగులను స్వాగతించే తెలుపు
నాకు తెలుపు రంగు చాలా ఇష్టం. శాంతి, కొత్త ప్రారంభాలు, అంతులేని అవకాశాలకు చిహ్నం తెలుపు. రంగులతో నింపుకోవడానికి వేచి ఉండే ఖాళీ కాన్వాస్ లాంటిది తెలుపు. ఇది అన్నింటినీ స్వాగతించే రంగు. అందుకే ఈ రంగు నాకు స్ఫూర్తిమంతమైనది కూడా. ప్రేమ, దయ, ఆనందాన్ని వ్యాప్తి చేసే ఈ వేడుక సందర్భంగా తెల్లని మన హృదయాలపైన అందమైన రంగులను చిలకరించుకుందాం. – వైష్ణవి చైతన్య
చదవండి: Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
గ్రీన్ అండ్ పర్పుల్
నాకు చాలా ఇష్టమైనది ఎల్లో. దీనిలోనే మరింత బ్రైట్‌గా ఉండే డ్రెస్సులను ఎంచుకుంటాను. దీంతో పాటు పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్స్ ఇష్టపడతాను. ఈ రంగులోనే పీచ్ కలర్ డ్రెస్సులు ధరించినప్పుడు ఉల్లాసంగా అనిపిస్తుంది. అవి నన్ను ప్రత్యేకంగా చూపుతాయి అనే భావన ఉంటుంది – రెజినా కసండ్రా
ప్రతి ఒక్కరికి కొన్ని రంగులు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అయితే, దుస్తుల విషయంలో మాత్రం కొన్ని రంగులు మాత్రమే వారి శరీరానికి నప్పేవిధంగా ఉంటాయి. ఏ రంగు డ్రెస్ ఎవరికి నప్పుతుందంటే... సాధారణంగా చీరలు ఎంపిక చేసుకుంటున్నప్పుడు వాటిని మన మీద వేసుకొని, కలర్ బాగుంటుందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకుంటుంటాం.
కొంత మంది చర్మం ఫెయిర్‌గా ఉంటుంది. కానీ, డార్క్ కలర్స్ సెట్ అవవు. అలాంటప్పుడు లైట్ షేడ్స్ లేదా మల్టీకలర్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. వీరు సేమ్ స్కిన్ టోన్ కలర్ డ్రెస్సులు ఈవెనింగ్ పార్టీలకు ధరిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు
డార్క్ స్కిన్ ఉన్నవారికి లేత రంగులు బాగుంటాయి అనుకుంటారు. కానీ, వీరికి డార్క్ కలర్స్ బాగుంటాటాయి.
తమకు నప్పే కలర్ డ్రెస్ ఎంపికకు డిజైనర్ సలహాలు తీసుకుంటారు. అలాంటి వారికి కలర్ కాన్సెప్ట్ గురించి వివరిస్తాం. వారి శరీర రంగు, సందర్భం, పార్టీ .. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని డిజైన్ చేస్తాం.
రీ యూజ్... రంగులు చల్లుకున్నాక వేసుకున్న డ్రెస్ మల్టీకలర్‌తో నిండిపోతుంది. ఆ డ్రెస్ పైన ఏ కలర్ భాగం ఎక్కువుందో చూసుకొని, ఆ రంగుతో డైయింగ్ చేయించి, తిరిగి వాడుకోవచ్చు. -నవ్యశ్రీ మండవ, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment