Bonalu ఉత్సవాల రాజు.. పోతరాజు | Potharajulu getting ready for Bonalu celebrations in Telangana | Sakshi
Sakshi News home page

Bonalu ఉత్సవాల రాజు.. పోతరాజు

Jun 10 2025 3:47 PM | Updated on Jun 10 2025 3:57 PM

Potharajulu getting ready for Bonalu celebrations in Telangana

 నగరంలో బోనాలకు సిద్ధమవుతున్న కళాకారులు   

బోనాల ఊరేగింపులో వీరి విన్యాసాలే హైలెట్‌ 

కొందరు వంశపారంపర్యంగా  ఇదే వృత్తిలో

బోనాలు.. పోతురాజులు.. ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం. శతాబ్దాలుగా బోనాలు, పోతురాజుల పేర్లు ఒకదానికొకటి పోటీపడుతూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎల్లమ్మ అమ్మవారి ఆలయాల ముందు పోతురాజుల విన్యాసాలు కళ్లప్పగించి చూడాల్సిందే. వేల సంఖ్యలో భక్తులు పాల్గొనే బోనాల ఊరేగింపుకు పోతురాజుల విన్యాసాలు హైలెట్‌గా నిలుస్తాయి. ఒళ్లు గగుర్పొడిచే వీరి విన్యాసాలు బోనాల ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి గీంకారాలతో ఆ ప్రాంతంలో నిశబ్దం ఆవహిస్తుంది. చూసేవారంతా భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. ముఖ్యంగా పోతురాజు నిమ్మకాయలతో చేసే విన్యాసం చూడ ముచ్చటగా అనిపిస్తుంది. రెండు చేతుల్లో కోరడాలతో సై..సై అని చప్పుడు చేస్తూ పోతురాజుల వీరంగం భలే ఆకట్టు కుంటుంది.– గోల్కొండ  

 

పోతురాజుల ప్రత్యేక ఆకర్షణ..  

పోతురాజు వేషంలో తయారవడమే ఒక ప్రత్యేక కళ. బోనాలలో పోతురాజులది ప్రత్యేక ఆకర్షణ. శరీరం మొత్తం వివిధ రకాల రంగులు, కాళ్లకు గల్లు గల్లు మనే గజ్జెలతో పోతురాజులు ఆకట్టుకుంటారు. మెడలో మాలలు, రెండు చేతుల్లో కోరడాలతో, నాలుక బయటకు తీస్తే ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. కాగా గోల్కొండ కోట బోనాలలో గత దశాబ్ద కాలంగా పోతురాజుగా ప్రజలను ఆకట్టుకుంటున్నాడు తల్వార్‌ శివ. పోతురాజు వేషంలో స్థానిక ప్రజల అభిమానాన్ని పొందాడు. అమ్మమీద భక్తితోనే బోనాల ఉరేగింపులో పోతురాజు వేషం వేస్తున్నానని తల్వార్‌ శివ అంటున్నాడు. ఒక్క రోజు వేషానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఊరేగింపులో విన్యాసాలు చేస్తుంటే ప్రజలు తమను ఆదరిస్తారని, ఇది తమకు ఎంతో గర్వంగా అనిపిస్తుందని అంటున్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement