
రంగుల ట్విస్ట్..
హోలీ (Holi) అంటే.. రంగుల రాజ్యం. ఆద్యంతం హుషారుగా సాగే ఏకైక పండుగ ఇదేనేమో.. డ్యాన్స్, మ్యూజిక్, విందు వినోదాల కలయికగా సాగే ఈ పండుగ సందర్భంగా అనుసరించే ఫ్యాషన్ కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి కదా.. కాబట్టి కలర్ ఫెస్ట్‌లో ప్రత్యేకంగా కనబడేందుకు తాను చెప్పే స్టైల్స్‌తో లుక్‌ని కొత్త లెవల్‌కి తీసుకెళ్లండి అని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్ కన్సెల్టెంట్ సుమన్ కృష్ణ. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కలర్.. బ్లాక్‌ని సెంటరాఫ్ ఫ్యాషన్‌గా చేసి హోలీ వేడుకలో త‘లుక్’మనవచ్చని అంటున్నారామె. ఆమె అందిస్తున్న విశేషాలు, సూచనలివీ.. – సాక్షి, సిటీబ్యూరో
కలర్ బ్లాకింగ్ అంటే..?
ఇది విభిన్న, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ స్టైల్. మామూలు వైట్ కుర్తా బోరింగ్‌గా ఉంటుంది. సో.. ట్రెండీ కలర్ కాంబినేషన్‌లతో లుక్‌కి ఎక్స్‌ట్రా గ్లామర్ వస్తుంది.. ఒకే షేడ్‌లో ఉండే డ్రెస్సింగ్ కంటే, రెండు లేదా మూడింటికి పైగా బ్రైట్ కలర్స్ మిక్స్ చేసి ధరించడం ద్వారా మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు.
కొన్ని కలర్ కాంబినేషన్స్..
ధరించే దుస్తుల మధ్య సరైన కలర్ కాంబినేషన్ చాలా కీలకం. పింక్–ఆరేంజ్ హోలీకి చాలా ఎనర్జిటిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే..ఎల్లో–పర్పుల్ వంటి బ్రైట్ షేడ్స్ ట్రెడిషనల్ హోలీ లుక్‌కి సరైన ఎంపిక. అంతేకాకుండా బ్లూ–రెడ్ కూడా ట్రెండీ లుక్ అందిస్తాయి. వైట్–రేసింగ్ గ్రీన్‌లు క్లాసిక్‌గా కనపడాలంటే బెస్ట్.
పీచ్‌లను సున్నితమైన, పండుగ కళ తెచ్చే కలర్స్‌గా పేర్కొనవచ్చు.స్టైల్–కంఫర్ట్ రెండింటి మేళవింపులా ఇంపుగా అనిపించాలంటే, కాటన్ లేదా లినెన్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవడం మంచిది.
బ్రైట్ టాప్ + లైట్ బాటమ్ – లేదా ఆపోజిట్ కలర్ బ్లాక్ డ్రెస్సింగ్ ట్రై చేయవచ్చు. బాగీ/లూజ్ కుర్తాస్, ఫ్యూజన్ ధోతి ప్యాంట్స్ హోలీ మూడ్‌కి సరిగ్గా సరిపోతాయి.
హోలీ డాన్స్‌లో ఫుల్ ఫన్ కోసం బెస్ట్ ఆప్షన్‌గా పాదాలకు స్నీకర్స్ బెస్ట్.
సన్‌గ్లాసెస్, వాటర్ ప్రూఫ్ మేకప్ – హోలీ ఎఫెక్ట్స్ స్టైలిష్‌గా హ్యాండిల్ చేయండి.
ఇలా చేయొద్దు..
పూర్తిగా వైట్ డ్రెస్సింగ్ వద్దు. దీనివల్ల రంగుల మిక్స్ తక్కువగా కనిపిస్తుంది.
హెవీ మెటీరియల్స్, సిల్క్ ధరిస్తే అన్ ఈజీగా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కాళ్లకు హీల్స్ ధరిస్తే జారిపడే చాన్స్ ఎక్కువ. మేకప్, హెయిర్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్లడం పెద్ద పొరపాటు అవుతుంది.
ఫైనల్ టచ్..
ఈ హోలీలో బ్లాక్ కలర్‌తో మ్యాజిక్ ట్రై చేయవచ్చు. ఫొటోలు మరింత ట్రెండీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ హోలీ జ్ఞాపకాలతో ఆనందాన్ని ఏడాది పాటు కొనసాగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment