బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం: ఉత్స‌వాల షెడ్యూల్ ఇదే! | Bathukamma 2025 celebrations the schedule of the festivities | Sakshi
Sakshi News home page

బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం: ఉత్స‌వాల షెడ్యూల్ ఇదే!

Sep 20 2025 5:22 PM | Updated on Sep 20 2025 5:32 PM

Bathukamma 2025 celebrations the schedule of the festivities

రేపటి నుంచే(సెప్టెంబరు 21)  బతుకమ్మ సంబరాలు 

ఆరంభ వేడుక‌ల్లో పాల్గొన‌నున్న మంత్రులు జూప‌ల్లి, కొండా సురేఖ‌, సీత‌క్క

బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి  జూప‌ల్లి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు రేప‌టి (ఆదివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. బ‌తుక‌మ్మ  ప్రారంభ వేడుక‌ల‌కు చారిత్ర‌క వేయి స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.  ప‌ర్యాట‌క శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క అన‌సూయ బ‌తుక‌మ్మ అరంభ వేడుక‌లో  పాల్గొన‌నున్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత  వైభవంగా నిర్వహించేందుకు అన్ని  ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపోందించింది. చారిత్ర‌క ప్రదేశాలు, ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలు, వార‌స‌త్వ క‌ట్ట‌డాలు, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో 9 రోజుల పాటు బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌హాలు చేసింద‌ని మంత్రి జూప‌ల్లి పేర్కొన్నారు.

ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతోందని అన్నారు. తెలంగాణ ఆడ్డ‌బిడ్డ‌లంద‌రికీ ఈ సంద‌ర్భంగా బతుక‌మ్మ  శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రార్థించారు.బ‌తుక‌మ్మ పండ‌గ‌ను సంప్ర‌దాయ బ‌ద్ధంగా జ‌రుపుకోవాల‌ని కోరారు.

బతుకమ్మ  ఉత్స‌వాల షెడ్యూల్

21వ తేదీ ఆదివారం

    •    వేయి స్తంభాల గుడి, వరంగల్ – బతుకమ్మ ప్రారంభోత్సవం (సాయంత్రం)
    •    హైదరాబాద్ శివారులో మొక్క‌లు నాట‌డం (ఉదయం)

22వ తేదీ పోమవారం
    •    శిల్పరామం, హైదరాబాద్ 
    •    పిల్లలమర్రి, మహబూబ్‌నగర్

23వ తేదీ మంగళవారం
    •    బుద్ధవనం, నాగార్జునసాగర్, నల్గొండ

24వ తేదీ  బుధవారం
    •    కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి 
    •    సిటీ సెంటర్, కరీంనగర్ 
25వ తేదీ గురువారం
    •    భద్రాచలం ఆలయం- కొత్త‌గూడెం, ఖమ్మం 
    •    జోగులాంబ అలంపూర్, గద్వాల
    •    స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ – బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ (25/09/2025 నుంచి 29/09/2025 వరకు)

26వ తేదీ  శుక్రవారం
    •    అలీ సాగర్ రిజర్వాయర్, నిజామాబాద్ 
    •    ఆదిలాబాద్, మెదక్ 
    •    నెక్లెస్ రోడ్, హైదరాబాద్ – సైకిల్ ర్యాలీ (ఉదయం)

27వ తేదీ శనివారం
    •    మహిళల బైక్‌ ర్యాలీ - నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, హైదరాబాద్ –  (ఉదయం)
    •    ఐటి కారిడార్, హైదరాబాద్ – బతుకమ్మ కార్నివల్ (సాయంత్రం)

28వ తేదీ ఆదివారం
    •    ఎల్‌బి స్టేడియం, హైదరాబాద్ – గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (10,000కిపైగా మహిళలతో 50 అడుగుల బతుకమ్మ)

29వ తేదీ  సోమవారం
    •    పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్ – ఉత్త‌మ బతుకమ్మ పోటీలు, సరస్ ఫెయిర్ (SHG’s తో)
    •    RWA’s  (రెసిడెంట్ వెల్పేర్ అసోసిమేష‌న్స్), Hyderabad Software Enterprises Association: (HYSEA) , హైదరాబాద్30/09/2025 & రంగారెడ్డి ప్రాంతం – బతుకమ్మ కార్యక్రమం, పోటీలు

30 తేదీ  మంగళవారం
    •    ట్యాంక్‌బండ్ – గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, IKEBANA (ఇకెబానా - జ‌ప‌నీయుల‌)  ప్రదర్శన, సెక్రటేరియట్‌పై 3D మ్యాప్ లేజర్ షో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement