
హోలి అంటే యువతరం పండగ. ఆనందం ఆకాశాన్ని అంటే పండగ. దీన్ని దృష్టిలో పెట్టుకొని వర్చువల్ హోలిని ముందుకు తెచ్చాయి శాంసంగ్,స్నాప్‌చాట్. సాంకేతికతకు, సంప్రదాయాన్ని జోడిస్తూ హోలి వేడుకలకు కొత్త రంగు జోడించాయి శాంసంగ్, స్నాప్‌చాట్ సంస్థలు. ఏఐ ఆధారిత ఏఆర్ లెన్స్‌తో హోలీ వేడుకలకు డిజిటల్ రంగును జోడించాయి. ఇంటరాక్టివ్ ఫేస్–పెయింటింగ్ ఎఫెక్ట్ ద్వారా హోలీ రంగులు వచ్చువల్‌గా అనుభవంలోకి వస్తాయి. పైనల్ స్క్రీన్ డిస్‌ప్లేలో ‘హోలి మెసేజ్’ కనువిందు చేస్తుంది. ‘77 శాతం మంది హోలి వేడుకలను సృజనాత్మకంగా, కొత్తగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఏఆర్ లెన్స్‌లనుఇష్టపడుతున్నారు’ అంటుంది స్నాప్ ఇంక్ ఇండియా అడ్వర్‌టైజింగ్ హెడ్ నేహా జోలి.
వర్చువల్ హోలి
‘ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్‌తో కలిపి హోలి బాగా ఆడేవాడిని. వారు విదేశాల్లో ఉండడం వల్ల ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను’ అని ఇక ముందు బాధ పడనక్కర్లేదు. ఫ్రెండ్స్ ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు ఉన్నా సరే, వర్చువల్ హోలి పుణ్యమా అని పండగ సంతోషాన్ని సొంతం చేసుకోవచ్చు. వర్చువల్ హోలి పార్టీలు ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి!
చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!
నలభై రోజుల హోలీ!
ఉత్తరాఖండ్‌లో హోలీని ‘కుమావోనీ’ హోలీగా జరుపుకుంటారు. ఇది బసంత్ పంచమితో ప్రారంభమయ్యే నెలరోజుల ఉత్సవం. దీన్ని బైతక్ హోలీ, నిర్వైన్ హోలీ అని కూడా పిలుస్తారు
శివుడు కొలువు తీరిన వారణాసిలో శ్మశానంలో దొరికే బూడిదతో హోలీ వేడుకలు జరుపుకుంటారు. ఈ హోలిని ‘మసన్ హోలీ’ అని పిలుస్తారు.
రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో చారిత్రాత్మకమైన ‘ఘన్‌శ్యామ్ జీ మందిర్’ ప్రాంతంలో హోలీ ఉత్సవాన్ని 40 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ హోలీ ఉత్సవాలను చూడడానికి స్థానికులే కాదు విదేశీయులు కూడా వస్తారు. ఈ ఆలయాన్ని 1718లో నిర్మించారు
పండగకి రెండు రోజుల ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లో వితంతువులు హోలీ వేడుకలు మొదలుపెడతారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘లాత్మార్ హోలీ’ వేడుకలు జరుగుతాయి. పురుషులను కర్రలతో తరుముతూ, వారిని రెచ్చగొట్టేలా మహిళలు పాటలు పాడతారు ∙హోలీని మన దేశంలోనే కాదు నేపాల్, శ్రీలంకలాంటి దేశాల్లోనూ జరుపుకుంటారు.
నేపాల్‌లో ‘భోటే ఉత్సవ్’ అని, శ్రీలంకలో ‘పులంగి’ అనీ పిలుస్తారు.
హోలీ... అరవై వేల కోట్ల వ్యాపారం!
గత ఏడాదితో పోల్చితే 20 శాతం వృద్ధితో ఈ సంవత్సరం హోలీ పండగకు సంబంధించి రూ.60,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. మూలికరంగులు, పండగ వస్తువులు, స్వీట్లు, వాటర్ గన్స్, బెలూన్లు, వైట్ టీ–షర్ట్‌లు, కుర్తా–పైజామాలు, హ్యాపీ హోలి స్లోగన్‌లతో ఉన్న టీ–షర్ట్‌లు... మొదలైన వాటికి పెరిగిన డిమాండ్ దేశవ్యాప్తంగా హోలీ పండగ వాణిజ్యాన్ని పెంచింది. ఈ డిమాండ్ రిటైలర్‌లు, చిన్న వ్యాపారులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఎఐటి) తెలియజేసింది
చదవండి: Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
Comments
Please login to add a commentAdd a comment