
ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అత్యంత శ్రద్ధాభక్తులతో అమ్మవారిని ఆరాధించడం అనూచానంగా వస్తోంది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు, మన దేశం, సమాజం అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ఈ సంవత్సరం శరన్నవరాత్ర మహోత్సవ శుభ సందర్భంలో సెప్టెంబర్ 22, సోమవారం నుంచి అక్టోబర్ 2, గురువారం విజయందశమి వరకూ మార్కండేయ పురాణాంతర్గతమూ, మహా శక్తిసంపన్నమూ అయిన శ్రీ దుర్గాసప్తశతి సంక్షిప్త రూపమైన దుర్గా సప్తశ్లోకీ అనే ఏడు శ్లోకాల స్తోత్రాన్ని ప్రతిరోజూ కనీసం 108 మార్లు పఠించవలసిందిగా శృంగేరీ పీఠం పిలుపునిచ్చింది.
భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పైన సూచించిన దుర్గాసప్తశ్లోకి సంకల్ప సహితంగా పారాయణ చేసి కృతార్థులు కావలసిందిగా శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు భక్తులకు సూచించారు.
సంకల్పం
మమ శ్రీ దుర్గాపరమేశ్వరీ ప్రసాదేన చింతిత సకల మనోరథ సిద్ధ్యర్థం ఆయుర్విద్యా యశోబల వృధ్యర్థం సర్వారిష్ట పరిహార ద్వారా సమస్త మంగళా వ్యాప్తర్థం విశేషతః అస్మిన్ భారత దేశ పరిదృశ్యమాన పరస్పర విద్వేష నివృత్తి ద్వారా ధర్మ శ్రద్ధాలూనామ్ సకల శ్రేయోభివృద్యర్థం ఏతత్దేశ రాజ్య పరిపాలకానాం ధన ధాన్యాది సకల సాంపత్సమృధ్యర్థం శ్రీ దుర్గా సప్త శ్లోకీ పారాయణం కరిష్యే
శ్రీ దుర్గా సప్త శ్లోకీ
అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః
1. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి
2. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి ।
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా ॥ 2 ॥
3. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే
4. శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే ।
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే
5. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే ।
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే
6. రోగానశేషానపహంసి తుష్టా-
రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ ।
త్వామాశ్రితానాం న విపన్నరాణాం
త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి
7. సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ।
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్
ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ ।