Delhi
-
హద్దులన్నీ దాటుతోంది
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బరితెగించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్ సంస్థ అయిన ‘‘తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్)’’పై నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహ అక్షింతలు చల్లింది. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి, భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ వేసిన పిటిషన్‌ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తిట్లతో తలంటు డీఎంకే సర్కార్, టాస్మాక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీలు వాదించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ‘‘ఒక ప్రభుత్వ కార్పొరేషన్ అనేది నేరం ఎలా చేయగలదు?. ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’అని సీజేఐ జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, అందుకే వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కల్పించుకుని ‘‘దర్యాప్తును ఆపకండి. దాదాపు రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి’’అని వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్ సిబల్ తప్పుబట్టారు. ‘‘మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నాసరే అక్రమాలు జరిగాయని అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టింది. 2014 ఏడాది నుంచి ఇప్పటిదాకా అక్రమంగా డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగి అన్యాయంగా టాస్మాక్ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి టాస్మాక్ ఆఫీసుల్లోనే నిర్బంధించి ఈడీ అధికారులు వేధించారు. వ్యక్తిగత వస్తువులను లాక్కుని గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్గించారు’’అని సిబల్ వాదించారు. ఈడీ దర్యాప్తును సమర్థిస్తూ ఏప్రిల్ 23వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. రాష్ట్రాల హక్కులను కూలదోస్తోంది సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ‘‘ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణ రాష్ట్రాలకు సంబంధించిన విషయంకాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా, బలవంతంగా లాక్కుంటోంది’’అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈఏడాది మార్చి ఆరో తేదీ నుంచి మార్చి 8వ తేదీదాకా ఏకధాటిగా 60 గంటలపాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా? అని తమిళనాడు సర్కార్ ఈడీని సుప్రీంకోర్టులో నిలదీసింది. ‘‘మార్చి ఆరో తేదీన టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సోదాలు, జప్తులు చేశామని ఈడీ చెబుతోంది. కానీ టాస్మాక్ అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని సంస్థ. ఇప్పటిదాకా అక్రమంగా నమోదైన ఎఫ్ఐఆర్లలో ఏ ఒక్క దాంట్లోనూ టాస్మాక్ పేరును ‘నిందితుల జాబితా’లో పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేని, నిందితుల జాబితాలో లేని సంస్థ పరిధిలో, ప్రాంగణాల్లో ఈడీకి విచారణ, దర్యాప్తు చేసే హక్కు లేదు. పీఎంఎల్ఏ చట్టం సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది’’అని తమిళనాడు సర్కార్ కోర్టులో వాదించింది. ‘‘2021లో చివరిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంత ఆలస్యంగా సోదాలు చేయడమేంటి?. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం నమ్మశక్యమైన కారణాలు ఉంటేనే దర్యాప్తు/సోదాలు జరపాలి. కానీ ఈడీ ఈ నిబంధనను గాలికొదిలేసింది. సరైన లక్ష్యంలేకుండా రంగంలోకి దూకి అడ్డదిడ్డంగా దర్యాప్తు చేస్తోంది’’అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈడీని సుప్రీంకోర్టు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. బీజేపీకి చెంపదెబ్బ: సుప్రీంకోర్టు నిర్ణయంపై డీఎంకే వ్యాఖ్య టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు స్టే నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి చెంపదెబ్బలా తగిలిందని తమిళనాడులోని పాలక డీఎంకే పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు డీఎంకే సీనియర్ నాయకుడు, పార్టీ కార్యదర్శి(వ్యవస్థాగతం) ఆర్ఎస్ భారతి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలో డీఎంకే సర్కార్ కొలువుతీరాక ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈడీని రంగంలోకి దింపారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు చూశాకైనా బీజేపీ ఈడీని దుర్వినియోగం చేయడం మానుకుంటే మంచిది. తమిళనాడులో మరో 7–8 నెలల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈడీ సోదాలు చేసింది’’అని ఆర్ఎస్ భారతి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని విపక్ష పారీ్టలు సైతం స్వాగతించాయి. -
వృద్ధుడి పిత్తాశయంలో 8 వేల రాళ్లు
న్యూఢిల్లీ: ఓ వృద్ధుడి పిత్తాశయంలో ఒకటీరెండూ కాదు ఏకంగా 8,125 రాళ్లు బయటపడిన అరుదైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధుడొకరు కొన్నేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆకలి మందగించడం, తరచూ జ్వరం బారినపడటం, ఛాతీ, వెన్నెముక భాగంలో బరువుగా ఉండటం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. దీంతో, ఈ నెల 12వ తేదీన గురుగ్రామ్‌లోని ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు తీసుకువచ్చారు. అల్ట్రా సౌండ్ పరీక్ష చేయగా పిత్తాశయ భాగమంతా రాళ్లతో నిండిపోయి కనిపించింది. దీంతో, వెంటనే లాపరోస్కోపిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గంటసేపట్లో శస్త్ర చికిత్స పూర్తయింది. అందులో వచ్చిన 8,125 రాళ్లను లెక్కించేందుకు వైద్య సిబ్బందికి ఏకంగా ఆరు గంటలు పట్టిందని ఆస్పత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా కొలెస్టరాల్ అసమతౌల్యం కారణంగా గాల్‌స్టోన్స్ ఏర్పడుతుంటాయి. వీటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. లేకుంటే ఇవి పెరిగిపోయే ప్రమాదముంది. ఈ కేసులో రోగి శస్త్రచికిత్సకు నిరాకరిస్తూ చాలాకాలంపాటు తాత్సారం చేశారని ఆస్పత్రి తెలిపింది. పరిస్థితి మరీ విషమించాకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆపరేషన్‌కు అంగీకరించారని పేర్కొంది. ఆపరేషన్ తర్వాత రెండు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జి చేశామని వెల్లడించింది. ఇప్పటికీ సర్జరీ చేయకుంటే అక్కడ చీము పేరుకుపోయి గట్టిపడి, పిత్తాశయం గోడలు మందంగా తయారవుతాయని, ఆ భాగంలో క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం సైతం ఉంటుందని గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ ఆంకాలజీ వైద్యుడు అమిత్ జావెద్ చెప్పారు. దేశ రాజధాని ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో పిత్తాశయంలో రాళ్లు బయటపడటం ఇదే మొదటిసారి కావచ్చని ఫోర్టీస్ ఆస్పత్రి తెలిపింది. అసాధారణమైంది కానప్పటికీ ఇది అరుదైన కేసని పేర్కొంది. -
వక్ఫ్ పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్
ఢిల్లీ: వక్ఫ్ చట్ట సవరణపై స్టే విధించాలన్న అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం (మే22) ఈ పిటిషన్లపై బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వాదనలు ఆసక్తికరంగా సాగాయి. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. #BreakingNews | Supreme Court reserves its order for interim relief on a batch of pleas challenging the Constitutional validity of the Waqf (Amendment) Act, 2025.#WaqfAct #WaqfBoard #Waqf #SupremeCourt pic.twitter.com/icvCz361gx— DD News (@DDNewslive) May 22, 2025 -
హద్దు దాటారు.. తమిళనాడులో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.ఇటీవల తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సిబల్ వాదనలు వినిపిస్తూ.. 2014-21 వరకు రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. కానీ, ఈడీ 2025లో టాస్మాక్ హెడ్ క్వార్టర్లలో సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయవచ్చు కానీ.. మొత్తం కార్పొరేషన్‌ను దీనికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించింది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.CJI: We have granted stay; Sibal: they are investigating-why are ED coming here?ASG Raju: We have done nothing wrong CJI: If they have registered FIR, why ED should come? Raju: 1000 crore fraudCJI: Where is the predicate offence? ED passing all limits— Live Law (@LiveLawIndia) May 22, 2025ఇదిలా ఉండగా.. తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో 1,000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తమిళనాడులో రాజకీయ గందరగోళాన్ని సృష్టించింది. తమిళనాడులో మద్యం విక్రయాలపై పూర్తి గుత్తాధిపత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ TASMAC, రాష్ట్ర ఆదాయంలో గణనీయమైన భాగం (సంవత్సరానికి దాదాపు రూ. 45,000 కోట్లు) సమకూరుస్తుంది. ఇది రాష్ట్రంలో 4,700కు పైగా రిటైల్ షాపుల ద్వారా మద్యం పంపిణీ చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. TASMAC కార్యకలాపాలలో బహుళ అవకతవకలు జరిగాయి. ఇందులో టెండర్ మానిప్యులేషన్, అక్రమ నగదు లావాదేవీలు, రూ. 1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపించింది. కాగా ఇటీవల ఈ కేసులో భాగంగా టాస్మార్క్ అధికారుల ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈడీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా TASMAC అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: మండు వేసవిలో దేశవ్యాప్తంగా అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాకాలం నాటి పరిస్థితులు వేసవిలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఢిల్లీలో బలమైన గాలులు, వడగళ్ల వానతో నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు.. చెట్లు కూలడంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ఏరియాల్లో మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. ఇటు తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.ఢిల్లీలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు 70కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఏకంగా గంటకు 80 కిలీమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. లోదీ రోడ్లో వడగళ్ల వాన పడింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశముందని ముందుగానే ప్రకటించాయి.Just now Delhi witnessed a massive dust storm followed by rain and hail. The power of nature is on full display #delhirain ⛈️"From dust storm to heavy rain and hail - #Delhi's weather is going to change dramatically tonight 🌪⚡️#delhirain #DelhiWeather pic.twitter.com/FLatYfSEap— Weatherman Uttam (@Gujarat_weather) May 21, 2025Thunderstorms and dust storms coupled with heavy rain wreak havoc across Delhi-NCR, uprooting trees and mangling sign boards.#delhirain #DelhiWeather pic.twitter.com/duY0nhOhIs— Mr. J (@LaughingDevil13) May 21, 2025ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.#delhirain pic.twitter.com/1nxW0mxdVC— Suaib (@JournalistSuaib) May 21, 2025హైదరాబాద్‌లో వాన బీభత్సంహైదరాబాద్‌లో వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని నదులను తలపించాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని అన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది వాతావరణ శాఖ. బంగ్లగూడ, సైదాబాద్, మలక్‌పేట్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #HyderabadRains Continue... 🌧️📸: Retratoooo [IG] pic.twitter.com/2LrjO7dxqT— Hi Hyderabad (@HiHyderabad) May 21, 2025It was a craziest downpour in Sikh Village Secunderabad. @balaji25_t #HyderabadRains pic.twitter.com/TzkHmGDfUA— The Food GlanZer (@JavedMohammeds) May 21, 2025Dramatic visuals from Hyderabad's Greenpark Colony: Two-wheeler almost swept away by rainwater.#Rain #Hyderabad #HyderabadRains #ViralVideo #Trending pic.twitter.com/mD3hRXFpLi— TIMES NOW (@TimesNow) May 22, 2025 -
సెలవుల్లో పని చేయడానికి లాయర్లు ఇష్టపడడం లేదు
న్యూఢిల్లీ: సెలవు రోజుల్లో పని చేయడానికి న్యాయవాదులు ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు పెండింగ్ కేసులు పరిష్కరించడం లేదంటూ న్యాయ వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని పేర్కొంది. తమ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత ప్రారంభించాలని కోరిన ఓ న్యాయవాది పట్ల ధర్మాసనం బుధవారం అసంతృప్తి వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టులో మొదటి ఐదుగురు న్యాయమూర్తులు వేసవి సెలవుల్లోనూ విధులు నిర్వర్తిస్తారని తెలియజేసింది. అయినప్పటికీ బ్యాక్లాగ్ కేసుల విషయంలో తమపై నిందలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. వాస్తవానికి వేసవి సెలవుల్లో పని చేయడం లాయర్లకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టుకు ఈ నెల 26 నుంచి జూలై 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయస్థానం నోటిఫికేషన్ జారీ చేసింది. సెలవుల సమయంలోనూ ధర్మాసనాలు పాక్షికంగా పని చేయాలని సూచించింది. రెండు నుంచి ఐదు వెకేషన్ బెంచ్‌లు పని చేయాలని నిర్దేశించింది. సీజేఐ సహా ఐదుగురు న్యాయమూర్తులు విధులకు హాజరవుతారు. గతంలో వేసవి సెలవుల్లో కేవలం రెండు వెకేషన్ బెంచ్‌లు పనిచేసేవి. సీనియర్ న్యాయమూర్తులు విధులు నిర్వర్తించాలన్న నిబంధన ఉండేది కాదు. కానీ, ఈ నిబంధనల్లో సుప్రీంకోర్టు తాజాగా మార్పులు చేసింది. ఈ నెల 26 నుంచి ఐదు ధర్మాసనాలకు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ బి.బి.నాగరత్న నేతృత్వం వహిస్తారు. అలాగే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తెరిచి ఉంటుంది. -
ప్రత్యేక గడియారం ధరించనున్న వ్యోమగామి శుభాన్షు శుక్లా
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రత్యేక గడియారాలను ధరించనున్నారు. శుభాన్షుతో సహా నలుగురు వ్యోమగాములు వీటిని ధరిస్తారని మిషన్ నిర్వాహక సంస్థ ఆక్సియమ్ స్పేస్ ధ్రువీకరించింది. ఒమేగా గడియారాలను మరోసారి రోదసీ యాత్రకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నామని తెలిపింది. ఈ గడియారాలను స్విట్జర్లాండ్‌కు చెందిన ఒమేగా సంస్థ తయారు చేసింది. ఈ ప్రత్యేక గడియారాలు మానవ అంతరిక్ష ప్రయాణంలో తొలి రోజుల నుంచే భాగమయ్యాయి. నాసాతో ఒమేగా అనుబంధం 1960ల్లో ప్రారంభమైంది. మొదటిసారి స్పీడ్‌మాస్టర్‌ను అక్టోబర్ 3, 1962న మెర్క్యురీ సిగ్మా 7 మిషన్‌లో వ్యోమగామి వాలీ షిర్రా ధరించి వెళ్లారు. అయితే ఇది అనధికారికంగా ఉపయోగించారు. అప్పటికి నాసా ఇంకా ఆమోదించలేదు. 1965 మార్చి 1న మానవసహిత మిషన్లలో ఉపయోగించడానికి నాసా ఒమేగా స్పీడ్‌మాస్టర్‌ను అధికారికంగా ధ్రువీకరించింది. దీనిని అపోలో మిషన్లలో విస్తృతంగా ఉపయోగించారు. అపోలో 11తో మొదటిసారి చంద్రునిపైనా కాలుపెట్టింది. నేటికీ వ్యోమగాములతో అంతరిక్షానికి వెళుతోంది. ఈ గడియారాలను గురుత్వాకర్షణ లేని పరిస్థితులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, అధిక పీడనం వరకు అంతరిక్షంలోని అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. శుక్లాతో సహా ప్రతి వ్యోమగామికి రెండు ఒమేగా స్పీడ్‌మాస్టర్ గడియారాలు అందుతాయి. -
రాజ్యాంగం, ‘సుప్రీం’ మధ్య విడదీయరాని బంధం
న్యూఢిల్లీ: దేశంలో ప్రాథమిక హక్కుల పరిధిని మరింత విస్తరింపజేయడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. 75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మధ్యవర్తిత్వం, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాల్లో మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా న్యాయస్థానం తీర్పులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని, ఇది చరిత్రాత్మక సందర్భమని వ్యాఖ్యానించారు. రెండింటి మధ్య విడదీయరాని బంధం కొనసాగుతున్నట్లు స్పష్టంచేశారు. ఇవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టును రాజ్యాంగమే సృష్టించిందని, రాజ్యాంగ ఆదేశాల ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తోందని ఉద్ఘాటించారు. అదేసమయంలో రాజ్యాంగానికి సుప్రీంకోర్టు అత్యుత్తమ రక్షణ కవచంగా వ్యవహరిస్తోందని జస్టిస్ గవాయ్ వివరించారు. జస్టిస్ ఓకా పని రాక్షసుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓకా తనకు మంచి మిత్రుడు, పని రాక్షసుడు జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. జస్టిస్ ఓకా ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టు అడ్వొకేట్–ఆన్–రికార్డు అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. జస్టిస్ ఓకాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. జస్టిస్ ఓకా మాట్లాడుతూ.. జస్టిస్ గవాయ్ అసలైన ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు. -
నేడు ప్రధాని చేతుల మీదుగా ‘అమృత్’ స్టేషన్ల ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు రాష్ట్రంలో పలు అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభం కాను న్నాయి. గురువారం దేశవ్యాప్తంగా మొత్తం 103 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వాటిలో రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో తాను స్వయంగా పాల్గొన నున్నట్లు పేర్కొన్నారు. బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడుస్తుందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించిందని, ఇది 2014–15 నాటి బడ్జెట్‌తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ అని తెలిపారు. రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. -
భారీ తుపాను.. ఢిల్లీ అతలాకుతలం!
న్యూఢిల్లీ: భారీ తుపాను(Delhi Massive Storm) ధాటికి దేశ రాజధాని అతలాకుతలం అయ్యింది. బుధవారం సాయంత్రం నుంచి ధూళి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. నిన్నమొన్నటి దాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రలతో.. తీవ్ర ఉక్కపోతతో రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం వాతావరణం చల్లబడిందని అనుకునేలోపే.. ధూళి తుపానుతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ధాటికి ఢిల్లీ, నోయిడాల్లో చాలా చోట్ల చెట్లు, హోర్డింగులు, కరెంట్ పోల్స్ నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపైనే చెట్లు, హోర్డింగ్స్ పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు రేపటికి తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఢిల్లీకి వర్షాలు ఉండడంతో.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోషల్ మీడియాలో తుపాను బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. #WATCH | Delhi-NCR experiences weather change. Visuals from Noida Sector 10 in Uttar Pradesh as it experiences dust storm. pic.twitter.com/gsqXxyFGhq— ANI (@ANI) May 21, 2025 #WATCH | Delhi: A tree uprooted at Janpath Road as the city received gusty wind, heavy rainfall and hailstorm. pic.twitter.com/GDVI1OpSz4— ANI (@ANI) May 21, 2025#WATCH | Delhi receives gusty wind, heavy rainfall and hailstorm. Visuals from Geeta Colony. pic.twitter.com/hTIXMzETgZ— ANI (@ANI) May 21, 2025 -
మావోయిస్టులపై ఇది ఘన విజయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. మావోయిస్టులపై ఇప్పటిదాకా సాధించిన ఇది అతిపెద్ద ఘన విజయం అని అన్నారాయన. ఈ క్రమంలో భదత్రా బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు.మావోయిస్టుల(Maoists)పై ఇది ఘన విజయం. నక్సల్స్ పై పోరాటంలో ఇదో మైలురాయి. భద్రతా బలగాలు సాధించిన విజయం చూసి గర్వంగా ఉంది. మా ప్రభుత్వం శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. అందుకే మావోయిజాన్ని మూలాలను చెరిపేస్తున్నాం. మావోయిజాన్ని అంతమొందించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారాయన. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు(Nambala Keshava Rao) ఉండడంతో కేంద్రం ఇలా స్పందిస్తోంది. అంతకు ముందు.. హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ ఎన్‌కౌంటర్‌పై ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ప్రధాని మోదీ ఆ పోస్ట్‌కు పైవిధంగా స్పందించారు.ఇదీ చదవండి: నక్సలిజానికి వెన్నెముక.. నంబాల! -
మావోయిస్టు అగ్రనేత నంబాల మృతి: అమిత్ షా అధికారిక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. నంబాల మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వివరాలను ఆయన తెలియజేశారు. నారాయణపూర్‌లో ఇప్పటిదాకా జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందారు. ఇందులో సీపీఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు. నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు. ముప్పై ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుబెట్టడం ఇదే తొలిసారి’’ అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారాయన. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మందిని అరెస్ట్ చేశాం. మరో 84 మంది లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందదిస్తాం’’ అని షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్నగా ఆయన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు ఈయన ప్రధాన సూత్రధారి. కేంద్ర కమిటీ సభ్యుడైన నంబాలపై కోటిన్నర రివార్డు ఉంది.కాల్పులు ఇలా.. నారాయణపూర్‌లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇంజనీరింగ్ చదివి.. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. నంబాల వరంగల్(తెలంగాణ) ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు కొనసాగుతూ వచ్చారు. -
ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదు
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025ను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే అయినప్పటికీ ఇస్లాంలో అది తప్పనిసరి భాగం కాదని తేల్చిచెప్పింది. వక్ఫ్ అంటే ఇస్లాంలో ఒక సేవా కార్యక్రమం అని స్పష్టంచేసింది. వక్ఫ్(సవరణ) చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ ధర్మానం ఎదుట వాదనలు వినిపించారు. సేవా కార్యక్రమాలను ప్రతి మతం గుర్తించి, ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఏ మతంలోనైనా ఇలాంటి సేవా కార్యక్రమాలను తప్పనిసరి భాగంగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘వక్ఫ్ బై యూజర్’ సూత్రం ఆధారంగా ప్రభుత్వ ఆస్తులు, భూములపై ఎవరూ హక్కులు కోరలేరని అన్నారు. వక్ఫ్ బై యూజర్ నిబంధనను అడ్డం పెట్టుకొని వక్ఫ్ ఆస్తులను రాష్ట్రాలు బలవంతంగా లాక్కోలేవని చెప్పారు. దీనిపై ఆందోళన అవసరం లేదని వివరించారు. వక్ఫ్ బై యూజర్ అనేది ప్రాథమిక హక్కు కాదని, ఇది శాసన వ్యవస్థ తీసుకొచ్చిన నిబంధన అని గుర్తుచేశారు. దాన్ని తొలగించే అధికారం కూడా శాసన వ్యవస్థకు ఉందన్నారు. ప్రభుత్వ భూములపై ఎవరికీ హక్కు ఉండదని అన్నారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వం కచ్చితంగా రక్షించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములతోపాటు వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 14 కోట్ల మంది పౌరుల తరఫున వక్ఫ్ ఆస్తులకు ప్రభుత్వం సంరక్షకురాలిగా వ్యవహరిస్తోందని ఉద్ఘాటించారు. వక్ఫ్(సవరణ) చట్టం ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్(సీడబ్ల్యూసీ)తోపాటు స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారంటూ ఆందోళన చెందడం అర్థరహితమని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీలో మొత్తం 22 మంది సభ్యులను నియమించే అవకాశం ఉందని, అందులో ముస్లిమేతరులు గరిష్టంగా నలుగురు మాత్రమే ఉంటారని వెల్లడించారు. ఇక స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 11 మంది సభ్యులకు అవకాశం ఉండగా, అందులో ముస్లిమేతరులు ముగ్గురు మాత్రమేనని వివరించారు. ఎక్ఫ్–అఫీషియో సభ్యులు ముస్లిమేతరులు అయితే సభ్యులుగా ఇద్దరు ముస్లిమేతరులకే స్థానం దక్కుతుందని పేర్కొన్నారు. వక్ఫ్(సవరణ) చట్టంతో ముస్లిమేతరులు కూడా ప్రభావితం అవుతు న్నారు కాబట్టి వారిని సభ్యులు నియమించే నిబంధన తీసుకొచ్చినట్లు తెలియజేశారు. ఈ చట్టంపై వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి. -
‘నన్ను పెళ్లి చేసుకోవా’.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan) ఐఎస్ఐ (isi)కు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి. వీరి విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది.అంతేకాదు వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్ చాటింగ్‌ను గుర్తించారు. ఆ చాటింగ్‌లో ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని (Get Me Married) జ్యోతి మల్హోత్రా కోరినట్లు తెలిపారు. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని,కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా, అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించివే అని నిర్ధారించారు.దుబాయ్ నుంచి డబ్బులువాట్సప్ చాట్‌తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్దిక లావాదేవీలపై కన్నేశారు. ఆమెకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉండగా..అందులో ఒక అకౌంట్‌కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసుల అదుపులో పలువురుభారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత భద్రత వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్‌కు చెందిన సైనిక రహస్యాల్ని పాక్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశానికి చెందిన 10మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని తేలింది. -
పూజా ఖేడ్కర్ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు బెయిల్ మంజూరైంది. నకిలీ సర్టిఫికెట్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. పూజ హంతకురాలో, తీవ్రవాదో కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రత, వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఇప్పుడు పూజ అన్నీ కోల్పోయింది.. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదన్న ధర్మాసనం.. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సూచించింది. కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్‌కు ఎంపికైన పూజ ఖేడ్కర్‌ను శిక్షణ నుంచి యూపీఎస్సీ తొలగించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో గత ఏడాది ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది.అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ
సాక్షి, ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియా, రాహుల్ గాంధీ వాడుకున్నారని తెలిపింది. నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ అంశంపై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం జరిగిన విచారణలో భాగంగా ఈడీ వాదన వినిపించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారని ఈడీ తెలిపింది. AJLకి రూ.50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే , సామ్ పిట్రోడా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. సోనియా, రాహుల్ యంగ్ ఇండియన్ కంపెనీలో 76% వాటాను కలిగి ఉన్నారు.నిందితులు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తి నుండి వచ్చే అద్దె కూడా తీసుకున్నారు. నిందితులు నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశాం. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు, వారు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోవడం కూడా మనీలాండరింగ్‌గా పరిగణించాలి. ఈ క్రమంలో వచ్చిన డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. ప్రాథమికంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేశాం’ అని చెప్పుకొచ్చింది.మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాపై ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని జూలైకి విచారణకు వాయిదా వేయాలని కోరారు. సింఘ్వీ అభ్యర్థనను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు.The Rouse Avenue Court began hearing the National Herald money laundering case. Notices were issued to Sonia Gandhi, Rahul Gandhi, Sam Pitroda, and others.Special counsel for ED, Zoheb Hossain submitted that the property derived from any criminal activity is a proceed of crime.…— ANI (@ANI) May 21, 2025ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. -
ఉరుముతున్న ఉష్ణోగ్రతలు
శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరిగిపోతుండడం, తద్వారా వాతావరణ మార్పులు సంభవిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశంలో 57 శాతం జిల్లాలు అధికం నుంచి అత్యధిక హీట్ రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు ఢిల్లీకి చెందిన వాతావరణ సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్(సీఈఈడబ్ల్యూ) వెల్లడించింది. దేశంలోని మొత్తం జనాభాలో ఏకంగా 76 శాతం మంది ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కొంటున్నట్లు తేల్చిచెప్పింది.ఈ మేరకు మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హీట్ రిస్క్ అత్యధికంగా ఉన్నట్లు తెలియజేసింది. గత పదేళ్లలో అత్యధిక వేడి కలిగిన పగటి దినాల కంటే అత్యధిక వేడి కలిగిన రాత్రి దినాల సంఖ్య వేగంగా పెరిగినట్లు వివరించింది. ⇒ అధ్యయనంలో భాగంగా సీఈఈడబ్ల్యూ సంస్థ 734 జిల్లాలకు సంబంధించిన హీట్ రిస్క్ ఇండెక్స్(హెచ్ఆర్ఐ)ను అభివృద్ధి చేసింది. ఇందుకోసం 1982 నుంచి 2022 వరకు.. 40 ఏళ్ల వాతావరణ గణాంకాలు, ఉపగ్రహా చిత్రాలు ఉపయోగించుకుంది. ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, జల వనరులు, భూవినియోగం, పచ్చదనం తదితర అంశాలను అధ్యయనం చేసింది. ⇒ జనాభా, భవనాలు, ఆరోగ్య, సామాజిక–ఆర్థిక అంశాలు, పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ వంటి అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంది. ⇒ 734 జిల్లాలకు గాను 417 జిల్లాలు హై నుంచి వెరీ హై రిస్క్ కేటగిరీల్లో ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇందులో 151 జిల్లా హై రిస్క్, 266 జిల్లాలు వెరీ హై రిస్క్ విభాగంలో ఉన్నాయి. 201 జిల్లాలు సాధారణ, 166 జిల్లాలు తక్కువ లేదా అతి తక్కువ హీట్ రిస్క్ విభాగాల్లో నిలిచాయి. ⇒ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా తక్కువగా ఉన్నట్లయితే దాని అర్థం వేడి వల్ల ముప్పు లేనట్లు కాదని, సీఈఈడబ్ల్యూ స్పష్టంచేసింది. ఇతర జిల్లాల కంటే కొంత తక్కువగా ఉన్నట్లు మాత్రమే భావించాలని పేర్కొంది. ⇒ దేశంలో అధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు పెరుగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు అంతకంటే ఎక్కువగా పెరుగుతుండడం గమనార్హం. అంటే మనుషులకు ముప్పు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నట్లే లెక్క. ⇒ ఉష్ణోగ్రతలు అత్యధికంగా మనుషులు తట్టుకోలేరు. అది ప్రమాదకరమే. శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాలు అధికంగా నమోదవుతున్నాయి. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్టే ఇందుకు కారణం. ⇒ 10 లక్షలకుపైగా జనాభా ఉన్న జిల్లాలతోపాటు ముంబయి, బెంగళూరు, భోపాల్, జైపూర్, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాల సంఖ్య భారీగా పెరిగింది. ⇒ చల్లగా ఉండే హిమాలయా ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య పెరుగుతోంది. సున్నితంగా ఉండే పర్వత ప్రాంత భౌగోళిక స్థితిగతులను ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ⇒ జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌లో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య 15 చొప్పున పెరిగింది. ఈ ప్రతి ఏటా వేసవిలో ఈ పెరుగుదల కనిపిస్తోంది. ⇒ ఉత్తర భారతదేశంలో వేసవి తేమ గత పదేళ్లలో 30–40 శాతం నుంచి 40–50 శాతం పెరిగింది. ⇒ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 2030 నాటికి 3.5 కోట్ల ఉద్యోగాలను కోల్పోతామని, జీడీపీలో 4.5 శాత తగ్గుదల నమోదవుతుందని సీఈఈడబ్ల్యూ అధ్యయనం అంచనా వేసింది. ⇒ ఇండియాలో 2024లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 45,000కుపైగా గుండెపోటు కేసులు నమోదయ్యాయి. 159 మరణాలు సంభవించాయి. ఇవన్నీ అధికారికంగా నమోదైన గణాంకాలే. నమోదు కానివి ఇంకెన్నో ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Covid-19: మళ్లీ కోవిడ్ కలవరం
ముంబై: ఐదేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ కలవర పెడుతోంది. మంగళవారంనాటికి దేశంలో 257 కోవిడ్ కేసులు నమోదవ్వగా ముంబైలోనే 53 కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లోనే 164 కేసులు పెరిగాయి. క్రియాశీలక కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మరణాలేవీ సంభవించలేదు. ముంబైలో కేసులు పెరుగుతుండటంతో నగరంలోని ఆస్పత్రులు కోవిడ్ రోగుల చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.ప్రజల్లో ఆందోళన పెరుగుతుండటంతో, భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ప్రజల్లో రోగ నిరోధక శక్తి బలపడిందని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని తెలిపారు. పరిస్థితి సాధారణంగానే ఉందని, అయిన ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. రోగుల సంఖ్య పెరిగినా మునుపటిలా భయపడాల్సిన అవసరం లేదని, ఈ ఇన్ఫెక్షన్తో అంత ప్రమాదం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రకాశ్ అబిత్కర్ చెప్పారు. కేంద్రం సూచనలు జారీ చేస్తే తప్ప కరోనాకు సంబంధించి ముందు జాగ్రత్తలు అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. -
మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు!
న్యూఢిల్లీ: రైతాంగానికి శుభవార్త. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళకు చేరుకొనే అవకాశం ఉందని భారత వాతవరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. పరిస్థితులు అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ గతంలో ప్రకటించింది. కానీ, అంతకంటే రెండు రోజుల ముందే రానున్నాయని మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి తాజాగా అంచనా వేసింది. అదే జరిగితే 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు త్వరగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది.2009లో మే 23న కేరళలో అడుగుపెట్టాయి. సాధారణంగా ఈ రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1వ తేదీ కల్లా కేరళలో ప్రవేశిస్తాయి. జూన్ 8 నాటికి దేశమంతటా వ్యాపిస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాల ప్రభావం తగ్గడం మొదలవుతుంది. అక్టోబర్ 15 కల్లా పూర్తిగా తగ్గిపోతుంది. అయితే, ఈసారి దాదాపు ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తుండడంవిశేషం. 2018లో మే 29, 2019లో జూన్ 8, 2020లో జూన్ 1, 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న రుతుపవనాలు కేరళలో అడుగుపెట్టాయి.ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. ఎల్–నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు లేవని తెలియజేసింది. భారత్‌లో వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా జలాశయాలు నిండడానికి, విద్యుత్ ఉత్పత్తికి ఇవి దోహదపడుతుంటాయి. దేశంలో 42.3 శాతం జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారం. దేశజీడీపీలో ఈ రంగం వాటా 18.2%నైరుతి రుతుపవనాల రాక కంటే ముందు దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాదిన ఈ పరిణామం కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మరో రెండు రోజుల్లో తుపానుగా మారనుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనవల్ల నైరుతి రుతుపవనాలు కేరళ దిశగా వేగంగా ముందుకు కదులుతాయని అంటున్నారు. ఉత్తర కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్, కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, పాలక్కాడ్, మలప్పురం, త్రిసూర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. -
ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా!
చండీగఢ్/న్యూఢిల్లీ: ఇండియన్ అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)(33)ను వాడుకుందా? నిజమేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ హ్యాండ్లర్ అలీ హసన్‌తో వాట్సాప్‌లో జ్యోతి చేసిన చాటింగ్‌లను వెలికి తీశారు. ఇద్దరి మధ్య కోడ్ భాషలో ఈ చాటింగ్‌లు జరిగాయి. ఒక చాటింగ్‌ను పరిశీలిస్తే.. భారత అండర్‌కవర్ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి అలీ హసన్ ఆమెను ప్రశ్నించాడు.భారత్–పాక్ సరిహద్దు అయిన అటారీ బోర్డర్‌ను సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్ ఉన్న అండర్‌కవర్ ఏజెంట్లను చూశావా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. ప్రోటో కాల్ అందుకున్నవారే అండర్ కవర్ ఏజెంట్లు కావొ చ్చు అని అలీ హసన్ చెప్పగా, అలాంటి వారిని తాను చూడలేదని పేర్కొంది. భారత నిఘా ఏజెంట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికి జ్యోతిని అస్త్రంగా ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్ఐ కోసమే పని చేస్తున్నట్లు ఆమెకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌కు సంబంధించిన భారీ గూఢచార ముఠాలో ఆమె ఒక కీలక సభ్యురాలని నిర్ధారణకు వచ్చారు. జ్యోతి తొలిసారిగా 2023లో బైశాఖి పండుగ సమయంలో పాకిస్తాన్లో పర్యటించింది. ఈ సరిహద్దులు ఇంకా ఎన్నాళ్లో.. జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. ఆమె తన ఆలోచనలు, పర్యటనల గురించి ఇందులో రాసుకుంది. పాకిస్తాన్ ప్రస్తావన సైతం ఉంది. డైరీలో 11 పేజీల్లో రాయగా.. 8 పేజీల్లో సాధారణ అంశాలు, 3 పేజీల్లో పాకిస్తాన్ గురించి హిందీ, ఇంగ్లిష్ భాషలో రాతలు కనిపిస్తున్నాయి. ‘‘పాకిస్తాన్ ప్రజల ఆదరణ, వారి అతిథి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్లో భారతదేశ హిందువుల పర్యటనలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌లోని తమ పూరీ్వకుల గ్రామాలను హిందువులు సందర్శించాలి.అక్కడి హిందూ ఆలయాలు, గురుద్వారాలకు సులువుగా వెళ్లొచ్చే పరిస్థితులు రావాలి. 1947లో దేశ విభజన తర్వాత విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుంది. పాకిస్తాన్లో పది రోజుల పర్యటన పూర్తి చేసుకొని ఈ రోజే ఇండియాకు తిరిగొచ్చా. రెండు దేశాల మధ్య ఈ సరిహద్దులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. బాధపడే హృదయాలకు ఉపశమనం కలగాలి. మనమంతా ఒకే దేశం, ఒకే నేలకు చెందినవాళ్లం’’ అని జ్యోతి తన డైరీలో రాసుకుంది. మరోవైపు ఆమె కశీ్మర్ పర్యటనల వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.అర్ధరాత్రి పొద్దుపోయే దాకా పనిచేయడం ఆమెకు అలవాటు అని గుర్తించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వీడియోలను ఎడిటింగ్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేదని చెప్పారు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి మరోచోటుకి వెళ్లినట్లు గుర్తించారు. జ్యోతి వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. తన బిడ్డ సంగతి తనకు తెలియదని, దీనిపై తనను ఏమీ ప్రశ్నించవద్దని జ్యోతి తండ్రి స్పష్టం చేశారు. నిందితురాలిపై ప్రశ్నల వర్షంయూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం రాబట్టానికి భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆమె పాకిస్తాన్, చైనాతోపాటు ఇతర దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 16న ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో గత రెండు వారాల్లో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఆదాయానికి, ఖర్చులకు పొంతనేదీ?ఇదిలా ఉండగా, నిందితురాలు జ్యోతి మల్హోత్రా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరిని కలిసిందీ పూర్తి వివరాలు తెలిస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తామని, దానివల్ల దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారానే తనకు ఆదాయం వస్తోందని నిందితురాలు చెబుతుండగా, అధికారులు విశ్వసించడం లేదు. ఆమెకు వచ్చిన ఆదాయానికి, విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులకు పొంతన లేదని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివరాలు కూపీ లాగుతున్నారు.జ్యోతి ల్యాప్‌టాప్‌పై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని అధికారులు చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య నాలుగు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేసే ఓ అధికారిని తరచుగా కలిసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. సోషల్ మీడియా ద్వారా జనంలో గుర్తింపు పొందినవారిని నియమించుకొని, దేశ రహస్యాలు కొల్లగొట్టడం ఆధునిక యుద్ధరీతిలో ఒక భాగంగా మారిందని తెలిపారు. -
25 మందిని వివాహం చేసుకున్న యువతి.. 26వ పెళ్లితో
జైపూర్: పెళ్లి పేరుతో అమాయికుల్ని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 25మందిని పెళ్లి చేసుకున్న నిత్యపెళ్లి కూతురు 26వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. పోలీసులకు అడ్డంగా దొరికి పోయింది.వివరాల్లోకి వెళ్లితే.. రాజస్తాన్‌కు చెందిన యువతి అనురాధా పాస్వాన్ది కడుపేదరికం, ఒంటరి జీవితం, నిరుద్యోగైన తమ్ముడు బాధ్యతను తానే చూసుకోవాలి. పెళ్లి చేసుకునేందుకు చేతిలో డబ్బు లేదు. వెరసీ.. పేదరికం నుంచి బయటపడేందుకు కతర్నాక్ ప్లాన్ వేసింది. తనకున్న అందం, తెలివితేటలతో పెళ్లి పేరుతో వరుస మోసాలకు పాల్పడింది.పెళ్లి చేసుకోవడం. ఆపై అత్తారింట్లో అనుకువగా ఉండటం. వారిని తన మాటలతో నమ్మించి ఇంట్లో ఉన్న బంగారం,డబ్బులు,ఖరీదైన వస్తువుల్ని అందినకాడికి దోచుకోవడం పరారవ్వడం. పేరు మార్చి, మకాం మార్చడం మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇలా తక్కువ సమయంలో 25మందిని వివాహం చేసుకుంది.ఇందుకోసం తానే ఓ గ్యాంగ్‌ను నడుపుతోంది. అమాయకులు, పెళ్లి కుమార్తె కోసం అన్వేషిస్తున్న వారి ఇంటికి తన గ్యాంగ్‌లోని మనిషిని పంపిస్తోంది. ఈ గ్యాంగ్ ఆమె ఫోటోలు, ప్రొఫైల్‌ను పెళ్లి కుమారులకు చూపిస్తారు. అనంతరం, పెళ్లికి ఒప్పిస్తారు. ఇందుకు గాను పెళ్లి కుమార్తెను చూసినందుకు పెళ్లి కుమారుడి కుటుంబం నుంచి రూ.2లక్షలు వసూలు చేస్తారు. పెళ్లి తర్వాత ప్లాన్ ప్రకారం.. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అనురాధా పాస్వాన్ అత్తింటి వారితో అనుకువగా మెసులుతుంది. ఇంట్లో ఉన్న బంగారాన్ని ఉడాయించాలనుకుంటే వెంటనే తన ప్లాన్‌లో భాగంగా కట్టుకున్న భర్త, ఇతర కుటుంబసభ్యులు తినే ఆహారంలో మత్తు మందు కలుపుతుంది. మత్తు మందు కలిపిన ఆహారం తిన్న కుటుంబ సభ్యులు ఆపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను కాజేస్తుంది.ఇప్పటివరకు 25 మందిని బురిడీ కొట్టించింది. ఈ క్రమంలో అనురాధా పాస్వాన్ చేతిలో మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె రూట్లోనే వెళ్లారు. నిత్యపెళ్లి కుమార్తెను, ఆమె ముఠా గుట్టురట్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు
చండీఘడ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లు వినియోగించినట్లు తేలింది. ఎన్ఐఏ విచారణలో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్‌గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే? ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేదని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం,ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాన్ దార్‌తో సన్నిహితంగా ఉండడంతో మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.గూఢచర్యం కేసులో ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్లో పర్యటన, ఐఎస్ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది. -
సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులపై విచారణకు ముందస్తు అనుమతి ఎందుకు?
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల్లో న్యాయ విచారణల నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఉన్న రక్షణకు సంబంధించి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై అభియోగాలు వచ్చినప్పుడు విచారించేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. అందుకు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల కేసును ప్రస్తావించారు. ‘‘అది బయటపడి రెండు నెలలవుతోంది. అయినా జస్టిస్ వర్మపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. పైగా దానిపై విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ సాక్షుల నుంచి కేసుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. అలా ఎలా చేస్తారు? ఇది చాలా తీవ్రమైన అంశం’’ అంటూ మండిపడ్డారు. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదులో ఇంత ఆలస్యం ఎందుకని ధన్‌ఖడ్ ప్రశ్నించారు. ‘‘ఆయన నివాసంలో బయటపడ్డ డబ్బెంత, దాని మూలా లేమిటి, అది ఎవరికి చెందినది, ఈ ఉదంతం న్యాయవ్యవస్థనే కలుషితం చేసిందా వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రజలంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. దీని వెనక దాగున్న పెద్ద తిమింగలాలెవరో కనిపెట్టి బయట పెట్టాల్సిన అవసరముంది. దేశ పౌరులందరికీ సమానంగా వర్తించే నేరన్యాయ వ్యవస్థను ఇంత కీలకమైన కేసుకు ఎందుకు వర్తింపజేయలేదు?’’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. రెండు నెలలు దాటుతున్నా ఈ ప్రశ్నల్లో వేటికీ ఇప్పటిదాకా బదులు లేదన్నారు. ‘‘జస్టిస్ వర్మ కేసులో సత్వర విచారణ జరగాల్సిన అవసరముంది. 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన కె.వీరాస్వామి తీర్పును పునఃపరిశీలించాల్సిన సమయం కూడా వచ్చింది’’ అని ధన్‌ఖడ్ అన్నారు. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నోట్లకట్టలు బయటపడటం నిజమేనని కమిటీ తేల్చడం, సీజేఐ ఆ నివేదికను రాష్ట్రపతికి పంపడం, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేయడం తెలిసిందే.పారదర్శక నియంత్రణ వ్యవస్థ కావాలిదురుద్దేశపూర్వక ఆరోపణలు తదితరాల నుంచి ఉన్నతస్థాయి న్యాయమూర్తులకు తప్పకుండా రక్షణ కల్పించాల్సిందేనని ధన్‌ఖడ్ అభిప్రా యపడ్డారు. అయితే ఈ విషయంలో సమగ్రమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థ కూడా అత్యంత అవసరమని స్పష్టం చేశారు. అది పూర్తి పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, వేగవంతంగా ఉండాలని సూచించారు. ‘‘జస్టిస్ వర్మ ఉదంతంపై ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక హైకోర్టు న్యాయమూర్తితో సీజేఐ ఒక కమిటీ వేశారు. నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు వారెంతగా శ్రమించి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. కానీ వారి కమిటీకి ఎలాంటి రాజ్యాంగబద్దతా, చట్టబద్దతా లేవు. వారిచ్చే నివేదికను సుప్రీంకోర్టు సొంతంగా ఏర్పాటు చేసుకుని పాలనపమైన ఏర్పాటును అనుసరించి ఎవరికైనా పంపవచ్చు. ఇక ఆ నివేదిక ప్రయోజనమేమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ఏమిటా తీర్పు?సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు అవినీతి నిరోధక చట్టాల వర్తింపు విషయమై కె.వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1991లో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ‘‘న్యాయమూర్తులు కూడా ప్రజా సేవకులే. కానీ ఆ చట్టం ప్రకారం వారిని విచారించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి’’ అని పేర్కొంది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలంటే ఇది తప్పనిసరి తెలిపింది. -
మొసలి కన్నీళ్లు వద్దు
న్యూఢిల్లీ: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యల కేసులో మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా క్షమాపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘‘న్యాయ విచారణ నుంచి బయటపడేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నట్లు నటిస్తారు. మొసలి కన్నీరు కారుస్తారు. మీ క్షమాపణ అలాగే ఉంది. హైకోర్టులో మీరు క్షమాపణలు చెప్పిన వీడియో చూశాం. ఏదో కోర్టు అడిగింది కదా అని చెబుతున్నట్లుగా ఉంది. సూటిగా తప్పు ఒప్పుకుంటూ నేరుగా క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. కానీ మీరేం చేశారు? అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వాటివల్ల ఎవరైనా బాధ పడి ఉంటే అంటూ నానా వంకలూ తిప్పారు. ఇదెక్కడి క్షమాపణ? తప్పు ఒప్పుకునే పద్ధతేనా ఇది? ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు’’ అంటూ తూర్పార బట్టింది. ‘‘నిజాయితీగా, మన స్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఎందుకు? మీ వ్యాఖ్యలతో యావత్ దేశం సిగ్గుపడుతోంది’’ అంటూ తీవ్రంగా మందలించింది. ఈ విషయంలో మంత్రిని అత్యున్నత న్యాయస్థానం గత వారమే తీవ్రంగా మందలించడం, కల్నల్ ఖురేషీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో మంత్రి క్షమాపణలు చెప్పారు. తనపై కేసు కొట్టేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మంత్రి క్షమాపణలు చెప్పిన తీరుపై జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘అలాంటి మొసలి కన్నీళ్లు వద్దు. కనుక మీ క్షమాపణలు అవసరం లేదు. మీలాంటి వాళ్ల విషయంలో ఎలా వ్యవహరించాలో మాకు బాగా తెలుసు’’ అని స్పష్టం చేశారు. ‘‘మీరో సీనియర్ రాజకీయ నాయకుడు. చాలా ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. తద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ మీరేం చేశారు? కల్నల్ ఖురేషీపై వ్యాఖ్యల వీడియో పూర్తిగా చూశాం. మీరు దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మరింత అభ్యంతరకర పదజాలం కూడా వాడబోయారు. సమయానికి పదాలు దొరక్క ఆగిపోయారంతే! మన సైన్యం ఘనతను చూసి దేశమంతా గర్విస్తుంటే మీరేమో ఇలాంటి మతిలేని మాటలకు దిగారు. ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు!’’ అంటూ మండిపడ్డారు.సిట్‌లో మహిళా ఐపీఎస్మంత్రి వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపైన ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. దర్యాప్తు ప్రగతిపై పోలీసులను ప్రశ్నించి వారి సమాధానంపై పెదవి విరిచింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లతో సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. ‘‘మంగళవారం ఉదయం పదింటికల్లా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటవ్వాలి. ముగ్గురు ఐపీఎస్‌లూ రాష్ట్రానికి చెందని వారై ఉండాలి. ఒక మహిళా ఐపీఎస్ ఉండాలి. మే 28లోగా సిట్ తొలి నివేదిక సమర్పించాలి’’ అని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరిగా వర్ణిస్తూ విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది.దేశం ధర్మసత్రం కాదు శరణార్థులకు ఆశ్రయం కుదరదుశ్రీలంకవాసి కేసులో ‘సుప్రీం’ వ్యాఖ్యలుశరణార్థులు దేశం వీడాలని ఆదేశంన్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ధర్మసత్రమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లో ఆశ్రయం ఓ శ్రీలంక శరణార్థి పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భారత్ ఇప్పటికే 140 కోట్లకు పైగా జనాభాతో సతమతమవుతోంది. శరణార్థులకు ఆశ్రయమివ్వడానికి దేశం ధర్మసత్రం కాదు’’ అని పేర్కొంది. శరణార్థులు తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. వారికి భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2015లో అరెస్టయిన శ్రీలంకవాసి పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రాథమిక హక్కుల్లో భాగంగా పిటిషనర్‌కు స్వేచ్ఛగా జీవించే హక్కుందని ఆయన తరఫున లాయర్ వాదనను జస్టిస్ దీపాంకర్ దత్తా తోసిపుచ్చారు. ఆ హక్కు భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎల్టీటీఈ కార్యకర్త అనే అనుమానంతో పిటిషనర్ 2015లో అరెస్టయ్యాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిషేధ) చట్టం కింద దోషిగా తేలడంతో 2018లో పదేళ్ల జైలు శిక్ష పడింది. 2022లో మద్రాస్ హైకోర్టు దాన్ని ఏడేళ్లకు తగ్గించింది. శిక్ష ముగియగానే భారత్ వీడాలని, అప్పటిదాకా శరణార్థి శిబిరంలో ఉండాలని ఆదేశించింది. వాటిని సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ‘‘2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్టీటీఈ సభ్యుడిగా పోరాడినందున అక్కడ నన్ను బ్లాక్ గెజిటెడ్‌గా ఉంచారు. కనుక శ్రీలంకలో నాకు ప్రాణహాని ఉంది. నా భార్య పలు వ్యాధులతో, కుమారుడు పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుతో బాధపడుతున్నారు. వారు భారత్‌లోనే స్థిరపడ్డారు. నేను కూడా వారితో పాటు ఇక్కడే ఉండిపోతా’’ అని అభ్యర్థించాడు. శ్రీలంకలో ప్రాణహాని ఉందని వాదించాడు. దానితో జస్టిస్ దత్తా పూర్తిగా విభేదించారు. ‘‘అయితే మాత్రం ఇక్కడ స్థిరపడేందుకు మీకేం హక్కుంది? మరే దేశమైనా వెళ్లండి’’ అని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. రోహింగ్యా శరణార్థుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ‘‘ఐరాస శరణార్థుల కార్డుల వంటివి ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్రమంగా దేశంలోకి చొరబడి ఉంటే తిప్పి పంపించేయాల్సిందే’’ అని ఆదేశించింది. -
‘మిమ్మల్ని క్షమాపణలు ఎవరు అడిగారు?’
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో కీలక భూమిక పోషించిన కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు(సోమవారం, మే 19) విచారణలో భాగంగా విజయ్ షా చెప్పిన క్షమాపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.‘క్షమాపణలు ఏమిటి..?, అవి ఏ రకమైన క్షమాపణలు. క్షమాపణలు చెబుతున్నామంటే దానికి ఎంతో కొంత అర్థం ఉండాలి. ఇది విచారణ నుంచి బయటపడటానికి కార్చే మొసలి కన్నీరా?, మీకు ఎలాంటి క్షమాపణ ఉంది?, మిమ్మల్ని కోర్టు క్షమాపణలు చెప్పమని అడిగిందా?, మరి ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు?, మీరు ఆ మహిళా అధికారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు నిజాయితీగా క్షమాపణలు కోరిన సందర్భం ఏమైనా ఉందా?, మరి ఇక్కడ ఎందుకు మాకు క్షమాపణలు చెబుతున్నారు?’అంటూ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. అదే సమయంలో విజయ్ షాపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన స్సెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ సిట్ ను రేపటి(మంగళవారం) ఉదయానికల్లా ఏర్పాటు చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. ఒక మహిళా అధికారిని నియమించి మే 28 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.అసలేమిటీ వివాదం? మంత్రి విజయ్ షా గత మంగళవారం(మే 13వ తేదీ)ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు.అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
షాషీ జామా మసీదులో సర్వే కొనసాగుతుంది: అలహాబాద్ హైకోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న షాషీ జామా మసీదు సర్వేలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలన్న 2024 నవంబర్‌లో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలని కోరుతూ ముస్లీం సంస్థ ప్రతినిధులు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (మే19) అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులు నిలిపివేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసింది. సర్వే కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
శరణార్థులపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: శ్రీలంక శరణార్థుల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక శరణార్థులు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్‌పై సోమవారం(మే 19 వ తేదీ) విచారించిన ధర్మాసనం... విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని స్సష్టం చేసింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలా? భారత్‌లో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ధర్మశాల కాదు. వెంటనే దేశంలోని శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలమ్ కోసం పోరాడిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ సానుభూతి పరుడైన శ్రీలంక జాతీయుడైన పిటిషనర్ మరో ఇద్దరు నిందితులతో కలిసి దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో 2015లో ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో పిటిషనర్‌ను దోషిగా పరిగణలోకి తీసుకున్న న్యాయ స్థానం 2018లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)కింద పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష కొనసాగుతున్న సమయంలో 2022లోమద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించడమే కాకుండా, శిక్ష పూర్తయ్యాక వెంటనే భారత్ నుండి వెళ్లాలని, ఇక్కడ ఉండకూడదనే సూచించింది. మద్రాస్ ఇచ్చిన నాటి తీర్పుతో పిటిషనర్ మరికొద్ది రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంది.India is not a "dharamshala" that can entertain refugees from all over the world, the Supreme Court orally observed, while refusing to interfere with the detention of a Sri Lankan Tamil national.Read more: https://t.co/LhaVOoiHtu#SupremeCourt pic.twitter.com/6fZD2EoiRq— Live Law (@LiveLawIndia) May 19, 2025 మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కానీ తాను, భారత్‌ను విడిచి శ్రీలంకకు వెళ్లలేనని, తనని ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా, కృష్ణన్ వినోద్ చంద్రన్ (K. Vinod Chandran) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే19) విచారణ చేపట్టింది. భారత్ ధర్మశాల కాదువిచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదు. శరణార్థులకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వలేం. వెంటనే శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. మద్రాస్‌కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’అనంతరం, పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. పిటిషనర్ శ్రీలంక జాతీయుడు. శ్రీలంక నుంచి భారత్‌కు వీసాతో వచ్చాడు. తన దేశంలో ప్రాణ భయముందని అన్నారు. పిటిషనర్ మూడేళ్లపాటు జైలు కస్డడీలో ఉన్నారని, ఆ సమయంలో అతని దేశం నుంచి పంపించేందుకు ఎలాంటి చర్య తీసుకోలేదని ప్రస్తావించారు. పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనలపై సుప్రీం జస్టిస్ దీపాంకర్ దత్తా..‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’ అని ప్రశ్నించారు.భారత్ కాకుండా వేరే దేశంలో స్థిరపడండిఅందుకు.. పిటిషనర్ న్యాయవాది స్పందిస్తూ.. ‘అతను శరణార్థి. అతని భార్య, పిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని ప్రకటించారు. పిటిషనర్ శ్రీలంకకు వెళితే తనకు ప్రాణ హాని ఉందన్న పిటిషనర్ అభ్యర్థనపై జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. పిటిషనర్‌కు తన దేశంలో ప్రాణ భయం ఉందని అన్నారు కదా.. భారత్‌యేతర దేశంలో స్థిరపడండి’ అని వ్యాఖ్యానించారు. సారీ.. దేశం విడిచి వెళ్లాల్సిందేఅదే సమయంలో పిటిషనర్ 2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్టిటి సభ్యుడిగా పాల్గొన్నట్లు చెప్పారు. అందువల్ల తాను శ్రీలంకకు వెళితే మళ్లీ అరెస్ట్ అవ్వడంతో పాటు, తన ప్రాణానికి అపాయం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. తన భార్య ఆరోగ్యపరమైన కారణాలతో బాధపడుతుండగా, తన కుమారుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. చివరిగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్ధించింది. శ్రీలంకకు వెళ్లే అవసరం లేకుండా భారత్‌లో స్థిరపడేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది. -
కాంగ్రెస్ మిమ్మల్ని అవమానిస్తోందా?.. ఎంపీ శశి థరూర్ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్రభుత్వం తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శశిథరూర్ స్పందించారు. ‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్‌ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్రశ్నకు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు. దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై భారత్ ప్రారంభించిన దౌత్య యుద్ధం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్‌కు, థరూర్‌కు మధ్య ఇటీవల దూరం పెరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ పట్ల ఆయన సానుకూలంగా మాట్లాడుతుండడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఏడు బృందాలకు సారథ్యం వహించే నేతల పేర్లను కేంద్రం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్చార్జి జైరామ్ రమేశ్ స్పందించారు. తాము ప్రతిపాదించని వ్యక్తిని ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్ గాందీతో మాట్లాడారు. విదేశాలకు పంపించే ప్రతినిధి బృందాల్లో నియమించడానికి నలుగురు ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని కోరారు. దాంతో రాహుల్ గాంధీ మా పార్టీ నుంచి ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నజీర్ హుస్సేన్, అమరీందర్‌సింగ్ రాజా వారింగ్ పేర్లను ప్రతిపాదిస్తూ కిరణ్ రిజిజుకు లేఖ రాశారు’’అని జైరామ్ రమేశ్ చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌కు దూరం! శశి థరూర్ వైఖరి కొన్ని నెలలుగా కాంగ్రెస్ పారీ్టలో చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్య చేసుకోవడం పట్ల బీజేపీని విపక్షాలన్నీ తప్పుపట్టగా, శశి థరూర్ మాత్రం వెనుకేసుకొ చ్చారు. ఆయన లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్ నాయకు లు మండిపడ్డారు. కానీ, ఒక భారతీయుడిగా తన సొంత అభిప్రాయాలు వెల్లడించానని, తన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని థరూ ర్ వివరణ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తో శశి థరూర్ వేదిక పంచుకున్నారు. తమను ఒకే వేదికపై చూసి కొందరికి నిద్ర పట్టదని కూడా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గొప్ప గౌరవంగా భావిస్తున్నా: థరూర్ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. ‘‘నా సేవలు అవసరమని కేంద్రం భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నా. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం నా వంతు సేవలు కచ్చితంగా అందిస్తా.. జైహింద్’’అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
అంబేడ్కర్ భావజాలమే ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావజాలమే నాకు ఆదర్శం. ఆయన మార్గమే నన్ను సీజేఐగా నిలబెట్టింది’’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ తెలిపారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) శనివారం ఘనంగా సన్మానించింది. యువ న్యాయవాది నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగేదాకా తన న్యాయ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను సీజేఐ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘చిన్నతనంలో నాకు ఆర్కిటెక్ట్ కావాలనే కోరిక ఉండేది. కానీ అంబేడ్కర్ ఆశయ సాధన, ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకతను తండ్రి సూచించడంతో న్యాయ వృత్తిని ఎన్నుకున్నా. న్యాయమూర్తిగా అవకాశం వచి్చనప్పుడు స్వీకరించాలా వద్దా అన్న మీమాంసలో పడ్డా. న్యాయవాదిగానే కొనసాగితే ఎంతో డబ్బు సంపాదించవచ్చని చాలామంది సలహా ఇచ్చారు. అది నిజమే అయినా న్యాయమూర్తిగా అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి సామాజిక, ఆర్థిక న్యాయ సాధనకు కృషి చేయొచ్చని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆయన మాటలకు కట్టుబడి న్యాయమూర్తిగా మారాను. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడెంతో సంతోషిస్తున్నా’’అని చెప్పారు. ఖాళీలను భర్తీ చేయాలి న్యాయ నియామకాల్లో వైవిధ్యం పెరగాల్సిన అవసరాన్ని జస్టిస్ గవాయ్ నొక్కిచెప్పారు. ఆ పదవులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి మహిళలను వీలైనంత ఎక్కువగా సిఫార్సు చేయాలని హైకోర్టులకు సూచించారు.‘‘ఈ విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడా మాట్లాడాను. జడ్జి నియామకాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు వారి హైకోర్టుల్లో లేని పక్షంలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిభావంతుల నుంచి ఎంపిక చేసుకోవాలని సూచించాను. ఈ విషయంలో కొంతమేరకు సఫలీకృతమయ్యాం కూడా’’అని వెల్లడించడంతో ఆహూతులు చప్పట్లతో అభినందించారు. వాగ్దానాలు నా నైజం కాదు సీజేఐ అయ్యాక చాలా మీడియా సంస్థలు తన ఇంటర్వ్యూ అడుగుతున్నట్టు జస్టిస్ గవాయ్ చెప్పారు. ‘‘కానీ ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడే కాదు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచీ మీడియాకు దూరంగానే ఉండేవాడిని. మీడియా అంటే నాకేమీ భయం లేదు. కానీ నాకు సిగ్గు చాలా ఎక్కువ’’అని చెప్పి నవ్వులు పూయించారు. ‘‘అదీగాక ముందుగానే వాగ్దానాలు చేయడం నాకిష్టముండదు. అప్పట్లో ఇంటర్వ్యూల్లో అన్ని చెప్పాడు, చివరికి వాటిలో ఒక్కటీ చేయలేదని మీడియా మిత్రులే విమర్శించే ప్రమాదముంది. కనుక ఇంటర్వ్యూలు ఇవ్వనందుకు నన్ను వాళ్లు క్షమిస్తారనే ఆశిస్తున్నా’’అంటూ చమత్కరించారు.ప్రొటోకాల్ పక్కన పెట్టి మరీ జస్టిస్ త్రివేదికి సీజేఐ వీడ్కోలు → చాంబర్‌కు వెళ్లి మరీ తోడ్కొని వచ్చారు → వెల్లడించిన జస్టిస్ విశ్వనాథన్ జస్టిస్ గవాయ్ వినమ్రత, నాయకత్వ లక్షణాలు సాటిలేనివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.వి.విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం రిటైరైన సహచర న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేదికి ప్రొటోకాల్‌ను పక్కన పెట్టిన మరీ ఘనంగా వీడ్కోలు పలికిన తీరే అందుకు గొప్ప నిదర్శనమన్నారు. ‘‘ప్రొటోకాల్ ప్రకారం ధర్మాసనం కార్యకలాపాలు ముగిశాక మధ్యాహ్నం 1.30 సమయంలో ఇతర న్యాయమూర్తులంతా సుప్రీంకోర్టు ఆవరణలోకి వచ్చి రిటైరయ్యే న్యాయమూర్తికి సాదరంగా వీడ్కోలు పలుకుతారు. జస్టిస్ త్రివేది విషయంలో మాత్రం సీజేఐ ఎవరూ ఊహించని పని చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తన చాంబర్ నుంచి రెండు అంతస్తులు ఎక్కి మరీ స్వయంగా జస్టిస్ త్రివేది చాంబర్లోకి వెళ్లి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. దాంతో మేం కూడా ఆయన్ను అనుసరించాం. సీజేఐ సారథ్యంలో అందరమూ కలిసి ఆమెను కోర్టు ప్రాంగణం దాకా సాదరంగా తోడ్కొని వచ్చాం. గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘనంగా వీడ్కోలు పలికాం. ఇది నా దృష్టిలో అత్యంత అర్థవంతమైన వీడ్కోలు’’అని చెబుతూ జస్టిస్ విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు. -
తిరుగుబాటు: ఆమ్ ఆద్మీ పార్టీలో ‘ కొత్త పార్టీ’!
ఢిల్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీలో అంతర్గత పోరు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాజాగా ఆప్ లో ఎప్పట్నుంచో నివురుగప్పిన నిప్పులో ఉన్న వర్గ పోరు వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లో ఆప్ కు చెందిన కౌన్సిలర్లు తమ రాజీనామాలు ప్రకటించారు.తమకు అసలు పనే లేదని, ఇంకెందుకు కౌన్సిల్లరుగా ఉండటం అంటూ వారు రాజీనామాలు చేశారు. ఆప్ కు చెందిన 15 మంది కౌన్సిలర్లు రాజీనామాలు చేయడమే కాకుండా కొత్తగా ఓ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి ఇంద్రప్రస్థ వికాస్ పేరును పెట్టినట్లు రాజీనామాకు సిద్ధమైన ఆప్ కౌన్సిలర్ హిమానీ జైన్ స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా మాకు పని లేదు. కార్పోరేషన్ లో జరగాల్సిన పని ఏదీ జరగలేవు. మేము అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏమీ చేయలేదు. కౌన్సిలర్లుగాఉండటం అనవసరం అని భావించే కొత్త పార్టీ పెట్టాం ’ అని ఆమె స్పష్టం చేశారు. తాము ఆప్ లో ఉన్నామనే సంగతినే అధ్యక్షుడు కేజ్రీవాల్ మరిచిపోయినట్లున్నారని మరో కౌన్సిలర్ ముఖేస్ గోయల్ వ్యాఖ్యానించారు.#WATCH | Delhi | On her resignation from the AAP, party councillor Himani Jain says, "We have formed a new party, Indraprastha Vikas Party. We have resigned from AAP. In the last 2.5 years, no work was done in the corporation which should have been done. We were in power, yet we… pic.twitter.com/c1thjuALZU— ANI (@ANI) May 17, 2025 -
బార్ తీరుపై సీజేఐ ఆక్షేపణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) తీరును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ తీవ్రంగా ఆక్షేపించారు. శుక్రవారం పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా మాధుర్య త్రివేదికి వీడ్కోలు పలకరాదన్న ఎస్సీబీఏ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జస్టిస్ త్రివేదికి వీడ్కోలు పలికేందుకు తన సారథ్యంలో కొలువుదీరిన లాంఛన ధర్మాసనం నుంచే ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తి రిటైరవుతున్న సందర్భంలో బార్ అలాంటి వైఖరి తీసుకోకుండా ఉండాల్సింది. దాని తీరుతో బాహాటంగా విభేదిస్తున్నా. నేను ఉన్నదున్నట్టుగా మాట్లాడే వ్యక్తిని. కనుక ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేయడం చాలా అవసరమని కూడా భావిస్తున్నా’’ అని ఎస్సీబీఏ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కపిల్ సిబర్, రచనా శ్రీవాత్సవ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. అయితే లాంఛన ధర్మాసన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ‘‘బెంచ్ మరోలా తీర్మానించినా వచ్చి పాల్గొన్నందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ త్రివేది ఎంత సమర్థురాలో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. న్యాయమూర్తుల్లో కొందరి నుంచి ఆశించిన తీర్పులు రావు. వారికి దక్కాల్సిన వాటిని నిరాకరించేందుకు అది కారణం కారాదు’’ అన్నారు.జస్టిస్ త్రివేది న్యాయవ్యవస్థకే ఆభరణంజస్టిస్ త్రివేదీ న్యాయవ్యవస్థకే ఆభరణమంటూ సీజేఐ జస్టిస్ గవాయ్ కొనియాడారు. ట్రయల్ కోర్టు జడ్జిగా ప్రస్థానం ప్రారంభించి సుప్రీంకోర్టు దాకా ఎదిగిన తొలి న్యాయమూర్తి ఆమేనని గుర్తు చేశారు. గుజరాత్ నేషనల్ లా వర్సిటీ ఏర్పాటు వంటివాటిలోనూ ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. ‘‘ఎస్సీ కోటాలో ఉప వర్గీకరణపై ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సభ్యురాలిగా మెజారిటీ తీర్పుతో జస్టిస్ త్రివేది విభేదించారు. తద్వారా స్వతంత్ర ఆలోచనకు, స్థైర్యానికి ప్రతీకగా నిలిచారు. వ్యక్తిగత జీవిత సవాళ్లు తన ఉద్యోగ ధర్మాన్ని ఏనాడూ ప్రభావితం చేయనివ్వలేదు. ఆరోగ్యం బాగాలేని తండ్రిని చూసుకునేందుకు వారాంతాల్లో అహ్మదాబాద్ వెళ్లి, ఎంత కష్టమైనా సోమవారాకల్లా కోర్టుకు హాజరయ్యేవారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘జస్టిస్ త్రివేదీ! నిజాయతీకి, నిష్పాక్షికతకు, శ్రమించే తత్వానికి మీరు మారుపేరు. జీవిత ప్రయాణంలో నూతన అధ్యాయానికి తెర తీస్తున్న సందర్భంగా అభినందనలు’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు బార్ సభ్యులు తదితరులు జస్టిస్ త్రివేది సేవలను కొనియాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిటైరైనప్పుడు ఎన్‌సీబీఏ వీడ్కోలు సమావేశం నిర్వహించడం ఆనవాయితీ.నా తీర్పులే మాట్లాడాయి: జస్టిస్ త్రివేదితానేమిటో చెప్పేందుకు 30 ఏళ్లుగా తానిచ్చిన తీర్పులే నిదర్శనమని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతి తీర్పులోనూ ఆత్మ ప్రబోధానుసారమే నడుచుకున్నా. సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా విధ్యుక్త ధర్మాన్ని నిబద్ధతతో, నిజాయతీతో నెరవేర్చిన తృప్తితోనే సెలవు తీసుకుంటున్నా’’ అని చెప్పారు.11వ మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన 11వ మహిళగా జస్టిస్ త్రివేది నిలిచారు. పలు చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. ఆమె జూన్ 9న రిటైరవాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో శుక్రవారమే పదవీ విరమణ చేశారు. ఆమె 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. అదే రోజు ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు సహా రికార్డు స్థాయిలో మొత్తం 9 మంది బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ త్రివేది సిటీ సివిల్ కోర్టు జడ్జిగా నియుక్తురాలైన సమయంలో ఆమె తండ్రి కూడా అదే హోదాలో ఉండటం విశేషం! -
పత్రికల్లో పేరు కోసం పిటిషన్లా?
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఇక కొత్తగా పిటిషన్లు దాఖలైతే విచారణకు స్వీకరించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు కుండబద్ధలు కొట్టినట్లు తేల్చిచెప్పింది. పత్రికల్లో పేరు కోసం కొందరు ఇష్టానుసారంగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పత్రికల్లో పేరు రావాలని కోరుకుంటున్నారని, అందుకే పిటిషన్లు అంటూ తమ సమయం వృథా చేస్తున్నారని మండిపడింది. మీడియాలో పబ్లిసిటీ కోసం కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడం ఏమిటని నిలదీసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగా రెండు వ్యాజ్యాలు దాఖలు కాగా, వాటిని విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. ఆ రెండు పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై ఈ నెల 20న విచారణ చేపట్టనున్నట్లు తెలియజేసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కొత్తగా ఎవరూ వ్యాజ్యాలు దాఖలు చేయొద్దని పరోక్షంగా హెచ్చరించింది. -
ఇకపై కుదరవు... పనులు మొదలయ్యాక పర్యావరణ అనుమతులు
న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ గీసింది. మైనింగ్ తదితర ప్రాజెక్టులకు కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని ఆదేశించింది. అలా అనుమతులిచ్చేందుకు వీలు కల్పిస్తూ 2017, 2021 ఉత్తర్వుల ఆధారంగా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లు తదితరాలు అక్రమమని పేర్కొంటూ వాటన్నింటినీ కొట్టేసింది. ఇకపై అలాంటి ఆదేశాలు, సర్క్యులర్లు, నోటిఫికేషన్లు, ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. అయితే ఆయా నోటిఫికేషన్ల ఆధారంగా ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులు మాత్రం చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో పర్యావరణ అనుమతుల్లేకుండా మొదలైన ప్రాజెక్టులు తమ కార్యకలాపాలను క్రమబద్దీకరించుకునేందుకు ఇకపై అవకాశముండదు. కావాలనే ఉల్లంఘనలు అత్యంత కీలకం, తప్పనిసరి అయిన పర్యావరణ అనుమతులను పట్టించుకోకపోవడం భారీ అవకతవకలకు పాల్పడటమే తప్ప మరోటి కాదని జస్టిస్ ఓకా ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘ఇలా చేస్తున్నవాళ్లు నిరక్షరాస్యులేమీ కారు. వారు కంపెనీలు, రియల్టీ డెవలపర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ పరిశ్రమల యజమానులు. వీళ్లంతా ఉద్దేశపూర్వకంగానే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న వాళ్లే’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అందుకే ఇలాంటి వాళ్లకు ఎలాంటి అనుచిత లబ్ధీ కలగడానికి అనుమతించేది లేదు. ఇలాంటి ప్రాజెక్టులకు అనంతర కాలంలో ఈసీలు ఇచ్చేలా 2017 నోటిఫికేషన్ల వంటివి ఇకపై జారీ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా నిర్దేశాలు జారీ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) నోటిఫికేషన్ (2006) ప్రకారం మైనింగ్‌తో పాటు ఎలాంటి భారీ ప్రాజెక్టులకైనా ముందుగా పర్యావరణ అనుమతులు (ఈసీ) తీసుకోవడం తప్పనిసరి. అలాంటివేవీ లేకుండానే మొదలు పెడుతున్న ప్రాజెక్టులకు ఈసీల జారీని సవాలు చేస్తూ వనశక్తి అనే స్వచ్ఛంద సంస్థ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమ ఉత్తర్వులు ఈఐఏ నోటిఫికేషన్‌కు విరుద్ధమేమీ కాదని, కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఈసీలు ఇవ్వకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని కేంద్రం వాదించింది. పర్యావరణ పరిరక్షణ చట్ట నిబంధనల మేరకే ఆ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. -
ఆయనపై కేసులున్నాయని మీరెలా చెబుతున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని మీరెలా చెబుతారు.. అంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాల కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కాకాణి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ–4గా చేర్చారు. దీంతో ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ.. ఆయన మే 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసేనని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం.. ‘హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దే తేల్చుకోవచ్చు కదా.. దీనికోసం ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు.. అని అడిగింది.హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును జూన్ 16కు వాయిదా వేసిందని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని దవే బదులిచ్చారు. కాగా.. తనపై గతంలో ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని గోవర్దన్ రెడ్డి కోర్టును తప్పుదారి పట్టించేలా పిటిషన్లో పేర్కొన్నారని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రేరణ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. ‘ఆయన మీద కేసులు ఉన్నాయని మీరు ఎలా చెబుతున్నారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయినా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున అరెస్టు నుంచి కాకాణికి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. -
జరిమానా విధిస్తాం జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఇష్టం వచ్చినట్లు ఒకే విషయంపై పదే పదే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది జాగ్రత్త..’అని గ్రూప్–1 అభ్యర్థులను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘ఈ విషయమై గతంలోనూ కొందరు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు అయ్యాక దీనిపై వాదనలు అవసరమా అని అప్పుడే మేం ప్రశ్నించాం. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశాం. ఇప్పుడు మళ్లీ మీరెందుకు వచ్చారు? మేం డిస్మిస్ చేసిన విషయం మీకు తెలియదా?’అంటూ నిలదీసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అభ్యర్థులు పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు, ఆ పిటిషన్ విత్‌డ్రాకు ధర్మాసనం అనుమతి ఇచి్చంది.గ్రూప్–1,2,3 నోటిఫికేషన్లకు సంబంధించిన జీవో 29, జీవో 33ను, పీహెచ్సీ రిజర్వేషన్లు వర్టీకల్గా అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ కుమ్మరి ప్రవీణ, మరో 12 మంది 370 పేజీలతో కూడిన రిట్ పిటిషన్‌ను ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జోమాల్య బగి్చలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, పిటిషనర్ల తరపున రానా ముఖర్జీ వాదనలు వినిపించారు.గ్రూప్–1 నోటిఫికేషన్ వ్యవహారంలో జీవో 29 రద్దు అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరిపి, కొట్టివేసిందని నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అభ్యర్థులపై సీరియస్ అయ్యింది. ‘పిటిషన్లో కొత్తగా ఏం ఉంది? ఒకే అంశంపై ఇంతమంది ఇన్నిసార్లు ఎందుకు? ఇలా చేస్తే జరిమానా విధిస్తాం..’అని హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రానా ముఖర్జీ అభ్యర్థించగా ధర్మాసనం అంగీకరించింది. -
‘ట్రైలర్ మాత్రమే చూశారు.. పాక్ తీరు మారకపోతే పూర్తి సినిమా చూపిస్తాం’
గాంధీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) ముగియలేదు. ట్రైలర్ మాత్రమే చూశారు. పాక్ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తాం’ అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (rajnath singh) హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ బేస్‌లో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం, ఆయన మీడియా మాట్లాడారు. పాకిస్తాన్‌పై భారత్ విజయానికి ఎయిర్‌బేస్ సాక్ష్యం.పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాం. బ్రహ్మోస్ మిస్సైల్ పవరేంటో పాకిస్తాన్‌కు చూపించాం. బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. పాకిస్తాన్ ముఖ్య ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేశాం. నయా భారత్ ఎంటో ప్రపంచానికి తెలిసింది.మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహార్‌కు పాక్ రూ.14కోట్లు ఇచ్చింది. ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం. మన వాయిసేన అసమాన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను వణికించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఫండింగ్ చేస్తోంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే.. పాక్‌కు అసలు సినిమా ముందుంది’ అంటూ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. Addressing the brave Air Warriors at the Air Force Station in Bhuj (Gujarat). https://t.co/3TGhBlyxFH— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025 -
దుమారం.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ (Ram Gopal Yadav) వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్‌పై (Vyomika Singh)వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.ఇటీవల, కల్నల్ సోఫియా ఖురేషీ (Sofia Khureshi)పై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijay Shah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని రామ్ గోపాల్ యాదవ్ తాజాగా, ప్రస్తావిస్తూ.. ‘వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ రాజ్‌పుత్ కాబట్టే ఆమెను వదిలేసి.. ముస్లిం మతానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ గురించి విజయ్ షా మాట్లాడారని అన్నారు. 🚨SP’s Ramgopal Yadav hurls CASTEIST slur at Wing Commander Vyomika Singh - calls her “CHAM*R” 😳~ No outrage. No suo moto by courts. No feminist noise.Because the abuser isn’t from BJP, and the victim isn’t convenient for the ecosystem👏🏼 pic.twitter.com/BXegkYPAg5— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 15, 2025ఉత్తరప్రదేశ్ మోరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మంత్రి విజయ్ షా కల్నల్ ఖురేషీపైచేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ‘ఓ మంత్రి కల్నల్ ఖురేషీని ఉద్దేశిస్తూ చేసిన మతతత్వ వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. కానీ అతనికి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల గురించి తెలియదు. లేదంటే వాళ్లని టార్గెట్ చేసేవారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి కులాల ప్రస్తావనకు తెచ్చారు. అదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్రవాదుల పీచమణిచిన సాయుధ దళాల సేవల కంటే బీజేపీ స్వీయ ప్రశంసలకు ప్రాధాన్యత ఇస్తుందని రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. మనస్తత్వం చెడుగా ఉన్నప్పుడు, సైన్యం సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి బదులుగా, వారు తమ సొంత విజయాలను హైలైట్ చేస్తారంటూ అభిప్రాయ పడ్డారు. सेना की वर्दी 'जातिवादी चश्मे' से नहीं देखी जाती है। भारतीय सेना का प्रत्येक सैनिक 'राष्ट्रधर्म' निभाता है, न कि किसी जाति या मजहब का प्रतिनिधि होता है।समाजवादी पार्टी के राष्ट्रीय महासचिव द्वारा एक वीरांगना बेटी को जाति की परिधि में बांधना न केवल उनकी पार्टी की संकुचित सोच का…— Yogi Adityanath (@myogiadityanath) May 15, 2025 సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహంరామ్ గోపాల్ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల యూనిఫామ్‌ను కుల దృక్పథంతో చూడరని, సైనికులు ఏ కులానికి లేదా మతానికి ప్రతినిధులు కాదని అన్నారు. దేశ వీర వనితను గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్ గోపాల్ యాదవ్ ఆలోచనలకు నిదర్శనం మాత్రమే కాదు, సైనికుల వీరత్వాన్ని, దేశ గౌరవాన్ని అవమానించడమేనని ట్వీట్ చేశారు. -
నిజాయితీపరులైతే సెలవు చూసి ఎందుకు చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘లాంగ్ వీకెండ్.. అదీ కోర్టుకు సెలవులున్నవి చూసుకుని ప్రీప్లాన్తోనే అక్కడ చెట్లన్నీ ధ్వంసం చేశారా? ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసే ఆలోచన లేకపోతే పనిదినాలైన సోమవారం నుంచి ఆ పనులు చేసుకోవచ్చు కదా? మీరు చేసింది చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు ఉంది’ అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ సింఘ్వీ మీరు బుల్డోజర్ల ఫొటోలు చూశారా? డజన్ బుల్డోజర్లను అంత తక్కువ టైంలో మోహరించగలరా? ధ్వంసం చేసిన ప్రాంతంలో పునరుద్ధరణ చర్యలు చేపడతారా? లేక జైలుకు వెళతారా’ అంటూ ప్రశ్నలు సంధించింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి కేసు విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి; బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు; మరొకరి తరఫున న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి, వరుణ్ ఠాకూర్ వాదనలు వినిపించారు. ఎలాంటి కార్యక్రమాలు జరపట్లేదు ‘ప్రస్తుతం ఆ ప్రాంతంలో పనులన్నీ ఆపేశాం. ఆ భూముల్లో మేము ఎలాంటి కార్యక్రమాలు జరపట్లేదు’ అని ప్రభుత్వం తరపున హాజరైన సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. అటవీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఫొటోలతో కూడిన సమగ్ర నివేదికను కోర్టుకు అందజేస్తామన్నారు. చెట్లు నరికిన ప్రాంతంలోనే మొక్కలు నాటుతున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా, అక్కడ నాటడం లేదని, మరోచోట నాటుతున్న విషయాన్ని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.104 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో దాదాపు 60శాతం చెట్లు నరికివేశారని అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది కె.పరమేశ్వర్ చెప్పారు. అక్కడ చదును చేసిన ఫొటోలను సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి ఇచ్చిందన్నారు. సీఈసీ అవన్నీ ధర్మాసనానికి ఇచి్చందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని సింఘ్వీని ప్రశ్నించగా.. సెల్ఫ్ సర్టీఫికెట్ తీసుకున్నామని బదులిచ్చారు. 50 హెక్టార్లకు పైగా ఉంటేనే ఈసీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాత్రికి రాత్రే ఎందుకు చేశారు? డజన్ల కొద్దీ బుల్డోజర్లను రాత్రికి రాత్రే అక్కడికి తరలించి వేలాది చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏం వచి్చందని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పారిశ్రామిక పార్క్ నిర్మిస్తామని చెబుతూ ప్రభుత్వం అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిందని ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనానికి చెప్పారు. ‘మీరు అక్కడ పారిశ్రామిక పార్క్ నిర్మిస్తారా? లేక మరే ఇతర నిర్మాణం చేస్తారా? అనేది మాకు అప్రస్తుతం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అని మరోసారి ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘వేలాది చెట్లను నరికివేసిన వీడియోలు చూసి మేం చలించాం.బుల్డోజర్ల శబ్దాలకు జంతువులు ప్రాణభయంతో పరుగులు తీశాయి. ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని పునరుద్ధరించే ఆలోచన ఉందా? లేక అక్కడే నిర్మించే తాత్కాలిక జైలుకు మీ చీఫ్ సెక్రటరీ, సంబంధిత అధికారులు జైలుకు వెళతారా? అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి’ అని చీఫ్ జస్టిస్ గవాయి హెచ్చరించారు. కంచ గచ్చిబౌలిలో అటవీ పునరుద్ధరణకు రాబోయే వర్షాకాలమే సరైన సమయమని నిరంజన్ రెడ్డి వాదించారు. హైదరాబాద్‌లో రుతుపవనాల సీజన్ జూన్ మొదటి వారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. అటవీ పునరుద్ధరణకు ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదని, కావాలనే, జూలైలో వాయిదాకు కోరుతున్నారన్నారు. విచారణను జూలై 23కు వాయిదా వేసిన ధర్మాసనం.. వంద ఎకరాల పునరుద్ధరణపై ప్రణాళికను సమరి్పంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు స్కూళ్లను కూల్చివేశారు.. చెట్ల నరికివేతపై పోరాడిన 200 మంది యూనివర్సిటీ విద్యార్థులపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, కొందరిని జైలుకు పంపారని విజిల్ బ్లోయర్స్ తరపున వరుణ్ ఠాకూర్ వాదనలు వినిపించారు. అయితే ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, పలువురు విద్యార్థులు జైల్లో ఉన్నారని చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలో మూడు స్కూళ్లను కూల్చివేశారని ఆరోపించారు. విద్యార్థులపై కేసుల్ని కొట్టివేయాలని కోరారు. అయితే స్కూళ్లను బుల్డోజ్ చేశారన్న వాదనపై జస్టిస్ గవాయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణను మొదటిసారి వింటున్నామని సింఘ్వీ అన్నారు. ఈ అప్లికేషన్ (ఐఏ)ను ఈ కేసుతో కలిపి విచారించడం కుదరదని సీజేఐ స్పష్టం చేశారు. కావాలంటే వేరే పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఆదేశిస్తూ... ఐఏను విత్‌డ్రా చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చారు. -
ఎవరు సుప్రీం?
ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతిగానీ, గవర్నర్‌గానీ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలి. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలను కుంటే అందుకు తగు కారణాలనూ పేర్కొనాలి. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా న్యాయసమీక్ష అధికారం మాకు ఉంది.సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నబిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటి? గవర్నర్లు, రాష్ట్రపతి ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువర్చాలని రాజ్యాంగంలో ఎలాంటి కాలావధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా కాలపరిమితిని విధిస్తారు? ఆర్టీకల్ 200, 201ను ఈ తరహాలోనే వినియోగించాలని గవర్నర్లు, రాష్ట్రపతికి మీరెలా దిశానిర్దేశం చేయగలరు?న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభలు పంపిన బిల్లులు గవర్నర్లు, రాష్ట్ర పతి వద్ద ఆమోదముద్ర కోసం నెలల తరబడి వేచిచూస్తున్న వైనంపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన సంచలనాత్మక తీర్పు, ఆ తీర్పులో గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించిన వైనంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసాధారణ రీతిలో స్పందించారు. బిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటని సుప్రీంకోర్టుపై రాష్ట్రపతి తాజాగా ప్రశ్నల వర్షం కురిపించారు.సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన అత్యంత కీలకమైన తీర్పుపై ఇలా రాష్ట్రపతి తీవ్ర, విస్తృతస్థాయిలో స్పందించడం, నేరుగా సుప్రీంకోర్టునే స్పందన కోరడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు వెలువర్చిన తీర్పులపై సందేహాలు వెలిబుచ్చుతూ ప్రశ్నలు సంధించడం కూడా ఇదే తొలిసారి అని న్యాయరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. రాష్ట్ర అసెంబ్లీలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం కోసం గవర్నర్ రిజర్వ్‌లో ఉంచిన నేపథ్యంలో అలాంటి బిల్లులపై మూడు నెలల్లోగా రాష్ట్రపతి తన నిర్ణయాన్ని తెలపాల్సిందేనని ఏప్రిల్ 8వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువర్చడం తెల్సిందే.దీంతో బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితిని విధించవచ్చా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా తనకు దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి తాజాగా సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు వేశారు. రాష్ట్రపతి మొత్తంగా 14 సూటి ప్రశ్నలు వేశారు. గత నెలలో ఇచ్చిన తీర్పులో ఏముంది? తమిళనాడు శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆమోదించకుండా తన వద్దే చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచడంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతిగానీ గవర్నర్‌గానీ గరిష్టంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలంటూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌ల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలనుకుంటే అందుకు తగు కారణాలనూ పేర్కొనాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై ఎటూ తేల్చకపోతే తమను మళ్లీ ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టంచేసింది. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా ఈ న్యాయసమీక్ష అధికారం తమకు ఉందని కోర్టు వెల్లడించింది. ఆ 14 ప్రశ్నలు క్లుప్తంగా.. ⇒ ఆర్టీకల్ 200 ప్రకారం తన వద్దకు వచ్చిన బిల్లులపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు? ⇒ బిల్లులపై అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకుంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాష్ట్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలు, సూచనలకు గవర్నర్ ఏమేరకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది? ⇒ స్వీయ విచక్షణాధికారంతో గవర్నర్ తీసుకునే నిర్ణయాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఎంత మేరకు న్యాయసమ్మతమైనవిగా భావిస్తారు? ⇒ ఆర్టీకల్ 200 కింద గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఆర్టికల్ 361 కింద న్యాయసమీక్ష జరుపుతుందా?. రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా సవాల్ చేయగలదు? ⇒ గవర్నర్ ఇంతకాలంలోపే నిర్ణయం వెలువర్చాలని రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినా మీరెలా గవర్నర్‌ను ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం చెప్పాలని ఆదేశించగలరు?. ఆర్టికల్ 200ను ఈ తరహాలోనే వినియోగించాలని మీరెలా దిశానిర్దేశం చేయగలరు? ⇒ ఆర్టికల్ 201 ప్రకారం తనకు దఖలుపడిన విచక్షణాధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి వెలువర్చిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయి? ⇒ రాష్ట్రపతి ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువర్చా లని రాజ్యాంగంలో ఎలాంటి కాలావధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా రాష్ట్రపతికి కాలపరిమితిని విధిస్తారు? ఆర్టికల్ 201ను ఈ తరహాలోనే వినియోగించాలని రాష్ట్రపతికి ఏ అధికారంతో ఆదేశాలు ఇచ్చారు? ⇒ రాష్ట్రపతి సమ్మతి కోసం ఏదైనా బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెడితే ఈ బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు, సలహాల కోసం సంప్రదించాలా?. ఒకవేళ సంప్రదించినా కోర్టు ఇచ్చే ఆ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందా? ⇒ బిల్లులకు సంబంధించి గవర్నర్‌గానీ, రాష్ట్రపతిగానీ తీసుకున్న నిర్ణయాలు చట్టంగా మారేలోపే ఆ నిర్ణయాలను కోర్టు న్యాయసమీక్ష జరపవచ్చా?. చట్టంగా మారబోతున్న బిల్లు ల్లోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వవచ్చా? ⇒ ఆర్టికల్ 142 ద్వారా తమకు దఖలుపడిన అసాధారణ అధి కారాలను ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు అప్పటికే గవర్నర్లు/ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు/ఉత్తర్వులు అమలుకాకుండా ప్రత్యామ్నాయ ఉత్తర్వులు/తీర్పులు వెలువర్చవచ్చా? ⇒ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందినా సరే గవర్నర్ ఆమోదించని/ఆమోదం పొందని బిల్లును చట్టంగా అమలుచేయొచ్చా? ⇒ ఏదైనా చట్టం రాజ్యాంగానికి లోబడే ఉందా? లేదా? అని తేల్చి కనీసం ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలనే నిబంధనను సుప్రీం కచ్చితంగా అమలుచేయాల్సిన అవసరం లేదుకదా? ⇒ ఆర్టీకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు దఖలుపడిన అధికారాలు కేవలం చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి? వంటి విధానపర నిర్ణయాలకే పరిమితమా? లేదంటే పరిపాలన, చట్టాల కూర్పు వంటి న్యాయస్థానాలేతర అంశాలకూ విస్తరించాయా? ⇒ సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 131 కింద కాకుండా మరే ఇతర అధికరణం కింద రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం ఉందా? -
ఉగ్రవాది కథ.. తల్లి ప్రేమ వద్దంది.. యమలోకం రమ్మంది!
శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) తర్వాత జమ్మూకశ్మీర్ (jammu and kashmir)లో ఉగ్రవేట మళ్లీ జోరందుకుంది. రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మొన్న సోపియాన్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ముష్కరులను ఎన్కౌంటర్ చేసింది. తాజాగా పుల్వామాలో ముగ్గురు జైహే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్లో జరిగిన ఓ ఎన్ కౌంటర్లో డ్రోన్ చిత్రీకరించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, వీరిలో ఉగ్రవాది ఆమిర్ నజీర్ వని ఎన్‌కౌంటర్‌కు కొన్ని నిమిషాల ముందు తన తల్లి ఫోన్ చేశాడు. వారి మధ్య జరిగిన భావోద్వేగ సంభాషణ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.📞 ఆమీర్ నజీర్ వని,అతని తల్లికి మధ్య జరిగిన వీడియోకాల్ సంభాషణ:ఆమీర్: ఏకే 47 పట్టుకుని.. అమ్మా... నువ్వు ఎలా ఉన్నావు? తల్లి (ఎడుస్తూ): బేటా, నీవెక్కడ ఉన్నావు?"ఆమీర్: ఇక్కడ ఓ బిల్డింగ్ బేస్మెంట్లో దాక్కున్నాను. భద్రతా బలగాలు దగ్గరకు వస్తున్నాయి తల్లి: బేటా, వాళ్లకి లొంగిపో.. ప్రాణాలు కాపాడుకో.. నిన్ను చూడాలని ఉందిఆమీర్: తల్లి మాటలు పట్టించుకోలేదు. ‘ఆర్మీని ముందుకు రానివ్వండి… వారి సంగతి చూస్తా’ అంటూ ఫోన్ కట్ చేశాడు.అనంతరం,ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరికి వీడియో కాల్ చేశాడు. ఆమె తన సోదరుడు ఆసిఫ్ అహ్మద్ షేక్ గురించి ఆరా తీసింది. ఆసిఫ్ తన వద్దే ఉన్నాడని చెప్పాడు. అది విన్న ఆమె భయ్యా మీరంతా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పగా.. నవ్వాడు. తామే ఆర్మీ పని పడుతామంటూ వివరించాడు. వీడియో కాల్ చేసిన కొద్ది సేపటికే భారత భద్రతా బలగాలు డ్రోన్ సాయంతో బేస్మెంట్లో నక్కిన ఉగ్రవాదుల్ని హతమార్చాయి.Mother pleads son Amir Nazir Wani, a Jaish-e-Mohammed (#JeM) terrorist to surrender before the Tral encounter began. He spoke to his mother and sister. #encounter #tral #pulwama #jammuandkashmir pic.twitter.com/t18ZsqDs7f— Madhuri Adnal (@madhuriadnal) May 15, 2025 గురువారం ఉదయం త్రాల్ ప్రాంతంలో నదీర్ గ్రామంలో ముష్కరులు నక్కినట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అసిఫ్ అహ్మద్ షేక్,ఆమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్‌గా హతమయ్యారు. ఈ కాల్పులు జరిగే సమయంలో ఉగ్రవాది ఆమీర్ నజీర్ వని నిర్మాణంలో ఉన్న బేస్మెంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అయితే, అతడి ఆచూకీ కనుగొనేందుకు భద్రతా బలగాలు డ్రోన్ కెమెరాల్ని రంగంలోకి దించాయి. ఉగ్రవాది ఒక పిల్లర్ చాటున నక్కినట్లుగా దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. డ్రోన్ విజువల్ సాయంతో దళాలు అతన్ని మట్టుపెట్టాయి. ఈ ముగ్గురు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతానికి చెందిన వారే. -
కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసు: జైశంకర్
ఢిల్లీ: పాక్ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందేనని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధూ జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రుపుమాపాలి’’ అని జైశంకర్ పేర్కొన్నారు.పాకిస్థాన్‌తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారని జైశంకర్ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని జైశంకర్ చెప్పారు. #WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd— ANI (@ANI) May 15, 2025కాగా, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారుల భద్రతపై కేంద్రం నిశితంగా దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మంత్రి కాన్వాయ్‌లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను చేరుస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైశంకర్‌కు భద్రతను 2023లో వై నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పటికే రెండో అత్యున్నత స్థాయి భద్రత. అందులో భాగంగా 33 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కమాండోల బృందం 24 గంటలూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.జెడ్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), 4 నుండి ఆరుగురు స్థానిక పోలీసు మంది కమాండోలతో సహా 22 మంది సిబ్బంది, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలుంటాయి. సాధారణంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, బెదిరింపులను ఎదుర్కొంటున్న వారికి ఈ స్థాయి భద్రత అందిస్తారు. కేంద్ర రక్షణ జాబితాలోని వీఐపీ భద్రతా కవర్ జెడ్–ప్లస్ (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్), జెడ్, వై, వై–ప్లస్, ఎక్స్ దాకా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 200 మందికి సీఆర్పీఎఫ్ వీఐపీ భద్రతా సంరక్షణ ఉంది. -
సీజేఐగా జస్టిస్ గవాయ్
న్యూఢిల్లీ: భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ గవాయ్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సుప్రీంకోర్టుకు తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత రెండో దళిత సీజేఐ. ప్రమాణస్వీకారం తర్వాత తల్లి కమల్ తాయ్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రాంగణంలో గాం«దీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. న్యాయవాదులు తదితరులు తనకు శుభాకాంక్షలు తెలపగా ‘జై భీమ్’ అంటూ నినదించారు. న్యాయవ్యవస్థలోని అత్యున్నత స్థానం నుంచి సామాజిక న్యాయం తాలూకు శక్తిమంతమైన ప్రకటనకు ఆ నినాదం ప్రతీక అని సుప్రీంకోర్టు బార్ పేర్కొంది. జస్టిస్ గవాయ్ ప్రమాణస్వీకార ఫొటోలను మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు జస్టిస్ గవాయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 64 ఏళ్ల జస్టిస్ గవాయ్ మహారాష్ట్ర నుంచి సీజేఐ పదవి చేపట్టిన ఆరో వ్యక్తి. మంగళవారం రిటైరైన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఆర్నెల్ల పాటు, అంటే నవంబర్ 23 దాకా విధులు నిర్వర్తిస్తారు. ప్రజా పక్షపాతి జస్టిస్ గవాయ్‌ది అతి సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థానానికి చేరిన అత్యంత స్ఫూర్తిదాయక నేపథ్యం. ఆయన 1960 నవంబర్ 24న మహారాష్ట్రలో అవరావతి జిల్లాలోని ఓ కుగ్రామంలో జని్మంచారు. ఆయన తండ్రి ఆర్ఎస్ గవాయ్ రాజకీయ నాయకుడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్)ని స్థాపించారు. జస్టిస్ గవాయ్ న్యాయప్రస్థానం 1985లో న్యాయవాదిగా మొదలైంది. నాగపూర్, అమరావతి కార్పొరేషన్ల స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 1993లో బాంబే హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, ఏడాదికి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, 2000లో నాగపూర్ బెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి, రెండేళ్లకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. చరిత్రాత్మక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ 700కు పైగా ధర్మాసనాల్లో సభ్యునిగా, సారథిగా ఉన్నారు. 300కు పైగా తీర్పులు వెలువరించారు. రాజ్యాంగపరమైన అంశాలు, పౌర హక్కులకు సంబంధించిన పలు కీలక తీర్పులు వాటిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ గవాయ్ నాయకత్వం వహించారు. కూల్చివేతలను తీవ్రంగా తప్పుబట్టడమే గాక వాటికి అడ్డుకట్ట వేస్తూ కఠిన నిబంధనలు రూపొందించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆరి్టకల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సబబేనని తీర్పు వెలువరించిన, పారీ్టలకు విరాళాలిచ్చే ఎన్నికల బాండ్లను రద్దు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాల్లో ఆయన సభ్యులు. పెద్ద నోట్ల రద్దు సబబేనని 4:1 మెజారిటీతో తీర్పు వెలువరించిన, ఎస్సీల్లో ఉప వర్గీకరణ చేసే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిందంటూ 6:1తో తీర్పిచ్చిన రాజ్యాంగ ధర్మాసనాల్లో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిబంధనను ప్రవేశపెట్టాలని ఈ కేసులో భాగంగానే తీర్పు వచ్చింది. మహిళల ఛాతీ పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచార యత్నం పరిధిలోకి రాబోవన్న అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలను జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టడమే గాక ఆ తీర్పుపై స్టే విధించింది. పలు రాజ్యాంగ, పర్యావరణ సంబంధ అంశాలపై కొలంబియా, హార్వర్డ్ తదితర ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీల్లో జస్టిస్ గవాయ్ ప్రసంగాలిచ్చారు. దేశవ్యాప్త సంచలనానికి కారణమైన వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసులను ఆయన ధర్మాసనమే విచారించాల్సి ఉంది. -
భార్గవాస్త్రం సిద్ధం
న్యూఢిల్లీ: ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలను తుత్తునియలు చేసే స్వదేశీ కౌంటర్–డ్రోన్ సిస్టమ్ ‘భార్గవాస్త్ర’ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల రూపంలో ఎదురవుతున్న ముప్పును సమర్థంగా తిప్పికొట్టడంలో గొప్ప ముందడుగు వేసింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్(ఎస్‌డీఏల్) అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల నిరోధక వ్యవస్థను ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ) అధికారుల సమక్షంలో మంగళవారం పరీక్షించారు. మొత్తం మూడు ట్రయల్స్ నిర్వహించగా, అన్నీ విజయవంతమయ్యాయి. ఎక్కడా గురి తప్పలేదు. ‘భార్గవాస్త్ర’లోని నాలుగు మైక్రో రాకెట్లు అన్ని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. తొలుత రెండు రాకెట్లను వేర్వేరుగా ఫైర్ చేశారు. దాంతో రెండు ట్రయల్స్ పూర్తయ్యాయి. మూడో ట్రయల్‌లో భాగంగా.. మరో రెండు రాకెట్లను ఒకేసారి సాల్వో మోడ్‌లో కేవలం రెండు సెకండ్ల వ్యవధిలోనే పరీక్షించారు. నాలుగు రాకెట్ల పనితీరూ అద్భుతంగా ఉన్నట్లు తేలింది. అవి నిర్దేశిత లాంచ్ పారామీటర్లను సాధించాయి. భారీ డ్రోన్లతో దాడులు జరిగినప్పుడు వాటిని గురిపెట్టి కచ్చితంగా నేలకూల్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించిన కొన్ని రోజులకే భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది. → భార్గవాస్త్రలో మొదటి దశలో ఆన్‌గైడెడ్ మైక్రో రాకెట్లు ఉంటాయి. ఇవి శత్రుదేశాల డ్రోన్లను కూల్చివేస్తాయి. → ఇక రెండో దశలో గైడెడ్ మైక్రో మిస్సైల్ ఉంటుంది. ఇది పిన్‌పాయింట్ కచ్చితత్వంతో ప్రత్యర్థి డ్రోన్లను చిత్తుచేస్తుంది. శత్రువు డ్రోన్లు తప్పించుకొనే అవకాశమే ఉండదు. గైడెడ్ మైక్రో మిస్సైల్‌ను గతంలోనే పరీక్షించారు. → అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసేలా భార్గవాస్త్రను అభివృద్ధి చేశారు. సముద్ర మట్టానికి 5 కిలోమీటర్లకుపైగా ఎత్తులోనూ చక్కగా పనిచేయగలదు. భారత సైనిక దళాల అవసరాలను అనుగుణంగా రూపొందించారు. → పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, చాలా తక్కువ ఖర్చుతో భార్గవాస్త్రను డిజైన్ చేయడం విశేషం. త్రివిధ దళాల అవసరాల మేరకు ఇందులో అదనంగా మార్పుచేర్పులు చేసుకోవచ్చని ఎస్‌డీఏఎల్ వెల్లడించింది. → అడ్వాన్స్డ్ సీ4ఐ(కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో భార్గవాస్త్ర పనిచేస్తుంది. గగనతలంలో ఎదురయ్యే ముప్పును రియల్–టైమ్‌లో ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. → ఇందులోని రాడార్ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగలదు. అలాగే ఎలక్ట్రో ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్(ఈఓ/ఐఆర్) సెన్సార్లు ‘లో రాడార్ క్రా–సెక్షన్’ లక్ష్యాలను కనిపెట్టగలవు. → కౌంటర్–డ్రోన్ టెక్నాలజీలో భార్గవాస్త్ర ఒక మైలురాయి అని ఎస్‌డీఏఎల్ అధికారులు చెబుతున్నారు. → కొన్ని దేశాలు భార్గవాస్త్ర తరహాలో మైక్రో–మిస్సైల్ సిస్టమ్స్‌ను రూపొందించినప్పటికీ... పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో ఇలాంటి బహుళ దశలతో కూడిన కౌంటర్–డ్రోన్ వ్యవస్థను ఎవరూ తయారు చేయలేకపోయారు. → భార్గవాస్త్రను హార్డ్‌కిల్ మోడ్‌లో రూపొందించారు. భారీ డ్రోన్లతోపాటు చాలా చిన్నస్థాయి డ్రోన్లను కూడా గుర్తించి, కూల్చివేయగలదు. -
టీపీసీసీకి జంబో కార్యవర్గం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ కూర్పు తుది దశకు చేరింది. పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకు సిద్ధమైన కార్యవర్గ ప్రతిపాదనల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అందజేశారు. కార్యవర్గంతోపాటు పార్టీలోని వివిధ కమిటీల చైర్మన్లకు సంబంధించిన పేర్లను అందులో చేర్చారు. దీనిపై తుది పరిశీలన అనంతరం రెండుమూడు రోజుల్లో కార్యవర్గ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువమందికి అవకాశం కల్పించేలా..కొత్తగా ఏర్పాటు చేయనున్న టీపీసీసీకి జంబో కార్యవర్గమే ఉండనున్నట్టు తెలుస్తోంది. కొత్త కార్యవర్గంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు. మొదట ఐదు నుంచి ఆరు పేర్లు అనుకున్నా, దానిని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి వర్గాలకు ఇచ్చేలా నాలుగుకు కుదించారు. ఈ పోస్టు కోసం ఎక్కువ మంది పోటీలో ఉన్న నేపథ్యంలో ఒక్కోవర్గం నుంచి ముగ్గురేసి పేర్ల చొప్పున 12 మంది పేర్లను సిఫార్సు చేశారు. హైకమాండ్ సూచనల మేరకు అందులో ఒకరి పేరు ఖరారు కానుంది. వైస్ ప్రెసిడెంట్లుగా 35 మంది వరకు ఉంటారు. అయితే 50 మంది పేర్లను ఏఐసీసీ ముందుంచినట్టు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులుగా 80 మందిని నియమించుకున్నారు. ప్రతి జిల్లాకు కచ్చితంగా ఇద్దరేసి చొప్పున అవకాశం ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మాత్రం ఎక్కువ మందికి అవకాశం కల్పించనున్నారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (పీఈసీ), పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ), క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, ప్రచార కమిటీ, మీడియా కమిటీలకు సైతం పలువురు పేర్లను సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలను టీపీసీసీ చీఫ్ ఏఐసీసీకి అందజేశారు. వీటిపై మరోమారు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌తోపాటు రాష్ట్ర నేతలను సంప్రదించిన అనంతరం కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశముంది. -
కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. హైకోర్టు సీరియస్, చర్యలకు ఆదేశాలు
భోపాల్: ఆపరేషన్ సింధూర్‌పై ( Operation Sindoor) మీడియా బ్రీఫింగ్లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషీపై (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కల్నల్ సల్మాన్ ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి విషయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.కర్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు మంత్రి విజయ్ షా (Kunwar Vijay Shah) మంగళవారం మౌలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైనిక విమానంలో వాళ్ల (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదరిని పాక్‌కు పంపించి అదే రీతిలో పాఠం నేర్పించారు’ అని అన్నారు.అయితే, విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, అనురాధ శుక్లాతో కూడిన ధర్మాసనం కల్నల్ సల్మాన్ ఖురేషీపై విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘విజయ్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి, తక్కువ చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలను వేర్వేరుగా చూడాలనే భావనను ప్రోత్సహించడమే కాకుండా, ఎవరు ముస్లిం అయితే వాళ్లు దేశభక్తులు కాదనే భ్రమను కలించేందుకు దారితీస్తాయి. ఇది భారత రాజ్యాంగంలో ఐకమత్యం,సోదర భావం అనే మౌలిక విలువలకు విరుద్ధం’అని వ్యాఖ్యానించిందిఈ సందర్భంగా నిజాయితీ, శ్రమ, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థత, స్వభావం, గౌరవం, దైర్యం వంటి విలువలకు ప్రతీక సాయుధ దళాలు’ అని ప్రశంసలు కురిపించింది. ఇలా దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారిపట్ల మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.India Pakistan News: MP Court Orders FIR Against BJP Leader Over Colonel Sofiya Qureshi Remark#DNAVideos | #IndiaPakistanTensions | #MadhyaPradesh | #BJP | #sofiyaqureshi For more videos, click here https://t.co/6ddeGFqedQ pic.twitter.com/W0kMjYhATB— DNA (@dna) May 14, 2025 -
ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలతో వెళ్తున్నా..
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో సుదీర్ఘకాలం పనిచేసి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు సొంతం చేసుకున్నానని జస్టిస్ సంజీవ్ ఖన్నా సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం ఈ జ్ఞాపకాలు తనకు తోడుగా ఉంటాయని చెప్పారు. తన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం ముగియడంతో మంగళవారం ఆయనకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టులో నిర్వహించిన సెర్మోనియల్ బెంచ్‌లో జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సంజయ్ కుమార్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థకు జస్టిస్ సంజీవ్ ఖన్నా అందించిన సేవలను వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రసంగించారు. నూతన సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ పట్ల తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు విలువలు, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఆయన చక్కగా పరిరక్షిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. తనకు ఇన్నాళ్లూ అతిపెద్ద మద్దతుదారుడిగా నిలిచారని కొనియాడారు. జస్టిస్ గవాయ్ నాయకత్వాన్ని ఎంతగానో విశ్వసిస్తున్నానని, రాజ్యాంగ విలువల పట్ల ఆయన అంకితభావం తిరుగులేనిదని వెల్లడించారు. తాము దాదాపు ఒకేసారి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందామని, కొలీజియంలో కలిసి పనిచేశామని చెప్పారు. తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ అద్భుతమైన సేవలు అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఖన్నాతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అందించిన సేవలను జస్టిస్ బి.ఆర్.గవాయ్ కొనియాడారు. ఇది వీడ్కోలు కాదని, ఒక మార్పు మాత్రమేనని చెప్పారు. జస్టిస్ ఖన్నా వృత్తి జీవితం ఈరోజుతో ఆగిపోవడం లేదని, మరొకదానికి ఇది ఆరంభమని వివరించారు. జస్టిస్ ఖన్నా ఆలోచల్లో స్పష్టత, నైతికత, ప్రాథమిక హక్కుల పరిరక్షణ పట్ల అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఆయన ఇచి్చన తీర్పులన్నీ రాజ్యాంగ విలువలతో కూడి ఉన్నాయని చెప్పారు. జస్టిస్ ఖన్నాతో ఇన్నాళ్లూ కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. జస్టిస్ ఖన్నా తమకు స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు.అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి మాట్లాడుతూ... జస్టిస్ ఖన్నా న్యాయస్థానాల విలువ, గౌరవం ఎన్నోరెట్లు పెంచారని ప్రశంసించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం జస్టిస్ ఖన్నా సేవలను గుర్తుచేసుకున్నారు. కపిల్ సిబల్ మాట్లాడుతూ... ఈ వారం దేశంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు పదవీ విరమణ చేశారని చెప్పారు. క్రికెటర్ విరాట్ కోహ్లీతోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్ అవుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కపిల్ సిబల్ ప్రసంగించారు. రెండు దశాబ్దాలపాటు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ఖన్నా న్యాయం పట్ల తిరుగులేని అంకితభావం కనబర్చారని చెప్పారు. -
అపూర్వం.. అనూహ్యం.. అద్భుతం.. వాయుసేనకు వందనం
ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. కానీ శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. యుద్ధక్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు. వాయుసేన వేగం, సత్తా చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానిక స్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్ వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినా వాయుసేన కచ్చితత్వంతో పాక్ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. – ప్రధాని మోదీన్యూఢిల్లీ: దుష్టదేశ గగనతలాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లి ముష్కర మిన్నాగుల పుట్టలను నేలమట్టంచేస్తూ, దాయాదిదేశం యుద్ధం ఆపాలని కాళ్లబేరానికి వచ్చే స్థాయిలో శత్రువుల వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసి తిరుగులేని ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేనను ప్రధాని మోదీ పొగడ్తల్లో ముంచెత్తారు. పాక్ సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి స్వయంగా వెళ్లి అక్కడి వాయుసేన బలగాలపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. వారి అసమాన పోరాట పటిమను భుజం తట్టి ప్రోత్సహించి పొగిడారు.తర్వాత అక్కడి ఎయిర్‌ఫోర్స్ జవాన్లనుద్దేశించి దాదాపు అరగంటపాటు ప్రసంగించారు. మరోసారి తెగించేందుకు దుస్సాహసం చేయొద్దని సరిహద్దు వెంట భారతవాయుసేన బలగాలు లక్ష్మణరేఖ గీశాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆదంపూర్ వైమానిక స్థావరంలోని భారత అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ అయిన సుదర్శన చక్ర(ఎస్–400) మిస్సైల్ లాంఛర్లను ముక్కలుచెక్కలు చేశామని పాక్ పలికిన ప్రగల్భాలన్నీ ఉత్తమాటలని నిరూపిస్తూ మోదీ మంగళవారం ఆ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ ఎదుటే నిలబడి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ విజయంపై జాతినుద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజే మోదీ ఎయిర్‌ఫోర్స్‌నుద్దేశిస్తూ మాట్లాడటం గమనార్హం. త్రిశూలం చిహ్నంతో ఉన్న ఎయిర్ కమాండ్ క్యాప్ ధరించి భారత్ మాతా కీ జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. అనుపమాన పరాక్రమం ‘‘పాక్ గడ్డపై మీరు చేసిన యుద్ధం అనుపమానం. అపూర్వం. అసాధారణం. అద్భుతం. పాకిస్తాన్ నడిబొడ్డున బాంబులు పేల్చారు. కేవలం 20–25 నిమిషాల్లో లక్ష్యాలను నేలమట్టంచేశారు. మీ మెరుపువేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేష్టులను చేసింది. చూసుకునేలోపే ఛాతీని చీల్చేశాం. మీ పోరాటంతో ప్రతి ఒక్క భారతీయుడు గౌరవంతో ఉప్పొంగిపోయాడు. మేం మీకు రుణపడిపోయాం. ఇది ఎన్నటికీ తీర్చుకోలేని రుణం. ఊహకందనంతటి శక్తియుక్తుల్ని ప్రదర్శించి దేశానికి విజయం చేకూర్చిన మీ నుంచి ఆశీస్సులు తీసుకోవడానికే నేను వచ్చా.ఆపరేషన్ సిందూర్ ధాటికి ఇక లక్ష్మణరేఖ దాటొద్దని పాకిస్తాన్‌కు బాగా అర్థమైంది. తరచూ అణుబాంబులతో బెదిరించాలని చూస్తున్న దాయాదికి మన బలగాలు భారత్ మాతాకీ జై నినాదంలోని అపారశక్తిని బయటకు తీసి చూపారు. భారత్ మాతాకీ జై అనేది కేవలం నినాదం కాదు. దేశం కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెడతామని బలగాలు చేసిన ప్రతిజ్ఞ. మన డ్రోన్లు, క్షిపణుల మోత పాక్ గడ్డపై ప్రతిధ్వనించిన ప్రతిసారీ పాకిస్తాన్ సైనికుల చెవుల్లో భారత్ మాతాకీ జై అనే నినాదమే మార్మోగింది. వాయుసేన శౌర్యం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మన సైనిక, వాయు, నావికా దళాలకు నా సెల్యూట్’’ అంటూ మోదీ సెల్యూట్ చేశారు. కన్నేస్తే కనుమరుగు ఖాయం ‘‘భారత గడ్డపై కన్నేస్తే తాము కనుమరుగు అవడం ఖాయమని ఉగ్రపోషకులకు ఆపరేషన్ సిందూర్ తర్వాత బాగా గుర్తుంటుంది. మీ పరాక్రమంతో ఆపరేషన్ సిందూరం నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది. శత్రువులు ఈ ఎయిర్‌ఫోర్స్‌ను నాశనంచేద్దామని కంకణం కట్టుకుని ఎడాపెడా దాడులు చేశారు. వాళ్ల ప్రయత్నాలను మీరు సులభంగా వమ్ముచేశారు. మన వైమానిక స్థావరాలు, రక్షణ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వాళ్ల 9 కీలక ఉగ్రస్థావరాలను సమాధులుగా మార్చేశాం. 100 మందికిపైగా ముష్కరులను మట్టుపెట్టాం. పాక్‌కు చెందిన ఎనిమిది సైనిక స్థావరాలను నాశనం చేశాం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ గీసిన లక్ష్మణరేఖ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. ధర్మ సంస్థాపనకు యుద్ధం ‘‘ధర్మ సంస్థాపనే లక్ష్యంగా శత్రు సంహారం కోసం ఆయుధం చేతబట్టి యుద్ధంచేయడం భారతీయుల సంప్రదాయం. మన అక్కచెల్లెళ్ల, కుమార్తెల పసుపు కుంకుమలు, సిందూరాన్ని తుచ్ఛమైన ముష్కరులు తుడిచేయగానే మనం వాళ్ల నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశాం. కనీసం పారిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. పహల్గాంలో వాళ్లు దొంగదెబ్బ తీస్తే మనం మాత్రం నేరుగా వెళ్లి, ఎదురునిలిచి పోరాడాం. పాకిస్తాన్ సైన్యం చంకనెక్కి భద్రంగా ఉండొచ్చని ఇన్నాళ్లు ఉగ్రవాదులు భావించారు. కానీ మన బలగాలు ఇక పాక్‌లో ఉగ్రవాదానికి సురక్షిత స్థలమంటూ ఏదీ లేదని నిరూపించాయి.సూర్యోదయం వేళ మీ సుందర దర్శనం చేసుకునేందుకే నేను ఇక్కడికొచ్చా. మీరు ఈ తరానికే కాదు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాతలు. మరోసారి సాహసిస్తే నాశనం, వినాశనం అని శత్రువులకు సందేశం ఇచ్చారు. భారత్ మాతాకీ జై అన్నప్పుడల్లా భయంతో శత్రువుల గుండెలు జారిపోయాయి. పరాక్రమవంతుల అడుగులతో నేల కూడా పులకిస్తుంది. అంతటి ధైర్యవంతులను నేరుగా చూడటంతో జన్మ ధన్యమవుతుంది. ఆ భాగ్యం కోసమే నేను ఇక్కడికొచ్చా. వీరుల నేలపై నిలబడి ఇప్పుడు నేను ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లోని యోధులకు సలామ్ చేస్తున్నా. మీ వీరత్వంతో ఆపరేషన్ సిందూర్ నినాదం నేల నలుచెరుగులా ప్రతిధ్వనిస్తోంది’’ అంటూ బలగాలను మోదీ పొగిడారు.త్రికరణ శుద్ధితో..‘‘ఇప్పుడు భారత్ మూడే సూత్రాలతో ముందుకెళ్తోంది. ఒకటి.. ఉగ్రదాడి జరిగితే మనదైన శైలిలో సమయం చూసి దీటుగా బదులిస్తాం. రెండు.. అణుబాంబులకు భయపడేదే లేదు. మూడు.. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచే వాళ్లను, ఉగ్రవాదాన్ని జాతీయవాదంగా మార్చేసిన ప్రభుత్వాలను ఇకపై భారత్ వేర్వేరుగా చూడబోదు’’ అని మోదీ స్పష్టంచేశారు. ఆదంపూర్ ఎయిర్‌బేస్ అనేది దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం. ఇక్కడ అత్యంత అధునాతన రఫేల్, మిగ్–29 యుద్ధవిమానాల స్క్వాడ్రన్ దళాలు ఉంటాయి. 1965, 1971 యుద్ధాల్లోనూ ఆదంపూర్ వైమానిక స్థావరం అత్యంత కీలకపాత్ర పోషించింది. మానవ యుక్తి.. మెషీన్ శక్తి‘‘వాయుసేన ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వేగం, సత్తా చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానికస్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినాసరే మన వాయుసేన అత్యంత కచ్చితత్వంతో పాక్ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. అమాయక పౌరులకు ఏ హానీ తలపెట్టలేదు. ఒక్క పౌరవిమానాన్నీ మీరు ధ్వంసంచేయలేదు. ఈ విషయంలో నేను నిజంగా గర్వపడుతున్నా. దాడుల్లో మీరు శత్రు స్థావరాలు, ఉగ్రశిబిరాలనే కాదు మరోసారి దుస్సాహసం చేయాలనే దుర్బుద్ధినీ దెబ్బతీశారు.గగనతల, భూతల యుద్ధ వ్యవస్థల మధ్య అద్భుతమైన సమన్వయం సాధించారు. మానవ యుక్తిని మెషీన్ శక్తిని చక్కగా మేళవించారు. మీరు భారత్ మాతా కీ జై అన్న ప్రతిసారీ శత్రువుల వెన్నులో వణుకుపుట్టింది. మీ సారథ్యంలో దేశీయ తయారీ ఆకాశ్ మిస్సైళ్లు, అధునాతన సుదర్శన చక్ర(ఎస్–400) వ్యవస్థలు శత్రు దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆపరేషన్ సిందూర్ ద్వారా మీరు దేశ ఆత్మవిశ్వాసం, సమైక్యత, ప్రతిష్టను నూతన శిఖరాలపై నిలిపారు. అణుబూచికి ఏమాత్రం భారత బలగాలు బెదరవని నిరూపించారు. మన శక్తియుక్తుల ముందు పాకిస్తాన్ అన్ని డ్రోన్లు, యూఏవీలు, క్షిపణులన్నీ దిగదుడుపే. నమ్మశక్యంకాని రీతిలో రణతంత్రం ప్రదర్శించారు.గత దశాబ్దకాలంలో అత్యంత అధునాతన సమర సాంకేతికతలన్నింటినీ మన బలగాలు అందిపుచ్చుకున్నాయి. టెక్నాలజీ వాడకంలో, యుద్ధం వచ్చినప్పుడు ఎలా వినియోగించుకోవాలో మీకు బాగా తెలుసు. రియల్ గేమ్‌లో మీరు అదరగొట్టారు. మీరు ఆయుధాలతో మాత్రమే యుద్ధం చేయలేదు. భారత్ ఇప్పుడు డ్రోన్లు, డేటా, టెక్నాలజీ సహిత రణాల్లో రాటుదేలింది. మీరు దమ్ము చూపించి శత్రువులను దుమ్ములో కలిపేశారు’’ అని మోదీ అన్నారు. మహారాణా ప్రతాప్ అశ్వమైన చేతక్ చూపిన తెగువ, సాహసం ఇప్పుడు మన ఆధునిక యుద్ధవిమానాలకు పాటవానికి సరిగ్గా సరిపోతుంది అంటూ నాటి వచనాలను మోదీ గుర్తుచేశారు. ‘‘కదలికల్లో నైపుణ్యం కనబరిచాయి. మెరుపువేగంతో దూకుడు చూపాయి. శత్రుసైన్యం మధ్యల్లోంచే శ్రస్తాలు సంధించాయి’’ అని మోదీ ఆ వచనాలను వల్లెవేశారు. శాంతంగా ఉంటాం.. సమరమూ చేస్తాం‘‘ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. శాంతంగా ఉంటాం. శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. యుద్ధ క్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు. శాంతంగా ఉంటాం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. ఆపరేషన్ సిందూర్ అంటే పోరాటానికి పెట్టుకున్న పేరు కాదు. భారత విధాననిర్ణయ పతాక. దృఢ సంకల్పానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతీక. శాంతిమయ జీవనం సాగించాలని ప్రపంచానికి బోధించిన బుద్ధుని నేల మాత్రమేకాదు శత్రువులను చీల్చి చెండాడిన గురు గోవింద్ సింగ్ లాంటి వీరపరాక్రముల పవిత్రభూమి’’ అని అన్నారు. -
సుప్రీంకోర్టులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఊరట
ఢిల్లీ: ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా కేసు దర్యాప్తుకు హాజరుకావాలని, అధికారులకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
కాలుష్య భూతంపై ‘వారుణాస్త్రం’!.. ఢిల్లీలో రూ. 3 కోట్లతో మేఘమథనం
ఢిల్లీ: చినుకు కోసం మేఘాలను చిలకబోతోంది దేశ రాజధాని ఢిల్లీ నగరం. కాలుష్య రక్కసిని సంహరించడానికి వరుణుడినే ఓ అస్త్రంగా సంధించబోతోంది. సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో ఢిల్లీ నగరం కాలుష్య భూతంతో పోరాటానికి సిద్ధమవుతోంది. ఢిల్లీలో ఈ నెలాఖరు నుంచి ఐదు ప్రదేశాల్లో మేఘమథనం ట్రయల్స్ నిర్వహించనున్నారు.మేఘాలు, తేమ ఆధారంగా ఆ ఐదు ప్రాంతాలను అప్పటికప్పుడు నిర్ణయిస్తారు. సరైన తేమ ఉంటేనే మేఘాలు వర్షిస్తాయి. అందుకే అనువైన మేఘాలు, సరిపోను తేమ వంటి అంశాలను గమనించి ఆ ఐదు ప్రదేశాలను ఎంపిక చేయనున్నారు. భద్రతా కారణాల రీత్యా లుట్యెన్స్ ఢిల్లీ, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతాలను మేఘమథనం నుంచి మినహాయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.కాన్పూర్ ఐఐటీ సాంకేతిక సహకారంతో ఢిల్లీ శివార్లలో అమలయ్యే ఈ ప్రాజెక్టు వ్యయం రూ.3.21 కోట్లు. 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కృత్రిమ వర్షం తొలి ట్రయల్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రయోగం వ్యవధి గంట నుంచి గంటన్నర. వేర్వేరు రోజుల్లో జరపనున్న ఈ మేఘమథనం కోసం 13 కేంద్ర, రాష్ట్ర (ఢిల్లీ) ప్రభుత్వ సంస్థల నుంచి లాంఛనపరమైన అనుమతులు లభించాల్సివుంది. ఢిల్లీలో కృత్రిమ వాన కురిపించాలనే ప్రతిపాదనలు తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2023 శీతాకాలంలో ఈ ప్రతిపాదనను ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ఆ కార్యక్రమాన్ని అప్పట్లో అది విరమించుకుంది.నిరుడు శీతాకాలంలోనూ మేఘమథనం కోసం ‘ఆప్’ సర్కారు పాకులాడింది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదంటూ ఆ ప్రయత్నం నుంచి మరోమారు వెనక్కు తగ్గింది. ఈ ప్రయోగంలో వర్షించడానికి అనుకూలమైన, సరిపోను తేమ గల మేఘాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తారు. వాటిని గుర్తించాక సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ (ఉప్పు), డ్రై ఐస్ (ఘనీకృత కార్బన్ డై ఆక్సైడ్) వంటి రసాయన పదార్థాలను విమానంలో తీసుకెళ్లి ఆ మేఘాలపై చల్లుతారు. అలా మేఘాలు వర్షిస్తాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి పలు దేశాల్లో ఇలాంటి ‘స్వల్పకాలిక’ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వీటితో ఉపయోగమెంత అనేది ఓ చర్చనీయాశంగానే మిగిలింది! - జమ్ముల శ్రీకాంత్ -
త్రివిధ దళాదిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రకటన చేసిన వేళ..కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కీలక సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాదిపతులు, డిఫెన్స్ సెక్రటరీ,సీడీఎస్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. ఈ కీలక భేటీలో కాల్పుల విరమణ, సరిహద్దుల్లో తాజా పరిస్థితుల గురించి చర్చ జరే అవకాశం ఉంది. Delhi | Defence Minister Rajnath Singh held a meeting with Defence Secretary, CDS, Navy Chief and Army Chief(Source: Defence Minister's office) pic.twitter.com/BF9AHZwkc4— ANI (@ANI) May 13, 2025మధ్యాహ్నం 3గంటలకు రక్షణ శాఖ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ ప్రెస్మీట్లో ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పాక్ ఎయిర్ బేస్ ధ్వంసంపై కీలక విషయాలు వెల్లడించనుంది. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రక్షణ శాఖ బ్రీఫింగ్ ఇవ్వనుంది. -
సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట
ఢిల్లీ: మద్యం విధానం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు హితవు పలికింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.‘‘గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలి. దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలి. ఈ కేసులో పిటీషనర్ పాత్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదు. అరెస్ట్‌కు సహేతుక కారణాలు చూపించాలి. మెకానికల్ అరెస్టులు సరికాదు. కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన సరికాదు’’ అని సుప్రీంకోర్టు తెలిపింది.‘‘పార్లమెంట్ సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలి. తాజాగా మరోసారి పిటిషన్ హైకోర్టు విచారణ చేయాలి. ఏపీ హైకోర్టు తగిన అఫిడవిట్ దాఖలు చేయాలి. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. షోపియాన్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదేనన్న అనుమానం నెలకొంది. మరోవైపు, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ పోలీసులు జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ జిల్లా అంతటా పోస్టర్లను అతికించారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల బహుమతి అందిస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు.ఈ క్రమంలో ఉగ్రవాదులపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు షోపియాన్ జిల్లాలో మొహరించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఓ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేటని ముమ్మరం చేశాయి. #BREAKING: J&K Police has pasted Posters across Shopian district of Jammu & Kashmir urging people to provide information of those terrorists involved in Pahalgam terror attack.Rs 20 lakh reward to the person who will provide any information about these Pakistani terrorists. pic.twitter.com/zjV7VUWtFb— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 13, 2025 -
కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి, ఆరుగురు పరిస్థితి విషమం
ఛండీఘడ్: పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా మారింది. #WATCH | Punjab: 14 people dead and 6 hospitalised after allegedly consuming spurious liquor in Amritsar's MajithaSSP Amritsar Maninder Singh says, " We received information around 9:30 pm last night that here people have started dying after consuming spurious liquor. We took… pic.twitter.com/C7miySsHo6— ANI (@ANI) May 13, 2025దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ‘సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని మాకు సమాచారం అందింది. సమాచారంతో బాధితుల్ని అస్పత్రికి తరలించాం. వారిలో 14 మంది మరణించారు’ అని అమృత్సర్ ఎస్ఎస్పీ మనీందర్ సింగ్ తెలిపారు. #WATCH | Punjab: 14 people dead and 6 hospitalised after allegedly consuming spurious liquor in Amritsar's MajithaAmritsar Deputy Commissioner Sakshi Sawhney says, " An unfortunate tragedy has happened in Majitha. We got to know yesterday night, we received reports from 5… pic.twitter.com/9IauurxVyq— ANI (@ANI) May 13, 2025అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ..నిన్న రాత్రి మద్యం సేవించిన ఐదు గ్రామాలకు చెందిన ప్రజల పరిస్థితి విషమంగా ఉందని మాకు సమాచారం అందించింది. వెంటనే సంబంధిత గ్రామాలకు వైద్య బృందాల్ని పంపించాం. ఇప్పటికీ వారికి రక్తపరీక్షలు నిర్వహిస్తున్నాం. నకిలీ మద్యం సేవించి ఇప్పటివరకు 14 మంది మరణించారు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సహాయం అందిస్తోంది. ఈ మరణాల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. నకిలీ మద్యాన్ని పంపిణీ చేసిన వ్యాపారస్థుల్ని అదుపులోకి తీసుకున్నాం. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు. -
న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో బిగ్ ట్విస్ట్
ఢిల్లీ: హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో కాలిన నోట్ల కట్టల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందిమార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక ఢిల్లీ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంపై సుప్రీంకోర్టు నియమించిన త్రి సభ్య కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున లభ్యమైన నోట్ల కట్టల్ని అక్కడ పనిచేసే సిబ్బంది మాయం చేసినట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చిన నోట్ల కట్టలపై సుప్రీం కోర్టు త్రి సభ్య కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మను విచారించింది. విచారణలో నోట్ల కట్టల విలువపై స్పష్టత లేకపోవడం, అగ్నిప్రమాదం జరిగిన తర్వాత నోట్ల కట్టల్ని ఇంట్లో పనిచేసే సిబ్బంది మాయం చేయడం,నగదు వెలుగులోకి వచ్చిన గదికి తాళం వేసి ఉండడంతో, దాన్ని బలవంతంగా తెరవాల్సి రావడం వంటి అంశాలపై త్రి సభ్య కమిటీ .. జస్టిస్ యశ్వంత్ వర్మను ప్రశ్నించింది. అయితే త్రి సభ్య కమిటీకి జస్టిస్ యశ్వంత్ వర్మ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలింది.ఈ వరుస పరిణామాలపై త్రి సభ్య కమిటీ నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకు అందించింది. ఆ నివేదికను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా..రాజీనామా చేసి తప్పుకోవడం ఉత్తమమని జస్టిస్ వర్మకు సూచించారు. అందుకు ప్రతిస్పందనగా తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని పేర్కొంటూ పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. దీంతో జస్టిస్ వర్మ అభిశంసన (ఇంపీచ్‌మెంటు)కు సీజేఐ సంజీవ్‌ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై త్రి సభ్య కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు సీజేఐ పంపారు. -
ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్!
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగన తలంపై ఆంక్షలు విధించింది. అయితే, భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో,ఎయిరిండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేసింది. రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిరిండియా మంగళవారం (మే 13) జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తాజా పరిణామాలు, ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొంది.#TravelAdvisoryIn view of the latest developments and keeping your safety in mind, flights to and from Jammu, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot are cancelled for Tuesday, 13th May.We are monitoring the situation and will keep you updated.For more…— Air India (@airindia) May 12, 2025 -
మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్, పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో దూసుకొచ్చిన పాకిస్థాన్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు.ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్ రెచ్చిపోయింది. వాస్తవాధీన రేఖ వెంట పాక్ కాల్పులకు తెగబడింది. డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగాయి. సాంబా, ఆర్నియాలో డ్రోన్ కదలికలను గుర్తించారు. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Samba.(Visuals deferred by unspecified time) pic.twitter.com/EyiBfKg6hs— ANI (@ANI) May 12, 2025 -
chhattisgarh: భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోల మృతి
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ సరిహద్దుల్లో ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం భద్రతా బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే 11 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు సమాచారం. దేశంలో మావోయిస్టులను 2026 మార్చి కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించారు. సల్వాజుడుం పేరుతో 2007లో మావోయిస్టుల ఏరివేతలో నేరుగా కేంద్రం జోక్యం చేసుకునే ప్రక్రియ.. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. -
ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు: పీఎం మోదీ
ఢిల్లీ : ‘మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై తొలిసారి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు’ అని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి.భారత సైన్యానికి,సైంటిస్టులకు నా సెల్యూట్. పహల్గాంలో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచాన్ని కలిచి వేసింది. పహల్గాం ఘటన నన్ను వ్యక్తి గతం కలిచివేసింది. మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం.ఉగ్రవాదులు కలలో కూడా దాడిని ఊహించి ఉండరుపహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల్నిటార్గెట్ చేశారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.ఆపరేషన్ సిందూర్ అంటే పేరు కాదు, ఆవేదన. ఆపరేషన్ సిందూర్ అంటే ప్రతిజ్ఞ. ఏడో తేదీన తెల్లవారున ఈ ప్రతిజ్ఞ నెరవేరడం ప్రపంచమంతా చూసింది. పహల్గాం ఘటన తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాంభారత సైన్యం ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేసింది. భారత డ్రోన్లు ఉగ్రవాదుల స్థావరాల్ని మట్టిలో కలిపేశాయి. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ బెంబేలెత్తిపోయింది. పాక్ గుండెలపై భారత సైన్యం దాడి చేసింది. భయంతో,రక్షణ కోసం పాకిస్తాన్ ప్రపంచ దేశాలను ఆశ్రయించిందిపాక్ శరణు గోరిందిఈ నెల 10 భారత్ డీజీఎంవోను పాక్ శరణు గోరింది. మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడబోమని,సైన్యంపై కాల్పులు జరపొద్దని ప్రాధేయపడింది. 3రోజుల్లో పాక్‌పై ఊహకందని విధంగా దాడి చేశాం. ఎడారి,కొండలు,ఆకాశంలో పాక్‌ను వదిలిపెట్టలేదు. యుద్ధరంగంలో ప్రతిసారి పాక్‌ను మట్టి కరిపించాం. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌ను ఓడించాం.ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాంఅణ్వాయుధాల బ్లాక్ మెయిల్‌ను ఇక సహించేది లేదు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. అదే ఉగ్రవాదం చేతిలో అంతమవుతుంది. ఈ యుద్ధంలో మేకిన్ ఇండియా ఆయుధాలు బాగా పనిచేశాయి. చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని బట్టి పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారని అర్ధమవుతుంది. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాం. భవిష్యత్‌లో పాక్ చర్యను బట్టి భారత్ అదే స్థాయిలో స్పందిస్తోంది.నీరు,రక్తం కలిసి పారలేవు ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు. నీరు,రక్తం కలిసి పారలేవు. పాక్‌తో చర్చించాల్సింది పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే. మన ఐక్యతే.. మన శక్తి.ఈ రోజు బుద్ధపూర్ణిమ. బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపాడు.అదే మనకు ఆదర్శం అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ఆపరేషన్ సిందూర్‌ను పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత్ -పాకిస్తాన్ల మధ్య మూడురోజుల పాటు భీకర కాల్పులు జరిపాయి. భారత్ జరిపిన భీకర దాడులకు పాకిస్తాన్ తోక ముడిచింది. కాల్పులు జరపొద్దంటూ భారత్‌ను ప్రాధేయపడింది. కాల్పుల విరమణతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh— ANI (@ANI) May 12, 2025ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. రక్షణ శాఖ,విదేశాంగ శాఖ, త్రివిధ దళాదిపతులతో ఆపరేషన్ సిందూర్ గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. -
DGMO press briefing: పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏర్పాటు చేసిన త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడిన డీజీఎంవోలు ఆపరేషన్ తీరుతెన్నుల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల డీజీఎంవోలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులతోనే మా పోరాటం. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్.కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోంది. ఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోంది. అందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాం. ఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దే. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్‌తో పాకిస్తాన్‌ను అడ్డుకున్నాం. #WATCH | Delhi | Air Marshal AK Bharti presents the composite picture of targets engaged by the Indian Air Force during #OperationSindoor pic.twitter.com/hBNJAFyLTD— ANI (@ANI) May 12, 2025 పాక్ వివిధ రాకల డ్రోన్లను వినియోగించింది. మనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్‌తో అడ్డుకున్నాం. చైనా తయారు చేసిన పీ-15 మిసైళ్లతో పాక్ భారత్‌పై దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువును అడ్డుకున్నాం. పాకిస్తాన్‌లోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో నూర్ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసమైంది. సైనికులనే కాకుండా యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసింది ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాల్ని మార్చుకుంటున్నారు. లాంగ్ రేంజ్ మిసైళ్లతో శత్రు స్థావరాలపై ప్రయోగించాం. 9,10వ తేదీలలో పాకిస్తాన్ భారత్‌లోని వైమానిక స్థావరాల్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్‌కు సాధ్యం కాలేదు. మనకు ఎలాంటి నష్టం జరగకుండా పక్కా స్ట్రాటజీతో ఎయిర్ డిఫెన్స్‌ను వినియోగించాం. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఓ వైపు పాక్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేస్తూనే.. మన ఎయిర్ బేస్‌లను సురక్షితంగా ఉండేలా చూసుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాలు సమన్వయంతో కలసి పనిచేశాయి. దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు. -
రాజ్యాంగమే అత్యున్నతం
న్యూఢిల్లీ: దేశంలో అన్నింటి కంటే అత్యున్నతం పార్లమెంట్ లేదా న్యాయ వ్యవస్థ కాదని.. రాజ్యాంగమే అత్యున్నతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తేల్చిచెప్పారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఇతర పదవులు చేపట్టాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. జస్టిస్ గవాయ్ ఈ నెల 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తొలి బౌద్ధ మతస్తుడైన సీజేఐగా ఆయన రికార్డుకెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయ్ ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడి గురించి తెలిసి తాము దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ఈ దాడిలో మృతిచెందిన వారికి సుప్రీంకోర్టు తరఫున నివాళులర్పించామమని, ముష్కరుల దుశ్చర్యను ఖండించామని అన్నారు. దేశం మొత్తం ఆందోళన, సంక్షోభంలో ఉన్న సమయంలో తాము మౌనంగా ఉండలేమని పేర్కొ న్నారు. దేశంలో తాము కూడా భాగమేనని వ్యాఖ్యానించారు. ఎవరు అత్యున్నతం అనేదానిపై రాజకీయ నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలపై జసిŠట్స్ గవాయ్ స్పందించారు. రాజ్యాంగమే అత్యున్నతం అని కేశవానంద భారతి కేసులో 13 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. తనకు ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవని, రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ వంటి పదవులు తీసుకోనని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు రాజకీయ నాయకులను, ఇతర రంగాల ప్రముఖులను కలిసి మాట్లాడ డంలో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు. ఇతరులను కలవకపోతే ప్రజల సమస్యలు, కొత్త విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. భారత్–పాకిస్తాన్ మధ్య దాడులు ఆగిపోవడం మంచి పరిణామం అని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకు నష్టమే తప్ప ప్రయోజనం చేకూరలేదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తులు ఉండగా, వీరిలో ఇప్పటిదాకా 21 మంది తమ ఆస్తుల వివరాలు ప్రకటించారని జస్టిస్ గవాయ్ తెలిపారు. మిగిలినవారు కూడా త్వరలో ఆస్తుల వివరాలు వెల్లడిస్తారని స్పష్టంచేశారు. ఆస్తుల సమాచారం బహిర్గతం చేసే సంప్రదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు కూడా పాటిస్తే బాగుంటుందని సూచించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించే విషయంలో కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలకపోవడంపై మాట్లాడేందుకు జస్టిస్ గవాయ్ నిరాకరించారు. న్యాయ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం తగినంతగా ఎందుకు లేదని ప్రశ్నించగా... రాజ్యాంగబద్ధమైన పదవుల్లో నియామకాలకు రిజర్వేషన్లు లేవని బదులిచ్చారు. -
అన్నివిధాలా పైచేయి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే. లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశీ్మర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేల్చిచెప్పింది. -
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాంఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్ కసబ్,డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్ చేశాంలాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం లాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్ డీజీఎంవో మాకు ఫోన్ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్ మెసేజ్ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్ అంతు చూస్తాంపాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్ చేస్తున్నాం -
పీవోకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: మోదీ
ఢిల్లీ: పీవోకేపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు.. పీవోకేను మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదన్నారు మోదీ. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదని, పాక్ కాల్పులు జరిపితే భారత్ దాడులు చేయడం ఖాయమన్నారు.. ‘వాళ్లు (పాక్) ఒక్క తూటా పేలిస్తే.. మీరు క్షిపణితో దాడి చేయండి’ అంటూ త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రేపు పాకిస్తాన్‌తో చర్చల వేళ భారత్ వైఖరి ఏమిటో ప్రధాని మోదీ ఒక్కరోజు ముందుగానే ప్రపంచానికి తేల్చి చెప్పారు. పీవోకే విషయంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, దానిని పాక్ తమకు అప్పగించడం తప్పితే మరో మార్గం లేదని మోదీ వ్యాఖ్యానిండంతో ట్రంప్ దీనికి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదనే విషయాన్ని మోదీ సూటిగా చెప్పేశారు.ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్,సీడీఎస్‌తో పాటు త్రివిధ దళాదిపతులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రధాని మోదీ పీవోకే విషయంలో ప్రపంచ దేశాలకు ఓ సందేశాన్ని పంపించారు. అదే సమయంలో పాక్‌కు గట్టిగా బదులివ్వాలని త్రివిధ దళాలకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది #WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్. -
విమాన ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ!
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు ఓ అడ్వైజరీని జారీ చేశారు. విమానాశ్రయంలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.వివరాల ప్రకారం.. భారత్, పాక్ మధ్య కాల్పులు, దాడులు నిలిచిపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఉదయం ఓ అడ్వైజరీని జారీ చేశారు. విమానాశ్రయంలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని.. ఎయిర్‌స్పేస్ డైనమిక్స్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల మేరకు పెరిగిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్, విమానాల షెడ్యూల్లో సర్దుబాట్ల సందర్భంగా తనిఖీ కేంద్రాల్లో ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంది.#DelhiAirport continues to run its operations smoothly. Delhi International Airport Limited says however, in light of evolving airspace dynamics and heightened security protocols mandated by the Bureau of Civil Aviation Security, there may be adjustments to flight schedules and… pic.twitter.com/PoyF655nTQ— All India Radio News (@airnewsalerts) May 11, 2025ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్ కమ్యూనికేషన్ ఛానెల్స్‌తో టచ్‌లో ఉండాలని.. క్యాబిన్, చెక్-ఇన్ బ్యాగేజీకి సంబంధించి సూచించిన మార్గదర్శకాలను పాటించాలని, వీలైనంత వరకు ముందుగానే చేరుకొని భద్రతా సిబ్బందికి సహకరించాలని సూచించింది. ఎయిర్‌లైన్స్ లేదంటే ఢిల్లీ విమానాశ్రయం వెబ్సైట్లో విమానం స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని చెప్పింది. పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు.. భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మే 15 వరకు 32 విమానాశ్రయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొంది.ఈ జాబితాలో ఆదంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపొర, బటిండా, భుజ్, బికనీర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, జోధ్‌పూర్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోడ్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లూథియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పాటియాలా, పోర్బందర్, రాజ్‌కోట్ (హిరాసర్), సర్సావా, సిమ్లా, శ్రీనగర్, థోయిస్ ఉత్తర్లై ఉన్నాయి. -
పాక్‌ను ఎలా నమ్మగలం.. శశిథరూర్
ఢిల్లీ: పాక్‌ను ఎలా నమ్మగలం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ దేశ తీరుపై మండిపడ్డారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయినా కూడా పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల వద్ద మళ్లీ కాల్పులకు తెగబడింది. దీనిపై శశి థరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం, మాట మీద నిలబడకపోవడం పాక్ స్వభావం అంటూ దుయ్యబట్టారు.భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని.. కానీ.. ఉగ్రవాదులు మన దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో కూడా వారికి తెలిసేలా చేసిందన్నారు. పాక్ గుణపాఠం నేర్చుకోవాలని.. ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలంటూ శిశిథరూర్ వార్నింగ్ ఇచ్చారు.కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించి పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కన్పించాయి.మరో వైపు, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కనిపించాయి. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌ను దారికి తెచ్చిన భారత్?
ఢిల్లీ: బ్రహ్మోస్ మిసైల్‌తో పాకిస్థాన్‌ను భారత్ దారికి తెచ్చింది. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బ్రహ్మోస్-ఏ (ఎయిర్-లాంచ్డ్) క్రూయిజ్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్ ఎనిమిది సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.అణు ఆయుధ కేంద్రాలను భారత్ టార్గెట్ చేసుకోవచ్చనే భయంతో అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన పాక్ చేసింది. మే 10న తెల్లవారు జామున, భారత వైమానిక దళం రావల్పిండి సమీపంలోని చక్లాలా, పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధా వద్ద బ్రహ్మోస్-ఏ క్షిపణులతో దాడులు చేసింది.కాగా, యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్థానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది.అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. పాక్ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయింది. -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఐదుగురు హతం!
న్యూఢిల్లీ: పహల్గాం పాశవిక ఉగ్రదాడికి ప్రతిస్పందనగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను భారత్ మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత దాడిచేయడం తెల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ గడ్డపై జరిపిన ఈ క్షిపణి దాడుల్లో తొమ్మిది కీలకమైన ఉగ్ర స్థావరాలు నేలమట్టమై కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన ఐదుగురు సైతం చనిపోయినట్లు కేంద్రం సంబంధిత వివరాలను శనివారం వెల్లడించింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు భారత అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఉన్నతాధికారులు, పోలీసులు సిబ్బంది హాజరయ్యారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ తరఫున అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో ఉగ్రసంస్థలతో పాక్ ప్రభుత్వ చెలిమి మరోసారి బహిరంగంగా బట్టబయలైంది. ఆ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల గురించి క్లుప్తంగా..మొహమ్మద్ యూసుఫ్ అజార్ భారతసర్కార్ గతంలో తయారుచేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో 21వ నంబర్‌గా మొహమ్మద్ యూసుఫ్ అజార్ పేరు ఉంది. దాదాపు 50 ఏళ్లకుపైబడిన వయస్సుండే ఇతను జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు బావమరిది. 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ–814 విమానం హైజాక్ ఉదంతంలో ఇతను కీలక సూత్రధారి. 1998లో అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తిద్వారా తప్పుడు పాస్‌పోర్ట్‌తో భారత్‌లోకి వచ్చాడు. జైషేకు చెందిన బహావల్పూర్ ప్రధాన స్థావరంలో కొత్త ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలను యూసుఫ్ చూసుకునేవాడు. యూసుఫ్ కుటుంబం సైతం అదే స్థావరప్రాంగణంలో నివసిస్తోంది. ఇతనికి ఉస్తాద్ జీ, మొహమ్మద్ సలీమ్, ఘోసీ సాహెబ్ వంటి మారు పేర్లు ఉన్నాయి. ఆయుధాలను ఎలా వాడాలో యువతకు శిక్షణ ఇస్తాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు పథకరచన చేశాడు. ఇతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ గతంలోనే రెడ్‌నోటీస్ ఇచి్చంది. ఇతడిని తమకు అప్పగించాలని 2002లోనే భారత్ పాకిస్తాన్‌ను కోరింది. అజార్‌ను జమ్మూ జైలు నుంచి తప్పించేందుకు పలుమార్లు ప్లాన్లు వేసి విఫలమయ్యాడు. చివరకు భారత ఎయిర్‌పోర్టులో భద్రతావైఫల్యాలు ఉన్నట్లు పసిగట్టి హైజాక్ ప్లాన్‌ను అమలుచేశాడు. హైజాక్ జరిగిన 26 ఏళ్ల తర్వాత సూత్రధారిని భారతబలగాలు అంతం చేశాయి. హఫీజ్ మొహమ్మద్ జమీల్ఇతను కూడా జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది. యూసుఫ్‌కు ఇతను అన్నయ్య అవుతాడు. జైషేకు చెందిన మర్కాజ్ సుభాన్ అల్లాహ్‌లోని అతిపెద్ద శిక్షణా కేంద్రానికి ముహమ్మెద్ జమీల్ ఇన్చార్జ్గా ఉన్నాడు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసి, టెర్రరిస్ట్‌లుగా మార్చాల్సిన ప్రధాన బాధ్యత ఇతనిదే. జైషే ఉగ్రసంస్థలో కీలకమైన వ్యక్తి. జైషే సంస్థ కోసం నిధులను సేకరించడంలోనూ అత్యంత చురుగ్గా ఉంటాడు. ముదస్సార్ ఖదియాన్ ఖాస్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో ముదస్సార్ ఖదియాన్ ఖాస్ అత్యంత కీలకమైన వ్యక్తి. ఇతనికి అబూ జుందాల్ అనే మారుపేరు ఉంది. సరిహద్దు నుంచి కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కేలోని మర్కాజ్ తైబా ఉగ్రస్థావరానికి ఇతనే సారథ్యం వహిస్తున్నాడు. ముంబైదాడుల్లో ప్రాణాలకు తెగించి పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ స్థావరంలోనే శిక్షణ పొందాడు. మే 7 అర్థరాత్రి తర్వాత భారత దాడుల్లో ఖదియాన్ హతమయ్యాడు. ఈ వార్త తెల్సి పాకిస్తాన్ సైన్యం ఉలిక్కిపడింది. వెంటనే ఇతని అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించింది. లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో అంత్యక్రియలు జరిగాయి. ఆర్మీ చీఫ్ మునీర్ తరఫున లెఫ్టినెంట్ జనరల్, పోలీస్‌విభాగం తరఫున పంజాబ్ ప్రావిన్సు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఇతని మృతదేహం వద్ద సైనికవందనం చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. దీంతో పాక్ ఆర్మీ, ఉగ్రసంస్థలకు మధ్య ఉన్న సత్సంబంధాలు ఇతని అంత్యక్రియల వీడియోతో మరోసారి ప్రపంచానికి తెల్సివచ్చాయి. ఖలీద్ అలియాస్ అబూ అకాషా లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ అయిన ఖలీద్ అలియాస్ అబూ అకాషా సైతం ఈ దాడుల్లో హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులతో ఇతని ప్రత్యక్ష సంబంధం ఉంది. అఫ్గానిస్తాన్ నుంచి లష్కరే తోయిబా కోసం ఆయుధాలను అక్రమంగా తీసుకొచ్చేవాడు. ఇతని అంత్యక్రియలు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పాక్ ఆర్మీ సీనియర్ అధికారులు, పోలీస్‌విభాగం తరఫున పైసలాబాద్ డెప్యూటీ కమిషనర్ ఈ ఖనన క్రతువులో పాల్గొన్నారు. మొహమ్మద్ హసన్ ఖాన్ జమ్మూకశ్మీర్‌లో వేర్వేరు ఉగ్రదాడులకు సమన్వయం చేయడంలో, సహాయసహకారాలు అందించడంలో మొహమ్మద్ హసన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రస్థావర నిర్వహణ బాధ్యతలను చూసుకునే సీనియర్ ఉగ్రవాది ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కశ్మీరీ కుమారుడే ఈ హసన్ ఖాన్. -
బిక్కుబిక్కుమంటూ గడిపాం..
సాక్షి, న్యూఢిల్లీ/సంగారెడ్డి క్రైం: ‘భీకరమైన శబ్దాలు, మెరుపుల్లా డ్రోన్లు, ఆకాశం వైపు చూస్తే చాలు.. గుండె ఆగేంత భయం. భారత్–పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాము’అని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల నుంచి తాము సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 మంది, తెలంగాణకు చెందిన 17 మంది విద్యార్థులు సురక్షితంగా ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌కు చేరుకున్నారు. ఇక్కడ రెండు రాష్ట్రాల అధికారులు విద్యార్థులకు వేర్వేరుగా బస, భోజన ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా విద్యార్థులను విమానాలు, రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపారు. వీరిలో కొందరు విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు. ఓ పక్క భయం..ఇంకో పక్క రైల్వే దోపిడీ రెండు రాత్రులు డ్రోన్లు, కాల్పుల శబ్దాలతో గజగజలాడాము. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకోవడానికి పంజాబ్‌లోని పగ్వరా రైల్వే స్టేషన్‌కు వచ్చాం. అక్కడ ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కాము. అయితే ఖాళీ లేకపోవడంతో వాష్‌రూమ్ బయట నిలబడ్డాం. టీసీ మమ్మల్ని తర్వాతి స్టేషన్ లుధియానాలో దించేశారు.రిజర్వేషన్ ఉన్నా ఏసీ కోచ్‌లో ఉన్నాం అనే కారణంతో ఐదుగురు నుంచి టీసీ రూ.4,500 వసూలు చేశారు. తర్వాత వచ్చి న ఇంటర్ సిటీ ఎక్కితే దానిలో రిజర్వేషన్ లేదు.. అని వాళ్లు మరో రూ.200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. ఓ పక్క యుద్ధ ప్రాంతం నుంచి బయటపడ్డామనుకుంటే, ఇంకో పక్క రైల్వే దోపిడీతో మోసపోయాం. –ఎస్.మధువర్షిత, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ హాస్టల్ చుట్టూ.. డ్రోన్లు పదుల సంఖ్యలో పాకిస్తాన్ డ్రోన్లు మా యూనివర్సిటీలోని హాస్టల్ చుట్టూ తిరిగాయి. ఆ శబ్దాలకు చెవులు గింగురుమనడమే కాదు, ఏం జరుగుతుందోనని భయపడిపోయా. ఉదయం రైల్వేస్టేషన్‌కు వచ్చేందుకు బస్సు దగ్గరకు వెళుతుండగా అప్పుడు కూడా మాపై నుంచి డ్రోన్లు వెళ్లాయి. –సీహెచ్ భానుకిరణ్, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్డ్రోన్ల శబ్దాలకు భయం వేసింది 8వ తేదీ రాత్రి చదువుకుంటున్నాం. ఒక్కసారిగా పైనుంచి భారీ శబ్దాలు.. అవి ఏమిటో మొదట మాకు అర్థం కాలేదు. హాస్టల్ యాజమాన్యం మా అందరినీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ రూమ్‌లో కూర్చోబెట్టింది. అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ డ్రోన్ల శబ్దాలు ఆగిపోవడంతో పడుకోవడానికి రూమ్‌లలోకి వెళ్లాము. పడుకున్న రెండు గంటల్లోనే మళ్లీ భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా హాస్టల్ రూమ్‌లలో గడిపాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. –ఎస్.జీవన జ్యోతి, ఐఐటీ జగతి (జమ్మూ)ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మేము చదువుకునే యూనివర్సిటీ సమీపంలో శుక్రవారం రాత్రంతా బాంబుల శబ్దం రావడంతో ఏమి జరుగుతుందోనని భయం భయంగా గడిపాం. గత రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. యుద్ధం గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాం. పంజాబ్ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు బయలుదేరాం. – రంజిత్‌రెడ్డి, (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ ఒక్కసారిగా భయంకర శబ్దాలు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వర్సిటీ సమీపంలో ఒక్కసారిగా భయంకర శబ్దాలు రావడంతో భయం వేసింది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో యుద్ధం జరుగుతోందని అర్థమైంది. సోషల్ మీడియా మాకు అందుబాటులో లేదు. –కూచ వెంకట బాలాజీ (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ -
తల్లీబిడ్డ మరింత భద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రసూతి, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష ప్రసవాలకు గతంలో 130 ఉండగా, తాజాగా 93కు తగ్గినట్లు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) నివేదికలో వెల్లడించింది. శిశు మరణాల రేటు కూడా భారీగా తగ్గింది. 2014లో వెయ్యి జననాలకు 39 మరణాలు ఉండగా, 2021 నాటికి 27కు తగ్గినట్లు ఎస్ఆర్ఎస్ పేర్కొంది. నవజాత శిశు మరణాల రేటు 2014లో వెయ్యికి 26 ఉండగా, 2021 నాటికి 19కి తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 2014లో వెయ్యికి 45 ఉండగా, 2021 నాటికి 31కి తగ్గిందని వివరించింది. 2021లో నమోదైన 2.0 శాతం సంతానోత్పత్తి రేటు స్థిరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 7న రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) విడుదల చేసిన ఎస్ఆర్ఎస్–2021 ప్రకారం తల్లి, శిశు ఆరోగ్య సూచికలలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని తెలిపింది. తెలంగాణ, ఏపీలో ఇలా.. » ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం 2030 నాటికి 8 రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)ను సాధిస్తాయని తెలిపింది. » ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్షకు సగటున 70 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు దేశంలో 8 ఉన్నాయి. అందులో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. » తెలంగాణలో ప్రసూతి మరణాలు ప్రతి లక్షకు 45 నమోదు కాగా, ఏపీలో 46గా నమోదయ్యాయి. ప్రసూతి మరణాలు అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఐదేళ్ల లోపు శిశు మరణాల సంఖ్య సగటున 25 కన్నా తక్కువ ఉన్న 12 రాష్ట్రాల్లో సైతం ఏపీ, తెలంగాణ చోటు దక్కించుకున్నాయి. ఇది తెలంగాణలో 22 ఉండగా, ఏపీలో 24గా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. ప్రసూతి మరణాలు 2014–16లో 130, 2015–17లో 122, 2016–18లో 113, 2017–19లో 103, 2018–20లో 97, 2019–21లో 93గా నమోదయ్యాయి. -
భారత్‌పై సైబర్ దాడికి పాక్ హ్యాకర్ల యత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్‌పై సైబర్ దాడికి ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రాం, ఈమెయిల్ల ద్వారా ‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’అనే ప్రమాదకరమైన వైరస్‌ను వ్యాప్తి చేయాలని చూస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించాయి. పాక్ హ్యాకర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వైరస్‌ను అభివృధ్ధి చేసినట్లు సమాచారం. సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటాను దొంగిలించేందుకు ఈ మాల్వేర్ను వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో పంపిస్తోంది. ఈ వైరస్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే మొబైల్ పరికరాలను, కంప్యూటర్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. బ్యాంక్ సమాచారం, పాస్వర్డ్ సహా రహస్య డేటాను హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదముందని ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘.exe', "tasksche.exe' వంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న ఫైళ్లలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైళ్లు సాధారణమైనవిగానే కనిపించినా, చాలా హానికరమైనవని, ఒకసారి క్లిక్ చేసిన తర్వాత, అవి హ్యాకర్లకు రిమోట్ యాక్సెస్‌ను ఇచ్చేస్తాయని చెబుతున్నారు. డిజిటల్ అవాంతరాలను కల్పించడమే ఈ దాడుల లక్ష్యమని అంటున్నారు. ఈ నేపథ్యంలో హానికరమైన కంటెంట్, సోషల్ మీడియా ట్రెండ్లను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల సైబర్ సెల్‌లను కేంద్రం అప్రమత్తం చేసింది. -
అఫీషియల్ బెగ్గర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మానవజాతికే ముప్పుగా తయారైందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆ దేశం వద్ద అణ్వాయుధాలను లేకుండా చేయాలని అగ్ర రాజ్యాలను ఆయన కోరారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)నుంచి అతికష్టమ్మీద ఉద్దీపన ప్యాకేజీ పొందిన పాకిస్తాన్‌ను అధికారిక బిచ్చగాడు (అఫీషీయల్ బెగ్గర్)అంటూ ఒవైసీ అభివరి్ణంచారు. శనివారం ఆయన ఏఎన్ఐకిచి్చన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ నిర్వాకాలను ఎండగట్టారు. ‘ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లోని సైనిక ప్రాంతంలో ఆశ్రయం పొందుతూ దొరికిపోయాడు. పాక్ విఫల దేశమనే విషయాన్ని పశ్చిమ దేశాలు గుర్తించాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధాలనేవీ లేకుండా చేసేందుకు అనువైన సమయమిదే. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. మానవాళికే ఆ దేశం ముప్పుగా మారింది’అంటూ ఒవైసీ నిప్పులు చెరిగారు. ‘ఐఎంఎఫ్ నుంచి 100 కోట్ల డాలర్లు రుణంగా తీసుకున్న పాక్ నేతలు అఫీషియల్ బెగ్గర్స్. పాక్‌కు అప్పిచ్చేందుకు అమెరికా, జర్మనీ, జపాన్ ఎలా అంగీకరించాయి? ఈ డబ్బును పేదరికాన్ని నిర్మూలించేందుకు గానీ పోలియో తగ్గించేందుకు గానీ వాడరు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకే ఈ సొమ్మును పాక్ వాడుతుంది’అని ఒవైసీ ఆరోపించారు. అదేవిధంగా ఆయన, పాకిస్తాన్ తన సైనిక ఆపరేషన్‌కు బున్యన్–అల్– మర్సూస్’అని పేరుపెట్టడంపైనా ఆయన మండిపడ్డారు. పవిత్ర ఖురాన్‌లోని వాక్కులను పాక్ దురి్వనియోగం చేసిందన్నారు. -
27న కేరళకు నైరుతి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగానే జూన్ ఒకటో తేదీన నైరుతి కేరళలోకి ప్రవేశిస్తాయి. అంతకంటే ముందుగా మే 27వ తేదీనే కేరళను తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం తెలిపింది. అదే జరిగితే 2009 తర్వాత మొదటిసారిగా రుతు పవనాలు మేలోనే వచ్చినట్లవుతుందని పేర్కొంది. 2009లో చాలా ముందుగా అంటే మే 23వ తేదీనే భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. సాధారణంగా జూలై 8వ తేదీకల్లా దేశం మొత్తానికి రుతుపవ నాలు వ్యాప్తి చెందుతాయి.తిరిగి సెప్టెంబరు 17వ తేదీన వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15కల్లా ముగుస్తుంది. గతేడాది మే 30న, అంతకు ముందు 2023లో జూన్ 8న కేరళను రుతుపవనాలు తాకాయి. అయితే, రుతు పవనాలు ప్రవేశించడానికి, ఈ సీజన్లో దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతానికి ఎటువంటి సంబంధం లేదని ఐఎండీ అధికారులు తెలిపారు.రుతుపవనాలు కేరళలోకి సాధారణం కంటే ముందుగా గానీ లేక ఆలస్యంగా గానీ తాకాయంటే దేశవ్యాప్తంగా అవి విస్తరిస్తాయని చెప్పలేమని అన్నారు. స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక పరిస్థితులపై రుతు పవనాల వైఖరి ఆధారపడి ఉంటుందని వివరించారు. 2025 రుతుపవన సీజన్లో మొత్తమ్మీద సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసింది. దేశంలో వ్యవసాయరంగానికి రుతుపవనాలే కీలకం. -
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులను వేధించడం సరికాదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) హితవు పలికింది. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన ఇంట్లో సోదాలు చేయడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే అని ఐజేయూ జాతీయ అధ్యక్షులు వినోద్ కోహ్లీ పేర్కొన్నారు. సాక్షి మీడియాపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. సాక్షాత్తు పత్రికా సంపాదకులను టార్గెట్ చేసుకుని దాడి చేయడం శోచనీయమన్న కోహ్లీ... ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో వైఖరి మార్చుకోవాలని సూచించారు. -
సైరన్ల మోత.. మీడియా ఛానెళ్లకు కేంద్రం కీలక సూచన
ఢిల్లీ: మీడియా ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. సైరన్ల శబ్దాలు వాడొద్దంటూ సూచించింది. అలా వాడితే.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. కేవలం అవగాహన కార్యక్రమాల్లోని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది.భారత్-పాకిస్తాన్ల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సంబంధించి స్థానిక, జాతీయ మీడియా విస్తృత కవరేజీ ఇస్తోంది. ఈ క్రమంలో పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్లను న్యూస్ కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్స్ సమయంలో మాత్రమే ప్రజలు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది. -
26/11 దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఢిల్లీ: 26/11 దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై దాడి సూత్రధారిని భారత్ మట్టుబెట్టింది. ఉగ్ర స్థావరాలపై దాడిలో అబూ జిందాల్ హతమయ్యారు. భారత్ దాడిలో టాప్-5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నెల 7న భారత్ దళాలు చేసిన దాడిలో టాప్-5 ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టింది. ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతమయ్యారు.మురిద్కే, బవహాల్పూర్లో జరిగిన దాడుల్లో ఉగ్రనేతలను భారత్ హతమార్చింది. ముర్కిదే దాడిలో అబు జిందాల్ హతమవ్వగా.. అబు అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ హాజరయ్యారు. కాందహార్ హైజాక్ కీలక సూత్రధారి మహమ్మద్ యూసుఫ్ అజార్‌ను కూడా భారత్ హతం చేసేసింది. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ తుడిచిపెట్టేసింది. -
భారత్-పాక్ ఉద్రిక్తతలు.. జై శంకర్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్
ఢిల్లీ: భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియా సూచించారు. జై శంకర్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. రెండు దేశాలు చర్చలు జరుపుకోవాలని కోరారు. పరిస్థితులు సద్దుమణిగేలా చూడాలన్న రూబియో.. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామంటూ ప్రతిపాదించారు. భారత్ విధానం ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగానే ఉంటుందని జైశంకర్ అన్నారు.అదే విధంగా.. కొన్ని గంటల ముందు.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు కూడా ఫోన్ చేసి రూబియో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో రూబియో.. జైశంకర్‌తో మాట్లాడటం ఇది రెండోసారి. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అలాగే, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో కూడా విడిగా మాట్లాడుతూ, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని చెప్పారు.మరోవైపు, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము నిత్యం సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్, చైనా వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. గురువారం సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అడెల్ అల్ జుబేర్ ఢిల్లీకి రావడం తెల్సిందే. అనంతరం శుక్రవారం ఆయన పాక్ చేరుకున్నారు. ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో చర్చలు జరపనున్న వేళ మంత్రి ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
డిప్యూటీ కలెక్టర్‌కు తహసీల్దార్‌గా డిమోషన్
సాక్షి, న్యూఢిల్లీ: తహసీల్దార్ హోదాలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి, గుంటూరు జిల్లాలో మురికివాడల నివాసితుల గుడిసెలను బలవంతంగా తొలగించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డిప్యూటీ కలెక్టర్ మోహనరావును తహసీల్దార్‌గా డిమోట్చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు రూ.లక్ష జరిమానా విధించి నాలుగు వారాల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని నిర్ధారించి, 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా డిప్యూటీ కలెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ‘చట్టం గొప్పతనం శిక్షించడంలో కాదు, క్షమించడంలో ఉంది’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2013 డిసెంబరు 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా 2014 జనవరిలో అప్పటి తహసీల్దార్‌గా ఉన్న మోహనరావు గుంటూరు జిల్లాలో గుడిసెలను బలవంతంగా తొలగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అధికారికి రెండు నెలల జైలు శిక్ష విధించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. దీంతో డివిజన్ బెంచ్ ఉత్తర్వును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును మోహనరావు ఆశ్రయించగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజాగా వాదోపవాదాల అనంతరం మోహనరావు ఎటువంటి క్షమకు అర్హులు కానప్పటికీ, ఆయన పిల్లలు, కుటుంబాన్ని బాధపెట్టరాదని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ కలెక్టర్ 2 నెలల జైలు శిక్ష అనుభవిస్తే, ఆయన తన ఉద్యోగం నుంచి వైదొలగాల్సి ఉన్నందున దయ చూపిస్తున్నామని, డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్‌గా డిమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్టు వెల్లడించింది. డీమోట్ విషయంలో ఆయన వెనక్కి తగ్గకపోతే తిరిగి ఉద్యోగంలో నియమించకుండా చూస్తామని పేర్కొంది. దీంతో డిమోట్ విషయంలో మోహనరావును ఒప్పించడానికి న్యాయవాది సమయం కోరడంతో కేసు మళ్లీ వాయిదా పడింది. -
అమరుడా.. నీకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్‌కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్‌లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్‌కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు ‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడుమురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్‌కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.నీ త్యాగాన్ని మరువలేంవైఎస్ జగన్ దిగ్భ్రాంతియుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు. ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
మహిళా సైనికాధికారుల సేవలను ఉపయోగించుకోవాలి
న్యూఢిల్లీ: షార్ట్ సర్విసు కమిషన్(ఎస్ఎస్సీ)కు సంబంధించిన మహిళా సైనికాధికారులను విధుల నుంచి తప్పించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో వారికి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదని సూచించింది. ఇలాంటి సమయంలో వారి సేవలు ఉపయోగించుకోవాలని, వారికి అండగా నిలవాలని స్పష్టంచేసింది. తమకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 69 మంది మహిళా సైనికాధికారులకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు క్రమశిక్షణా చర్యల కింద పిటిషనర్లను విధుల నుంచి రిలీవ్ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ తరుణంలో ఈ పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. శక్తిసామర్థ్యలు కలిగిన మహిళల సేవలను చక్కగా వాడుకోవాలని కేంద్రానికి సూచించింది. -
జనాభా ఆధారిత పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయమే
న్యూఢిల్లీ: జనాభా గణాంకాల ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పరోక్షంగా సమరి్థంచారు. ఈ విషయంలో దక్షిణ భారత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నట్లు గుర్తుచేశారు. సరోగసీ(క్రమబదీ్ధకరణ) చట్టానికి సంబంధించిన దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సరోగసీ ద్వారా రెండో సంతానం పొందడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ జంట ఈ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.వి.నాగరత్న స్పందిస్తూ... ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతోంది. కుటుంబాలు కుదించుకుపోతున్నాయి. జననాల సంఖ్య నానాటికీ పడిపోతోంది. దక్షిణాదికి భిన్నంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోతోంది. పిల్లలను కంటూనే ఉన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది ప్రజలకు భావిస్తున్నారు. పార్లమెంట్లో ఉత్తరాది ప్రాధాన్యం మరింత పెరుగుతుందని, దక్షిణాది వాటా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు’’అని వివరించారు. ఇప్పటికే ఒక బిడ్డ ఉండగా, మరో బిడ్డ కోసం ఎందుకు ప్రయతి్నస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించారు. జనాభా తగ్గుదల వల్ల చైనాలో ఎన్నో ప్రతికూల పరిణామాలు సంభవిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితి మన దేశంలో రాదని జస్టిస్ నాగరత్న స్పష్టంచేశారు. ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరుగుతోందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవచ్చు కదా! అని పిటిషనర్లకు సూచించారు. విచారణను వాయిదా వేశారు. -
పిటిషన్ల డ్రాఫ్టింగ్ సూటిగా ఉండాలి
న్యూఢిల్లీ: న్యాయ విచారణలో ప్రక్రియలో సంక్షిప్తంగా, సూటిగా ఉండే పిటిషన్ల అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నొక్కిచెప్పారు. డ్రాఫ్టింగ్ కళపై పట్టు సాధించేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు. పిటిషన్లు స్పష్టంగా సంక్షిప్తంగా ఉండటం లాయర్లేకాదు, జడ్జీలకు కూడా ప్రయోజనకరమని చెప్పారు. ఈ నెల 13వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా శుక్రవారం తనకు సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏవోఆర్ఏ) ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు. 14వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. సీజేఐ జస్టిస్ ఖన్నా తన పదవీ కాలంలో పారదర్శకతను, సమ్మిళితత్వాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. సుప్రీంకోర్టులో ఆడ్వొకేట్స్ ఆన్ రికార్డు ఎంతో కీలకమైన వారని, అత్యున్నత న్యాయస్థానానికే కాదు, దేశంలోని పౌరులందరికీ ప్రతినిధులంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా కొనియాడారు. అయితే, తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్పగలిగే డ్రాఫ్టింగ్ కళపై పట్టు సాధించలేకపోవడం ఇంకా తనకు లోటుగానే అనిపిస్తోందని చెప్పారు. క్లుప్లంగా ఉండే ఫైళ్లను చదవడం కూడా చాలా తేలికని చెప్పారు. ఫైల్ చదివిన తర్వాత ఆకేసుపై సగం వరకు పట్టు దొరుకుతుందని జస్టిస్ ఖన్నా అన్నారు. సీనియర్లపై ఆధారపడకుండా కోర్టుల్లో కేసులను వాదించాలని న్యాయవాదులకు సూచించారు. ‘కక్షి దారులతో మాట్లాడేది మీరు. కక్షిదారులు మాట్లాడేది కూడా మీతోనే. నోట్స్ తయారు చేసేదీ మీరే. ఆ సారాంశాన్ని సీనియర్లకు వివరిస్తారు. కోర్టులో మీరే ఎందుకు వాదించరు?’అని జస్టిస్ ఖన్నా తెలిపారు. సంబంధిత విషయ పరిజ్ఞానం కలిగి ఉండటం లాయర్లకు ఎంతో ముఖ్యమైన విషయమని చెప్పారు. సుప్రీంకోర్టు కాకున్నా, మిగతా కోర్టుల్లో కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ప్రస్తుతం ముఖ్యమైన విధానంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ మీడియేషన్ ట్రెయినింగ్ కోర్సుకు ఎంతో ఆదరణ లభిస్తోందని వివరించారు. దీని వల్ల అమూల్యమైన సమయం ఆదా అవుతుందని తెలిపారు. రిటైరయ్యాక సాయం కావాల్సిన వారు మొహమాటం లేకుండా తన వద్దకు రావచ్చని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. -
ఢిల్లీలో హై అలర్ట్.. రైళ్లన్నీ నిలిపివేత
ఢిల్లీ: నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను మరింత పెంచారు. ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలను కూడా బంద్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 90 విమానాలను వివిధ విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. దీంతో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు పలు విమానాలు రద్దయ్యాయి. మొత్తం 46 దేశీయ ప్రయాణాలు, 33 రాకపోకలు రద్దయ్యాయి.మరో వైపు, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్‌తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల ముందు క్యూ కట్టారు. పంజాబ్‌లోని సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్‌పూర్, తార్న్ తరన్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.ఇక అమృత్‌సర్‌లో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం ఒక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నిత్యావసర వస్తువుల కొరత లేదని, బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించవద్దని, ప్రజలు అనవసరంగా అదనపు వస్తువులను కొనుగోలు చేయవద్దని అధికారులు కోరారు. మరోవైపు పప్పులు, వంటనూనె, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి వస్తువులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అమృత్‌సర్‌లోని కిరాణా దుకాణాలు, డిపార్ట్మెంటల్ స్టోర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. సరిహద్దు జిల్లాల్లో ఒకటైన గురుదాస్‌పూర్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాకవుట్ విధించారు. ప్రజల భద్రత కోసం పోలీసు స్క్వాడ్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలను నియమించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది.ప్రజల భద్రత దృష్ట్యా పాక్ సరిహద్దుల్లో రిట్రీట్ వేడుకలను బీఎస్ఎఫ్ నిలిపివేసింది. పంజాబ్‌లోని పాకిస్తాన్ వెంబడి ఉన్న మూడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రిట్రీట్ వేడుకలను నిర్వహించబోమని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. పాకిస్తాన్ వాఘాకు ఎదురుగా ఉన్న అట్టారీ (అమృత్సర్), ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా, ఫజిల్కా జిల్లాలోని సద్కీ వద్ద ఉన్న జేసీపీల వద్ద పాకిస్తాన్ రేంజర్లతో కలిసి బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజూ సాయంత్రం రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వమిస్తాయి.ఇక గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. తీరం వెంబడి ఉన్న రాజ్‌కోట్ రేంజ్‌లోని జామ్‌నగర్, మోర్బి, దేవభూమి, ద్వారకాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు తీరప్రాంత గ్రామాలు, బోట్‌ల్యాండింగ్ పాయింట్లను సందర్శిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను పోలీసులు కోరుతున్నారు. -
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
India-Pakistan War Updates:పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. శుక్రవారం(మే9వ తేదీ) రాత్రి కాగానే పాకిస్తాన్ మళ్లీ భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీలో పాక్ సైన్యం కాల్పులకు దిగడమే కాకుండా, డ్రోన్లను ప్రయోగిస్తూ సరహద్దు ప్రాంతాల్లో దాడులకు దిగింది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను భారత్ సైన్యం కూల్చివేసింది. దాంతో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శ్రీనగర్ లో భారీ పేలుడు శబ్దాలుపాక్ దాడులు.. ఇప్పటివరకూ దాయాదికి చెందిన 100 డ్రోన్లను కూల్చివేసిన భారత్‌ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన కీలక సమావేశంసమావేశంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్సమావేశానికి హాజరైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులుతాజా పరిణామాలను మోదీకి వివరించిన త్రివిధ దళాధిపతులు ఢిల్లీ :జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపై డ్రోన్లు,మిస్సైల్స్ తో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడులుపాక్ డ్రోన్లను గగనతలం లో నిలువరిస్తున్న భారత రక్షణ వ్యవస్థకొనసాగుతున్న బ్లాక్ అవుట్సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న భద్రతా బలగాలుఎల్ వో సి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘిస్తూ భారీగా కాల్పులుపాక్ కాల్పులను తిప్పి కొడుతున్న భారత సైన్యంఒమర్ అబ్దుల్లా ట్వీట్కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి: ఒమర్ అబ్దుల్లాIt’s my earnest appeal to everyone in & around Jammu please stay off the streets, stay at home or at the nearest place you can comfortably stay at for the next few hours. Ignore rumours, don’t spread unsubstantiated or unverified stories & we will get through this together.— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025 ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశంహాజరైన నేవీ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారుసరిహద్దుల్లో తాజా పరిస్థితిపై చర్చ సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్భారత్ - పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతజమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులుసాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులుఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్జైసల్మీర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాకౌట్ఎల్వోసీలో మళ్లీ పాక్ సైన్యం కాల్పులు యూరీ సెక్టార్ హెవీ షెల్లింగ్‌పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.నేవీ చీఫ్, జాతీయ భద్రతా సహదారు తాజా పరిణామాలను వెల్లడించారు.సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.విశాఖ:విశాఖలో అప్రమత్తమైన బలగాలుకేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత పెంపుప్రతి ఒక్క ప్రయనికుడుని పూర్తిగా తనిఖీ చేస్తున్న CISF సిబ్బందివిమానాశ్రయం ఎంట్రీ లోనే చెకింగ్ చేస్తున్న CISF బలగాలుఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ మీడియా సమావేశంగత రాత్రి పాక్.. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసింది300 నుంచి 400 వరకూ డ్రోన్లను ప్రయోగించిందిఎల్‌ఓసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందిజమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లక్ష్యంగా పాక్ దాడులు చేసిందిజమ్మూలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందిపాక్ దాడులను తిప్పికొట్టాంపౌర విమానాలను టార్గెట్ గా పాక్ దాడులు చేసిందిఆ డ్రోన్లు టర్కీకి చెందినవి తెలుస్తోందిలేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారులేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారుపాక్ ఉపయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవిపాక్ సైన్యం కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు.పాక్ దాడులను భారత వాయుసేన సమర్థవంతంగా అడ్డుకుందికర్తర్‌పూర్ కారిడార్ ను తాత్కాలికంగా మూసివేశాం అమృత్‌సర్‌లో పాక్ బాంబును నిర్వీర్యం చేసిన ఇండియన్ ఆర్మీమక్నా దిండి విలేజ్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్‌బాంబును నిర్వీర్యం చేసిన భారత సైనికులుసరిహద్దుల్లో పాక్ దాడిని తిప్పికొడుతున్న భారత సైన్యంతిరుమలభారత్- పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రత బలగాలు మాక్ డ్రిల్..తిరుమల ప్రవేశ మార్గంలో ఆక్టోపస్, పోలీస్, విజిలెన్స్, ఇతర బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహణఢిల్లీ:అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ లేఖసివిల్ డిఫెన్స్ రూల్స్ కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశంఅత్యవసర సమయంలో కావలసిన అన్ని వస్తువులను సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్న 1968 సివిల్ డిఫెన్స్ రూల్స్ఢిల్లీ ;ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ఐటీఓ వద్ద టెస్ట్ సైరెన్ చేసిన అధికారులువైమానిక దాడి సైరన్లను పరిశీలించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ8 కి.మీ వరకు వినిపించేలా సైరన్ ఏర్పాటుఅమరావతి:ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఏపీ సచివాలయ ఉద్యోగులుఅమరుడైన మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలుపాక్‌స్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్‌జమ్మూకశ్మీర్, రాజస్తాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీఢిల్లీ, హరియాణా, హిమాచల్‌లోనూ భద్రత కట్టుదిట్టంపోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసిన సరిహద్దు రాష్ట్రాలుగుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలుఅవసరమైతే టరిటోరియల్ ఆర్మీని పిలిపించుకునేందుకు అనుమతిఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన రక్షణమంత్రి రాజ్ నాథ్‌టెరిటోరియల్ ఆర్మీలో ధోనీ, మోహన్‌లాల్, సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్ దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపుభద్రతను రెండోస్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు పోర్టులు, టర్మినళ్లు, నౌకలకు భద్రత పెంచిన కేంద్రంఇస్రో కేంద్రాల దగ్గర హైఅలర్ట్‌ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ భద్రత పెంపుశ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్‌పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతల విరాళంనెల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచననెల వేతనం విరాళంగా ప్రకటించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌అప్రమత్తమైన అధికారులుఎయిర్ పోర్ట్ లో తనిఖీలు సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సీఎంలతో మాట్లాడిన మోదీసరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచనప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీఢిల్లీ:అమిత్ షా నివాసంలో హైలెవల్‌మీటింగ్‌హాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దుల్లో పరిస్థితులపై అమిత్ షా రివ్యూ ఢిల్లీ:ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ భేటీపాక్ పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతపై నిర్మలా సీతారామన్ రివ్యూసైబర్ భద్రత సన్నద్ధతపై సమీక్షించనున్న నిర్మాలా సీతారామన్ పాక్ పార్లమెంట్ లో రక్షణ మంత్రి అసిఫ్ కీలక వ్యాఖ్యలుమన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలంపాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసిందిమన రక్షణ విభాగం పూర్తి విఫలమైందిపాక్ ప్రభుత్వంపై ఎంపీలు విమర్శలుచేతగాని ప్రభుత్వం అంటూ మండిపాటు👉కాసేపట్లో ప్రధాని మోదీతో రాజ్‌నాథ్ భేటీపాక్‌పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చఉదయం త్రివిధ దళాధిపతులతో రెండున్నర గంటల పాటు భేటీఅమిత్‌షా అత్యున్నతస్థాయి సమావేశంహాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దు పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష 👉పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలుమరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరితెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతం👉జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్ వీర మరణంభారత్-పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ మృతిజవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండా గ్రామం 👉ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదాఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐభారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం👉జమ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యే రైళ్లుపాకిస్థాన్ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్‌ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టంసరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనబోర్డర్ వెళ్లిన 10 మంది పంజాబ్ మంత్రులుదేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు👉జమ్మూలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్‌సాంబా సెక్టార్లో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల హతంచైనా తయారీ పీఎల్-15 మిస్సైల్‌ను కూల్చేసిన భద్రతా బలగాలుపంజాబ్ పంట పొలాల్లో కూలిన పీఎల్-15 మిస్సైల్‌భారత్ భీకర దాడులతో పాక్ కకావికలంకంటోన్మెంట్లను ఖాళీ చేస్తున్న పాక్ ఆర్మీ కుటుంబాలు👉చండీగఢ్‌లో మోగిన సైరన్లుప్రజలు ఇళ్లలోనే ఉండాలిదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఎయిర్ ఫోర్స్👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్ సింగ్👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్.. ఇండియా గేట్ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలు బంద్👉కాసేపట్లో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీపాకిస్థాన్ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్ఎఫ్ చీఫ్ భేటీ 👉ఆపరేషన్ సిందూర్.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్ ఎటాక్ దిగిన భారత్‌లాహోర్, సియాల్కోట్, కరాచీపై భారత్ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన ఇండియన్ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చీఫ్‌తో అమిత్ షా చర్చించారు. ఇండో–పాక్ సరిహద్దుసహా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భద్రతను బీఎస్ఎఫ్ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే. -
మా సహనాన్ని పరీక్షించొద్దు
న్యూఢిల్లీ: భారత్ సహనాన్ని పరీక్షించవద్దని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. రెచ్చగొడితే తగు రీతిలో సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు బదులుగా భారత్‌లోని 15 సైనిక లక్ష్యాలపై పాక్ దాడికి యత్నించడం బదులుగా గురువారం పాక్ వ్యాప్తంగా ఉన్న మిలటరీ రాడార్లతోపాటు లాహోర్‌లోని రాడార్ వ్యవస్థను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ పైవిధంగా స్పందించారు. నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ..‘మనం ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా, ఎంతో సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చాం. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలనే నమ్ముతున్నాం. దీనిని అలుసుగా తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం దీటుగా బదులిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు. పాక్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేసిన వీర సైనికులను ఆయన అభినందించారు. దాడుల సమయంలో సామాన్యులకు హాని వాటిల్లకుండా అనితర సాధ్యమైన కచ్చితత్వంతో దాడులు జరిపామన్నారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించుకునే విషయంలో ఏ శక్తీ ఆపజాలదన్నారు. పాక్, పీవోకేల్లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడుల్లో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారని వెల్లడించారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ, సంసిద్ధత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జాతీయ భద్రత పట్ల ప్రభుత్వం పూర్తి అంకితభావంతో ఉందని పునరుద్ఘాటించారు. గురువారం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు, రక్షణ, హోం, విదేశాంగ వ్యవహారాలు, సమాచార, విద్యుత్, ఆరోగ్యం, టెలికమ్యూనికేషన్స్ వంటి కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. జాతీయ భద్రత, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను ప్రధాని మోదీ సమీక్షించారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల సన్నాహాలు, ప్రణాళికలను ఆరా తీశారు. కార్యదర్శులు తమ మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని పేర్కొన్నారు. అత్యవసర ప్రతిస్పందన, కమ్యూనికేషన్ ప్రొటోకాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పౌర రక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతోపాటు తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తిని సమర్థంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రాల అధికారులతో పాటు క్షేత్రస్ధాయి సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా తగిన రీతిలో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు కార్యదర్శులు చెప్పారు. -
Rajnath Singh: ‘ఆపరేషన్ సిందూర్’ ఆగలేదు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు హతమయ్యారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్ ఆగిపోలేదని, ఇంకా కొనసాగుతూనే ఉందని వెల్లడించారు. భారత్ ఘర్షణలు కోరుకోవడం లేదని, పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం గట్టిగా బుద్ధిచెప్పడం ఖాయమని అన్నారు. రెచ్చగొడితే ఎదురుదాడి చేయక తప్పదని తేల్చిచెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యకు పారీ్టలకు అతీతంగా వారంతా మద్దతు పలికారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, మనమంతా ఐక్యంగా ఉండాలని నిర్ణయానికొచ్చారు. భారత సైనిక దళాల పరాక్రమాన్ని ప్రశంసించారు. అన్ని పారీ్టల నాయకులు ఏకగ్రీవంగా అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటిదాకా అనుకున్న లక్ష్యాలు సాధించినట్లు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల భద్రత కోసం చేపట్టిన చర్యలను అఖిలపక్ష భేటీలో రాజ్‌నాథ్ వెల్లడించారు. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, జేడీ(యూ), ఎంఐఎం, సీపీఎం తదితర నేతలు ప్రకటించారు. లష్కరే తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) అరాచకాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవెసీ సూచించారు. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుండడం పట్ల ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మత సామరస్యం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని విపక్ష నేతలు పిలుపునిచ్చారు. భారత వైమానికి దళానికి చెందిన ఐదు యుద్ధ విమానాలు కూల్చివేసినట్లు పాకిస్తాన్ చెబుతోందని, ఈ తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పలువురు నాయకులు కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, దేశమంతా ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి అందించాలని సూచించారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తంచేశారు. -
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత సైన్యం దాడితో భారీ పేలుళ్లు జరిగాయి. దాంతో ఇస్లామాబాద్‌లోని తన నివాసం నుంచి షెహబాజ్ షరీఫ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ డ్రోన్లు, మిస్సైల్లతో దాడికి దిగింది. పాక్ మిస్సైల్లను గాల్లోనే కూల్చి వేసిన భారత సైన్యం. జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడి చేయగా వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. జైసల్మేర్, అక్నూర్లో ఇద్దరు పాక్ పైలట్లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం. లాహోర్ , సియాల్ కోర్టులో కౌంటర్ ఎటాక్‌కు దిగిన భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 14 మంది పాక్ సైనికులు హతమైనట్టు సమాచారం.S-400, L-17 సిస్టమ్‌ను యాక్టివేట్ చేసిన భారత్. జమ్మూ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాక్ దాడులు. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను హై అలర్ట్ చేసిన భారత్ సైన్యం. వరుస డ్రోన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇదిలా ఉండగా అమెరికా, యూకే, యూఏఈలతో టచ్‌లో భారత్. రంగంలోకి SZU-23, శిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తాజా పరినామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, CDSతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. రంగంలోకి భారత నౌకాధళం రంగంలోకి దిగిన భారత నౌకాధళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీ పోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత నుంచి మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలను ద్వంసం చేసిన ఇండియన్ నేవీ. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్‌పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్‌ను వణికిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేతతాజా పరినామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ,గుజరాత్, రాజస్థాన్ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్తాజా పరినామాలతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ధ భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్ల మోహరింపు.మరోవైపు పాకిస్తాన్‌పై బలూచిస్తాన్ దాడిఓవైపు భారత సైన్యం, ఇండియన్ నేవీ జరుపుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్‌కు మరోవైపు నుంచి బలూచిస్తాన్ దాడికి దిగింది. పాక్ చమురు క్షేత్రాలపనా బలూచిల దాడులు. ఇదిలా ఉండగా పాక్‌పై భారత్ దాడులను బలూచి రేడియో హైలెట్ చేస్తోంది.పాక్ రక్షణ వ్యవస్థల కూల్చివేతపాక్లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్. సర్గోదా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించిన భారత్. భారత్ దాడులతో దిక్కు తోచని పాక్ బలగాలు.15 భారత సైనిక స్థావరాలపై గురిన్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్ బొక్కబోర్లా పడింది. భారత్‌లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్లాయ్, భుజ్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అందుకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను తుత్తునియలు చేసింది. గురువారం మధ్యాహ్నం పాక్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, రావల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్‌లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన హెచ్‌క్యూ–9 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను హర్పీ కామికాజ్ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్ కూడా ధ్రువీకరించింది. ‘‘లాహోర్ సమీపంలో ఒక డ్రోన్ నేలకూలింది. గుర్జన్‌వాలా, చాక్వాల్, బహవల్పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అతోక్ ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయి’’ అని అంగీకరించింది. లాహోర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. ‘‘పాక్ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్–400తో పాటు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్‌తో పాక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం’’ అని సైన్యం ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది. యుద్ధ వాతావరణం భారత దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్‌లో సియాల్కోట్, కరాచీ, లాహోర్ సహా పలు ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అమెరికా సూచించింది. పీఎంఓ భేటీ జరుగుతుండగానే!ఇస్లామాబాద్‌పై భారత్ దాడుల సమయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అర్ధంతరంగా నిలిపేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయనను హుటాహుటిన పాతిక కి.మీ. దూరంలోని బంకర్లోకి తరలించినట్టు చెబుతున్నారు. పలుచోట్ల బ్లాకౌట్పాక్ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్సర్, హోషియార్పూర్, మొహాలీ, చండీగఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి. -
పాకిస్థాన్‌కు భారత్ మరో షాక్.. ఇకపై అవన్నీ బంద్
పాకిస్థాన్‌కు భారత్ వరుస షాక్‌లు ఇస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్.. బాగ్లిహార్ ఆనకట్ట నుంచి కూడా పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. ఇప్పటికే పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధించగా.. ఆ దేశంపై డిజిటల్ యుద్ధం కూడా ప్రారంభించింది. పాకిస్థాన్ ఓటీటీ, వెబ్‌సీరీస్‌లు, సినిమా పాటలపై నిషేధం విధించింది. పాడ్‌కాస్ట్‌లు, మీడియా కంటెంట్‌పై కూడా నిషేధం విధించాలని నిర్ణయించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది.పాక్‌ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ముప్పేట దాడి చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ విడిచి పెట్టడం లేదు. తాజాగా, వినోద రంగం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్ ఏదీ కూడా ఇక భారత్‌లో అందుబాటులో ఉండదు. సబ్స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీలు పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.కాగా, దేశవ్యాప్తంగా 27 ఎయిర్ పోర్టులను మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాల రాకపోకలు రద్దు చేశారు. ఢిల్లీకి వచ్చే, వెళ్లే 90 విమానాలను రద్దు చేశారు. రద్దయిన విమానాల్లో ఐదు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. -
పాక్ కుయుక్తులు.. భారత్ సీరియస్ వార్నింగ్
ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేసిందని.. ఉత్తర, పశ్చిమ, భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ సైన్య స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని.. ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని ఆమె స్పష్టం చేశారు. విదేశాంగశాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాక్ దాడులను తిప్పికొట్టామని.. పాక్ మిస్సైళ్లను కూల్చేశామని వెల్లడించారు.నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరుపుతున్న విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 16 మంది మృతి చెందినట్లు ఆమె వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి,భుజ్‌లో పాక్ సైన్యం దాడులు చేసిందని.. మేం చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవన్నారు.నియంత్రణ కచ్చితత్వంతో మేం కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. మిలటరీ స్థావరాలపై మేం దాడి చేయలేదు. పాక్ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. కుప్పారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ సెక్టార్లలో పాక్ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ తనకేమీ సంబంధం లేదంటూ చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తోందని విక్రమ్ మిస్త్రీ అన్నారు.‘‘పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. ఇంతకంటే ధీటుగా సమాధానం ఇస్తాం. 65 ఏళ్ల నుంచి భారత్‌ను పాక్ రెచ్చగొడుతున్నా సహనంగా ఉన్నాం. పాకిస్థాన్‌తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరపడం లేదు. ఐరాసతోనే పాకిస్థాన్ అబద్ధాలు చెప్పింది. పాక్‌లో ఉన్న టీఆర్ఎఫ్.. లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థ. ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని పాక్ బుకాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ కేంద్రం. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదులు పాక్‌లో రక్షణ పొందుతున్నారు.బిన్ లాడెన్‌కు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పించింది. పాకిస్థాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులే.. పఠాన్‌కోట్, ముంబైలో దాడులు చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ అధికారులు హాజరయ్యారు. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో పాక్ అంత్యక్రియలు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేశామని అబద్ధాలు చెప్తోంది. మేం ఎక్కడా ప్రార్థనా కేంద్రాలను టార్గెట్ చేయలేదు. పూంఛ్‌లో సిక్కు పౌరులపై పాక్ కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారు, పహల్గాం ఉగ్రదాడి వల్లే ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. పల్గాహం ఉగ్రదాడికి నిన్న భారత్ సమాధానం చెప్పింది’’ అని విక్రమ్ మిస్త్రీ చెప్పారు. -
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది.. కేంద్రం ప్రకటన
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆపరేషన్ సిందూర్‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు ఆపరేషన్ సిందూర్ వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇక, వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.అఖిలపక్ష సమావేశంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అన్నారు. అనంతరం, కేంద్రమంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌ను అన్ని పార్టీలు సమర్థించాయి. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఆపరేషన్ సిందూర్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతం. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేం. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు’ అని చెప్పుకొచ్చారు.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట భారత్ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. ఈ భేటీకి ముందు ప్రధాని మోదీ నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులను ప్రధానికి వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు.#WATCH | Centre holds all-party meeting to brief all political parties on #OperationSindoor pic.twitter.com/q96NZnhUY6— ANI (@ANI) May 8, 2025 -
పహల్గాం దాడికి తగిన నివాళి
‘ఆపరేషన్ సిందూర్’పై పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ నుదుటన సిందూరాన్ని తుడిపేసినవారిపై దాడితో న్యాయం జరిగిందని మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడులతో మరోసారి దాడి చేయాలంటే ఉగ్రవాదులు వణికిపోతారంటూ బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కొంత ఉపశమనం పొందారు. భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వాలను ప్రశంసించారు. మోదీని అడగండి అన్నారు.. ఆయన సమాధానం ఇచ్చారు: హిమాన్షి నర్వాల్ ఆపరేషన్ సిందూర్‌ను పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్వాగతించారు. ‘నా పెళ్లి జరిగి ఆరు రోజులే అయింది.. మమ్మల్ని వదిలేయండని ఉగ్రవాదులను వేడుకున్నా. కానీ ఉగ్రవాదులు మాత్రం ‘మోదీని అడగండి’ అని బదులిచ్చారు. ఈ రోజు మోదీ, మన సైన్యం వారికి సమాధానం చెప్పారు’ అని హిమాన్షి వ్యాఖ్యానించారు.బాధితులకు సరైన నివాళి: ప్రగతి జగ్దాలే ‘ఆపరేషన్ సిందూర్’ పహల్గాం దాడిలో మరణించిన వారికి సరైన నివాళి అని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పుణేవాసి సంతోష్ జగ్దాలే భార్య ప్రగతి జగ్దాలే అభివరి్ణంచారు. ‘మా సిందూరాన్ని ఉగ్రవాదులు తుడిచిపెట్టేశారు. మన సాయుధ దళాలు పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినందుకు సంతోషిస్తున్నా. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని నాకు తెలుసు’’అని ఆమె వ్యాఖ్యానించారు.ప్రతీకారం తీర్చుకున్నాం..: సంగీతా గన్బోటే ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని పహల్గాం దాడిలో మరణించిన మరో పుణే వాసి కౌస్తుభ్ గన్బోటే భార్య సంగీతా గన్బోటే అన్నారు. ‘‘ఉగ్రదాడికి భారత్ ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందోనని మేమంతా ఎదురు చూశాం. ఈ రోజు ఆపరేషన్ సిందూర్‌తో భారత సాయుధ దళాలు పహల్గాంలో పిరికిపంద దాడికి ధీటైన సమాధానం ఇచ్చాయి’’అని తెలిపారు. ఇదే నిజమైన నివాళి: అషన్య ద్వివేది ఉగ్రవాదులు భవిష్యత్తులో అమాయకులపై ఎలాంటి దాడులకు పాల్పడకుండా ఆపరేషన్ సింధూర్ బుద్ధి చెప్పిందని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కాన్పూర్ వాసి శుభమ్ ద్వివేది భార్య అషన్య సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇదే నా భర్తకు, పహల్గాం దాడిలో మరణించిన వారికి నిజమైన నివాళి. నా భర్త ఎక్కడున్నా ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘పహల్గాం’ఉగ్రవాదులను కూడా అంతమొందించాలి: జెన్నీఫర్ ఆపరేషన్ సిందూర్ బాగుందని, కానీ.. తన భర్తను చంపిన నలుగురు ఉగ్రవాదులను కూడా అంతమొందించాలని పహల్గాం దాడిలో మృతి చెందిన సుశీల్ నథానియేల్ భార్య జెన్నీఫర్ అన్నారు. ఒక జంతువు కూడా చేయని పనిని ఆ నలుగురూ చేశారని, వారు కూడా అదే శిక్షను పొందాలని, నలుగురూ చనిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. నా కుమారుడి హత్యకు ప్రతీకారం తీరింది: పోనీవాలా ఆదిల్ తండ్రి హైదర్ షాఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడులు తన కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయని పహల్గాం ఉగ్రదాడి సమయంలో పర్యాటకులను కాపాడుతూ ప్రాణాలు అరి్పంచిన పోనీవాలా సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తండ్రి హైదర్ షా అన్నారు. ఇప్పుడు తనకు సంతోషంగా ఉందన్నారు. తన సోదరునితోపాటు మరో 25 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేశారని ఆదిల్ సోదరుడు సయ్యద్ నౌషాద్ వ్యాఖ్యానించారు.ప్రాణాల విలువ ఇప్పుడు తెలిసొస్తుంది: ప్రియదర్శిని ఆచార్య ప్రాణాల విలువేంటో ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసొస్తుందని పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి భార్య ప్రియదర్శని ఆచార్య అన్నారు. చర్యలు తీసుకుంటామని భర్త మృతదేహం వద్ద ఆర్మీ సిబ్బంది తనకు హామీ ఇచ్చారని, ఈరోజు అది చేసి చూపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమికొట్టాలని, ఈ భూమ్మీద ప్రజలు స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేవారు. సరైన నిర్ణయం: మంజునాథ్ రావు తల్లి సుమతి ఆపరేషన్ సిందూర్‌తో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని పహల్గాంలో హత్యకు గురైన కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ రావు తల్లి సుమతి అన్నారు. అమాయకులకు ఏమీ జరగకూడదని, అణచివేతకు, దౌర్జన్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టకూడదని చెప్పారు. ఎంతోమంది నుదుటి తిలకాన్ని చెరిపేసినవారిని తుదముట్టించడానికి ఆపరేషన్ సింధూర్ సరైనదని పహల్గాం దాడిలో మరణించిన బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ తండ్రి చెన్నవీరప్ప అన్నారు. కొంత ఉపశమనం: ఆరతి ఆపరేషన్ సిందూర్ బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని పహల్గాం దాడిలోమృతి చెందిన కొచి్చకి చెందిన ఎన్ రామచంద్రన్ కుమార్తె ఆరతి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను సంతృప్తిగా ఉన్నాను. నా దివంగత తండ్రి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు. విడిచిపెట్టాలంటూ మా మేనమామలు ఉగ్రవాదులను వేడుకున్నారు. కానీ వారు కనికరం చూపలేదు. వారిని కాల్చి చంపారు’అంటూ దాడి రోజును గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి: బాధిత కుటుంబాలు ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టేంతవరకూ దాడులు కొనసాగించాలని పహల్గాం దాడిలో మరణించిన పశి్చమబెంగాల్ వాసులు సమీర్ గుహా, బితాన్ అధికారి కుటుంబీకులు కోరారు. పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోయే వరకు ఆ దేశంపై చర్యలు కొనసాగించాలని ఉగ్రదాడిలో భర్త యతీష్ పర్మార్, కుమారుడు స్మిత్‌లను కోల్పోయిన గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన కాజల్ బెన్ పర్మార్ ప్రభుత్వాన్ని కోరారు. పాక్‌పై భారత్ చర్య పట్ల తనకు సంతృప్తిగా ఉందని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సూరత్‌కు చెందిన శైలేష్ కలతియా భార్య శీతల్ బెన్ కలతియా చెప్పారు. హిందువులు, ముస్లింల పేరుతో నా భర్తను, ఇతరులను కాల్చి చంపిన ప్రజలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఏం చేసినా సరేనన్న శీతల్‌బెన్.. ప్రభుత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. -
కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌ల పునరుద్ధరణ అంశంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్‌జైన్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. వేల కోట్లతో నిర్మించిన బరాజ్‌లను తిరిగి వినియోగంలోకి తేవాలనే దృఢమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, సీడబ్ల్యూసీ నిర్దిష్ట మార్గదర్శకాలు సూచిస్తే, వాటికి అనుగుణంగా ముందుకు వెళతామని ఈ సందర్భంగా ఉత్తమ్ వివరించారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో బుధవారం జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనా«థ్ దాస్, ఈఎన్సీ అనిల్‌కుమార్, సీఈలు బస్వరాజు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై చర్చించారు. అతుల్ జైన్ మాట్లాడుతూ.. ఈ బరాజ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తమకు నివేదిక రూపంలో అందిస్తే, పరిశీలించి తగు మార్గదర్శకాలు సూచిస్తామని హామీ ఇచ్చారు. నీటి కేటాయింపులు జరపండి: అతుల్ జైన్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఉండే ముంపు సమస్యపై సమగ్ర అధ్యయనం చేయించాలని మంత్రి ఉత్తమ్ కోరారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డికి అవసరమైన 90 టీఎంసీల నీటిలో మొదటి దశ కింద 45 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణ మార్గాలు అన్వేషిస్తున్నాం: మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ సహా కాళేశ్వరం మూడు బరాజ్‌లను తిరిగి వినియోగంలోకి తేవడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కాకూడదన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, డిజైన్, లొకేషన్, నిర్మాణం, ఓఅండ్ఎం లోపాల వల్లే ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. కృష్ణా జలాల్లో సమర్ధ నీటి వినియోగం ఉండేలా, అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీటిని మళ్లించకుండా నీటి లెక్కలు పక్కాగా ఉండేలా టెలీమెట్రీ వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు. -
సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్‌కు ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించారు. ప్రవీణ్ 2023 మేలో సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సుబోధ్ జైస్వాల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్–2003 ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు. ప్రవీణ్ సూద్ రెండేళ్ల పదవీకాలం మే 24తో ముగియనుంది. దీంతో సీబీఐ చీఫ్‌ను ఎన్నుకోవడానికి ప్రధాని మోదీ ఎంపిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్, కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. బళ్లారి, రాయచూర్ ఎస్పీగా పనిచేసి బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)గా నియమితులయ్యారు. డిప్యూటేషన్‌పై మూడేళ్ల పాటు మారిషస్‌లో పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు మైసూరు నగర పోలీసు కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011 వరకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్‌లో అడిషనల్ పోలీస్ కమిషర్, 2013–14 వరకు కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆ తరువాత రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ ఏడీజీపీగా, అడ్మినిస్ట్రేషన్ ఏడీజీపీగా, కర్ణాటక డీజీపీగా పనిచేశారు. -
2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ముందంజలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. 2040 నాటికి చందమామపై మన వ్యోమగాములు అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. అంగారక(మార్స్), శుక్ర(వీనస్) గ్రహాలపైనా ప్రయోగాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ స్పేస్ ఎక్ప్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్(గ్లెక్స్–2025) సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. అంతరిక్ష ప్రయోగ ప్రణాళికలు వివరించారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర ఉంటుందని పేర్కొన్నారు. మరో 15 ఏళ్లలో భారతీయ వ్యోమగాములు చందమామపై అడుగుపెట్టడం తథ్యమని స్పష్టంచేశారు. మన అంతరిక్ష ప్రయాణం ఇతరులతో పోటీకి సంబంధించింది కాదని, అందరినీ కలుపుకొని ఈ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే అసలు లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం మానవాళికి లబ్ధి చేకూరేలా అంతరిక్ష ప్రయోగాల్లో తమ ఉమ్మడి లక్ష్యాన్ని అందరితో పంచుకుంటామని వ్యాఖ్యానించారు. జీ20 ఉపగ్రహం ప్రయోగిస్తాం దక్షిణాసియా దేశాల కోసం ఒక శాటిలైట్ ప్రయోగించామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు బహుమతిగా జీ20 ఉపగ్రహం ప్రయోగించబోతున్నామని చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టు మన దేశ ఆకాంక్షలకు ప్రతిబింబిస్తోందని అన్నారు. మన తొలి మానవసహిత స్పేస్–ఫ్లైట్‌ను త్వరలో అంతరిక్షంలోకి పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రో–నాసా ఉమ్మడి మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి మరికొన్ని వారాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) చేరుకోబోతున్నాడని వివరించారు. అంతరిక్షం అంటే కేవలం ఒక గమ్యం కాదని.. ఉత్సకత, ధైర్యం, సమీకృత ప్రగతికి ఒక ప్రతీక అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశ అంతరిక్ష ప్రయాణం ఆ దిశగానే సాగుతోందని చెప్పారు. 1963లో ఒక చిన్న రాకెట్ ప్రయోగంతో మన అంతరిక్ష యాత్ర ఆరంభమైందని గుర్తుచేశారు. అనంతరం ఈ రంగంలో ఎంతగానో పురోగమించామని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. మన ప్రయాణం చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. మన రాకెట్లు పేలోడ్స్ కంటే అధికంగా 140 కోట్ల మంది భారతీయుల కలలను మోసుకెళ్తుంటాయని వివరించారు. తొలి ప్రయత్నంలోనే మార్స్ వద్దకు చేరుకున్న దేశంగా ఇండియా చరిత్ర సృష్టించిందన్నారు. చంద్రయాన్ ప్రయోగాలతో చంద్రుడిపై నీటి జాడ కనిపెట్టామని, అత్యంత నాణ్యమైన చంద్రుడి ఫొటోలు చిత్రీకరించామని, అక్కడి దక్షిణ ధ్రువం గురించి మరింత సమాచారం తెలుసుకున్నామని వెల్లడించారు. రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేశామని, ఒకేసారి 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించామని గుర్తుచేశారు. 34 దేశాలకు చెందిన 400కుపైగా శాటిలైట్లను మన అంతరిక్ష నౌకల ద్వారా ప్రయోగించామని అన్నారు. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించామని, ఇదొక గొప్ప ముందడుగు అని తెలియజేశారు. -
ముష్కరులపై తిరుగులేని అస్త్రాలు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ముష్కరుల భరతం పట్టడానికి భారత సైన్యం అత్యాధునిక క్షిపణులు ప్రయోగించింది. స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైళ్లు, హ్యామర్ క్షిపణులను రంగంలోకి దించింది. వీటిని రఫేల్ యుద్ధ విమానాల నుంచి ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు చేయడంలో స్కాల్ప్ క్షిపణులు పేరుగాంచాయి. వీటిని స్టార్మ్ షాడో అని కూడా అంటారు. పగటిపూట, రాత్రిపూట మాత్రమే కాకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయోగించేలా ఉండడం వీటి ప్రత్యేకత. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. స్కాల్ప్ మిస్సైల్స్ రేంజ్ 450 కిలోమీటర్లు. జీపీఎస్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ వల్ల గురి తప్పదు. యూరోపియన్ కన్సార్టియం ఎంబీడీఏ ఈ క్షిపణులను తయారు చేసింది. దృఢమైన బంకర్లు, ఆయుధాగారాలను ధ్వంసం చేయడానికి ఇవి చక్కగా తోడ్పడతాయి. గత ఏడాది ఉక్రెయిన్ సైన్యం ఇలాంటి క్షిపణులనే తొలిసారిగా రష్యాపై ప్రయోగించింది. స్కాల్ప్ మిస్సైల్ 450 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. తక్కువ ఎత్తులో ప్రయోగించగల వీలుంది కాబట్టి శత్రువుల నిఘా వ్యవస్థలు వీటిని గుర్తించడం కష్టం. -
ప్రతిదాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింతగా పెచ్చరిల్లకుండా చూసుకుంటూనే సరైన రీతిలో ప్రతీకార చర్యలు చేపట్టామని ప్రపంచ దేశాలకు భారత్ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో దాడి వివరాలను మీడియాకు వెల్లడించారు. తొలుత విక్రమ్ మిస్రీ మాట్లాడారు. ‘‘ ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందుకు ఈడ్చుకురావాల్సిన అత్యావశ్యక పరిస్థితుల్లో ఈ దాడులు చేయాల్సి వచ్చింది. తమ భూభాగంలో ఉగ్ర వ్యవస్థపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా మేం ‘బాధ్యతాయుతమైన’ దాడులు చేశాం. పహల్గాం ఉదంతం తర్వాత సైతం మరోసారి భారత్‌లో దాడులతో తెగించేందుకు ఉగ్రసంస్థలు కుట్రలు పన్నినట్లు విశ్వసనీయ నిఘా సమాచారం అందటంతో ముందస్తుగా మెరుపుదాడులు చేశాం. పౌర, జనావాసాలకు ఏమాత్రం హాని కలగకుండా కేవలం ఉగ్రవాదుల మౌలికవసతులే లక్ష్యంగా దాడులు జరిపాం. సీమాంతర దాడులు, సీమాంతర చొరబాట్లను నిరోధించడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాడులు కొనసాగాయి. బైసారన్‌లో హేయమైన ఉగ్రదాడి జరిగింది. అమాయకులను తమ కుటుంబసభ్యుల కళ్లెదుటే తలపై గురిపెట్టి కాల్చిచంపారు. దీంతో కుటుంసభ్యుల్లో అంతులేని విషాదం, భయం అలుముకున్నాయి. భారత్ అదే స్థాయిలో ఉగ్రవాదులకు దీటైన సమాధానం చెప్పదల్చుకుంది’’ అని మిస్రీ స్పష్టంచేశారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఇష్టంలేకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కోట్ల మంది పర్యాటకులతో వృద్ధిబాటలో పయనిస్తున్న కశ్మీర్ ఆర్థికవ్యవస్థను ఉగ్రవాదులు కూలదోయాలనున్నారు. ప్రత్యేకంగా హిందువులను చంపేసి కశ్మీర్ లోయలో, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూశారు. కానీ భారతీయులు వీళ్ల నమ్మకాన్ని వమ్ముచేశారు. ఈ విషయంలో మన ప్రజలను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే’’ అని మిస్రీ అన్నారు. నారీశక్తి.. నాయకత్వం ‘ఆపరేషన్ సిందూర్’ దాడి వివరాలను ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించడం అక్కడి వారందర్నీ ఆశ్చర్యపరిచింది. భారత్ ఏఏ ప్రాంతాలపై దాడి చేసిందనే పూర్తి వివరాలను భారత ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషి, భారత వాయుసేన తరఫున వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు మీడియాకు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), పాకిస్తాన్‌లోని ఏఏ ప్రాంతాల్లో ఏ విధంగా భారత్ దాడులు చేసిందో ఈ అధికారిణులు ఇద్దరూ సవివరంగా చెప్పారు. ధైర్యసాహసాలతో దాడులు చేసిన వైనాన్ని వనితలతో చెప్పించడం వెనుక భారత సర్కార్ దౌత్య పాటవం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లింగవివక్షకు తావులేకుండా కీలక సమయాల్లోనూ భారత్ సమానత్వానికి, మహిళా సాధికారతకు జై కొడుతుందని ఈ మీడియా సమావేశంలో భారత్ మరోసారి చాటిచెప్పిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సోఫియా ఖురేషి ప్రస్తుతం ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో కల్నల్‌గా ఉన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా ప్రస్తుతం హెలికాప్టర్ పైలట్‌గా సేవలందిస్తున్నారు. ఖురేషీ హిందీలో, వ్యోమికా ఇంగ్లిష్ లో మాట్లాడారు. ‘‘ పహల్గాం దాడికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టాం. 9 ఉగ్రస్థావరాలపై దాడులు జరిపాం. గత మూడు దశాబ్దాల్లో పాకిస్తాన్లో ఎన్నో ఉగ్ర స్థావరాలు నెలకొల్పారు. ఇక్కడ రిక్రూట్మెంట్, భారత్‌పై విద్వేషాన్ని నూరిపోసేలా ప్రసంగాలు ఇవ్వడం, శిక్షణ కేంద్రాలున్నాయి’’ అని సోఫియా ఖురేషీ చెప్పారు. ‘‘ ఈ దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీ సంబంధ ప్రాంతాల జోలికి వెళ్లలేదు. అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడులు చేశాం. దాడి ప్రాంత పరిధికి తగ్గట్లుగా సరైన ఆయుధాలను, అనువైన సాంకేతకతను వినియోగించాం. దీని వల్ల లక్ష్యాలను మాత్రమే ధ్వంసంచేశాం. చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగలేదు. ముందుగా నిర్ణయించుకున్న భవనాలను మాత్రమే నేలమట్టంచేశాం. ఆ శిబిరాల్లోని ఉగ్రవాదులను హతమార్చాం. లక్ష్యాల ఛేదనలో భారత సాయుధ బలగాల ప్రణాళికా రచన, దాడి, సామర్థ్యాలను ఈ దాడులు మరోసారి చాటిచెప్పాయి. ఇకమీదట పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచుతూ దాడులు చేయాలని చూస్తే భారత్ కనీవినీ ఎరుగని రీతిలో దాడులతో విరుచుకుపడుతుందని మరోసారి స్పష్టంచేస్తున్నా. జై హింద్’’ అని వ్యోమికా సింగ్ తన మీడియా బ్రీఫింగ్ను ముగించారు. ఈ ఇద్దరు మహిళాధికారుల మధ్యలో కూర్చొని మీడియాకు వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక కశ్మీరీ పండిట్. కీలక ప్రెస్మీట్లో ఎవరెవరు వేదికపై ఆసీనులై భారతవాణిని ప్రపంచానికి వినిపించాలనే విషయంలో కేంద్రప్రభుత్వానికి అత్యంత స్పష్టత ఉందని ఈ ముగ్గురిని చూస్తే తెలుస్తోంది. -
Operation Sindoor: పేరు పెట్టింది మోదీనే
న్యూఢిల్లీ: దేశమంతటా ఎక్కడ విన్నా ‘ఆపరేషన్ సిందూర్’ ప్రతిధ్వనులే. అతికినట్టుగా సరిపోయిన ఆ పేరును స్వయంగా ప్రధాని మోదీయే సూచించారు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని భార్యల ముందే వారిని కాల్చి చంపడం తెలిసిందే. వాళ్లలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షికైతే కనీసం కాళ్ల పారాణి కూడా ఆరలేదు. పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లూ నిండిన భర్త మృతదేహం వద్ద ఆమె ఆక్రందన అందరినీ కలచివేసింది. ఉగ్రవాదులు అమాయక మహిళల నుదుటి సిందూరాన్ని తుడిపేసినందున ప్రతీకార చర్యకు ఆ పేరే బాగుంటుందని సూచించినట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. దాడుల విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఆ యన, ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించారు. కేబినెట్ అభినందనలుప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం కీలక సమావేశాలు జరిగాయి. తొలుత కేంద్ర కేబినెట్, అనంతరం భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీ అయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌ను ముక్త కంఠంతో అభినందిస్తూ కేబినెట్ తీర్మానం ఆమోదించింది. మన సైన్యం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. దాడులు జరిపిన తీరును కొనియాడారు. మరోవైపు కేంద్రం గురువారం ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. -
Operation Sindoor: ఉగ్ర తండాలపై 'రక్త సిందూరం'
అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సిందూరం వారి పాలిట రక్తసిందూరమే అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్‌కు, దాని ప్రేరేపిత ఉగ్ర ముఠాలకు తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ అంతకంతా బదులు తీర్చుకుంది. పాక్, పీఓకేల్లోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. లష్కరే, జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ‘ఆపరేషన్ సిందూర్’ను దిగి్వజయంగా పూర్తి చేసింది. ‘జైహింద్’ అంటూ పహల్గాం మృతులకు ఘనంగా నివాళులు అర్పించింది.న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి పక్షం రోజుల్లోనే భారత్ బదులు తీర్చుకుంది. అమాయక పర్యాటకులను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముష్కరులకు జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేరి్పంది. వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడైనా కలలో కూడా ఊహించనంత కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ప్రతిజ్ఞను సైన్యం దిగి్వజయంగా నెరవేర్చింది. ప్రతీకార దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్ సారథ్యంలోని జైషే మహ్మద్, హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తొయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్ర తండాల వెన్ను విరిచింది. వాటి ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను కూడా నేలమట్టం చేసేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట 25 నిమిషాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించాయి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్‌తో వైమానిక దళం, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులతో ఆర్మీ ద్విముఖ వ్యూహంతో ఏక కాలంలో దాడులకు దిగాయి. అత్యాధునిక స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ ప్రెసిషన్ బాంబులు, గైడెడ్ బాంబ్ కిట్లు, ఆత్మాహుతి డ్రోన్లతో 9 ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. వీటిలో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా నాలుగు స్వయానా పాక్ గడ్డ మీదే ఉండటం విశేషం! బాలాకోట్ దాడుల మాదిరిగా పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మన ఎయిర్‌ఫోర్స్ అమ్ములపొదిలోని అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు సరిహద్దులకు ఇవతలి నుంచే అరగంట లోపే పని ముగించేశాయి. అర్దరాత్రి 1:05కు మొదలైన దాడులు 1:30కు ముగిశాయి. ఆ వెంటనే 1:44 గంటలకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘కాసేపటి క్రితం ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. పాక్, పీఓకేల్లో నుంచి భారత్‌పై ఉగ్ర దాడులకు వ్యూహరచన చేసిన ఉగ్రవాద మౌలిక వ్యవస్థలపై దాడులు చేశాం. ఉద్రిక్తతలకు తావులేని రీతిలో, పూర్తి కచ్చితత్వంతో కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. పాక్ సైన్యాన్ని, సైనిక వ్యవస్థలను, పౌరులను ఏ మాత్రమూ లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడిలో ఆ మేరకు పూర్తి సంయమనం పాటించాం’’ అని వెల్లడించింది. ‘‘ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం. భారత్ మాతా కీ జై’’ అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది. జైహింద్’’ అని సైన్యం పేర్కొంది. దాడుల వీడియోను ఎక్స్‌లో ఉంచింది. మృతుల్లో జైషే చీఫ్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. దీన్ని అజర్ కూడా ధ్రువీకరించాడు. జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో వారితో పాటు తన నలుగురు సన్నిహిత సహచరులు కూడా మరణించినట్టు చెప్పుకొచ్చాడు. పాక్ ప్రేరేపిత ఉగ్ర తండాల పీచమణచేలా అద్భుతంగా సాగిన సైనిక చర్య భారతీయులందరికీ గర్వకారణమంటూ ప్రధాని మోదీ ప్రస్తుతించారు. భారత దాడుల్లో 26 మందే మరణించారని, 46 మందికి పైగా గాయపడ్డారని పాక్ చెప్పుకుంది. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ తొలుత ప్రగల్భాలకు దిగినా కాసేపటికే దిగొచ్చింది. గట్టి ప్రతి చర్యలు తప్పవంటూ బీరాలు పలికిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ‘ఇప్పటికైనా ఉద్రిక్తతలు పెరగకుండా భారత్ చూస్తే మేమూ సహకరిస్తాం’ అంటూ సాయంత్రానికల్లా మాట మార్చారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో బైసారన్ మైదానంలో 26 మంది పర్యాటకులను లష్కరే ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడం తెలిసిందే.అద్భుత నైపుణ్యం దాడులపై నిపుణులు సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను అమలు చేసిన తీరును రక్షణ నిపుణులు ఎంతగానో కొనియాడుతున్నారు. ఉగ్ర శిబిరాల పరిసరాల్లోని నివాసాలు తదితరాలకు ఏమాత్రమూ నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాలను మాత్రమే నేలమట్టం చేస్తూ అత్యంత కచ్చితత్వంతో దాడులు జరపడం అద్భుతమని చెబుతున్నారు. ‘‘పాక్ సైనిక స్థావరాలు, కీలక మౌలిక వ్యవస్థల వంటివాటి జోలికే వెళ్లకుండా సంయమనం పాటించడం నిస్సందేహంగా అద్భుతమైన దౌత్య ఎత్తుగడే. తద్వారా ప్రతీకార దాడులకు దిగేందుకు పాక్‌కు ఎలాంటి సాకూ లేకుండా పోయింది. పైగా 9 ఉగ్ర శిబిరాల్లో 4 స్వయానా పాక్ భూభాగంలోనే ఉండటంతో ఆ తండాలను దాయాది ఇప్పటికీ పెంచి పోషిస్తోందని నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది. దాంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి ధూర్త దేశంగా మిగిలింది’’ అని వారు వివరించారు. దాడులు చేసిన ప్రాంతాల్లో కొన్ని సరిహద్దుల నుంచి ఏకంగా 100 కి.మీ. లోపల ఉండటం విశేషం. తద్వారా పాక్‌లో ఏ లక్ష్యాన్నైనా, ఎప్పుడైనా అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సత్తా తనకుందని భారత్‌కు మరోసారి నిరూపించింది. 25 నిమిషాలు.. 9 లక్ష్యాలుదాడుల విషయంలో సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పక్కాగా వ్యవహరించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. నిఘా వర్గాలు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి లష్కరే, జైషే తదితర ఉగ్రవాద సంస్థ శిబిరాలతో పాటు ప్రధాన కార్యాలయాల ఆనుపానులను పక్కాగా సేకరించాయి. వాటి ఆధారంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. సరిహద్దులకు ఆవల క్షిపణి నిరోధక వ్యవస్థలు తదితరాలతో కాచుకుని కూచున్న శత్రు సైన్యం అంచనాలకు అందకుండా వ్యవహరించాయి. సరిహద్దులు దాటకుండానే ఆపరేషన్ నిర్వహించాయి. మురిద్కే, బహావల్‌పూర్‌ల్లోని లష్కరే, జైషే ప్రధాన స్థావరాల్లో ఒక్కోచోట కనీసం 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. -
Operation Sindoor: ఆ 9 లక్ష్యాలు ఇవే..
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కోసం ఎంపిక చేసిన 9 లక్ష్యాలను పక్కాగా సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయించుకుంది. ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలు తదితర ముసుగుల్లో నడుస్తున్నాయి. వీటిని కచ్చితంగా గుర్తించడం మన నిఘా వర్గాలకు సవాలుగా నిలిచింది. ఈ ఉగ్ర కేంద్రాలు, శిబిరాలను బయటి ప్రపంచం దృష్టి నుంచి దాచి ఉంచేందుకు పాక్ ప్రభుత్వం, సైన్యం అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటాయి. ఇందుకోసం ఎప్పటికప్పుడు వాటి గుర్తింపులు మార్చడం వంటి పనులు చేస్తుంటాయి. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నవి (4) 1: మర్కజ్ సుభాన్జైషే మహ్మద్ ప్రధాన స్థావరం. అంతర్జాతీయ సరిహద్దులకు 100 కి.మీ. దూరంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో బహావల్పూర్ సమీపంలో నరోవల్ జిల్లా తెహ్రా కలాన్ గ్రామంలో ఉంది. ఉగ్రవాదుల చేరిక, శిక్షణ వంటివి ఇక్కడ జరుగుతాయి. జైషే చీఫ్ మసూద్ అజర్ ఇక్కడినుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాడు. భద్రతా దళాలకు చిక్కిన అతన్ని 1999లో జైషే ఉగ్రవాదులు ప్రయాణికుల విమానాన్ని హైజాక్ చేసి విడిపించుకున్నారు. అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ తదితర అగ్ర నేతల నివాసాలు తదితరాలూ ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఇది అస్గర్ కనుసన్నల్లో నడుస్తోంది. సరిహద్దుల గుండా ముష్కరులు చొరబడేందుకు అనువైన ప్రాంతాలను ఇక్కడినుంచే గుర్తించడం, అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సొరంగాలు తవ్వడం జేషేకు నిత్యకృత్యం. అంతేగాక డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు, డ్రగ్స్ వంటివి పంపే లాంచ్‌ప్యాడ్ కూడా ఇదే. 2000లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటుపై దాడి మొదలుకుని 2019లో 40 మంది సీఆరీ్పఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల దాకా ప్లానింగ్ జరిగిందిక్కడే. 2: మర్కజ్ తొయిబా‘టెర్రర్ ఫ్యాక్టరీ’గా పేరు పొందింది! నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో లాహర్ సమీపంలో మురిద్కేలో ఉంది. ఇది హఫీజ్ సయీద్ నేతత్వంలో పని చేసే లష్కరే తొయిబా ప్రధాన కేంద్రం. దానికి ఆయువుపట్టు కూడా. 1990లో ఉనికిలోకి వచ్చింది. నిత్యం కనీసం 1,000 మంది రిక్రూట్లకు ఇక్కడ 2 వారాల ప్రాథమిక కోర్సు నడుస్తుంటుంది. అందులో భాగంగా శారీరక, మతోన్మాద శిక్షణ ఇస్తారు. ముంబై ఉగ్ర దాడుల కుట్ర పురుడు పోసుకుంది ఇక్కడే. వాటికి పాల్పడ్డ కసబ్ బృందానికి దౌరా–ఎ–నిబ్బత్ (నిఘా) సంబంధిత శిక్షణ ఇక్కడే ఇచ్చారు. ముంబై దాడుల సూత్రధారులు డేవిడ్ హెడ్లీ, తహవ్వుర్ రాణా కూడా ఇక్కడ శిక్షణ పొందారు. ఇక్కడ ‘అతిథి గృహం’నిర్మాణానికి అప్పటి అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ రూ.10 లక్షలిచ్చాడు. జమ్మూ కశ్మీర్‌తో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల బాంబు పేలుళ్లు లష్కరే పనే. 3: సర్జాల్ అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 6 కి.మీ. దూరంలో సియాల్కోట్లో ఉంది. గత మార్చిలో నలుగురు జమ్మూ కశ్మీర్ పోలీసు సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శిక్షణ పొందింది ఇక్కడే. 4: మెహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 12 కి.మీ. దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉంది. హిజ్బుల్‌కు కీలక శిక్షణ కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముసుగులో పని చేస్తోంది. జమ్మూలోని కథువా ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కార్యకలాపాలకు ఇది కంట్రోల్ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. పఠాన్‌కోట్ వైమానిక బేస్‌పై దాడుల వంటివాటికి ఇక్కడినుంచే వ్యూహరచన జరిగింది. జమ్మూ నగరంలో పలు ఉగ్ర దాడులకు కారకుడైన ఇర్ఫాన్ టండా ఈ కేంద్రానికి సారథి. పీఓకేలో ఉన్నవి (5) 5: అహ్నే హదీత్ (బర్నాలా) క్యాంప్ నియంత్రణ రేఖకు 9 కి.మీ. దూరంలో భీంబర్ వద్ద ఉంది. ఆయుధాల వాడకంతో పాటు అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ) తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. 150 మంది దాకా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వగలదు. 6: మర్కజ్ తొయిబాలష్కరే తొయిబా ముఖ్య కేంద్రాల్లో ఒకటి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో తాంగ్దార్ సెక్టర్లో ఉంది. కీలక ఉగ్ర శిక్షణకు ఇఎది కేంద్రం. ముంబైపై 26/11 దాడులకు తెగబడ్డ అజ్మల్ కసబ్ ఉగ్రవాద బృందం పూర్తిస్థాయి శిక్షణ పొందింది ఇక్కడే. ఇది 2000లో పుట్టుకొచ్చింది. పాక్ సైనిక, ఐఎస్ఐ అధికారులు ఇక్కడికి నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఏకకాలంలో 250 మందికి పైగా ఉగ్రవాదులు ఉండేందుకు ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. ఇక్కడినుంచి వారు ప్రధానంగా ఉత్తర కశ్మీర్లోకి చొరబడుతుంటారు. కొత్తగా చేర్చుకున్న వారికి మత, ఉగ్రవాద శిక్షణ కూడా ఇక్కడ అందుతుంది. పహల్గాంలో ఉగ్రవాదులపై దాడులకు తెగబడింది ఇక్కడినుంచి చొరబడ్డ ఉగ్రవాదులే! 2024లో కశ్మీర్‌లోని సోన్మార్గ్, గుల్మార్గ్లో భద్రతా బలగాలు, పౌరులపై దాడులు కూడా వారి పనే. 7: గుల్పూర్ క్యాంప్నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో కోట్లిలో ఉంది. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఆపరేట్ చేసే లష్కరే ఉగ్రవాదులకు బేస్. పూంచ్ 2023 దాడులు, 2024లో యాత్రికులపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఈ శిబిరానికి తరచూ వచ్చి రిక్రూటీలకు మతోన్మాద ప్రసంగాలిచ్చేవాడు. 8: అబ్బాస్ క్యాంప్ నియంత్రణ రేఖకు 13 కి.మీ. దూరంలో కోట్లీలో ఉంది. లష్కరే ఆత్మాహుతి బాంబర్లకు ప్రధాన కేంద్రం. 150 మందికి పైగా ఉగ్రవాదులకు ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. పూంచ్, రాజౌరీల్లో చొరబాట్లు, ఉగ్ర దాడులకు వ్యూహరచన మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక్కడి వ్యవహారాలు చూసేది క్వారీ జరార్. జేషే చీఫ్ మసూద్ సోదరుడైన అస్గర్‌కు సన్నిహితుడు. పలు ఎన్ఐఏ కేసుల్లో జరార్ ప్రధాన నిందితుడు. హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తో పాటు స్నైపర్ దాడులు తదితరాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. 9: సయీద్నా బిలాల్ క్యాంప్జైషే ఉగ్ర శిబిరం. ముజఫరాబాద్‌లో ఉంది. తొలుత ఉగ్ర సామగ్రి నిల్వ కేంద్రం. తర్వాత ఆధునీకరించి ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాల వాడకం, అడవులు, ప్రతికూల పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ఉండటం తదితరాల్లో శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చారు. నిత్యం కనీసం 100 మందికి పైగా ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. పాక్ సైన్యానికి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ వీరికి నేరుగా శిక్షణ ఇస్తుంది! -
ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే: ఖర్గే
ఢిల్లీ: సైనికులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం నిర్వహించింది.‘‘పీవోకే నుంచి ఉగ్రవాదులు పనిచేస్తున్నారనేది స్పష్టమైంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే. దేశ రక్షణ విషయంలో మనమంతా కలిసి ఉండాలి. సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతిస్తాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సైనిక దళాలను చూసి తాము గర్విస్తున్నామని ఖర్గే అన్నారు.కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు రోజుల ముందే తెలుసునంటూ నిన్న(మంగళవారం) మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై దాడి జరగబోతున్నట్లు మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని.. అందుకే ఆయన జమ్మూకశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. నిఘా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మోదీ సైతం స్వయంగా ఒప్పుకున్నారంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. -
ఢిల్లీలో కరెంట్ కట్.. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే..?
ఢిల్లీ: సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌లో భాగంగా నగరంలో ఇవాళ రాత్రి 8 నుంచి 8.15 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ప్రజలంతా సహకరించాలని న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. అయితే, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రాష్ట్రపతి భవన్, పీఎంవో, మెట్రో స్టేషన్లు, ఇతర ముఖ్య ప్రదేశాలకు ఇది వర్తించదని ఎన్డీఎంసీ వెల్లడించింది.పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. ఈ అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరిగాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది.వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదికయ్యాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్ డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి. -
పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాం: అజిత్ దోవల్
ఢిల్లీ: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యం భారత్‌కు లేదని.. పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై ఇతర దేశాల మద్దతు కూడగట్టే క్రమంలో అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులతోచర్చించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై తీసుకున్న చర్యలు.. ఆపరేషన్ నిర్వహించడానికి గల కారణాలను ఆ దేశాల ప్రతినిధులకు వివరించారు.కాగా, పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. -
ఆపరేషన్ సిందూర్.. మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం
ఢిల్లీ: ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం.ముఖ్యంగా బవహల్పూర్లోని జైష్-ఎ-మహమ్మద్ శిబిరాలు, సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మందితో పాటు అనుచరులు మరణించినట్లు తెలుస్తోంది. మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతడి భార్య కూడా ఉన్నట్లు సమాచారం. -
Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం వంతంగా ముగి;సింది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మంగళవారం అర్ధ రాత్రి భారత భద్రతా దళాలు ఆర్మీ,నేవీలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి.ఆపరేషన్‌లో భాగంగా లక్షిత దాడుల్ని అరగంటలోపు నేలమట్టం చేసింది. 9స్థావరాల్లో ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశాయి. అనంతరం ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం జరిగింది. ఈ ఆపరేషన్‌కు సారధ్యం వహించిన భారత సశస్త్ర దళాల్లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ,విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది వెల్లడించారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోల్ని బహిర్ఘతం చేశారు. దీంతో ప్రపంచ మొత్తం ఈ ఇద్దరి మహిళా అధికారులు గురించి చర్చ మొదలైంది. ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలలైన ఆర్మీలోని సిగ్నల్‌కోర్‌కి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ. అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచున్నారు. ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించారు. ఫోర్స్ 18కు నాయకత్వం 2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ భారత్ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళజాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుండి 8 వరకు పుణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దళాల్లో, లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ మాత్రమే మహిళా కమాండర్‌గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం.పీస్ కీపింగ్ ఆపరేషన్స్‌లోనూఆమె నేతృత్వంలోని 40-సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు, సంఘర్షణ లేదా సంఘర్షణానంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ (PKOs). ఈ పీకేవో ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించారు. హ్యూమానిటేరియన్ మైన్ యాక్షన్ (HMA) వంటి కీలక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన పీస్ కీపింగ్ శిక్షణాదారులలోంచి ఆమెను ఎంపిక చేశారు.యుఎన్ శాంతి పరిరక్షణలో విశిష్ట అనుభవం2006లో, యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ (కాంగో) లో మిలిటరీ అబ్జర్వర్‌గా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేవోలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. సైనిక సేవ ఆమెకు వారసత్వంగా ఆమె తాత సైన్యంలో సేవలందించగా, ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందిన అధికారి. ఈ విధంగా ఆమె కుటుంబం సైనిక సేవలతో ముడిపడిందివింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh)వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. వ్యోమికా సింగ్ విషయానికొస్తే.. వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్ధం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కల ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరి, తరువాత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.చల్లని గాలుల మధ్య నుండి మసక చీకట్ల వరకూ అన్నీ సాహసాలే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చీటాహ్ వంటి హెలికాప్టర్లను నడిపుతూ, జమ్మూ కాశ్మీర్ లోని ఎత్తయిన ప్రాంతాలు నుండి, ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకూ సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరంగ్ (21,650 అడుగుల ఎత్తు) పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పహల్గాంలో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో, దేశానికి సమాచారం ఇవ్వడమే కాక, భారత సైన్యం ఇప్పుడు ఎవరిచేత ప్రాతినిధ్యం వహించబడుతోంది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ సింగ్ చూపించారు. -
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్.. లైవ్
ఢిల్లీ: పాక్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులపై భారత విదేశాంగ, రక్షణ శాఖ బుధవారం ఉదయం సంయుక్తంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్ ప్రారంభానికి ముందు భారత్‌పై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడుల తాలూకు వీడియోల్ని విడుదల చేసింది. అనంతరం, ప్రెస్ మీట్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ముందుగా విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందుపై మిస్రీ తర్వాత ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాల్ని వెల్లడించారు. #WATCH | Delhi | #OperationSindoor| Foreign Secretary Vikram Misri says, " A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a Front for UN proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba...Investigations into the Pahalgam… pic.twitter.com/JqpIbHrttN— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్..👉ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ ఆపరేషన్ సిందూర్ 1.05 నిమిషాలకు ప్రారంభమై 1.30కి ముగిసింది9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్‌లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వసం చేశాం అప్జన్ కసబ్కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు.ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు చేశాం 👉విక్రమ్ మిస్రీఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారులష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ఏ ఈ దాడి చేసింది దాడిని సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. టీఆర్ఎఫ్కు పాకిస్తాన్ అండదండలున్నాయి.జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ దాడులు చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందిఉగ్రవాదులను చట్టం ముందు శిక్షించాలిముంబై ఉగ్రదాడి తర్వాత దేశంలో పహల్గాం అతి పెద్ద ఉగ్రదాడిభారత్..పాక్‌కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది.ఉగ్రసంస్థల మౌలిక వసతులను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సిందూర్ జరిగిందిగతేడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారుజమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని ,ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసేందుకు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందిపాక్లో ఉన్న ఉగ్ర సంస్థల గురించి 2023 లో భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్ళిందిపాకిస్తాన్పై దౌత్య పరమైన ఆంక్షలు విధించాంఅయినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపలేదుఉగ్రదాడులు చేసిన వారికి పాక్ షెల్టర్ ఇస్తోందిసీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ 22, 2025న, పాకిస్తాన్,పాకిస్తాన్ శిక్షణ పొందిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో భారతీయ పర్యాటకులపై దారుణమైన దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది మరణించారు, వీరిలో ఒక నేపాల్ జాతీయుడు కూడా ఉన్నారు. 2008 నవంబర్ 26 ముంబై దాడుల తర్వాత ఇది అత్యధిక పౌర మరణాలతో కూడిన ఉగ్రదాడి. దాడి అత్యంత క్రూరంగా జరిగింది, బాధితులను సమీప నుండి తలపై కాల్చి చంపారు, వారి కుటుంబాల ముందే ఈ హత్యలు జరిగాయి. కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టేలా హత్యలు జరిగాయి, సందేశాన్ని తీసుకెళ్లమని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్లో తిరిగి వస్తున్న సాధారణ స్థితిని అడ్డుకోవడం ఈ దాడి లక్ష్యం. గత సంవత్సరం 23 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించిన ఈ ప్రాంతంలో పర్యాటక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం దీని ఉద్దేశం. ఈ దాడి యూనియన్ టెరిటరీలో వృద్ధిని అడ్డుకుని, పాకిస్తాన్ నుండి సరిహద్దు ఉగ్రవాదానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో జరిగింది. ఈ దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మతపరమైన అసమ్మతిని రెచ్చగొట్టే ఉద్దేశంతో జరిగింది.భారత ప్రభుత్వం,ప్రజలు ఈ కుట్రలను విఫలం చేశారు. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ” (TRF) అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. టీఆర్ఎఫ్ అనేది ఐక్యరాష్ట్ర సమితి నిషేధిత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబాకు ముసుగు. మే, నవంబర్ 2024లో ఐక్యరాష్ట్ర సమితి 1267 శిక్షణ కమిటీకి భారత్ TRF గురించి సమాచారం అందించింది, ఇది పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు కవర్‌గా పనిచేస్తుందని తెలిపింది. డిసెంబర్ 2023లో లష్కర్, జైష్-ఎ-మహమ్మద్ టీఆర్ఎఫ్ టి చిన్న ఉగ్రవాద సంస్థల ద్వారా పనిచేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఏప్రిల్ 25, 2025 ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి పత్రికా ప్రకటనలో TRF ప్రస్తావనను తొలగించాలని పాకిస్తాన్ ఒత్తిడి చేసింది పహల్గాం దాడి దర్యాప్తులో ఉగ్రవాదులు పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. TRF చేసిన బాధ్యత ప్రకటనలు, లష్కర్-ఎ-తోయిబా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాటిని రీపోస్ట్ చేయడం దీనికి నిదర్శనం. సాక్షుల గుర్తింపు, చట్ట అమలు సంస్థలకు అందిన సమాచారం ఆధారంగా దాడి చేసినవారిని గుర్తించారు. ఈ దాడి ప్రణాళికకర్తలు, మద్దతుదారుల గురించి భారత ఇంటెలిజెన్స్ ఖచ్చితమైన సమాచారం సేకరించింది. భారత్‌లో సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్ చరిత్ర బాగా డాక్యుమెంట్ చేయబడింది. పాకిస్తాన్ అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరుగాంచింది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ తప్పుదారి పట్టిస్తుంది. సజిద్ మీర్ కేసు దీనికి ఉదాహరణ: ఈ ఉగ్రవాదిని మృతుడిగా ప్రకటించి, అంతర్జాతీయ ఒత్తిడి తర్వాత అతను బతికే ఉన్నాడని, అరెస్టు చేశామని తెలిపారు.పహల్గాం దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఏప్రిల్ 23న పాకిస్తాన్‌తో సంబంధాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రాథమిక చర్యలను ప్రకటించింది. దాడి జరిగిన రెండు వారాలు గడిచినప్పటికీ, పాకిస్తాన్ తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేవలం ఆరోపణలు, తిరస్కరణలతో సరిపెట్టింది. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గుండ్లు మరిన్ని దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ గుర్తించింది.ఆపరేషన్ సిందూర్: ఈ ఉదయం భారత్ తన హక్కును వినియోగించుకుని, సరిహద్దు దాడులను నిరోధించడానికి, నివారించడానికి చర్యలు తీసుకుంది. ఈ చర్యలు నియంత్రిత, అనవసర ఉద్రిక్తత లేని, సమతూకమైన, బాధ్యతాయుతమైనవి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, భారత్‌కు పంపబడే ఉగ్రవాదులను అడ్డుకోవడంపై దృష్టి సారించారు. ఏప్రిల్ 25, 2025న ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి జారీ చేసిన పత్రికా ప్రకటనలో “ఈ దుర్మార్గపు ఉగ్రవాద చర్యకు కారకులు, నిర్వాహకులు, ఆర్థిక సహాయకులు, ప్రోత్సాహకులను జవాబుదారీగా చేసి న్యాయస్థానం ముందు తీసుకురావాలి’ అని నొక్కి చెప్పింది. కల్నల్ సోఫియా ఖురేషీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషీవింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ #WATCH | #OperationSindoor | Terror site Markaz Subhan Allah, Bahawalpur, Pakistan, the headquarters of Jaish-e-Mohammed, targeted by Indian Armed Forces." pic.twitter.com/iM4s91ktb8— ANI (@ANI) May 7, 2025👉ఆపరేషన్ సిందూర్‌లో ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన పాక్ ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఇవే ఎల్ఈటీ-లష్కరే తోయిబా,జేఈఎం-జైషే మహమ్మద్, హెచ్ఎం-హిజ్బుల్ ముజాహిదీన్ 1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - ఎల్ఈటీ3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్కోట్ - హెచ్ఎం5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - ఎల్ఈటీ6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - హెచ్ఎం8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - ఎల్ఈటీ9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎం #WATCH | Video shows multiple hits on the Mundrike and other terrorist camps in Pakistan and PoJKCol. Sofiya Qureshi says, "No military installation was targeted, and till now there are no reports of civilian casualties in Pakistan." pic.twitter.com/zoESwND7XD— ANI (@ANI) May 7, 2025 -
Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి?
delhi: పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. తాజా సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..! అంటూ ఇండియన్ ఆర్మీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్‌పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది.పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. సింధూరం అనేది దుర్గా, శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమ శివుడు పార్వతి దేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు.. భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు. ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా. This video captures the moment an Indian missile hit Bahawalpur, Pakistan, during 'Operation Sindoor' — a series of retaliatory attacks for last month’s Pahalgam bombing that killed 26 people, which India blames on Pakistan. pic.twitter.com/9g0yzHhYVB— Al Jazeera English (@AJEnglish) May 6, 2025సింధూరం భారతీయ సాంస్కృతికలో వివాహ తత్వానికి మాత్రమే కాదు, ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం. రాజపుత్‌లు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్.. పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు. ఇది నీతికోసం, ధర్మంకోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తోంది. దేశాన్ని కుదిపేసిన వినయ్ నర్వాల్ ఘటన ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌నే. వినయ్ నర్వాల్ దంపతులకు పెళ్లై అప్పటికి ఆరు రోజుల క్రితమే. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి నర్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు. దెబ్బకు దెబ్బ తీసిందిఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలిస్తే.. భారత్ అదే దారిలో నడిచింది. దెబ్బకు దెబ్బ తీసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో, ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా, ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. -
Operation Sindoor: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..రాత్రంతా పర్యవేక్షించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు. భారత్ జరిపిన దాడిని పాకిస్తాన్ అంగీకరించింది. తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని తెలిపింది. ఇక ఇండియన్ ఆర్మీ విజయవంతగా నిర్వహించిన ఈ ఆపరేషన్ సిందూర్‌ను (OperationSindoor)ప్రధాని మోదీ రాత్రంతా సమీక్షించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ కేంద్రంగా ఉన్న బహావల్పూర్ సహా పంజాబ్ ప్రావిన్స్‌లోని ఐదు ప్రదేశాలు, పీఓకేలోని నాలుగు ప్రదేశాలు ఈ దాడులు జరిగాయి. వీటిలో మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం సైతం ఉంది. "प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో బుధవారం తెల్లవారు జామున ఉదయం 1:44 గంటలకు ఆపరేషన్ సింధూర్‌పై ప్రకటన చేసింది. తాము దాడులు నిర్వహించింది ఉగ్రవాద స్థావరాలేనని, పాకిస్తాన్ సైనిక స్థావరాలు కాదని స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి నేరుగా సమీక్షించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, గూఢచార సంస్థల ఉన్నతాధికారుల నుండి నిరంతరంగా సమాచారం అందుకుంది. మంగళవారం రాత్రి నుంచే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో ప్రధాని పలుమార్లు మాట్లాడారు. పహల్గాం ఘటన అనంతరం ప్రభుత్వ గూఢచార సంస్థల ద్వారా పొందిన కీలక నిఘా సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచాఉరం. దాడుల అనంతరం భారత ప్రభుత్వం ముఖ్య అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించింది. అమెరికా, యూకే , రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాధికారులను భారత ఉన్నతాధికారులు సంప్రదించి ఈ దాడులు గురించి పూర్తిగా వివరించారు. -
సన్నద్ధతకు సంసిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మాక్‌డ్రిల్స్‌కు సర్వం సిద్ధమైంది. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు దేశమంతా ఒక్కటవుతోంది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు జరగనున్నాయి. పట్టణాల నుంచి గ్రామస్థాయి దాకా వాటిలో ప్రజలంతా చురుగ్గా భాగస్వాములు కానున్నారు. 6.5 లక్షల మందికి పైగా వలెంటీర్లు ఈ క్రతువులో వారికి సాయపడనున్నారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో బుధవారం సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి దాకా ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరుగుతాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది. వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశీ్మర్, పశి్చమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదిక కానున్నాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.కేంద్రం సమీక్ష పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ దేశవ్యాప్త డ్రిల్స్ సన్నద్ధతను కేంద్ర హోం శాఖ మంగళవారం సమీక్షించింది. డ్రిల్స్ విధివిధానాలు తదితరాలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు రక్షణ, పోలీసు విభాగాల అత్యున్నత స్థాయి అధికారులు భేటీలో పాల్గొన్నారు. డ్రిల్స్‌లో విద్యార్థులు, ఎన్సీసీ కాడెట్లు, యువతతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ఆస్పత్రుల సిబ్బంది, రైల్వే, మెట్రో ఉద్యోగులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.ఎక్కడికక్కడ పోలీసు, సైనిక సిబ్బంది వారితో సమన్వయం చేసుకోనున్నారు. 1971 తర్వాత రక్షణపరంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతుండటం ఇదే తొలిసారి. అప్పుడు కూడా పాక్‌తో యుద్ధ నేపథ్యంలోనే ఈ కసరత్తు నిర్వహించారు. అంతకుముందు 1962, 1965ల్లో కూడా చైనా, పాక్‌తో పూర్తిస్థాయి యుద్ధం సందర్భంగా మాక్ డ్రిల్స్ జరిపారు. మంగళవారం అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్స్ సన్నాహక కసరత్తులు పోలీసు తదితర బృందాల పర్యవేక్షణలో ముమ్మరంగా జరిగాయి. విద్యార్థులు, యువత మొదలుకుని ప్రజలంతా పెద్ద సంఖ్యలో వాటిలో పాల్గొన్నారు.డ్రిల్స్ ఇలా...⇒ మాక్ డ్రిల్స్‌లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు విని్పస్తాయి. ⇒ వెంటనే పరిసర ప్రాంతాల పౌరులంతా క్షణాల్లో అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలాలి. వీలైన చోట్ల బంకర్లు, సబ్‌వేలు, అండర్‌గ్రౌండ్ మెట్రో తదితర చోట్ల తలదాచుకోవాలి. ⇒ ఈ కసరత్తులో యువత, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కాడెట్లు మొదలుకుని హోం గార్డుల దాకా అందరినీ భాగస్వాములను చేస్తారు. ⇒ కీలక సంస్థలు, మౌలిక సదుపాయ వ్యవస్థలను దాడుల నుంచి కాపాడుకోవడం, అవి శత్రువు కంటపడకుండా జాగ్రత్త పడటం తదితరాల్లో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగి్నమాపక తదితర బృందాలు వారికి శిక్షణ ఇస్తాయి. ⇒ బ్లాకౌట్ వంటివి చోటుచేసుకుంటే ఎలా స్పందించాలో, స్వీయరక్షణతో పాటు పౌరులను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తాయి. ⇒ రాత్రి 7.30 నుంచి 10 నిమిషాల పాటు క్రాష్ బ్లాకౌట్ ‘లైట్లను ఆపేయడం) కసరత్తు జరుగుతుంది. ⇒ డ్రిల్స్ కోసం హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్ వంటివాటిని వైమానిక దళ లింకులతో అనుసంధానిస్తారు. ⇒ కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్స్ విపత్తులకు ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తారు. ⇒ డ్రిల్స్ నిమిత్తం స్పందన బృందాలన్నింటికీ ఇప్పటికే కోడ్ వర్డ్స్ కేటాయించారు. ⇒ ఎప్పుడేం చేయాలో పేర్కొంటూ టైమ్‌లైన్‌ను కూడా స్పష్టంగా నిర్దేశించారు. ⇒ వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల సమర్థతను డ్రిల్స్ ద్వారా పరిశీలించనున్నారు. ⇒ కేంద్ర హోం శాఖ పౌర రక్షణ నిబంధనలు (1968) సెక్షన్ 19 ప్రకారం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇవి అందుబాటులో ఉంచుకోవాలి⇒ మాక్ డ్రిల్స్‌కు పౌరులు పూరిస్థాయిలో సన్నద్ధం కావాలి. ⇒అత్యవసర చికిత్స నిమిత్తం మెడికల్ కిట్లు, కరెంటు కోత తదితరాల కోసం టార్చిలు, క్యాండిళ్లు వెంట ఉంచుకోవాలి. అలాగే వీలైనంత నగదు కూడా దగ్గరుంచుకోవాలి. ⇒ వీటిపై పౌరులను అప్రమత్తం చేయాల్సిందిగా అధికారులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ⇒ ఢిల్లీ, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పౌర రక్షణ బృందాలు ఇప్పటికే చురుగ్గా పని చేస్తున్నాయి. ⇒ అయితే ఇవన్నీ స్వచ్ఛంద స్వభావంతో కూడిన బృందాలే.ఎక్కడెక్కడ?దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్‌డ్రిల్స్ జరుగుతాయి.⇒ వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి.⇒ 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ వంటివి ఉన్నాయి.ఈసారి తగ్గేదే లే! ⇒ ఉరి, బాలాకోట్ మాదిరిగా కాదు ⇒ త్వరలో బాహాటంగా భారీ ‘ఆపరేషన్’ ⇒ ఆ రాజకీయ సందేశమే డ్రిల్స్ లక్ష్యం2016లో సర్జికల్ స్ట్రైక్స్. 2019లో బాలాకోట్ వైమానిక దాడులు. ఉగ్రవాద దుశ్చర్యలకు గతంలో మోదీ సర్కారు ప్రతిస్పందనలు. రెండూ సైలెంట్‌గా నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్లే. ఉరి, పుల్వామా ఉగ్ర చర్యలతో పోలిస్తే ‘పహల్గాం’ దాడి పరిస్థితి పూర్తి భిన్నం. 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. ఒక్కొక్కరినీ మతం అడిగి పిట్టల్లా కాల్చేసి పైశాచికత్వం ప్రదర్శించారు. అంతేగాక ‘పోయి మోదీకి చెప్పుకోండి’ అంటూ కేంద్రానికి సూటిగా సవాలు విసిరారు. దాడిని తలచుకుని భారతీయులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఈసారి కొట్టబోయే దెబ్బ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండాలని కోరుతున్నారు. అందుకే ఈసారి భారత ప్రతి చర్య పూర్తి భిన్నంగా ఉండటం ఖాయమంటున్నారు. బాహాటంగా, అత్యంత భారీ స్థాయిలో సైనిక చర్య ఉండనుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధత, పౌర అవగాహన కోసం దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ నిర్ణయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదికి గట్టి రాజకీయ సందేశమివ్వడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. ఉగ్రవాదానికి, దానికి తల్లివేరు వంటి పొరుగు దేశానికి బుద్ధి చెప్పే విషయంలో దేశమంతా ఒక్కతాటిపై ఉందని ప్రపంచానికి చాటేందుకే మోదీ సర్కారు ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. భారత ‘ఆపరేషన్’కు పాక్ స్పందనను బట్టి ఒకవేళ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినా అందుకు దేశమంతా సంసిద్ధంగా ఉందని చాటడం కూడా ఈ డ్రిల్స్ ఉద్దేశమని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మానస సరోవర యాత్రకు వేళాయె
సాక్షి, న్యూఢిల్లీ: కైలాస మానససరోవర యాత్ర ఐదేళ్ల తర్వాత త్వరలోనే మళ్లీ మొదలుకానుంది. యాత్రకు వెళ్లాలనుకునే వారు ఈనెల 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. తొలి యాత్ర జూన్ 30న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ సంబంధిత ఉత్తరఖండ్, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపింది. యాత్రకు సంబంధించిన వివరాలను రెండు రోజుల క్రితం తన వెబ్సైట్లో ఉంచింది. కరోనా సమయంలో బ్రేక్ పడిన ఈ యాత్రకు కేంద్రం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్దపడుతున్నారు. పాస్‌పోర్టే తొలి అర్హత యాత్రలో పాల్గొనే వారు భారత పౌరుడై, కచి్చతంగా పాస్‌పోర్టు కలిగి ఉండాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ పాస్‌పోర్టే తొలి అర్హతని ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పాస్‌పోర్టుకు 6 నెలల వ్యాలిడిటీ ఉండాలి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18–70 ఏళ్ల మధ్య వయసు్కలై ఉండాలి. బీఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్) 25, అంతకంటే తక్కువ ఉన్న వారినే యాత్రకు అనుమతి ఇస్తారు.ఆన్లైన్లో దరఖాస్తు చేసేప్పుడు అన్ని కాలమ్‌లను కచ్చితంగా పూర్తి చేయాలి. ఒక్క కాలమ్ నింపకున్నా సిస్టం ఆ దరఖాస్తును తీసుకోదు. పాస్‌పోర్టు మొదటి పేజీ, చివరి పేజీని అప్లోడ్ చేయాలి. ఒక అకౌంట్ నుంచి రెండు దరఖాస్తులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బులు, మూర్చ తదితర సమస్యలు ఉన్న వారు యాత్రకు అనర్హులు. రూట్‌ను బట్టి యాత్రకయ్యే ఖర్చు మారుతుంది. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. యాత్రికులే పూర్తిగా ఈ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. డ్రా పద్ధతిలో ఎంపిక ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారిని విదేశాంగ శాఖ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనుంది. ఎంపికైన వారికి ఈ–మెయిల్, మొబైల్ నంబర్‌కు మెసేజ్ అందుతుంది. యాత్రికులు ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్, ఐటీబీపీ బేస్ హాస్పిటల్లో నిర్వహించే నిర్థిష్ట వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్) , నథులా పాస్ (సిక్కిం) ఈ రెండు ప్రాంతాల నుంచి యాత్ర కొనసాగనుంది. డ్రా తర్వాత ప్రయాణికుల బ్యాచ్‌ను, మార్గాన్ని నిర్దేశిస్తారు. యాత్ర ప్రారంభమయ్యేది దేశ రాజధాని ఢిల్లీ నుంచే. యాత్రలో ఇప్పటికే నాలుగుసార్లు పాల్గొన్న వారిపై తాత్కాలికంగా నిషేధం ఉంది. ఇతర వివరాలను 011–23088133 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా సమాచారం తెలుసుకోచ్చు.సమ్మతి పత్రంపై సంతకం తప్పనిసరి పర్వత ప్రాంతంలో 19,500 అడుగుల ఎత్తులో కొనసాగే మానససరోవర యాత్రలో భక్తులు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అననుకూల పరిస్థితుల్లో ట్రెక్కింగ్ చేసే అవసరం కూడా రావచ్చు. శారీరకంగా ఆరోగ్యంగా లేని వారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలూ ఉన్నాయి. యాత్ర సమయంలో ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాలతో యాత్రికులు మరణించినా, గాయపడినా భారత ప్రభుత్వం బాధ్యత వహించదు. మరణించే యాత్రికులను దహన సంస్కారాల కోసం తిరిగి తీసుకువచ్చే బాధ్యతను కూడా తీసుకోదు. అందువల్ల చైనా భూభాగంలో దహనం చేయడానికి ముందుగానే సమ్మతి పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. -
20న సుప్రీం బార్ ఎన్నికలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఎన్నికల తేదీని అత్యున్నత న్యాయస్థానం ఖరారు చేసింది. ఈ నెల 20వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల్లో అసోసియేషన్ కార్యదర్శి పోస్టును మహిళా లాయర్లకు ప్రత్యేకంగా రిజర్వు చేయాలని స్పష్టం చేసింది. అదేవిధంగా, ఎగ్జిక్యూటివ్ కమిటీలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకే ఇవ్వాలని కూడా తెలిపింది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల దర్మాసనం మంగళవారం ఈ మేరకు స్పష్టతనిచి్చంది.2024 ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని, ఫిబ్రవరి 28వ తేదీతో అర్హత పొందిన లాయర్ల పేర్లను కూడా 2025 ఎస్సీబీఏ ఓటరు జాబితాలో చేర్చాలని తెలిపింది. మే 21వ తేదీన ఓట్లు లెక్కించి, ఫలితాలను ప్రకటించాలని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీబీఏ ఎన్నికల్లో సంస్కరణలను సూచించేందుకు నియమించిన సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎల్ నాగేశ్వర రావు ఇచి్చన నివేదికను ఎస్సీబీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ధర్మాసనం తెలిపింది. ఈ నివేదికపై తగు సూచనలు ఇవ్వడమే తప్ప, ఎవరూ సవాల్ చేయరాదని స్పష్టం చేసింది. మే 19వ తేదీతో ఎస్సీబీఏ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ గడువు ముగుస్తున్నందున కమిటీ సిఫారసులను ఈ పోలింగ్‌కు అమలు చేయడం సాధ్యం కాదని తెలిపింది. -
సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా?
కోల్‌కతా: ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా? అంటే అవుననే అంటున్నారు ఒడిశా బీజేపీ నేతలుపశ్చిమ బెంగాల్ దిఘూలో జగన్నాథుడి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠాపన జరిగింది.ఈ ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి మమతా వేప మొద్దులు దొంగిలించదని ఒడిశా బీజేపీ నేతలు మమతా బెనర్జీపై ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని దీదీ ఖండించారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇంట్లోనే నాలుగు వేప చెట్లు ఉన్నాయి. దొంగిలించాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. బెంగాల్లో జగన్నాథ స్వామిని పూజించడం నేరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ, ఒడిశా బీజేపీ పాలనలో పశ్చిమ బెంగాల్ వలసకూలీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. -
‘పహల్గాం ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు’.. ఖర్గే సంచలన ఆరోపణలు
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. Watch: Congress President Shri @kharge addresses the Samvidhan Bachao Rally in Ranchi, Jharkhand. https://t.co/wRfrg2XD99— Congress (@INCIndia) May 6, 2025 -
Mock drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి!
ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ముఖ్య ప్రదేశాలలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది.ఈ మాక్ డ్రిల్‌పై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నీ రాష్ట్రాల సెక్రటరీలు,డీజీపీలు,ఫైర్ డీజీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా మాక్ డ్రిల్ నిర్వహించాలో ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ , తారాపూర్ అణు కేంద్రంకేటగిరి 2 లో విశాఖపట్నం, హైదరాబాద్ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో ఏ కేటగిరిలో ఢిల్లీ ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. 1. అండమాన్ & నికోబార్ ద్వీపాలు Category-II: పోర్ట్ బ్లెయిర్2. ఆంధ్ర ప్రదేశ్Category-II: హైదరాబాద్, విశాఖపట్నం3. అరుణాచల్ ప్రదేశ్ Category-II: • ఆలోగ్ (వెస్ట్ సియాంగ్) • ఇటనగర్ • తవాంగ్ • హయులింగ్ • Category-III: బొమ్డిలా4. అస్సాం Category-II: • బోంగైగావోన్ • డిబ్రూగఢ్ • ధుబ్రి • గోల్పారా • జోర్హాట్ • శిబ్‌సాగర్ • టిన్సుకియా • తేజ్‌పూర్ • డిగ్బోయ్ • దిలీజన్ • గువహాటి (డిస్పూర్) • రంగియా • నమ్రుప్ • నజీరా • నార్త్-లక్ష…26.ఒరిస్సా (ఒడిశా)Category-II: • టాల్చర్ Category-III: • బలాసోర్ • కోరాపుట్ • భువనేశ్వర్ • గోపాల్పూర్ • హిరాకుడ • పారాదీప్ • రౌర్కెలా • భద్రక్ • ధేంకనాల్ • జగత్సింగ్పూర్ • కేండ్రాపాడా27. పుదుచ్చేరి Category-II:పుదుచ్చేరి28. పంజాబ్Category-II: • అమృత్సర్ • భటిండా • ఫిరోజ్‌పూర్ • గుర్దాస్పూర్ • హోషియార్పూర్ • జలంధర్ • లుధియానా • పటియాలా • పఠాన్‌కోట్ • అడాంపూర్ • బర్ణాలా • భాఖ్రా-నంగళ్ • హల్వారా • కొఠ్‌కాపూర్ • బటాలా • మోహాలి (ససనగర్) • అబోహర్Category-III: • ఫరీద్పూర్ • రోపర్ • సంగ్రూర్29. రాజస్థాన్Category-II: • కోటా • రావత్భాటా • అజ్మీర్ • అల్వార్ • బార్మేర్ • భరత్పూర్ • బీకానేర్ • బుండీ • గంగానగర్ • హనుమాన్‌గఢ్ • జైపూర్ • జైసల్మేర్ • జోధ్‌పూర్ • ఉదయ్‌పూర్ • సికార్ • నాల్ • సూరత్‌గఢ్ • అబూ రోడ్ • నసీరాబాద్ (అజ్మీర్) • భివారీ Category-III: • ఫులేరా (జైపూర్) • నాగౌర్ (మెర్టా రోడ్) • జాలోర్ • బేవార్ (అజ్మీర్) • లాల్‌గఢ్ (గంగానగర్) • సవాయ్ మాధోపూర్ • పాలి • భిల్వారా👉రేపటి మాక్ డ్రిల్ సందర్భంగా ఎదురయ్యే పరిణామాలుఎలక్ట్రిసిటీ బ్లాక్ అవుట్మొబైల్ సిగ్నల్స్ నిలిపివేతట్రాఫిక్ దారి మళ్లింపుప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలుపబ్లిక్ అనౌన్స్మెంట్స్👉యుద్ధం తరహా ఎమర్జెన్సీలో పోలీసులు, పారా మిలిటరీ వ్యవహరించే విధానంసివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలు వ్యవహరించాల్సిన విధానంఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండడం. స్థానిక గా ఇచ్చే సూచనలు పాటించాలివదంతులను వ్యాపింప చేయొద్దు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మవద్దుకరెంటు లేక పోయినా, ఇంటర్నెట్ పనిచేయకపోయినా ఆందోళనకు గురికావద్దు అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ చానల్స్, రేడియోను మాత్రమే వినాలిప్రజలు, అధికారులు తమ తమ బాధ్యతలు గుర్తెరిగి మెలగాలిమార్క్ డ్రిల్స్ కేవలం ప్రజల సన్నద్ధత కోసమే తప్ప... ఆందోళన కు గురిచేయడం లక్ష్యం కాదు 👉రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే...ఎయిర్ రైడ్ సైరన్స్ : ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకి వెళ్ళాలిక్రాష్ బ్లాక్ ఔట్స్: నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు. 1971 యుద్ధ సమయంలో బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించిన భారత్ కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ: కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్ ను గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు తరలింపు చర్యలు: హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం , లాజిస్టిక్స్ ఇష్యూస్ ను గుర్తించడం పౌరులకు శిక్షణ: పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో శిక్షణ. సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండడం అంశాలపై శిక్షణ -
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
ఇస్లామాబాద్: 1971లలో నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ బుధవారం జరగనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ దౌత్వవేత్త (హైకమిషనర్) అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్.. పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. వచ్చే వారం,11,12వ తేదీలలో దాడి చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.— Abdul Basit (@abasitpak1) May 6, 2025మరోవైపు, పాక్‌పై దాడి చేసేందుకు భారత్ సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్‌లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా బ్లాకౌట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు. -
సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు ఎలా చూడొచ్చంటే?
ఢిల్లీ: సుప్రీంకోర్టు (supreme court) కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాల్ని పబ్లిక్ డొమైన్లో అందుబాటులోకి తెచ్చింది.ఏప్రిల్ 1వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా కలిసి ఫుల్ కోర్టు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులందరూ వారి ఆస్తుల వివరాల్ని బహిర్గతం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయ స్థానానికి చెందిన 33 మంది జడ్జీలలో 21మంది జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు.ఈ ఆస్తుల్లో రియల్ ఎస్టేట్,మూవబూల్ ప్రాపర్టీలు ,గోల్డ్,పెట్టుబడుల వివరాలు ఉన్నాయి. జడ్జీలతో పాటు వారి సతీమణులకు చెందిన ఆస్తులతో పాటు, ఉమ్మడి కుటుంబమైతే వారి ఆస్తుల వివరాల్ని సైతం ఉన్నాయి. ఆస్తుల వివరాల్ని జడ్జీలతో పాటు ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సైతం వారి ఆస్తుల వివరాల్ని అందిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.నవంబర్ 2022 మే 2025 మధ్య జరిగిన నియామకాల గురించి ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు అత్యున్నత న్యాయస్థానం ఈ వివరాల్ని తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఆస్తుల వివరాలే కాదు సుప్రీంకోర్టు, హైకోర్టులలో నియామకాలు, హైకోర్టు కొలీజియంకు కేటాయించిన పాత్రలతో సహా, రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు జడ్జీల నియామకపు ప్రతిపాదనలు వంటి ఇతర వివరాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలుకాగా,ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా (Delhi HC Judge) యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున కాలిన నోట్ల కట్టలు బయటపడడం సంచలనంగా మారింది. న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఇది వివాదాస్పదం కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు.. ఎలా చూడొచ్చంటే?గూగుల్‌లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అని టైప్ చేయండి. అనంతరం మీకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ ఇంటర్ ఫేస్ కనిపిస్తుంది. ఇంటర్ ఫేస్ టాప్ బార్లో మీకు హోం,అబౌట్ అజ్,జడ్జస్ ఇలా కేటగిరీలు కనిపిస్తాయి. వాటిల్లో జడ్జస్ కేటగిరి మీద ట్యాప్ చేస్తే అసెట్స్ ఆఫ్ జడ్జస్ అనే సబ్ కేటగిరీలు కనిపిస్తాయి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జీల పేర్లు పక్కన వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆస్తుల వివరాలు ఓపెన్ అవుతాయి. -
యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
ఢిల్లీ: యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ నేడు కీలక సమీక్ష నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో యుద్ధ సన్నద్ధతపై కీలక సమీక్ష చేపట్టనుంది. రేపు(బుధవారం) అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని సోమవారం కేంద్రం ఆదేశించించిన సంగతి తెలిసిందే. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్‌కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమీక్షించనుంది.కాగా, సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ నిన్న (సోమవారం) కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.కాగా, దేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (సోమవారం) కీలక సమీక్షలు నిర్వహించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతి చర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పహల్గాంకు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతలను మోదీ వారికే అప్పగించారు. -
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
ఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు కొనసాగుతున్నాయి. వరుసగా 12వ రోజు కాల్పుల విరమణ ఒప్పందం పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్లో 8 సెక్టార్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు దీటుగా బదులిచ్చినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతి చర్యల్లో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని పక్కన పెడుతూ ఏప్రిల్ 24న కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ వెంటనే నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆగడాలు మొదలయ్యాయి.యుద్ధ సన్నద్ధత కోసం సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడక్ రాష్ట్రాలకు సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం . సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలని అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులు అరెస్ట్బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారి వద్ద నుంచి గ్రనేడ్, ఆయుధాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన భద్రతా బలగాలు.. దర్యాప్తు చేపట్టాయి. కాగా, సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పాకిస్తాన్ జాతీయుడిని అరెస్ట్ చేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అతడి నుంచి పాక్ కరెన్సీని, గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు.గుజ్రన్ వాలాకు చెందిన మహ్మద్ హుస్నైన్‌గా గుర్తించిన అతడు ప్రస్తుతం పంజాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. పహల్గాం ఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చ రిల్లిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. -
ఉగ్ర పాక్‌కు నిధులు ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆర్థిక మూలా లను దెబ్బకొట్టడంపై దృష్టిపెట్టిన భారత్ ఆ దిశగా ప్రయత్నాలు ఉధృతంచేసింది. పాకిస్తాన్‌కు వందల కోట్ల రూపాయల రుణాలు, ఆర్థిక సాయం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అంతర్జాతీయ సంస్థలు ఆ యత్నాలను మానుకోవాలని భారత్ అభ్యర్థిస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఇటలీలోని మిలాన్ సిటీలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అధ్యక్షుడు మసాటో కందాతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్‌కు ఆర్థికసాయం చేయడం మానుకోవాలని నిర్మల కోరారు. ఈ సందర్భంగా ఇటలీ ఆర్థిక మంత్రి జిన్‌కార్లో జార్జెట్టీతోనూ నిర్మల భేటీ అయ్యారు. నాలుగురోజులపాటు జరిగే ఏడీబీ 58వ వార్షిక సమావేశాలు ఆదివారం ఇటలీలో ప్రారంభమవడం తెల్సిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ వంటి బహుళజాతి సంఘాలు పాకిస్తాన్‌కు సాయంపై పునరాలోచన చేస్తే మంచిదని ఈ సందర్భంగా నిర్మల హితవు పలికారు. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకుగాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిర్ణయించడం తెల్సిందే. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. మరోవైపు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే జాబితాలోకి పాకిస్తాన్‌కు చేర్చడానికి భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. -
భారత్‌కే మా మద్దతు
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంచేశారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉ గ్రవాదులను, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు. అత్యంత హేయమైన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా మని తెలిపారు. బాధిత కుటుంబాలకు పుతిన్ సానుభూతి ప్రకటించారు. ఆయన సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయానికొచ్చారు. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే నామరూపాల్లేకుండా చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. భారత్–రష్యా మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని మోదీ, పుతిన్ పేర్కొన్నారు. రష్యా ‘విక్టరీ డే’ 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్‌తోపాటు రష్యా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ ఏడాది జరగబోయే ఇండియా–రష్యా ద్వైపాక్షిక సదస్సుకు హాజరు కావాలని ప్రధానమంత్రి ఆహ్వానించగా, పుతిన్ అందుకు అంగీకరించారు. -
ముందస్తు బెయిల్‌పై.. 7న నిర్ణయం తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో ముందస్తు బెయిల్‌పై బుధవారం (7వ తేదీన) జరిగే విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తమకు రక్షణ కల్పించాలంటూ కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కొనుగోళ్లలో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ వ్యవహారమంతా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలోనిదని.. తామే కుట్రదారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లలో పేర్కొన్నారు.ఇదే కేసులో అరెస్టు నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రక్షణ కల్పించారని తెలిపారు. మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తేల్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై సోమవారం జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి మీరు హకోర్టులో పిటిషన్ ఎప్పుడు వేశారు?, కోర్టు ఎలాంటి నోటీసులు జారీ చేసిందని జస్టిస్ పార్దీవాలా పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు.ఈ నెల 2న వేశామని, మధ్యంతర రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై వాదనలు వినకుండానే తిరస్కరించి హైకోర్టు వాయిదా వేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో పీవీ మిథున్‌రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించాం కదా అంటూ ధర్మాసనం గుర్తు చేసింది. అయితే.. ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బుధవారం హైకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నందున తాము ఇందులో జోక్యం చేసుకోలేమని, మధ్యంతర రక్షణ కల్పించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి 7న విచారణ ఎలా సాగింది? ఎలాంటి నిర్ణయం తీసుకున్నదనే విషయం తమకు చెప్పాలని ధర్మాసనం సూచించింది.అప్పటివరకైనా అరెస్టు చేయకుండా మధ్యంతర ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. 7న చేపట్టనున్న విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచిస్తూ.. కేసుకు సంబంధించిన మెరిట్స్‌పై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, నిర్ణయాధికారం హైకోర్టుదేనని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. 7న హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఫలితం ఏమొచ్చినా మరో వాయిదా అడగవద్దంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది లూథ్రాకు జస్టిస్ పార్దీవాలా సూచించారు. -
సీబీఐ నూతన డైరెక్టర్ ఎవరో?
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన డైరెక్టర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అపాయింట్మెంట్ కమిటీ సోమవారం సమావేశమైంది. విపక్ష నేత రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ భేటీలో పాల్గొన్నారు. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం ఈ నెల 25న ముగినుంది. ఆయన 2023 మే 25న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కొత్త డైరెక్టర్‌గా పలువురు సీనియర్ అధికారుల పేర్లను అపాయింట్మెంట్ కమిటీ పరిశీలించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం... ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు సీబీఐ నూతన డైరెక్టర్‌ను కేంద్రం నియమిస్తుంది. -
Mock drills: భారత్‌లో మాక్ డ్రిల్.. 1971భారత్-పాక్ యుద్ధ సమయంలో
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. అదే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. సోమవారం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.అయితే, మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.Following measures will be undertaken1.Operationalization of Air Raid Warning Sirens2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A— DD News (@DDNewslive) May 5, 2025శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. గత ఆదివారం ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు. -
ఇదంతా వేధింపుల్లో భాగమే: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో పిటిషనర్లు
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో అరెస్టు నుంచి తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషన్లో పేర్కొన్న కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మద్యం కొనుగోళ్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యవహారం అంతా ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ పరిధిలోనిది. మేమేకుట్ర దారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఇలాంటి ఆధారాలు లేవు. ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించారు. . పైగా మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. .. మాపై ఆరోపణలు చేయడం వేధింపులో భాగమే. మద్యం కొనుగోళ్లలో మా పాత్ర ఉందనే ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఏసీబీ వద్దే ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఆధారాలను తాము ఎలా తారుమారు చేయగలం. మా స్థాయిని తగ్గించి, అవమానించే ఉద్దేశంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని పిటిషన్లో ప్రస్తావించారు వాళ్లు. మరో పక్క ఈ వ్యవహారంలో మే 7వ తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఆలస్యం లేకుండా విచారణ జరపాలని ఆదేశించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. -
ట్రోలింగ్‌పై సీరియస్
పహల్గాం ఉగ్రదాడిలో 26మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో.. నేవీ అధికారి అయిన తన భర్త వినయ్ నర్వాల్ మృతదేహం వద్ద భార్య హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఆ ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్(NCW) తీవ్రంగా స్పందించింది.న్యూఢిల్లీ: నేవీ అధికారి వినయ్ భార్య హిమాన్షిపై నడుస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడిలో ఎంతో మంది చనిపోయారు. లెఫ్టినెంట్ వినయ్ అగర్వాల్‌ను మతం అడిగి మరీ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడితో యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. అయితే వినయ్ భార్య హిమాన్షిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం దుర్మార్గం.కేవలం ఆమె తన అభిప్రాయం తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్ చేయడం దారుణం. ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అలా కామెంట్లు చేయడం సరికాదు అని ఎన్సీడబ్ల్యూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ మహిళా గౌరవాన్ని, ఔనత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్ ఉద్దేశమని పేర్కొంది. మరోవైపు.. కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఉదంతంపై స్పందించారు. నేవీ అధికారి వినయ్ నర్వాల్ స్మారకార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ముస్లింలు లేదా కశ్మీరీలపై ఎలాంటి ద్వేషం లేదని... శాంతి, న్యాయం మాత్రమే కోరుకుంటున్నానని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రజలు ముస్లింలకు గానీ, కశ్మీరీలకు గానీ వ్యతిరేకంగా మారడాన్ని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. "మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం. కచ్చితంగా మాకు న్యాయం జరగాలి" అని ఆమె అన్నారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ, తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే ఆకాంక్షించేవారని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలకు గానూ సోషల్ మీడియాలో ఆమెను కొందరు నిందిస్తూ పోస్టులు చేయసాగారు.గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షి పీహెచ్డీ స్కాలర్. కేవలం కొద్ది వారాల క్రితమే, ఏప్రిల్ 16న ఆమెకు నేవీ అధికారి వినయ్ నర్వాల్‌తో వివాహం జరిగింది. ఏప్రిల్ 19న రిసెప్షన్ అనంతరం, వారు హనీమూన్ కోసం కశ్మీర్‌లోని పహల్గామ్కు వెళ్లారు. అయితే, ఏప్రిల్ 22న వారు సేదతీరుతున్న సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వినయ్ నర్వాల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త మృతదేహం వద్ద హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వినయ్ నర్వాల్ అంత్యక్రియలను హర్యానాలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు హిమాన్షిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్త శవపేటిక వద్ద హిమాన్షి సెల్యూట్ చేసిన దృశ్యాలు పలువురిని కదిలించాయి. जम्मू-कश्मीर के पहलगाम में हुए आतंकी हमले में देश के अनेक नागरिकों की हत्या कर दी गई थी। इस हमले में अन्य लोगों के साथ लेफ्टिनेंट विनय नरवाल जी से उनका धर्म पूछकर उन्हें गोली मार दी गई थी। इस आतंकी हमले से पूरा देश आहत व क्रोधित है। लेफ्टिनेंट विनय नरवाल जी के मृत्यु के पश्चात…— Vijaya Rahatkar (@VijayaRahatkar) May 4, 2025 -
వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మే 15కి వాయిదా వేసిందిసీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా వక్ఫ్ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. మే 13న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా రిటైర్ కానున్న నేపథ్యంలో కేసు బదిలీపై నిర్ణయం తీసుకుంది.వక్ఫ్ కేసులలో తదుపరి విచారణ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ కొనసాగించనుంది.వక్ఫ్ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది. -
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్‌తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా జరిగి తీరుతుందంటూ తేల్చి చెప్పారు. అందుకు తాను హామీ ఇస్తున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారాయన.‘‘మోదీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం నా బాధ్యత’’ అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్‌ను దెబ్బతీయడానికి దుస్సాహసం చేసిన వారికి ధీటైన రీతిలో సమాధానం ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరో వైపు, భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. -
ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష
న్యూఢిల్లీ, సాక్షి: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(NEET) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిబంధన మేరకు.. పలు కేంద్రాల వద్ద నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. దీంతో కంటితడి పెడుతూ పలువురు సెంటర్లను వీడారు.దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాల్లో 5 వేలకు పైగా సెంటర్లలో.. అలాగే దేశం వెలుపల 14 నగరాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. గతేడాది నీట్(National Eligibility cum Entrance Test) యూజీ ప్రశ్నపత్రం లీక్‌తో పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో.. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశముందని అంచనా. నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. -
ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ కీలక భేటీ.. ఏం జరగనుంది?
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు.ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.జాతీయ భద్రతతోపాటు ప్రస్తుత కీలక సమయంలోని నిర్వహణ అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రపుర్ జిల్లా కర్మాగారం అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయామని, ఆ లోటును భర్తీ చేయడానికే దీర్ఘకాల సెలవులను తక్షణం రద్దు చేస్తున్నట్లు ఖమరియా ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు.Indian Air Force Chief Air Marshal Amar Preet Singh is meeting Prime Minister Narendra Modi right now: Sources pic.twitter.com/qytnt88F0G— ANI (@ANI) May 4, 2025 -
IMF నుంచి కృష్ణమూర్తిని తొలగించిన భారత్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) బోర్డు నుంచి డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్(dr krishnamurthy subramanian)ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఆ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ఐఎంఎఫ్ వెబ్సైట్ ప్రకటించింది.ఐఎంఎఫ్(IMF) బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆగష్టు 2022లో భారత్ కృష్ణమూర్తిని నామినేట్ చేసింది. నవంబర్ 1, 2022లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది నవంబర్‌తో ఆయన పదవీ కాలపరిమితి ముగియనుంది. ఈ లోపే భారత ప్రభుత్వం ఆయన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.కృష్ణమూర్తి సుబ్రమణియన్ కేవలం భారత్‌కు మాత్రమే కాదు.. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకకు సైతం ప్రాతినిధ్యం వహించారు. మే 2వ తేదీతో ఆయన పదవి కాలపరిమితి ముగిసినట్లు ఐఎంఎఫ్ అధికారిక వెబ్సైట్ ప్రకటించింది. అంతకు ముందు కృష్ణమూర్తి భారత్‌కు ప్రధాన ఆర్థిక సలహాదారుగా (2018-2021)గా వ్యవహరించారు. అయితే ఆ టైంలోనూ ఆరు నెలల కంటే ముందు ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శిగా ఉన్న అజయ్ సేత్.. ఈ జూన్‌లో రిటైర్ కాబోతున్నారు. ఈయన పేరును ఐఎంఎఫ్ బోర్డుకు భారత్ నామినేట్ చేసే అవకాశం ఉందని సమాచారం. మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో పాక్‌కు ఇవ్వబోయే ఆర్థిక సాయం గురించి చర్చించబోతున్నారు. పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఫండింగ్ ఇవ్వొద్దని.. ఆ నిధులను ఉగ్రవాదులకు తరలిస్తోందంటూ భారత్ వాదిస్తున్ను సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కృష్ణమూర్తిని బోర్డు నుంచి తొలగిస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.కారణాలేంటో?ఐఎంఎఫ్ నుంచి కృష్ణమూర్తి తొలగింపుపై ఆర్థిక నిపుణలు విశ్లేషణలు జరుపుతున్నారు. ఐఎంఎఫ్ పని తీరుపై.. దాని డాటా మెకానిజంపై ఆయన చేస్తున్న తీవ్ర విమర్శలే అందుకు కారణమై ఉండొచ్చనే భావిస్తున్నారు. అలాగే.. ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగే అవకాశాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన India@100 పుస్తకం కోసం ఆయన చేస్తున్న ప్రమోషన్ కూడా మితిమీరడం కూడా కారణం అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఉగ్రవాదుల పాపాలు పండాయి
శ్రీనగర్: ఉగ్రవాదుల పాపాలు పండాయని, దేశంలో ఉగ్రవాదాన్ని తక్షణమే పెకిలించివేయాలని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. ఉగ్రవాదం ఆనవాళ్లు సైతం ఉండడానికి వీల్లేదని అన్నారు. ఉగ్ర విష భుజంగాలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై మన ప్రభుత్వం చేపట్టే ప్రతీకార చర్యలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఆయన శనివారం పహల్గాంలో పర్యటించారు. గత నెల 22న పర్యాటకులపై దాడి జరిగిన తర్వాత ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ దాడికి పాల్పడిన ముష్కరులను, వారిని వెనుక ఉండి నడిపించిన కుట్రదారులకు నరకమే గతి అని స్పష్టంచేశారు. పహల్గాంలో పర్యాటకులను రక్షించే క్రమంలో ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలు కోల్పోయిన అదిల్ షా కుటుంబాన్ని ఫరూఖ్ అబ్దుల్లా పరామర్శించారు. ముష్కరులు సాగించిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. వారిపై నిప్పులు చెరిగారు. ‘‘ఇక్కడ 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు రోజుల క్రితమే వివాహం జరిగిన ఓ నవ వధువు తన భర్తను పోగొట్టుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి ఓ బిడ్డ బిగ్గరగా రోదించాడు. మారణకాండ చూసిన తర్వాత మాకు భోజనం సహించలేదు. మానవత్వాన్ని పొట్టనపెట్టుకున్న ఆ భూతాలు ఇప్పటికీ ప్రాణాలతో సంచరిస్తున్నాయి. వారు తమను తాము ముస్లింలం అని చెప్పుకుంటున్నారు. కానీ, వారు ముమ్మాటికీ ముస్లింలు కాదు. బాధితుల త్యాగాలు వృథా కావడానికి వీల్లేదు. ఉగ్రవాదుల పాపాల పుట్ట నిండిపోయింది. వారిపై తగిన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. జమ్మూకశ్మీర్‌లో 35 ఏళ్లుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. కానీ, వారు ఎప్పటికీ విజయం సాధించలేరు’’ అని ఫరూఖ్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. మానవత్వాన్ని హత్య చేసిన వారు నరకానికి తప్ప స్వర్గానికి వెళ్లలేరని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఆగిపోతేనే జమ్మూకశ్మీర్ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పహల్గాం తరహా దాడులను తీవ్రంగా వ్యతిరేకించాలని స్థానికులకు పిలుపునిచ్చారు. భయపడితే మరణించినట్లే... పహల్గాంలో పలువురు పర్యాటకులతో ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. ఉగ్రదాడుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్భయంగా ఉండాలని సూచించారు. జమ్మూకశ్మీర్‌ను మధ్యలోనే వదిలివెళ్లొద్దని కోరారు. పర్యటన పూర్తి చేసుకోవాలని చెప్పారు. ఇక్కడికి మరెంతో మంది పర్యాటకులు రావాలని ఆకాంక్షించారు. ఎవరూ భయపడొద్దని అన్నారు. భయం అనేది చావుతో సమానమని వ్యాఖ్యానించారు. భయపడితే మరణించినట్లేనని పేర్కొన్నారు. -
దిగుమతులు బంద్
న్యూఢిల్లీ/శ్రీనగర్: పహల్గాం దుస్సాహసానికి ము ష్కరులను ప్రేరేపించిన దాయాదికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పాకిస్తాన్ నుంచి దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ భారత్ శనివారం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులకూ ఇది వర్తిస్తుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాక్‌లో ఉత్పత్తయ్యే, ఆ దేశం గుండా ఎగుమతయ్యే అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తుల ప్రత్య క్ష, పరోక్ష దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేగాక పాక్ నౌకలకు భారత్‌లోకి అనుమతి నిషేధించింది. ఆ దేశానికి సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. దీని ప్రభావం కూడా పాక్‌పై తీవ్రంగా ఉండనుంది. ఇక పాక్‌కు అన్నిరకాల పార్సిల్, పోస్టల్ సేవలను కూడా సంపూర్ణంగా నిలిపేశారు. ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. పాక్‌కు మన గగనతలాన్ని ఇ ప్పటికే మూసేయడం తెలిసిందే. అంతేగాక సింధూ జల ఒప్పందం నిలిపివేత, పాక్ పౌరులకు వీసాల రద్దు వంటి పలు కఠిన చర్యలు కూడా కేంద్రం ఇప్పటికే తీసుకుంది. దివాలా ముంగిట ఉన్న పాక్‌కు ఆర్థికంగా ప్రాణాధారం వంటి 700 కోట్ల ఐఎంఎఫ్ రుణాన్ని అడ్డుకునే ప్రయత్నాలకు కూడా పదును పెట్టింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్‌ను గ్రే లిస్టులో చేర్చి రుణాలు, ఆర్థిక సాయాలు పూర్తిగా నిలిపేయాలని అంతర్జాతీయ సంస్థలకు శుక్రవారం విజ్ఞప్తి చేయడం తెలిసిందే. తద్వారా దాయాది ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేలా కేంద్రం వ్యూహరచన చేస్తోంది. దీనిపై పాక్ శనివారం గగ్గోలు పెట్టింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఐఎంఎఫ్ రుణానికి భారత్ మోకాలడ్డుతోందంటూ ఆక్రోశించింది. దిగుమతులు అంతంతే పాక్ నుంచి దిగుమతుల నిషేధం ప్రభావం మనపై ఏమీ ఉండదు. పుల్వామా దాడుల నేపథ్యంలో 2019 నుంచే ఆ దేశంతో వాణిజ్య కార్యకలాపాలను భారత్ దాదాపుగా తగ్గించుకుంది. గతేడాది దాయాది నుంచి మనం దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ కేవలం 4.2 లక్షల డాలర్లు! ప్రధానంగా సేంద్రియ లవణంతో పాటు ఫార్మా ఉత్పత్తులు, పళ్ల వంటివి వీటిలో ఉన్నాయి. అదే సమయంలో పాక్‌కు మన ఎగుమతుల విలువ ఏకంగా 44.8 కోట్ల డాలర్లుగా ఉంది. పాక్ ఉత్పత్తులపై భారత్ ఇప్పటికే 200 శాతం విధిస్తోంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌కు అన్ని ఎగుమతులనూ భారత్ ఇప్పటికే నిలిపేయడం తెలిసిందే. తొమ్మిదో రోజూ కాల్పులు సరిహద్దుల వెంబడి పాక్ దుశ్చర్యలు వరుసగా తొమ్మిదో రోజూ కొనసాగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం శనివారం కూడా కాల్పులకు తెగబడింది. వాటికి దీటుగా బదులిచి్చనట్టు సైన్యం ప్రకటించింది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. కశీ్మర్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. శనివారం శ్రీనగర్‌లో ఐదుచోట్ల ముమ్మర తనిఖీలు కొనసాగాయి. రెచ్చగొట్టేలా పాక్ క్షిపణి పరీక్షలుఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా పాక్ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్‌తో కూడిన అబ్దాలీ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ‘సింధూ’ నిర్మాణాలను పేల్చేస్తాం పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలు ఇస్లామాబాద్: సింధూ నదీ వ్యవస్థపై భారత్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలకు దిగారు. వాటిని తమపై దురాక్రమణ చర్యగానే పరిగణిస్తామన్నారు. ‘‘నదీ జలాలను ఆపేస్తే మేం ఆకలిదప్పులతో అలమటిస్తాం. అందుకే అలాంటి పరిస్థితి రానివ్వబోం’’అని చెప్పుకొచ్చారు. సింధూ ఒప్పందం నిలిపివేతపై అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు. -
ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికన్ యూనియన్ ప్రగతిశీల భాగస్వామ్యపక్షాలు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. గ్లోబల్ సౌత్‌కు ఇరుపక్షాలు మూలస్తంభాలని చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంప్రదాయ వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక సహకారం వంటి రంగాల్లో భారత్–అంగోలా మధ్య అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను, వారి మద్దతుదారులను శిక్షించడం తథ్యమని స్పష్టంచేశారు. ఉగ్రవాదులపై దృఢమైన, నిర్ణయాత్మక చర్యలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అంతరిక్ష సాంకేతికత వంటి అంశాల్లో ఇండియా శక్తిసామర్థ్యాలను అంగోలాతో పంచుకుంటామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, వజ్రాల ప్రాసెసింగ్, ఎరువులు, ఖనిజాల విషయంలో అంగోలాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అంగోలా అధ్యక్షుడు లోరెన్సోకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి లారెన్సో ఘనంగా నివాళులర్పించారు. భారత్–అంగోలా మధ్య దౌత్య సంబంధాలు 1985లో ప్రారంభమయ్యాయి. ఆఫ్రియన్ యూనియన్‌కు ఈ ఏడాది అంగోలా దేశమే నేతృత్వం వహిస్తోంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం లోరె న్సో గురువారం భారత్‌కు చేరుకున్నారు. అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు రూ.1,691 కోట్ల రుణం అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇందుకోసం 200 మిలియన్ డాలర్లు(రూ.1,691 కోట్లు) రుణంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు లోరెన్సో పర్యటన భారత్–అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను నిర్దేశిస్తుందని, భారత్–ఆఫ్రికా నడుమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. -
పాకిస్తాన్ ఓడలపై భారత్ నిషేధం
ఢిల్లీ: పాకిస్తాన్‌కు భారత్ వరుస షాకులిస్తోంది. ఇవాళ పాకిస్తాన్ ఓడలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆ నోటిఫకేషన్‌లో పాకిస్తాన్ జెండా ఉన్న ఏ ఓడ భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించవద్దని ఆదేశించింది. భారత ఓడలేవి పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్ళొద్దని సూచించింది. భారత్ ఆస్తులను, కార్గో , మౌలిక సదుపాయాలను రక్షించే క్రమంలో ఓడరేవుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. పాకిస్తాన్ విమానాలకు ఇప్పటికే గగనతలం నిషేధం విధించింది భారత్. తాజాగా సముద్ర మార్గాన్ని సైతం బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా పాక్ అన్ని మార్గాల్లో నిషేధం విధిస్తూ అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నాల్ని భారత్ కొనసాగిస్తోంది. -
సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత.. వరద భయంతో పాక్ గగ్గోలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ చినాబ్ నదిలో వరద ప్రవాహాం పెరుగుతుండడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు.చినాబ్‌లో నీటి ప్రవాహం డేంజర్ మార్క్‌కు చేరుకోవడంతో సలాల్ డ్యామ్ గేట్లు తెరిచారు జమ్మూకశ్మీర్ అధికారులు. దీంతో పాకిస్తాన్లో వరద భయాలు మరింత పెరిగిపోయాయి. భారత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తివేసిందంటూ పాక్ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది వాటర్ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. అయితే, గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బస్టర్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వెరసీ సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తారు. -
పహల్గాం ఉగ్రదాడి: పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో షాక్
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఎగుమతులు, దిగుమతులపై నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బ తీసే ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే, ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు అమానుషంగా 26 మంది టూరిస్టుల ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్,పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి నుంచి వరుస కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్‌ను భారత్ దెబ్బకు దెబ్బ తీస్తోంది. ముందుగా సరిహద్దు దాటిన ఉగ్రవాదం అని పేర్కొంటూ సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ జాతీయుల అన్ని వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత గగనతలంలో పాక్ విమానాలపై నిషేధం విధించింది. భారత్‌లో పాక్ దేశ మీడియా,సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్ విధించింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్న కేంద్రం పేర్కొంది. -
పాక్‌పై భారత్ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయమై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్ చేశారు.SICK!Rahul Gandhi's Congress continues to defend Pakistani terror!Now Charanjeet Singh Channi questions our forces.Why is Congress demoralising our forces at this critical time.Congress is taking orders directly from Pakistan!#PehalgamTerroristAttack pic.twitter.com/b2MIexdAQA— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 2, 2025ఇక, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.మరోవైపు.. సదరు కాంగ్రెస్ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. -
Goa: దేవాలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
ఢిల్లీ: గోవాలో విషాదం చోటు చేసుకుంది. శిర్గావ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. 30 మందికి పైగా త్రీవ గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. Goa Congress is deeply saddened by the stampede at Jatrotsav of Shree Lairai Devi,Shirgao. We condemn this tragic incident and offer heartfelt condolences to the families who lost their loved ones. Wishing a speedy recovery to all those injured. 🙏@DrAnjaliTai @ViriatoFern pic.twitter.com/7kL6uNkBEi— Goa Congress (@INCGoa) May 3, 2025ఉత్తర గోవాలోని బిచ్లిమ్ జిల్లా తాలూకా శిర్గావ్ గ్రామంలో ప్రతీ ఏడాది మే 2న ఘనంగా నిర్వహించే పార్వతి దేవి(Shri Lairai Zatra) జాతర ఈ ఏడాది విషాదాన్ని నింపింది. ఈ శుక్రవారం (మే2) జాతర జరిగే సమయంలో తొక్కిసలాట ఆరుగు భక్తుల ప్రాణాల్ని తీసింది. పోలీసుల సమాచారం మేరకు శుక్రవారం జాతరను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో పాల్గొని, అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు సమారు 50వేల నుంచి 70 వేల మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రారంభమైంది. సరిగ్గా జాతర జరిగే మార్గంలో ఎతైన ప్రదేశంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. అదుపు తప్పి భక్తులు ఒకరిపై ఒకరు మీద పడ్డారు. దీంతో ఊపిరాడక ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.(బాధితుల్ని పరామర్శిస్తున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్)ప్రమాదంపై సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఢిల్లీ సహా ఉత్తరాదిన భారీ వర్షం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు శుక్రవారం ఉదయం ఈదురు గాలులు, వర్షాలతో అతలాకుతలమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతోపాటు, పలు చోట్ల చెట్లు కూలడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. వర్షం సంబంధిత ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నజఫ్‌గఢ్ ప్రాంతంలోని ఖర్ఖారీలో ఇంటిపై చెట్టు కూలినపడినట్లు ఉదయం 5.30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది.భారీ వర్షం, తీవ్ర ఈదురుగాలుల కారణంగా ఒకే గది ఉన్న చిన్న ఇంటిపై పక్కనే ఉన్న చెట్టు కూలి పడింది. ఘటనలో ఆ ఇంట్లోని ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళ(28), ఆమె ముగ్గురు చిన్నారులు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మహిళ భర్త గాయాలతో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. అదే సమయంలో చావ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పాపారావత్ గ్రామంలో గోడ కూలి ఇద్దరు బాలురు సహా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని చెప్పారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, మధుర రోడ్లపై పెద్ద ఎత్తున వరద నిలిచిపోయింది. ఘజియాబాద్‌లో రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కనిపించాయి. ఫరీదాబాద్‌లో వరదలో సగం వరకు మునిగిన కారును జనం బయటకు తీస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.200 విమానాలు ఆలస్యంఈదురు గాలుల ప్రభావం ఢిల్లీలో విమానాల రాకపోకలపైనా పడింది. మూడు విమానాలను దారి మళ్లించగా 200కు పైగా ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కుండపోతతో ట్రాఫిక్ అంతరాయం, వరదలు, చెట్లు, ఇళ్లు కూలిన ఘటనలకు సంబంధించి 100 కాల్స్ అందాయని ఫైర్ విభాగం తెలిపింది. -
వణుకుతున్న దాయాది
ఇస్లామాబాద్/వాషింగ్టన్/శ్రీనగర్/న్యూఢిల్లీ: భార త ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్ తదితర దేశాలకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.పాక్‌లో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్‌తో కూడా షహబాజ్ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్ ఆఫ్ లార్డ్స్ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. అదేమీ రహస్యం కాదు: బిలావల్ పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్పర్సన్ బిలావల్ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్ ఇంటర్వ్యూలో బిలావల్ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే’’అంటూ పాక్ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.‘‘ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ‘‘నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా’’అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. హాకింగ్‌కు విఫలయత్నాలు పాక్ ప్రేరేపిత హాకర్ గ్రూపులు భారత వెబ్సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్ గ్రూప్ హోక్స్1337, నేçషనల్ సైబర్ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం’’అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్ హైబ్రిడ్ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు. ఐదు సెక్ట్టర్లలో కాల్పులుపాక్ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘తొలుత ఉత్తర కశ్మీర్లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్ సెక్టర్లకు విస్తరించాయి.అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్గ్వాల్ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది’’అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (ఏజీపీఎల్)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్ ప్రాంతంలో విస్తరించి ఉంది. -
పాక్‌పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి డజన్లకొద్దీ ముష్కరులను అంతమొందించిన భారత ఇప్పుడు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. అందులోభాగంగా విదేశీ నిధులను పాక్ సర్కార్ ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులను కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలని భారత్ యోచిస్తోంది.ఇందుకోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)పై భారత్ తీవ్ర స్థాయిలో ఒత్తిడిచేయనుంది. ఈ టాస్‌్కఫోర్స్‌కు చెందిన ‘గ్రే’జాబితాలోకి చేరితే ఆయా దేశాలకు అంతర్జాతీయ సాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. దీనికితోడు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా పాకిస్తాన్‌కు రాబోయే వందల కోట్ల విలువైన నిధులను అడ్డుకుని పాక్‌ను ఆర్థిక కష్టాల కడలిలో ముంచాలని మోదీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో పాక్‌పై గ్రే లిస్ట్ కొరడా విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధికి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్‌ను 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ తన గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్రకార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్‌చేసింది.దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్‌లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్‌కు విముక్తి లభించింది. ఇప్పుడు సైతం ఇలాగే పాకిస్తాన్‌ను గ్రే జాబితాలోకి చేర్చేలా ఎఫ్‌ఏటీఎఫ్‌పై మోదీ సర్కార్ ఒత్తిడిని పెంచింది. ఎఫ్ఏటీఎఫ్లో 40 సభ్యదేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో జరుగుతాయి. ఈ జూన్ సెషన్లో ఈ మేరకు మద్దతు కూడగట్టేందుకు మిత్రదేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టినట్లు వార్తలొచ్చాయి. ఐఎంఎఫ్పైనా కేంద్రం ఒత్తిడిస్వదేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిపోయిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్ దేశ పాలన కోసం తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే మూడేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. ఈ నిధులొస్తే పాక్ వాటిని ఉగ్రకార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ ఐఎంఎఫ్ ఎదుట ఆందోళన వ్యక్తంచేయనుంది. భారత వాదన నెగ్గితే ఈ నిధులు ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరగొచ్చు. నిధుల విస్తరణపై మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, పాక్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది.పాకిస్తాన్‌కు నిధుల మంజూరుపై పునరాలోచన చేస్తే మంచిదని ఇతర అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, సంఘాలను సైతం భారత్ కోరబోతోంది. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకు గాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్ణయించింది. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. -
తెలంగాణే మార్గదర్శి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణనను చేర్చాలన్న కేంద్ర నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ అద్వితీయ పోరాటం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందని, దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కొనియాడింది. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి పారదర్శకంగా నిర్వహించిన కులగణన నమూనానే కేంద్రం అనుసరించాలని తీర్మానించింది. దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అంశాల్లో న్యాయం చేసేలా జనగణనను ఎప్పట్లోగా పూర్తి చేస్తుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ప్రధానంగా కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలి: ఖర్గే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు, మొన్నటి లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే అంశాన్ని ముందుపెట్టి కాంగ్రెస్ పార్టీ పోరాడిందని ఖర్గే చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తి చేసి ప్రభుత్వ పథకాల్లో అమలు చేసే ప్రక్రియను సైతం మొదలు పెట్టిందని ప్రశంసించారు. ప్రజల సమస్యలను నిజాయితీగా లేవనెత్తితే, ఎన్డీఏ వంటి మొండి ప్రభుత్వాలు తలవంచాల్సిందేనని రాహుల్‌గాంధీ నిరూపించారని అన్నారు. అయితే కులగణన సమస్యను ఒక మంచి ముగింపు వచ్చేంత వరకు కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇదే అంశంపై చేసిన తీర్మానంలోనూ తెలంగాణ అంశాన్ని సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాలి ‘తెలంగాణలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పాటించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన అవసరం ఉందని సీడబ్ల్యూసీ భావిస్తోంది. తెలంగాణలో కుల సర్వే రూపకల్పన పూర్తిగా పౌర సమాజం, సామాజికవేత్తలు, నాయకుల క్రియాశీల ప్రమేయంతో.. సంప్రదింపులు, పారదర్శక ప్రక్రియ ద్వారా జరిగింది. ఈ సర్వే పూర్తిగా బ్యూరోక్రాటిక్ విధానంలో కాకుండా ప్రజల పరిశీలన నుంచి వచ్చింది.అందువల్ల జాతీయ స్థాయి కులగణన కోసం తెలంగాణ పాటించిన విధానాన్ని అనుసరించాలని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కేంద్రం విశ్వసనీయమైన, శాస్త్రీయమైన, భాగస్వామ్య నమూనాను రూపొందించేందుకు వీలుగా మా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. సంప్రదింపులు, జవాబుదారీతనం సమ్మిళితత్వంతో విలువలను ప్రతిబింబించే చట్రాన్ని రూపొందించడంలో సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..’అని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో పేర్కొంది. జాప్యం వద్దు..పారదర్శకంగా జరగాలి ‘కులగణన ప్రక్రియలో జాప్యం చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీలను పూర్తి విశ్వాసంలోకి తీసుకోవాలి. ఈ అంశంపై పార్లమెంట్లో వెంటనే చర్చ జరపాలి. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులను కేటాయించి, జనాభా లెక్కల ప్రతి దశకు నిర్దిష్టమైన సమయాన్ని ప్రకటించాలి. కులగణన వివరాల నమోదు ప్రక్రియ పూర్తి సమగ్రంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలి. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకు, విద్యా, ఉపాధి అవకాశాలకు ఈ కులగణనే ప్రాతిపదికగా ఉండాలి. కుల గణన సరిగ్గా జరిగి అమలైతే సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది..’అని తీర్మానంలో స్పష్టం చేసింది. పూర్తి పారదర్శకతతో నిర్వహించాం: సీఎం రేవంత్ తెలంగాణలో కులగణన జరిగిన తీరును సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని తెలిపారు. ‘బీసీల జనాభా గతం కన్నా 6 శాతం మేర పెరిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దానిని పార్లమెంట్ ఆమోదానికి పంపించాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపుల్లో ఓబీసీ, ఆదివాసీ, దళితులు, మైనార్టిలకు ప్రయోజనం చేకూరేలా ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని చూసే కేంద్రం కూడా కులగణన చేసేందుకు ముందుకొచ్చింది. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..’అని సీఎం తెలిపారు. రేవంత్, దామోదరకు అభినందనలు కులగణన ప్రక్రియలో చేసిన శ్రమ, అమలులో చూపిన చొరవపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదరలను సీడబ్ల్యూసీ కీలక నేతలు అభినందించారు. -
పాక్ వెళ్లిపోవాలన్న కేంద్రం ఆదేశాలపై ఓ కుటుంబానికి సుప్రీంలో ఊరట
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్ తారిక్ బట్ కుటుంబం కూడా తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. అయితే, వారు వేసిన పిటిషన్‌పై శుక్రవారం.. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం.. ఆ కుటుంబానికి తాత్కాలిక ఊరటనిచ్చింది. వీసా గడువు ముగిసినా వీరు ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ఆ కుటుంబం కశ్మీర్లో ఉండగా.. కుమారుడు బెంగళూరు యాక్సెంచర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తాము భారత జాతీయులమేనని అయినా మమ్మల్ని అరెస్టు చేశారంటూ వాదనలు వినిపించారు. తమ వద్ద అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నాయని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఈ కుటుంబంలో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినా.. ఆ తర్వాత భారత్‌కు వలసవచ్చి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఈ అంశంలో ధ్రువీకరించాల్సిన అంశాలున్నాయని.. ఈ పిటిషన్ దాఖలు చేయడంలోనే లోపాలున్నాయని పేర్కొంది. దీని మెరిట్‌పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా పిటిషన్‌ను కొట్టేస్తున్నామన్న ధర్మాసనం.. అధికారులకు ఓ సూచన చేసింది. ఏ నిర్ణయం తీసుకోబోయే ముందైనా.. వారు చూపుతున్న పత్రాలను ధ్రువీకరించాలని.. ఈ కేసులో ఉన్న కొన్ని విచిత్ర పరిస్థితుల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకొనేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల చర్యలతో సంతృప్తి లేకపోతే పిటిషనర్లు జమ్మూకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ కూడా ధర్మాసనం సూచించింది. -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ: మద్యం విధానం కేసులో మద్యం తనకు సీఆర్పీసీ 160 నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో నివసిస్తున్న తనకు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటిసు ఇచ్చే పరిధి ఏపీ సీఐడికి లేదని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం, సిట్, ముఖేష్‌కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డి తరపున న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపించారు. తదుపరి విచారణ మే 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.