భారత్‌కే మా మద్దతు | Russian President Putin Voiced Full Support For India | Sakshi
Sakshi News home page

భారత్‌కే మా మద్దతు

May 6 2025 5:27 AM | Updated on May 6 2025 5:27 AM

Russian President Putin Voiced Full Support For India

పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం 

ముష్కరులను కఠినంగా శిక్షించాల్సిందే: పుతిన్‌ 

ప్రధాని మోదీతో ఫోన్‌లో మాటామంతి  

ద్వైపాక్షిక సదస్సుకు మోదీ ఆహ్వానం 

అంగీకరించిన పుతిన్‌ 

న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టంచేశారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉ గ్రవాదులను, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు. అత్యంత హేయమైన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా మని తెలిపారు. బాధిత కుటుంబాలకు పుతిన్‌ సానుభూతి ప్రకటించారు. ఆయన సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయానికొచ్చారు. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే నామరూపాల్లేకుండా చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. భారత్‌–రష్యా మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని మోదీ, పుతిన్‌ పేర్కొన్నారు. రష్యా ‘విక్టరీ డే’ 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్‌తోపాటు రష్యా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ ఏడాది జరగబోయే ఇండియా–రష్యా ద్వైపాక్షిక సదస్సుకు హాజరు కావాలని ప్రధానమంత్రి ఆహ్వానించగా, పుతిన్‌ అందుకు అంగీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement