
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
69 మంది అధికారులను రిలీవ్ చేయొద్దని స్పషీ్టకరణ
న్యూఢిల్లీ: షార్ట్ సర్విసు కమిషన్(ఎస్‌ఎస్‌సీ)కు సంబంధించిన మహిళా సైనికాధికారులను విధుల నుంచి తప్పించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో వారికి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదని సూచించింది. ఇలాంటి సమయంలో వారి సేవలు ఉపయోగించుకోవాలని, వారికి అండగా నిలవాలని స్పష్టంచేసింది.
తమకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 69 మంది మహిళా సైనికాధికారులకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు క్రమశిక్షణా చర్యల కింద పిటిషనర్లను విధుల నుంచి రిలీవ్ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ తరుణంలో ఈ పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. శక్తిసామర్థ్యలు కలిగిన మహిళల సేవలను చక్కగా వాడుకోవాలని కేంద్రానికి సూచించింది.