
ఢిల్లీ: బ్రహ్మోస్ మిసైల్‌తో పాకిస్థాన్‌ను భారత్ దారికి తెచ్చింది. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బ్రహ్మోస్-ఏ (ఎయిర్-లాంచ్డ్) క్రూయిజ్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్ ఎనిమిది సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
అణు ఆయుధ కేంద్రాలను భారత్ టార్గెట్ చేసుకోవచ్చనే భయంతో అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన పాక్ చేసింది. మే 10న తెల్లవారు జామున, భారత వైమానిక దళం రావల్పిండి సమీపంలోని చక్లాలా, పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధా వద్ద బ్రహ్మోస్-ఏ క్షిపణులతో దాడులు చేసింది.
కాగా, యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్థానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది.
అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. పాక్ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయింది.